సరిహద్దుల్లో టెన్షన్‌.. విధ్వంసక క్షిపణి పరీక్ష చేపట్టిన భారత్‌ | Indian Navy Successfully Conducted Anti Ship Missile Firings In Arabian Sea, Watch Video Inside | Sakshi
Sakshi News home page

సరిహద్దుల్లో టెన్షన్‌.. విధ్వంసక క్షిపణి పరీక్ష చేపట్టిన భారత్‌

Published Sun, Apr 27 2025 1:36 PM | Last Updated on Sun, Apr 27 2025 3:25 PM

India Warships Carry Out Missile Firings In Arabian Sea

ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత సరిహద్దుల్లో పాక్‌ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ కాల్పులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది.

వివరాల ప్రకారం.. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నౌకాదళం సిద్ధమవుతోంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. సముద్ర జలాల్లో ఎప్పుడైనా.. ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు ఇండియన్‌ నేవీ సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు క్షిపణి పరీక్షలకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అయితే, మూడు రోజుల క్రితమే భారత్‌ ఇదే సముద్రంలో మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ (ఎంఆర్‌-ఎస్‌ఏఎం)తో సీ స్కిమ్మింగ్‌ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ సూరత్‌ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. ఈ మేరకు నౌకాదళం వీడియోను విడుదల చేసింది. సీ స్కిమ్మింగ్‌ టార్గెట్‌ను కచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లు వెల్లడించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సీ స్కిమ్మింగ్‌ టార్గెట్‌లుగా పేర్కొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement