ఢిల్లీ: అయోధ్యలో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500 ఏళ్ల హిందువుల కల సాకారమైంది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలావతారంలో కొలువు దీరాడు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట క్రతువు జరిగింది.
మేషలగ్నం అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగింది. విగ్రహ ప్రతిష్టకు కర్తగా వ్యవహరించారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌లతో పాటు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ట సమయంలో ఆలయం మీద నుంచి హెలికాఫ్టర్‌లతో పూల వర్షం కురిపించారు.
#WATCH | First visuals of the Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya pic.twitter.com/E0VIhkWu4g
— ANI (@ANI) January 22, 2024
రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది. అదే సమయంలో జై శ్రీరామ్ నినాదంతో కోట్లాది హిందువులు పులకరించి పోయారు. సకలాభరణలతో అలంకరించిన బాలరాముడు.. కమలంపై కొలువుదీరాడు. కుడి చేతిలో బాణం.. ఎడమ చేతిలో విల్లు ఉంది. ఆ దివ్యరూపం సోషల్ మీడియాకు చేరగా.. తన్మయంతో భక్తులు పులకరించిపోతున్నారు.
దర్శన వేళలు ఇవే
అయోధ్య రామ మందిర సామాన్యుల దర్శనం కోసం స్లాట్‌లు కేటాయించారు. రేపటి నుంచి అంటే.. మంగళవారం ఉదయం 7గం. నుంచి 11.30 వరకు, అలాగే మధ్యాహ్నాం 2గం. నుంచి 7 వరకు భక్తులకు అనుమతిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment