
మురికి గుంటలో శిశువు మృతదేహం
హైదరాబాద్: హైదరాబాద్ కుషాయిగూడలో రోడ్డు పక్కన ఉన్న మురికి గుంటలో మంగళవారం ఓ శిశువు మృతదేహం కనిపించింది. గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకుని.. శిశువు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శిశువు వయసు 6 నుంచి 7 నెలలు ఉండవచ్చునని అనుకుంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.