అధిక బరువు ఉంటే ఒబిసిటీ అని పిలిచేవారు కదా. ఇక నుంచి అలా పిలవకూడదట. ఎందకంటే ఆ పదమే పేషెంట్ సమస్యకు మరింత కారణమవుతుందని, అందువల్ల దానికి పేరు మార్చాలని ఆరోగ్య నిపుణులు నిర్ణయించారు. అధిక బరువు ఉన్నవాళ్లని సమాజం ఎలా చూస్తుందో అందరికీ తెలిసిందే. పలువురుతో జరిపిన విస్తృత చర్చల అనంతరం అధికం బరువు సమస్యకు కొత్త పేరు పెట్టాలనే వాదన వినిపించింది. లావుగా ఉన్నవారికి వారు అలా ఉన్నదాని కంటే ఆ పేరే వారిని ఇబ్బందుల పాలు చేసిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే అధిక బరువు సమస్యను మరోక పేరు పెట్టాని నిపుణలు భావించారు.
పేరు మార్చాల్సినంత నీడ్..
- 1950లలో స్వలింగ సంపర్కాన్ని సామాజిక వ్యక్తిత్వ భంగంగా భావించారు. ఆ తర్వాత అనేక నిరసనలు, వ్యతిరేకతలు గట్టిగా రావడంతో దాన్ని అపకీర్తిగా భావించడం మానేశారు. అదోక మానసిక రుగ్మతకు సంబంధించినదని అంగీకరించారు.
- అలానే ఫ్యాటీ లివర్ వ్యాధి విషయంలో కూడా ఇదే సమస్య ఎదురైంది. నిజాని నాన్ ఆల్కహాలిక్‌లకు కూడా ఈ ఫ్యాటీ లివర్ అని పేరు మార్చాలనే వాదన తెరపైకి వచ్చింది. దీంతో ఆ తర్వాత ఆ వ్యాధికి మెటబాలిక్ డిస్‌ఫంక్షన్-అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్" అని పేరు పెట్టారు.ఈ నేపథ్యంలోనే ఒబెసిటీ అనే పదం మార్చడం తప్పనిసరైంది. అదీగాక ఆయా పేషంట్లు ఆ పేరు కారణంగానే సమాజంలోనూ, కుటుంబ పరంగాను వివక్షకు గురవ్వుతున్నారు.
కొత్తపేరు బీఎంఐకి మించి ఉండాలి
అధిక బరువును బీఎంఐల ద్వారా నిర్ణయిస్తారు. బీఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు ఇది కూడా సరిపోదు. ఇది కండర ద్రవ్యరాశిని లెక్కించదు, శరీర బరువు లేదా కొవ్వు కణజాలం (శరీర కొవ్వు) గురించి సరైన సమాచారం ఇవ్వదు.
నిపుణులు సూచించిన కొత్తపేరు
ఈ ఒబెసిటీని “అడిపోసిటీ ఆధారిత దీర్ఘకాలిక వ్యాధి” అని పిలవాలని సూచించారు ఆరోగ్య నిపుణులు. దీని పేరులోనే ఆ వ్యాధి ఏంటో అవగతమవుతుంది. జీవక్రియలు పనిచేయకపోవడమే ఈ వ్యాధి లక్షణం అని తెలుస్తుంది. ఈ పేరు కారణంగా సమాజ దృక్పథం మారి చులకనగా చూసే అవకాశం తగ్గుతుంది.
అధిక బరవు సమస్య అనేది వ్యాధేనా..
- అధిక బరవు అనేది శారీరక లేదా మానసిక వ్యవస్థలు సరిగా పనిచేయక పోవడం వల్ల ఎదురయ్యే సమస్య
- దీన్నిబట్టి ఆ సమస్యను వ్యాధిగా పరిగణించలేం. మొదట్లో అధిక బరువు హానికరం కాకపోవచ్చు.
- కొందరూ లావుగా ఉన్నా.. వారికి ఎలాంటి హెల్త్ సమస్యలు ఉత్పన్నం కావు.
- కొందరికి క్రమేణ అధిక బరువు వివిధ శారీరక సమస్యలకు దారితీస్తుంది.
ఈ పేరు మార్పు కారణంగా ప్రజలకు ఆయా వ్యకుల పట్ల చులకన భావం, హేయభావం తగ్గి వారి సమస్యను అర్థం చేసుకునే యత్నం చేయగలుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment