Azim Premji
-
రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?
భారతదేశం సర్వమత సమ్మేళనం.. కాబట్టి ఇక్కడ అనేక మతాల ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో ముస్లింల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వీరు (ముస్లింలు) కళ, సాహిత్యం, సైన్స్ వంటి వివిధ రంగాలలో తమదైన ముద్ర వేసినప్పటికీ.. వ్యాపార రంగంలో మాత్రం ఇతరులతో పోలిస్తే కొంత వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం మాత్రం దీనికి భిన్నం. ఎందుకంటే మూడు తరాలుగా వ్యాపార సామ్రాజ్యాన్ని పాలిస్తోంది.1947లో దేశ విభజన సమయంలో మహమ్మద్ అలీ జిన్నా.. అజీమ్ ప్రేమ్‌జీ తండ్రి 'మహ్మద్ ప్రేమ్‌జీ'ని పాకిస్తాన్‌కు రమ్మని ఆహ్వానించడమే కాకుండా.. అక్కడ ఆర్ధిక మంత్రి పదవిని కూడా ఇస్తామని చెప్పారు. కానీ మహ్మద్ ప్రేమ్‌జీ నిరాకరించి, భారతదేశంలో ఉండిపోయారు. నిజానికి మహ్మద్ ప్రేమ్‌జీ బియ్యం వ్యాపారి. ఈయన మొదట్లో మయన్మార్‌లో వ్యాపారం చేసేవారు. ఆ తరువాత 1940లో ఇండియాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. అజీమ్ ప్రేమ్‌జీ ముంబైలోనే 1945లో జన్మించారు.అజీమ్ ప్రేమ్‌జీ.. ఐటీ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు. ఈయన ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరు. ఫోర్బ్స్ ప్రకారం అజీమ్ ప్రేమ్‌జీ నికర విలువ రూ. లక్ష కోట్ల కంటే ఎక్కువ.ప్రాథమిక విద్యను భారతదేశంలోనే పూర్తి చేసిన అజీమ్ ప్రేమ్‌జీ.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు. ఆ సమయంలోనే అజీమ్ ప్రేమ్‌జీ అన్న ఫరూఖ్ ప్రేమ్‌జీ తన తండ్రి వ్యాపారం చూసుకోవడం మొదలుపెట్టారు. అయితే అతని వివాహానంతరం.. పాకిస్తాన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ముహమ్మద్ ప్రేమ్‌జీ మరణానంతరం.. అజీమ్ ప్రేమ్‌జీ అప్పులపాలైన కుటుంబ వ్యాపారాన్ని (చమురు వ్యాపారం) నిర్వహించాల్సి వచ్చింది. తన తెలివితో చమురు వ్యాపారాన్ని సంక్షోభం నుంచి బయటపడేశాడు. ఆ తరువాత దానిని విస్తరించడం మాత్రమే కాకుండా.. ఇతర రంగాలలోకి కూడా అడుగుపెట్టారు. ఇందులో భాగంగానే విప్రో కంపెనీ ప్రారంభించారు.ఇదీ చదవండి: బిలియనీర్ కుమార్తె జైలు కష్టాలు.. ఆహారం, నీరు ఇవ్వడానికి కూడా..భారతదేశంలో 19వ ధనవంతుడు.. ప్రపంచంలోని 195వ ధనవంతుడైన అజీమ్ ప్రేమ్‌జీ, ఉదారంగా విరాళాలు అందించడంలో కూడా ముందున్నారు. 2020- 2021ఆర్ధిక సంవత్సరంలో భారతదేశంలో ఎక్కువ విరాళాలు అందించిన వ్యక్తుల జాబితాలో.. ఈయన రూ. 9713 కోట్లు విరాళం అందించి అగ్రస్థానంలో నిలిచారు. దీన్ని బట్టి చూస్తే అజీమ్ ప్రేమ్‌జీ రోజుకు రూ. 27 కోట్లు విరాళంగా అందిస్తున్నట్లు తెలుస్తోంది. -
ప్రేమ్ జీ ఇన్వెస్ట్.. తిరుగులేని పోర్ట్‌ఫోలియో
అజీమ్ ప్రేమ్ జీ (Azim Premji) ఫ్యామిలీ ఆఫీస్ ఇన్వెస్ట్ మెంట్ విభాగమైన ప్రేమ్ జీ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ల్యాండ్ స్కేప్ లో తిరుగులేని సంస్థగా నిలదొక్కుకుంది. దీర్ఘకాలిక విలువ సృష్టిపై దృష్టి సారించిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీ, హెల్త్ కేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్జ్యూమర్ గూడ్స్ సహా వివిధ రంగాలకు చెందిన వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోను నిర్మించింది.ఇన్వెస్ట్ మెంట్ ఫిలాసఫీప్రేమ్ జీ ఇన్వెస్ట్ దీర్ఘకాలంలో వ్యాపారాలను నిర్మించడం, మద్దతు ఇవ్వడంపై కేంద్రీకృతమైన స్పష్టమైన పెట్టుబడి తత్వంతో పనిచేస్తుంది. బలమైన వృద్ధి సామర్ధ్యం ఉన్న కంపెనీలను గుర్తించడానికి, పెట్టుబడి పెట్టడానికి సంస్థ తన విస్తృతమైన నెట్వర్క్, లోతైన పరిశ్రమ నైపుణ్యాన్ని ఉపయోగిస్తుంది. 10 బిలియన్ డాలర్లకు పైగా ఎవర్ గ్రీన్ క్యాపిటల్ తో ప్రేమ్ జీ ఇన్వెస్ట్ ఇన్నోవేషన్ ను ప్రోత్సహించడానికి, సుస్థిర వృద్ధిని నడిపించడానికి కట్టుబడి పనిచేస్తోంది.కీలక పెట్టుబడులుటెక్నాలజీ: ప్రేమ్ జీ ఇన్వెస్ట్ ప్రముఖ ఐవేర్ రిటైలర్ లెన్స్ కార్ట్, టెక్ ఆధారిత సప్లై చైన్ ఫైనాన్సింగ్ కంపెనీ మింటిఫి సహా టెక్నాలజీ కంపెనీల్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడులు టెక్నాలజీ పరివర్తన శక్తి, ఆర్థిక వృద్ధిని నడిపించే సామర్థ్యంపై సంస్థ నమ్మకాన్ని ప్రతిబింబిస్తాయి.హెల్త్ కేర్: జీవన నాణ్యతను మెరుగుపరచడంలో, ఆర్థిక అభివృద్ధిని నడిపించడంలో ఈ రంగం కీలక పాత్రను గుర్తించిన ఈ సంస్థ హెల్త్ కేర్ కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టింది. ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ హెల్త్ కేర్ పోర్ట్‌ఫోలియోలో మెడికల్ ఇన్నోవేషన్, పేషెంట్ కేర్‌లో ముందంజలో ఉన్న కంపెనీలు ఉన్నాయి.ఫైనాన్షియల్ సర్వీసెస్: డిజిటల్ కన్జ్యూమర్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ క్రెడిట్‌బీ, టెక్నాలజీ ఫస్ట్ వెల్త్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ డెజెర్వ్ వంటి కంపెనీల్లో పెట్టుబడులతో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లో బలమైన ఉనికి ఉంది.కన్జ్యూమర్ గూడ్స్: అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులు, సేవలకు పెరుగుతున్న డిమాండ్ ను గుర్తించిన ఈ సంస్థ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ కన్జ్యూమర్ గూడ్స్ పోర్ట్ ఫోలియోలో ఆయా పరిశ్రమలలో అగ్రగామిగా ఉన్న, వృద్ధి, సృజనాత్మకతలో బలమైన ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీలు ఉన్నాయి.తాజాగా 9 కంపెనీలలో షేర్ల కొనుగోలుప్రేమ్జీ ఇన్వెస్ట్ తాజాగా 9 కంపెనీలలో షేర్లు కొనుగోలు చేసింది. ఈ జాబితాలో భారతీ ఎయిర్టెల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితరాలున్నాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఇందుకు రూ. 446 కోట్లకుపైగా వెచ్చించింది. అనుబంధ సంస్థ పీఐ అపార్చునిటీస్ ఏఐఎఫ్వీ ఎల్ఎల్పీ ద్వారా ఎయిర్‌టెల్‌లో 5.44 లక్షల షేర్లు, జిందాల్ స్టీల్‌లో 9.72 లక్షల షేర్లు, రిలయన్స్‌లో 5.7 లక్షల షేర్లు, ఇన్ఫోసిస్‌లో 3.28 లక్షల షేర్లు సొంతం చేసుకుంది.ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంకులో 3.33 లక్షల షేర్లు, హిందాల్కోలో 8.13 లక్షల షేర్లు, అంబుజా సిమెంట్స్‌లో 5.14 లక్షల షేర్లు, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌లో 1.09 లక్షల షేర్లు, ఎస్బీఐ లైఫ్‌లో 84,375 షేర్లు చొప్పున కొనుగోలు చేసింది. ఒక్కో షేరునీ సగటున రూ. 477–1,807 ధరల శ్రేణిలో సొంతం చేసుకుంది. టారిష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ఈ వాటాలు విక్రయించింది. -
ఐటీ దిగ్గజం భారీ పెట్టుబడి: ఏకంగా తొమ్మిది సంస్థలలో..
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం అజీమ్ ప్రేమ్‌జీ పెట్టుబడుల సంస్థ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ తాజాగా 9 కంపెనీలలో వాటాలు కొనుగోలు చేసింది. జాబితాలో భారతీ ఎయిర్టెల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితరాలున్నాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఇందుకు రూ. 446 కోట్లకుపైగా వెచ్చించింది.అనుబంధ సంస్థ పీఐ అపార్చునిటీస్ ఏఐఎఫ్ వీ ఎల్ఎల్పీ ద్వారా ఎయిర్‌టెల్‌లో 5.44 లక్షల షేర్లు, జిందాల్ స్టీల్‌లో 9.72 లక్షల షేర్లు, రిలయన్స్‌లో 5.7 లక్షల షేర్లు, ఇన్ఫోసిస్‌లో 3.28 లక్షల షేర్లు సొంతం చేసుకుంది.ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంకులో 3.33 లక్షల షేర్లు, హిందాల్కోలో 8.13 లక్షల షేర్లు, అంబుజా సిమెంట్స్‌లో 5.14 లక్షల షేర్లు, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌లో 1.09 లక్షల షేర్లు, ఎస్బీఐ లైఫ్‌లో 84,375 షేర్లు చొప్పున కొనుగోలు చేసింది. ఒక్కో షేరునీ సగటున రూ. 477–1,807 ధరల శ్రేణిలో సొంతం చేసుకుంది. టారిష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ఈ వాటాలు విక్రయించింది. -
ఆకాశ ఎయిర్‌లో ప్రేమ్‌జీ ఫ్యామిలీ ఆఫీసు పెట్టుబడులు
టెక్ దిగ్గజం అజీం ప్రేమ్‌జీ (Azim Premji), మణిపాల్ గ్రూప్ చీఫ్ రంజన్ పాయ్లకు చెందిన ఫ్యామిలీ ఆఫీసులు తాజాగా విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లో ఇన్వెస్ట్ చేశాయి. ఇందుకు సంబంధించి క్లేపాండ్ క్యాపిటల్ (రంజన్ పాయ్), ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, అసెట్ మేనేజ్మెంట్ సంస్థ 360 వన్ అసెట్ తదితర ఇన్వెస్టర్ల కన్సార్షియంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆకాశ ఎయిర్ వెల్లడించింది.ప్రమోటరు ఝున్‌ఝున్‌వాలా కుటుంబం కూడా మరింతగా మూలధనం సమకూర్చనున్నట్లు వివరించింది. ఎయిర్‌లైన్‌లో ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి ఇప్పటికే దాదాపు 40 శాతం వాటా ఉంది. కాగా పెట్టుబడి మొత్తం గురించి కానీ, ఎంత వాటాను విక్రయిస్తున్నది కానీ ఎయిర్‌లైన్ వెల్లడించలేదు. అయితే దాదాపు 125 మిలియన్ డాలర్లు సేకరించాలని యోచిస్తున్నట్లు సమాచారం.2023-24లో ఆకాశ ఎయిర్ నికర నష్టం రెండింతలు పెరిగింది. గత ఏడాది రూ.744 కోట్ల నుండి రూ.1,670 కోట్లకు చేరుకుంది. మరోవైపు దాని మొత్తం ఆదాయం 2022-23లో రూ.778 కోట్లతో పోలిస్తే 2023-24లో రూ.3,144 కోట్లకు చేరుకుంది. ఈ ఎయిర్‌లైన్‌లో ఝున్‌ఝున్‌వాలా కుటుంబంతో పాటు ముగ్గురు దూబే సోదరులు వినయ్ దూబే, సంజయ్ దూబే, నీరజ్ దూబే దాదాపు 30 శాతం వాటాను కలిగి ఉన్నారు.గత ఏడాది జనవరిలో, ఆకాశ ఎయిర్ అమెరికన్ విమాన తయారీ సంస్థ బోయింగ్‌తో 150 B737 మ్యాక్స్ విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఇది గతంలో ఆర్డర్ చేసిన 76 మ్యాక్స్ విమానాలకు అదనం. 76 విమానాలలో 27 ఇప్పటికే ఎయిర్‌లైన్‌కు డెలివరీ అయ్యాయి. -
ఆకాసాలో భారీ పెట్టుబడులకు చర్చలు
ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఆకాసా ఎయిర్‌లో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్ వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. రెండు సంస్థలు కలిపి రూ.1,049 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.భారత్‌లో విమానయాన ప్రయాణికులు పెరుగుతున్నారు. దాంతో చాలా కంపెనీలు దేశీయ రూట్లలో విమానాల సంఖ్యను పెంచుతున్నాయి. రానున్న రోజుల్లో టైర్1, 2, 3 సిటీల్లోని ప్రజలు విమానాల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతారని అంచనా వేస్తున్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లో ప్రయాణాలకు అనువైన మౌలికవసతులను అభివృద్ధి చేస్తున్నాయి. దీన్ని గమనించిన కొన్ని సంస్థలు విమానయాన కంపెనీల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగానే రూ.2,938 కోట్లు విలువైన ఆకాసా ఎయిర్‌లో తాజాగా అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం కన్సార్టియంగా ఉన్న ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, మణిపాల్ గ్రూప్‌కు చెందిన రంజన్‌పాయ్ ఆధ్వర్యంలోని క్లేపాండ్ క్యాపిటల్ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాయి. ఫలితంగా ఆకాసా ఎయిర్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: ప్రైవేట్ బ్యాంకుల్లో తగ్గుతున్న ‘అట్రిషన్’ఇదిలాఉండగా, ఇప్పటికే ఆ కంపెనీలో రాకేష్జున్జున్వాలా కుటుంబానికి గరిష్ఠంగా రూ.293 కోట్ల వాటా ఉంది. ఇప్పుడు ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్ కలిపి దాదాపు రూ.1,049 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇదే జరిగితే ఆకాసాలో మేజర్ వాటాదారులుగా ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్ వ్యవహరిస్తాయి. ఆకాసాలో ప్రస్తుతం 24 ఎయిర్‌క్రాఫ్ట్‌లున్నాయి. 202 విమానాలను ఆర్డర్ చేశారు. 27 నగరాలకు ప్రయాణికులను చేరవేస్తున్నారు. -
ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
సాఫ్ట్వేర్ దిగ్గజం అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం వివిధ విభాగాల్లో దాదాపు రూ.83వేలకోట్లు(10 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టింది. తాజాగా ప్రేమ్‌జీఇన్వెస్ట్ ఆఫీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల్లో పెట్టుబడులను పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు సంస్థతో సంబంధం ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు మీడియాకు తెలియజేశారు.ప్రైవేట్ ఈక్విటీ రంగంలో ఏఐ సాధనాలను ఉపయోగించిన మొట్టమొదటి అతిపెద్ద భారతీయ అసెట్ మేనేజ్మెంట్ సంస్థగా ప్రేమ్‌జీఇన్వెస్ట్ నిలిచింది. కంపెనీ ప్రస్తుతం ఏఐ క్వాంట్ మోడల్‌పై పని చేస్తోందని మేనేజింగ్ పార్ట్నర్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ టీకే కురియన్ తెలిపారు. అధికరాబడుల కోసం ఏఐటూల్స్‌ను వినియోగిస్తూ ఆయా కంపెనీల్లో తన పెట్టుబడులను సైతం పెంచుకోవాలనుకుంటుందని ఆయన చెప్పారు.బ్లాక్‌రాక్ ఇంక్., సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడి సంస్థలు మార్కెట్లోని డేటా స్ట్రీమ్‌లను విశ్లేషించడానికి ఏఐపై ఆధారపడుతున్నాయి. దాంతోపాటు ఈ రంగంలో మరింత పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాయి. అందులో భాగంగానే ప్రేమ్‌జీఇన్వెస్ట్ మూడేళ్ల క్రితం ఏఐ ఇన్వెస్ట్మెంట్ సాధనాలను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. దానికోసం ఏఐ ఇంజినీర్లను నియమించుకుంది. అదే సమయంలో ఏఐ ఇన్వెస్ట్మెంట్ టూల్స్ తయారుచేసే సంస్థలకు మద్దతుగా నిలవడం మొదలుపెట్టినట్లు తెలిసింది.ఇదీ చదవండి: నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ కంపెనీల్లో పెట్టుబడి అవకాశాలను గుర్తించడానికి 600 పారామీటర్లను విశ్లేషించేందుకు ఏఐ సహాయం చేస్తోందని కురియన్ అన్నారు. ఈ కసరత్తు వల్ల తోటివారి కంటే ముందంజలో ఉండేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. కోహెసిటీ ఇంక్-డేటా మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ, లండన్‌లోని ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ కంపెనీ-హోలిస్టిక్ ఏఐ, ఇకిగాయ్, ఫిక్సిస్ వంటి ప్రముఖ కంపెనీలకు ప్రేమ్‌జీఇన్వెస్ట్ సేవలందిస్తోందని తెలిసింది. దేశంలో అధికంగా పోగవుతున్న కోర్టు కేసులను వేగంగా పరిష్కరించడానికి ఉపయోగపడే ఏఐను అభివృద్ధి చేసేందుకు సంస్థ సహకరిస్తుందని కురియన్ అన్నారు. -
కొడుకులకు రూ.500 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి - ఎవరో తెలుసా?
విప్రో వ్యవస్థాపకుడు 'అజీమ్ ప్రేమ్‌జీ' (Azim Premji) తన కుమారులు.. సంస్థ చైర్మన్ 'రిషద్ ప్రేమ్‌జీ', ఎంటర్ప్రైజెస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'తారిఖ్ ప్రేమ్‌జీ'లకు జనవరి 23న దాదాపు రూ.500 కోట్ల విలువైన 10.2 మిలియన్ షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ చూపించింది. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ అండ్ అజీమ్ ప్రేమ్‌జీ ఫిలాంత్రోపిక్ ఇనిషియేటివ్స్‌లో బోర్డు సభ్యునిగా పనిచేస్తున్నాడు. లావాదేవీ తర్వాత, అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబానికి కంపెనీలో 4.4% వాటా ఉంది. ఇందులో ప్రేమ్‌జీకి 4.3%, అతని భార్య యాస్మీన్ ప్రేమ్‌జీకి 0.05%, ఇద్దరు కొడుకులకు 0.03% వాటా ఉంది. ఇదీ చదవండి: ప్రపంచంలో అయోధ్యకు పెరిగిన ఖ్యాతి.. ఏడాది చివరికి రూ.4 లక్షల కోట్లు.. ప్రేమ్‌జీ కుటుంబం విప్రోలో 72.9% వాటా కలిగి ఉన్నప్పటికీ 7.4% షేర్ల నుంచి డివిడెండ్ ఆదాయాన్ని పొందుతుంది. ప్రస్తుతానికి విప్రో ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌తో సహా ప్రేమ్‌జీ సంపద మొత్తం 11.3 బిలియన్ డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. విప్రో షేర్లు శుక్రవారం నాడు రూ.484.9 వద్ద ముగిశాయి. దీని ప్రకారం 1,0230,180 షేర్ల విలువ రూ. 496 కోట్లుగా ఉంది. -
అప్పుడాయన ఆ తప్పు చేయకుంటే ఇన్ఫోసిస్ పుట్టేదే కాదు!
విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ చేసిన ఒక తప్పు.. దేశంలో అగ్రశ్రేణి ఐటీ సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్ (Infosys) పుట్టుకకు కారణమని తెలుసా? అప్పుడాయన ఆ తప్పు చేయకుండా ఉంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉండేదే కాదు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి (NR Narayana Murthy) స్వయంగా చెప్పిన ఆ విషయం గురించి తెలుసుకుందామా.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగంలో భారత్ గణనీయ అభివృద్ధి సాధించింది. ఇందుకు ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది కార్పొరేట్ లీడర్లు చేసిన కృషి ఎనలేనిది. 1981లో కంపెనీని స్థాపించి దేశంలో ఐటీ అభివృద్ధి బాటలో పయనించడానికి అనేకమందికి మార్గం సుగమం చేసిన ఏడుగురిలో ఒకరైన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ముందువరుసలో ఉంటారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో ఎలాంటి కీలక పాత్ర లేని 77 ఏళ్ల నారాయణమూర్తి.. తనతో విప్రో ఫౌండర్ అజీమ్ ప్రేమ్‌జీ చెప్పిన ఓ ఆసక్తికర విషయాన్ని ఇటీవల వెల్లడించారు. నారాయణమూర్తిని ఉద్యోగంలోకి తీసుకోకపోవడమే తాను చేసిన అతి పెద్ద తప్పులలో ఒకటి అని అజీమ్ ప్రేమ్‌జీ తనతో ఒకసారి చెప్పాడని సీఎన్‌బీసీ టీవీ18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పరిస్థితులు అనుకూలంగా జరిగి ఉంటే ఇప్పుడు విప్రో సంస్థకు తిరగుండేది కాదని నారాయణ మూర్తి దంపతులు ఇదే ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నారాయణ మూర్తి 1981 నుంచి 2002 వరకు 21 సంవత్సరాల పాటు ఇన్ఫోసిస్ సీఈవోగా కొనసాగారు. 2002 నుంచి 2006 వరకు బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ తర్వాత చీఫ్ మెంటార్‌గా కూడా సేవలందించారు. 2011లో ఇన్ఫోసిస్ నుంచి రిటైరయ్యారు. నారాయణ మూర్తి ఇప్పుడు ఇన్ఫోసిస్ ఎమెరిటస్ చైర్మన్. -
రోజుకు 3 కోట్లు విరాళాలు, టాప్‌లో ఎవరు? అంబానీ, అదానీ ఎక్కడ?
సాక్షి, ముంబై: ఎడెల్ గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో బిలియనీర్ పారిశ్రామికవేత్త, పరోపకారి హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, 77 ఏళ్ల శివ్ నాడార్ టాప్ ప్లేస్‌ను ఆక్రమించారు.. రోజుకు రూ. 3 కోట్లు విరాళంగా ఇచ్చిన ఘనతను సొంతం చేసుకున్నారు. 2022 సంవత్సరానికి గాను ఎడెల్ గివ్ హురున్ ఇండియా విడుదల చేసిన తాజా లిస్ట్‌లో రూ. 1161 కోట్ల వార్షిక విరాళంతో దేశీయ అత్యంత ఉదారమైన వ్యక్తిగా శివ నాడార్ నిలిచారు. 484 కోట్ల రూపాయల వార్షిక విరాళాలతో విప్రో 77 ఏళ్ల అజీమ్ ప్రేమ్‌జీ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. దాతృత్వంలో ఇప్పటివరకు ఈ జాబితాలో టాప్‌లో ఉన్న అజీమ్ ప్రేమ్‌జీ విరాళాలు 95 శాతం తగ్గిపోవడంతో రెండో స్థానానికి పడిపోయారు. ఆసియా, భారతదేశపు అత్యంత సంపన్నుడు, గౌతమ్ అదానీ విరాళాలు 46 శాతం పెరగడంతో ఈ జాబితాలో ఏడవ స్థానంలో నిలిచారు. గత మూడేళ్లలో రూ.400 కోట్లకు పైగా విరాళం ఇచ్చారు. ఇక రిలయన్స్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ 1446 కోట్ల రూపాయలతో ఈ జాబితాలో మూడవ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 2022 ఎడెల్‌గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో భారతదేశంలో 15 మంది దాతలు రూ. 100 కోట్లకు పైగా వార్షిక విరాళాలివ్వగా, 20 మంది రూ. 50 కోట్లకు పైగా విరాళాలను అందించగా, 20 కోట్లకు పైగా విరాళాలిచ్చిన వారి సంఖ్య 43 మంది అని నివేదిక తెలిపింది. ఇంకా 142 కోట్ల రూపాయల విరాళం అందించిన లార్సెన్ అండ్ టూబ్రో గ్రూప్ చైర్మన్ ఏఎం నాయక్, దేశీయ అత్యంత ఉదారమైన ప్రొఫెషనల్ మేనేజర్. జెరోధా వ్యవస్థాపకులు నితిన్ ,నిఖిల్ కామత్ తమ విరాళాన్ని 300శాతం పెంచి రూ.100 కోట్లకు చేరుకున్నారు. వీరితోపాటు మైండ్‌ట్రీ సహ వ్యవస్థాపకుడు సుబ్రొతో బాగ్చి, ఎన్ఎస్ పార్థసారథి జాబితాలో ఒక్కొక్కరు రూ. 213 కోట్ల విరాళాలత టాప్ 10లోకి ప్రవేశించడం విశేషం. -
ప్రధానీ మోదీ, అంబానీ సమక్షంలో సైరస్ మిస్త్రీ పాత ప్రసంగం వైరల్
సాక్షి, ముంబై: ఘోర రోడ్డు ప్రమాదంలో ఆదివారం కన్నుమూసిన టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రసంగం ఒకటి ఇపుడు వైరల్ అవుతోంది. మేకిన్ఇండియాలో భాగంగా టాటా గ్రూపు తరపున ప్రసంగించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. భారత ఆర్థికవ్యవస్థకు మూలాధారంగా తయారీరంగాన్ని మార్చే ప్రాధాన్యత, కొన్ని సవాళ్లు పరిష్కారాలపై మిస్త్రీ మాట్లాడారు. భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేయడానికి ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి పనిచేసేందుకు మేక్ ఇన్ ఇండియా సమయోచితమైన ప్రత్యేకమైన అవకాశమని మిస్త్రీ ప్రశంసించారు. భారతదేశం ఒక చారిత్రాత్మక తరుణంలో ఉందనీ, మనం కలిసి దేశాన్ని కొత్త మార్గంలోకి నడిపించే అవకాశం ఉందన్నారు. అలాగే జీడీపీలో తయారీ రంగం సహకారం 15 శాతం నుంచి 25 శాతానికి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు 2014లోనిర్వహించిన 'మేక్ ఇన్ ఇండియా' ఈవెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి జౌళి శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఉన్నారు. వీరితో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముఖేశశ్ అంబానీ, విప్రోకు చెందిన అజీమ్ ప్రేమ్‌జీ తదిరులు హాజరైనారు. కాగా సైరస్ పల్లోంజీ మిస్త్రీ 2012 నుండి 2016 వరకు టాటాసన్స్ ఛైర్మన్‌గా ఉన్నారు. అనూహ్యంగా టాటా, మిస్త్రీ కుటుంబాల మధ్య బహిరంగ, వివాదాలు పొడసూపాయి. 2016 చివరిలో మిస్త్రీని పదవినుంచి తొలగించడంతో ఇది మరింత ముదిరి, సుదీర్ఘ న్యాయ పోరాటానికి తెర లేచింది. ఆ తరువాత ఫిబ్రవరి 2017చంద్రశేఖరన్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు . -
ఒకపుడు కాలేజీ డ్రాపవుట్, మరిపుడు రోజుకు రూ. 27 కోట్లు దానం
సాక్షి,ముంబై: టెక్ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు, అజీమ్ ప్రేమ్‌జీ జూలై 24న తన 77వ పడిలోకి అడుగు పెట్టారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరు, ఆసియాలోని అగ్రశ్రేణి దాతృత్వవేత్తలలో ఒకరుగా పేరుగాంచిన అజీం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కూరగాయల ఉత్పత్తులు, ప్రధానంగా కూరగాయల నూనె కంపెనీగా ప్రారంభమైంది విప్రో ప్రస్థానం. 1966లో తన తండ్రి మరణించిన తర్వాత ప్రేమ్‌జీ కుటుంబ వ్యాపార బాధ్యతలను చేపట్టారు. కాలేజీ డ్రాపౌట్ నుంచి ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్ కంపెనీలలో విప్రో లిమిటెడ్‌ను చైర్మన్‌గా మారడం దాకా, అజీమ్ ప్రేమ్‌జీ వ్యవస్థాపక ప్రయాణం స్ఫూర్తిదాయకం. జూలై 24, 1945న ముంబైలో పుట్టిన అజీమ్ హషీమ్ ప్రేమ్‌జీ తన కుటుంబ వ్యాపారాన్ని (వనస్పతి నూనెను ఉత్పత్తి చేసే కంపెనీ) ప్రపంచంలోని ప్రముఖ సాఫ్ట్వేర్ పరిశ్రమలలో ఒకటిగా మార్చిన ఘనత సొంతం చేసుకున్నారు. కాలేజీ డ్రాపవుట్: స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్‌లో డిగ్రీ చదువుతుండగా, తండ్రి మహమ్మద్ హషీమ్ ప్రేమ్‌జీ మరణించడంతో చదువుకు స్వస్తి చెప్పి 1966లో వ్యాపార బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ప్రేమ్‌జీ వయసు కేవలం 21 ఏళ్లే పాకిస్థాన్ ఆహ్వానం తిరస్కరణ: 1947లో ఇండియా-పాకిస్థాన్ విడిపోయినప్పుడు, పాకిస్తాన్ నేత మహమ్మద్ అలీ జిన్నా, పాకిస్తాన్‌కు మారమని ప్రేమ్‌జీ తండ్రికి ఆహ్వానం పంపారట. అయితే అందుకు నిరాకరించిన ముహమ్మద్ ప్రేమ్‌జీ దేశంలోనే ఉండాలని నిర్ణయించు కున్నారు. ప్రేమ్‌జీకి ఎప్పుడూ విలాసాల పట్ల మోజు లేదు. ఖరీదైన కార్లు అంతకన్నా లేవు. ఇప్పటికీ ఎకానమీ క్లాస్ విమాన ప్రయాణాన్ని ఇష్ట పడతారట. వ్యాపార పర్యటనల సమయంలో కంపెనీ గెస్ట్ హౌస్‌లకే ప్రాధాన్యం. అంతేకాదు కంపెనీ క్యాంటీన్ ఆహారాన్నే ప్రిఫర్ చేసేవారు. విప్రో ఆవిర్బావం 1979లో ఐబీఎం ఇండియానుంచి నిష్క్రమించిన తర్వాత ఐటీ రంగంలోకి ప్రవేశించింది విప్రో. అనంతరం బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారాలతో టాప్ కంపెనీగా ఎదిగింది. తన తాత 'నిజాయితీ' సూత్రమే తన విజయానికి కారణమని అజీమ్ ఎపుడూ చెబుతూ ఉంటారు. 30 ఏళ్ల తరువాత డిగ్రీ పూర్తి చేసిన అజీంజీ స్టాన్‌ఫోర్డ్‌లో గ్రాడ్యుయేషన్ వదిలిపెట్టిన ఆయన డిస్టెంట్ లెర్నింగ్ ప్రోగ్రాం ద్వారా 30 ఏళ్ల తర్వాత డిగ్రీ పూర్తి చేయడం విశేషం. కాగా 2021నాటి లెక్కల ప్రకారం అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ద్వారా సామాజిక ప్రయోజనాల కోసం 1.3 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. జీవితంలో మొత్తం దాదాపు 10వేల కోట్లను దానం చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎడెల్ గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2021లో కూడా ప్రేమ్‌జీ రూ.9,713 కోట్ల విలువైన విరాళాలతో అగ్రస్థానాన్ని నిలిచారు. అంటే రోజుకు 27 కోట్ల మేర దానం చేశారు. పద్మ పురస్కారాలు విప్రో 75 ఏళ్ల వ్యాపార ప్రయాణం గురించి రాసిన ‘ద స్టోరీ ఆఫ్ విప్రో’ (The Story of Wipro)’పుస్తకాన్ని అజీమ్ ప్రేమ్‌జీ గత ఏడాది విడుదల చేసిన సంగతి తెలిసిందే. అజీమ్ ప్రేమ్‌జీ యాస్మీన్ ప్రేమ్‌జీని వివాహం చేసుకోగా, ఇద్దరుపిల్లు రిషద్ ప్రేమ్‌జీ , తారిఖ్ ప్రేమ్‌జీ ఉన్నారు. వ్యాపార రంగంలో ఆయన చేసిన కృషికిగాను అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు. 2005లో "పద్మ భూషణ్ అవార్డు", 2011లో, "పద్మ విభూషణ్" లభించింది. ఇది కూడా చదవండి: ITR Filling Benefits: ఆదాయ పన్నుపరిధిలోకి రాకపోయినా, ఐటీఆర్ ఫైలింగ్ లాభాలు తెలుసా? -
ఆ కంపెనీపై అజీమ్ ప్రేమ్‌జీ కన్ను.. వందల కోట్ల పెట్టుబడులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అజీమ్ ప్రేమ్‌జీకి చెందిన పెట్టుబడి సంస్థ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ అపార్చునిటీస్ ఫండ్.. హైదరాబాద్‌కు చెందిన సాగర్ సిమెంట్స్‌లో 10.10 శాతం వాటాను చేజిక్కించుకుంది. డీల్ విలువ రూ.350 కోట్లు. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన రూ.2 ముఖ విలువ కలిగిన 1.32 కోట్ల షేర్లను ఒక్కొక్కటి రూ.265 చొప్పున ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు జారీ చేయాలన్న ప్రతిపాదనకు సాగర్ సిమెంట్స్ బోర్డ్ శుక్రవారం ఆమోదం తెలిపింది. డీల్ కారణంగా సాగర్ సిమెంట్స్‌లో ప్రమోటర్ల వాటా 50.28 నుంచి 45.2 శాతానికి వచ్చి చేరింది. వాటా విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని విస్తరణ, వ్యాపార కార్యకలాపాలకు వినియోగించనున్నట్టు సాగర్ సిమెంట్స్ వెల్లడించింది. కార్యకలాపాలు, వ్యవస్థలను బలోపేతం చేయడం, వాటాదారులకు విలువను పెంపొందించడానికి ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సలహాల కోసం ఎదురుచూస్తున్నామని సాగర్ సిమెంట్స్ జేఎండీ ఎస్.శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కంపెనీతో కలిసి వృద్ధి లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి, అత్యుత్తమ పాలన ప్రక్రియలతో దేశవ్యాప్త బ్రాండ్‌గా మారడానికి ఎదురుచూస్తున్నట్టు ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ పార్ట్నర్ రాజేశ్ రామయ్య చెప్పారు. సాగర్ సిమెంట్స్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 82.5 లక్షల టన్నులు. -
విప్రో ఆజీమ్ ప్రేమ్‌జీ ఇటీవల షేర్లు కొనుగోలు చేసిన కంపెనీ ఏంటో తెలుసా?
Wipro Azim Premji's investment in Tanla Platforms Ltd: సీపాస్ (కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫాం యాజ్ ఏ సర్వీస్) దిగ్గజం తాన్లా ప్లాట్‌ఫామ్స్‌లో తాజాగా ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ పెట్టుబడులు పెట్టారు. ప్రేమ్‌జీకి చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థలు సుమారు 20.6 లక్షల షేర్లను కొనుగోలు చేశాయి. ఇందుకోసం షేరు ఒక్కింటికి రూ. 1,200 వెచ్చించాయి. బన్యాన్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ వీటిని విక్రయించింది. ప్రేమ్‌జీ పెట్టుబడులపై తాన్లా సీఈవో ఉదయ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను తీర్చిదిద్దడంలోను, కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాల్లోను, దాతృత్వంలోను అజీం ప్రేమ్‌జీకి సాటిలేరని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేశారు. తాన్లా ప్లాట్‌ఫామ్స్ ఏటా సుమారు 800 బిలియన్ల పైగా సందేశాలను ప్రాసెస్ చేస్తోంది. దేశీయంగా ఏ2పి ఎస్ఎంఎస్ ట్రాఫిక్‌లో దాదాపు 70% భాగం తాన్లాకు చెందిన ట్రూబ్లాక్ ద్వారా ప్రాసెస్ అవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ నికర లాభం 67% ఎగిసి రూ. 136 కోట్లుగా నమోదైంది. మంగళవారం బీఎస్ఈలో తాన్లా షేరు 5% ఎగిసి రూ. 1,327 వద్ద క్లోజయ్యింది. - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో -
60 రోజుల్లో 50 కోట్ల మందికి వ్యాక్సినేషన్
న్యూఢిల్లీ: దేశంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో కోవిడ్–19 వ్యాక్సినేషన్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచవచ్చని విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ అభిప్రాయపడ్డారు. తనకు వచ్చిన ఆలోచనను అమలు పరిస్తే 60 రోజుల్లో 50 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయవచ్చని తెలిపారు. బెంగళూరు చాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్‌లో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలకు ఈ విషయం తెలిపారు. ‘ప్రభుత్వం తక్షణమే ప్రైవేట్ రంగానికి భాగస్వామ్యం కల్పిస్తే, మన 50 కోట్ల ప్రజలకు 60 రోజుల్లోనే టీకా అందించగలం’అని చెప్పారు. ప్రైవేట్ రంగానికి అవకాశం కల్పిస్తే వ్యాక్సినేషన్ రేటు భారీగా పెరుగుతుందన్నారు. రికార్డు సమయంలో కోవిడ్–19 వ్యాక్సిన్ రూపకల్పన జరిగిందనీ, పెద్ద సంఖ్యలో ప్రజలకు టీకా వేయడమే ప్రస్తుత లక్ష్యమని చెప్పారు. ‘సీరం ఇన్స్టిట్యూట్ నుంచి టీకా ఒక్కో డోసును రూ.300 చొప్పున పొందేందుకు అవకాశం ఉంది. దీనికి మరో రూ.100 కలుపుకుని ఆస్పత్రులు, ప్రైవేట్ నర్సింగ్ హోంలలో రూ.400కే ప్రజలకు టీకా డోసు ఇవ్వగలుగుతాం. దీంతో దేశంలో భారీగా వ్యాక్సినేషన్ సాధ్యమవుతుంది’అని ప్రేమ్‌జీ అన్నారు. -
దాతృత్వంలో మేటి.. అజీం ప్రేమ్‌జీ!!
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ దాతృత్వంలోనూ మేటిగా నిల్చారు. రోజుకు సుమారు రూ. 22 కోట్ల చొప్పున గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 7,904 కోట్లు విరాళమిచ్చారు. తద్వారా 2019–20 సంవత్సరానికి గాను హురున్ రిపోర్ట్ ఇండియా, ఎడెల్‌గివ్ ఫౌండేషన్ రూపొందించిన దానశీలుర జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ప్రేమ్‌జీ రూ. 426 కోట్లు విరాళమిచ్చారు. ఇక తాజా లిస్టులో సుమారు రూ. 795 కోట్ల విరాళంతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ నాడార్ రెండో స్థానంలో నిలవగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రూ. 458 కోట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో శివ నాడార్ రూ. 826 కోట్లు, అంబానీ రూ. 402 కోట్లు విరాళమిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి పరిణామాలతో కార్పొరేట్ల విరాళాల తీరు కొంత మారింది. కరోనాపై పోరాటానికి టాటా సన్స్ అత్యధికంగా రూ. 1,500 కోట్లు, ప్రేమ్‌జీ రూ. 1,125 కోట్లు ప్రకటించారు. కార్పొరేట్లు అత్యధిక మొత్తం విరాళాలను పీఎం–కేర్స్ ఫండ్కే ప్రకటించడం గమనార్హం. దీనికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 500 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్ రూ. 400 కోట్లు, టాటా గ్రూప్ రూ. 500 కోట్లు ప్రకటించాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం విరాళాల పరిమాణం సుమారు 175 శాతం పెరిగి రూ. 12,050 కోట్లకు పెరిగినట్లు నివేదికలో వెల్లడైంది. రూ. 10 కోట్లకు మించి దానమిచి్చన వ్యక్తుల సంఖ్య స్వల్పంగా 72 నుంచి 78కి పెరిగింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు ముగ్గురు.. నందన్ నీలేకని (రూ. 159 కోట్లు), ఎస్ గోపాలకృష్ణన్ (రూ. 50 కోట్లు), ఎస్డీ శిబులాల్ (రూ. 32 కోట్లు) ఎడెల్‌గివ్ జాబితాలో ఉన్నారు. విద్యా రంగానికి ప్రాముఖ్యం.. విద్యారంగానికి అత్యధికంగా విరాళాలు అందాయి. ప్రేమ్‌జీ, నాడార్ల సారథ్యంలో సుమారు 90 మంది సంపన్నులు దాదాపు రూ. 9,324 కోట్లు ప్రకటించారు. ఆ తర్వాత స్థానంలో హెల్త్‌కేర్, విపత్తు నివారణ విభాగాలు ఉన్నాయి. భారీ విరాళాలు ఇచి్చన వారిలో అత్యధికంగా ముంబైకి చెందిన వారు 36 మంది ఉండగా, ఢిల్లీ వాసులు 20 మంది, బెంగళూరుకు చెందిన వారు 10 మంది ఉన్నారు. రూ. 5 కోట్లకు పైగా విరాళమిచి్చన 109 మంది సంపన్నులతో రూపొందించిన ఈ జాబితాలో ఏడుగురు మహిళలు ఉన్నారు. మహిళల జాబితాలో నందన్ నీలేకని సతీమణి రోహిణి నీలేకని అత్యధికంగా రూ. 47 కోట్లు విరాళమిచ్చారు. -
టాప్‌లో అజీం ప్రేమ్‌జీ : రోజుకు ఎన్ని కోట్లంటే
సాక్షి,ముంబై: పారిశ్రామిక వేత్త, ప్రముఖ దాత, దేశీయ అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ దాతృత్వంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2020వ సంవత్సరంలో విరివిగా దానాలు చేసి, ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. హురున్ రిపోర్ట్ ఇండియా తాజా లెక్కల ప్రకారం రోజుకు 20 కోట్లు ఏడాదికి 7,904 కోట్లు చొప్పున, విరాళంగా ఇచ్చారు. గత ఏడాది హురున్ రిపోర్ట్ ఇండియా రూపొందించిన జాబితా ప్రకారం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ శివ్ నాడార్ టాప్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా శివ నాడార్‌ను అధిగమించిన అజీం ప్రేమ్‌జి టాప్‌లో నిలిచారు. నాడార్ ఈ ఆర్థిక సంవత్సరంలో 795 కోట్లు రూపాయల విరాళమివ్వగా అంతకుముందు ఏడాది కాలంలో 826 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రేమ్‌జీ 426 కోట్లు విరాళంగా ఇచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అధినేత, బిలియనీర్ ముకేశ అంబానీ 458 కోట్ల రూపాయల విరాళం ఇవ్వడం ద్వారా మూడో స్థానంలో నిలిచారు. ఏడాది క్రితం అంబానీ 402 కోట్ల రూపాయలు డొనేట్ చేశారు. అలాగే కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా కార్పొరేట్ రంగం భారీగా విరాళాలిచ్చింది. ప్రధానంగా టాటా సన్స్ 1500 కోట్ల నిబద్ధతతో, ప్రేమ్‌జీ 1125 కోట్లు, అంబానీ 510 కోట్లు రూపాయల విరాళాన్ని ప్రకటించారు. దీంతో పాటు పీఎం కేర్స్ ఫండ్‌కు రిలయన్స్ 500 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్ 400 కోట్లు, టాటా గ్రూపు 500 కోట్ల విరాళంగా ఇచ్చాయి. దీంతో కలిపి ఈ ఏడాది ప్రేమ్‌జీ మొత్తం విరాళాలను 175శాతం పెరిగి 12,050 కోట్లకు చేరుకుంది.10 కోట్లకు పైగా విరాళం ఇచ్చిన వ్యక్తుల సంఖ్య అంతకుముందు కాలం 72 నుండి 78 కు స్వల్పంగా పెరిగిందని నివేదిక తెలిపింది. 27 కోట్ల విరాళంతో, ఏటీఈ చంద్ర ఫౌండేషన్‌కు చెందిన అమిత్ చంద్ర, అర్చన చంద్ర ఈ జాబితాలో ప్రవేశించిన తొలి, ఏకైక ప్రొఫెషనల్ మేనేజర్లు. ఈ జాబితాలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ముగ్గురు చోటు సంపాదించుకున్నారు. నందన్ నీలేకని 159 కోట్లు, ఎస్ గోపాల కృష్ణన్ 50 కోట్లు, షిబులాల్ 32 కోట్లు డొనేట్ చేశారు. మరోవైపు 5 కోట్లకు పైగా విరాళం ఇచ్చిన 109 మంది వ్యక్తుల జాబితాలో ఏడుగురు మహిళలు ఉన్నారు. వీరిలో రోహిణి నీలేకని 47 కోట్ల రూపాయలతో టాప్‌లో ఉన్నారు. ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ (37) 5.3 కోట్లతో అతి పిన్నవయస్కుడిగా ఉండటం విశేషం. -
సుప్రీంను ఆశ్రయించిన ప్రేమ్‌జీ దంపతులు
సాక్షి, న్యూఢిల్లీ: విప్రో ప్రమోటర్ అజీమ్ ప్రేమ్‌జీ, ఆయన భార్య యాసీమ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రేమ్‌జీ గ్రూపు యాజమాన్యంలోని మూడు సంస్థల విలీనం వివాదంలో కర్ణాటక హైకోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని కోరుతూ వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యా, రీగల్, నేపియన్ అనే మూడు సంస్థలను హాషమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీతో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఒక ఎన్ జీవో ఇచ్చిన ఫిర్యాదుపై కోర్టు సమన్లు జారీ చేసిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుందని టైమ్స్ఆఫ్ ఇండియా నివేదించింది. చెన్నైకి చెందిన ఇండియా అవేక్ ఫర్ ట్రాన్సపరెన్సీ(ఐఏటీ) అనే సంస్థ మూడు కంపెనీలను అక్రమంగా విలీనం చేశారని ఆరోపిస్తూ ప్రేమ్‌జీ దంపతులు సహా, మరో ముగ్గురుపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. మూడు కంపెనీల నుండి 45,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కొత్తగా ఏర్పాటుచేసిన సంస్థకు చట్టవిరుద్ధంగా బదిలీ చేశారని ఆరోపించింది. డైరెక్టర్లుగా ఉన్న నిందితులు 2010-2012 మధ్య ఈ మూడు కంపెనీల 13,602 కోట్ల రూపాయలను ఆస్తులను బహుమతుల రూపంలో తీసుకున్నారని, మిగిలిన 31,342 కోట్ల రూపాయల ఆస్తులను హషమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌లో విలీనం చేశారని ఐఏటి ఆరోపించింది. ఈ కేసులో మూడు సంస్థల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఏడాది జనవరి 27న నగర కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే ఈ సమన్లను రద్దు చేయాలని కోరుతూ ప్రేమ్‌జీ, యాసీమ్ ప్రేమ్‌జీ, శ్రీనివాసన్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రాంతీయ డైరెక్టర్ ఎం.ఆర్.భట్, చార్టర్డ్ అకౌంటెంట్ జీ వెంకటేశ్వరరావు హైకోర్టుకు వెళ్లారు. కానీ ఫిర్యాదుదారు ఆరోపణలను సమర్ధించిన కర్ణాటక హైకోర్టు వీరి పిటిషన్ ను మే15 న కొట్టివేసింది. దీంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. 1974 లో ఏర్పడిన విద్యా ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, రీగల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, నేపియన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు మూడు కంపెనీలు, 1980 లో వాటాలు ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యాయనీ, ఆర్ బీఐ సూత్రప్రాయం ఆమోదంతోపాటు కర్నాటక హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తరువాత 2015 లో హషంతో విలీనం చేశామని ప్రేమ్‌జీ న్యాయవాది మహేష్ అగర్వాల్ పేర్కొన్నట్లు దినపత్రిక నివేదించింది. వ్యాపారవేత్త ఆర్ సుబ్రమణియన్ ఆధ్వర్యంలోని సుభిక్ష సంస్థతో వ్యాపార భాగస్వామ్య వివాదం, 2013లో కోట్ల రూపాయల విలువైన చెక్ బౌన్స్ ఆరోపణలతో ప్రేమ్‌జీ గ్రూపు సుబ్రమణియన్ యాజమాన్యంలోని సంస్థపై క్రిమినల్ ఫిర్యాదు నమోదు చేసింది. ఇది ఇంకా పెండింగ్‌లో ఉంది. దీంతో సుబ్రమణియన్ ప్రోద్బలంతోనే ఐఏటీ తమపై ఆరోపణలు చేస్తోందని అగర్వాల్ వాదిస్తున్నారు. -
మోడర్నాలో ప్రేమ్‌జీ పెట్టుబడులు
ముంబై: ప్రముఖ సాఫ్టవేర్ దిగ్గజం విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ కరోనా వ్యాక్సిన్ తయారీ కంపెనీ మోడర్నాలో పెట్టుబడులు పెట్టినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అమెరికాకు చెందిన మోడర్నా అనే బయోటెక్ కంపెనీ కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు వేగంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఎమ్ఆర్ఎన్ఏ-1273 అనే ఈ వ్యాక్సిన్‌ను మోడర్నా తయారుచేసింది. ప్రేమ్‌జీ 25నుంచి 30మిలియన్ డాలర్లు మోడర్నాలో పెట్టుబడులు పెట్టారు. వ్యాక్సిన్ విజయవంతం అవ్వాలంటే హ్యూమన్ ట్రయల్స్‌లో మూడు దశల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుంటే.. వ్యాక్సిన్ విజయవంతమయ్యినట్లు గుర్తిస్తారు. ఇటీవల 45మంది కరోనా వ్యాధిగ్రస్తుల్లో ప్రయోగించగా వ్యాక్సిన్ సానుకూల ఫలితాలు ఇచ్చినట్లు కంపెనీ పేర్కొంది. చదవండి: అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ. 1125 కోట్లు! -
విరాళాలతో కరోనాను తరిమి కొడుతున్న దాతలు
ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి కరాళ నత్యం చేస్తున్న కరోనా వైరస్ బారిన పడిన బాధితులతోపాటు, పొట్ట కూటి కోసం అలమటిస్తున్న అభాగ్యులను, అనాథలను ఆదుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా దయార్ద్ర హదయులైన దాతలు ముందుకు వచ్చారు. వారిలో కార్పొరేట్ కుటుంబ సంస్థలు, కార్పొరేట్ వ్యాపార సంస్థలు, పార్లమెంట్లు, ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలతోపాటు వ్యక్తులు ఉన్నారు. వారంతా మున్నెన్నడులేని విధంగా ముందుకు వచ్చారు. (కరోనాపై పోరుకు అమ్మ రూ.13 కోట్ల విరాళం ) ఇలా మార్చి ఒకటవ తేదీ నాటికే ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్ డాలర్లు, అంటే దాదాపు 7,629 కోట్ల రూపాయలు విలాసంగా వసూలయ్యాయి. ఇదివరకు ఎబోలా వైరస్ దాడి చేసినప్పుడు 362 మిలియన్ డాలర్లు, హార్వే ఉప్పెన ముంచుకొచ్చినప్పుడు 341 మిలియన్ డాలర్లు మాత్రమే విరాళంగా వచ్చాయి. ఈసారి పెద్ద మొత్తాల్లో విరాళాలు కుటుంబ సభ్యులతో నడుస్తున్న వ్యాపార సంస్థల నుంచి రావడం, ఆ సంస్థలే ముందుగా స్పందించడం గమనార్హం. ఈ సంస్థలకు కుటుంబ సభ్యులే సీఈవోలుగా, డైరెక్టర్లుగా ఉంటారు కనుక వారు త్వరగా సమావేశం కాగలరు, వారి మధ్య త్వరగా ఏకాభిప్రాయం కుదురగలదు. అదే పలువురు కలిసి నడిపే కార్పొరేట్ సంస్థల్లో డైరెక్టర్లు సకాలంలో సమావేశం అవడం, అయినా ఏకాభిప్రాయానికి రావడం అంత సులువు కాదు. (విడాకులు తీసుకున్న సీరియల్ నటి ) ఇటలీలో ఆగ్నెల్లీ కుటుంబం ► ఇటలీలో ప్రధానంగా కార్ల పరిశ్రమను నిర్వహించే ఆగ్నెల్లీ పారిశ్రామిక కుటుంబం పది మిలియన్ యూరోలను ఇటలీ పౌర రక్షణ విభాగానికి విరాళంగా ఇచ్చింది. అంతేకాకుండా ఆ కుటుంబానికి చెందిన కంపెనీలు వైద్య పరికరాలను, మందులను, ఆహారాన్ని స్వయంగా కొనుగోలు చేసి ప్రభుత్వ విభాగాలకు, ప్రజలకు సరఫరా చేసింది. సామాజిక దూరం ఎలా పాటించాలో అవగాహన కల్సించే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. (ఆ పథకం బాగుందంటూ సోనియా ప్రశంస) ►విలాస వస్తువులను తయారు చేసే ఫ్రాన్స్‌కు చెందిన ఎల్వీఎంహెచ్ సంస్థ ప్రభుత్వ వైద్య సిబ్బందికి నాలుగు కోట్ల క్లినికల్ మాస్క్‌లను విరాళంగా అందజేసింది. తమకు చెందిన మూడు కాస్మోటిక్ ఫ్యాక్టరీలను కేవలం శానిటైజర్లను తయారు చేయడానికే కేటాయించింది. వాటన్నింటిని ఉచితంగా అందచేయడానికి ముందుకు వచ్చింది. ►ఆరోగ్య రంగంలో ప్రసిద్ధి చెందిన స్విడ్జర్లాండ్‌కు చెందిన ‘రోచే’ సంస్థ కరోనా వైరస్‌ను కనుగొనేందుకు కొత్త పరీక్షను రూపొందించింది. ఇక భారత్‌కు చెందిన టాటా సన్స్ అండ్ టాటా ట్రస్ట్స్ 1500 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. అదనంగా రోగులకు అవసరమైన వెంటిలేటర్లు అందజేయడానికి టాటా ట్రస్టులు ముందుకు వచ్చాయి. ►విప్రో గ్రూప్ ఈజ్మీ ప్రేమ్‌జీ గ్రూప్ 1125 కోట్ల రూపాయలు, అంబానీలకు చెందిన రిలయెన్స్ ఇండస్ట్రీ 500 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించింది. లాభాలే లక్ష్యంగా పనిచేసే వ్యాపార సంస్థలు ఇలాంటి ఆపద సమయంలో ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు రావడం నిజంగా ఆశ్చర్యమే. ►ఇటలీకి చెందిన జార్జియో అర్మానీ, రెమో రుఫిణి, సిల్వియో బెర్లూస్కోని అనే బిలియనీర్ వ్యాపారస్థులు వారి దేశంలో కరోనాపై పోరాటానికి 45 మిలయన్ డాలర్లును విరాళంగా ప్రకటించారు. ► ఇక క్రీడారంగంలో ఆటల పోటీలు నిలిచిపోవడం వల్ల ఉద్యోగం లేదా ఉపాధి కోల్పోయిన ఉద్యోగుల జీతాలను చెల్లిస్తామని జియాన్ విలియమ్సన్, బ్లేక్ గ్రిఫిన్ లాంటి బాస్కెట్ బాల్ క్రీడాకారులు ముందుకు వచ్చారు. అథ్లెట్స్, క్రికెట్ క్రీడాకారులు కూడా తమవంతు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ►కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు పది కోట్ల డాలర్లను ప్రపంచ దిగ్గజ వ్యాపారస్థుల్లో ఒకరైన బిల్ గేట్స్ ప్రకటించారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అభివద్ధి కోసం చైనా ధనవంతుడు జాక్ మా వంద మిలియన్ యాన్లను కేటాయించారు. కరోనా పరీక్షలకు ఐదు లక్షల కిట్లను, పది లక్షల మాస్క్‌లను అమెరికాకు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. (‘వారికి మాత్రమే కరోనా టెస్టులు ఉచితం’ ) -
కోవిడ్ క్రాష్ : అంబానీకి నష్టం ఎంతంటే?
సాక్షి, ముంబై: కోవిడ్-19 కల్లోలానికి ప్రపంచ మార్కెట్లు విలవిల్లాడాయి. అటు దేశీయ ఈక్విటీమార్కెట్లు కూడా ఫిబ్రవరి చివరి వారంలో భారీగా నష్టపోయాయి. గత ఆరు సెషన్లుగా వరుస నష్టాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.10 లక్షల కోట్లు ఆవిరైపోయింది. శుక్రవారం ఒక్కరోజే రూ.4 లక్షల కోట్లకు పైగా సంపద నిమిషాల్లో కరిగిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తికి ఎక్కడా అడ్డుకట్టపడకపోవడంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు భారీ అమ్మకాలకు దిగారు. దీంతో దేశంలోని కుబేరులు కూడా సంపదను కోల్పోయారు. (5 నిమిషాల్లో రూ. 5 లక్షల కోట్లు హాంఫట్) ముఖ్యంగా ఈ సంవత్సరం మొదటి రెండు నెలల్లోని బలహీన ధోరణి భారత బిలియనీర్ల సంపదను ప్రభావితం చేసింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ సూచిక ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ ఏడాది తన సంపదలో 5 బిలియన్ డాలర్లకు పైగా కోల్పోయారు.ఇండెక్స్‌లో పదిహేనవ స్థానంలో ఉన్న ఆసియా టాప్ బిలియనీర్ మొత్తం నికర విలువ 53.5 బిలియన్ డాలర్లు. సెన్సెక్స్1500 పాయింట్లు కుప్పకూలడంతో, మార్కెట్ క్యాప్ పరంగా టాప్‌లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర శుక్రవారం 4.12 శాతం క్షీణించి రూ.1,328 కు చేరుకుంది, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .8.4 లక్షల కోట్లకు పడిపోయింది. (టెక్ దిగ్గజాలకు కోవిడ్-19 సెగ) ఇదే వరుసలో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా 884 మిలియన్ డాలర్లు కోల్పోయారు. విప్రో లిమిటెడ్ చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ సంపద రెండు నెలల కాలంలో 869 మిలియన్ డాలర్లు క్షీణించింది. అలాగే గౌతమ్ అదానీ 496 మిలియన్ డాలర్లను కోల్పోయారు. విప్రో షేర్లు 4.53, అదానీ ఎంటర్ప్రైజెస్ 6.5శాతం నష్టపోయాయి. ఇంకా టీసీఎస్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్ షేర్లు 2.5 -3.5 శాతం మధ్య, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు 4-5 శాతం మధ్య కుప్పకూలిన సంగతి తెలిసిందే. బెంచ్‌మార్క్ సూచికలు 7 శాతం పతనం కావడంతో సెంటిమెంటు పూర్తిగా దెబ్బతిందనీ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. కరోనా మహమ్మారి ముప్పు ఊహించనదానికంటే పెద్దగా ఉండనుందని అంచనా వేశారు. (కోవిడ్-19 : స్విస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం) -
వచ్చే ఏడాదే మెడ్‌ప్లస్ ఐపీవో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధాల విక్రయ రంగంలో ఉన్న మెడ్‌ప్లస్ వచ్చే ఏడాది పబ్లిక్ ఇష్యూకు (ఐపీఓ) రానుంది. తద్వారా రూ.700 కోట్లకుపైగా నిధులను సమీకరించనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం మెడ్‌ప్లస్‌లో ప్రమోటర్లకు 77 శాతం, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీకి చెందిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సంస్థకు 13 శాతం వాటాలున్నాయి. మిగిలిన వాటా ప్రమోటర్లకు సన్నిహితులైన కొందరు ఇన్వెస్టర్ల చేతుల్లో ఉంది. ఆఫర్ ఫర్ సేల్‌తో సహా ఐపీఓ మార్గంలో 20 శాతం వాటా విక్రయించనున్నట్టు మెడ్‌ప్లస్ ప్రమోటర్, ఫౌండర్ మధుకర్ గంగాడి వెల్లడించారు. కెనడా కంపెనీ జెమీసన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సందర్భంగా ఆ వివరాలను వెల్లడించడానికి బుధవారమిక్కడ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐపీఓ వివరాలను వెల్లడిస్తూ... అలా సమీకరించే నిధులను విస్తరణకోసం ఉపయోగిస్తామని స్పష్టంచేశారు. సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేసే ప్రక్రియ ఈ డిసెంబరులో ప్రారంభిస్తామన్నారు. నాలుగేళ్లలో 3,100 స్టోర్లకు... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మొత్తం ఏడు రాష్ట్రాల్లో మెడ్‌ప్లస్ ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ రాష్త్రాల్లో సంస్థకు 1,700కు పైగా స్టోర్లున్నాయి. ‘‘2023 నాటికి అన్ని రాష్త్రాల్లో 3,100 ఔట్లెట్ల స్థాయికి తీసుకు వెళతాం. ఈ కొత్త స్టోర్లను జమ్ము, కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తాం. 2018–19లో మెడ్‌ప్లస్ రూ.2,250 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో టర్నోవరు రూ.2,800 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. దీనిపై రూ.50 కోట్ల నికరలాభం వస్తుందనేది మా అంచనా’’ అని మధుకర్ వివరించారు. సంఘటిత ఔషధ రిటైల్ రంగంలో కంపెనీ వాటా 3 శాతానికి చేరుతుందని కూడా తాము అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. తమ వ్యాపారంలో దాదాపు 17 శాతం ‘మెడ్‌ప్లస్‌మార్ట్.కామ్’ ద్వారా వస్తున్నట్లు మెడ్‌ప్లస్ సీవోవో సురేంద్ర మంతెన తెలియజేశారు. ఈ విభాగం ఏటా రెండంకెల వృద్ధిని సాధిస్తోందన్నారు. స్టోర్లలో జెమీసన్ ఉత్పత్తులు.. కెనడాకు చెందిన విటమిన్ల తయారీ దిగ్గజం జెమీసన్‌తో మెడ్‌ప్లస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత్‌లో జెమీసన్ బ్రాండ్ ఉత్పత్తులు ఇక నుంచి మెడ్‌ప్లస్ స్టోర్లలో లభిస్తాయి. 1922లో ప్రారంభమైన జెమీసన్ విటమిన్లు, మినరల్స్, హెల్త్ సప్లిమెంట్లను 40 దేశాల్లో విక్రయిస్తున్నట్టు కంపెనీ ప్రెసిడెంట్ మార్క్ హార్నిక్ ఈ సందర్భంగా చెప్పారు. -
చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం
న్యూఢిల్లీ: భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగిత రేటు పెరిగిందని ప్రముఖ అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం తన అధ్యయనంలో పేర్కొంది. కాగా 2011-12, 2017-18 సంవత్సరాలలో దేశంలో 90లక్షల మంది ఉపాధికి దూరమయ్యారని తెలిపింది. కాగా దేశంలో 2011-12సంవత్సరాలలో 474మిలియన్లుగా ఉన్న ఉపాధి 2017-18లో 465 మిలియన్లకు పడిపోయిందని ఎంప్లాయిమెంట్ క్రైసిస్ అనే కొత్త నివేదిక పేర్కొంది. యువత, శ్రామికులు, విద్యావంతులు నిరుద్యోగంలో మగ్గిపోతున్నారని తమ అధ్యయంలో తేలినట్లు స్పష్టం చేసింది. నివేదికలోని కీలక అంశాలు నివేదిక ప్రకారం ప్రైవేట్ రంగంలో ఉపాధి స్వల్పంగా పెరిగింది. ప్రభుత్వ రంగంలో అసంఘటిత రంగానికి మెరుగైన ఉపాధి కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమ రంగాలు సైతం ఏ విధమైన కాంట్రాక్టు లేకుండా ఉపాధిని కల్పిస్తున్నట్లు తెలిపింది. దేశంలో వ్యవసాయేతర రంగాలలో సేవల రంగం అత్యధిక ఉపాధిని కల్పిస్తున్నదని తెలిపింది. కానీ పెరుగుతున్న జనాభాకు, చదువుకున్న లక్షలాది విద్యార్థులకు ఆశించిన మేర ఉపాధి లభించలేదని నివేదిక తెలిపింది. కాగా వ్యవసాయ రంగం 2011-12, 2017-18 సంవత్సరాల్లో సుమారు 27 మిలియన్ల మేర ఉపాధి క్షీణించింది అని తెలిపింది. వ్యవసాయ అనుబంధ రంగాలలో ఉపాధి వాటా కూడా 49 శాతం నుండి 44 శాతానికి పడిపోయిందని నివేదిక పేర్కొంది. తయారీయేతర రంగాలలో ముఖ్యంగా నిర్మాణ రంగం 2004-05, 2011-12 సంవత్సరాల్లో సంవత్సరానికి 4 మిలియన్ల ఉద్యోగాలను సృష్టిస్తే (2011-12), (2017-18) మధ్య కాలంలో కేవలం 0.6 మిలియన్ మాత్రమే సృష్టించిందని నివేదిక పేర్కొంది. దేశంలో శ్రామిక, విద్య శిక్షణ (ఎన్‌ఎల్‌ఇటి) పొందని యువత 2004-05, 2011-12 లో మూడు మిలియన్లు ఉంటే 2017-18లో 100మిలియన్లు ఉన్నారని నివేదిక తెలిపింది. 2017-18లో ఎన్‌ఎల్‌ఇటి యువత అత్యధిక కలిగిన రాష్ట్ర్రాలలో యూపీ మొదటి స్థానంలో ఉండగా తరువాతి స్థానాలలో బిహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, అసోం తదితర రాష్ట్రాలు ఉన్నాయి. ఇక సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు 68శాతం ఉపాధిని కల్పిస్తున్నట్లు నివేదిక తెలిపింది. కాగా 2017-18 సంవత్సరం తయారీ రంగంలో 61శాతం ఉపాధిని కల్పిస్తుండగా, తయారీయేతర రంగాలలో 66శాతం నుంచి 71శాతానికి ఉపాధిని కల్పిస్తున్నట్లు తెలిపింది. కాగా దేశంలో రిజిస్టర్డ్ సంస్థల సంఖ్య భారీగా పెరిగాయి. కానీ మెరుగైన వ్యాపారం కోసం జీఎస్టి కింద సంస్థలను నమోదు చేసుకున్నప్పటికీ, వారి వ్యాపారం తక్కువ స్థాయిలో ఉండడం వల్ల ఉద్యోగులకు సామాజిక భద్రతా ప్రయోజనాలతో కూడిన ఉపాధిని కల్పించలేకపోయారని నివేదిక తెలిపింది. -
దిగ్గజ స్టార్టప్‌కు ప్రేమ్‌జీ ఊతం
బెంగళూరు: ఐటీ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్‌జీ తోడ్పాటుతో ఒక స్టార్టప్ సంస్థ బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ స్థాయికి చేరింది. క్లౌడ్ ఆధారిత కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ సేవలు అందించే ఐసెర్టిస్ సంస్థలో అజీం ప్రేమ్‌జీ కుటుంబానికి చెందిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ ఫండ్, గ్రేక్రాఫ్ట్ పార్ట్నర్స్ తదితర సంస్థలు 115 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. వీటిలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన బి క్యాపిటల్ గ్రూప్, ఎయిట్ రోడ్స్ మొదలైనవి కూడా ఉన్నాయి. తాజా పెట్టుబడులతో ఐసెర్టిస్ సంస్థ మొత్తం 211 మిలియన్ డాలర్లు సమీకరించినట్లయింది. ఈ విడత నిధుల సమీకరణతో సంస్థ విలువ 1 బిలియన్ డాలర్ల స్థాయికి చేరినట్లవుతుందని ఐసెర్టిస్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ బోదాస్ తెలిపారు. నెలకొల్పింది మనోళ్లే.. 2009లో సమీర్, ఆయన మిత్రుడు మనీష్ దర్దా కలిసి ఐసెర్టిస్ను ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో 850 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 600 మంది పుణే కేంద్రంలో పనిచేస్తున్నారు. సరుకుల కొనుగోళ్ల నుంచి ఉద్యోగులతో ఒప్పందాలు దాకా ప్రపంచవ్యాప్తంగా పలువురు క్లయింట్లకు 57 లక్షల పైగా కాంట్రాక్టుల నిర్వహణకు సేవలు అందిస్తున్నట్లు సమీర్ వివరించారు. వీటి మొత్తం విలువ 1 లక్ష కోట్ల డాలర్ల పైగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ సేవలపై కంపెనీలు 2018–2022 మధ్య కాలంలో దాదాపు 20 బిలియన్ డాలర్ల దాకా వెచ్చించనున్నట్లు పరిశ్రమవర్గాల అంచనా. -
అజీం ప్రేమ్‌జీ అండతో ఆ స్టార్టప్ అరుదైన ఘనత
ముంబై : భారత స్టార్టప్‌లు ఇబ్బందులను అధిగమిస్తూ ఎదుగుతున్న తీరు ఇన్వెస్టర్లలో నయా జోష్ నింపుతోంది. బిలియనీర్ అజీం ప్రేమ్‌జీ వెన్నుదన్నుతో సాఫ్ట్వేర్ స్టార్టప్‌గా మొదలైన ఐసెర్టిస్ తాజాగా 100 కోట్ల డాలర్ల క్లబ్లో చేరుతూ యూనికార్న్ ఘనతను సాధించింది. శాప్ ఎస్ఈ, ఒరాకిల్ కార్పొరేషన్లతో తలపడుతూ క్లౌడ్ కాంట్రాక్టులను నిర్వహించే సంస్థల వ్యాపారాలకు సేవలందించే ఐసెర్టిస్ తాజాగా 115 మిలియన్ డాలర్లను సమీకరించి అరుదైన ఘనతను అందుకుంది. పూణేకు చెందిన ఐసెర్టిస్‌లో ప్రేమ్‌జీ కుటుంబ కార్యాలయం నిర్వహించే ప్రేమ్‌జీఇన్వెస్ట్, గ్రేక్రాఫ్ట్ పార్టనర్స్ ఎల్ఎల్సీ, బీ క్యాపిటల్గ్రూప్, క్రాక్ క్రీక్ అడ్వైజర్స్ పెట్టుబడులు పెట్టాయి. తాజా పెట్టుబడులతో ఐసెర్టిస్ 211 మిలియన్ డాలర్లకుపైగా సమీకరించింది. ఐసెర్టిస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 57 లక్షల కాంట్రాక్టులు నిర్వహిస్తున్న కస్టమర్లకు సేవలందిస్తోందని, ప్రతి కంపెనీ అంతర్జాతీయంగా పోటీని ఎదుర్కొంటున్న క్రమంలో కాంట్రాక్టుల నిర్వహణకు ఆయా కంపెనీలకు సాఫ్ట్వేర్ అవసరం నెలకొందని సంస్థ సహ వ్యవస్ధాపకులు, సీఈవో సమీర్ బొదాస్ పేర్కొన్నారు. భారత టెక్నాలజీ స్టార్టప్‌లపై అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఉన్న విశ్వాసం, క్రేజ్‌కు ఐసెర్టిస్‌లో భారీ పెట్టుబడులతో వారు ముందుకు రావడమే నిదర్శమని టెక్ నిపుణులు చెబుతున్నారు. -
విప్రోకు ఉజ్వల భవిష్యత్: ప్రేమ్‌జీ
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉండబోతోందని, కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని సంస్థ వ్యవస్థాపక చైర్మన్ అజీం ప్రేమ్‌జీ చెప్పారు. ఇందుకోసం కొత్త వ్యూహాలు అమలు చేయనుందని ఆయన తెలిపారు. డిజిటల్, క్లౌడ్, ఇంజనీరింగ్ సేవలు, సైబర్ సెక్యూరిటీ విభాగాలపై భారీగా ఇన్వెస్ట్ చేయనుందని మంగళవారం కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో వివరించారు. ‘సామర్ధ్యాలను పెంచుకునేందుకు విప్రో భారీగా పెట్టుబడులు పెడుతుంది. మారే ప్రపంచానికి అనుగుణంగా తనను తాను మల్చుకుంటూ, విలువలకు కట్టుబడి ఇకపైనా ప్రస్థానం కొనసాగిస్తుంది. కొత్త శిఖరాలను అధిరోహిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విప్రో భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుంది‘ అని ప్రేమ్‌జీ చెప్పారు. షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు, షేర్హోల్డర్లు ఆమోదముద్ర వేశారని, సెబీ అనుమతుల మేరకు ఆగస్టునాటికి ఈ ప్రక్రియ పూర్తి కాగలదని ఆయన తెలిపారు. ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయనున్న ప్రేమ్‌జీ చివరిసారిగా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో ఇందులో పాల్గొన్నారు. సుమారు 53 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విప్రోకు సారథ్యం వహించిన ప్రేమ్‌జీ ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేసి, కంపెనీ పగ్గాలను కుమారుడు రిషద్ ప్రేమ్‌జీకి అందించనున్నారు. ప్రస్తుతం చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్‌గా ఉన్న రిషద్ ప్రేమ్‌జీ జూలై 31న ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. చైర్మన్‌గా ప్రేమ్‌జీకి ఆఖరు ఏజీఎం కావడం తో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. రిటైర్మెంట్ తర్వాత ఆయన విప్రో బోర్డులో నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగనున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలపై పూర్తి సమయం వెచ్చించనున్నారు. అసాధారణ ప్రయాణం..: ఏజీఎం సందర్భంగా కంపెనీ ప్రస్థానాన్ని ప్రేమ్‌జీ గుర్తు చేసుకున్నారు. ఒక చిన్నపాటి వంటనూనెల సంస్థగా మొదలెట్టిన కంపెనీ.. 8.5 బిలియన్ డాలర్ల భారీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజంగా ఎదిగిన తీరును ప్రస్తావించారు. ‘నా వరకూ ఇది ఒక అసాధారణ ప్రయాణం. ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ, విప్రో తనను తాను మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగుతోంది. విలువలకు కట్టుబడి ఉండటం, ఉద్యోగుల నిబద్ధత, శ్రమతోనే ఇదంతా సాధ్యమైంది. ఇదే విప్రో స్ఫూర్తి‘ అని ప్రేమ్‌జీ చెప్పారు. రిషద్ సారథ్యంలో మరింత వృద్ధిలోకి..: కొత్త ఆలోచనలు, విస్తృత అనుభవం, పోటీతత్వంతో తన వారసుడైన రిషద్ .. విప్రోను మరింతగా వృద్ధిలోకి తేగలరని ప్రేమ్‌జీ ఆకాంక్షించారు. ‘2007 నుంచి లీడర్షిప్ టీమ్‌లో రిషద్ భాగంగా ఉన్నారు. కంపెనీ గురించి, వ్యాపార వ్యూహాలు, సంస్కృతి గురించి తనకు పూర్తి అవగాహన ఉంది‘ అని ఆయన చెప్పారు. ఎండీగా ఆబిదాలి..: ప్రస్తుతం సీఈవోగా ఉన్న ఆబిదాలి నీముచ్వాలా జూలై 31 నుంచి విప్రో ఎండీ బాధ్యతలు కూడా చేపట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది. నారాయణన్ వాఘుల్, అశోక్ గంగూలీ విప్రో బోర్డు నుంచి పదవీ విరమణ చేయనున్నారు. నాన్–ఎగ్జిక్యూటివ్ స్వతంత్ర డైరెక్టరుగా ఎస్బీఐ మాజీ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య విప్రో బోర్డులో చేరతారు. -
విప్రో ప్రేమ్‌జీ రిటైర్మెంట్!!
న్యూఢిల్లీ: చిన్న స్థాయి వంట నూనెల సంస్థను దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దిన ఐటీ దిగ్గజం, విప్రో వ్యవస్థాపకుడు అజీం హెచ్ ప్రేమ్‌జీ త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ చేతికి పగ్గాలు అందించనున్నారు. వచ్చే నెల 74వ పడిలో అడుగుపెట్టనున్న అజీం ప్రేమ్‌జీ.. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి జూలై 30న రిటైరవుతున్నారు. ఆ తర్వాత నుంచి అజీం కుమారుడు, సంస్థ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్, బోర్డు సభ్యుడు అయిన రిషద్ ప్రేమ్‌జీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు చేపడతారు. రిటైరయ్యాక అజీం ప్రేమ్‌జీ అయిదేళ్ల పాటు 2024 దాకా విప్రో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కొనసాగుతారు. ఆయన వ్యవస్థాపక చైర్మన్‌గా ఉంటారని విప్రో పేర్కొంది. ‘దేశ టెక్నాలజీ పరిశ్రమ దిగ్గజాల్లో ఒకరు, విప్రో వ్యవస్థాపకులు అయిన అజీం ప్రేమ్‌జీ దాదాపు 53 ఏళ్లు కంపెనీకి సారథ్యం వహించిన తర్వాత జూలై 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన కంపెనీ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతారు’ అని స్టాక్ ఎక్సే్చంజీలకు విప్రో తెలియజేసింది. మరోవైపు చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆబిదాలి జెడ్ నీముచ్‌వాలాను మరో విడత అయిదేళ్ల పాటు సీఈవో, ఎండీ హోదాల్లో కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. విప్రో ఎంటర్ప్రైజెస్, విప్రో–జీఈ హెల్త్‌కేర్ చైర్మన్‌గా అజీం ప్రేమ్‌జీ కొనసాగుతారు. షేర్‌హోల్డర్ల అనుమతుల మేరకు జూలై 31 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని విప్రో వివరించింది. ‘ఇటు విప్రో, అటు టెక్నాలజీ పరిశ్రమ పెను మార్పులకు లోనవుతున్న తరుణంలో అన్ని వర్గాలకూ ప్రయోజనాలు చేకూర్చేలా కృషి చేసేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను’ అని రిషద్ పేర్కొన్నారు. ఇకపై పూర్తి స్థాయిలో సేవా కార్యక్రమాలు.. వంట నూనెల సంస్థగా మొదలైన విప్రోను 8.5 బిలియన్ డాలర్ల అంతర్జాతీయ టెక్ దిగ్గజంగా అజీం తీర్చిదిద్దారు. విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ను అంతర్జాతీయ ఎఫ్ఎంసీజీ సంస్థగా నిలబెట్టారు. ఇన్ఫ్రా ఇంజినీరింగ్, మెడికల్ డివైజ్‌ల తయారీ తదితర రంగాల్లోకి వ్యాపారాన్ని విస్తరించారు. వీటి ఆదాయం దాదాపు 2 బిలియన్ డాలర్ల పైగా ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాల గ్రహీత అయిన అజీం ప్రేమ్‌జీ రిటైర్మెంట్ తర్వాత దాతృత్వ కార్యకలాపాలు, సేవా కార్యక్రమాల్లో మరింతగా పాలుపంచుకోవాలని భావిస్తున్నారు. ‘ఈ సుదీర్ఘ ప్రస్థానం ఎంతో సంతృప్తికరం. భవిష్యత్‌లో మా ఫౌండేషన్ సామాజిక సేవా కార్యకలాపాలకు మరింత సమయం వెచ్చించాలనుకుంటున్నాను. కంపెనీని అధిక వృద్ధి బాట పట్టించగలిగే సామర్థ్యాలు రిషద్‌కు ఉన్నాయని గట్టిగా విశ్వసిస్తున్నాను‘ అని ప్రేమ్‌జీ పేర్కొన్నారు. తన పేరిటే ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా ప్రేమ్‌జీ సేవా కార్యకలాపాల్లో ఉన్నారు. ఈ ట్రస్టు కు రూ. 52,750 కోట్ల విలువ చేసే విప్రో షేర్లను ఈ ఏడాది మార్చిలో ఆయన విరాళంగా ఇచ్చారు. ప్రేమ్‌జీ ఫౌండేషన్ విద్యా రంగంలో సేవలు అందించడంతో పాటు బడుగు వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న దాదాపు 150 పైగా స్వచ్ఛంద సేవా సంస్థలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తోంది. -
అజీం ప్రేమ్‌జీ సంచలన నిర్ణయం
సాఫ్ట్వేర్ సేవల సంస్థ విప్రో ఫౌండర్, చైర్మన్ అజీం ప్రేమ్‌జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. జులై చివరి నుంచి విప్రో ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలనుంచి విశ్రాంతి తీసుకోనున్నారని విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి వాటాదారుల ఆమోదం పొందాల్సి వుందని పేర్కొంది. అయితే ప్రేమ్‌జీ బోర్డులో తే ఐదేళ్ల పాటు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ , వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతారని విప్రో వెల్లడించింది. విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా 53 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తరువాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అజీం ప్రేమ్‌జీ స్థానంలో ఆయన కుమారుడు, ప్రస్తుత చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ రిషద్ ప్రేమ్‌జీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించనున్నారు. 2024 జూలై 30 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు అలాగే కొత్త ఎండీ, సీఈవో బాధ్యతలను తిరిగి అబిదాలి నీముచ్ చేపట్టనున్నారు. జూలై 31, 2019నుంచి ఈ నియామకం అమల్లోకి రానున్నాయి. "ఇది నాకు చాలా సుదీర్ఘమైన, సంతృప్తికరమైన ప్రయాణం. భవిష్యత్తులో దాతృత్వ కార్యక్రమాలపై మరింత దృష్టి కేంద్రీకరించడంతోపాటు ఎక్కువ సమయాన్ని కేటాయించాలని ప్రణాళిక వేసుకున్నాను’’ అని అజీం ప్రేమ్‌జీ ఒక ప్రకటనలో తెలిపారు. వాటా దారుల ప్రయోజనాలను కాపాడటంలో రిషద్ నేతృత్వంలోని విప్రో టీం ముందుంటుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
50 లక్షల ఉద్యోగాలు ఆవిరి
బెంగళూరు: దేశంలో 2011 నుంచి 2018 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో నిరుద్యోగం రెండింతలు పెరిగినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో ఉద్యోగావకాశాలు క్షీణించడంతోపాటు గడిచిన రెండేళ్ల(2016–18)లో 50 లక్షల మంది పురుషులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు జరిగిన నాటి నుంచే దేశంలో ఉద్యోగావకాశాలు తగ్గుతూ వచ్చాయని తెలిపింది. అయితే ఉద్యోగావకాశాల క్షీణతకు పెద్ద నోట్ల రద్దుకు ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేకున్నా.. పెద్ద నోట్ల రద్దు జరిగిన నవంబర్ 2016 నుంచే ఉద్యోగాలు తగ్గిపోవడం గమనార్హం అని పేర్కొంది. ది స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా(ఎస్‌డబ్ల్యూఐ)–2019 పేరిట బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఈ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను దేశంలోని ఉద్యోగాల స్థితిగతులను లెక్కించే కన్సూమర్ పిరమిడ్స్ సర్వే ఆఫ్ ది సెంటర్ ఫర్ మోనిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ(సీఎమ్ఐఈ–సీపీడీఎక్స్) సంస్థ నుంచి 2016–18 మధ్య గల సమాచారాన్ని సేకరించి రూపొందించారు. ఈ నివేదికలో కేవలం పురుషులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఒకవేళ మహిళలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కోల్పోయిన ఉద్యోగాల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. నిరుద్యోగుల్లో ముఖ్యంగా ఉన్నత చదువులు చదివిన వారితోపాటు యువకులే అధికంగా ఉన్నారని పేర్కొంది. ఇదేకాలంలో తక్కువ విద్యార్హత గల వారు కూడా ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు ఆ స్థాయిలో కూడా ఉద్యోగావకాశాలు తగ్గాయని తెలిపింది. ఈ విషయంలో మహిళల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని పేర్కొంది. ఈ నివేదిక రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించిన అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అమిత్ బాసోల్ మంగళవారం ఇక్కడ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఉద్యోగాలను సృష్టించేందుకు కొన్ని పరిష్కార మార్గాలను నివేదికలో తాము సూచించామని అన్నారు. ‘మేము సూచించిన పరిష్కార మార్గాలు ఉద్యోగాల సృష్టికి ఊతమివ్వడంతోపాటు దేశంలోని అందరికీ సమానమైన ఉద్యోగావకాశాలను కల్పిస్తాయని బలంగా నమ్ముతున్నాం’అని పేర్కొన్నారు. పరిష్కార మార్గాలు.. ► దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ తరహాలోనే అర్బన్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ తేవాలని నివేదిక సూచించింది. దీని ద్వారా చిన్న పట్టణాల్లో సుమారు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలిపింది. ► స్థూల దేశీయ ఉత్పత్తిలో విద్యపై 6 శాతం, వైద్యంపై 3 శాతం అదనంగా ఖర్చు పెట్టగలిగితే సుమారు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించవచ్చని వెల్లడించింది. అలాగే దీని ద్వారా అత్యంత నాణ్యమైన ప్రజా సేవలను అందించవచ్చని పేర్కొంది. ► భారతీయ తయారీ రంగాన్ని పునరుద్ధరించడానికి సరికొత్త పారిశ్రామిక విధానం తీసుకురావడం అత్యవసరమని స్పష్టం చేసింది. -
బిల్ గేట్స్‌కే ప్రేరణనిస్తున్న మహాదాత ఎవరో తెలుసా?
సమాజ సేవకు, ముఖ్యంగా విద్యకు భారీగా నిధులను కేటాయించే విప్రో ఛైర్మన్, ఇండియన్ బిలియనీర్ అజీమ్ ప్రేమ్‌జీ తన ఉదారతతో ప్రపంచ దాతలను సైతం ఆకర్షిస్తున్నారు. తాజాగా ప్రపంచ కుబేరుడు, మహాదాత, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఆయనపై ప్రశంసలు కురిపించారు. సమాజానికి ప్రేమ్‌జీ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమైనవని వ్యాఖ్యానించారు. సామాజిక వేదిక ట్విటర్ ద్వారా బిల్‌గేట్స్ తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు. అజీమ్ ప్రేమ్‌జి తాజా వితరణ తనకు ఎంతో ఉత్సాహానిచ్చిందని పేర్కొన్నారు. ఇది అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. ముఖ్యంగా సమాజానికి ప్రేమ్‌జీ అందిస్తున్న స్వచ్ఛంద సహకారం, దాతృత్వం, చూపిస్తున్న నిబద్ధత ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాతలకు ప్రేరణనిస్తుందని బిల్ గేట్స్ ట్వీట్ చేశారు. కాగా విప్రోలోనితన వాటాల్లో 34 శాతం వాటాలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను తన దాతృత్వ కార్యక్రమాల ఫౌండేషన్‌కు కేటాయించినట్టు ఇటీవల అజీమ్ ప్రేమ్‌జీ ప్రకటించారు. రూ.52,700 కోట్లను అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు అందించారు. దీంతో ప్రేమ్‌జీ అందించిన విరాళం విలువ మొత్తం రూ.1.45 లక్షల కోట్లకు (21 బిలియన్ డాలర్లు) చేరిన సంగతి తెలిసిందే. చదవండి: సంచలనం : వేల కోట్ల రూపాయల విరాళం I’m inspired by Azim Premji’s continued commitment to philanthropy. His latest contribution will make a tremendous impact. https://t.co/IOTiHxtivw — Bill Gates (@BillGates) March 24, 2019 -
సమాజానికి ప్రేమతో రూ.52,700 కోట్లు!
న్యూఢిల్లీ: విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సమాజ సేవ కోసం మరింత సంపదను కేటాయించారు. విప్రోలోని తన వాటాల్లో 34 శాతం వాటాలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను తన దాతృత్వ కార్యక్రమాల ఫౌండేషన్‌కు కేటాయించినట్టు ప్రకటించారు. ప్రేమ్‌జీ నియంత్రణలోని పలు సంస్థల నిర్వహణలో ప్రస్తుతం ఈ వాటాలున్నాయని, వీటి మార్కెట్ విలువ రూ.52,700 కోట్లుగా అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ తన ప్రకటనలో తెలిపింది. దీంతో తన ఫౌండేషన్ కార్యక్రమాలకు ప్రేమ్‌జీ కేటాయించిన మొత్తం రూ.1.45 లక్షల కోట్లకు (21 బిలియన్ డాలర్లు) చేరింది. ఇందులో విప్రోలోని 67 శాతం వాటాలకు సంబంధించిన ఆర్థిక యాజమాన్య హక్కులు కూడా ఉన్నాయి. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా ప్రేమ్‌జీనే వ్యవహరిస్తున్నారు. దాతృత్వ కార్యక్రమాలకు ఆయన గతంలోనే భారీ కేటాయింపులు జరపగా, తాజాగా వీటిని మరింత పెంచారు. 2018 డిసెంబర్ నాటికి విప్రోలో ప్రమోటర్ హోల్డింగ్ 74.3 శాతంగా ఉంది. దేశంలో విద్యా సంబంధిత కార్యక్రమాలతోపాటు పలు ఇతర విభాగాల్లో పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సాయం అందిస్తోంది. కర్ణాటక, ఉత్తరాఖండ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఈశాన్య భారత్‌లో ఫౌండేషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పాఠశాల విద్యా వ్యవస్థ మెరుగు కోసం ఇనిస్టిట్యూషన్లను ఏర్పాటు చేస్తోంది. బెంగళూరులో అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసింది. వచ్చే కొన్నేళ్లలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నట్టు ఫౌండేషన్ తెలిపింది. ఉత్తరభారత్‌లోనూ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. సమానత, మానవతతో కూడిన స్థిరమైన సమాజం కోసం అన్నది ప్రేమ్‌జీ ఫౌండేషన్ లక్ష్యం. -
ఒక కోటీశ్వరుడు = ఒక రాష్ట్రం
మన దేశం ఒకవైపు ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. మరోవైపు దేశంలో ‘కొందరి’వ్యక్తిగత ఆస్తులు లక్షల కోట్లకు పెరుగుతున్నాయి. కొంతమంది సంపద విలువ ఒక రాష్ట్రం లేదా కొన్ని రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తి విలువతో సమానం లేదా అంతకంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. అంటే ఒక్కో కోటీశ్వరుడు ఒక రాష్ట్ర జీడీపీతో సమానమన్న మాట. ఉదాహరణకు ముకేశ్ అంబానీ ఆస్తుల నికర విలువ 3.3 లక్షల కోట్లు. ఇది ఒడిశా రాష్ట్ర జీడీపీ (3.46 లక్షల కోట్లు)కి దాదాపు సమానం. అజిమ్ ప్రేమ్‌జీ సంపద గోవా, త్రిపుర, పాండిచ్చేరిల మొత్తం జీడీపీ కంటే కూడా పది వేల కోట్లు ఎక్కువ. ‘ఇండియా స్పెండ్’విశ్లేషణ ప్రకారం మన దేశంలో పది మంది అత్యంత ధనవంతుల మొత్తం ఆస్తి కొన్ని రాష్ట్రాల జీడీపీతో సమానం. దేశంలో కేవలం తొమ్మిది మంది కోటీశ్వరుల సంపద దేశ జనాభాలో ఆదాయం రీత్యా దిగువ 50 శాతం మంది మొత్తం సంపదతో సమానమని అంతర్జాతీయ అసమానతలపై ఆక్స్‌ఫాం నివేదిక– 2019 స్పష్టం చేసింది. దేశ సంపదలో 52 శాతం 9 మంది వద్దే ఉంది. ఆర్థికపరంగా దిగువన ఉన్న 60 శాతం జనాభా దగ్గర కేవలం 5 శాతం సంపద మాత్రమే ఉంది. సాధారణంగా ఇతర దేశాల్లో సంపదంతా జనాభాలో ఒక శాతం మంది దగ్గరే ఉంటుంది. అదే 120 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఇది కేవలం తొమ్మిది మంది (0.000000075%) దగ్గరే ఉంది. 1982–83లో ఆదాయం రీత్యా పైనున్న ఒక శాతం జనాభా ఆదాయం మొత్తం దేశం ఆదాయంలో 6 శాతం ఉంది. 1992–93 నాటికది 10 శాతానికి పెరిగింది. 2000 నాటికి 15 శాతం కాగా, 2014 నాటికి దాదాపు 23 శాతానికి పెరిగింది. దేశం మొత్తం ఆదాయంలో పైనున్న ఒక శాతం జనాభా అత్యధిక వాటా కలిగిన దేశాల్లో భారతదేశం నాలుగో స్థానంలో ఉంది. బ్రెజిల్, టర్కీ, జాంబియా మొదటి స్థానాల్లో ఉన్నాయి. 2018లో దేశంలో కోటీశ్వరుల సంపద 35 శాతం పెరిగింది. అంటే రోజుకు 2,200 కోట్లు చొప్పున పెరిగింది. ముకేశ్ అంబానీ.. 2017–18 లెక్కల ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆస్తుల నికర విలువ రూ.3,31,525 కోట్లు. ఇది ఒడిశా జీడీపీకి దాదాపు సమానం. ఒడిశా జీడీపీ 3,46,294 కోట్లు. ఈశాన్య రాష్ట్రాల మొత్తం జీడీపీ కలిపినా కూడా అంబానీ సంపద కంటే చాలా తక్కువ. అజిమ్ ప్రేమ్‌జీ... విప్రో అధినేత ప్రేమ్‌జీ ఆస్తుల విలువ 1,47,189 కోట్లు. గోవా, త్రిపుర, పుదుచ్చేరి జీడీపీ కంటే ఇది పది వేల కోట్లు అధికం. లక్ష్మీ మిట్టల్... ఉక్కు పరిశ్రమ ఆర్సెల్ మిట్టల్ సీఈవో లక్ష్మీ మిట్టల్ ఆస్తుల విలువ రూ.1,28,264 కోట్లు. ఇది హిమాచల్‌ప్రదేశ్ జీడీపీ (రూ.1.52 లక్షల కోట్లు) కంటే కొంచెం తక్కువ. హిందూజా.. హిందూజాల నికర సంపద రూ.1,26,162 కోట్లు. ఉత్తరా ఖండ్ జీడీపీ (రూ.2.58 లక్షల కోట్లు)లో ఇది సగం ఉంది. పల్లోంజి మిస్త్రీ... 153 ఏళ్ల చరిత్ర గల షాపూర్జీ పల్లోంజీ గ్రూపు చైర్మన్ మిస్త్రీకి రూ.1,10,041 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఇది గోవా జీడీపీ (రూ.70,400 కోట్లు) కంటే దాదాపు 40,000 కోట్లు ఎక్కువ. శివనాడార్... హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ నాడార్ ఆస్తుల విలువ 1,02, 331 కోట్లు. 2018లో ఫోర్బ్స్ 100 మంది ధనవంతుల జాబి తాలో 4వ స్థానంలో నిలిచారు. ఈయన ఆస్తుల విలువ జార్ఖండ్ జీడీపీ(రూ.2.82లక్షల కోట్లు)లో దాదాపు సగం. గోద్రేజ్... గోద్రేజ్ గ్రూపు మొత్తం ఆస్తుల విలువ రూ.98,126 కోట్లు. ఇది గోవా జీడీపీ (రూ.70,400 కోట్లు) కంటే 25 వేల కోట్లు ఎక్కువ. దిలీప్ సంఘ్వి... సన్ ఫార్మాస్యుటికల్స్ వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వికి రూ.88,313 కోట్ల విలువైన సంపద ఉంది. ఇది మేఘాలయ జీడీపీ రూ.24,202 కోట్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువ. కుమార మంగళం.. బిర్లా సంస్థ అధినేత కుమార మంగళం బిర్లా నికర ఆస్తుల విలువ రూ.87,612 కోట్లు. సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ల మొత్తం జీడీపీ కంటే ఇది దాదాపు పది వేల కోట్లు అధికం. గౌతం అదానీ... అదానీ గ్రూపు వ్యవస్థాపకుడు గౌతం అదానీ సంపద విలువ రూ.83,407 కోట్లు. ఇది కూడా నాలుగు ఈశాన్య రాష్ట్రాల జీడీపీ కంటే ఎక్కువే. -
అజీం ప్రేమ్‌జీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో అధిపతి అజీం ప్రేమ్‌జీకి అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ ప్రభుత్వం ఆయనను అత్యున్నత ‘షెవాలీర్ డె లా లెజియన్ డిఆనర్’ (నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్) పురస్కారంతో సన్మానించనుంది. ఐటీ దిగ్గజంగా భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి, వితరణశీలిగా సమాజానికి చేస్తున్న సేవలకు గాను ఈ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు ఫ్రాన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెలాఖరులో జరిగే కార్యక్రమంలో భారత్‌లో ఫ్రాన్స్ దౌత్యవేత్త అలెగ్జాండర్ జిగ్లర్ దీన్ని ఆయనకు అందజేయనున్నట్లు వివరించింది. ఐటీ దిగ్గజంగానే కాకుండా అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్, విశ్వవిద్యాలయం ద్వారా సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా ప్రేమ్‌జీ నిమగ్నమైన నేపథ్యంలో ఫ్రాన్స్ పురస్కారం ప్రాధాన్యం సంతరించుకుంది. నవంబర్ 28–29 తారీఖుల్లో జరిగే బెంగళూరు టెక్ సదస్సులో పాల్గొంటున్న సందర్భంగా జిగ్లర్ ఈ పురస్కారాన్ని ప్రేమ్‌జీకి అందజేయనున్నారు. -
ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో మనోళ్లు ముగ్గురు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారతదేశంలో ఈ యేటి శ్రీమంతులంటూ ఫోర్బ్స్ వెలువరించిన జాబితాలో మళ్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీయే అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. దాదాపు రూ.3.4 లక్షల కోట్ల సంపదతో ఆయన నంబర్–1 స్థానంలో నిలిచారు. నిజానికి లిస్టెడ్ కంపెనీ అయిన రిలయన్స్... గత కొద్ది రోజుల్లోనే ఏకంగా 20 శాతం వరకూ పతనమయింది. ఫోర్బ్స్ జాబితా గనక ఇప్పుడు వెలువరించి ఉంటే ఆయన సంపద రూ.3 లక్షల కోట్లకన్నా తక్కువే ఉండేదన్నది మార్కెట్ వర్గాల మాట. ఇక 1.5 లక్షల కోట్ల సంపదతో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ రెండవ స్థానంలో నిలిచారు. మొదటి– రెండు స్థానాల మధ్య తేడా దాదాపు సగానికన్నా అధికంగా ఉండటం గమనార్హం. భారతీయ కుబేరుల జాబితాలో 3వ స్థానంలో ఆర్సెలర్ మిట్టల్ అధినేత లక్ష్మీ నివాస్ మిట్టల్ నిలిచారు. ఈయన సంపద దాదాపు 1.3 లక్షల కోట్లు. తరువాతి స్థానాల్లో వరసగా హిందూజా సోదరులు, పల్లోంజీ మిస్త్రీ, హెచ్‌సీఎల్ గ్రూప్ అధిపతి శివ్ నాడార్, గోద్రెజ్ కుటుంబం నిలిచాయి. ఫోర్బ్స్ మొత్తంగా 100 మందితో ఈ జాబితాను వెలువరించింది. తెలుగు వారు ముగ్గురు!! భారతదేశంలోని టాప్–100 శ్రీమంతులతో ఫోర్బ్స్ రూపొందించిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికి చోటు దక్కింది. దాదాపు రూ.22,300 కోట్ల సంపదతో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధిపతి పి.పి.రెడ్డి ఈ రెండు రాష్ట్రాల నుంచీ అగ్రస్థానంలో నిలిచారు. మొత్తంగా చూస్తే మాత్రం జాబితాలో ఈయనది 47వ స్థానం. దాదాపు రూ.20వేల కోట్లతో అరబిందో ఫార్మా అధిపతి పి.వి.రామ్‌ప్రసాద్ రెడ్డి, రూ.19,800 కోట్లతో దివీస్ ల్యాబ్స్ అధిపతి మురళి ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు. మొత్తంగా చూస్తే ఫోర్బ్స్ జాబితాలో వీరు 50, 53 స్థానాల్లో నిలిచారు. (గమనిక: ఫోర్బ్స్ ఈ జాబితాలో సంపదను డాలర్లలో లెక్కించగా... రూపాయిల్లోకి మార్చేటపుడు డాలర్ విలువను రూ.72గా పరిగణించటం జరిగింది.) -
విప్లవాత్మక టెక్నాలజీల్లో ఫలితాలనిస్తున్న పెట్టుబడులు: ప్రేమ్‌జీ
బెంగళూరు: విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చే టెక్నాలజీలపై ఆరంభంలో విప్రో చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తున్నట్టు ఆ సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ తెలిపారు. విప్రో వాటాదారుల 72వ వార్షిక సమావేశంలో ప్రేమ్‌జీ మాట్లాడారు. తమ క్లయింట్లను విజయవంతం చేసేందుకు వీలుగా, పరిశ్రమలో ముందుండేందుకు వీలుగా తమ సేవల్ని తీర్చిదిద్దుకుంటున్నట్టు చెప్పారు. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్:)విభాగంలో కంపెనీ వృద్ధి నెలకొనగా, ఇప్పుడు కన్జ్యూమర్ విభాగంలో పరీక్షించుకుంటున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా మారుతున్నట్టు చెప్పారు. 2017 ప్రారంభం నుంచి అంతర్జాతీయంగా చాలా వరకు పెద్ద ఆర్థిక వ్యవస్థలు మంచి పనితీరును చూపిస్తున్నాయని, టెక్నాలజీలో చోటు చేసుకుంటున్న అభివృద్ధి సమీకరణాలు అసాధారణ స్థాయికి చేరుతున్నాయని ప్రేమ్‌జీ వివరించారు. భారత్, అమెరికా, యూరోప్ దేశాలు, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. కంపెనీలు చురుగ్గా ఉంటూ టెక్నాలజీను స్వీకరిస్తూ తమను తాము మార్చుకోవాలని, మరీ ముఖ్యంగా తమ కస్టమర్ల అనుభవాన్ని మార్చే విధంగా ఉండాలని సూచించారు. -
ఫ్యూచర్ రిటైల్‌లో ప్రేమ్‌జీ పాగా
న్యూఢిల్లీ: ఐటీ రంగ ప్రముఖుడు, విప్రో సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ ఫ్యూచర్ రిటైల్‌లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ఫ్యూచర్ రిటైల్‌లో భారతీ గ్రూపు తనకున్న వాటాల్లోంచి 6 శాతాన్ని రూ.1,700 కోట్లకు ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు విక్రయించింది. గురువారం బ్లాక్‌డీల్ రూపంలో ఈ లావాదేవీ జరిగింది. ‘‘ఫ్యూచర్ రిటైల్‌లో భారతీ గ్రూపు ప్రమోటర్లు మిట్టల్ కుటుంబానికి మొత్తం 9 శాతం వాటా ఉండగా, ఇందులో 6 శాతాన్ని ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు (ప్రేమ్‌జీకి చెందిన పెట్టుబడుల విభాగం) విక్రయించారు. ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ ప్రస్తుతం కన్జ్యూమర్ విభాగంలో అతిపెద్ద ఇన్వెస్టరుగా ఉంది. ఫ్యూచర్ లైఫ్‌స్టయిల్ ఫ్యాషన్‌లోనూ పెట్టుబడులున్నాయి’’ అని ఫ్యూచర్ గ్రూపు అధినేత కిశోర్ బియానీ తెలిపారు. అయితే, తాజా వాటా విక్రయంలో భారతీ గ్రూపునకు మొత్తం రూ.1,700 కోట్లు వెళ్లవు. ఇందులో రూ.575 కోట్లు ’క్లా బ్యాక్‘ నిబంధన కింద తిరిగి ఫ్యూచర్ రిటైల్కే వస్తాయి. ఈ నిధుల్ని విస్తరణ కార్యకలాపాలపై వెచ్చిస్తామని కిశోర్ బియానీ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తాజా విక్రయం అనంతరం ఫ్యూచర్ రిటైల్‌లో భారతీ గ్రూపు ‘సెడార్ సపోర్ట్ సర్వీసెస్’ ద్వారా ఇంకా 3 శాతం వాటా కలిగి ఉంటుంది. -
అదానీ, అంబానీలు భారీగా కోల్పోయారు
న్యూఢిల్లీ : భారత టాప్ 20 బిలీనియర్లు తమ సంపదను భారీగా కోల్పోయారు. 2018 ప్రారంభం నుంచి వీరు తమ నికర సంపదలో 17.85 బిలియన్ డాలర్లు కోల్పోయినట్టు బ్లూమ్‌బర్గ్ బిలీనియర్ ఇండెక్స్ వెల్లడించింది. కేవలం టాప్ 5లో ఉన్నవారే 15 బిలియన్ డాలర్ల మేర సంపదను హరించుకున్నారని తెలిపింది. భారీగా సంపదను కోల్పోయిన వారిలో గౌతమ్ అదానీ తొలి స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 3.68 బిలియన్ డాలర్ల హరించుకుపోయి 6.75 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదానీ బాగా ప్రయోజనాలు పొందారని తెలిసింది. అయినప్పటికీ ఈ ఏడాది ప్రారంభం నుంచి మాత్రం ఆయనే ఎక్కువగా సంపదను కోల్పోయారు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఈ క్యాలండర్ ఏడాదిలో 7 శాతం నుంచి 45 శాతం వరకు నష్టపోయాయి. అదానీ ఎంటర్‌ప్రైజస్, అదానీ పవర్, అదానీ ట్రాన్సమిషన్, అదానీ పోర్ట్స్ సెజ్ కలిపి కేవలం తమ నికర లాభాలను 13.76 శాతం మాత్రమే పెంచుకోగలిగాయి. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్‌లో అదానీ 242వ సంపన్నుడిగా ఉన్నారు. మరో బిగ్ లూజర్‌గా అజిమ్ ప్రేమ్‌జీ నిలిచారు. దేశంలో మూడో పెద్ద ఐటీ సంస్థగా పేరున్న విప్రో వాటా కలిగి ఉన్న ప్రేమ్‌జీ, కంపెనీ ఇటీవల గడ్డు పరిస్థితులను ఎదుర్కొనడంతో తన సంపదను కోల్పోయినట్టు బ్రోకరేజ్ సంస్థ షేర్‌ఖాన్ తెలిపింది. ఇప్పటి వరకు ఈ కంపెనీ స్టాక్ 16 శాతం వరకు పడిపోయింది. సన్ ఫార్మాస్యూటికల్స్ అధిపతి బిలీనియర్ దిలీప్ సంఘ్వి కూడా తన నికర సంపదలో 3.48 బిలియన్ డాలర్లు పోగొట్టుకుని, 9.34 బిలియన్ డాలర్లగా నమోదు చేసుకున్నట్టు బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ తెలిపింది. అంటే ఈయన సంపద కూడా 21 శాతం మేర కిందకి పడిపోయింది. సంఘ్వి ప్రస్తుతం బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్‌లో 153వ సంపన్నుడిగా ఉన్నారు. మరో దిగ్గజం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూడా తన నికర సంపదలో 2.83 బిలియన్ డాలర్లను చేజార్చుకున్నారు. దీంతో ఈయన నికర సంపద 37.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ప్రస్తుతం అంబానీ ఈ భూమిపైనే 21వ సంపన్న వ్యక్తిగా పేరు గడిస్తున్నారు. ఈ క్యాలెండర్ ఏడాదిలో రిలయన్స్ షేర్లు 1 శాతం మేర పడిపోవడంతో పాటు అంబానీ ప్రమోట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ షేర్లు 25 శాతం పడిపోవడం, అంబానీ వాటా కలిగి ఉన్న రెండు మీడియా సంస్థల షేర్లు క్షీణించడం దీనికి కారణమైనట్టు తెలిసింది. సంపదను కోల్పోయిన వారిలో కుమార్ బిర్లా, కేపీ సింగ్, సిప్రస్ పూనవాలా ఉన్నారు. -
అంబానీతో పాటు మరో నలుగురు..
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మరోసారి బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్‌లో తన సత్తా చాటారు. బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ టాప్ 100 ఇండెక్స్‌లో అంబానీ 19వ స్థానంలో నిలిచారు. అంతేకాక ఆసియాలోనే మూడో అత్యంత ధనిక వ్యక్తిగా పేరొందారు. 38.3 బిలియన్ డాలర్లు(రూ.2,49,160 కోట్లకు పైగా) సంపదతో ముఖేష్ అంబానీ ఈ స్థానంలో నిలిచారని బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ పేర్కొంది. అంబానీతో పాటు మరో నలుగురు భారతీయులు కూడా బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్‌లో చోటు దక్కించుకున్నారు. వారిలో ఆర్సెలర్‌మిట్టల్ సీఈవో లక్ష్మి మిట్టల్, షాపూర్జీ పల్లోంజి గ్రూప్ చైర్మన్ పల్లోంజి మిస్త్రీ, విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ చైర్మన్ శివ్ నాడార్లు ఉన్నారు. బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ టాప్ 500 ఇండెక్స్‌లో మొత్తంగా 24 మంది భారతీయులు ఉన్నట్టు తెలిసింది. గతేడాదితో పోలిస్తే అంబానీ సంపద 9.3 బిలియన్ డాలర్లు పెరిగింది. కాగ, ఈ ఇండెక్స్‌లో ప్రథమ స్థానంలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఉన్నారు. ఆయన తర్వాతి స్థానంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఉన్నట్టు తెలిసింది. అమెరికన్లను మినహాయిస్తే, కేవలం ఇద్దరు యూరోపియన్లు మాత్రమే ఈ ఇండెక్స్‌లో చోటు దక్కించుకున్నారు. వారిలో ఒకరు జరా వ్యవస్థాపకుడు అమెంషియో ఓర్టెగా, రెండో వ్యక్తి లగ్జరీ బ్రాండు ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్. ఆసియా నుంచి అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా, టెన్సెంట్ కో-ఫౌండర్, సీఈవో పోనీ మా లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. -
భారత ఆర్థికవ్యవస్థలో 10 శాతం వీరివద్దనే
న్యూఢిల్లీ : భారత ఆర్థికవ్యవస్థ 2 ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు కోటి కోట్లకు పైగానే. ఈ కోటి కోట్లలో సుమారు 10 శాతం మేర సంపద, అంటే 200 బిలియన్ డాలర్లకు పైనా సంపద దేశంలోని టాప్-20 పారిశ్రామికవేత్తల దగ్గరే ఉన్నట్టు తెలిసింది. 2017 తొలి ఏడు నెలల కాలంలో వీరి సంపద అదనంగా 50 బిలియన్ డాలర్ల మేర పెరిగినట్టు బ్లూమ్‌బర్గ్ బిలీనియర్ ఇండెక్స్‌లో వెల్లడైంది. 18 మంది టాప్ ఇండియన్ బిలీనియర్లలో ప్రతి ఒక్కరూ ఈ ఏడు నెలల కాలంలో తమ సంపదను 1 బిలియన్ డాలర్లు(రూ.6400 కోట్లు) లేదా అంతకంటే ఎక్కువగానే పెంచుకున్నారని ఈ ఇండెక్స్ తెలిపింది. ఆయిల్ నుంచి టెలికాం వరకు వ్యాపారాలతో మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన సంపదను అదనంగా ఏకంగా 13 బిలియన్ డాలర్లను పెంచుకున్నట్టు తెలిసింది. అదేవిధంగా అదానీ గ్రూపుకు చెందిన గౌతమ్ అదానీ, విప్రో అజిమ్ ప్రేమ్‌జీ, ఆర్కే దమానీ వంటి వారు బ్లూమ్‌బర్గ్ డేటాలో దూసుకుపోయినట్టు వెల్లడైంది. వీరి సంపద 3-4 బిలయన్ డాలర్ల మధ్యలో ఎగిసినట్టు ఇండెక్స్ తన రిపోర్టులో పేర్కొంది. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు తొమ్మిదేళ్ల గరిష్టంలో ట్రేడవుతున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ జియోను విజయవంతంగా ఈ ఇండస్ట్రీస్‌ను లాంచ్ చేయడంతో తమ, నమ్మకం మరింత పెరుగుతుందని గ్రూప్ చెబుతోంది. విప్రో ప్రమోట్చేస్తున్న అజిమ్ ప్రేమ్‌జీ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో వాటాను కలిగి ఉన్నారు. అంతేకాక ఎన్సీసీ, జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, జేఎం ఫైనాన్సియల్ సంస్థల్లో అజిమ్ ప్రేమ్‌జీ ట్రస్ట్ వాటాలను కలిగి ఉంది. వీటన్నింటితో ప్రేమ్‌జీ సంపద 3.8 బిలియన్ డాలర్లు ఎగిసి 16 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ముఖేష్ అంబానీ, ప్రేమ్‌జీ మాత్రమే కాక, దమానీ, గౌతమ్ అదానీ, ఉదయ్ కొటక్, కుమార్ మంగళం బిర్లా, పంకజ్ పటేల్, విక్రమ్ లాల్, లక్ష్మీ మిట్టల్, కేపీ సింగ్, అజయ్ పిరామిళ్, పల్లోజి మిస్త్రీ వంటి వారు బ్లూమ్‌బర్గ్ బిలీనియర్ ఇండెక్స్‌కి ప్రతేడాది 2 బిలియన్ డాలర్లను అందిస్తున్నారు. -
ఇరకాటంలో పడ్డ ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ డీల్
ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ విలీనానికి అజిమ్ ప్రేమ్ జీ మెలక పెట్టారు. ఈ డీల్ తుదిఆమోదం పొందితే, మైనార్టీ షేర్ హోల్డర్స్ హక్కులను ఎలా రక్షిస్తారని ప్రేమ్ జీ పెట్టుబడుల సంస్థ ప్రశ్నించింది. ఫ్లిప్ కార్ట్ కొనాలనుకుంటున్న స్నాప్‌డీల్ లో విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీకి మైనార్టీ స్టేక్ ఉంది. ఈ విషయంపై మరోసారి స్పష్టమైన వివరణ ఇవ్వాలని ప్రేమ్‌జీ పెట్టుబడుల సంస్థ అడుగుతోంది. దీంతో ఈ డీల్ మరికొంత కాలం ఆలస్యమయ్యే అవకాశముందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలలుగా ఈ పెట్టుబడుల సంస్థ దీనిపై తమకు క్లారిటీ కావాలని అడుగుతూనే ఉంది. ఇతర మైనార్టీ ఇన్వెస్టర్ల ఆందోళనలను కూడా ఈ సంస్థ కంపెనీ బోర్డు సభ్యుల ముందు ఉంచుతోంది. అంతేకాక ఈ విలీన డీల్ లో స్నాప్ డీల్ ఇద్దరి సహవ్యవస్థాపకులకు, మరో ఇద్దరికి స్పెషల్ చెల్లింపులు చేయాలని బోర్డు సభ్యులు నిర్ణయించారు. కానీ దీనికి ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ అడ్డుచెబుతోంది. బుధవారం స్నాప్ డీల్ బోర్డుకు రాసిన లేఖలో ఎంపికచేసిన స్నాప్ డీల్ షేర్ హోల్డర్స్, వ్యవస్థాపకులు చెల్లించే 90మిలియన్ డాలర్లు తమకు ఆమోదయోగ్యంగా లేవని, ఉద్యోగులకు చెల్లిదామనుకున్న 30 మిలియన్ డాలర్ల స్పెషల్ పేమెంట్ల ప్రతిపాదన తమకు సమ్మతమేనని ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ పేర్కొంది. ఈ తారతమ్యంతో కూడిన పేమెంట్లు, కేవలం పెద్ద స్నాప్ డీల్ ఇన్వెస్టర్లకు, వ్యవస్థాపకులకు మాత్రమే మేలు చేకూరుతుందని ప్రేమ్ జీ ఇన్వెస్ట్ ఆందోళన వ్యక్తంచేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థను తక్కువ విలువ కట్టి, ఫ్లిప్ కార్ట్ కు అమ్మబోతున్నారు. ఒకప్పుడు 40వేల కోట్లతో స్నాప్ డీల్ ను కొనడానికి ముందుకొచ్చిన సంస్థలు, తర్వాత దానిలో పావు శాతం ఇవ్వడానికి కూడా సముఖత వ్యక్తంచేయలేదు. దీంతో స్నాప్ డీల్ సంస్థకు తక్కువ విలువ కట్టి ఫ్లిప్ కార్ట్ కు అమ్మేస్తున్నారు. ఈ డీల్ ను జూన్ వరకు ముగించేయాలని స్నాప్ డీల్ అతిపెద్ద వాటాదారు అయిన సాఫ్ట్ బ్యాంకు నిర్ణయించింది. కానీ ఈ ప్రక్రియ మరికొంత కాలం ఆలస్యమయ్యేటట్టు కనిపిస్తోంది. ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ తో పాటు రతన్ టాటా, ఫాక్స్ కాన్, అలీబాబా గ్రూప్, ఆంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్, ఈబే, హాంకాంగ్ ఆధారిత హెడ్జ్ ఫండ్స్ స్నాప్ డీల్ లో ఇన్వెస్టర్లుగా ఉన్నాయి. వీరందరూ 40 శాతం కలిగి ఉన్నారు. కానీ వీరు బోర్డు బాధ్యతను నిర్వర్తించడం లేదు. -
ఉద్యోగులకు విప్రో ఛైర్మన్ లేఖ
ముంబై: టెక్ దిగ్గజం విప్రో వాటాల విక్రయాలపై వస్తున్నవార్తలపై విప్రో లిమిటెడ్ ఛైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ అధికారికంగా స్పందించారు. విప్రో కంపెనీని లేదా కంపెనీకి చెందిన కొన్ని యూనిట్లను విక్రయించడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయని, అమ్మడానికి ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారన్న మీడియా నివేదికలను అజిమ్ ప్రేమ్‌జీ తీవ్రంగా ఖండించారు. ఇవి పూర్తిగా నిరాధారమైనవి, హానికరమైనవంటూ తోసిపుచ్చారు. ఈ మేరకు ఆయన సంస్థ ఉద్యోగులకు ఒక లేఖను విడుదల చేశారు. గడచిన 50 ఏళ్ళుగా, కూరగాయల నూనెల వ్యాపారంతో ఒక చిన్న ప్రాంతీయ సంస్థగా ఉన్న విప్రో నేడు టెక్నాలజీలో ఒక ప్రపంచ సంస్థగా ఎదుగుతున్న సంస్థను చూస్తున్నా...ఇదే ఒరవడి ఒక ముందు కూడా కొనసాగుతుంది. ఎంతో పొటెన్షియాలిటీ ఉన్న విప్రో, ఐటి పరిశ్రమలో ఎంతో ఆనందంగా కొనసాగుతున్నాను. కంపెనీలో ఖాతాదారుల విజయానికి అలాగే కంపెనీ విజయానికి ఎంతో శక్తివంతమైన శక్తి ఉంది. దీనికి ఎప్పటిలాగానే విప్రో కట్టుబడి ఉందని అజీమ్ చెప్పారు. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవాలనీ, నిరాధారమైన ఇలాంటి పుకార్లను నమ్మవద్దంటూ లేఖలో ప్రేమ్‌జీ ఉద్యోగులను కోరారు. -
ఇండస్ట్రీలో అలజడి: అమ్మకానికి ఆ టెక్ దిగ్గజం?
రెవెన్యూల పరంగా అది దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సర్వీసుల కంపెనీ. కానీ గత ఐదేళ్లుగా వృద్ధిని నమోదుచేయడంలో ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉంది. ఇక ప్రస్తుతం ఐటీ పరిశ్రమలో నెలకొన్న తిరోగమన పరిస్థితులు ఆ కంపెనీని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దీంతో ఇక ఆ టెక్ దిగ్గజాన్ని అమ్మేయాలని చూస్తున్నారట. విప్రో కంపెనీని లేదా కంపెనీకి చెందిన కొన్ని యూనిట్లను విక్రయించడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయని, అమ్మడానికి ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు ఓ సరసమైన విలువ వద్దకు చేరుకున్నాయని సీనియర్ బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని స్వయానా మనీ కంట్రోలే రిపోర్టు చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ వ్యవస్థాపకుడు, చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీ, ఆయన కుటుంబమే విప్రోలో 73 శాతం వాటా కలిగిఉంది. కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగడమా? లేదా కొంతమొత్తంలో విక్రయించాలా? అనే యోచనలో ఉన్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఓ మంచి ధర వస్తే బహుళ జాతీయ ఐటీ సర్వీసు కంపెనీకి లేదా ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ కైనా విక్రయించడానికి సన్నద్ధంగా ఉన్నారని, వ్యూహాత్మక కొనుగోలుదారుడు ఎవరు అయి ఉండాలి అని నిర్ణయిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం కంపెనీ ప్రమోటర్లు, బ్యాంకులను ఆశ్రయించినట్టు, ఎంతమొత్తంలో విలువ పొందుతారో తెలుసుకుంటున్నారని ఓ బ్యాంకర్ చెప్పారు ఒకవేళ ఈ డీల్ కనుక జరిగితే 150 బిలియన్ ఐటీ ఇండస్ట్రీలో అలజడి రేకెత్తబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని విప్రో యాజమాన్యం ఖండిస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం మేరకు కంపెనీ అధికార ప్రతినిధిని ఆశ్రయించగా, ఇవన్నీ నిరాధార రూమర్లేనని కొట్టిపారేశారు. ఇలాంటి తప్పుడు వార్తలకు తాము ఆజ్యం పోయమని చెప్పారు. కానీ మర్చంట్ బ్యాంకర్ల సమాచారాన్ని కొట్టిపారేసే విధంగా లేకుండా.. వారు కూడా చాలా స్ట్రాంగ్ గా ఈ విషయాన్ని చెబుతున్నారు. కంపెనీ మిగులు నిధులను రాబట్టుకునేందుకు అమ్మకాలకు సిద్దమవుతున్నట్లు పేర్కొంటున్నారు. దేశీ ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీగా వెలుగొందిన విప్రో మేనేజ్ మెంట్ వేరే వారి చేతుల్లోకి వెళ్లడం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గడిచిన ఐదేళ్లలో విప్రో వృద్ధి రేటు సింగిల్ డిజిట్ కే పరిమితమైనా.. కంపెనీ మిగులు నిధులు మాత్రం రూ.34,474కోట్లు ఉన్నాయి. -
భారీగా తగ్గిన అజిమ్ ప్రేమ్ జీ జీతం
న్యూఢిల్లీ : దేశీయ సాఫ్ట్ వేర్ రంగంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటైన విప్రో సంస్థ చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీ సుపరిచితమే. టాప్ టెక్ బిలీనియర్లలో ఒకరైన అజిమ్ ప్రేమ్ జీ జీతం 2016-17లో భారీగా తగ్గిపోయింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన వేతనం 63 శాతం తగ్గి, రూ.79 లక్షలు మాత్రమే అందుకున్నట్టు తెలిసింది. ఈ ఏడాదిలో కనీసం ఎలాంటి కమిషన్లను కూడా పొందలేదు. ముందటి ఆర్థిక సంవత్సరంలో అజిమ్ ప్రేమ్ జీ వేతనం రూ.2.17 కోట్లగా ఉంది. ప్రేమ్ జీ ప్యాకేజీలో 66,464 డాలర్ల వేతనం, అలవెన్స్ లు, దీర్ఘకాలిక పరిహారాలు 13,647 డాలర్లు కలిసి ఉన్నాయి. దీంతో మొత్తం ఆయన అందుకున్న జీతం 1,21,853 డాలర్లేనని అమెరికా మార్కెట్ రెగ్యులేటరి సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కు సమర్పించిన డాక్యుమెంట్లలో తెలిసింది. ముందటి ఆర్థిక సంవత్సరం కంటే 2017 ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి పెరిగిన నికర లాభాలను బట్టి 0.5 శాతం కమిషన్ ను అజిమ్ ప్రేమ్ జీకి ఇస్తారు. అయితే 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అజిమ్ ప్రేమ్ జీ ఎలాంటి కమిషన్లను పొందలేదని సెక్యురిటీస్ కు సమర్పించిన డాక్యుమెంట్లలో తెలిసింది. కాగ ఇటీవల ఐటీ పరిశ్రమలో కంపెనీల వృద్ధి మందగించడంతో కీలక ఎగ్జిక్యూటివ్ ల పరిహారాలు తగ్గిపోతున్నాయి. వృద్ధి ప్రభావం వీరి పరిహారాలపై పడుతోంది. ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా వేతన ప్యాకేజీ కూడా 67 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో విప్రో వార్షిక ఆదాయాలు 4.7 శాతం తగ్గాయి. నాలుగో క్వార్టర్ రెవెన్యూలు కూడా స్వల్పంగా పడిపోయాయి. -
విప్రో కొత్త లోగో ఆవిష్కరణ
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో కొత్త లోగోను ఆవిష్కరించింది. 1998లో ప్రారంభించిన రంగురంగుల పొద్దుతిరుగుడు పువ్వు స్థానంలో చుక్కలతో కూడిన కొత్త లోగోను విప్రో వినియోగించనున్నది. విశ్వసనీయమైన డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కంపెనీగా విప్రోను ఈ కొత్త లోగో ప్రతిబింబిస్తోందని విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ తెలిపారు. 1945లో మహారాష్ట్రలోని అమల్నర్లో వెస్టర్న్ ఇండియా వెజిటబుల్ ప్రోడక్ట్స్ కంపెనీగా విప్రో ప్రారంభమైంది. ఐటీ పరిశ్రమలోకి 1981లో ప్రవేశించింది. ప్రస్తుతం విప్రో కంపెనీలో 1.7 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 850 కోట్ల డాలర్ల స్థూల ఆదాయాన్ని ఆర్జించింది. -
సంపదలో ముఖేష్ సంచలన రికార్డు
ఒక దేశ జీడీపీతో సమానమైన సంపద ఆర్జించిన వ్యక్తిగా రికార్డు పోర్బ్స్ జాబితాలో వరుసగా తొమ్మిదో ఏడాది మొదటిస్థానం న్యూఢిల్లీ: దేశంలో అత్యంత సంపన్నుడిగా వరుసగా తొమ్మిదో ఏడాది అగ్రస్థానంలో నిలిచిన పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఆయన సంపద ఏకంగా ఒక దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)తో సమానం కావడం గమనార్హం. 22.7 బిలియన్ డాలర్ల (రూ. లక్షన్నర కోట్ల) సొమ్ముతో ఈస్టోనియా జీడీపీకి సమానమైన సంపదను ఆయన కలిగి ఉన్నారని ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది. దేశంలో అత్యంత సంపన్నులతో కూడిన జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో వరుసగా తొమ్మిదో ఏడాది ముఖేశ్ మొదటి స్థానంలో నిలువగా.. నాలుగోస్థానంలో నిలిచిన విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ సంపద.. మొజాంబిక్ జీడీపీ కన్నా అధికం కావడం గమనార్హం. మొజాంబిక్ జీడీపీ 14.7 బిలియన్ డాలర్లు (రూ. 98వేల కోట్లు) కాగా.. ప్రేమ్‌జీ సంపద 15 బిలియన్ డాలర్లు (రూ. లక్షకోట్లు). ఇక దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో 16.9 బిలియన్ డాలర్ల (రూ. 1.12 లక్షల కోట్ల)తో సన్ ఫార్మా అధినేత దిలీప్ శాంఘ్వీ రెండోస్థానంలో నిలువగా.. హిందూజా కుటుంబ వ్యాపార సంస్థ 15.2 బిలియన్ డాలర్ల (రూ. 1.01 లక్షల కోట్ల)తో నాలుగోస్థానంలో నిలిచింది. 13.90 బిలియన్ డాలర్ల (రూ. 92వేల కోట్ల)తో పళ్లోంజీ మిస్త్రీ ఐదో సంపన్న భారతీయుడిగా ఈ జాబితాలో చోటు సాధించారు. ఈ ఐదుగురు భారతీయుల సంపద మొత్తం కలిస్తే.. అది 83.7 బిలియన్ డాలర్లు (రూ. 5.59 లక్షల కోట్లు) అవుతుందని, అంగారక గ్రహంపై వెళ్లేందుకు ఉద్దేశించిన ‘మంగల్యాన్’ వ్యోమనౌకను 1230 సార్లు పంపేందుకు అయ్యే ఖర్చు కన్నా ఇది అధికమని, ఈ సందపతో 18సార్లు రియో ఒలింపిక్స్‌ను నిర్వహించవచ్చునని ఫోర్బ్స్ మ్యాగజీన్ పేర్కొంది. మొత్తం టాప్ వందమంది సంపన్న భారతీయులతో కూడిన జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో చోటు సంపాదించేందుకు కనీస సంపద 1.25 బిలియన్ డాలర్ల (రూ. 8,300 కోట్ల)ను కటాఫ్‌గా నిర్ణయించింది. ఇది గత ఏడాది 1.1 బిలియన్ డాలర్లుగా ఉంది. 2015లో టాప్ -10లో నిలిచిన కుబేరులే ఈ ఏడాది కూడా అటు-ఇటు మార్పులతో టాప్-10లో నిలువడం గమనార్హం. 84.6, 82.6శాతం సంపద వృద్ధితో ఈ జాబితాలో టాప్ గెయినర్లుగా కేపీ సింగ్ (4.80 బిలియన్ డాలర్లు/రూ. 32వేల కోట్లు), అజయ్ పిరమల్ (3.25 బిలియన్ డాలర్లు/రూ. 21వేల కోట్లు) నిలిచారు. అయితే, ఫ్లిప్‌కార్ట్ అధినేతలు సచిన్, బిన్నీ బన్సాల్ ఈ ఏడాది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. టెక్ దిగ్గజమైన తురాఖియా బ్రదర్స్, పతంజలి గ్రూప్ అధినేత, రాందేవ్ అనుచరుడు బాలకృష్ణన్ కొత్తగా ఈ జాబితాలో చోటు సాధించారు. -
కార్పొరేట్ వదాన్యుడు
మన దిగ్గజాలు సబ్బుల నుంచి సాఫ్ట్వేర్ రంగం వరకు విస్తరించిన వ్యాపార సామ్రాజ్యానికి రారాజు ఆయన. వ్యాపారవేత్తగా ఆయన సాధించిన విజయాలు మాత్రమే కాదు, వితరణశీలిగా ఆయన చేపడుతున్న సేవా కార్యక్రమాలు కూడా ఆయన ఔన్నత్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. భారత ఐటీ రంగంలో మకుటం లేని మహారాజుగా గుర్తింపు పొందిన అజీమ్ ప్రేమ్‌జీ దేశప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన పారిశ్రామికవేత్తల్లో అగ్రగణ్యుడు. ఐటీ రంగంలో భారత్ సాధించిన పురోగతిలో ఆయన పాత్ర కీలకం. వేల కోట్ల ఆస్తులు ఉన్నా, ‘విప్రో’ సంస్థల్లో సింహభాగం వాటాలు ఉన్నా, ఇదంతా సమాజం నుంచి తనకు దక్కిందేనని, సమాజానికి తిరిగి ఇవ్వడంలోనే తనకు సంతృప్తి ఉందని అంటారు అజీమ్ ప్రేమ్‌జీ. అజీమ్ హషీమ్ ప్రేమ్‌జీ 1945 జూలై 24న మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా అమల్నేర్ పట్టణంలో పుట్టారు. తండ్రి మహమ్మద్ ప్రేమ్‌జీ వ్యాపారవేత్త. బియ్యం వ్యాపారంలో ఆరితేరిన ఆయన ‘రైస్ కింగ్ ఆఫ్ బర్మా’గా పేరుపొందారు. అజీమ్ పుట్టిన కొద్ది నెలల్లోనే ఆయన ‘వెస్టర్న్ ఇండియా పామ్ రిఫైన్డ్ ఆయిల్ లిమిటెడ్’ కంపెనీని ప్రారంభించారు. తర్వాతి కాలంలో ఇదే ‘విప్రో’గా రూపాంతరం చెందింది. తొలినాళ్లలో ఈ కంపెనీ ముంబైలో కర్మాగారాన్ని ఏర్పరచుకుని, శాకాహార నూనెలను, రిఫైన్డ్ నూనెలను ఉత్పత్తి చేసేది. కొంతకాలం తర్వాత వనస్పతి, డిటర్జెంట్ సోప్‌ల తయారీ కూడా ప్రారంభించింది. దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌కు వచ్చేయాల్సిందిగా మహమ్మద్ ప్రేమ్‌జీని జిన్నా ఆహ్వానించారు. అయితే, ఆయన సున్నితంగా తోసిపుచ్చి, భారత్‌లోనే ఉండిపోయారు. ఒకవైపు వ్యాపార విస్తరణను కొనసాగిస్తూనే, కొడుకు అజీమ్‌ను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపారు. స్టాన్ఫోర్డ్ వర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరారు అజీమ్. అయితే, 1966లో మహమ్మద్ ప్రేమ్‌జీ ఆకస్మికంగా మరణించారు. తండ్రి మరణంతో అజీమ్ చదువును అర్ధంతరంగానే వదిలేసి భారత్‌కు రావాల్సి వచ్చింది. ‘విప్రో’ విస్తరణ పర్వం తండ్రి వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా ‘విప్రో’ పగ్గాలు చేపట్టారు అజీమ్. అప్పటికి ఆయన వయస్సు కేవలం 21 ఏళ్లే. స్వతహాగా తెలివైన అజీమ్ త్వరగానే వ్యాపార మెలకువలను ఆకళింపు చేసుకున్నారు. ‘విప్రో’ విస్తరణను వేగవంతం చేశారు. సబ్బులు, షాంపూలు, బేబీ ప్రోడక్ట్స్, బల్బులు వంటి వాటి ఉత్పత్తి మొదలుపెట్టారు. అనతికాలంలోనే ‘విప్రో’ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ఆదరణ చూరగొన్నాయి. ఇలా సాగుతుండగా, 1980లలో దేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు అడుగులు వేయడం మొదలైంది. ఈ తరుణంలోనే ‘విప్రో’ ఐటీ రంగంలోనూ అడుగు పెట్టింది. అమెరికన్ కంపెనీ ‘సెంటినెల్’తో ఒప్పందం కుదుర్చుకుని కంప్యూటర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో, అజీమ్ ప్రేమ్‌జీ తన దృష్టిని ఎక్కువగా సాఫ్ట్వేర్ అభివృద్ధిపై సారించారు. ఐటీ రంగంలో ‘విప్రో’ ఘనవిజయాలతో రెండు దశాబ్దాలు గడిచేలోగానే దేశంలోని అపర కుబేరుల్లో ఒకరిగా ఎదిగారు. ఈ ప్రస్థానంలో అజీమ్ ప్రేమ్‌జీని ‘పద్మవిభూషణ్’ సహా లెక్కలేనన్ని పురస్కారాలు వరించాయి. పలు వర్సిటీలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. ఇవ్వడంలోనే సంతృప్తి వేల కోట్ల ఆస్తులు ఉన్నా, ‘విప్రో’ సంస్థల్లో సింహభాగం వాటాలు ఉన్నా, ఇదంతా సమాజం నుంచి తనకు దక్కిందేనని, సమాజానికి తిరిగి ఇవ్వడంలోనే తనకు సంతృప్తి ఉందని అంటారు అజీమ్ ప్రేమ్‌జీ. ఏదో మాట వరుసకు అలా అనడం కాదు, వివిధ సేవా కార్యక్రమాలకు విరివిగా ఖర్చు చేయడం ద్వారా తాను చేతల మనిషినని నిరూపించుకుంటున్నారు ఆయన. సేవా కార్యక్రమాల కోసం 2001లో ‘అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్’ను స్థాపించారు. కర్ణాటక శాసనసభ చట్టం కింద బెంగళూరులో అజీమ్ ప్రేమ్‌జీ వర్సిటీని కూడా నెలకొల్పారు. పాశ్చాత్య వ్యాపార దిగ్గజాలు వారెన్ బఫెట్, బిల్ గేట్స్ మొదలుపెట్టిన ‘ది గివింగ్ ప్లెడ్జ్’పై సంతకం చేసిన తొలి భారతీయుడు అజీమ్ ప్రేమ్‌జీనే కావడం విశేషం. ఇందులో భాగంగానే ఆయన సేవా కార్యక్రమాల కోసం తన వ్యక్తిగత సంపదలో 25 శాతం మొత్తాన్ని ఇచ్చేశారు. 2018 నాటికి మరో 25 శాతం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కార్పొరేట్ ప్రపంచంలో సంపాదించడం ఒక్కటే లక్ష్యం కాదని, సంపాదించిన సంపాదనను సామాజిక ప్రయోజనాల కోసం ఖర్చుపెట్టడం కూడా అవసరమని తన చర్యలతో చాటి చెబుతున్న అజీమ్ ప్రేమ్‌జీ నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తారు. -
నిరాడంబర సంపన్నులు
తామరాకు మీద నీటిబొట్టులా... కొందరు మహానుభావులుసంపదలలో మునిగి తేలుతున్నా, సామాన్య జీవితాన్ని గడుపుతుంటారు.. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ పక్కా జెంటిల్మెన్లా జీవితాన్ని సాగిస్తుంటారు. అటువంటి స్థితప్రజ్ఞులు కొందరి గురించి. తెల్లవారితే రాముడికి పట్టాభిషేకమనగా, దశరథుడు రామునితో, ‘‘రామా! రాజు కావడానికి ముందు కొన్ని నియమాలు ఆచరించాలి. అవ న్నీ మన కులగురువులు వశిష్ఠులు నీకు వివరిస్తారు. ఆయన మాటలను తుచ తప్పక అనుసరించు’ అన్నాడు. సరేనన్నాడు రాముడు. వశిష్ఠుని సమీపించి, ఆయనకు ప్రణమిల్లి, తన రాక వివరాలు విన్నవించాడు. అప్పుడు వశిష్ఠుడు, ‘రామా! రాజు కాబోయేవాడు పట్టాభిషేకానికి ముందు రోజు భోజనం చేయకూడదు. సాధారణ వస్త్రాలు ధరించాలి. నేల మీద శయనించాలి. రాజబంధువులతో సంభాషించకూడదు. మౌనంగా ఉండాలి. అందుకు కారణం కూడా వివరిస్తాను విను. పేదవారు తిండిలేక అల్లాడిపోతుంటారు. గతుకుల నేల మీద, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నిద్రిస్తారు. వారి కష్టం తెలియాలంటే వాటిని రాజు కాబోయే వ్యక్తి స్వయంగా అనుభవించాలి. పేదల కష్టాలు తెలిస్తేనే ప్రజారంజకంగా పరిపాలన చేయగలుగుతారు. ఇక బంధువర్గంతో ఎందుకు మాట్లాడకూడదో తెలుసా. పదవిలోకి వచ్చేవారిని ఎన్నో రకాల ప్రలోభాలతో లొంగ దీయాలనుకుంటారు. అందుకే వారికి దూరంగా ఉండాలి’ అని బోధించాడు. నాటి బోధనల నుంచి ప్రేరణ పొంది, వాటిని ఆచరిస్తున్న సంపన్నులు వీళ్లు. విజయ్ మాల్యా ఖరీదైన ధోరణికి భిన్నంగా ఆదర్శప్రాయులుగా నిలిచినవారు వీళ్లు. అపార్ట్మెంట్లో టాటా: ముంబైలో రతన్ టాటా ఇంటిని చూస్తే, అసలు ఆయన కోటీశ్వరుడేనా అనుకుంటారు! మన కంటె చిన్న ఇంట్లో ఉంటున్నారే అనుకుంటారు కొందరు లక్షాధికారులు. ప్రజల మధ్య ఒక సొంత ఫ్లాట్ ఆయన నివాసం. ఆయన కోటీశ్వరుడే. కాని ఆయన మనిషి. నేల మీద నడిచే మనిషి. గాలిలో తేలడం, ఆకాశంలో మేడలు కట్టడం ఆయనకు ఇష్టం లేదు. విలువల పునాదుల మీదే ఆయన ప్రయాణం. భారతదేశానికి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను తీసుకువ చ్చిన నిరాడంబర కోటీశ్వరుడు టాటా. డేవిడ్ గ్రీన్: హాబీ లాబీ (చైన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కంపెనీ) సిఈవో. 4.5 బిలియన్ డాలర్లకు అధిపతి. ప్రత్యేక విమానంలో దేశవిదేశాలకు వెళ్లగల స్థితిమంతుడు. కాని అతి సామాన్యంగా ప్రయాణిస్తారు. వీలైనంతవరకు తన ధనాన్ని సమాజ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ పక్కా జెంటిల్మన్ అనిపించుకున్నాడు. హాబీలాబీ కంపెనీను మూసేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు తన ఆస్తిలో 90 శాతం ప్రభుత్వానికి, 10 శాతం తన వారి చదువులు, ఆరోగ్యం కోసం ఒక ట్రస్ట్‌గా ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యాడు. అజీమ్ ప్రేమ్‌జీ: భారతదేశంలో అత్యంత సంపన్నులలో మూడో వ్యక్తి విప్రో చైర్మన్. ఆయన ఆస్తి విలువ 11.2 బిలియన్ డాలర్లు. టాయిలెట్ పేపర్ల వాడకం నుంచి, అక్కర్లేని సమయంలో లైట్లు ఆర్పేయడం వరకు తన ఉద్యోగులకు దిశానిర్దేశం చేస్తుంటాడు. అదేదో పిసినారితనం అనుకుంటే పొరపాటే. ఆ అనవసర ఖర్చును ఆపేస్తే, ఉద్యోగస్తులకు మరింత ఎక్కువ జీతాలు ఇవ్వచ్చనేది ఆయన భావన. మార్క్ జుకెర్‌బర్గ్: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన యువకుడు. వయను 28. ఆస్తి విలువ 13.3 బిలియన్ డాలర్లు. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు, చైర్మన్, సిఈవో. సామాన్యమైన జీన్స్, షర్ట్స్ వేసుకుంటాడు. సూటు వేసుకున్నా కూడా లెదర్ షూస్ లేదా మామూలు శాండల్స్ మాత్రమే ధరిస్తాడు. అతడి వివాహం, తన ఇంట్లో అతి సామాన్యంగా చేసుకున్నాడు. హనీమూన్ ట్రిప్‌లో ఇటలీలో మెక్‌డొనాల్డ్స్‌లో చాలా సింపుల్‌గా ఆహారం తీసుకున్నాడు. సెర్జీ బ్రిన్: ఇంటర్నెట్ ఎంటర్ప్రెన్యూర్, కంప్యూటర్ శాస్త్రవేత్త. గూగుల్ స్పెషల్ ప్రాజెక్ల్ కోఫౌండర్. ఆయన ఆస్తి 22.8 బిలియన్ డాలర్లు. అతి సామాన్యంగా ఎలా జీవించాలో తన తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ‘‘విలాసాలు లేకుండా ఆనందంగా జీవించడం నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాను. ఇప్పటికీ నేను భోజనం చేసేటప్పుడు కంచంలో ఒక్క మెతుకు కూడా వదలను. ఏ వస్తువు కొనాలన్నా వాటి ధర తప్పక చూస్తాను. వీలైనంతవరకు తక్కువ ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తాను. ఎంత సామాన్యంగా జీవిస్తే అంత ఎక్కువ ఆనందంగా హాయిగా గడపగలమని నా అనుభవంలో తెలుసుకున్నాను’’ అంటాడు. జిమ్ వాల్టన్: వాల్‌మార్ట్ వ్యవస్థాపకుడు సామ్ వాల్ట్ కుమారుడు. ఆ ఇంట్లో అందరికంటె చిన్నవాడు. ఆస్తి విలువ 26.7 బిలియన్ డాలర్లు. తన తండ్రి నుంచి సాధారణ జీవితాన్ని అలవర్చుకున్నాడు. మామూలు ఇటుకలతో నిర్మించిన బిల్డింగులో పర్సనల్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ నడుపుతున్నాడు. పొదుపుగా ఖర్చు చేయడం అలవాటు చేసుకున్నాడు. అమానికో ఒర్టెగా: జారా (బట్టల వ్యాపార సంస్థ) వ్యవస్థాపకుడు. స్పెయిన్‌లో అత్యంత సంపన్నుడు. 57 బిలియన్లకు అధిపతి. ఒర్టెగాతో ఆయన భార్య కూడా పొదుపరే. ఒక అపార్ట్మెంట్లో వీరి నివాసం. దీనికితోడు ఒర్టెగా వస్త్రధారణ చాలా సింపుల్‌గా ఉంటుంది. సాధారణంగా రెండు జతలతోనే తన జీవితం గడపడానికి ఇష్టపడతాడు. వారెన్ బఫెట్: బెర్క్‌షైర్ హాథ్‌వే చైర్మన్, సిఈవో. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన సంపన్నుడిగా 53.5 బిలియన్ల డాలర్ల ఆస్తులు కలిగి ఉన్నాడు. బాల్యం నుంచే ఆయనది వ్యాపారాత్మక ధోరణి. పిల్లలతో ఆడుకోవడానికి బదులు మ్యాగజైన్లు, సోడాలు, గమ్ బాటిల్స్ అమ్ముతూ ఉండేవాడు. అతి పిన్న వయసులోనే వాల్ స్ట్రీట్ ను బాగా చదివేవాడు. అతి పిన్నవయసులోనే అనేక షేర్లు కొన్నాడు. అంత సంపదలు, అంత వ్యాపారాత్మక ధోరణి ఉన్నప్పటికీ ఎంతో పొదుపుగా జీవించేవాడు. గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్ల కోసం అస్సలు ఖర్చుచేయడానికి సుముఖత చూపడు. కనీసం బొమ్మలు కొనడానికి కూడా ఇష్టపడడు. బొమ్మలతో ఆడుకోవడం వల్ల మెడనొప్పి తప్ప ఏ ప్రయోజనం లేదు... అనేవాడు. బిలియన్లకొలదీ డాలర్లు దానాల రూపంలో ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతాడు. కార్లోస్ స్లిమ్ హెలూ: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. ‘అమెరికన్ మువిల్’కి గౌరవ అధ్యక్షుడు. 73 బిలియన్ డాలర్లకు అధినేత. ఈ గ్రహం మీదే అత్యంత సంపన్నుడిగా పేరు పొందిన కార్లోస్ అత్యంత సాధారణ జీవితం గడపడానికి ఇష్టపడతాడు. కేవలం ఆరు పడక గదుల ఇంట్లో నివసిస్తున్నాడు. ఇప్పటికీ తన కారు తనే డ్రైవ్ చేసుకుంటాడు. బిలియనీర్ అంటే విలాసంగా ఖర్చు చేసేవాడని అర్థం కాదు. సాధారణ జీవితం గడుపుతూ, తన దగ్గర అదనంగా ఉన్న డబ్బును పేదవారి కోసం ఖర్చుచేసేవాడే సంపన్నుడు... అంటాడు కార్లోస్. ఎంత సంపన్నులైనా కూడా అవసరానికి మించి ఖర్చు చేయకూడదని, సగటు మనిషి కూడా శక్తికి మించి జీవించడం మంచిది కాదని, నిరాడంబర జీవనంలోని సౌఖ్యాన్ని తెలుసుకోవాలని వీరి జీవితాలు చెబుతున్నాయి. ఔరంగజేబు స్వయంగా తన చేత్తో చేసిన టోపీలను అమ్మగా వచ్చిన డబ్బును తన ఖర్చులకు ఉపయోగించుకునేవాడు. ఖజానా సొమ్ము నుంచి ఒక్క పైసా కూడా ముట్టుకునేవాడు కాదు. అలాగే ట్రావన్‌కోర్ రాజులు వేల కోట్ల ఆదాయాన్ని భగవంతుడికే ఇచ్చారు కాని, సొంతానికి వాడుకోలేదు. సింహాసనం అధిష్టించబోతున్న శ్రీకృష్ణదేవరాయల చెంప మీద మహామంత్రి తిమ్మరుసు గట్టిగా కొడతాడు. ఎందుకు కొట్టారని ఆయన అడగలేదు. సామాన్య జీవితం అల వాటు చేసుకోవడం కోసమే అప్పాజీ ఇలా చేశారని అర్థం చేసుకున్నాడు. ప్రజారంజకంగా పరిపాలన చేశాడు. ఆంధ్రభోజుడయ్యాడు. - డా.పురాణపండ వైజయంతి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మూడో సంవత్సరంలోనూ ప్రేమ్‌జీయే
* అత్యంత దాతృత్వమున్న భారతీయుడిగా ఘనత * హురుణ్ ఇండియా దాతృత్వ జాబితా న్యూఢిల్లీ: విప్రో ప్రేమ్‌జీ మూడో ఏడాది 2015లో కూడా అత్యంత దాతృత్వం ఉన్న భారతీయుడిగా నిలిచారు. హురుణ్ ఇండియా దాతృత్వ జాబితా ప్రకారం విద్యా కార్యక్రమాల కోసం రూ.27,514 కోట్లు విరాళాలిచ్చిన అజిమ్ ప్రేమ్‌జీ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన తర్వాతి స్థానాల్లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని, నా రాయణ మూర్తిలు రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. అజిమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఎనిమిది రాష్ట్రాల్లో మూడున్నర లక్షలకు పైగా పాఠశాలల్లో విద్యాసాధికారత కోసం కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రూ.2,404 కోట్ల విరాళమిచ్చిన నందన్, రో హిణి నిలేకని కుటుంబం రెండో స్థానంలో నిలిచింది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సామాజిక అభివృద్ధి, విద్యాకార్యక్రమాల కోసం రూ.1,322 కోట్లు విరాళాలిచ్చిన నారాయణ మూర్తి, ఆయన కుటుంబం మూడో స్థానంలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ముకేశ్ అంబానీ రూ.345 కోట్లు విరాళాలిచ్చి ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు. -
ప్రపంచ టాప్-20 టెక్ బిలియనీర్లలో ప్రేమ్‌జీ, శివనాడార్
న్యూయార్క్ : ప్రపంచ టాప్-20 టెక్ బిలియనీర్లలో భారత్ నుంచి విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ నాడార్ ఉన్నారు. ఫోర్బ్స్ ‘టెక్నాలజీ రంగం టాప్-100 సంపన్నులు’ జాబితాలో మెక్రోసాఫ్ట్ సహ వ్యవ స్థాపకుడు బిల్ గేట్స్ (79.6 బిలియన్ డాలర్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. తర్వాతి స్థానాల్లో ఎలిసన్ (50 బిలియన్ డాలర్లు), జెఫ్ బిజోస్ ఉన్నారు. ప్రేమ్‌జీ 13వ స్థానంలో, నాడార్ 14వ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రేమ్‌జీ సంపద విలువ 17.4 బిలియన్ డాలర్లుగా, నాడార్ సంపద విలువ 14.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రేమ్‌జీ, నాడార్‌తో పాటు ఈ జాబితాలో మరో ఇద్దరు భారతీయులకు స్థానం దక్కింది. వారిలో సింఫనీ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్ రమేశ్ వాద్వాని 2.8 బిలియన్ డాలర్ల సంపదతో 73వ స్థానంలో, భారత్ దేశాయ్ 2.5 బిలియన్ డాలర్ల సంపదతో 82వ స్థానంలో ఉన్నారు. -
టాప్-20 కుబేరుల్లో ప్రేమ్‌జీ, శివనాడార్
న్యూయార్క్: ప్రపంచ ఐటీ రంగంలో టాప్-20 ధనవంతుల జాబితాలో విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ అధినేత శివనాడార్‌కు స్థానం దక్కింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అగ్రస్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ విడుదల చేసిన తాజా జాబితాలో ప్రేమ్‌జీ, నాడార్ వరసగా 13, 14వ స్థానాల్లో ఉన్నారు. ప్రేమ్‌జీకి లక్షా 13 వేల కోట్లు, నాడార్కు 93 వేల కోట్ల రూపాయల సంపద ఉన్నట్టు ఫోర్బ్స్ వెల్లడించింది. టాప్-100 జాబితాలో మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు రమేష్ వద్వాని, భరత్ దేశాయ్ ఉన్నారు. సింఫోని టెక్నాలజీ గ్రూపు చైర్మన్ రమేష్ వద్వాని 73వ స్థానంలో ఉన్నారు. ఆయన సందప దాదాపు 18 వేల కోట్ల రూపాయలు. 82వ స్థానంలో ఉన్న భరత్ దేశాయ్‌కు 16 వేల కోట్ల రూపాయలకుపైగా ఆస్తులున్నాయి. ప్రపంచ అపర కుబేరుడు బిల్‌గేట్స్ సంపద 5.16 లక్షల కోట్ల రూపాయలు. ఒరాకిల్ వ్యవస్థాపకుడు ఎలిసన్‌కు 3.24 లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. కుబేరుల జాబితాలో అమెరికన్లదే అగ్రస్థానం. టాప్-100లో 51 మంది అమెరికన్లే ఉన్నారు. ఆ తర్వాతి స్థానం ఆసియాది. ఆసియా దేశాలకు చెందిన 33 మంది ధనవంతుల జాబితాలో ఉన్నారు. ఇక ఐటీ కుబేరుల జాబితాలో యూరప్ వెనుకబడివుంది. యూరప్‌కు చెందిన 8 మందికి మాత్రమే జాబితాలో చోటు దక్కింది. -
నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: అజీమ్ ప్రేమ్‌జీ (వ్యాపారవేత్త); జెన్నీఫర్ లోపెజ్ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది బృహస్పతికి సంబంధించిన సంఖ్య కాబట్టి మీకు గురుత్వం వస్తుంది. అందరూ మీ మాట వింటారు. కార్యజయం కలుగుతుంది. విషయ పరిజ్ఞానం పొందుతారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తారు. ఈ రోజు పుట్టిన తేదీ 24. అంటే 6. ఇది శుక్రునికి సంబంధించిన అంకె. కుటుంబ పరమైన బాధ్యతలకు ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. పిల్లలకోసం పెళ్లి సంబంధాలు చూస్తున్న వారి శ్రమ ఫలిస్తుంది. విలాస జీవనానికి ఎక్కువ ఖర్చు చేస్తారు. గతంలో కన్నా ఎంతో రిలాక్స్డ్గా కనిపిస్తారు. విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో సీట్లు లభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది. వారు కోరుకున్న ప్రదేశాలకు బదిలీ అవుతుంది. మీడియా రంగంలోని వారికి, కళాకారులకు, సంగీతవిద్వాంసులకు మంచి అవకాశాలు వస్తాయి. చాలా కాలంగా బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారి కల ఫలిస్తుంది. పాతస్నేహితులను కలుసుకుంటారు. ఆపోజిట్ సెక్స్ వారితో జాగ్రత్తగా ఉండాలి. న్యాయకోవిదులకు మంచి పేరు వస్తుంది. లక్కీ నంబర్స్: 1,2,3, 5,6,9; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ; లక్కీ డేస్: గురు, శుక్ర, శని, ఆదివారాలు సూచనలు: దక్షిణామూర్తి ఆరాధన, అనాథలను ఆదుకోవడం, ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేయించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు అందుకోవచ్చు. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
విప్రోలో సగం వాటాలు ట్రస్టుకు విరాళం
ఐటీ దిగ్గజం అజీం ప్రేమ్‌జీ దాతృత్వం బెంగళూరు : ఐటీ దిగ్గజం అజీం ప్రేమ్‌జీ.. విప్రోలో తనకున్న వాటాల్లో దాదాపు సగభాగాన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం చారిటబుల్ ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు. ఇప్పటికే సుమారు 21 శాతం వాటాలను ట్రస్టుకు ఇచ్చిన ప్రేమ్‌జీ తాజాగా అదనంగా మరో 18 శాతం వాటాలను విరాళమిచ్చారు. దీంతో అజీం ప్రేమ్‌జీ ట్రస్టుకు మొత్తం 39 శాతం వాటాలు (విలువ సుమారు రూ. 53,284 కోట్లు) ఇచ్చినట్లయింది. వ్యక్తిగతంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో తాను కూడా పాలుపంచుకోవాలనే తలంపుతో గడిచిన పదిహేనేళ్లుగా విప్రోలో తనకున్న వాటాల్లో కొద్ది కొద్దిగా ట్రస్టుకు బదలాయిస్తూ వస్తున్నట్లు ప్రేమ్‌జీ.. విప్రో వార్షిక నివేదికలో షేర్హోల్డర్లకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్, అజీం ప్రేమ్‌జీ ఫిలాంత్రోపిక్ ఇనీషియేటివ్ సంస్థలు చేపట్టే కార్యక్రమాలకు ఈ ట్రస్టు తోడ్పాటు అందిస్తుందన్నారు. -
ఆధారాలిస్తే సహకరిస్తాం..
నల్లధనంపై స్విస్ రాయబారి ముంబై: స్వతంత్రంగా దర్యాప్తు చేయకుండా తమ దేశంలోని బ్యాంకుల్లో ఖాతాదారులందరి పేర్లు ఇవ్వాలని భారత అధికారులు కోరే అవకాశంలేదని భారత్‌లో స్విట్జర్లాండ్ రాయబారి లైనస్ క్యాస్టల్మూర్ అన్నారు. ఆశావహ దృక్పథంతో ఆధారాల్లేకుండా చేసే దర్యాప్తుకు తాము అనుమతిచ్చేది లేదని స్పష్టం చేశారు. భారత వ్యాపార దిగ్గజం అజీమ్ ప్రేమ్‌జీకి స్ఫూర్తిదాయక, సామాజిక నాయకత్వం అంశంలో స్విస్ ప్రభుత్వం అవార్డు ప్రదానం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ట్యాక్స్ మోసగాళ్లకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఇస్తే తమ ప్రభుత్వం భారత్‌కు పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. అయితే ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చిన జాబితాపై మాత్రం సహకరించదని, ట్యాక్స్ మోసగాళ్లపై భారత దర్యాప్తు సంస్థలు ప్రాథమిక ఆధారాలు ఇవ్వాలని తెలిపారు. గతంలో వివిధ మార్గాల నుంచి ధన ప్రవాహానికి స్విస్ గమ్యంగా ఉండేదన్న క్యాస్టల్మూర్.. అదంతా ట్యాక్స్ కట్టిన డబ్బు అని చెప్పలేనన్నారు. -
ప్రధాని మోదీతో ప్రేమ్‌జీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీతో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ గురువారం సమావేశమయ్యారు. ప్రధాని కార్యాలయం(పీఎంఓ) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంతకుమించి సమావేశం వివరాలను వెల్లడించలేదు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ్ భారత్ వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ప్రధాని మోదీ పలువురు వ్యాపార దిగ్గజాలతో గత కొన్ని రోజులుగా సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమ్‌జీతో ఈ భేటీ జరిగింది. కాగా భారత విమానయాన రంగం పురోభివృద్ధికి సమాచార సంకేతిక రంగం తోడ్పాటు అవసరమని ప్రేమ్‌జీ పేర్కొన్నారు. విమానయానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజుతో భేటీ సందర్భంగా అయన మాట్లాడారు. -
విప్రో లాభం 2,085 కోట్లు
అమెరికాలో కార్పొరేట్ కంపెనీలు వ్యాపార వృద్ధిపై అత్యంత విశ్వాసంతో ఉన్నాయి. దీంతో ఐటీ క్లయింట్లు టెక్నాలజీ వినియోగంపై భారీగా పెట్టుబడులు వెచ్చించేందుకు ముందుకొస్తున్నారు. మరోపక్క, దేశీయంగా కేంద్ర ప్రభుత్వం వృద్ధిని గాడిలోపెట్టేందుకు తీసుకుంటున్న చర్యలు కూడా కార్పొరేట్ రంగంలో విశ్వాసం పెంచుతోంది. - అజీమ్ ప్రేమ్‌జీ, విప్రో చైర్మన్ ► క్యూ2లో 7.9% వార్షిక వృద్ధి ► ఆదాయం 7.5 శాతం అప్; రూ.11,816 కోట్లు బెంగళూరు: దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం విప్రో ఈ ఏడాది రెండో త్రైమాసికం(2014-15, క్యూ2)లో రూ.2,085 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,932 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 7.9 శాతం వృద్ధి నమోదైంది. ఇన్ఫ్రా సేవల విభాగంలో మెరుగైన పనితీరు ఇందుకు తోడ్పడిందని కంపెనీ పేర్కొంది. కాగా, క్యూ2లో మొత్తం ఆదాయం 7.5 శాతం ఎగబాకి రూ.11,816 కోట్లకు చేరింది. గతేడాది సెప్టెంబర్ క్వార్టర్లో ఆదాయం రూ.10,991 కోట్లుగా ఉంది. కాగా, సీక్వెన్షియల్‌గా చూస్తే(ఈ ఏడాది ఏప్రిల్-జూన్, క్యూ1లో రూ.2,103 కోట్లతో పోలిస్తే) నికర లాభం దాదాపు 1 శాతం తగ్గింది. ఆదాయం మాత్రం త్రైమాసిక ప్రాతిపదికన 5 శాతం పెరగడం గమనార్హం. గెడైన్స్‌కు అనుగుణంగానే సాఫ్ట్వేర్ ఆదాయం... ఐటీ సేవల ఆదాయం సెప్టెంబర్ క్వార్టర్లో 1.77 బిలియన్ డాలర్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 8.6 శాతం, ఈ ఏడాది క్యూ1తో పోలిస్తే 1.8 శాతం చొప్పున పెరిగింది. కంపెనీ జూలైలో పేర్కొన్న ఆదాయ అంచనా(గెడైన్స్) 1.77-1.81 బిలియన్ డాలర్ల స్థాయిలోనే క్యూ2 గణాంకాలు నమోదయ్యాయి. అయితే, మార్కెట్ విశ్లేషకుల అంచనా 1.78 బిలియన్ డాలర్ల కంటే కొద్దిగా తక్కువగా ఆదాయం ప్రకటించింది. కాగా, ఈ ఏడాది మూడో త్రైమాసికం(అక్టోబర్-డిసెంబర్)లో ఐటీ సేవల ఆదాయం 1.80-1.84 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని కంపెనీ అంచనా వేసింది. ఈ ఏడాది(2014-15) ప్రథమార్ధం కంటే ద్వితీయార్థం ఐటీ పరిశ్రమకు చాలా సానుకూలంగా ఉంటుందని విప్రో సీఈఓ టీకే కురియన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీకి డిమాండ్ స్థిరంగా కొనసాగుతోందని.. ప్రధానంగా ఉత్తర అమెరికాలో వ్యయాలు పెరుగుతున్నట్లు ఆయన చెప్పారు. యూరప్‌లో కూడా అవుట్సోర్సింగ్ వృద్ధి అవకాశాలు జోరందుకుంటున్నాయని కురియన్ తెలిపారు. ఇతర ముఖ్యాంశాలు... ► సెప్టెంబర్ చివరినాటికి ఐటీ సేవల విభాగం మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,54,297కు చేరింది. ► ఐటీ ఉత్పత్తుల విభాగం ఆదాయం క్యూ2లో రూ.920 కోట్లుగా నమోదైంది. ► జూలై-సెప్టెంబర్ మూడు నెలల వ్యవధిలో 50 మంది కొత్త క్లయింట్లను కంపెనీ దక్కించుకుంది. ► ఆర్థిక ఫలితాల నేపథ్యంలో మంగళవారం విప్రో షేరు ధర బుధవారం 1.47 శాతం లాభంతో రూ.582 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. -
కుబేర సంపద సగం వీరిదే
న్యూఢిల్లీ: టాప్ 5 భారతీయ కుబేరుల ఆస్తుల విలువ ఎంతో తెలుసా? 8,550 కోట్ల డాలర్లు! మన కరెన్సీలో రూ.5,23,897 కోట్లు. భారత్‌లో 100 కోట్ల డాలర్లకుపైగా వ్యక్తిగత సంపద ఉన్న శ్రీమంతుల మొత్తం ఆస్తుల విలువలో ఇది దాదాపు సగమని వెల్త్ రీసెర్చ్ కంపెనీ వెల్త్-ఎక్స్ విశ్లేషించింది. దేశంలోని కుబేరుల సిరిసంపదలపై కంపెనీ ఇటీవలే అధ్యయనం నిర్వహించి నివేదిక రూపొందించింది. ముకేశ్ అంబానీదే అగ్రస్థానం... రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ 2,440 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,49,474 కోట్లు) సంపదతో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఉక్కు రంగ దిగ్గజం లక్ష్మీ మిట్టల్, సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, టాటా సన్స్ వాటాదారు పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విలువైన ముంబై ఇండియన్స్ టీమ్ ముకేశ్ అంబానీకి చెందినదే. ఈ టీమ్ విలువ 11.20 కోట్ల డాలర్లుంటుందని అంచనా. స్టీల్ టైకూన్ మిట్టల్... ప్రపంచంలో ఉక్కును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న ఆర్సెలర్ మిట్టల్ చైర్మన్, ఎన్నారై పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్ నెట్‌వర్త్ 1,720 కోట్ల డాలర్లు. ఆర్సెలర్ మిట్టల్లో 38 శాతం షేరుతో పాటు క్వీన్స్ పార్క్ రేంజర్స్ ఫుట్‌బాల్ క్లబ్లో 33 శాతం వాటా మిట్టల్‌కు ఉంది. అత్యంత సంపన్నుల్లో మూడో స్థానంలో ఉన్న దిలీప్ సంఘ్వీకి 1,563 కోట్ల డాలర్లు, నాలుగో స్థానంలోని విప్రో ప్రేమ్‌జీకి 1,490 కోట్ల డాలర్లు, ఐదో ర్యాంకులోని పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీకి 1,270 కోట్ల డాలర్ల ఆస్తులున్నాయి. విద్య, వైద్యం, పర్యావరణం, సామాజిక సంక్షేమం వంటి రంగాలకు ఇతోధిక తోడ్పాటు అందించేందుకు ఈ ఐదుగురు కుబేరులూ ఫౌండేషన్లను ఏర్పాటు చేశారని వెల్త్-ఎక్స్ తెలిపింది. బాలీవుడ్ కింగ్ షారూక్ ఖాన్‌కు 60 కోట్ల డాలర్లు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు 16 కోట్ల డాలర్ల ఆస్తులున్నాయని పేర్కొంది. -
తెలంగాణలో ‘విప్రో’ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టంలో విప్రో సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ ప్రకటించారు. ప్రేమ్‌జీ ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఆయన అధికారిక నివాసంలో కలిశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకు, తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు కేసీఆర్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రేమ్‌జీ హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్‌కు వివరించారు. తమ సంస్థ కార్యకలాపాలను తెలంగాణ రాష్ట్రంలో మరింత విస్తరిస్తామని తెలిపా రు. కాగా ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తమ ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త విధానాలను సీఎం, ప్రేమ్‌జీకి వివరించారు. ఐటీ రంగంలో హైదరాబాద్, భారతదేశానికి తలమానికమయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ర్టం అనువైన ప్రాంతంగా జాతీయ, అంతర్జాతీ య సంస్థలకు కనిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని ఐటీ పార్కులు వచ్చేం దుకు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్,సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు పాల్గొన్నారు. -
కోట్లున్నా.. సెకండ్ హ్యాండ్ బెంజే
ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీకి దాదాపు రూ. 90 వేల కోట్ల పైచిలుకు ఆస్తి ఉంది. తల్చుకుంటే కోట్లు ఖరీదు చేసే కార్లను కొనే సత్తా ఉంది. కానీ ఆయన మాత్రం అలా చేయలేదు. చేయరు. పదేళ్ల నాటి కారు మొరాయిస్తోంది .. కొత్తది కొనండి సార్ అంటూ ఇటీవలే సిబ్బంది పోరు పెట్టగా పెట్టగా ప్రేమ్‌జీ ఏం చేశారో తెలుసా? కారు కొన్నారు.. కానీ ఏ కారో తెలుసా? తన ఆఫీసులోనే పనిచేసే మరో ఉద్యోగి దగ్గర్నుంచి ఒక సెకండ్ హ్యాండ్ మెర్సిడెస్ బెంజిని ఏరి కోరి తీసుకున్నారట. ఇదీ.. వేల కోట్ల ఆస్తులున్నా ఏమాత్రం ఆర్భాటాలు ఇష్టపడని ప్రేమ్‌జీ సింప్లిసిటీ. దేశంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ప్రేమ్‌జీ పొదుపునకు, సింప్లిసిటీకి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. ఆయన సాధ్యమైనంత వరకూ విమాన ప్రయాణాల్లో ఎకానమీ తరగతిలోనే ప్రయాణిస్తారు. ఎయిర్‌పోర్టుల్లో కంపెనీ కారు రావడం ఆలస్యమైతే ఏమాత్రం సంకోచించకుండా ఆటోలోనో లేదా బస్సులోనో కూడా వెళ్లిపోతారు. అలాగే, వ్యాపార రీత్యా పర్యటించేటప్పుడు ఫైవ్ స్టార్ హోటల్స్ కన్నా కంపెనీ గెస్ట్ హౌస్‌లలో ఉండటానికి ఇష్టపడతారు. భోజనం కూడా కంపెనీ క్యాంటీన్లోనే చేస్తారు. క్యాంటీన్లో ఆహారం ఉద్యోగులకు మంచిదైనప్పుడు.. తనకు కూడా మంచిదే కదా అని లాజిక్ తీస్తారు. ఆఖరికి కుమారుడి వివాహంలో కూడా లంచ్‌ను పేపర్ ప్లేట్లలో అందించారట. పొదుపు విషయానికొస్తే.. ఆయన అల్టిమేట్. అవసరం లేనప్పుడు లైట్లను ఆర్పేయించడం మొదలు టాయ్‌లెట్ రోల్స్ దాకా అన్నింటి విషయంలోనూ ప్రేమ్‌జీ జాగ్రత్తగా వ్యవహరిస్తారు. పెట్టుబడుల్లోనూ మేటి.. పొదుపే కాదు పెట్టుబడి విషయాల్లోనూ ప్రేమ్‌జీ ఘనాపాటి. ఇప్పటిదాకా ఆయన సుమారు 60 పైగా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు. రియల్టీ పెట్టుబడులు మొదలుకుని లిస్టెడ్ కంపెనీల దాకా అనేకం ఆయన పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. స్నాప్‌డీల్, మింత్రా, సూపర్ బజార్ల చైన్ సుభిక్ష (ప్రస్తుతం మూతబడింది) లాంటి వాటిల్లో ప్రేమ్‌జీ పెట్టుబడులు పెట్టారు. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఆయన ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆఫీస్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇది దాదాపు రూ. 10,000 కోట్ల నిధులను మేనేజ్ చేస్తుంది. అవకాశాలను బట్టి పెట్టుబడులు పెడుతుంటుంది. దేశీయంగానే కాకుండా ఈ మధ్యే అమెరికా, చైనాలోని టెక్నాలజీ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఖర్చుల విషయంలో పీనాసితనంగా కనిపించినప్పటికీ.. డబ్బు తీయాల్సిన చోట తీయడానికి వెనుకాడరు ప్రేమ్‌జీ. అందుకే, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఏకంగా రూ. 10,000 కోట్లు విలువ చేసే షేర్లను తన పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టుకు బదలాయించారు. సేవా కార్యక్రమాల కోసం ఇంత పెద్ద మొత్తాన్ని అందించిన వితరణశీలురుల్లో ఆయన అగ్రస్థానంలో నిల్చారు. -
ఫలంలోని మాధుర్యమంతా శ్రమలోనిదే!
సంపన్న వ్యాపారస్తుడు, పరోపకార పారిశ్రామికవేత్త అయిన అజీమ్ ప్రేమ్‌జీ తరచు ఒక మాట చెబుతుంటారు. దొరికిన ఐదు రూపాయల కన్నా, సంపాదించిన రూపాయి ఎక్కువ విలువైనదని! ఎవరినైనా అడిగి చూడండి, ‘‘మీ జీవితంలో మరపురాని విజయం ఏది?’’ అని. సాధారణంగా అది ఎంతో శ్రమకు ఓర్చిన విజయం అయి ఉంటుంది. అసలు ఆ శ్రమ కారణంగానే వారు పొందిన విజయం సంతోషకరమైనది, మరపురానిది, మధురమైనదీ అవుతుంది. పెద్దవాళ్లు ఇంకో మాట కూడా అంటుంటారు, తేలిగ్గా వచ్చింది తేలిగ్గా పోతుందని. ఆ మాట ఎలా ఉన్నా, ప్రేమ్‌జీ అన్నట్లు కష్టపడి సంపాదించిన దానికి విలువెక్కువ. విలువ ఎక్కువ కాబట్టి కష్టపడి దాని నిలుపుకుంటాం. అంటే తేలిగ్గా పోదు అని. ఒకవేళ పోయినా, అది అవసరంలో ఉన్నవారికే చేరుతుంది. ‘‘నువ్వు సృష్టించిన సంపద మొదట అవసరంలో ఉన్నవారికి, సహాయానికి విలువ ఇచ్చేవారికి అందాలి’’ అంటారు మరో పరోపకార సంపన్నుడు బిల్ గేట్స్. అయితే సంపదను సృష్టించడం అంత తేలికా? కాదు. చెమటోడ్చాలి. సహనం ఉండాలి. వినయ విధేయతలు ఉండాలి. కలిసి పనిచేస్తున్నప్పుడు శ్రమ విలువలను గుర్తించగలిగి ఉండాలి. ఇవ్వవలసింది ఇవ్వాలి. అప్పుడే పొందవలసింది పొందుతాం. దీన్నంతా ఒక చిన్న కథగా చెబితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకావిడకు కొత్తగా తెరచిన దుకాణంలోకి వెళ్లినట్టు కలొచ్చింది. కౌంటర్లో సాక్షాత్తూ ఆ దేవుడే ఉన్నాడు! ‘‘ఇక్కడ మీరేం అమ్ముతారు?’’ అని అడిగింది ఆవిడ. ‘‘నీ మనసు కోరుకున్నది ఏదైనా ఇక్కడ దొరుకుతుంది’’ అని చెప్పాడు దేవుడు. ఆవిడ బాగా ఆలోచించి, ‘‘నాకు మనశ్శాంతి కావాలి. ప్రేమ కావాలి. సంతోషం కావాలి. వివేకం కావాలి. అన్ని భయాల నుంచి విముక్తి కావాలి’’ అని అడిగింది. దేవుడు నవ్వాడు. ‘‘అమ్మా, ఇక్కడ పండ్లు దొరకవు. విత్తనాలు మాత్రమే లభ్యమౌతాయి. ఆ విత్తనాలు మొలకెత్తి, మొక్కలుగా మారి, చెట్టుగా ఎదిగితే అప్పుడు వాటి నుంచి నీకు ఫలాలు వస్తాయి’’ అని చెప్పాడు. ‘‘విత్తనాలా?’’ అంది ఆవిడ నిరుత్సాహంగా. ‘‘అవును. ఈ విత్తనాలు తీసుకెళ్లి నాటుకోవాలి. మొలకెత్తాక ఏపుగా పెరగడానికి ఎరువులు వేయాలి. పిట్టల్నుంచి, పశువుల నుంచి ఆ మొక్కలను కాపాడుకోవాలి. చిత్తశుద్ధితో, అంకితభావంతో, ప్రేమతో వాటిని పెంచుకోవాలి. ఫలాలు వచ్చే వరకు ఓపిగ్గా ఎదురు చూడాలి. అన్నిటికన్నా ముఖ్యం సహనం. పురుగు పట్టినప్పుడు, తెగులు చేరినప్పుడు కష్టపడి వాటిని వదిలించాలి. మళ్లీ చేరకుండా జాగ్రత్తలు వహించాలి. అంటే వాటి కోసం శ్రమించాలి. అప్పుడే నీ శ్రమ ఫలిస్తుంది’’ అని చెప్పాడు దేవుడు. కష్టపడందే ఫలితం ఉండదని ఇందులోని అంతరార్థం. కష్టపడి సాధించిన దాన్ని మనం ఎంతో జాగ్రత్తగా సంరక్షించుకుంటామని పరమార్థం. సుఖసంతోషాలైనా, సంపదలైనా శ్రమకోర్చి సంపాదించుకున్నవైతేనే కలకాలం నిలుస్తాయి. -
జేఎం ఫైనాన్షియల్‌లో ప్రేమ్‌జీ వాటా పెంపు!
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ... బ్యాంకింగ్ లెసైన్స్‌కోసం పోటీలో ఉన్న జేఎం ఫైనాన్షియల్‌లో అదనపు వాటా కొనుగోలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జేఎంలో ప్రేమ్‌జీకి 2.9% వాటా ఉంది. వ్యక్తిగత ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో కింద ప్రేమ్‌జీ ఈ వాటాను కలిగి ఉన్నారు. దీనికి అదనంగా 5% వాటాను తీసుకోనున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. నిమేష్ కంపానీ ఆధ్వర్యంలోని జేఎం కొత్త బ్యాంకింగ్ లెసైన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్‌కు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే సిటీబ్యాంక్ మాజీ చీఫ్ విక్రమ్ పండిట్‌ను కీలక ఇన్వెస్టర్‌గా ఎంపిక చేసుకుంది కూడా. అధికారిక సమాచారం లేనప్పటికీ 5% వాటాకు సమానమైన షేర్లను ప్రేమ్‌జీకి కొత్తగా జారీ చేయనున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. కాగా, మార్కెట్ ధర కంటే బాగా అధిక ధరలో ఈ షేర్లను కేటాయించే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. గడిచిన శుక్రవారం జేఎం ఫైనాన్షియల్ షేరు బీఎస్ఈలో 5% జంప్‌చేసి రూ. 28.85 వద్ద ముగిసింది. కుటుంబం తరఫున పెట్టుబడులు చేపట్టే ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ ద్వారా గతంలో ప్రేమ్‌జీ జేఎంలో 2.9% వాటాను కొనుగోలు చేశారు. -
దాతృత్వం స్వతహాగా రావాలి: ప్రేమ్‌జీ
న్యూఢిల్లీ: దాతృత్వమనేది సహజసిద్ధంగా రావాలే తప్ప దీన్ని బలవంతంగా రుద్దడం కుదరదని ఐటీ దిగ్గజం విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ అభిప్రాయపడ్డారు. సమాజం అభివృద్ధి చెందడంలో మనమూ పాలుపంచుకోవాలని, అయితే ఈ భావన మనసులో నుంచే రావాల్సి ఉంటుందని ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 40వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. సామాజిక బాధ్యతలో భాగంగా కంపెనీలు తమ లాభాల్లో కొంత మొత్తాన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు(సీఎస్ఆర్) ఉపయోగించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిన నేపథ్యంలో ప్రేమ్‌జీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. లాభాల్లో 2 శాతాన్ని సీఎస్‌ఆర్‌పై వెచ్చించాలన్న నిబంధనను భవిష్యత్‌లో పన్ను కింద మార్చేయకూడదని ప్రేమ్‌జీ పేర్కొన్నారు. అందరూ పాలుపంచుకోవాలి.. సామాజిక బాధ్యత కేవలం ప్రభుత్వానికే పరిమితం కాదని, సమాజంలో మార్పు రావాలంటే మొత్తం వ్యవస్థ అంతా ఈ ప్రక్రియలో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రేమ్‌జీ అన్నారు. అయితే, ఈ చర్యలేవైనా సరే అర్థవంతంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. 2010లో ప్రేమ్‌జీ విప్రోలో 8.7% వాటాలను స్వచ్ఛంద సేవా సంస్థ అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కి విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.