మరికొద్ది గంటల్లో ఓ మహాఘట్టానికి తెరలేవనుంది. అయోధ్య మహానగరం నడిబొడ్డున శ్రీరామచంద్రుల వారు కొలువుతీరనున్నారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం రేపు(సోమవారం)మధ్యాహ్నం 12 :15 నిమిషాల నుంచి 12: 45 నిమిషాల మధ్య జరుగనుంది.
మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అయోధ్య రామమందిర ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. కాగా, ప్రాణప్రతిష్టకు ముందు చేసే ప్రత్యేక పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రాణ్ అంటే ప్రాణశక్తి, ప్రతిష్ట అనగా స్థాపన. శ్రీరాముని విగ్రహానికి జీవం పోసే కార్యక్రమంగా చెప్పవచ్చు. దీంతో అయోధ్య నగరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎటు చూసినా, ఎక్కడా చూసినా రాముడు, సీత, హనుమంతుడు, రామయాణ దృశ్యాలే కనిపిస్తున్నాయి. వీధులన్నీ కాషాయమయం అయ్యాయి. రామ భజనలు, కీర్తనలతో అయోధ్య మారుమోగుతోంది.
ఇవి కూడా చదవండి:
అంతరిక్షం నుంచి అయోధ్య చిత్రాలు..
ప్రాణ ప్రతిష్టను ప్రత్యక్షంగా చూడటం ఎలా?
Comments
Please login to add a commentAdd a comment