సాక్షి, ముంబై: ఘోర రోడ్డు ప్రమాదంలో ఆదివారం కన్నుమూసిన టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రసంగం ఒకటి ఇపుడు వైరల్ అవుతోంది. మేకిన్‌ఇండియాలో భాగంగా టాటా గ్రూపు తరపున ప్రసంగించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. భారత ఆర్థికవ్యవస్థకు మూలాధారంగా తయారీరంగాన్ని మార్చే ప్రాధాన్యత, కొన్ని సవాళ్లు పరిష్కారాలపై మిస్త్రీ మాట్లాడారు.
భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేయడానికి ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి పనిచేసేందుకు మేక్ ఇన్ ఇండియా సమయోచితమైన ప్రత్యేకమైన అవకాశమని మిస్త్రీ ప్రశంసించారు. భారతదేశం ఒక చారిత్రాత్మక తరుణంలో ఉందనీ, మనం కలిసి దేశాన్ని కొత్త మార్గంలోకి నడిపించే అవకాశం ఉందన్నారు. అలాగే జీడీపీలో తయారీ రంగం సహకారం 15 శాతం నుంచి 25 శాతానికి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు
2014లోనిర్వహించిన 'మేక్ ఇన్ ఇండియా' ఈవెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి జౌళి శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఉన్నారు. వీరితో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముఖేశశ్ అంబానీ, విప్రోకు చెందిన అజీమ్ ప్రేమ్‌జీ తదిరులు హాజరైనారు.
కాగా సైరస్ పల్లోంజీ మిస్త్రీ 2012 నుండి 2016 వరకు టాటాసన్స్ ఛైర్మన్‌గా ఉన్నారు. అనూహ్యంగా టాటా, మిస్త్రీ కుటుంబాల మధ్య బహిరంగ, వివాదాలు పొడసూపాయి. 2016 చివరిలో మిస్త్రీని పదవినుంచి తొలగించడంతో ఇది మరింత ముదిరి, సుదీర్ఘ న్యాయ పోరాటానికి తెర లేచింది. ఆ తరువాత ఫిబ్రవరి 2017చంద్రశేఖరన్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు
.
Comments
Please login to add a commentAdd a comment