
చెత్త కూడా తీయలేమా?
నగరాల్లో చెత్తను తొలగించే పనులకు కూడా మన ప్రభుత్వాలు భారీ నిధులతో అమెరికన్ కార్పొరేట్ కంపెనీల ముందు సాగిలబడుతున్నాయి. మరో వైపున మునిసిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేత నాలను ఇవ్వడానికి కూడా వెనుకాడుతున్నాయి. దీని ఫలితంగానే తెలుగు రాష్ట్రాల్లోని మునిసిపల్ కార్మి కులు చెత్త తొలగింపు పనులకు బంద్ పెడుతున్నారు. వారి వెతలను పట్టించుకోవడానికి కాసింత సమ యం దొరకని మన ఇద్దరు సీఎంలూ గోదావరి పుష్క రాల సేవలో తరించిపోతున్నారు.
విజయవాడ, గుం టూరులను నాజూకు నగరాలుగా మార్చడానికి ఏపీ సీఎం వాషింగ్టన్‌కు చెందిన గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ సంస్థను ఆహ్వానించారు. కాలుష్యాన్ని నివారించి 2018 నాటికి ఈ రెండు నగరాలను స్వచ్ఛ నగరాలుగా తీర్చిదిద్దటమే విదేశీ సంస్థ లక్ష్యమట. చివరకి మనం చెత్త ఎత్తివేయడానికి కూడా పనికిరా మా? అందుకు కూడా అమెరికా అంగబలం, ఆర్థిక సాయం కావాలా? విదేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞా నం తెచ్చుకోవటం తప్పు కాదు. కానీ ఆ పేరుతో ఎంఎన్‌సీలకు తలుపులు తెరవడం కాకుండా మన కార్మికులకు విదేశీ యంత్రాలను ఉపయోగించడం నేర్పాలి.
తమ కమీషన్ పోతుందని బాధపడకుండా మధ్య దళారీలను రద్దు చేసి, ఒప్పంద కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాలి. వారి జీవన భృతి ని పెంచాలి. చెత్తను ఎత్తివేయించుకోవడానికి కూడా అమెరికా చుట్టూ ఎందుకు తిరుగుతారు? ఇలాగే ముందుకు పోతే మన రాష్ట్రాలే కాదు. దేశమే పరా ధీనం కాక తప్పదు. పారిశుద్ధ్య కార్మికులకు కాసింత జీవనభృతిని పెంచలేని ప్రభుత్వాలు పుష్కరాలకు వందల వేల కోట్లు ఎలా ఖర్చుపెడుతున్నాయి?
- ఎస్. హనుమంతరెడ్డి
రిటైర్డ్ బీఎస్‌ఎన్‌ఎల్ డివిజనల్ ఇంజనీర్. 9490204545