indian army
-
రక్షణ దళాలకు, ఉగ్రవాదులకు, మధ్య ఎన్కౌంటర్!
హిరానగర్: జమ్మూ కశ్మీర్‌లోని కతూవా జిల్లాలో భారత్-పాక్ సరిహద్దు ప్రాంతమైన హిరానగర్ సెక్టార్ సన్యాల్ గ్రామంలో ఉగ్రవాదులకు, రక్షణ దళాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. పూంచ్ పోలీసులు కలిసి సంయుక్తంగా చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా భారత రక్షణ దళాల బృందంపై ఉగ్రవాదులు ఆకస్మికంగా కాల్పులు జరపడానికి యత్నించారు. దాంతో రక్షణ దళాలు కూడా అప్రమత్తమై ఎదురుకాల్పులకు దిగింది. కొంతమంది అనుమానితులు ఆ ప్రాంతంలో నిఘా వేసినట్లు సమాచారం అందుకున్న రక్షణ దళాలు.. ఆదివారం సాయంత్రం వేళ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులకు, రక్షణ దళాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.నిన్న భారత ఆర్మీ బలగాలు, పూంచ్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. సురాన్ కోట్ లో ఉగ్రవాదులు మాటు వేశారన్న సమాచారంలో ఈ జాయింట్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన విషయాన్ని పసిగట్టిన ఉగ్రమూకలు.. ఓ అటవీ ప్రాంతంలోకి జారుకున్నారు. అయితే అక్కడ ఉగ్రవాదులకు సంబంధించిన కొన్ని మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ కొనసాగింపులో భాగంగా ఆదివారం నాడు ఉగ్రవాదులు, భారత రక్షణ దళాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్‌కు సంబంధించి ఎవరైనా గాయపడ్డారా, మరణించారా అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. -
ఆర్మీలో నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
లక్డీకాపూల్ (హైదరాబాద్): ఇండియన్ ఆర్మీలో వివిధ కేటగిరీల్లో నియామకం కోసం ఔత్సాహిక అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ , అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మేజర్ పీ.సీ.రాయ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ (క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్), అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్‌కు 10వ తరగతి, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్‌కు 8వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులు తమ అర్హత ఆధారంగా ఏవైనా రెండు కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అలాగే ఐటీఐ, డిప్లొమా, ఎన్సీసీ అర్హత పొందిన అభ్యర్థులకు బోనస్ మార్కులుంటాయని, 13 భాషలలో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఆన్లైన్లో జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు www.joinindianarmy. nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు జూన్‌లో సంబంధిత సైట్ నుంచి అడ్మిట్ కార్డు పొందవచ్చని, అప్డేట్స్, ఈ–మెయిల్ ఐడీని వెబ్సైట్ ద్వారా పరిశీలించుకోవాలని సూచించారు. సలహాలు, సూచనలకు రిక్రూటింగ్ కార్యాలయం సికింద్రాబాద్ 040–27740205 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చని రాయ్ పేర్కొన్నారు. -
అరుదైన మిలిటరీ థ్రిల్లర్!
ఒక సైనిక ప్రధానాధికారి నవల రాయటం అన్నది ప్రతిరోజూ జరిగేది కాదు. నిజానికి, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఈ 77 ఏళ్లలో ఇలా ఒకసారి మాత్రమే సంభవించింది. జనరల్ ముకుంద్ మనోజ్ నరవణే రాసిన పుస్తకాన్ని అరుదైన వాటిలో ఒకటిగా, ప్రత్యేకమైనదిగా చేస్తున్నది ఇదే. నేను ఈ పుస్తకం గురించి రాస్తున్నది కూడా దానికున్న ఈ ప్రత్యేకత కారణంగానే! నరవణే రాసిన ఈ నవల పేరు ‘ద కంటోన్మెంట్ కాన్స్పిరసీ’. టైటిల్ కింద ఉన్న ఉపశీర్షికను బట్టి ఇదొక మిలిటరీ థ్రిల్లర్. ఇది ‘లూ కరే’ (గూఢచారి నవలలకు ప్రసిద్ధి చెందిన స్వర్గీయ బ్రిటిష్ రచయిత డేవిడ్ జాన్ కార్న్వెల్ కలం పేరు) ఒరవడిని కలిగి ఉన్నటువంటిది కాకున్నా... వేగంగా చదివిస్తూ, ముందుకు నడిపించేలా ఉంటుంది. నేనైతే, తెరిచిన పుస్తకం ముగిసే వరకు కూర్చున్న చోటు నుంచి కదల్లేదు. పేజీలు వాటంతటవే తిరిగిపోతున్నట్లుగా అనిపించింది. ఈ కథ, కొత్తగా ఆర్మీలో చేరిన ఇద్దరు యువ అధికారుల చుట్టూ తిరుగుతుంది. ఒకరు లెఫ్ట్‌నెంట్ రోహిత్ వర్మ. ఇంకొకరు లెఫ్ట్‌నెంట్ రేణుకా ఖత్రీ. రోహిత్ మూడో తరం అధికారి. రేణుక పదాతిదళం రెజిమెంట్‌లో నియామకం పొందిన తొలి మహిళ. రోహిత్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తాయి. చాలామంది అతడు దోషి అని భావిస్తుంటారు. రోహిత్, రేణుకలలో రేణుకే అత్యంత శక్తిమంతమైన వ్యక్తిత్వం కల ఆఫీసర్. ఒక్క దుముకుతో రోహిత్ వెనుక అండగా నిలబడి ఈ కథను ముందుకు నడిపిస్తుంది రేణుక పాత్ర. కథాంశంలో ఒక్కో ముడీ విడివడుతున్నప్పుడు రెండు హత్యలు జరుగుతాయి. ఆ హత్యలు చేసిన వ్యక్తి మొదట మీరు అనుమానించిన వ్యక్తి కాదు. ఇంతకుమించి నేను మీకు చెప్పను. అలా చెప్తే కథ తెలిసి పోతుంది. కథా నేపథ్యం భవిష్యత్ కాలం. ఇదంతా కూడా 2026 జూన్ తర్వాత జరుగుతుంది. ఫతేపురిలోని సిఖ్ రైఫిల్స్ రెజిమెంటల్ సెంటర్లో కథ మొదలవుతుంది. రోహిత్, రేణుక ఓరియెంటేషన్ ట్రైనింగ్ కోసం అక్కడ ఉంటారు. కొత్తను పోగొట్టి, దిశా నిర్దేశం చేసే శిక్షణ కార్యక్రమం అది. జనరల్ నరవణే సొంత రెజిమెంట్ కూడా ‘7వ సిఖ్ లైట్ ఇన్ఫాంట్రీ’ కనుక ఆయన స్వీయానుభవాలు, ప్రత్యక్ష పరిశీలన ద్వారా గ్రహించిన విషయాలు ఈ నవల రాసేందుకు తోడ్ప డ్డాయని స్పష్టంగా తెలుస్తోంది. ఏమైనా, థ్రిల్లర్ కథలు రాయటం అంత తేలికేమీ కాదు. మొదట కథాంశం అన్నది ఉండాలి. అది ఆసక్తికరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా – చదువుతున్న కొద్దీ అది మనల్ని లోలోతుల్లోకి లాక్కెళు తుండాలి. తర్వాత ప్రధానమైనది కథన వేగం. అది మనల్ని ముగింపు వైపు పరుగులెత్తించాలి. మహోగ్రమైనదిగా కూడా ఆ ముగింపు ఉండాలి. చివరిగా భాష. అది కుదింపుగా, ఉద్వేగభరి తంగా ఉండాలి. సుదీర్ఘమైన తాత్విక ప్రసంగాల్లా కాకుండా, వాక్యాలు చిన్న చిన్నవిగా ఉండాలి. వీటి ద్వారా ప్రధాన పాత్రలు ఎటువంటి స్వభావం కలిగినవో మనకొక స్పష్టమైన అవగాహనను కలిగించటం అవసరం. ఇక రచయిత ఆ పాత్రల వ్యక్తిత్వాన్ని సూటిగా, పదునుగా శిల్పీకరించాలి. అంతేనా, ఏది తప్పో ఏది ఒప్పో చెప్ప గలిగేలా ఉండాలి. థ్రిల్లర్ పుస్తకాలు సాధారణంగా నీతి కథలుగా ముగుస్తాయి.ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. నిజానికైతే, ఇది మనం ఆర్మీ జనరల్స్ నుంచి ఆశించేది కాదు. ఈ పుస్తకంలోని వివిధ వర్ణాల ఛాయలు, వివరాల్లోని సూక్ష్మత్వం ఆహ్లాదకరమైన అబ్బురపాటును కలిగించేలా ఉన్నాయని నేను చెప్పగలను. నేను ఎంతో మంది ఆర్మీ చీఫ్‌లను కలిశాను కానీ – మీరు నమ్మండి – ఈ విధమైన సాహితీ నైపుణ్యాలను కలిగి ఉన్న ఆర్మీ చీఫ్‌ను నేనెప్పుడూ కలవలేదు. కథలో బ్రిగేడియర్ అశోక్ మీనన్‌ది కేవలం పైపైన పాత్రే అయినప్పటికీ, ఆ రెజిమెంటల్ సెంటర్ కమాండెంట్ ఇంగ్లిషు నన్ను పడేసింది. మీనన్ మాట్లాడేటప్పుడు ‘బ్లింప్’ అనే ఒక ఇంగ్లిష్ కల్నల్ (కార్టూన్ క్యారక్టర్) గుర్తొచ్చారు నాకు. ‘What the deuce?' (ఆశ్చర్యాన్ని, గందరగోళాన్ని లేదా చికాకును వ్యక్తపరిచే యాస), ‘darn’ (డామిట్) వంటి పదాలు ఆయన నోటి నుండి వచ్చేవి. ఆయన ప్రసంగమంతా కూడా ruddy, blighter, bugger అనే పదాల చిలకరింపుతో ఉంటుంది. అవన్నీ తిట్లు. జనరల్ నరవణే ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని స్పష్టంగా తెలుస్తోంది. ఆయన తన పాత్ర మాట్లాడే భాషతో ఆ పాత్రకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సృష్టించారు. కొన్నిసార్లు ఇది నాకు ఆర్థర్ కానన్ డోయల్ (రచయిత), షెర్లాక్ హోమ్స్(కానన్ డోయల్ సృష్టించిన పాత్ర)ను కూడా గుర్తుకు తెచ్చేది. అయితే ఆర్మీ బ్రిగేడియర్లు నిజంగా అలా ఉంటారా? లేదా, అలా ఉండాలని పాఠకులు ఆశిస్తా రని ఈ రచయిత నమ్ముతున్నారా? ఏదైనా సరే, అది పని చేస్తుంది. అయితే, సునిశితమైన శ్రద్ధతో సాగిన పాత్రల చిత్రీకరణ, సైనిక జీవిత స్ఫూర్తి, స్వభావాల సంగ్రహణలతో ఈ థ్రిల్లర్ పుస్తకం దోష రహితంగా ఉన్నప్పటికీ, ఇందులో నాకొక వింత లోపం మార్మికంగా అనిపించింది. బ్రిగేడియర్ మీనన్, రోహిత్‌తో మాట్లాడే సందర్భంలో రచయిత ఇలా రాశారు: ‘‘గోడవైపు చూపిస్తూ ఆయన అంటారు, ‘గురునానక్ చెప్పిన ఆ మాట నీకు తెలుసా? చెడు విజయం సాధించటానికి కావలసిన ఒకే ఒకటి, మంచి మనుషులు ఏమీ చేయకపోవ టమే’’ అని. నాకు తెలిసినంత వరకు ఈ మాటను 18వ శతాబ్దం నాటి బ్రిటిష్ కన్జర్వేటివ్ నాయకుడు ఎడ్మండ్ బర్క్ అన్నారని చెబు తుంటారు. అయితే ఈ మాటను అన్నది బర్క్ కాదు అని ఇటీవలి కాలంలో కొన్ని పండిత వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గురు నానక్ నిజంగా అలా చెప్పారా? చెబితే ఎప్పుడు చెప్పారు? ఎక్కడ చెప్పారు?ఈ చిన్న విషయాన్ని పక్కన పెడితే జనరల్ నరవణే తర్వాతి థ్రిల్లర్ కోసం నేను కుతూహలంతో వేచి చూస్తున్నాను. ఈ పుస్తకానికి మంచి ఆదరణ లభిస్తే, హత్యల గురించి లెఫ్ట్‌నెంట్ రేణుకా ఖత్రి చెప్పే రహస్యాలు వరుసగా వెలువడతాయని ఆయన నాతో అన్నారు. ఎవరికి తెలుసు? ఆమె మన సొంత ‘మిస్ మార్పుల్’ (ఆంగ్ల రచ యిత్రి అగాథా క్రిస్టీ డిటెక్టివ్ నవలల్లోని కల్పిత పాత్ర) కావచ్చు. అలా జరిగితే కనుక జనరల్ నరవణే కొత్త అగాథా క్రిస్టీ అవుతారు!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఉత్తరాఖండ్: 46 మంది సేఫ్.. నలుగురి మృతి.. ఐదుగురు మిస్సింగ్
డెహ్రాడూన్: మంచు చరియలు విరిగిపడిన(Uttarakhand avalanche) ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందినట్లు భారత సైన్యం శనివారం ప్రకటించింది. రెండో రోజు సహాయక చర్యల్లో 17 మందిని రక్షించినట్లు.. మిగిలిన మరో ఐదుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.ఛమోలి జిల్లాలో శుక్రవారం వేకువజామున బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ క్యాంప్ వద్ద భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 55 మంది బీఆర్వో కార్మికులు చిక్కుకుపోగా.. భారత సైన్యం(Indian Army) రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. మంచు వర్షంతో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే నిన్న 33 మందిని.. ఇవాళ మరో 17 మందిని భారత సైన్యం రక్షించింది. వీళ్లలో తీవ్రంగా గాయపడిన వాళ్లను జోషిమఠ్‌లోని ఆస్పత్రులకు హెలికాఫ్టర్ల ద్వారా తరలించింది. చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందినట్లు తెలిపింది.ఇండో-టిబెటన్ సరిహద్దు గ్రామమైన మనాలో.. సైన్యం కదలికల కోసం రోడ్ల నుంచి మంచును తొలగించే పనుల్లో బీఆర్వో బృందం తలమునకలైంది. ఈ క్రమంలో.. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంచు కొండలు విరిగిపడ్డాయి. ఎనిమిది కంటైనర్లతో పాటు ఒక షెడ్డూలో వాళ్లను మంచు చరియలు కప్పేశాయి. ఒకవైపు వర్షం.. మరోవైపు అడుగుల మేరలో పేరుకుపోయిన మంచులో మరికొన్ని ఏజెన్సీల సాయంతో సైన్యం సహాయక చర్యలు కొనసాగించింది. వీళ్లలో కొందరు ఉత్తరాఖండ్(Uttarakhand) నుంచి ఉండగా, చాలామంది బీహార్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జమ్ము కశ్మీర్, ఇతర రాష్ట్రాలకు చెందినవాళ్లు ఉన్నారు.సహాయక చర్యలపై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి సమీక్ష జరుపుతున్నారు. ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నామని అన్నారాయన. -
మళ్లీ పాక్ సరిహద్దు ఉల్లంఘన.. బుద్ధి చెప్పిన భారత్
జమ్మూ: భారత్ విషయంలో పాక్ తన వైఖరిని మార్చుకోవడంలేదు. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా కాల్పులకు తెగబడిన పాక్‌కు భారత్ తగిన సమాధానం చెప్పింది. ఈ ఘటనలో పలువురు పాకిస్తాన్ సైనికులు మరణించారని భారత భద్రతా అధికారులు తెలిపారు.ఈ ఉదంతంలో పాకిస్తాన్‌కు ఎంతంటి ప్రాణనష్టం జరిగిందో తెలియకపోయినా, శత్రు దళాలు భారీ నష్టాలను చవిచూశాయని అధికారులు పేర్కొన్నారు. జమ్మూ జిల్లాలోని అఖ్నూర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ సమీపంలో అనుమానిత ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ పేలుడులో కెప్టెన్‌తో సహా ఇద్దరు భారత ఆర్మీ సిబ్బంది మరణించారు. ఇది జరిగిన ఒక రోజు తర్వాత కృష్ణ ఘాటి సెక్టార్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిదని అధికారులు తెలిపారు.2021, ఫిబ్రవరి 25న భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించినప్పటి నుండి ఎల్ఓసీ వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘన సంఘటనలు తక్కువగా నమోదయ్యాయి. అయితే తాజాగా తార్కుండి సెక్టార్‌లోని ఫార్వర్డ్ పోస్ట్‌పై పాకిస్తాన్ దళాలు ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా కాల్పులు జరిపి, కాల్పుల విరమణను ఉల్లంఘించాయని, దీనికి భారత సైన్యం తగిన సమాధానం చెప్పిందని అధికారులు పేర్కొన్నారు. కాగా గత వారం రోజులుగా సరిహద్దు వెంబడి శత్రుదేశపు కార్యకలాపాలు పెరిగాయి. దీంతో ఎల్ఓసీ వెంబడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.ఇది కూడా చదవండి: పెళ్లి వేడుకల్లోకి చిరుత.. బంధించే పనిలో అటవీ సిబ్బంది -
రూ.230 కోట్ల డ్రోన్ కాంట్రాక్టులు రద్దు
న్యూఢిల్లీ: దేశీయ డ్రోన్ల తయారీదారులకు భారత సైన్యం షాక్ ఇచ్చింది. రూ.230 కోట్ల విలువైన డ్రోన్ల కొనుగోలు కాంట్రాక్టులను రద్దు చేసింది. ఆయా డ్రోన్లలో చైనా విడిభాగాలు ఉన్నట్లు తేలడమే ఇందుకు కారణం. తూర్పు లద్ధాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట మోహరించడానికి 400 డ్రోన్లు కొనుగోలు చేయాలని భారత సైన్యం తొలుత నిర్ణయించింది. ఇందులో 200 మీడియం–అల్టిట్యూడ్ డ్రోన్లు, 100 హెవీవెయిట్ డ్రోన్లు, 100 లైట్‌వెయిట్ డ్రోన్లు ఉన్నాయి. సైన్యానికి డ్రోన్లు సరఫరా చేయడానికి పలు కంపెనీలు ముందుకొచ్చాయి. ఒప్పందాలు సైతం కుదుర్చుకున్నాయి. అయితే, చైనాలో తయారైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను ఈ డ్రోన్ల తయారీలో ఉపయోగిస్తున్నట్లు వెల్లడయ్యింది. ఇలాంటి వాటితో దేశ భద్రతకు, సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండడంతో ఆయా కాంట్రాక్టులకు రద్దు చేస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. అయితే, దేశ భద్రతకు సంబంధించిన పరికరాల్లో చైనా విడిభాగాలు అమర్చడం ఇదే మొదటిసారికాదు. గతంలోనూ ఇలాంటి ఉదంతాలు బహిర్గతమయ్యాయి. మన రక్షణ వ్యవస్థలో చైనా హార్డ్‌వేర్ గానీ, సాఫ్ట్వేర్ గానీ ఉపయోగించడానికి వీల్లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలటరీ ఇంటెలిజెన్స్(డీజీఎంఐ) గతంలో రెండుసార్లు హెచ్చరికలు జారీ చేసింది. చైనా తప్ప ఇతర దేశాల విడిభాగాలను డ్రోన్లలో ఉపయోగించేందుకు అనుమతి ఉందని అధికారులు అంటున్నారు. -
జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్కౌంటర్..ఏడుగురు ఉగ్రవాదులు హతం
పూంచ్:జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు(ఎల్వోసీ) వద్ద ఇటీవల భారీ ఎన్కౌంటర్ జరిగింది. పూంచ్ జిల్లాలోని క్రిష్ణఘాటి సెక్టార్లో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు చొరబాటుదారులు హతమయ్యారు. మృతి చెందిన వారిలో ముగ్గురు దాకా పాకిస్తాన్ ఆర్మీ జవాన్లే కావడం గమనార్హం.పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ సభ్యులు ఫిబ్రవరి 4 అర్ధరాత్రి సరిహద్దు ద్వారా భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వీరిని అడ్డుకోవడానికి సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఏడుగురు చొరబాటుదారులు మృతి చెందారు. ఫిబ్రవరి5వ తేదీని కాశ్మీర్ లిబరేషన్ డేగా పాకిస్తాన్ జరుపుకుంది. ఈ నేపథ్యంలో అదే రోజు పాక్ ఆర్మీకి చెందిన జవాన్లు భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించడం పట్ల సైన్యం అప్రమత్తమై వారి ప్రయత్నాన్ని అడ్డుకుంది.ఇటీవల జమ్ముకశ్మీర్‌లో వరుస ఘటనల్లో పలువురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఈ ఎన్కౌంటర్లలో పలువురు జవాన్లు కూడా గాయపడ్డారు. డిసెంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతమైన విషయం తెలిసిందే. -
మధ్యప్రదేశ్‌లో కూలిన యుద్ధ విమానం
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపురి సమీపంలో వైమానిక దళానికి చెందిన ట్విన్ సీటర్ మిరాజ్ 2000 యుద్ధ విమానం కూలిపోయింది. నివాస ప్రాంతాల్లో కూలకపోవడంతో పెనుప్రమాదమే తప్పింది. ట్విన్ సీటర్ మిరాజ్ 2000లో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలెట్లు సురక్షితంగా ప్రాణాలతో భయటపడ్డారు. A twin-seater Mirage 2000 fighter aircraft today crashed near Shivpuri in Madhya Pradesh while it was on a routine training sortie. A Court of Inquiry is being ordered to ascertain the cause of the crash. More details are awaited: Defence officials pic.twitter.com/I1mMYpN6gj— ANI (@ANI) February 6, 2025 -
పర్యాటక ప్రాంతాలుగా యుద్దభూములు
-
Nag Mark 2: ఆర్మీ అమ్ములపొదిలోకి నాగ్ మార్క్-2
న్యూఢిల్లీ: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించుకున్న ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి నాగ్ మార్క్-2(Nag MK-2) పరీక్ష విజయవంతమైంది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్లో సోమవారం పరీక్షను నిర్వహించారు. అత్యంత కచ్చితమైన లక్ష్యాలను ఇది చేధించడంలో విజయవంతమైందని భారత రక్షణ పరిశోధన సంస్థ(DRDO) ప్రకటించింది.ఇది మూడోతరం(Third Generation) ‘ఫైర్ అండ్ ఫొర్గెట్’ క్షిపణి. లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. అలాగే.. లక్ష్యాలను చేధించడంలో క్షిపణి కనిష్ఠ, గరిష్ఠ పరిధి నిర్ధారణ అయింది. మొత్తం మూడుసార్లు ఇది విజయవంతంగా లక్ష్యాన్ని తాకిందని అధికారులు తెలిపారు. నాగ్ క్షిపణికి సంబంధించిన క్యారియర్ వెర్షన్(NAMICA) -2ని కూడా పరీక్షించినట్లు తెలిపారు. ‘‘ఈ పరీక్షలతో నాగ్ ఆయుధ వ్యవస్థ మొత్తం.. భారత సైన్యం(Indian Army)లో ప్రవేశించేందుకు సిద్ధమైంది’’ అని రక్షణ మంత్రిత్వశాఖ ఒక అధికార ప్రకటనలో పేర్కొంది. -
రక్షణ రంగంలో రావాల్సిన మార్పులు
⇒ కీలకమైన ఆయుధ, సమాచార వ్యవస్థలు, టెక్నాలజీల కోసం విదేశాలపై ఆధారపడటం వీలైనంత తగ్గించుకోవాలి.⇒ యుద్ధ ట్యాంక్, యుద్ధ విమానం, జలాంతర్గాముల విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. వ్యక్తిగత ఆయుధాల కోసం కూడా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. అగ్ని–5 వంటి క్షిపణులను సమర్థంగా ఉత్పత్తి చేయగల దేశానికి ఇదే మంత అనుకూలమైన అంశం కాదు.⇒ స్థూల జాతీయోత్పత్తిలో ‘ఆర్ అండ్ డీ’కి భారత్ వెచ్చిస్తున్న మొత్తం కేవలం 0.65 శాతమే. అమెరికా 2.83 శాతం, ఫ్రాన్స్ 2.19 శాతం, చైనా 2.14 శాతం, దక్షిణ కొరియా 4.8 శాతం ఖర్చు చేస్తున్నాయి. ఏ దేశమైనా భద్రంగా ఉండాలన్నా, సార్వభౌమత్వానికి సవాళ్లు ఎదురు కాకూడ దన్నా పటిష్టమైన మిలిటరీ, రక్షణ వ్యవస్థలు అత్యవసరం. 2014లో ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి నరేంద్ర మోదీ ఈ అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. అయితే భారత మిలిటరీ, రక్షణ వ్యవస్థలను సంపూర్ణంగా అర్థం చేసుకోవడంతోపాటు సమీక్షించి అవసరమైన సంస్కరణలు చేపట్టాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉన్నది. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ అంశాన్ని తరచూ మిలిటరీ పెద్దల వద్ద ప్రస్తావిస్తూండేవారు. దురదృష్టవశాత్తూ ఈ వ్యవస్థ సంస్కరణ పథం పట్టేందుకు ఇప్పటికీ నిరాకరిస్తోంది. నరేంద్ర మోదీ రెండో దఫా ప్రధానిగా ఎన్నికైన తరువాత ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్’ పదవిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రక్షణ రంగ సంస్కరణలనే భారీ ప్రయత్నానికి ఇది చిన్న ముందడుగు మాత్రమే. చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి.రక్షణ శాఖ ఆధ్వర్యంలోని మిలిటరీ వ్యవస్థ బహుముఖమైనది.ఎన్నో భాగాలు, విభాగాలు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల వంటివి బిట్రిష్ కాలం నాటివి. అన్నీ వేటికవే ప్రత్యేకమన్నట్టుగా పనిచేస్తున్నాయి. మార్పును సుతరామూ ఇష్టపడటం లేదు. అయితే ఈ లక్షణం భారతీయులది కాకపోవడం కాకతాళీయమే. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మిలిటరీలు పాతకాలపు మూస ధోరణుల్లోనే కొట్టుకు పోతున్నాయి. భారత మిలిటరీ కూడా ఇలాంటి వ్యవస్థాగతమైన లక్షణాన్నే వ్యక్తం చేస్తోంది.లేని యుద్ధ సన్నద్ధతఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 2025 సంవత్సరాన్ని మిలిటరీ సంస్కరణలను ప్రధాన లక్ష్యంగా ఎంచుకోవడం, ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పాలి. ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్’ (డీఆర్డీవో) 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని ఉద్దేశాలను బహిరంగ పరిచారు. సంస్కరణల లక్ష్యాల సాధనలో డీఆర్డీవో కీలక భూమిక ఏమిటన్నది కూడా రక్షణ మంత్రి ఆ సమావేశంలో వివరించారు. మిలిటరీ సంస్కరణల గురించి స్థూలంగా చెప్పాలంటే... దేశ రక్షణకు వ్యూహాత్మకంగా, సాంకేతిక పరిజ్ఞానాల విషయంలో, భౌగోళిక, రాజకీయ అనివార్యతలకు తగ్గట్టుగా యుద్ధ సన్నద్ధతను సంపా దించుకోవడం ఒకటి. కీలకమైన ఆయుధ, సమాచార వ్యవస్థలు, టెక్నాలజీల కోసం విదేశాలపై ఆధారపడటం వీలైనంత తగ్గించడం రెండోది. ఈ రెండు లక్ష్యాలను సాధించాలంటే డీఆర్డీవోతో పాటు దేశంలోని శాస్త్ర, తయారీ రంగాలు ప్రధానమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది.శాస్త్రవేత్తలు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలనీ, తమ సామ ర్థ్యాలను పెంచుకోవాలనీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘ప్రపంచంలోనే అగ్రగామి పరిశోధన, అభివృద్ధి సంస్థగా డీఆర్డీవో ఎదగాలి’ అని ఆకాంక్షించారు. డీఆర్డీవో కీర్తి కిరీటంలో కొత్తగా చేరిన కలికితురాయి దీర్ఘశ్రేణి ‘హైపర్ సానిక్ యాంటీ–షిప్’ క్షిపణి డిజైన్ బృందం కృషిని రక్షణ మంత్రి అభినందించారు కూడా. అయితే భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి విషయాల్లో వ్యవస్థాగతమైన పరిమితులు కొన్ని పట్టిపీడిస్తున్నాయన్నది కఠోర సత్యం. వీటిని పరిష్కరించకుండా సంస్కరణల లక్ష్యం సాధించడం అసాధ్యం. ‘ఆర్ అండ్ డీ’ విషయంలో భారత్ ప్రపంచ అగ్రగామి దేశాల జాబితాలో లేదు. రక్షణ రంగంలో పెట్టుబడులు, ఉత్పాదకతలు కూడా దశాబ్దాలుగా ఓ మోస్తరుగా మాత్రమే ఉన్నాయి. అప్పుడప్పుడు అక్కడక్కడ ఒకట్రెండు మినహాయింపులు కనిపిస్తాయి అంతే. కేటాయింపులు పెరిగేనా?గత ఏడాది సెప్టెంబరులో డీఆర్డీవో చైర్మన్ సమీర్ వి.కామత్ మాట్లాడుతూ, ‘ఆర్ అండ్ డీ’కి వెచ్చిస్తున్న మొత్తం భారత స్థూల జాతీయోత్పత్తిలో కేవలం 0.65 శాతం మాత్రమే ఉన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఈ రంగంపై అమెరికా 2.83 శాతం, ఫ్రాన్స్ 2.19 శాతం, చైనా 2.14 శాతం, దక్షిణ కొరియా 4.8 శాతం ఖర్చు చేస్తున్నాయని కూడా ఆయన గుర్తు చేశారు. భారత్ కేటాయిస్తున్న నిధులు చాలా తక్కువన్న విషయం ప్రభుత్వానికి కూడా తెలుసుననీ, మోదీ హయాంలోనైనా ఈ మొత్తం జాతీయోత్పత్తిలో ఒక శాతానికి చేరుకోవాలనీ ఆశిస్తున్నట్లు సమీర్ కామత్ తెలిపారు. 2035 నాటికి రెండు శాతానికి చేరడం అభిలషణీయమని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఈ ఆశలు నెరవేరే సూచనలేవీ లేవు. రక్షణ రంగం మొత్తానికి కేటాయిస్తున్న నిధులే స్థూల జాతీయోత్పత్తిలో రెండు శాతానికి దగ్గరగా ఉన్న పరిస్థితుల్లో భారీ రాజకీయ జోక్యంతో గానీ ‘ఆర్ అండ్ డీ’కి ఒక శాతం కేటాయింపులు సాధ్యం కావు. ఇక డీఆర్డీవో, రక్షణ మిలటరీ వ్యవస్థలు ఎదుర్కొంటున్న సమస్య విదేశీ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక ప్రకారం, 2012–13 నుంచి 2021–22 మధ్యకాలంలో మిలిటరీ, రక్షణ రంగాల మూలధన వ్యయం విదేశీ మారక ద్రవ్యంలో 35 శాతం వరకూ ఉందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది. ఒకానొక దశలో ఇది 49 శాతానికి కూడా చేరు కున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. వ్యూహాత్మక విషయాల్లో స్వతంత్రంగా ఉండాలన్న దేశ ఆకాంక్షలకు ఇది భిన్నం.డీఆర్డీవో, ఇతర రక్షణ రంగ సంస్థలు మొదలై సుమారు ఏడు దశాబ్దాలు అవుతోంది. అణ్వాయుధాలు, క్షిపణులు, అణు చోదక వ్యవస్థల విషయంలో ప్రశంసార్హమైన ప్రగతి సాధించాము. ఇందులో ముప్ఫై ఏళ్లు అగ్రరాజ్యం అమెరికా ఎన్నో ఆంక్షలున్న సంగతి తెలిసిందే. అయితే యుద్ధ ట్యాంక్, యుద్ధ విమానం, జలాంతర్గాముల విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. డీఆర్డీవో, ప్రభుత్వ రంగ సంస్థలు రెండూ దేశ యుద్ధ సన్నద్ధతను గణనీయంగా పెంచిందీ లేదు. సొంత డిజైన్లు లేవు!ప్రస్తుత ప్రభుత్వం దృష్టి ప్రధానంగా ప్రైవేట్ రంగం, విద్యాసంస్థల సహకారంపై ఉంది. ఆహ్వానించ దగ్గదే. కానీ ఈ సహకారానికి సంబంధించి పద్ధతులు, సమయావధులు నిర్ణయం కావాల్సి ఉంది. భారత్‌కు ఉన్న ఇంకో బలహీనత ఏమిటంటే... గణనీయమైన జీడీపీ, నైపుణ్యం, విద్యార్హతలున్న మానవ వనరులు, ఉన్నత విద్యాసంస్థలు ఎన్ని ఉన్నా... మిలిటరీ పరికరాలకు సంబంధించి సొంత డిజైన్ లేకపోవడం! 1960లలో ఐషాపోర్ రైఫిల్, హెచ్ఎఫ్–24 మారుత్ యుద్ధ విమానాలు కొంతమేరకు మాత్రమే విజయం సాధించాయన్నది గుర్తుపెట్టుకోవాలి. ఫలితంగా ఇప్పటికీ మనం వ్యక్తిగత ఆయుధాల కోసం కూడా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. అగ్ని–5 వంటి క్షిపణులను సమర్థంగా ఉత్పత్తి చేయగల భారత్ లాంటి దేశానికి ఇదేమంత అనుకూలమైన అంశం కాదు. డీఆర్డీవో విషయాన్నే ప్రత్యేకంగా పరిశీలిస్తే... సంస్కరణలను ఆహ్వానిస్తూనే తన సొంత శక్తి సామర్థ్యాలపై లోతైన సమీక్ష చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాలి. స్వతంత్ర నిపుణుల ఆధ్వర్యంలో ఇలాంటి అధ్యయనం ఒకటి జరిపి ఫలితాల ఆధారంగా భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందించుకోవడం అవసరం. లేదంటే సంస్కరణల ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిపోయే ప్రమాదం ఉంది. సి. ఉదయ్ భాస్కర్ వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
గోల్కొండ కోటలో ఇండియన్ ఆర్మీ ‘నో యువర్ ఆర్మీ’ మేళా (ఫొటోలు)
-
జమ్మూకశ్మీర్‌లో 60 శాతం పాక్ టెర్రరిస్ట్‌లు హతం
ఢిల్లీ : భారత ఆర్మీ జవాన్లు ప్రాణాలకు తెగించి ఇప్పటి వరకు జమ్మూకశ్మీర్‌లో సుమారు 60 శాతం పాకిస్తాన్ తీవ్ర వాదుల్ని హత మార్చినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటి ప్రతి ఐదురోజులకు ఒక టెర్రరిస్ట్‌ను, మొత్తంగా 75 మంది టెర్రరిస్ట్‌లను మట్టుబెట్టామని తెలిపారు. వారిలో అధిక శాతం(60) పాక్ ముష్కరులు ఉన్నట్లు నిర్ధారించారు.ఆర్మీ అధికారుల నివేదిక ప్రకారం.. జమ్మూ ప్రాంతంలోని ఐదు జిల్లాలు-జమ్మూ, ఉధంపూర్, కథువా, దోడా, రాజౌరిలో మరణించిన 42 మందిలో స్థానికేతర ఉగ్రవాదులు ఎక్కువ మంది ఉన్నారని డేటా వెలుగులోకి వచ్చింది. స్థానికేతర కశ్మీర్ లోయలోని బారాముల్లా, బందిపొరా, కుప్వారా, కుల్గాం జిల్లాల్లో విదేశీ ఉగ్రవాదులను మట్టుబెట్టారు.జమ్మూ కశ్మీర్‌లోని తొమ్మిది జిల్లాలలో బారాముల్లాలో అత్యధికంగా తొమ్మిది ఎన్కౌంటర్లలో 14 మంది స్థానికేతర ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలో అత్యధికంగా ఉరీ సెక్టార్‌లోని సబురా నాలా ప్రాంతం, మెయిన్ ఉరి సెక్టార్, కమల్‌కోట్ ఉరి నియంత్రణ రేఖ వెంబడి, చక్ తప్పర్ క్రిరి, నౌపోరా, హడిపొర, సాగిపోరా, వాటర్‌గామ్, రాజ్‌పూర్‌లోని లోతట్టు ప్రాంతాలలో ఆర్మీ జవాన్లు హతమార్చారు. నియంత్రణ రేఖ (Line of Control (LoC),ఇంటర్నేషనల్ బోర్డర్ (ఐబీ)17 మంది, జమ్మూకశ్మీర్ అంతర్గత ప్రాంతాల్లో 26 మందిని భారత ఆర్మీ అదుపులోకి తీసుకుంది. అదే సమయంలో తీవ్రవాద కార్యకలాపాలు పెరగకుండా భద్రత బలగాలు ప్రముఖ పాత్ర పోషించాయి. జమ్మూ కశ్మీర్లో పనిచేస్తున్న స్థానిక ఉగ్రవాదుల ఉనికి గణనీయంగా తగ్గుముఖం పట్టిందని, ప్రధానంగా పాకిస్తానీ ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో చురుకుగా ఉన్నారని సంఖ్యలు సూచిస్తున్నాయి. స్థానిక ఉగ్రవాద సంస్థ దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని ఓ అధికారి తెలిపారు. 2024లో జమ్మూ కాశ్మీర్లో 60 ఉగ్రదాడి ఘటనల్లో 32 మంది పౌరులు, 26 మంది భద్రతా దళాల సిబ్బందితో సహా మొత్తం 122 మంది చనిపోయారు. -
మానవ తప్పిదమే.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణానికి కారణం
ఢిల్లీ : మానవ తప్పిదం వల్లే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ డిసెంబర్ 8, 2021న ఎంఐ-17 హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్రువీకరించింది. ఈ మేరకు ప్రమాదానికి సంబంధించిన రిపోర్టును రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ మంగళవారం లోక్‌సభ ముందుంచింది. 2017 - 2022 వరకు 'పదమూడవ డిఫెన్స్ పీరియడ్ ప్లాన్' పేరిట రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో 2017-2022 వరకు మొత్తం భారత వైమానిక దళానికి సంబంధించి మొత్తం 34 ప్రమాదాలు చోటు చేసుకున్నాయని పేర్కొంది.The Indian Air Force has officially attributed the tragic crash of the Mi-17 V5 helicopter, which resulted in the untimely demise of CDS General Bipin Rawat and other esteemed personnel, to human error by the flying crew. This conclusion raises critical questions about the… pic.twitter.com/lFNZs29uls— Aviator Amarnath Kumar (@aviatoramarnath) December 19, 2024 వాటిల్లో అప్పటి సీడీఎస్ బిపిన్ రావత్ తమిళనాడులోని కున్నూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం కూడా ఉందని వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు భార్య మధులిక, మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ సందర్భంగా బిపిన్ రావత్ ప్రమాదానికి కారణం మానవ తప్పిదేమేనని స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసింది. డిసెంబరు 8, 2021న తమిళనాడులోని సూలూర్ ఎయిర్‌బేస్ నుంచి బయల్దేరిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు ఆ రోజు ఉదయం రావత్ దంపతులు, ఆర్మీ అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తమిళనాడు బయలుదేరారు.అయితే మార్గం మధ్యలో హెలికాప్టర్ లోయ ప్రాంతంలోకి వెళ్లిన తర్వాత వాతావరణంలో హఠాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో అయోమయంలో పడిన పైలట్ హెలికాప్టర్‌ను మేఘాల్లోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే అది కూలిపోయింది. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డులను విశ్లేషించిన తర్వాత ప్రమాదానికి గల కారణంపై ఓ అంచనాకు వచ్చాము’ అని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. -
సరిహద్దుల్లో బంగ్లా డ్రోన్లు
న్యూఢిల్లీ: భారత్‌తో సరిహద్దుల్లో బంగ్లాదేశ్ డ్రోన్లను మోహరించింది. టర్కీలో తయారైన అధునాతన బేరక్తార్ టిబి2 డ్రోన్లను పశ్చిమబెంగాల్లోని సరిహద్దుల్లో బంగ్లాదేశ్ మోహరించింది. దాంతో భారత్ అప్రమత్తమైంది. షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత సరిహద్దుల్లో తీవ్రవాద కార్యకలాపాలు ఉధృతమయ్యాయనే వార్తల నేపథ్యంలో భారత్ నిఘాను మరింత పెంచింది. బేరక్తార్ టిబి2 డ్రోన్ల మోహరింపునకు సంబంధించి భారత ఆర్మీ వాస్తవాలను బేరీజు వేస్తోంది. బంగ్లాదేశ్ ఇంటలిజెన్స్, సర్వైలెన్స్ 67 విభాగం ఈ డ్రోన్లను పర్యవేక్షిస్తోంది. రక్షణ చర్యల్లో భాగంగా ఈ డ్రోన్లను రంగంలోకి దింపామని బంగ్లా చెబుతున్నా పశ్చిమబెంగాల్‌తో వ్యూహాత్మకమైన సరిహద్దు ప్రదేశాల్లో వీటిని మోహరించడంపై భారత్ అప్రమత్తమైంది. హసీనా ప్రభుత్వ పతనం తర్వాత సరిహద్దుల్లో తీవ్రవాద కార్యకలాపాలు ఊపందుకున్నాయని, చొరబాటు ప్రయత్నాలు పెరిగాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. -
జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్: ఆర్మీ అధికారి మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో భారత ఆర్మీ ప్రత్యేక దళాలకు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) మరణించగా, మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఆదివారం ఉగ్రవాదులు, ఆర్మీ బలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన సైనికుడిని నాయబ్ సుబేదార్ రాకేష్ కుమార్‌గా అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని భారత ఆర్మీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.‘‘జనరల్ ఆఫీసర్ కమాండింగ్ వైట్ నైట్ కార్ప్స్ , అన్ని ర్యాంక్‌లకు చెందిన అధికారులమంతా నయాబ్ సుబేదార్ రాకేష్ కుమార త్యాగానికి సెల్యూట్ చేస్తున్నాం. భార్త్ రిడ్జ్ కిష్త్వార్ సాధారణ ప్రాంతంలో ప్రారంభించబడిన ఉమ్మడి కౌంటర్ ఎదురుకాల్పుల ఆపరేషన్‌లో భాగమై వీరమరణం పొందారు. ఈ దుఃఖ సమయంలో మేం మరణించిన కుటుంబానికి అండగా ఉంటాం’’ అని పేర్కొంది. #GeneralUpendraDwivedi #COAS and All Ranks of #IndianArmy salute the supreme sacrifice of #Braveheart Nb Sub Rakesh Kumar who laid down his life in the line of duty in J&K. #IndianArmy offers deepest condolences and stands firm with the bereaved family in this hour of grief. https://t.co/bJRZY7w8d3— ADG PI - INDIAN ARMY (@adgpi) November 10, 2024గ్రామ రక్షణ గార్డులు నజీర్ అహ్మద్ , కుల్దీప్ కుమార్ల బుల్లెట్‌తో కూడిన మృతదేహాలు కనిపించిన ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో నిన్న భారత సైన్యం, జమ్ము కశ్మీర్ పోలీసుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. డిఫెన్స్ గార్డులను ఉగ్రవాదులు అపహరించి హతమార్చిన తర్వాత గురువారం సాయంత్రం కుంట్వారా, కేష్వాన్ అడవుల్లో ఆర్మీ బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.చదవండి: జార్ఖండ్‌లో అవినీతిపరులను బీజేపీ విడిచిపెట్టదు: ప్రధాని మోదీ -
ఆర్మీచేతికి స్వదేశీ అస్మీ మెషీన్ పిస్టల్స్
జమ్మూ: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ‘అస్మీ’మెషీన్ పిస్టళ్లు భారత సైన్యం చేతికొచ్చాయి. ‘‘దేశ ఆత్మనిర్భరత కార్యక్రమానికి మరింత ఊతమిస్తూ 100 శాతం భారత్ తయారీ ఆయుధాన్ని ఇండియన్ ఆర్మీ తమ అమ్ములపొదిలోకి తీసుకుంది’’అని డిఫెన్స్ జమ్మూ విభాగం ప్రజావ్యవహారాల శాఖ మంగళవారం ‘ఎక్స్’లో ట్వీట్‌చేసింది. ఇండియన్ ఆర్మీ కల్నల్ ప్రసాద్ బన్సూద్తో కలిసి సంయుక్తంగా రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) ఈ పిస్టల్‌ను అభివృద్ధిచేసింది. ఈ పిస్టళ్లను హైదరాబాద్‌లోని లోకేశ్ మెషీన్స్ కర్మాగారంలో తయారుచేశారు. దీంతో కీలకమైన రక్షణ సాంకేతికలో భారత్ మరింత స్వావలంభన సాధించింది. అత్యంత చిన్నగా, తేలిగ్గా ఉండటం అస్మీ పిస్టల్ ప్రత్యేకత. శత్రువుతో అత్యంత సమీపం నుంచి పోరాడాల్సి వచ్చినపుడు వేగంగా స్పందించేందుకు ఈ పిస్టల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణ పిస్టల్గా, సబ్ మెషీన్గన్గా రెండు రకాలుగా వాడుకోవచ్చు. స్వల్ప, మధ్య శ్రేణి దూరాల్లోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో షూట్ చేయొచ్చు. అత్యంత వేడి, చలి వాతావరణంలోనూ ఏమాత్రం మొరాయించకుండా పనిచేస్తాయి. 8 అంగుళాల బ్యారెల్‌కు 33 తూటాల మేగజైన్‌ను అమర్చవచ్చు. 9ఎంఎం బుల్లెట్‌ను దీనిలో వాడతారు. తొలి దఫా 550 పిస్టళ్లను నార్తర్న్ కమాండ్ పరిధిలోని జమ్మూకశీ్మర్, లద్దాఖ్ సరిహద్దులవెంట పహారా కాసే భారత సైన్యంలోని ప్రత్యేక బలగాలకు అందజేశారు. వీటి తయారీ ఆర్డర్‌ను లోకేశ్ మెషీన్స్ సంస్థకు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇచ్చారు. -
వీడియో: చరిత్రలో మొదటిరోజు.. దీపావళి వేడుకల్లో భారత్, చైనా బలగాలు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ వేళ ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. అటు, భారత సరిహద్దుల్లో కూడా పండుగ వాతావరణం నెలకొంది. దీపావళి సందర్బంగా భారత్-చైనా బలగాలు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట పలుచోట్ల స్వీట్స్ పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇటీవల రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్బంగా భారత్, చైనా దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో ఎల్ఏసీ వెంట సరిహద్దుల్లో భారత్, చైనాలు తమ బలగాలను పూర్తిగా ఉపసహంరించుకున్నాయి. అంతేకాకుండగా.. తూర్పు లడఖ్‌లోని దెప్పాంగ్, దేమ్‌చుక్ ప్రాంతాల నుంచి సైన్యాల ఉపసంహరణ పూర్తయ్యిందని, త్వరలోనే పెట్రోలింగ్ ప్రారంభిస్తామని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎల్ఏసీ వద్ద ఒప్పందం అమలు వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోంది. భవిష్యత్తులో కూడా చర్చలు కొనసాగుతాయని సైనిక వర్గాలు వెల్లడించాయి.మరోవైపు.. నేడు దీపావళి పండుగ సందర్భంగా భారత్, చైనాకు చెందిన సైనికులు స్వీట్లను ఇచ్చిపుచ్చుకున్నారు. లఢఖ్ సెక్టార్‌లోని కోంగ్లా ప్రదేశంలో ఎల్ఏసీ వెంట రెండు దేశాలకు చెందిన సైనికులు కలుసుకోవడం విశేషం. ఈ సందర్బంగా సైనికులు ఆనందం వ్యక్తం చేశారు.Soldiers of the Indian and Chinese Army exchange sweets at KongkLa in Ladkah Sector on the occasion of #Diwali. (Source: Indian Army) pic.twitter.com/KKEJpEHgPo— ANI (@ANI) October 31, 2024 Just in: Indian, Chinese PLA troops exchange Diwali sweets in at least five border points along LAC in Ladakh; MoD statement says this marks a “new era of cooperation”.- Karakoram Pass, - Daulat Beg Oldie - Chushul-Moldo Meeting Point- Kongka La- Hot Springs pic.twitter.com/mepbzoFetG— Dhairya Maheshwari (@dhairyam14) October 31, 2024 -
ఉగ్రవాదుల చొరబాటు కట్టడికి అప్రమత్తంగా ఉన్నాం: ఆర్మీ
శ్రీనగర్: జమ్ము ప్రాంతంలోకి సరిహద్దు వెంబడి దాదాపు 50 మందికి పైగా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని భారత ఆర్మీ అంచనా వేస్తోంది. ఉగ్రవాదుల చొరబాటు కట్టడి విషయంలో ఆర్మీ బలగాలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయని తెలిపింది. ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేస్తామని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అఖ్నూర్ సెక్టార్లో ముగ్గురు ఉగ్రవాదులను విజయవంతంగా అంతం చేసిన అనంతరం 10వ పదాతిదళ విభాగానికి చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ సమీర్ శ్రీవాస్తవ విలేఖరులతో మాట్లాడారు. ‘‘పౌరులకు హాని కలిగించే ఉగ్రవాదుల ప్రయత్నాలను ఆర్మీ అడ్డుకుంటుంది. మంగళవారం ఉదయం అఖ్నూర్ సెక్టార్‌లోని ఒక గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. నియంత్రణ రేఖ (ఎల్ఓసి) సమీపంలో 27 గంటల కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్య మూడుకు చేరుకుంది. అఖ్నూర్ కఠినమైన నిఘాలో ఉంది. ...అఖ్నూర్లో ఉగ్రవాదుల శాశ్వత ఉనికి లేదు. మేము మా గార్డును వదులుకోం. చాలా కాలంగా ఈ ప్రాంతం చొరబాట్లను చూడలేదు. ప్రతి ఏడాది చొరబాటు విధానం మారుతోంది. ముఖ్యంగా చలికాలం సమయంలో మేము కూడా ఉగ్రవాదుల చొరబాటు కట్టడి విషయంలో అప్రమత్తంగా ఉన్నాం’’ అని అన్నారు.ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం.. సరిహద్దుల వెంబడి 50 నుండి 60 మంది ఉగ్రవాదులు ఉన్నారని సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు. అఖ్నూర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చడం భద్రతా బలగాలకు లభించిన పెద్ద విజయంగా అభివర్ణించారు.చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లతో సహా నలుగురి మృతి
జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లాలో ఆర్మీ వాహనంపై గురువారం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు విడిచినట్లు అధికారులు వెల్లడించారు. వీరితోపాటు ఇద్దరు కూలీలు మరణించగా, మరో ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడినట్లు తెలిపారు. మరణించారని వర్గాలు తెలిపాయి.బారాముల్లాలోని బుటాపత్రి నాగిన్ ప్రాంతంలో సామాగ్రి తీసుకెళ్తున్న మిలటరీ ట్రక్కుపై గురువారం సాయంత్రం ఉగ్రవాదులు తొలుత దాడులు జరిపినట్లు ఆర్మీ అధికారులు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికుడిపై కాల్పులు జరపడంతో.. దీంతో ఉగ్రవాదులు, 18వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందినసైనికుల మధ్య కాల్పులు జరిగినట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తిని ప్రీతమ్ సింగ్‌గా గుర్తించారు. సంఘటనా ప్రాంతాన్ని భారత బలగాలు ఆధీనంలో తీసుకొని టెర్రరిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.కాగా గత 72 గంటల్లో కేంద్రపాలిత ప్రాంతంలో ఆర్మీ వాహనంపై దాడి జరగడం ఇది రెండోది. మూడు రోజుల క్రితం టన్నెల్ నిర్మిస్తున్న నిర్మాణ కార్మికుల హౌసింగ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరుగురు కార్మికులు, ఒక వైద్యుడు మరణించారు - మరణించిన వారిని కశ్మీర్‌లోని నయీద్గామ్లోని బుద్గామ్కు చెందిన డాక్టర్ షానవాజ్, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన గుర్మీత్ సింగ్, బీహార్‌కు చెందిన మహ్మద్ హనీఫ్, ఫహీమ్ నాసిర్, కలీమ్‌లుగా గుర్తించారు.ఈ దాడిని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ‘ఉత్తర కాశ్మీర్‌లోని బూటా పత్రి ప్రాంతంలో ఆర్మీ వాహనాలపై దాడి జరగడం, ప్రాణ నష్టం కలగడం దురదృష్టకరం.కశ్మీర్లో ఇటీవల జరుగుతున్న వరుస దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిని నేను ఖండిస్తున్నాను. ఈ దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని అబ్దుల్లా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. -
మోదీ, జిన్‌పింగ్ భేటీ సఫలం.. భారత బోర్డర్లో కీలక పరిణామం
ఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తూర్పు లడఖ్ ప్రాంతం నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్తున్నట్టు భారత రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఇటీవల బ్రిక్స్ సమావేశాల సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందాల్లో భాగంగానే బలగాలు వెనక్కి వెళ్తున్నట్టు స్పష్టం చేసింది.రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్భంగా భారత్, చైనా మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా రెండు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగానే సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైందని భారత రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. తూర్పు లఢఖ్ సెక్టార్‌లోని రెండు కీలక ప్రాంతాలైన డెమ్చోక్, డెస్పాంగ్ నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్తున్నట్టు అధికారులు చెప్పారు.అలాగే, ఈ ప్రాంతంలోని సైనిక సామగ్రి, ఇతర పరికరాలను భారత బలగాలు వెనక్కి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. లడఖ్ నుంచి పశ్చిమ దిశగా భారత బలగాలు, తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నాయి. ఇదే సమయంలో ఎల్ఏసీ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరు దేశాల బలగాలు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. రెండు దేశాల బలగాలు అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత మరికొన్ని రోజుల్లోనే డెస్పాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను మళ్లీ ప్రారంభించనున్నట్టు సమాచారం.Disengagement of troops of India and China has started at two friction points in Demchok and Depsang Plains in Eastern Ladakh sector. As per the agreements between the two sides, the Indian troops have started pulling back equipment to rear locations in the respective areas:… pic.twitter.com/CzwAZs4sJG— ANI (@ANI) October 25, 2024ఇదిలా ఉండగా.. తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో 2020 జూన్ 15న భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ సందర్బంగా భారత్‌కు చెందిన 20 మంది జవాన్లు వీర మరణం పొందారు. ఇదే సమయంలో చైనా కూడా తన సైన్యాన్ని కోల్పోయింది. దీంతో, నాటి నుంచి ఎల్ఏసీ వెంబడి రెండు దేశాల బలగాలు భారీ సంఖ్యలో మోహరించాయి. అయితే, గాల్వాన్ దాడిలోనే తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందారు. -
ఒకే రోజు ఐఏఎఫ్, ఆర్మీ దంపతుల ఆత్మహత్య..
న్యూఢిల్లీ: భారత సాయుధ దళాల్లో పనిచేస్తున్న ఓ జంట ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న వారిద్దరూ.. వేర్వేరు నగరాల్లో ఒకేరోజు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. బీహార్‌కు చెందిన దీనదయాల్ దీప్ ఆగ్రాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో లెఫ్టెనెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతని భార్య రేణు తన్వర్ అదే నగరంలోని సైనిక ఆస్పత్రిలో కెప్టెన్‌గా పనిచేస్తున్నారు. ఈ జంట 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు.ఇటీవల తన్వర్ తన తల్లి, సోదరుడితో కలిసి వైద్య చికిత్స కోసం ఢిల్లీ వెళ్లారు. ఇంతలో ఏమైందో తెలియదు. రాత్రి భోజనం తర్వాత గదిలోకి వెళ్లిన దీప్ మరుసటి రోజు బయటకు రాకపోవడంతో సహోద్యోగులు తలుపు పగలగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించారు. భర్త మరణించాడనే విషయాన్ని తట్టుకోలేక అతని ఆర్మీ అధికారి భార్య కూడా ఢిల్లీ కంటోన్మెంట్‌లోని గెస్ట్ హౌస్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. వీరిద్దరి చావుకి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే తన్వర్ వద్ద పోలీసులు సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన భర్త దీప్తోమృతదేహంతో కలిపి తనకూ దహన సంస్కారాలు నిర్వహించాలని లేఖలో ఆమె కోరారు. తన్వర్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె తల్లి, సోదరుడు ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. దీప్ వద్ద ఎలాంటి సూసైడ్ నోటు లభ్యం కాలేదు. దీంతో అతడి మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు -
ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు అమెరికాతో భారత్ కీలక ఒప్పందం
దేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేసే దిశగా అమెరికా, భారత్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. మన సాయుధ బలగాల నిఘా సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు అమెరికా నుంచి అత్యాధునిక సాయుధ ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. వీటి విలువ రూ. 32,000 కోట్లు కాగా ఈ డీల్ కింద భారతదేశంలో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎమ్ఆర్ఓ) సదుపాయాన్ని నెలకొల్పడంతో పాటు యూఎస్ నుంచి మొత్తం 31 MQ-9B హై ఆల్టిట్యూడ్ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌కు గత వారం క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) అనుమతి ఇచ్చింది. మొత్తం 31 డ్రోన్లలో 15 భారత నావికాదళానికి వెళ్తాయి. మిగిలినవి వైమానిక దళం, ఆర్మీల మధ్య సమంగా విభజించనున్నారు.కాగా డెలావేర్లో జరిగిన క్వాడ్ లీడర్స్ సదస్సు సందర్భంగా డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య చర్చలు జరిగిన నెలలోపే ఈ పరిణామం చోటుచేసుకుంది. అంతేగాక ఈ డీల్ మొత్తం విలువ రూ.34,500 కోట్లకు పెరగే అవకాశం ఉంది. చెన్నై సమీపంలోని ఐఎన్ఎస్ రాజాలి, గుజరాత్‌లోని పోర్బందర్, ఉత్తరప్రదేశ్‌లోని సర్సావా మరియు గోరఖ్‌పూర్‌తో సహా నాలుగు సాధ్యమైన ప్రదేశాలలో భారతదేశం డ్రోన్లను ఉపయోగించనుంది.అయితే చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఉంచేందుకు ఈ డ్రోన్లు అవసరమని భారత్ భావిస్తోంది. ఈ డ్రోన్లు గరిష్టంగా గంటకు 442 కిమీ వేగంతో, దాదాపు 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతాయి. సుమారు 40 గంటలకుపైగా గాల్లో ఉండగలవు. నాలుగు హెల్ఫైర్ క్షిపణులను, 450 కిలోల బాంబులను మోసుకెళ్లగలవు. ఇప్పటికే భారత్ వీటిల్లో మరోరకమైన సీగార్డియన్ డ్రోన్లను వినియోగిస్తోంది. వీటిని కూడా జనరల్ అటామిక్స్ నుంచి లీజ్‌పై భారత్ తీసుకొంది. ఈ ఏడాది జనవరిలో కాంట్రాక్టు ముగియగా.. మన నౌకాదళం మరో నాలుగేళ్లపాటు దీనిని పొడిగించింది. -
సర్జికల్ స్ట్రైక్: పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న వేళ..
న్యూఢిల్లీ: పొరుగు దేశం పాకిస్తాన్ సాగిస్తున్న దుశ్చర్యలకు పలుమార్లు భారత్ నష్టపోవాల్సి వచ్చింది. పాక్ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ, ఉగ్రదాడులకు కుట్ర పన్నుతూనే ఉన్నారు. 2016, సెప్టెంబర్ 18న కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరీలో భారత సైనికులపై పాక్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 18 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటన తరువాత భారత జవాన్లు పాక్ ఉగ్రవాదులకు ఇచ్చిన సమాధానం ఇప్పటికీ వారి చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటుంది.పాక్ ఉగ్రవాదులు ఉరీలో దాడి చేసి పది రోజుల తర్వాత అంటే 2016, సెప్టెంబర్ 18న భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి, పాక్‌పై తగిన ప్రతీకారం తీర్చుకుంది. జమ్ముకశ్మీర్‌లోని ఉరీలో భారత సైన్యం క్యాంపుపై దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నారు. జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు భారత ఆర్మీ క్యాంపులోకి ప్రవేశించి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. భారత సైనికులు నిద్రిస్తున్న గుడారాలకు నిప్పు పెట్టారు. ఈ దాడి అకస్మాత్తుగా జరగడంలో సైనికులకు తప్పించుకునే అవకాశం దొరకలేదు. ఈ దాడిలో 18 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి అనంతరం అక్కడ ఉన్న ప్రత్యేక బలగాలు నలుగురు పాక్ ఉగ్రవాదులను హతమార్చాయి. ఉరీ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.ఈ నేపధ్యంలో పాక్ ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని దేశ ప్రజలు డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో భారత సైన్యం పాక్‌పై ప్రతీకార దాడికి పక్కా ప్రణాళిక రూపొందించింది. ప్లాన్‌లో భాగంగా ముందుగా ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించారు. 2016, సెప్టెంబర్ 28 నాటి అర్థరాత్రి భారత పారా కమాండోల బృందం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి ప్రవేశించింది. అక్కడున్న ఉగ్రవాద స్థావరాలను భారత సైనికులు ధ్వంసం చేశారు. భారత సైన్యం తన పని ముగించుకుని, విజయవంతంగా తిరిగి వచ్చింది. ఈ దాడిలో 50 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌కు ‘సర్జికల్ స్ట్రైక్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేశారు. దీంతో నాడు దేశ ప్రజలు సంబరాలు చేసుకున్నారు.ఇది కూడా చదవండి: మరో రైలు ప్రమాదానికి కుట్ర.. తప్పిన ముప్పు -
బారాముల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: అసెంబ్లీ ఎన్నికల ముందు జమ్ముకశ్మీర్‌లో బాంబు మోత మోగుతోంది. ఇప్పటికే కథువా, కిష్త్వార్ జిల్లాలో ఎన్కౌంటర్ కొనసాగుతుండగా.. తాజాగా బారాముల్లా జిల్లాలోనూ భద్రతా బలగాలు.. ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.ఈ ఎన్కౌంటర్ ముగ్గురు మిలిటెంట్లు హతమయ్యారు. ఉత్తర కాశ్మీర్ పట్టాన్ ప్రాంతంలోని చక్ తాపర్ క్రీలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. స్కూల్ బిల్డింగ్‌లో దాక్కున్న మిలిటెంట్లతో ఎదురుకాల్పులకు దిగారు. శుక్రవారం రాత్రి ఒక మిలిటెంట్ చనిపోగా, శనివారం ఉదయం మరో ఇద్దరు హతమయ్యారు.చదవండి: మోదీ పర్యటన ముందు జమ్ముకశ్మీర్‌లో కాల్పుల మోత.. ఇద్దరు జవాన్ల మృతిఎన్కౌంటర్లో ముగ్గురు చనిపోయినట్లు కశ్మీర్ ఐజీ వీకే బిర్డి వెల్లడించారు. ఆ మిలిటెంట్లను గుర్తించే ప్రక్రియలో ఉన్నట్లు చెప్పారు. మరోవైపు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ దోడా జిల్లాలో ప్రధాని మోదీ ప్రచారం చేపట్టనున్నారు.Joint operation with @JmuKmrPolice in progress at #Baramulla. https://t.co/YZY7MLjYeo pic.twitter.com/GkvBlwRJ2k— NORTHERN COMMAND - INDIAN ARMY (@NorthernComd_IA) September 14, 2024 -
పాక్ బరితెగింపు.. సరిహద్దులో కాల్పులు
జమ్మూ: సరిహద్దులో పాకిస్తాన్ మరోసారి బరితెగించింది. మనదేశంతో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూలోని అక్నూర్ ప్రాంతంలో సరిహద్దు వెంబడి భారత బలగాలు లక్ష్యంగా బుధవారం(సెప్టెంబర్11) తెల్లవారుజామున పాక్ సైన్యం కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో భారత జవాను ఒకరు గాయపడ్డట్లు సమాచారం. పాక్ కాల్పులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ కాల్పులతో అప్రమత్తమైనట్లు బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉలంఘించడం గమనార్హం. సెప్టెంబర్ 18న అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరగనుంది.కాగా, 2021లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించిన తర్వాత సరిహద్దు వెంబడి భారత్,పాకిస్తాన్ మధ్య కాల్పులు పెద్దగా లేవు. గతేడాది మాత్రం పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో భారత సైనికుడొకరు మృతి చెందారు. ఇదీ చదవండి.. మళ్లీ రాజుకుంటున్న మణిపూర్ -
రెండో ప్రపంచయుద్ధవీరుడికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు
రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న సైనికుడు, ప్రతిష్టాత్మక ‘బర్మా స్టార్ అవార్డ్’ గ్రహీత రిటైర్డ్ లాన్స్ నాయక్ చరణ్ సింగ్ 100వ పుట్టినరోజు వేడుకలను భారత సైన్యం ఘనంగా నిర్వహించింది. శనివారం హిమాచల్ ప్రదేశ్‌లోని స్వగృహంలో ఆయనతో కేక్ కట్చేయించి జన్మదిన వేడుకలను ఆరంభించారు. ఆర్మీ తరఫున సైతం బ్రిగేడియర్ అధికారి, సైనికులు పాల్గొనడంతో కార్యక్రమం సందడిగా మారింది. 1924 సెపె్టంబర్ ఏడో తేదీన జన్మించిన చరణ్‌సింగ్ 1942 ఆగస్ట్ 26వ తేదీన భారత్‌లో బ్రిటిష్ సైన్యం ఫిరోజ్పూŠ కంటోన్మెంట్ యూనిట్లో చేరారు. రెండో ప్రపంచయుద్ధంలో వీరోచితంగా పోరాడారు. సింగపూర్ నుంచి లాహోర్ దాకా పలు దేశాల్లో యుద్ధక్షేత్రాల్లో తన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. తర్వాత హిమాచల్‌ప్రదేశ్‌లోని యోల్ కంటోన్మెంట్‌లోనూ పనిచేశారు. ‘‘ 17 ఏళ్లపాటు సైన్యంలో చూపిన ప్రతిభకు బర్మా స్టార్ అవార్డ్‌ను, ఇండియన్ ఇండిపెండెన్స్ మెడల్‌ను ఆయన పొందారు. 1959 మే 17న పదవీవిరమణ చేశారు. తర్వాత ప్రస్తుతం తన శేషజీవితాన్ని రోపార్ జిల్లాలోని దేక్వాలా గ్రామంలో గడుపుతున్నారు. ఆయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సొంతింట్లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో బ్రిగేడియన్ అధికారి, సైనికులు పాల్గొన్నారు. దేశసేవలో తరించిన మాజీ సైనికులను గుర్తుపెట్టుకుని వారిని తగు సందర్భంలో గౌరవిస్తూ భారతసైన్యం పలు కార్యక్రమాలు చేస్తున్న విషయం విదితమే. ఇందులోభాగంగానే శనివారం చరణ్‌సింగ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు సైన్యాధికారి ఒకరు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ దశాబ్దాల క్రితం సైన్యంలో పనిచేసినా సరే ఆర్మీ దృష్టిలో అతను ఎప్పటికీ సైనికుడే. సైన్యంలో భాగమే. సైన్యానికి, పౌరులకు స్ఫూర్తిప్రదాతలుగా వారిని సదా స్మరించుకోవాలి. వారి నుంచి నేటి సైనికులు ఎంతో నేర్చుకోవాలి’ అని సైన్యం పేర్కొంది. – న్యూఢిల్లీ -
15 వేల అడుగుల ఎత్తు నుంచి.. పోర్టబుల్ ఆస్పత్రి పారా–డ్రాప్
న్యూఢిల్లీ: భారత ఆర్మీ, వైమానిక దళం కలిసి అరుదైన ఘనతను సాధించాయి. పోర్టబుల్ ఆస్పత్రి ‘ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్’ను 15 వేల అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా లక్షిత ప్రాంతంలో నేలపైకి దింపాయి. అత్యంత ఎత్తులో నుంచి విజయవంతంగా పూర్తి చేసిన ఈ పారా–డ్రాప్ ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదటిదని రక్షణ శాఖ తెలిపింది. ఇందులోని క్రిటికల్ ట్రామాకేర్ క్యూబ్‌లను భీష్మ(భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి)ప్రాజెక్టులో భాగంగా దేశీయంగానే రూపొందించినట్లు వెల్లడించింది. మారుమూల, అటవీ కొండ ప్రాంతాల్లో వరదలు వంటి ప్రకృతి విపత్తులు, అత్యవసర సమయాల్లో బాధితులకు అత్యంత వేగంగా, సమర్థమైన వైద్యసేవలను అందించే లక్ష్యంతో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పోర్టబుల్ ఆస్పత్రికి రూపకల్పన జరిగిందని వివరించింది. ఇందులోనున్న వసతులతో 200 మందికి వైద్య సేవలందించొచ్చని తెలిపింది. ఈ క్యూబ్‌ను అధునాతన రవాణా విమానం సీ–130జే సూపర్ హెర్క్యులస్ ద్వారా అనుకున్న చోట అనుకున్న విధంగా నేలపైకి సురక్షితంగా పారాడ్రాప్ చేసినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ఆర్మీ ఇందుకోసం అత్యాధునిక ప్రెసిషన్ డ్రాప్ సాంకేతికతను వినియోగించుకుందని తెలిపింది. -
ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ హాస్పిటల్ పారాడ్రాప్
ఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన పోర్టబుల్ హాస్పిటల్‌ను విజయవంతంగా పారాడ్రాప్ చేసినట్లు రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆరోగ్య మైత్రీ హెల్త్ క్యూబ్‌గా పేర్కొనే ఈ ఆస్పత్రిని 15 వేల అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా నేలకు దించినట్లు పేర్కొంది. భీష్మా (భారత హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హితా అండ్ మైత్రి) అనే ప్రాజెక్టులో భాగంగా ఆరోగ్య మైత్రీ హెల్త్ క్యూబ్‌ని ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం సంబంధించిన వీడియోను రక్షణ శాఖ విడుదల చేసింది. ఇక.. ఇది ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ హాస్పిటల్ కావటం విశేషం.#IAF & #IndianArmy have jointly carried out a first-of-its-kind precise para-drop operation of Aarogya Maitri Health Cube at a high-altitude area close to 15,000 ft.These critical trauma care cubes have been indigenously developed under Project #BHISHM👉🏻https://t.co/QmA6ZYBPST pic.twitter.com/iEufwVcEG3— Defence Production India (@DefProdnIndia) August 17, 2024విపత్తుల సమయంలో దెబ్బతిన్న ప్రాంతాల్లోని ప్రజలకు అత్యవసర సేవలు అందించాలనే ప్రధాని మోదీ ఆదేశాలతో ఈ ప్రాజెక్టు ప్రారంభించినట్లు తెలిపింది. మారుమూల, పర్వత ప్రాంతాల్లో విపత్తులు సంభవించినప్పుడు తక్షణ సహాయ చర్యలు అందించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని అన్నారు. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈ పోర్టబుల్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ఇక.. పోర్టబుల్ హాస్పిటల్లో మొత్తం 72 క్యూబ్స్ ఉంటాయి. దీన్ని ఉపయోగించి 200 మందికి ఆరోగ్య సేవలందించవచ్చు. భారత వైమానికి దళానికి సంబంధించిన విమానం సీ-130జీని సాయంతో దీనిని నిర్దేశించిన ప్రాంతానికి చేరవేస్తుంది. -
కల్నల్ మన్‌ప్రీత్‌కు కీర్తిచక్ర
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులతో పోరులో వీరమరణం పొందిన కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్, జమ్మూకశ్మీర్ డీఎస్పీ హుమయూన్ ముజ్జామిల్ భట్‌కు కేంద్ర ప్రభుత్వం కీర్తిచక్ర అవార్డ్‌ను ప్రకటించింది. రైఫిల్మన్ రవికుమార్ (మరణానంతరం), మేజర్ మల్ల రామగోపాల్ నాయుడు, (మరణానంతరం)లనూ కీర్తిచక్రతో ప్రభుత్వం గౌరవించింది. శాంతిసమయంలో ప్రకటించే రెండో అత్యున్నత గ్యాలెంట్రీ అవార్డ్‌కు ఈసారి నలుగురికి ఎంపికచేశారు. అనంత్ నాగ్ అడవుల్లో ఆర్మీ బృందానికి నాయకత్వం వహిస్తూ ప్రాణాలను లెక్కచేయకుండా ఉగ్రవాదులను నేరుగా ఎదుర్కొని ఒక ఉగ్రవాదిని కల్నల్ మన్‌ప్రీత్ హతమార్చారు. తర్వాత నక్కిన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. త్రివిధ దళాల సర్వసైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి ముర్ము బుధవారం మొత్తం 103 గ్యాలంట్రీ అవార్డులను ప్రకటించారు. కీర్తిచక్రతోపాటు 18 మందికి శౌర్య చక్ర, ఒకరికి బార్ టు సేనా మెడల్, 63 మందికి సేనా మెడల్, 11 మందికి నావో సేనా మెడల్, ఆరుగురికి వాయుసేనా మెడల్ ప్రకటించారు. ఒక ప్రెసిడెంట్ తట్‌రక్షక్ మెడల్, మూడు తట్‌రక్షక్ మెడళ్లనూ తీర గస్తీ దళాలకు ప్రకటించారు. -
వీడియో: వయనాడ్‌లో జవాన్లకు వీడ్కోలు.. కన్నీరుపెట్టిన బాధితులు
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విపత్తు కారణంగా 400 మందికిపైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. ఇంకా 152 మంది ఆచూకీ దొరకలేదు. ఇక ఈ విపత్తు చోటుచేసుకున్న నాటి నుంచి దాదాపు 10 రోజుల పాటు భారత ఆర్మీ సహాయక చర్యల్లో పాల్గొంది. నేటితో సహాయక చర్యలు ముగియడంతో వయనాడ్ ప్రజలు.. జవాన్లకు వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.కాగా, వయనాడ్‌లో ప్రకృతి విపత్తు జరిగిన నాటి నుంచి ఆర్మీ సహా సహాయక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మన ఆర్మీ జవాన్లు ఎంతో శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. అలాగే, వరదల్లో చిక్కుకున్న వారిని సహాసోపేతంగా కాపాడారు. ఎంతో తక్కువ సమయంలో వంతెన నిర్మించి దేశ ప్రజల మన్ననలు అందుకున్నారు. వయనాడ్ ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యయప్రయాసలకు ఓడ్చి బాధితులకు బాసటగా నిలిచారు.అయితే, నేటితో సహాయక చర్యలు ముగియడంతో జవాను తిరుగు పయనం అయ్యారు. ఈ సందర్భంగా జవాన్లకు వీడ్కోలు పలుకుతూ వయనాడ్ ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు. జవాన్లు వెళ్తుండగా ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎంతో సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. #WayanadLandslide Watch | Emotional send-off to #IndianArmy personnel from people of all walks of life at #Wayanad.Grateful for our brave heroes who risked everything during the landslide #RescueOps.Your courage & sacrifice won't be forgotten…#WeCare🇮🇳@giridhararamane pic.twitter.com/u2csEIo5r7— PRO Defence Kochi (@DefencePROkochi) August 8, 2024 -
భారత్‌లోకి చొరబడేందుకు 600 మంది బంగ్లాదేశ్ పౌరులు యత్నం
ఢాకా,ఢిల్లీ: ఇక్కడే ఉంటే తమకు భూమిపై నూకలు చెల్లినట్లేనని భావించిన సుమారు 600 మంది బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన భారత్ భద్రతా బలగాలు వారిని నిలువరించాయి. రాజకీయ అనిశ్చితితో బంగ్లాదేశ్ అట్టుడికిపోతుంది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వీడిన నేపథ్యంలో సైన్యం నేతృత్వంలో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ గ్రహీత మహ్మద్ యూనుస్ గురువారం (ఆగస్ట్8న)బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే విషయాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ ప్రకటన చేశారు. అయినప్పటికీ అక్కడి విధ్వంసకర పరిస్థితులు అదుపులోకి రాలేదు. అల్లరి మూకలు పేట్రేగి పోయారు. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ మద్దతుదారుల్ని దారుణంగా హత మార్చుతున్నారు. అలా ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌లో 470 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.అల్లరి మూకల దమన కాండని ఆపేందుకు పోలీసులు తిరిగి విధుల్లోకి రావాలని, పరిస్థితుల్ని చక్కదిద్దాలని ఆ దేశ పోలీస్ తాత్కాలిక చీఫ్ షహీదుర్ రెహా్మన్ బహిరంగంగా విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది! ఆర్మీ సైతం చేతులెత్తేసింది. దీంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయడానికి, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు కారణమైన విద్యార్ధులే రంగంలోకి దిగారు. పరిస్థితుల్ని చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ తరుణంలో వందలాది బంగ్లాదేశ్ పౌరులు దేశం విడిచి పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురి జిల్లాలోని దక్షిణ్ బెరుబరి గ్రామం నుంచి భారత్‌లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించగా వారిని బీఎస్ఎఫ్ భద్రతా బలగాలు నిలిపివేశాయి. బలవంతంగా భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే కాల్పులు జరపాల్సి వస్తుందని హెచ్చరించాయి. "Fear Being Killed": 600 Bangladeshis Try To Enter Bengal, Stopped By Border Force BSF https://t.co/NrH8JRrApU— ahmed (@ahmed_ebs) August 7, 2024 -
ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డీజీగా చరిత్రకెక్కిన సాధనా సక్సేనా
ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా సాధనా సక్సేనా నాయర్ ( Sadhna Saxena Nair) రికార్డు సృష్టించారు. ఆర్మీ మెడికల్ సర్వీసెస్ తొలి మహిళా డీజీగా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ ఈ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఆగస్టు 1న (గురువారం) ఆమె ఈ బాధ్యతలు స్వీకరించారు.ఈ నియామకానికి కంటే ముందు ఆమె ఆర్మీ బలగాల డైరెక్టర్ జనరల్ బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవి చేపట్టిన తొలి మహిళా అధికారి కూడా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయరే కావడం గమనార్హం. ర్యాంకులో ఎయిర్ మార్షల్‌గా పదోన్నతి కల్పించి మరీ ఆమెను ఆ పదవిలో నియమించారు. గతంలో ఆమె ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు.పుణెలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన ఎయిర్ మార్షల్ సాధనా సక్సేనా నాయర్ 1985లో వైద్యురాలిగా ఆర్మీలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఎయిర్ మార్షల్ హోదాకు చేరుకున్నారు. డిసెంబరు 1985లో ఆర్మీ మెడికల్ కార్ప్స్లో నియమితులయ్యారు. 1986లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా చేరారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ , స్విట్జర్లాండ్‌లోని MME (మిలిటరీ మెడికల్ ఎథిక్స్)తో CBRN (కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ మరియు న్యూక్లియర్) వార్ఫేర్లో శిక్షణ పొందారు.వైద్య విద్యపై ఆసక్తితో ఆర్మీలో పనిచేస్తూనే ఆమె ఫ్యామిలీ మెడిసిన్‌లో పీజీ చేశారు. న్యూ ఢిల్లీలోని ఆల్-ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో మెడికల్ ఇన్ఫర్మేటిక్స్లో రెండు సంవత్సరాల శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తాజాగా ర్మీ మెడికల్ సర్వీసెస్‌కు డీజీగా ఎంపికయ్యారు. ఆమె అందించిన సేవలకు గాను విశిష్ట సేవా పతకాన్ని (VSM) అందుకున్నారు. మెరిటోరియస్ సర్వీస్ కోసం ఆమెకు AOC-in-C (వెస్ట్రన్ ఎయిర్ కమాండ్),చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ప్రశంసలు లభించాయి. జనరల్ ఆఫీసర్ ఎయిర్ మార్షల్ కేపీ నాయర్ (రిటైర్డ్)ని వివాహం చేసుకున్నారు. నాయర్ కుటుంబంలోని మూడు తరాలు గత 70 ఏళ్లుగా సాయుధ దళాలలో పనిచేశారు. -
వయనాడ్ విలయం: మేజర్ సీతాషెల్కేకు హ్యాట్సాఫ్! (ఫొటోలు)
-
ఆపరేషన్ ఆలౌట్ ఉగ్రమూకలను ఏరిపారేస్తున్న ఆర్మీ
-
ఒకే యూనిఫామ్, విధులతో.. లక్ష మంది అగ్నివీరులు చేరిక
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ప్రథకం కింద ఇప్పటివరకు లక్షమంది అగ్నివీరులు శిక్షణపొంది వివిధ విభాగాల్లో చేరినట్లు ఆర్మీ పేర్కొంది. సుమారు 70 శాతం మంది అగ్నివీరులు వివిధ ఆర్మీ యూనిట్ల పనిచేస్తున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ (ఆర్మీ అడ్జటెంట్ జనరల్) సీబీ పొన్నప్ప ఆదివారం తెలిపారు.‘2022 జూన్‌లో అగ్నిపథ్ పథకం అమలులోకి వచ్చింది. జనవరి, 2022 నుంచి 2023 మధ్య మొదటి బ్యాచ్ నియామకం పూర్తి అయింది. ఈ పథకం ద్వారా లక్ష మంది అగ్నివీరులో అర్మీలో జాయిన్ అయ్యారు. ఇందులో 200 మంది మహిళలు ఉన్నారు. ఇక.. రిక్రూట్ అయిన 70 వేల మంది అగ్నివీరులు వివిధ విభాగాలు, బెటాలియన్లలో చేరారు. ఇందులో కూడా 100 మంది మహిళలు ఉన్నారు’అని తెలిపారు.దీంతోపాటు మరో 50 వేల అగ్నివీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని 2024-25 ఏడాదికి గాను నియామక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం కింద రెండు రకాల సైనికులను ఆర్మీ తయారు చేస్తోందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.‘ఇతర సైనికుల మాదిరిగానే అగ్నివీరు అన్ని రకాల విధులను నిర్వర్తించాలి. నిబంధనల్లో కూడా పేర్కొన్నాం. ఆపరేషనల్, వృత్తిపరమైన విధులను అగ్నివీరులు నిర్వహించాలి. వీరంతా ఆయా యూనిట్లలో చేరి విధులు చేపడతారు. ఒకే విధమైన యూనిఫామ్, ఒకే విధమైన విధులు నిర్వహిస్తారు’అని లెఫ్టినెంట్ జనరల్ సీబీ పొన్నప్ప తెలిపారు.కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంలో సెలెక్ట్ అయినవారు నాలుగు సంవత్సరాల పాటు సాయుధ బలగాల్లో పనిచేస్తారు. వారిని అగ్నివీర్లు అంటారు. 17.5 ఏళ్ల నుంచి 21 సంవత్సరాల వయస్సు అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నాలుగు ఏళ్ల తర్వాత కేవలం 25 శాతం మందిని మాత్రమే కొనసాగిస్తారు. మిగతావారంతా రిటైర్ అవుతారు. ఈ పథకం విధివిధానాలు నియామక ప్రక్రియ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు సైతం ఈ పథకాన్ని రద్దు చేయాని డిమాండ్ చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్ట్‌లో సైతం ఈ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. -
ఉగ్రవాదుల ఏరివేత.. జమ్ములో సైనికుల మోహరింపు
జమ్ము ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న నేపధ్యంలో ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో సైనికులను మోహరించారు. జమ్ములో ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇంటర్ కమాండ్‌లో మార్పులు చేశారు. కథువా, సాంబా, దోడా, బదర్వా, కిష్త్వార్లలో సైనికుల సంఖ్యను మరింతగా పెంచారు. వెస్ట్రన్ కమాండ్ నుండి కూడా ఇక్కడకు సైనికులను పంపారు.గత సోమవారం జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్‌కు చెందిన సాయుధ ఉగ్రవాదులతో జరిగిన భీకర ఎన్కౌంటర్లో కెప్టెన్‌తో సహా నలుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. మూడు వారాల్లో జమ్మూ ప్రాంతంలో ఇది మూడో అతిపెద్ద ఉగ్రవాద ఘటన. దీనికి ముందు కథువా జిల్లాలో ఉగ్రవాదులు ఆర్మీ పెట్రోలింగ్ వాహనంపై మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. అంతేసంఖ్యలో సైనిక సిబ్బంది గాయపడ్డారు.అంతకుముందు జూలై 9న కిష్త్వార్ జిల్లా సరిహద్దుల్లోని అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత ఉగ్రవాదులు పారిపోయారు. జూన్ 26న గండో ప్రాంతంలో ఒక రోజంతా జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అదేవిధంగా జూన్ 12న జరిగిన భీకర కాల్పుల్లో ఐదుగురు ఆర్మీ సిబ్బంది, ఒక ప్రత్యేక పోలీసు అధికారి గాయపడటంతో దోడాలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు ముమ్మరం చేశారు.గండోలో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఒక పోలీసు గాయపడ్డాడు. 2005- 2021 మధ్య భద్రతా దళాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించిన తర్వాత జమ్ము ప్రాంతం సాపేక్షంగా శాంతియుతంగా ఉంది. అయితే ఈ ప్రాంతంలో గత నెల నుంచి ఉగ్రవాద దాడులు పెరిగాయి. ఇటీవల యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన దాడిలో తొమ్మిది మంది మృతిచెందగా, 40 మంది గాయపడ్డారు. -
‘జమ్ము కశ్మీర్లో కల్లోలానికి ఉగ్రవాదుల యత్నం’
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కేరాన్ సెక్టార్ సరిహద్దుల్లో చొరబాటుకు హత్నించిన ముగ్గురు ఉత్రవాదులను ఆదివారం భారత ఆర్మీ మట్టుబెట్టింది. ఈ ఘటనపై తాజాగా కేరాన్ సెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ కుల్కర్ణి మాట్లాడారు.‘జూలై 13,14 తేదీల్లో రాత్రి సమయంలో ఉగ్రవాదుల చొరబాటు యత్నించటంతో దాడులు జరిపాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నెలకొన్న శాంతి పరిస్థితులకు భంగం కలిగించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నట్లు మాకు నిఘా సమాచారం ఉంది. ..అమర్నాథ్ యాత్ర సందర్భంగా ఇక్కడ కల్లోలం సృష్టించాలని ఉగ్రవాదులు యత్నించారు. ఉగ్రవాద దాడులకు సంబంధించి.. జూలై 12నే మాకు ఇంటెలిజెన్స్ నుంచి మాకు సమాచారం అందింది. దట్టమైన అడవుల నుంచి కేరాన్ సెక్టార్ గుండా విదేశీ ఉగ్రవాదులు చొరబడతారన్న సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని జమ్ము కశ్మీర్ పోలీసులు ధృవీకరించారు. జూలై 13, 14 తేదీ రోజుల్లో రాత్రి మేము చాలా అప్రమత్తంగా ఉన్నాం. .. ఆర్మీ, బీఎస్ఎఫ్, జమ్ము కశ్మీర్ పోలీసు సయుక్తగా ఉగ్రవాదుల చొరబడే చోట దాడులు చేశాం. అయితే చికటి ఉండటంతో ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోయారు. టెర్రరిస్టుల వద్ద భారీ ఆయుధాలు ఉన్నాయి. బాగా శిక్షణ పొందిన ఉగ్రవాదులు చొరబడటానికి యత్నించారు. ఇక.. మేము జరిపిన కాల్పుల్లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతమయయ్యారు. వారి వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం’అని ఎన్ఆర్ కుల్కర్ణి తెలిపారు. -
కెప్టెన్ అన్షుమాన్ సింగ్ పెన్షన్, పీఎఫ్‌పై వివాదం.. స్పందించిన ఆర్మీ
అమర వీరుడు కెప్టెన్ అన్షుమాన్ సింగ్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీర్తి చక్ర అవార్డు బహుకరించిన సంగతి తెలిసిందే. గతేడాది జూలైలో సియాచిన్ గ్లేసియర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి అమరుడైన 26వ బెటాలియన్ పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన అన్షుమాన్ సింగ్‌కు.. మరణానంతరం రెండో అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం కీర్తి చక్రను ప్రకటించింది.జూలై 5న ఆయన భార్య స్మృతి సింగ్, తల్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఈ అవార్డును స్వీకరించారు. కొంత ఎక్స్ గ్రేషియాను అందించారు. వీటితోపాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 50 లక్షల నష్టపరిహారాన్ని అందించింది. కాగా అయితే పెళ్లైన అయిదు నెలలకే అన్షుమాన్ మరణించడం, వారి ప్రేమ, పెళ్లి, భవిష్యత్తు గురించి ఎంతో బాధతో ఆమె మాట్లాడిన మాటలు అందర్ని కంటతడి పెట్టించాయి. ఈ వీడియోను రక్షణశాఖ సోషల్ మీడియాలో షేర్ చేసిందిఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇటీవల అన్షుమాన్ తల్లిదండ్రులు రవి ప్రతాప్ సింగ్, మంజు సింగ్.. కోడలిపై మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. కోడలు అవార్డు, ఎక్స్ గ్రేషియా తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయిందని చెబుతున్నారు. ఎక్స్ గ్రేషియాను నెక్ట్స్ ఆఫ్ ది కిన్ (తదుపరి కటుంబ సభ్యులు)రూల్ ప్రకారం కోడలు, ఆమె కుటుంబీకులు తీసుకున్నారని చెబుతున్నారు. బిడ్డను కోల్పోయిన తమకు గోడ మీద ఫోటో తప్ప ఏమీ మిగల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. NOK (నెక్ట్స్ ఆఫ్ ది కిన్) నిబంధనలను సవరించాలని కోరుతున్నారు.కాగా వ్యక్తి సైన్యంలో చేరినప్పుడు.. ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ (ఏజీఐఎఫ్), ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) , ఇతర స్థిరాస్తుల నుంచి బీమా పొందడం కోసం తమ తల్లిదండ్రులు, సంరక్షులు పేర్లు NOK (నెక్ట్స్ ఆఫ్ ది కిన్) నమోదు చేస్తారు. అయితే వీటన్నింటికీ ఒకరి కంటే ఎక్కువ నామినీలు ఉండవచ్చు. కానీ పెన్షన్ కోసం ఒకే నామినీ ఉంటారు. జవాను పెళ్లి అయిన తర్వాత ఆర్మీ నిబంధన ప్రకారం..తల్లిదండ్రులకు బదులుగా జీవిత భాగస్వామిని NOKకేగా పేర్కొంటారు. ‘నా కొడుక్కి వచ్చిన అవార్డును కోడలు తీసుకెళ్లింది. ఆమె మాతో ఉండటం లేదు. మేము కొడుకునే కాదు, అవార్డును కూడా కోల్పోయాం. కోడలు మాతో జీవించాలనుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కొడుక్కి వచ్చిన అవార్డుపై మాకూ అధికారం లేదా?‘ అని వాపోయారు. అయితే అత్తమామల ఆరోపణలపై సింగ్ భార్య స్మృతి సింగ్ ఇప్పటివరకు ఏ విధంగానూ స్పందించలేదు.అయితే కోడలు స్మృతి సింగ్‌పై దివంగత కెప్టెన్ అన్షుమాన్ సింగ్ తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు నేపథ్యంలో ఆర్మీ స్పందించింది. ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ ద్వారా వచ్చి రూ.1 కోటి eర్థిక సాయం.. సింగ్ భార్య, తల్లిదండ్రులకు 50-50 శాతం విభజించనున్నట్లు ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే పీఎఫ్, పెన్షన్ మాత్రం భార్యకే చెందుతుందని తెలిపాయి. వీటితోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన రూ. 50 లక్షల సహాయంలో రూ. 35 లక్షలు అతని భార్యకు, రూ. 15 లక్షలు అతని తల్లిదండ్రులకు అందించనున్నట్లు పేర్కొన్నాయి.Amid allegations made by the parents of late Captain Anshuman Singh against their daughter-in-law Smriti Singh, Army sources clarified that the AGIF of ₹1 crore was split between his wife and parents while the pension goes directly to the spouse. @dperi84 reports.… pic.twitter.com/UCJocN2TBA— The Hindu (@the_hindu) July 14, 2024 వీలునామాలో సింగ్ భార్య నామినేట్ అయినందునా ఆమెకు కొన్ని ఎక్కువ ప్రయోజనాలు అందనున్నాయి. అంతేగాక కెప్టెన్ సింగ్ తండ్రి ఆర్మీలో రిటైర్డ్ జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ కావడంతో ఆయనకు స్వయంగా పెన్షన్ పొందున్నారు. మాజీ అధికారిగా ఇతర ప్రయోజనాలను కూడా అందుకుంటున్నారు. అయితే ఆర్మీ పాలసీ ప్రకారం ఒక అధికారి వివాహం చేసుకున్న తర్వాత, అతని భార్య పెన్షన్ కోసం నామినీ అవుతుందని ఆర్మీ వర్గాలు వివరించాయి.అయితే సింగ్ తల్లిదండ్రుల ఆరోపణలపై పలువురు అధికారులు స్పందించారు. నామినీ అనేది ఖచ్చితంగా అధికారి ఎంపిక అని. అందులో జీవిత భాగస్వామి పాత్ర లేదని పేర్కొన్నారు. అయితే తల్లిదండ్రులు పూర్తిగా కుమారుడిపై ఆధారపడిన సమయంలో ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ సమస్యలను ఆర్మీ యూనిట్ పరిష్కరిస్తుందని తెలిపారు. -
జమ్ము కశ్మీర్లో చొరబాటుకు హత్నం.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో ముగ్గరు టెర్రరిస్టులు హతమైనట్లు భారత ఆర్మీ వెల్లడించింది. జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌ను ఆర్మీ చేపట్టింది. ఈ క్రమంలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు ప్రయత్నించిన టెర్రరిస్టులపై సైనికులు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.‘జమ్ము కశ్మీర్ కెరాన్ సెక్టార్లో ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్‌లో ముగ్గురు టెర్రరిస్టులు మృతి చెందారు. వారి వద్ద లభించినట్లు ఆయుధాలను స్వాధనం చేసుకున్నాం’ అని ఆర్మీ చినార్ కార్ప్స్ ‘ఎక్స్’ లో పేర్కొంది.OP DHANUSH II, KERAN #Kupwara03x Terrorists have been eliminated in the ongoing anti-infiltration operation on the #LoC in Keran Sector, alongwith recovery of weapons and other war-like stores. The operation is continuing #Kashmir@adgpi@NorthernComd_IA— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) July 14, 2024ఈ రోజు(ఆదివారం) భద్రతా బలగాలు ధనుష్-2 అనే కోడ్ పేరుతో కుప్వారాలోని కేరన్ సెక్టర్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక.. మృతి చెందిన ఉగ్రవాదులు ఏ ఉగ్రసంస్థకు చెందినవారనే విషయం తెలియాల్సి ఉంది. -
సత్వర చర్యలే రక్ష!
మంచుకొండల సీమ మళ్ళీ నెత్తురోడుతోంది. జమ్మూ– కశ్మీర్‌లోని కఠువా జిల్లా మాచేడీలో భారత సైనిక గస్తీ బృందంపై సాయుధ తీవ్రవాదుల దాడి సహా 48 గంటల్లో నాలుగు ఘటనలు జరగడమే అందుకు తాజా సాక్ష్యం. కఠువా ఘటనలో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌తో సహా అయిదుగురు సైనిక సిబ్బంది, ఆ వెంటనే మరో ఘటనలో మరో ఇద్దరు అసువులు బాయడం పెరుగుతున్న ప్రమాదాన్ని సూచిస్తోంది. సాధారణ తీవ్రవాదులు కాక సుశిక్షితులైన సాయుధ మూక కఠువా దుశ్చర్యకు పాల్పడడం సమస్య కొత్త లోతుల్ని చెబుతోంది. ఈ ఏడాది ఇంతవరకు జమ్మూలో ఇలాంటి ప్రధాన ఘటనలే అరడజనుకు పైగా సంభవించాయి. చిన్నాచితకా వాటి సంగతి సరేసరి. ఒక్క జూన్‌లోనే నాలుగు తీవ్రవాద దాడుల్లో, రెండు రోజుల్లో 9 మంది మరణించారు. ప్రభుత్వ వ్యూహాల వైఫల్యం, పాలకులు కశ్మీర్‌పై దృష్టి పెట్టి జమ్మూను తేలికగా తీసుకోవడం... ఏదైతేనేం తీవ్రవాదులు తమ కార్యాచరణను కశ్మీర్ లోయ నుంచి జమ్మూకు బదలాయించారు. అలా తీవ్రవాదానికి ఇప్పుడు రాజౌరీ – పూంఛ్ ప్రాంతం కొత్త కేంద్రమైంది. సుప్రీమ్ కోర్ట్ ఆదేశం మేరకు సెప్టెంబర్ 30లోగా రాష్ట్రంలో ఎన్నికలు జరపాల్సి ఉన్నందున తీవ్రవాదానికి ముకుతాడు వేయడం తక్షణావసరం.పాతికేళ్ళ క్రితం తీవ్రవాదానికి అడ్డా అయినా, అనంతరం ప్రభుత్వ చర్యలు, స్థానికుల సహకారంతో గత రెండు దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న జమ్మూ ఇప్పుడు మళ్ళీ అగ్నిగుండం కావడం విషాదం. గమనిస్తే, ముష్కర దాడులతో జమ్మూలో బలైన సామాన్యులు, భద్రతా సిబ్బంది సంఖ్య గత ఏడాది జనవరి నుంచి ఇప్పటికి రెట్టింపయింది. తీవ్రవాద కేంద్రం మారిందడానికి ఇది స్పష్టమైన సూచిక. 2023 డిసెంబర్లో రాజౌరీ ఘటనలో నలుగురు సైనికులను కోల్పోయాం. తరవాత కుల్గామ్ ఎన్కౌంటర్లో మరో ఇద్దరు. ఇలా కొద్ది నెలల్లోనే సాహస జవాన్లను పలువురిని పోగొట్టుకోవడం విచారకరం. ప్రతి ప్రాణం విలువైనదే. అందులోనూ వీర సైనికుల ప్రాణత్యాగం వెల కట్టలేనిది. గత నెలలో వరుస ఘటనలతో తీవ్రవాదులు తెగబడ్డారు. జూన్ 9న పర్యాటకుల బస్సుపై దాడిలో 9మంది మరణించిన ఘటన, అది మరువక ముందే జూన్ 26న దోడాలో ఘటన... ఇవన్నీ అస్థిరతను సృష్టించాలని చూస్తున్న అదృశ్య శక్తుల విజృంభణకు సంకేతాలు. కశ్మీర్లో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నో ఏళ్ళ తర్వాత జనం ఉత్సాహంగా పాల్గొనడంతో, అసెంబ్లీ ఎన్నిక లకు పాలకులు సన్నద్ధమవుతున్నారు. దానికి అడ్డం కొట్టడానికే తాజా ఉగ్ర దుశ్చర్యలని విశ్లేషణ. ఢిల్లీలో మోదీ సర్కార్ మూడోసారి కొలువు తీరినరోజే తీవ్రవాదులు పేట్రేగడం యాదృచ్ఛికం కాదు. ఈ మొత్తం వ్యవహారంలో దాయాది పాకిస్తాన్ పాత్రను విస్మరించలేం. భద్రత, విదేశాంగ విధానంలో తీవ్రవాదాన్ని క్రియాశీలంగా, అదే సమయంలో దొంగచాటు సాధనంగా చేసుకోవడం ఆ దేశం ఆది నుంచీ చేస్తున్నదే. ఆర్థికంగా కష్టాల్లో పడి, అంతర్జాతీయంగా ప్రతిష్ఠ తగ్గినా సరిహద్దులో అది తన కుటిల బుద్ధిని వదులుకోవట్లేదు. స్థానికులను ముందుంచి, తాను వెనుక నుంచి కథ నడిపే వ్యూహాన్ని జమ్మూలో అనుసరిస్తోంది. నిజానికి, జమ్మూ – కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370వ అధికరణాన్ని రద్దు చేశాక కేంద్రం ఉక్కుపాదంతో వ్యవహరించింది. రద్దు అనంతరం సైతం అంతా సవ్యంగా ఉందని చెప్పడం, చూపడంలో మోదీ సర్కార్ బిజీగా ఉంది. దానికి తగ్గట్టే 2017 – 2022 మధ్య చొరబాటుదారుల సంఖ్య 53 నుంచి 14కి తగ్గిందనీ, దుశ్చర్యలు 228 నుంచి 125కి దిగివచ్చాయనీ హోమ్ శాఖ లెక్క. కానీ, పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. క్షేత్రస్థాయి పరిస్థితులు సజావుగా లేవనీ, వాటిని పాలకులు పట్టించుకోవట్లేదనీ ప్రతిపక్షాలు ఆరోపి స్తున్నది అందుకే. ఆ మాటకొస్తే, పెద్ద నోట్ల రద్దు మొదలు 370వ అధికరణం ఎత్తివేత దాకా తమ ప్రతి చర్యా తీవ్రవాదాన్ని తుదముట్టించేదే అని పాలకులు చెప్పినా అది వాస్తవరూపం దాల్చలేదు. పైగా, వర్షాకాలం కావడంతో సరిహద్దు వెంట పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల చొరబాట్లు సులభమవుతాయి. ప్రస్తుతం ఏటా భారీగా సాగే సంక్లిష్టమైన అమరనాథ్ యాత్రాకాలం కూడా! హిమలింగాన్ని దర్శించడానికి యాత్రికుల రద్దీ ఉండే ఈ సమయంలో మాటు వేసి కాటు వేయాలనీ, అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించాలనీ ముష్కరులు ఎత్తుగడ వేస్తారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. లేదంటే, తదుపరి పరిణామాలకు చింతించి ప్రయోజనం ఉండదు. వచ్చేవారం బడ్జెట్ సమావేశాలు సైతం ప్రారంభమవుతున్నందున ప్రభుత్వం జాగు చేయరాదు. చేపడుతున్న చర్యలపై స్వచ్ఛందంగా సవివరమైన ప్రకటన చేయాలి.పాక్‌తో నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ కొనసాగుతున్నా, చైనాతో గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత మన బలగాలు ఆ సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంట మోహరించాల్సి వచ్చింది. ఫలితంగా కశ్మీర్‌తో పోలిస్తే సైనిక బలగాలు తక్కువగా ఉన్న జమ్మూ తీవ్రవాదులకు వాటంగా మారింది. కశ్మీర్ లోయలో కాస్తంత ఊపిరి పీల్చుకొనే లోగా ఇక్కడకు విస్తరించిన ఈ ముప్పును ఆదిలోనే అడ్డుకోవాలి. దేశ భద్రతపై రాజకీయాల కన్నా రాజీ లేని ధోరణి ముఖ్యమని అధికార, ప్రతిపక్షాలన్నీ బాధ్యతతో ప్రవర్తించాలి. పాలకులు గత పదేళ్ళ తమ హయాంలో అంతా సుభిక్షంగా, సుదృఢంగా మారిపోయిందనే ప్రగల్భాలు మాని, కార్యాచరణకు దిగాలి. భద్రతాదళాల పెంపు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదని అర్థం చేసుకోవాలి. సమస్యను సమగ్రంగా దర్శించి, తీవ్ర వాదం వైపు స్థానికులు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు శుష్క వాగ్దానాలకు మించిన భరోసా కల్పించాలి. అప్పుడే ఈ భూతాన్ని అడ్డుకోగలుగుతాం. భారత్‌తో వాణిజ్యం, శాంతి కోరుతున్నట్టు చెబుతున్న పాక్ సైతం తీవ్రవాదానికి అండదండలు మానాలి. లేదంటే గుణపాఠం తప్పదు. -
అల్మరాలో నక్కిన టెర్రరిస్ట్‌లు.. బయటకు లాగి మరి ఎన్కౌంటర్..
కుల్గాం : జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్‌లు హతమయ్యారు. భద్రతా బలగాలు ఓ ఇంట్లో ఫేక్ అల్మారాలో నక్కి ఉన్న టెర్రరిస్ట్‌ల్ని బయటకు లాగి ఎన్ కౌంటర్ చేశారు. అమర్ నాథ్ యాత్ర నేపథ్యంలో భారత భద్రతా దళాలు జమ్మూకశ్మీర్‌లో భద్రతపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా అనుమానిత ప్రాంతాల్ని జల్లెడ పట్టాయి.ఈ తరుణంలో ఆదివారం సాయంత్రం కుల్గామ్ జిల్లాలోని చింగామ్,సౌత్ కాశ్మీర్ కుల్గామ్ అనే ప్రాంతాలలో నివసించేందుకు టెర్రరిస్ట్‌లకు స్థానికులే వసతి కల్పించారనే సమాచారంతో ఎన్ కౌంటర్ ఆపరేషన్ నిర్వహించాయి భద్రతా బలగాలు. ఈ సందర్భంగా ఓ ఇంట్లో ఫేక్ అల్మారా మాటున బంకర్‌ను ఏర్పాటు చేసుకున్న టెర్రరిస్ట్‌ల్ని బయటకు లాగి ఎన్ కౌంటర్ చేశాయి. మదర్గాంలో తొలి ఎన్కౌంటర్ జరగ్గా.. రెండో ఎన్కౌంటర్ కుల్గాం జిల్లా చింగాం అనే ప్రాంతంలో జరిగింది. సైనికులు జరిపిన మెరుపు దాడిలో నలుగురు టెర్రరిస్ట్‌లు మృతి చెందారు. ఎదురు కాల్పుల్లో ఒక భారత సైనికుడు వీరమరణం చెందారని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వీకే బర్డి తెలిపారు. ఇక ఎన్కౌంటర్లో హతమైన టెర్రరిస్ట్‌లు హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ గ్రూప్‌కు చెందినవారని,వారిలో ఒకరు లోకల్ కమాండర్‌గా పోలీసులు నిర్ధారించారు.చింగాంలో హతమైన నలుగురు టెర్రరిస్ట్‌లు యావర్ బషీర్ దార్,జాహిద్ అహ్మద్ దార్, త్వాహిద్ అహ్మద్ రాతీర్, షకీల్ అహ్ వ్వానిలు కాగా, మదర్గాంలో మృతి చెందిన టెర్రరిస్ట్‌లు ఫైసల్, అదిల్లుగా గుర్తించారు.మదర్గాంలో జరిగిన టెర్రరిస్ట్‌ల ఎదురు దాడిలో పారా కమాండో, లాన్స్ నాయక్ ప్రదీప్ నాయిన్, చింగాం గ్రామంలోని ఫ్రిసాల్ ఏరియాలో వన్ రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన హవల్దార్ రాజ్‌కుమార్ వీరమరణం చెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. -
‘అగ్నివీర్’ల పరిహారంపై అసత్యాలు.. ఖండించిన ఇండియన్ ఆర్మీ
సాక్షి,న్యూఢిల్లీ : విధి నిర్వహణలో మరణించిన అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి చెల్లించిన నష్ట పరిహారంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని ఇండియన్ ఆర్మీ ఖండించింది. ఇప్పటికే అగ్నివీర్ అజయ్ కుటుంబానికి ఇప్పటి వరకు మొత్తం రూ.98.39 లక్షలు అందించినట్లు ఆర్మీ స్పష్టం చేసింది. అగ్నివీర్ పథకంలోని నిబంధనల మేరకు అగ్నివీర్లో మరణించిన వారి తరుపున కుటుంబానికి రూ.1.65 కోట్లు పరిహారంగా అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి రూ.98.39 లక్షలు ఇచ్చామని, పోలిస్ వెరిఫికేషన్ అనంతరం రూ.67 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం రూ.1.65కోట్లు అవుతుందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. *CLARIFICATION ON EMOLUMENTS TO AGNIVEER AJAY KUMAR* Certain posts on Social Media have brought out that compensation hasn't been paid to the Next of Kin of Agniveer Ajay Kumar who lost his life in the line of duty.It is emphasised that the Indian Army salutes the supreme… pic.twitter.com/yMl9QhIbGM— ADG PI - INDIAN ARMY (@adgpi) July 3, 2024దేశం కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్ త్యాగానికి సెల్యూట్ అంటూ ఆయనకు ప్రగాఢ సంతాపం తెలిపింది. అజయ్ కుమార్ లేని లోటు తీర్చ లేనిదిఅంతకుముందు అగ్నివీర్ అజయ్ కుమార్ మరణంపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. విధి నిర్వహణలో మరణించిన అజయ్ కుమార్ సేవలకు గాను ఇండియన్ ఆర్మీ ‘హీరో’ గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం అజయ్ కుమార్ లేని లోటును తీర్చలేదని తండ్రి, అక్క విచారం వ్యక్తం చేశారు.అగ్నివీర్‌ను రద్దు చేయాలి.. ఈ సందర్భంగా అజయ్ కుమార్ అక్క జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తమ్ముడు అజయ్ కుమార్ అగ్నివీర్‌గా నాలుగేళ్లు విధులు నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా రూ.కోటి పరిహారం నా తమ్ముడు లేని లోటును తీరుస్తుందా? ఆయన లేకుండా నా కుటుంబం ఎలా జీవిస్తుంది’అని ప్రశ్నించారు. ప్రభుత్వం పరిహారం చెల్లించింది. కానీ అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాలనేది మా డిమాండ్ అని తెలిపారు. सत्य की रक्षा हर धर्म का आधार है!लेकिन रक्षा मंत्री राजनाथ सिंह ने शहीद अग्निवीर के परिवार को सहायता मिलने के बारे में संसद में झूठ बोला।उनके झूठ पर शहीद अग्निवीर अजय सिंह के पिता जी ने खुद सच्चाई बताई है।रक्षा मंत्री को संसद, देश, सेना और शहीद अग्निवीर अजय सिंह जी के… pic.twitter.com/H2odxpfyOO— Rahul Gandhi (@RahulGandhi) July 3, 2024స్పందించిన రాహుల్ గాంధీఅజయ్ కుమార్ తండ్రి మాత్రం అగ్నివీర్ మరణం అనంతరం ప్రభుత్వం అందించే పరిహారం రూ.1.65కోట్లు అందలేదని చెప్పారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పరిహారం చెల్లించే విషయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అబద్ధాలాడారని రాహుల్ గాంధీ మండి పడ్డారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. తాజాగా పరిణామాల నేపథ్యంలో పరిహారంపై ప్రచారం అవుతున్న అసత్యాల్ని ఇండియన్ ఆర్మీ ఖండించింది. -
అస్సాంలో వరదలు: పలువురిని కాపాడిన ఆర్మీ
దిస్ఫూర్: అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలు కారణంగా వరదలు పోటెత్తాయి. ఈ వరదలు రాష్ట్రంలోని పలు జిల్లాలను ప్రభావితం చేశాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ.. జూన్ 29 నుంచి పలు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు చేపట్టింది.#SpearCorps, #IndianArmy, @sdma_assam, and @ComdtSdrf, jointly carried out relentless rescue & relief operations in the flood affected areas in Dhemaji District of #Assam and East Siang district of #ArunachalPradesh. Over 35 citizens were evacuated, provided critical aid &… pic.twitter.com/xLxSYQ8kzw— SpearCorps.IndianArmy (@Spearcorps) July 1, 2024 ‘అసోంలోని ధేమాజీ జిల్లాలోని శివగురి, అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు సియాంగ్ జిల్లాలోని మెర్ గ్రామాలు ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర డిజాస్టర్ రిలీఫ్ ఫోర్సెస్ (SDRF) సమన్వయంతో సహాయ చర్యలు చేపట్టాం. జూన్ 29 నుంచి వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని భారత్ ఆర్మీ ఒక ప్రకటనలో వెల్లడించింది.Troops of #AssamRifles & #IndianArmy under #SpearCorps, safely rescued 800 personnel, including women and children from the inundated areas in Imphal East and Imphal West districts of #Manipur. The rescue columns also strengthened the embankments of the Imphal and Iril Rivers in… pic.twitter.com/3zDgwLIOda— SpearCorps.IndianArmy (@Spearcorps) July 3, 2024 అస్సాంలోని శివగురి, నామ్సింగ్ ఘాట్, పగ్లామ్, ఓరియన్ ఘాట్ ప్రాంతాల్లో 72 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టాం. సహాయక చర్యల్లో 17 మంది పిల్లలతో సహా మొత్తం 48 మందిని రక్షించినట్లు తెలిపారు. తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి ఆహారం, వైద్య సాయం అందిస్తున్నామని చెప్పారు. సహాయక చర్యల్లో స్థానిక అధికార యంత్రాంగం, డిజాస్టర్ రెస్పాన్స్ టీంలతో కలిసి.. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సాయం అందించామని ఆర్మీ అధికారులు తెలిపారు.#IndianArmy is conducting joint rescue & relief ops in the flood affected areas of #Assam & #ArunachalPradesh; 35 people evacuated so far. pic.twitter.com/WhGMwMiqPL— News IADN (@NewsIADN) July 1, 2024 -
‘అగ్నివీర్ మహేష్ కుమార్ ఫ్యామిలీకి రూ.98 లక్షలు’
ఢిల్లీ: ప్రధాని మోదీ ప్రభుత్వం చేపట్టిన అగ్నివీర్ పథకంపై ఇటీవల లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. మందుపాతర పేలి అగ్నివీరుడు అమరుడు అయితే.. అమరుడని పిలువరు. అగ్నివీర్ అంటారు. వారికి రావాల్సిన పెన్షన్ రాదు. పరిహారం ఇంటికి అందదని మండిపడ్డారు. అదేవిధంగా అజయ్ కుమార్ అనే అగ్నివీర్ కుటుంబానికి నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందించలేదని నిన్న( బుధవారం) ‘ఎక్స్’లో విమర్శలు చేశారు. మహేష్ కుమార్ మాట్లాడిని వీడియోను షేర్ చేశారు. అయితే రాహుల్ గాంధీ విమర్శలపై ఇండియన్ ఆర్మీ స్పందించింది. ‘అమరుడైన అగ్నివీర్ కుటుంబానికి నష్టపరిహారం అందిచలేదని సోషల్‌మీడియాలో పోస్టులు వెలిశాయి. అయితే అమరుడై మహేష్ కుమార్ కుటుంబానికి 98. 39 లక్షలు అందించాం. ఎక్స్ గ్రేషియాతో పాటు ఇతర చెల్లింపుల కింద మొత్తం 67 లక్షలు ఇవ్వాల్సి ఉంది. అగ్నివీర్ పథకం ప్రకారం పోలీసుల వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ డబ్బును కూడా అందిస్తాం. దీంతో మొత్తం రూ. 1.65 కోట్లు మహేష్‌కుమార్ కుటుంబానికి అందించినట్లు అవుతుంది’అని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. ఈ మేరకు రాహుల్ గాంధీ ఎక్స్ పోస్ట్‌కు స్పష్టత ఇచ్చింది భారత ఆర్మీ.‘రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమరులైన అగ్నివీరుల కుటుంబాలకు అందించే ఆర్థిక సాయవ విషయంలో పార్లమెంట్లో అబద్ధాలు చెప్పారు. అమరులైన అగ్నివీర్ కుటుంబానికి రూ. కోటి ఇస్తున్నామని మంత్రి చెప్పారు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు. అమరుడైన అగ్నివీర్ అజయ్ కుమార్ తండ్రి నాతో మీరు(ప్రభుత్వం) చెప్పిన అబద్దాలు గురించి తెలిపారు. వారి కుటుంబానికి పరిహారం అందలేదని చెప్పారు. రక్షణ మంత్రి పార్లమెంట్, దేశానికి, భారత ఆర్మీకి , అమరుడైన అగ్నివీర్ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి’అని ‘ఎక్స్’లో రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.सत्य की रक्षा हर धर्म का आधार है!लेकिन रक्षा मंत्री राजनाथ सिंह ने शहीद अग्निवीर के परिवार को सहायता मिलने के बारे में संसद में झूठ बोला।उनके झूठ पर शहीद अग्निवीर अजय सिंह के पिता जी ने खुद सच्चाई बताई है।रक्षा मंत्री को संसद, देश, सेना और शहीद अग्निवीर अजय सिंह जी के… pic.twitter.com/H2odxpfyOO— Rahul Gandhi (@RahulGandhi) July 3, 2024ఇటీవల లోక్‌సభలో ప్రతిపక్ష రాహల్ గాంధీ.. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంపై విమర్శలు చేశారు. అగ్నివీర్లను వాడకొని వదిలేస్తున్నారని మండిపపడ్డారు. రాహుల్ గాంధీ విమర్శలపై లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అభ్యంతరం తెలిపారు. అమరులైన అగ్నివీర్ కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం చేల్లిస్తున్నామని తెలిపారు. దీనిపై ప్రధాని మోదీ సైతం స్పందించారు. రక్షణ, భద్రత వ్యవస్థల్లో భారత్‌ను పటిష్టం చేసే సంస్కరణలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని చురకలంటించారు. -
సైన్యానికి సేవలందించే చిప్ ఆధారిత 4జీ బేస్ స్టేషన్
భారత సైన్యం తొలిసారిగా స్వదేశీ చిప్ ఆధారిత 4జీ మొబైల్ బేస్ స్టేషన్‌ను ప్రవేశపెట్టింది. బెంగుళూరుకు చెందిన ‘సిగ్నల్‌ట్రాన్’ అనే సంస్థ దీన్ని తయారుచేసింది. ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ పోర్టల్ ద్వారా బిడ్‌ను దక్కించుకుని దీన్ని రూపొందించినట్లు సిగ్నల్‌ట్రాన్ తెలిపింది. ఈ ‘సహ్యాద్రి’ ఎల్టీఈ బేస్ స్టేషన్లో ఉపయోగించే చిప్‌ను కంపెనీ ఆధ్వర్యంలోని ‘సిగ్నల్ చిప్’ బృంద్రం అభివృద్ధి చేసిందని సంస్థ వ్యవస్థాపకుడు హిమాంషు ఖాస్నిస్ తెలిపారు.హిమాంషు, తన బృందం 2010లో 4జీ, 5జీ నెట్వర్క్ చిప్‌లను తయారు చేయడానికి ఈ కంపెనీను స్థాపించారు. ఈ సందర్భంగా హిమాంషు మాట్లాడుతూ..‘దేశంలోనే మొదటిసారి చిప్ ఆధారిత 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కోసం ప్రత్యేక వ్యవస్థను తయారుచేశాం. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించాం. సంక్లిష్ట కమ్యూనికేషన్ టెక్నాలజీ కోసం దేశీయ చిప్ ఆధారిత నెట్‌వర్క్‌ను భారతీయ సైన్యంలోకి ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. గతేడాది 4జీ ఎల్టీఈ నెట్వర్క్ ఇన్ ఎ బాక్స్(ఎన్ఐటీ) సాంకేతికత కోసం భారతీయ సైన్యం గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్‌లో బిడ్లను పోస్ట్ చేసింది. దాంతో సిగ్నల్‌ట్రాన్ ఈ బిడ్‌ను దక్కించుకుంది. కేవలం 7 కిలోల బరువున్న ఈ సహ్యాద్రి నెట్వర్క్ ఇన్ ఎ బాక్స్ (ఎన్ఐబీ) వ్యవస్థ అధిక నాణ్యత కలిగిన వైర్లెస్ కమ్యూనికేషన్‌ను అందిస్తుంది. ఆడియో, వీడియో, డేటా అప్లికేషన్ల సరఫరాలో సమర్థంగా పనిచేస్తుంది. సైనికులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారితో కమ్యూనికేషన్ చేయడానికి వీలవుతుంది. భారత్ సైన్యానికి కంపెనీ 20 యూనిట్లను సరఫరా చేసింది’ అని చెప్పారు.‘ఈ బేస్ స్టేషన్లను ఎప్పుడు, ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనే దానిపై సైన్యం నిర్ణయం తీసుకుంటుంది. అవి తేలికపాటి, మొబైల్ యూనిట్లు కాబట్టి వారి అవసరాలకు అనుగుణంగా ఎక్కడికైనా మార్చుకునే సౌలభ్యం ఉంటుంది. దేశంలోని బేస్ స్టేషన్లల్లో ఎక్కువ భాగం స్థానికంగా తయారు చేసినవికావు. కొన్నింటిలో స్వదేశీ చిప్‌లు కూడా లేవు. ప్రస్తుతం ఆధునిక సెమీకండక్టర్ చిప్‌ల తయారీకి దేశంలో ఫ్యాబ్రికేషన్ సౌకర్యం లేదు. ఎన్విడియా, క్వాల్కామ్, మీడియాటెక్ వంటి ప్రముఖ సెమీకండక్టర్ కంపెనీలకు సమానమైన మోడల్లో సిగ్నల్‌చిప్ ఈ టెక్నాలజీని రూపొందించింది. 2029 నాటికి భారతీయ బేస్ స్టేషన్ మార్కెట్ విలువ సుమారు రూ.2 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా’ అని ఖాస్నిస్ వివరించారు. -
బోర్డర్లో పాక్ కాల్పులు.. ధీటుగా స్పందించిన ఆర్మీ
జమ్మూ: సరిహద్దులో పాకిస్తాన్ మరోసారి దుశ్చర్యకు ఒడిగట్టింది. జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌జిల్లాలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శుక్రవారం(జూన్28) రాత్రి పాక్‌సైన్యం కాల్పులకు దిగింది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.క్రిష్టఘాటి సెక్టార్ వద్ద సరిహద్దు వద్ద భారత్‌వైపు నుంచి ఎలాంటి చర్యలు లేకుండానే పాక్ సైన్యం కాల్పులకు దిగినట్లు తెలుస్తోంది. పాక్ సైన్యం జరిపిన ఈ కాల్పులకు భారత సైన్యం ధీటుగా సమాధానమిచ్చినట్లు సమాచారం. సరిహద్దు వెంట చొరబాటుదారులను పంపే సమయంలో దృష్టిని మరల్చడానికే పాక్ సైన్యం కాల్పులకు పాల్పడినట్లు చెబుతున్నారు. దీంతో చొరబాట్లను అడ్డుకోవడానికి సైన్యం అప్రమత్తమైంది. -
ఆర్మీ విన్యాసంలో విషాదం..
-
మేజర్గారి ప్రసంగం మెగా హిట్
ప్రతిష్ఠాత్మక ‘మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డ్’ అందుకోవడంతో వార్తల్లోకి వచ్చిన మేజర్ రాధికాసేన్ తన ‘వైరల్ స్పీచ్’ ద్వారా మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ‘జెండర్–సెన్సిటివ్ పీస్‌కీపింగ్ ప్రాముఖ్యత గురించి తన ప్రసంగంలో నొక్కి చెప్పింది సేన్. ‘జెండర్–సెన్సిటివ్ పీస్‌కీపింగ్ అనేది కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదు. అది అందరి బాధ్యత. మహిళల ఆరోగ్యం, విద్య, శిశుసంరక్షణ. లింగసమానత్వం, లైంగిక హింసను ఎదుర్కోవడం లాంటి అంశాలపై కమ్యూనిటీలతో మమేకమయ్యే అవకాశం లభించింది’ అంటుంది సేన్. ప్రసంగం అనంతరం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ రాధికసేన్ను నిజమైన నాయకురాలిగా, మోడల్‌గా అభివర్ణించారు. -
Major Radhika Sen: కాంగోలో శాంతిదూత
భారత ఆర్మీకి చెందిన మేజర్ రాధికా సేన్‌కు ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరానికి గాను ‘మిలటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రకటించింది. ప్రతిష్టాత్మక ఈ అవార్డు కాంగోలో స్త్రీలు, బాలికల పట్ల హింస చోటు చేసుకోకుండా రాధికా సేన్ చూపిన శాంతి ప్రబోధానికి, ప్రచారానికి నిదర్శనం. రాధికాసేన్ పరిచయం.తు΄ాకీ పట్టుకొని శాంతి కోసం ప్రయత్నించడం జటిలమైన పని. అంతర్యుధ్ధం జరిగే దేశాల్లో బయటి దేశాల నుంచి వెళ్లి ఈ పని చేయాలంటే ్ర΄ాణాలతో చెలగాటం. కాని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని పీస్ కీపింగ్ ఫోర్స్ ఆయా దేశాలలో శాంతి కోసం ΄ోరాటం చేస్తూనే ఉంటుంది. ్ర΄ాణాలకు తెగిస్తూనే ఉంటుంది. అందుకే ఈ శాంతి దళాలలో గొప్పగా పని చేసిన వారికి ఐక్యరాజ్యసమితి వివిధ విభాగాలలో అవార్డులు ఇస్తుంటుంది. లింగ వివక్ష, మహిళలపై హింసను సమర్థంగా నియంత్రించడానికి పని చేసే వారికి ‘మిలటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ ఇస్తోంది. 2023 సంవత్సరానికి ఆ అవార్డు మన ఆర్మీ మేజర్ రాధికా సేన్‌కు దక్కింది.ఈ కాంగోలో ఘోరాలుమధ్య ఆఫ్రికాలో రెండు కాంగోలు ఉన్నాయి. ఒకటి ‘రిపబ్లిక్ ఆఫ్ కాంగో’ (ఆర్ఓసి), రెండు ‘డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో’ (డిఆర్సి). ఆఫ్రికాలో రెండవ అతి పెద్ద దేశం డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఒకప్పుడు బెల్జియం వలసగా ఉన్న ఈ దేశం స్వతంత్రం ΄÷ంది ‘మొబుతు’ అనే నియంత ΄ాలనలో మగ్గింది. అతణ్ణి ప్రజలు కిందకు దించాక 1998 నుంచి అక్కడ అస్థిర ΄ాలన కొనసాగుతూ ఉంది. తరచూ అంతర్యుద్ధాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ దేశ తూర్పు ్ర΄ాంతాలైన ఇటురి, నార్త్ కీవోలలో రెండు సాయుధ దళాల వల్ల దాడులు జరుగుతున్నాయి. ‘ఎయిడెడ్ డెమొక్రటిక్ ఫోర్సెస్’ అనే గ్రూప్, ‘హుతూస్’ అనే మరో గ్రూప్ తమ తమ కారణాల రీత్యా తీవ్ర హింసకు ΄ాల్పడుతుంటాయి. ఈ రెండు గ్రూపుల మధ్య సామాన్య జనం నలుగుతున్నారు. వీరిని అదుపు చేయడానికి వచ్చే సైన్యం వీరి కంటే ఎక్కువ హింసకు ΄ాల్పడుతోంది. వీటన్నింటి మధ్య కనీస ఓదార్పుగా ఐక్యరాజ్య సమితి శాంతి దళాలు పని చేస్తున్నాయి.అత్యాచార పర్వంరిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని దాదాపు 30 లక్షల మంది స్త్రీలు, బాలికలు ఏదో ఒక మేర హింసకు, లైంగిక హింసకు లోనయ్యారు. అర్ధరాత్రి అపరాత్రి ప్రత్యర్థి గ్రూపులు దాడి చేసి స్త్రీలు, బాలికల మీద అత్యాచారాలు చేసి మగవారిని చంపేసి ΄ోతారు. ఇవి అక్కడ స్త్రీల మీద తీవ్రమైన మానసిక ప్రభావాన్ని ఏర్పరుస్తున్నాయి. అత్యాచారాల వల్ల వారిలో చాలామంది హెచ్.ఐ.వి/ఎయిడ్స్ బారిన పడుతున్నారు. అక్కడి చిన్నపిల్లలైతే దారుణమైన ఆకలిని ఎదుర్కొంటున్నారు. ΄ûష్టికాహారం ఊసే లేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని బాధిత స్త్రీలలో విశ్వాసం నింపుతూ వారి కోసం సమర్థంగా పని చేయడం వల్ల రాధికా సేన్‌ను అవార్డు వరించింది.బాధితుల కోసం దూతగా వచ్చి...ఐక్యరాజ్య సమితి శాంతి దళాలలో భాగంగా ఆర్మీ మేజర్ రాధికా సేన్ 2023 ఏప్రిల్‌లో డి.ఆర్.కాంగోకు వెళ్లింది రాధికా సేన్. ‘ఇండియన్ రాపిడ్ డి΄్లాయ్మెంట్ బెటాలియన్’కు ఆమె అక్కడ కమాండర్‌గా పని చేసింది. అక్కడ మొదటగా ఆమె చేసిన పని తన బెటాలియన్‌కు కాంగో సంస్కృతిని పరిచయం చేయడం. స్త్రీల పట్ల సుహృద్భావనతో ఎలా మెలగాలో తెలియచేయడం. వారిలో ఆత్మవిశ్వాసం ఎలా కలిగించాలో చెప్పడం. రాధికా సేన్ నార్త్ కీవోలో పని చేసింది. అక్కడ స్త్రీల కోసం హెల్త్ ఎడ్యుకేషన్, ఉ΄ాధి, లింగ సమానత్వం, కుటుంబ నిర్ణయాల్లో స్త్రీ ్ర΄ాధాన్యం వంటి అంశాలలో రాధికా సేన్ వర్క్‌షాప్‌లు నిర్వహించింది. భర్తలను, పిల్లలను కోల్పోయిన స్త్రీలలో ఆత్మవిశ్వాసం నింపేలా వారితో తరచూ ఆమె సంభాషణలు నిర్వహించేది. వారు మళ్లీ పనిలో పడేలా చూసింది. హింసను సమష్టిగా ఎలా ఎదుర్కొనాలో అవగాహన కల్పించింది. కాంగో మహిళలు రాధికా సేన్‌ను తమలోని మనిషిగా చూశారు. ఆమె ద్వారా వారి ముఖాల్లో చిరునవ్వులు వచ్చాయి. అందుకే ఐక్యరాజ్యసమితి సెక్రెటరి జనరల్ ఆంటోనియో గుటెరస్ రాధికా సేన్‌కు అవార్డు ప్రకటిస్తూ ‘రాధికా సేన్ కాంగో మహిళలను గొంతెత్తేలా చేయగలిగింది. శాంతి కోసం వారు ముందుకొచ్చేలా ఉద్యుక్తుల్ని చేసింది’ అని మెచ్చుకున్నారు. మే 30 (నేడు) రాధికా సేన్‌కు అవార్డు బహూకరించనున్నారు. -
ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీకాలం పొడిగింపు
సాక్షి, ఢిల్లీ: ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీ కాలం పొడిగింపు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీకాలాన్ని కేంద్రం నెల రోజులు పొడిగించింది. జూన్ 30 వరకు ఆర్మీ చీఫ్‌గా కొనసాగనున్నారు. పదవీకాలం పొడిగింపునకు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఆదివారం ఆమోదం తెలిపింది. మనోజ్ పాండే ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. గతంలోనూ కేంద్రం ఆయన పదవీకాలాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే.మనోజ్ పాండే ఏప్రిల్ 30, 2022న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ పాండే.. ఇప్పటి వరకు ఆర్మీ వైస్ చీఫ్‌గా ఉన్న జనరల్ పాండే, కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ విభాగం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎంపికైన మొదటి వ్యక్తి. జనరల్ మనోజ్ పాండే నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో శిక్షణ అనంతరం 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్‌లో విధుల్లో చేరారు. 39 ఏళ్ల కెరీర్లో పలు కీలక బాధ్యతలు చేపట్టారు.పశ్చిమ ప్రాంతంలో ఇంజనీర్ బ్రిగేడ్‌కు, నియంత్రణ రేఖ వద్ద ఇన్ఫాంట్రీ బ్రిగేడ్‌కు, లదాఖ్ సెక్టార్లో మౌంటేన్ డివిజన్‌కు నేతృత్వం వహించారు. 2001లో పార్లమెంటుపై ఉగ్ర దాడి అనంతరం జమ్మూ కశ్మీర్‌లోని పల్లన్వాలా సెక్టార్లో ఆపరేషన్ పరాక్రమ్ సందర్భంగా ఇంజనీర్ రెజిమెంట్‌కు సారథ్యం వహించారు. తూర్పు కమాండ్ బాధ్యతలు చూశారు. -
జయహో జోయా
‘ఈ ప్రపంచంలో గొప్ప వృత్తులు ఏమిటి?’ అని చిన్నప్పుడు తండ్రిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం జోయా మీర్జా మనసులో ముద్రించుకుపోయింది. ఆ తరువాత కలగా మారింది. కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో పరాజయం పలకరించింది. నిరాశలో రెండడుగులు వెనక్కి వేసినా ఆ తరువాత మాత్రం ఆత్మవిశ్వాసం అనే ఇంధనంతో వేగంగా ముందడుగు వేసింది. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ డాక్టర్‌గా ఎంపిక అయింది జోయా మీర్జా. చత్తీస్‌గఢ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది జోయా....కల కన్నప్పుడే విజయానికి దగ్గరవుతాం. ఏ కలా లేనప్పుడు ఏ విజయమూ ఉండదు. ఛత్తిస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాకు చెందిన జోయా మీర్జా చిన్నప్పటి నుంచి పెద్ద కలలు కనేది. అయితే అవేమీ ఆకాశానికి నిచ్చెన వేయాలనుకునే కలలు కావు. ‘వైద్యురాలిగా సేవ అందించాలి, సైన్యంలో పనిచేయాలి’... ఇలా ఉండేవి ఆమె కలలు.కన్న కలలు కాలానికి నిలబడతాయనే గట్టి నిబంధన లేదు. అయితే గట్టి పట్టుదల ఉంటే కల నెరవేర్చుకోవడం కష్టమేమీ కాదు అని చెప్పడానికి స్ఫూర్తి... జోయా మీర్జా. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ (ఏఎఫ్ఎంసీ)లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన మీర్జా ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ డాక్టర్‌గా నియామకం కావడం ద్వారా తన కలను నిజం చేసుకుంది.అయితే జోయా మీర్జాది నల్లేరు మీద నడకేమీ కాదు. కుటుంబ ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉండేది. ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నా ‘ఇక చదివింది చాలు’ అనే మాట తల్లిదండ్రుల నుంచి ఎప్పుడూ రాలేదు. చదువు విషయంలో కుమార్తెను ఎప్పుడూ ్రపోత్సహించేవారు. జోయాను డాక్టర్‌గా చూడాలనేది అమ్మమ్మ కల.‘నీట్’ పరీక్షలో జోయాను ఫెయిల్యూర్ పలకరించింది. బాధపడుతూ కూర్చోకుండా ‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’లో గ్రాడ్యుయేషన్ చేయడంపై దృష్టి పెట్టింది. ఒక సంవత్సరం గ్యాప్ తీసుకొని రాజస్థాన్‌లోని కోటాలో ‘నీట్’ కోసం కోచింగ్ తీసుకోవడానికి జోయా మీర్జాను తల్లిదండ్రులు ఒప్పించారు. కోచింగ్ కోసం అప్పులు చేశారు. ‘తల్లిదండ్రుల కోరిక మేరకు కోటాకు వెళ్లాను. అయితే ్రపాక్టీస్ ఎగ్జామ్స్‌లో ఇతర విద్యార్థులు నా కంటే మెరుగ్గా ఉన్నారనే విషయం తెలిసినప్పుడు నాలో ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. నీట్ పరీక్షకు ఇరవై రోజుల ముందు అమ్మమ్మ తీవ్రమైన అనారోగ్య సమస్య వల్ల నేను ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఆ తరువాత తిరిగి కోటాకు వచ్చాను. ఒకే ఒక్క ర్యాంకు తేడాతో సీటు సాధించే అవకాశాన్ని కోల్పోయాను’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది మీర్జా.తల్లిదండ్రులు మొదట నిరాశ పడినా ‘మరో ప్రయత్నం’ అంటూ కుమార్తెను కోచింగ్ కోసం భిలాయ్‌కు పంపించారు.‘భిలాయ్ కోచింగ్ సెంటర్లోని ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడంతోపాటు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. అది నాకు ఎంతగానో ఉపకరించింది’ అంటుంది మీర్జా. ఆ ఆత్మబలమే ‘నీట్’లో తగిన మార్కులు సాధించి ‘ఏఎఫ్ఎంసీ’ ఎంచుకునేలా చేసింది. పుణేలోని ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ’లో ఎంబీబీఎస్ చేసింది.‘గొప్ప వృత్తులు ఏమిటి?’ అని చిన్నప్పుడు తండ్రిని అడిగినప్పుడు... ‘సోల్జర్, డాక్టర్’ అని చేప్పేవాడు. లెఫ్టినెంట్ డాక్టర్‌గా ఆ రెండు గొప్ప వృత్తులలో పనిచేసే అవకాశం తన అదృష్టం అంటుంది జోయా మీర్జా.తన ఫస్ట్ పోస్టింగ్ జమ్మూలో.‘చదువుపై నాకు ఉన్న ఆసక్తిని గమనించి మా అమ్మమ్మ నన్ను డాక్టర్‌గా చూడాలనుకుంది. డాక్టర్‌గా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంది. దురదృష్టవశాత్తు ఆమె ఏడాది క్రితం చనిపోయింది. నన్ను యూనిఫామ్‌లో చూడలేకపోయింది’ అమ్మమ్మను తలుచుకుంటూ బాధగా అంటుంది మీర్జా.‘పరులకు సహాయం చేయాలనే తత్వం తనది. తన మనస్తత్వానికి సరిగ్గా సరిపోయే వృత్తి ఇది. మీర్జాకు ఎలాంటి సవాలైనా ఎదుర్కొనే శక్తి ఉంది’ అంటున్నాడు జోయా తండ్రి షమీమ్ మీర్జా. -
ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు.. రంగంలోకి దిగిన ఆర్మీ
ఉత్తరాఖండ్‌లోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు నైనిటాల్ నగరం వరకు విస్తరిస్తోంది. మంటల కారణం పొగ కమ్ముకుంటుంది. ప్రస్తుతం మంటలు నైనిటాల్ హైకోర్టు కాలనీవైపు విస్తరిస్తున్నాయి. దీంతో అప్రత్తమైన ఉత్తరఖండ్ ప్రభుత్వం మంటలు ఆర్పడానికి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాయం కోరింది. దీంతో మంటలు ఆర్పడానికి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రంగంలో దిగింది. ఆర్మీ అధికారులు హెలికాప్టర్ల సాయంతో చెలరేగతున్న మంటలపై నీటిని వెదజల్లుతూ ఆర్పుతున్నారు. నైనిటాల్ లేక్‌లో బోటింగ్ సేవలు నిలిపిస్తున్నట్లు అధికారాలు ప్రకటన విడుదల చేశారు.‘ఇప్పటివరకు హైకోర్టు కాలనీకి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. కానీ మంటలు ప్రమాదకారంగా పలు భవనాలకు సమీపంగా చేరుకుంటుంది’ అని హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రాటర్ తెలిపారు. నైనిటాల్ జిల్లాలోని లారియా కాంటా అడవుల్లో కూడా మంటలు వ్యాపించగా.. అక్కడి ఐటీఐ భవనం పాక్షికంగా దెబ్బతింది. అడవులకు నిప్పు పెట్టారన్న అనుమానాలు ఉన్న ముగ్గురు వ్యక్తులను రుద్రప్రయాగ్‌లో అరెస్ట్ చేసినట్లు ఫారెస్ట్ డివిజినల్ అఫీసర్ అభిమాన్యూ తెలిపారు.ఈ క్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అడవుల్లో చెలరేగిన మంటలపై శనివారం సమీక్ష నిర్వహించారు. మంటలు ఆర్పడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. గడిచిన వారం రోజుల్లో అడవుల్లో కార్చిచ్చు ప్రమాదాలు వేగంగా విస్తరిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సుమారు 31 కొత్త అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగిన ఘటనలు చోటు చేసుకున్నాయి. -
త్రివిధ దళాల హోలీ వేడుకలు.. (ఫోటోలు)
-
‘చైనా, పాక్ స్నేహం.. భారత్‌కు సవాలే’
ఢిల్లీ: చైనా దుందుడుకు చర్యలు, అదేవిధంగా డ్రాగన్ దేశం పాకిస్తాన్‌తో కొనసాగిస్తున్న స్నేహం భారత్‌కు సవాల్‌గా మారుతోందని చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. ఆ రెండు దేశాల స్నేహం భారత్ భద్రతా బలగాలకు ఛాలెంజ్ విసురుతోందని పేర్కొన్నారు. ఇండియా టుడే కాన్క్లేవ్లో పాల్గొన్న అనిల్ చౌహాన్ పలు విషయాలు పంచుకున్నారు. పాక్, చైనా దేశాల మధ్య స్నేహం రోజురోజుకు హిమాలయాలంత ఎత్తు.. సముద్రమంత లోతుకు విస్తరిస్తోందని అన్నారు. అదే విధంగా ఆ రెండు దేశాలు కూడా అణు సామర్థ్యం కలిగి ఉన్నాయని తెలిపారు. కానీ, ఈ సవాళ్లు తాము ముందునుంచి ఊహిస్తున్నవేనని ఈయన స్పష్టం చేశారు. మరికొన్ని ఊహించని పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక.. పాకిస్తాన్ ఆర్మీని తేలికగా తీసుకుంటున్నామన్న విషయాన్ని ఆయన తోసిపుచ్చారు. ఇటీవల తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో కొట్టుమిట్టాడిన పాక్.. ఇప్పుడిప్పుడే అన్ని రకాలుగా స్థిరత్వాన్ని పొందుతుందన్న విషయాన్ని వెల్లడించారు. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఆర్మీ తన సత్తా కోల్పోకుండా కాపాడుకుంటోందని తెలిపారు. తద్వారా పాక్‌తో భారత్‌కు ముప్పు వాటిల్లే అవకాశం లేకపోలేదని అనిల్ చౌహన్ పేర్కొన్నారు. అయితే భారత్ సైన్యం సైతం ఎప్పటికప్పుడు తన సామర్థాన్ని పెంచుకుంటోందని స్పష్టం చేశారు. -
Bharat Shakti: అబ్బురపర్చిన ‘భారత్ శక్తి’ విన్యాసాలు..వీక్షించిన మోదీ (ఫొటోలు)
-
పోఖ్రాన్ యుద్ధ విన్యాసాల్లో ‘రోబో డాగ్’ సత్తా!
భారత సైన్యం వ్యవస్థాగత నిఘాను మెరుగుపరచడానికి, పోరాట కార్యకలాపాల్లో సహాయానికి రోబోటిక్ డాగ్ ‘మ్యూల్’ను అభివృద్ధి చేసింది. ఈ నెల 12న పోఖ్రాన్లో జరగనున్న ఆర్మీ ఎక్సర్సైజ్లో ఈ రోబో డాగ్ తన సత్తా చాటనుంది. ‘మ్యూల్’ అంటే మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్. దీనిలో పలు ఫీచర్లు ఉన్నాయి. ‘మ్యూల్’.. థర్మల్ కెమెరాలు, రాడార్‌తో అనుసంధానమై ఉంటుంది. మంచు, ఎడారి, కఠినమైన నేల, ఎత్తయిన మెట్లు, కొండ ప్రాంతాలలో.. ప్రతి అడ్డంకిని దాటగలిగేలా ఈ రోబో డాగ్‌ను రూపొందించారు. దీనికి శత్రు లక్ష్యాలను మట్టుబెట్టగల సామర్థ్యం కూడా ఉంది. మార్చి 12న భారత సైన్యం రాజస్థాన్‌లోని పోఖ్రాన్లో స్వదేశీ ఆయుధాలు, సాయుధ దళాలకు చెందిన పరికరాల బలాన్ని ప్రదర్శించనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను భారత సైన్యం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. దీనిలో ఇండియన్ ఆర్మీకి చెందిన రోబోటిక్ డాగ్ ‘మ్యూల్’ యాక్షన్ మోడ్‌లో కనిపించనుంది. ఈ రోబో డాగ్ 2023లోనే భారత సైన్యానికి చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్‌లో చేరింది. రోబోటిక్ డాగ్ ‘మ్యూల్’ కుక్క మాదిరిగా కనిపిస్తుంది. దీనికి నాలుగు కాళ్లు ఉంటాయి. ‘మ్యూల్’ బరువు దాదాపు 51 కిలోలు. దీని పొడవు 27 అంగుళాలు. ఇది ఒక గంటలో రీఛార్జ్ అవుతుంది. పది గంటల పాటు పని చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. శత్రు లక్ష్యాలపై కాల్పులు జరిపే సాంకేతికత ‘మ్యూల్’లో ఉంది. #BharatShakti स्वदेशीकरण से सशक्तिकरण Displaying the might of indigenous weapons & equipment of #IndianArmedForces. On 12 Mar 2024 at #Pokaran Field Firing Ranges (Rajasthan).#AatmanirbharBharat#YearofTechAbsorption@DefenceMinIndia@HQ_IDS_India@IAF_MCC@indiannavy pic.twitter.com/poRvYHjOZh — ADG PI - INDIAN ARMY (@adgpi) March 9, 2024 -
మంచులో చిక్కుకున్న పర్యాటకులను కాపాడిన ఆర్మీ సిబ్బంది
తూర్పు సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ సైనికులు మంచులో చిక్కుకున్న పర్యాటకుల ప్రాణాలను కాపాడారు. బుధవారం అకస్మాత్తుగా భారీ హిమపాతం కురియడంతో తూర్పు సిక్కింలోని నటులాలో 500 మంది పర్యాటకులు మంచులో చిక్కుకుపోయారు. వీరిని గమనించిన ఆర్మీ సైనికులు వెంటనే అప్రమత్తమై పర్యాటకులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అకస్మాత్తుగా కురిసిన భారీ మంచు కారణంగా 500 మంది పర్యాటకులతో పాటు దాదాపు 175 వాహనాలు ఆ ప్రాంతంలో చిక్కుకుపోయాయి. వారిని ఆర్మీ బృందం కాపాడింది. భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ పర్యాటకులను కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆర్మీ తెలిపింది. దీనికిముందు ఫిబ్రవరి 20న జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భారీ హిమపాతం కారణంగా చిక్కుకుపోయిన వాహనాలను తరలించడంలో సీఆర్పీఎఫ్ సైనికులు సహాయం అందించారు. భారీ వర్షం, హిమపాతం కారణంగా శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిలో కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. 𝐒𝐮𝐝𝐝𝐞𝐧 𝐒𝐧𝐨𝐰𝐟𝐚𝐥𝐥 𝐢𝐧 𝐄𝐚𝐬𝐭 𝐒𝐢𝐤𝐤𝐢𝐦, 𝟓𝟎𝟎 𝐒𝐭𝐫𝐚𝐧𝐝𝐞𝐝 𝐓𝐨𝐮𝐫𝐢𝐬𝐭𝐬 𝐑𝐞𝐬𝐜𝐮𝐞𝐝 𝐛𝐲 𝐓𝐫𝐨𝐨𝐩𝐬 𝐨𝐟 𝐓𝐫𝐢𝐬𝐡𝐚𝐤𝐭𝐢 𝐂𝐨𝐫𝐩𝐬 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐀𝐫𝐦𝐲 Due to sudden heavy snowfall, approximate 175 vehicles with more than 500 tourists got… pic.twitter.com/vdQTbdQ6jJ — Trishakticorps_IA (@trishakticorps) February 21, 2024 -
ఆర్మీలో ‘జై శ్రీరామ్’, ‘జై బజరంగబలి’ నినాదాలు ఎందుకు?
ప్రపంచంలోని ఐదు అత్యంత శక్తివంతమైన సైన్య బలగాలలో భారత సైన్యం ఒకటిగా గుర్తింపు పొందింది. ఇండియన్ ఆర్మీలో అనేక రెజిమెంట్లు ఉన్నాయి. ప్రతి రెజిమెంట్‌కు దాని సొంత యుద్ధ నినాదాలు ఉన్నాయి. ‘వార్ క్రై’ అంటే యుద్ధ సమయంలో సైనికునికి స్ఫూర్తినిచ్చే, ఉత్సాహభరితమైన నినాదాలు. అవి శత్రువును తరిమికొట్టేందుకు ప్రేరణ కల్పిస్తాయి. సైనికులలో ఉత్సాహాన్ని నింపడానికి పలు రెజిమెంట్లు జై శ్రీ రామ్, బజరంగబలి కీ జై, దుర్గా మాతా కీ జై అంటూ నినాదాలు చేస్తాయని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రెజిమెంట్లలో బ్రిటీష్ కాలం నుంచి ‘జై శ్రీరామ్’ అనే యుద్ధ నినాదం వినిపిస్తే వస్తోంది. నాడు బ్రిటిషర్లుకూడా దీనికి అభ్యంతరం చెప్పలేదు. మతపరమైన యుద్ధ నినాదాలు సైనికులలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయని బ్రిటీషర్లు కూడా భావించారు. భారత సైన్యం (ఆర్మీ), వైమానిక దళం, నావికాదళాల యుద్ధ నినాదం ఒకటే. అదే ‘భారత్ మాతా కీ జై’.. అయితే ప్రతి రెజిమెంట్‌కు ఒక్కో ప్రత్యేక నినాదం ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రాజ్‌పుతానా రైఫిల్స్ రాజ్‌పుతానా రైఫిల్స్ సైన్యంలోని పురాతన రైఫిల్ రెజిమెంట్. ఇది 1921 సంవత్సరంలో ఏర్పడింది. ఆ సమయంలో ఇది బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ పరిధిలో ఉంది. ‘రాజా రామచంద్ర కీ జై’ అనేది ఈ రెజిమెంట్ నినాదం. టెరిటోరియల్ ఆర్మీ టెరిటోరియల్ ఆర్మీ అనేది భారత సైన్యానికి సహాయక సైనిక సంస్థ. భారత సైన్యానికి సేవలను అందించడం దీని పని. ఇది 1949, అక్టోబర్ 9న ఏర్పడింది. ‘జై శ్రీరామ్’ అనేది టెరిటోరియల్ ఆర్మీ నినాదం. కుమావూ రెజిమెంట్ కొన్ని రెజిమెంట్లు ‘బజరంగబలి’ పేరుతో యుద్ధ నినాదాలు చేస్తాయి. వాటిలో ఒకటి కుమావూ రెజిమెంట్. ఇది 1922లో ఏర్పాటయ్యింది. ‘కాళికా మాతా కీ జై, బజరంగబలి కీ జై, దాదా కిషన్ కీ జై’ అనేవి కుమావూ రెజిమెంట్ యుద్ధ నినాదాలు. బీహార్ రెజిమెంట్ బీహార్ రెజిమెంట్ సైన్యంలోని పురాతన పదాతిదళ రెజిమెంట్. ఇది 1941లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం బీహార్‌లోని దానాపూర్‌లో ఉంది. ఈ రెజిమెంట్ 2020లో గాల్వాన్ వ్యాలీలో చైనీస్ ఆర్మీని మట్టి కరిపించింది. ‘జై బజరంగబలి’ అనేది బీహార్ రెజిమెంట్ నినాదం. జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ భారత సైన్యానికి చెందిన సైనిక బృందం. ఇది 1821లో ఏర్పడింది. ‘దుర్గా మాతా కీ జై' అంటూ జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ యుద్ధ నినాదాలు చేస్తుంటుంది. గర్వాల్ రైఫిల్స్ గర్వాల్ రైఫిల్స్ బెంగాల్ ఆర్మీ ఆధ్వర్యంలో 1887లో స్థాపితమయ్యింది. ఇది బెంగాల్ ఆర్మీకి చెందిన 39వ రెజిమెంట్. ఆ తర్వాత ఇది బ్రిటిష్ ఆర్మీలో భాగమైంది. స్వాతంత్య్రానంతరం ఇది ఇండియన్ ఆర్మీ రెజిమెంట్‌గా మారింది.దీని యుద్ధ నినాదం ‘బద్రీ విశాల్ కీ జై’. జాట్ రెజిమెంట్ జాట్ రెజిమెంట్ ఒక పదాతిదళ రెజిమెంట్. స్వాతంత్ర్యం తరువాత ఈ రెజిమెంట్‌కు ఐదు యుద్ధ గౌరవాలు లభించాయి. ఈ రెజిమెంట్ ఎనిమిది మహావీర్ చక్ర, ఎనిమిది కీర్తి చక్ర, 39 వీర్ చక్ర, 170 సేన పతకాలను అందుకుంది. ‘జాట్ బల్వాన్, జై భగవాన్’అనేది దీని యుద్ధ నినాదం. డోగ్రా రెజిమెంట్ డోగ్రా రెజిమెంట్ 1922లో ఏర్పడింది. డోగ్రా రెజిమెంట్‌కు చెందిన నిర్మల్ చందర్ విజ్ జనవరి 1, 2003న ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. 2005 వరకు ఈ పదవిలో కొనసాగారు. ‘జ్వాలా మాతా కీ జై’ అనేది ఈ రెజిమెంట్ యుద్ధ నినాదం. ఇదే కాకుండా పంజాబ్ రెజిమెంట్, సిక్కు రెజిమెంట్, సిక్కు లైట్ పదాతిదళాల 'జో బోలే సో నిహాల్, సత్ శ్రీ అకల్’అనే నినాదాలు చేస్తాయి. దీనితో పాటు పంజాబ్ రెజిమెంట్ ‘బోలో జ్వాలా మాతా కీ జై’ అనే నినాదాన్ని అందుకుంటుంది. -
బరువు పెరిగితే సెలవులు కట్!
సైనికాధికారులు, సిబ్బందిలో తగ్గుతున్న శారీరక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత సైన్యం కొత్త ఫిట్నెస్ విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం సైన్యంలో పనిచేస్తున్న ప్రతీఒక్కరికీ ఆర్మీ ఫిజికల్ ఫిట్నెస్ అసెస్మెంట్ కార్డ్ (ఏపీఏసీ) ప్రవేశపెట్టనున్నారు. ఆర్మీలో తాజాగా రూపొందించిన శారీరక ప్రమాణాలకు అనుగుణంగా లేని సైనికులకు మెరుగుదల కోసం 30 రోజుల గడువు ఇవ్వనున్నారు. అప్పటికీ విఫలమైతే, ఆ సైనికుని సెలవులను తగ్గించనున్నారు. నూతన మార్పుల ప్రకారం త్రైమాసికానికి ఒకసారి జరిగే ట్రయల్స్‌లో కమాండింగ్ ఆఫీసర్‌కు బదులుగా బ్రిగేడియర్ ర్యాంక్ అధికారి ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. ఈ కొత్త విధానంలో 30 రోజులలోపు మెరుగుదల కనిపించకపోతే అధిక బరువు కలిగిన ఆర్మీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఉన్న పరీక్షలతో పాటు అదనంగా మరికొన్ని పరీక్షలను కూడా నిర్వహించనున్నారు. ఈ కొత్త విధానం ఉద్దేశ్యం సైన్య సిబ్బంది పరీక్షల ప్రక్రియలో ఏకరూపతను తీసుకురావడం, శారీరకంగా అన్‌ఫిట్ లేదా స్థూలకాయంగా మారే ముప్పును తగ్గించడం, జీవనశైలి వ్యాధులు నివారణ. ప్రస్తుతం సైన్యం ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్యాటిల్ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (బీపీఈటీ), ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (పీపీటీ) నిర్వహిస్తోంది. బీపీఈటీ పరీక్షలో సిబ్బంది నిర్ణీత సమయంలో 5 కిలోమీటర్లు పరుగెత్తాలి. తాడు పైకి ఎక్కి తొమ్మిది అడుగుల గొయ్యిని దాటాలి. ఇక్కడ వయస్సు ఆధారంగా సమయం నిర్ణయిస్తారు. పీపీటీలో 2.4 కిలోమీటర్ల రన్, 5 మీటర్ల షటిల్, పుష్ అప్స్, చిన్ అప్స్, సిట్ అప్స్, 100 మీటర్ల స్ప్రింట్ ఉంటాయి. ఇది కాకుండా కొన్ని చోట్ల స్విమ్మింగ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. ఈ పరీక్షల ఫలితాలు వార్షిక రహస్య నివేదిక (ఏసీఆర్)లో పొందుపరుస్తారు. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒక బ్రిగేడియర్ ర్యాంక్ అధికారితో పాటు ఇద్దరు కల్నల్లు, ఒక మెడికల్ ఆఫీసర్ అసెస్మెంట్ నిర్వహిస్తారు. బీపీఈటీ, పీపీటీలు కాకుండా సైనికులకు కొన్ని ఇతర పరీక్షలు కూడా నిర్వహిస్తారు. వీటిలో ప్రతి ఆరు నెలలకు 10 కిలోమీటర్ల స్పీడ్ మార్చ్ , 32 కిలోమీటర్ల రూట్ మార్చ్ ఉంటాయి. అదనంగా 50 మీటర్ల స్విమ్మింగ్ టెస్ట్ కూడా నిర్వహించనున్నారు. -
'వీళ్ళతో ఎప్పుడూ పెట్టుకోవద్దు' - ఆర్మీ గురించి ఆనంద్ మహీంద్రా ట్వీట్
దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో సైనిక బృందాలు, నాగ్ క్షిపణులు, టీ-90 భీష్మ యుద్ద ట్యాంకులు, డ్రోన్ జామర్లు, నిఘా వ్యవస్థలు, వాహనాలపైన అమర్చే మోటార్లు ఇవన్నీ కూడా ఎంతో ఆకర్షణీయంగా నిలిచాయి. గణతంత్ర వేడుకల్లో సైనిక కవాతు భారతదేశ పరాక్రమాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించింది. దీనికి సంబంధించిన వీడియోను పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ.. 'ఇతర దేశాల ఆర్మీకి నాదో సలహా.. వీరితో ఎప్పుడూ పెట్టుకోవద్దు' అంటూ ట్వీట్ చేశారు. ఇండియా దృఢంగా ఉందని చెప్పే రెండు ఎమోజీలను కూడా యాడ్ చేశారు. ఇదీ చదవండి: కొండపై క్రికెట్.. రోడ్డుపై ఫీల్డింగ్ - ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. లక్షల మంది వీక్షించిన ఈ వీడియో 23000 కంటే ఎక్కువ లైక్స్ పొందింది. కాగా పలువురు నెటిజన్లు తమదైన రీతిలో ఇండియన్ ఆర్మీని ప్రశంసిస్తూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. Some personal advice to other armies: Don’t ever.. EVER… mess with these guys… 💪🏽🇮🇳 pic.twitter.com/04svWsUVGn — anand mahindra (@anandmahindra) January 27, 2024 -
సైన్యంలో చేరాలన్నదే ఆ ఊరి యువత లక్ష్యం
-
China: గల్వాన్ ఘటన తర్వాత మరిన్ని..?
ఢిల్లీ: గల్వాన్ ఉద్రిక్తతల తర్వాత.. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భారత్-చైనా సైనిక దళాల మళ్లీ ఘర్షణలు జరిగాయి. కనీసం మరో రెండుసార్లు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. తాజాగా.. భారత సైనిక పశ్చిమ దళం ఆధ్వర్యంలో సైనికులకు సాహస పురస్కారాల ప్రదాన కార్యక్రమం కారణంగా ఈ విషయం బయటపడింది. వారికి ఎందుకు ఈ పురస్కారాలు ఇస్తున్నదీ చెప్పే పత్రాల వల్ల విషయం బయటకు వచ్చింది. ఇక ఈ నెల 13న జరిగిన కార్యక్రమానికి సంబంధించిన వీడియోను చాందీమందిర్‌లో ఉన్న ఆర్మీ వెస్ట్రన్ కమాండ్ ప్రధాన కార్యాలయం యూట్యూబ్ ఛానెల్ అప్లోడ్ చేసింది. అయితే.. సోమవారం ఆ చానెల్ డీయాక్టివేట్ కావడం గమనార్హం. దీనిపై సైన్యం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ, 2021 సెప్టెంబరు- 2022 నవంబరు మధ్య చైనాతో ఘర్షణలు జరిగినట్లు పత్రాల్లో ఉంది. అయితే రెండుసార్లే ఘర్షణలు జరిగాయా? మరిన్ని జరిగాయా? అనేదానిపైనా సైన్యం స్పందించాల్సి ఉంది. మే 2020లో తూర్పు లడఖ్ సరిహద్దు వరుస వివాదం తర్వాత.. వాస్తవాధీన రేక వెంట భారత్, చైనా దళాల మధ్య అనేక వాగ్వివాదాలు జరిగాయి. ఆ మరుసటి నెలలోనే గల్వాన్ లోయలో ఘర్షణలు జరగ్గా.. ఇరువైపులా గాయాలు అయ్యాయి. అప్పటి నుంచి తర్వాత 3,488 కి.మీ. ఎల్ఏసీ వెంట భారత సైన్యం ప్రత్యేక అప్రమత్తతతో ఉంటోంది. తవాంగ్ సెక్టార్లో కూడా చైనా దళాలు అతిక్రమించడానికి ప్రయత్నించాయని.. చైనా ప్రయత్నాలన్నింటిని భారత సైనికులు దృఢంగా ఎదుర్కొన్నారని పార్లమెంట్లో ఆ సమయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక ప్రకటన చేశారు కూడా. -
ఇండియన్ ఆర్మీ ఎప్పుడు ఏర్పడింది? ‘ఆపరేషన్ రాహత్’ ఘనత ఏమిటి?
దేశ రక్షణ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఇండియన్ ఆర్మీ. ప్రాణాలను సైతం లెక్క చేయక నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ, దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసే జవాన్ల త్యాగం ఎవరూ వెలకట్టలేనిది. భారత సైన్యానికున్న పరాక్రమాన్ని, ధీరత్వాన్ని, త్యాగాలను గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేను నిర్వహిస్తారు. ఈ నేపధ్యంలో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన 20 ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ హయాంలో 1776లో కోల్‌కతాలో ఇండియన్ ఆర్మీ ఏర్పడింది. 2. సియాచిన్ గ్లేసియర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమి. ఇది సముద్ర మట్టానికి ఐదువేల మీటర్ల ఎత్తులో ఉంది. ఇది భారత సైన్యం ఆధీనంతో ఉంది. 3. హిమాలయాలలోని ద్రాస్, సురు నదుల మధ్య ఉన్న బెయిలీ వంతెన ప్రపంచంలోనే అతిపెద్ద వంతెన. దీనిని 1982లో భారత సైన్యం నిర్మించింది. 4. అమెరికా, చైనాల తర్వాత భారత సైన్యం ప్రపంచంలో మూడవ అతిపెద్ద సైనికబలగం. 5. ఇతర ప్రభుత్వ సంస్థలలో మాదిరిగా భారత సాయుధ దళాలలో కులం లేదా మతం ఆధారిత రిజర్వేషన్ వ్యవస్థ లేదు. 6. 2013లో ఉత్తరాఖండ్‌లో వరద బాధితులను రక్షించేందుకు నిర్వహించిన ‘ఆపరేషన్ రాహత్’ ప్రపంచంలోనే అతిపెద్ద పౌర రెస్క్యూ ఆపరేషన్. 7. ప్రెసిడెంట్స్ బోర్డ్గార్డ్ అనేది భారత సైన్యంలోని పురాతన సైనిక దళం. ఇది 1773లో స్థాపితమయ్యింది. ప్రస్తుతం ఇది న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉంది. 8. ఎత్తయిన పర్వతప్రాంతాలలో యుద్ధాలకు భారతీయ సైనికులు సమర్థులైనవారిగా గుర్తింపుపొందారు. 9. 1971 డిసెంబర్లో భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన లాంగేవాలా యుద్ధంలో కేవలం ఇద్దరు సైనికులు మాత్రమే మరణించారు. ఈ యుద్ధ నేపధ్యంతోనే బాలీవుడ్ సినిమా ‘బోర్డర్’ రూపొందింది. 10. ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోనే అతిపెద్ద వాలంటరీ ఆర్మీ. భారతఆర్మీ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సైనికులను కలిగి ఉంది. 11. హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ (హెచ్ఏడబ్ల్యుఎస్)ను భారత సైన్యం అత్యుత్తమ సైనిక శిక్షణ కోసం నిర్వహిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయడానికి ముందు అమెరికా, ఇంగ్లండ్, రష్యా ప్రత్యేక దళాలు ఇక్కడ శిక్షణ పొందాయి. 12. భారతదేశం 1970, 1990లో అణు పరీక్షలను నిర్వహించింది. 13. కేరళలోని ఎజిమల నావల్ అకాడమీ మొత్తం ఆసియాలోనే అతిపెద్ద అకాడమీ. 14. భారత సైన్యంలో అశ్విక దళం కూడా ఉంది. ప్రపంచంలో ఇలాంటి రెజిమెంట్లు మూడు మాత్రమే ఉన్నాయి. 15. తజికిస్థాన్‌లో భారత వైమానిక దళానికి ఔట్-స్టేషన్ ఉంది. తజికిస్థాన్ తర్వాత, ఇప్పుడు భారత సైన్యం ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా తన అవుట్-స్టేషన్‌ను నిర్మించబోతోంది. 16. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ ఏజెన్సీలలో ఒకటి. ఇది భారతదేశంలోని అత్యంత విలాసవంతమైన రోడ్ల నిర్మాణం, నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. 17. 1971లో భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఏకంగా 93 వేల మంది పాకిస్తానీ సైనికులు భారత సైన్యానికి లొంగిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం చోటుచేసుకున్న అతిపెద్ద లొంగుబాటు ఇదే. 18. పలువురు ప్రముఖులకు సాయుధ దళాల గౌరవ ర్యాంక్‌లు ఇచ్చారు. సచిన్ టెండూల్కర్‌కు భారత వైమానిక దళం కెప్టెన్ హోదాను ప్రదానం చేశారు. ఎంఎస్ ధోనీకి భారత సైన్యం లెఫ్టినెంట్ హోదాను ప్రదానం చేసింది. 19. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో గల మోవ్ భారతదేశంలోని పురాతన కంటోన్మెంట్లలో ఒకటి. 1840 నుండి 1948 వరకు రెజిమెంట్ ఇక్కడ శిక్షణ పొందింది. 20. 1835లో స్థాపితమైన అస్సాం రైఫిల్స్.. భారత సైన్యంలోని పురాతన పారామిలిటరీ దళం. -
Jammu: ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న ఆర్మీ
జమ్మూ : అంతర్జాతీయ సరిహద్దు నుంచి దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం అడ్డుకుంది. భారీగా ఆయుధాలు ధరించిన నలుగురు ఉగ్రవాదులు శుక్రవారం(డిసెంబర్ 22) అర్ధరాత్రి జమ్మూలోని అక్నూర్ సెక్టార్ వద్ద సరిహద్దు దాటడానికి యత్నించారు. వీరిని గుర్తించిన సైనికులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒక ఉగ్రవాది అక్కడికక్కడే మరణించాడు. మిగతా వారు వెనక్కి వెళ్లిపోయారు. అయితే చనిపోయిన ఉగ్రవాది మృతదేహాన్ని మిగిలిన ముగ్గురు తమ వెంటే వెనక్కి లాక్కెళ్లిపోయారని ఆర్మీ అధికారులు తెలిపారు. ‘ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని అడ్డుకున్నాం. నలుగురిలో ఒకరిని కాల్చి చంపాం. మిగిలిన ముగ్గురు చనిపోయిన ఉగ్రవాది మృతదేహాన్ని లాక్కెళ్లడాన్ని గమనించాం’అని ఆర్మీకి చెందిన వైట్‌నైట్ కార్ప్స్ ఎక్స్(ట్విటర్)లో తెలిపింది. రాజౌరీ సెక్టార్లో గురువారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు ఆర్మీ జవాన్లు మృతి చెందారు. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం ఒక పక్క సైన్యం పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపడుతుండగానే మరో నలుగురు సరిహద్దు దాటి దేశంలోకి చొరబాటుకు ప్రయత్నించడం గమనార్హం. ఇదీచదవండి..మగువలు మెచ్చిన చెప్పులు.. -
పతంజలి యోగపీఠ్, భారత ఆర్మీ ఎంవోయూ
న్యూఢిల్లీ: పతంజలి ఇన్స్టిట్యూషన్స్, భారత ఆర్మీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఔషధ మొక్కలపై పరిశోధన నిర్వహించనున్నారు. అలాగే, భారత ఆర్మీలో విభిన్నమైన ఐటీ అప్లికేషన్లు, ఆటోమేషన్‌పై పని చేయడం కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉంది. సైనికుల ఆరోగ్యం కోసం యోగ, ఆయుర్వేద ఔషధాలపై పతంజలి పరిశోధన నిర్వహించనుంది. మరోవైపు, విశ్రాంత సైనిక ఉద్యోగులను నియమించుకునేందుకు పతంజలి, దాని అనుబంధ సంస్థలు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. -
కొనసాగుతున్న ఆపరేషన్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి అక్రమ చొరబాటుకి యత్నించిన ఉగ్రవాదుల్ని కశ్మీర్ పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా మట్టుబెట్టాయి. గురువారం ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ పోలీసులు ప్రకటించారు. సరిహద్దు వెంట చొరబాటు కార్యకలాపాల నియంత్రణకు సైన్యం, జమ్ము పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టింది. కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్లో ఉదయం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు.. ఆపై కాల్పుల్లో మరో ముగ్గురు చనిపోయినట్లు జమ్ముకశ్మీర్ అదనపు డీజీ విజయ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందన్నారాయన. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటు నిరోధక ఆపరేషన్లలో పోలీసు బలగాల్ని సైతం వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా భారీ ఆపరేషన్ చేపట్టారు. కశ్మీర్‌కు చెందిన పోలీసులు, సెక్యూరిటీ ఏజెన్సీలు శ్రీనగర్‌లోని 15 కార్ప్స్లో బుధవారం భేటీ అయ్యారు. ఈ ఏడాది 46 మంది ఉగ్రవాదులు హతమవ్వగా.. వారిలో 37మంది పాకిస్థానీలు కాగా.. తొమ్మిది మంది స్థానికంగా ఉన్నవారేనని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. గత 33 ఏళ్లలో స్థానిక ఉగ్రవాదుల కన్నా.. విదేశీ ఉగ్రవాదులు అత్యధిక సంఖ్యలో హతం కావడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. -
లోయలో పడిన ఆర్మీ వాహనం.. 9 మంది జవాన్లు మృతి
లడఖ్ ఖేరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది ఇండియన్ ఆర్మీ జవాన్లు మృతిచెందారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఇందులో ఎనిమిది మంది జవాన్లు కాగా, ఒకరు జేసీవో (జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్) ఉన్నారు. లేహ్ ప్రాంతానికి సుమారు 150కిమీ దూరంలో ఉన్న ఖేరీలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇండియన్ ఆర్మీ జవాన్లు మరణించడంతో యావత్ భారతదేశం ఒక్క సారిగా దిగ్బ్రాంతికి గురైంది. -
పల్లె సైనికుడా.. దేశ రక్షకుడా..
నిర్మల్: జవాన్ అంటే ఉద్యోగం కాదని దేశ సేవ చేయడమేనని నిరూపిస్తున్నారు బోథ్‌కు చెందిన జవాన్లు. మండల కేంద్రం నుంచి దాదాపు 181 మంది జవాన్లు ఉన్నారు. వివిధ హోదాల్లో వీరు సేవలందిస్తున్నారు. రాబోయే రోజుల్లో అకాడమీ ఏర్పాటుకు పలువరు సైనికులు సన్నాహాలు చేస్తున్నారు. స్థానిక యువతకు సైనికులు ఆదర్శంగా నిలుస్తున్నారు. కాగా బోథ్ మండలానికి చెందిన యువత జవాన్‌గా మారడానికి సన్నద్ధమవుతున్నారు. వీర మరణం పొందిన జవాన్.. 'బోథ్ మండలం మర్లపెల్లికి చెందిన లింగాగౌడ్ కుమారుడు గొడిసెల సతీశ్‌గౌడ్ సీఆర్పీఎఫ్లో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 2016లో గడ్చిరోలి, చత్తీస్ఘడ్ సరిహద్దు ప్రాంతంలో మావోలు, సీఆర్పీఎఫ్ బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో సతీశ్‌గౌడ్ మృతిచెందారు. ఆయన స్వస్థలం మర్లపెల్లిలో ఆయన జ్ఞాపకార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిఏటా ఆయన వర్ధంతిని గ్రామస్తులు ఘనంగా నిర్వహిస్తారు.' ఒకే కుటుంబం నుంచి ఏడుగురు సైనికులు.. బోథ్‌లోని కదం భోజారామ్, ముకుంద్, శంకర్, నర్సింగ్‌రావులు అన్నదమ్ములు. దివంగత భోజారామ్‌కు ఐదుగురు కుమారుల్లో ప్రవీణ్ కుమార్, ప్రతాప్ సైనికులు. ముకుంద్‌కు ముగ్గురు కుమారుల్లో ఇద్దరు సైనికులే. పెద్దకుమారుడు సుధాకర్ సైనికుడిగా సేవలందించి ఇటీవల రిటైర్డ్ అయ్యాడు. రెండో కుమారుడు మధుకర్ సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. శంకర్ కుమారుడు ప్రశాంత్, కదం నర్సింగ్‌రావు కుమారుడు విజయ్ సైనికులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఏడుగురు జవాన్లుగా దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు. -
అజిత్ దక్ష టీమ్‌తో ఇండియన్ ఆర్మీ డీల్.. రూ.165 కోట్లకు ఒప్పందం
కోలీవుడ్ స్టార్ అజిత్ నటనతో పాటు ఇతర రంగాల్లోనూ ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఈయన గతంలో రైఫిల్ షూట్ విన్ అయ్యారు. బైక్ రైడింగ్‌లో పాల్గొంటూ ప్రపంచ యాత్ర చేస్తున్నారు. అదే విధంగా ఏరోనాటికల్ రంగంలోనూ ఆసక్తి కలిగి ఉన్నారు. చైన్నె ఎంఐటీ విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఆయన సలహదారుడిగా ఉన్నారు. ఈయన నేతృత్వంలో ఏరోనాటికల్ విద్యార్థుల బృందం డ్రోన్లను తయారు చేస్తోంది. గత కరోనా కాలంలో వీరు తయారు చేసిన డ్రోన్లు ప్రభుత్వ సేవలకు ఉపయోగపడ్డాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అజిత్ సలహదారుడిగా వ్యవహరించిన దక్ష టీమ్ 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన అంతర్జాతీయ డ్రోన్ల పోటీల్లో పాల్గొని అవార్డులను గెలుచుకుంది. తాజాగా ఈ టీమ్‌తో ఇండియన్ ఆర్మీ డీల్ కుదుర్చుకుంది. 200 డ్రోన్లు తయారు చేసివ్వమంటూ రూ.165 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అజిత్ సినిమాల విషయానికి వస్తే ఆయన చివరగా తునివు(తెలుగులో తెగింపు) చిత్రంలో నటించారు. విడాముయర్చి సినిమాకు సంతకం చేసిన ఆయన తన బైక్ టూర్ ముగియగానే షూటింగ్లో పాల్గొననున్నారు. అనిరుధ్ రవించందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా త్రిష హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. అర్జున్, అర్జున్ దాస్ కూడా ఈ చిత్రంలో భాగమవుతున్నట్లు తెలుస్తోంది. #AK's passion once again benefits the nation - The #AjithKumar mentored #Daksha team has got the order to supply 200 drones worth 165 crore rupees to the Indian Army in the next 12 months 👏#Ajithkumar #VidaaMuyarchi pic.twitter.com/fZVIQR5bwj — KERALA AJITH FANS CLUB (@KeralaAjithFc) August 8, 2023 చదవండి: జైలర్ సినిమా రివ్యూ -
పాకిస్థాన్ నుంచి కాల్స్.. వాట్సాప్ యూజర్లకు ఇండియన్ ఆర్మీ హెచ్చరిక!
భారతదేశంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌తో సహా చాలా మంది విద్యార్థులకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ నుంచి కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు వస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ వర్గాలను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం.. కొన్ని నంబర్ల నుంచి విద్యార్థులకు వస్తున్న కాల్స్, మెసేజ్‌లలో వారిని సోషల్ మీడియా గ్రూపులలో చేరాలని, సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాలని కోరుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌నకు చెందిన గ్యాడ్జెట్స్ నౌ కథనం పేర్కొంది. ఇలా కాల్స్ చేస్తున్నవారు తమను పాఠశాల ఉపాధ్యాయులుగా చెప్పుకొంటూ కొత్త క్లాస్ గ్రూప్‌లలో చేరాలని విద్యార్థులను కోరుతున్నారు. ఈ నెపంలో వారికి ఓటీపీలను పంపుతున్నారు. తాము ఉపాధ్యాయులేనని నమ్మించేందుకు విద్యార్థులకు తెలిసిన వారి పేర్లు చెబుతున్నారు. ఈ అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు వాట్సాప్ ద్వారానే వస్తున్నాయి. ఇలాంటి రెండు అనుమానాస్పద నంబర్లను అధికారులు గుర్తించారు. అవి 8617321715, 9622262167. ఈ కాల్స్ గురించి విద్యార్థులు, సిబ్బందిని ఆర్మీ పబ్లిక్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు హెచ్చరించారు. ఇదీ చదవండి ➤ వాషింగ్టన్ పోస్ట్ సీటీవోగా వినీత్ ఖోస్లా విద్యార్థులు గ్రూపుల్లో చేరిన తర్వాత వారి నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. విద్యార్థుల తండ్రి ఉద్యోగం, ఉపాధ్యాయుల పేర్లు, వారికి సంబంధించిన సమాచారం అడుగుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు దీని గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులను చైతన్యపరచాలని ఆర్మీ స్కూళ్ల అధికారులు కోరుతున్నారు. ఆ రెండు నంబర్ల నుంచే కాకుండా ఇతర నంబర్ల నుంచి కూడా కాల్స్, మెసేజ్‌లు రావచ్చని, అనుమానాస్పద కాల్స్ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
పాక్ కుటిల ప్రయత్నాలకు..భారత్ చెక్‌పెట్టి నేటికి 22 ఏళ్లు..!
శత్రుదేశం, దాయాది దేశం పాకిస్తాన్ భారత్‌పై చేసిన కుటిల ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. వాటన్నింటిని భారత్ తనదైన శైలిలో తిప్పి కొట్టి నేటికి 22 ఏళ్లయ్యాయి. జులై 26 కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆ సమయంలో శత్రువులతో పోరాడి అమరులైన వీర సైనికులను స్మరించుకుంటూ నివాళులర్పిద్దాం. ఈ నేపథ్యంలో నాటి చేదు ఘటనలు స్మృతి పథంలోకి తెచ్చుకుంటే.. మన రక్తం మరిగిపోతుంది. పాక్‌పై ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. ఇంతకీ నాడు ఏం జరిగింది? ఎందుకు ఈ కార్గిల్ దివాస్ జరుపుకుంటున్నాం అంటే.. పాక్ అరాచక్రీడను తిప్పికొట్టి.. ఉగ్రమూకలతో చేతులు కలపిన పాక్ భారత్‌పై యద్ధానికి కాలు దువ్వింది. అంతేగాదు భారత్‌తో పోరాడుతోంది మేం కాదు కాశ్మీర్ స్వాతంత్య్రాన్ని ఆకాంక్షించే వాళ్లే అని ప్రపంచాన్ని నమ్మించే యత్నం చేసింది. నాటి కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ విసిరిన పంజాకు చావు దెబ్బతింది. ఉగ్రవాదులతో కలిసి కశ్మీర్‌లోని కార్గిల్ సెక్టార్‌ను ఆక్రమించి పాక్ సైన్యాన్ని ఇండియన్ ఆర్మీ తరిమికొట్టింది. ఈ యుద్ధంలో అమరులైన జవాన్ల త్యాగాలను స్మరించుకునేందుకే ఏటా జూలై 26ని విజయ్ దివాస్‌గా జరుపుకుంటున్నాం. సరిగ్గా ఈ జూలై 26న కార్గిల్‌లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఉగ్రవాదుల ముసుగులో పాక్ అరాచక క్రీడను తిప్పి కొట్టింది భారత సైన్యం. కాశ్మీర్లో పాగా వేయాలనుకున్న పాక్ కుటిల ప్రయత్నానికి భారత్ జవాన్లు చెక్ పెట్టారు. పాకిస్తాన్‌పై భారత్ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకుంటూ నాడు భరతమాత కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లను తలుచుకుంటూ ప్రతి ఏటా కార్గిల్ విజయ్ దివాస్‌ను జరుపుకుంటున్నాం. 'ఆపరేషన్ విజయ్' పేరుతో.. ఇక దీని ప్రస్తావన వస్తే 130 కోట్ల మంది భారతీయుల హృదయాలు పులకించిపోతాయి. ఈ విజయం సామాన్యమైనది కాదు మంచుకొండలపై మాటు వేసి భారత్‌ను దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని మన సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొని ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టింది. మన జవాన్లు ఆ సమయంలో చూపిన అసామాన్యమైన తెగువ, ధైర్యమే భారత్‌కు విజయాన్ని తెచ్చిపెట్టాయి. 1999లో సరిగ్గా ఇదే రోజున పాకిస్తాన్ భారత సైన్యాన్ని మట్టికరిపించింది. దురాక్రమణకు దిగిన పాకిస్తాన్‌ను కథన రంగంలో మట్టికరిపించి భారత్ తిరుగులేని విజయాన్ని సాధించింది. భారత సైన్యం కార్గిల్‌లో లడఖ్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాక్ చేసిన ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత సైన్యం 'ఆపరేషన్ విజయ్' పేరుతో జరిపిన పోరాట పటిమకు పాక్ సైన్యం తోకముడిచింది. పాక్ పాలకుల గుండెల్లో భయం.. 73 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో దాదాపు 527 మంది జవాన్లు దేశం కోస ప్రాణత్యాగం చేశారు. శత్రు సైనికులు పర్వత పైభాగం నుంచి దాడులు చేస్తున్నప్పటికీ వెనక్కి తగ్గకుండా మన సైనికులు వీరోచితంగా పోరాడారు. పర్వత శిఖరాలపైకి ఎగబాకుతూ మన సైనికులు టైగర్ హిల్, టోలోలిగ్ కొండలను పాక్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ క్రమంలో 4 వేల మందికి పైగా శత్రు దేశ సైనికులను మట్టుబెట్టారు. భారత సైన్యం విరుచుకుపడుతున్న తీరును చూసి పాక్ సైనికులతోపాటు పాలకుల గుండెల్లోనూ వణుకు పుట్టింది. ఈ యుద్ధంతో దాయాది దేశం ఉగ్ర బుద్దిని ప్రపంచానికి చాటిచెప్పడంలో భారత్ విజయం సాధించింది. అలాగే పాక్ ఆక్రమణలో ఉన్న కార్గిల్, ద్రాస్ సెక్టార్లను చేజిక్కుంచుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురువేసింది. రెండు ఫెటర్ జెట్లు కూలడంతో.. ఈ యుద్ధం జమ్మూ కాశ్మీర్లో 1999 మే -జూల నెలల మధ్య ఈ యుద్ధం జరిగింది. తమ వ్యూహంలో భాగంగా ఎత్తైన కొండ ప్రాంతాలను ఆక్రమించి పాక్ బలగాలు యుద్ధానికి కాలుదువ్వాయి. స్థానిక గొర్రెల కాపరులు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన భారత సైన్యం ఆపరేషన్ విజయ్‌కు శ్రీకారం చుట్టింది. ఆ యుద్ధంలో పాక్ మన దేశానికి చెందిన రెండు ఫైటర్ జెట్లను కూల్చేసింది. దీంతో ఇండియన్ ఆర్మీ ఆగ్రహావేశాలతో రెచ్చిపోయింది. దెబ్బకు పాక్‌లో భయం మొదలైంది. ఇక తమకు ఓటమి తప్పదని భావించి అమెరికాను జోక్యం చేసుకోవాలని కోరింది. నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ పాక్ ప్రతిపాదనకు అంగీకరించలేదు సరికదా..నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలో అడుగుపెట్టిన పాక్ బలగాలను వెంటనే వెనుదిరగాలని హెచ్చరించాడు. ఇక పాక్ బలగాలు కార్గిల్ నుంచి వెనుదిరగక తప్పలేదు. జూలై 26 నాటికి పాక్ ఆక్రమించిన ప్రాంతాలన్నింటిని భారత సైన్యం తన గుప్పిట్లోకి తెచ్చుకోగలిగింది. ఇది ఒకరకంగా పాక్ ఆర్మికి కోలుకోలేని దెబ్బ. ఈ చారిత్రాత్మక విజయంలో వీరమరణం పొందిన నాటి సైనికులను స్మరించుకునేందుకే ప్రతి ఏటా ఈ విజయ్ దివాస్‌ను ఘనంగా జరుపుకుంటున్నాం. (చదవండి: నేడు ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం..ఎన్నో జంటలను వేధించే సమస్య) -
ఇండియన్ ఆర్మీలోకి మొదటి సారి ఆ కార్లు!
భారత సైన్యం మరింత బలపడటానికి ఎప్పటికప్పుడు తగిన వాహనాలను ఫ్లీట్‌లో చేరుస్తూనే ఉంది. ఇటీవల 1850 మహీంద్రా స్కార్పియో వాహనాలకు ఆర్డర్ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ తాజాగా టయోటా హైలక్స్ పికప్ ట్రక్కులను డెలివరీ తీసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీలో ఇప్పటికే మారుతీ జిప్సీ, మహీంద్రా స్కార్పియో, టాటా సఫారి స్టోర్మ్ (GS800), టాటా జెనాన్ పిక్-అప్ల వంటి వాహనాలు ఉన్నాయి. కాగా ఇప్పుడు ఈ విభాగంలో టయోటా కంపెనీకి చెందిన హైలక్స్ పికప్ ట్రక్కులు చేరనున్నాయి. ఈ కార్లు ఆఫ్ రోడింగ్‌కి అనుకూలంగా ఉండటం వల్ల భారత సైన్యానికి ఇవి చాలా అనుకూలంగా ఉంటాయని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఏఐతో కొత్త రకం మోసం - తెలిసిన ముఖమే అనుకున్నారో..) టయోటా హైలక్స్.. టయోటా హైలక్స్ అద్భుతమైన డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు 2.8 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ కలిగి 204 హార్స్ పవర్ & 420 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. కావున అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఇది మంచి వాటర్ వాడింగ్ కెపాసిటీ కూడా కలిగి ఉంటుంది. కావున అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఇవి భారత సైన్యానికి మరింత బలం చేకూర్చుతాయని భావిస్తున్నాము. -
వాళ్లని జాగ్రత్తగా చూసుకోండి.. వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా ట్వీట్
భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఇండియన్ ఆర్మీ ఇటీవల 1850 మహీంద్రా కార్లను ఆర్డర్ చేసింది. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం ఇటీవల మహీంద్రా కొత్త స్కార్పియో కార్లను ఆర్డర్ చేసింది. గత జనవరిలో ఆర్మీ 1470 యూనిట్ల కార్లను డెలివరీ చేసుకుంది. మొదట్లో డెలివరీ చేసుకున్న కార్లు కంపెనీ పాత లోగో కలిగి ఉన్నాయి, కావున రెండవ లాట్ కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మహీంద్రా స్కార్పియో కొనుగోలు చేసిన ఇండియన్ ఆర్మీ ఇప్పటికే ఉన్న మారుతి సుజుకి జిప్సీ స్థానంలో వినియోగించనున్నట్లు సమాచారం. గతంలో భారతీయ సైన్యం జిప్సీతో పాటు టాటా జెనాన్ పిక్-అప్లు, ప్రత్యేకంగా తయారు చేసిన టాటా సఫారీ స్టోర్మ్ (GS800)ని కూడా కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా మా దళాలను జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు అని ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పోస్ట్ ఇప్పటికే వేలలో లైక్స్ పొందింది, చాలామంది కామెంట్స్ కూడా తమకు తోచిన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. Take good care of our troops, Scorpio. Because they take care of us… https://t.co/RzghhqgbGJ — anand mahindra (@anandmahindra) July 13, 2023 -
భారత సైన్యానికి అశోక్ లేలాండ్ వాహనాలు - ఆర్డర్ ఎన్ని కోట్లంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ తాజాగా భారత సైన్యం నుంచి రూ.800 కోట్ల ఆర్డర్‌ను చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా భారత సైన్యానికి ఫీల్డ్ ఆర్టిలరీ ట్రాక్టర్, గన్ టోయింగ్ వెహికిల్స్‌ను అశోక్ లేలాండ్ సరఫరా చేస్తుంది. 12 నెలల్లో వీటిని డెలివరీ చేస్తామని కంపెనీ ఎండీ, సీఈవో శేణు అగర్వాల్ తెలిపారు. డిఫెన్స్ వ్యాపారం కంపెనీ వృద్ధికి బలమైన స్తంభంగా నిలిచిందని చెప్పారు. ఈ డీల్‌తో డిఫెన్స్ మొబిలిటీ వెహికల్స్ వ్యాపారంలో సంస్థ నాయకత్వాన్ని మరింత స్థిరపరుస్తుందని అన్నారు. -
మణిపూర్ విషయంలో మద్దతివ్వండి.. భారత ఆర్మీ విజ్ఞప్తి
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని పునరుద్ధరించేందుకు ప్రజలు తమకు సహాయం చేయాలని భారత ఆర్మీ కోరింది. సహాయక చర్యలందించడానికి తాము వెళ్లకుండా మహిళా ఉద్యమకారులు రోడ్లపై అడ్డంకులు సృష్టిస్తున్నారని, తమ కార్యకలపాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆర్మీ తెలిపింది. ఇలాంటి అనవసర జోక్యం వల్ల భద్రతా బలగాలు సరైన సమయానికి చేరుకోలేకపోతున్నాయని ఆర్మీ ట్విట్టర్లో సోమవారం ఓ వీడియో విడుదల చేసింది. ‘‘శాంతి పునరుద్ధరణకోసం కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని అన్ని వర్గాల ప్రజలను ఇండియన్ ఆర్మీ కోరుతోంది. మణిపూర్‌కు సాయం చేసేందుకు మాకు సాయం చేయండి’’ అంటూ ట్వీట్ చేసింది. తూర్పు ఇంఫాల్‌లోని ఇథం గ్రామంలో ఆర్మీ, మహిళల నేతృత్వంలోని ఓ సమూహం మధ్య శనివారం రోజంతా ప్రతిష్టంభన నెలకొంది. దీంతో ఆర్మీ 12 మంది ఉగ్రవాదులను వదిలిపెట్టింది. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తరువాత ఆర్మీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. 2015లో 6 డోగ్రా యూనిట్‌పై ఆకస్మిక దాడితో సహా అనేక దాడుల్లో పాల్గొన్న మైతీ మిలిటెంట్ గ్రూప్ అయిన కంగ్లీ యావోల్ కన్న లుప్ (కేవైకేఎల్)కు చెందిన 12 మంది సభ్యులు గ్రామంలో దాగి ఉన్నారని వారు తెలిపారు. భద్రతా సిబ్బంది ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా కొండ జిల్లాల్లో మే 3న ’ఆదివాసి సంఘీభావ యాత్ర’ నిర్వహించిన తర్వాత మొదట ఘర్షణలు చెలరేగడం, ఈశాన్య రాష్ట్రంలో మైతీ, కుకీ కమ్యూనిటీల మధ్య చెలరేగిన హింసలో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కార్యకలాపాలకు సహకరించండి అంటూ ఆర్మీ విజ్ఞప్తి చేస్తోంది. Women activists in #Manipur are deliberately blocking routes and interfering in Operations of Security Forces. Such unwarranted interference is detrimental to the timely response by Security Forces during critical situations to save lives and property. 🔴 Indian Army appeals to… pic.twitter.com/Md9nw6h7Fx — SpearCorps.IndianArmy (@Spearcorps) June 26, 2023 ఇది కూడా చదవండి: పశ్చిమ బెంగాల్ సీఎంకు తప్పిన పెను ప్రమాదం -
సైన్యాన్ని చుట్టుముట్టిన మహిళలు
ఇంఫాల్: మణిపూర్‌లో శాంతి నెలకొల్పేందుకు యత్నిస్తున్న సైన్యానికి స్థానికంగా ఓ వర్గం మహిళల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మిలిటెంట్లను విడిపించుకునేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు ఆర్మీని దిగ్బంధించారు. దీంతో రోజంతా ఉద్రిక్తత కొనసాగింది. చివరికి, ఆర్మీ తమ అదుపులో ఉన్న మెయిటీ వర్గం మిలిటెంట్లను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఈ ఘటన తూర్పు ఇంఫాల్ జిల్లా ఇథమ్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. భద్రతా బలగాలు శనివారం ఉదయం గ్రామంలో సోదాలు జరిపి 12 మంది మిలిటెంట్లను అదుపులోకితీసుకున్నాయి. విషయం తెల్సుకున్న సుమారు 1,200 మంది మెయిటీ వర్గం మహిళలు సైనికులను చుట్టుముట్టారు. మిలిటెంట్లను వదిలేయాలని భీష్మించారు. సాయంత్రం వరకు ఇదే ప్రతిష్టంభన కొనసాగింది. చివరికి బలగాలు మిలిటెంట్లను వదిలేశాయి. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను, మందుగుండును మాత్రం తీసుకెళ్లామని ఆర్మీ తెలిపింది. రాష్ట్రంలో నెలకొన్న సున్నిత పరిస్థితుల దృష్ట్యా, బలప్రయోగంతో కలిగే నష్టాన్ని, గ్రామస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, మానవతా దృక్పథంతో మిలిటెంట్లను స్థానిక నేతకు అప్పగించినట్లు ఆర్మీ తెలిపింది. ఆర్మీ విడిచిపెట్టిన వారిలో మెయిటీ వర్గం కేవైకేఎల్ గ్రూపునకు చెందిన స్వయం ప్రకటిత లెఫ్టినెంట్ కల్నల్ మొయిరంగ్థెమ్ తంటా అలియాస్ ఉత్తమ్ ఉన్నాడు. ఇతడికి పలు హింసాత్మక ఘటనలతో సహా 2015లో ‘6 డోగ్రా యూనిట్’పై దాడితో సంబంధముంది. ఈ గ్రూప్ మయన్మార్ నుంచి మణిపూర్‌లోకి చొరబడినట్లు ఆర్మీ తెలిపింది. గ్రామంలోకి అదనపు బలగాల ప్రవేశాన్ని ఆలస్యం చేసేందుకు ఆ మార్గంలోని కొన్ని వంతెనల వద్ద అడ్డంకులు కల్పించారంది. కాగా, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ఆదివారం ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను వివరించారు. -
మణిపూర్: ఆర్మీని అడ్డుకున్న మహిళలు.. 12 మంది మిలిటెంట్లు జంప్
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ కొద్దిరోజులుగా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఇక, మణిపూర్‌పై అమిత్ షా అఖిలపక్ష భేటీ కూడా నిర్వహించారు. ఈ క్రమంలో మణిపూర్‌లో శనివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. స్థానిక మహిళల నేతృత్వంలో ఓ గుంపు భారత సైన్యాన్ని చుట్టుముట్టి 12 మంది మిలిటెంట్లకు అండగా నిలిచారు. అనంతరం, నాటకీయ పరిణామాల మధ్య సైన్యం 12 మంది మిలిటెంట్లను వదిలేసింది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని సైన్యం స్వాధీనం చేసుకుంది. వివరాల ప్రకారం.. ఇంఫాల్ ఈస్ట్‌లోని ఇథమ్‌లో మిలిటెంట్లు దాక్కున్నారనే సమాచారంతో భారత సైన్యం ఆ గ్రామాన్ని చుట్టుముట్టింది. అయితే, ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. మహిళ నేతృత్వంలో సుమారు 1200-1500 ఓ గుంపుగా ఏర్పాడ్డారు. ఈ క్రమంలో వారంతా ఆర్మీ వాహనాలను చుట్టుముట్టారు. వాహనాలను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తమకు అడ్డుకోవద్దని సైన్యం హెచ్చరించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. ఇలా కొన్ని గంటల పాటు ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో, అధికారులు రంగంలోకి దిగారు. కాగా, అధికారులు కూడా ఆందోళనకారులను హెచ్చరించినప్పటికీ లాభం కనిపించలేదు. దీంతో, చేసేదేమీలేక పరిస్థితి చేయిదాటిపోకముందే 12 మంది మిలిటెంట్లను వదిలేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండానే ఉద్రిక్తపరిస్థితి సద్దుమనిగింది. ఈ క్రమంలో గ్రామంలో పెద్దసంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రీని సైనికులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. గ్రామస్తుల కారణంగా మైటీ వర్గానికి చెందిన మిలిటెంట్ గ్రూప్ కంగ్లీ యావోల్ కన్నా లుప్ సభ్యులు తప్పించుకున్నారు. వారిలో మొయిరంగథెం తంబా కూడా ఉన్నాడని అధికారులు వెల్లడించారు. అతడు 2015లో 6 డోగ్రా రెజిమెంట్‌పై జరిగిన దాడితో సహా అనే ఘటనల్లో అతడు సూత్రధారి అని తెలిపారు. Unedited UAV Footage@adgpi @easterncomd #Manipur pic.twitter.com/mfVWK0CHKt — SpearCorps.IndianArmy (@Spearcorps) June 24, 2023 ఇదిలా ఉండగా.. మణిపూర్‌లో మైతీ, కుకీల మధ్య జరగుతున్న హింసలో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మూడు వేల మందికిపైగా గాయపడగా.. 4వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళనలతో 40 వేల మందికి పైగా ఇళ్లను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇక, తాజాగా మణిపూర్ మంత్రి ఎల్ సుసీంద్రోకు చెందిన ప్రైవేట్ గోడౌన్‌కు కొంతమంది ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ గోడౌన్ ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చింగారెల్‌లో ఉంది. ఈ ఘటనలో ఈ గోడౌన్ కాలి బూడిదైందని పోలీసులు శనివారం తెలిపారు. అలాగే శుక్రవారం రాత్రి ఖురారులోని ఆహార వ్యవహారాల మంత్రి నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది సకాలంలో స్పందించి వారిని నిలువరించారు. ఆందోళనకారులు మంత్రి నివాసాన్ని చుట్టుముట్టకుండా భద్రతా దళాలు అర్థరాత్రి వరకు పలుసార్లు భాష్పవాయుని ప్రయోగించాయని పోలీసులు తెలిపారు. Another church is burning in Manipur - Modi is in the USA. pic.twitter.com/PJcLUaGBut — Ashok Swain (@ashoswai) June 20, 2023 Did I just heard 'Aap nahi jayega toh hum kapre utar denge..'? This is misuse of the 'Woman Card' So Wrong. So Sick. So Embarassing. Big Salute to our Indian Jawans for handling the scene calmly.🇮🇳#Manipur_Violence#SeparateAdministration4PeaceSake#SaveTribalsOfManipur pic.twitter.com/n2FOOH33eY — Kimmi Khongsai (@KimmiKhs) June 22, 2023 ఇది కూడా చదవండి: మణిపూర్‌కు అఖిలపక్షాన్ని పంపించాలి -
ఇండియన్ ఆర్మీ మరింత పటిష్టం - రంగంలోకి మహీంద్రా ఆర్మడో
భారతదేశంలో ఎక్కువమంది వాహన ప్రియులకు ఇష్టమైన కార్లలో మహీంద్రా అండ్ మహీంద్రా కార్లు చెప్పుకోదగ్గవి. కేవలం రోజు వారి వినియోగానికి, ఆఫ్ రోడింగ్ చేయడానికి మాత్రమే కాకుండా భారత సైన్యం కోసం కూడా కంపెనీ వాహనాలను సిద్ధం చేసి డెలివరీలను ప్రారంభించింది. మహీంద్రా సాయుధ వాహనాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా యాజమాన్యంలో ఉన్న మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ (MDS) భారత సాయుధ దళాలకు ఆర్మడో వాహనాల డెలివరీలను ప్రారంభించింది. ఆర్మడో అనేది ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్స్ (ALSV). ఇవి పూర్తి భారతదేశంలోనే రూపుదిద్దుకున్నాయి. కావున పటిష్టమైన భద్రత లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి అధిక తీవ్రత ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్, స్పెషల్ ఫోర్స్ ఆపరేషన్, క్విక్ రియాక్షన్ టీమ్స్ ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటాయి. సరిహద్దు భూభాగాల్లో, ఎడారి ప్రాంతాల్లో దాడులకు ఉపయోగించడానికి కూడా అవి ఉపయోగపడతాయి. ఇంజిన్ మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్ ఆర్మడో వాహనాలు 3.2 లీటర్, టర్బోచార్జ్డ్, డైరెక్ట్-ఇంజెక్షన్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 215 హార్స్ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఈ వెహికల్స్ కేవలం 12 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వేగవంతమవుతాయి. గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లు. పేలోడ్ కెపాసిటీ 1000 కేజీలు కావడం గమనార్హం. (ఇదీ చదవండి: ఈ సైకిల్ కొనే డబ్బుతో కారు కొనేయొచ్చు! ధర ఎంతో తెలుసా?) ఆర్మడో వెహికల్ బిల్స్టెయిన్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ కలిగి 318/80 ఆర్17 టైర్లను పొందుతుంది. టైర్లలో గాలి లేకుండా పోయినా 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల కెపాసిటీ కలిగి ఉంటాయి. ఇందులో పవర్ స్టీరింగ్ సిస్టమ్ ఉంటుంది, కావున లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ లేదా రైట్ హ్యాండ్ డ్రైవ్ కాన్ఫిగర్ చేయవచ్చు. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా వైరల్ ట్వీట్.. నితిన్ గడ్కరీ జీ అంటూ..!!) ఫీచర్స్ ఇంటీరియర్ విషయానికి వస్తే, లోపల డ్రైవర్‌తో సహా ఆరుగురు ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది, అవసరమైతే ఎనిమిది మంది కూర్చునేలా సీట్లు కాన్ఫిగర్ చేయవచ్చు. ఇది పబ్లిక్ అడ్రస్ (PA) సిస్టమ్, జీపీఎస్ (GPS), ఆటోమేటిక్ గ్రెనేడ్ లాంచర్, ఎలక్ట్రిక్ వించ్, HF/UHF/VHF రేడియోతో పాటు సెల్ఫ్-క్లీనింగ్-టైప్ ఎగ్జాస్ట్ స్కావెంజింగ్ వంటి వాటిని పొందుతుంది. మహీంద్రా వాహనాల డెలివరీకి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి ఆనంద్ మహీంద్రా ట్విటర్ ద్వారా కూడా షేర్ చేశారు. My gratitude to Sukhvinder Hayer & his entire team who made this project a reality through their patience, persistence & passion… 👏🏽👏🏽👏🏽 pic.twitter.com/wYttXVMKKq — anand mahindra (@anandmahindra) June 17, 2023 -
ఆర్మీలో ఉన్నత స్థానంలో ఉన్న సెలెబ్రెటీస్
-
కేటీఆర్‌పైనే అనిల్ కుటుంబం ఆశలు..!
బోయినపల్లి(చొప్పదండి): జమ్మూకాశ్మీర్‌లో జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో చనిపోయిన మల్కాపూర్‌కు చెందిన ఆర్మీ జవాన్ అనిల్ కుటుంబం ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తోంది. అనిల్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్.. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈనెల 5న భరోసా ఇచ్చారు. వారం రోజులు కావస్తున్నా ఇప్పటివరకే అటు కేంద్రంనుంచిగానీ.. ఇటు రాష్ట్రంగానీ సహాయానికి సంబంధించిన ప్రకటన రాలేదు. ఈ క్రమంలోమంత్రి కేటీఆర్ ప్రకటనపైనే అందరి దృష్టి ఉంది. 11 ఏళ్లు సైన్యంలో.. మల్కాపూర్‌కు చెందిన పబ్బాల లక్ష్మి, మల్లయ్య కుమారుడు అనిల్ డిగ్రీ వరకు చదుకుని 11 ఏళ్ల క్రితం ఆర్మీలో చేరారు. అనిల్‌కు ఏడేళ్ల కిత్రం మండలంలోని కోరెం గ్రామానికి చెందిన సౌజన్యతో వివా హమైంది. వీరికి ఇద్దరు కుమారులు అయాన్ (6), అరయ్(3) సంతానం. అనిల్ సోదరులు శ్రీనివాస్, మహేందర్ వ్యవసాయం చేసుకుని జీవిస్తారు. తండ్రి మలయ్య అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. 45రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన అనిల్ తండ్రి కాలుకు సర్జరీ చేయించాడు. ఇలాంటి తరుణంలో అనిల్ మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీరని వేదనలోకి నెట్టింది. అనిల్ కుమారులు చిన్నపిల్లలు కావడం.. తండ్రి మంచానికే పరిమితమవడం.. భర్త చనిపోయిన విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేక నిత్యం రోదిస్తున్న ఆయన భార్య సౌజన్యను చూసినవారికే కన్నీళ్లు ఆగడం లేదు. మంత్రిపైనే ఆశలు.. అనిల్ కుటుంబాన్ని ఆదుకోవడం ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌తోనే సాధ్యమవుతుందని గ్రామస్తులు అంటున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన ప్రకటన చేయడం.. మంత్రి గంగుల కమలాకర్ సైతం సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే ఇక్కడికి వచ్చానని చెప్పడం ఆ కుటుంబానికి చిరుదీపంలో కనిపిస్తోంది. అనిల్ భార్య సౌజన్య డిగ్రీ చదువుకుంది. భర్త ప్రోత్సాహంతో ఇటీవల ఎస్సై రాత పరీక్ష కూడా రాసింది. మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని సౌజన్యకు ఉద్యోగం ఇప్పించాలని, సైనికుడికి అందించే అన్నిరకాల సహాయం అందించాలని గ్రామస్తులు అంటున్నారు. అనిల్ అంత్యక్రియల్లో పాల్గొన్నప్పటి నుంచి ఇద్దరు ఆర్మీ జవాన్లు ఇక్కడే ఉండి డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నారని, సౌజన్య బ్యాంకు అకౌంట్, తదితర ధ్రువీకరణపత్రాలు సేకరిస్తున్నారని తెలిసింది. అలాగే కుటుంబంలో ఏమైనా గొడవలుంటే సరి చేయాలని ఆర్మీ ఉన్నతాధికారులు, ఎస్పీ ఆదేశించినట్లు సమాచారం. -
దుఃఖంలోనూ భర్తకు సెల్యూట్ చేసిన భార్య సౌజన్య
బోయినపల్లి(చొప్పదండి): జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన అనిల్ అంతిమయాత్ర కుటుంబ సభ్యుల రోదనలు, బంధువులు, ప్రజాప్రతినిధుల ఆశ్రునయనాల మధ్య ముగిసింది. శనివారం ఉదయం అనిల్ భౌతికకాయం ఆయన స్వగ్రామమైన మల్కాపూర్‌లోని ఇంటికి చేరడంతో మండలవ్యాప్తంగా జనం భారీగా తరలివచ్చారు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి గంగాధరకు చేరుకుంది. అక్కడ పలువురు యువకులు జాతీయ జెండాలతో స్వాగతం పలికి ర్యాలీగా మల్కాపూర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆర్మీ అధికారులు సైనికలాంఛనాలతో గౌరవ వందనం చేశారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభించారు. అనిల్ వ్యవసాయ భూమిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆర్మీ సిబ్బంది గౌరవ వందనం చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. అనిల్ పెద్ద కుమారుడు అయాన్ తండ్రి చితికి నిప్పంటించాడు. నిన్ను విడిచి ఎలా ఉండాలే బావా.. అనిల్ భార్య సౌజన్య రెండురోజులుగా కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉంది. ‘బావా నిన్ను విడిచి నేనెలా ఉండాలే బావా.. పిల్లలను ఎట్ల సాదాలే బావా.. అని రోదించడం చూసేవారిని కంటతడి పెట్టించింది. ‘నన్ను పోలీస్‌గా చూడాలని అంటివి. నీ మాటతోనే ఎస్సై పరీక్ష రాసిన బావ..’ రెండు నెలలైతే దగ్గరికి బదిలీ చేయించుకుంట అంటివి.. అంతలోనే ఘోరం జరిగిందా బావా..’ అంటూ భర్త ఫొటో ఉన్న ఫ్లెక్సీ వద్ద విలపించింది. అనిల్ తల్లి లక్ష్మి, అనారోగ్యంతో ఉన్న తండ్రి మల్లయ్య ఏడుస్తుండడాన్ని ఆపడం ఎవరితరమూ కాలేదు. కుమారులు అయాన్, అరయ్ సైతం తండ్రి శవపేటిక వద్ద విలపించారు. అమరుడైన భర్తకు భార్య సెల్యూట్ అనిల్ భౌతికకాయాన్ని చితిపై పెట్టిన అనంతరం సైనికులు గౌరవ వందనం చేశారు. సైనిక గీతం ఆలపించిన సమయంలో అంతులేని దుఃఖంలోనూ సౌజన్య భర్త భౌతికకాయానికి సెల్యూట్ చేయడం అక్కడున్నవారిని మరింత కంటతడి పెట్టించింది. తండ్రి చితికి ఆయన పెద్ద కుమారుడు అయాన్ నిప్పు పెట్టాడు. అనిల్ సైనిక యూనిఫాంను ఆర్మీ అధికారులు సౌజన్యకు అందించారు. హాజరైన మంత్రి గంగుల, ఎంపీ సంజయ్ అనిల్‌కు మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ అనురాగ్‌జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ తదితరులు నివాళులు అర్పించారు. అంత్యక్రియలు ముగిసేవరకూ అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యే రవిశంకర్ అనిల్ పాడె మోశారు. అంతిమయాత్రలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, వేములవాడ ఆర్డీఓ పవన్‌కుమార్, రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్రావు, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీలు కత్తెరపాక ఉమ, నాగం కుమార్, సెస్ డైరెక్టర్ కొట్టెపెల్లి సుధాకర్, సర్పంచు కోరెపు నరేశ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేశ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి మేడిపల్లి సత్యం, ఎంపీడీఓ నల్లా రాజేందర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఏఎస్పీ చంద్రయ్య, వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి, బోయినపల్లి ఎస్సై మహేందర్ బందోబస్తు నిర్వహించారు. అనిల్ కుటుంబాన్ని ఆదుకుంటాం అనిల్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అనిల్ అంత్యక్రియలు పూర్తయిన అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయన కుటుంబాన్ని పరామర్శించామని, యువ జవాన్‌ను కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. -
తెరపైకి ‘ప్రాజెక్ట్ సంజయ్’
న్యూఢిల్లీ: అగ్రరాజ్యాలు సైనికపరంగా అనేక నూతన అస్త్రాలను సమకూర్చుకుంటున్న వేళ..భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. అత్యాధునిక డిజిటల్ యుద్ద క్షేత్రాల్లో పోరాటంలో సైతం పైచేయి సాధించేందుకు ఆర్మీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ‘ప్రాజెక్ట్ సంజయ్’పేరుతో యుద్ధ క్షేత్రంలోని వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు కచ్చితంగా బేరీజు వేసేందుకు సమీకృత రణక్షేత్ర నిఘా కేంద్రాల (ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్‌ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్ల)కు రూపకల్పన చేస్తోంది. ఇందులో ఏర్పాటు చేసే సెన్సర్లు రాడార్లు, శాటిలైట్లు, డ్రోన్ల నుంచి వచ్చే సమాచారాన్ని క్షేత్రస్థాయిలోని బలగాలకు అందజేస్తాయి. దీని సాయంతో ప్రత్యర్థి బలగాల ఆనుపానులను నిక్కచ్చిగా తెలుసుకునేందుకు వీలుంటుంది. 2025 డిసెంబర్ నాటికి సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్‌ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్లను డజన్ల కొద్దీ ఏర్పాటు చేయనుంది. తాజాగా వ్యూహం అమల్లోకి వస్తే యుద్ధ క్షేత్రంలో కార్యకలాపాలను, నిఘాను విస్తృతం చేసేందుకు వీలవుతుంది. ఫలితంగా ఆర్మీ కమాండర్లు ఫ్రంట్‌లైన్ బలగాల మోహరింపు, యుద్ధ సామగ్రి తరలింపు వంటి విషయాల్లో వెంటవెంటనే మెరుగైన నిర్ణయాలు తీసుకునే వీలుకల్పించడమే దీని లక్ష్యమని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇందులోభాగంగా, పర్వత ప్రాంతాలు, ఎడారులు, మైదాన ప్రాంతాల్లో ఇప్పటికే ట్రయల్స్ పూర్తయ్యాయని పేర్కొన్నాయి. పొరుగుదేశం చైనా చాలా రోజుల నుంచి ఇదే రకమైన వ్యవస్థల ఏర్పాటులో నిమగ్నమై ఉంది. భారత్ ఎలక్ట్రానిక్స్ ఈ వ్యవస్థలను సమకూరుస్తోంది. దేశం 12 లక్షల పటిష్ట ఆర్మీ ‘ఆటోమేషన్, డిజిటైజేషన్, నెట్వర్కింగ్’కోసం ఇప్పటికే పలు పథకాలు అమలవుతున్నాయి. ప్రాజెక్ట్ శక్తి పేరుతో ఇప్పటికే ఏసీసీసీసీఎస్(ఆర్టిలరీ కంబాట్, కంట్రోల్, కమ్యూనికేషన్ సిస్టం) కింద వ్యవస్థల అప్‌గ్రేడ్ చేపట్టారు. దీనిని కూడా కొత్తగా ఏర్పాటయ్యే ప్రాజెక్ట్ సంజయ్‌తో అనుసంధానిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. -
హింసాకాండలో 54 మంది మృతి.. మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణలతో రాష్ట్రం రావణకాష్టంలా మారిపోయింది. హింసాత్మక ఘటనలను కట్టడి చేసేందుకు 'తీవ్రమైన కేసుల్లో' కనిపిస్తే కాల్చివేతకు మణిపూర్ గవర్నర్ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని జిల్లాల్లో నిరసనకారులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల నిరసనకారుల్ని అదుపు చేయడానికి కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చిందని పోలీసులు తెలిపారు. మణిపూర్ మారణహోమంలో మరణించిన వారి సంఖ్య 54కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. అయితే అనధికారికంగా మృతుల సంఖ్య మరింత ఎక్కువే ఉండవచ్చని భావిస్తున్నారు. బుల్లెట్ గాయాలు తగిలిన మరికొంత మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చి, సాధారణ పరిస్థితిని నెలకొల్పడం కోసం కేంద్రం అదనపు బలగాలను రంగంలోకి దింపింది. శాంతి భద్రతలను కాపాడేందుకు ఆర్మీ దళాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్ర పోలీసులు బలగాలలు అన్ని సమస్యాత్మక ప్రాంతాలు, రహదారుల్లో పహరా కాస్తున్నాయి. ఆర్టికల్ 355ను సైతం కేంద్ర అమల్లోకి తీసుకొచ్చింది. శనివారం ఉదయం షాపులు, మార్కెట్లు తిరిగి తెరుచుకోవడంతో శనివారం ఇంఫాల్ వ్యాలీలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రజలు కురగాయాలు వంటి నిత్యవసర వస్తువుల కోసం బయటకు వస్తున్నారు. కార్లు వంటి వాహనాలు సైతం రోడ్డెక్కాయి. మరోవైపు ఇప్పటి వరకు మొత్తం 13 వేల మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రక్షణశాఖ అధికారి ఒకరు తెలిపారు. వారికి సైనిక శిబిరాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో ఆశ్రయం కల్పించినట్లు చెప్పారు. చదవండి: ఖర్గే కుటుంబాన్ని హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది! గడిచిన 12 గంటల్లో, ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకున్నాయిని, విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. అయితే వేంగంగా స్పందించిన ఆర్మీ, ఇతర భద్రతా బలగాలు పరిస్థితిని నియత్రణలోకి తీసుకొచ్చాయని తెలిపారు. శుక్రవారం రాత్రి చురాచంద్పూర్ జిల్లాలోని సైటన్‌లో భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారని పోలీసులు తెలిపారు. ఇద్దరు ఐఆర్బీ జవాన్లు గాయపడ్డారని తెలిపారు. గచురాచాంద్‌పూర్, మోరే, కక్చింగ్, కాంగ్పోక్పీ వంటి ప్రాంతాలను కేంద్ర బలగాలు తమ ఆధినంలోకి తీసుకున్నాయి. ఈ ప్రదేశాల్లో శుక్రవారం రాత్రి నుంచి ఎలాంటి ఘర్షణలు జరగలేదు. ఇండియన్ ఆర్మీ, అస్సాం రైఫిల్స్ బలగాలు దాదాపు 10,000 మంది సైనికులు రాష్ట్రంలో మోహరించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్, ఉన్నతాధికారులతో మాట్లాడారు. అకస్మాత్తుగా ఇటువంటి పరిస్థితులు ఏర్పడటం వెనుక ఉన్న అసలు కారణాలు, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై ఆరాతీశారు. అసలు ఎందకీ ఘర్షణలు? మణిపూర్ రాష్ట్ర జనాభాలో 53 శాతం మంది ఉన్న మైతీలు తమకు షెడ్యూల్డు తెగల హోదాను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఎస్టీ హోదా కోసం మైతీలు చేస్తున్న డిమాండ్‌పై నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని మణిపూర్ హైకోర్టు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) పిలుపు మేరకు బుధవారం గిరిజన సంఘీభావ కవాతును నిర్వహించారు. ఈ కవాతు చురాచాంద్‌పూర్ జిల్లాలోని టోర్బుంగ్ ఏరియాలో జరిగింది. ఈ కార్యక్రమంలో నాగాలు, జోమీలు, కుకీలు పాల్గొన్నారు. అయితే చురాచాంద్‌పూర్ జిల్లాలో బుధవారం జరిగిన గిరిజన కవాతు పలుచోట్ల ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అనంతరం లోయలోని జిల్లాలన్నిటికీ హింసాకాండ విస్తరించింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింస జరిగింది. చదవండి: భద్రతా సిబ్బంది సమక్షంలోనే గ్యాంగ్‌స్టర్ టిల్లుపై కత్తితో.. వీడియో వైరల్ -
జవాన్ అనిల్ కు కన్నీటి వీడ్కోలు..
-
ఆర్మీ జవాన్ అనిల్ అంత్యక్రియలు...
-
భారత సైన్యం కోసం మారుతి జిప్సీ ఎలక్ట్రిక్ వెహికల్ - పూర్తి వివరాలు
ఇండియన్ ఆర్మీ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి భద్రతకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తుంది. ఇందులో భాగంగానే ఆర్మీ కమాండర్స్ కాన్ఫిరెన్స్ (ACC) నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం 2023 ఏప్రిల్ 17 నుంచి 21 వరకు ఢిల్లీలో ఈ కార్యక్రమం నిర్వహించింది. ఆర్మీ కమాండర్లు, ఇతర ఉన్నతాధికారులు డిజిటల్ సెషన్లో పాల్గొన్నారు. ఈ కాన్ఫిరెన్స్ చివరి రోజు మారుతి సుజుకి జిప్సీ రెట్రోఫిట్డ్ ఎలక్ట్రిక్ వెర్షన్ దర్శనమిచ్చింది. నిజానికి ఇది ఇండియన్ ఆర్మీ సెల్, ఐఐటీ ఢిల్లీ & టాడ్‌పోల్ ప్రాజెక్ట్స్ అనే స్టార్టప్ పాతకాలపు మిలిటరీ జిప్సీ SUVని ఎలక్ట్రిక్ వెహికల్ మాదిరిగా మార్చడానికి సహకరించింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో భాగంగానే ఇది పుట్టుకొచ్చింది. (ఇదీ చదవండి: జీవితంలో ఎదగాలంటే? ఓయో ఫౌండర్ 'రితేశ్ అగర్వాల్' మాటల్లో..) ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. అదే సమయంలో కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా పాత వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా రూపొందించే క్రమంలో బిజీగా ఉన్నాయి. పాత వాహనాలను ఎలక్ట్రిక్ వాహనంగా మార్చడానికి స్టార్టప్ ఇంజిన్‌ను తీసివేసి మార్చాల్సి ఉంటుంది. ఇది వాహనం జీవిత కాలాన్ని మరింత పెంచడంలో సహాయపడుతుంది. (ఇదీ చదవండి: వైద్య వృత్తిలో వెయ్యికోట్లకంటే ఎక్కువ సంపాదిస్తున్న డాక్టర్ - ఈమె) ఇటీవల కాలంలో అమలులోకి వచ్చిన మోటారు వెహికల్ యాక్ట్ కింద వ్యక్తిగత కారును 15 సంవత్సరాల పాటు ఉపయోగించవచ్చు. ఆ తరువాత స్క్రాప్ చేయాల్సి ఉంటుంది. 2015లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీ-ఎన్‌సిఆర్ హైవేలపై 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పాత డీజిల్ వాహనాలను అనుమతించరాదని ప్రకటించింది. Retrofitted Electric #Gypsies were showcased at the ongoing #Army Commanders Conference in New Delhi. #IADN pic.twitter.com/1N1oKrzPMv — Indian Aerospace Defence News - IADN (@NewsIADN) April 21, 2023 -
ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట
పూంచ్: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఐదుగురు జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల కోసం భారత సైన్యం వేట ముమ్మరం చేసింది. డ్రోన్లు, జాగిలాలతోపాటు హెలికాప్టర్‌తో గాలింపు కొనసాగిస్తోంది. బాటా–డోరియా అటవీ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది జల్లెడ పడుతున్నారు. గాలింపు చర్యలను సైనిక, పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందం శుక్రవారం ఘటనా స్థలాన్ని సందర్శించింది. గురువారం ముష్కరుల దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన ఐదుగురు చనిపోవడంతోపాటు మరొకరు గాయపడిన సంగతి తెలిసిందే. అమర జవాన్ల మృతదేహాలకు ఉన్నతాధికారులు శుక్రవారం నివాళులర్పించారు. అనంతరం మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించారు. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో హై అలర్ట్ విధించారు. నియంత్రణ రేఖ వద్ద నిఘాను పటిష్టం చేశారు. ముష్కరుల దుశ్చర్యను ఖండిస్తూ బీజేపీ, వీహెచ్‌పీ, రాష్ట్రీయ బజరంగ్ దళ్, శివసన, డోగ్రా ఫ్రంట్, జమ్మూ స్టేట్హుడ్ ఆర్గజనైజేషన్ జమ్మూలో భారీ ప్రదర్శనలు నిర్వహించాయి. -
కుప్పకూలిన చీతా.. విషాదాంతం
భారత ఆర్మీ ఛాపర్ చీతా ప్రమాదం.. విషాదంగా ముగిసింది. పైలట్ లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డితో పాటు కో పైలట్ మేజర్ జయంత్ కూడా మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించింది ఆర్మీ. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చీతా ఎయిర్‌క్రాఫ్ట్.. సంగే గ్రామం నుంచి అసోం సోనిట్‌పూర్ జిల్లా మిస్సమారి వైపు వెళ్లాల్సి ఉంది. అయితే పావు గంటకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ కామెంగ్ జిల్లా మండాలా వద్ద అది ప్రమాదానికి గురైనట్లు ఆర్మీ వర్గాలు గుర్తించాయి. అయితే.. ఆపై అందులో ఉన్న ఇద్దరు పైలట్ల ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. భారత సైన్యంతో పాటు ఐటీబీపీ మరో రక్షణ విభాగ సాయంతో మొత్తం ఐదు బృందాలు కూలిపోయిన పైలట్ల ఆచూకీ కోసం గాలించాయి. ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ దిరాంగ్ ప్రాంతం బంగ్లాజాప్ వద్ద గ్రామస్తులు కాలిపోతున్న ఛాపర్ శకలాలను గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడి చేరుకున్న బలగాలు.. ఆపై పైలట్, కోపైలట్లు దుర్మరణం పాలైనట్లు ప్రకటించారు. ఛాపర్ క్రాష్‌కు గురైన ప్రాంతంలో పొగమంచు దట్టంగా నిండిపోయి ఉండడం, కమ్యూనికేషన్ అండ్ సిగ్నలింగ్ వ్యవస్థకు ఆటంకం కలుగుతోందని గుర్తించారు. మరోవైపు ప్రమాదానికి కారణాల గుర్తించేందుకు దర్యాప్తునకు ఆదేశించింది భారత ఆర్మీ. చీతా ఐదుగురు ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న హెలికాఫ్టర్. అనేక రకాలుగా దీనిని ఉపయోగిస్తున్నారు. ప్రతికూల వాతావరణంలోనూ.. మిషన్ల సమయంలో అత్యంత ఎత్తులో(ప్రపంచ రికార్డు సైతం ఉంది దీనిపేరిట) అయినా ప్రయాణించగలిగే సత్తా ఉందన్న పేరుంది. హాల్(HAL) 1976-77 నడుమ తొలి ఛాపర్‌ను భారత సైన్యానికి అందించింది. ఇప్పటిదాకా 279 హెలికాఫ్టర్లను హాల్.. భారత్‌తో పాటు విదేశాల్లోనూ అందించింది. -
కుప్పకూలిన భారత ఆర్మీ హెలిక్టాపర్.. ఇద్దరు పైలట్స్ ఎక్కడ?
భారత సైన్యానికి చెందిన చిరుత హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో పైలట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఆర్మీ అధికారులు. ఇక, ఈ ప్రమాదం ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆర్మీకి చెందిన చిరుత హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లోని మండాలా హిల్స్ వద్ద కుప్పకూలిపోయింది. బొండిలా పట్టణం నుంచి వెళ్తుండగా గురువారం 9.15 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన అధికారులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు పైలట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు గువాహటి డిఫెన్స్ పీఆర్వో, కల్నల్ మహేంద్ర రావత్ తెలిపారు. Report: Army #Cheetah Helicopter Crash in West #Khameng district of the #Arunachal Pradesh. More details awaited.#IADN 📸 Representation pic.twitter.com/2ZL9P30yHM — Indian Aerospace Defence News (IADN) (@NewsIADN) March 16, 2023 -
గల్వాన్ లోయలో క్రికెట్ ఆడిన భారత జవాన్లు..
న్యూఢిల్లీ: 2020 జూన్ 15. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ. భారత్, చైనా సరిహద్దులోని పెట్రోలింగ్ పాయింట్(పీపీ)–14. సరిగ్గా అక్కడే ఇరు దేశాల సైనికుల నడుమ భీకర స్థాయిలో ఘర్షణ జరిగింది. పదునైన ఆయుధాలతో చైనా జవాన్లు దాడి చేయగా, దెబ్బకు దెబ్బ అన్నట్లుగా భారత సైనికులు దీటుగా బదులిచ్చారు. ఈ కొట్లాటలో తమ జవాన్లు ఎంతమంది బలయ్యారో చైనా ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టలేదు. 40 మందికిపైగానే చనిపోయి ఉంటారని అంచనా. భారత్ వైపు నుంచి దాదాపు 20 మంది చనిపోయారు. రణక్షేత్రంగా రక్తంతో తడిసిపోయిన పీపీ–14 ఇప్పుడు క్రికెట్ మైదానంగా మారింది. పటియాలా బ్రిగేడ్‌కు చెందిన త్రిశూల్ డివిజన్ క్రికెట్ పోటీ నిర్వహించింది. సైనికులు సరదాగా క్రికెట్ ఆడారు. పీపీ–14కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఈ పోటీ జరిగింది. జవాన్లు క్రికెట్ ఆడుతున్న ఫొటోలను భారత సైన్యం శుక్రవారం ట్విట్టర్లో పోస్టు చేసింది. గడ్డ కట్టించే తీవ్రమైన చలిలో పూర్తి ఉత్సాహంతో ఈ పోటీ జరిగిందని వెల్లడించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని ఉద్ఘాటించింది. జీ20 విదేశాంగ మంత్రుల సదస్సు సందర్భంగా గురువారం ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఆ మరుసటి రోజే గల్వాన్‌లో భారత సైనికులు క్రికెట్ పోటీ నిర్వహించుకోవడం విశేషం. -
ఏరో ఇండియా 2023లో స్పెషల్ అట్రాక్షన్ గా ఎగిరే సైనికుడు
-
మిలటరీ సామర్థ్యంలో స్థిరంగా భారత్
ఎం. విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి మిలటరీ సామర్థ్యంలో మన దేశం నాలుగో స్థానంలో నిలిచింది. ‘గ్లోబర్ ఫైర్ పవర్’ (జీఎఫ్‌పీ) సూచీ–2023 ఇటీవల విడుదలైంది. ఈ సూచీలో 2006 నుంచి భారత్ నాలుగో స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది. తాజా సూచీలో అమెరికాకు తొలి ర్యాంకు రాగా.. రెండు, మూడు స్థానాల్లో రష్యా, చైనా ఉన్నాయి. జీఎఫ్‌పీ సూచీ రూపొందించిన 2005 నుంచి ఇప్పటివరకు అమెరికా తొలి ర్యాంకులోనే ఉంది. 2005, 2006 సూచీల్లో రెండోస్థానంలో నిలిచిన చైనా.. ఆ తర్వాత రష్యా ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2007 నుంచి ఇప్పటివరకు రెండు, మూడు స్థానాల్లో రష్యా, చైనా కొనసాగుతున్నాయి. 2005 సూచీలో పాకిస్తాన్ నాలుగో స్థానంలో ఉండగా, 2006లో 5వ స్థానానికి, 2007లో 20వ స్థానానికి పడిపోయింది. 2010కి కాస్త మెరుగుపడి 15వ స్థానానికి చేరింది. ఇప్పుడు తాజాగా 2022లో 9వ స్థానానికి వచ్చిన పాకిస్తాన్... ఈ సంవత్సరం 7వ స్థానంలో నిలిచింది. ప్రపంచ యుద్ధాల్లో కదన రీతిని సమూలంగా మార్చేసిన యుద్ధట్యాంకులు.. ఆధునిక యుగంలోనూ సైన్యం శక్తిసామర్థ్యాలకు మూలస్తంభాలుగా యుద్ధట్యాంకులు నిలవడం గమనార్హం. ► ఆధునిక ఆయుధ సంపత్తి సమకూరిన తర్వాత సైన్యం సామర్థ్యాన్ని లెక్కగట్టడంలో ఇప్పటికీ యుద్ధట్యాంకులు కీలక భూమిక పోషిస్తున్నాయి. యుద్ధ ట్యాంకులూ ఆధునికతను సంతరించుకుని, సాయుధ బలగాలకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. ► రష్యా వద్ద ఇవి అత్యధికంగా 12,566, భారత్ వద్ద 4,614 ట్యాంకులున్నాయి. ► అర్జున్ లాంటి అత్యాధునిక భారీ యుద్ధ ట్యాంకులతో పాటు తక్కువ బరువైన (గరిష్టంగా 25 టన్నులు) యుద్ధ ట్యాంకులు కూడా భారత్ సైన్యం వద్ద ఉన్నాయి. ► కృత్రిమ మేధస్సును వాడుకునే సామర్థ్యం ఉన్న అత్యాధునిక ట్యాంకులు మన సొంతం. ► ఇక ఎత్తయిన ప్రదేశాల్లోనూ, భౌగోళికంగా అత్యంత అనుకూల పరిస్థితులున్న చైనా సరిహద్దు ప్రాంతాల్లో శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తక్కువ బరువున్న యుద్ధ ట్యాంకులను సమకూర్చుకోవడానికి భారత్ దేశీయ పరిజ్ఞానంతో ‘ప్రాజెక్టు జొరావర్’ చేపట్టింది. ► భారీ ట్యాంకులకు ఇవి ఏమాత్రం తక్కువ కాదు. అమెరికాలోనే ఎక్కువగా.. అత్యాధునిక యుద్ధ ట్యాంకులు తయారుచేస్తున్న అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌లో చూస్తే అమెరికా వద్దే పెద్ద సంఖ్యలో ట్యాంకులు ఉన్నాయి. మిగతా అగ్ర దేశాలు తాము ఉత్పత్తి చేసిన ట్యాంకులను ఇతర దేశాలకు విక్రయించడమే తప్ప తమ సైన్యానికి ఇవ్వలేదు. అత్యాధునిక లెపర్డ్–2 ఉత్పత్తి చేస్తున్న జర్మనీ తన వద్ద ఉంచుకున్న ట్యాంకులు 266 మాత్రమే. ఛాలెంజర్–2లను ఉత్పత్తి చేస్తున్న యూకే.. తన వద్ద ఉన్న ఈ ట్యాంకుల సంఖ్య 227 మాత్రమే. అవి నాటో దేశాలు కావడంవల్లే భారీగా ట్యాంకులు సమకూర్చుకోవడం లేదు. ఉక్రెయిన్ వద్ద ఆనాటి ట్యాంకులు ఉక్రెయిన్ ఒకప్పటి యూఎస్ఎస్ఆర్లో భాగం. ఉక్రెయిన్ వద్ద ఉన్న యుద్ధ ట్యాంకుల్లో యూఎస్ఎస్ఆర్ కాలం నాటివే ఎక్కువ. రష్యా యుద్ధ ట్యాంకులను కొన్నింటిని స్వాధీనం చేసుకుని వాడుతున్నారు. అత్యాధునిక యుద్ధ ట్యాంకులు ఇస్తే రష్యాతో యుద్ధ స్వరూపాన్ని సమూలంగా మార్చేయాలని ఉక్రెయిన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. వీటిని ఇవ్వమని నాటో సభ్య దేశాలను అడుగుతోంది. ఇటీవల జర్మనీలో జరిగిన వివిధ దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో ఉక్రెయిన్ విజ్ఞప్తి మీద చర్చ జరిగినా సానుకూల నిర్ణయం రాలేదు. ర్యాంకుల కథాకమామిషు.. ప్రపంచ దేశాల సైన్యాల కదన సామర్థ్యం ఆధారంగా ‘గ్లోబర్ ఫైర్ పవర్’ (జీఎఫ్‌పీ) అంతర్జాతీయ సంస్థ 2005 నుంచి ఏటా ర్యాంకులు ఇస్తోంది. సంప్రదాయ పద్ధతుల్లో ఆయా దేశాల నింగి, నేల, జల యుద్ధ సామర్థ్యాలు, సైన్యాలకు అందుబాటులో ఉన్న మానవ వనరులు, ఆయుధ సంపత్తి, సహజ వనరులు, దేశ రక్షణకు చేస్తున్న వ్యయం, భౌగోళిక పరిస్థితులు, పొరుగు దేశాల నుంచి ఒత్తిడి, సరిహద్దు పాయింట్లు.. ఇలా 60కి పైగా అంశాలను పరిగణనలోకి తీసుకుని 145 దేశాలకు ‘గ్లోబల్ ఫైర్ పవర్’ ర్యాంకులు ఇస్తోంది. -
74th Republic Day: పరేడ్‌లో మహిళా శక్తి
74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగే రిపబ్లిక్ పరేడ్‌లో ఈసారి మహిళా శక్తికి విశేష ప్రాధాన్యం లభించింది. ఆర్మి, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లోనికవాతు బృందాలకు మహిళా ఆఫీసర్లు నాయకత్వం వహించనున్నారు. మొదటిసారి మహిళా ఒంటె దళం కవాతు చేయనుంది. డేర్ డెవిల్స్‌గా స్త్రీల బృందం మోటర్ సైకిల్ విన్యాసాలుచేయనుంది. అనేక శకటాలు మహిళా శక్తిని చాటనున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా స్త్రీ ప్రభావ శక్తికి ఈ పరేడ్ వేదిక కానుంది. గణతంత్ర దినోత్సవం నాడు మన దేశం తన సైనిక తేజాన్ని, సాంస్కృతిక సౌభ్రాతృత్వాన్ని, అంతర్గత వైవిధ్యాన్ని చాటుకుంటుంది. ప్రతి సంవత్సరం జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్‌లో రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు జరిగే సైనిక కవాతు, రాష్ట్ర ప్రభుత్వాల శకటాల విన్యాసం, కళా బృందాల ఆట΄ాటలు. చూడటానికి కళ్లు చాలవు. ఇదంతా కలిసి మన దేశం... మనమంతా కలిసి మన శక్తి అనే భావన ఈ సందర్భంలో కలుగుతుంది. అయితే ఈసారి ఈ ‘మన శక్తి’లో స్త్రీ శక్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, త్రివిధ దళాలుప్రాధాన్యం ఇచ్చాయి. అందువల్ల ఈ పరేడ్ స్త్రీ శక్తికి నిదర్శనంగా నిలువనుంది. ముగ్గురు మహిళా సైనికాధికారులు పరేడ్‌లోపాల్గొనే త్రివిధ దళాల కవాతు బృందాలకు పురుష ఆఫీసర్లు నాయకత్వం వహించి ముందు నడవడం ఆనవాయితీ. ఈసారి ముగ్గురు మహిళా ఆఫీసర్లకు నాయకత్వ స్థానం దొరికింది. నావికా దళంలో నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్న లెఫ్టినెంట్ కమాండర్ దిశా అమృత్ (29) 144 మంది నావికులతో కూడిన కవాతు బృందాలకు నాయకత్వం వహించనుంది. బెంగళూరుకు చెందిన దిశ అమృత్ 2016లో నావికా దళంలో చేరక ముందు ఐటి రంగంలో పని చేసింది. ఎన్సిసి కాడెట్‌గా ఉన్నప్పటి నుంచి రిపబ్లిక్ డే పరేడ్‌పాల్గొంటున్న ఆమె ఈసారి ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మిగ్– 17 పైలెట్‌గా ఉన్న స్కాడ్రన్ లీడర్ సింధు రెడ్డి తన దళం తరఫున 144 మంది గగన యోధులతో కవాతు నిర్వహించనుంది. ఇక మేడ్ ఇన్ ఇండియా ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్‌కు లెఫ్టెనెంట్ ఆకాష్ శర్మ నాయకత్వం వహించనుంది. ‘చిన్నప్పటి నుంచి టీవీలో చూసిన పరేడ్‌లో ఈసారి నేను పాల్గొనడం సంతోషంగా ఉంది’ అని శర్మ అంది. ఈ ముగ్గురు కాకుండా లెఫ్టినెంట్ డింపుల్ భాటి మోటార్ సైకిల్ విన్యాసాల దళంలో, మేజర్ మహిమ ‘కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్’ బృందాల నాయకత్వంలోపాల్గొననున్నారు. మహిళా శకటాలు ఈసారి పరేడ్‌లో 17 రాష్ట్రాల నుంచి, 6 మంత్రిత్వ శాఖల నుంచి, త్రివిధ దళాల నుంచి శకటాలుపాల్గొననున్నాయి. ఇవి కాకుండా డిఆర్డివో శకటం ఉంటుంది. అయితే వీటిలో చాలా శకటాలు ఈసారి మహిళా శక్తికి ప్రాధాన్యం,ప్రాముఖ్యం ఇచ్చాయి. మూడు సైనిక దళాలు ఈసారి మహిళా కేంద్రిత శకటాలను నడుపుతున్నాయి. టూరిజంలోనూ, సేంద్రియ వ్యవసాయంలోనూ స్త్రీల భాగస్వామ్యంలో వారి స్వయం సమృద్ధికిపాటుపడతాం అనే థీమ్‌తో త్రిపుర శకటం ఉండనుంది. పశ్చిమ బెంగాల్ శకటం యునెస్కో గుర్తింపు పొందిన దుర్గా పూజను ‘మానవత్వానికి అమూర్త వారసత్వ సంపదగా’ అభివర్ణిస్తూ ముందుకు సాగనుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ‘సకల సజీవిత్వాలను సమృద్ధి చేసే అమృత స్త్రీతత్వం’ థీమ్‌తో శకటం నడపనుంది. కేంద్ర హోమ్ శాఖ అయితే ఆరు కేంద్ర బలగాలలో స్త్రీ పోరాట పటిమను ప్రదర్శించే శకటంను ఎంచుకుంది. కేరళ మహిళా సాక్షరత శకటాన్ని, కర్నాటక మహిళా స్వయం సమృద్ధి శకటాన్ని ఈ పరేడ్ దారుల్లో నడిపించనున్నాయి. కళకళలాడే నృత్యాలు వీరందరూ కాకుండా వివిధ రాష్ట్రాల సాంస్కృతిక బృందాలలో విద్యార్థునులు, యువతలు, మహిళా కళాకరులు విశేష సంఖ్యలోపాల్గొననున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి మొదలు వీరంతా తమ సాంస్కృతిక విన్యాసాలను ప్రదర్శించనున్నారు. లెఫ్టెనెంట్ ఆకాష్ శర్మ, స్కాడ్రన్ లీడర్ సింధు రెడ్డి, లెఫ్టినెంట్ కమాండర్ దిశా అమృత్ చారిత్రక దృశ్యం దిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ నేత్రపర్వంగా ఉండటమే కాదు, దేశభక్తి భావాలు ఉ΄÷్పంగేలా కూడా చేస్తుంది. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రత్యేకత... సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) ‘క్యామెల్ కాంటింజెంట్’లో తొలిసారిగా ΄ాల్గొంటున్న మహిళా సైనికులు... దిల్లీలో ఘనంగా జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)కు చెందిన ‘క్యామెల్ కాంటింజెంట్’ 1976 నుంచి భాగం అవుతోంది. ఈసారి జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో మహిళా సైనికులు ‘క్యామెల్ కాంటింజెంట్’లో భాగం కావడం చారిత్రక ఘట్టం కానుంది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇరవై నాలుగు మంది మహిళా సైనికులకు రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో క్యామెల్ రైడింగ్‌లో శిక్షణ ఇచ్చి పన్నెండు మందిని ఎంపిక చేశారు. ‘రిపబ్లిక్ డే పరేడ్‌లో ΄ాల్గొనడం ఒక సంతోషం అయితే క్యామెల్ కాంటింజెంట్‌లో భాగం కావడం మరింత సంతోషం కలిగిస్తుంది’ అంటుంది బృందంలో ఒకరైన అంబిక. ‘రిపబ్లిక్ డే ఉత్సవాల్లో క్యామెల్ రైడర్స్‌ను చూసి అబ్బురపడేదాన్ని. ఇప్పుడు నేను అందులో భాగం కావడం గర్వంగా ఉంది’ అంటుంది సోనాల్. విజయ్‌చౌక్ నుంచి ఎర్రకోట వరకు కర్తవ్యపథ్ మీదుగా క్యామెల్ రైడర్స్ కవాతు నిర్వహిస్తారు. రిపబ్లిక్‌డే తరువాత జరిగే రీట్రీట్ సెరిమనీలో కూడా ఈ బృందం ΄ాల్గొనబోతోంది. అమృత్‌సర్‌లో జరిగిన బీఎస్ఎఫ్ రైజింగ్ డే పరేడ్‌లో ఈ బృందం ΄ాల్గొని ప్రశంసలు అందుకుంది. ఉమెన్ రైడర్స్ కోసం ఆకట్టుకునే యూనిఫాంను కూడా రూ΄÷ందించారు. ప్రముఖ డిజైనర్ రాఘవేంద్ర రాథోడ్ దీన్ని డిజైన్ చేశారు. మన దేశంలోని వివిధ ్ర΄ాంతాలకు చెందిన క్రాఫ్ట్ ఫామ్స్‌ను ఈ డిజైన్ ప్రతీకాత్మకంగా ప్రతిబింబిస్తుంది. రాజస్థాన్‌లోని మెవాడ్ సంప్రదాయానికి చెందిన తల΄ాగా మరో ఆకర్షణ. మన దేశంలో భద్రతావసరాలు, సాంస్కృతి కార్యక్రమాల్లో ఒంటెలను ఉపయోగిస్తున్న ఏకైక సైనిక విభాగం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సాంస్కృతిక కార్యక్రమాల్లో బీఎస్ఎఫ్ క్యామెల్ కాంటింజెంట్ కవాతులకు ప్రత్యేకత ఉంది. ఉమెన్ రైడర్స్ రాకతో కవాతులలో రాజసం ఉట్టిపడుతుంది. మేము సైతం: ఉమెన్ రైడర్స్, ఆకట్టుకునే యూనిఫాం: ప్రముఖ డిజైనర్ రాఘవేంద్ర రాథోడ్ డిజైన్ చేశారు. -
భారత భూభాగం ఆక్రమించిన చైనా.. కేంద్రానికి సంచలన నివేదిక!
భారత్ సరిహద్దుల్లో చైనా కారణంగా ఎప్పుడూ ఉద్రిక్తత చోటుచేసుకుంటూనే ఉంటుంది. డ్రాగన్ కంట్రీ భారత్‌కు చెందిన సరిహద్దులపై కన్నేసి ఆక్రమణలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా భారత్‌కు సంబంధించిన భూమిని చైనా ఆక్రమించుకున్నట్టు స్వయంగా దేశానికి చెందిన సీనియర్ అధికారి ఓ నివేదికలో చెప్పడం సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌లోని తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఈ ప్రాంతంలోని 65 పాయింట్లలో భారత్ గస్తీ నిర్వహించాల్సి ఉండగా.. మన బలగాలు 26 చోట్లకు మాత్రమే ప్రవేశించగలుగుతున్నాయి. పలు చోట్ల భారత్ గస్తీ నిర్వహించడం లేదని ఈ క్రమంలోనే ఆక్రమణ జరిగినట్టు లేహ్ ఎస్పీ నిత్య కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందించారు. ఈ నివేదికను ఆమె.. ఢిల్లీలో జరిగిన పోలీసుల సదస్సులో కేంద్రానికి సమర్పించారు. కాగా, ఆ ప్రాంతం కారాకోరం శ్రేణుల్లో నుండి చమూరు వరకు విస్తరించి ఉన్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. ఇక, ఈ ప్రాంతాల్లో భారత్ గస్తీ నిర్వహించకపోవడంతో చైనా.. ఆయా ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నట్టు తెలిపారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో కొన్ని చోట్ల బఫర్ జోన్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అయితే, బఫర్ జోన్లను ఆసరాగా తీసుకుని భారత్‌కు చెందిన ప్రాంతాలను చైనా ఆక్రమిస్తున్నట్టు నివేదికలో చెప్పుకొచ్చారు. అలాగే, భారత్ బలగాల కదలికలను సైతం గుర్తించేందుకు అక్కడి ఎత్తైన శిఖరాలపై చైనా.. కెమెరాలను అమర్చినట్టు తెలిపారు. ఇలా, బఫర్ జోన్లోకి భారత సైన్యం వెళ్లిన వెంటనే ఆ ప్రదేశం తమ దేశానికి చెందినదే అని చైనా దూకుడగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. కొద్దిరోజులుగా ఇలా చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని నివేదికలో స్పష్టం చేశారు. ఇక, ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా ఉన్నారు. Did India lose access to 26 patrolling points in Eastern Ladakh? Become a Youturn Supporter: https://t.co/6cvL9b8072#Youturn | #FactCheck | #IndiaBorder | #Ladakh pic.twitter.com/kHY6nsLBcY — Youturn English (@Youturn_media) January 25, 2023 -
ఫ్రీగా క్రెడిట్ కార్డు.. ఓటీటీ సబ్స్క్రిప్షన్, ఈఎంఐ ఆఫర్లంటూ బోలెడు బెనిఫిట్స్!
ఇటీవల క్రెడిట్ కార్ట్ వాడకం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి కొత్త క్రెడిట్ కార్డులు బోలెడు ఆఫర్లతో వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ క్రెడిట్ కార్డు గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ కార్డు ఫ్రీగా లభిస్తుంది. అంతేనా ఉచితంగా బీమా కవరేజ్ కూడా పొందచ్చు. ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఈ కొత్త క్రెడిట్ కార్డుని ప్రవేశపెట్టింది. కాకపోతే ఫుల్ ప్రయోజనాలతో వస్తున్న ఈ కార్డు కేవలం కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. వారి కోసం కొత్త క్రెడిట్ కార్డు ఈ క్రెడిట్ కార్డు పేరు విక్రమ్ క్రెడిట్ కార్డు (Vikram Credit Card). ఇండియన్ డిఫెన్స్, పారామిలిటరీ, పోలీస్ సిబ్బంది కోసం ఈ క్రెడిట్ కార్డును తీసుకువచ్చినట్లు బ్యాంక్ తెలిపింది. బీఎప్ఎస్ఎల్ ( BFSL) ఇప్పటికే ఇండియన్ ఆర్మీ (యోధా), ఇండియన్ నేవీ (వరుణహ్), ఇండియన్ కోస్ట్ గార్డ్ (రక్షమాహ్), అస్సాం రైఫిల్స్(ది సెంటినెల్) వారి కోసం ప్రత్యేకమైన కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను అందించింది. నిస్వార్థంగా మనల్ని కాపాడుతూ, మన దేశానికి సేవ చేస్తున్న సిబ్బంది క్రెడిట్ అవసరాలను తీర్చేందుకు విక్రమ్ క్రెడిట్ కార్డ్ ఎంత గానో ఉపయోగపడుతుందని బీఎఫ్ఎసఎల్ ( BFSL ) తెలిపింది. 74వ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కొత్త ఎక్స్‌క్లూజివ్ క్రెడిట్ కార్డులను వారికి అందిస్తామని బ్యాంక్ పేర్కొంది. విక్రమ్ క్రెడిట్ కార్డును బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య సింగ్ ఖిచి ప్రారంభించారు. విక్రమ్ క్రెడిట్ కార్డ్ ఫీచర్లు, ప్రయోజనాలపై ఓ లుక్కేద్దాం! ►జీవితకాల ఉచిత (LTF) క్రెడిట్ కార్డ్ ►ఆకర్షణీయమైన రివార్డ్ పాయింట్లతో పాటు కాంప్లిమెంటరీ ఓటీటీ సబ్స్క్రిప్షన్ యాక్టివేషన్ బహుమతి. ►ప్రమాద మరణ కవరేజీ రూ. 20 లక్షలు ►1% ఇంధన సర్ఛార్జ్ మినహాయింపు ►LTF యాడ్-ఆన్లు ►ఈఎంఐ ఆఫర్లు ►కాలానుగుణంగా వ్యాపార సంబంధిత ఆఫర్లు చదవండి: Maruti Suzuki: మారుతి కస్టమర్లకు మరోషాక్, 11 వేల కార్లు రీకాల్ -
Women Army Officers: నెరవేరిన దశాబ్దాల కల.. ఆమె కమాండ్‌లో...
ఆకాశంలో సగం కాదు... నింగి నేల నీరు దేనినైనా పూర్తిగా కమాండ్ చేస్తామంటోంది మహిళాలోకం కఠోరమైన శారీరక శ్రమ చేయాల్సిన కదనరంగాన్ని కూడా నడిపించడానికి ముందుకొచ్చింది.. దశాబ్దాలుగా ఎందరో మహిళా అధికారుల కల ఎట్టకేలకు నెరవేరింది. 100 మందికిపైగా మహిళలు పదోన్నతులు పొంది కల్నల్ స్థాయికి ఎదిగారు. భారత ఆర్మీలో చరిత్రాత్మక ముందడుగు పడింది. సియాచిన్ సహా వివిధ కమాండ్ యూనిట్లను మహిళలు కూడా ముందుండి నడిపించనున్నారు. ఇన్నాళ్లూ పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ బాధ్యతల్ని మొట్టమొదటి సారిగా మహిళలు కూడా నిర్వర్తించనున్నారు. రెజిమెంట్లు, బెటాలియన్లకు అధికార పదవుల్లో మహిళల నియామకానికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ ఈ నెల 9 నుంచి 22 వరకు జరిగింది. దాదాపుగా 108 మంది మహిళా అధికారులు కల్నల్‌గా పదోన్నతులు పొందారు. 1992 నుంచి 2006 బ్యాచ్‌కు చెందిన మహిళా అధికారులకు పదోన్నతులు ఇవ్వడానికి ప్రత్యేక కమిటీ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. వీరంతా ఇంజనీర్స్, సిగ్నల్స్, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, ఇంటెలిజెన్స్ కోర్, ఆర్మీ సర్వీస్ కోర్, ఆర్మీ ఆర్డన్స్ కోర్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్స్ వంటి విభాగాలకు అధికారులుగా సేవలందిస్తారు. భారత సాయుధ బలగాల్లో 1992 నుంచి మహిళా అధికారులు ఉన్నారు. అయితే వారంతా షార్ట్ సర్వీసు కమిషన్ (ఎస్ఎస్సీ) అధికారులుగానే ఇన్నేళ్లుగా కొనసాగుతున్నారు. ఇంజనీర్లు, న్యాయవాదులు, వంటి అడ్మినిస్ట్రేటివ్ పాత్రలే పోషిస్తున్నారు. యుద్ధ క్షేత్రాల్లో గాయపడ్డ జవాన్లకి చికిత్స అందించే వైద్యులు, నర్సులుగా కూడా ఉన్నారు. 16–18 ఏళ్లు సర్వీసు ఉంటేనే కమాండర్ పదవికి అర్హత సాధిస్తారు. ఇప్పుడు కోర్ ఆఫ్ ఆర్టిలరీ, కంబాట్ సపోర్ట్ ఆర్మ్‌లలో మహిళా అధికారుల్ని నియమించనున్నారు. భారత వాయుసేన, నావికాదళంలో అన్ని విభాగాల్లో మహిళా అధికారులు ఉన్నారు. వారికి శాశ్వత కమిషన్లు కూడా ఉన్నాయి. యుద్ధ విమానాలను, యుద్ధ నౌకల్ని నడిపించే మహిళలూ ఉన్నారు. త్రివిధ బలగాల్లో అతి పెద్దదైన పదాతి దళంలో మాత్రమే మహిళల పట్ల ఇన్నాళ్లూ వివక్ష కొనసాగుతూ వచ్చింది. ఎందుకీ వివక్ష పురుషులతో పోలిస్తే మహిళల శారీరక దారుఢ్యంపైనున్న సందేహాలే ఇన్నాళ్లూ వారికి అవకాశాల్ని దూరం చేశాయి. మాతృత్వం, పిల్లల పోషణ, ప్రసూతి సెలవులు వంటివి మహిళలకు తప్పనిసరిగా ఇవ్వాలని, యుద్ధం ముంచుకొచ్చే నేపథ్యాల్లో అది సాధ్యం కాదనే వాదన వినిపించింది. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. మహిళలకు ఎక్కడైనా పని చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వినిపించాయి. భారత వాయుసేన, నావికాదళంతో పోలిస్తే ఆర్మీలో వివక్ష ఎక్కువగా ఉంది. యుద్ధభూమిలో నేరుగా మహిళలుంటే శత్రు దేశానికి చిక్కితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ఇప్పటికీ పోరాట క్షేత్రాల్లో మహిళా కమాండర్లను నియమించడానికి భారత సైన్యం ఇంకా సిద్ధంగా లేదు. సుప్రీం తీర్పుతో నెరవేరిన కల భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు శాశ్వత కమిషన్, కమాండింగ్ పదవులు ఇవ్వాల్సిందేనని 2020 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. వారు ఎన్ని సంవత్సరాలుగా సర్వీసులో ఉన్నారనే విషయంతో సంబంధం లేకుండా అందరికీ శాశ్వత కమిషన్ వర్తింపచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో ఆర్మీలో మహిళలు పురోగతి సాధించడానికి, నాయకత్వ సామర్థ్యాలను ప్రదర్శించడానికి, పదోన్నతులకు మార్గం సుగమమైంది. యూనిట్‌ను కమాండ్ చేయడమంటే..? పదాతి దళంలో క్షేత్రస్థాయిలో సైనికులందరికీ నేరుగా ఆదేశాలు ఇస్తూ వారిని ముందుకు నడిపించే కీలక బాధ్యత. ఇప్పటివరకు పురుషులు మాత్రమే నిర్వహించిన ఈ బాధ్యతల్ని మహిళలు కూడా అందుకున్నారు. సైన్యంలో కల్నల్ పదవి మహిళకి లభిస్తే ఆమె కనుసన్నల్లోనే సైన్యం నడుస్తుంది. బ్రిగేడర్, మేజర్ జనరల్, లెఫ్ట్‌నెంట్ జనరల్ వంటి ఉన్నతాధికారులు నేరుగా సైనికులతో సంబంధాలను కొనసాగించరు. ఇలాంటి పదవుల్లోనే ఎన్నో సవాళ్లను మహిళలు ఎదర్కోవాల్సి ఉంటుంది. అప్పుడే మహిళల్లో నాయకత్వ సామర్థ్యం బయట ప్రపంచానికి తెలుస్తుంది. ‘‘సియాచిన్‌లో మొట్టమొదటి మహిళా అధికారిగా శివ చౌహాన్‌ను నియామకం మాలో కొత్త ఉత్సాహాన్ని పెంచింది. స్త్రీ, పురుషులన్న భేదం లేకుండా ప్రతీ ఒక్కరికీ వారికి మాత్రమే సొంతమయ్యే సామర్థ్యాలుంటాయి. ఆర్మీలో మహిళలకు మంచి భవిష్యత్ ఉంది. శారీరక దారుఢ్యం ఉన్నవారు కూడా ఇన్నాళ్లూ వివక్ష కారణంగా పదవులకి దూరమయ్యారు. ఇక ఆ రోజులు పోయాయి’’ – దీక్షా ధామిన్, ఆర్మీకి శిక్షణ పొందుతున్న యువతి ‘‘ఆర్మీలోకి రావాలనుకునే మహిళల సంఖ్య ఇంకా పెరుగుతుంది. పోరాట క్షేత్రాలకు సంబంధించిన విభాగాల్లో కూడా మహిళా అధికారులు రావాలి. ఎందుకంటే మహిళలు ఎంతో చురుగ్గా, త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో ఉంటారు’’ – దీప్‌నూర్ సహోతా, ఆర్మీకి శిక్షణ పొందుతున్న యువతి – సాక్షి, నేషనల్ డెస్క్ -
Indian Army Day: సెల్యూట్..సైనికుడా..!
తమ బతుకునే ఫణంగా పెట్టి తన కోసం, తన కుటుంబం కోసం కాకుండా దేశం కోసం ఉద్యోగం చేస్తుంటారు కొందరు. పుట్టిన ఊరికి దూరంగా, కన్నవారికి, కట్టుకున్న వారికి కనపడకుండా ఎండా, వానను లెక్క చేయకుండా చలికి వణుకుతూ అనుక్షణం ఎదురయ్యే ప్రమాదాలతో సహజీవనం చేస్తూ దేశసేవకు తమ జీవితాలను అంకితం చేస్తుంటారు. వారే మన భారత సైనికులు. త్యాగానికి నిదర్శనంగా నిలుస్తున్న నిజమైన దేశ భక్తులు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఏటా జనవరి 15వ తేదీన ఆర్మీ డే జరుపుకుంటాం. పోరాటాల పురిటిగడ్డగా పేరొందిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎందరో యువకులు ఆర్మీలో పనిచేస్తున్నారు. అనేక మంది రిటైర్డ్ అయి సమాజ సేవలో ఉన్నారు. నేడు సైనిక దినోత్సవం సందర్భంగా.. వారిపై ప్రత్యేక కథనం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 1300 మంది వరకు త్రివిధ దళాల్లో పనిచేశారు. వీరిలో ఎయిర్‌ఫోర్స్‌లో 50 మంది, నేవీలో 20 మంది వరకు పని చేశారు. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారు దాదాపు 400 మంది వరకు జవాన్ స్థాయి నుంచి కల్నల్ హోదా వరకు సైన్యంలో పనిచేస్తున్నారు. సైనిక సంక్షేమ శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం 1300 మందిలో కొంతమంది యుద్ధంలో వీరమరణం పొందారు. వివిధ కారణాలతో మరో 350 చనిపోయారు. మన జిల్లాకు చెందిన పలువురు సైనికులు 1965లో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో, 1977లో జరిగిన బంగ్లాదేశ్ విభజన సమయంలో, 1999 కార్గిల్ యుద్ధంలో, 2021లో చైనా బలగాలను నిలువరించిన ఘటనలో పాల్గొన్నారు. నల్లగొండ, సూర్యాపేట ప్రాంతానికన్నా భువనగిరి ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో సైన్యంలో చేరుతున్నారు. వలిగొండ మండలం ఎదుళ్లగూడెంలో 15 మంది మాజీ సైనికులు ఉన్నారు. ముగ్గురు ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా.. త్రివిధ దళాల్లో పనిచేసిన పలువురు రిటైర్డ్ అయిన తరువాత ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవలందిస్తున్నారు. కోదాడ, హుజూర్నగర్ ఎమ్మెల్యేగా, ప్రస్తుతం నల్లగొండ ఎంపీగా పనిచేస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భారత వాయుసేనలో మిగ్ యుద్ధవిమానం ఫైలెట్‌గా పనిచేశారు. శాలిగౌరారం మండలం ఇటుకులపహాడ్ సర్పంచ్ సైదులు సైన్యంలో పనిచేసినవాడే. హాలియా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సుధాకర్ కూడా సైన్యంలో పనిచేశారు. ఇలా చాలా మంది ఉన్నారు. అల్లి గంగరాజు, అల్లి సైదులు, అల్లి వెంకటేశ్వర్లు దేశసేవకు ఆ కుటుంబం అంకితం ఆర్మీలో ఉద్యోగం అంటేనే బయపడే కాలంలో దాదాపు మూడు దశాబ్దాల క్రితం మారుమూల గ్రామంలో పుట్టిపెరిగి, ఒకే ఇంటి నుంచి ముగ్గురు అన్నదమ్ములు దేశసేవ కోసం సైన్యంలో చేరి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరిలో ఇద్దరు ఉద్యోగ విరమణ పొందగా మరొకరు దేశమాత సేవలోనే ఉన్నారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకులపçహాడ్ గ్రామానికి చెందిన అల్లి రామచంద్రయ్య– లక్ష్మి దంపతులకు నలుగురు కుమారులు సైదులు, వెంకటేశ్వర్లు, గంగరాజు, సురేష్ ఉన్నారు. పెద్ద కుమారుడు సైదులు 1998లో తొలిప్రయత్నంలోనే ఆర్మీలో ఉద్యోగం సాధించాడు. అన్నను స్పూర్తిగా తీసుకొని తమ్ముళ్లు వెంకటేశ్వర్లు 2005లో గంగరాజు 2011లో సైన్యంలో చేరారు. నాలుగవవాడైన సురేష్ అన్ని రకాల పరీక్షలు పాసై ఆర్మీలో చేరుదామనుకొనే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఉద్యోగంలో చేరలేకపోయాడు. అతను ఇంటి వద్ద ఉండి వ్యవసాయం చేసుకుంటున్నాడు. 1998లో ఉద్యోగంలో చేరిన సైదులు 2014లో నాయక్ హోదాలో ఉద్యోగ విరమణ పొందాడు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై సేవలందిస్తున్నాడు. వెంకటేశ్వర్లు 2022లో లాన్స్‌నాయక్ హోదాలో రిటైర్ అయ్యాడు. గ్రామంలోనే ఉండి సైన్యంలో చేరాలనుకుంటున్న వారికి శిక్షణ ఇస్తున్నాడు. గంగరాజు ప్రస్తుతం హవాల్దార్ హోదాలో జమూకశ్మీర్‌లో పనిచేస్తున్నాడు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని గ్రామానికి చెందిన మరో ఐదుగురు యువకులు సైన్యంలో చేరారు. క్రమశిక్షణ అలవడుతుంది ఆర్మీ ఉద్యోగం అంటేనే క్రమశిక్షణ, నీతి నిజాయితీలకు మారుపేరు. సైన్యంలో చేరిన ప్రతి ఒక్కరూ కఠోర శిక్షణతో పాటు శరీరదారుఢ్యం, మానసికస్థైర్యం, ఆత్మరక్షణలో రాటుదేలుతారు. నేడు సైన్యంలో చేరేందుకు యువత ఎంతో ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. ఇది దేశరక్షణకు మంచి పరిణామంగానే భావించవచ్చు. నాడు సైన్యంలో చేరేందుకు ఒక్క ఉద్యోగానికి 10 మంది పోటీపడితే నేడు సైన్యంలో ఒక్క ఉద్యోగానికి వందల సంఖ్యలో పోటీపడుతున్నారు. – అల్లి సైదులు, మాజీ సైనికుడు, ఇటుకులపహాడ్ సర్పంచ్ సైనిక నియామకాల కోసం ప్రభుత్వం ఇటీవల కొత్తగా ‘అగ్నిపథ్’ విధానాన్ని తీసుకొచ్చింది. దీనిలో చేరడానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి దాదాపు 7000 మంది యువకులు ముందుకొచ్చారు. వీరికి ఫిజికల్, మెడికల్ టెస్ట్‌లు పూర్తి కాగా త్వరలో రాత పరీక్ష జరుగుతుంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘవాపురానికి చెందిన మాజీ సైనికుడు కల్నల్ డాక్టర్ సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘ది షోల్జర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో వివిధ అంశాలలో ఉచితంగా శిక్షణ ఇచ్చారు. 2020 సంవత్సరం జూన్‌లో చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు అర్పించిన సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు ఆదుకుంటున్నామా.. యుక్త వయస్సులో అన్నీ వదులుకొని దేశసేవ కోసం పనిచేసిన సైనికులు రిటైర్డ్ అయిన తరువాత వారికి అందాల్సిన సౌకర్యాలు సక్రమంగా అందడం లేదనే విమర్శలున్నాయి. మాజీ సైనికుల డిమాండ్లు అపరిష్కృతంగా ఉన్నాయి. చాలా మంది తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మాజీ సైనికుల డిమాండ్స్ ఇవీ.. ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు 2 శాతం నుంచి 5 శాతానికి పెంచాలి. మాజీ సైనికులకు కేటాయించిన ఉద్యోగాలు ఒకసారి భర్తీ కాకుంటే వాటిని బ్యాక్లాగ్ చేసి మళ్లీ మాజీ సైనికులకే కేటాయించాలి. మాజీ సైనికుల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించాలి. ఉచితంగా ఇంటి స్థలాలు కేటాయించాలి. రాయితీ మీద మాజీ సైనికులకు ఇచ్చే సరుకుల కోసం ఉమ్మడి జిల్లాలో క్యాంటీన్ ఏర్పాటు చేయాలి. సరుకుల కోసం హైదరాబాద్‌కు వెళ్లి రావడం ఇబ్బందిగా ఉంది. ఉమ్మడి జిల్లాలో మాజీ సైనికులకు స్మారక చిహ్నం నిర్మించాలి. మాజీ సైనికులకు జీఓ నంబర్ 69 ప్రకారం సత్వరమే అన్ని సౌకర్యాలు కల్పించాలి. దేశసేవకు మించిన తృప్తి మరొకటి లేదు దేశం కోసం పనిచేయడానికి మించిన తృప్తి దేనిలోనూ ఉండదు. ఇటీవల ఆగ్నిపథ్ నియామకాల కోసం సూర్యాపేట జిల్లా నుంచి నేను ఏర్పాటు చేసిన ‘ది షోల్జర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల సహకారంతో 225 మందికి శిక్షణ ఇవ్వగా తుది రాత పరీక్షకు 167 మంది ఎంపికయ్యారు. ఇది ఆనందించదగ్గ విషయం. యువత ఇంకా ముందుకు రావాలి. – రిటైర్డ్ కల్నల్ సుంకర శ్రీనివాసరావు, విజయరాఘవాపురం, మునగాల దేశం రుణం తీర్చుకున్నా సైన్యంలో పనిచేసి దేశం రుణం తీర్చుకున్న తృప్తి మిగిలింది. నేను చదువుకునే రోజుల్లో సికింద్రాబాద్ వెళ్లాను. అక్కడ మిలటరీ వారిని చూసి నేను కూడా సైన్యంలో చేరాలనుకున్నాను. 20 సంవత్సరాల వయస్సులో 1962లో సైన్యంలో చేరాను. 1965లో పాకిస్తాన్ యుద్ధంలో, 1971లో బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొన్నా. 1977లో రిటైర్డ్ అయ్యాను. తరువాత ఫైర్ ఆఫీసర్‌గా పనిచేశాను. రెండు యుద్ధాల్లో పాల్గొని దేశం కోసం పనిచేసిన తృప్తి ఎప్పటికీ ఉంటుంది. యువత కూడా దేశం కోసం పనిచేయడానికి ముందుకు రావాలి. – సంధి పాపిరెడ్డి, అయిటిపాముల, కట్టంగూర్ మండలం (చదవండి: టోల్ ప్లాజాకు ‘పండుగ’) -
Eguvaramapuram: సైనికుల ఊరు.. సరిలేరు మీకెవ్వరు
భారత భూభాగాన్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ, పొరుగు దేశాల దురాక్రమణలను అడ్డుకుంటూనే, ఎప్పటికప్పుడు యుద్ధానికి సన్నద్ధులై కీలకమైన ఆపరేషన్లలో ప్రధాన పాత్రధారులుగా ఆ గ్రామ యువత దేశరక్షణలో నిమగ్నమైంది. సాధారణ సిపాయి నుంచి అత్యున్నత శిక్షణ పొందిన కమాండో, సెంట్రల్ మిలటరీ పోలీసు (సీఎంపీ) వరకూ ఆ గ్రామానికి చెందిన వారు సేవలందిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే యుద్ధభూమిలో ఆ గ్రామ యువత కీలకంగా వ్యవహరిస్తోంది. వైఎస్సార్ జిల్లాకు గర్వకారణంగా నిలుస్తున్న ఆ గ్రామం పేరు ఎగువరామాపురం. కలసపాడు మండలంలోని ఒక్క ఎగువ రామాపురం నుంచే దాదాపు 300 మంది యువకులు దేశరక్షణలో ఉండడం విశేషం. సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 2200 మంది భారతదేశ రక్షణ విభాగంలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తుంటే ఒక్క కలసపాడు మండలంలోనే దాదాపు 700 మందికి పైగా ఉన్నారు. అంటే జిల్లా నుంచి సైన్యంలో పనిచేస్తున్న వారిలో 30 శాతం వాటా కలసపాడు మండలానిదేనని స్పష్టమవుతోంది. ఈ మండలంలో ప్రధానంగా ఎగువరామాపురం, ఎగువ తంబళ్లపల్లె, రాజుపాళెం గ్రామాల నుంచే ఆర్మీలో ఉండడం మరో విశేషం. వారిలో అత్యధికంగా ఎగువరామాపురం వాసులు ఉన్నారు. పాకిస్థాన్‌తో తలపడిన కార్గిల్ యుద్ధంలో సైతం వీరి భాగస్వామ్యం ఉంది. ముంబయి తాజ్ హోటల్ వద్ద పాకిస్తాన్ ఉగ్రవాదులతో తలపడ్డ ఆపరేషన్ ‘సైక్లోన్’లో కూడా ఎగువరామాపురం గ్రామానికి చెందిన కమాండో ఉన్నారు. ఇలా అనేక ఆపరేషన్లలో ఆ గ్రామానికి చెందిన యువత భాగస్వామ్యం ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కార్గిల్ యుద్ధంలో.. నిత్యం మంచు ముద్దలు, మంచు కొండలు విరిగిపడుతుంటాయి. అలాంటి ప్రాంతంలో 1999 మే 13వతేదీ నుంచి 28 వరకు కార్గిల్‌లో యుద్ధం జరిగింది. భారతదేశ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ ముష్కరులను భారత సైన్యం తరిమికొట్టింది. ఈ యుద్ధంలో ఎగువరామాపురానికి చెందిన వారు 20 మంది ఉండడం మరో విశేషం. 2008 డిసెంబర్లో భారతదేశ ఆర్థిక రాజధానిగా పేరుబడ్డ ముంబయి నగరంలో తాజ్ హోటల్‌పై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. వారిని తుదముట్టించేందుకు ఢిల్లీ నుంచి బ్లాక్ క్యాట్ క మాండోలను ముంబయికి తరలించారు. ఆపరేషన్ ‘సైక్లోన్’ పేరుతో నిర్వహించిన ఈ టాస్క్‌లో ఎగువరామాపురానికి చెందిన కమాండో బండి ప్రతాప్‌రెడ్డి పాల్గొని విజయకేతనం ఎగురవేసి దేశ ప్రతిష్టలో భాగస్వామి అయ్యాడు. అన్నదమ్ములం ఇద్దరం ఆర్మీలో చేరాం మేం ఇద్దరం అన్నదమ్ములం. ఇద్దరం ఆర్మీలో చేరాం. మా అమ్మా నాన్న పొలంలో కష్టం చేసి మా ఇద్దరిని చదివించారు. జీవనోపాధికి ఆర్మీలో చేరినా దేశ భద్రతలో మేం కూడా మా వంతు పాత్ర పోషిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మిలటరీలో చేరి 13 సంవత్సరాలు అయింది. సెలవుపై ఇంటికి వచ్చినప్పుడు వ్యవసాయ పనుల్లో అమ్మా నాన్నకు చేదోడుగా ఉంటున్నాం. – వై.వెంకటరెడ్ధి ఆర్మీ ఉద్యోగి,ఎగువ రామాపురం దేశసేవ తృప్తిగా ఉంది మాది చాలా పేద కుటుంబం. పదవ తరగతి పూర్తయిన వెంటనే పై చదువులకు వెళ్లే పరిస్థితులు లేవు. ఆర్మీలో అయితే త్వరగా జాబ్ వస్తుందని పదవ తరగతి పూర్తి అయిన వెంటనే సెలక్షన్‌కు పోయా, ఉద్యోగం వచ్చింది. దాంతో బతుకు దెరువు దొరికింది. అమ్మా నాన్నలు కూడా ఆర్మీలోనే చేరమని చెప్పారు. దేశ సేవ చేస్తున్నానన్న ఆనందం ఉంది. ఇప్పటికి 15 సంవత్సరాలు సర్వీస్ పూర్తి అయింది. ఆర్మీ కమ్యూనికేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాను. – కె.కిరణ్‌కుమార్ ఆర్మీ ఉద్యోగి.ఎగువ రామాపురం మాకెంతో గర్వకారణం దేశ రక్షణలో మా గ్రామస్తుల భాగస్వామ్యం ఉండడం మాకెంతో గర్వకారణం. తరాలు మారినా ఆర్మీకి వెళ్లడంలో గ్రామ యువత ఎప్పటికీ ముందుంటుంది. గ్రామానికి చెందిన ఉదయగిరి చెన్నయ్య(40), నడిపి మస్తాన్(45) మరో ఇరువురు ప్రమాదవశాత్తు, అనారోగ్య పరిస్థితులతో మృత్యువాత పడ్డారు. అయినప్పటికీ ఆర్మీకి పంపేందుకు తల్లిదండ్రులు సంకోచించరు. దేశానికి సేవ చేస్తున్నామనే తృప్తే మెండుగా ఉంటుంది. ఆర్మీలో ఎంతో క్రమశిక్షణతో మా గ్రామానికి చెందిన వారు వివిధ హోదాల్లో రాణిస్తున్నారు. మాజీ సైనికోద్యోగులను ఆదుకోవాలి. – వెంకటయ్య సర్పంచ్, ఎగువ రామాపురం -
జమ్మూ కశ్మీర్లో భారీగా మారణాయుధాలు పట్టివేత
భారత సైన్యం, జమ్ముకాశ్మీర్ పోలీసులు భారీ మొత్తంలో యుద్ధం తరహా ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారు ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో యూరీలోని హత్లాంగా సెక్టార్లో ఈ ఆయుధాలను గుర్తించారు. ఆ ఆయుధాల్లో ఎనిమిది ఏకేఎస్ 74 రైఫిళ్లు, 560 లైవ్ రైఫిల్ రౌండ్లు, 12 చైనీస్ పిస్టల్స్, 14 పాకిస్తాన్, చైనా గ్రెనేడ్లతో పాటు పాకిస్తాన్ జెండాతో కూడిన బెలూన్లు ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు కల్నల్ మనీష్ పంజ్ చెప్పారు. ఆ ఆయుధాలు పాకిస్తాన్‌వేనని, ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలన్నారు కల్నల్ మనీష్ పంజ్ పాకిస్తాన్‌కి చెందిన మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కేసును చేధించే క్రమంలోనే ఒక రాజకీయ కార్యకర్త, కాంట్రాక్టర్, దుకాణాదారుడు, ఐదుగురు పోలీసులతో సహా సుమారు 17 మందిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాతే ఈ అనుహ్య ఘటన చోటు చేసుకుంది. మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో పౌల్ట్రీ షాపు యజమాని మహ్మద్ వసీమ్ నజర్ అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అతడిచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు చేసినట్లు తెలిపారు. (చదవండి:15 రోజుల పాటు శిక్ష..ఆప్ మంత్రికి మరో ఎదురు దెబ్బ) -
చైనా వ్యూహానికి దూకుడే విరుగుడా?
భారత, చైనా సైనికుల మధ్య తవాంగ్ ప్రాంతంలో జరిగిన ఘటన అనూహ్యమేమీ కాదు. తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై పట్టు సాధించేందుకు చైనా దూకుడుగా వ్యవహరిస్తుందన్నది నిర్వివాదాంశం. చైనా దృష్టిలో ఆసియాలో తన ఆధిపత్యానికి గండికొట్టగల దేశం భారత్ మాత్రమే. అందుకే తన షరతులతోనే సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని చైనా నాయకత్వం భావిస్తోంది. అయితే భారతీయ సైనికులు కైలాశ్ పర్వత శ్రేణిలోని కీలక ప్రాంతాలను ఆక్రమించినప్పుడు మాత్రమే చర్చలు కొంతైనా ముందుకు సాగాయి. చైనా మన మాటలు వినాలంటే, మనం దానిపై ఎంతో కొంత పట్టు సాధించాలి. యాంగ్సీలోనూ చైనా దళాలు వెంటనే వెనక్కు తగ్గడమూ ఈ విషయాన్నే సూచిస్తోంది! అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమభాగంలో... భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ నెల తొమ్మిదిన తవాంగ్ ప్రాంతంలోని యాంగ్సీ వద్ద ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ ఘటన అనూహ్యమేమీ కాదు. ఏదో ఒక రోజు తప్పదన్న అంచనాలు చాలాకాలంగా ఉన్నాయి. వాస్తవాధీనరేఖ వెంబడి చాలాకాలంగా ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూండటం ఇందుకు కారణం. ఈ ఘర్షణకు ముందస్తు సూచన ఏదైనా ఉందీ అంటే... అది భారత – అమెరికా మిలటరీ ప్రదర్శనలకు పొరుగుదేశం చైనా పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేయడం! వాస్తవాధీన రేఖకు వంద కిలోమీటర్ల దూరంలో ఉత్తరాఖండ్ సెంట్రల్ సెక్టర్లో భారత, అమెరికా మిలటరీ దళాలు కలిసికట్టుగా విన్యాసాలు చేసిన విషయం తెలిసిందే. యాంగ్సీ వద్ద చెలరేగిన ఘర్షణలు తూర్పు లదాఖ్ ఘటనల తరువాత రెండేళ్లకు జరిగాయి. ఈ రకమైన తోపు లాటలు, ఘర్షణలు, పరస్పర దాడులు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింల లోని వివాదాస్పద ప్రాంతాల్లో చాలాకాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 2020 జూన్‌లో గల్వాన్ లోయలో రెండుపక్కల సైనికులకు ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో తాజా ఘటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులు ఈ మధ్యకాలంలో వీధిపోరాటల విషయంలో బాగా ఆరితేరినట్లు కనిపి స్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి వీరు ముళ్ల్లతో కూడిన కర్రలతో, టేజర్లతో(కరెంట్ షాక్ కొట్టే ఆయుధం) ప్రత్యర్థులపైకి విరుచుకుపడు తున్నారు. మందు గుండు ఆయుధాలు వినియోగించడం ఇక్కడ సాధ్యం కాదు మరి! గల్వాన్ ఘర్షణ... ఫలితంగా జరిగిన ప్రాణనష్టం... భౌతిక దాడుల విషయంలో పీఎల్ఏ చేసుకున్న మార్పుల తీవ్రత ఎలాంటిదో తెలిపింది. అయితే తవాంగ్ ఘటనకు భారతీయ సైనికులు సర్వసన్న ద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రత్యర్థి బలగాల మోహరింపును అడ్డుకోవడం, అదనపు సిబ్బందితో తమ స్థానాన్ని పదిలపరచు కోవడం, తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. చలికాలంలో తేమతో కూడిన దుస్తులపై టేజర్లు ప్రయోగిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పో వచ్చు. కాబట్టి... భారతీయ సైనికుల కోసం పెద్ద పెద్ద ఆయుధాలు, ఇతర వ్యవస్థలను సమకూర్చడంతోపాటు ఘర్షణలను ఎదుర్కొ నేందుకు ఉపయోగించే పరికరాలనూ అందించాల్సిన అవసర ముంది. పిడిగుద్దులు, ఘర్షణలతో బెదిరించాలని చూస్తున్న శత్రు వును ఎదుర్కునేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. వ్యూహాత్మక సంకేతం అగ్రరాజ్యాల్లో ఒకటైన అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశం... తన సరిహద్దుల్లో వీధిపోరాటాల స్థాయికి దిగజారడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ... ఇవన్నీ తమ అసలు ఉద్దేశాలను వ్యక్తం చేసేందుకు వ్యూహాత్మకంగా ఇస్తున్న సంకేతాలుగా పరిగ ణించాలి. చైనా నాయకత్వం మరింత దూకుడుగా, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుందని చెప్పడం! చైనీస్ కమ్యూనిస్టు పార్టీ 20వ కాంగ్రెస్ రెండు నెలల క్రితం బీజింగ్‌లో విజయవంతంగా ముగిసింది. ఇందులోనే ప్రపంచ వేదికపై చైనా వ్యవహారశైలి ఎలా ఉండబోతోందో స్పష్టమైంది. ఇండోనేసియాలో జరిగిన జీ20 సమావేశాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వైఖరి కూడా చైనా ఆధిపత్య ధోరణికి అద్దం పట్టేదే. సుదీర్ఘ శత్రుత్వం కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్‌లో స్థానిక సరిహద్దు వివాదాలతో ఎలా వ్యవహరించబోయేదీ అధికారికంగానే వివరించారు. సౌత్ చైనా సముద్రంలో తైవాన్‌తో ఉన్న వివాదాలు... కొన్ని ద్వీపాల విషయంలో జపాన్‌తో ఉన్న చిక్కులు, హిమాలయా ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ విషయంలోనూ తమ వైఖరి ఏమిటన్నది అక్కడే నిర్ణయమైంది. తైవాన్, ఇతర సముద్ర సంబంధిత సమస్యలను ఆర్థిక ప్రభా వంతో లేదా బలవంతంగానైనా పరిష్కరించాలని చైనా భావిస్తోంది. అయితే... భారత్ విషయంలోనే చైనా ఆందోళన. ఏకంగా 3,488 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖతో కూడిన సరిహద్దు.... దాని వెంబడే గుర్తించిన వివాదాస్పద, సున్నితమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ సరిహద్దుపై ఉన్న వివాదాలు అన్నీ ఇన్నీ కాదు. సద్దుమణిగేందుకు చైనా ఏ రకమైన అవకాశమూ ఇవ్వలేదు. నిత్యం ఎక్కడో ఒక చోట అగ్గి రాజేస్తూ వివాదాన్ని కొనసాగిస్తోంది. ‘సెంట్రల్ టిబెటెన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఎక్సైల్’, దలైలామా భారత నేలపై ప్రవాసంలో ఉండటం భారత, చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో వివాదాస్పదమైన అంశంగా నిలుస్తోంది. అంతేకాకుండా... చైనా దృష్టిలో ఆసియా ప్రాంతంలో తన ఆధిపత్యానికి గండికొట్టగల దేశం భారత్ మాత్రమే. తద్వారా భారత్ అగ్రరాజ్యం స్థాయిని అందుకోగలదని చైనా భావిస్తోంది. అందుకే తన షరతులతోనే భారత్‌తో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇప్పుడప్పుడే సమసేది కాదు తూర్పు లదాఖ్ ప్రాంతంలో పీఎల్ఏతో 2020 మే నెల నుంచి వివాదం మొదలైంది. పలు దఫాలు చర్చలు నడిచినా సాధించింది ఏమీ లేదు. ఫలితంగా భారత సైనికులు దీర్ఘ కాలంపాటు అననుకూల వాతావరణంలో గస్తీ నిర్వహించాల్సి వస్తోంది. భారతీయ సైనికులు కైలాశ్ పర్వత శ్రేణిలోని కీలక ప్రాంతాలను ఆక్రమించినప్పుడు మాత్రమే చర్చలు కొంతైనా ముందుకు సాగాయి అని చెప్పవచ్చు. ఈ పరిణామంతో చైనా ఖంగుతింది. వెంటనే తాము నిర్మించిన ఆవాసాలను, ఇతర నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించింది. పాంగ్యాంగ్ సో ఉత్తరభాగ తీరం వెంబడి తన దళాలను ఉపసంహరించుకుంది కూడా. చైనా మన మాటలు వినాలంటే... మనం దానిపై ఎంతో కొంత పట్టు సాధించాలని చెబుతోంది ఈ ఘటన. యాంగ్సీలోనూ చైనా దళాలు వెనువెంటనే వెనక్కు తగ్గడం కూడా ఈ విషయాన్నే సూచిస్తోంది! ఒక్క విషయమైతే స్పష్టం. వాస్తవాధీన రేఖ వెంబడి ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగుతూనే ఉంటాయన్నది మనమూ అంగీకరించాల్సి ఉంటుంది. తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై పట్టు సాధించేందుకు పీఎల్ఏ దూకుడుగా వ్యవ హరిస్తుందన్నదీ నిర్వివాదాంశం. అదే సమయంలో ద్వైపాక్షిక సంబంధాలనూ, సరిహద్దు వివాదాలనూ వేర్వేరుగా చూడాలని చైనా ఒత్తిడి తీసుకువస్తుంది. ప్రతిగా భారత్ సరిహద్దుల్లో శాంతి నెలకొంటేనే అన్ని విషయాలను సమగ్రంగా సమీక్షించవచ్చునని అంటోంది. అయితే ఈ పరిస్థితి వల్ల భారత ఆర్మీ ఏడాది పొడవునా... అననుకూల పరిస్థితుల్లో గస్తీ కాయాల్సిన పరిస్థితి కొనసాగనుంది. చైనా ఒకవైపు తన మిలిటరీ దూకుడును కొనసాగిస్తూనే... భారత్‌తో సరిహద్దు వివాదాలను దీర్ఘకాలం నాన్చే ప్రయత్నం చేస్తుందని ప్రస్తుత పరిణామాల ఆధారంగా అంచనా కట్టవచ్చు. ఇందుకు భారత్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి. దౌత్యం, మిలిటరీ రెండింటిలోనూ అన్నమాట. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుంటే... యాంగ్సీ, గల్వాన్ లాంటి ఘటనలు జరక్కుండా ముందస్తుగానే నివారించడం ఎంతైనా అవసరం. వ్యాసకర్త మిలిటరీ వ్యవహారాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
చైనా ఆర్మీని తరిమికొట్టిన భారత బలగాలు.. వీడియో వైరల్
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టర్లోని వాస్తవాధీన రేఖ వద్ద ఇటీవల భారత్ చైనా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్9న భారత్ భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా ఆర్మీ ప్రయత్నించిందని.. డ్రాగన్ చర్యను భారత బలగాలు ధీటుగా అడ్డుకున్నాయని మంగళవారం లోక్‌సభలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. అయితే చైనా, భారత్ దళాల దాడి ఘటనను కేంద్రం ధృవీకరించిన మరుసటి రోజే ఓ వీడియో బయటకు వచ్చింది. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. చైనా దళాలు భారత భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.భారత్ భూభాగంలోకి చొచ్చుకు వస్తున్న చైనా జవాన్లను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పి కొట్టాయి. సరిహద్దు దాటాలనుకుంటున్న చైనా ఆర్మీని.. భారత సైనికులు ధైర్యంగా అడ్డుకున్నారు. గుంపుగా వచ్చిన చైనా దళాలపై ఇండియన్ ఆర్మీ లాఠీలతో మూకుమ్మడిగా దాడి చేసింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో డిసెంబర్ 9 జరిగిన ఘటనకు సంబంధించినది కాదని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. 2020లో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత ఈ దాడి ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. -
శత్రు డ్రోన్లను చీల్చి చెండాడే ‘గద్దలు’.. ఆర్మీ నయా అస్త్రం
న్యూఢిల్లీ: సైనికల బలగాల కన్నుగప్పి దేశంలోకి ఆయుధాలు, మాదకద్రవ్యాలను డ్రోన్ల ద్వారా చేరవేస్తున్నాయి శత్రు దేశాలు. డ్రోన్ల ద్వారానే దాడులకు పాల్పడుతున్న సంఘటనలూ ఇటీవల వెలుగు చూశాయి. ఈ క్రమంలో శత్రు డ్రోన్లను నివారించేందుకు కొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది భారత సైన్యం. తొలిసారి శత్రు డ్రోన్లను ధ్వంసం చేసేందుకు గద్దలకు శిక్షణ ఇస్తోంది. ఉత్తరాఖండ్‌లోని ఔలీలో అమెరికా, భారత్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న యుద్ధ అభ్యాస్ ప్రదర్శనలో ఈ అస్త్రాన్ని భారత సైన్యం ప్రదర్శించింది. ఈ సైనిక ప్రదర్శన సందర్భంగా ‘అర్జున్’ అనే గద్ద శత్రు దేశాల డ్రోన్లను ఏ విధంగా నాశనం చేస్తుందనే విషయాన్ని చూపించారు. శత్రు దేశాలకు చెందిన డ్రోన్లు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, ధ్వంసం చేసేందుకు గద్దతో పాటు ఓ శునకానికి సైతం శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో డ్రోన్ శబ్దం వినబడగానే సైన్యాన్ని శునకం అప్రమత్తం చేసింది. అలాగే.. డ్రోన్ ఎక్కడి నుంచి వెళ్తుందనే విషయాన్ని గద్ద గుర్తించింది. ఇలాంటి పక్షులను శత్రు డ్రోన్లను గుర్తించి, ధ్వంసం చేసేందుకు ఉపయోగించటం ఇదే తొలిసారి. అయితే, సైనికపరమైన చర్యల కోసం గద్దలు, శునకాలను వినియోగిస్తున్నట్లు భారత సైన్యం తెలిపింది. పంజాబ్, జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దుల గుండా దేశంలోకి ప్రవేశించే డ్రోన్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ ప్రక్రియ దోహదబడుతుందని పేర్కొంది. Here comes India's first anti #drone Kite (a bird) which can destroy a quadcopter in air. #IndianArmy #YUDHABHYAS22 pic.twitter.com/OByAwWuJop — Haresh 🇮🇳 (@HARESHRJADAV3) November 29, 2022 ఇదీ చదవండి: ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన ఖర్గే.. బీజేపీ ఆగ్రహం -
భారత ఆర్మీని అవమానించిందంటూ నటిపై ట్రోలింగ్
బాలీవుడ్ నటి రిచా చద్దా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపింది. భారత ఆర్మీని కించపరిచేలా మాట్లాడిదంటూ నటిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నేతలు సైతం ఆమె తీరును ఎండగడుతున్నారు. ఫిలిం మేకర్ అశోక్ పండిట్ అయితే ఓఅడుగు ముందుకేసి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతకీ ఈ వివాదానికి కారణమేంటి? అసలేం జరిగిందో చూద్దాం.. 'పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను తిరిగి మన స్వాధీనంలోకి తీసుకొచ్చేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ ఆదేశాల కోసం వేచి చూస్తున్నాం. మీరు సరే అంటే వెంటనే ఆపరేషన్ పూర్తి చేస్తాం. కానీ ఈలోపు పాకిస్తాన్ కాల్పులు ఉల్లంఘనకు దిగితే మా సమాధానం ఇంకోలా ఉంటుంది. దాన్ని వారు కలలో కూడా ఊహించలేరు!' అని నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది బుధవారం ఓ ట్వీట్ చేశారు. దీనిపై బాలీవుడ్ నటి రిచా చద్ధా స్పందిస్తూ 'గల్వాన్ సేస్ హాయ్' అని రిప్లై ఇచ్చింది. ఇక్కడ ఆమె ఉద్దేశం ఏంటో తెలీదు కానీ గల్వాన్ ఘటనను గుర్తు చేయడం మాత్రం నెటిజన్లకు కోపం తెప్పించింది. సైన్యాన్ని అవహేళన చేస్తూ మాట్లాడిందంటూ ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో రిచా చద్ధా తన ట్వీట్‌ను తొలగించి అందరినీ క్షమాపణలు కోరుతూ మరో ట్వీట్ చేసింది. 'నా వల్ల బాధపడ్డ అందరికీ క్షమాపణలు చెప్తున్నా. కానీ నా ఉద్దేశం అది కానే కాదు. నా అన్నయ్య ఆర్మీలోనే పని చేస్తాడు. మామయ్య పారాట్రూపర్. దేశాన్ని కాపాడే క్రమంలో సైనికుడు గాయపడ్డా, అమరుడైనా అతడి కుటుంబమంతా ఎంతో మనోవేదనకు గురి అవుతుంది. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా సొంత నానాజీ లెఫ్టినెంట్ కల్నల్‌గా భారత ఆర్మీకి సేవలందించారు. 1960లో జరిగిన ఇండో - చైనా యుద్ధంలో ఆయన కాలికి బుల్లెట్ తగిలింది. ఆర్మీపై గౌరవం నా రక్తంలోనే ఉంది' అని రిచా రాసుకొచ్చింది. @BediSaveena pic.twitter.com/EYHeS75AjS — RichaChadha (@RichaChadha) November 24, 2022 ఇకపోతే 2020లో గల్వాన్ నది లోయలో భారత్-చైనా సైన్యాల మధ్య ఘర్షణ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది భారతీయ సైనికులు అమరులవగా చైనా 38 మంది సైనికులను కోల్పోయినట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. I filed a police complaint against actress #RichaChadha at #JuhuPolicestation (Mumbai ) . Nobody has a right to mock our soldiers . I hope @MumbaiPolice will act against her as per the law of the land . @mieknathshinde @Dev_Fadnavis pic.twitter.com/In0HD9LuJa — Ashoke Pandit (@ashokepandit) November 24, 2022 Just received a 'call', had muted replies so had no idea... bye all — RichaChadha (@RichaChadha) November 24, 2022 చదవండి: ఇనయను, ఆమె తల్లిని కలిపిన బిగ్‌బాస్, కీర్తి కోసం ఎవరు వచ్చారంటే? ఆస్పత్రిలో కమల్ హాసన్, హెల్త్ బులెటిన్ విడుదల -
న్యూస్ మేకర్: గగనాన్ని జయించింది
‘పక్షి తన రెక్కలను విశ్వసించాలేగాని అంబరం అంచుల్ని చూడగలదు’ అంది మంగళవారం రోజు 10 వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ (పారాచూటింగ్) చేసిన లాన్స్‌నాయక్ మంజు. భారత సైన్యంలో ఈ ఘనత సాధించిన తొలి వనితగా మంజు రికార్డు సృష్టించింది. ఆర్మీలో మిలటరీ పోలీస్ విభాగంలో పని చేసే మంజును భారతసైన్యం ఈ ఫీట్ కోసం ఎంచుకుంది. ఇందుకోసం అడ్వంచర్ వింగ్ ఆమెకు శిక్షణ ఇచ్చింది. మంగళవారం ఇద్దరు స్కైడైవర్లతో పాటు ‘ఎ.ఎల్.హెచ్.ధ్రువ్’ (అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్)లో నింగిలోకి ఎగిరిన మంజు పదివేల అడుగులకు చేరాక జంప్ చేసి తోటి స్కైడైవర్లతో పాటు కొన్ని సెకండ్ల పాటు ఉమ్మడి విన్యాసం చేసింది. ఆ తర్వాత పారాచూట్ విప్పుకుని సురక్షితంగా నేలకు దిగింది. ‘మంజు సాధించిన ఈ ఘనత సైన్యంలో పని చేసే మహిళలకు స్ఫూర్తిదాయకం’ అని ఆర్మీ అధికారులు వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధం నుంచి మన దేశంలో రెండో ప్రపంచ యుద్ధం నుంచి పారాచూట్ రెజిమెంట్ (1941 ఆవిర్భావం) ఉంది. కాని ఇది మగవారికి ఉద్దేశించబడింది. యుద్ధాల్లో మన సైన్యానికి పారాట్రూప్స్ విశేష సేవలు అందించాయి. అయితే ప్రయివేట్ వ్యక్తులు పారాచూటింగ్ చేయడానికి కూడా మన దేశంలో అనుమతులు అంత సులభం కాదు. శిక్షణ కూడా అంతంత మాత్రమే. అందుకే విదేశాలకు వెళ్లి స్కై డైవింగ్‌లో శిక్షణ తీసుకుంటూ ఉంటారు ప్రయివేటు వ్యక్తులు. మన దేశంలో స్కై డైవింగ్ చేసిన తొలి స్త్రీ ప్రయివేటు వ్యక్తే. రేచల్ థామస్ అనే కేరళ రైల్వే ఉద్యోగి 2002లో అది నార్త్ పోల్‌లో 7000 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి ఈ రికార్డును సొంతం చేసుకోవడమే కాదు ‘పద్మశ్రీ’ కూడా అందుకుంది. ఇటీవల కాలంలో స్త్రీలు చాలామంది ప్రయివేటుగా స్కై డైవింగ్ నేర్చుకుని జంప్ చేస్తున్నారు. మహిళల ముందంజ ఇటీవల త్రివిధ దళాలలో పని చేస్తున్న స్త్రీలు రికార్డులు సాధించి వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సంవత్సరం మే నెలలోనే కెప్టెన్ అభిలాష బరాక్ ఆర్మీ ఏవియేషన్‌లో మొదటి మహిళా ఆఫీసర్‌గా నియమితురాలైంది. గత సంవత్సరం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో మాయ సుదన్ మొదటి మహిళా ఫైటర్ పైలట్‌గా బాధ్యత పొందింది. ఫ్లయిట్ లెఫ్టినెంట్ హినా జైస్వాల్ మొదటి మహిళా ఫ్లయిట్ ఇంజనీర్‌గా తొలి అడుగు వేసింది. ఇవన్నీ ఘనకార్యాలే. వారి వరుసలో ఇప్పుడు మంజు చేరింది. గగనాన్ని జయించాలని ఇటీవల మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి యువతులు కూడా అభిలషిస్తున్నారు. సైన్యంలో చేరో ఏవియేషన్ చదువులు చదివో లేకుంటే కనీసం ఎయిర్ హోస్టెస్‌గా అయినా ఆకాశంలో విహరిస్తున్నారు. అనుకోవాలే గానీ చేయొచ్చని నిరూపించే వీరంతా విజేతలే. ఆర్మీకి చెందిన లాన్స్‌నాయక్ మంజు స్కై డైవింగ్ చేసిన తొలి సైనికురాలిగా చరిత్ర సృష్టించింది. 10 వేల అడుగుల ఎత్తు నుంచి దూకి ఇటీవల ఆమె ఈ రికార్డు సాధించింది. -
పోరాడి ఓడిన సైనిక శునకం.. ఆర్మీ అధికారుల నివాళులు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ జిల్లాలోని టాంగ్పావా ప్రాంతంలో ఉగ్రవాదుల సర్చ్ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన జూమ్ అనే వీర శునకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఉగ్రవాదులను చేజ్ చేసే ఆపరేషన్‌లో రెండు బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోయినా లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడింది. దీంతో వెంటనే అధికారులు జూమ్(కుక్క)ని హుటాహుటిన ఆర్మీ ఆస్పత్రికి తరలించి తగిన చికిత్స అందించారు. ఐతే ఈ ఘటనలో జుమ్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించి ప్రాణాలతో పోరాడుతూ... గురువారం ఉదయం 11. 50 నిమిషాలకు మృతి చెందిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు జూమ్‌కి శ్రీనగర్‌లోని చినార్ వార్ మెమోరియల్ బాదామి బాగ్ కంటోన్మెంట్ వద్ద భారత సైన్య ఘనంగా నివాళులర్పించినట్లు పీఆర్ఓ డిఫెన్స్ కల్నల్ ఎమ్రాన్ ముసావి తెలిపారు. అంతేగాదు ఈ కార్యక్రమంలో పలు ఆర్మీ శునకాలు పాల్గొని మృతి చెందిన వీర శునకం జూమ్‌కి నివాళులర్పించాయి. ఆర్మీ కనైన్ చినార్ వారియర్స్‌లో అమూల్యమైన సభ్యుడిని కోల్పాయమని కల్నల్ ముసావి అన్నారు. జూమ్ పలు ఉగ్రవాదక నిరోధక కార్యకలాపాల్లో వీరోచితంగా పోరాడి ధైర్యసాహసాలను కనబర్చినట్లు తెలిపారు. #WATCH | 29 Army Dog Unit pays tributes to Indian Army Dog 'Zoom' in Jammu. He passed away yesterday at 54 AFVH (Advance Field Veterinary Hospital) in Srinagar where he was under treatment after sustaining two gunshot injuries in Op Tangpawa, Anantnag, J&K on 9th Oct. pic.twitter.com/0nlU7Mm7Ti — ANI (@ANI) October 14, 2022 (చదవండి: మాస్కో విమానంలో బాంబు కలకలం...అప్రమత్తమైన అధికారులు) -
Army Dog Zoom: ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన ‘జూమ్’ మృతి
శ్రీనగర్: శత్రువులకు ఎదురొడ్డి వీరోచితంగా పోరాడిన ఇండియన్ ఆర్మీ శునకం ‘జూమ్’ మృతి చెందింది. జమ్మూకశ్మీర్‌లో ఇటీవల భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో జూమ్ అనే జాగిలం తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అడ్వాన్స్ ఫీల్డ్ వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ శునకం గురువారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది. ఉదయం 11:45 గంటల వరకు వైద్యానికి బాగానే సహకరించిందని, అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకోవడం ఆపేసి కుప్పకూలినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. కాగా సైన్యంలో కఠిన శిక్షణ పొందిన ‘జూమ్’.. కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ ఆర్మీ తరపున సేవలు అందిస్తుంది. అనేక సెర్చ్ ఆపరేషన్లలో పాల్గొంది. జమ్మూకశ్మీర్‌లో నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లోనూ భాగం అయ్యింది. శత్రువులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు త్యాగం చేసింది. అసలేం జరిగిందంటే.. జమ్మూకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని టాంగ్పావా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ముందుగా సైన్యం ఉగ్రవాదులు ఉంటున్న ఇంటికి జూమ్ అనే ఆర్మీ కుక్కను పంపారు. అది టెర్రరిస్టులను గుర్తించి వారిపై దాడి చేసింది. దీనిని గమనించిన ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరిపారు. #UPDATE | Army dog Zoom, under treatment at 54 AFVH (Advance Field Veterinary Hospital ), passed away around 12 noon today. He was responding well till around 11:45 am when he suddenly started gasping & collapsed: Army officials He had received 2 gunshot injuries in an op in J&K pic.twitter.com/AaEdKYEhSh — ANI (@ANI) October 13, 2022 దీంతో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఆపరేషన్‌లో 'జూమ్' అనే ఆర్మీ కుక్కకు రెండు తుపాకీ బుల్లెట్లు తగిలాయి. తీవ్రంగా గాయపడి నెత్తురు కారుతున్నా.. జూమ్ తన పోరాటాన్ని కొనసాగించింది.. దీని ఫలితంగా ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన ఉగ్రవాదులు లష్కరే తోయిబా సంస్థకు చెందినవారుగా అధికారులు గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో పలువురు జవాన్లు సైతం గాయపడ్డారు. సెర్చ్ ఆపరేషన్ ముగిసిన వెంటనే జూమ్‌ను ఇక్కడి ఆర్మీ వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జూమ్ మరణించింది. -
భారత వైమానిక దళంలోకి మన ప్రచండ్ (ఫొటోలు)
-
Prachand: రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది
జైపూర్: భారత సైన్యం రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. వైమానిక దళంలోకి మేడ్ ఇన్ ఇండియా ఘనత వచ్చి చేరింది. తేలికపాటి యుద్ద హెలికాఫ్టర్(LCH) ‘ప్రచండ్’ను ఇవాళ(సోమవారం) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి ప్రవేశపెట్టారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. దేశీవాళీ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్ ‘ప్రచండ్’ను జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రవేశపెట్టారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సర్వ్ ధరమ్ ప్రార్థన సైతం నిర్వహించారు. Made-in-India light combat helicopters 'Prachand' inducted into IAF Read @ANI Story | https://t.co/S6zR9sWphB#LCH #Prakhand #RajnathSingh #IAF pic.twitter.com/nh36KANOdz — ANI Digital (@ani_digital) October 3, 2022 చాలా కాలంగా.. దాడుల కోసం తేలికపాటి హెలికాప్టర్ల అవసరం ఉంది. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో ఆ అవసరాన్ని తీవ్రంగా భావించింది మన సైన్యం. LCH అనేది రెండు దశాబ్దాల పరిశోధన-అభివృద్ధి ఫలితం. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి ప్రచండ్ ప్రవేశం రక్షణ ఉత్పత్తిలో ఒక కీలకమైన మైలురాయి. ప్రచండ్ సమర్థవంతంగా శత్రు నిఘా నుంచి తప్పించుకోగలదు. వివిధ రకాల మందుగుండు సామగ్రిని మోసుకెళ్ళగలదు. దానిని త్వరగా యుద్ధ ప్రాంతాలకు అందించగలదు. ఇది వివిధ భూభాగాలలో మన సాయుధ దళాల అవసరాలను సంపూర్ణంగా తీరుస్తుంది. ఇది మన సైన్యం, వైమానిక దళం రెండింటికీ ఆదర్శవంతమైన వేదిక అని ఈ సందర్భంగా పేర్కొన్నారు మంత్రి రాజ్‌నాథ్ సింగ్. For a long time, there was a need for attack helicopters & during the 1999 Kargil war, its need was felt seriously. The LCH is a result of research & development for two decades. And its induction into IAF is an important milestone in defence production: Defence Minister R Singh pic.twitter.com/zU5KrCUjwk — ANI (@ANI) October 3, 2022 ప్రచండ్ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) రూపొందించింది. 5,000 మీటర్ల (16,400 అడుగులు) ఎత్తులో గణనీయంగా ఆయుధాలు, ఇంధనంతో.. భారత సాయుధ దళాల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ప్రచండ్ ల్యాండ్-టేకాఫ్ చేసుకోగలదు. ప్రపంచంలోనే ఈ తరహా దాడులు చేయగలిగిన ఏకైక హెలికాప్టర్ ఇదే కావడం గమనార్హం. There is no need to define ‘Prachand’, the LCH itself is capable of sending out a message to the enemy: Defence Minister Rajnath Singh after his LCH sortie at Jodhpur IAF airbase pic.twitter.com/KQoRtRjvfH — ANI (@ANI) October 3, 2022 అవసరమైన చురుకుదనం, యుక్తి, విస్తరించిన శ్రేణి, అధిక ఎత్తులో పనితీరు, అన్ని వేళలా.. వాతావరణం ఎలాంటిదైనా సరే పోరాట సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ప్రచండ్. భారత సైన్యం.. ప్రత్యేకించి వైమానిక దళం కార్యాచరణ అవసరాలను తీర్చడానికి ప్రచండ్ ఒక శక్తివంతమైన వేదిక అవుతుందని అధికారులు చెప్తున్నారు. మార్చిలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ (CCS) రూ. 3,887 కోట్లతో దేశీయంగా అభివృద్ధి చేసిన 15 పరిమిత శ్రేణి ఉత్పత్తి (LSP) తేలికపాటి యుద్ధ విమానాల సేకరణకు ఆమోదం తెలిపింది. IAF కోసం పది హెలికాప్టర్లు, భారత సైన్యం కోసం ఐదు హెలికాప్టర్లు ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఇదీ చదవండి: 8% గృహాలకు వారంలో ఒక్క రోజే నీరు -
ఓడినా పైచేయి నిజాందేనంటూ.. మజ్లిస్ పత్రిక ప్రచారం
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థకు ‘మీజాన్’ పేరుతో ఓ పత్రిక ఉంది. నరరూప రాక్షసుడిగా ముద్రపడ్డ ఖాసింరజ్వీ నేతృత్వంలో ఉన్న సంస్థ కావటంతో దాని పత్రిక కూడా నిజాం సేనలకు అనుకూల వార్తలతో జనాన్ని తప్పుదోవ పట్టించే యత్నం చేసింది. ఓవైపు భారత సేనలు హైదరాబాద్‌ను చుట్టుముట్టడంతో నిజాం సైన్యం తోకముడిచినా.. ఎంఐఎం పత్రిక మీజాన్ మాత్రం, నిజాం సైన్యానిదే పైచేయి అంటూ తప్పుడు కథనాలను జనంలోకి వదిలింది. మరోవైపు నిజాం నియంత్రణలో ఉన్న హైదరాబాద్ రేడియో కూడా నిజాం సేనలు వీరోచితంగా పోరాడుతూ భారత సైన్యాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నాయని వార్తలు వెలువరించింది. సెప్టెంబర్ 17 సాయంత్రం వరకు జరిగిన ఈ తంతు ఆ తర్వాత ఆగిపోయింది. తప్పుడు వార్తలే కాదు, తుదకు ఆ పత్రిక, రేడియో కూడా ఆ తర్వాత మూగబోయాయి. సైన్యానికి స్వాగతం పలికిన జనంపై రజాకార్ల దాడులు భారత సైన్యం రాకను అడ్డుకోలేకపోయిన నిజాం సేనలు, ఆ అక్కసును సాధారణ ప్రజలపై చూపించాయి. నగరానికి చేరుకున్న భారత సైనిక పటాలాలను చూసి సంబరపడ్డ జనం, హారతులిచ్చి స్వాగతం పలికాయి. బొల్లారం మిలటరీ కేంద్రం వద్ద పండగ వాతావరణం నెలకొంది. సెప్టెంబరు 17న రాత్రి అక్కడికి దొంగచాటుగా చేరుకున్న రజాకార్ల బృందం సాధారణ ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. దీంతో అమాయకులు బలయ్యారు. విషయం తెలుసుకున్న భారత సైనికులు గాలించి మరీ ముష్కరులను పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు. చదవండి: (బురఖా ధరించి మహిళ వేషంలో గోడ దూకి పరారైన... నిజాం నవాబు ప్రధాని) -
నిజాంను తెలివిగా తోకముడిచేలా చేసిన వల్లభాయ్ పటేల్
ఒక అంచనా ప్రకారం నిజాం వద్ద రెండో ప్రపంచ యుద్ధకాలం నాటికి 30 వేల మంది సైనికులున్నారు. వీరితో పాటు మూడు ఆర్మర్ రెజిమెంట్లు, అశ్విక దళం, 11 ఇన్ఫాన్ట్రీ బెటాలియన్లు, ఒక ఆర్టిలరీకి తోడుగా ఇంకా పది వరకు సైనిక రెజిమెంట్లు ఉన్నాయి. వీరికి తోడుగా దాదాపు 2 లక్షల మంది రజాకార్లున్నారు. వీరిలో 50వేల మంది దగ్గర తుపాకులు, తల్వార్ల లాంటి ఆయుధాలున్నాయి. దీనికి తోడుగా విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసేందుకు అప్పటికే నిజాం ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఆపరేషన్ పోలోకు నెలరోజుల ముందు భారతసైన్యం తమపై దాడిచేస్తే ఎంతకాలం ప్రతిఘటించగలమని నిజాం తన సైన్యాధ్యక్షుడు ఇద్రూస్‌ను ప్రశ్నించాడు. ఒక్కరోజు కూడా కష్టమే అని ఇద్రూస్ సమాధానం చెప్పాడు. దీంతో సైన్యానికి తోడుగా రజాకార్ల సంఖ్యను పెంచాలని నిజాం ఆదేశాలు జారీచేశాడు. అయితే నిజాం సైన్యం భారత సైన్యం ముందు ఏమాత్రం నిలుస్తుందన్నదానిపై శతకోటి అనుమానాలు. సెప్టెంబర్ 13 తెల్లవారుజామున భారత్ సైన్యం ఐదు వైపుల నుంచీ హైదరాబాద్ సంస్థానంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించింది. విజయవాడ-హైదరాబాద్ మార్గంలో నిజాం సంస్థానంలోకి పెద్ద ఎత్తున ట్యాంకులతో భారత సైన్యం ప్రవేశించింది. మరో మార్గంలో అటు షోలాపూర్ నుంచి జెఎన్ చౌదరి ఆధ్వర్యంలో భారత బలగాలు హైదరాబాద్ వైపు దూసుకు వచ్చాయి. భారత సైన్యంలో స్ట్రైక్ ఫోర్స్, స్మాష్ ఫోర్స్, కిల్ ఫోర్స్, వీర్ ఫోర్స్ పేరుతో నాలుగు రకాల బలగాలున్నాయి. ముందుగా భారత్ యుద్ధ విమానాలు హైదరాబాద్ సంస్థానంలోని ఉస్మానాబాద్, వరంగల్‌తో పాటు ఇతర విమానాశ్రయాలపై బాంబులు కురిపించింది. దీంతో నిజాం విమానాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ముందుగా యుద్ధ ట్యాంకులతో నిజాం సైనిక పోస్టులపై దాడులు చేసిన భారత బలగాలు ఆ తరువాత వేగంగా నిజాం సంస్థానంలోకి చొచ్చుకు వచ్చాయి. చదవండి: (హైదరాబాద్‌పై కేంద్రం సైనిక చర్య.. ‘ఆపరేషన్ పోలో’ పేరెలా వచ్చింది?) ఇక భారత తొలి బుల్లెట్ ఉస్మానాబాద్ జైలు బయట ఉన్న నిజాం సెంట్రీకి తగిలింది దీంతో అతను అక్కడే కుప్ప కూలాడు. ఇదే సమయంలో భారత సైన్యం దాడి గురించి విస్తృతంగా ప్రచారం జరిగింది. నిజాం సైన్యం భారత సైన్యాన్ని ఎదుర్కోలేక తోక ముడిచింది. అయితే భారత సైన్యం ఒక్కో పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నా.. నిజాం మాత్రం తప్పుడు వార్తలు ప్రసారం చేయించాడు. నిజాం సైన్యం గెలుస్తుందంటూ వదంతులు వ్యాపింపజేశాడు. చివరికి సెప్టెంబర్-17న జెఎన్ చౌదరి ఆధ్వర్యంలోని భారత బలగాలు హైదరాబాద్ శివారులోని పటాన్చెరువు చేరుకున్నారు. దీంతో నిజాం సైన్యాధ్యక్షుడు ఇద్రూస్ లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. భారత సైన్యం హైదరాబాద్‌లోకి ప్రవేశించిందనే వార్త తెలియగానే నిజాం తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఇక నిజాం ఎవరిని నమ్మే స్థితిలో కనిపించలేదు. వెంటనే భారత రాయబారి మున్షిని పిలిపించి తాను లొంగిపోతున్నట్లు తెలిపాడు. దీంతో నిజాం లొంగుబాటు విషయాన్ని హోంమంత్రి పటేల్‌కు మున్షి తెలిపారు. నిజాం లొంగుబాటు ప్రక్రియలో పటేల్ చాలా తెలివిగా వ్యవహరించారు. ముఖ్యంగా సెప్టెంబర్-18వ తేదీన ఐక్యరాజ్యసమితిలో నిజాం భారత్‌కు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. ఈ విచారణ జరగడానికి ముందుగానే నిజాం లొంగిపోయాడనే విషయాన్ని అంతార్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లాలనేది పటేల్ ఆలోచన. అందుకే హైదరాబాద్‌లో భారత రాయబారి మున్షి సహాయంతో నిజాం ద్వారా దక్కన్ రేడియోలో లొంగుబాటు ప్రకటన చేయించారు పటేల్. ఈ ప్రకటనలో నిజాం చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చదవండి: (తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన సెప్టెంబర్ 17.. అసలేం జరిగింది?) నిజాం లొంగుబాటు ప్రకటనతో ఐక్యరాజ్యసమితిలో హైదరాబాద్ సంస్థానం వేసిన పిటిషన్‌కు ప్రాధాన్యత లేకుండా పోయింది. నిజాం తన పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నానని దక్కన్ రేడియోలో చేసిన ప్రకటన బీబీసీ రేడియోలోనూ ప్రసారం అయింది. ఆ తరువాత ఈ పిటిషన్‌పై విచారణను పెండింగ్‌లో పెట్టారు. 1979వరకు ఈ పిటిషన్ ఐక్యరాజ్యసమితి వద్ద పెండింగ్‌లోనే ఉంది. ఆ తరువాత ఈ పిటిషన్‌ను కొట్టివేశారు. ఇక లొంగిపోయిన నిజాం సైన్యాధ్యక్షుడు ఇద్రూస్‌ను భారత సైన్యాలు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించాయి. ఇక ఖాసీం రజ్వీని అరెస్టు చేసి జైలుకు పంపారు. తరువాతి కాలంలో రిజ్వీ పాకిస్థాన్‌కు వెళ్లిపోయాడు. ఇక భారత సైన్యాలకు లొంగిపోయిన నిజాం తనకు రజాకార్లకు సంబంధం లేదని ప్రకటించాడు. లొంగిపోయిన నిజాంను ఏంచేయాలనే విషయంపై భారత ప్రభుత్వం తీవ్రంగా చర్చించింది. ప్రస్తుతానికి నిజాం రాజు పేరు పైనే పరిపాలన సాగించాలని.. పౌరప్రభుత్వాన్ని భారత సైన్యం ఏర్పాటు చేస్తుందని పటేల్ నిర్ణయించారు. జనరల్ జెఎన్ చౌదరిని సైనిక గవర్నర్‌గా నియమించి పాలనను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు. ఆపరేషన్ పోలో పూర్తయిన సెప్టెంబర్-17 నుంచి హైదరాబాద్ సంస్థానంలో భారత చట్టాలు అమలులోకి వచ్చాయి. ముఖ్యంగా త్రివర్ణ పతాకం సగర్వంగా తెలంగాణా గడ్డపై రెపరెపలాండింది. తరువాతి కాలంలో భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్‌ప్రముఖ్‌గా నిజాంను నియమించింది. ఆయన చనిపోయే వరకు ఆ పదవిలో కొనసాగాడు. -
భారత్-చైనా సరిహద్దు వివాదంలో కీలక పురోగతి
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దు వివాదంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా కీలక ముందడుగు పడింది. తూర్పు లద్దాక్ పెట్రోలింగ్ పాయింట్ 15 సమీపంలోని గోగ్రా హైట్స్ హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ఇరుదేశాలు తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ మంగళవారం పూర్తయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కోసం ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరు దేశాల సైన్యాలు తొలగించాయి. దీంతో 2020 మే తర్వాత ఈ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. గోగ్రా హాట్‌స్ప్రింగ్స్‌లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ సెప్టెంబర్ 12న పూర్తవుతుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ గతవారమే చెప్పింది. భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా మంగళవారంతో ఈ ప్రక్రియ పూర్తవుతుందని సోమవారం వెల్లడించారు. శనివారం ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన తూర్పు లద్దాక్‌లో పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. 2020 మే 5న భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ తలెత్తినప్పటినుంచి తూర్పు లద్దాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత సరిహద్దులోని ఇతర ప్రాంతాలకు ఈ వివాదం విస్తరించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇరు దేశాల సైనికాధికారులు రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. మొత్తం 16 సార్లు కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిపారు. పరస్పర ఒప్పందం ప్రకారం ఎట్టకేలకు బలగాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేశారు. చదవండి: అందరూ దొంగలే.. అవినీతిపై మంత్రి సంచలన వ్యాఖ్యలు.. -
ఇండియన్ ఆర్మీపై దాడులకు పాక్ ఆర్మీ స్కెచ్
శ్రీనగర్: భారత గడ్డపై దాడులకు పాక్ సైన్యం కుటిల యత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాలను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో.. భారత్‌లో దాడులకు సుపారీ తీసుకున్న ఓ ఉగ్రవాదిని భారత సైన్యం నిలువరించగలిగింది. జమ్ము కశ్మీర్ రాజౌరి వద్ద గత రెండురోజులుగా భారత్‌లోకి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పీవోకే సమీపంలోని అటవీ ప్రాంతంలో భారత సైన్యం అమర్చిన ల్యాండ్ మైన్ పేలి ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా.. ఆగస్టు 21న నౌషేరా ప్రాంతంలోని ఝంగర్ సెక్టార్ నుంచి భారత్‌లోకి ఆయుధాలతో అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఓ ఉగ్రవాదిని గాయపరిచి అదుపులోకి తీసుకుంది భారత సైన్యం. సరిహద్దు ప్రాంతంలోని ఫెన్సింగ్‌ను కట్ చేసి చొరబడేందుకు ప్రయత్నించారు. గమనించిన భారత సైనికులు కాల్పులు జరిపి.. అతన్ని గాయపరిచి పట్టుకున్నారు. గాయపడిన ఉగ్రవాదికి చికిత్స అందించి ప్రాణాలు కాపాడడమే కాకుండా.. అతని నుంచి కీలక సమాచారం సేకరించింది భారత సైన్యం. అతన్ని పీవోకే కొట్లి జిల్లా సబ్జ్‌కోట్‌కు చెందిన తబరాక్ హుస్సేన్‌గా గుర్తించింది. పాక్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీకి చెందిన కల్నల్ యూనస్ చౌద్రీ తనను పంపించాడని, భారత ఆర్మీపై దాడులకు పాల్పడాలంటూ తనకు రూ.30వేల పాక్ రూపాయలను ఇచ్చాడని వెల్లడించాడు. ఆయుధాలతో పాటు పాక్ కరెన్సీని భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది. విశేషం ఏంటంటే.. 2016లో తబరాక్ నియంత్రణ రేఖ వెంబడి తన సోదరుడితో సహా చొరబడేందుక యత్నించగా.. ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. అయితే మానవతా ధృక్పదంతో ఏడాది జైలుశిక్ష తర్వాత అతన్ని మళ్లీ వెనక్కి పంపించేసింది. అయినప్పటికీ తీరు మార్చుకోకుండా ఈసారి ఏకంగా దాడులకే సిద్ధపడడం గమనార్హం. #WATCH | Tabarak Hussain, a fidayeen suicide attacker from PoK, captured by the Indian Army on 21 August at LOC in Jhangar sector of Naushera, Rajouri, says he was tasked by Pakistan Army's Col. Yunus to attack the Indian Army for around Rs 30,000 pic.twitter.com/UWsz5tdh2L — ANI (@ANI) August 24, 2022 ఇదీ చదవండి: మరో జలియన్ వాలాబాగ్.. 80 ఏళ్లు పూర్తి.. అయినా గుండెలపై మానని గాయం -
ఆర్మీలో చేరాలనుకున్నా.. కానీ!: రాజ్‌నాథ్ సింగ్ భావోద్వేగం
ఇంఫాల్: రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తుతం రెండు రోజుల పర్యటన నిమిత్తం మణిపూర్‌లో ఉన్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా ఆయనతోపాటు ఉన్నారు. ఆర్మీ అధికారులు, సైనికులను శుక్రవారం రాజ్‌నాథ్ సింగ్ కలిశారు. వారితో కలిసి అల్ఫాహారం చేశారు. ఇంఫాల్‌లో అస్సాం రైఫిల్స్ ఇండియన్ ఆర్మీలోని 57వ మౌంటైన్ డివిజన్ సైనికులను ఉద్ధేశించి మాట్లాడారు. ఈ మేరకు జవాన్ల ధైర్యసాహసాలను రాజ్‌నాథ్ కొనియాడారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి తన జీవితంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఇండియన్ ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని కలలు కన్నట్లు తెలిపారు. పరీక్ష కూడా రాసినట్లు పేర్కొన్నారు. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా చేరలేకపోయానని వెల్లడించారు. చదవండి: Video: ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం ‘నా జీవితంలో జరిగిన ఓ సంఘటనను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా చిన్నప్పుడు నేను కూడా భారత సైన్యంలో చేరాలని అనుకున్నాను. అందుకు తగిన విధంగా ప్రిపేర్ అయ్యాను. ఒకసారి షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్ష కూడా రాశాను. కానీ కుటుంబంలో ఎదురైన అనుకోని పరిస్థితులు, మా తండ్రి మరణంతో సైన్యంలో చేరలేకపోయాను.’ అంటూ ఎమోషనల్ అయ్యారు. సైనిక దుస్తులను చిన్నపిల్లవాడికి ఇచ్చినా అతడి వ్యక్తిత్వంలో దేశభక్తితో కూడిన మార్పు కనిపిస్తుందన్నారు. అలా ఆర్మీ యూనిఫామ్‌కు ఒక ప్రత్యేకత ఉంటుంది’ అని అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా అక్కడి సైనికులను కలుస్తానని తెలిపారు. ఆర్మీ అధికారులను కలవడం తనకు ఎంతో గర్వంగా ఉంటుందన్నారు. ‘మణిపూర్ పర్యటనను ప్లాన్ చేసినప్పుడు కూడా అస్సాం రైఫిల్స్, 57వ మౌంటైన్ డివిజన్ అధికారులను కలవాలనుకుంటున్నానని (ఆర్మీ చీఫ్) పాండేకు చెప్పాను. డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఓ విధంగా దేశానికి సేవ చేస్తున్నారు. కానీ మీరు నిర్వర్తించే బాధ్యతలు ఓ వృత్తి, సేవ కంటే గొప్పదని నేను నమ్ముతున్నాను. చాలా మందిని ఆర్మీలోకి తీసుకురావడంలో అస్సాం రైఫిల్స్ ముఖ్యపాత్ర పోషిస్తుంది’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. చదవండి: నిజంగా విడ్డూరమే! మనుషులకే కాదు.. చేపలు, పీతలకూ కరోనా పరీక్షలు, వైరల్ వీడియో -
మనది కాని యుద్ధంలో మన సైనికులు!
‘‘స్వర్గం కూలిపోతున్నప్పుడు, భూమి కదలిపోతున్నప్పుడు, వాళ్లు తమది కాని యుద్ధం చేయడానికి వచ్చారు. కూలిపోతున్న ఆకాశాన్ని తమ భుజానికెత్తుకున్నారు. దేవుడు కూడా వదిలేసినవారిని తమ ప్రాణాలను పణంగా పెట్టి వారు రక్షించారు.’’ మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికుల గురించి ప్రముఖ ఇంగ్లిష్ కవి ఎడ్వర్డ్ హౌస్‌మెన్ రాసిన మాటలివి. జూలై 28.. మొదటి ప్రపంచ యుద్ధం మొదలైన రోజు. 1914 జూలై నుంచి నాలుగేళ్లపాటు రక్తపుటేరులు పారించిన ఆ సంగ్రామం 1918 నవంబరు 11న ముగిసింది. ఆ యుద్ధంలో 85 లక్షల మంది సైనికులు, కోటీ ముప్పై లక్షల మంది ప్రజలు మరణించినట్లు అంచనా. యుద్ధంలో బ్రిటిష్ ఇండియాకు చెందిన 14 లక్షల మంది భారతీయ సైనికులు పాల్గొన్నారు. వారిలో 74 వేల మంది మరణించారు. వాళ్లకు ఫ్రాన్స్, గ్రీస్, ఉత్తర ఆఫ్రికా, పాలస్తీనా, మెసపటోమియాలలోనే అంత్యక్రియలు నిర్వహించారు. వాళ్లంతా పాల్గొన్నది బ్రిటన్ తరఫున! యూరప్, మధ్యప్రాచ్యం, మధ్యధరా ప్రాంతాల్లో జరిగిన యుద్ధాల్లో భారత సైనికులు పోరాడారు. భారత సైన్యం వెస్టర్న్ ఫ్రంట్‌ను చేరుకోకపోయినా లేక ఇంగ్లిష్ చానెల్ తీరంలోని పోర్టులను జర్మనీ ఆక్రమించుకున్నా మొదటి ప్రపంచయుద్ధం చరిత్ర మరోలా ఉండేది అంటారు. బెల్జియం, ఈశాన్య ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీలు ఉన్న ప్రాంతానికే వెస్టర్న్ ఫ్రంట్ అని పేరు. మొదటి ప్రపంచ యుద్ధానికి ప్రధాన వేదిక ఈ ప్రాంతమే. లగ్జెంబర్గ్, బెల్జియంలను ఆక్రమించుకున్న జర్మన్ సైన్యం వెస్టర్న్ ఫ్రంట్‌కు తెరతీసింది. ఈ క్రమంలో ఫ్రాన్స్‌లోని కీలకమైన పారిశ్రామిక ప్రాంతాలపైనా పట్టు సాధించింది. ఆ సమయంలో జర్మన్ సైన్యంపై పోరాడటంలోనూ, నిలువరించటంలోనూ భారత సైన్యం ప్రముఖ పాత్ర పోషించింది. వెస్టర్న్ ఫ్రంట్ ప్రాంతంలోని బెల్జియం, ఫ్రాన్స్‌ల్లో భారత సైన్యానికి చెందిన 1,30,000 మంది తమ సేవలు అందించారు. వీరిలో 9 వేల మంది మరణించారు. ఈ ఒక్క వెస్టర్న్ ఫ్రంట్‌లోనే కాదు, మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా జరిగిన ప్రతి పోరాటంలో బ్రిటిష్ ఇండియా సైన్యం పాలుపంచుకుంది. అయితే మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఎప్పుడూ భారతీయ నేపథ్యం నుంచి ఎవరూ వివరించలేదు. సైనికులే కాకుండా వాళ్లకు సేవలు అందించేందుకు భారతదేశం నుంచి వేల మంది కూలీలు వారి వెంట వెళ్లారు. అంతేకాదు, భారతదేశం తనది కాని యుద్ధం కోసం ధన రూపేణా, ఇతర రూపేణా రూ.13 వేల కోట్లు బ్రిటన్‌కు అందించింది. (చదవండి: తొలి షిప్పింగ్ మహిళ) -
ఎల్ఏసీకి అతి సమీపంలో చైనా యుద్ధ విమానాలు.. భయంతోనే అలా!
సాక్షి, న్యూఢిల్లీ: సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నప్పటికీ చైనా కవ్వింపు చర్యలను ఆపడం లేదు. తూర్పు లద్దాఖ్ సరిహద్దులోని వాస్తవాధీన రేఖకు అతి సమీపంలో యుద్ధ విమానాలలో చక్కర్లు కొడుతోంది. గత మూడ్నాలుగు వారాల్లో భారత సైన్యాన్ని కవ్వించేందుకు పలుమార్లు ప్రయత్నించింది. భారత రక్షణ యంత్రాంగం గుట్టును తెలుసుకునేందుకే డ్రాగన్ దేశం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చైనాకు భారత సైన్యం దీటుగా బదులిస్తోందని సైనిక వర్గాలు తెలిపాయి. డ్రాగన్ దేశం ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా, భద్రతా ముప్పు వాటిల్లేలా చేసినా క్షణాల్లో తిప్పికొట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నాయి. సరిహద్దుకు అతి సమీపంలో మిగ్ 29, మిరాజ్ 2000 యుద్ధ విమానాలకు మోహరించినట్లు వెల్లడించాయి. అదే సమయంలో సంయమనంతో వ్యవహరిస్తూ ఉద్రిక్తతలు పెరగకుండా చూస్తున్నట్లు పేర్కొన్నాయి. భయంతోనే.. అయితే డ్రాగన్ దేశ సైన్యం భయంతోనే యుద్ధ విమానాలతో చక్కర్లు కొడుతున్నట్లు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. లద్దాక్ సెక్టార్లో భారత సైన్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అప్‌గ్రేడ్ చేసిందని, చైనా సైన్యానికి సంబంధించిన కార్యకలాపాలను అత్యంత సమీపం నుంచి పసిగడుతోందని చెప్పాయి. ఆ భయంతో చైనా యుద్ధ విమానాలతో వాస్తవాధీన రేఖకు సమీపంలో చక్కర్లు కొడుతున్నట్లు పేర్కొన్నాయి. జూన్ 24-25 మధ్య చైనా కవ్వింపు చర్యలు మొదలయ్యాయని, జులై 17న ఇరు దేశాల మధ్య జరిగిన కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల్లోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. భారత్ కూడా తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో నిఘాను మరింత పటిష్టం చేసినట్లు సమాచారం. చదవండి: సోనియా గాంధీ గురించి అలా మాట్లాడుతారా? బీజేపీ యాంటీ వుమెన్ -
AP: ఆ ఊరే ఒక సైన్యం.. వీరుల పురిటిగడ్డ అది..
తాడేపల్లిగూడెం: అక్కడి తల్లులు తమ పిల్లలకు ఉగ్గుపాలతోనే వీరత్వాన్ని రంగరించి పోస్తున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆ ఊరు ఊరంతా ఒక సైన్యమే అంటే అతిశయోక్తి కాదు. టెక్నాలజీతో అందివస్తున్న జాబ్‌లెన్నో ఉన్నా.. తమ మొగ్గు మాత్రం దేశమాత సేవకే అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం భారత సైన్యంలో ఈ ఊరి నుంచి 1,650 మంది పనిచేస్తున్నారు. వీరిలో కల్నల్స్, లెఫ్టినెంట్ కల్నల్స్ ఉండటం విశేషం. భారత సైన్యంలో చేరాలనుకునే తమ ఊరి యువతకు ఎక్స్‌సర్వీస్‌మెన్ అసోసియేషన్ మార్గనిర్దేశం చేస్తోంది. ఇప్పుడు అగ్నిపథ్ ద్వారా భారత సైన్యంలోకి చేరికలు ఉండటంతో యువత సులువుగా ఎంపికయ్యేలా ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభిస్తామని ఎక్స్‌సర్వీస్‌మెన్ అసోసియేషన్ బాధ్యులు ప్రత్తి రామకృష్ణ, బొల్లం వీరయ్య చెబుతున్నారు. దేశంలోనే రెండో స్థానం.. మాధవరం గ్రామస్తులు స్వాతంత్య్రానికి ముందు నుంచే సైనికులుగా, అధికారులుగా సేవలు అందించారు. దేశంలోనే అత్యధికంగా సైన్యంలోకి యువకులను పంపిస్తున్న ప్రాంతంగా మాధవరం రెండో స్థానం పొందడం విశేషం. గ్రామస్తులు మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు, దేశ స్వాతంత్య్ర పోరాటం, పాకిస్థాన్, చైనాలతో యుద్ధాలు, బంగ్లాదేశ్, శ్రీలంక తరఫున చేసిన యుద్ధాల్లో ప్రతిభ చూపారు. సిపాయి, హవల్దార్, సుబేదార్, సుబేదార్ మేజర్, నాయక్, కల్నల్, లెఫ్టినెంట్ కల్నల్ వంటి హోదాల్లో సేవలను అందించారు. భారత్–పాకిస్తాన్ మధ్య జరిగిన రెండు యుద్ధాల్లో 1,850 మంది మాధవరం సైనికులు పాల్గొని సత్తా చాటడం విశేషం. వార్ మెమోరియల్ ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర ఉండగా రెండోది మాధవరంలో మాత్రమే ఉంది. ఇది కూడా చదవండి: సచివాలయ సేవలు బాగున్నాయి.. కేంద్ర మంత్రి కితాబు -
ఇండియన్ ఆర్మీలోకి ప్రైవేట్ సంస్థలు! ఇప్పటికే..
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మానిర్బర్ భారత్ పథకం కింద మిలటరీ హార్డ్‌వేర్ విభాగంలోకి ప్రైవేట్ సంస్థల్ని ఆహ్వానించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ డిఫెన్స్ అక్విజేషన్ ప్రొసిజర్స్ (డీఏపీ) మ్యాన్యువల్‌గా సవరించాలని నిర్ణయించింది. ఇండియన్ డిఫెన్స్‌కు (పీఎస్‌యూ) చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు మిలటరీకి సంబంధించిన ఆయుధాలు తయారు చేసేవి. ఇప్పుడీ డీఏపీ సవరణలతో ప్రైవేట్ సంస్థలు ఎక్కువ భాగం డిఫెన్స్‌కు చెందిన ఆయుధాల్ని తయారు చేసేందుకు ఊతం ఇచ్చినట్లైందని నివేదికలు చెబుతున్నాయి. ప్రైవేట్ సంస్థల సహకారంతో ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ (ఐఎంఆర్‌హెచ్ )నను అభివృద్ధి, తయారీని కేంద్ర రక్షణ శాఖ ప్రయత్నిస్తుంది. దీంతో ఇండియన్ ఆర్మీ ఇన్వెంటరీలో ఉన్న రష్యా తయారు చేసిన ఎంఐ-17,ఎంఐ-8 హెలికాప్టర్లు భర్తీ కానున్నాయి. కాగా,13టన్నుల బరువైన ఈ మల్టీరోల్ హెలికాఫ్టర్ వైమానిక దాడిలో భారత సాయుధ బలగాల్ని రంగంలోకి దించడంతో పాటు, ఎయిర్ ఎటాక్, యాంటీ సబ్ మెరైన్, యాంటీ షిప్, మిలటరీ ట్రాన్స్ పోర్ట్, వీవీఐపీ వంటి విభాగాల్లో కీలకంగా పనిచేస్తుంది. ఫ్రెంచ్ కంపెనీతో ఎంఓయూ ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఎరో నాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), ప్రైవేట్ సంస్థలు కలిసి వచ్చే ఏడేళ్లలో ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ తయారీని పూర్తి స్థాయిలో ప్రారంభించేలా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. దీంతో పాటు నేవల్ వేరియంట్‌తో సహా ఐఎంఆర్ హెచ్ ఇంజిన్‌ను తయారీ, ఉత్పత్తితో పాటు మద్దతు అందించేలా కొత్త జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు కానుంది. జులై 8న ఈ జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేసేందుకు హెచ్ఏఎల్ తో విమానాల విడిభాగాల తయారీలో పేరు గాంచిన ఫ్రెంచ్ సంస్థ సఫ్రాన్ అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు సమాచారం. -
అది భారత ఆర్మీ సత్తా.. రికార్డులు బద్దలు కొట్టారు
Army reconstructed two bridges.. ఇండియన్ ఆర్మీ తమ సత్తా ఏంటో మరోసారి చాటిచెప్పారు. అమర్నాథ్ యాత్రలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకుండా భారత ఆర్మీ అద్భుతం సృష్టించింది. దీంతో, ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. కరోనా తర్వాత ఎంతో వైభవంగా అమర్నాథ్ యాత్రలో భక్తులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో వాతావరణ మార్పుల కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవలే ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా జూన్ 30, జులై 1 మధ్య బల్తాల్ వద్ద కాళీమాతా ఆలయ సమీపంలోని నది ప్రవాహం వద్ద కొండచరియలు విరిగిపడి యాత్రా మార్గంలో వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో, రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సంచలనం సృష్టించింది. బ్రిడ్జి కొట్టుకుపోయిన విషయాన్ని గమనించిన ఆర్మీ జవాన్లు.. వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ప్రత్యేక హెలికాప్టర్లో బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన కర్రలను తరలించారు. ఇంజినీర్ రెజిమెంట్‌కు చెందిన సభ్యులను, సాంకేతిక నిపుణులను అక్కడికి రప్పించారు. వెంటనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి కేవలం నాలుగు గంటల్లోనే అక్కడ కొత్త బ్రిడ్జిని నిర్మించారు. అమర్నాథ్ యాత్ర నిరాటంకంగా కొనసాగేలా చేశారు. దీంతో ఆర్మీ అందరిచేత శభాష్ అనుపించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "#Chinarwarriors to the Rescue - #AmarnathYatra." On 01 Jul, 02 bridges near Brarimarg on #Baltal Axis were damaged by landslides. #ChinarCorps mobilised assets & reconstructed the bridges overnight for resumption of route & avoiding an over 4 hour detour by #Yatris.@adgpi https://t.co/AwdxMAyKSs pic.twitter.com/DUQnjWAHTG — Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) July 2, 2022 ఇది కూడా చదవండి: అన్నాడీఎంకే వర్గపోరులో మరో ట్విస్ట్.. పన్నీరు సెల్వానికి షాక్! -
కాలపరీక్షకు నిలబడినవి మార్చడమా?
అగ్నిపథ్ పథకం లక్ష్యం స్పష్టం. పెన్షన్లు, సైనికుల వేతన బిల్లుల కోతే దీనికి కారణం. సైనిక నియామకాల వ్యవస్థను మాత్రమే కేంద్రం మరమ్మతు చేయడం లేదు... సైనిక చర్యల సమయంలో సైనికుల సంఖ్య విస్తృతంగా అవసరమయ్యే కూర్పునే మార్చేయాలని చూస్తున్నారు. సుదీర్ఘకాలానికి బదులుగా నాలుగేళ్ల వ్యవధి నియామకాల వ్యవస్థను తేవడమే యువత ఆగ్రహానికి కారణం. ప్రభుత్వం చేస్తున్న పెద్ద తప్పిదం ఏమిటంటే, కాలపరీక్షకు నిలిచిన రెజిమెంటల్ వ్యవస్థను ధ్వంసం చేయాలనుకోవడం. అఖిల భారత స్థాయిలో ఉన్న సైన్యాన్ని సింగిల్ క్లాస్‌గానూ, వ్యవస్థీకృత యూనిట్లను సబ్ యూనిట్లుగానూ మార్చేయాలని చూస్తున్నారు. తండ్రి నుంచి కుమారుడి వరకు తరాలపాటు సైన్యంలో కొనసాగిన బంధాలు ఇకపై కనిపించవు. ప్రభుత్వంలోని మిత్రులతో ఎవరు శత్రుత్వం కోరుకుంటారు? ప్రభుత్వం మొత్తంగా ఇప్పుడు అగ్నివీర్లను కాపాడుకునేందుకు అగ్నిపోరాటం చేస్తోంది. సీనియర్ ఆర్మీ అధికారులతో చర్చించామని ప్రభుత్వం పదే పదే చెబుతోంది కానీ, తనతో ఏకీభవించేవారితోనే ప్రభుత్వం చర్చించిందని స్పష్టంగా తెలుస్తోంది. అగ్నిపథ్ అనే అవివేకపు పథకం వల్ల సైన్యంతో పోలిస్తే తక్కువగా ప్రభావితమయ్యే భారతీయ వాయుసేన, నేవీ చీఫ్‌లు ఈ పథకానికి వ్యతిరేకంగా రేగిన హింసా కాండను చూసి దిగ్భ్రాంతి చెందినట్లు అంగీకరించారు. తప్పుడు సమాచారం, అనవగాహనే ఈ హింసాకాండకు కారణమని వీరు తేల్చి చెప్పేశారు. నాలుగేళ్ల సైనిక సేవలో పెన్షన్ తదితర ప్రయోజనాలకు దూరమవడంతోపాటు గౌరవాన్ని కూడా కోల్పోతున్న అగ్నివీర్లను సరిగా అర్థం చేసుపోవడంలో విఫలమవుతున్నారు కాబట్టే ఈ హింసా కాండను చూసి ప్రభుత్వవర్గాలు భీతిల్లుతున్నాయి. 2032 నాటికి భారత సైన్యంలో 50 శాతం మంది రెగ్యులర్ సైనికులుగానూ, 50 శాతంమంది అగ్నివీర్లుగానూ ఉండబోతున్న తరహా వ్యవస్థలో నిర్వహణాత్మక లోపాలను గురించి అతిశయోక్తులు చెప్పనవసరం లేదు. జనరల్స్, వారికి సమానమైన హోదా కలిగిన వారు ప్రభుత్వ బాకారాయుళ్లగా ఉంటారు. అగ్నివీర్లు మాత్రం రాజకీయ ఫుట్ బాల్లో పావులుగా తయారవుతారు. ఈ విప్లవాత్మకమైన ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం ఉన్నట్లుండి ప్రకటించిన అయిదు రోజుల తర్వాత త్రివిధ దళాధిపతులు అసాధారణంగా మీడియో ముందుకు వచ్చి మరోసారి అగ్నివీర్ పథకం విశిష్టత గురించి వివరించారు. సైన్యంలో వ్యవస్థీకృత మార్పు నకు యువశక్తి ప్రధాన చోదకశక్తిగా ఉంటుందని వీరు నొక్కిచెప్పారు. పెన్షన్లు, సైనికుల వేతన బిల్లుల కోతే అగ్నివీర్ పథకానికి వెనుక ఉన్న హేతువు అని వీరు ఒక్కసారి కూడా తమ బ్రీఫింగులో పేర్కొనలేదు. గత రెండు సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ని సస్పెండ్ చేయడానికి కోవిడ్ కారణం అని చెప్పడం అసత్యం. ఈ రెండేళ్ల కాలంలో అనేక ఎన్నికలు, కుంభమేళాలు నిర్వహించ గలిగినప్పుడు రిక్రూట్మెంట్ ర్యాలీలను ఎందుకు చేపట్టలేకపోయా రని వీధుల్లోకి వచ్చిన యువత ప్రశ్నిస్తోంది. అగ్నివీర్ పథకం ప్రక టించిన నాటికి సైన్యంలో చేరదలిచిన అభ్యర్థులు మెడికల్ పరీక్షలు, శారీరక పరీక్షలు పూర్తి చేసుకుని రాత పరీక్షకు సిద్ధమవుతున్నారు. భారతీయ వాయుసేన విషయంలో అన్ని ప్రక్రియలనూ అభ్యర్థులు పూర్తి చేసుకున్నారు కానీ ఇప్పటికీ వీరికి కాల్ రాలేదు. మనం ఈ విషయంలో స్పష్టంగా ఉందాం. సుదీర్ఘకాలం సైనిక కెరీర్లో కొన సాగడానికి బదులుగా నాలుగేళ్ల వ్యవధి ఉండే మౌలిక నియామకాల వ్యవస్థను తీసుకురావడమే యువత ఆగ్రహానికి కారణమైంది. పైగా అగ్నిపథ్ నుంచి వెనక్కు మళ్లే ప్రశ్నే లేదు; క్రమశిక్షణా వ్యతిరేక చర్యల్లో పాల్గొనలేదని యువత ప్రతిన చేయటమే కాకుండా ఆగస్ట్ మధ్యనాటికి రిక్రూట్మెంట్ ర్యాలీకి వచ్చేటప్పటికి పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్ కూడా తీసుకురావాల్సి ఉంటుందని త్రివిధ దళాధిపతుల తమ బ్రీఫింగ్లో తెలియపర్చారు. అగ్నిపథ్ పథకం వెనకాల లక్ష్యం స్పష్టంగా వెల్లడవుతోంది. సైనిక నియామకాల వ్యవస్థను మాత్రమే మీరు మరమ్మతు చేయడం లేదు... సైనిక చర్యల సామర్థ్యంలో సైనికుల సంఖ్య విస్తృతంగా అవసర మయ్యే కూర్పునే మౌలికంగా మార్చివేయాలని చూస్తున్నారు. సైనిక నిర్వహణాపరమైన సవాళ్లు ‘రెండున్నర’ (చైనా, పాకిస్తాన్, తీవ్ర వాదం) యుద్ధరంగాలలో ప్రత్యక్షంగా కనిపిస్తాయి. అంతేకాక పలు అంతర్గత ఇబ్బందులు దీనికి అదనం. ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, బ్రెజిల్ లాంటి దేశాలు భారత్ ఎదుర్కొంటున్న ప్రమాదాలు, సవాళ్లను కలిగి లేవన్నది గుర్తుంచుకోవాలి. మన ప్రస్తుత రాజకీయ, సైనిక నాయకత్వం యుద్ధాలను చూడలేదు. తీవ్రవాద వ్యతిరేక, ఉగ్రవాద వ్యతిరేక చర్యల అనుభవం మాత్రమే ఉంది. టైగర్ హిల్స్‌ను కైవసం చేసుకున్న యువ సైనికులు రెగ్యులర్ సైనికులు అని గుర్తించాలి. వీరికి పెన్షన్లు అందుతాయి. నైపు ణ్యంతో కూడిన రెజిమెంటల్ వ్యవస్థ వీరికి వెన్నుదన్నుగా నిలిచింది. ఆ వ్యవస్థ జవాన్‌ను ఆద్యంతం కాపాడుకుంటూ వస్తోంది. నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు విక్టోరియా క్రాస్లను గెల్చుకుంటా రంటూ కొంతమంది వృద్ధ ఆఫీసర్లు సైనికుల స్థితిని తప్పుగా కోట్ చేస్తున్నారు. ఏడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా సైనిక వృత్తిలో పనిచేసిన వారికి మాత్రమే 95 శాతం అవార్డులు వచ్చాయని మర్చిపోరాదు. ఒకే ఒక్క రైఫిల్‌మ్యాన్ మాత్రమే విక్టోరియా క్రాస్ గెలుచుకున్నారు. చిన్నవయసులో నాలుగేళ్ల సేవ పూర్తి చేసుకునే అగ్ని వీర్లకు 26 నుంచి 32 సంవత్సరాల వయస్సులో సైనికజీవితంలో లభ్యమయ్యే విశిష్టమైన అనుభవం సిద్ధించదు. నాలుగేళ్ల సేవ తర్వాత కూడా సైన్యంలో కొనసాగాలనుకునే అగ్నివీర్లలో 75 శాతాన్ని సాగ నంపుతారు. పైగా వీరికి ఉద్యోగాలు, విద్యావకాశాలు, ధన సహాయం కల్పించి వారు రెండో కెరీర్ ప్రారంభించడానికి మద్దతునిస్తామని ఇప్పుడు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారు. కానీ నోటిమాటలు పనిచేయవు కదా. నా తరంలోని సైనికులు అన్ని యుద్ధాలు, తీవ్రవాద వ్యతిరేక పోరాటాల్లో పాలుపంచుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అతిపెద్ద తప్పిదం ఏమిటంటే కాలపరీక్షకు నిలిచిన, జాగ్రత్తగా పెంచిపోషించిన రెజిమెంటల్ వ్యవస్థను ధ్వంసం చేయాలనుకోవ డమే. ఈ వ్యూహాత్మక సంపదను అర్థం చేసుకోవడంపై మన రాజకీయ నాయకత్వం ఏమాత్రం దృష్టి పెట్టలేదు. అఖిల భారత స్థాయిలో ఉన్న సైన్యాన్ని సింగిల్ క్లాస్‌గానూ, వ్యవస్థీకృత యూనిట్లను సబ్ యూనిట్లుగానూ మార్చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో సిక్కు, గర్వాల్, కుమావూ, అస్సామ్ తదితర రెజిమెంట్లు తమ గుణాన్ని, ఆత్మను కోల్పోతాయి. రెజిమెంట్ సంప్రదాయాలు, తండ్రి నుంచి కుమారుడి వరకు తరాలపాటు సైన్యంలో కొనసాగిన స్నేహబంధం కూడా ఇకపై కనిపించవు. క్లాస్ అస్తిత్వం, యుద్ధ నినాదం అనేవి మార్చలేని ప్రేరణ శక్తులు. గతంలోకూడా ప్రభుత్వాలు ఆల్ ఇండియా, ఆల్ క్లాస్ అని ప్రబోధిస్తూ ఇలాంటి విశిష్ట బృందాలను తొలగించాలని ప్రయత్నించాయి కానీ అలాంటి ప్రయోగాలు విఫలమయ్యాయి. ఒకే భారత్, ఒకే క్లాస్ అనే భావాన్ని సైన్యంపై రుద్దడం అంటే రెజిమెంటల్ విలువలపై దాడి చేయడమే అవుతుంది. నమ్రత కలిగిన గూర్ఖాల గురించి కాస్సేపు ఆలోచిద్దాం. 43 ఇన్ఫాంట్రీ బెటాలియన్లతో కూడిన గూర్ఖా బ్రిగేడ్‌ని ప్రధానంగా నేపాల్ నుంచి రిక్రూట్ చేసుకునేవారు. అగ్నివీర్ ప్రధాన శిల్పి అయిన ప్రధాని మోదీ 2014లో నేపాల్ సందర్శించినప్పుడు, భారత సార్వ భౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో నేపాలీ గూర్ఖాల త్యాగాలను ఎంతగానో కొనియాడారు. నేపాల్‌తో భారత్ సంబంధా లను, ప్రభావాన్ని చైనా దెబ్బతీస్తున్న సమయంలోనే లక్షలాదిమంది మాజీ సైనికులు, ప్రస్తుత గూర్ఖా సైనికులు భారత అనుకూల వైఖరిని ప్రదర్శించేవారు. ఒకే భారత్, ఒకే శ్రేణి అనే విధానాన్ని గూర్ఖా అగ్నవీర్లకు కూడా వర్తిస్తే భారత్, నేపాల్ ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయి. జనరల్ ఇయాన్ హామిల్టన్ రాసిన ‘మై రెజిమెంటల్ హిస్టరీ’ ముందుమాట చివరలో ఈ కొటేషన్ ఉంది. ‘‘ఉత్కృష్టమైన 5వ గూర్ఖా రైఫిల్స్ కీర్తి ఎన్నడూ అంతరించదు. ఏ రాజకీయ నేత అయినా గూర్ఖా కేడర్‌ను తొలగించాలని కానీ, వారి సంఖ్యను మార్చాలని కానీ భావిం చినట్లయితే అతడి చెయ్యి పక్షవాతానికి గురై స్తంభించిపోవచ్చు.’’ వ్యాసకర్త: అశోక్ కె. మెహతా, ఆర్మీ మేజర్ జనరల్ (రిటైర్డ్), (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఆర్మీలో అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ నియామకాలకు నోటిషికేషన్ విడుదల చేసింది. అంతేగాక ఎయిర్‌ఫోర్స్, నేవీలో కూడా అగ్నివీర్ నియామకాల కోసం తేదీలను ప్రకటించింది. మంగళవారం ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్.. ఈనెల 24న ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇండియన్ ఆర్మీలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ రోజు నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు అగ్నిపథ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. ఇదిలా ఉండగా ఓ వైపు అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనల జ్వాలలు రగులుతుంటే.. మరోవైపు కేంద్రం మాత్రం ఈ పథకం కింద నియామకాలపై తగ్గేదేలే అంటూ ముందుకు వెళ్తోంది. చదవండి: భారత్ బంద్ ఎఫెక్ట్: వందల సంఖ్యలో రైళ్లు రద్దు 📢 #Agniveer aspirants, get ready! Notification dates for recruitments under #AgnipathScheme 👇 🇮🇳 Indian Army @adgpi - June 20, 2022. 🇮🇳 Indian Navy @indiannavy - June 21, 2022. 🇮🇳 Indian Air Force @IAF_MCC - June 24, 2022.#AgnipathRecruitmentScheme #Agnipath #Agniveers pic.twitter.com/ZFPxcOZTcX — Ministry of Information and Broadcasting (@MIB_India) June 20, 2022 పథకం స్వరూపం... ►ఇది ఆఫీసర్ దిగువ ర్యాంకు సిబ్బంది (పీబీఓఆర్) నియామక ప్రక్రియ. ►త్రివిధ దళాలకు సంయుక్తంగా ఆన్లైన్ సెంట్రలైజ్డ్ విధానంలో ర్యాలీలు, క్యాంపస్ ఇంటర్వ్యూ తదితర మార్గాల్లో నాలుగేళ్ల కాలానికి నియామకాలు చేపడతారు. ►ఈ ఏడు 46,000 నియామకాలుంటాయి. 90 రోజుల్లో ప్రక్రియ మొదలవుతుంది. ►వయో పరిమితి 17.7–21 ఏళ్లు. ఆర్నెల్ల శిక్షణ, మూడున్నరేళ్ల సర్వీసు ఉంటాయి. ►త్రివిధ దళాల్లో ప్రస్తుతమున్న అర్హత ప్రమాణాలే వర్తిస్తాయి. ►సైన్యంలో ఇప్పటిదాకా జరుగుతున్న ప్రాంతాలు, కులాలవారీ నియామకాలకు భిన్నంగా ‘ఆలిండియా–ఆల్ క్లాస్’ విధానంలో రిక్రూట్మెంట్ ఉంటుంది. దీంతో రాజ్‌పుత్, మరాఠా, సిక్కు, జాట్ వంటి రెజిమెంట్ల స్వరూప స్వభావాలు క్రమంగా మారతాయి. ►విధుల్లో చేరేవారిని అగ్నివీర్‌గా పిలుస్తారు. వీరికి ప్రస్తుత ర్యాంకు లు కాకుండా ప్రత్యేక ర్యాంకులిస్తారు. ►వేతనం తొలి ఏడాది నెలకు రూ.30,000. రూ.21 వేలు చేతికిస్తారు. రూ.9,000 కార్పస్ నిధికి వెళ్తుంది. కేంద్రమూ అంతే మొత్తం జమ చేస్తుంది. నాలుగో ఏడాదికి రూ.40,000 వేతనం అందుతుంది. ►నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యాక రూ.11.71 లక్షల సేవా నిధి ప్యాకేజీ అందుతుంది. దీనిపై ఆదాయ పన్నుండదు. ►సర్వీసు కాలావధికి రూ.48 లక్షల ఉచిత జీవిత బీమా కవరేజీ ఉంటుంది. ►గ్రాట్యుటీ, పెన్షన్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. ► ప్రతిభ, ఖాళీల ఆధారంగా 25 శాతం మందిని శాశ్వత సర్వీసుకు పరిగణనలోకి తీసుకుంటారు. ►మిగతా వారికి రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు రంగ నియామకాల్లో ప్రాధాన్యం. -
‘అగ్ని’లో నిగ్గుతేలిన నిజాలు
‘అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని’... ఇది ‘సిరి వెన్నెల’ రాసిన గేయంలో ఒక పంక్తి. అగ్గి తోటి కడిగితే అది పునీతమవుతుందని మన విశ్వాసం. నిఖార్సయిన నిజాన్ని గురించి చెప్పడానికి నిప్పును ఉపమానంగా తెచ్చుకోవడం మన అలవాటు. అగ్నిపరీక్షలో పాసైతే పవిత్రత అనే సర్టిఫికెట్ ఆటో మేటిక్‌గా లభిస్తుంది. ఇది మన సాంస్కృతిక భావజాలంలో ఊడలు దిగిన విశ్వాసం. సైనిక దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ కూడా సమాజ వాస్తవికతలపై ఒక అగ్నిపరీక్షగా పనిచేసింది. ఈ విధానానికి వ్యతిరేకంగా చెలరేగిన దావానలం యథార్థాల ముసుగుల్ని దహించి, నగ్నంగా నిలబెట్టింది. ఈ దేశంలోని లక్షలాదిమంది యువకులు సైన్యంలో చేరడానికి చకోర పక్షుల్లా నిరీక్షిస్తున్నారనేది ఒక వాస్తవం. ఎదురు చూపులు ఉపాధి కోసమా? దేశభక్తి ప్రపూరితమా అన్నది ఇక్కడ అప్రస్తుతం. నిరుద్యోగం పెనుభూతమై పీడిస్తున్న దేశంలో ఉపాధి ఆరాటమే తొలి కారణం కావచ్చు. దానికి దేశభక్తి కూడా జతకూడి ఉండవచ్చు. కారణమేదైనా సుమారు లక్షా డెబ్బయ్ ఐదు వేలమంది యువకులు ఏడాది కిందనే ఫిజికల్ టెస్టులూ, మెడికల్ టెస్టులూ గట్టెక్కి ఉన్నారు. నెలల తరబడి శిక్షణ తీసుకుని గురిపెట్టి విడిచిన బాణాల్లా పరుగులు తీసి పరీక్షలు పాసయ్యారు. ఇంకొక్క పరీక్ష. రాత పరీక్ష. అది పూర్తయితే ఇక సైన్యంలో చేరడమే! ఆలివ్ గ్రీన్ యూనిఫామ్‌లో తమను తాము ఎన్నిసార్లు ఊహించుకున్నారో! కరాన మర తుపాకీ... శిరాన ఉక్కుటోపీతో సరిహద్దుల్లో పహారా కాస్తున్నట్టు ఎన్ని కలలు కన్నారో! దూరంగా, సొంత ఊరిలో ఉన్న తల్లి దండ్రులకు నెలనెలా జీతం డబ్బులు పంపి అండగా నిలబడ బోతున్నామని ఎంత సంబరపడ్డారో! జస్ట్... ఒక్క పరీక్ష!! అధికారులు చెబుతున్నట్టు కరోనా కారణంగానే అది వాయిదా పడుతూ వస్తున్నదని సర్దిచెప్పుకున్నారు. నేడో రేపో ఆ పరీక్ష పూర్తవబోతున్నదని ఎదురుచూస్తున్నారు. సైనిక బలగాల నియామకానికి పాత పద్ధతిని రద్దుచేస్తూ సరికొత్తగా ‘అగ్నిపథ్’ అనే పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు్ట ప్రకటన వెలువడగానే హతాశులయ్యారు. ఎదురుచూస్తున్న కొలువు ఎగిరిపోయింది. నోటి దగ్గర ముద్ద నేల రాలింది. ‘కొత్తగా వచ్చే కొలువులు నాలుగేళ్లు మాత్రమే’ అని చెప్పడంతో వారి కలలన్నీ కరిగి పోయాయి. ఒక్కసారిగా లక్షా డెబ్బైఐదు వేల గుండెలు పగిలిన శబ్దానికి త్రీగోర్జెస్ డ్యామ్ బద్దలైనంత విధ్వంసం దేశమంతటా ప్రవహించింది. ఈ విధ్వంసంలో కొన్ని ప్రతిపక్షాల పాత్ర ఉన్న దని కేంద్రం ఆరోపిస్తున్నది. ప్రజల్లో అసంతృప్తి ఉన్న ప్పుడు ప్రతిపక్షం ఆజ్యం పోయడం సహజమే! ప్రభుత్వం చెబుతున్నట్టు సైనిక బలాల నియామకాల హేతుబద్ధీకరణ చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశమే. ఇందుకు పైకి చెబుతున్న కారణాలు ఎన్ని వున్నా ప్రధానమైన అంతర్గత కారణం పెన్షన్ భారం. రక్షణ రంగంలో ఇప్పటికే 32 లక్షలమంది పెన్షనర్లు ఉన్నారు. రక్షణ శాఖ మొత్తం వార్షిక బడ్జెట్లో పెన్షన్ల వాటా 26 శాతానికి చేరుకున్నది. ఏటా యాభై వేలమంది పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఈ శాతం ఏటా పెరుగుతూనే ఉంటుంది. అమెరికా రక్షణ బడ్జెట్లో పెన్షన్ల వాటా 10 శాతమే. యూ.కే.లో అది 14 శాతం. సైనిక బలగాలకోసం ఖర్చుచేసే పెన్షన్‌ను భారంగా భావించే దేశంలో ఒక్కసారి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఎన్నికైన వారికి జీవితాంతం ఇచ్చే పెన్షన్‌ను ఎలా సమర్ధించగలుగు తారు? ఈ ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అందుకే ప్రభుత్వం ఇతర కారణాలను చెబుతున్నది. ‘అగ్నిపథ్’ కింద నియమించేవారిలో నాలుగో వంతు మందిని 15 ఏళ్ల సర్వీస్ వరకు కొనసాగిస్తామనీ, మిగిలిన వారికి స్వయంఉపాధికి దోహదపడే ఆర్థిక సహకారాన్ని అందజేస్తామనీ చెబుతున్నది. ఈ పద్ధతి ప్రపంచంలోని చాలా దేశాల్లో అమల్లో ఉన్నదని ఉదాహరణలిస్తున్నది. ఏదైనా ఒక రంగంలో సమూల మార్పు లకు సిద్ధపడినప్పుడు అందుకు సంబంధిత ప్రజానీకాన్ని ముందుగానే సిద్ధం చేయడం అవసరమని ఈ వివాదం మరో సారి చాటి చెప్పింది. వ్యవసాయ చట్టాల సందర్భంలోనూ, ఇప్పుడు రక్షణ శాఖ నియామకాల హేతుబద్ధీకరణలోనూ ప్రభుత్వం తొందరపాటుగానే వ్యవహరించింది. ఈ పథకంలోని గుణదోషాల అంశాన్ని పక్కనపెట్టి పరిశీ లిస్తే... మన విద్యావ్యవస్థలోని లోపాలనూ, నిరుద్యోగ సమస్య తీవ్రతనూ ఈ సందర్భం ఎత్తిచూపింది. విద్యావ్యవస్థలోని నాణ్యతా ప్రమాణాల క్షీణత, నైపుణ్య లేమి యువతరానికి శాపంగా పరిణమిస్తున్న వైనానికి అద్దం పట్టింది. దేశంలో ఏటా 24 లక్షలమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తు న్నారు. వారిలో 10 లక్షల మందికే క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారానో, ఇతర మార్గాల ద్వారానో చదువుకు తగిన ఉద్యోగాలు లభిస్తున్నాయి. మిగిలిన వారిలో సగం మంది అతికష్టం మీద చదువుతో సంబంధం లేని దిగువశ్రేణి ఉద్యో గాల్లో సర్దుకోగలుగుతున్నారు. సుమారు ఆరేడు లక్షలమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ప్రతియేటా రోడ్డు మీద మిగిలి పోతున్నారు. నాన్–ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యు యేషన్ పూర్తిచేసిన వారిలో ఇంగ్లిష్ నైపుణ్యం, సాఫ్ట్ స్కిల్స్ ఉన్న కొంతమంది మాత్రమే మెరుగైన ఉద్యోగాలు పొందగలుగుతున్నారు. మిగిలిన వారంతా తమ సోదర ఇంజనీరింగ్ సేన లతో కలిసి ఒక రిజర్వు నిరుద్యోగ ఫోర్స్‌గా ఉండిపోతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా ఉండి జీడీపీ వృద్ధిరేటును నమోదు చేస్తున్న పరిస్థితుల్లో ఏదో ఒక ఉపాధి వీరికి లభిస్తున్నది. లేదంటే అన్యాయమైన పరిస్థితుల్లో ఉండిపోతున్నారు. నైపుణ్యాల క్షీణతతోపాటు విద్యారంగాన్ని వేధిస్తున్న మరో సమస్య... డ్రాపవుట్లు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోని సౌకర్యాల లేమి, ఆర్థిక పరిస్థితుల వలన ప్రైవేట్ చదువు కొనలేని పరిస్థితి. ప్రోత్సాహం లేకపోవడం ఈ డ్రాపవుట్లకు కారణంగా కని పిస్తున్నది. ఫలితంగా ఉన్నత విద్యాప్రస్థానంలో టెన్త్, ఇంటర్ మజిలీల దగ్గరే చాలామంది మిగిలిపోతున్నారు. వీళ్లంతా నిరుద్యోగ రిజర్వు ఫోర్సే! దినసరి కూలీపై దొరికే లేబర్ పనులే వీరికి దిక్కు. వీళ్ల క్వాలిఫికేషన్‌కు తగిన ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు వచ్చినప్పుడు మెరుగైన జీతం, జీవితం కోసం పోటీపడుతున్నారు. సైనికోద్యోగాలు కూడా అందులో ఒక భాగం. ఆర్థిక వృద్ధి నమోదవుతున్న ప్రాంతాల్లో డిగ్రీ, పీజీ నిరుద్యోగ పెద్దన్నల మాదిరిగానే టెన్త్, ఇంటర్ నిరుద్యోగ సేన కూడా ఏదో ఒక పనిలో కుదురుకుంటున్నది. ఆర్థిక వృద్ధి మందగమన స్థితిలో ఉన్న ప్రాంతాల్లో ఉపాధి లభించక నిస్పృహతో నిరుద్యోగ సేన రోడ్డెక్కుతున్నది. ఈ దేశాన్ని రానున్న కాలంలో నవజీవన బృందావనంగా తీర్చిదిద్దగల యువతరం రూపొందడానికి 4 కీలక అంశాలపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని ‘అగ్నిపథ్’ సందర్భం గుర్తు చేసింది. 1. ఆర్థిక వ్యవస్థను వృద్ధి గమనంలో నిలపడం, 2. రిజర్వు నిరుద్యోగసేనల సమస్య పరిష్కారం, 3. విద్యా రంగంలో ప్రమాణాలు, నైపుణ్యాల పెంపుదల, 4. డ్రాపవుట్లు లేకుండా చేయడం. ఈ అంశాల ప్రాధాన్యాన్ని తొలిదశలోనే గుర్తించి అందుకు తగిన ప్రణాళికలను రచించిన ఒకే ఒక్క రాజకీయ నేత ఏపీ సీఎం జగన్. ఇది వైఎస్సార్సీపీ చెప్పుకుం టున్న ఘనత కాదు. ఏపీ ప్రభుత్వం చాటింపు చేసుకుంటున్న విషయం కూడా కాదు. స్వతంత్ర ఏజెన్సీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల గణాంకాలు ఘంటాపథంగా చెబుతున్న అక్షర సత్యాలు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్ ఐఈ) నివేదిక ప్రకారం జాతీయ నిరుద్యోగితా రేటు 7.8 శాతం. ఆంధ్రప్రదేశ్‌లో అది 4.4. శాతం మాత్రమే! ఎల్లో మీడియా నిత్యం బ్యాండు మేళం మోగిస్తూ స్వర్ణయుగంగా కీర్తించే చంద్ర బాబు హయాం చివరిరోజు నాటికి నిరుద్యోగితా రేటు 5.2 శాతం. ఆ తర్వాత కోవిడ్ కారణంగా దేశమంతటా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. రెండేళ్లపాటు వరసగా కోవిడ్ మహమ్మారి పీడించింది. ఈ పరిస్థితుల్లో నిరుద్యోగితా రేటు పెరగడం సహజం. అలా అన్ని రాష్ట్రాల్లో పెరిగింది కూడా! కానీ ఏపీలో తగ్గింది. దీని వెనుక ఏ మాయా, మంత్రం లేవు. అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు. చిత్తశుద్ధి, దూరదృష్టి, తపన మాత్రమే ఉన్నాయి. ఎక్కువమంది ప్రజానీకానికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ, చిన్న పరిశ్రమల (ఎమ్ఎస్ఎమ్ఈ) రంగాలను గుర్తించి వాటిని డైనమిక్‌గా నిలబెట్టడానికి పడిన శ్రమ ఉన్నది. చిన్న, సూక్ష్మ పరిశ్రమల రంగం ఏపీలో 11 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నది. అందులో 20 శాతం మందిని కోవిడ్ కాలం లోనే ఈ రంగం ఇముడ్చుకోగలిగింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఎమ్ఎస్ఎమ్ఈలను గతిశీలకంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం అందజేసిన ప్రోత్సాహకాలు అర్థం చేసుకోవడానికి! 2021–22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం జీఎస్డీపీ 18.47 శాతం వృద్ధి (ప్రస్తుత ధరల ప్రకారం)ని నమోదు చేసింది. ఇందులో భాగంగా వ్యవసాయ రంగం కూడా 14.50 శాతం వృద్ధిని సాధించింది. రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తున్న ఆర్బీకే సెంటర్ల వలన, రైతు భరోసా వలన, సకాలంలో ఇస్తున్న ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ఫలితంగా, ఉత్పత్తుల ధరలు తగ్గకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ వ్యూహాన్ని అమలు చేస్తున్నం దువలన ఈ విజయం సాధ్యమైంది. జగన్ ప్రభుత్వం రిజర్వ్ నిరుద్యోగ సేనల సమస్యను పరిష్కరించిన తీరు నభూతో నభవిష్యతి. పరిపాలనా వికేంద్రీకరణలో విప్లవాత్మక కార్యక్రమా నికి శ్రీకారం చుడుతూ, అందులో భాగంగా ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించగలిగింది. లక్షా 34 వేలమందికి ఒకేసారి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలను కల్పించింది. వలంటీర్ వ్యవస్థ ద్వారా మరో 2 లక్షల 60 వేల మంది గౌరవభృతితో సేవా పథంలోకి అడుగు పెట్టగలిగారు. విద్యారంగ సమూలక్షాళనకు విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి – ఉన్నత ప్రమాణాల కోసం భారీ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ‘నాడు–నేడు’ కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చింది. గేమ్ ఛేంజర్‌గా ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు దీటుగా ఆధునిక బోధనా పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. ఎడ్టెక్ కంపెనీ ‘బైజూస్’తో ఒప్పందం చేసుకొని లెర్నింగ్ యాప్ ద్వారా శిక్షణ అందించే ఏర్పాట్లు చేసింది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యను సంస్కరించింది. రెండు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలతో పాటు 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా రాబోయే విద్యార్థి తరాలు ప్రపంచస్థాయిలో పోటీ పడే సామర్థ్యాన్ని సంతరించుకుంటున్నాయి. ఏ స్థాయిలోనూ డ్రాపవుట్లు ఉండకుండా అందరూ ఉచి తంగా, నాణ్యమైన విద్యను అభ్యసించేందుకు అనేక పథకాల ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యాదీవెన, వసతి దీవెన... ఇలా పలు పథకాలతో విద్యా రంగంలో డ్రాపవుట్ లేకుండా చూసే ప్రయత్నాన్ని చేస్తున్నది. ఇవన్నీ అక్షరాలా అమలు జరుగుతున్న కార్యక్రమాలు. కానీ చంద్రబాబూ, మీడియా మొఘల్ శ్రీమాన్ రామోజీరావు నేతృ త్వంలో వాలతుల్యులు, తోకమాత్రులతో కూడిన యెల్లో మీడియా ఈ కార్యక్రమాలను రివర్స్ గేర్‌లో చూపెడుతున్నారు. ఇది రివర్స్ పాలన నమ్మండని చెబుతున్నారు. మన విద్యార్థు లను పోటీ ప్రపంచంలో నిలబెట్టడానికి ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించింది ఈ ముఠా. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందట, ఇంగ్లిష్ మీడి యంలో చదివిస్తే మీ పిల్లలు మొద్దబ్బాయిలుగా తయారవు తారని రోడ్డు పక్కనున్న పల్లె జనానికి చంద్రబాబు సుద్దులు చెప్పబోయారు. వారు జై జగన్ అని బదులు చెప్పేసరికి పలాయనం చిత్తగించారు. ఇంగ్లిష్ మీడియానికి వ్యతిరేకంగా తెలుగు ఉద్యమాన్ని రెచ్చగొట్టడానికి యెల్లో మీడియా శాయ శక్తులా ప్రయత్నించి తల్లిదండ్రుల వ్యతిరేకతతో తోక ముడి చింది. ఇప్పుడు బైజూస్ మీద విషపు దాడి ప్రారంభించారు. ఏటా 24 వేల ఖర్చు చేయాల్సిన ఈ బోధన ప్రభుత్వ స్కూళ్లలో ఉచితంగా లభించనుంది. విద్యాబోధనను ఆధునికం చేసే అదనపు ఉపకరణం. సమగ్ర అవగాహనకు దోహదపడే ఆయుధం. పేదల చేతికి ఆయుధం దొరకకూడదు. వారు సాధి కారత సాధించకూడదు. ఇదీ చంద్రబాబు, యెల్లో మీడియా జాయింట్‌గా అమలు చేస్తున్న కార్యక్రమం. చంద్రబాబు లాంటి విజనరీ ప్రపంచాన లేడని పాత డప్పునే ఇప్పుడు మళ్లీ∙వాయిస్తున్నారు. ఈ ప్రచారం హోరులో నిజంగా తాను విజనరీ అనే భ్రమలోకి బాబు జారిపోయి చాలా కాలమైంది. అదే ఆత్మవిశ్వాసంతో నిన్న విజయనగరంలో మాట్లాడారు. ‘‘నేనే ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లూ’’ అని ప్రశ్నించారు. ఇటువంటి మాటలు సామాన్య ప్రజలు ఎవరు మాట్లాడినా జనం అనుమానిస్తారు. ‘ఎవరికైనా చూపెట్టండర్రా’ అని సలహా ఇస్తారు. ఇలా మాట్లాడటం ఆయనకు కొత్త కాదు. ఒకసారి తాను తుపాన్లను అడ్డుకున్నానని చెప్పారు. విజయవాడలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు తగ్గించాలని ఆదేశించారు. రెయిన్ గన్స్‌తో ఒక ట్యాంకర్ నీళ్లను చిలకరించి కరువును జయించానని ప్రకటించారు. ఎవరు అడి గినా అడక్కపోయినా మధ్యమధ్య ‘నేను మెంటల్లీ ఫిట్’ అని ప్రకటిస్తుంటారు. ఆయన మాటలన్నీ గొప్ప విజన్‌తో కూడిన వని యెల్లో మీడియా ఊదరగొడుతున్నది. ఆయనొస్తే అభివృద్ధి పరుగులు పెట్టుకుంటూ వస్తుం దని దండోరా వేస్తున్నది. జగన్ హయాంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులపై మసిపూసే ప్రయత్నం చేస్తున్నది. నిజాలపై ముసుగు కప్పుతున్నది. కానీ నిజం నిప్పు లాంటిది. నిప్పునూ దాచలేరు! నిజాన్నీ దాచలేరు! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
దేశమంతటా ‘అగ్ని’గుండం
ఢిల్లీ: సైనిక దళాల్లో నియామకాలకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకం అగ్నిపథ్ రాజేసిన అగ్గి కార్చిచ్చుగా మారి దేశమంతటినీ కమ్మేసింది. పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత చేపట్టిన నిరసనలు, ఆందోళనలు శుక్రవారం మూడో రోజు తారస్థాయికి చేరాయి. రైల్వేస్టేషన్లను ముట్టడించడం, హైవేలను దిగ్బంధించడంతో పాటు చాలాచోట్ల హింసాకాండ కూడా చోటుచేసుకుంది. బిహార్, యూపీ మొదలుకుని పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ... ఇలా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. కోపోద్రిక్తులైన యువకులు పలు రాష్ట్రాల్లో 7 రైళ్లకు, వందలాది వాహనాలకు నిప్పుపెట్టారు. గంటల తరబడి రోడ్లపై, పట్టాలపై బైఠాయించారు. రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వాటిపైకి రాళ్లు రువ్వారు. ప్రభుత్వ ఆస్తులతో పాటు టోల్ ప్లాజాలను కూడా ధ్వంసం చేశారు. పలుచోట్ల రైల్వేస్టేషన్లలో విధ్వంసానికి పాల్పడ్డారు. బిహార్‌లో ఉప ముఖ్యమంత్రితో పాటు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుని నివాసాలపై దాడికి దిగారు. బీజేపీకి, కేంద్రానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపారు. ‘అగ్నిపథ్‌ను వెనక్కు తీసుకోవాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. లాఠీచార్జీలో వందలాది మంది గాయపడ్డారు. యువత భవిష్యత్తును అంధకారంగా మార్చే ఈ పథకాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఆందోళనలు, విధ్వంసాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 200కు పైగా రైళ్లు రద్దయ్యాయి. 300 పై చిలుకు రైళ్ల రాకపోకలు ప్రభావితమయ్యాయి. చాలాచోట్ల ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ వంటి సేవలను నిలిపేయాల్సి వచ్చింది. యువతను శాంతింపజేసేందుకు కేంద్రం హుటాహుటిన రంగంలోకి దిగినా పెద్దగా ఫలితం కనిపించలేదు. అగ్నిపథ్ అన్నివిధాలా ఆలోచించి రూపొందించిన పథకమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరించారు. పైగా దీనికింద సైనిక దళాల్లో చేరేందుకు గరిష్ట వయో పరిమితిని ఈ ఏడాదికి 23 ఏళ్లకు పెంచడం యువతకు సువర్ణావకాశమని వారన్నారు. నాలుగేళ్ల సర్వీసు అనంతరం పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ప్రైవేటు రంగంలో చక్కని ఉద్యోగావకాశాలు ఉంటాయని చెప్పారు. అయినా యువత శాంతిస్తున్న సూచనలు గానీ, ఆందోళనలు తగ్గుముఖం పడుతున్న జాడలు కానీ కన్పించడం లేదు. పైగా అగ్నిపథ్ నియామకాలకు అతి త్వరలో శ్రీకారం చుడుతున్నట్టు ర్రివిధ దళాధిపతులు ప్రకటించిన నేపథ్యంలో ఆందోళనలు మరింతగా పెరిగేలా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకంపై శనివారం త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సమావేశమై చర్చించే అవకాశముందని తెలుస్తోంది. యూపీ, బెంగాల్, ఒడిశాల్లో... యూపీలో కనీసం 17 నగరాల్లో భారీ ఆందోళనలు జరిగాయి. బలియాలో రాష్ట్ర రవాణా మంత్రి క్యాంపు కార్యాలయంపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఓ రైలుకు నిప్పు పెట్టారు. అలీగఢ్ వద్ద హైవేపై పలు బస్సులపై రాళ్లు రువ్వారు. వారణాసి, ఫిరోజాబాద్, అమేథీ తదితర చోట్ల పలు రైళ్లపై దాడికి పాల్పడటంతో పాటు రాళ్లు రువ్వినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో రైల్వేస్టేషన్ ముట్టడి సందర్భంగా కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు. ఢిల్లీ, బెంగాల్, ఒడిశాల్లో హైవేల దిగ్బంధం జరిగింది. అట్టుడికిన బిహార్... అగ్నిపథ్ ఆందోళనతో బిహార్ అట్టుడికింది. రాజధాని పట్నా, హాజీపూర్, సమస్తిపూర్, లఖీసరాయ్ వంటి పలు పట్టణాల్లో రైళ్లకు నిప్పుపెట్టారు. దాంతో 10 ఇంజన్లతో పాటు 60 కోచ్‌లకు పైగా దగ్ధమయ్యాయి. హైవేలపై టైర్లు తదితరాలు తగలబెట్టి రాకపోకలను స్తంభింపజేశారు. శనివారం రాష్ట్ర బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. పట్నా శివార్లలో ఓ టోల్ ప్లాజా, నవడాలో ఓ పోలీసు జీపుకూ నిప్పు పెట్టారు. పశ్చిమ చంపారన్ జిల్లా బెట్టియాలో ఉప ముఖ్యమంత్రి రేణూ దేవి ఇంటిపై దాడి చేశారు. బిహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ ఇంటిని పాక్షికంగా ధ్వంసం చేశారు. తన ఇంటిని పేల్చేసేందుకు సిలిండర్ బాంబు కూడా పెట్టారని ఆయన ఆరోపించారు. మోతీహారీలో బీజేపీ ఎమ్మెల్యే వినయ్ బిహారీ కారును తగలబెట్టారు. 320 మందిని అరెస్టు చేసినట్టు అదనపు డీజీపీ సంజయ్‌సింగ్ తెలిపారు. రాష్ట్రంలో 12 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను రెండు రోజుల పాటు నిలిపేశారు. -
హింసాత్మక ‘అగ్నిపథం’
త్రివిధ దళాల్లో యువతను చేర్చుకోవడానికి కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’పై మూడు రోజులుగా ఉత్తరాదిలో సాగుతున్న హింసాత్మక ఆందోళనలు దక్షిణాదికి కూడా వ్యాపించాయి. సికింద్రాబాద్ స్టేషన్లో శుక్రవారం వేలాదిమంది యువకులు హింసకు పాల్పడటం, పోలీసు కాల్పుల్లో ఒకరు మరణించగా పలువురు గాయపడటం, రైళ్లకు నిప్పెట్టడం, పొద్దు పోయే వరకూ ఉద్రిక్తతలు కొన సాగటం దిగ్భ్రాంతికరం. దాదాపు పది గంటల అనంతరం అక్కడ పరిస్థితి చక్కబడింది. చాలాసేపు పోలీసులను నిస్సహాయత ఆవరించింది. తమపై ఎలాంటి హెచ్చరిక లేకుండా కాల్పులు జరిపారని ఆందోళన కారుల ఆరోపణ. అల్లర్లకు దిగినవారిని అదుపు చేయడానికి కాల్పులు తప్పనిసరను కుంటే మోకాళ్లకింది భాగంలోనే కాల్చాలని నిబంధనలు చెబుతున్నాయి. మరి అలా జరిగిందా? ఉత్తరాదిన జరుగుతున్న ఘటనల పరంపర తీరును సరిగా అధ్యయనం చేసి, ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగాల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. నిర్ణయం ప్రకటించాక ఆలోచించుకోవడం కన్నా, ఆలోచించి నిర్ణ యించడం అన్నివిధాలా మంచిదని ఎన్డీఏ సర్కారుకు ఇటీవల తెలియజెప్పిన మరో ఉదంతమిది. లోగడ సాగు చట్టాల విషయంలోనూ ఇదే తంతు నడిచింది. ‘కీలకమైన చట్టాలు తెచ్చేటపుడు సంబంధిత పక్షాలతో మాట్లాడాలి కదా’ అన్నవారి నోళ్లు మూయించడం కోసం ఇన్ని లక్షలమంది రైతులతో, ఇన్ని వేల సంఘాలతో చర్చించామని అప్పటి కేంద్ర వ్యవసాయ మంత్రి లెక్కలు చెప్పారు. కానీ ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తే సంబంధిత రికార్డులు లేవన్న జవాబు వచ్చింది. చివరికేమైంది? ఆ సాగు చట్టాలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సికింద్రాబాద్ ఘటనలకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అలజడి వెనుక టీఆర్ఎస్, ఎంఐఎం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. మరి వరసగా మూడోరోజైన శుక్రవారం కూడా ఉత్తరప్రదేశ్, బిహార్, హరియాణా, మధ్యప్రదేశ్‌లలో కొనసాగిన ఘటనల వెనుక ఎవరున్నట్టు? అస్సాంలో సైతం ఆందోళనలు ఎందుకు జరుగుతున్నట్టు? అక్కడ బీజేపీ, బీజేపీ కూటమి ప్రభుత్వాలే కదా ఉన్నాయి! సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో యువకులు మాట్లాడిన తీరు వారిలో గూడుకట్టుకున్న తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని వెల్లడిస్తున్నాయి. వారిని సమస్యగా పరిగణించి, బలప్రయోగంతో అణచడానికి బదులు సానుభూతితో అర్థం చేసుకోవడం అవసరం. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినందుకు వారిపై ఎటూ కేసులు ముసురుకుంటాయి. వాటి సంగతలా ఉంచి సైన్యానికి ఎంపికైతే ఎదురయ్యే కష్టాలు తెలిసి కూడా వీరంతా ఎందుకు సిద్ధపడతారో గ్రహించాలి. గ్రామీణ భారతంలో అలుముకున్న దారిద్య్రం, తగిన విద్యార్హతలు పొందడానికి సహకరించని ఆర్థిక స్థితిగతులు, కనుచూపు మేరలో కనబడని ఉద్యోగావకాశాలు వగైరా వీరిని సైన్యంలో చేరడానికి సిద్ధపడేలా చేస్తాయనడంలో సందేహం లేదు. కానీ అంతకుమించిన ధైర్యసాహసాలు, తెగువ, మీదుమిక్కిలి దేశంపై ప్రేమాభిమానాలు గుండెనిండా ఉన్నవారే ఆ బాట పట్టగలరని గుర్తించాల్సి వుంది. దేశభక్తి గురించి గంటలతరబడి మాట్లాడే స్థితిమంతుల పిల్లల్లో ఎంతమంది నిత్యం ప్రాణాలకు ముప్పు పొంచివుండే కొలువుకు సిద్ధపడతారు? ఎప్పుడేం జరుగుతుందో తెలియని సరిహద్దు ప్రాంతాల్లో, ఉగ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లో సైనికుడిగా పనిచేసేందుకు వారిలో ఎందరు వెళ్తారు? కనుక నిరసనకు దిగిన యువతపై ముద్రలు వేయడం మానుకోవాలి. సైన్యంలో చేరడానికి ఇతరత్రా పరీక్షల్లో అర్హత సంపాదించి రెండేళ్లుగా రాత పరీక్ష కోసం నిరీక్షిస్తూ, అప్పో సప్పో చేసి శిక్షణ కోసం నెలనెలా వందల రూపాయలు ఖర్చు చేస్తున్న యువతకు కేంద్రం తాజా పథకం దిగ్భ్రాంతి కలిగించింది. అగ్నిపథ్ ప్రకటించినప్పుడు ప్రస్తుత నియామక ప్రక్రియకు ఇది వర్తించబోదని చెబితే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. వయోపరిమితిని ఈసారికి రెండేళ్లు పెంచుతున్నట్టు శుక్రవారం ప్రకటించారు. ముందే ఆ పని ఎందుకు చేయలేక పోయారు? రెండేళ్లుగా ఏదో కారణాలతో నియామకాలు నిలిపేయడంతో వయసు మీరి కొందరికి అనర్హత వస్తుందన్న అంచనా లేదా? అలాగే ఉద్యోగం తాత్కాలిక ప్రాతిపదికనే ఉంటుందనీ, నాలుగేళ్ల తర్వాత కేవలం 25 శాతంమందికి మాత్రమే కొనసాగే వీలుంటుందనీ అనడం మింగుడు పడటం లేదు. ఆ 25 శాతం మందికి కూడా నాలుగేళ్ల సర్వీసు పరిగణనలోకి రాదట! శాశ్వత కొలువు లేకపోవడం, పింఛన్ లేకపోవడం యువకులను నిరాశపరుస్తోంది. మున్ముందు ఖజానాకు భారమవుతుందని ప్రభుత్వం భావించడంవల్ల ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కానీ ఆ విషయంలో బహిరంగ చర్చ, ఏకాభిప్రాయ సాధన అవసరం లేదా? తాము ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ శిరసావహించి తీరాలన్న మనస్తత్వం ఏదైనా కావొచ్చుగానీ... ప్రజాస్వామిక దృక్పథం కాదు. ఈ పథకం సైన్యాన్ని బలహీనపరుస్తుందనీ, దేశ భద్రతకు మంచిది కాదనీ విపక్షాలంటున్నాయి. అదే మాట బీజేపీని గట్టిగా సమర్థించే మేజర్ జనరల్ (రిటైర్డ్) జీడీ బక్షీ సైతం చెబుతున్నారు. లోటు పాట్లతో ఉన్న విధానాన్ని సరిచేద్దామనుకోవడంలో అర్థముంది. సజావుగా ఉన్నదాన్ని తీరికూర్చుని సమస్యాత్మకం చేయడం సరికాదు. కేంద్రం అన్ని వర్గాలతోనూ సమగ్రంగా చర్చించాలి. ‘అగ్ని పథ్’కు సవరణలు అవసర మో, సమూల మార్పు అవసరమో ఆలోచించాలి. -
Agnipath Scheme Protest: అగ్గిరాజేస్తున్న అగ్నిపథ్
పాట్నా: త్రివిధ దళాల సంస్కరణల్లో భాగంగా.. స్వల్పకాలిక నియామక కాంట్రాక్టు పథకం ‘అగ్నిపథ్’ తెరపైకి తెచ్చింది కేంద్రం. అయితే దీనిని వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా నిరసనలూ మొదలయ్యాయి. ఆర్మీలో చేరాలనే ఉత్సుకతతో ఉన్న యువత.. రోడ్ల మీదకు చేరి నిరసనలు వ్యక్తం చేస్తోంది. తాజాగా ఈ రాడికల్ రిక్రూట్మెంట్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ.. బీహార్‌లో కొనసాగుతున్న నిరసనలు ఘర్షణ వాతావరణానికి తెర తీశాయి. వరుసగా రెండో రోజూ.. రోడ్లు, రైలు పట్టాల మీదకు చేరిన యువత.. అగ్నిపథ్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తోంది. ‘ఇండియన్ ఆర్మీ లవర్స్’ పేరుతో బ్యానర్లు చేతబట్టి బాబువా రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర ఏకంగా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు అద్దాలను పగలకొట్టి.. ఓ కోచ్‌కు మంటపెట్టారు. #Bihar: #ArmedForces aspirants protest at Bhabua Road railway station, block tracks & set a train ablaze over #AgnipathRecruitmentScheme They say, "We prepared for long & now they've brought ToD (Tour of Duty) as a 4-yr job.Don't want that but the old recruitment process" (ANI) pic.twitter.com/DEVsY5t4Er — The Times Of India (@timesofindia) June 16, 2022 ఇదిలా ఉండగా.. ఆరాహ్ దగ్గర రాళ్లు రువ్విన నిరసనలకారుల మీద, ప్రతిగా టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇది ఇంతటితోనే ఆగలేదు.. రైలు పట్టాల మధ్య ఫర్నీచర్‌కు నిప్పు పెట్టి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు. జెహానాబాద్‌లో విద్యార్థులు రాళ్లు రువ్వడంతో పలువురు గాయపడ్డారు. నిరసనకాలరును చెదరగొట్టేందుకు.. తుపాకులను గురిపెట్టి భయపెట్టారు. నవాడాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వేతనాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడం, సైన్యంలో మరింతగా యువ రక్తాన్ని నింపడం లక్ష్యంగా తెచ్చిన అగ్నిపథ్ పథకానికి.. మంగళవారం ప్రధాని నేతృత్వంలో జరిగిన రక్షణపై కేబినెట్ కమిటీ భేటీ ఆమోదముద్ర వేసింది. అయితే ఈ కొత్త విధానంపై సైన్య నిపుణులు సహా అనేక వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. నాలుగేళ్ల పదవీకాలం, ర్యాంకుల్లో.. పోరాట స్ఫూర్తిని దెబ్బతీస్తుందని, రిస్క్‌లకు వారిని దూరంగా ఉంచుతుందని విమర్శకులు విమర్శిస్తున్నారు. #Bihar | A passenger train was set ablaze at Chhapra in Saran district as protests against the Agnipath scheme for short-term induction of personnel in the armed forces escalated Read https://t.co/lqlRYn2WuL pic.twitter.com/rAWdRsMmX8 — Hindustan Times (@htTweets) June 16, 2022 -
రక్షణ శాఖ సంచలన నిర్ణయం.. ఆర్మీలో చేరే వారు తప్పక తెలుసుకోండి
న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో సంస్కరణల్లో భాగంగా అగ్నిపథ్ పేరుతో స్వల్పకాలిక నియామక కాంట్రాక్టు పథకాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. వేతనాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడం, సైన్యంలో మరింతగా యువ రక్తాన్ని నింపడం లక్ష్యంగా తెచ్చిన ఈ పథకానికి మంగళవారం ప్రధాని నేతృత్వంలో జరిగిన రక్షణపై కేబినెట్ కమిటీ భేటీ ఆమోదముద్ర వేసింది. అనంతరం వివరాలను త్రివిధ దళాధిపతులతో కలిసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మీడియాకు వెల్లడించారు. దేశభక్తి, స్ఫూర్తి కలిగిన యువతకు జాతిసేవకు వీలు కల్పించే అద్భుత పథకంగా దీన్ని అభివర్ణించారు. తద్వారా దేశ రక్షణ కూడా మరింత బలోపేతమవుతుందన్నారు. ‘‘నాలుగేళ్ల సర్వీసు అనంతరం అత్యంత క్రమశిక్షణ, అంకితభావం, నైపుణ్యాలున్న యువత సమాజంలోకి తిరిగొస్తుంది. దేశానికి వెల కట్టలేని ఆస్తిగా మారుతుంది. ఇలా రెండు రకాలుగా ప్రయోజనం’’ అని వివరించారు. సైన్యంలో ప్రస్తుతం పదేళ్ల షార్ట్ సర్వీస్ కమిషన్ నియామకాలు అమల్లో ఉన్నాయి. టూర్ ఆఫ్ డ్యూటీ (టీఓడీ)గా కూడా పిలిచే అగ్నిపథ్‌కు వచ్చే ఆదరణను బట్టి వీటితో పాటు ప్రస్తుత నియామక పద్ధతులన్నింటినీ నిలిపేస్తారని సమాచారం. కొత్త శకానికి నాంది: త్రివిధ దళాధిపతులు త్రివిధ దళాల్లో మానవ వనరుల విధానంలో కొత్త శకానికి అగ్నిపథ్ నాంది పలుకుతుందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పథకం తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పింది. దీనిపై త్రివిధ దళాధిపతులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. సైనిక నియామక ప్రక్రియలో సమూల మార్పులకు అగ్నిపథ్ శ్రీకారం చుట్టనుందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు. ‘‘భవిష్యత్తు సవాళ్లకు సైన్యాన్ని సర్వ సన్నద్ధంగా ఉంచడంలో, సైన్యం సగటు వయసును ప్రస్తుత 32 ఏళ్ల నుంచి 26 ఏళ్లకు తగ్గించడంలో అగ్నిపథ్ ప్రధాన పాత్ర పోషించనుంది’’ అన్నారు. కొత్త నియామకాల్లో అర్హత ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని చెప్పారు. సైన్యం పనితీరు, సామర్థ్యం, సరిహద్దుల వెంబడి సన్నద్ధత తదితరాలను యథాతథంగా కొనసాగిస్తామని వివరించారు. ఈ పథకం కింద మహిళలను కూడా తీసుకుంటామని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వివరించారు. యువ ప్రతిభను వాయుసేన అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌధురి అన్నారు. అగ్నిపథ్‌ను దేశ యువతకు గొప్ప అవకాశంగా యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ అభివర్ణించారు. వారి సర్వీసు నైపుణ్యాలకు యూజీసీ గుర్తింపు కల్పించేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. విపక్షాల పెదవి విరుపు అగ్నిపథ్ పథకాన్ని విప్లవాత్మక నిర్ణయంగా బీజేపీ అభివర్ణించగా విపక్షాలు మాత్రం పెదవి విరిచాయి. యువతకు భారీ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రధాని మోదీ సంకల్పానికి ఇది, ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాల ప్రకటన కార్యరూపమని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బంగారు భవిత కోసం యువతకు ఇదో అద్భుత అవకాశమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, పార్టీ అగ్ర నేతలు అన్నారు. రక్షణ రంగంలో పెన్షన్ల భారం తదితరాలను తగ్గించుకోవడానికి దేశ భద్రతను కేంద్రం పణంగా పెడుతున్నట్టు కన్పిస్తోందని కాంగ్రెస్, ఇతర విపక్షాలు విమర్శించాయి. మాజీల మిశ్రమ స్పందన కొత్త పథకంపై మాజీ సైనికాధికారులు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. ఇది త్రివిధ దళాలకు మరణ శాసనంతో సమానమని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) వినోద్ భాటియా విమర్శించారు. సైన్యంలో తరాలుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయాలు, నైతిక విలువలు, చిత్తశుద్ధి తదితరాలు ఇకపై లోపిస్తాయని మేజర్ జనరల్ (రిటైర్డ్) సత్బీర్సింగ్ అన్నారు. సైన్యం సామర్థ్యాన్ని కూడా ఈ పథకం దెబ్బ తీస్తుందన్నారు. రక్షణ రంగంలో దీర్ఘకాలిక సంస్కరణలకు ఇది తొలి అడుగని మేజర్ జనరల్ (రిటైర్డ్) బీఎస్ ధనోవా అభిప్రాయపడ్డారు. పథకం స్వరూపం... ► ఇది ఆఫీసర్ దిగువ ర్యాంకు సిబ్బంది (పీబీఓఆర్) నియామక ప్రక్రియ. ► త్రివిధ దళాలకు సంయుక్తంగా ఆన్లైన్ సెంట్రలైజ్డ్ విధానంలో ర్యాలీలు, క్యాంపస్ ఇంటర్వ్యూ తదితర మార్గాల్లో నాలుగేళ్ల కాలానికి నియామకాలు చేపడతారు. ► ఈ ఏడు 46,000 నియామకాలుంటాయి. 90 రోజుల్లో ప్రక్రియ మొదలవుతుంది. ► వయో పరిమితి 17.7–21 ఏళ్లు. ఆర్నెల్ల శిక్షణ, మూడున్నరేళ్ల సర్వీసు ఉంటాయి. ► త్రివిధ దళాల్లో ప్రస్తుతమున్న అర్హత ప్రమాణాలే వర్తిస్తాయి. ► సైన్యంలో ఇప్పటిదాకా జరుగుతున్న ప్రాంతాలు, కులాలవారీ నియామకాలకు భిన్నంగా ‘ఆలిండియా–ఆల్ క్లాస్’ విధానంలో రిక్రూట్మెంట్ ఉంటుంది. దీంతో రాజ్‌పుత్, మరాఠా, సిక్కు, జాట్ వంటి రెజిమెంట్ల స్వరూప స్వభావాలు క్రమంగా మారతాయి. ► విధుల్లో చేరేవారిని అగ్నివీర్‌గా పిలుస్తారు. వీరికి ప్రస్తుత ర్యాంకు లు కాకుండా ప్రత్యేక ర్యాంకులిస్తారు. ► వేతనం తొలి ఏడాది నెలకు రూ.30,000. రూ.21 వేలు చేతికిస్తారు. రూ.9,000 కార్పస్ నిధికి వెళ్తుంది. కేంద్రమూ అంతే మొత్తం జమ చేస్తుంది. నాలుగో ఏడాదికి రూ.40,000 వేతనం అందుతుంది. ► నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యాక రూ.11.71 లక్షల సేవా నిధి ప్యాకేజీ అందుతుంది. దీనిపై ఆదాయ పన్నుండదు. ► సర్వీసు కాలావధికి రూ.48 లక్షల ఉచిత జీవిత బీమా కవరేజీ ఉంటుంది. ► గ్రాట్యుటీ, పెన్షన్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. ► ప్రతిభ, ఖాళీల ఆధారంగా 25 శాతం మందిని శాశ్వత సర్వీసుకు పరిగణనలోకి తీసుకుంటారు. ► మిగతా వారికి రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు రంగ నియామకాల్లో ప్రాధాన్యం. रक्षा क्षेत्र को मजबूत करने के लिए क्रांतिकारी पहल - #Agnipath योजना, योजना के माध्यम से #BharatKeAgniveer को मिलेगा राष्ट्र सेवा का अवसर!!@DefenceMinIndia @adgpi@indiannavy @IAF_MCC @SpokespersonMoD pic.twitter.com/lIBWzQFNzv— PIB in Bihar 🇮🇳 (@PIB_Patna) June 14, 2022 #Agnipath model is based on the All India merit-based selection process we are looking at the best to serve the armed forces between the age of 17.5 to 21 years. After the selection. pic.twitter.com/LB4zWFR7Pd— Krishana_Rajput# (@RajputKrishana) June 14, 2022 -
Woman combat pilot: ఫస్ట్ టైమ్ అభిలాష నెరవేరింది
చిన్నప్పుడు అభిలాషకు తండ్రి కథలు చెప్పేవాడు. అవి కాలక్షేప కథలు, కంచికి వెళ్లే కథలు కావు. మన వీరసైనికుల నిజమైన జీవిత కథలు. ఆ కథలు వింటూ పెరిగిన అభిలాష భారత సైన్యంలో పనిచేయాలని గట్టిగా అనుకుంది. తాజాగా ‘ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమన్ కంబాట్ ఏవియేటర్’గా చారిత్రక గుర్తింపు పొందింది కెప్టెన్ అభిలాష బరాక్. అభిలాష బరాక్కు మిలిటరీ అనే మాట కొత్త కాదు. నాన్న ఓమ్‌సింగ్ సైనిక అధికారి. దీంతో దేశంలోని రకరకాల కంటోన్మెంట్లలో పెరిగింది అభిలాష. సైనికుల వీరగాథలను తండ్రి స్ఫూర్తిదాయకంగా చెబుతుండేవాడు. ఆ ప్రభావం తన మీద పడింది. అలా మిలిటరీలో పనిచేయాలనే కలకు అంకురార్పణ జరిగింది. ఒకరోజు ఇండియన్ మిలిటరీ అకాడమీలో తన సోదరుడి పాసింగ్ ఔట్ పరేడ్‌కు హాజరైంది అభిలాష. ఆ వాతావరణం తనను ఎంత ఉత్తేజపరిచింది అంటే...పనిచేస్తే మిలిటరీలోనే పనిచేయాలన్నంతగా. ‘మిలిటరీ యూనిఫామ్’లో తనను తాను చూసుకొని మురిసిపోవాలనుకునేంతగా! ‘నా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసుకున్న రోజు అది’ అని గతాన్ని గుర్తు చేసుకుంది అభిలాష. దిల్లీ టెక్నాలజికల్ యూనివర్శిటీలో బీటెక్ పూర్తిచేసిన అభిలాష 2018లో ‘ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాప్స్’లో చేరింది. దీనికి ముందు కొన్ని ప్రొఫెషనల్ మిలిటరీ కోర్స్‌లు పూర్తిచేసింది. ‘ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు ఇది. కంబాట్ ఏవియేషన్ కోర్స్ విజయవంతంగా పూర్తి చేసిన కెప్టెన్ అభిలాష ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమన్ కంబాట్ ఏవియేటర్...’ అని ఆర్మీ తన అధికార ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా తెలియజేసింది. ప్రత్యేక విధులు నిర్వర్తించే దళంగా ప్రసిద్ధమైన ఏవియేషన్ కాప్స్‌కు ఉన్న ఘనచరిత్ర తక్కువేమీ కాదు. రుద్ర, చీతా, ధృవ...మొదలైన హెలికాప్టర్లను ఆపరేట్ చేయడంతో పాటు సియాచిన్‌లాంటి సున్నిత ప్రాంతాలలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తుంది. ‘రెట్టించిన అంకితభావంతో పనిచేయడానికి తాజా బాధ్యత ప్రేరణ ఇస్తుంది’ అంటుంది హరియాణాకు చెందిన 26 సంవత్సరాల అభిలాష ‘స్విఫ్ట్ అండ్ ష్యూర్’ అనేది మన సైన్యానికి సంబంధించిన లక్ష్య ప్రకటిత నినాదం. ఈ నినాదాన్ని వేగంగా అందుకున్న యువ సైనికులలో అభిలాష ఒకరు. ఆమెకు అభినందనలు. -
చిమ్మ చీకటిలో ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్.. వీడియో వైరల్
Daring Midnight Rescue: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో చీనాబ్ నది మధ్యలో చిక్కుకున్న ఇద్దరు యువకులను భారత ఆర్మీ రక్షించింది. అర్ధరాత్రి చిమ్మచీకటిలో సాహసోపేతమైన రెస్క్యూ చేపట్టి మరీ వారిని రక్షించింది. వివరాల్లోకి వెళితే.. సునీల్, బబ్లూలు, జేసీబీ వాహనంలో చీనాబ్ నది దాటుతుండగా నది ప్రవాహంలో చిక్కుకుపోయారు. పైగా నీటిమట్టం క్రమంగా పెరగడంతో రక్షించేంత వరకు వాహనంపై కూర్చోవాలని అధికారులు సూచించారు. సివిల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న ఆర్మీ జవాన్లు ముమ్మరంగా రెస్క్యూ చర్యలు చేపట్టారు. ఈమేరకు ఆర్మీకి చెందిన సుమారు 17 మంది రాష్ట్రీయ రైఫిల్స్, స్థానిక పోలీసులతో కలిసి ఈ రెస్క్యూ సహాయక చర్యలో పాల్గొన్నారు. ఎట్టకేలకు అర్ధరాత్రి చిమ్మ చీకటిలోనే ఆ యువకులను రక్షించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు పౌరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి భారత సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందంటూ ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. #IndianArmy carried out rescue of two youth stuck in #Chenab river near village Sohal, #Kishtwar, #JammuKashmir. The water level was rising at fast pace, Soldiers rappelled across the river & rescued the youth to safety.@adgpi @Whiteknight_IA @ANI @ABPNews pic.twitter.com/aewQKQLKWJ — NORTHERN COMMAND - INDIAN ARMY (@NorthernComd_IA) May 8, 2022 (చదవండి: ఇండిగో ఘటనపై స్పందించిన సీఈవో) -
Rekha Singh: భర్త కన్న కలల కోసం.. భారత ఆర్మీలోకి రేఖా సింగ్
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లోని గల్వాన్ లోయలో 2020 జూన్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీర మరణం పొందిన నాయక్ దీపక్ సింగ్ భార్య రేఖా సింగ్ ఇండియన్ ఆర్మీలో చేరారు. తన భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్న ఆమె లెఫ్టినెంట్ అయ్యారు. ఆర్మీకి సంబంధించిన శిక్షణని మే 28 నుంచి చెన్నైలో రేఖా సింగ్ తీసుకోనున్నారు. దీపక్ సింగ్‌కు తన భార్య కూడా ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని బలమైన కోరిక ఉండేది. ఆయన జీవించి ఉన్నప్పుడు ఆమెను ఆ దిశగా ప్రోత్సాహించారు. వారిద్దరికీ పెళ్లయిన ఏడాదిన్నరలోనే గల్వాన్ ఘర్షణల్లో దీపక్ సింగ్ వీర మరణం పొందడం రేఖను బాగా కుంగదీసింది. భర్త పోయిన దుఃఖం నుంచి కోలుకున్న ఆమె టీచర్ ఉద్యోగం వీడి తన భర్త కన్న కలల్ని సాకారం చేయడానికి ఆర్మీలో చేరారు. అది కూడా ఏమంత సులభంగా ఆమెకి రాలేదు. రెండు సార్లు ప్రయత్నించిన మీద లెఫ్టినెంట్ పదవి దక్కింది. -
ట్రెండ్ సెట్ చేశాడు.. భారత ఆర్మీ జాబ్ కోసం పెద్ద సాహసం
సాక్షి, న్యూఢిల్లీ: భారత సైన్యంలో చేరాలన్నది అతని కల. ఆర్మీలో రిక్రూట్మెంట్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. అధికారులు మాత్రం రిక్రూట్మెంట్ జరపకపోవడంతో ఓ యువకుడు పెద్ద సాహాసం చేశాడు. ఏకంగా 350 కిలోమీటర్లు పరుగెత్తి సోషల్ మీడియాలో నిలిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, కోవిడ్ కారణంగా సుమారు 2 సంవత్సరాలుగా నిలిచిపోయిన ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ వందలాది మంది యువకులు జంతర్ మంతర్‌లో నిరసన చేపట్టారు. ఈ నిరసనల్లో పాల్గొనేందుకు రాజస్థాన్‌కు చెందిన సురేశ్ భిచార్(24).. రాజస్థాన్ నుంచి పరుగెత్తుకుంటూ ఢిల్లీ చేరుకున్నాడు. దాదాపు 350 కి.మీ పరుగెత్తి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు చేరాడు. చేతిలో జాతీయ జెండా పట్టుకుని 50 గంటల్లో 350 కి.మీ పరుగెత్తాడు. అనంతరం నిరసనల్లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా సురేశ్ మాట్లాడుతూ.. ‘‘మార్చి 29న పరుగు యాత్రను ప్రారంభించాను. ప్రతీరోజు ఉదయం 4 గంటలకు పరుగు ప్రారంభించి.. 11 గంటలకు ఎక్కడో ఓ చోట పెట్రోల్ బంకుకు చేరుకున్న తర్వాత అక్కడ విశ్రాంతి తీసుకుంటాను. సమీప ప్రాంతంలో ఉన్న ఆర్మీలో చేరేందుకు ప్రయత్నిస్తున్న అభ్యర్థుల నుండి ఆహారం తీసుకుని తింటాను. ప్రతీ గంటకు దాదాపు 7 కి.మీలు పరిగెత్తుతాను. భారత సైన్యంలో చేరేందుకు యువతలో ఉత్సాహాన్ని నింపేందుకు ఇలా పరుగు యాత్ర ప్రారంభించా’’ అని చెప్పాడు. #WATCH दिल्ली: भारतीय सेना में शामिल होने के लिए इच्छुक एक युवा राजस्थान के सीकर से दिल्ली में एक प्रदर्शन में शामिल होने के लिए 50 घंटे में 350 किलोमीटर दौड़कर पहुंचा। pic.twitter.com/rpRVH8k4SI — ANI_HindiNews (@AHindinews) April 5, 2022 -
వైరల్ అయినందుకు సంతోషం, కానీ..: పరుగుల ప్రదీప్ మెహ్రా
Pradeep Mehra Running Video: అనుకున్నది సాధించే క్రమంలో ఆటంకాల గురించి ఆలోచించి.. ఆగిపోయేవాళ్లే ఎక్కువ. కానీ, అవాంతరాలను అలవోకగా దాటేయాలనుకునే ప్రదీప్ మెహ్రా లాంటి వాళ్లు ఎంత మంది ఉంటారు చెప్పండి!. 19 ఏళ్ల ప్రదీప్.. భారత ఆర్మీలో చేరాలనే ఒకే ఒక్క లక్ష్యంతో తాను పని చేసే చోటు నుంచి ఉంటున్న చోటుకి దాదాపు 8 కిమీపైనే అర్ధరాత్రి పరుగులు తీస్తుండడం, అది కాస్త వీడియో రూపంలో ఇంటర్నెట్లో వైరల్ కావడం తెలిసిందే. అయితే.. తన రన్నింగ్ వీడియో వైరల్ కావడంపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని ఉత్తరాఖండ్ ఆల్మోరాకు చెందిన ప్రదీప్.. అనవసరంగా తనను ఓ సెలబ్రిటీని చేయొద్దంటూ వేడుకుంటున్నాడు. అది ఎందుకో అతని మాటల్లోనే తెలుసుకుందాం. ఫిల్మ్‌మేకర్ వినోద్ కాప్రి.. నొయిడా నుంచి బరోలా మధ్య ప్రదీప్ మెహ్రా ఉరుకులను షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో వైరల్ అయ్యాక.. ప్రదీప్ రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలని కాప్రి ఆరాటపడ్డాడు. ఈ క్రమంలో మరోసారి ప్రదీప్‌ను కలిశాడు. ‘‘అతిగా ఫేమ్ దక్కినా నాకు ఇబ్బందే. ఇంటర్వ్యూల కోసం ఎగబడడమో లేదంటే నన్నొక సెలబ్రిటీగా మార్చేయడమో చేస్తారు. అప్పుడు నా లక్ష్యంపై నేను దృష్టి సారించలేను. కాబట్టి, ఇదంతా నాకొద్దు. దయచేసి వేడుకుంటున్నా నా కోసం వేరే ఎవరూ రావొద్దు. ప్రశాంతంగా నా పని నన్ను చేసుకోనివ్వండి’’ అని వేడుకుంటున్నాడు ఆ కుర్రాడు. “मेहनत सुनसान होनी चाहिए, कामयाबी का शोर होना चाहिए” ये कहते हुए #PradeepMehra ने मीडिया से अपील की है कि वो उसे उसके लक्ष्य में फ़ोकस रहने दे और परेशान ना करें🙏🏻🙏🏻 pic.twitter.com/B6OptUQ8Je — Vinod Kapri (@vinodkapri) March 21, 2022 ‘‘నా శ్రమ నిశబ్దంగానే సాగిపోవాలి. ఎందుకంటే నా విజయాన్ని నేను ప్రపంచానికి బిగ్గరగా చాటి చెప్పాలి కదా. అందుకే ఇలాంటి ఫేమ్లకు దూరంగా ఉండాలనుకుంటున్నా. సెల్ఫీల కోసం కొందరు వస్తుంటే.. సిగ్గుగా అనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది ఇంటర్వ్యూలంటూ ఇబ్బంది పెడుతున్నారు. నా తల్లి ట్రీట్మెంట్కి సాయం దొరికింది. సాయం అందించినందుకు కృతజ్ఞతలు. ఇక చాలు. ఇంకేం వద్దు. నా లక్ష్యం దేశ సేవే’’ అని క్లారిటీగా చెప్పేశాడు ఆ కుర్రాడు. కాస్తంత ఫేమ్ దక్కినా, అనుకోకుండా వైరల్ అయినా ఎలా క్యాష్ చేసుకోవాలా? అని ఆలోచించే వాళ్లు ఉన్న ఈ రోజుల్లో.. ప్రదీప్ మెహ్రా లాంటి వాళ్లు ఎంత మంది ఉంటారు చెప్పండి. This morning @atulkasbekar took my address and with in few hours , a @PUMA sports kit with Running shoes, Apparels, backpack , socks was there at my door step for #PradeepMehra and with in no time we delivered it to him. Love you Atul ❤️ love you Tweeple❤️❤️ Thanks #Puma pic.twitter.com/MZws0nBd8L — Vinod Kapri (@vinodkapri) March 21, 2022 ఇదిలా ఉంటే.. సినీ నిర్మాత అతుల్ కస్బేకర్, ప్రదీప్ కోసం షూస్, దుస్తులు, బ్యాక్‌ప్యాక్‌ను వినోద్ కాప్రి ద్వారా పంపించాడు. వాటిని దగ్గరుండి మరీ ప్రదీప్‌కు అందజేసి ఆల్‌ది బెస్ట్ చెప్పాడు కాప్రి. ఇక పలువురు ఇంటర్నెట్ వేదికగా ఆ కుర్రాడిని అభినందిస్తున్నారు. ఇక కాప్రి కూడా యూట్యూబ్ ఛానెల్స్‌కు, మీడియాకు ప్రదీప్ మెహ్రాను అలాగే వదిలేయాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు కూడా. సంబంధిత వార్త: అమ్మ అనారోగ్యం, ఆపై.. ప్రదీప్ పరుగుల కథ ఇది! -
‘డార్లింగ్’ ప్రదీప్.. ఆర్మీలో చేరేందుకు ఏం చేస్తున్నాడంటే.. వీడియో వైరల్
లక్నో: సోషల్ మీడియాలో ఓ యువకుడు చేసిన ఫీట్ సంచలనంగా మారింది. ప్రస్తుతం అతను సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాడు. ఇంతకీ అతను ఏం చేశాడంటే.. ప్రతీ రోజు రాత్రి 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తాడు. ఎందుకో కారణం తెలిస్తే మీరు ఫిదా అయిపోతారు. వివరాల్లోకి వెళ్తే.. నోయిడాకు చెందిన ప్రదీప్(19) పట్టణంలోని వీధుల్లో రాత్రి వేళ పరిగెత్తుతుండగా ఫిల్మ్ మేకర్ వినోద్ కాప్రీ చూశాడు. ఇంతలో వినోద్.. ప్రదీప్ దగ్గరికి వెళ్లి ఎందుకిలా పరిగెత్తుతున్నావని ప్రశ్నించగా.. అతడు చెప్పిన సమాధానం విని ఫిదా అయిపోయాడు. తాను ప్రతీ రోజు ఇలాగే 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తానని ప్రదీప్ చెప్పాడు. ఎందుకని మళ్లీ ప్రశ్నించగా.. తన కల భారత ఆర్మీలో చేరడమేనని.. అందుకే తాను ఇలా ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలిపాడు. ఈ క్రమంలో వినోద్.. ఉదయం సమయంలో రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు కదా అని అడగ్గా.. తాను మెక్‌డోనాల్డ్ సెక్టార్-16లో పని చేస్తున్నానని అన్నాడు. ఉదయాన్నే 8 గంటలకు లేచి వంట చేయాలని చెప్పాడు. తన తల్లి అనారోగ్యం కారణంగా మంచానపడిందని చెప్పిన ప్రదీప్.. తన తమ్ముడికి సైతం వంట చేసిపెట్టాలని సమాధానం ఇచ్చాడు. అందుకే తాను రాత్రి సమయంలోనే ఇలా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తానని వివరించాడు. ప్రదీప్ రన్నింగ్ కొనసాగిస్తూనే ఇలా సమాధానాలు చెప్పడం విశేషం. చివరకు.. ప్రదీప్‌ను వినోద్ కాప్రీ తన కారులో ఇంటి వద్ద దింపుతానని చెప్పగా.. అతను నో చెప్పాడు. కారులో వస్తే ఈరోజు ప్రాక్టీస్ మిస్ అవుతానని చెప్పడంతో వినోద్ మరోసారి ఫిదా అయిపోయాడు. కాగా, అతను రన్నింగ్ చేస్తున్న విషయంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ఇది నిజంగా స్ఫూర్తిదాయకం. అయితే నా #MondayMotivation ఏమిటో మీకు తెలుసా? అతను చాలా గ్రేట్, రైడ్ ఆఫర్‌ను తిరస్కరించడం వాస్తవం. అతనికి సహాయం అవసరం లేదు. ఆయనే ఆత్మనిర్భర్ అంటూ ట్విట్టర్లో వీడియోను షేర్ చేశాడు. Inspiring…all the best #Pradeep 👏🏼👏🏼👏🏼 https://t.co/Y1YMQBV5jW — Sai Dharam Tej (@IamSaiDharamTej) March 21, 2022 ప్రదీప్ వీడియోపై టాలీవుడ్ హీర్ సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. స్పూర్తిదాయకం.. ఆద్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేశారు. The only impossible journey is the one you never begin 👍 Video Via @vinodkapri pic.twitter.com/ue5x482T2s — Defence Squad (@Defence_Squad_) March 20, 2022 టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ స్పందిస్తూ.. What an exemplary person 🌟 Run #Pradeep Run 🏃♂️ https://t.co/hAibkgRU7U — Krish Jagarlamudi (@DirKrish) March 20, 2022 -
భారత్ భేష్.. ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామాకు తాను వెనకాడబోనని చెప్పిన పాక్ పీఎం.. విపక్షాల ఒత్తిళ్లకు తలొగ్గేదిలేదంటూ వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా పాక్ ఆర్మీని విమర్శిస్తూ.. భారత్‌పై ప్రశంసలు గుప్పించాడు. ఖైబర్ ఫక్తూన్వాలో ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించాడు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవిశ్వాసం తేబోతున్న ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ.. తన ప్రభుత్వ పని తీరును సమర్థించుకున్నాడు. పనిలో పనిగా.. భారత ఆర్మీ భేషుగ్గా పని చేస్తుందని మెచ్చుకున్నాడు. భారత ఆర్మీ.. అక్కడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. అలాగే భారత విదేశాంగ విధానం అద్భుతంగా ఉంటుందని, పౌరుల కోసం ఎంతకైనా తెగిస్తుందంటూ ఆకాశానికి ఎత్తాడు. ఇక భారత్.. ఏ ఒత్తిళ్లకూ తలొగ్గని దేశమని, విధానాలు సక్రమంగా ఉండడం వల్లే తటస్థ వైఖరి అవలంభిస్తుందంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాదు భారత్ విధానాలు ఆ దేశానికి ఎంతో మేలు చేస్తున్నాయని వ్యాఖ్యానించాడు ఇమ్రాన్ ఖాన్. ఇక పదవీ గండంపై స్పందిస్తూ.. రాజీనామాకు తాను ఎప్పటికైనా సిద్ధమని పేర్కొన్నాడు. అలాగని విపక్షాల ఒత్తిళ్లకు తాను తలొగ్గనని, ఆర్మీకి డబ్బులిచ్చి ప్రభుత్వాన్ని, పదవిని నిలబెట్టుకోలేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉండగా.. ఆర్మీ చీఫ్ జనరల్ ఖనార్ జావెద్ బజ్వా ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇది ఇస్లామిక్ కో ఆపరేషన్’ తర్వాత ఇమ్రాన్ ఖాన్‌ను ప్రధాని పదవికి రాజీనామా చేయాలని కోరిన సంగతి తెలిసిందే. చదవండి: ఖాన్ సాబ్.. మీరు దిగి పోవడమే మంచిది! -
అదిరిపోయిన తొలి 3డీ గృహం.. 28 రోజుల్లోనే నిర్మాణం..!
ఇండియన్ ఆర్మీకి చెందిన మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్(ఎంఈఎస్) 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి రెండు ఇళ్లను నిర్మించింది. అవును! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల మాదిరిగానే 3డీ గృహాలు నిర్మించింది. 3డీ రాపిడ్ కనస్ట్రక్షన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ ఇళ్లను నిర్మించినట్లు తన అధికారిక ప్రకటనలో తెలిపింది. గాంధీనగర్‌లోని నైరుతి ఎయిర్ కమాండ్ ఈ 3డీ గృహాలను దేశంలో మొట్టమొదటి సారిగా నిర్మించింది. ఈ గృహాలను నాలుగు వారాల వ్యవధిలోనే నిర్మించడం విశేషం. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ఏఎన్ఐ మీడియా ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ఈ భారత సాయుధ దళాల పెరుగుతున్న వసతి అవసరాలను వేగంగా తీర్చడానికి ఈ 3డీ గృహాలను నిర్మించాల్సి వస్తుంది అని రక్షణ దళాలు పేర్కొన్నాయి. చెన్నైకి చెందిన స్టార్టప్ త్వాస్తా సహకారంతో ఈ ఇళ్లను నిర్మించారు. ప్రతి ఇల్లు సుమారు 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ గృహాలను భూకంపాలు తట్టుకునే విధంగా నిర్మించినట్లు పేర్కొన్నారు. ఇంతకు ముందు ఎంఈఎస్ భారతదేశంలోని మొదటి 3డీ ప్రింటెడ్ శానిటరీ బ్లాక్‌లను జైసల్మేర్ వద్ద సుమారు 600 చదరపు అడుగుల స్థలంలో నిర్మించింది. #WATCH how the Indian Army’s Military Engineering Services constructed two houses within four weeks using the 3D Printing Technology in construction. (Source: Indian Army) pic.twitter.com/bMf3G3aO01 — ANI (@ANI) March 14, 2022 (చదవండి: బంగారం రుణం తీసుకునే వ్యాపారులకు భారత్ పే శుభవార్త..!) -
ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకను జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్
-
Indian Army : జవాన్ అదిరిపోయే ఫీట్.. ఫిదా అవుతున్న ఇండియన్స్
సాక్షి, న్యూఢిల్లీ: భారత సైనం ఘనతను ఓ జవాన్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. తాము మానసికంగా, శారీరకంగా ఎంత దృఢంగా ఉన్నామో చెప్పకనే చెప్పారు. ఎముకలు కొరికే చలైనా, మండే ఎండకైనా, బీభత్సం సృష్టించే వానకైనా తాము బెదరమని తన పోరాట పటిమను చూపించారు. భారత జవాన్ చేసిన సాహాసం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మనోడి స్టంట్ చేసి భారతీయులు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఏం చేశాడంటే.. ఐటీబీపీ కమాండెంట్ రతన్ సింగ్ సోనాల్(55) మైనస్ 30 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద.. ఆగకుండా 60 పుష్ అప్స్ తీసి ఔరా అనిపించుకున్నారు. అది కూడా మాములు ప్రాంతంలో కాదు.. శీతల ప్రాంతమైన లద్దాఖ్‌లో 17,500 అడుగుల ఎత్తులో ఈ సాహసం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంత ఎత్తు, మంచులో కూడా రతన్ సింగ్ కొంచెం కూడా తన బ్యాలెన్స్ కోల్పోకుండా 60 పుష్ అప్స్ చేశాడు. అయితే, ఫిబ్రవరి 20న ఎత్తైన కర్జోక్ కంగ్రీ పర్వతాన్ని చేరుకున్న ఈ ఐటీబీపీ బృందం గడ్డ కట్టే చలిలో తమ పోరాటపటిమను ప్రదర్శిస్తోంది. వీరి ధైర్య సాహాసాలను చూసి సెల్యూట్ టూ ఇండియన్ ఆర్మీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Push-ups at icy heights... ITBP Commandant Ratan Singh Sonal (Age- 55 years) completes more than 60 push-ups at one go at 17,500 feet at minus 30 degree celsius temperature around in Ladakh.#Himveers #FitIndia #FitnessMotivation pic.twitter.com/Fc6BnfmGqH — ITBP (@ITBP_official) February 23, 2022 -
రెండు రోజులుగా చావు అంచున వేలాడుతూ, చివరికి..
ఊహించని రీతిలో చావు అంచున వేలాడుతూ రెండు రోజులు గడిపాడు ఆ వ్యక్తి. అధికారులు ప్రయత్నించినా.. అతన్ని కాపాడడం వీలు కాలేదు. ఇక తన ప్రాణం పోవడం ఖాయం అనుకుంటూ ఆ యువకుడు బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఆ తరుణంలో భారత్ ఆర్మీ ఎంట్రీతో సీన్ మారింది. ఆ కేరళ యువకుడి ప్రాణాలు నిలిచాయి. కేరళలోని పాలక్కాడ్ జిల్లా చేరాడు సమీపంలో చేరాట్ కొండలున్నాయి. వీటిని అధిరోహించాలనుకున్న ఆర్.బాబు (23), తన స్నేహితులు సోమవారం నాడు ట్రెక్కింగ్‌కు వెళ్లారు. కొండ అలా ఉండడంతో కష్టంగా అనిపించడంతో ఇద్దరు స్నేహితులు మధ్యదాకా వెళ్లి కిందకు వచ్చేశారు. కానీ, బాబు మాత్రం ధైర్యంగా ముందుకెళ్లి కొండపైకి చేరుకున్నాడు. కానీ, తిరిగి వచ్చే క్రమంలో అతనికి పట్టు జారిపోయింది. దీంతో రెండు బండరాళ్ల మధ్య చీలికలో చిక్కుకుపోయాడు. అక్కడి నుంచి బయటపడే మార్గం తోచలేదు. సీఎం చొరవతో.. కొండ అంచు చీలిక భాగంలో రెండు రోజులుగా చిక్కుకుపోయి సోమవారం నుంచి ఆహారం, నీరు లేకుండా అక్కడే చిక్కుకుపోయాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు.. కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తన చావు ఇలా రాసి ఉందా? అని యువకుడు అనుకున్నాడు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా ఆర్మీ సాయాన్ని కోరారు. దీంతో బుధవారం ఉదయానికి రెండు ఆర్మీ బృందాలు చేరాట్ కొండ ప్రాంతానికి చేరుకున్నాయి. ఇందులో ఒకటి మద్రాస్ రెజిమెంట్ కు చెందిన బృందం. ఇందులో పర్వతాల అధిరోహణలో నైపుణ్యం కలిగిన సైనికులు ఉన్నారు. అలాగే, బెంగళూరు నుంచి పారాచ్యూట్ రెజిమెంట్ కు చెందిన 22 మంది సైనికుల బృందం అన్ని రకాల ఎక్విప్ మెంట్ తో చేరుకుంది. ముందు తిండి.. ఆపై బాబును సహాయ కార్యక్రమాలు బుధవారం ఉదయం 5.45 గంటలకు మొదలయ్యాయి. డ్రోన్ల సాయంతో బాబు జాడను గుర్తించారు. తొలుత అతడికి తిండి, నీరు అందించారు. ఆపై అతడికి కొంచెం ఓపిక వచ్చాక.. అనంతరం అక్కడి నుంచి క్షేమంగా కిందకు తీసుకొచ్చారు. కాగా, సురక్షితంగా ఒక ప్రాణం నిలబెట్టిన భారత్ ఆర్మీకి సోషల్ మీడియా సలాం చెబుతోంది. కృతజ్క్షతలు చెప్పినవాళ్లలో కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ఉన్నారు. Worries have been put to rest as the young man trapped in the Cherad hill in Malampuzha has been rescued. The treatment & care needed to regain his health will be provided now. Thanks to the soldiers who led the rescue operation and everyone who provided timely support. pic.twitter.com/YAwHQOxZAP — Pinarayi Vijayan (@vijayanpinarayi) February 9, 2022 -
కేరళలో కొండ చీలికలో చిక్కుకున్న యువకుడు..
-
కాల్పుల విరమణ.. మా బలహీనత కాదు: పాక్
ఇస్లామాబాద్: భారత్–పాకిస్తాన్ మధ్య గత ఏడాది ఫిబ్రవరి 25న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒకరి బలంగా, మరొకరి బలహీనతగా చూడరాదని పాకిస్తాన్ సైనిక దళాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్ అన్నారు. ఈ ఒప్పందం విషయంలో భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే చేసిన వ్యాఖ్యలను ఆయన శుక్రవారం ఖండించారు. నరవణే వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవిస్తూ 2021 ఫిబ్రవరి 25న నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంట కాల్పుల విరమణను పాటించేలా ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ఆర్మీ చీఫ్ నరవణే గురువారం ఢిల్లీలో ఓ సెమినార్లో మాట్లాడుతూ.. తాము(భారత సైన్యం) బలమైన స్థానంలో ఉండి చర్చలు జరపడం వల్లే పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని చెప్పారు. చదవండి: ఆందోళనకారులపై మిలటరీ అవసరం లేదు -
సైన్యానికి హీరో సుమన్ 117 ఎకరాల భూమి విరాళం ఇచ్చారా?
ప్రముఖ నటుడు సుమన్ భారత సైన్యానికి 117ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.అంతేకాకుండా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ భూమిని విరాళంగా అందించినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై సుమన్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. '117 ఎకరాల భూమిని తాను భారత సైన్యానికి ఇచ్చినట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆ భూమికి సంబంధించిన వివాదం ఇంకా కోర్టులో ఉంది. వివాదం పరిష్కారం అయిన వెంటనే స్వయంగా తానే అందరికీ తెలియజేస్తాను' అంటూ అంటూ చెప్పుకొచ్చారు. -
తరోన్‌ను భారత ఆర్మీకి అప్పగించిన చైనా ఆర్మీ
న్యూఢిల్లీ: ఇటీవల అదృశ్యమైన అరుణాచల్‌ప్రదేశ్ యువకుడు మిరమ్ తరోన్‌ను భారతీయ సైనికులకు చైనా ఆర్మీ (పీఎల్ఏ) అప్పగించిందని కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజుజు గురువారం ప్రకటించారు. అరుణాచల్‌లోని వాచా– దమాయ్ సరిహద్దు ప్రాంతం వద్ద తరోన్‌ను అప్పగించారన్నారు. ఈనెల 18న తరోన్ చైనా భూభాగంలోకి వెళ్లి అదృశ్యమయ్యాడు. అతన్ని వెతికి అప్పగించాలని పీఎల్ఏను భారత ఆర్మీ కోరింది. తరోన్ జాడ కోసం ఆర్మీ చేసిన కృషిని కిరణ్ కొనియాడారు. ఈ మేరకు తరోన్, సైనికులున్న ఫొటోను ఆయన షేర్ చేశారు. తరోన్ ఆచూకీ తెలిసినట్లు ఈ నెల 20న చైనా ఆర్మీ వెల్లడించింది. The Chinese PLA handed over the young boy from Arunachal Pradesh Shri Miram Taron to Indian Army at WACHA-DAMAI interaction point in Arunachal Pradesh today. I thank our proud Indian Army for pursuing the case meticulously with PLA and safely securing our young boy back home 🇮🇳 pic.twitter.com/FyiaM4wfQk — Kiren Rijiju (@KirenRijiju) January 27, 2022 చదవండి: (పాక్‌లో జిహాద్ పేరుతో నిధులు సేకరించొద్దు) -
ఘనంగా గణతంత్ర వేడుకలు
న్యూఢిల్లీ: భారత 73వ గణతంత్ర దిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో భారతీయ సైనిక పాటవాన్ని చాటిచెప్పేలా యుద్ధవిమానాలతో భారీ ఫ్లైపాస్ట్ నిర్వహించారు. 1971 పాకిస్తాన్‌తో యుద్ధంలో కీలక పాత్ర పోషించిన పలు సైనిక వాహనాలను ప్రదర్శించారు. కరోనా కారణంగా వేడుకలకు విదేశీ అతిధిని ఆహ్వానించలేదు. వీక్షకుల సంఖ్యను కూడా పరిమితం చేశారు. అయితే ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ఆటోడ్రైవర్లు, నిర్మాణ కార్మికులను ప్రత్యేక అతిధులుగా గౌరవించారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ గౌరవ వందనం స్వీకరించడంతో రిపబ్లిక్ డే పెరేడ్ ఆరంభమైంది. లెఫ్టినెంట్ జనరల్ విజయ్ కుమార్ మిశ్రా, మేజర్ జనరల్ అలోక్ కకేర్ నేతృత్వంలో సైనికులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయగీతాలాపన, 21 తుపాకుల గన్‌సెల్యూట్ జరిగాయి. భారత ఆర్మీ 61వ కేవలరీ రెజిమెంట్ సైనికులు మార్చింగ్‌లో ముందు నిలిచారు. ఉత్తరాఖండ్ టోపీతో ప్రధాని గణతంత్ర ఉత్సవాలకు హాజరయ్యే ముందు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ యుద్ద మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆయనతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాధ్, త్రివిధ దళాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వీరు రిపబ్లిక్ డే పెరేడ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ఉత్తరాఖండ్‌కు పత్య్రేకమైన టోపీ ధరించారు. దీనిపై ఆ రాష్ట్ర పుష్పం బ్రహ్మకమలం చిత్రీకరించారు. అలాగే మణిపూర్ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా శాలువా ధరించారు. పెరేడ్లో ఎన్సీసీ కేడెట్లు షహీదోం కో శత్ శత్ నమాన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయా రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శన జరిగింది. పలు ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సైతం తమ శకటాలను ప్రదర్శించాయి. కేంద్ర ప్రజాపనుల శాఖ నేతాజీ 125వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనకు నివాళినర్పిస్తూ శకటాన్ని ప్రదర్శించింది. ఈ ఏడాది కొత్తగా లోక్ అదాలత్ శకటం పెరేడ్లో అడుగుపెట్టింది. విదేశాల్లో గణతంత్ర దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భారతీయులు 73వ గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ సహా పలు దేశాధినేతలు ఈ సందర్భంగా ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. పలు దేశాల్లో భారతీయ కమిషన్ కార్యాలయాల్లో వేడుకలు జరిపారు. బీజింగ్‌లో భారత రాయబారి విమల్ జాతీయజెండాను ఎగురవేసి, రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించారు. సింగపూర్‌లో హైకమిషనర్ సిద్ధార్ధ్ నాథ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. భారత్‌లో మరింత బలమైన బంధాన్ని ఏర్పరుచుకుంటామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ హిందీలో భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల సంబంధాలు మరింత బలోపేతం కావాలని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ ఆకాంక్షించారు. భారత్‌తో కలిసి అనేక అంశాల్లో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు బంగ్లా ప్రధాని షేక్ హసీనా చెప్పారు. భూటాన్, ఇండియాల స్నేహం కాలానికి నిలిచిందని ఆ దేశ ప్రధాని లోటే ష్రింగ్ తెలిపారు. భారత ప్రజలకు శ్రీలంక ప్రధాని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్తాన్లో ఇండియా రాయబారి సురేశ్ కుమార్ జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ఇండో– యూఎస్ బంధం కీలకమని వైట్‌హౌస్ వర్గాలు వ్యాఖ్యానించాయి. బ్రూనై, న్యూజిలాండ్, ఇటలీ, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో రిపబ్లిక్ డే ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్రాల్లో రిపబ్లిక్ డే సంబరాలు భారత 73వ గణతంత్ర సంబరాలు అన్ని రాష్ట్రాల్లో అంబరాన్నంటాయి. ఆయా రాష్ట్రాల ప్రజలకు గవర్నర్లు, ముఖ్యమంత్రులు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ సూత్రాలను కాపాడేందుకు పాటుపడతామని ప్రతిన పూనారు. కరోనా కారణంగా ప్రేక్షకుల సంఖ్యపై పలు రాష్ట్రాల్లో పరిమితులు విధించారు. కాశ్మీర్లో ప్రఖ్యాత లాల్‌చౌక్ క్లాక్ టవర్‌పై మువ్వన్నెల జెండాను ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు సాజిద్ యూసుఫ్, సాహిల్ బషీర్ పాల్గొన్నారు. ముందు జాగ్రత్తగా కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. లోయలో పుకార్లు వ్యాపింపజేసేవారిపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తన రిపబ్లిక్‌డే ప్రసంగంలో నిప్పులు చెరిగారు. రాజాంగ్య మౌలికతను కాపాడేందుకు ప్రతినపూనాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి ప్రజలను కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగితను తొలగిస్తామని హర్యానా సీఎం ఖటర్ ప్రతిజ్ఞ చేశారు. పెట్రోల్‌పై సబ్సిడీని జార్ఖండ్ సీఎం సోరెన్ ప్రకటించారు. మహిళా శిశువుల కోసం ప్రత్యేక పథకం తెస్తామని చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ చెప్పారు. కేరళలో మంత్రి అహ్మద్ తలకిందులుగా జాతీయజెండాను ఆవిష్కరించడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్రాభివృద్ధికి తీసుకునే చర్యలను మేఘాలయ ముఖ్యమంత్రి వివరించారు. మధ్యప్రదేశ్‌లో మద్యనిషేధం ఆవశ్యకతను ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ నొక్కిచెప్పారు. రెండేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నోవిజయాలు సాధించిందని మహారాష్ట్ర గవర్నర్ చెప్పారు. కేంద్రం తిరస్కరించిన శకటాన్ని తమిళనాడు ప్రభుత్వం మెరీనా బీచ్‌లో ప్రదర్శించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో రిపబ్లిక్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలో సీఎం అరవింద్, లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ స్వతంత్య్ర యోధుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. సీమా భవానీ బృందం విన్యాసాలు పెరేడ్లో బీఎస్ఎఫ్కు చెందిన మహిళా జవాన్లతో కూడిన సీమా భవానీ మోటర్‌సైకిల్ టీమ్ చేసిన విన్యాసాలు వీక్షకులను మంత్రముగ్దులను చేశాయి. ప్రముఖులంతా ఈ బృందానికి నిల్చొని చప్పట్లతో గౌరవం ప్రకటించారు. భారతీయ ఐక్యతను ప్రతిబింబించేలా 485 మంది డాన్సర్లతో నిర్వహించిన భారీ ప్రదర్శన కూడా అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకలకు గుర్తుగా 75 యుద్ధ విమానాలు ఆకాశ వీధిలో విన్యాసాలు చేశాయి. విమానాలు గగనతలంలో విన్యాసాలు చేస్తుండగా, కాక్‌పిట్ నుంచి చిత్రీకరించిన వీడియోలను వాయుసేన ప్రదర్శించింది. ఆకాశంలో విమాన విన్యాసాల ప్రత్యక్ష ప్రసారం ఇదే తొలిసారి. వేడుకలకు దాదాపు 5వేల మంది హాజరయ్యారు. కరోనా పూర్వం ఈ వేడుకలకు దాదాపు లక్షమంది వచ్చేవారు. వీక్షకులంతా కరోనా నిబంధనలు పాటించారు. అలాగే వీక్షకులు సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. వేడుకలకు భద్రతా బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. నగరం మొత్తాన్ని పోలీసులు దిగ్భంధనం చేశారు. -
రీల్ మీదకు రానున్న ‘రియల్ హీరో’ల బయోపిక్స్
కంటి నిండా నిదుర ఉండదు.. సేద తీరే తీరిక ఉండదు. కుటుంబంతో గడిపే సమయం ఉండదు... ఒక్కటే ఉంటుంది.. ‘దేశం మీద ప్రేమ’ ఉంటుంది. అందుకే నిదుర లేకుండా కాపలా కాస్తారు. చల్లగాలికీ సేద తీరరు. దేశమే కుటుంబం అనుకుంటారు. దేశం కోసం ప్రాణాలు వదులుతారు. అందుకే ‘సెల్యూట్ సైనికా’. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి, పోరాడిన వీర జవాన్లను ‘గణతంత్ర దినోత్సవం’ సందర్భంగా స్మరించుకుందాం. రీల్ మీదకు రానున్న ఈ ‘రియల్ హీరో’ల బయోపిక్స్ గురించి తెలుసుకుందాం. బయోపిక్స్‌కి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అందులోనూ దేశం కోసం పోరాడిన సైనికుల జీవిత చిత్రాలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. చరిత్ర చెప్పే ఈ చిత్రాలు చలన చిత్ర చరిత్రలోనూ ఓ చరిత్రగా మిగిలిపోతాయి. దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను అడివి శేష్ చేశారు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం వచ్చే నెల 11న విడుదల కావాల్సింది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. సందీప్ పోరాటం ఈ తరానికి తెలుసు. ఇక ముందు తరానికి చెందినవారిలో 1971 భారత్–పాక్ యుద్ధం గురించి తెలియనివారు ఉండరు. ఈ యుద్ధంలో పోరాడిన వీరుల నేపథ్యంలో మూడు నాలుగు చిత్రాలు నిర్మాణంలో ఉండటం విశేషం. భారత్–పాక్ యుద్ధంలో పోరాడిన సాహసోపేత సైనికుడు ‘సామ్ మానెక్ షా’ (పూర్తి పేరు సామ్ హోర్ముస్జీ ఫ్రేంజీ జెమ్షెడ్జీ మానెక్ షా) ఒకరు. ఈ యుద్ధంలో ఆర్మీ చీఫ్‌గా భారత్‌కు పెద్ద విజయాన్ని సాధించిపెట్టిన ఘనత మానెక్ షాది. మొత్తం ఐదు యుద్ధాల్లో పాల్గొన్న వీరుడు మానెక్ షా. ఆయన జీవితం ఆధారంగా విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సామ్ బహదూర్’. అలాగే 1971 భారత్ – పాక్ యుద్ధంలో పోరాడిన ఓ వీర జవాను బ్రిగేడియర్ బల్‌రామ్‌సింగ్ మెహతా. ఈ యుద్ధంలో తన తోబుట్టువులతో కలిసి తూర్పు వైపున పోరాడారు మెహతా. ఆయన జీవిత కథతో రూపొందుతున్న చిత్రం ‘పిప్పా’. బల్రామ్ సింగ్ మెహతా పాత్రను ఇషాన్ కట్టర్ చేస్తున్నారు. రాజా కృష్ణ మీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. బల్రామ్ సింగ్ మెహతా స్వయంగా రాసిన ‘ది బర్నింగ్ చౌఫిస్’ (2016) పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి బల్రామ్ సింగ్ మోహతాను కూడా చిత్రబృందం ఆహ్వానించింది. 1971 యుద్ధంలోనే పోరాడిన అరుణ్ ఖేతర్పాల్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఇక్కీస్’. యుద్ధంలో వీరమరణం పొందారు ఖేతర్పాల్. పరమవీర చక్ర సాధించిన యువసైనికుడు ఆయన. ఈ సైన్యాధికారి పాత్రను వరుణ్ ధావన్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ దర్శకుడు. ఇక కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న ‘కెప్టెన్ ఇండియా’ కూడా యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమే. అయితే ఇది జీవిత కథ కాదు. దేశ చరిత్రలో ఓ కీలక రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కార్తీక్ పైలెట్‌గా చేస్తున్నారు. దేశభక్తి సినిమా కాదు కానీ... ‘‘ఆర్ఆర్ఆర్’ దేశభక్తికి సంబంధించిన సినిమా కాదు. స్నేహం మీద ఆధారపడిన సినిమా. దేశభక్తి అంతర్లీనంగా కనిపిస్తూ, స్నేహం గురించి చెప్పిన కథే ఈ సినిమా’’ అని దర్శకుడు రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది? అనే కల్పిత కథతో ఈ సినిమా తీశారు. అయితే అంతర్లీనంగా దేశభక్తి కనిపించే సినిమా కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటించారు. ఈ భారీ పాన్ ఇండియన్ సినిమాపై అందరి దృష్టి ఉంది. కరోనా పరిస్థితుల కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ‘‘దేశవ్యాప్తంగా థియేటర్స్‌లో వంద శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ ఉన్నట్లయితే మా సినిమాను ఈ ఏడాది మార్చి 18న విడుదల చేస్తాం. లేకపోతే ఈ ఏడాది ఏప్రిల్ 28న చిత్రం విడుదలవుతుంది’’ అని చిత్ర బృందం ఇటీవల అధికారికంగా ప్రకటించింది. మొత్తం 14 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇంకా పలు దేశభక్తి చిత్రాలు వెండితెరకు వచ్చే అవకాశం ఉంది. ఈ తరహా చిత్రాలు ఎన్ని వస్తే అంత మంచిది. ఎందుకంటే సినిమా శక్తిమంతమైన మాధ్యమం కాబట్టి చరిత్ర సులువుగా యువతరానికి చేరుతుంది. -
సైన్యంలో పురుషాధిక్యతకు పగ్గాలు!
వైద్యం కోసం కాకుండా... షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆర్మీలోకి మహిళలు మొట్టమొదట ప్రవేశించి 30 సంవ త్సరాలు అవుతోంది. 1992లో తొలి మహిళా ఆర్మీ ఆఫీసర్లు సర్వీసులోకి అడుగుపెట్టారు. అలా మొదలై ఈ దేశపు మహిళలు దేశ రక్షణ రంగంలో బలంగా కాలుమోపేందుకు... న్యాయమైన తమ హక్కులను సాధించుకునేందుకు ఇప్పుడు వీలు పడింది. అంటే, ఇంత సమయం కావాల్సి వచ్చిందన్న మాట. సుప్రీం కోర్టు గత ఏడాది ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు పుణ్యమా అని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) తలుపులు ఇప్పుడు మహిళలకూ బార్లా తెరుచుకున్నాయి. ఎన్డీఏలో సీట్ల కోసమే కాకుండా... ఆర్మీ తదితర సర్వీసుల్లోనూ పర్మనెంట్ కమిషన్ కోసమూ ఇప్పుడు మహిళలు పోటీ పడవచ్చు. యుద్ధరంగంలోనూ దిగేందుకు మార్గం సుగమ మైంది. ఈ జనవరి 15వ తేదీ నిర్వహించిన ఆర్మీ డే నిజంగా సంబరాలు చేసుకోవాల్సిన దినమే. త్రివిధ దళాల్లో మహిళల పాత్ర పెరిగే దిశగా ఇంకో ముందడుగు వేశాం మరి! నిజానికి సైనిక బలగాల కూర్పులో గుణాత్మక, పరిమా ణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడం ఈ రోజు ఉన్న పరి స్థితులకు చాలా అవసరం కూడా! లీగల్, ఎడ్యుకేషన్ కోర్లతో పాటు 2008 నుంచి మహిళలు పర్మినెంట్ కమిషన్ ఆఫీసర్లుగా నియమితులవుతున్నా, 2020 నుంచి ఇది ఇంకో ఎనిమిది యుద్ధేతర రంగాలకు విస్తరించినా, మహిళల భాగస్వామ్యం పెద్దగా పెరిగిందేమీ లేదు. ఇండియన్ ఆర్మీలో వైద్య సేవల విభాగాన్ని మినహాయిస్తే 2020 నాటికి మహిళల శాతం కేవలం మూడు మాత్రమే. అగ్రరాజ్యం అమెరికాలో ఇది 16 శాతం వరకూ ఉంటే, ఫ్రాన్స్‌లో 15 శాతం, రష్యా, బ్రిటన్లలో పది శాతం వరకూ ఉంది. ఆర్మీలో మహిళల భాగస్వామ్యం పెరగడం చాలా రకా లుగా ప్రయోజనకరం. ముందుగా చెప్పుకోవాల్సింది ఆఫీసర్ల కొరత! ఆర్మీలో 7,476 మంది ఆఫీసర్ల కొరత ఉందని నెల రోజుల క్రితం దేశ రక్షణ శాఖ సహాయ మంత్రి స్వయంగా రాజ్యసభలో తెలిపారు. యువత ఆర్మీలో చేరేందుకు కొంత విముఖత చూపుతూండటం ఈ కొరతకు కారణం. గతంలో మాదిరిగా ఆర్మీ అధికారుల సంతానం కూడా సర్వీసుల్లోకి చేరడం తగ్గిపోతోంది. కొన్ని దశాబ్దాలుగా వీరు ఇతర కార్పొరేట్ ఉద్యోగాల్లోకి చేరిపోతున్నారు. అయితే ఇప్పుడు ఆడపిల్లలకూ పర్మనెంట్ కమిషన్ లభించే అవకాశం ఏర్పడినందున చాలామంది ఆఫీసర్ల కుమార్తెలు ఈ వృత్తిని ఎంచుకునే అవకాశాలున్నాయి. ఈ మార్పుతో ఆర్మీలో చిలిపి తనం పేర ఇప్పటివరకూ కొనసాగుతూ వస్తున్న పురుషాధిక్య భావజాలం కూడా కొంతమేరకైనా తగ్గే అవకాశం ఉంది. కొన్నేళ్ల క్రితం ఓ ఆర్మీ ఉన్నతాధికారిని ఇంటర్వ్యూ చేసిన ప్పుడు ఆర్మీలోకి మహిళలు చేరడంపై పరోక్షంగా తన అభిప్రా యాలను ఆయన కుండబద్దలు కొట్టాడు. ఒకానొక సంద ర్భంలో వేరెవరూ లేకుండా ఒక పురుష, మహిళ ఆర్మీ అధికారులిద్దరే బేస్ క్యాంప్‌లో ఉండాల్సిన పరిస్థితిని తాను ఉద్దేశపూర్వకంగా తప్పించానని చెప్పుకొచ్చాడు. కొంత కాలం తరువాత ఈ విషయం ఆ మహిళా ఆఫీసర్‌కు తెలిసి, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందట. అయితే దాని ప్రభావం ఈ ఆర్మీ ఆఫీసర్‌పై ఏమీ పడలేదు. ఉన్నతాధికారి చర్య తనపై ఆయనకున్న అపనమ్మకానికి ప్రతీక అని మహిళా అధికారి వాపోయింది. కానీ ఆర్మీ నైతిక విలువలకు ఇదో తార్కాణమని ఆ ఉన్నతాధికారి తన చర్యను సమర్థించుకున్నాడు. 2020 ఫిబ్రవరిలో పురుషులతో సమానంగా మహిళలకూ కమాండ్ స్థానాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్పుడు, మహిళలకు అలాంటి పాత్రలు ఇవ్వడంపై మిలటరీ వ్యక్తం చేసిన అభ్యంతరాలన్నింటికీ చెక్ పెట్టినట్లు అయ్యింది. ఆదేశాలు జారీ చేసే స్థానాన్ని మహిళలకు ఇవ్వడం ఆచరణ లోనూ, సంస్కృతీ సంప్రదాయల పరంగానూ సరికాదన్న అభ్యంతరం దుర్విచక్షణతో కూడినదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏది ఏమైతేనేం. మహిళలు ఇప్పుడు యుద్ధ రంగం లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈలోపు వారు మరి కొన్ని అడ్డంకులను అధిగమించాల్సి ఉంది. ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే ఇటీవల ఎన్డీఏ పెరేడ్‌ను సమీక్షిస్తూ చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలి. ఆర్మీలో మహిళల ప్రవేశా నికి సంబంధించి సుప్రీం తీర్పును ఆయన శ్లాఘించారు. ఆర్మీలో లింగ సమానత్వానికి ఇది దారి తీస్తుందని స్పష్టం చేశారు. ‘‘ఇంకో 40 ఏళ్ల తర్వాతైనా.. వాళ్లు ఇప్పుడు నేనున్న స్థానంలో ఉంటారు’’ అని నరవాణే వ్యాఖ్యానించడం స్త్రీలకు భరోసానిచ్చే విషయమే. ఆర్మీ చీఫ్ స్థానానికి ఒక మహిళ ఎదిగేందుకు మరో నలభై ఏళ్లు పడుతుందో, లేదో చెప్పలేము కానీ.. ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన నేను మాత్రం నాలుగేళ్ల తర్వాత ఎన్డీఏ పాసింగ్ అవుట్ పెరేడ్‌ను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని మాత్రం చెప్పగలను. పురుషు లతో సమానంగా యుద్ధరంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్న మహిళ ఆర్మీ ఆఫీసర్ల కళ్లల్లో రేపటిపై విశ్వాసం, భుజ స్కంధాలపై ఆర్మీ చిహ్నాలు చూడడం గర్వకారణం కూడా! – సునందా మెహతా, రచయిత్రి, పాత్రికేయురాలు (ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో) -
ఆ బాలుడ్ని అప్పగించండి: చైనాను కోరిన ఇండియన్ ఆర్మీ
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్- చైనా సరిహద్దుల్లో తప్పిపోయిన బాలుడు మీరామ్ టారోన్‌ను తమకు అప్పగించాలని భారత సైన్యం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) కోరినట్లు రక్షణ శాఖ వర్గాలు గురువారం పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల మీరామ్ టారోన్ అనే బాలుడుని చైనా ఆర్మీ.. కిడ్నాప్ చేసిందని అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తపిర్ గావో బుధవారం ఆరోపించారు. భారత భూభాగంలోని సియాంగ్ జిల్లాలో అతను అపహరణకు గురైనట్లు తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న భారత ఆర్మీ.. హాట్‌లైన్ సాయంతో మీరామ్ టారోన్ విషయాన్ని పీఎల్ఏకు తెలిపింది. బాలుడుని పట్టుకొని ప్రొటోకాల్ ప్రకారం తమకు అప్పగించాలని ఇండియన్ ఆర్మీ.. చైనా సైన్యాన్ని కోరింది. మూలికలు సేకరించడానికి, వేటుకు వెళ్లిన సదరు బాలుడు దారితప్పిపోయిడంతో అదృశ్యం అయినట్లు తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో త్సాంగ్పో నది భారతదేశంలోకి ప్రవేశిస్తుందని అక్కడ బాలుడు అపహరణకు గురైనట్లు ఎంపీ తపిర్ గావో తెలిపారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. రిపబ్లిక్ డేకు కొన్ని రోజల ముందే భారతదేశానికి చెందిన ఓ బాలుడిని చైనా కిడ్నాప్ చేసిందని, దీనిపై ప్రధాని మోదీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. బాలుడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ట్వీటర్లో పేర్కొన్నారు. -
Army Day 2022: ఇండియన్ ఆర్మీ కొత్త యూనిఫాం ఇదే!
న్యూఢిల్లీ: మన ఆర్మీ యూనీఫాం మారబోతోంది. సౌకర్యవంతమైన, వాతావరణ అనుకూలమైన, డిజిటల్ డిస్రప్టీవ్ ప్యాట్రన్‌లో కొత్త యూనీఫాంను ఇండియన్ ఆర్మీ శనివారం ఆవిష్కరించింది. కొత్త యూనీఫాంలను ధరించిన ప్యారాచూట్ సైనిక దళం నిన్న (శనివారం) ఆర్మీ డే పరేడ్‌లో పాల్గొన్నారు. భారత ఆర్మీ కొత్త యూనీఫాం రూపురేఖల విశేషాలు ఇవే.. ►ఆలివ్, మట్టి రంగులతో సహా వివిధ రంగుల సమ్మేళనంతో రూపొందించిన కొత్త యూనిఫాం, దళాల వ్యూహరచన ప్రాంతాలు, వివిధ వాతావరణ పరిస్థితులు వంటి అంశాల దృష్ట్యా రూపొందించడం జరిగింది. ►నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీతో కలిసి వివిధ దేశాల ఆర్మీల యూనిఫాంలను విశ్లేషించిన అనంతరం కొత్త యూనిఫాంలను రూపొందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ►ఈ యూనిఫాం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, అన్ని రకాల వాతావరణాల్లో ధరించవచ్చని తెలిపారు. కంప్యూటర్ సహాయంతో డిజిటల్ డిస్రప్టివ్ ప్యాటర్న్‌లో ప్రత్యేకంగా రూపొందించారు. ►కొత్త యూనిఫాంలోని షర్టును, ట్రౌజర్‌లో టక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇకపై మన ఆర్మీ డ్రెస్ ఇన్‌షర్ట్ లేకుండా ఉండబోతుందన్నమాట. ►కొత్త ఆర్మీ యూనిఫామ్‌లు బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉండవని సంబంధిత వర్గాలు తెలిపాయి. #WATCH | Delhi: Indian Army’s Parachute Regiment commandos marching during the Army Day Parade in the new digital combat uniform of the Indian Army. This is the first time that the uniform has been unveiled in public. pic.twitter.com/j9D18kNP8B — ANI (@ANI) January 15, 2022 -
గల్వాన్‌లో మువ్వన్నెల జెండా
న్యూఢిల్లీ: లద్దాఖ్‌లోని గల్వాన్‌లోయలో భారీ భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తున్న ఆర్మీ బలగాల ఫొటోలను రక్షణ వర్గాలు విడుదల చేశాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా భారత సైనిక బలగాలు లోయలో భారత జెండాతో ప్రదర్శన నిర్వహించాయి. ఈ లోయ తమ అదీనంలో ఉన్నట్లు చూపుతూ చైనా ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలను తిప్పికొట్టేందుకే భారతీయ రక్షణ వర్గాలు తాజా ఫొటోలు విడుదల చేశాయి. చైనా బలగాలు చైనా జాతీయ జెండాతో గల్వాన్‌లోయలో ఉన్నట్లు చూపే చిత్రాలను ఆదేశం మూడు రోజుల కిందట విడుదల చేసింది. దీంతో ఈ ప్రాంతం మొత్తం చైనా అధీనంలోకి వచ్చిందన్న దుమారం రేగింది. అయితే ఇవన్నీ చైనా వక్రబుద్ధికి చిహ్నాలని, ఆ ప్రాంతంపై చైనా పట్టు లేదని కేంద్రం వివరణ ఇచ్చింది. చైనా విడుదల చేసిన చిత్రాలు గల్వాన్ లోయ అవతలి ప్రాంతంలోనివని, ఫొటోల్లోని ప్రాంతం నిస్సైనిక మండలం దగ్గరలో లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో భారతీయ ఆర్మీ గల్వాన్‌లోయలో ఉన్న చిత్రాలు విడుదలయ్యాయి. న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు సైతం తన ట్విట్టర్ అకౌంట్లో ఈ చిత్రాలను పోస్ట్ చేశారు. నూతన సంవత్సర సందర్భంగా గల్వాన్‌లోయలో వీర భారతీయ సైనికులు అని ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు. భారతీయ వర్గాలు విడుదల చేసిన ఫొటోలను ఈనెల 1న గల్వాన్‌లోయలో తీసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒక ఫొటోలో అసాల్ట్ రైఫిళ్లు ధరించిన దాదాపు 30 మంది భారతీయ సైనికులు జాతీయ జెండాను ప్రదర్శిస్తున్నారు. మరో ఫొటోలో నలుగురు సైనికులు భారతీయ జెండాను ప్రదర్శిస్తున్నారు. ఇందులో డోగ్రా రెజిమెంట్ జెండా కూడా కనిపిస్తోంది. నూతన సంవత్సర సందర్భంగా సరిహద్దుల్లో భారతీయ రక్షణ వర్గాలు చైనా సైనికులకు స్వీట్లు పంచి సహృద్భా వం చాటారు. కానీ చైనా మాత్రం కుయుక్తితో నకిలీ ఫొటోలను, అభూత వీడియోను విడుదల చేసింది. -
డ్రాగన్ దుష్ట పన్నాగాలు
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా మరోసారి తన యుద్ధకాంక్షను బయటపెట్టింది. రణక్షేత్రంలో తమకు ఎదురు నిలిచే దేశంపై పైచేయి సాధించేందుకుగాను సరిహద్దులకు వేగంగా సైన్యాన్ని, శతఘ్నులను తరలించేందుకు పటిష్ట ప్రణాళికలతో దూసుకెళ్తోంది. భారత్–చైనా మధ్య 18 నెలలుగా తీవ్ర ఉద్రిక్తంగా తయారైన తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ ప్రాంతంలో ఒక వంతెనను నిర్మించింది. ప్యాంగాంగ్ త్సో సరస్సు ఉత్తర, దక్షిణ తీరాలను కలుపుతూ ఈ బ్రిడ్జిని యుద్ధప్రాతిపదికన నిర్మించారని తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా బహిర్గతమైంది. భారత్‌తో ఘర్షణ తలెత్తితే హుటాహుటిన సైన్యాన్ని, భారీ ఆయుధాలను, యుద్ధ సామగ్రిని తరలించాలనే ఎత్తుగడతోనే చైనా దీన్ని నిర్మించిందని శాటిలైట్ ఫొటోలకు సంబంధించిన జియో ఇంటెలిజెన్స్ నిపుణుడు డామిన్ సైమన్ విశ్లేషించారు. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణం వైపున ఉన్న కైలాస్ శిఖరాలను ముందుగా చేరుకుని గత ఏడాది భారత సేనలు అక్కడ పట్టు సాధించాయి. దీంతో భవిష్యత్తులో భారత సైన్యానికి దీటుగా స్పందించేందుకే సైన్యం మోహరింపునకు వీలుగా కొత్త వంతెనను చైనా సిద్ధం చేసిందని తెలుస్తోంది. కొత్త వంతెన ద్వారా అదనపు ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో సైన్యాన్ని రంగంలోకి దింపి చైనా బరితెగించనుంది. 2020 తొలినాళ్ల నుంచే భారత్, చైనా చెరో 50 వేల సైన్యాన్ని తూర్పు లద్దాఖ్‌లో మోహరించాయి. 2020 జూన్‌లో గల్వాన్ నదీ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైన్యం ఘర్షణల్లో 40 మందికి పైగా చైనా సైనికులు మరణించారు. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు. దాదాపు ఏడాదిపాటు తూర్పు లద్దాఖ్‌లో తీవ్ర ఉద్రిక్తత రాజ్యమేలింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీల చర్చల తర్వాత ఘర్షణ జరిగిన ప్రాంతం నుంచి రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్లాలని ఇరుదేశాల సైన్యాలు నిర్ణయించాయి. అటు వైపే బ్రిడ్జి కట్టారు సరిహద్దు వెంట చైనా అధీనంలోని ప్రాంతంలోనే బ్రిడ్జి నిర్మాణం జరిగిందని భారత ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. రెండు కి.మీల. నిస్సైనిక ప్రాంతంలో ఈ వంతెనను నిర్మించలేదని, గల్వాన్ ఘర్షణల తర్వాత కుదిరిన ఒప్పందాలను చైనా ఉల్లంఘించలేదని భారత సైనిక వర్గాలు తెలిపాయి. అంగుళం కూడా వదులుకోం: గ్లోబల్ టైమ్స్ కొత్త సంవత్సరం మొదలైన కొద్ది గంటలకే గల్వాన్ లోయ తమదేనంటూ తమ జాతీయ జెండాను చైనా గల్వాన్‌లో ఎగరేసిందని ఆ దేశ జాతీయ మీడియా సంస్థలు సంబంధిత వీడియోను ప్రముఖంగా ప్రసారం చేశాయి. ‘ఒక్క అంగుళం నేల కూడా వదులుకునేది లేదు’ అనే సందేశాన్ని చైనా సైనికులు తమ పౌరులకు కొత్త సంవత్సర కానుకగా పంపించారని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ట్వీట్ చేసింది. దీంతో విపక్షాలు మోదీ సర్కార్‌పై మండి పడ్డాయి. ‘గల్వాన్ లోయకు మన త్రివర్ణ పతాకమే సరిగ్గా సరిపోతుంది. ప్రధాని మౌనదీక్షను వీడి చైనా ఆక్రమణలపై మా ట్లాడాలి’ అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. 🇨🇳China’s national flag rise over Galwan Valley on the New Year Day of 2022. This national flag is very special since it once flew over Tiananmen Square in Beijing. pic.twitter.com/fBzN0I4mCi — Shen Shiwei沈诗伟 (@shen_shiwei) January 1, 2022 (చదవండి: మీ మనసులోకి తొంగి చూడలేను.. శిక్ష అనుభవించాల్సిందే!) (చదవండి: దక్షిణాఫ్రికా ‘పార్లమెంట్’లో అగ్ని ప్రమాదం) -
మీ సైనికుడి మృతదేహాన్ని తీసుకెళ్లండి: ఇండియన్ ఆర్మీ
శ్రీనగర్: తమ దేశ సైనికుడి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని పాకిస్తాన్‌కు భారత్ ఆర్మీ తెలిపింది. శనివారం నియంత్రణ రేఖ వద్ద చోటు చేసుకున్న చొరుబాటును భారత్ ఆర్మీ ముందుగానే పసిగట్టి కాల్పులు జరిపింది. కెరాన్ సెక్టర్లో నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల్లో పాక్ ఆర్మీ బోర్డర్ యాక్షన్ టీమ్‌కు చెందిన సైనికుడు మృతి చెందినట్లు మేజర్ జనరల్ ఏఎస్ పెంధార్కర్ పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి మహ్మద్ షబీర్ మాలిక్‌గా గుర్తించామని తెలిపారు. పాకిస్తాన్ వైపున భారత చొరబాటు నిరోధక వ్యవస్థ ఉన్న చోట ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. భారత్‌లోకి చొరబడటానికి ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు. అయితే భారత్ సైనికులు జరిపిన కాల్పులో ఓ వ్యక్తి మృతి చెందాడని తెలిపారు. అతని వద్ద ఏకే రైఫిల్, మందుగుండు సామాగ్రి, 7గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని స్పష్టంగా తెలుస్తోందని తెలిపారు. మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని పాక్‌కు సమాచారం అందిచినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి వద్ద పాకిస్తాన్ జాతీయ గుర్తింపు కార్డు, పాక్ వైద్యశాఖ జారీ చేసిన కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు లభ్యమైనట్లు పేర్కొన్నారు. అందులోని ఫోటోలో సదరు వ్యక్తి పాక్ ఆర్మీ దుస్తుల్లో కనిపిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఇరుదేశాల మధ్య ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘింగిచే చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. -
యుద్ధ క్షేత్రాల్లో ఆర్మీకి కొత్త యూనిఫాం
న్యూఢిల్లీ: యుద్ధక్షేత్రాల్లో సైనిక బలగాలకు మరింత తేలికైన, మన్నికైన యూనిఫాం సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి భారత ఆర్మీకి ఈ కొత్త యూనిఫామ్‌ను అందజేయనున్నట్లు సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. వేసవి, చలికాలాల్లో మరింత సౌకర్యవంతంగా ఉండేలా దీనిని తయారుచేశారు. మంచు, అటవీ ప్రాంతాల పరిసరాల రంగుల్లో కలిసిపోయేలా ఉండే రంగులను యూనిఫామ్ కోసం ఎంపికచేశారు. బలగాలను కాస్త దూరం నుంచి చూస్తే పసిగట్టకుండా ఉండేందుకు ఆయా రంగుల్లో డిజైన్‌ను ఎంపికచేశారు. ఆలివ్, మృణ్మయ రంగుల కలబోతగా ‘డిజిటల్ డిస్ట్రర్బ్’ డిజైన్‌లో ఈ యూనిఫామ్‌ను రూపొందించారు. వచ్చే ఏడాది జనవరి 15న జరిగే ఆర్మీ డే పరేడ్‌లో తొలిసారిగా అధికారికంగా దీనిని ప్రదర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సైనికులకు యుద్ధక్షేత్రాల్లో వినియోగిస్తున్న వేర్వేరు డిజైన్ల ఆర్మీ యూనిఫామ్‌లను పరిశీలించి, పలు చర్చల అనంతరం ఈ యూనిఫామ్‌కు తుదిరూపునిచ్చారు.