ఒంగోలు: ఒంగోలు భాగ్యనగర్ 4వ లైన్‌లోని ఓ చెత్తకుండీలో పురిటి శిశువు మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.