రాముడి ఆహ్వానం అందింది.. అయోధ్యకు వస్తున్నా: నిత్యానంద | Nithyananda Claims To Have Received Invitation For Ram Temple Ceremony On January 22? - Sakshi
Sakshi News home page

రాముడి ఆహ్వానం అందింది.. అయోధ్యకు వస్తున్నా: నిత్యానంద

Published Sun, Jan 21 2024 5:14 PM | Last Updated on Sun, Jan 21 2024 6:18 PM

Nithyananda To Attend Ram Temple Event In Ayodha - Sakshi

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగసుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనం ఇవ్వనున్నాడు. రేపు సోమవారం బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది. ప్రపంచం నలు మూలల నుంచి తరలివస్తున్న భక్త జనం సాక్షిగా ఆగమ శాస్త్ర పద్ధతుల్లో ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమానికి తాను వస్తున్నాని తాను దైవ​ంగా చెప్పుకునే నిత్యానంద స్పష్టం చేశాడు. 

వివరాల ప్రకారం.. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో ఈ నెల 22న జరుగనున్న రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందినట్లు నిత్యానంద తెలిపాడు. ఈ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్లు నిత్యానంద ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నాడు. ఈ క్రమంలో ట్విట్టర్‌లో ‘ఈ చారిత్రాత్మకమైన, అసాధారణమైన సంఘటనను మిస్ అవ్వకండి. సాంప్రదాయ ప్రాణ ప్రతిష్ట సమయంలో రాముడు లాంఛనంగా ఆలయంలోని ప్రధాన విగ్రహంలోకి ఆవాహనం అవుతాడు. యావత్ ప్రపంచాన్ని కరుణించేందుకు భూమిపైకి వస్తాడు’ అని కామెంట్స్‌ చేశారు. 

అలాగే, రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి లాంఛనంగా ఆహ్వానం అందడంతో హిందూ మతం అత్యున్నత పీఠాధిపతి భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం ఈ గొప్ప కార్యక్రమానికి హాజరుకానున్నారు అంటూ చెప్పుకొచ్చారు. 

ఇదిలా ఉండగా.. నిత్యానంద 2020లో భారత్‌ నుంచి పారిపోయాడు. ఒక దీవిని ‘కైలాస’ దేశంగా ప్రకటించిన ఆయన హిందూ మతానికి సుప్రీం పీఠాధిపతిగా చెప్పుకుంటున్నాడు. అయితే, అంతకుముందు కర్ణాటకలో ఒక మఠానికి అధిపతి అయిన నిత్యానందపై 2010లో అత్యాచారం కేసు నమోదైంది. కారు డ్రైవర్‌ ఫిర్యాదుతో ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన నిత్యానంద దేశం నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో పలు మార్లు సోషల్‌ మీడియా వేదికగా పలు కామెంట్స్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement