అయోద్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దేశంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు రామాలయ ప్రారంభోత్సవ కమిటీ ఆహ్వాన ప్రతికలు అందజేస్తోంది. ఇక..ఈ కార్యక్రమంపై పలువురు రాజకీయ నాయకులు బీజేపీ రామ మందిర ప్రారంభోత్సవాన్ని రాజకీయం చేస్తోదని రాబోయే లోక్‌సభ ఎన్నికలకు పావుగా వాడుకుంటోందని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పింస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ రామ మందిర ప్రారంభోత్సవం విషయంలో మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై తీరుపై విమర్శలు చేశారు. వాస్తవానికి అయోధ్యలో రామ మందిర ఏర్పాటుకు మాజీ, దివంగత ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ హయాంలోనే కీలకమైన ‘శిలాన్యాస్’ (శిలాఫలకం శంకుస్థాపన) చేసి వేడుక జరిపారని గుర్తు చేశారు. శరద్ పవార్ కర్ణాటకలోని నిపాణిలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మంగళవారం మాట్లాడారు.
రామ మందర విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ కేవలం రాజకీయం కోసమే చాలా హడావుడీ చేస్తున్నాయని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే ‘శిలాన్యాస్’ (శిలాఫలకం శంకుస్థాపన) వేడుక చేశారని తెలిపారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ మాత్రం రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయోద్యలో బలరాముడి ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని 11 రోజులు ఉపవాసం ఉంటున్న విషయం తెలిసిందే. దానిపై కూడా సీనియర్ నేత శరద్ పవార్ స్పందిస్తూ.. రాముడిపై భక్తి, విశ్వాసం ఉండటాన్ని తాను గౌరవిస్తాన్నానని తెలిపారు. కానీ.. దేశంలో పేదరికం నిర్మూలించబడాలని ఉపవాసం చేస్తే దేశ ప్రజలు సైతం ప్రశంసిస్తారని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment