New name
-
పేరు మార్చుకున్న మస్క్.. వినడానికే వింతగా ఉంది!
ప్రపంచ కుబేరుడు.. టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) తన పేరును మార్చుకున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్టాపిగ్గా మారింది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు.ఒకవైపు బిజినెస్, మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న మస్క్.. తాజాగా తన ఎక్స్ (Twitter) అకౌంట్ పేరును 'కేకియస్ మాక్సిమస్' (Kekius Maximus)గా మార్చుకున్నారు. వినడానికి ఈ పేరు వింతగా ఉన్నప్పటికీ.. దీనికో అర్థం కూడా ఉంది. కేకియస్ అనేది ఓ క్రిప్టో కరెన్సీ టోకెన్. ఇది అనేక బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.ఇలాన్ మస్క్ క్రిప్టో కరెన్సీకి మద్దతు ఇస్తున్నారనే విషయం అందరికి తెలుసు. ఇందులో భాగంగానే తన ఎక్స్ ఖాతా పేరును.. క్రిప్టో కరెన్సీ అర్థం వచ్చేలా మార్చుకున్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. 2023లో కూడా తన ఎక్స్ అకౌంట్ పేరును 'మిస్టర్ ట్వీట్'గా మార్చుకున్నారు.Changed my name to Mr. Tweet, now Twitter won’t let me change it back 🤣— Kekius Maximus (@elonmusk) January 25, 2023సంపదలో మస్క్ కొత్త రికార్డ్ బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ సంపద 447 బిలియన్ డాలర్లు. యుఎస్ అధ్యక్ష ఎన్నికల తరువాత ఈయన సంపద గణనీయంగా పెరిగింది. స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ స్పేస్ఎక్స్ అంతర్గత వాటా విక్రయంతో సంపాదన సుమారు 50 బిలియన్ డాలర్లు పెరిగిందని సమాచారం.ఇదీ చదవండి: ఇలాన్ మస్క్ బూతు ప్రయోగం2022 వరకు మస్క్ నికర విలువ 200 డాలర్ల కంటే తక్కువ ఉండేది. అయితే అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందిన తరువాత.. ఈయన సంపాదన భారీగా పెరిగింది. తాజాగా 400 బిలియన్ డాలర్లు దాటేసింది. మొత్తం మీద 400 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33.20 లక్షల కోట్లు) నికర విలువను అధిగమించిన మొదటి వ్యక్తిగా ఇలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. -
సీఎన్జీ బైక్ రేపే విడుదల.. పేరు తెలిసిపోయింది!!
దేశంలో మొట్టమొదటి సీఎన్జీ బైక్ శుక్రవారం విడుదలవుతోంది. బజాజ్ ఆటో లిమిటెడ్ తన మొట్టమొదటి సీఎన్జీ, పెట్రోల్ హైబ్రిడ్ మోటార్‌సైకిల్‌ను 'ఫ్రీడమ్ 125' పేరుతో విడుదల చేసే అవకాశం ఉంది.బజాజ్ సీఎన్జీ బైక్ పేరు 'బ్రూజర్' అని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా బజాజ్ ఆటో వెబ్సైట్లో పేరు లీక్ అయింది. 'ఫ్రీడమ్ 125'ని రెండు వేరియంట్లలో ఒకటి సాధారణ మోడల్, మరొకటి ప్రీమియం మోడల్లో విడుదల చేయాలని బజాజ్ ఆటో భావిస్తోంది. ఇందులో మరిన్ని కలర్ ఆప్షన్స్, ఫీచర్లు ఉండనున్నాయి.బజాజ్ ఆటో నుంచి వస్తున్న ఈ డ్యూయల్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌లో పెట్రోల్ నుంచి సీఎన్జీకి అలాగే సీఎన్జీ నుంచి పెట్రోల్‌కు ఎప్పుడైనా మారేందుకు కంట్రోల్ బటన్ ఉంటుంది. ఇతర అంశాలలో రౌండ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, మరింత ప్రాక్టికాలిటీని అందించే ఫ్లాట్ సీటు ఉన్నాయి.ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 'బజాజ్ బియాండ్' ఈవెంట్ సందర్భంగా, ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 80,000 నుంచి రూ. 90,000 మధ్య ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇది ఎంట్రీ-లెవల్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో పోటీ ఎంపికగా మారింది. తమ రాబోయే ఉత్పత్తుల కోసం బజాజ్ ఇంతకుముందు గ్లైడర్, మారథాన్, ట్రెక్కర్, ఫ్రీడమ్ అని నాలుగు వేర్వేరు పేర్లను ట్రేడ్‌మార్క్ చేసింది. -
పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?
డార్లింగ్ ప్రభాస్ హిట్ కొట్టేశాడు. 'కల్కి'తో వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరినీ అలరిస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్‌కి ముందు అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వస్తున్న టాక్ చూస్తుంటే తొలిరోజు వసూళ్లతో పాటు ఓవరాల్ కలెక్షన్స్‌లోనూ సరికొత్త రికార్డులు నమోదు కావడం గ్యారంటీ అనిపిస్తుంది. సినిమా సూపర్ ఉంది. మరీ ముఖ్యంగా ప్రభాస్ తన కామెడీ టైమింగ్ ప్లస్ యాక్షన్‌తో అదరగొట్టాడు. కానీ చాలామంది మూవీలో ఓ విషయం మాత్రం సరిగా గమనించలేదేమో!(ఇదీ చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ)ప్రభాస్ పేరులో చిన్న మార్పు చోటు చేసుకుంది. అవును మీరు విన్నది నిజమే. 'కల్కి' సినిమా చూడాలనే ఆత్రుత వల్లో ఏమో గానీ ఇటు ప్రేక్షకులు అటు ఫ్యాన్స్ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ టైటిల్స్‌లో ప్రభాస్ బదులు 'శ్రీ ప్రభాస్' అని పడింది. అయితే దీన్ని గౌరవ సూచకంగా పెట్టారా? లేదంటే న్యూమరాలజీ ప్రకారం పేరుకి ముందు శ్రీ అని జోడీంచుకున్నాడా అనేది మరో మూవీ వస్తే క్లారిటీ వచ్చేస్తుంది.ఏ పేరు మార్చినా సరే ఫ్యాన్స్‌కి మాత్రం ప్రభాస్ ఎప్పుడూ ప్రభాస్ డార్లింగే. ఇకపోతే మూవీలో మహాభారతం ఎపిసోడ్ బాగా వర్కౌట్ అయింది. టైటిల్స్ పడేటప్పుడు వచ్చే సీన్స్‌తో పాటు చివర్లో వచ్చే సన్నివేశాలు వావ్ అనిపించాయి. 3 గంటల సినిమాలో దాదాపు 30 నిమిషాలు మహాభారతం ట్రాక్ పెట్టారు. ఇందులో అమితాబ్ బచ్చన్, విజయ్ దేవరకొండ, ప్రభాస్ కనిపించారు. వీళ్ల గెటప్స్ అయితే అలా అందరికీ నచ్చేసేయంతే!(ఇదీ చదవండి: 'కల్కి' గెస్ట్ రోల్స్‌లో మరో ఐదుగురు.. ఎవరూ ఊహించని పేర్లు) -
ఇవేం పేర్లు బాబోయ్!.. రాజకీయ పార్టీలకు గమ్మత్తైన పేర్లు
ట్వంటీ20. హైటెక్. సాఫ్. సూపర్ నేషన్. జాగ్తే రహో... ఇవన్నీ ఏమిటా అనుకుంటున్నారా? రాజకీయ పార్టీల పేర్లు! వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజం. మన దేశంలో ఆరు జాతీయ పార్టీలు, 57 రాష్ట్ర పార్టీలున్నాయి. వీటి పేర్లు మనం తరచూ వినేవే. వీటితో పాటు భారత్‌లో ఏకంగా 2,597 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. వీటిలో వినడానికే గమ్మత్తైన, ఆసక్తికరమైన, పేర్లున్న పార్టీలకు కొదవ లేదు. కాకపోతే వీటిలో చాలావరకు ఎన్నికల సమయంలో తప్ప పెద్దగా తెరపైకే రావు. పార్టీ పెట్టడం యమా ఈజీ మన దేశంలో పార్టీ పెట్టడం సులువైన పని. రూ.10 వేలు డిపాజిట్, 100 మంది సభ్యుల మద్దతుంటే చాలు... పార్టీ పెట్టేయొచ్చు. ఏ మతాన్నో, కులాన్నో, ప్రాంతాన్నో కించపరిచేలా లేకపోతే చాలు. దాంతో దేశవ్యాప్తంగా ఇలా వేలాది పార్టీలు పుట్టుకొచ్చాయి. వాటిలో గమ్మత్తైన పేర్లకూ కొదవ లేదు. ఇండియన్ లవర్స్ పార్టీ, ఇండియన్ ఓషియానిక్ పార్టీ, లైఫ్ పీస్ఫుల్ పార్టీ, హోలీ బ్లెస్సింగ్ పీపుల్స్ పార్టీ, లేబర్ అండ్ జాబ్ సీకర్స్ పార్టీ, అఖిల భారతీయ భారత్‌మాతా–పుత్రపక్ష, భారతీయ మొహబ్బత్ పార్టీ, మినిస్టీరియల్ సిస్టం అబాలిషన్ పార్టీ, ఆల్ పెన్షనర్స్ పార్టీ, తమిళ్ తెలుగు నేషనల్ పార్టీ, ఇండియన్ విక్టరీ పార్టీ, ఇంటర్నేషనల్ పార్టీ, చిల్డ్రన్ ఫస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, చాలెంజర్స్ పార్టీ, స్వచ్ఛ భారత్ పార్టీ, సత్యయుగ్ పార్టీ, ఇన్సానియత్ పార్టీ, నేషనల్ టైగర్ పార్టీ, మర్యాదీ దళ్... ఇలా ఈ జాబితా చాంతాడును మించిపోతుంది. ప్రధాని మోదీ ఇటీవల పదేపదే ప్రస్తావిస్తున్న నారీ శక్తి పేరుతో కూడా ఒక పార్టీ ఉంది! ఆమ్ ఆద్మీ పార్టీని తలపించేలా గరీబ్ ఆద్మీ పేరుతో కూడా ఒక పార్టీ ఉంది. ఇక, ద రిలిజియన్ ఆఫ్ మ్యాన్ రివాల్వింగ్ పొలిటికల్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీ పేరునైతే వీటికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు! అయితే ఈ పార్టీల్లో చాలావరకు వ్యవస్థపై తమ అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసేందుకు, ఆదర్శ సమాజ స్వప్నానికి రూపమిచ్చేందుకు వాటి వ్యవస్థాపకులు చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. రైట్ టు రీకాల్! ...అంటే తమకు నచ్చని ప్రజాప్రతినిధిని చట్టసభ నుంచి తప్పించే హక్కు. భారత్‌లో లేకున్నా చాలా దేశాల్లో ఈ హక్కుంది. కాకపోతే యూపీలో రాకేశ్ సూరి అనే 42 ఏళ్ల కంప్యూటర్ ఆపరేటర్ ఈ పేరుతో ఏకంగా పార్టీయే పెట్టారు. హామీలు నెరవేర్చని ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే ప్రతిపాదనపై పౌరులకు అవగాహన కల్పించడమే ఆయన లక్ష్యమట. అన్నట్టూ, ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఘాజియాబాద్ నుంచి ఆయన పోటీ కూడా చేస్తున్నారు! యూపీలో ఇలాంటి భిన్నమైన పేర్లతో కూడిన పార్టీలకు కొదవ లేదు. సబ్ సే అచ్ఛీ అనే పార్టీ కూడా అక్కడ ఉనికిలో ఉంది. తొలుత దీని పేరు ఇస్లామిక్ డెమోక్రటిక్ పార్టీ. మతపరమైనదిగా ఉందంటూ అభ్యంతరాలు రావడంతో ఇలా మార్చేశారన్నమాట! ఆప్ కీ అప్నీ పార్టీ (పీపుల్స్), సుభాష్ వాదీ భారతీయ సమాజ్‌వాదీ పార్టీ వంటి పార్టీలు కూడా యూపీలో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాలరామునికి ప్రధాని నరేంద్ర మోదీ నామకరణం!
ఈ నెల 22న అయోధ్యలో జరిగే బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన అతిథిగా హాజరుకానున్నారు. ఆయన ఆరోజు గర్భగుడిలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం చేయనున్నారు. బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన తరువాత ప్రధాని మోదీ ఆ విగ్రహానికి పేరు పెట్టనున్నారు. ఆయన ఏ పేరు పెడతారనేది 22న తెలియనుంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్న కాశీకి చెందిన పండితులు బాలరామునికి ఏ పేరు పెట్టాలనేది శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయిస్తుందని చెప్పారు. విగ్రహానికి నామకరణం చేసే విషయమై ట్రస్టు సభ్యులు శాస్త్ర నిపుణులతో చర్చిస్తున్నారు. అయోధ్యకు తరలివచ్చిన పండితులు ముందుగా రామనగరిలో స్థానిక దేవతలుగా పూజిలందుకుంటున్న దేవతలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానాన్ని అందించారు. ఏదైనా శుభ కార్యం, పూజలు లేదా ఆచారాల నిర్వహణకు స్థానికులు ఇక్కడి దేవతలను పూజిస్తుంటారు. ఈ నేపధ్యంలోనే పండితులు ముందుగా హనుమాన్‌గర్హిలో కొలువైన హనుమంతులవారికి, శివుని పౌరాణిక పీఠమైన నాగేశ్వరనాథ్, సరయూమాత, కనక్ బిహారీ సర్కార్ దేవతలకు ఆహ్వానం అందించారు. పండితులు ఈ ఆలయాలకు వెళ్లి పూజలు చేసి..‘మీ నగరంలో భారీ కార్యక్రమం జరగబోతోందని, మీరు వచ్చి ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజలలో పాల్గొనాలని’ వేడుకున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్య ఎయిర్‌పోర్టుకు భారీ భద్రత -
'ఒబెసిటీ'కి సరికొత్త పేరు..ఇక అలా పిలవొద్దని సూచన!
అధిక బరువు ఉంటే ఒబిసిటీ అని పిలిచేవారు కదా. ఇక నుంచి అలా పిలవకూడదట. ఎందకంటే ఆ పదమే పేషెంట్ సమస్యకు మరింత కారణమవుతుందని, అందువల్ల దానికి పేరు మార్చాలని ఆరోగ్య నిపుణులు నిర్ణయించారు. అధిక బరువు ఉన్నవాళ్లని సమాజం ఎలా చూస్తుందో అందరికీ తెలిసిందే. పలువురుతో జరిపిన విస్తృత చర్చల అనంతరం అధికం బరువు సమస్యకు కొత్త పేరు పెట్టాలనే వాదన వినిపించింది. లావుగా ఉన్నవారికి వారు అలా ఉన్నదాని కంటే ఆ పేరే వారిని ఇబ్బందుల పాలు చేసిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే అధిక బరువు సమస్యను మరోక పేరు పెట్టాని నిపుణలు భావించారు. పేరు మార్చాల్సినంత నీడ్.. 1950లలో స్వలింగ సంపర్కాన్ని సామాజిక వ్యక్తిత్వ భంగంగా భావించారు. ఆ తర్వాత అనేక నిరసనలు, వ్యతిరేకతలు గట్టిగా రావడంతో దాన్ని అపకీర్తిగా భావించడం మానేశారు. అదోక మానసిక రుగ్మతకు సంబంధించినదని అంగీకరించారు. అలానే ఫ్యాటీ లివర్ వ్యాధి విషయంలో కూడా ఇదే సమస్య ఎదురైంది. నిజాని నాన్ ఆల్కహాలిక్లకు కూడా ఈ ఫ్యాటీ లివర్ అని పేరు మార్చాలనే వాదన తెరపైకి వచ్చింది. దీంతో ఆ తర్వాత ఆ వ్యాధికి మెటబాలిక్ డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్" అని పేరు పెట్టారు.ఈ నేపథ్యంలోనే ఒబెసిటీ అనే పదం మార్చడం తప్పనిసరైంది. అదీగాక ఆయా పేషంట్లు ఆ పేరు కారణంగానే సమాజంలోనూ, కుటుంబ పరంగాను వివక్షకు గురవ్వుతున్నారు. కొత్తపేరు బీఎంఐకి మించి ఉండాలి అధిక బరువును బీఎంఐల ద్వారా నిర్ణయిస్తారు. బీఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు ఇది కూడా సరిపోదు. ఇది కండర ద్రవ్యరాశిని లెక్కించదు, శరీర బరువు లేదా కొవ్వు కణజాలం (శరీర కొవ్వు) గురించి సరైన సమాచారం ఇవ్వదు. నిపుణులు సూచించిన కొత్తపేరు ఈ ఒబెసిటీని “అడిపోసిటీ ఆధారిత దీర్ఘకాలిక వ్యాధి” అని పిలవాలని సూచించారు ఆరోగ్య నిపుణులు. దీని పేరులోనే ఆ వ్యాధి ఏంటో అవగతమవుతుంది. జీవక్రియలు పనిచేయకపోవడమే ఈ వ్యాధి లక్షణం అని తెలుస్తుంది. ఈ పేరు కారణంగా సమాజ దృక్పథం మారి చులకనగా చూసే అవకాశం తగ్గుతుంది. అధిక బరవు సమస్య అనేది వ్యాధేనా.. అధిక బరవు అనేది శారీరక లేదా మానసిక వ్యవస్థలు సరిగా పనిచేయక పోవడం వల్ల ఎదురయ్యే సమస్య దీన్నిబట్టి ఆ సమస్యను వ్యాధిగా పరిగణించలేం. మొదట్లో అధిక బరువు హానికరం కాకపోవచ్చు. కొందరూ లావుగా ఉన్నా.. వారికి ఎలాంటి హెల్త్ సమస్యలు ఉత్పన్నం కావు. కొందరికి క్రమేణ అధిక బరువు వివిధ శారీరక సమస్యలకు దారితీస్తుంది. ఈ పేరు మార్పు కారణంగా ప్రజలకు ఆయా వ్యకుల పట్ల చులకన భావం, హేయభావం తగ్గి వారి సమస్యను అర్థం చేసుకునే యత్నం చేయగలుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. (చదవండి: కార్యాలయాల్లో ఓన్లీ 'వై' బ్రైక్!ఏంటంటే ఇది!) -
మంకీపాక్స్ పేరు మార్చిన డబ్ల్యూహెచ్ఓ.. ఇకపై ఇలానే పిలవాలి..!
మంకీపాక్స్ వ్యాధికి కొత్త పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అంతర్జాతీయ నిపుణులతో వరుసగా సంప్రదింపులు జరిపిన అనంతరం చివరకు ఈ పేరును ఖరారు చేసింది. ఇకపై మంకీపాక్స్‌ను 'ఎంపాక్స్' అని పిలవాలని ప్రపంచ దేశాలకు సిఫారసు చేసింది. మరో ఏడాది పాటు ఈ వ్యాధిని మంకీపాక్స్, ఎంపాక్స్ అని రెండు పేర్లతో పిలుస్తారు. ఆ తర్వాత పాత పేరును తొలగించి కొత్త పేరును మాత్రమే ఉపయోగిస్తారు. డబ్ల్యూహెచ్ఓ ఈమేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పేరు మార్పు ఎందుకు? ఈ ఏడాది మొదట్లో మంకీపాక్స్ వ్యాప్తి మొదలైనప్పుడు దీనిపై కొందరు ఆన్లైన్లో జాత్యహంకార, అసభ్య పదజాలంతో దూషించారు. అంతేగాక ఈ పేరుపై కొన్ని దేశాలు, వ్యక్తులు అభ్యంతరం తెలిపి ఆందోళన వ్యక్తం చేశారు. పేరు మార్చాలని ప్రతిపాదించారు. దీంతో నిపుణులతో సంప్రదింపులు జరిపిన అనంతరం డబ్ల్యూహెచ్ఓ కొత్తపేరును ఖరారు చేసింది. చదవండి: 3.30 నిమిషాల్లో పాస్తా ఉడకలేదని రూ.40 కోట్లు దావా.. -
కరోనా సరికొత్త వేరియెంట్.. సెంటారస్!.. మనదేశంలోనూ ఉందా?
ఒకప్పుడు బాగా సైన్స్ తెలిసిన వాళ్లకే కొన్ని గ్రీకు, రోమన్లాంటి పారిభాషిక పదాలు తెలిసేవి. కానీ కరోనా పుణ్యమా అని చాలా చాలా కొత్త కొత్త పేర్లు అందరికీ తెలిసి వస్తున్నాయి. ఆ కోవలో ఇప్పుడు సరికొత్తగా మరో పదం తెలిసివచ్చింది. దాని పేరే ‘సెంటారస్’. ఇది కూడా కరోనాకు చెందిన సరికొత్త వేరియెంట్. అయితే ఇది ఒమిక్రాన్ తాలూకు ఒక సబ్ వేరియెంట్‌గా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఒక వైరస్ తాలూకు వేరియెంట్‌కు మనుషులు నిరోధకత సాధించగానే... తన మనుగడ కోసం కొత్త కొత్త వేరియెంట్లు పుట్టుకొస్తాయన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ కోవిడ్‌కు సంబంధించి... ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్ వంటి అనేక పేర్లు విన్నాం. ఆ తర్వాత వాటిల్లోనే డెల్టా, ఒమిక్రాన్ కలిసిపోయి... డెల్మిక్రాన్ వంటివీ, ఒమిక్రాన్ ఫ్లూతో కలవడంతో ఫ్లూరాన్ వంటి మరికొన్ని సబ్వేరియెంట్లూ పుట్టుకొచ్చాయి. ఇదే వరసతో కోవిడ్‌కు సంబంధించి ఇప్పుడు తాజాగా మరో సబ్–వేరియెంట్ ఆవిర్భవించింది. దాని పేరే ‘సెంటారస్’. ఈ పేరుకు ఇంకా కొన్ని ప్రాధాన్యాలున్నాయి. ‘సెంటారస్’ అనే పేరును ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధికారికంగా పెట్టలేదు. అయితే... మనకు (భూమికి) చాలా దూరంలో ఉన్న సెంటారస్ అనే గ్యాలక్సీ పేరు దీనికి పెట్టారనీ... గ్రీకు మైథాలజీ ప్రకారం సగం గుర్రం, సగం మానవ దేహం ఉన్న గ్యాలక్సీ పేరు దీనికి ఇచ్చారనీ... గుర్రం పరుగులా వేగంగా విస్తరించే స్వభావం ఉన్నందునే ఈ పేరు పెట్టారంటూ ‘గ్సేబియర్ ఆస్టేల్’ అనే కోవిడ్ పరిశీలకుడి మాట. అయితే ఇప్పటివరకైతే దాని తీవ్రత అంతగా కనిపించడం లేదు. తొలిసారిగా ‘నెదర్లాండ్’లో అవును ఉంది. సెంటారస్ (బీఏ 2.75) సబ్–వేరియెంట్‌ను ఈ ఏడాది మే నెలలోనే మన దేశంలోనూ ఉన్నట్లు గుర్తించారు. అయితే తొలిసారిగా దీన్ని ‘నెదర్లాండ్’లో కనుగొన్నారు. ఇప్పుడు ఈ వేరియెంట్ యూఎస్ఏ, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియాల్లో సోకుతోంది. ఇప్పుడీ వేరియెంట్ పై దేశాలు కలుపుకుని దాదాపు పది దేశాల్లో విస్తరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంత తీవ్రమైనదేమీ కాదు... ఈ సెంటరాస్ వేరియెంట్ చాలా వేగంగా పాకుతుందంటూ కొంతమంది శాస్త్రవేత్తలు తొలుత ఆందోళన పడ్డారు. ఒమిక్రాన్ విషయంలో ఆందోళన పడ్డట్టుగానీ ఇది కూడా అంత తీవ్రమైనది కాదని తొలి పరిశీలనల్లో తేలింది. పైగా ఇది ఒమిక్రాన్ తర్వాత వచ్చిన సబ్–వేరియెంట్ కావడం... కొత్త కొత్త వేరియెంట్లు వస్తున్నకొద్దీ వాటి తీవ్రత తగ్గుతూ పోతుండటం వల్ల... ఇది శాస్త్రవేత్తలు అంచనా వేసినంత తీవ్రంగా లేకపోవడం ఓ సానుకూల అంశం. జెనీవాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆంటోనీ ఫ్లాహాల్ట్ మాట్లాడుతూ... ‘‘ఇలా వేరియెంట్లు రూపు మార్చుకుంటున్న కొద్దీ ఈ కొత్త కొత్త స్ట్రెయిన్ల కారణంగా కరోనాలోని ఫలానా వేరియెంట్‌కు అంటూ నిర్దిష్టంగా వ్యాక్సిన్ కనుగొనడం కష్టమవుతుంది’’ అంటూ వ్యాఖ్యానించారు. డచ్ ఇన్స్టిట్యూట్కు చెందిన మరో నిపుణుడు మాట్లాడుతూ ‘‘మనం సార్స్–సీవోవీ–2 కోసం రూపొందించిన వ్యాక్సిన్ కోటగోడను దాటుకుని ఇవి లోనికి ప్రవేశించగలవా లేదా అన్న అంశం ఇంకా తెలియద’’ని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ యాంగ్లియాకు చెందిన ప్రొఫెసర్ పాల్ హంటర్ మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ ఇది చాలా నెమ్మదిగానే ఉంది. పెద్దగా విధ్వంసకారిలా అనిపించడం లేదు’’ అని తెలిపారు. ఇంకా మనదేశానికి చెందిన ‘సార్స్–సీవోవీ–2’ జీనోమిక్ కన్సార్షియమ్ కో–ఛైర్ పర్సన్ డాక్టర్ ఎన్.కె. అరోరా మాట్లాడుతూ ‘‘ఇది మన దేశంలో కొత్తగా, అరకొరగా మరికొన్ని కేసులకు కారణమవుతున్నప్పటికీ, తీవ్రమైనదేమీ కాదు. దీనివల్ల కొత్తగా నాలుగో వేవ్ రాదు’’ అంటూ భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే మన దేశవాసుల్లోని చాలామంది డబుల్ వ్యాక్సినేషన్ తీసుకుని ఉండటం, మరికొందరు బూస్టర్ డోసుకూడా తీసుకోవడం, మూడో వేవ్‌లో ఒమిక్రాన్ చాలామందికి స్వాభావికమైన నిరోధకత ఇచ్చి ఉండటంతో పాటు... తాజాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మూడో డోసు బూస్టర్‌ను కూడా ఉచితంగా ఇవ్వనుండటంతో ఇకపై ఈ వేరియెంట్ ఓ పెద్ద సమస్య కాబోదనేది చాలా మంది నిపుణుల భావన. -
Facebook: పేరు మారిస్తే ఫేస్బుక్ ఇమేజ్ దెబ్బతినదా?
Facebook Change Name: వరుస వివాదాలు, విమర్శల నడుమే పేరు మార్చుకోబోతున్నట్లు ఉప్పందించింది ఫేస్బుక్. ఇంటర్నెట్లో సంచనాలకు నెలవైన ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్.. ఉన్నట్లుండి పేరు మార్చుకోవడం గురించి రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అంతపెద్ద కంపెనీ సడన్‌గా పేరు మార్చుకుంటే చిక్కులు ఎదురుకావా? వ్యాపారానికి, గ్లోబల్ మార్కెట్‌కి ఇబ్బందులు ఏర్పడవా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పేరు మార్చుకోవడం ద్వారా ఫేస్‌బుక్‌కు టెక్నికల్‌గానే కాదు.. లీగల్‌గానూ ఎలాంటి సమస్యలు ఎదురు కావని చెప్తున్నారు నిపుణులు. ►టెక్ దిగ్గజాలు ఆల్ఫాబెట్ (గూగుల్), స్నాప్‌ఛాట్(స్నాప్ ఐఎన్‌సీ), యాపిల్ కంప్యూటర్(యాపిల్)గా పేర్లు మార్చేసినవే. ఇప్పుడు ఫేస్బుక్ ఐఎన్‌సీ(కంపెనీ) మార్చేసినా ఎలాంటి ప్రభావం ఉండబోదు. ►సోషల్ మీడియా దిగ్గజంగా పేరున్న ఫేస్‌బుక్‌ను ప్రపంచం మొత్తంలో 30 శాతం మంది ఉపయోగిస్తున్నారనేది అంచనా. ► ఫేస్బుక్ కంపెనీ నుంచి ఫేస్బుక్ యాప్, ఫేస్బుక్ మెసేంజర్‌తో పాటు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఓక్యూలస్.. ఇవేగాక మరికొన్ని మిస్టీరియస్ ప్రాజెక్టులు ఫేస్బుక్ కింద పని చేస్తున్నాయి. ఇక మెటావర్స్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపడుతున్న నేపథ్యంలోనే పేరును మార్చేయాలని ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ నిర్ణయించుకున్నాడని కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. ►ఫేస్బుక్ కంటే ముందు.. చాలా ఏళ్లుగా కంపెనీలెన్నో తమ పేర్లు మార్చేసుకున్నాయి. వాటికి కారణాలూ ఉన్నాయి. ►సిగరెట్ కంపెనీ ఫిలిప్ మోరిస్ తనపై పడ్డ బ్యాడ్ మార్క్‌ను చెరిపేసుకునేందుకు 2003లో ఆల్ట్రియా గ్రూప్‌గా మార్చుకుంది. ►పెప్సికో రెస్టారెంట్ విభాగంలో టాకో బెల్, పిజ్జా హట్, కేఎఫ్సీలాంటివి ఉన్నాయి. అయితే రెస్టారెంట్ రంగంలో చక్రం తిప్పాలనే ఉద్దేశంతో వీటన్నింటికి కలిపి ‘యమ్!’ కిందకు తీసుకొచ్చింది పెప్సీకో. ►ప్రజల్లో మంచి మార్కుల కోసం.. వీటి నుంచి తప్పించుకునేందుకు కూడా కంపెనీలు పేరు మార్చుకున్న దాఖలాలు ఉన్నాయి. కెన్టూకీ ఫ్రైడ్ చికెన్‌ను ‘ఫ్రైడ్’ పదం మంచిదికాదనే ఉద్దేశంతో.. షార్ట్ కట్లో కేఎఫ్సీగా, సుగర్పాప్స్లో షుగర్ ఉందని ‘కార్న్ పాప్స్’గా, ది చైనీస్ గూస్బెర్రీ కాస్త ది కివీగా మారిపోయాయి. ►న్యాయపరమైన చిక్కులతోనూ కంపెనీలు పేర్లు మార్చుకున్నాయి. ఆండర్సన్ కన్సల్టింగ్.. యాసెంచర్గా పేరు మార్చుకుంది. ►తాజాదనం కోసం.. ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ తన పేరును ఫెడ్ఎక్స్గా మార్చేసుకుంది. పేరు మార్చడమంటే ఆఫీసుల్లో రౌండ్ టేబుల్ మీద అంతా కూర్చుని పేర్లు రాసుకుని.. బెస్ట్ పేరుకు ఓటేయడం కాదంటారు లారెన్ సుట్టన్. కంపెనీల పేర్లు మార్చే ప్రక్రియకు దీర్ఘకాలికంగా నడిచిన రోజులు ఉన్నాయని, పేర్లు మార్చడం కోసం కంపెనీలకు ఖర్చు కూడా తడిసి మోపెడు అవుతుందని చెప్తున్నారు. క్యాచ్వర్డ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడైన లారెన్.. ఆసానా, ఫిట్‌బిట్, ఇంటెల్, అప్‌వర్క్ పేర్లను ప్రతిపాదించారు కూడా. ‘‘కంపెనీలకు సరిపోయే పేరు పెట్టడం పెద్ద సమస్య. కొత్త పేరు కంపెనీ లక్క్క్ష్యాన్ని ప్రతిబింబించేదిలా ఉండాలి. ఇక ఫేస్బుక్ లాంటి కంపెనీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేస్తోంది. కాబట్టి, ట్రేడ్ మార్క్స్ పరంగా న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా చూసుకోవాలి. అలాగే ఆ పేరు వెబ్ డొమైన్స్‌లో అందుబాటులో ఉండాలి అని చెప్తున్నారు లారెన్ సుట్టన్. ఫేస్బుక్ ఎందుకు మార్చాలనుకుంటోంది అనే దానిపై విశ్లేషకుల సమీక్ష మొదలైంది. కేవలం సోషల్ నెట్వర్క్ ప్లాట్‌ఫామ్‌గా మొదలై.. పేరెంట్ కంపెనీగా వాట్సాప్,ఇన్స్టాగ్రామ్ లాంటి మోస్ట్ యూజర్ యాప్స్‌ను తన కింద నడిపిస్తోంది ఫేస్బుక్. అయితే ఈమధ్యకాలంలో వివాదాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్‌ను డీల్ చేయడంలో యూజర్ భద్రత కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇస్తుందనే ఆరోపణ.. కంపెనీ(ఫేస్బుక్) పేరు ఘోరంగా బద్నాం అయ్యింది. ఈ తరుణంలోనే పేరు మార్చేయడం ద్వారా కొంతలో కొంత డ్యామేజ్ కంట్రోల్ చేయాలని ఫేస్బుక్ కంపెనీ భావిస్తుండొచ్చని ఆంటోనీ షోర్ చెప్తున్నారు. అడోడ్ లైట్రూం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్, యాసెంచర్లకు పేర్లు పెట్టింది ఈ టెక్ మేధావే. ‘‘గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్. ఈ విషయం చాలా కొద్దిమందికే తెలుసు. యూజర్లకు, సాధారణ ప్రజలకు పేరెంట్ కంపెనీ గురించి పెద్దగా పని లేదు. ఆ అవసరం కేవలం ఇన్వెస్టర్లకు, ఫైనాన్షియల్ ఆడియొన్స్‌కు ఉంటే సరిపోతుంది. అలాంటప్పుడు ఫేస్బుక్ పేరు మార్పు పెద్ద సమస్య కాదని ఆంటోనీ షోర్ అంటున్నారు. చదవండి: పేరు మార్చుకోనున్న ఫేస్బుక్? కారణాలు ఏంటంటే.. చదవండి: Facebook: ఫేస్బుక్ పేరు మార్పు..! కొత్త పేరు ఇదేనా...! -
ఫేస్బుక్ పేరు మార్పు..! కొత్త పేరు ఇదేనా...!
ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్బుక్ కంపెనీ పేరును మార్చనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో నెట్టింట్లో ఫేస్బుక్ పేరు మార్పుపై నెటిజన్లు రకరకాలుగా గెస్ చేస్తున్నారు. ఫేస్బుక్ కొత్త పేరు ఇదేనంటూ నెటిజన్లు గోలగోల చేస్తున్నారు. కొత్తపేరు ఇదేనంటూ.. ఫేస్బుక్ కంపెనీ పేరును మార్చనున్నట్లు తెలియడంతో నెటిజన్లు ట్విటర్లో పలు సూచనలను చేస్తున్నారు. వీరిలో సామాన్య నెటిజన్లే కాకుండా టెక్ ఇండస్ట్రీ దిగ్గజ వ్యక్తులు కూడా ఉండడం విశేషం. కొంత మంది నెటిజన్లు ఎఫ్బీ(FB)గా పేరు పెట్టాలంటూ సూచనలు చేస్తున్నారు. మరికొంత మంది నెటిజన్లు మేటా(Meta), హరిజన్ (Horizon),ది ఫేస్బుక్ అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరోవైపు ఫేస్బుక్ మాజీ సివిక్ ఛీఫ్ సమిద్ చక్రవర్తి ఒక అడుగు ముందుకేసి ఫేస్‌బుక్‌ను ‘మెటా’ పేరుతో మారుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా మరికొద్ది రోజుల్లోనే ఫేస్బుక్ మెటావర్స్‌ను రిలీజ్ చేస్తున్న తరుణంలో ఫేస్బుక్ కొత్త పేరు మెటా అయి ఉండోచ్చనే భావన అందరిలో వస్తోంది. ఇదిలా ఉండగా..ఈ నెల అక్టోబర్ 28 లోపే ఫేస్బుక్ కొత్త పేరును ప్రకటించనుంది. వరుస ఆరోపణలను ఎదుర్కొంటున్న ఫేస్బుక్..! గత కొద్ది రోజుల నుంచి ఫేస్‌బుక్‌పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఫేస్బుక్ కొంతమంది వ్యక్తుల కోసమే పనిచేస్తుదంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఫేస్‌బుక్‌పై దుమ్మెతి పోసింది. కొంత మంది వీఐపీల ప్రైవసీ విషయంలో ఫేస్బుక్ వారిని అందలాలను ఎక్కిస్తోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఆరోపణలు చేసింది. వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక్కటే కాదు ఫ్రాన్సెస్ హాగెన్ అనే మాజీ ఉద్యోగిని కూడా ఫేస్‌బుక్‌పై తీవ్ర ఆరోపణలను చేసింది. ఫేస్బుక్ దృష్టిలో యూజర్ల‘భద్రత కంటే లాభాలే ముఖ్యం’ అంటూ యూఎస్ కాంగ్రెస్ వేదికగా పలు సంచలన రహస్య పత్రాలను బయటపెట్టిన విషయం తెలిసిందే. My best guess for the new name: "Meta" But I'd prefer something more classic like simply "A Mark Zuckerberg Production" — Samidh (@samidh) October 20, 2021 drop the book, just Face — Danny Trinh (@dtrinh) October 20, 2021 చదవండి: టీవీ ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్...!వారికి మాత్రం పండగే..! -
కొత్త పేరుతో త్వరలో పబ్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాపులర్ గేమ్ పబ్జీ గుర్తుందిగా.. కొద్ది రోజుల్లో బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో ఈ గేమ్ దర్శనమీయనుంది. అది కూడా కేవలం భారత్‌కే పరిమితం కానుందని దక్షిణ కొరియాకు చెందిన వీడియో గేమ్ డెవలపర్ క్రాఫ్టన్ వెల్లడించింది. చైనా యాప్స్‌కు అడ్డుకట్ట వేసే ప్రక్రియలో భాగంగా ప్లేయర్ అన్నోన్స్ బాటిల్‌గ్రౌండ్స్ (పబ్జీ) మొబైల్‌ను గతేడాది సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన ఇంటర్నెట్ కంపెనీ టెన్సెట్ భారత్‌లో పబ్జీని ఆఫర్ చేసింది. అయితే ఇక నుంచి ఈ గేమ్ అధికారం టెన్సెట్ ఇండియాకు లేదని పబ్జీ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఎప్పుడు ఈ గేమ్‌ను అందుబాటులోకి తెచ్చేదీ వెల్లడించనప్పటికీ కొత్త లోగోను కంపెనీ గురువారం ఆవిష్కరించింది. ఉచితంగానే గేమ్‌ను విడుదల చేయనున్నట్టు క్రాఫ్టన్ వెల్లడించింది. భారత్‌లో అనుబంధ కంపెనీ ఏర్పాటు చేసి ఇక్కడి మార్కెట్ కోసం ప్రత్యేక గేమ్‌ను ప్రవేశపెట్టనున్నట్టు గతేడాది నవంబర్‌లో పబ్జీ కార్పొరేషన్ ప్రకటించింది. వ్యాపార పునరుద్ధరణ కోసం మాతృ సంస్థ అయిన క్రాఫ్టన్‌తో కలిసి సుమారు రూ.740 కోట్లు భారత్‌లో ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. పబ్జీ డౌన్లోడ్స్ దేశంలో 17.5 కోట్లకుపైమాటే. -
పిల్ల ఏనుగుకు పేరు పెడితే అదిరే గిఫ్ట్
లక్నో: ఏనుగమ్మ ఏనుగు అని పాట పాడుకుంటూ మనం చిన్నప్పుడు ఎంజాయ్ చేశాం. ఇప్పుడు ఆ ఏనుగుకు పేరు పెడితే అదిరిపోయే బహుమతి సొంతమయ్యే అవకాశం వచ్చింది. ఏనుగుకు పేరు పెడితే తాము బహుమతి ఇస్తామని ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. కొత్తగా పుట్టిన ఏనుగు పిల్లకు పేరు సూచించాలని అధికారులు తెలిపారు. కర్ణాటక నుంచి పది ఏనుగులను ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరి జిల్లా దక్షిణ సోనారిపూర్ ప్రాంతంలోని దుధ్వా టైగర్ రిజర్వ్ (డీటీఆర్)కు తరలించారు. ఆ గుంపులో ఉన్న ‘థెరిసా’ అనే ఏనుగు ఈ నెల 3వ తేదీన ఒక పిల్లకు జన్మనిచ్చింది. కొత్తగా పుట్టిన ఆ పిల్ల ఏనుగుకు పేరు సూచిస్తే బహుమతి సొంతం చేసుకుంటారని డీటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ సంజయ్ పాఠక్ ప్రకటించారు. తగిన పేరును సూచించిన వారికి ఆశ్చర్యకరమైన బహుమతిని అందిస్తామని చెప్పారు. ఈ మేరకు పర్యాటకులు, వన్యప్రాణి ప్రేమికులను ఈ పోటీకు అనుమతించారు. కర్నాటక నుంచి యూపీకి తీసుకువచ్చిన మొదట్లో వాటి ఆరోగ్యంపై అధికారులు ఆందోళన చెందారు. అయితే అక్కడి వాతావరణానికి, ఆ ప్రాంత ఆహారానికి అలవాటుపడడంతో యూపీ అధికారులు ఆనందం పొందారు. దీంతో వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. వాటికి పేర్లు పెట్టి సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు. ఆశ్చర్యమేమిటంటే ఆ ఏనుగులు కన్నడకు కాకుండా హిందీ భాషకు స్పందిస్తుండడం విశేషం. -
‘ఆర్సీబీ’ పేరులో మార్పు?
బెంగళూరు : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు పేరు మారబోతుందని బుధవారం ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఆర్సీబీకి సంబంధించిన అకౌంట్ల ప్రొఫైల్స్‌లో మార్పులు చోటుచేసుకోవడంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విటర్లలో ఆర్సీబీ ప్రొఫైల్ పిక్చర్స్ ఖాళీగా కనిపించడంతో పలువురు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్సీబీ పాత పోస్ట్‌లు కనిపించకపోవడం, ట్విటర్ ఖాతాలో కేవలం రాయల్ చాలెంజర్స్‌గా మాత్రమే పేర్కొనడంతో ఎదో జరుగుతోందంటూ చర్చ ప్రారంభమైంది. ఆర్సీబీ ఆటగాడు యజ్వేంద్ర చహల్ కూడా ఈ విషయాన్ని ట్విటర్లో ప్రస్తావించాడు. ప్రొఫైల్ పిక్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లు ఎక్కడికి వెళ్లాయంటూ సరదాగా ప్రశ్నించారు. మరోవైపు ఆర్సీబీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్ర్కీన్ షాట్‌ను షేర్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా అంతా ఓకేనా అని అడిగింది. అయితే ఆర్సీబీ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆర్సీబీ పేరు మార్పుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ చర్చలు తుది దశలో ఉన్నాయని.. ఫిబ్రవరి 16న అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు ఉన్న ‘Bangalore’ను ‘Bengaluru’ గా మార్చనున్నట్టుగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్లో ఆర్సీబీ ఒక్కసారైనా టైటిల్‌ను సొంతం చేసుకోకపోవడం, స్థానిక అభిమానులు Bangalore అని పిలవడానికి అంతగా ఆసక్తి కనబరచకపోవడం వల్లనే ఆ జట్టు పేరు మార్చబోతున్నారనేది ఆ వార్తల సారాంశం. ఆ ప్రచారంలో నిజమెంతుందో తెలియాలంటే ఆర్సీబీ నుంచి అధికార ప్రకటన వెలువడే వరకు ఆగాల్సిందే. మరోవైపు ఇటీవల ముత్తూట్ ఫిన్‌కార్ఫ్‌తో మూడేళ్ల స్పాన్సర్షిప్ ఒప్పందం కుదుర్చుకున్న ఆర్సీబీ.. ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. Arey @rcbtweets, what googly is this? 🤔 Where did your profile pic and Instagram posts go? 😳 — Yuzvendra Chahal (@yuzi_chahal) February 12, 2020 Hey @RCBTweets, everything ok? 🤔 pic.twitter.com/XmcgcsP0GZ — SunRisers Hyderabad (@SunRisers) February 12, 2020 -
ఎన్సీఎల్ బిల్డ్‌టెక్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్సీఎల్ గ్రూప్ కంపెనీ అయిన ఎన్సీఎల్ ఆల్టెక్ అండ్ సెక్కోలార్ పేరును ఎన్సీఎల్ బిల్డ్‌టెక్‌గా మార్చారు. కంపెనీ ప్రస్తుతం సుమారు రూ.100 కోట్లతో విస్తరణ చేపట్టింది. నెల్లూరులో ఏఏసీ బ్లాక్స్ యూనిట్ నిర్మాణంలో ఉందని ఎన్సీఎల్ బిల్డ్‌టెక్ ఎండీ కె.మధు తెలిపారు. జేఎండీ సుబ్బ రాజు, ఈడీ పి.ఆదిత్యతో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘నెల్లూరు యూనిట్ 2020 మార్చికల్లా సిద్ధం కానుంది. జర్మనీకి చెందిన షూకో సహకారంతో సంగారెడ్డి వద్ద అల్యూమినియం విండోల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఇదే జిల్లాలో స్టీల్ డోర్ల తయారీ యూనిట్ కూడా నెలకొల్పుతున్నాం’ అని వివరించారు. సోలార్ వెలుగులు..: విద్యుత్ వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా సోలార్ విద్యుత్‌ను వినియోగించాలని కంపెనీ నిర్ణయించింది. మొత్తం అవసరాల్లో 60–70 శాతం సోలార్ నుంచి సమకూరేలా చూస్తామని మధు చెప్పారు. 2018–19లో కంపెనీ రూ.372 కోట్ల టర్నోవర్‌పై రూ.47 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 700లకు పైమాటే. త్వరలో కొత్తగా 200 మందిని నియమించనున్నారు. -
విసిగిపోయాం..సొంత పేరు పెట్టుకుంటాం!
సాక్షి. న్యూఢిల్లీ: బ్రిటన్ ట్రావెల్ దిగ్గజం థామస్‌కుక్ దివాలా తీయడం దేశీయంగా సేవలు నిర్వహిస్తున్న థామస్‌కుక్ ఇండియాకు పెద్ద ఇబ్బందులు తెచ్చిపెట్టింది. 2012 నుంచి దేశీయంగా స్వతంత్ర సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న థామస్ కుక్ ఇండియా పేరు మార్చుకోవాలని యోచిస్తోంది. ఎందుకంటే దివాలా తీసిన బ్రిటిన్ సంస్థకు చెందిన 22వేల ఉద్యోగాలు (ప్రపంచవ్యాప్తంగా) ప్రమాదంలో పడనున్నాయి. అలాగే అకస్మాత్తుగా పలు విమానల సర్వీసులను నిలిపి వేయడంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడిక్కడ చిక్కుక పోయారన్న వార్త ఆందోళనకు దారితీసింది. స్టాక్మార్కెట్లో ఈ కౌంటర్లో అమ్మకాల వెల్లువ ఈ రోజు (మంగళవారం) కూడా కొనసాగుతోంది. దీంతో ఈ పరిణామాంలపై స్పందించిన థామస్‌కుక్ (ఇండియా) లిమిటెడ్ (బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీ)కి యుకెసంస్థతో ఎటువంటి సంబంధం లేదని పునరుద్ఘాటించింది. అలాగే తమకు, ప్రస్తుత సంక్షోభానికి ఎలాంటి సంబంధమూ లేదని ప్రకటించింది. నిర్వహణ, లాభాల పరంగా తాము చాలా పటిష్టంగా ఉన్నామని స్పష్టం చేసింది. 2012 నాటికి ఒప్పందం ప్రకారం 2024 వరకు 'థామస్ కుక్' బ్రాండ్ పేరును ఉపయోగించుకునే హక్కు కంపెనీకి ఉందని కంపెనీ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ మాధవన్ మీనన్ వెల్లడించారు. అయితే సంస్థ సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున సంస్థలో సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున రాబోయే రోజుల్లో కూడా దీనిని సమీక్షించే అవకాశం ఉందనీ, దాదాపు రెండు వారాల్లో వివరణాత్మక పరివర్తన ప్రణాళిక అమలుకు సిద్ధంగా ఉన్నామన్నారు. . కాగా థామస్ కుక్ (ఇండియా) లిమిటెడ్‌లో మేజర్ వాటాను(77 శాతం) ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ 2012లో కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఫెయిర్‌బ్రిడ్జ్ క్యాపిటల్ (మారిషస్) లిమిటెడ్ - ఫెయిర్‌ఫాక్స్ కంపెనీ దాదాపు 67 శాతం వాటాను కలిగి ఉంది. చదవండి: కుప్పకూలిన దిగ్గజం, 22 వేల ఉద్యోగాలు ప్రమాదంలో చదవండి : ‘థామస్ కుక్’ దివాలా... -
ముస్లిం చిన్నారికి ‘నరేంద్ర మోదీ’ పేరు
గోండా(యూపీ): ప్రధాని వ్యక్తిత్వం పట్ల ఆకర్షితురాలైన ఓ ముస్లిం మహిళ తన నవజాత శిశువుకి ‘నరేంద్ర దామోదర్ దాస్ మోదీ’అని పేరు పెట్టాలని నిర్ణయించింది. ఇక్కడి పర్సాపూర్ మహరార్ గ్రామానికి చెందిన మైనాజ్ బేగం లోక్‌సభ ఫలితాలు వెల్లడై నరేంద్ర మోదీ భారీ మెజారిటీతో గెలిచిన రోజే తన బిడ్డకు ఆయన పేరు పెట్టాలనే ఆలోచనకు వచ్చింది. ‘మేమందరం ఆమె అభిప్రాయాన్ని మార్చడానికి ప్రయత్నించాం. కానీ ఆమె తన ఆలోచనను అస్సలు మార్చుకోలేదు. ఇదే విషయాన్ని దుబాయిలో ఉన్న తన భర్త ముస్తాక్ అహ్మద్‌కు తెలుపగా ఆయన కూడా ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా ఆమె ఎంతకీ వినకపోవడంతో చివరికి ఆమె కోరిక మేరకే పేరు పెట్టేందుకు ఒప్పుకున్నాడు’అని మైనాజ్ బేగం మామ ఐద్రీస్ తెలిపారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు బాలుడి పేరుతో పుట్టిన తేదీ సర్టిఫికెట్ పొందడానికి ఆ జిల్లా మెజిస్ట్రేట్‌లో అఫిడవిట్ దాఖలు చేసి, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (పంచాయతీ) ఘనశ్యామ్ పాండేకు సమర్పించారు. -
ఐడీబీఐ బ్యాంకు పేరు మార్పునకు ఆర్బీఐ నో?
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకు పేరు మార్చేందుకు ఆర్బీఐ సుముఖంగా లేదని సమాచారం. బ్యాంకు పేరును ఎల్ఐసీ ఐడీబీఐ బ్యాంకుగాను లేదంటే ఎల్ఐసీ బ్యాంకుగాను మార్చాలని, ప్రథమ ప్రాధాన్యం ఎల్ఐసీ ఐడీబీఐ బ్యాంకేనని గత నెలలో ప్రతిపాదనలు పంపిన విషయం గమనార్హం. అయితే, ఐడీబీఐ బ్యాంకు పేరు మార్పునకు ఆర్బీఐ అనుకూలంగా లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పేరు మార్పునకు ఆర్బీఐతోపాటు కార్పొరేట్ వ్యవహారాల శాఖ, వాటాదారులు, స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల అనుమతి కూడా అవసరం అవుతుంది. ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటా కొనుగోలు ప్రక్రియను జనవరిలో ఎల్ఐసీ పూర్తి చేసిన విషయం తెలిసిందే. దీంతో 60 ఏళ్లకు పైగా బీమా రంగంలో ఉన్న ఎల్ఐసీ ఎట్టకేలకు బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టినట్టు అయింది. -
ట్రైన్ 18 ఇక ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’
న్యూఢిల్లీ: దేశీయంగా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సెమీ హైస్పీడ్ రైలుకు కేంద్రం కొత్త పేరు పెట్టింది. ఇప్పటివరకూ ‘ట్రైన్ 18’గా వ్యవహరిస్తున్న ఈ రైలుకు ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ అని నామకరణం చేసినట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వారణాసి–ఢిల్లీ మధ్య ఈ రైలు పరుగులు పెడుతుందని వెల్లడించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ రూ.97 కోట్ల వ్యయంతో 16 బోగీలున్న ఈ రైలును నిర్మించిందని పేర్కొన్నారు. పూర్తి స్వదేశీ సాంకేతికతతో భారత ఇంజనీర్లు 18 నెలల్లోనే పూర్తి ఏసీ సౌకర్యం ఉన్న ఈ రైలును అభివృద్ధి చేశారన్నారు. ఈ రైలులో రెండు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లు ఉంటాయన్నారు. లోకోమోటివ్ల అవసరం లేకుండా నడిచే తొలి రైలుగా ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ చరిత్ర సృష్టించిందని గోయల్ తెలిపారు. మేకిన్ ఇండియా కార్యక్రమం కింద ప్రపంచస్థాయి ప్రమాణాలతో రైళ్లను నిర్మించగలమని ఈ ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’తో తేటతెల్లమయిందన్నారు. వారణాసి–ఢిల్లీ మధ్య పరుగులు పెట్టే ఈ రైలు కాన్పూర్, అలహాబాద్‌లో ఆగుతుందన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన సలహాలు, సూచనల ఆధారంగానే ఈ పేరును ఖరారు చేసినట్లు గోయల్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ త్వరలోనే ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభిస్తారని ప్రకటించారు. ఈ తరహా రైళ్ల తయారీని వేగవంతం చేయాలని తాను రైల్వే బోర్డును కోరారనీ, దీనివల్ల రైళ్ల సగటు ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. -
ఏడాదిలో 25 ప్రాంతాల పేర్లు మార్పు
న్యూఢిల్లీ: ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 25 నగరాలు, గ్రామాల పేర్లను మార్చేందుకు కేంద్రం అనుమతులిచ్చింది. ఈ పేర్ల మార్పు ప్రతిపాదనల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఒకటి. అయితే, పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగ్లా’ గా మార్చాలన్న ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ఇటీవల అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా, ఫైజాబాద్‌ను అయోధ్యగా పేరు మారుస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంలో ఆంధ్రపదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిని రాజమహేంద్రవరంగా, ఒడిశాలోని భద్రక్ జిల్లా ఔటర్ వీలర్‌ను ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్‌గా, కేరళలోని మలప్పుర జిల్లా అరిక్కోడ్‌ను అరీకోడ్‌గా, హరియాణాలోని జింద్ జిల్లా పిండారిని పందు–పిండారగా, నాగాలాండ్‌లోని కిఫిరె జిల్లా సాంఫూర్‌ని సాన్‌ఫూరెగా పేర్లు మార్చారు. ఈ ప్రతిపాదనలను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం హోంశాఖ అమలు చేస్తుంది. కాగా, అహ్మదాబాద్‌ను కర్ణావతిగా పేరు మార్చాలన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ వెల్లడించారు. ఫైజాబాద్‌పై మిశ్రమ స్పందన ఫైజాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మార్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయంపై స్థానికుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అవసరం లేకుండానే కేవలం రాజకీయ కారణాలతో పేరును మారుస్తున్నారని, దీని వల్ల చారిత్రక నగరానికి ఉన్న గుర్తింపు తెరమరుగవుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ..అది అయోధ్య కీర్తిప్రతిష్టల్ని మరింత ఇనుమడింపజేస్తుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. -
అలహాబాద్.. ఇకపై ప్రయాగ్‌రాజ్!
అలహాబాద్: చారిత్రక నగరం అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై సీఎం ఆదిత్యనాథ్ మాట్లాడారు. విస్తృత ఏకాభిప్రాయం తర్వాతే అలహాబాద్ పేరును మారుస్తాం. ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలన్నది ఎక్కువ మంది ప్రజల ఆకాంక్ష. అందరూ అంగీకరిస్తే ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తాం’ అని తెలిపారు. ఈ మేరకు సీఎం పంపించిన ప్రతిపాదనలకు గవర్నర్‌తో పాటు కేంద్రం కూడా ఆమోద ముద్ర వేసింది. వచ్చే ఏడాది జనవరిలో ఇక్కడ జరగనున్న కుంభమేళాకు ముందుగానే కొత్తపేరు ప్రయాగ్‌రాజ్‌ను ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. 16వ శతాబ్దంలో మొఘలు చక్రవర్తి అక్బర్ ఇక్కడి గంగా–యమున కలిసే సంగమ ప్రాంతంలో కోటను నిర్మించాడు. ఆ కోటకు, పరిసర ప్రాంతానికి కలిపి ఇలాహాబాద్ అని పేరు పెట్టాడు. కుంభమేళా జరిగే సంగమ ప్రాంతాన్ని ప్రయాగ్ అనే పేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నారు. -
'యువతకు ఉపయోగపడేలా మన టీవీ కార్యక్రమాలు'
- ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ హైదరాబాద్: ప్రభుత్వం నడిపిస్తున్న 'మన టీవీ' ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువకులకు ఉపయోగపడే కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రైతులకు, గృహిణులకు ఉపయుక్తంగా ఉండేలా కార్యక్రమాలుండాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం మంత్రి ప్రకటన విడుదల చేశారు. పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తున్న మనటీవీకి కొత్త పేరు, లోగోను సూచించాలని సీఈఓ శైలేష్‌రెడ్డి కోరారు. మంచి పేరు, లోగో సూచించిన వారికి రూ.51 వేల బహుమతి అందిస్తామని ప్రకటించారు. పేరు, లోగోలను ఐటీ శాఖ వెట్సైట్లో లేదా అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ ప్రాంగణంలోని మనటీవీ కార్యాలయంలో నేరుగా కానీ, పోస్టు ద్వారా కానీ సమర్పించవచ్చని తెలిపారు. -
త్వరలో నంది అవార్డుల పేరు మార్పు
రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సినిమాలకు ఏటా ఇచ్చే 'నంది' పురస్కారాల పేరు మారనుంది. తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పేరుతో సినీ అవార్డులను ప్రదానం చేయనుంది. త్వరలో నంది అవార్డుల పేరు మార్చనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ఫష్టం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాదే నంది అవార్డుల పేరు మారుస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఈ విషయమై రమణాచారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటయ్యిందని, అవార్డుల పేరు మార్పుపై రమణాచారి కమిటీదే నిర్ణయమని అన్నారు. తెలుగు చరిత్ర మరియు కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు,ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు. ఈ సంప్రదాయం 1964 వ సంవత్సరంలో ప్రారంభమైంది. మొదట్లో బంగారు, రజత, కాంస్య నంది అనే 3 బహుమతులు, కథకు 2 బహుమతులు.. మొత్తము 5 పురస్కారాలు మాత్రమే ఉండేవి. చిత్ర నిర్మాణములో ఉన్న శాఖలకు గుర్తింపు, ప్రోత్సాహము అందించే విధంగా ప్రస్తుతం అన్ని విభాగాలకు నంది పురస్కారాలను అందజేస్తున్నారు. ఇక నుంచి ఈ నంది పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే అవార్డులుగా మాత్రమే కొనసాగుతాయి.