remove
-
‘ఆదాయ పన్ను రద్దు చేస్తాం’
అమెరికా పన్నుల వ్యవస్థను పునర్నిర్మించే సాహసోపేత చర్యలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక విధానాలు అనుసరించాలని చెప్పారు. అమెరికన్ పౌరులకు ఆదాయపు పన్నును రద్దు(abolishing income tax) చేయాలని ప్రతిపాదించారు. దాని స్థానంలో పౌరుల డిస్పోజబుల్ ఆదాయాన్ని(కనీస అవసరాలు, ఈఎంఐలు.. వంటి వాటికి ఖర్చు చేశాక మిగిలే మొత్తం) పెంచే లక్ష్యంతో దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను ప్రవేశపెట్టాలని ట్రంప్ సూచించారు. హౌస్ రిపబ్లికన్ మెంబర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.1870-1913 మధ్య కాలంలో అమెరికా ప్రత్యేక టారిఫ్(tariff)లను ప్రవేశపెట్టి వాటివల్ల వచ్చే ఆదాయంపై ఆధారపడిందని ట్రంప్ తెలిపారు. తర్వాత ఆ ప్రత్యేక టారిఫ్‌లను క్రమంగా తొలగించారని గుర్తు చేశారు. ఈ వ్యూహం అమెరికా ఆర్థిక వ్యవస్థకు మరోసారి ఊతమిస్తుందని ట్రంప్ అన్నారు. మునుపెన్నడూ లేనంతగా అమెరికన్లను ధనవంతులుగా, మరింత శక్తిమంతులుగా మార్చే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఆదాయపన్ను రద్దు చేసి, దిగుమతి వస్తువులపై సుంకాలు పెంచాలనే విధానాలు ప్రవేశపెట్టాలని ట్రంప్ చెబుతుండడం చర్చకు దారి తీసింది.భారత్, చైనాలపై టారిఫ్లుఈ విధానాన్ని పర్యవేక్షించడానికి, టారిఫ్‌లు, సంబంధిత ఆదాయాల నిర్వహణకు బాధ్యత వహించే ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే జనవరి 20న ట్రంప్ తన ప్రారంభ ఉపన్యాసంలో మాట్లాడుతూ..‘అమెరికా పౌరులను సంపన్నులుగా చేయడానికి విదేశాలపై సుంకాలు విధిస్తాం. మన ఖజానాకు విదేశీ వనరుల నుంచి భారీగా డబ్బు వచ్చి చేరుతుంది’ అన్నారు. ట్రంప్ చైనా, భారత్ వంటి దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని చెప్పారు.ఇదీ చదవండి: హైదరాబాద్ అమెజాన్‌లో రూ.102 కోట్ల మోసంఈ ఆదాయ పన్ను రద్దు పథకంపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరిలో ఇది ఉత్సాహాన్ని రేకెత్తించినప్పటికీ, మరికొందరిలో విమర్శలకు దారితీస్తుంది. పెరిగిన దిగుమతి వ్యయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. పన్ను పునర్వ్యవస్థీకరణను అమలు చేయడంలో లోపాలు ఎదురవుతాయని అమెరికన్ కాంగ్రెస్‌లో కొంతమంది చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అమెరికన్ కార్మికులు, వారి కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి నిబద్ధతతో ఉన్నట్లు ట్రంప్ చెప్పారు. ‘అమెరికా ప్రయోజనాలను పరిరక్షించడానికి మేము వెంటనే వాణిజ్య వ్యవస్థను సమూలంగా మార్చాలని నిర్ణయించుకున్నాం’ అన్నారు. -
ట్రాన్స్జెండర్లకు ట్రంప్ షాక్..!
వాషింగ్టన్:అమెరికా రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీటిలో భాగంగా అమెరికా ఆర్మీలో ఉన్న ట్రాన్స్జెండర్లను ట్రంప్ పూర్తిగా తొలగించనున్నట్లు ది సండే టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రమాణస్వీకారం తర్వాత ట్రంప్ ట్రాన్స్జెండర్లను తొలగించే ఫైల్‌పై సంతకం చేయనున్నట్లు తెలిపింది. ఓ వైపు ఆర్మీలోకి కొత్తవారి నియామకం అంతగా లేని ప్రస్తుత సమయంలో ట్రంప్ ట్రాన్స్జెండర్లను తొలగించనుండడం చర్చనీయాంశమవుతోంది. ట్రాన్స్జెండర్లు ఆధునిక ఆర్మీ అవసరాలకు తగినట్లుగా సేవలందించడం లేదని ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించే వారు చెబుతున్నారు. ఈ మేరకు వారు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఆర్మీ నుంచి తొలగించే ముందు ట్రాన్స్జెండర్లకు అన్ని గౌరవాలు ఇచ్చి పంపిస్తారని తెలుస్తోంది.ట్రంప్ తన తొలిటర్ములో కూడా ఇలాంటి వివాదాస్పద నిర్ణయమే తీసుకున్నారు. అయితే ట్రాన్స్ జెండర్లను ఆర్మీలోకి తీసుకోవడాన్ని మాత్రమే ట్రంప్ నిషేధించారు. అప్పటికే ఉన్నవారిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత రద్దు చేశారు. కాగా, నవంబర్ 5న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. -
హైడ్రా మాదిరిగా నిడ్రా!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ‘హైడ్రా’ను ఆపేదే లేదని.. దీనిపై ఎవరెన్ని అవాంతరాలు సృష్టించినా ముందుకు వెళ్తా మని ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. హైడ్రాను ఆపితే భవిష్యత్తులో హైదరాబాద్ మరో వయనాడ్ అవుతుందన్నారు. జిల్లాలోనూ హైడ్రా మాదిరిగా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ క్రమించిన వారిలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, వా రి కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నా సదరు ఆక్రమణలు తొలగిస్తామని తెలి పారు. దీంతో ఈ విషయమై జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జిల్లాలో కబ్జాలు, ఆక్రమణల విషయమై అన్ని వర్గాల్లో చర్చ జరుగుతుండగా, ఆక్రమణదారుల్లో మా త్రం టెన్షన్ నెలకొంది. దీంతో చెరువులు, వాగుల్లో నిర్మాణాలు చేపట్టి విక్రయించిన బిల్లర్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డిలను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. చివరకు వాళ్లు వేసిన అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొన్నా మధ్యతరగతి అమాయకులు మాత్రం పరేషాన్ అవుతున్నారు. ఆక్రమణల తొలగింపునకు సంబంధించి కలెక్టర్ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.నగరంలో అనేక ఆక్రమణలునిజామాబాద్లో కీలకమైన పూలాంగ్ వాగు అడుగడుగునా కబ్జా అయింది. మాలపల్లి నుంచి ప్రారంభమయ్యే డి –54 కెనాల్ చంద్రశేఖర్‌కాలనీ వరకు కబ్జా అయింది. అర్సపల్లిలోని రామర్తి చెరువు 90 శాతం కబ్జా అయింది. భారీ నిర్మాణాలు చేశారు. ధర్మపురి హిల్స్, డ్రైవర్స్ కాలనీ, పెయింటర్స్ కాలనీల్లో 40 ఎకరాల ప్రభు త్వ భూమి కబ్జా అయింది. వీటికి మున్సిపల్ అధికారులు ఇంటి నంబర్లు కేటాయించారు.కనుమరుగవుతున్న కాలువలుఆర్మూర్ పట్టణంలో నిజాంసాగర్ 82/2/1 మైనర్ కాలువ ఆక్రమణలతో కనుమరుగు అవుతోంది. 70 ఫీట్ల వెడల్పుతో పట్టణంలోని మామిడిపల్లి, పెర్కిట్–కొటార్మూర్ మీదుగా వెళ్లే ఈ కాలువ ఉనికిని కోల్పోయింది. మాక్లూర్ మండలం దాస్‌నగర్ వద్ద నిజాంసాగర్ ప్రధాన కాలువ 68వ డిస్ట్రిబ్యూటరీని కబ్జా అయింది. ఈ కాలువను ఆక్రమించి కొందరు వెంచర్లు వేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు ఇష్టం వచ్చినట్లు కబ్జాలు చేసి ఏకంగా ప్రహరీలతో బిల్డింగ్లు నిర్మించారు. ఫలితంగా చిన్న వర్షం కురిస్తే జాతీయ రహదారి జలమయం అవుతోంది.సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణాలునగరంలో చాలా చోట్ల సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు లు వచ్చినా అక్రమార్కులకు పాల్పడుతున్న అధికారులను కాపాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగాల్లో కిందిస్థాయి అధికారులు మాఫియా మాదిరిగా వ్యవహారాలు నడిపి రూ.కోట్లలో దండుకుంటున్నారు.చెరువుల్లో కబ్జాలుజిల్లాలోని పలు చెరువులు కబ్జా అయ్యాయి. నవీపేట దర్యాపూర్ చెరువు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఇందులో 5 ఎకరాల వరకు రియల్ స్టేట్ వ్యాపారులు ఆక్రమించారు. నవీపేట మండలం మోకన్‌పల్లి చెరువులో 60 ఎకరాల శిఖం భూమిని కొందరు పట్టాలు చేసుకున్నారని గ్రామస్తులు గతంలో కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. భీమ్‌గల్ రాధం చెరువు భూములు ఎన్నో ఏళ్లుగా కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. రాజకీయ నాయకుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లుగా చేసి అమ్మేశారు. ఇందల్వాయి చెరువు 80 ఎకరాలు కబ్జా అయింది. కొందరు ఈ ఆక్రమిత స్థలాల్లో డెయిరీ ఫామ్‌లు కట్టారు. నందిపేటలోని రఘునాథ చెరువు కబ్జా చేసి నిర్మాణాలు చేశారు. -
కోల్‌కతా సీపీగా మనోజ్ వర్మ
కోల్‌కతా: జూనియర్ డాక్లర్లు డిమాండ్ చేసినట్లుగానే కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్‌పై వేటు పడింది. కొత్త కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ వర్మను బెంగాల్ ప్రభుత్వం మంగళవారం నియమించింది. జూడాలకు ఇచి్చన హామీ మేరకు ఆరోగ్య సేవల డైరెక్టర్ దెవాశిష్ హల్దర్, వైద్య విద్య డైరెక్టర్ కౌస్తవ్ నాయక్‌లను మమత సర్కారు తొలగించింది. కోల్‌కతా నార్త్ డివిజన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ అభిõÙక్ గుప్తా పైనా వేటు వేసింది. మనోజ్ వర్మ జంగల్‌మహల్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతలో కీలకపాత్ర పోషించారు. కిషన్‌జీ (కోటేశ్వర రావు) ఎన్కౌంటర్లోనూ ముఖ్యభూమిక వహించారు. ఆర్.జి.కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు 39 రోజులుగా విధులను బహిష్కరిస్తున్నారు. సోమవారం రాత్రి మమతతో సమావేశమయ్యారు. వారి ప్రధాన డిమాండ్లను మమత అంగీకరించడం తెలిసిందే. -
నెయిల్ పాలిష్ రిమూవర్ ఇంత డేంజరా? మంటల్లో చిక్కుకున్న చిన్నారి..
నెయిల్ రిమూవర్ గురించి మనందరికీ తెలుసు. మన వేలి గోళ్లపై నెయిల్ పాలిష్ సరిగ్గా లేకున్నా లేదా తొలగించాలనుకున్నా నెయిల్ రిమూవర్‌ని ఉపయోగిస్తాం. అలానే ఓ చిన్నారి తన వేలి గోళ్లకు నెయిల్ పాలిష్ సరిగా లేదని తొలగించేందుకు నెయిల్ రిమూవర్‌ని ఉపయోగించింది. అంతే అనూహ్యంగా మంటలు చెలరేగి తీవ్ర గాయాల బారినపడింది ఆ చిన్నారి. ఈ దిగ్బ్రాంతికర ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని ఓహియోకు చెందిన 14 ఏళ్ల కెన్నడి అనే బాలిక కొవ్వొత్తి దగ్గర కూర్చొని నెయిల్ పాలిష్‌ని తొలగిస్తుంది. తన వేళ్లకు నెయిల్ పాలిష్ సంక్రమమైన రీతీలో లేదని తొలగించాలనుకుంటుంది. అయితే ఆ టైంలో తన మంచానికి సమీపంలో కొవ్వొత్తి కూడా ఉంటుంది. ఒక్కసారిగా ఆ నెయిల్ రిమూవర్ ఆవిరికి సమీపంలోనే కొవ్వొత్తి ఉండటంతో ఒక్కసారిగా భగ్గుమని మంటలు లేచిపోయాయి. దీంతో ఆ చిన్నారి చేతిలోని నెయిల్ పాలిష్ బాటిల్ డబ్ మని పగిలి మంటలు మరింతగా మంటలు వ్యాపించాయి. ఆమెతో సహా అక్కడ ఉన్న వస్తువులన్నీ అంటుకుపోతున్నాయి. ఈ హఠాత్పరిణామానికి బిగ్గరగా కేకలు పెట్టింది. అయితే ఆ టైంలో చిన్నారి తల్లిదండ్రులు వేరే పనిలో ఉన్నారు. కెన్నడీ అరుపుతో ఉలిక్కిపడ్డ తలిదండ్రులు ఆమె బెడ్ రూంలోకి హుటాహుటీనా వెళ్లి చూడగా..గదిఅంతా పొగలు కమ్మి చిన్నారి మంటల్లో చిక్కుకుని ఉంది. వెంటనే వారు స్పందించి..కెన్నడీని చుట్టుముట్టిన మంటలను ఆర్పేసి హుటాహుటీనా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే ఈ ఘటనతో తల్లిందండ్రలు గట్టి షాక్‌లోకి వెళ్లిపోయారు. పాపం ఆ చిన్నారి తీవ్రంగా గాయపడటంతో చర్మం చాలా వరకు కాలిపోయింది. పొత్తి కడుపు నుంచి, రెండు తొడలు, ఆమె కుడి చెయ్యికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయా భాగాల్లో ఎక్సిషన్ అనే శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతానికి ఆమె చేతులు కొంతవరకు నయం అయ్యాయి. మిగతా భాగాలకు అయ్యిన గాయాలు తగ్గి కొత్త చర్మం రావడానికి కనీసం ఏడాదిపైన పడుతుందని వైద్యులు తెలిపారు. అంతేగాదు అవి తగ్గేందుకు కొద్దిపాటి చికిత్స కూడా తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఏదీఏమైనా పిల్లలను ఒంటరిగా వదిలేటప్పుడూ మధ్యమధ్యలో కాస్త గమనించండి. ఎల్లవేళల వారిపై ఓ కన్నేసి ఉంచండి. లేదంటే తెలిసి తెలియన పనులతో ప్రాణాలపైకి తెచ్చుకునే ప్రమాదం లేకపోలేదు. (చదవండి: చికూ ఫెస్టివల్ గురించి విన్నారా? ఆ ఫ్రూట్ కోసమే ఈ పండుగ!) -
ప్రభుత్వం మారగానే సీఎం కార్లకు కొత్త నంబర్లు!
ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం మారిన వెంటనే పాలనలో అనేక మార్పులు మొదలయ్యాయి. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని ఒక వాహనానికి గల బీబీ-0023 అనే నంబర్ ప్లేటును తొలగించారు. దీనిలో బీబీ అంటే అంటే భూపేష్ బఘేల్ (మాజీ ముఖ్యమంత్రి). అలాగే 23 అతని పుట్టినరోజు. దీని ప్రకారం నంబర్ ప్లేటును బీబీ-0023గా రూపొందించారు. ముఖ్యమంత్రి సచివాలయం అందించిన మార్గదర్శకాల ప్రకారం ఈ నంబర్ ప్లేట్ మార్చారు. నూతన సీఎం విష్ణు దేవ్ సాయి కారుకు వచ్చిన కొత్త నంబర్ సీజీ-03-9502. గతంలో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో సీజీ-02 నంబర్ ఉండేది. మాజీ సీఎం బఘేల్ తన కాన్వాయ్‌లో ఉన్న వాహనాలకు ప్రత్యేక నంబర్‌ను తీసుకున్నారు. ఇప్పుడు ఆ నంబర్లను సమూలంగా మార్చారు. అంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తన కాన్వాయ్‌లో ఉన్న వాహనాలను కూడా మార్చారు. నాడు సీఎం తన కాన్వాయ్‌లోని మిత్సుబిషి పజెరో వాహనాన్ని తొలగించారు. ఛత్తీస్‌గఢ్‌లో సీజీ-01, సీజీ-02, సీజీ-04 రిజిస్ట్రేషన్‌ను రాయ్‌పూర్ ఆర్టీఓ పర్యవేక్షిస్తుండగా, సీజీ-03 రిజిస్ట్రేషన్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జరగడం గమనార్హం. ఇది కూడా చదవండి: ‘నిర్భయ’కు 11 ఏళ్లు... మహిళల భద్రతకు భరోసా ఏది? -
చీఫ్ సెక్రటరీని తొలగించండి
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌ను బాధ్యతల నుంచి తప్పించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్(ఎల్జీ)ని సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. నరేశ్ కుమార్ తన కుమారుడికి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీకి, ఐఎల్బీ అనే సంస్థతో ఎంవోయూ కుదిరేందుకు అధికార దురి్వనియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ మంత్రి అతీషి ఆరోపించారు. ఈ మేరకు నివేదికను ఇటీవల సీఎం కేజ్రీవాల్‌కు అందజేశారు. ఆ నివే దికను కేజ్రీవాల్ శనివారం లెఫ్టినెంట్ జనరల్ వీకే శుక్లాకు పంపారు. అతీషి సిఫారసుల మేరకు ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. తనకుమారుడికి ఎటువంటి కంపెనీతోను, ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ఐఎల్‌బీఎస్ సంస్థ కూడా అతీషి చేసిన ఆరోపణలు నిరాధారాలంటూ ఖండించింది. -
కొంపముంచిన ‘హాలోవీన్’ మేకప్!.. భయంకరంగా మహిళ ముఖం!
హాలోవీన్ ఉత్సవాన్ని అమెరికా, ఐరోపా దేశాల్లో జరుపుకుంటారు. ఇప్పుడు భారత్‌లోనూ ఈ ఉత్సవం క్రేజ్ కనిపిస్తోంది. ఈ ఉత్సవంలోని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో పాల్గొనే జనం ఇతరులను భయపెట్టేలాంటి మేకప్ వేసుకుని రోడ్లపై తిరుగుతారు. ఒకరికొకరు బహుమతులు లేదా చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 న జరుపుకుంటారు. ఈ ఉత్సవం సందర్భంగా ఒక మహిళ తన ముఖంపై వేయించుకున్న భయంకరమైన టాటూ ఆమెను మరింత ఇబ్బందులపాలు చేసింది. ఎలిజబెత్ రోజ్ అనే మహిళ హాలోవీన్ రోజున తాను భయానకంగా కనిపించేందుకు తన ముఖంపై తాత్కాలిక టాటూలు వేయించుకుంది. ఆ మహిళ నుదిటిపైన, నోటిపైన టాటూలు వేయించుకుంది. అయితే ఆ టాటూల గుర్తులు తొలగక పోవడంతో ఆమెకు ఇబ్బంది ఎదురయ్యింది. ఆ మహిళ తన ముఖంపై ఉన్న టాటూను తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఒక వీడియోలో తెలియజేసింది. ‘నేను నా ముఖంపై టాటూ వేయించుకుని హాలోవీన్‌కు వెళ్లాను’ అని రోజ్ ఆ వీడియోలో పేర్కొంది. ఆమె ఆ టాటూను తొలగించడానికి కాటన్ ప్యాడ్‌ను ఉపయోగించింది. అయినా ఉపయోగం లేకపోయింది. మరుసటి రోజు తనకు ఆఫీసులో మీటింగ్ ఉన్న విషయం గుర్తుకువచ్చి ఆమె మరింత ఆందోళనకు గురయ్యింది. అయితే వోడ్కా, యాంటీ బాక్ జెల్, సెల్లోటేప్, ఆలివ్ ఆయిల్, నెయిల్ వార్నిష్ రిమూవర్ మొదలైనవాటిని ఉపయోగించి ఎట్టకేలకు ఆ టాటూ గుర్తులను తొలగించింది. ఇది కూడా చదవండి: ప్రియుడు ఖరీదైన గిఫ్ట్ ఇస్తే బ్రేకప్ చెప్పింది.. ట్విస్ట్ ఇదే! -
'ఒబెసిటీ'కి సరికొత్త పేరు..ఇక అలా పిలవొద్దని సూచన!
అధిక బరువు ఉంటే ఒబిసిటీ అని పిలిచేవారు కదా. ఇక నుంచి అలా పిలవకూడదట. ఎందకంటే ఆ పదమే పేషెంట్ సమస్యకు మరింత కారణమవుతుందని, అందువల్ల దానికి పేరు మార్చాలని ఆరోగ్య నిపుణులు నిర్ణయించారు. అధిక బరువు ఉన్నవాళ్లని సమాజం ఎలా చూస్తుందో అందరికీ తెలిసిందే. పలువురుతో జరిపిన విస్తృత చర్చల అనంతరం అధికం బరువు సమస్యకు కొత్త పేరు పెట్టాలనే వాదన వినిపించింది. లావుగా ఉన్నవారికి వారు అలా ఉన్నదాని కంటే ఆ పేరే వారిని ఇబ్బందుల పాలు చేసిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే అధిక బరువు సమస్యను మరోక పేరు పెట్టాని నిపుణలు భావించారు. పేరు మార్చాల్సినంత నీడ్.. 1950లలో స్వలింగ సంపర్కాన్ని సామాజిక వ్యక్తిత్వ భంగంగా భావించారు. ఆ తర్వాత అనేక నిరసనలు, వ్యతిరేకతలు గట్టిగా రావడంతో దాన్ని అపకీర్తిగా భావించడం మానేశారు. అదోక మానసిక రుగ్మతకు సంబంధించినదని అంగీకరించారు. అలానే ఫ్యాటీ లివర్ వ్యాధి విషయంలో కూడా ఇదే సమస్య ఎదురైంది. నిజాని నాన్ ఆల్కహాలిక్లకు కూడా ఈ ఫ్యాటీ లివర్ అని పేరు మార్చాలనే వాదన తెరపైకి వచ్చింది. దీంతో ఆ తర్వాత ఆ వ్యాధికి మెటబాలిక్ డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్" అని పేరు పెట్టారు.ఈ నేపథ్యంలోనే ఒబెసిటీ అనే పదం మార్చడం తప్పనిసరైంది. అదీగాక ఆయా పేషంట్లు ఆ పేరు కారణంగానే సమాజంలోనూ, కుటుంబ పరంగాను వివక్షకు గురవ్వుతున్నారు. కొత్తపేరు బీఎంఐకి మించి ఉండాలి అధిక బరువును బీఎంఐల ద్వారా నిర్ణయిస్తారు. బీఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు ఇది కూడా సరిపోదు. ఇది కండర ద్రవ్యరాశిని లెక్కించదు, శరీర బరువు లేదా కొవ్వు కణజాలం (శరీర కొవ్వు) గురించి సరైన సమాచారం ఇవ్వదు. నిపుణులు సూచించిన కొత్తపేరు ఈ ఒబెసిటీని “అడిపోసిటీ ఆధారిత దీర్ఘకాలిక వ్యాధి” అని పిలవాలని సూచించారు ఆరోగ్య నిపుణులు. దీని పేరులోనే ఆ వ్యాధి ఏంటో అవగతమవుతుంది. జీవక్రియలు పనిచేయకపోవడమే ఈ వ్యాధి లక్షణం అని తెలుస్తుంది. ఈ పేరు కారణంగా సమాజ దృక్పథం మారి చులకనగా చూసే అవకాశం తగ్గుతుంది. అధిక బరవు సమస్య అనేది వ్యాధేనా.. అధిక బరవు అనేది శారీరక లేదా మానసిక వ్యవస్థలు సరిగా పనిచేయక పోవడం వల్ల ఎదురయ్యే సమస్య దీన్నిబట్టి ఆ సమస్యను వ్యాధిగా పరిగణించలేం. మొదట్లో అధిక బరువు హానికరం కాకపోవచ్చు. కొందరూ లావుగా ఉన్నా.. వారికి ఎలాంటి హెల్త్ సమస్యలు ఉత్పన్నం కావు. కొందరికి క్రమేణ అధిక బరువు వివిధ శారీరక సమస్యలకు దారితీస్తుంది. ఈ పేరు మార్పు కారణంగా ప్రజలకు ఆయా వ్యకుల పట్ల చులకన భావం, హేయభావం తగ్గి వారి సమస్యను అర్థం చేసుకునే యత్నం చేయగలుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. (చదవండి: కార్యాలయాల్లో ఓన్లీ 'వై' బ్రైక్!ఏంటంటే ఇది!) -
బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ సమీపంలో జెండాలను తొలగించాం
-
కలెక్టర్ ఆదేశాలు.. గొల్లపూడి టీడీపీ ఆఫీస్‌ను తొలగించిన అధికారులు..
ఎన్టీఆర్ జిల్లా: గొల్లపూడి వన్ సెంటర్లో ప్రైవేట్ స్థలంలో ఉన్న టీడీపీ కార్యాలయాన్ని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తొలగించారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను పూర్తి చేశారు. శేషారత్నం పేరిట ఉన్న ఈ స్థలంలో గత కొన్నాళ్లుగా టీడీపీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆ స్థలాన్ని దుర్వినియోగం చేస్తుండటంతో తన కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేయాలంటూ శేషారత్నం కలెక్టర్‌ను ఆశ్రయించారు. దీంతో గిఫ్ట్ డీడ్ రద్దు చేశారు కలెక్టర్. శేషారత్నానికి ఆ స్థలాన్ని స్వాధీనం చేసి అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ నేతల ఆందోళనల నడుమ రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాన్ని కూల్చివేసి స్థలాన్ని శేషారత్నంకు అప్పగించారు. -
ఢిల్లీ: బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు
ఢిల్లీ: భారత రాష్ట్ర సమితికి ఆదిలోనే షాక్ తగిలింది. బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఫ్లెక్సీలను తొలగించింది న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్. ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో ఉన్న పార్టీ కార్యాలయం ఎదుట అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని చెప్తూ.. అధికారులు మంగళవారం వాటిని తొలగించారు. ఎన్డీఎంసీ ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారంపై గులాబీ పార్టీ శ్రేణులు స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కోసం హస్తినకు చేరుకున్న ఆ పార్టీ అధినేత కేసీఆర్ యాగాల్లో పాల్గొననున్నారు. ఈ నెల 14న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం కానుంది. తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం లక్ష్యంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఉక్రెయిన్-రష్యా సైనికుల కౌగిలింత.. తీవ్ర విమర్శలు
వైరల్: సద్దుదేశంతో ఓ ఆర్టిస్ట్ గీసిన చిత్రం.. తీవ్ర దుమారం రేపింది. ప్రధానంగా బాధిత దేశం నుంచి అభ్యంతరాలు.. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆ ఆర్ట్ వర్క్‌ను ఎట్టకేలకు తొలగించాల్సి వచ్చింది. ఉక్రెయిన్-రష్యా సైనికులు కౌగిలించుకున్నట్లు ఓ కుడ్యచిత్రంను(మ్యూరాల్) మెల్బోర్న్(ఆస్ట్రేలియా)నగరంలో ప్రదర్శించారు. పీటర సీటన్ అనే ఆర్టిస్ట్.. ఇరు దేశాల మధ్య శాంతియుత ప్రయత్నాలను ప్రతిబింబించేలా ఒకరాత్రంతా కష్టపడి దానిని వేశాడు. అయితే.. ఇది అత్యంత ప్రమాదకరమైన సంకేతమని ఉక్రెయిన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆస్ట్రేలియాలో ఉక్రెయిన్ రాయబారి వసైల్ మైరోష్నిచెంకో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై వ్లాదిమిర్ పుతిన్ పూర్తి స్థాయి దండయాత్ర వాస్తవికతను వక్రీకరించే ప్రయత్నమంటూ మండిపడ్డారాయన. ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే అంశమే. అది గీసిన ఆర్టిస్ట్‌కు బహుశా రష్యా ఆక్రమణ గురించి ఏమాత్రం అవగాహన లేకపోయి ఉండొచ్చు. రష్యాను శాంతికాముక దేశంగా చిత్రీకరించే యత్నం చేయడం దుర్మార్గం. వేలమందిని బలిగొన్న ఈ మారణహోమంపై ఇలాంటి చిత్రం.. కలలో కూడా ఈ ఊహ సరికాదు. ఉక్రెయిన్ కమ్యూనిటీ సంప్రదించకుండా దానిని ప్రదర్శించడం విచారకరం అంటూ ట్విటర్లో షేర్ చేశారాయన. వీలైనంత త్వరగా దానిని తొలగించాలని డిమాండ్ చేశారాయన. మరోవైపు ప్రముఖ సోషియాలజిస్ట్ ఓల్గా బోయ్చక్ ఈ వ్యవహారంపై మండిపడ్డారు. నిందితుడిని-బాధితుడిని ఒకేలా చూపించే ప్రయత్నం సరికాదని, దీని వెనుక ఏదైనా గూఢపుఠాణి ఉండొచన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకవైపు ఆ ఆర్ట్‌వర్క్‌కు పాజిటివ్ కామెంట్లు, లైకులు దక్కినప్పటికీ.. విమర్శలు, అభ్యంతరాల నేపథ్యంలో దానిని తొలగించారు సీటన్. అంతేకాదు.. దీనిని నెగెటివ్‌గా తీసుకుంటారని తాను అనుకోలేదని చెబుతూ.. క్షమాపణలు తెలియజేశారు. ఇదీ చదవండి: కత్తి దూసిన ఉన్మాదం.. పదిమంది దారుణహత్య -
రేప్ వీడియోపై అభ్యంతరం.. తొలగించిన ట్విటర్
రోమ్: దారుణంగా అత్యాచారానికి గురైన ఉక్రెయిన్ మహిళ వీడియోను పోస్ట్ చేసింది ఇటలీ ప్రధాని రేసులో ఉన్న అభ్యర్థి జార్జియా మెలోని(45). దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా.. ఉల్లంఘనల పేరిట రెండు రోజుల తర్వాత ఎట్టకేలకు ఆ వీడియోను తొలగించింది ట్విటర్. ఓ న్యూస్ వెబ్సైట్లో వచ్చిన ఆ వీడియోను యధాతధంగా తన ట్విటర్ అకౌంట్లో ఆదివారం రాత్రి పోస్ట్ చేశారామె. మహిళలపై జరుగుతున్న అరాచకాలకు పరాకాష్టగా పేర్కొంటూ ఆమె ఆ బ్లర్డ్ వీడియోను పోస్ట్ చేశారు. అయితే.. రాజకీయ ప్రత్యర్థులతో పాటు మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు.. మెలోనీ పోస్ట్ చేసిన వీడియోను తప్పుబట్టారు. ఇది బాధితురాలి ఉనికిని ప్రపంచానికి తెలియజేయడమే అని, ఆమెను క్షోభపెట్టడమే అవుతుందని వాదించారు. అయితే బాధితురాలికి సానుభూతి తెలిపే క్రమంలోనే తాను ఆ వీడియోను పోస్ట్ చేశానని, ఆమెకు న్యాయం జరిగేలా చూడడమే తన ఉద్దేశమని మెలోనీ తన చర్యను సమర్థించుకున్నారు. అయినప్పటికీ.. మంగళవారం ఉదయం ట్విటర్ ఆ వీడియోను తొలగించింది. ఇక ఈ చర్యపై మెలోనీ నుంచి స్పందన లేదు. స్థానిక అధికారుల సమాచారం ప్రకారం.. పియాసెంజా నగరంలో 55 ఏళ్ల ఉక్రెయిన్ మహిళపై అఘాయిత్యం జరిగింది. గినియాకు చెందిన ఓ శరణార్థి కాలిబాటపైన ఆమెపై దారుణానికి తెగబడ్డాడు. నిందితుడిని గుర్తించిన పోలీసులు.. ఇప్పటికే అరెస్ట్ చేసి కేసులో పురోగతి సాధించారు. ఇదిలా ఉంటే.. రోమ్‌లో పుట్టి, పెరిగిన జార్జియా మెలోనీకి జర్నలిస్ట్‌గా, మానవ హక్కుల ఉద్యమకారిణిగా మంచి పేరుంది. సెప్టెంబర్ 25వ తేదీన జరగబోయే ఇటలీ జాతీయ సార్వత్రిక ఎన్నికల్లో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ తరపున మెలోనీ ప్రధాని అభ్యర్థిగా నిలబడబోతున్నారు. జనాల్లో మద్దతు ఆధారంగా ఆమె ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించవచ్చని పోల్‌సర్వేలు చెప్తున్నాయి. అదే జరిగితే.. ఇటలీకి తొలి మహిళా ప్రధానిగా ఎన్నికై జార్జియా మెలోని చరిత్ర సృష్టిస్తారు. ఇదీ చదవండి: పుతిన్ సన్నిహితుడి కుమార్తె ప్రాణత్యాగానికి ఫలితం! -
NEET అభ్యర్థి లోదుస్తుల తొలగింపుపై రగడ
తిరువనంతపురం: నీట్ పరీక్షలో అభ్యర్థి లోదుస్తులు తొలగించిన తర్వాతే పరీక్షకు అనుమతించారనే వ్యవహారం ముదురుతోంది. ఈ ఘటనపై విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగు చూసింది. స్పందించిన మానవ హక్కుల సంఘం.. పదిహేను రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి ఘటనకు సంబంధించిన నివేదిక తమకు సమర్పించాలని కొల్లాం రూరల్ ఎస్పీని ఆదేశించింది కూడా. అయితే.. నీట్ ఎగ్జామ్ కోసం వెళ్లిన అభ్యర్థిని లోదుస్తులు తొలగించారనే ఘటనపై ఎట్టకేలకు నీట్ నిర్వాహణ సంస్థ ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ స్పందించింది. ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. జులై 17న నీట్ పరీక్ష సందర్భంగా.. కేరళ కొల్లాంలోని ఓ ఎగ్జామ్ సెంటర్లో అభ్యర్థినిని లోదుస్తులు తొలగించాల్సిందిగా సెంటర్ నిర్వాహకులు కోరారు. ఈ ఘటనపై బాధిత యువతి తండ్రి మాట్లాడుతూ.. 90 శాతం విద్యార్థులకు ఇలాంటి అనుభవమే ఎదురైందని, వాళ్లంతా మానసిక వేదన అనుభవించారని ఆరోపించారు. మీడియా కథనాల ఆధారంగా.. ఈ ఘటనపై కొల్లాం సెంటర్ సూపరిండెంట్, ఇండిపెండెంట్ అబ్జర్వర్, సిటీ కో ఆర్డినేటర్ల నుంచి పరీక్ష నిర్వాహణ సంస్థ నివేదిక తెప్పించుకుంది. అలాంటి ఘటనేం జరగలేదని, అభ్యర్థిని పరీక్షకు అనుమతించామని వాళ్లు నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు ఎన్టీఏ సైతం ఇందుకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేసింది. ఎన్టీఏ డ్రెస్ కోడ్ ప్రకారం.. నీట్ పరీక్షలో అలా అభ్యర్థుల మనోభావాలు దెబ్బతినేలా ఎలాంటి నిబంధనలు లేవు. కోడ్ చాలా స్పష్టంగా ఉంది అని ఎన్టీఏ తెలిపింది. విమర్శల నేపథ్యంతో.. కేరళ కొల్లాంకు చెందిన ఓ వ్యక్తి.. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్ష కేంద్రంలో తన కూతురికి ఎదురైన ఘోర అవమానంపై కొట్టారకారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్టీఏ రూల్స్‌లో లేకున్నా తన కూతురి లోదుస్తులు విప్పించి స్టోర్ రూమ్‌లో పడేయాలని, ఆపైనే పరీక్షకు అనుమతించారని.. తద్వారా ఆమెను మానసికంగా వేధించారని ఫిర్యాదు చేశాడు. అంతేకాదు.. మెజార్టీ విద్యార్థులకు ఇలాంటి సమస్యే ఎదురైందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేరళ లోక్‌సభ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ ఈ ఘటనపై స్పందించారు. పరీక్ష మార్గదర్శకాలను సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సాంకేతికతో పరీక్షలో అవకతవకలు గుర్తించగలుగుతున్నాం. అలాంటి సాంకేతిక సాయాన్ని ఉపయోగించకుండా.. ఇలా కర్కశకంగా వ్యవహరించడం సరికాదంటూ విమర్శించారు. ఈ మేరకు ఘటనపై పార్లమెంట్లో చర్చకు పట్టుబడుతున్నారు. పోలీస్ కేసు నమోదు బలవంతగా విద్యార్థినుల బ్రాలు తొలగించిన సిబ్బందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు కేరళ విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆర్ బిందు ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు. కేంద్రం ఈ వ్యవహారంలో ఎన్టీఏపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారామె. అలాగే.. నీట్ పరీక్ష రాసేందుకు వచ్చిన బాలికను బలవంతంగా ఇన్నర్‌వేర్‌ను తొలగించిన ఘటనపై కేరళ పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 354, 509ల కింద కేసు నమోదు చేశారు. అయితే పరీక్ష నిర్వాహణ కేంద్రం అయిన మార్ థోమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులు.. తమ సిబ్బంది ఎవరూ తనిఖీల ప్రక్రియలో పాల్గొనలేదని చెప్పారు. అలాగే ఎడ్యుకేషన్ విద్యాశాఖ కూడా తమ పరిధిలో ఈ పరీక్ష జరగలేదని, రాష్ట్ర నిర్వాహణ అధికారులు ఎవరూ అందులో లేరని అంటోంది. డ్రెస్ కోడ్ ఏంటంటే.. అభ్యర్థులు సాధారణంగా.. వాతావరణానికి తగిన దుస్తులను ధరించాలని సూచిస్తుంది. అయితే, పూర్తి స్లీవ్లతో కూడిన లేత రంగు దుస్తులను మాత్రం ధరించడానికి వీల్లేదు. అలాగే శాండల్స్, ఓపెన్ స్లిప్పర్స్ వేస్కోవచ్చు. షూలు ధరించడానికి మాత్రం వీల్లేదు. పర్సులు, హ్యాండ్ బ్యాగులు, బెల్టులు, టోపీలు, నల్ల కళ్లద్దాలు, చేతి వాచీ, బ్రేస్లెట్, కెమెరా, నగలు, మెటాలిక్ వస్తువులు నిషిద్ధం. అయితే మెటాలిక్ హుక్స్ ఉన్న దుస్తులు నిషిద్దమా? కాదా? అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. గతంలో కేరళలోనే.. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 2017లో కేరళ కన్నూర్‌లోనే ఓ అభ్యర్థితో బ్రా విప్పించారు సెంటర్ నిర్వాహకులు. ఆ ఘటన విమర్శలకు దారి తీసింది. తొలుత.. హాప్ స్లీవ్, బ్లాక్ ప్యాంట్‌తో సెంటర్‌కు చేరుకుంది ఓ అభ్యర్థి. అయితే డార్క్ కలర్ అనుమతించకపోవడంతో.. ఆమె ఆందోళనకు గురైంది. ఆదివారం కావడంతో దుకాణాలు సైతం తెరవలేదు. దీంతో రెండు కిలోమీటర్లు తల్లితో పాటు వెళ్లి కొత్త దుస్తులు కొనుగులు చేసుకుని మార్చుకుని వచ్చింది. అయితే ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. మెటల్ డిటెక్టర్ గుండా వెళ్తున్న టైంలో.. బ్రాకు ఉన్న హుక్స్ కారణంగా ఆమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇన్నర్‌వేర్ తొలగించి ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఆమె పరీక్ష రాసింది. ఆ సమయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్లునీట్ నిర్వహించారు. ఆ మరుసటి సంవత్సరం పాలక్కడలో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఈ ఏడాది నీట్ పరీక్షల సమయంలో హిజాబ్ తొలగింపు ఫిర్యాదులు సైతం రావడం విశేషం. -
ఏక్నాథ్ షిండే శివసేన సభ్యత్వం తొలగింపు
ముంబై: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు.. మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఝలక్ ఇచ్చారు. షిండేను శివసేన పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారాయన. పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడినందుకుగానూ తొలగిస్తున్నట్లు శుక్రవారం ఓ అధికారిక లేఖ ద్వారా షిండేకు థాక్రే తెలియజేశారు. శివసేన పక్ష ప్రముఖ హోదాలో ఉద్దవ్ థాక్రే, ఏక్నాథ్ షిండేను శుక్రవారం సాయంత్రం పార్టీ నుంచి తొలగించారు. పార్టీ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడినందుకుగానూ స్వచ్ఛందంగా ఆయన(షిండే) తన సభ్యత్వాన్ని కోల్పోయారని, ఇకపై పార్టీలోని ఏ పదవిలోనూ(ప్రాథమిక సభ్యత్వంతో సహా) ఆయన ఉండబోరని లేఖలో థాక్రే వెల్లడించారు. ఇదిలా ఉంటే.. మెజార్టీ ఎమ్మెల్యేలతో మద్దతుతో తనదే సిసలైన శివసేన వర్గంగా ప్రకటించుకున్న ఏక్నాథ్ షిండే.. పార్టీ చీఫ్‌గా ఎప్పుడూ ప్రకటించుకోలేదు. కాకపోతే బాల్‌థాక్రేకు తానే నిజమైన రాజకీయ వారసుడిగా పేర్కొంటూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఈ మేరకు తన ట్విటర్ అకౌంట్లో ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చేసుకున్నారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల వర్గం మాత్రం తమదే అసలైన శివసేన అంటూ సుప్రీం కోర్టులో వాదనల సందర్భంగా పేర్కొంది. ఈ పంచాయితీ ఎటూ తేలని తరుణంలో.. సాంకేతికంగా ఇప్పటికీ ఉద్దవ్ థాక్రే నే శివసేన అధినేతగా కొనసాగుతున్నారు. బీజేపీ మద్ధతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన షిండే.. మెజారిటీని నిరూపించుకునేందుకు బలపరీక్షను ఎదుర్కొన్నారు. ఇందుకోసం జూలై 2 నుంచి మహారాష్ట్ర శాసనసభలో రెండు రోజుల ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. చదవండి: ఫడ్నవిస్ అసంతృప్తి.. బీజేపీ సంబురాలకు దూరం! -
Twitter: ట్విటర్ కొత్త పాలసీ, కఠిన నిబంధనలు ఇవే..
Twitter New Rules 2021: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ ఇకపై ప్రైవసీ నిబంధనలను కఠినంగా అమలు చేయనుంది. అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు షేర్ చేయడంపై ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోనుంది. ట్విటర్ కొత్త పాలసీ నవంబర్ 30, 2021 నుంచి అమలులోకి వచ్చిందని ప్రకటించుకుంది. ఒక యూజర్ లేదంటే అథారిటీ కావొచ్చు.. అవతలి వాళ్ల అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారం పోస్ట్ చేయడానికి వీల్లేదు. అలాంటి పోస్టుల మీద గనుక ఫిర్యాదులు అందితే.. ప్రైవసీ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించి ఆ పోస్ట్‌ను తొలగిస్తుంది ట్విటర్ . అయితే.. ఇదివరకే ట్విటర్లో ఇలాంటి కఠిన నిబంధనలు ఉన్నాయి. చిరునామాలు, ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్స్, మెడికల్‌బిల్లులు, సోషల్ మీడియా అకౌంట్ వివరాలు, జీపీఎస్ లొకేషన్, గుర్తింపు ఐడెంటిటీ కార్డులు, మెడికల్ రికార్డులు.. ఇలాంటి సమాచారం ట్విటర్లో షేర్ చేయడానికి వీల్లేదు. వీటికి తోడు ఫైనాన్షియల్ ట్రాన్జాక్షన్స్కు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయడం కూడా ఉల్లంఘనే అవుతుంది. ఇక కొత్త పాలసీ అప్డేట్ ప్రకారం.. పబ్లిక్ ఫిగర్స్, ప్రజా ప్రయోజనాల కోసం ఇతరులకు(నాన్ సెలబ్రిటీస్) సంబంధించి మీడియా షేర్ చేసే పోస్టులకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. కానీ, అవి అభ్యంతరకరంగా ఉండి.. ఫిర్యాదులు అందితే మాత్రం వాటిని కూడా ట్విటర్ పరిశీలించి మరీ తొలగిస్తుంది. చర్యల్లో భాగంగా వ్యవహారం తీవ్రతను బట్టి అకౌంట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయడమో లేదంటే పర్మినెంట్‌గా సస్పెండ్ చేయడమో జరుగుతుందని ట్విటర్ తెలిపింది. అమెరికాలో పబ్లిక్ ప్లేసుల్లో ఫొటోలు తీసి.. ట్విటర్లో అనుమతులు లేకుండా పోస్ట్ చేయడంలాంటి వ్యవహారాలు పెరిగిపోతున్నాయి. ఇక యూరోపియన్ చట్టాలు మాత్రం.. ఇలా ఫిర్యాదులు అందితే ఫొటోలు, వీడియోలను తొలగించేందుకు ఎప్పటి నుంచో అనుమతిస్తున్నాయి. అయితే యూజర్ల వ్యక్తిగత భద్రతను (Privacy) కాపాడేందుకు.. ఆయా దేశాల చట్టాలను అనుసరించి ఈ అప్డేట్ తీసుకొచ్చినట్లు ట్విటర్ ప్రకటించుకుంది. ట్విటర్లో ప్రైవసీ నిబంధనల అమలు అసలు ఉంటుందా? అనే అనుమానాలకు ట్విటర్ పైవిధంగా క్లారిటీ ఇచ్చింది. Beginning today, we will not allow the sharing of private media, such as images or videos of private individuals without their consent. Publishing people's private info is also prohibited under the policy, as is threatening or incentivizing others to do so.https://t.co/7EXvXdwegG — Twitter Safety (@TwitterSafety) November 30, 2021 -
పూజకు వేళాయే.. తరలివచ్చిన భక్తజనం.. లఘు దర్శనాలకే అనుమతి
సాక్షి, వేములవాడ: ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేయడంతో 40 రోజులుగా మూసి ఉంచిన వేములవాడ రాజన్న ఆలయాన్ని ఆదివారం ఉదయం ఆలయ అధికారులు తెరిచారు. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం కేవలం స్వామివారి లఘు దర్శనం, కల్యాణకట్టలో తలనీలాల సమర్పణ, స్వామివారి ప్రసాదాలను మాత్రమే అనుమతించారు. గర్భగుడి దర్శనాలు, ధర్మగుండం ప్రవేశం నిలిపివేశారు. కోడె మొక్కులు చెల్లించుకునే అంశంపై తుదినిర్ణయం తీసుకుంటామని ఆలయ ఏఈవో హరికిషన్ తెలిపారు. జోరందుకున్న పుట్టువెంట్రుకలు ప్రభుత్వం అన్‌లాక్ ప్రకటించడంతో పాటు ఆదివారం మంచిరోజు కావడంతో చిన్నారుల పుట్టు వెంట్రుకలు తీసేందుకు కుటుంబాలతో వచ్చిన వారితో ఆలయ ఆవరణ కిటకిటలాడింది. అలాగే కల్యాణకట్టలోనూ మొక్కులు చెల్లించుకున్నారు. కొత్త పెళ్లి జంటలు సైతం తమ ఇలవేల్పు రాజన్నను కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. చాలా రోజుల తరువాత రాజన్నను దర్శించుకున్నామంటూ జనం సంబరపడిపోయారు. స్థానికుల దర్శనాలు మూడు మాసాలుగా రాజన్న గుడి మెట్లు ఎక్కని స్థానికులు ఆదివారం వేకువజాము నుంచే స్వామి సన్నిధికి చేరుకుని దర్శించుకున్నారు. మే 12 ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు ముందునుంచే రాజన్న ఆలయాన్ని అధికారులు సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించడం, సెకండ్ వేవ్‌తో చాలా మంది మృతిచెందడంతో స్థానికులు రాజన్న గుడివైపు వెళ్లలేకపోయారు. పాజిటివ్ కేసులు తగ్గడం, ప్రభుత్వం అన్‌లాక్ ప్రకటించడంతో పురప్రముఖులు, స్థానికులు దర్శనం కోసం క్యూ కట్టారు. పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. చదవండి: సప్త మాతృకలకు బంగారు బోనం.. -
మయన్మార్ మిలటరీ ఫేస్బుక్ పేజీ తొలగింపు
యాంగాన్: మయన్మార్‌లో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు సాధారణ పౌరులు మరణించడం పట్ల ఫేస్బుక్ యాజ మాన్యం విచారం వ్యక్తం చేసింది. మయన్మార్ మిలటరీ ప్రధాన పేజీని ఫేస్బుక్ నుంచి తొలగించినట్లు ప్రకటించింది. తాము పాటిస్తున్న ప్రమాణాల ప్రకారం హింసను రెచ్చగొట్టే అంశాలను కచ్చితంగా తొలగిస్తామని వెల్ల్లడించింది. మయన్మార్ సైన్యం తాత్మదా ట్రూ న్యూస్ ఇన్ఫర్మేషన్ టీమ్ పేరిట ఫేస్బుక్ పేజీని నిర్వహిస్తోంది. ఆ పేజీ ఇప్పుడు కనిపిం చడం లేదు. కాగా, పోలీసు దమనకాండను ఖండిస్తూ ఆదివారం దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఫిబ్రవరి 9న పోలీసుల కాల్పుల్లో గాయపడిన 19 ఏళ్ల మయా థ్వెట్ ఖీనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది. ఆమె అంత్యక్రియలను ఆదివారం యాంగాన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా జనం పాల్గొన్నారు. -
సిలబస్ నుంచి పౌరసత్వం, నోట్లరద్దు కట్
న్యూఢిల్లీ: కరోనా కారణంగా విద్యా సంవత్సరం తగ్గించాల్సి రావడంతో సిలబస్‌ను కూడా సీబీఎస్ఈ తగ్గించింది. దీనికోసం తొలగించిన అంశాల్లో లౌకికవాదం, పౌరసత్వం, జాతీయ వాదం, నోట్ల రద్దు వంటి అంశాలు. 9 నుంచి 12 తరగతుల వారికి దాదాపు 30 శాతం సిలబస్ ను తగ్గిస్తూ తాజా సిలబస్‌ను బుధవారం వెల్లడించింది. ఇందులో పదో తరగతిలో తొలగించిన వాటిలో ప్రజాస్వామ్యం– వైవిధ్యత, లింగం, కులమతాలు, ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు, సమస్యలు వంటి అంశాలు ఉన్నాయి. 11వ తరగతిలో సమాఖ్యవిధానం, పౌరసత్వం, జాతీయవాదం, భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు లౌకిక వాదం అనే అంశాలను తొలగించారు. 12వ తరగతిలో భారత్‌తో పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ దేశాల సంబంధాలు, భారతదేశ ఆర్థిక అభివృద్ధి, భారత్ లో సామాజిక ఉద్యమాలు, పెద్ద నోట్ల రద్దు వంటి అంశాలను తొలగించారు. విద్యార్థులపై భారం పడకుండా ఉండేలా సిలబస్‌ను రూపొందించినట్లు హెచ్చార్డీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సిలబస్ నుంచి ఇంటర్నల్ పరీక్షల్లోగానీ, సంవత్సరాంతపు పరీక్షల్లోగానీ ప్రశ్నలు రావని సీబీఎస్ఈ తెలిపింది. ఈ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఒక్కసారి మాత్రమే.. 9 నుంచి 12 తరగతుల వరకూ తగ్గించిన సిలబస్ కేవలం ఒక్క విద్యా సంవత్సరానికి (2020–21) మాత్రమేనని సీబీఎస్ఈ సెక్రెటరీ అనురాగ్ తిపాఠి చెప్పారు. 190 సబ్జెక్టులకు సంబంధించి 30 శాతం సిలబస్ తగ్గించామని చెప్పారు. ఏఏ అంశాలను తొలగించారో స్పష్టంగా తెలిసేందుకు పాఠశాలలు ఎన్సీఈఆర్టీ రూపొందించిన క్యాలెండర్‌ను పాటించాలని సూచించారు. తొలగించిన అంశాలకు సంబంధించిన పాఠాలు సిలబస్‌లో ఎక్కడో ఒక చోట ఉండేలా చూసుకున్నామని చెప్పారు. -
ఆ 89 యాప్స్ తొలగించండి
న్యూఢిల్లీ: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్రూకాలర్ సహా మొత్తం 89 యాప్‌లను జులై 15లోగా తమ స్మార్ట్ ఫోన్లలో నుంచి తొలగించాలని తమ సిబ్బంది, అధికారులను బుధవారం ఆర్మీ ఆదేశించింది. ఆ యాప్‌లతో కీలకమైన సెక్యూరిటీ సమాచారం లీక్ అయ్యే ప్రమాదముందని పేర్కొంది. ఈ ఆదేశాలను పాటించని వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఈ 89 యాప్స్‌లో 59 యాప్స్ చైనాకు సంబంధించినవే కావడం గమనార్హం. వాటిలో ఇటీవల కేంద్రం నిషేధించిన టిక్‌టాక్ కూడా ఉంది. పాకిస్తాన్, చైనాల ఇంటలిజెన్స్ వర్గాలు భారత సైనికులను లక్ష్యంగా చేసుకునే ముప్పు ఇటీవల చాలా పెరిగిందని భారత సైన్యాధికారి ఒకరు పేర్కొన్నారు. అధికారిక సమాచార మార్పిడికి వాట్సాప్‌ను వాడకూడదంటూ గత నవంబర్లోనే ఆర్మీ తమ సిబ్బందిని ఆదేశించింది. కీలక హోదాల్లో ఉన్న సైన్యాధికారులు ఫేస్‌బుక్‌ను వాడవద్దని కూడా అప్పుడే సూచించింది. గత రెండు, మూడేళ్లుగా పాక్ ఏజెంట్లు భారత త్రివిధ దళాల సైనికులు లక్ష్యంగా, కీలక రక్షణరంగ సమాచారం సేకరించేందుకు అమ్మాయిలను ఎరగా వేసి హానీట్రాప్‌లకు పాల్పడిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్‌ను వినియోగించవద్దని నౌకాదళం కూడా ఇప్పటికే తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. -
అప్పట్లో ఇలానే ఉంటే తెలంగాణ వచ్చేదా?
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ఉమ్మడి రాష్ట్రంలో ఇంత నిర్బంధం ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా?అని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రావడానికి గల ఉద్యమాలను మర్చిపోయి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని, యూనియన్లు అవసరం లేదని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉపా చట్టం కింద అందరినీ అరెస్టు చేస్తే తెలంగాణను సాధించుకునే వారిమా? అని ప్రశ్నించారు. ఇప్పటి ప్రభుత్వం కంటే అప్పటి ప్రభుత్వమే ప్రజాస్వామికంగా ఉందని అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్లో (టీపీటీఎఫ్) టీడీఎఫ్, టీడీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు విలీనమైన సందర్భంగా సదస్సు జరిగింది. ఈ సదస్సులో హరగోపాల్ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ కాశింను అరెస్టు చేసిన పద్ధతి అప్రజాస్వామికం అని అన్నారు. వైస్ చాన్స్‌లర్ అనుమతి లేకుండా పోలీసులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ చక్రధర్‌రావు, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఏపీటీఎఫ్ మాజీ అధ్యక్షుడు ఎ.నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీపీటీఎఫ్ నూతన కమిటీ.. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) నూతన కమిటీని ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రకటించా రు. అధ్యక్షుడిగా కె.రమణ, అసోసియేట్ అధ్యక్షుడిగా వై.అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా మైస శ్రీనివాసులు, అదనపు ప్రధాన కార్యదర్శిగా నన్నెబోయిన తిరుపతి, ఉపాధ్యక్షులుగా బి.రమేష్, పి.నారాయణమ్మ, ఎం.రవీందర్, జి.తిరుపతిరెడ్డి, కె.కిషన్‌రావు, రావుల రమేష్, కార్యదర్శులుగా పి.నాగమణి, పి.నాగిరెడ్డి, ఎం.రామాచారి, జె.చంద్రమౌళి, ఎ.రాంకిషన్, కె.కనకయ్య, మాడుగుల రాములు తదితరులు ఎన్నికయ్యారు. కాశింపై కేసులు ఎత్తివేయాలి సుల్తాన్‌బజార్: విరసం కార్యదర్శిగా కొత్తగా ఎన్నికైన కాశింను విడుదల చేసి ఆయనపై మోపిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. వ్యవస్థాపక సభ్యుడు వరహరరావు ఏడాదికి పైగా పూణె జైలులో ఉన్నారని సభ్యులమీద సైతం కేసులు నడుస్తున్నాయని అన్నారు. ప్రజల పక్షాన మాట్లాడే ప్రజా సంఘాల నేతలను రాష్ట్ర ప్రభుత్వం జైళ్లకు నెడుతోందని మండిపడ్డారు. రాష్ట్రం కోసం విద్యార్థి దశ నుంచి ఎన్నో పోరాటాల్లో భాగమైన కాశింను అక్రమంగా అరెస్ట్ చేయడం తగదన్నారు. ప్రజా సంఘాల బాధ్యులను వరుసగా అరెస్టు చేసి మొత్తం సమాజాన్ని ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తుందని మండిపడ్డారు. సమావేశంలో విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ, సహాయ కార్యదర్శి రివేర, కాశిం తల్లి వీరమ్మ పాల్గొన్నారు. -
ఐటీడీఏను ముట్టడించిన ఆదివాసీలు
ఉట్నూర్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ప్రధాన డిమాండ్‌తోపాటు తమ సమస్యలను ప్రభుత్వం వెంట నే పరిష్కరించాలంటూ ఆదివాసీ మహిళాలోకం కదంతొక్కింది. భారీగా తరలివచ్చిన ఆదివాసీలు సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఐదువేలకు పైగా ఆదివాసీలు ఆందోళనలో పాల్గొన్నారు. ఉట్నూర్ ప్రధానవీధుల్లో భారీ ప్రదర్శన చేపట్టారు. మధ్యా హ్నం 2 నుంచి సాయంత్రం ఐదున్నర వరకు మూడు కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ ఐటీడీఏ కార్యాలయానికి చేరుకుని వారి నుంచి వినతిపత్రం తీసుకున్నప్పటికీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. పోలీసులు బారికేడ్లు ఏర్పాట్లు చేయడం.. గేటుకు తాళం వేయడం తో ఆదివాసీలు కోపోద్రిక్తులయ్యారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికా రి రావాల్సిందేనంటూ.. లోపలికి చొచ్చుకెళ్లే యత్నం చేశారు. పోలీసులు అడ్డుకున్నా.. ఆదివాసీలు భారీ సంఖ్యలో ఉండటంతో చేతులెత్తేయాల్సి వచ్చింది. పలువురు ఆదివాసీలు గోడపై నుంచి దూకి కార్యాలయం లోపలికి వెళ్లారు. అదనపు ఎస్పీ రవికుమార్, డీఎస్పీ డేవిడ్ ఆదివాసీలకు నచ్చజెప్పే ప్రయ త్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆదివాసీ మహిళా సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఐటీడీఏ ఉన్నది ఆదివాసీల కోసమేనని, తమను ఎందుకు అనుమతించట్లేదని ప్రశ్నించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు తమ పోరాటం ఆపబోమన్నారు. లంబాడీలకు ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వొద్దంటూ నినదించారు. ఇప్పటికే ధ్రువీకరణ పత్రాలిచ్చిన తహసీల్లార్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీఆర్టీలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన 25 మందిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివాసీ నేతలపై పెట్టిన కేసుల ను ఎత్తి వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ మహిళా సంఘం నాయకులు గోడం రేణుకాబాయి, సోయం లలితాబాయి, మర్సకోల సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
వేలాది ఫేక్ న్యూస్ అకౌంట్ల క్లోజ్
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ సంస్థ వేలాది ఫేక్ న్యూస్ అకౌంట్లను శుక్రవారం తొలగించింది. సౌదీ అరేబియాలో యుద్ధం అంటూ సౌదీకి అనుకూలంగా తప్పుడు సమాచారం శుక్రవారం ట్విటర్లో వైరల్ కావడంతో ట్విటర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా హాంకాంగ్‌లో ఆందోళనల గురించి చైనా నుంచి వస్తున్న పోస్టులకు సంబంధించిన అకౌంట్లను కూడా ట్విటర్ రద్దు చేసింది. ఇంకా స్పెయిన్, ఈక్వెడార్‌లోని అదనపు ఫేక్ అకౌంట్లను తొలగించింది. హాంకాంగ్ నిరసనకారుల గురించి పోస్టులు పెడుతున్న 4302 నకిలీ ఖాతాలను రద్దు చేసినట్టు ట్విటర్ వెల్లడించింది. హాంకాంగ్‌లో నిరసనలపై పోస్టులు పెట్టిన చైనా చెందిన 2 లక్షల నకిలీ ఖాతాలను గత ఆగస్టులో ట్విటర్ తొలగించింది. (చదవండి: ట్విటర్ సీఈవో అకౌంట్ హ్యాక్) -
ఆర్టీజీఎస్, నెఫ్ట్ చార్జీల రద్దు
ముంబై: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్టీజీఎస్, నెఫ్ట్‌పై చార్జీలను ఎత్తివేయాలంటూ నందన్ నీలేకని ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫారసులను ఆర్బీఐ అమలుపరిచింది. ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ (నెఫ్ట్) ద్వారా చేసే నగదు బదిలీలపై చార్జీలను తొలగిస్తూ, బ్యాంకులు సైతం కస్టమర్లకు దీన్ని బదలాయించాలని కోరింది. రూ.2 లక్షల వరకు నిధుల బదిలీకి నెఫ్ట్‌ను వినియోగిస్తుండగా, రూ.2 లక్షలకు పైన విలువైన లావాదేవీలకు ఆర్టీజీఎస్ వినియోగంలో ఉంది. దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ నెఫ్ట్ లావాదేవీలపై రూ.1–5 వరకు, ఆర్టీజీఎస్‌పై రూ.5–50 వరకు చార్జ్ చేస్తోంది. డిజిటల్ రూపంలో నిధుల బదిలీకి ప్రోత్సాహం ఇచ్చేందుకు చార్జీలను ఎత్తివేయాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ పేర్కొంది. వాస్తవానికి ఆర్టీజీఎస్, నెఫ్ట్‌లపై చార్జీలను ఎత్తివేయడమే కాకుండా, రోజులో 24 గంటల పాటు ఈ సదుపాయాలను అందుబాటులో ఉంచాలని, దిగుమతి చేసుకునే పీవోఎస్ మెషిన్లపై సుంకాలు ఎత్తివేయాలని, ఇలా ఎన్నో సూచనీలను నీలేకని కమిటీ సిఫారసు చేసింది. కానీ, ఇతర అంశాలపై ఆర్బీఐ స్పందించినట్టు లేదు. ఏటీఎం చార్జీల సమీక్షపై కమిటీ ఏటీఎంల వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో వీటి లావాదేవీల చార్జీలను సమీక్షించాలన్న బ్యాంకుల వినతులను మన్నిస్తూ ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సీఈవో చైర్మన్‌గా, భాగస్వాములు అందరితో కలసి ఈ కమిటీ ఉంటుందని తెలిపింది. తొలిసారి భేటీ అయిన తేదీ నుంచి రెండు నెలల్లోపు ఈ కమిటీ నివేదికను సమర్పించాల్సిన ఉంటుందని పేర్కొంది. -
ధోనితో ఆ లోగో తీయించండి
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ధోనికి భారత ఆర్మీ అంటే అభిమానం, గౌరవం. ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఉన్న ధోని రాష్ట్రపతి భవన్లో జరి గిన పద్మ అవార్డుల కార్యక్రమంలో ఆర్మీ కవాతుతో పురస్కారాన్ని స్వీకరించాడు. పుల్వామా దాడిని తీవ్రంగా ఖండించడమే కాదు... వారిని స్మరిస్తూ ఆసీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో జట్టు మొత్తం ఆర్మీ క్యాపులతో బరిలోకి దిగేలా చేశాడు. తనకు ఆర్మీలో చేరాలనే కోరిక ఉందని చాలాసార్లు చెప్పాడు కూడా. ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌లో ధోని కీపింగ్ గ్లౌజ్‌పై ‘బలిదాన్ బ్యాడ్జ్’ (ఆర్మీకి చెందిన ప్రత్యేకమైన లోగో) వేయించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఫెలుక్వాయోను స్టంపౌట్ చేయడం ద్వారా ఈ గ్లౌజ్‌పై ఉన్న లోగో అందరికంటా పడింది. అతని దేశభక్తి ఉన్నతమైనదే అయినా... దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ధోనితో ఆ లోగోను తీయించాల్సిందిగా భారత క్రికెట్ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల్లో ఆటగాళ్ల దుస్తులు, కిట్ సామాగ్రిపై జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తులు ఉండరాదు. ఈ నేపథ్యంలో బీసీసీఐని ఆ గుర్తు తీయించాలని కోరామని ఐసీసీ జనరల్ మేనేజర్ (కమ్యూనికేషన్స్) ఫర్లాంగ్ వెల్లడించారు. -
ముస్లింల ఓట్ల తొలగింపు
నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికారపార్టీ కుట్రలు చేస్తోంది. జిల్లాలో వైఎస్సార్సీపీకి ముస్లింలు అధిక శాతం మంది మద్దతుగా ఉన్నారు. ముస్లింల ఓట్లు తొలగించేలా అధికారపార్టీ కుతంత్రాలు చేసింది. నెల్లూరుసిటీ నియోజకవర్గానికి సంబంధించి వెంకటేశ్వరపురంలో 300 ముస్లిం ఓట్లు తొలగించారు. షేక్ ఖలీమ్ కుటుంబానికి సంబంధించి, ఆయన బంధువులు అందరివీ కలిపి సుమారు 50 ఓట్లు తొలగించారు. ఓటర్ కార్డు ఉండడంతో ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయని అనుకున్నారు. ఒకసారి చెక్ చేసుకుందామని జాబితాను పరిశీలించారు. వారి 50 ఓట్లు తొలగించారని గుర్తించారు. ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకుంటే ఇద్దరికి మాత్రమే ఓటు హక్కు కల్పించారు. ఆ ఇద్దరికి కూడా వెంకటేశ్వరపురంలో కాకుండా కొత్తూరులో ఓటు హక్కు కల్పించారు. ఇది అధికారులు, అధికారపార్టీ నాయకుల చేసిన కుట్రే. జిల్లా వ్యాప్తంగా ముస్లింల ఓట్లు తొలగించారు. ముస్లింలను గుర్తింపుకార్డులకు మాత్రమే పరి మితం చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, అభిమానుల ఓట్లు వేల సంఖ్యలో తొలగించారు. కొత్తగా పెరిగిన ఓట్లు అధికారపార్టీకి అనుకూలంగా ఉండే వారివే అధికంగా ఉన్నాయని విమర్శలున్నాయి. జిల్లాలో 32.50 లక్షల మంది జనాభా ఉన్నారు. పెరిగిన ఓటర్లతో కలిíపి జిల్లాలో 23,92,210 మంది ఉన్నారు. జనాభా ప్రాతిపదికన పరిశీలించిన ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండాలి. జిల్లా వ్యాప్తంగా మరణించిన వారు ఓట్లు తొలగించకుండా బతికున్న వారి ఓట్లు తొలగించారు. అందని కార్డులు సార్వత్రిక ఎన్నికలు 2019కి సంబంధించి పోలింగ్ ప్రక్రియకు ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంత వరకు పెరిగిన ఓటర్లకు గుర్తిపుకార్డులు అందలేదు. ప్రజలు మీ–సేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. మీ–సేవ కేంద్రాల్లో ఓటర్ కార్డులు డౌన్లోడ్ కావడంలేదు. రాత్రి 10 గంటల తరువాత ఉదయం 9 గంటల లోపు మాత్రమే సైట్ పని చేస్తోంది. పట్టించుకోని జిల్లా యంత్రాంగం ఓటర్ కార్డులు డౌన్లోడ్ చేసి ప్రజలకు అందజేయాలన్నా మీ–సేవ నిర్వాహకులకు హోలో గ్రామ్స్ అందుబాటులో లేవు. హోలోగ్రామ్స్ సర్వీస్ ప్రొవైడర్ల వద్ద అందుబాటులో ఉన్న వాటిని మీ–సేవ కేంద్రాల నిర్వాహకులకు ఇవ్వడంలేదు. గుర్తింపు కార్డులు త్వరితగతిన అందజేసేలా చర్యలు తీసుకోవాల్సిన జిల్లా యంత్రాంగం పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. మీ–సేవ ఏఓ పోస్టు ఖాళీగా ఉండడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అధికారులు స్పందించి ప్రతి ఒక్కరికీ ఓటర్ గుర్తింపు కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
బ్యూటిప్స్
మేకప్ వేసుకునేటప్పుడే కాదు తొలగించేటప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాలి. సహజమైన పద్ధతిలో మేకప్‌ని తొలగించాలంటే పాలు లేదా పెరుగును ముఖానికి పట్టించి దూదితో తుడిచేయాలి.ఇంట్లోనే ఐ మేకప్ రిమూవర్‌ని తయారు చేసుకోవచ్చు. ఒక పాత్రలో టీ స్పూన్ ఆముదం, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ వంటనూనె వేసి మూడూ బాగా కలపాలి. ఈ నూనెను దూదితో అద్దుకుని కంటి చుట్టూ, ఐలైనర్, మస్కారా వాడినచోట సున్నితంగా రుద్దితే ఐ మేకప్ సులభంగా తొలగుతుంది. గోరువెచ్చటి నీటిలో దూది లేదా మెత్తని కాటన్ క్లాత్‌ను ముంచి గట్టిగా పిండాలి. ఆ తడి క్లాత్‌తో మరోసారి ముఖాన్ని తుడవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి.మేకప్ వేసుకునే అలవాటు ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు వెంట లిప్‌స్టిక్, బ్లషర్, పౌడర్, దువ్వెన, టిష్యూపేపర్, సేఫ్టీపిన్స్... ఇలాంటివన్నీ ఉండే చిన్న ‘టచ్–అప్’ కిట్‌ని వెంట తీసుకెళ్లాలి. మేకప్ చెదిరినా, తీసివేయాలన్నా తడుముకోవాల్సిన అవసరం ఉండదు. -
ఇక విమానాల్లో హిందూ భోజనం కట్
దుబాయ్ : దుబాయ్ అధికారిక విమానయాన సంస్థ ఎమిరేట్స్ తన అధికారిక మెనూ నుంచి ‘హిందూ మీల్స్’ ఆప్షన్‌ను తొలగించింది. బుధవారం విమానయాన సంస్థ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ప్రయాణికులకు మేము కల్పించే సేవలు గురించి నిరంతరం పరిశీలిస్తాం. మేము ప్రకటించే ఆఫర్ల గురించి, సేవల గురించి ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకుంటాం. ఇది మా సేవలను మరింత మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. దానిలో భాగంగానే ఆన్ బోర్డ్ ప్రొడక్ట్స్, సేవల విషయంలో ప్రయాణికులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ఎమిరేట్స్ మెనూలోంచి హిందూ మీల్స్‌ను తొలగించాం’ అని ఎమిరేట్స్ అధికారులు తెలిపారు. అంతేకాక ‘ప్రయాణికుల అభిరుచికి తగ్గట్లుగా మా విమానయాన సంస్థలో ఆహారాన్ని, డ్రింక్స్‌ను అందిస్తాం. మా దగ్గర చాలా మంచి చెఫ్‌లు ఉన్నారు. వారు ప్రయాణికుల అభిరుచులకనుగుణంగా, మా సాంప్రదాయలను ప్రతిబింబించే రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు. మేము ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పదార్ధాలను తయారు చేయిస్తాం’ అని తెలిపారు. ఇక మీదట హిందూ ప్రయాణికులు, శాఖాహార ప్రయాణికులు శాఖాహార జైన్ ఆహారం, భారతీయ శాఖాహార భోజనం, కోశర్ భోజనం, నాన్ బీఫ్ నాన్ వెజిటేరియన్ నుంచి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. -
హౌసింగ్ ఉద్యోగులు ఔట్
అంతన్నారు.. ఇంతన్నారు.. హామీల వర్షం కురిపించారు.. ఉద్యోగాలు వస్తాయంటూ ఊరించారు.. నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారు.. కొత్త జాబులు రాకపోగా ఉన్నవి పీకి పారేస్తున్నారు.. కొత్త కొత్త నిబంధనలు.. అర్హతల మెలికలతో ఉద్యోగాలను తొలగించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం పూనుకుంది. దీనిలో భాగంగా గృహనిర్మాణ శాఖలో ఔట్ సోర్సింగ్ విధానంలో పదేళ్లుగా పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లను తొలగిస్తూ రెండు నెలల క్రితం ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలో 60 మంది ఉద్యోగాలను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏలూరు (మెట్రో) : బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసి గద్దెనెక్కిన తర్వాత ఆ మాటే మరిచిపోయారు తెలుగుదేశం పార్టీ నాయకులు. కొత్త జాబులు రాకపోగా ఉన్నవి ఊడిపోయే పరిస్థితి వచ్చింది. ఔట్సోర్సి ంగ్ ఉద్యోగాలను ఉఫ్ అంటూ పీకేస్తూ చిరుద్యోగుల ఉపాధికి గండి కొడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 2008లో గృహనిర్మాణ శాఖలో విధులు నిర్వహించేందుకు ఔట్సోర్సింగ్ పద్ధతిలో 173 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను నియమించారు. అప్పటి నుంచి గృహ నిర్మాణ పథకాల వద్ద వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో గృహ నిర్మాణాలు చేసిన మేరకు ఆయా ప్రభుత్వాలు వేతనాలు చెల్లిస్తుండేవి. అయితే వర్క్ ఇన్స్పెక్టర్లు పనికి తగిన వేతనం లభించడం లేదని ఆందోళన చెందడంతో నెలకు రూ.15 వేలు వేతనాన్ని చెల్లించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వర్క్ ఇన్స్పెక్టర్లు ఆనందం వ్యక్తం చేశారు. అయితే వీరి ఆనందం కొద్దిరోజుల్లోనే ఆవిరి అయిపోయింది. నెలసరి వేతనాన్ని నిర్ణయించడంతో పాటు కొత్త నిబంధనలు తీసుకురావడంతో చాలా మంది ఉద్యోగాలను కోల్పోయారు. పదేళ్లకు గుర్తొచ్చిన నిబంధనలు ప్రభుత్వం గృహనిర్మాణ శాఖలో విధులు నిర్వహించేందుకు 2008లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఐ టీఐ చేసిన అభ్యర్థులను వర్క్ ఇన్స్పెక్టర్లుగా నియమించింది. అప్పట్లో ఐటీఐలో అన్ని ట్రేడుల వారిని అర్హులుగా గుర్తించి ఉద్యోగాలు ఇచ్చారు. అయితే ఐటీఐలో ట్రేడులను పక్కన పెట్టి ఐటీఐ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కట్టబెట్టింది. అయితే చంద్రబాబు సర్కారు ఉద్యోగులను తగ్గించే ఆలోచనతో పదేళ్ల తర్వాత కొత్త నిబంధనలను తెరపైకి తీసుకువచ్చింది. ఐటీఐలో సివిల్ డిప్లమో, డ్రాఫ్ట్‌మెన్ సివిల్ వంటి ట్రేడులు ఉన్న వర్కు ఇన్స్పెక్టర్లను మాత్రమే కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇతర ట్రేడుల్లో ఉద్యోగాలు పొందిన వర్క్ ఇన్స్పెక్టర్లు ఉద్యోగాలను కోల్పోయారు. ఇలా జిల్లాలో 60 మంది ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారు. వీధిన పడ్డ 60 కుటుంబాలు : 2008 నుంచి గృహ నిర్మాణ శాఖనే నమ్ముకుని విధులు నిర్వహించే వర్కు ఇన్స్పెక్టర్లు తమ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని భావించారు. చంద్రబాబు సర్కారు వీరి ఉద్యోగాలు తొలగించడంతో 60 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.కాళ్లరిగేలా తిరుగుతున్నా.. కొత్త నిబంధనలతో ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డామని రెండు నెలలుగా జిల్లాలోని వర్క్ ఇన్స్పెక్టర్లు మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రాలు అందిస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారులను కలిసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయినా ఏ ఒక్క నాయకుడూ, అధికారీ వీరికి న్యాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. న్యాయం చేయండి మహాప్రభో పదేళ్ల నుంచి గృహనిర్మాణ శాఖనే నమ్ముకుని జీవనాలు సాగిస్తున్నాం. హౌసింగ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ విడుదల చేసిన జీఓతో ఉద్యోగాలను తొలగించారు. ఒక్క సంతకంతో ఉద్యోగాలు తీసేయడంతో ఏం చేయాలో తెలియడం లేదు. మాకు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం. – దిద్దే జగన్, బాధితుడు పర్మినెంట్ చేస్తారనుకుంటే.. వర్క్ ఇన్స్పెక్టర్లను పర్మినెంట్ చేస్తారని ఎప్పటి నుంచో భావిస్తున్నాం. పర్మినెంట్ చేయకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగించేశారు. ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించకుండా ఉద్యోగాలు తొలగించడంతో కుటుం బాలతో సహా రోడ్డున పడ్డాం. మా గోడు పట్టించుకునే వారే లేరు. – కొడవటి శ్రీనివాస్, బాధితుడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అధికంగా ఉన్న ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన వారిని నియమించి, అర్హతలు లేని ఉద్యోగులను తొలగించాం. ఐటీఐలో సివిల్‌కు ప్రాధాన్యత ఇచ్చి అర్హులైన అభ్యర్థులను కొనసాగిస్తున్నాం. – ఈ.శ్రీనివాస్, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ -
లంబాడాలను తొలగించేదాకా.. లడాయే
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు లడాయి ఆగదని పలువురు ఆదివాసీ నేతలు స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గుడిహత్నూర్‌లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో గురువారం ఆదివాసీ మహిళా పోరుగర్జన సభ నిర్వహించారు. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీ మహిళలు భారీగా తరలివచ్చారు. అలాగే ఆదివాసీ ప్రొఫెసర్లు, వివిధ రాష్ట్రాలకు చెందిన ఆదివాసీ నేతలు, ప్రజాప్రతినిధులు హాజరై తమ గొంతుక వినిపించారు. మా అస్తిత్వం, స్వాభిమానం కోసమే మా పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల ఆదివాసీ నాయకుల రాక ఆదివాసీ మహిళా పోరు గర్జన సభకు ఇతర రాష్ట్రాల నుంచి హాజరయ్యారు. వీరిలో ప్రొఫెసర్ ఉయిక అమ్రాజ్, దుర్వ సుశీల, ప్రొఫెసర్ సువ ర్ణ వార్కెడె, అసిస్టెంట్ ప్రొఫెసర్ కంచర్ల వాలంటిన ఉన్నారు. వీరితో పాటు ఉమ్మడి జిల్లా ఆది వాసీ మహిళా నాయకులు కుమ్ర ఈశ్వరీబాయి, దుర్వ చిల్కుబాయి, మర్సకోల కమల, మ డావి కన్నీబాయి, సోందేవ్‌బాయి, లక్ష్మీబాయి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ జెడ్పీ చైర్మన్ సిడం గణపతి, తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాక కా ర్యదర్శి ఉయిక సంజీవ్, ఆదివాసీ విధ్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాక కార్యదర్శి వెడ్మబొజ్జు, కార్యదర్శి కొడప నగేష్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కొడప జాలంజాకు, కార్యదర్శి బాపురావు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు వెంకటేశ్, ఉమ్మడి జిల్లా ఆది వాసీ నాయకులు విజయ్, గోపిచంద్, కుడ్మెత తిరుపతి, భూమయ్య, పాండురంగ్, మారుతి, జలపతి,ఖమ్ము, భాస్కర్, అశోక్, వెంకటేశ్ హైమన్‌డార్ఫ్ యూత్ అధ్యక్షులు పాల్గొన్నారు. అస్తిత్వం కోసమే పోరాటం మా అస్తిత్వం, స్వాభిమానం కోసమే పోరాడుతున్నామని ప్రొఫెసర్ ఉయిక అమ్రాజ్ అన్నారు. ప్రకృతి ఒడిలో స్వచ్ఛంగా బతికే మా అమాయకత్వాన్ని చేతకాని తనంగా తీసుకుని ప్రభుత్వాలు తమతో ఆడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజుల వంశం మాది. అలాంటి మాకు సమాజంలో మనుషులుగా కూడా పరిగణించడం లేదు. ఉద్యమించక పోతే మనల్ని క్షమించరు ఆదివాసీల హక్కులను హరిస్తూ విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో పెత్తనాన్ని అనుభవిస్తున్న లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఉద్యమిద్దామని ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావు పిలుపు నిచ్చారు. ఉద్యమంలో కలిసిరావాలని కోరారు. రాష్ట్ర సాధనలో ఆదివాసీ త్యాగాలను మరిచారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆదివాసీలు తమదైన శైలిలో ఉద్యమించి చేసిన త్యాగాలు ముఖ్యమంత్రి మరిచారని ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రం సుగుణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం సాధించాక పోలవరం ప్రాజెక్టులో లక్షల మంది ఆదివాసీలు నిరాశ్రయులయ్యారని తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం ఆదివాసీలు చేస్తున్న ఉద్యమాన్ని చట్ట విరుద్ధంగా లంబాడాలు ఎస్టీలో కొనసాగుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో వారికి ఉన్న హోదా, రాజ్యాంగ అధికారాలు తదితర అంశాలను పరిశీలించి సమస్యను పరిష్కరిద్దామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆ దిశగా అందరం సామరస్యంగా కృషి చేద్దామని ఆమె కోరారు. – ఎమ్మెల్యే కోవ లక్ష్మి -
తాజ్‌మహల్ పర్యాటక స్థలం కాదు
న్యూఢిల్లీ / లక్నో: ఆధునిక ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తొలగించింది. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రోత్సహించడానికి విడుదల చేసిన బుక్‌లెట్‌లో గంగా నదికి హారతి ఇవ్వడాన్ని ముఖచిత్రంగా ఇచ్చారు. ప్రతి ఏటా దాదాపు 60 లక్షల మంది పర్యాటకులు, ఎక్కువగా విదేశీయులు తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. తాజ్‌మహల్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించగా.. ప్రధాని మోదీ ‘క్లీన్ ఇండియా మిషన్’కు ఎంపిక చేసిన 10 ప్రాంతాల్లో తాజ్‌మహల్ చోటు దక్కించుకుంది. రామాయణం, భగవద్గీతలు మాత్రమే భారతీయ సంస్కృతికి చిహ్నాలనీ, తాజ్‌మహల్ ఎంతమాత్రం కాదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అది వాస్తవం కాదు: యూపీ పర్యాటక బుక్లెట్ నుంచి తాజ్‌మహల్‌ను తొలగించారన్న వార్తల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. యూపీలో రూ.370 కోట్లతో చేపడుతున్న పర్యాటక ప్రాజెక్టుల్లో ఒక్క తాజ్‌మహల్ కోసమే రూ.156 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఖైదీలకూ ఆ హక్కు ఉంది: సుప్రీం న్యూఢిల్లీ: నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్న దోషులకు కూడా జైలు గోడలు దాటి బయటికి వెళ్లే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సామాజిక సంబంధాలు కొనసాగించేందుకు వారికి అవకాశం ఇవ్వాలని పేర్కొంది. సుదీర్ఘ కాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న వారు.. పెరోల్/ఫర్లాఫ్ కోరితే మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. -
మద్యం నియంత్రించక పోతే పోరాటమే
-
ఆర్టీసీ సీసీఎస్ కార్యదర్శిని తొలగించండి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సహకార పరిపతి సంఘం (సీసీఎస్)లో అలజడి నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సొసైటీ కార్యదర్శిని వెంటనే తొలగిం చాలని కొందరు కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే హైకోర్టు తలుపు తట్టిన ఆ కార్మిక వర్గం.. ఇటీవల సహకార శాఖ విచారణ జరిపి చేసిన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. పదవీ విరమణ పొందినా నిబంధనలకు విరుద్ధంగా కార్యదర్శిగా నాగరాజు కొనసాగు తున్నారని, ఆంధ్రా ప్రాంతంలో ఆరు నుంచి పదో తరగతి వరకు చదివినందున తెలంగాణలో కొనసాగే అవకాశం లేనప్పటికీ కొనసాగు తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. స్థాయికి మించి అక్రమంగా అధిక వేతనం పొందుతున్నందున ఇప్పటివరకు పొందిన మొత్తాన్ని తిరిగి సంఘానికి చెల్లించాలని విచారణాధికారులు తేల్చారని పేర్కొంటున్నారు. ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఆయనను తొలగించాలని సహకార శాఖ సిఫార్సు చేసిందని ఆర్టీసీ బహుజన కార్మిక సంఘం అధ్యక్షుడు ప్రేమ్‌నాథ్ సహా పలువురు కార్మికులు చెబుతన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సహకార పరపతి సంఘం మంగళవారం అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసింది. అయితే కార్యదర్శిని కాపాడుకునేందుకు కొందరు కుట్రపన్నారని, సమావేశంలో ఆయనకు అనుకూల తీర్మానం చేయబోతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మరోవైపు సహకార శాఖ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీసీఎస్ చైర్మన్, ఆర్టీసీ ఎండీ రమణరావు పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు: కార్యదర్శి నాగరాజు కార్మిక సంఘాల మధ్య ఉన్న విభేదాల వల్లే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని సీసీఎస్ కార్యదర్శి నాగరాజు అన్నారు. సహకార శాఖ విచారణ జరిపి తనకు క్లీన్‌చీట్ ఇచ్చిందని, బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకునేందుకు నిబంధనలకు విరుద్ధంగా తాను రుణం పొందినట్లు తేలలేదన్నారు. -
ఫ్లెక్సీలు, పోస్టర్లు తొలగించండి
అనంతపురం అర్బన్ : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, పోస్టర్లను తొలగించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. శనివారం మునిసిపల్ కమిషనర్లు, తహశీల్దార్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో ఎక్కడా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఉండరాదన్నారు. సోమ, మంగళవారాల్లో మునిసిపాలిటీల్లో పర్యటించి, తనిఖీ చేస్తామన్నారు. ఎక్కడైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు ఉంటాయని జేసీ హెచ్చరించారు. -
తొలగించండి..లేదా ముసుగేయండి
న్యూఢిల్లీ: రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ చర్యలు మొదలుపెట్టింది. ఏదైనా పార్టీకి స్వీయ లబ్ధి కలిగేలా ఉన్న హోర్డింగులు, ప్రకటనల్లోని రాజకీయనాయకుల ఫొటోలను తొలగించడం లేదా మూసివేయడం చేయాలని ఎన్నికల యంత్రాంగాన్ని ఆదేశించింది. యూపీలో ఎన్నికల్లో అవినీతిని అరికట్టేందుకు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ప్రత్యేక టోల్ ఫ్రీ నంబరును ప్రారంభించింది. అభ్యర్థులెవరైనా పరిమితి(రూ.28 లక్షలు)కి మించి ఎన్నికల కోసం ఖర్చు పెడితే, ప్రజలు 1800 180 6555 నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరింది. గోవాలో ప్రచారం కోసం అభ్యర్థులెవరూ మత సంస్థలను ఉపయోగించుకోకూడదని ఈసీ తెలిపింది. -
ENగ్లీషు దేశం
-
నస్లీ వాడియాకు టాటా స్టీల్ గుడ్ బై
-
నస్లీ వాడియాకు టాటా స్టీల్ గుడ్ బై
టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా తప్పించిన సైరస్ మిస్త్రీకి మద్దతుగా నిలుస్తున్నారనే నెపంతో ప్రముఖ పారిశ్రామిక వేత్త నస్లీ వాడియాకు టాటా స్టీల్ గుడ్ బై చెప్పింది. బుధవారం జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశంలో స్వతంత్ర డైరెక్టర్‌గా ఆయనకు ఉద్వాసన పలుకుతున్నట్టు టాటా స్టీల్ వెల్లడించింది. నస్లీ వాడియాకు వ్యతిరేకంగా 90 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిసింది. చాలామంది షేర్ హోల్డర్స్ వాడియాను తొలగించడానికే మొగ్గుచూపినట్టు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీకి టాటా స్టీల్ పేర్కొంది. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఓటింగ్‌లో నస్లీ వాడియా పాల్గొన్నలేదు. 37 ఏళ్లుగా నస్లీ వాడియా టాటా స్టీల్ స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్నారు. చైర్మన్‌గా గ్రూప్ కంపెనీల నుంచి బయటికి గెంటివేయబడ్డ సైరస్ మిస్త్రీకి నస్లీ వాడియా మద్దతుగా నిలవడంతో పాటు టాటా గ్రూప్‌పై పలు విమర్శలు సంధించారు. దీంతో ఆగ్రహించిన టాటా సన్స్ , గ్రూపు కంపెనీల నుంచి స్వతంత్ర డైరెక్టర్ నస్లీ వాడియాను సాగనంపే ప్రక్రియను ప్రారంభించింది. స్వతంత్ర డైరెక్టర్ అయిన తనను ఈ సమావేశాల ద్వారా తొలగించే సత్తా టాటా సన్స్‌కు ఉందా? అంటూ ప్రశ్నలను సైతం ఆయన సంధించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం జరిగిన ఈజీఎంలో టాటా స్టీల్ నస్లి వాడియాను కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌గా తప్పిస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. టాటా మోటార్స్, టాటా కెమెకిల్స్ కూడా ఈ వారంలో వాడియాను డైరెక్టర్‌గా తొలగించేందుకు ఈజీఎంలు నిర్వహించనున్నాయి. అయితే కంపెనీల స్వతంత్ర డైరెక్టర్‌గా తనను తొలగిస్తుండటం వివరణ కోరిన అనంతరం రతన్ టాటా, టాటా సన్స్, కొంతమంది డైరెక్టర్లపై నుస్లీ వాడియా రూ.3000 కోట్ల పరువు నష్టం దావా కూడా వేశారు. దీంతో ఇక ఆయన టాటా గ్రూప్ సంస్థల్లో ఉండటం ఏ మాత్రం మంచిది కాదని టాటా సన్స్ నిర్ణయించింది. తొలగింపుపై నస్లి వాడియా స్పందన: తనకు అప్పగించిన పనుల్లో స్వతంత్ర అభిప్రాయాలు తీసుకుని పనిచేస్తున్నందునే తనపై వేటు వేశారని నుస్లి వాడియా ఆరోపించారు. తన తొలగింపుపై టాటా సన్స్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవిగా ఉన్నాయని వాడియా పేర్కొన్నారు. నానో మూతను జాప్యం చేయడం కంపెనీని మరింత ఆర్థిక నష్టాల్లోకి నెడుతున్నారని ఆరోపించారు. ఇది కంపెనీ పీవీబీపై మరింత నెగిటివ్ ప్రభావాన్ని చూపుతుందన్నారు. -
నరుడి తోక.. కత్తిరింపు!
నాగ్‌పూర్: ఎవరిమీద అయినా కోపమొస్తే.. వాడి తోక తెగ్గోస్తా అంటా మన కోపాన్ని వ్యక్తం చేస్తాం. అయితే మహారాష్ట్రకు చెందిన ఒక బాలుడికి దురదృష్టవశాత్తూ నిజంగానే తోక మొలిచింది. నాగపూర్ డాక్టర్లు ఎంతో శ్రమించి శస్త్రచికిత్స ద్వారా దానిని తొలగించారు. అసాధారణంగా 18 అంగుళాలు పెరిగిన తోక వల్ల తీవ్రమైన నొప్పితో వచ్చిన బాలుడిని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు రక్షించారు. గత వారం తీవ్రమైన నొప్పితో 18 ఏళ్ల బాలుడు ఆసుపత్రికి వస్తే సర్జరీ చేసి తోకను తీసివేశామని న్యూరోసర్జరీ విభాగం అధిపతి డాక్టర్.ప్రమోద్ గిరి అన్నారు. ‘బాలుడు పుట్టినప్పటి నుంచి తోక ఉంది. క్రమంగా పెరుగుతూపోవడం వల్ల అతడికి కూర్చోవడం, పడుకోవడానికి ఇబ్బంది కలిగింది. దీంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువచ్చారు’ అని ఆయన చెప్పారు. ఇది చాలా క్లిష్టమైన ఆపరేష¯ŒS అని, వెన్నెముకకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సర్జరీ ముగించామని ప్రమోద్ వివరించారు. ఇప్పటివరకు ఇంత పెద్ద తోకను తొలగించడం ఇదే మొదటిసారని ప్రమోద్ విశదీకరించారు. -
కర్కశత్వం
డ్రైవర్లు.. కండక్టర్లను తొలగించిన ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ పేరుతో అయినవారికి జీతాలు భగ్గుమంటున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు చాలీచాలని జీతాలతో నెట్టుకొచ్చే ఆర్టీసీ సిబ్బంది నోటి దగ్గర పచ్చడి మెతుకులను కూడా ప్రభుత్వం కర్కశంగా లాగేసుకుంటోంది. అధికారంలోకి వచ్చాక సంస్థ కష్టాలు తీర్చుతామని ప్రగల్భాలు పలికిన టీడీపీ నేతలు ఇప్పుడు సిబ్బందిని కూరలో కరివేపాకులా తీసి పారేస్తున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా గప్‌చుప్‌గా మారిపోయూరు. కార్గో సేవల పేరుతో పెద్ద ఎత్తున ఔట్ సోర్సింగ్‌కు తెరలేపి అయినవారికి ఉద్యోగాలు కట్టబెడుతున్నారు. కూలీల కంటే ఘోరం.. డ్రైవర్లు, కండక్టర్ల కోసం ఆర్టీసీ ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అర్హులైనవారికి శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటుంది. డ్యూటీకి హాజరైతేనే వీరికి వేతనం లభిస్తుంది. నిత్యం డిపోకు రావాల్సిందే. ఒక వేళ వచ్చినా విధులు కేటాయించకపోతే ఆ రోజు వేతనం లేనట్లే. అయితే ఇష్టం వచ్చినట్లు విధులకు గైర్హాజరైతే అంగీకరించరు. ఇలా కాంట్రాక్టు వ్యవస్థ ద్వారా 2012 నుంచి చాలా మంది విధుల్లో ఉన్నారు. అయితే ఇటీవల ఆర్టీసీ సొంత బస్సుల స్థానంలో అద్దె బస్సులను భారీగా పెంచేసింది. డ్రైవర్లకే టిమ్‌లను కట్టబెట్టి కండక్టర్ల వ్యవస్థకు చెక్ పెట్టింది. కొంతమంది డ్రైవర్లు టికెట్లు ఇవ్వకుండా చేతివాటం ప్రదర్శిస్తున్నా సరైన చర్యలు తీసుకోవడంలేదు. ఇలా అద్దె బస్సుల రాకతో డ్రైవర్ పోస్టులకూ గండి పడింది.. ఎడా పెడా తీసేశారు. అనేకమంది ఆర్టీసీ రెగ్యులర్ కార్మికులు రిటైర్డ్ అయిన నేపథ్యంలో కాంట్రాక్టు కార్మికులందరూ రెగ్యులర్ కావాలి. కానీ అందుకు భిన్నంగా ప్రస్తుతం 210 మంది రెగ్యులర్, కాంట్రాక్టు సిబ్బంది అదనంగా తేలారు. దీంతో 100 మంది ఆర్టీసీ డ్రైవర్లను చిత్తూరు జిల్లాకు తాత్కాలికంగా బదిలీచేశారు. అంటే తాత్కాలికంగా ఆ జిల్లాలో పనిచేయాల్సి ఉంటుంది. కుటుంబానికి దూరంగా పని చేయడం ఆర్టీసీ భద్రతాసూక్తికి పూర్తి విరుద్ధం. రెండు చోట్ల కార్మికులు అద్దెలు చెల్లించాల్సి రావడం, కుటుంబ భోజనం బదులు హోటల్ భోజనం తినడం వంటి సమస్యలు ప్రారంభమయ్యూయి. ఇదిలా ఉంటే మరో 110 మందిలో 72 మందిని మాత్రం జిల్లాలోని ఇతర డిపోలకు సర్దుబాటు చేశారు. 32 మంది కాంట్రాక్టు డ్రైవర్లు మిగులుగా ఉన్నారంటూ వారిని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించేశారు. జిల్లాలో కాంట్రాక్టు కండక్టర్లుగా ఎంపికైన 29 మందిని ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. దాని ప్రకారం వారు అక్కడ పనిచేస్తుండగా తమ రీజియన్ పరిధిలో కార్మికులు ఎక్కువయ్యారంటూ వారిని ప్రకాశం రీజియన్‌కు తిరిగి పంపారు. ఇక్కడ కూడా కండక్టర్ల అవసరం లేదంటూ వారిని ఇంటికి పంపేశారు. ఇలా 32 మంది కాంట్రాక్టు డ్రైవర్లు, 29 మంది కాంట్రాక్టు కండక్టర్లు ఉపాధి కోల్పోయి ఆర్టీసీ పిలుపు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. జీతాల్లోనూ వారిష్టం.. ఇదిలా ఉంటే ఆర్టీసీలో కార్గో సర్వీసుల పేరిట సరుకు రవాణాకు ఆర్టీసీ పచ్చజెండా ఊపింది. అధికారులకు అండగా నిలిచేందుకు అవుట్సోర్సింగ్ సిబ్బందిని పెద్ద ఎత్తున విధుల్లోకి తీసుకున్నారు. వీరి వేతనాలు కూడా రూ. 15 వేలు మొదలు రూ. 20వేల వరకు కేటాయించారు. జీతం కూడా స్కిల్డ్ , అన్‌స్కిల్డ్ అని కాకుండా ఇష్టం వచ్చినట్లుగా కేటారుుంచినట్లు తెలిసింది. కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధుల రెకమెండేషన్‌తో విధుల్లో చేరారు. అవుట్ సోర్సింగ్ అంటూనే ఆర్టీసీనే వారికి నియామక ఉత్తర్వులు జారీ చేసిందనే విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కార్మికవర్గాలు భగ్గుమంటున్నారుు. విధుల్లోకి తీసుకోవాలి తొలగించిన కాంట్రాక్టు కండక్టర్లను, డ్రైవర్లును విధుల్లోకి తీసుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. అద్దె బస్సుల్లో జరుగుతున్న దోపిడీని నివారించి ఆర్టీసీ సంస్థను పరిరక్షించుకోవాలి. - ఎస్.పి.రావు, ఎన్ఎంయూ రీజనల్ కార్యదర్శి కాంట్రాక్టు సిబ్బందికి అవకాశం కల్పించాలి ఆర్టీసీ నష్టాల్లో ఉన్నపుడు కార్గో సర్వీసులకు సైతం అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించే బదులు కాంట్రాక్టు కండక్టర్లు, డ్రైవర్ల సేవలను వినియోగించుకుంటే బాగుండేది. ఒక పక్క కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తుంటే మరో వైపు ఉన్న ఉపాధిని కొల్లగొట్టడం సరైన చర్య కాదు. - బెజవాడ రవి, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి -
అదనపు బాధ్యతల తొలగింపు
అనంతపురం ఎడ్యుకేషన్ : డిప్యూటీ డీఈఓ అదనపు బాధ్యతల నుంచి విద్యాశాఖ ఏడీ చంద్రలీలను తప్పించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖకు పాఠశాల విద్యా కమిషనర్ నుంచి బుధవారం ఉత్తర్వులు అందాయి. ఈ విషయం విద్యాశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చంద్రలీల మధ్యాహ్న భోజన పథకం (ఎండీఎం) అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈమెకు ధర్మవరం డివిజన్ డిప్యూటీ డీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే తాడిపత్రి మోడల్ స్కూల్లో 2014 నుంచి 2016 వరకు దాదాపు రెండేళ్లపాటు మధ్యాహ్న భోజన పథకం అమలు కాలేదని తెలిసింది. ఈ విషయంలో కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులకు విచారణకు ఆదేశించారు. వారి నివేదిక ఆధారంగా అదనపు బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయించారు. దీనిపై డీఈఓ అంజయ్యను వివరణ కోరగా డిప్యూటీ డీఈఓ అదనపు బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు వచ్చింది వాస్తవమన్నారు. -
ఇద్దరు మంత్రులను తొలగించాలి
అనంతపురం సిటీ: జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు కోరలు చాస్తుంటే ప్రభుత్వ పెద్దలు చోద్యం చూస్తున్నారని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీష్ విమర్శించారు. మంగళవారం సాయంత్రం సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి వెంకటరమణ రావాలంటూ డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యలయం ముందు ధర్నా నిర్వహించిన నేతలు ఎంతకీ అధికారి కిందకు రాకపోవడంతో నేతలు, కార్యకర్తలు అధికారి కార్యాలయంలోకి దూసుకెళ్లారు. ముక్కు పచ్చలారని చిన్నారుల జీవితాలతో ఆరోగ్యశాఖా మాత్యులు, మునిపాలిటీ శాఖా మాత్యులు చెలగాటం ఆడుతున్నారని దుయ్య బట్టారు. తక్షణం ఈ నిర్లక్ష్యానికి కారకులైన మంత్రులు కామినేని, నారాయణలను తక్షణం మంత్రి పదవులనుంచి తొలగించాలని డిమాండ్‌చేశారు. అనంతరం డీఎం అండ్ హెచ్ఓని ఘెరావ్ చేశారు. ఛాంబర్లోకి ఎవరు రాకుండా కార్యాలయంలో ఉన్న వారు బయటకు పోకుండా నిర్భందించారు. వైద్యాధికారి స్పందించలేదంటూ ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. చివరకు టూటౌన్పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఆందోళనను విరమించారు. -
బోగస్ ఓటర్ల తొలగింపుపై దృష్టిసారించండి
ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలకు జేసీ–2 రామస్వామి ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): బోగస్ ఓటర్లను గుర్తించి తొలగించడంపై ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు దృష్టిసారించాలని జాయింట్ కలెక్టర్–2 రామస్వామి తెలిపారు. డి–డూప్లికేట్ ఓటర్లు, ఒకే రకం ఫొటోతో రెండు,మూడు చోట్ల ఓటర్లుగా ఉన్న వారిని తొలగించి ఈఎస్ఐ వెబ్సైట్లో పొందుపరచాలని సూచించారు. మంగళవారం కలెకర్ సమావేశ మందిరంలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలకు ఈఎస్ఐ, ఈఆర్‌ఎంఎస్ వెబ్సైట్లో ఎలా పొందుపరచాలనే దానిపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలో డి–డూప్టికేట్ ఓటర్లు 82,581 మంది, ఒకే రకం ఫొటోతో రెండు,మూడు చోట్ల 14687 మంది, మల్టిపుల్ ఎర్రర్ ఓటర్లు దాదాపు 15వేల మంది ఉన్నారన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫారం–6,7,8,8ఎలపై విచారణ జరిపి ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో నిక్ టెక్నికల్ డైరక్టర్ నూర్జాహాన్, శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, ఆర్డీఓలు రుఘుబాబు, ఓబులేసు, సుధాకర్‌రెడ్డి, అన్ని నియోజక వర్గాల ఈఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. -
విగ్రహాలు తొలగించాలంటూ ఆందోళన
కందుకూరు: కందుకూరు చౌరస్తా శ్రీశైలం రహదారిపై రాకపోకలకు అడ్డుగా ఉన్న అన్ని విగ్రహాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వ్యాపార సంఘం ఆధ్వర్యంలో షాపులను మూసేసి నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్లి మండల సర్వసభ్య సమావేశం కొనసాగుతున్న హాల్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రహదారిపై ఉన్న విగ్రహాలతో రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని, దీంతో డ్రైనేజీ నిర్మాణం లేక మురుగు నీటితో పాటు వర్షం నీరు వెళ్లడం లేదని చెప్పారు. దీంతోపాటు తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రహదారులపై విగ్రహాలు తొలగించాలని స్పష్టంగా ఎందుకు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. అన్ని విగ్రహాలను వదిలేసి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన వారిపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆందోళనకారులతో తహసీల్దార్ సుశీల, సీఐ విజయ్‌కుమార్ మాట్లాడారు. నెల రోజుల్లో విగ్రహాలు తొలగిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
నిషేధ స్థలంలో గోడ తొలగింపు
ముదివర్తి (విడవలూరు) : మండలంలోని ముదివర్తి వీఆర్వో నరసింహులు స్థానికంగా ఉన్న నిషేధ స్థలంలో ఉన్న గోడను తొలగించడంతో పాటు వీరంగం సష్టించిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. పెన్నానది తీరాన ఉన్న సర్వే నంబర్ 54లో కొంత ప్రభుత్వ భూమిని గతంలో స్థానికంగా ఉన్న శనీశ్వర చక్రవర్తి ఆలయానికి ఇవ్వడం జరిగింది. ఇటీవల ఆలయ నిర్వహకులకు, ఓ వర్గానికి ఈ స్థలం విషయమై వివాదం చోటుచేసుకుంది. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీస్‌లు రంగప్రవేశం చేసి ఆ స్థలంలో 145 సెక్షన్ విధించారు. ఈ క్రమంలో ఆదివారం వీఆర్వో తనకు ఆర్డీఓ, తహసీల్దార్ ఆదేశాలు ఉన్నాయని, ఈ గోడను కూల్చుతున్నట్లు తెలిపి, గోడను కూల్చేందుకు సిద్ధమయ్యాడు. దీంతో స్థానికులు కలుగచేసుకుని మీ వద్ద అధికారుల ఆదేశాలు ఉంటే చూపాలని కోరినా వినిపించుకోకుండా వీరంగం సష్టిస్తూ గోడను తొలగించారు. కాగా ఎటువంటి ఆదేశాలు లేకుండా నిషేధ స్థలంలో అధికారులు నిర్మించిన గోడ తొలగించిన విషయాన్ని ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్తామని బాధితులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే : తహసీల్దార్ వివాదానికి నిలయంగా ఉన్న స్థలంలో 145 సెక్షన్ విధించి, ఆ ప్రాంతంలో గోడను నిర్మించడం వాస్తమే. ప్రస్తుతం ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు గోడను తొలగించడం జరిగింది. ఈ ప్రాంతంలో వ్యవసాయ భూములున్న కారణంగా ఆ భూములు చెందిన రైతులు రాకపోకలు సాగించేందుకు వీలుగా మాత్రమే గోడను తొలగించడం జరిగింది. -
ఆ చెట్లను తొలగించండి
-
ఈడ్చిపారేసేందుకు కదిలిన బలగాలు
చండీగఢ్: ఉద్యమాల సమయంలో మోహరించాల్సిన బలగాలు ఉద్యమం తగ్గుముఖంపట్టాక మోహరిస్తే ఎలా ఉంటుంది. ప్రస్తుతం హర్యానాలో అదే జరుగుతుంది. అయితే, అదేదో ఆందోళన చర్యలు అదుపుచేసేందుకు కాదు.. ఆందోళనకారులు పోగేసిన బారీకేడ్స్, చెత్తా చెదారం తీసి పక్కకు పడేసేందుకు. అవును.. రిజర్వేషన్ల కోసం జాట్ లు చేస్తున్న ఆందోళన నేటికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. హింసను సృష్టించిన ఈ ఉద్యమం కేంద్ర ప్రభుత్వ హామీతో కాస్తంత నెమ్మదించింది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధరణ స్థితికి వస్తున్నాయి. ఈ ఉద్యమ సమయంలో వారు రహదారులు, రైల్వే స్టేషన్లు, ట్రాక్‌లకు ఎక్కడికక్కడ అవరోధాలు సృష్టించారు. కొత్త, పాత అని తేడా లేకుండా పలు వాహనాల వాటిపై నిలిపారు. ఎక్కడికక్కడా బారీకేడ్లు పెట్టి రవాణా స్తంభించిపోయేలా చేశారు. రాళ్లు రప్పలు కూడా కుప్పలుగా పోశారు. అయితే, వాటిని తొలగించే సాహసం కేంద్ర ప్రభుత్వ బలగాలు చేయలేదు. అందులో జోక్యం చేసుకుంటే ఎక్కడ ఆందోళన మరింత హింసాత్మకం అవుతుందనే కారణంతో కనీసం వాటిపై చేయి కూడా వేయలేదు. ప్రస్తుతం వారు వెనక్కి తగ్గడంతో ఆ బారీ కేడ్స్ ను తొలగించేందుకు బలగాలన్నీ ఇప్పుడు హర్యానాలో దండిగా మోహరించాయి. గడిచిన పన్నెండు గంటల్లో ఎక్కడా ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. ఇప్పటివరకు, పదకొండు మంది ఈ ఉద్యమం కారణంగా ప్రాణాలు కోల్పోగా.. 150మంది గాయాలపాలయ్యారు. ఉద్యమ సమయంలో ఎన్‌హెచ్-10(న్యూఢిల్లీ-అంబాలా), ఎన్‌హెచ్-10(న్యూఢిల్లీ-హిసార్) రహదారులపై ఢిల్లీ అంబాలా, ఢిల్లీ-భటిండాల మధ్య నడిచే రైళ్ల ట్రాక్‌లపై ఉన్న అవరోధాలు కూడా తొలగిస్తున్నారు. ఇక సోనిపట్, పానిపట్ జిల్లాలో బారీకేడ్లను తీసివేయడంతోపాటు హర్యానా-పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, చండీగఢ్ ల మధ్య తెగిపోయిన రోడ్డు మార్గాలను పునరుద్ధరిస్తున్నారు. ఈఉద్యమం కారణంగా దాదాపు 800 మంది రైళ్లను రద్దు చేసిన అధికారులు తిరిగి వాటిని ప్రారంభించే యోచనలుచేస్తున్నారు. -
ఎయిర్ హోస్టెస్‌లు తొలగింపు
చెన్నై : స్థూలకాయం కలిగిన విమాన సిబ్బంది, ఎయిర్ హోస్టెస్‌లకు ఎయిరిండియా సంస్థ ఉద్వాసన పలికింది. ఎయిర్ హోస్టెస్లుగా పనిచేసేవారికి అందం ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. ప్రధానంగా స్థూలకాయంగా ఉండరాదు. ఎయిరిండియా విమాన సంస్థలో పనిచేస్తున్న 125 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. స్థూలకాయం కలిగిన 600 మంది విమాన సిబ్బంది, ఎయిర్ హోస్టెస్లను గుర్తించారు. వ్యాయామం ద్వారా స్థూలకాయాన్ని తగ్గించుకునేందుకు వారికి అవకాశం ఇచ్చారు. వ్యాయామం చేసినా శరీర బరువు తగ్గని 125 మందికి ఎయిరిండియా విమాన సంస్థ ఉద్వాసన పలికింది. వీరికి 18 నెలల గడువు ఇచ్చామని, అయినా వారు స్థూలకాయాన్ని తగ్గించుకోలేకపోయారని, దీంతో ఉద్యోగాల నుంచి తొలగించినట్లు ఆ సంస్థ తెలిపింది. -
స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ తొలగింపు
తిరుపతి : స్విమ్స్ (శ్రీవెంకటేశ్వర వైద్య విజ్ఞానసంస్థ) డెరైక్టర్ డాక్టర్ వెంగమ్మను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమె స్థానంలో ఇంఛార్జ్ బాధ్యతలను టీటీడీ జేఈవో కోలా భాస్కర్‌కు అప్పగించారు. స్విమ్స్ డైరెక్టర్ గా వెంగమ్మ బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి వేగవంతమైన విషయం తెలిసిందే. అయితే, కొన్ని నెలలుగా స్విమ్స్ లో జరుగుతున్న పరిణామాలు ఆమెను తీవ్రంగా బాధించిన నేపథ్యంలో వ్యక్తిగత కారణాల పేరిట ఆమె రాజీనామా చేశారు. కానీ, అంతకుముందు జిల్లా పర్యటనకు వచ్చిన వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రేణిగుంట ఎయిర్‌పోర్టుకు డాక్టర్ వెంగమ్మను పిలిపించుకుని పదవి నుంచి తప్పుకోవాలని హెచ్చరికలు చేసినట్టు సమాచారం. ఇంతకుమునుపే ఆమెను స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగేలా చేసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ప్రభుత్వం పాచికగా ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే స్విమ్స్‌లోని కొన్ని పైళ్లను తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ తనిఖీల్లో ఎలాంటి ఆరోపణలు, అవినీతి ఆధారాలు లభించకపోగా డెరైక్టర్ నిక్కచ్చిగా వ్యవహరించినట్టు ప్రాథమిక సమాచారం అందింది. దీంతో స్విమ్స్ డెరైక్టర్ పదవి నుంచి వెంగమ్మను తప్పించి, తమకు అనుకూలమైన వారిని నియమించుకోనేందుకు వీలుగా చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే స్విమ్స్ డెరైక్టర్ వెంగమ్మను కుప్పానికి పిలిపించుకుని పదవి నుంచి తప్పుకోవాలని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుగుదేశం వర్గాల్లోనే చర్చ జరిగింది. ఈలోగానే స్విమ్స్ డైరెక్టర్‌గా వెంగమ్మను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
ఓటమి భయంతోనే ఓటర్లను తొలగిస్తున్నారు
-
అసెంబ్లీ లాంజ్‌లో వైఎస్ చిత్రపటం తొలగింపు
సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే.. సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ లాంజ్‌లో.. కొన్ని సంవత్సరాలుగా చిరునవ్వు చిందిస్తూ అక్కడికి వచ్చిన వారిని పలకరిస్తున్నట్లుగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిలువెత్తు ఫొటోను తొలగించారు. ఇటీవల శాసనసభ ఇన్‌ఛార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ దగ్గరుండి మరీ సిబ్బందితో అక్కడి నుంచి ఆ చిత్రపటాన్ని తీయించి వేశారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆదేశాల మేరకు వైఎస్ ఫొటోను తొలగిస్తున్నామని ఈ సందర్భంగా సిబ్బందికి సత్యనారాయణ చెప్పినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వైఎస్ నిలువెత్తు ఫొటో ఉన్న లాంజ్ ప్రాంతాన్ని ఏపీకి కేటాయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్కడ పలుమార్లు తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశాలు నిర్వహించారు. ఆ సమావే శాలు జరిగే సమయంలో హాజరైన ఎమ్మెల్యేలకు వైఎస్ చిత్రపటం కనిపించకుండా ముసుగు వేసేవారు. ఇప్పుడు ఏకంగా అక్కడి నుంచి చిత్రపటాన్ని తొలగించారు. వైఎస్ చిత్రపటాన్ని అక్కడి నుంచి తొలగించాలని, లేదంటే దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చిత్రపటాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురు శాసనసభ జరిగే సమయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. ఎన్టీఆర్ చిత్రపటాన్ని లాంజ్‌లో ఏర్పాటు చేయటం ఇష్టం లేని చంద్రబాబు ఆదేశాలతోనే వైఎస్ చిత్రపటాన్ని అక్కడి నుంచి తొలగించినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు ని ర్వర్తిస్తూ మరణించిన తొలి నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. దీంతో అప్పటి స్పీకర్‌తోపాటు ప్రభుత్వ నిర్ణయం మేరకు శాసనసభ ఆవరణలో వైఎస్ నిలువెత్తు చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్ వర్ధంతి, జయంతి సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు లాంజ్‌లోని ఆ చిత్రపటం వద్దే నివాళులు అర్పించేవారు. -
'ఉస్మానియా' భవనం తొలగింపు!
-
'ఉస్మానియా' భవనం తొలగింపు!
- ఆసుపత్రి భవనాన్ని వారసత్వ హోదా నుంచి తొలగించే ప్రయత్నాలు షురూ - హెరిటేజ్ కమిటీకి ప్రతిపాదనలు పంపిన సర్కారు - ఆ స్థానంలో 20 అంతస్తులు గల రెండు టవర్లతో భారీ ఆసుపత్రి - నూతన భవనం రూపురేఖలపై ఆర్కిటెక్ట్‌లతో వైద్య మంత్రి భేటీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని తొలగించేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. దాన్ని వారసత్వ హోదా (హెరిటేజ్) నుంచి తొలగించాలని ప్రతిపాదించింది. సంబంధిత ప్రతిపాదనను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలోని వారసత్వ హోదా కమిటీకి పంపారు. ఆ కమిటీ సమావేశమై తొలగింపునకు ఆమోదం తెలపగానే ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని ఇక సాధారణ భవనంగానే పరిగణిస్తారు. ఆ తర్వాత ఆ భవనాన్ని తొలగించి ఆ స్థానంలో 20 అంతస్తులతో అత్యాధునిక ఆసుపత్రి నిర్మిస్తారు. అయితే పాత భవనానికి గుర్తుగా నమూనా భవనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సోమవారం రాష్ట్రంలోని ప్రముఖ ఆర్టిటెక్ట్లతో సమావేశం నిర్వహించారు. భవనం లేఔట్ ఎలా ఉండాలో చర్చించారు. నూతన భవన ఊహా చిత్రాలు రూపొందించి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. పాత భవనం కంటే అత్యంత వైభవంగా... అత్యాధునికంగా ఉండేలా చేయాలని సూచించారు. వీలైనంత త్వరలో కొత్త భవనాలను నిర్మించాలని సర్కారు భావిస్తోంది. అయితే ఎంతైనా అధిక సమయం తీసుకునే అవకాశం ఉన్నందున పాత భవనాన్ని తొలగించాక వైద్య సేవల కోసం తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంచేయాలన్న అంశంపైనా అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. వందేళ్లకు పైగా ఘన చరిత్ర 1910లో ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వైద్య సేవల కోసమే నిర్మించారు. రెండంతస్తులున్న (జి+2) ఈ భవ నాన్ని పురావస్తుశాఖ వారసత్వ సంపదగా గుర్తించింది. ప్రస్తుతం అందులో 1,500 పడకలున్నాయి. నిత్యం 2 వేల మందికిపైగా రోగులు చికిత్స కోసం వస్తుంటారు. నిజాం కాలంలో నిర్మించిన ప్రతీ భవనం కూడా ఇలాంటి ప్రత్యేకతలనే సంతరించుకున్నాయి. చూడ టానికి ఎంతో అపురూపంగా ఉంటుందీ ఈ భవనం. అయితే ప్రస్తుతం దాని పరిస్థితి శిథిలావస్థలో ఉంది. ఐదారేళ్ల కంటే కూడా ఆ భవనం ఉండదని జేఎన్టీయూ నిపుణులు కూడా ప్రభుత్వానికి విన్నవించారు. దాన్ని ఆధునీకరించడానికి కూడా సాధ్యపడటం లేదని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు కూలుతుందోనన్న భయాందోళనలు కూడా అందరినీ వేధిస్తున్నాయి. పైగా అత్యాధునిక వైద్య సేవలు కల్పించడం కష్టంగా మారింది. పారిశుద్ధ్య నిర్వహణ ఇబ్బందిగా ఉంటోంది. అయితే దాన్ని తొలగించాలన్న నిర్ణయంతో వారసత్వ సంపద పరిరక్షకుల నుంచి అనేక విమర్శలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాన్ని కేవలం ఆసుపత్రి కోసమే నిర్మించినందున కూల్చి వేయడం తప్పుకాదని... పైగా దాని స్థానంలో అత్యాధునిక సదుపాయాలతో మరో భవనం నిర్మిస్తామని సర్కారు చెబుతోంది. పైగా వారసత్వ కట్టడాల స్థానంలో కొత్త వాటిని నిర్మించి ప్రజలకు సేవ చేస్తే ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఒకవేళ దాన్ని అలాగే ఉంచి పక్కన మరో భవనం నిర్మించాలన్నా పాత భవనానికి మించి అంతస్తులు కట్టడానికి కూడా వీలుండదంటున్నారు. కాబట్టి దీన్ని తొలగించడమే సరైన నిర్ణయంగా సర్కారు భావిస్తోంది. దీనిపై వారసత్వ హోదా కమిటీ ప్రభుత్వం చెప్పే వాదనలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటుందంటున్నారు. ఇదంతా లాంఛనప్రాయమే కానుంది. -
చెత్త కూడా తీయలేమా?
నగరాల్లో చెత్తను తొలగించే పనులకు కూడా మన ప్రభుత్వాలు భారీ నిధులతో అమెరికన్ కార్పొరేట్ కంపెనీల ముందు సాగిలబడుతున్నాయి. మరో వైపున మునిసిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేత నాలను ఇవ్వడానికి కూడా వెనుకాడుతున్నాయి. దీని ఫలితంగానే తెలుగు రాష్ట్రాల్లోని మునిసిపల్ కార్మి కులు చెత్త తొలగింపు పనులకు బంద్ పెడుతున్నారు. వారి వెతలను పట్టించుకోవడానికి కాసింత సమ యం దొరకని మన ఇద్దరు సీఎంలూ గోదావరి పుష్క రాల సేవలో తరించిపోతున్నారు. విజయవాడ, గుం టూరులను నాజూకు నగరాలుగా మార్చడానికి ఏపీ సీఎం వాషింగ్టన్కు చెందిన గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ సంస్థను ఆహ్వానించారు. కాలుష్యాన్ని నివారించి 2018 నాటికి ఈ రెండు నగరాలను స్వచ్ఛ నగరాలుగా తీర్చిదిద్దటమే విదేశీ సంస్థ లక్ష్యమట. చివరకి మనం చెత్త ఎత్తివేయడానికి కూడా పనికిరా మా? అందుకు కూడా అమెరికా అంగబలం, ఆర్థిక సాయం కావాలా? విదేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞా నం తెచ్చుకోవటం తప్పు కాదు. కానీ ఆ పేరుతో ఎంఎన్సీలకు తలుపులు తెరవడం కాకుండా మన కార్మికులకు విదేశీ యంత్రాలను ఉపయోగించడం నేర్పాలి. తమ కమీషన్ పోతుందని బాధపడకుండా మధ్య దళారీలను రద్దు చేసి, ఒప్పంద కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాలి. వారి జీవన భృతి ని పెంచాలి. చెత్తను ఎత్తివేయించుకోవడానికి కూడా అమెరికా చుట్టూ ఎందుకు తిరుగుతారు? ఇలాగే ముందుకు పోతే మన రాష్ట్రాలే కాదు. దేశమే పరా ధీనం కాక తప్పదు. పారిశుద్ధ్య కార్మికులకు కాసింత జీవనభృతిని పెంచలేని ప్రభుత్వాలు పుష్కరాలకు వందల వేల కోట్లు ఎలా ఖర్చుపెడుతున్నాయి? - ఎస్. హనుమంతరెడ్డి రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ డివిజనల్ ఇంజనీర్. 9490204545 -
'నోటీసులు అందాక చూస్తా..'
ముంబయి: తనకు నోటీసులు అందిన తర్వాత న్యాయసలహా తీసుకొని ముందుకు వెళతానని అవినీతి వ్యతిరేక సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చెప్పారు. పుణెలో ఆయన స్థాపించిన స్వచ్ఛంద సంస్థ 'భ్రష్టాచార్ విరోధి జన్ ఆందోళన్-మహారాష్ట్ర' అనే పేరులో భ్రష్టాచార్ అనే పదాన్ని పుణెకు చెందిన స్వచ్ఛంద సంస్థల కమిషనర్ తొలగించారు. దీనిపై మీరు ఏమైనా స్పందిస్తారా.. చట్టపరంగా ముందుకు వెళతారా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. తనకు మాత్రమే కాకుండా మొత్తం 16 స్వచ్ఛంద సంస్థలకు నోటీసులు పంపిచారని, అయితే తనకు నోటీసులు అందిన తర్వాత స్పందిస్తానని అన్నా హజారే చెప్పారు. -
రెండు ప్రభుత్వాలు బర్తరఫ్ చేసి ఎన్నికలు పెట్టండి
హైదరాబాద్: రేవంత్ రెడ్డి ముడుపుల కేసులో ఇద్దరు సీఎంలు అనైతిక రాజకీయాలకు పాల్పడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారని టీ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, భిక్షమయ్య గౌడ్ అన్నారు. తమ వద్ద చాలా సమాచారం ఉందని బాగోతాలు బయటపెడతామంటూ ఇద్దరు సీఎంలు పరస్పర ఆరోపణలతో బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఈ వివాదంలో కేంద్ర కూడా జోక్యం చేసుకోవాలని జాప్యం చేయడం తగదని అన్నారు. విపక్ష నేత చంద్రబాబు అడ్డంగా దొరికిపోయినా.. ప్రధాని బీజేపీ అగ్ర నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలో తన కూతురుకి కేబినెట్ పదవికోసం కేసీఆర్ బీజేపీతో సఖ్యతతో ఉంటూ చంద్రబాబు విషయంలో రాజీపడుతున్నారని అనిపిస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు చంద్రబాబుపై కేసు నమోదు చేయకపోవడమే అందుకు నిదర్శనం అని అన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఫిరాయింపులు, కొనుగోళ్లకు పాల్పడుతున్న ఇద్దరు సీఎంలపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రెండు ప్రభుత్వాలు బర్తరఫ్ చేసి కేంద్రం ఎన్నిక జరపాలని వారు డిమాండ్ చేశారు. -
'జస్టిస్ ఎస్కే గాంగిలీని తొలగించాలి'!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే గాంగిలీని తొలగించాలంటూ రాజ్యసభలో 58 మంది సభ్యులు అభిశంసన నోటీసులు ఇచ్చారు. గ్వాలియర్ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు మహిళా న్యాయమూర్తిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై జస్టిస్ గాంగిలీపై గురువారం విపక్ష సభ్యులు ఈ నోటీసులు ఇచ్చారు. జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ ప్రతిపాదనకు కాంగ్రెస్, సీపీఎం, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ సహా పలు ఇతర పార్టీల సభ్యులు మద్దతు ప్రకటించారు. న్యాయరంగానికి చెందిన పలువురు తనను కలసి ఈ అంశాన్ని సభలో లేవనెత్తాల్సిందిగా కోరారని, జస్టిస్ గాంగిలీ వేధింపులకు సంబంధించిన సమాచారాన్ని అందించారని శరద్‌యాదవ్ తెలిపారు. దాంతో ఆ జడ్జి అభిశంసనకు అర్హుడని తాను భావించానన్నారు. -
కేజ్రీవాల్ తొలగింపునకు సర్వం సిద్ధం చేస్తున్నాం
ఆమ్ఆద్మీపార్టీ జాతీయ కన్వీనర్ బాధ్యతల నుంచి పార్టీ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను పక్కన పెట్టేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామని ఆ పార్టీ నేత సంజయ్‌సింగ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 4న పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుందని చెప్పారు. పార్టీలో సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తే పాలనను సజావుగా చేయడం అంత సులువు కాదని, వారు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకుంటే ఏమి చేయలేమన్నారు. వారి అసంతృప్తుల విషయంలో చర్చలు జరుపుతామని చెప్పారు. పార్టీలో విభేదాల విషయంపై మార్చి 4న అంతర్గతంగా చర్చించుకుంటాం తప్ప బహిరంగంగా కాదని స్పష్టం చేశారు. ఢిల్లీ సీఎంగా, పార్టీ జాతీయ కన్వీనర్ గా రెండు పదవుల్లో కేజ్రీవాల్ కొనసాగడంపై కొందరు నేతలు ఇటీవల అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. దాంతో కేజ్రీవాల్ గత గురువారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తన రాజీనామాను సమర్పించారు. అయితే కొందరు నేతలు ఆయనను నిలువరించారు. -
మద్యం దుకాణాన్ని తొలగించాలి
కొంకుదురు(బిక్కవోలు) : బ్రాందీ షాపు తొలగించాలంటూ కొంకుదురు గ్రామంలో సోమవారం శెట్టిబలిజ పేట వాసులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే... 2014 సంవత్సరానికి గాను కొంకుదురు గ్రామానికి రెండు మద్యం షాపులకు టెండర్లు నిర్వహించారు. ఒక షాపును ప్రైవేట్ వ్యక్తులు పాడుకొని శెట్టిబలిజ పేటలో ఉన్న 4-1 డోర్ నంబర్ గల ఇంటిలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. దీనిని పట్టాభిరామ శెట్టి బలిజ సొసైటీ ఆధ్వర్యంలో శెట్టిబలిజలు అడ్డుకున్నారు. ఊరు బయట షాపు నిర్వహించుకోవాలని సూచించారు. ఇక రెండో షాపునకు పాటదారులెవరూ ముందుకు రాకపోవడంతో ఏపీబీసీఎల్ ద్వారా ప్రభుత్వమే మద్యం దుకాణాన్ని శెట్టిబలిజపేటలో ఉన్న 4-1 డోర్ నంబరు గల ఇంటిలో ఈ నెల ఒకటో తేదీన ఏర్పాటు చేసింది. దీంతో శెట్టిబలిజలు మరోసారి ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం సుమారు 500 మంది మద్యం షాపు ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్యం షాపు ముందు టెంట్ వేసి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న బిక్కవోలు ఎస్సై పి.దొరరాజు తన సిబ్బందితో వచ్చి ఆందోళనకారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మద్యం షాపును ఊరి మధ్య నుంచి తరలించాలని కోరారు. దీనికి ఎస్సై పి.దొరరాజు బదులిస్తూ ఈ సమస్యను తనపై అధికారులు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు దృష్టికి తీసుకు వెళతానని, అంత వరకు కానిస్టేబుల్‌ను దుకాణం వద్ద కాపలా పెడతానని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. -
‘ఉద్యమ’ కేసుల ఎత్తివేత
ఆస్పత్రిలోనే ఫైలుమీద సంతకం చేసిన హోంమంత్రి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన 698 కేసులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న ఫైలుపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బుధవారం సంతకం చేశారు. వైరల్ జ్వరంతో బాధపడుతూ సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాయిని ఈ ఫైలును ఆస్పత్రికే తెప్పించుకుని సంతకం చేశారు. ఉద్యమం సందర్భంగా అనేకమంది విద్యార్థులు, పార్టీల నేతలు, ఉద్యోగ సంఘాల నాయకులపైనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను ఎత్తివేస్తామని గతంలోనే హామీఇచ్చినా, అమలుకాలేదు. ఈ నేపథ్యంలో ఉద్యమకారులపై కేసులను ఎత్తివేస్తామంటూ ఎన్నికల్లో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. దీనికి న్యాయపరమైన చిక్కులతో జాప్యం జరిగిందని, వాటిని పరిష్కరించుకుంటూ ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయాలనే నిర్ణయాన్ని అమలుచేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. -
ఏపీలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు
10 వేల మందిని తొలగిస్తూ ఉత్తర్వులు సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న పది వేల మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగించింది. బుధవారం సాయంత్రం అన్ని జిల్లాల డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్లకు 2614/16.7. 2014 నంబర్‌తో ప్రభుత్వం ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. జిల్లాల్లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లందరినీ గురువారం నుంచే విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో జాబు కావాలంటే బాబు రావాలని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది. అధికారంలోకి వస్తూనే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నెలన్నర రోజులకే పదివేల మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
బ్యానర్లు, కటౌట్ల తొలగించాల్సిందే
రాజధాని నగరంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిజిటల్ బ్యానర్లను తొలగించాల్సిందేనని గురువారం మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. అన్నీ తొలగించాక నివేదిక సమర్పించాలని సూచించింది. సాక్షి, చెన్నై: రాష్ర్టంలో బ్యానర్లు, డిజిటల్ బ్యానర్లు, కటౌట్ల సంస్కృతి తాండవం చేస్తున్నది. రాజకీయ పక్షాలు తమ పార్టీల నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆహ్వానాలు పలుకుతూ ఇష్టారాజ్యంగా ఎక్కడ బడితే అక్కడ బ్యానర్లను ఏర్పాటు చేసేస్తున్నారు. వీటిపై సంఘ సేవకుడు ట్రాఫిక్ రామస్వామి ఎప్పటి నుంచో కోర్టులో పోరాడుతూ వస్తున్నారు. కోర్టు ఆదేశాలిచ్చినా అమలు పరిచే వాళ్లు లేకపోవడంతో చివరకు తానే స్వయంగా రంగంలోకి దిగి అక్కడక్కడ ఉండే బ్యానర్లను ట్రాఫిక్ రామస్వామి తొలగించారు. దీంతో బ్యానర్లు, కటౌట్ల ఏర్పాటుకు ఆంక్షల కొరడాను కోర్టు ఝుళిపించింది. ముందుస్తు అనుమతిని తప్పనిసరి చేసింది. సభలు, సమావేశాలు ముగిసిన మరుసటి రోజున రోడ్ల మీద ఉండే బ్యానర్లను సంబంధిత పార్టీలు, వ్యక్తులు తొలగించని పక్షంలో వాటిని తొలగించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను అమలు పరిచే వాళ్లే లేరు. దీంతో మళ్లీ ఇష్టారాజ్యంగా బ్యానర్లు వెలుస్తూ వస్తున్నాయి. వీటి పుణ్యమా అని వాహన చోదకులు తంటాలు పడాల్సిన పరిస్థితి. అనేక చోట్ల ఫుట్ పాత్లను బ్యానర్లు ఆక్రమించేస్తున్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని ట్రాఫిక్ రామస్వామి మళ్లీ హైకోర్టు మెట్లు ఎక్కారు. తొలగించాల్సిందే: నగరంలో ముందస్తు అనుమతులు లేకుండానే, ఇష్టా రాజ్యంగా బ్యానర్లు వెలుస్తున్నాయంటూ ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్ విచారణ బుధవారం సాయంత్రం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అగ్ని హోత్రి, న్యాయమూర్తి సుందరేషన్ల నేతృత్వంలోని తొలి బెంచ్ విచారించింది. బ్యానర్లను తొలగించాల్సిందేనని కోర్టు ఆదేశించింది. ఇదే పిటిషన్ విచారణ గురువారం సైతం సాగింది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సోమయాజులు హాజరై వివరణ ఇచ్చారు. చెన్నైలో అనుమతులు లేని డిజిటల్ బ్యానర్లన్నీ తొలగించ మాని, ఈ పిటిషన్ విచారణ ముగించాలని సూచించారు. అయితే, న్యాయమూర్తులు ఆయన వాదనతో ఏకీ భవించలేదు. చెన్నైలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేకుండా వెలసిన ప్రతి డిజిటల్ బ్యానర్‌ను తొలగించాల్సిందేనని ఆదేశాలు ఇచ్చారు. వాటిని తొలగించే విధంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఉత్తర్వులు ఇచ్చారు. తొలగించిన తర్వాత ఆయా జిల్లాల నుంచి ప్రత్యేక నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. ట్రాఫిక్ రాస్తారోకో : కోర్టులోనే కాదు, రోడ్డు మీద సైతం పోరాడుతోన్న ట్రాఫిక్ రామస్వామి ఉదయం రోడ్డెక్కారు. మెరీనా తీరంలో సీఎం జయలలితకు శుభాకాంక్షలు, ఆహ్వానాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించాలని పట్టుబడుతూ కామరాజర్ రోడ్డులోని డీజీపీ కార్యాలయం ఎ దుట ఆయన బైఠాయించారు. తానొక్కడినే రోడ్డు మీద బైఠాయించినా, అధికారులు గుండెల్లో మాత్రం గుబులు పుట్టించారు. ట్రాఫిక్ రామస్వామిని బుజ్జగించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఆ బ్యానర్లను తొలగించే వరకు తాను కదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చివరకు ఆ బ్యానర్లు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాటి తొలగింపుతో తన ఆందోళనను ట్రాఫిక్ రామస్వామి విరమించారు. ఆయన ఆందోళన పుణ్యమా అని కాసేపు మెరీనా తీరంలోని కామరాజర్ రోడ్డులో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. -
జీవో 101లో షరతులు తొలగించాలి
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: జీవో ఎం.ఎస్. నంబరు 101లోని కొన్ని షరతులను తక్షణమే తొలగించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు బేసి మోహనరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయంగా, సామాజికంగా అణగదొక్కబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జీవనోపాధి కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రుణాలు మంజూరు చేసిందని చెప్పారు. వీటిని వినియోగించుకుని పలువురు ఉపాధి పొందుతున్నారని వివరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 101 నంబరు ఉత్తర్వుల్లో పొందుపరచిన కొన్ని షరతుల వల్ల బ్యాంకుల నుంచి సబ్సి డీ రుణాలు పొందటానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని, రుణాల మంజూరులో నెలల తరబడి జాప్యం జరుగుతోందని తెలిపారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతల దుర్గారావు మాట్లాడుతూ పంచాయతీ నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, అంబేద్కర్ ఆలోచన విధానం, రాజ్యాంగపరంగా దళితులకు దక్కాల్సిన హక్కులపై జిల్లాలో కొత్తగా ఎన్నికైన 143 మంది ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌లకు త్వరలో అవగాహన సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా సహాధ్యక్షుడు కె.వేణు మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ నియామకాల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను స్పెషల్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సమితి ప్రతినిధులు బి.కామరాజు, టి.సత్యవతి, టి.మధుసూదనరావు, ఎం.కాళిదాస్ పాల్గొన్నారు. -
తస్మదీయులా..లేపెయ్యండి పేర్లు
రామచంద్రపురం, న్యూస్‌లైన్ : ఓటు హక్కు పవిత్రమైదని, అర్హులైన ప్రతివారూ ఓటు నమోదు చేయించుకోవాలని ఎన్నికల సంఘం పదేపదే ప్రకటనలు చేస్తోంది. అందుకు అనుగుణంగా సంబంధిత అధికారులు, సిబ్బంది అర్హులందరినీ జాబితాలోకి ఎక్కించేందుకు కృషి చేయాల్సి ఉంది. అయితే రామచంద్రపురం నియోజకవర్గంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. ఇప్పటికే ఓటర్లుగా నమోదై, జాబితాల్లో ఉన్న వారి పేర్లను మూకుమ్మడిగా తొలగించే కుతంత్రం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తమకు కాక ప్రత్యర్థి పక్షాలకు ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటు వేస్తారని అనుమానం ఉన్న వారి పేర్లను జాబితాల నుంచి తొలగించాలని అధికార పార్టీ నాయకుడొకరు అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఓడిపోతానన్న భయం పీడిస్తున్న ఆ నేత అడ్డదారుల్లోనైనా గెలుపు బాట వేసుకోవడానికి బరి తెగిస్తున్నారని, నియోజకవర్గంలోని కాజులూరు, కె.గంగవరం, రామచంద్రపురం మండలాలతో పాటుగా మున్సిపల్ పరిధిలో మొత్తం సుమారు 20 వేల మంది తస్మదీయుల (తమకు చెందని వారు) ఓట్లను తొలగించాలని ఆయా మండల తహశీల్దార్లను ఆదేశించినట్టు సమాచారం. ఇప్పటికే ఆయా గ్రామాల్లోని తమ కార్యకర్తలతో తయారు చేయించిన ‘తొలగింపు’ జాబితాలను తహశీల్దార్లకు అందించగా.. వారు వాటిని సంబంధిత జాబితాలను బూత్ లెవెల్ అధికారులకు (బీఎల్ఓ) అందించినట్టు తెలుస్తోంది. సదరు నేత ఆదేశాలను తలదాల్చిన ఓ తహశీల్దార్ ‘ఫారం-7(మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన, వివాహమై అత్తింటికి వెళ్లిన వారి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించేందుకు నిర్దేశించినది)లు ఎన్ని వచ్చాయి? మీకిచ్చిన ‘తొలగింపు’ జాబితాలను ఏం చేశారు?’ అంటూ బీఎల్ఓలను ఒత్తిడి చేస్తున్నారు. అధికార పార్టీ నేత కుటిల వ్యూహం నేపథ్యంలోఏ బూత్‌లో ఎవరి ఓటు గల్లంతవుతుందోనన్న ఆందోళన నియోజకవర్గంలోని ఓటర్లను పీడిస్తోంది. నియోజకవర్గంలో ఓటర్లలో అత్యధికులు.. ముఖ్యంగా బీసీ, ఎస్సీ వర్గాల వారు ైవె ఎస్సార్ కాంగ్రెస్ సానుభూతిపరులుగా ఉంటున్నారు. దీంతో రానున్న సాధారణ ఎన్నికల్లో ఓటమి తప్పదని కలవరపడుతున్న అధికార పార్టీ నేత ఇప్పటి నుంచే పథకం ప్రకారం అలాంటి ఓట్ల తొలగింపునకు పూనుకున్నారని సమాచారం. ఈ క్రమంలోనే కొన్ని జాబితాలను తయారు చేయించి మండల స్థాయిలో ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న తహశీల్దార్లకు అందించారు. ఇలాంటి జాబితాల్లో అత్యధికంగా బీసీ, ఎస్సీ ఓటర్ల పేర్లు ఉండటం గమనార్హం. చనిపోయిన వారి పేర్లతో పాటు పనుల కోసం తాత్కాలికంగా వలస వెళ్లిన వారి పేర్లతోనూ ఫారం-7లు నింపిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఓట్ల తొలగింపునకు ముందస్తుగా ఆయా ఓటర్లకు నోటీసులు జారీ చేయాలి. అనంతరం గ్రామ సభలను ఏర్పాటు చేసి ఓట్లను తొలగించాలి. కానీ కొన్ని గ్రామాల్లో నోటీసులు కూడా లేకుండానే ఓట్లను తొలగిస్తున ్నట్లు ఓటర్లు గ గ్గోలు పెడుతున్నారు. కె.గంగవరం మండలంలో తొలగించాల్సిన ఓటర్లకు పాత తేదీలను వేసి నోటీసులు అందించాలని ఉన్నతాధికారి బీఎల్ఓలను ఆదేశించినట్టు సమాచారం. అధికార పార్టీ నేత అందించిన జాబితాల ప్రకారం ఓట్లను తొలగించాలని ఒత్తిడి చేయడంతో బీఎల్ఓలు ఇరకాటాన్ని ఎదుర్కొంటున్నారు. తాత్కాలికంగా కూలి పనులకు వలస వెళ్లిన వారి ఓట్లు ఎలా తొలగిస్తారని కొ ంత మంది ప్రశ్నిస్తున్నారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇక్కడే ఉన్నాయని, ప్రతి నెలా రేషన్‌ను తీసుకుంటున్నా ఊర్లో ఉండటం లేదని కొందరు చెపుతున్న అవాస్తవాలను పరిగణించడమేమిటని నిలదీస్తున్నారు. బీసీ, ఎస్సీ ఓటర్లనే లక్ష్యంగా చేసుకోవడంపై ఆయా వర్గాల వారు మండిపడుతున్నారు. జాబితాలు అందించడం అవాస్తవం.. ఓటర్ల తొలగింపుపై కె.గంగవరం మండల తహశీల్దార్ ఎన్.రమేష్‌ను వివరణ కోరగా గ్రామాల్లో తాత్కాలికంగా వలస వెళ్లిన వారికి నిబంధనల మేరకు నోటీసులు అందిస్తున్నామన్నారు. గ్రామసభలను పెట్టి సమాచారం సేకరించిన అనంతరమే జాబితా నుంచి తొలగిస్తామన్నారు. అధికార పార్టీ వారు జాబితాలను అందించిన మాట అవాస్తవమని, తాను బీఎల్ఓలకు ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేదని స్పష్టం చేశారు.