
రూ. 446 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం అజీమ్ ప్రేమ్‌జీ పెట్టుబడుల సంస్థ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ తాజాగా 9 కంపెనీలలో వాటాలు కొనుగోలు చేసింది. జాబితాలో భారతీ ఎయిర్‌టెల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితరాలున్నాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఇందుకు రూ. 446 కోట్లకుపైగా వెచ్చించింది.
అనుబంధ సంస్థ పీఐ అపార్చునిటీస్ ఏఐఎఫ్ వీ ఎల్‌ఎల్‌పీ ద్వారా ఎయిర్‌టెల్‌లో 5.44 లక్షల షేర్లు, జిందాల్ స్టీల్‌లో 9.72 లక్షల షేర్లు, రిలయన్స్‌లో 5.7 లక్షల షేర్లు, ఇన్ఫోసిస్‌లో 3.28 లక్షల షేర్లు సొంతం చేసుకుంది.
ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంకులో 3.33 లక్షల షేర్లు, హిందాల్కోలో 8.13 లక్షల షేర్లు, అంబుజా సిమెంట్స్‌లో 5.14 లక్షల షేర్లు, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌లో 1.09 లక్షల షేర్లు, ఎస్‌బీఐ లైఫ్‌లో 84,375 షేర్లు చొప్పున కొనుగోలు చేసింది. ఒక్కో షేరునీ సగటున రూ. 477–1,807 ధరల శ్రేణిలో సొంతం చేసుకుంది. టారిష్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ఈ వాటాలు విక్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment