
ఈ నెల 22న అయోధ్యలో జరిగే బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన అతిథిగా హాజరుకానున్నారు. ఆయన ఆరోజు గర్భగుడిలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం చేయనున్నారు.
బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన తరువాత ప్రధాని మోదీ ఆ విగ్రహానికి పేరు పెట్టనున్నారు. ఆయన ఏ పేరు పెడతారనేది 22న తెలియనుంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్న కాశీకి చెందిన పండితులు బాలరామునికి ఏ పేరు పెట్టాలనేది శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయిస్తుందని చెప్పారు. విగ్రహానికి నామకరణం చేసే విషయమై ట్రస్టు సభ్యులు శాస్త్ర నిపుణులతో చర్చిస్తున్నారు.
అయోధ్యకు తరలివచ్చిన పండితులు ముందుగా రామనగరిలో స్థానిక దేవతలుగా పూజిలందుకుంటున్న దేవతలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానాన్ని అందించారు. ఏదైనా శుభ కార్యం, పూజలు లేదా ఆచారాల నిర్వహణకు స్థానికులు ఇక్కడి దేవతలను పూజిస్తుంటారు.
ఈ నేపధ్యంలోనే పండితులు ముందుగా హనుమాన్‌గర్హిలో కొలువైన హనుమంతులవారికి, శివుని పౌరాణిక పీఠమైన నాగేశ్వరనాథ్, సరయూమాత, కనక్ బిహారీ సర్కార్ దేవతలకు ఆహ్వానం అందించారు. పండితులు ఈ ఆలయాలకు వెళ్లి పూజలు చేసి..‘మీ నగరంలో భారీ కార్యక్రమం జరగబోతోందని, మీరు వచ్చి ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజలలో పాల్గొనాలని’ వేడుకున్నారు.
ఇది కూడా చదవండి: అయోధ్య ఎయిర్‌పోర్టుకు భారీ భద్రత
Comments
Please login to add a commentAdd a comment