నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
పెన్‌పహాడ్: నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెన్‌పహాడ్ మండలం చిన్నారెడ్డిపాళెం గ్రామ శివారులోని ఎస్సీ కాలనీలో గుర్తుతెలియని వ్యక్తులు గోనె సంచిలో ఓ పసికందును వదిలివెళ్లారు. శుక్రవారం ఉదయం గోనేసంచిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోనె సంచి విప్పి చూడగా బొడ్డూడని పసికందు మృతదేహం కనిపించింది. పసికందు నిన్న రాత్రి పుట్టిఉండొవచ్చని బావిస్తున్నారు. బతికున్న పసికందునే సంచిలోవేసుకుని వచ్చి వదిలివెళ్లి ఉంటారని, గోనెసంచి విప్పేముందే మృతిచెంది ఉండవచ్చని పసికందును చూసిన వారు చెబుతున్నారు.