భారతదేశంలో ఎక్కువమంది వాహన ప్రియులకు ఇష్టమైన కార్లలో మహీంద్రా అండ్ మహీంద్రా కార్లు చెప్పుకోదగ్గవి. కేవలం రోజు వారి వినియోగానికి, ఆఫ్ రోడింగ్ చేయడానికి మాత్రమే కాకుండా భారత సైన్యం కోసం కూడా కంపెనీ వాహనాలను సిద్ధం చేసి డెలివరీలను ప్రారంభించింది. మహీంద్రా సాయుధ వాహనాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మహీంద్రా యాజమాన్యంలో ఉన్న మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ (MDS) భారత సాయుధ దళాలకు ఆర్మడో వాహనాల డెలివరీలను ప్రారంభించింది. ఆర్మడో అనేది ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్స్ (ALSV). ఇవి పూర్తి భారతదేశంలోనే రూపుదిద్దుకున్నాయి. కావున పటిష్టమైన భద్రత లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి అధిక తీవ్రత ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్, స్పెషల్ ఫోర్స్ ఆపరేషన్, క్విక్ రియాక్షన్ టీమ్స్ ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటాయి. సరిహద్దు భూభాగాల్లో, ఎడారి ప్రాంతాల్లో దాడులకు ఉపయోగించడానికి కూడా అవి ఉపయోగపడతాయి.
ఇంజిన్
మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్ ఆర్మడో వాహనాలు 3.2 లీటర్, టర్బోచార్జ్డ్, డైరెక్ట్-ఇంజెక్షన్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 215 హార్స్ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఈ వెహికల్స్ కేవలం 12 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వేగవంతమవుతాయి. గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లు. పేలోడ్ కెపాసిటీ 1000 కేజీలు కావడం గమనార్హం.
(ఇదీ చదవండి: ఈ సైకిల్ కొనే డబ్బుతో కారు కొనేయొచ్చు! ధర ఎంతో తెలుసా?)
ఆర్మడో వెహికల్ బిల్‌స్టెయిన్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ కలిగి 318/80 ఆర్17 టైర్లను పొందుతుంది. టైర్లలో గాలి లేకుండా పోయినా 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల కెపాసిటీ కలిగి ఉంటాయి. ఇందులో పవర్ స్టీరింగ్ సిస్టమ్ ఉంటుంది, కావున లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ లేదా రైట్ హ్యాండ్ డ్రైవ్ కాన్ఫిగర్ చేయవచ్చు.
(ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా వైరల్ ట్వీట్.. నితిన్ గడ్కరీ జీ అంటూ..!!)
ఫీచర్స్
ఇంటీరియర్ విషయానికి వస్తే, లోపల డ్రైవర్‌తో సహా ఆరుగురు ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది, అవసరమైతే ఎనిమిది మంది కూర్చునేలా సీట్లు కాన్ఫిగర్ చేయవచ్చు. ఇది పబ్లిక్ అడ్రస్ (PA) సిస్టమ్, జీపీఎస్ (GPS), ఆటోమేటిక్ గ్రెనేడ్ లాంచర్, ఎలక్ట్రిక్ వించ్, HF/UHF/VHF రేడియోతో పాటు సెల్ఫ్-క్లీనింగ్-టైప్ ఎగ్జాస్ట్ స్కావెంజింగ్ వంటి వాటిని పొందుతుంది. మహీంద్రా వాహనాల డెలివరీకి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి ఆనంద్ మహీంద్రా ట్విటర్ ద్వారా కూడా షేర్ చేశారు.
My gratitude to Sukhvinder Hayer & his entire team who made this project a reality through their patience, persistence & passion… 👏🏽👏🏽👏🏽 pic.twitter.com/wYttXVMKKq
— anand mahindra (@anandmahindra) June 17, 2023
Comments
Please login to add a commentAdd a comment