తొలగించండి..లేదా ముసుగేయండి
న్యూఢిల్లీ: రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ చర్యలు మొదలుపెట్టింది. ఏదైనా పార్టీకి స్వీయ లబ్ధి కలిగేలా ఉన్న హోర్డింగులు, ప్రకటనల్లోని రాజకీయనాయకుల ఫొటోలను తొలగించడం లేదా మూసివేయడం చేయాలని ఎన్నికల యంత్రాంగాన్ని ఆదేశించింది. యూపీలో ఎన్నికల్లో అవినీతిని అరికట్టేందుకు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ప్రత్యేక టోల్ ఫ్రీ నంబరును ప్రారంభించింది. అభ్యర్థులెవరైనా పరిమితి(రూ.28 లక్షలు)కి మించి ఎన్నికల కోసం ఖర్చు పెడితే, ప్రజలు 1800 180 6555 నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరింది. గోవాలో ప్రచారం కోసం అభ్యర్థులెవరూ మత సంస్థలను ఉపయోగించుకోకూడదని ఈసీ తెలిపింది.