Cyrus Mistry
-
రతన్ టాటా కఠిన నిర్ణయం: వెలుగులోకి కీలక విషయాలు
ప్రముఖ పారిశ్రామిక వేత్త, పరోపకారి 'రతన్ టాటా' మరణించిన తరువాత.. థామస్ మాథ్యూ రచించిన 'రతన్ టాటా: ఏ లైఫ్' (Ratan Tata: A Life) అనే పుస్తకం విడుదలైంది. 100 పేజీల కంటే ఎక్కువ ఉన్న ఈ పుస్తకం రెండేళ్ల క్రితమే పూర్తయినప్పటికీ.. ప్రచురణకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు ఆ బుక్ లాంచ్ చేశారు. దీని ద్వారా అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.డిసెంబర్ 2012లో టాటా సన్స్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుని, రతన్ టాటా పదవీ విరమణ చేసిన తరువాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. టాటా సన్స్ ఛైర్మన్‌గా సైరన్ మిస్త్రీ పూర్తి బాధ్యతలను అధికారికంగా చేపట్టడానికి ముందే.. ఆ పదవికి మిస్త్రీ అర్హుడేనా అనే ఆలోచన రతన్ టాటాకు వచ్చినట్లు థామస్ మాథ్యూ పుస్తకం ఆధారంగా తెలుస్తోంది.నిజానికి రతన్ టాటా తన చైర్మన్ పదవికి రాజీనామా చేయడానికి ముందే.. ఎంపిక కమిటీ 2011లోనే సైరన్ మిస్త్రీని ఎంపిక చేసింది. ఆ తరువాత మిస్త్రీ సంస్థ నిర్వహణ విషయంలో మెళుకువలను తెలుసుకోవడానికి రతన్ టాటా కింద అప్రెంటిస్‌షిప్‌గా ఉన్నారు. ఈ సమయంలోనే ఏడాది తరువాత కంపెనీ బాధ్యతలను తీసుకోవడానికి మిస్త్రీ సరైన వ్యక్తేనా అని రతన్ టాటా పునరాలోచన చేశారు.2016లో సైరన్ మిస్త్రీని టాటా సన్స్ ఛైర్మన్‌గా తొలగించవలసి వచ్చింది. ఆ సమయంలో ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి రతన్ టాటాకు ఎంతో కష్టంగా అనిపించిందని.. హార్వర్డ్ బిజినినెస్ స్కూల్ మాజీ డీన్ నితిన్ నోహ్రియా ద్వారా తెలిసినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. టాటా సన్స్ డైరెక్టర్‌గా ఉన్న వేణు శ్రీనివాసన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించినట్లు పుస్తకంలో వివరించినట్లు సమాచారం.ఇదీ చదవండి: ఇషా ఆడపడుచు పెద్ద బిజినెస్ ఉమెన్.. తన గురించి ఈ విషయాలు తెలుసా?సైరన్ మిస్త్రీ మీద సంస్థ సంస్థ డైరెక్టర్లకు విశ్వాసం లేదని తెలుసుకున్నప్పుడే చైర్మన్ బాధ్యతల నుంచి స్వయంగా బయటకు వెళ్లి ఉంటే బాగుండేదని రతన్ టాటా అభిప్రాయపడ్డారు. కానీ రతన్ టాటా అనుకున్నట్లు జరగలేదు. దీంతో బోర్డు సభ్యులందరూ కలిసి సైరన్ మిస్త్రీ తొలగించడం జరిగింది. ఆ తరువాత జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మిస్త్రీ కన్నుమూశారు. -
ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో సైరస్ మిస్త్రీ కుమారులు
ముంబై : ఫోర్బ్స్ ఈ ఏడాది బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. అందులో 25 మంది అతిచిన్న వయస్సుల్లో బిలియనీర్లు ఉన్నారు. వారి మొత్తం సంపద 110 బిలియన్ డాలర్లు కాగా వారి వయస్సు 33 అంతకంటే తక్కువగా ఉందని ఫోర్బ్స్ తెలిపింది. 30 ఏళ్లలోపు యువ భారతీయ బిలియనీర్లలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కుమారులు జహాన్, ఫిరోజ్ ముందంజలో ఉన్నారు. వారిద్దరి సంపద 9.8 బిలియన్లుగా ఉంది. జహాన్ మిస్త్రీ 2022లో కారు ప్రమాదంలో తండ్రి సైరస్ మిస్త్రీ మరణించిన తర్వాత జహాన్ తన కుటుంబ సంపదలో కొంత భాగాన్ని వారసత్వంగా పొందారు. ఇందులో టాటా సన్స్‌లో వాటా 18.4శాతం, ముంబై నిర్మాణ దిగ్గజం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో జహాన్ 25 శాతం వాటా ఉంది. ఐర్లాండ్‌లో పౌరసత్వం కలిగిన జహాన్ మిస్త్రీ తన తండ్రి సైరస్ మిస్త్రీ మరణం తర్వాత ముంబైలో నివసిస్తున్నారు. ఫిరోజ్ మిస్త్రీ ఫిరోజ్ మిస్త్రీ (27) దివంగత సైరస్ మిస్త్రీకి పెద్ద కుమారుడు. కుటుంబ వారసత్వంగా టాటా సన్స్‌లో 18.4శాతం వాటాను, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో 25శాతం వాటాను దక్కించుకున్నారు. ప్రస్తుతం తన సొంత నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఐపీఓకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ఫిరోజ్ మిస్త్రీ యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో చదువుకున్నారు. ఐరిష్ పౌరసత్వం ఉన్నప్పటికీ అతను ముంబైలో నివసిస్తున్నారు. -
సైరస్ మిస్త్రీ విషాదం: గడ్కరీ కీలక నిర్ణయం, త్వరలోనే ఆదేశాలు
న్యూఢిల్లీ: టాటాసన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై కారులో ప్రయాణించే వారందరికీ సీటు బెల్టు ధరించడం తప్పనిసరి చేస్తామన్నారు. సెప్టెంబర్ 4న జరిగిన కారు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి చెందడమే ఈ నిర్ణయానికి కారణమని గడ్కరీ తెలిపారు. సైరస్ మిస్త్రీ మరణం తర్వాత, కారులో వెనుక సీటు ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుందని ఒక మీడియా కార్యక్రమంలో వెల్లడించిన కేంద్రమంత్రి వెనుకసీటులో కూర్చున్నవారికి కూడా సీటు బెల్ట్ తప్పని సరిగి ధరించాలని వ్యాఖ్యానించారు. త్వరలోనే వెనుకసీట్లో కూర్చున్న వారితో సహా కారులో ప్రయాణించే అందరూ సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి చేస్తామని చెప్పారు. సీటుబెల్ట్ ధరించకుంటే సీట్‌బెల్ట్ బీప్ సిస్టమ్ కూడా అమలులో ఉంటుందని గడ్కరీ తెలిపారు. అంతేకాదు ఈ నిబంధన పాటించిక పోతే జరిమానా కూడా విధించేఅవకాశం ఉందని, దీనికి సంబంధించిన ఆదేశాలనుమూడు రోజుల్లో జారీ చేస్తామని కూడా గడ్కరీ పేర్కొన్నారు. (పండుగ వేళ ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం, ఫైర్ క్రాకర్స్ బ్యాన్ ) కాగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మిస్త్రీ కన్నుమూశారు. మితిమీరిన వేగానికితోడు, వెనుక సీట్లో కూర్చున్న మిస్త్రీ సీటు బెల్ట్ పెట్టుకోకోవడంతోనే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సైరస్ మిస్త్రీ విషాదం: పోస్ట్‌మార్టం నివేదిక ఏం చెబుతోందంటే?
ముంబై: గత ఆదివారం కారు ప్రమాదంలో మరణించిన టాటాసన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రాథిమిక పోస్ట్‌మార్టం పూర్తియింది. దీని ప్రకారం ఆయన తలకు, గుండెకు తీవ్ర గాయాలయ్యాయి. ఫలితంగా అంతర్గత రక్తస్రావంతో అక్కడి కక్కడే మరణించినట్లు నివేదిక పేర్కొంది. అలాగే పాలీట్రామా (శరీరంలోని అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బ తినడం)కు గురయ్యారని ఈ నివేదిక తేల్చింది.(Instagram: భారీ జరిమానా..షాకింగ్! ఎందుకో తెలుసా?) సోమవారం తెల్లవారుజామున ముంబైలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని జేజే ఆసుపత్రిలో సైరస్ మిస్త్రీ పోస్టుమార్టం నిర్వహించినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. మిస్త్రీ, జహంగీర్ పండోలే ఇద్దరి శవపరీక్ష నివేదికను కాసా పోలీస్ స్టేషన్‌కు (ప్రమాదం జరిగిన ప్రాంతం)పంపారు. మరో రెండురోజుల్లో తుది నివేదిక వెలువడ నుంది. ఇందులో మిస్త్రీ మరణానికి ఖచ్చితమైన కారణాన్ని పేర్కొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిస్త్రీ శరీరంనుంచి ఎనిమిది శాంపిళ్లను సేకరించి, తదుపరి పరిశీలన కోసం విసెరా నమూనాలు భద్రం చేశారు. మరోవైపు మంగళవారం తెల్లవారుజామున ముంబైలోని వర్లీ శ్మశానవాటికలో సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై సూర్య నదిపై ఉన్న వంతెనపై వేగంగా వెళుతున్న మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మిస్త్రీతోపాటు, స్నేహితుడు జహంగీర్ పండోలే మరణించారు. తీవ్రంగా గాయపడ్డ డాక్టర్ అనాహిత పండోలే, ఆమె భర్త డేరియస్ పండోలే ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మితిమీరిన వేగం మిస్త్రీ , మిస్టర్ జహంగీర్ పండోల్ ఇద్దరూ సీట్ బెల్ట్ ధరించకపోవడమే విషాదానికి దారి తీసిందని పోలీసులుఅధికారులు వెల్లడించారు. ఇదీ చదవండి: New milestone: వావ్.. మార్కెట్లో భారీగా ఇన్వెస్టర్లు, కీలక మైలురాయి ముగిసిన అంత్యక్రియలు జేజే ఆస్పత్రి నుంచి తీసుకొచ్చిన ఆయన భౌతికకాయాన్నిస్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషుల నివాళులర్పించేందుకు వర్లీ శ్మశానవాటికలో ఉంచారు. అనంతరం సెంట్రల్ ముంబైలోని వర్లీలోని ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో హిందూ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు జరిపించారు. పార్సీ సంఘం సభ్యులు, వ్యాపార ప్రముఖులు, రాజకీయ నాయకులు దహన సంస్కారాలకు హాజరయ్యారు. సైరస్ మిస్త్రీ సోదరుడు షాపూర్ మిస్త్రీ, మామ, సీనియర్ న్యాయవాది ఇక్బాల్ చాగ్లా, పారిశ్రామికవేత్తలు అనిల్ అంబానీ, అజిత్ గులాబ్‌చంద్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తదితరులు సైరస్ మిస్త్రీకి తుది నివాళులర్పించారు. అమూల్ ప్రత్యేక నివాళి డైనమిక్ బిజినెస్‌మ్యాన్ అంటూ అమూల్ ఇండియా మిస్త్రీకి నివాళులర్పించింది. View this post on Instagram A post shared by Amul - The Taste of India (@amul_india) -
మితిమీరిన వేగం వల్లే... మిస్త్రీ మృతి
ముంబై: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (54) అంత్యక్రియలు మంగళవారం ముంబైలో జరగనున్నాయి. మృతదేహానికి సోమవారం అటాప్సీ పూర్తయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ డాక్టర్ అనాహిత పండోలే, ఆమె భర్త డేరియస్ పండోలే ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు ప్రయాణిస్తున్న బెంజ్ కారు ఆదివారం మధ్యాహ్నం ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురవడం తెలిసిందే. వెనక సీట్లో ఉన్న మిస్త్రీ, ఆయన మిత్రుడు జహంగీర్ పండోలే అక్కడికక్కడే మరణించారు. వాళ్లిద్దరూ సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసులు తెలిపారు. మితిమీరిన వేగం, మరో వాహనాన్ని రాంగ్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో కారు అదుపు తప్పడమే ప్రమాదానికి కారణమన్నారు. చరోటీ చెక్ పోస్టు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి కారు 9 నిమిషాల్లో చేరుకుందని వివరించారు. జర్మనీ నుంచి వచ్చిన బెంజ్ సంస్థ బృందం ఘటనా స్థలిని పరిశీలించింది. -
మిస్త్రీ కారు ప్రమాదం.. వెనక సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే..?
ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోడం వ్యాపార, వాణిజ్య వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదానికి గల కారణాలను అధికారులు, నిపుణులు అన్వేషిస్తున్నారు. మిస్త్రీతో పాటు కారు వెనుక సీట్లో కూర్చున్న జహంగీర్ పండోలే.. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని నిపుణులు అంటున్నారు. వారిద్దరూ కనుక సీట్ బెల్ట్ ధరించివుంటే ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకుని ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గురైన కారు పరిశీలిస్తే ముందు భాగంలో రెండు ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకున్నట్టు స్పష్టంగా కనబడుతోంది. దీంతో ముందు సీట్లో ఉన్న డేరియస్ పండోలే, కారు నడుపుతున్న ఆయన భార్య డాక్టర్ అనాహిత గాయాలతో బయటపడ్డారు. వారిద్దరూ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకుని ప్రమాద తీవ్రత తగ్గి ప్రాణాలు నిలుపుకున్నారు. (క్లిక్: మిస్త్రీ హఠాన్మరణం.. ఆనంద్ మహీంద్ర భావోద్వేగం) సెక్యురిటీ ఫీచర్లు ఉన్నప్పటికీ.. కారుకు ఒకవైపు మాత్రమే అమర్చినట్లుగా కనిపించే నీలం రంగు సైడ్-కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఓపెన్ అయినట్టు తెలుస్తోంది. మిస్త్రీ, జహంగీర్ సీటు బెల్ట్ ధరించపోవడంతో వారి సీట్లలో నుంచి ఎగిరిపడివుండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన మెర్సిడెస్ జీఎల్సీ ఎస్‌యూవీలో అత్యంత సురక్షితమైన సెక్యురిటీ ఏర్పాట్లు ఉన్నప్పటికీ అజాగ్రత్త కారణంగానే మిస్త్రీ, జహంగీర్ ప్రాణాలు కోల్పోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన దేశంలో చాలా తక్కువ మంది మాత్రమే వెనుక సీటులో సీట్ బెల్ట్‌లు ధరిస్తారన్న విషయం తెలిసిందే. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏమౌతుంది? కారు వెనుక కూర్చున్న వారు సీటు బెల్ట్ ధరించకపోతే ఏమవుతుందనే దాని గురించి తెలిపే వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెనుక సీట్లో ఉన్న ఇద్దరిలో ఒకరు మాత్రమే సీటు బెల్ట్ ధరించారు. ప్రమాదం జరిగినప్పడు సీటు బెల్ట్ పెట్టుకోని వ్యక్తి ఎగిరి ముందు సీటులోని వ్యక్తి ఎగిరిపడిపోయినట్టుగా వీడియో చూపించారు. బాహుశా మిస్త్రీ కారు ప్రమాదానికి గురైనప్పుడు ఈవిధంగానే జరిగివుండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కారులో ప్రయాణించే వారంతా తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని చెబుతున్నారు. (క్లిక్: చిన్న పొరపాట్లే మిస్త్రీ ప్రాణాలు తీశాయా.. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..!) చట్టం ఏం చెబుతోంది? సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (సీఎంవీఆర్) ప్రకారం వెనుక సీటులో కూర్చున్న ప్రయాణికులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి. సీఎంవీఆర్ రూల్ 138 (3) ప్రకారం వాహనం కదులుతున్నప్పుడు.. ముందు సీటులో కూర్చున్న వారితో పాటు వెనుక సీటులో ఉన్న వారు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి 1,000 రూపాయల జరిమానా విధిస్తారు. కాగా, కారులో అన్ని సీట్లకు Y- ఆకారపు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉండాలని ఈ సంవత్సరం ప్రారంభంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. 25 శాతం మరణాలను నివారించొచ్చు వెనుక సీటు బెల్ట్‌లను ఉపయోగించడం వల్ల 25 శాతం మరణాలను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. అంతేకాదు ప్రమాదాల్లో ముందు సీటు ప్రయాణికులకు అదనపు గాయాలు లేదా మరణాన్ని కూడా నిరోధించవచ్చని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. -
ప్రధానీ మోదీ, అంబానీ సమక్షంలో సైరస్ మిస్త్రీ పాత ప్రసంగం వైరల్
సాక్షి, ముంబై: ఘోర రోడ్డు ప్రమాదంలో ఆదివారం కన్నుమూసిన టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రసంగం ఒకటి ఇపుడు వైరల్ అవుతోంది. మేకిన్ఇండియాలో భాగంగా టాటా గ్రూపు తరపున ప్రసంగించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. భారత ఆర్థికవ్యవస్థకు మూలాధారంగా తయారీరంగాన్ని మార్చే ప్రాధాన్యత, కొన్ని సవాళ్లు పరిష్కారాలపై మిస్త్రీ మాట్లాడారు. భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేయడానికి ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి పనిచేసేందుకు మేక్ ఇన్ ఇండియా సమయోచితమైన ప్రత్యేకమైన అవకాశమని మిస్త్రీ ప్రశంసించారు. భారతదేశం ఒక చారిత్రాత్మక తరుణంలో ఉందనీ, మనం కలిసి దేశాన్ని కొత్త మార్గంలోకి నడిపించే అవకాశం ఉందన్నారు. అలాగే జీడీపీలో తయారీ రంగం సహకారం 15 శాతం నుంచి 25 శాతానికి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు 2014లోనిర్వహించిన 'మేక్ ఇన్ ఇండియా' ఈవెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి జౌళి శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఉన్నారు. వీరితో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముఖేశశ్ అంబానీ, విప్రోకు చెందిన అజీమ్ ప్రేమ్‌జీ తదిరులు హాజరైనారు. కాగా సైరస్ పల్లోంజీ మిస్త్రీ 2012 నుండి 2016 వరకు టాటాసన్స్ ఛైర్మన్‌గా ఉన్నారు. అనూహ్యంగా టాటా, మిస్త్రీ కుటుంబాల మధ్య బహిరంగ, వివాదాలు పొడసూపాయి. 2016 చివరిలో మిస్త్రీని పదవినుంచి తొలగించడంతో ఇది మరింత ముదిరి, సుదీర్ఘ న్యాయ పోరాటానికి తెర లేచింది. ఆ తరువాత ఫిబ్రవరి 2017చంద్రశేఖరన్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు . -
సైరస్ మిస్త్రీ హఠాన్మరణం: ఆనంద్ మహీంద్ర భావోద్వేగం
సాక్షి,ముంబై: టాటాసన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ అకాలమరణం కార్పొరేట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించిన తీరుతో మితిమీరినవేగం, సీట్ బెల్ట్ పెట్టుకోకవడం తదితర అంశాలు మరోసారి తీవ్ర చర్చకు దారి తీసాయి. ముఖ్యంగా పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ‘కారు వెనుక సీటులో కూర్చున్నప్పుడు కూడా ఎప్పుడూ నా సీటు బెల్ట్ ధరించాలని నిర్ణయించుకుంటున్నాను. మీ అందరూ కూడా ఇలాంటి ప్రతిజ్ఞ తీసుకోండి’ అంటూ ట్వీట్ చేశారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే సైరస్ చనిపోయారన్న వార్తలపై పలు వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆనంద్ మహీంద్ర మనసులోని బాధను, ఆవేదనను ట్విటర్లో తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. దయచేసి అందరూ సీట్ బెల్ట్‌లు ధరించండి. వెనక సీట్లో కూర్చున్నా కూడా బకిల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. మన వెనుక మన కుంటుంబాలు ఉన్నాయన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి. కచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తాను అందరూ కూడా ప్రతిజ్ఞను కూడా తీసుకోవాలంటూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కోరారు. కాగా సైరస్ మిస్త్రీ (54) గుజరాత్‌లోని ఉద్వాడనుంచి ముంబై వెళ్తుండగా ఆదివారం జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. టాటా గ్రూప్ మాజీ ఇండిపెండెంట్ డైరెక్టర్ డారియస్ పండోల్, అతని భార్య ముంబైకి చెందిన గైనకాలజిస్ట్ అనహిత పండోల్, సోదరుడు జహంగీర్ పండోల్‌తో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. అనహిత పండోలే మెర్సిడెస్ కారు నడుపుతున్న క్రమంలో అతి వేగంతో మరో వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ఆమె కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే వెనుక సీట్లో కూర్చున్న సైరస్ మిస్త్రీ, జహంగీర్ పండోలే సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలోసైరస్, జహంగీర్ అక్కడికక్కడే చనిపోగా, అనహిత పండోలె, డారియస్ పండోలే తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. I resolve to always wear my seat belt even when in the rear seat of the car. And I urge all of you to take that pledge too. We all owe it to our families. https://t.co/4jpeZtlsw0 — anand mahindra (@anandmahindra) September 5, 2022 -
సైరస్ మిస్త్రీ మరణం, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ బాధ్యతలు ఎవరు చూసుకుంటారంటే!
157ఏళ్ల చరిత్ర, మల్టీ బిలియన్ డాలర్ల సంస్థ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ మూగబోయింది. ఆ గ్రూప్ ఛైర్మన్‌గా వ్యవహరించిన షాపూర్జీ పల్లోంజీ ఈ ఏడాది జూన్ 28న మరణించగా, ఇప్పుడు సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో కన్ను మూయడం వ్యాపార సామ్రాజ్యానికి తీరని లోటుని మిగిల్చాయి. అయితే ఇప్పుడు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారనేది చర్చాంశనీయంగా మారగా..సైరస్ మిస్త్రీ అతని పిల్లలు, సోదరుడే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సైరస్ మిస్త్రీ, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది చదవండి: సైరస్ మిస్త్రీ హఠాన్మరణం: ఆనంద్ మహీంద్ర భావోద్వేగం ►1865లో సైరస్ మిస్త్రీ ముత్తాత పల్లోంజి మిస్త్రీ..లిటిల్‌వుడ్ పల్లోంజీ అండ్ కో సంస్థను స్థాపించారు. ఆ తర్వాతి కాలంలో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌గా మారింది. ►సుమారు 30 బిలియన్ డాలర్ల నికర సంపద కలిగిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు.. టాటా గ్రూప్‌లో 18.6శాతం వాటాలున్నాయి. ►బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. 2022లో షాపూర్జీ గ్రూప్ దాదాపు 30 బిలియన్ల నికర విలువను కలిగి ఉంది. ►2016 అక్టోబర్‌లో జరిగిన బోర్డ్ మీటింగ్‌లో టాటా గ్రూప్..సైరస్ మిస్త్రీని ఛైర్మన్‌గా తొలగించింది. ఆ నిర్ణయంతో భారత దేశ చరిత్రలో కార్పొరేట్ దిగ్గజ సంస్థల మధ్య వైరం మొదలైంది. ►సైరస్ మిస్త్రీ పర్యవేక్షణలో, టాటా గ్రూప్‌కు చెందిన టాప్-20 లిస్టెడ్ గ్రూప్ కంపెనీల వార్షిక వృద్ధి రేటు 12.5 శాతం పెరిగింది. ►టాటా గ్రూప్ మొత్తం నికర లాభం 42.3 శాతంతో వృద్ది చెందింది. సైరస్ మిస్త్రీ టాటా గ్రూప్ ఛైర్మన్‌గా విధులు నిర్వహించే సమయంలో కార్యకలాపాల్ని సమర్ధవంతంగా నిర్వహించారు. అతి తక్కువ కాలంలో 100 బిలియన్ డాలర్ల టర్నోవర్ సాధించింది. ►షాపూర్జీ పల్లోంజీ గ్రూప్.. నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్, రియల్ ఎస్టేట్, కన్స్యూమర్ గూడ్స్, సోలార్ పవర్, ఇంజనీరింగ్ అండ్ కన్ స్ట్రక్షన్లో కార్యకాలాపాల్ని నిర్వహించింది. ► 50 కంటే ఎక్కువ దేశాలలో 50వేల మందికి పైగా ఉద్యోగులు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో పనిచేస్తున్నారు. ►సైరస్ మిస్త్రీ 2012 డిసెంబర్లో టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా నియమితులైనప్పటి నుండి.. సైరస్ తన అన్నయ్య షాపూర్ మిస్త్రీకి కుటుంబ వ్యాపార కార్యకలాపాల బాధ్యతల్ని నిర్వహించారు. ►2019 చివరి కాలంలో షాపూర్జీ గ్రూప్ నిర్వహణ బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. షాపూర్ కుమారుడు పల్లోన్ (26) గ్రూప్ హోల్డింగ్ కంపెనీ బోర్డులో చేర్చారు. కుమార్తె తాన్య గ్రూప్ కార్పొరేట్ బాధ్యల్ని నిర్వహిస్తున్నారు. -
సైరస్ మిస్త్రీ మృతిపై సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ అకాల మరణంపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం వ్యక్తంచేశారు. మిస్త్రీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సైరస్ మిస్త్రీ ఒక ఆశాజనక వ్యాపార దిగ్గజమని సీఎం కొనియాడారు. చదవండి: గౌరవం కోసం పోరాటం.. టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (54) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆదివారం మరో ముగ్గురితో కలిసి అహ్మదాబాద్ నుంచి ముంబై వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెజ్ బెంజ్ కారు ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలోని పాల్ఘార్ జిల్లా చరోటీ నాకా వద్ద మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో సూర్య నది వంతెనపై రోడ్డు డివైడర్‌ను, ఆపై రిటెన్షన్ వాల్‌ను ఢీకొట్టింది. దాంతో మిస్త్రీతో పాటు మరొకరు అక్కడికక్కడే చనిపోయారు. -
Cyrus Mistry: గౌరవం కోసం పోరాటం..
ముంబై: పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. దీనితో, కొన్నాళ్ల క్రితమే టాటా గ్రూప్ నుంచి అర్ధాంతరంగా ఉద్వాసనకు గురైన మిస్త్రీ తాజాగా జీవితం నుంచి కూడా అర్ధాంతరంగా నిష్క్రమించినట్లయింది. టాటా సన్స్‌లో అత్యధికంగా 18 శాతం పైగా వాటాలున్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ తరఫున 2012లో టాటా గ్రూప్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టే వరకూ.. కుటుంబ వ్యాపార వర్గాల్లో తప్ప సైరస్ మిస్త్రీ పేరు పెద్దగా బైట వినిపించేది కాదు. 1991లో మిస్త్రీ తమ కుటుంబ వ్యాపార సంస్థ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో (ఎస్పీ) డైరెక్టరుగా చేరారు. 1994లో ఎండీగా నియమితులయ్యారు. ఎస్పీ గ్రూప్ కార్యకలాపాలు మెరైన్, ఆయిల్, గ్యాస్, రైల్వే తదితర రంగాల్లోకి విస్తరించడంలో ప్రధాన పాత్ర పోషించారు. 2006లో కీలకమైన టాటా సన్స్ బోర్డులో చేరారు. అప్పటివరకూ ఆయన పలు టాటా కంపెనీల బోర్డుల్లో సభ్యుడిగా కొనసాగారు. సాధారణంగా నలుగురిలో ఎక్కువగా కలవకపోయినా.. తెలిసినంత వరకూ వ్యాపార దక్షత విషయంలో ఆయనకు మంచి పేరు ఉండేది. ఇదే టాటా గ్రూప్ చీఫ్ రతన్ టాటా తన వారసుడిగా మిస్త్రీని ఎంచుకునేలా చేసింది. వాస్తవానికి టాటా పగ్గాలు చేపట్టడానికి మిస్త్రీకి ఇష్టం లేకపోయినప్పటికీ రతన్ టాటా స్వయంగా నచ్చచెప్పడంతో ఆయన అంగీకరించినట్లు సన్నిహిత వర్గాలు చెబుతాయి. అలా 44 ఏళ్ల వయస్సులో, దేశంలోనే అతి పెద్ద దిగ్గజాల్లో ఒకటైన టాటా గ్రూప్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న మిస్త్రీ సంస్థను కొత్త బాటలో నడిపించే ప్రయత్నం చేశారు. టాటాల కుటుంబానికి చెందిన వారు కాకుండా వేరొకరు టాటా గ్రూప్‌నకు సారథ్యం వహించడం అదే ప్రథమం. కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలను మెరుగుపర్చడంపై ఆయన దృష్టి పెట్టారు. నష్టాల్లో ఉన్న సంస్థలను, ఉత్పత్తులను నిలిపివేసి.. లాభదాయక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటివరకూ ఎక్కువగా బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ)కి పరిమితంగా ఉంటున్న సంస్థ .. మరింతగా వినియోగదారులకు సంబంధించిన ఉత్పత్తులు, సేవలవైపు మళ్లే విధంగా ప్రణాళికలను రూపొందించేందుకు కృషి చేశారు. ఇందుకోసం తగు సిఫార్సులు చేసేందుకు టాటా గ్రూప్‌లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలతో ఒక గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను (జీఈసీ) ఏర్పాటు చేశారు. టాటాతో విభేదాలు.. ఉద్వాసన .. అయితే, ఈ క్రమంలో వ్యాపార వ్యవహార శైలి విషయంలో మిస్త్రీ, రతన్ టాటాల మధ్య విభేదాలు తలెత్తాయి. చివరికి 2016 అక్టోబర్‌లో ఆయన అర్ధాంతరంగా చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఆ తర్వాత టాటా సన్స్ డైరెక్టరుగా కూడా ఆయన్ను తప్పించారు. మిస్త్రీ కుటుంబం అతి పెద్ద వాటాదారే అయినప్పటికీ సైరస్ తన పదవిని కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఎన్ చంద్రశేఖర్ (టీసీఎస్ చీఫ్) .. గ్రూప్ పగ్గాలు అందుకున్నారు. న్యాయస్థానాల్లో చుక్కెదురు.. అవమానకరంగా తనను పంపించిన తీరుపై మిస్త్రీ న్యాయపోరుకు దిగారు. స్వయంగా టాటాపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘అహంభావంతో ఒక్కరు’’ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో గ్రూప్ వ్యాపారానికి నష్టం జరుగుతోందని, టాటా వాస్తవాలు మాట్లాడటం లేదని ఆరోపించారు. తనను తొలగించడంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించారు. అంతకు కొన్నాళ్ల క్రితమే తన పనితీరు అద్భుతమని ప్రశంసించి, అంతలోనే అలా ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో బాంబే డయింగ్ చీఫ్ నుస్లీ వాడియా, ఆయన చిన్ననాటి స్నేహితురాలు.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే తదితరులు ఆయన పక్షాన నిల్చారు. అయితే, బోర్డు, మెజారిటీ వాటాదారులు ఆయనపై విశ్వాసం కోల్పోయారంటూ ఎన్సీఎల్టీ 2018లో మిస్త్రీ పిటీషన్‌ను తోసిపుచ్చింది. దీనిపై ఆయన నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ని ఆశ్రయించగా ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కానీ దీనిపై టాటాలు సుప్రీం కోర్టులో అప్పీలు చేయగా 2021 మార్చిలో ఇచ్చిన తుది తీర్పులో.. అత్యున్నత న్యాయస్థానం టాటాల పక్షం వహించింది. అయితే, అంతకు ముందు తీర్పులో ఆయనపై చేసిన కొన్ని ప్రతికూల వ్యాఖ్యలను తొలగించడం ద్వారా కొంత ఊరటనిచ్చింది. -
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కన్నుమూత
మహరాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మరణించారు. సైరస్ మిస్త్రీ మెర్సిడెస్ బెంజ్ కారులో అహ్మదాబాద్ నుంచి ముంబైకి వస్తున్నారు. మార్గం మధ్యలో మహరాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో సూర్య నది వంతెనపై ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. Former chairman of Tata Sons Cyrus Mistry killed in road accident near Mumbai — Press Trust of India (@PTI_News) September 4, 2022 #BREAKING | Cyrus Mistry no more. First visuals from the accident spot, Palghar near Mumbai in Maharashtra. @PoojaShali @divyeshas pic.twitter.com/YAwQjKOw1w — IndiaToday (@IndiaToday) September 4, 2022 సైరస్ మిస్త్రీ విద్యాభ్యాసం 1968 జులై 4న ముంబైలో పల్లోంజి మిస్త్రీ, పాట్ పెరిన్ దుబాష్ దంపతులకు సైరస్ మిస్త్రీ జన్మించారు. లండన్ ఇంపీరియల్ కాలేజ్‌లో బిజినెస్ స్కూల్ మేనేజ్మెంట్లో ఎంఎంసీ చేసిన ఆయన ..1991లో తన ఫ్యామిలికి చెందిన ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీ షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. రతన్ టాటా స్థానంలో 2012లో రతన్ టాటా పదవీ విరమణతో టాటా గ్రూప్‌నకు సైరస్ మిస్త్రీ ఛైర్మన్ అయ్యారు. అదే సంవత్సరం డిసెంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవి చేపట్టిన నాలుగేళ్లకే అంటే 2016 అక్టోబర్ నెలలో టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ, టాటా సన్స్ బోర్డ్.. సైరస్ మిస్త్రీ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని సూచించింది. ఆ తరువాత ఛైర్మన్ పదవి నుండి తొలగించింది. ఎందుకంటే..సైరస్ మిస్త్రీ సంస్థ నిర్ధేశించిన లక్ష్యాల్ని చేరడంలో విఫలమయ్యారని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మిస్త్రీ తొలగింపు మిస్త్రీ తొలగింపుతో మాజీ ఛైర్మన్ రతన్ టాటా తర్వాత తాత్కాలిక ఛైర్మన్‌గా కొనసాగారు. కొన్ని నెలల తర్వాత కొత్త ఛైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్ ఎంపికయ్యారు. చంద్ర శేఖరన్ ఎంపికపై టాటా సన్స్‌లో 18.4శాతం వాటా ఉన్న మిస్త్రీ తన తొలగింపును సవాల్ చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించారు. అంతేకాదు తన రెండు ఇన్వెస్ట్మెంట్ సంస్థలైన సైరస్ ఇన్వెస్ట్మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ల ద్వారా పలు ఆరోపణలు చేస్తూ రతన్ టాటాతో పాటు, టాటా సన్స్‌లోని మరో 20 మందిపై కేసు దాఖలు చేశారు. గెలుపుపై సుప్రీం స్టే తొలత సైరస్ మిస్త్రీ ఆరోపణల్ని ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. దీంతో ఎన్సీఎల్టీ ఆదేశాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యూనల్(ఎన్సీఎల్ఏటీ) వెళ్లారు. 3 ఏళ్ల న్యాయపోరాటంలో సైరస్ మిస్త్రీ గెలిచారు. ఆ తర్వాత టాటా సన్స్ ఎక్జిక్యూటివ్ ఛైర్మన్‌గా మిస్త్రీని తిరిగి నియమించాలని జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యూనల్ జారీ చేసింది. ఆ ఆదేశాలను 2021 మార్చి 26న సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. ప్రస్తుతం సైరస్ మిస్త్రీ ..షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తుండగా..ఇవాళ మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించడం పట్ల పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
మా నిర్ణయం ఫైనల్.. సమీక్ష ప్రశ్నేలేదు!
న్యూఢిల్లీ: టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగిస్తూ టాటా గ్రూప్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 2021లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ సంస్థలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. ‘క్షమించండి, సమీక్ష పిటిషన్‌ను స్వీకరించడంలేదు. దీనిని తోసిపుచ్చుతున్నాం’’ అని ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. 2021 తీర్పును సమీక్షించాలని కోరుతూ ఎస్పీ గ్రూప్ సంస్థలు సైరస్ ఇన్వెస్ట్మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాయి. 2021 తీర్పులోని కొన్ని వ్యాఖ్యల తొలగింపునకు మాత్రం ఓకే కాగా, బెంచ్‌కు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా రాసినట్లు కనబడుతున్న కొన్ని పేరాలను సైరస్ మిస్త్రీ ఉపసంహరించడానికి సిద్ధంగా ఉన్నాడని ఎస్పీ గ్రూప్ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలియజేయడంతో సైరస్ మిస్త్రీకి వ్యతిరేకంగా 2021 తీర్పులో చేసిన కొన్ని వ్యాఖ్యలను తొలగించడానికి అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ‘‘2021 తీర్పు పత్రికా ప్రకటన కంటే దారుణంగా ఉంది’’ అంటూ సమీక్షా పిటిషన్లో వాడిన పదజాలంపై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘అది సరైనది కాదు, మీరు ముందుగా ఆ పేరాలను ఉపసంహరించుకోండి’’ అని చీఫ్ జస్టిస్ ఎస్పీ గ్రూప్ తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదికి సూచించారు. ధర్మాసనాన్ని బాధపెట్టాలన్న ఉద్దేశం లేదని ఈ సందర్భంగా మిస్త్రీ తరపు న్యాయవాది సోమశేఖరన్ సుందరం పేర్కొన్నారు. ఆయా అభ్యంతరకర పేరాలను ఉపసంహరించుకోవడానికి సిద్ధమని తెలిపారు. పూర్వాపరాలు ఇవీ... మిస్త్రీ 2012లో రతన్ టాటా తర్వాత టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్పీఎల్) చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే నాలుగేళ్ల తర్వాత 2016లో అక్టోబర్‌లో బోర్డ్ ఆయనను ఆకస్మికంగా తొలగించింది. మిస్త్రీని తొలగింపు ‘రక్త క్రీడ’, ’ఆకస్మిక దాడి’ లాంటిదని, ఇది కార్పొరేట్ గవర్నెన్స్ సూత్రాలను, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమేనని ఎస్పీ గ్రూప్ వాదించింది. టాటా గ్రూప్ ఈ ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకించింది. మిస్త్రీని చైర్మన్‌గా తొలగించే హక్కు బోర్డుకు ఉందని, ఈ విషయలో బోర్డ్ ఎటువంటి తప్పు చేయలేదని వాదించింది. తొలుత నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ మిస్త్రీని ఎగ్జిక్యూటివ్ (ఎన్సీఎల్ఏటీ) చైర్మన్ బాధ్యతల్లో పునఃనియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై టాటా సన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కార్పొరేట్ గవర్నర్స్‌కు సంబంధించి కొన్ని మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదని మిస్త్రీ కూడా అప్పీల్‌కు వెళ్లారు. ఈ క్రాస్ అప్పీళ్లను విచారించిన సుప్రీంకోర్టు, 2021 మార్చి 26న తుది తీర్పును ఇస్తూ, మిస్త్రీని తొలగిస్తూ, బోర్డ్ తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా రూలింగ్ ఇచ్చింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్పీఎల్)లో యాజమాన్య ప్రయోజనాలను విభజించాలని కోరుతూ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. We would like to express our grateful appreciation of the judgement passed and upheld by the Supreme Court today. It reinforces the value system and the ethics of our judiciary. — Ratan N. Tata (@RNTata2000) May 19, 2022 -
నన్ను అలా ఎందుకు అన్నారు- సైరస్ మిస్త్రీ
Tatas vs Cyrus Mistry: టాటా గ్రూపు మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టారు. టాటా గ్రూపు చైర్మన్ విదానికి సంబంధించి సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పులో తనపై చేసిన వ్యాఖ్యలు తొలగించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఉప్పు, పప్పుల నుంచి సాఫ్ట్వేర్ ఉత్పత్తుల వరకు అనేక రంగాల్లో ఉన్న టాటా గ్రూపుకి సైరస్ మిస్త్రీని 2012లో చైర్మన్‌గా నియమించారు. రతన్‌టాటా వారసుడిగా ఆయనకి విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే టాటా గ్రూపు పాటించే విలువలు, ఆశయాలను ముందుకు తీసుకుపోవడంటో మిస్త్రీ విఫలమవుతున్నాడనే కారణంతో నాలుగేళ్ల తర్వాత 2016లో మిస్త్రీని చైర్మన్ పదవి నుంచి తొలగించారు. Supreme Court agrees to hear the plea of Cyrus Mistry seeking to expunge remarks made against him by the top court in a judgment upholding Tata Group's decision to remove him as its chairman. Supreme Court posts the matter for hearing after 10 days. (File photo) pic.twitter.com/IxTjkGcIVx — ANI (@ANI) February 28, 2022 ఈ వివాదంపై టాటా గ్రూపు, షాపూర్జీ పల్లోంజి, సైరస్ మిస్త్రీలు కలిసి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, సుప్రీం కోర్టులను ఆశ్రయించారు. చివరకు అత్యున్నత న్యాయస్థానం మిస్త్రీ తొలగింపును సమర్థించింది. -
కార్పొరేట్ వార్: సుప్రీంకోర్టుకు సైరస్ మిస్త్రీ
సాక్షి, న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌తో వివాదంపై మార్చి 26న అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ .. సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేసింది. సదరు తీర్పులో లోపాలు ఉన్నాయని, కంపెనీల చట్టం మూలాలనే దెబ్బ కొట్టే విధంగా ఉందని పేర్కొంది. దీన్ని సరిచేయని పక్షంలో మైనారిటీ షేర్‌హోల్డర్ల హక్కులపై గణనీయంగా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని తెలిపింది. దాదాపు నాలుగేళ్ల క్రితం టాటా గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపును సమర్ధిస్తూ సుప్రీం కోర్టు ఈ ఏడాది మార్చి 26న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులనే తిరిగి సమీక్షించాలంటూ మిస్త్రీ కుటుంబానికి చెందిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. -
సుప్రీం తీర్పుపై సైరస్ మిస్త్రీ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌తో వివాదం కేసులో ప్రతికూల తీర్పు వచ్చిన నేపథ్యంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు తనను నిరాశపర్చాయని ఆయన పేర్కొన్నారు. తన హయాంలో సంస్థ శ్రేయస్సు కోసమే నిర్ణయాలు తీసుకున్నానని, అంతరాత్మ సాక్షిగా తాను ఏ తప్పూ చేయలేదని విశ్వసిస్తున్నానని మిస్త్రీ తెలిపారు. ‘తాము తీసుకున్న నిర్ణయాలకు న్యాయ స్థానాల్లాంటి వ్యవస్థల నుంచి తోడ్పాటు లభిస్తుందని సమాజంలో ప్రతీ ఒక్కరు ఆశిస్తారు. టాటా సన్స్ మైనారిటీ షేర్‌హోల్డరుగా, మా కేసులో వచ్చిన తీర్పు నాకు వ్యక్తిగతంగా నిరాశ కలిగించింది‘ అని ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. (మిస్త్రీకి టాటా రైటే..!) వ్యక్తుల కన్నా గవర్నెన్స్‌కు ప్రాధాన్యం ఉండేలా, షేర్‌హోల్డర్ల అభిప్రాయాలకు విలువ ఇస్తూనే డైరెక్టర్లు నిర్భయంగా విధులను నిర్వర్తించేలా టాటా గ్రూప్‌లో మార్పులను తెచ్చేందుకు తాను ప్రయత్నించానని ఆయన తెలిపారు. ‘టాటా గ్రూప్ గవర్నెన్స్‌ను నేను ఇకపై ప్రత్యక్షంగా ప్రభావితం చేయలేకపోయినా నేను లేవనెత్తిన అంశాల గురించి పునరాలోచన జరుగుతుందని ఆశిస్తున్నాను. జీవితం అంటే పూలబాటే కాదు, సమస్యలూ ఉంటాయి. అయితే కష్టకాలంలో కుటుంబసభ్యులు, మిత్రులు, సహచరులు నా వెన్నంటే ఉంటుండటం అదృష్టం‘ అని మిస్త్రీ పేర్కొన్నారు. (ఆ ఐటీ నిపుణులకు కాగ్నిజెంట్ తీపి కబురు) -
మిస్త్రీకి టాటా రైటే..!
దేశీ కార్పొరేట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన టాటా–మిస్త్రీ వివాదానికి దాదాపు తెరపడింది. చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగించిన కేసులో టాటా గ్రూప్‌నకు సుప్రీం కోర్టులో విజయం లభించింది. మిస్త్రీని పునర్నియమించాలన్న ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం.. టాటా గ్రూప్‌లో మిస్త్రీకి చెందిన ఎస్పీ గ్రూప్ వాటాల వేల్యుయేషన్‌ను ఇరు పక్షాలు తేల్చుకోవాలంటూ సూచించింది. సుప్రీం ఉత్తర్వులపై టాటా గ్రూప్ హర్షం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌తో నాలుగేళ్లుగా సాగుతున్న న్యాయపోరాటంలో మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. టాటా సన్స్ చైర్మన్‌గా ఆయన్ను పునర్నియమించాలంటూ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చింది. ఈ విషయంలో టాటా సన్స్ అప్పీళ్లను అనుమతిస్తున్నట్లు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్‌లతో కూడిన బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. ‘2019 డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెడుతున్నాం. టాటా గ్రూప్ అప్పీళ్లను అనుమతిస్తున్నాం, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ (మిస్త్రీ కుటుంబానికి చెందిన గ్రూప్) అప్పీళ్లను తోసిపుచ్చుతున్నాం‘ అని ఆదేశాలు ఇచ్చింది. దీనితో మిస్త్రీ తొలగింపుపై దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న వివాదానికి తెరపడినట్లయింది. టాటా సన్స్ యాజమాన్య అధికారాలను విభజించాలన్న షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఎస్పీ గ్రూప్‌లో భాగమైన రెండు సంస్థలు వేసిన పిటిషన్లను కూడా డిస్మిస్ చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే టాటా సన్స్ బోర్డులో సముచితంగా ప్రాతినిధ్యం కల్పించాలంటూ సైరస్ ఇన్వెస్ట్మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ చేసిన అప్పీళ్లను కూడా తోసిపుచ్చింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులపై టాటా సన్స్‌తో పాటు టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు. ‘ఏళ్ల తరబడి టాటా గ్రూప్ పాటిస్తున్న అత్యుత్తమ గవర్నెన్స్ ప్రమాణాలకు ఇది గుర్తింపు‘ అని టాటా సన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. రతన్ టాటా వారసుడిగా 2012లో సైరస్ మిస్త్రీ టాటా గ్రూప్ చైర్మన్ హోదాలో పగ్గాలు చేపట్టడం, 2016లో ఆయన్ను అర్ధాంతరంగా తప్పించడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ మిస్త్రీ, ఉద్వాసనను సమర్ధించుకుంటూ టాటా గ్రూప్ అప్పట్నుంచీ న్యాయపోరాటం చేస్తున్నాయి. మిస్త్రీకి అనుకూలంగా వచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ టాటా గ్రూప్, కంపెనీలో గవర్నెన్స్ లోపాలపై తాము లేవనెత్తిన అంశాలను ఎన్సీఎల్ఏటీ పరిష్కరించలేదంటూ మిస్త్రీ గ్రూప్.. సుప్రీంను ఆశ్రయించాయి. వేల్యుయేషన్‌పై... టాటా గ్రూప్‌లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వాటాల విలువ ఎంత ఉంటుందనేది తేల్చుకోవడాన్ని ఇరుపక్షాలకు వదిలేస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. ఇందుకోసం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లోని ఆర్టికల్ 75 లేదా ఇతరత్రా న్యాయపరమైన మార్గాలను పరిశీలించవచ్చని సూచించింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్పీఎల్) ఎస్పీ గ్రూప్‌నకు 18.37 శాతం వాటాలు ఉన్నాయి. వీటి విలువ రూ. 1.75 లక్షల కోట్లుగా ఉంటుందని ఎస్పీ గ్రూప్ లెక్కగట్టింది. తదనుగుణంగానే గ్రూప్ కంపెనీల డైరెక్టర్ల బోర్డులో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతోంది. అయితే, ఈ వాటాల వేల్యుయేషన్ రూ. 70,000–80,000 కోట్లే ఉంటుందని టీఎస్పీఎల్ వాదిస్తోంది. కేసు సాగిందిలా.. ► 2016 అక్టోబర్ 24: టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపు. తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా నియామకం. ► 2016 డిసెంబర్ 20: మిస్త్రీ తొలగింపును సవాలు చేయడంతో పాటు టాటా సన్స్ మైనారిటీ షేర్‌హోల్డర్ల గొంతు నొక్కేస్తోందని ఆరోపిస్తూ మిస్త్రీ కుటుంబానికి చెందిన 2 సంస్థలు ఎన్సీఎల్టీ (ముంబై)ని ఆశ్రయించాయి. ► 2017 జనవరి 12: టాటా సన్స్ కొత్త చైర్మన్‌గా అప్పటి టీసీఎస్ సీఈవో ఎన్ చంద్రశేఖరన్ నియామకం. అదే ఏడాది ఫిబ్రవరి 6న మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ డైరెక్టర్‌గా తొలగించారు. మార్చి, ఏప్రిల్‌లో మిస్త్రీ కంపెనీల పిటీషన్లను ఎన్సీఎల్టీ (ముంబై) తోసిపుచ్చింది. దీన్ని సవాలు చేస్తూ మిస్త్రీ కంపెనీలు ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. దాని ఆదేశాల మేరకు మరోసారి ఎన్సీఎల్టీకి వెళ్లాయి. ► 2018 జూలై 9: మిస్త్రీ తొలగింపును సవాల్ చేయడంతో పాటు ఇతరత్రా అంశాలపై దాఖలైన పిటిషన్లను ఎన్సీఎల్టీ ముంబై మరోసారి తోసిపుచ్చింది. దీనిపై మిస్త్రీ కంపెనీలు మళ్లీ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. ► 2019 డిసెంబర్ 18: మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్‌గా పునర్నియామకానికి అనుకూలంగా ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై అప్పీల్‌కు వెళ్లేందుకు టాటా గ్రూప్‌నకు నాలుగు వారాల వ్యవధినిచ్చింది. ► 2020 జనవరి 2: ఈ ఆదేశాలను సవాలు చేస్తూ టాటా సన్స్ .. సుప్రీంను ఆశ్రయించింది. ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. డిసెంబర్ 17న తుది ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ► 2020 మార్చి 26: మిస్త్రీ పునర్నియామకంపై ఎన్సీఎల్ఏటీ ఆదేశాలను తోసిపుచ్చుతూ సుప్రీం తుది ఉత్తర్వులు ఇచ్చింది. మా విలువలకు నిదర్శనం.. గెలుపోటములకు సంబంధించిన అంశం కాదిది. నా నిబద్ధతపైనా, గ్రూప్ నైతిక విలువలపైనా నిరంతరంగా ఆరోపణల రూపంలో దాడులు జరిగాయి. అంతిమంగా టాటా సన్స్ అప్పీళ్లకు అనుకూలంగా తీర్పు రావడం మా విలువలు, నైతికతకు నిదర్శనం. చిరకాలంగా ఇవే మార్గదర్శక సూత్రాలుగా గ్రూప్ ప్రస్థానం సాగుతోంది. – రతన్ టాటా, గౌరవ చైర్మన్, టాటా గ్రూప్ టాటా షేర్లు రయ్.. సుప్రీం కోర్టులో అనుకూల ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో టాటా గ్రూప్ కంపెనీల షేర్లు శుక్రవారం జోరుగా పెరిగాయి. బీఎస్ఈలో టాటా స్టీల్ 6%, టాటా పవర్ 5 శాతం, టాటా కమ్యూనికేషన్స్ 4 శాతం, టాటా మోటార్స్ సుమారు 4 శాతం ఎగిశాయి. టాటా మెటాలిక్స్ 3 శాతం, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ .. టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్ చెరి 2.6 శాతం, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ .. వోల్టాస్ .. టాటా కెమికల్స్ దాదాపు 2 శాతం మేర పెరిగాయి. -
టాటా-మిస్త్రీ వార్: సైరస్ మిస్త్రీకి భారీ షాక్
సాక్షి, ముంబై: టాటా గ్రూపు, సైరస్ మిస్త్రీ మధ్య వివాదంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీకి భారీ షాక్ తగిలింది. ఈ మేరకు సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. ఛైర్మన్‌గా మిస్త్రీ తొలగింపును సుప్రీం సమర్ధించింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్ఐ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సైరస్ మిస్త్రీని తొలగింపు నిర్ణయం సరైనదని వ్యాఖ్యానించింది. తద్వారా నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ ( ఎన్సీఎల్ఏటీ ) ఉత్తర్వులను తిరస్కరించింది. దీంతో కార్పొరేట్ వార్‌లో టాటాకు భారీ ఊరట లభించింది. గతేడాది జనవరి 10న టాటా సన్స్ చైర్మన్‌గా మళ్లీ సైరస్ మిస్త్రీని నియమించాలన్న ఎన్సీఎల్ఏటీ తీర్పును కొట్టేసింది సుప్రీంకోర్టు. కాగా 2016, అక్టోబర్‌లో సైరస్ మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. (టాటా-మిస్త్రీ వివాదం సుప్రీం తీర్పు రిజర్వ్) -
టాటా–మిస్త్రీ వివాదం సుప్రీం తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ : టాటా గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపునకు సంబంధించి దాఖలైన క్రాస్ అప్పీల్స్‌పై తీర్పును సుప్రీంకోర్టు గురువారం రిజర్వ్ చేసుకుంది. రెండు గ్రూపులూ తమ వాదనలను రాతపూర్వకంగా సమర్పించాలనీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. టాటా గ్రూప్ చీఫ్‌గా మిస్త్రీ తొలగింపు, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) పునఃనియామకం ఉత్తర్వులు, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన క్రాస్ అప్పీల్స్ గురువారం చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే. ఎస్. బోపన్న, వి.రామసుబ్రమణ్యన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. కేసు పూర్వాపరాలు ఇవీ... 2012లో టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా వారసునిగా సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. 2017 మార్చిలో జరగాల్సిన పదవీకాలానికి ముందే 2016 అక్టోబర్ 24న గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ అర్ధాంతరంగా తొలగించింది. ఈ చర్య మిస్త్రీలు–టాటాల మధ్య న్యాయపోరాటానికి దారితీసింది. తనను తొలగించడంపై ఎన్సీఎల్ఏటీని సైరస్ మిస్త్రీ ఆశ్రయించారు. ఈ కేసులో సైరస్ను తిరిగి నియమిస్తూ, 2019 డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు ఇచ్చింది. అయితే 100 బిలియన్ డాలర్ల విలువైన (దాదాపు రూ.7,50,000 కోట్లు) గ్రూప్ పాలనా అంశాలకు సంబంధించి తగిన ఆదేశాలు రాలేదని, ట్రిబ్యునల్ ఆదేశాల్లో వైరుధ్యాలు ఉన్నాయని పేర్కొంటూ మిస్త్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు సైరస్ మిస్త్రీ పునఃనియామకాన్ని సవాలుచేస్తూ, టాటా సన్స్ కూడా అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లింది. తద్వారా రెండు గ్రూప్‌లూ వివాదంపై క్రాస్ అప్పీల్స్ దాఖలు చేసినట్లయ్యింది. డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ జారీ చేసిన పునఃనియామక ఉత్తర్వులపై జనవరి 10వ తేదీన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్పీఎల్)లో తమకున్న షేర్లను తనఖా పెట్టడంకానీ లేదా బదలాయించడంగానీ చేయరాదని కూడా ఎస్పీ గ్రూప్, సైరస్ మిస్త్రీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. చైర్మన్‌గా మిస్త్రీని తొలగింపు విషయంలో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, అలాగే కంపెనీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్లు షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ ఆరోపిస్తోంది. అయితే టాటా గ్రూప్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. వాటా విలువలపైనా వివాదం టాటా సన్స్‌లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వాటా 18.37 శాతం విలువ ప్రస్తుతం రెండు గ్రూప్‌ల మధ్య తాజా న్యాయపోరాటానికి వేదికగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాటా సన్స్‌లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వాటా విలువ రూ.70,000 కోట్లు–రూ.80,000 కోట్ల మధ్య ఉంటుందని డిసెంబర్ 8వ తేదీన సుప్రీంకోర్టుకు టాటా గ్రూప్ తెలిపింది. టాటా గ్రూప్‌తో ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంబంధాలకు ముగింపు పలకడానికి సంబంధించిన ఒక ప్రణాళికను అత్యున్నత న్యాయస్థానం– సుప్రీంకోర్టుకు షాపూర్జీ పలోంజీ (ఎస్పీ) గ్రూప్ అప్పటికే సమర్పించింది. టాటా గ్రూప్‌లో మిస్త్రీల వాటా విలువ రూ.1.75 లక్షల కోట్లు అని న్యాయస్థానానికి తెలిపినట్లు అక్టోబర్ 29న సంబంధిత వర్గాలు తెలిపాయి. -
మిస్త్రీకి మరోసారి షాకిచ్చిన టాటా సన్స్
సాక్షి, న్యూఢిల్లీ: వాటాలకు సంబంధించి టాటా సన్స్, షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ మధ్య వివాదంపై సుప్రీం కోర్టులో తుది వాదనలు కొనసాగుతున్నాయి. హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్‌లో తమకున్న 18.37 శాతం వాటాలకు బదులుగా టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో షేర్లను కేటాయించాలంటూ ఎస్పీ గ్రూప్ ప్రతిపాదించింది. అయితే, ఇది అర్థరహితమైన ప్రతిపాదనంటూ టాటా సన్స్ తోసిపుచ్చింది. అలా చేస్తే టాటా గ్రూప్‌లో భాగమైన ఇతర లిస్టెడ్ కంపెనీల్లో ఎస్పీ గ్రూప్ మళ్లీ మైనారిటీ వాటాలు తీసుకున్నట్లవుతుందే తప్ప పెద్ద తేడా ఉండబోదని పేర్కొంది. టాటా సన్స్ తరఫున సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే, ఎస్పీ గ్రూప్‌నకు సంబంధించిన సైరస్ ఇన్వెస్ట్మెంట్ తరఫున సీనియర్ అడ్వకేట్ సీఏ సుందరం వాదనలు వినిపించారు. దీనిపై విచారణ సోమవారం కూడాకొనసాగనుంది. టాటా సన్స్‌తో విభేదాల నేపథ్యంలో అందులో వాటాలు విక్రయించి వైదొలగాలని ఎస్పీ గ్రూప్ భావిస్తోంది. అయితే, వేల్యుయేషన్ విషయంలో సమస్య వచ్చి పడింది. టాటా సన్స్‌లో తమకున్న 18.37 శాతం వాటాల విలువ రూ. 1.75 లక్షల కోట్లుగా ఉంటుందని ఎస్పీ గ్రూప్ వాదిస్తుండగా, ఇది కేవలం రూ. 70,000-80,000 కోట్ల మధ్య ఉంటుందని టాటా సన్స్ చెబుతోంది. -
ఆయన హయాంలో ఓ వ్యూహమంటూ లేదు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్, ఉద్వాసనకు గురైన మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీల మధ్య న్యాయ పోరు కొనసాగుతోంది. తాజాగా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాపై మిస్త్రీ మరిన్ని ఆరోపణలు చేశారు. టాటా హయాంలో పెట్టుబడులకంటూ ఓ వ్యూహమంటూ ఉండేది కాదని మిస్త్రీ పేర్కొన్నారు. టెలికం టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్, ఇతరత్రా వ్యాపారాలకు సంబంధించి తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో దేశీ కార్పొరేట్ చరిత్రలోనే ఎన్నడూ చూడనంత స్థాయిలో గ్రూప్ విలువ నాశనమైందని మిస్త్రీ ఆరోపించారు. 2012 డిసెంబర్లో టాటా సన్స్ చైర్మన్ హోదా నుంచి వైదొలిగినప్పట్నుంచీ రతన్ టాటాపై పెట్టిన వ్యయాలన్నీ ఆయన కంపెనీకి తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. టాటా గ్రూప్ అఫిడవిట్లకు ప్రతిగా మిస్త్రీ కుటుంబ సంస్థలు ఈ మేరకు సుప్రీం కోర్టుకు అఫిడవిట్లు దాఖలు చేశాయి. 2016 అక్టోబర్ 24న మిస్త్రీని చైర్మన్‌గా టాటా సన్స్ తొలగించడం, అటుపైన సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత అది చెల్లదంటూ నేషనల్ కంపెనీ లా అప్పి లేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఉత్తర్వులివ్వడం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ టాటా గ్రూప్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపైనే మే 29న విచారణ ప్రారంభించిన సుప్రీం కోర్టు నాలుగు వారాల్లోగా తమ వాదనలు తెలియజేయాలంటూ ఇరు వర్గాలను ఆదేశించింది. మిస్త్రీ పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల కంపెనీకి నష్టాలు వాటిల్లాయని, అందుకే ఆయన్ను తొలగించాల్సి వచ్చిందని టాటా గ్రూప్ పేర్కొనడాన్ని మిస్త్రీ తప్పు పట్టారు. -
టాటాలకు ‘సుప్రీం’ ఊరట
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని పునర్నియమించాలన్న ఎన్సీఎల్ఏటీ(నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్) ఉత్తర్వులపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వు్యలను పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. కేసును మరోరోజు పూర్తిస్థాయిలో విచారణకు చేపట్టనున్నట్లు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు టాటా సన్స్ పిటిషన్ లిస్టయ్యింది. 2016లో అర్ధంతరంగా టాటా సన్స్ చైర్మన్ హోదా నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీని పునర్నియమించాలంటూ 2019 డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. టీసీఎస్‌కు కూడా... కాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) డైరెక్టర్‌గా సైరస్ మిస్త్రీని పునర్నియమించాలంటూ ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన ఉత్తర్వులపై కూడా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కంపెనీ శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 17న కంపెనీ ఫలితాలు.. కాగా, టీసీఎస్ శుక్రవారం ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తూ, జనవరి 17న డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నట్లు వివరించింది. -
సైరస్ మిస్త్రీకి సుప్రీం షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని పునరుద్ధరిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌క్లాట్) ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు నిలుపుదల చేసింది. టాటా గ్రూప్ చీఫ్‌గా సైరస్ మిస్ర్తీ పునరుద్ధరణకు గత ఏడాది డిసెంబర్లో ఎన్‌క్లాట్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ టాటా సన్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన వారం రోజుల్లోనే స్టే ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. సదరు వాణిజ్య సంస్ధ చీఫ్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి నియమించాలనే ట్రిబ్యునల్ నిర్ణయం మొత్తం తీర్పును ప్రభావితం చేసే తీర్పు లోపంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అర్వింద్ బోబ్డే అభివర్ణించారు. కాగా ఎన్‌క్లాట్ ఉత్తర్వులను సవాల్ చేసిన టాటా గ్రూప్ మిస్త్రీ పునర్నియామకం కంపెనీలో వేళ్లూనుకున్న కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలతో పాటు మొత్తం సంస్థ పనితీరుపై ప్రభావం చూపుతుందని పిటిషన్లో పేర్కొంది. మిస్ర్తీని టాటా సన్స్ చీఫ్‌గా పునరుద్ధరిస్తూ ఎన్‌క్లాట్ తీసుకున నిర్ణయం చట్టవిరుద్ధమని ప్రకటించాలని సుప్రీంకోర్టును కోరింది. చదవండి : టాటా గ్రూప్ చైర్మన్ హోదా అక్కర్లేదు: సైరస్ మిస్త్రీ -
టాటాకు మరోసారి ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: టాటాకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. టాటాసన్స్ నుంచి ఉద్వాసన పలికిన సైరస్ మిస్త్రీ వివాదంలో నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తన తీర్పును సమీక్షించేందుకు నిరాకరించింది. గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ నియామక తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అభ్యర్తనను ఎన్సీఎల్ఏటీ తిరస్కరించింది. జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ ఆర్వోసీ (రిజిష్టర్ ఆఫ్ కంపెనీస్)పిటిషన్‌ను సోమవారం కొట్టివేసింది. గతంలో వెల్లడించిన తీర్పును సమీక్షించేది లేదని ఎన్సీఎల్ఏటీ తేల్చి చెప్పింది. ఎన్సీఎల్ఏటీ వెల్లడించిన తీర్పును సమీక్షించాలని ఆర్వోసీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. టాటా చైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకం చెల్లదని ఎన్సీఎల్ఏటీ డిసెంబర్ 18, 2019న ఆదేశించింది. మరోవైపు సైరస్ మిస్త్రీని తిరిగి చైర్మన్‌గా నియమించాలన్న ఎన్సీఎల్ఏటీ తీర్పును సవాలు చేస్తూ టాటా సన్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదానికి సంబంధించిన వాదనలు త్వరలోనే సుప్రీం కోర్టులో జరగనున్నాయి. చదవండి: టాటా గ్రూప్ చైర్మన్ హోదా అక్కర్లేదు: సైరస్ మిస్త్రీ -
టాటా గ్రూప్ చైర్మన్ హోదా అక్కర్లేదు: సైరస్ మిస్త్రీ
ముంబై: టాటా సన్స్ చైర్మన్‌గా పునఃనియమించాలంటూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ .. తనకు ఆ హోదాపై ఆసక్తేమీ లేదని సైరస్ మిస్త్రీ స్పష్టం చేశారు. అసలు టాటా గ్రూప్‌లో ఏ పదవీ తనకు అక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. సంస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిస్త్రీ వివరించారు. అంతిమంగా వ్యక్తుల కన్నా సంస్థ ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. అయితే, మైనారిటీ షేర్‌హోల్డర్ల హక్కుల పరిరక్షణ కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తానని తెలిపారు. సైరస్ మిస్త్రీ ఆదివారం ఈ మేరకు ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ‘నా మీద జరుగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నాను. ఎన్సీఎల్ఏటీ నాకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. నాకు టాటా సన్స్ చైర్మన్ హోదా గానీ టీసీఎస్, టాటా టెలీసర్వీసెస్, టాటా ఇండస్ట్రీస్ డైరెక్టర్‌హోదాపై గానీ ఆసక్తేమీ లేదు. అయితే, బోర్డులో చోటు సాధించడం సహా మైనారిటీ షేర్‌హోల్డరుగా హక్కులను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తాను‘ అని మిస్త్రీ పేర్కొన్నారు. మిస్త్రీని చైర్మన్‌గా తిరిగి తీసుకోవాలన్న ఎన్సీఎల్ఏటీ ఆదేశాలను సవాల్ చేస్తూ టాటా గ్రూప్.. సుప్రీం కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మిస్త్రీ బహిరంగ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు నాలుగేళ్ల క్రితం చైర్మన్ హోదా నుంచి అర్ధాంతరంగా ఉద్వాసనకు గురైన మిస్త్రీని పునఃనియమిస్తూ ఎన్సీఎల్ఏటీ 2019 డిసెంబర్లో ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాతో పాటు పలు గ్రూప్ సంస్థలు, టాటా ట్రస్ట్‌లు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. -
సైరస్ మిస్ర్తీ సంచలన వ్యాఖ్యలు..
ముంబై : టాటా సన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా తన నియామకాన్ని పునరుద్ధరిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌క్లాట్) తీసుకున్న నిర్ణయం తనను చట్టవిరుద్ధంగా తొలగించిన విధానంతో పాటు, తనను రతన్ టాటా ఇతర ట్రస్టీలు అణిచివేతకు గురిచేసిన తీరును గుర్తించిందని సైరస్ మిస్త్రీ వ్యాఖ్యానించారు. ఎన్‌క్లాట్ ఉత్తర్వులు తనకు అనుకూలంగా వచ్చినప్పటికీ టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సహా, టీసీఎస్, టాటా టెలీసర్వీసెస్, టాటా ఇండస్ర్టీస్‌లో డైరెక్టర్ పదవుల కోసం పాకులాడటం లేదని స్పష్టం చేశారు. మరోవైపు సైరస్ మిస్త్రీని టాటా సన్స్ చీఫ్‌గా పునరుద్ధరిస్తూ ఎన్‌క్లాట్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ టాటా గ్రూప్ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎన్‌క్లాట్ ఉత్తర్వులు టాటా గ్రూపు కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్‌తో పాటు సంస్థలో దశాబ్ధాల తరబడి నెలకొన్న విధానాలను దెబ్బతీసేలా ఉన్నాయని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో సంస్థ పేర్కొంది. -
టాటా.. మాటల తూటా!
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి చైర్మన్‌గా తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన ఆదేశాలతో మిస్త్రీ, టాటాల మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. తాజాగా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలను సవాలు చేస్తూ టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాతో పాటు టాటా ట్రస్ట్‌లు, గ్రూప్ సంస్థలు.. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ‘ఎన్సీఎల్ఏటీ తీర్పు అసంబద్ధం, తప్పు, కేసు రికార్డుకు పూర్తిగా విరుద్ధం‘ అని రతన్ టాటా పిటిషన్లో పేర్కొన్నారు. మిస్త్రీని వృత్తిపరంగా మాత్రమే చైర్మన్‌గా నియమించడం జరిగిందే తప్ప.. ఆయన కుటుంబానికి (షాపూర్జీ పల్లోంజీ గ్రూప్) టాటా గ్రూప్‌లో అత్యధిక వాటాలు ఉన్నందుకు కాదని స్పష్టం చేశారు. మరోవైపు, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు చెందిన ట్రస్టీలు కూడా వేర్వేరు పిటిషన్లు వేశాయి. ఎన్సీఎల్ఏటీ తీర్పులో హేతుబద్ధత లోపించిందని, చట్టాలపరంగా తీవ్రమైన తప్పిదాలు ఉన్నాయని, తప్పుడు ఊహాగానాల ఆధారంగా ఇచ్చినట్లుగా ఉందని ట్రస్టీలు ఆరోపించారు. అటు గ్రూప్ సంస్థ టాటా టెలీ సర్వీసెస్ కూడా మరో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్సీఎల్టీలో గానీ ఎన్సీఎల్ఏటీలో గానీ జరిగిన విచారణలో తాము పాలుపంచుకోలేదని, మిస్త్రీ తొలగింపును సమరి్ధంచుకునేలా వాదనలు వినిపించేందుకు తమకు అసలు అవకాశమే దొరకలేదని పేర్కొంది. అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం)లో ఏకగ్రీవ తీర్మానం ఆధారంగానే మిస్త్రీని తమ సంస్థ డైరెక్టరుగా తొలగించడం జరిగిందని స్పష్టం చేసింది. మరోవైపు, మిస్త్రీపై తీర్పును సవరించాలంటూ ఎన్సీఎల్ఏటీలో దాఖలు చేసిన కేసులో కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) తన వాదనలు వినిపించింది. టాటా సన్స్‌ను ప్రైవేట్ కంపెనీగా మార్చేందుకు అనుమతులివ్వడంలో తామెలాంటి అవకతవకలకూ పాల్పడలేదని స్పష్టం చేసింది. దీనిపై ద్విసభ్య బెంచ్ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. 2016లో హఠాత్తుగా ఉద్వాసనకు గురైన మిస్త్రీని తిరిగి చైర్మన్‌గా తీసుకోవాలంటూ ఎన్సీఎల్ఏటీ ఇటీవల ఆదేశాలు ఇచి్చన సంగతి తెలిసిందే. అధికారమంతా తన దగ్గరే పెట్టుకున్నారు.. టాటా సన్స్ చైర్మన్ అయిన తర్వాత నిబంధనలకు అనుగుణంగా.. సొంత కుటుంబ వ్యాపారాన్ని దూరం పెట్టడంలో మిస్త్రీ విఫలమయ్యారని రతన్ టాటా ఆరోపించారు. అంతే గాకుండా ‘అధికారాలన్నీ మిస్త్రీ తన గుప్పిట్లోనే పెట్టుకున్నారు. టాటా సన్స్ నిర్వహణలో ఉన్న సంస్థల వ్యవహారాల విషయంలో బోర్డు సభ్యులను దూరంగా ఉంచారు. బలవంతంగా రుద్దే నిర్ణయాలను ఆమోదించడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది‘ అని రతన్ టాటా విమర్శించారు. గ్రూప్ అభ్యున్నతి కోసం కృషి చేసిన తనపై ఎన్సీఎల్ఏటీ తీర్పులో నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ తీర్పు ఒక తప్పుడు ఒరవడి సృష్టిస్తుందని, భవిష్యత్‌లో పలు కంపెనీలకు వ్యతిరేకంగా దీన్ని దురి్వనియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మిస్త్రీపై ట్రస్టుల తీవ్ర ఆరోపణలు.. టాటా గ్రూప్‌లో మైనారిటీ షేర్‌హోల్డర్ల నోరు నొక్కేస్తున్నారంటూ మిస్త్రీ చేసిన ఆరోపణలపైనా టాటా ట్రస్టులు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. 2006 నుంచి సైరస్ మిస్త్రీ టాటా సన్స్ డైరెక్టరుగా ఉన్నప్పుడు గానీ, ఆ తర్వాత చైర్మన్ అయినప్పుడు గానీ అణచివేత గురించి ఎన్నడూ మాట్లాడలేదని.. ఉద్వాసనకు గురయ్యాకే హఠాత్తుగా వీటిని తెరపైకి తెచ్చారని విమర్శించాయి. ఇక, గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటా.. 1917లో టాటా సన్స్‌ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగానే ఏర్పాటు చేశారని ట్రస్టులు పేర్కొన్నాయి. మిస్త్రీ కుటుంబం ఇప్పటిదాకా రూ. 69 కోట్లు పెట్టుబడి పెట్టిందని, 2016 మార్చికి వారి వాటాల విలువ రూ. 58,441 కోట్లకు ఎగిసిందని, 1991–2016 మధ్య రూ. 872 కోట్ల డివిడెండ్లు అందుకున్నట్లు ట్రస్టులు పేర్కొన్నాయి. -
సైరస్ మిస్త్రీ కేసులో... ‘సుప్రీం’కు టాటా సన్స్
న్యూఢిల్లీ: ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ టాటా సన్స్ .. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరింది. చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధమన్న ఆదేశాలను కూడా తిరస్కరించాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు, టాటా సన్స్‌ను ప్రైవేట్ సంస్థగా మార్చడంలో తమ పాత్రను తప్పుపడుతూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించాల్సిందిగా కోరుతూ ఎన్సీఎల్ఏటీలో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) గురువారం పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ సారథ్యంలోని ద్విసభ్య బెంచ్ దీనిపై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కంపెనీల చట్టం ప్రకారం ప్రైవేట్, పబ్లిక్ కంపెనీల నిర్వచనాలు, పెయిడప్ క్యాపిటల్ అవసరాలు మొదలైన వివరాలను సమర్పించాల్సిందిగా సూచించింది. 2016లో అర్ధంతరంగా టాటా సన్స్ చైర్మన్ హోదా నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీని పునర్నియమించాలంటూ 2019 డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధమన్న ఎన్సీఎల్ఏటీ.. టాటా సన్స్‌ను పబ్లిక్ నుంచి ప్రైవేట్ కంపెనీగా మార్చడంలో ఆర్వోసీ పాత్రపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వీటిపైనే ఇటు టాటా సన్స్.. సుప్రీం కోర్టును, అటు ఆర్వోసీ.. ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. -
మిస్త్రీ రీఎంట్రీపై సుప్రీంలో టాటా సన్స్ వాదన..
సాక్షి, న్యూఢిల్లీ : టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా సైరస్ మిస్ర్తీ పునర్నియమకంపై కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్‌క్లాట్ గత నెలలో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ టాటా సన్స్ గురువారం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని టాటా సన్స్ పిటిషన్లో కోరింది. ఒక్క కలం పోటుతో ఎన్‌క్లాట్ ఇచ్చిన ఉత్తర్వులు టాటా సన్స్ వ్యవస్ధాపకులు గత శతాబ్ధ కాలంగా వ్యయప్రయాసలతో తీర్చిదిద్దిన సంస్థ పాలనను, అంతర్గత కార్పొరేట్ వ్యవస్థను కుదిపివేసిందని పిటిషన్లో పేర్కొంది. సైరస్ మిస్ర్తీ నియామకాన్ని పునరుద్ధరిస్తూ ఎన్‌క్లాట్ జారీ చేసిన ఉత్తర్వులు గ్రూపు సంస్ధల్లోని కొన్ని లిస్టెడ్ కంపెనీల పనితీరులో గందరగోశానికి దారితీసిందని తెలిపింది. టాటా సన్స్ చైర్మన్, డైరెక్టర్‌గా సైరస్ మిస్త్రీ పదవీకాలం 2017 మార్చిలో ముగిసిందని, ఆయన తనను తిరిగి నియమించాలని కోరకపోయినా ఎన్‌క్లాట్ అత్యుత్సాహంతో ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసిందని కోర్టుకు నివేదించింది. -
ఇది విలువలు సాధించిన విజయం..
సాక్షి, న్యూఢిల్లీ : టాటా గ్రూప్ చీఫ్‌గా సైరస్ మిస్త్రీ తిరిగి బాధ్యతలు చేపట్టాలన్న నేషనల్ కంపనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌క్లాట్) ఉత్తర్వులపై మిస్త్రీ స్పందించారు. ట్రిబ్యునల్ తీర్పును సుపరిపాలన సూత్రాల విజయంగా ఆయన అభివర్ణించారు. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ నియామకాన్ని ఎన్‌క్లాట్ పునరుద్ధరించిన అనంతరం ట్రిబ్యునల్ తీర్పును స్వాగతిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈరోజు వెలువడిన తీర్పు తనకు వ్యక్తిగత విజయం ఎంతమాత్రం కాదని, సుపరిపాలన సూత్రాలు, టాటా సన్స్ మైనారిటీ వాటాదారు హక్కుల విజయమేనని వ్యాఖ్యానించారు. మిస్ర్తీ కుటుంబం గత యాభై సంవత్సరాలుగా టాటా సన్స్‌లో ప్రాముఖ్యత కలిగిన మైనారిటీ వాటాదారుగా దేశం గర్వించదగిన సంస్థకు బాధ్యతాయుతమైన సంరక్షకుడిగా వ్యవహరిస్తోందని గుర్తుచేశారు. మూడేళ్ల కిందట టాటా సన్స్ చీఫ్‌గా బోర్డు తనను తొలగించిన అనంతరం తాను చేపట్టిన పోరాటానికి ఫలితంగానే ఈ తీర్పు వెలువడిందని అన్నారు. కాగా, టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధమని, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తిరిగి పగ్గాలు చేపట్టాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) స్పష్టం చేసింది. చదవండి : సైరస్ మిస్త్రీకే టాటా సన్స్ పగ్గాలు -
మళ్లీ సైరన్ మిస్త్రీకే టాటా గ్రూప్ పగ్గాలు..
ముంబై : టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్ నియామకం అక్రమమని, గ్రూప్ చీఫ్‌గా సైరస్ మిస్త్రీ తిరిగి పగ్గాలు చేపట్టాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) స్పష్టం చేసింది. టాటా గ్రూప్ తనను బోర్డు నుంచి తప్పించడాన్ని సవాల్ చేస్తూ మిస్త్రీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన క్రమంలో అప్పీల్‌పై తుది నిర్ణయం వెలువడేవరకూ షేర్లు విక్రయించాలని ఆయనను టాటా సన్స్ ఒత్తిడి చేయరాదని ట్రిబ్యునల్ గత ఏడాది ఆదేశించింది. 2016 అక్టోబర్‌లో మిస్త్రీని టాటా గ్రూప్ బోర్డు నుంచి తొలగించారు. ఇక రతన్ టాటా స్ధానంలో డిసెంబర్ 2012లో మిస్త్రీ టాటా గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
మిస్త్రీని తొలగించడంలో నిబంధనల ఉల్లంఘన
ముంబై: టాటా సన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని అర్ధంతరంగా తొలగించడంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) ముంబై విభాగం స్పష్టం చేసింది. కంపెనీల చట్టం, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలతో పాటు టాటా సన్స్ స్వంత ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లు పేర్కొంది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కి చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఆగస్టు 31న సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలు చేసిన దరఖాస్తుకు ముంబైలోని అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఉదయ్ ఖొమానె ఈ మేరకు సమాధానమిచ్చారు. మరోవైపు, దీనిపై స్పందించేందుకు టాటా సన్స్ వర్గాలు నిరాకరించాయి. -
వాటాలు విక్రయించాలని మిస్త్రీని బలవంతపెట్టొద్దు
న్యూఢిల్లీ: టాటా గ్రూపు కంపెనీల మాతృ సంస్థ ‘టాటాసన్స్’లో మిస్త్రీ కుటుంబానికి ఉన్న వాటాలను విక్రయించాలంటూ బలవంతం చేయవద్దని జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) టాటాలను ఆదేశించింది. అలాగే, టాటాసన్స్ను ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మార్చుతూ తీసుకున్న నిర్ణయానికి అనుమతిని హోల్డ్‌లో ఉంచింది. ఈ విషయమై మిస్త్రీ పిటిషన్‌ను అనుమతించిన అప్పిలేట్ ట్రిబ్యునల్ విచారణను సెప్టెంబర్ 24కు వాయిదా వేసింది. సైరస్ మిస్త్రీని టాటాసన్స్ చైర్మన్‌గా తప్పించిన తర్వాత, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని కాస్తా ప్రైవేటు కంపెనీగా మార్చేందుకు బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి వాటాదారులు కూడా ఆమోదం తెలిపారు. అయితే, మిస్త్రీ పిటిషన్ నేపథ్యంలో టాటాసన్స్ను ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మార్చడంపై అనుమతిని నిలిపివేస్తూ ట్రిబ్యునల్ శుక్రవారం మధ్యంతర ఆదేశాలు వెలువరించింది. టాటాసన్స్లో 18.4% వాటాతో మిస్త్రీ కుటుంబం మైనారిటీ వాటాదారుగా ఉంది. టాటాసన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తప్పించే అధికారం కంపెనీ బోర్డుకు ఉందంటూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) ముంబై బెంచ్ ఇటీవలే ఆదేశాలు వెలవరించగా, దీన్ని మిస్త్రీ కంపెనీలు అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు సవాల్ చేశాయి. అలాగే, టాటాసన్స్ను ప్రైవేటు కంపెనీగా మార్చుతూ, వాటాదారులు తమ స్వేచ్ఛ ప్రకారం తమ వాటాలను విక్రయించుకోకుండా నిరోధించడం, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లోని ఆర్టికల్ 75 కింద వాటాదారులు తమ వాటాలను విక్రయించేలా బలవంత పెట్టే అధికారం బోర్డుకు కల్పించడాన్ని కూడా సవాల్ చేశాయి. ‘‘వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్న మీదట అప్పీల్ పెండింగ్‌లో ఉంచడం జరిగింది. అప్పీలుదారు (మిస్త్రీ) తన వాటాలను విక్రయించేందుకు బలవంతం చేస్తే అప్పీల్ మెరిట్స్‌పై ప్రభావం చూపిస్తుంది. వారు కంపెనీ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఈ అప్పీల్ పెండింగ్‌లో ఉన్న కాలంలో ఆర్టికల్ 75 కింద మైనారిటీ వాటాదారుల షేర్లను బదిలీ చేసే విషయంలో ఎలాంటి నిర్ణయంవద్దని ప్రతివాదుల(టాటాలు)ను ఆదేశిస్తున్నాం’’ అని చైర్పర్సన్ జస్టిస్ ఎస్జే ముకోపాధ్యాయ అధ్యక్షతన గల ఇద్దరు సభ్యుల అప్పిలేట్ ట్రిబ్యునల్ బెంచ్ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. స్పందన తెలియజేసేందుకు టాటాలకు పది రోజుల గడువు ఇచ్చింది. ప్రైవేటు కంపెనీగానే ఉంది... టాటాసన్స్.. నిజానికి ప్రైవేటు సంస్థ మాదిరిగానే ఉందని, కాకపోతే కంపెనీ పరిమాణం, పాత న్యాయ నిబంధన మేరకు పబ్లిక్ లిమిటెడ్‌గా పరిగణించడం జరిగిందని టాటాసన్స్ ఈ సందర్భంగా వాదించింది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ హోదా అన్నది వాటాదారులు తమ వాటాలను బదిలీ చేసే విషయంలో ఎంతో సౌకర్యాన్ని కల్పిస్తోందని, ఈ చట్టబద్ధమైన హోదా మార్పిడికి గాను టాటా సన్స్ వాటాదారులను అనుమతిస్తూ మార్పులు చేసినట్టు తెలిపింది. టాటాలు ఆదరాబాదరగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, ముంబై కార్యాలయాన్ని సంప్రదించగా, టాటాసన్స్ ప్రైవేటు లిమిటెడ్‌గా మారుస్తూ సర్టిఫికెట్‌ను వెంటనే జారీ చేసినట్టు వాదనల సందర్భంగా మిస్త్రీ కుటుంబ కంపెనీలు అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు నివేదించాయి. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో వాటాదారులు తమ షేర్లను ఎవరికైనా విక్రయించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల్లో వాటాదారులు ఎవరైనా తమ వాటాలను బయటి వ్యక్తులకు విక్రయించేందుకు అనుమతి ఉండదు. -
రతన్ టాటాకు ఊరట
ముంబై : టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీ తొలగింపు వ్యవహారంలో రతన్ టాటాకు ఊరట లభించింది. తనను చైర్మన్ పదవి నుంచి అర్ధంతరంగా తొలగించారంటూ మిస్త్రీ టాటా గ్రూప్‌పై న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్(ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించారు. తన కుటుంబానికి టాటా గ్రూప్‌లో 18.4 శాతం వాటాలున్నట్టు ఆయన పేర్కొన్నారు. రతన్ టాటా, టాటా సన్స్ బోర్డ్ మైనార్టీ షేర్ హోల్డర్స్ హక్కులను కాలరాస్తున్నారంటూ ఆయన మరో అంశాన్ని కూడా తన పిటిషన్లో పొందుపర్చాడు. దీనిపై విచారణ చేపట్టిన ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ మిస్త్రీ అభ్యర్థనను తొసిపుచ్చుతు సోమవారం తీర్పు వెలువరించింది. అలాగే రతన్ టాటాకు ఈ వ్యవహారంలో క్లీన్ చీట్‌నిచ్చింది. ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌ను తొలగించడానికి బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్కు తగిన అధికారాలు ఉన్నాయని ట్రిబ్యూనల్ తెలిపింది. బోర్డ్ మెంబర్స్ మిస్త్రీపై నమ్మకం కొల్పోవడం వల్లే పదవి నుంచి తొలగించారని ట్రిబ్యూనల్ తన తీర్పులో పేర్కొంది. మిస్త్రీ లెవనెత్తిన వాదనలో చెప్పుకోదగ్గ అంశాలు లేవని వెల్లడించిది. ప్రస్తుత కాలంలో యాజమాన్యాలు, వాటా దారులకు జవాబుదారీ తనంగా ఉండాలని ట్రిబ్యూనల్ అభిప్రాయపడింది. 2016 అక్టోబర్‌లో టాటా సన్స్ బోర్డ్ మెంబర్స్ మిస్త్రీని చైర్మన్ బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వారి నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన 2016 డిసెంబర్లో ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. -
నన్ను పీకేస్తున్నారు..!
న్యూఢిల్లీ: ఎన్నివేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా.. ఉద్యోగం అంటే ఎలా ఉంటుందో సైరస్ మిస్త్రీకి టాటాలు బాగానే రుచిచూపించారు. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తనను అర్ధంతరంగా తొలగించడానికి నిమిషాల ముందు భార్య రోహిఖాకు మిస్త్రీ పంపిన సందేశం(ఎస్ఎంఎస్) ఏంటో తెలుసా.. ‘నన్ను పీకేస్తున్నారు’ అని! ఈ విషయాన్ని మిస్త్రీ అనుచరుల్లో ఒకరైన నిర్మల్య కుమార్ బయటపెట్టారు. మిస్త్రీ టాటా గ్రూప్ చైర్మన్ పగ్గాలు చేపట్టాక ఏర్పాటు చేసిన కోర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(జీఈసీ)లో కుమార్ కూడా సభ్యుడు కావడం గమనార్హం. టాటా ట్రస్టులకు మిస్త్రీపై నమ్మకం పూర్తిగా పోయిందని పేర్కొంటూ గతేడాది అక్టోబర్ 24న టాటా సన్స్ డైరెక్టర్ల బోర్డు ఆయనను అకస్మాత్తుగా తొలగించిన సంగతి తెలిసిందే. అప్పుడు బోర్డు సమావేశంలో జరిగిన తతంగాన్ని కుమార్ తన తాజా బ్లాగ్ (హౌ సైరస్ మిస్త్రీ ఫైర్డ్)లో వెల్లడించారు. మీకు నచ్చింది చేసుకోండి...! ‘అక్టోబర్ 24న టాటా సన్స్ బోర్డు సమావేశానికి కొద్ది నిమిషాల ముందు రతన్ టాటా, బోర్డు సభ్యుడు నితిన్ నోహ్రియాలు మిస్త్రీతో భేటీ అయ్యారు. ముందుగా నితిన్ మాట్లాడుతూ.. సైరస్ నీకు తెలుసు.. రతన్ టాటాకు నీతో పొసగడం లేదని. మీ ఇద్దరి మధ్య సంబంధాలు అస్సలు బాగాలేవు. నిన్ను(మిస్త్రీ) చైర్మన్ పదవి నుంచి తొలగించాలని టాటా ట్రస్టులు నిర్ణయించాయి. ఈ బోర్డు సమావేశంలో దీనిపై తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నాయి. నీకు రెండే మార్గాలు ఉన్నాయి. స్వచ్ఛందంగా రాజీనామా చేయడం, లేదంటే బోర్డు భేటీలో తొలగింపు తీర్మానాన్ని ఎదుర్కోవడం అంటూ విషయాన్ని వివరించారు. ఈ సమయంలో రతన్ టాటా జోక్యం చేసుకుంటూ... పరిస్థితి ఇంతవరకూ వచ్చినందుకు చింతిస్తున్నానని అన్నారు’ అని కుమార్ వెల్లడించారు. దీనికి సావధానంగా స్పందించిన మిస్త్రీ.. ‘జెంటిల్మెన్, బోర్డు సమావేశంలో ఏం చేయాలన్నది మీ ఇష్టం. నేను ఏం చేయాలో అది చేస్తాను’ అంటూ సమాధానం ఇచ్చారని కుమార్ పేర్కొన్నారు. ఆ తర్వాత సైరస్ మిస్త్రీ బోర్డు సమావేశానికి వెళ్తూ... తన భార్య రోహిఖాకు ‘నన్ను తొలగిస్తున్నారు(ఐయామ్ బీయింగ్ శాక్డ్) అంటూ ఫోన్లో మెసేజ్ పెట్టారని కుమార్ వివరించారు. బోర్డు సమావేశంలో తనపై వేటు వేసేందుకు తీర్మానాన్ని ఆమోదించాలంటే నిబంధనల ప్రకారం 15 రోజులకు ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని మిస్త్రీ వాదించినట్లు కూడా చెప్పారు. అయితే, ఎలాంటి నోటీసూ అక్కర్లేదంటూ బోర్డుకు టాటా ట్రస్టుల నామినీ డైరెక్టర్ వెల్లడించారని కుమార్ తెలిపారు. బోర్డు సమావేశంలో మొత్తం ఎనిమిది మంది డైరెక్టర్లకు గాను ఆరుగురు.. అమిత్ చం ద్ర, విజయ్ సింగ్, నితిన్ నోహ్రియా(వీళ్లు టాటా టస్టుల నామినీలు), అజయ్ పిరమల్, రోనెన్ సేన్, వేణు శ్రీనివాసన్(వీళ్లు ఇండిపెండెంట్ డైరెక్టర్లు) మిస్త్రీని తొలగించే తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. ఫరీదా ఖంబాటా, ఇషాత్ హుసేన్‌లు మాత్రం ఓటింగ్‌కు గైర్హాజరవడం గమనార్హం. ‘మిస్త్రీకి వివరణ ఇచ్చుకోవడానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండానే నిమిషాల్లోనే ఆయనను తక్షణం తొలగిస్తున్నట్లు బోర్డు ప్రకటించేసింది’ అని కుమార్ వ్యాఖ్యానించారు. -
ఫ్లాష్ బ్యాక్ : నా సమయం ముగిసింది!
సాక్షి, న్యూఢిల్లీ : 148 సంవత్సరాల చరిత్ర. కానీ, చైర్మన్లుగా పని చేసింది ఆరుగురు మాత్రమే. ఇది టాటా గ్రూప్ సంస్థ సంబంధించిన అరుదైన ఘనత. కానీ, ఎన్నడూ లేని రీతిలో సైరస్ మిస్ట్రీని అవమానకరమైన రీతిలో పదవి నుంచి తొలగించారు. ఈ వ్యవహారంపై సైరస్ సన్నిహితుడు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మాజీ సభ్యుడు నిర్మల్యా కుమార్ ఇప్పుడు తన బ్లాగ్‌లో స్పందించారు. హౌ సైరస్ మిస్ట్రీ వాజ్ ఫైర్డ్ అంటూ సరిగ్గా ఏడాది క్రితం జరిగిన ఘటనను ఆయన గుర్తు చేశారు. ఒప్పందం ప్రకారం టాటా సన్స్ చైర్మన్ గా మార్చి 31, 2017 వరకూ సైరస్ మిస్ట్రీని బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. కానీ, అక్టోబర్ 24, 2016... బాంబే హౌస్‌లో బోర్డు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మరీ ఆయన్ని తొలగించాలని నిర్ణయించింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆ నిర్ణయాన్ని ప్రకటించాలనుకున్నారు. కానీ, అప్పటికే మిస్ట్రీకి విషయం తెలిసిపోయింది. తనను బయటకు పంపడం ఖాయమని, ఈ విషయంలో తాను చేసేది ఏమీ లేదని ఆయన తెలుసుకున్నారు. వెంటనే ఆ విషయాన్ని తన భార్యకు మెసేజ్ చేశారు. ‘‘నా సమయం ముగిసింది. కాసేపట్లో బయటకు నన్ను బయటకు పంపించబోతున్నారు’’ అంటూ ఆయన సందేశం చేశారంట. మిస్త్రీని చాలా అన్యాయంగా, ఘోరంగా తొలగించారు. దాదాపు సంవత్సరం పాటు ఎంతో జాగ్రత్తగా స్క్రూటినీ చేసి ఎంపిక చేసుకున్న మిస్త్రీని, ఎంపిక చేసుకున్నంత సమయం కూడా విధుల్లో ఎందుకు ఉండనివ్వలేదని నేను ప్రశ్నించా. వారి దగ్గరి నుంచి సమాధానం లేదు. కాస్తంత గౌరవంగా మిస్ట్రీని తొలగించే మార్గమున్నా, బోర్డు దాన్ని పాటించలేదని నిర్మల్యా ఆరోపించారు. ఇక అదే రోజు నిర్మల్యా కూడా ఉద్వాసనకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన సింగపూర్‌కు చెందిన ఓ యూనివర్సిటీలో ప్రోఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. -
సైరస్ మిస్త్రీకి స్వల్ప ఊరట
మైనార్టీ షేర్‌హోల్డర్ల కేసు విచారణకు ఎన్సీఎల్ఏటీ ఆదేశం న్యూఢిల్లీ: చైర్మన్ హోదా నుంచి తనను అర్ధంతరంగా తొలగించిన టాటా గ్రూప్‌పై న్యాయపోరాటం చేస్తున్న సైరస్ మిస్త్రీకి తాజాగా ఎన్సీఎల్ఏటీలో స్వల్ప ఊరట లభించింది. మైనార్టీ షేర్‌హోల్డర్ల హక్కులు కాలరాస్తున్నారన్న ఆరోపణలతో కేసు దాఖలు చేయాలంటే... కనీస షేర్‌హోల్డింగ్ ఉండాలన్న నిబంధన నుంచి నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఆయనకు మినహాయింపునిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశిత కనీస షేర్‌హోల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా మిస్త్రీ కంపెనీలు లేకపోయినప్పటికీ.. అసాధారణ సందర్భాల్లో ఇలాంటి నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వవచ్చని పేర్కొంది. ఇదే అంశం కారణంగా గతంలో మిస్త్రీ పిటీషన్‌ను ఎన్సీఎల్టీ కొట్టివేయటంతో... దాన్ని విచారణకు స్వీకరించి మూడు నెలల్లో తేల్చాలని ఎన్సీఎల్టీని ఆదేశించింది. టాటా సన్స్‌లో మిస్త్రీ కుటుంబానికి 18.4% వాటా ఉన్నప్పటికీ.. ప్రిఫరెన్షియల్ షేర్లను పక్కన పెడితే 3% కన్నా తక్కువే ఉంటుంది. మైనారిటీ షేర్‌హోల్డర్ల హక్కులు హరిస్తున్నారన్న ఆరోపణలతో కేసు పెట్టాలంటే కంపెనీలో కనీసం 10% వాటాలు ఉండాలి. తాజా తీర్పును మిస్త్రీ సంస్థలు స్వాగతించాయి. అయితే, పిటిషనర్ల వాదనలు నిరాధారమైనవని టాటా సన్స్ పేర్కొంది. న్యాయస్థానాల్లో తమ వాదనలు బలంగా వినిపిస్తామని తెలిపింది. -
టాటా సన్స్.. ‘ప్రైవేట్’!
ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్పునకు సన్నాహాలు ► షేర్ హోల్డర్ల అనుమతి కోరిన కంపెనీ ► వ్యతిరేకిస్తూ మిస్త్రీ సంస్థ లేఖ ► మైనారిటీ వాటాదారుల్ని అణిచేయటానికేనని ఆరోపణలు న్యూఢిల్లీ: టాటా సన్స్ చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ, టాటాలకు మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. తాజాగా సంస్థ కార్పొరేట్ స్వరూపాన్ని మార్చేసేందుకు టాటా సన్స్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ హోదా నుంచి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా మార్చే దిశగా మెమోరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌కు తగు మార్పులు చేర్పులు చేసే ప్రతిపాదనకు షేర్‌హోల్డర్ల అనుమతి కోరింది. ఈ మేరకు ఈ నెల 21న వార్షిక సర్వ సభ్య సమావేశం నిర్వహించనున్నట్లు షేర్హోల్డర్లకు సంస్థ సమాచారం ఇచ్చింది. పేరును కూడా టాటా సన్స్ లిమిటెడ్ నుంచి టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మార్చే ప్రతిపాదన ఇందులో ఉంది.కంపెనీ ప్రయోజనాల కోసమే ఈ మార్పులు చేయాలని నిర్ణయించినట్లు టాటా సన్స్ వర్గాలు తెలిపాయి. తమకున్న ‘డీమ్డ్ పబ్లిక్ కంపెనీ’ హోదాకు .. కంపెనీల చట్టం 2013 కింద గుర్తింపు లేకపోవడం వల్లే ఈ మేరకు మార్పులు తలపెట్టినట్లు పేర్కొన్నాయి. ఒకవేళ ఈ తీర్మానం గానీ ఆమోదం పొందిన పక్షంలో.. వాటాదారులు స్వేచ్ఛగా షేర్లను విక్రయించుకోవడంపై నిర్ధిష్ట నియంత్రణలు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం సంస్థలో గణనీయమైన వాటాలున్న మిస్త్రీ కుటుంబం.. ఆ షేర్లను బయటి ఇన్వెస్టర్లకు అమ్ముకోకుండా చెక్ చెప్పేందుకే టాటా సన్స్ ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ స్వరూపం మార్చాలన్న తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని మిస్త్రీ కుటుంబం భావిస్తోంది. కార్పొరేట్ స్వరూపం మార్పునకు ప్రత్యేక తీర్మానం కావాలి. దీనికి మద్దతుగా కనీసం 75 శాతం మేర షేర్‌హోల్డర్ల ఓట్లు అవసరమవుతాయి. వీటితో పాటు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర కూడా అవసరమవుతుంది. మిస్త్రీ సంస్థల అభ్యంతరం.. టాటా సన్స్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నందున .. అందులో గణనీయమైన వాటాలు ఉన్న మిస్త్రీల కుటుంబం తమ షేర్లను చట్టబద్ధంగా టాటాల పోటీ సంస్థలకు కూడా విక్రయించుకోవచ్చు. ఇది కంపెనీల చట్టం చెబుతున్న నిబంధన. అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే దాని షేర్‌హోల్డరుకు ఈ వెసులుబాటు ఉండదు. ఈ నేపథ్యంలో.. టాటా సన్స్‌ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చే ప్రతిపాదనపై మిస్త్రీ కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘మెజారిటీ షేర్ హోల్డర్లు మైనారిటీ వాటాదారులను అణచివేసేందుకు చేస్తున్న మరో ప్రయత్నమిది. దీనివల్ల టాటా సన్స్‌కి ఎటువంటి ప్రయోజనం ఉండదు. దురుద్దేశాలు, దుర్బుద్ధితోనే ఈ ఏజీఎం ఏర్పాటు చేస్తున్నారు‘ అని వ్యాఖ్యానించింది. సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ ఈ మేరకు టాటా సన్స్ బోర్డుకు లేఖ రాసింది. టాటా సన్స్‌ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చడం వల్ల షేర్లను స్వేచ్ఛగా బదలాయించుకునేందుకు వీలు లేకుండా నియంత్రణలు అమల్లోకి వస్తాయని, ఇది ఓ రకంగా మైనారిటీ వాటాదారులను మెజారిటీ షేర్హోల్డర్లు అణిచివేసేందుకు చేస్తున్న ప్రయత్నమని పేర్కొంది. సైరస్ మిస్త్రీని గతేడాది చైర్మన్‌గా తొలగించిన నేపథ్యంలో టాటా సన్స్‌తో మిస్త్రీ కుటుంబం న్యాయ పోరాటం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టాటా సన్స్‌లో షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి చెందిన సైరస్ ఇన్వెస్ట్మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్కి 18.4 శాతం వాటాలు, టాటా ట్రస్ట్స్‌కి 66 శాతం వాటాలు ఉన్నాయి. -
మిస్త్రీ కంపెనీలకు పూర్తిగా ’టాటా’
న్యూఢిల్లీ: మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీకి చెందిన షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్‌తో వ్యాపార లావాదేవీలు పూర్తిగా తెగదెంపులు చేసుకోవడంపై టాటా గ్రూప్ దృష్టి పెట్టింది. టాటా గ్రూప్ ప్రమోటింగ్ సంస్థ టాటా సన్స్ ఈ మేరకు.. తమ గ్రూప్ సంస్థలకు ఈ నెల ప్రారంభంలో ఆదేశాలు ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు టాటా సన్స్ చైర్మన్‌గా మిస్త్రీ ఉన్న రోజుల్లోనే టాటా కంపెనీల నుంచి తమకొచ్చే ఇంజనీరింగ్, నిర్మాణ కాంట్రాక్టులు సున్నా స్థాయికి పడిపోయాయని, ఒకవేళ ఒకటీ అరా ఉన్నా అవి పెద్దగా ప్రాధాన్యం లేనివేనని షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ పేర్కొంది. 2013 నవంబర్‌లో టాటా సన్స్‌కి చైర్మన్‌గా ఉన్నప్పుడే తన పదవీ కాలంలో ఎస్పీ గ్రూప్‌నకు కొత్తగా ఎటువంటి ఇంజనీరింగ్, నిర్మాణ కాంట్రాక్టులు ఇవ్వరాదంటూ మిస్త్రీ స్వయంగా ఆదేశాలు జారీ చేసినట్లు వివరించింది. ఈ నేపథ్యంలోనే టాటా గ్రూప్ నుంచి 2012–13లో రూ. 1,125 కోట్లుగా ఉన్న ఆర్డర్ల పరిమాణం 2015–16 నాటికల్లా సున్నా స్థాయికి తగ్గిపోయాయని ఎస్పీ గ్రూప్ ఒక ప్రకటనలో పేర్కొంది. మిస్త్రీకి ఉద్వాసన పలికిన అనంతరం రెండు గ్రూప్‌ల మధ్య మొదలైన వైరానికి ఇది కొనసాగింపుగా పరిశీలకులు అభిప్రాయపడ్డారు. 18.4 శాతం వాటాలతో టాటా సన్స్‌లో ఎస్పీ గ్రూప్ అతి పెద్ద వాటాదారుగా ఉంది. -
టాటా గ్రూప్ నిర్ణయం: మిస్త్రీతో పూర్తిగా కటీఫ్
న్యూఢిల్లీ : కొత్త చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో టాటా గ్రూప్ సంచలన నిర్ణయం తీసుకుంది. టాటా సన్స్‌లో అతిపెద్ద వాటాదారు అయిన షాపూర్జి పల్లోంజి గ్రూప్‌తో ఉన్న అన్ని వ్యాపార సంబంధాలతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని టాటా గ్రూప్ నిర్ణయించింది. ఈ గ్రూప్‌ను టాటా సన్స్ చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ కుటుంబం ప్రమోట్ చేస్తోంది. దీంతో సైరస్ మిస్త్రీ కుటుంబానికి చెందిన అన్ని సంస్థలతో ఉన్న డీలింగ్స్‌కు చెక్ పెట్టాలని నిర్ణయిస్తోంది. టాటా సన్స్ బోర్డు, టాటా గ్రూప్‌లోని మేజర్ ఆపరేటింగ్ సంస్థల ప్రమోటర్ గత నెలలో సమావేశమయ్యాయని, ఈ మీటింగ్‌లో షాపూర్జి పల్లోంజి గ్రూప్‌తో ఉన్న అన్ని వ్యాపార సంబంధాలను తెంచుకోవాలని సంస్థలను ఆదేశించినట్టు టాటా గ్రూప్ ఇన్సైడర్స్ తెలిపారు. టాటా సన్స్ చైర్మన్‌గా ఉన్న సైరస్ మిస్త్రీకి, గతేడాది బోర్డు సభ్యులు అర్థాంతరంగా ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. ఈ హఠాత్తు పరిణామం అనంతరం నుంచి టాటా సన్స్‌కు, మిస్త్రీకి వాదనలు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే టాటా గ్రూప్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 18.4 శాతం వాటాతో టాటా సన్స్‌లో షాపూర్జి పల్లోంజి గ్రూప్ అతిపెద్ద సింగిల్ వాటాదారునిగా ఉంది. అయితే మిస్త్రీ టాటా సన్స్‌కు చైర్మన్‌గా ఉన్నప్పుడు తమకెళ్లాంటి కొత్త ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్టులు దక్కలేదని ఎస్పీ గ్రూప్ చెబుతోంది. 2012-13లో రూ.1,125 కోట్లగా ఉన్న టాటా గ్రూప్‌నుంచి తమకి వచ్చిన ఆర్డర్లు, 2015-16 నాటికి జీరోకి పడిపోయాయని పేర్కొంది. మిస్త్రీకి, టాటా గ్రూప్‌కు నెలకొన్న యుద్ధం, ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. -
మిస్త్రీకి చుక్కెదురు
ముంబై: టాటా సన్స్ ఛైర్మన్‌గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. టాటా ట్రస్ట్స్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్. వెంకటరామన్ దాఖలు చేసిన దావాను ముంబై చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు విచారణకు స్వీకరించచింది. ఈ నేపథ్యంలో ముంబై కోర్టు సైరస్మిస్త్రీ, షాపూజీ మిస్త్రీ, నలుగురు డైరెక్టర్లకు సమన్లు జారీ చేసింది. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కృష్ణా పల్దేవార్ మిస్త్రీ, సోదరులు కోర్టు ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. మిస్టరీ సోదరులు, సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లకు ఈ నోటీసులు జారీ చేసింది. టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ టాటా ట్రస్ట్స్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్. వెంకటరామన్ సైరస్ మిస్త్రీపై రూ.500కోట్ల డిఫమేషన్ కేసును చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వద్ద పిటిషన్‌వేశారు. రూ .500 కోట్ల నష్టపరిహారాన్ని కోరుతో ఈ పిటిషన్ దాఖలు చేశారు. సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్లు , మిస్ట్రస్ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్ పై ఈ పిటీషన్ వేశారు. 2016 అక్టోబర్ 25న ఒక ఈ మెయిల్లో టాటాసన్స్ డైరెక్టర్లు, టాటా ట్రస్ట్‌కు చెందిన ఇతర ట్రస్టీలకు తప్పుడు ఆరోపణలు చేశారని తన పిటిషన్లో ఆరోపించారు. వెంకటరామన్ (వెంకట్) ఎయిర్ ఏషియా ఇండియా డైరెక్టర్ గా ఉన్నారు. -
టాటా సన్స్‌పై మిస్త్రీ పిటీషన్ కొట్టివేత
ముంబై: టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో చుక్కెదురైంది. టాటా సన్స్‌లో అవకతవకలు, మైనారిటీ షేర్‌హోల్డర్ల గొంతు నొక్కేస్తున్నారన్న ఆరోపణలపై పిటీషన్ వేయడానికి వీలుగా.. అర్హత నిబంధనలు సడలించాలంటూ మిస్త్రీ కుటుంబానికి చెందిన సంస్థలు చేసిన విజ్ఞప్తిని ఎన్సీఎల్టీ బెంచ్ తోసిపుచ్చింది. కంపెనీల చట్టం నిబంధనల నుంచి మినహాయింపునిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెడితే.. టాటా సన్స్ నుంచి మిస్త్రీ ఉద్వాసనను సవాల్ చేస్తూ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ సంస్థలు రెండు .. ఎన్సీఎల్టీని ఆశ్రయించాయి. టాటా సన్స్‌లో నిర్వహణ లోపాలున్నాయని, మైనారిటీ షేర్‌హోల్డర్ల గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించాయి. ఇలాంటి పిటీషన్ దాఖలు చేసేందుకు సంబంధించి పిటీషనర్‌కు ఇష్యూడ్ షేర్ క్యాపిటల్‌లో కనీసం పదో వంతు లేదా మైనారిటీ షేర్హోల్డర్లలో కనీసం పదో వంతు వాటాలు ఉండాలన్న నిబంధన నుంచి మినహాయింపునివ్వాలంటూ కోరాయి. కానీ, ప్రిఫరెన్స్ క్యాపిటల్ కూడా కలిపితే.. మొత్తం ఇష్యూడ్ షేర్ క్యాపిటల్‌లో పిటీషనర్ సంస్థలకు కేవలం 2.17% వాటా మాత్రమే ఉంటుందని టాటా సన్స్ వాదించింది. ఈ నేపథ్యంలో అర్హత ప్రమాణాలు కోణంలో పిటీషన్ సాధ్యపడదని ఎన్సీఎల్టీ బెంచ్ స్పష్టం చేసింది. మరోవైపు ఎన్సీఎల్టీ ఉత్తర్వులు.. తమ వాదనకు బలం చేకూర్చాయని టాటా సన్స్ పేర్కొంది. -
మిస్త్రీకి మళ్లీ చుక్కెదురు!
-
మిస్త్రీకి మళ్లీ చుక్కెదురు!
పిటిషన్లు చెల్లుబాటు కావన్న కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై: టాటా సన్స్‌పై న్యాయపోరాటంలో సైరస్ మిస్త్రీకి చుక్కెదురైంది. టాటా సన్స్‌కు వ్యతిరేకంగా మిస్త్రీ కుటుంబ కంపెనీలు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్లు దాఖలు చేయగా... అవి విచారించడానికి అర్హమైనవి కాదని ట్రిబ్యునల్ సోమవారం పేర్కొంది. ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే విషయంలో అర్హత ప్రమాణాలను అనుసరించలేదని స్పష్టం చేసింది. మిస్త్రీ కుటుంబానికి చెందిన సైరస్ ఇన్వెస్ట్మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్... టాటాసన్స్ చైర్మన్‌గా మిస్త్రీ తొలగింపును ట్రిబ్యునల్‌లో సవాల్ చేయడం తెలిసిందే. మైనారిటీ వాటాదారుల హక్కులను సైతం కాలరాస్తున్నారని ఆరోపించాయి. అయితే, విచారణ సందర్భంగా ఈ పిటిషన్లను టాటా సన్స్ వ్యతిరేకించింది. కంపెనీల చట్టం ప్రకారం మైనారిటీ వాటా కలిగిన పిటిషనర్లు ట్రిబ్యునల్ ముందు సవాల్ చేసే అవకాశం లేదని టాటా సన్స్ వాదించింది. కనీసం 10% వాటా కలిగి ఉండాలన్న అర్హతా ప్రమాణాల విషయంలో విఫలమైనందున ఈ పిటిషన్లు కొనసాగించగలిగినవి కావని ట్రిబ్యునల్ పేర్కొంది. దీనికి మిస్త్రీ కుటుంబ కంపెనీలు స్పందిస్తూ... జారీ మూలధనంలో పిటిషనర్ పదింట ఒక వంతు వాటా కలిగి ఉన్నా లేదా మైనారిటీ వాటాదారుల్లో పదింట ఒక వంతు వాటా కలిగి ఉన్నా చట్ట ప్రకారం ఈ నిబంధనను ట్రిబ్యునల్ రద్దు చేయవచ్చని పేర్కొన్నాయి. అయితే, సైరస్ కుటుంబ కంపెనీలు రెండిం టికీ కలిపి మొత్తం జారీ మూలధనంలో 2.17% వాటాయే ఉందని, పిటిషన్లను దాఖలు చేసే సమయంలో అర్హత నిబంధనను రద్దు చేయాలని కోరకుండా, ఈ దశలో అడగలేరని టాటా సన్స్ వాదించింది. ట్రిబ్యునల్ ముందు న్యాయపోరాటానికి కనీసం 10% వాటా నిబంధనను రద్దు చేయాలన్న సైరస్ కంపెనీల అభ్యర్థనపై వాదనలను మంగళవారం వింటామని ట్రిబ్యునల్ బెంచ్ పేర్కొంది. -
మిస్త్రీకి మరో భారీ షాక్!
ముంబై: టాటా సన్స్ ఛైర్మన్‌గా ఉద్వాసన గురయ్యి, న్యాయపోరాటం చేస్తున్న సైరస్మిస్త్రీకి భారీ షాక్ తగిలింది. టాటాసన్స్కు వ్యతిరేకంగా మిస్త్రీ దాఖలు చేసిన పిటీషన్‌ను తోసిపుచ్చిన నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) నిర్వహించగలిగింది కాదని (నాన్ మెయింటన్బుల్) చెప్పింది. టాటా సన్స్‌పై సైరస్ మిస్త్రీ కుటుంబ సంస్థలు దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) తిరస్కరించింది. టాటా గ్రూప్ మైనారిటీ వాటాదారుల హక్కులను కాలరాస్తోదంటూ మిస్త్రీ సంస్థలు - సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన పిటిషన్ లో చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. కంపెనీల చట్టం ప్రకారం ఈ కంపెనీలు పిటిషన దాఖలు చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసేందుకు కనీసం 10శాతం వాటాను కలిగి ఉండాలని చెప్పింది. కాగా మిస్త్రీ కుటుంబ కంపెనీలు టాటా సన్స్‌లో 2.17శాతం (ఈక్విటీ + ప్రాధాన్య వాటాలను) శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయితే దీనిపై మిస్త్రీ తరపు న్యాయవాది సుందరం స్పందించారు. కంపెనీలో వాటాను కలిగి వుండకపోవడం అనేది తమ కేసుకు బలహీనత కాబోదని వాదించారు. దీనిపై మంగళవారం వాదనలు జరగనున్నాయని చెప్పారు. కాగా టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి గత ఏడాది అక్టోబర్ 24న మిస్త్రీకి హఠాత్తుగా ఉద్వాసన పలికింది. అనంతరం మిస్త్రీకి టాటాకుచెందిన ఆయన ఆరు కంపెనీల బోర్డులకూ రాజీనామా చేశారు. అయితే టాటా సన్స్, ఆ కంపెనీ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటాపై ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. కార్పొరేట్ నియమనిబంధనలను నీరుగారుస్తున్నారని ఆరోపించారు. మరోవైపు టీసీఎస్ ఛైర్మన్ గా ఉన్న చంద్రశేఖరన్ కు టాటా సన్స్ గా నియమించిన సంగతి తెలిసిందే. -
టాటా సన్స్ నుంచి సైరస్ మిస్త్రీ ఔట్
డైరెక్టర్ పదవినుంచి తొలగింపు • ఈజీఎమ్‌లో తీర్మానాన్ని ఆమోదించిన వాటాదారులు • టాటా గ్రూప్‌తో తెగిన చివరి అనుబంధం ముంబై: టాటా గ్రూప్‌తో సైరస్ మిస్త్రీకి మిగిలిన చివరి అనుబంధం(హోదా పరంగా) తెగిపోయింది. టాటా సన్స్ డైరెక్టర్‌గా మిస్త్రీని తొలగించాలన్న తీర్మానానికి కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపారు. సోమవారం జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్)లో డైరెక్టర్‌గా సైరస్ మిస్త్రీని తొలగించాలన్న తీర్మానానికి వాటాదారులు తగిన మెజారిటీతో ఆమోదం తెలిపారని టాటా సన్స్ పేర్కొంది. ఈ పరిణామం కారణంగా టాటా సన్స్ కంపెనీలో 18.5 శాతం వాటా ఉన్న షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి పదేళ్ల తర్వాత తొలిసారిగా ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. షాపూర్జీ పల్లోంజీ కుటుంబం ఈ కంపెనీలో 1965 నుంచి వాటాదారుగా ఉంది.1980లో మిస్త్రీ తండ్రి పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ డైరెక్టర్‌గా చేరారు. 2004లో వైదొలిగారు. రెండేళ్ల తర్వాత 2006లో సైరస్ మిస్త్రీ డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన టాటా సన్స్ చైర్మన్ అయ్యారు. పనితీరు బాగా లేదంటూ చైర్మన్ పదవి నుంచి ఆయనను టాటా సన్స్ కంపెనీ గత ఏడాది అక్టోబర్ 24న తొలగించింది. తదనంతరం టాటా మోటార్స్, టీసీఎస్ తదితర ఆరు టాటా గ్రూప్ కంపెనీలు ఆయనను డైరెక్టర్‌గా తమ తమ డైరెక్టర్ల బోర్డ్ నుంచి తొలగించాయి. విఫలమైన మిస్త్రీ ప్రయత్నాలు డైరెక్టర్‌గా మిస్త్రీని తొలగించడానికి అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్) నిర్వహించనున్నామని గత నెలలోనే టాటా సన్స్ ప్రకటించింది. దీనిని న్యాయపరంగా అడ్డుకోవడానికి మిస్త్రీ చేసిన పలు ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈజీఎమ్ నిర్వహణను అడ్డుకోవాలంటూ మిస్త్రీ వేసిన పిటీషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ గత నెల 31న కొట్టేసింది. ఈ ఈజీఎమ్‌కు వ్యతిరేకంగా మిస్త్రీకి చెందిన రెండు ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు దాఖలు చేసిన పిటీషన్లను గత వారంలో నేషనల్ కంపెనీ లా అప్పిల్లేట్ ట్రిబ్యునల్ డిస్మిస్ చేసింది. దీంతో ఈజీఎమ్‌కు మార్గం సుగమం అయింది. ఈ ఈజీఎమ్‌లో డైరెక్టర్‌గా ఆయనను తొలగించే తీర్మానం ఆమోదం పొందింది. -
మిస్త్రీకి చుక్కెదురు..!
ధిక్కరణ పిటిషన్లను కొట్టేసిన కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై: జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)లో సైరస్ మిస్త్రీకి చుక్కెదురైంది. తనను టాటా సన్స్ బోర్డు నుంచి డైరెక్టర్‌గా తొలగించేందుకు చర్యలు చేపట్టడం ద్వారా టాటాసన్స్, ఆ సంస్థ డైరెక్టర్లు ఎన్సీఎల్టీ ఆదేశాలను ఉల్లంఘించారంటూ... వారికి వ్యతిరేకంగా మిస్త్రీ కుటుంబ కంపెనీలు దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్లను ఎన్సీఎల్టీ బుధవారం రద్దు చేసింది. టాటా సన్స్ చర్య కోర్టు ధిక్కారం కిందకు రాదని డివిజన్ బెంచ్ పేర్కొంది. అయితే, మిస్త్రీని డైరెక్టర్‌గా తొలగించేందుకు ఫిబ్రవరి 6న టాటా సన్స్ సమావేశం ఏర్పాటు చేయడంపై అఫిడవిట్‌ను మూడు రోజుల్లోగా దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వటం కొద్దిగా ఊరట. ఇదే అంశంపై 3 రోజుల్లోగా స్పందించాలని టాటా సన్స్‌ను కూడా బెంచ్ కోరింది. మిస్త్రీని టాటా గ్రూపు చైర్మన్‌గా తప్పించడాన్ని సవాల్ చేస్తూ మిస్త్రీ కుటుంబ కంపెనీలు లోగడ దాఖలు చేసిన పిటిషన్లపై ట్రిబ్యునల్ ఈ నెల 31, ఫిబ్రవరి 1న విచారించనుంది. అవే రోజుల్లో ఈ అంశంపైనా విచారణ జరుపుతామని ట్రిబ్యునల్ తాజాగా స్పష్టం చేసింది. ఫిబ్రవరి 6న గానీ ఆ తర్వాతగానీ ఏ అంశంపైనా టాటా సన్స్ ఈజీఎం నిర్వహించకుండా ఇంజెక్షన్ ఆదేశాలు ఇవ్వాలని సైరస్ మిస్త్రీ కుటుంబానికి చెందిన సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ తమ పిటిషన్లలో ఎన్సీఎల్టీని కోరాయి. -
మిస్త్రీ ధిక్కరణ పిటిషన్‌పై 18న ఉత్తర్వులు
ముంబై: రతన్‌టాటా, టాటాసన్స్ డైరెక్టర్లపై సైరస్ మిస్త్రీ నేతృత్వం లోని రెండు సంస్థలు దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్‌పై తన ఉత్తర్వులను ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఈ నెల 18వ తేదీ వరకూ రిజర్వ్ చేసింది. ఎన్సీఎల్టీ డిసెంబర్ 22న ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చి మిస్త్రీని బోర్డ్ నుంచి తొలగించడానికి టాటా సన్స్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది పిటిషనర్ల ఆరోపణ. బీఎస్వీ ప్రసాద్ కుమార్ (మెంబర్–జ్యుడీషియల్), ఎన్ నల్లసేనాపతి (మెంబర్–టెక్నికల్)లతో కూడిన డివిజన్ బెంచ్ ముందు ఇరువర్గాల వాదనలు సోమవారం ముగిశాయి. తనను బోర్డ్ నుంచి తొలగించేందుకు జరపతలపెట్టిన ఫిబ్ర వరి 6 ఈజీఎంను నిలిపివేయాలని, ఇలాంటి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా తదుపరి సమావేశాలనూ నిరోధించాలని పిటిషన్లో మిస్త్రీ కంపెనీలు కోరాయి. -
మర్యాదగా చెబితే మిస్త్రీ వినలేదు!
ఉద్వాసనకు ముందే రాజీనామా కోరిన టాటా • తిరస్కరించడంతో తొలగింపు • ఆయనపై నమ్మకం కోల్పోవడం వల్లే • కంపెనీ లా ట్రిబ్యునల్‌కు టాటాసన్స్ వెల్లడి ముంబై: టాటా గ్రూపు చైర్మన్‌గా సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికే ముందు టాటా సన్స్ ఆయనకు రాజీనామా చేసే అవకాశం ఇచ్చిందట. టాటా సన్స్ బోర్డు మిస్త్రీపై నమ్మకం కోల్పోవడంతో రాజీనామా చేయాలని ఆయన్ను రతన్‌టాటా స్వయంగా అడిగారు. కానీ, రాజీనామా చేసేందుకు మిస్త్రీ నిరాకరించడంతో మెజారిటీ ఓటు మేరకు తొలగించాల్సి వచ్చిందని టాటా సన్స్ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు వివరించింది. మిస్త్రీ కుటుంబానికి చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు టాటాసన్స్, రతన్టాటాలకు వ్యతిరేకంగా కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. వారి పిటిషన్లకు సమగ్రమైన స్పందనను 204 పేజీల అఫిడవిట్ రూపంలో టాటా సన్స్ దాఖలు చేసింది. మిస్త్రీ నాయకత్వంలో ఎటువంటి పురోగతి లేకపోవడం లేదా చాలా తక్కువగా ఉండడంతో గతేడాది అక్టోబర్ 24న చైర్మన్‌గా ఆయన్ను తొలగించినట్టు తెలిపింది. టాటాసన్స్ బోర్డులోని తొమ్మిది మంది డైరెక్టర్లకు గాను ఫరీదా ఖంబటా గైర్హాజరు కాగా... మిగిలిన వారిలో ఏడుగురు మిస్త్రీని మార్చేందుకుఅనుకూలంగా ఓటు వేశారని, డైరెక్టర్‌గా మిస్త్రీని ఓటు వేసేందుకు అనర్హుడిగా ప్రకటించినట్టు పేర్కొంది. ‘‘2016 అక్టోబర్ 24న టాటాసన్స్ బోర్డు సమావేశానికి ముందే రతన్‌టాటా, నితిన్ నోహ్రియా సైరస్ మిస్త్రీతో వ్యక్తిగతంగా మాట్లాడారు. ఎగ్జిక్యూటివ్చైర్మన్ పదవికి రాజీనామా చేసే అవకాశం ఆయన ముందుంచారు. కానీ, తప్పుకునేందుకు మిస్త్రీ తిరస్కరించారు’’ అని టాటాసన్స్ తెలిపింది. అంతేకానీ, ఈ నిర్ణయం ఆకస్మికంగా, తొందరపాటుతో తీసుకోలేదని పేర్కొంది. టాటా గ్రూపు నిర్మాణాన్ని బలహీనపరిచారు.. ‘‘నాలుగేళ్ల మిస్త్రీ నాయకత్వంలో కలతకు గురిచేసే ఎన్నో వాస్తవాలు చోటు చేసుకున్నాయి. మూలధన కేటాయింపు నిర్ణయాల్లో క్రమశిక్షణ లోపించింది. నిర్వహణలో జాప్యం, వ్యూహాత్మక, వ్యాపార ప్రణాళికలు లేకపోవడం, వృద్ధికి అవకాశం ఉన్నకొత్త వ్యాపారాల్లోకి అడుగు పెట్టే అర్థవంతమైన చర్యలు లోపించడం, ఉన్నత స్థాయి యాజమాన్యం బలహీనపడడం వంటివి జరిగాయి. టాటా గ్రూపులోని మేజర్ కంపెనీల్లో టాటాసన్స్ డైరెక్టర్ల ప్రాతినిథ్యాన్ని తగ్గించేందుకు మిస్త్రీ క్రమపద్ధతిలో ప్రణాళికమేరకు వ్యవహరించారు. క్రమపద్ధతిలో పలుచన చేసే ఈ చర్యలు... టాటా విలువలు, సంస్కృతి, పరిపాలన మార్గదర్శకాలు, గ్రూపు వ్యూహాత్మక విధానాలు, నిర్మాణాన్ని నిర్వీర్యపరిచాయి’’ అని అఫిడవిట్లో టాటాసన్స్ వివరించింది. నాయకుడిగానూ విఫలం: వెనుకటి నుంచీ ఉన్న సమస్యలకే మిస్త్రీ దృష్టి పరిమితం అయిందని విమర్శించింది. ఇన్వెస్టర్లు, వాటాదారులతో సానుకూల సంబంధాలు నెలకొల్పడం నాయకుడి ప్రధాన విధుల్లో భాగమని, వీటిలోనూ మిస్త్రీవిఫలమయ్యారని పేర్కొంది. దీంతో టాటాసన్స్, టాటా ట్రస్ట్‌ల మధ్య విశ్వాస అంతరం పెరిగిపోయిందని పేర్కొంది. టాటా సన్స్ చైర్మన్‌గా మిస్త్రీని రతన్ టాటానే ఆహ్వానించారని... ఆ హోదాలోనే రతన్Sటాటా టాటాసన్స్ బోర్డు డైరెక్టర్ల సమావేశాల్లోపాల్గొనే హక్కు కలిగి ఉన్నారని పేర్కొంది. అయినప్పటికీ గతేడాది అక్టోబర్ 24 నాటి సమావేశానికి ముందెప్పుడూ రతన్‌టాటా గౌరవ చైర్మన్ హోదాలో పాల్గొన్న సందర్భం లేదని వివరించింది. మిస్త్రీ కుటుంబానికి ఆ హక్కులేదు... టాటా సన్స్ బోర్డులో డైరెక్టర్‌ను నియమించే హక్కు మిస్త్రీ కుటుంబానికి లేదని టాటా సన్స్ స్పష్టం చేసింది. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం ఇందుకు అవకాశం లేదని తెలిపింది. టాటా గ్రూపు నిర్వహణ కంపెనీ అయిన టాటా సన్స్... డైరెక్టర్పదవి నుంచి మిస్త్రీని తప్పించేందుకు ఫిబ్రవరి 9న సమావేశం కానున్న విషయం తెలిసిందే. ‘‘టాటా సన్స్‌లో షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి 1965 నుంచీ 18.4 శాతం వాటా ఉంది. అయినప్పటికీ పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ టాటా సన్స్ బోర్డులోడైరెక్టర్గా 1980లో తొలిగా నియమితులయ్యారు. 2004లో రిటైర్ అయ్యారు. రెండేళ్ల తర్వాత రతన్ టాటా ప్రతిపాదించగా ఆయన కుమారుడైన సైరస్ మిస్త్రీ టాటా సన్స్ బోర్డులో డైరెక్టర్‌గా చేరారు. అంతేగానీ పల్లోంజీ మిస్త్రీ లేదా సైరస్ మిస్త్రీ నైతికంగానియామక హక్కు కలిగి లేరు’’ అని టాటా సన్స్ తన అఫిడవిట్లో పేర్కొంది. -
కార్పొరేట్ ప్రతిష్టకు ‘టాటా’!!
2016 రివైండ్ దేశంలో పెద్దది, అత్యంత విశ్వసనీయమైనది అనుకునే బ్రాండ్ ఏదైనా ఉంటే అది టాటానే. పచారీ సరుకుల నుంచి ఆభరణాల దాకా దాదాపు ప్రతి రంగంలోనూ ఉండటం... అన్నిట్లోనూ కోట్ల మంది వినియోగదారులుండటం దీనికి కారణంగా భావించొచ్చు. కాకపోతే ఇంతటి గ్రూప్ పరువు ఈ అక్టోబర్ 24న వీధిలోకొచ్చింది. గ్రూపు చైర్మన్ గా ఉన్న సైరస్ పల్లోంజీ మిస్త్రీని టాటా బోర్డు అనూహ్యంగా తొలగించింది. అప్పట్లో కారణాలు తెలియరాకున్నా... రానురాను జరిగిన ఘటనలు చూస్తే ఇది కేవలం ‘రతన్ టాటా– సైరస్ మిస్త్రీ’ మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలకటానికేనని తేలిపోయింది. నిజానికి 2012 డిసెంబర్ 28న మిస్రీ్తని ఈ పదవిలో కూర్చోబెట్టింది కూడా రతన్ టాటానే. మిస్త్రీ కుటుంబానికి టాటా సన్స్ లో 18 శాతం వాటా కూడా ఉంది. కానీ నాలుగేళ్లు తిరిగేసరికి... మిస్రీ్తని గెంటేసి రతన్ టాటా తిరిగి తాత్కాలిక చైర్మన్ బాధ్యతల్లోకి వచ్చేశారు. తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు... బోర్డ్ రూమ్ సమావేశాలు, ఎత్తులు పైఎత్తుల పర్వం తర్వాత ఈ వివాదం చివరికి కంపెనీ లాబోర్డును చేరింది. మిస్త్రీని తొలగించటానికి కారణాలు చెబుతూ... టాటా గ్రూపు పలు ఆరోపణలు చేసింది. ఆయన గ్రూపు రుణభారాన్ని పెంచేశారని, సమస్యలున్నాయంటూ పలు కంపెనీలను వదిలించుకోవటానికి ప్రయత్నించారని, టాటాల విలువల్ని ఏమాత్రం పట్టించుకోలేదని, అధికార రహస్యాలను కూడా బయటపెట్టారని ఆరోపించింది. మిస్త్రీ తక్కువేమీ తినలేదు. రతన్ టాటా తనకు చైర్మన్ బాధ్యతలు అప్పగించినా, స్వతంత్రంగా పనిచేసుకోనివ్వకుండా, మరో అధికార కేంద్రాన్ని నడిపించారని... కార్పొరేట్ గవర్నెన్స్ ను మంటగలిపారని, నష్టాలొస్తున్నా పట్టించుకోకుండా తన అహం కోసం నానో వంటి బ్రాండ్లను నడిపిస్తున్నారని, చాలా కొనుగోళ్లకు ఎక్కువ మొత్తం పెట్టారని... రకరకాల ఆరోపణలు చేశారు. కానీ టాటా బోర్డు రతన్ టాటా వైపే ఉండటంతో మిస్రీ్తని దాదాపు అన్ని టాటా కంపెనీల నుంచీ తొలగించారు. ఆయనకు మద్దతు పలికిన స్వతంత్ర డైరెక్టరు నుస్లీ వాడియానూ అదే చేశారు. నిజానికి ఈ వివాదం ఈ ఏడాదితో ముగిసిపోలేదు. 2017లో కంపెనీ లాబోర్డు ముందు కొత్త మలుపు తీసుకోవచ్చు కూడా. పెద్ద నోట్ల రద్దు... దేనికంట? ఈ ఏడాది నవంబర్ 8న రాత్రి 8 గంటల సమయంలో ప్రధాని నరేంద్రమోదీ ఓ బాంబు పేల్చారు. ఆ రోజు అర్ధరాత్రి నుంచీ రూ.500, రూ.1000 నోట్లు చెల్లవని ప్రకటించారు. వాటిని డిసెంబర్ 30 వరకూ బ్యాంకుల్లో మాత్రం డిపాజిట్ చేసుకోవచ్చని చెప్పారు. దీనికి ఆయన చెప్పిన కారణాలు రెండు!! 1) నకిలీ నోట్లు భారీగా చలామణిలోకి వచ్చి, వాటి సాయంతో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని. 2) చాలామంది దగ్గర ఈ పెద్ద నోట్ల రూపంలో నల్లధనం పోగుపడిపోయి ఉందని, ఈ దెబ్బతో వారు దాన్ని డిపాజిట్ చేయలేక గంగానదిలో విసిరేయటమో, తగలబెట్టడమో చేస్తారని. అది విన్న జనం... నల్ల కుబేరుల్ని మోదీ భలే దెబ్బతీశారని సంతోషించారు. కాకపోతే రోజులు గడుస్తున్నకొద్దీ పాతనోట్లు చెల్లక, కొత్త నోట్లు అందుబాటులో లేక, వ్యాపారాలేవీ సాగకపోయేసరికి మోదీ ఎవరిని దెబ్బతీశారనేది అర్థంకాలేదు. కనీసం తిండికి కూడా కరువయ్యే పరిస్థితులొచ్చేసరికి దెబ్బతిన్నది తామేనని తెలిసిపోయింది. చలామణిలో ఉన్న నోట్లకన్నా ఎక్కువ నగదు బ్యాంకుల దగ్గర డిపాజిట్ అయినట్లు వార్తలు వెలువడటంతో... కొన్ని దొంగనోట్లూ బ్యాంకుల్లోకి చేరాయని... అక్రమార్కులు తెలివిగా బ్లాక్ మనీ మొత్తాన్ని మార్చేసుకున్నారని అర్థమైంది. అయితే ప్రభుత్వం డిజిటల్ లావాదేవీల్ని పెంచటానికే పెద్ద నోట్లు రద్దు చేశామంటూ కొత్త పల్లవి అందుకుంది. మరి దీని ప్రభావమేంటి? వృద్ధి రేటు అంచనాలు బాగా తగ్గాయి. చివరి త్రైమాసికంలో వృద్ధిరేటు దారుణంగా తగ్గొచ్చనే అంచనాలు వెలువడ్డాయి. కాకపోతే ఇబ్బందులు తాత్కాలికమేనంటూ అందరూ తమను తాము సమాధానపరచుకుంటున్నారు. అదే ఈ ఏడాదికి ఊరట!!. ఈక్విటీ, డెట్ .. ప్చ్! ఈ ఏడాది స్టాక్, రుణ మార్కెట్లు రెండూ ఇన్వెస్టర్లకు సరైన లాభాలు ఇవ్వలేకపోయాయి. ఈ ఏడాది బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్లలో మొదలైన ర్యాలీ... అనేక ఆటుపోట్ల తరవాత ప్రస్తుతం మళ్లీ మొదటికొచ్చింది. ఆర్బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ మార్పు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంపు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యంగా డొనాల్డ్ ట్రంప్ విజయం, పెద్ద నోట్ల రద్దు... ఇవన్నీ అనిశ్చితికి దారితీశాయి. గతేడాది ముగింపు 26,117.54 పాయింట్లతో పోలిస్తే ఈ ఏడాది చివరికి సెన్సెక్స్ 508 పాయింట్లు మాత్రమే లాభపడింది. ఇక విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది తొలి 9 నెలల్లో రూ.51,293 కోట్లు ఇన్వెస్ట్ చేసి... అక్టోబర్ నుంచి అమ్మకాలకు దిగారు. దీంతో డిసెంబర్ 27 నాటికి నికర పెట్టుబడులు రూ.26,213 కోట్లకు పరిమితం అయ్యాయి. టెలికం బరిలో జియో ఫ్రీ ఎంట్రీ! రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులతో రిలయన్స్ జియో సెప్టెంబర్ 3న మెగా ఎంట్రీ ఇచ్చింది. జీవిత కాలం ఉచిత కాల్స్, మూడునెలల పాటు 4జీ డేటా ఉచితం అంటూ వల విసిరింది. 83 రోజుల్లో 5 కోట్ల మంది కస్టమర్లను సంపాదించింది. దీంతో ప్రత్యర్థులు ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ కూడా దిగొచ్చాయి. అపరిమిత కాల్స్, పరిమిత డేటా పథకాలు ప్రకటించాయి. కానీ కాల్స్ కనెక్ట్ కాక, ఉచిత డేటాలో వేగం లేక జియో కస్టమర్లు అసంతృప్తితోనే ఉన్నారు. జియో పోటీని తట్టుకోవటానికి వీడియోకాన్ నుంచి ఎయిర్టెల్ రూ.4,428 కోట్లకు స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. ఎయిర్‌సెల్‌కు చెందిన 4జీ ఎయిర్వేస్ను కూడా రూ.3,500 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక సెప్టెంబర్‌లో వొడాఫోన్ గ్రూపు ఇండియా కార్యకలాపాల కోసం రూ.47,000 కోట్ల నిధుల్ని కేటాయించింది. తనిఖీలతో ఫార్మా కుదేలు... పలు ఫార్మా కంపెనీలు ఈ ఏడాది యూఎస్ ఎఫ్‌డీఏ తనిఖీల్ని ఎదుర్కొన్నాయి. వోకార్డ్, దివీస్ ల్యాబ్స్ ప్లాంట్లలో తగిన ప్రమాణాలు లేవని ఎఫ్‌డీఏ అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఆయా షేర్లను పడగొట్టింది. అరబిందో ఫార్మా, సన్ ఫార్మా తదితర కంపెనీలు ధరల విషయంలో కుమ్మక్కయ్యాయంటూ అమెరికా చర్యలు చేపట్టడం వీటి షేర్లపై ప్రభావాన్ని చూపించింది. మరోవంక బ్రెగ్జిట్ కూడా ఫార్మా కంపెనీల ఆదాయాలపై ప్రభావం చూపుతుందనే విశ్లేషణలు వెలువడ్డాయి. 2018లోనే జీఎస్టీ అమలు!! ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వస్తు సేవల పన్నుకు (జీఎస్టీ) ఆగస్ట్ 8న మోక్షం లభించింది. వివిధ రకాల రాష్ట్రాల పన్నులు, కేంద్రం పన్నుల స్థానంలో జీఎస్టీ అమల్లోకి రావడం ద్వారా యావత్‌దేశం ఒకే మార్కెట్‌గా అవతరించనుంది. 2017లో ఇది అమల్లోకి రావచ్చని భావిస్తున్నా... నోట్ల రద్దు నేపథ్యంలో 2018లోనే అమల్లోకి వస్తుందనేది తాజా అంచనా. ఎగుడు దిగుళ్ల రియల్టీ!! కొన్నేళ్లుగా డౌన్ లో ఉన్న మార్కెట్ ఈ ఏడాది కాస్త మెరుగుపడింది. తొలి 10 నెలల్లో ఇళ్ల విక్రయాలు పర్వాలేదనిపించాయి. తొలిసారి గృహరుణం తీసుకున్న వారికి అదనంగా రూ.50వేల వడ్డీ మినహాయింపు ప్రయోజనాన్ని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించడం ఈ రంగానికి జోష్ నిచ్చింది. రియల్ ఎస్టేట్ నియంత్రణ, అభివృద్ధి బిల్లును ఈ ఏడాదే పార్లమెంటు ఆమోదించింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌ల లిస్టింగ్‌కూ అడ్డంకులు తొలగిపోయాయి. నవంబర్‌లో నోట్ల రద్దు నిర్ణయం వెలువడ్డాక మాత్రం మార్కెట్ మళ్లీ డౌనయింది. డెవలపర్లు తమ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఈ ఏడాది ప్రయివేటు ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి రూ.48,300 కోట్లు సమీకరించారు. ఇది గతేడాది కంటే 53 శాతం అధికం. 2017 రియల్టీకి గోల్డెన్ ఇయర్ అవుతుందనేది ఆ వర్గం నమ్మకం. రూపాయి... బాగా పడింది 2016లో రూపాయి మారకపు విలువ డాలర్‌తో పోలిస్తే 2.5 శాతం క్షీణించింది. గతేడాది చివర్న 66.15 స్థాయి వద్ద ఉన్న రూపాయి అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచాక 68.90 రికార్డు స్థాయికి పడింది. తర్వాత స్వల్పంగా కోలుకుని డిసెంబర్ 30న 67.90 వద్ద ముగిసింది. భారత్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధుల్ని వెనక్కు తీసుకోవడం రూపాయి పతనానికి ప్రధాన కారణం. 2013లో సమీకరించిన విదేశీ కరెన్సీ డిపాజిట్లను భారత్ ఈ నవంబర్‌లో చెల్లించాల్సి రావటం కూడా రూపాయిని పడేసింది. గల్ప్ దేశాల నుంచి రెమిటెన్సులు తగ్గడం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం వంటివి ఈ పతనానికి ఆజ్యం పోశాయి. ట్రంప్... భారత ఐటీకి చిక్కేనా? 2016లో అంతర్జాతీయంగా ఐటీపై ఖర్చులు 0.3 శాతం తగ్గాయి. మాంద్యం పరిస్థితులతో దేశీ ఐటీ దిగ్గజాలు మెరుగైన ఫలితాలను సాధించలేకపోయాయి. పులిమీద పుట్రలా తాత్కాలిక వర్కింగ్ వీసా ఫీజుల్ని అమెరికా భారీగా పెంచింది. విప్రో 50 కోట్ల డాలర్లతో అప్పీరియోను... హెసీఎల్ టెక్నాలజీస్ 20 కోట్ల డాలర్లతో జియోమెట్రిక్ను కొనుగోలు చేశాయి. ఇన్ఫోసిస్ పలు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టింది. 150 బిలియన్ డాలర్ల దేశీ ఐటీ విపణిలో 60% ఎగుమతుల ద్వారా వస్తున్నదే. కానీ, అమెరికా అధ్యక్ష ఎన్నికలో ట్రంప్ గెలవటం ఐటీ అనిశ్చితికి దారితీసింది. ఇమిగ్రేషన్ వీసా నిబంధనలను కఠినం చేయవచ్చని, వ్యయాలు పెరిగిపోతాయని అంచనాలున్నాయి. బ్రెగ్జిట్ ప్రభావం కూడా ఐటీ ఎగుమతులపై పడొచ్చనే ఆందోళనలున్నాయి. ఫెడ్ రేట్ల... భయం భయం! అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్... డిసెంబర్లో ఫండ్ రేటును పావు శాతం పెంచింది. అమెరికా ఆర్థిక రంగం కోలుకుంటున్నందున వచ్చే ఏడాది నుంచి మూడేళ్ల పాటు... ఏటా మూడు సార్లు రేట్లను పెంచుతామనే సంకేతాలూ ఇచ్చింది. దీంతో డాలర్ బలపడింది. మన రూపాయి రూ.68కి క్షీణించింది. ఎఫ్ఐఐల నిధుల ఉపసంహరణ కూడా మొదలైంది. అదే వచ్చే ఏడాది మార్కెట్లపై ఒక అంచనాకు రాలేకుండా చేస్తోంది. మూడేళ్ల తర్వాత లాభాల్లో∙పుత్తడి వరుసగా మూడేళ్లు నష్టాల్ని మూటగట్టుకున్న పుత్తడి 2016లో స్వల్ప లాభాలందించింది. ఈ ఏడాది ఒక దశలో 29 శాతం పెరిగిన బంగారం ధర... సంవత్సరాంతానికి చాలా కోల్పోయింది. బులియన్ విశ్లేషకుల వేసిన అంచనాలకు పూర్తి భిన్నంగా బంగారం ధర హెచ్చుతగ్గులకు లోనవటం విశేషం. 2015 డిసెంబర్లో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచాక పుత్తడి ధర పతనమవుతుందని, ట్రంప్ గెలవటంతో ఈ ధర పెరుగుతుందని విశ్లేషకులు అంచనావేయగా, అందుకు భిన్నమైన రీతిలో జరిగింది. ఈ డిసెంబర్ 14న ఫెడ్ తిరిగి రేట్లను పెంచాక పుత్తడి క్షీణిస్తూ వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఏడాది ప్రారంభంలో 1060 డాలర్ల వద్దనున్న ఔన్సు బంగారం ధర ఆగస్టుకల్లా 29 శాతం ఎగబాకి 1,372 డాలర్ల గరిష్టస్థాయికి చేరింది. తర్వాత 1,158 డాలర్లకు దిగింది. దీంతో ఏడాది మొత్తంమీద 9 శాతం పెరిగినట్లయింది. దేశీయంగా ముంబై బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పుత్తడి ధర ర్యాలీ రూ.25,150 నుంచి మొదలై ఆగస్టులో నాలుగేళ్ల గరిష్టస్థాయి రూ.31,720 వద్దకు చేరింది. సంవత్సరంలో చివరి ట్రేడింగ్ రోజున రూ.28,050 వద్ద ముగిసింది. దీంతో ఏడాది మొత్తంమీద రూ. 2,900 మేర (11.3 శాతం) పెరిగినట్లయింది. ప్రపంచ మార్కెట్‌తో పోలిస్తే దేశీయంగా ఎక్కువ పెరగడానికి కారణం రూపాయి మారకపు విలువ క్షీణించటమే. కొనుగోళ్లు, విలీనాల రిటైల్ ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సవాళ్లను తట్టుకుంటూ రిలయన్స్ రిటైల్, మహీంద్రా, ఫ్యూచర్ రిటైల్, మోర్ సంస్థలు బాగా విస్తరించాయి. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్... ‘ఫరెవర్21’ను సొంతం చేసుకుంది. ఫ్యూచర్ రిటైల్ సంస్థ ఫ్యాబ్ ఫర్నిష్.కామ్‌ను, హెరిటేజ్ ఫ్రెష్ దుకాణాలను సొంతం చేసుకుంది. మహీంద్రా రిటైల్ సంస్థ బేబీఓయే కార్యకలాపాలను విలీనం చేసుకుంది. కాకపోతే పెద్ద నోట్ల రద్దుతో ఏడాది చివర్లో విక్రయాలు మందగించాయి. స్వీడన్ కు చెందిన రిటైల్ ఫర్నిచర్ దిగ్గజం ఐకియా భారత్‌లోకి అడుగుపెట్టింది. వచ్చే కొన్నేళ్లలో రూ.10వేల కోట్ల పెట్టుబడికి ప్రణాళికలు వేసుకుంది. ప్రభుత్వం 100 శాతం సింగిల్ బ్రాండ్ రిటైల్‌కు అనుమతించడంతో పుమా, అడిడాస్ సొంత స్టోర్లను తెరిచాయి. పడిలేచిన ముడిచమురు! 2016లో ముడి చమురు భారీ రాబడుల్ని అందించింది. ఇది కూడా పుత్తడిలానే మూడేళ్లపాటు క్షీణిస్తూ వచ్చింది. 2016 జనవరిలో 14 ఏళ్ల కనిషా్ఠనికి పడిపోయింది. చమురు ఎగుమతి దేశాల నుంచి సరఫరాలు పెరగడం, అమెరికాలో షేల్ గ్యాస్ దిగుబడులు పెరగడంతో క్రూడ్ క్షీణిస్తూ వచ్చింది. అధికంగా క్రూడ్ దిగుమతి చేసుకునే అమెరికా స్వదేశంలోనే షేల్ గ్యాస్ ద్వారా ఉత్పత్తిని పెంచుకోవడం క్రూడ్ పతనానికి ముఖ్య కారణం. 2016 జనవరిలో 37.22 డాలర్ల వద్దనున్న బ్యారల్ బ్రెంట్ క్రూడ్ అదే నెల మధ్యలో 27.88 డాలర్ల వద్దకు పతనమయింది. అప్పట్నుంచి వేగంగా పెరిగిన క్రూడ్ దాదాపు రెట్టింపై 57 డాలర్ల స్థాయిని దాటింది. డిసెంబర్ 30న 56.68 డాలర్లకు చేరింది. దీంతో ఏడాది మొత్తం మీద క్రూడ్ 52%పైగా రాబడినిచ్చినట్లయ్యింది. -
రహస్య పత్రాలను 48 గంటల్లో వెనక్కిచ్చేయండి
మిస్త్రీకి టాటా సన్స్ మరో లీగల్ నోటీసు... సమాచారం బయటపెట్టనని హామీ ఇవ్వాలంటూ డిమాండ్ న్యూఢిల్లీ: కంపెనీకి సంబంధించిన రహస్య సమాచార పత్రాలన్నింటినీ తమకు వెంటనే తిరిగి స్వాధీనం చేయాలని టాటా సన్స్... సైరస్ మిస్త్రీని కోరింది. కంపెనీ ఆంతరంగిక సమాచారాన్ని బయటపెట్టడం ద్వారా గోప్యతా నిబంధనల్ని మిస్త్రీ ఉల్లంఘించారంటూ టాటా సన్స్ ఇప్పటికే ఆరోపించిన విషయం తెలిసిందే. తప్పుడు పద్ధతుల్లో, విశ్వాసరహితంగా, తమ అనుమతి లేకుండా కంపెనీ నుంచి ఈ పత్రాలను తీసుకెళ్లినట్టు ఆరోపించింది. చట్ట ప్రకారం శిక్షించదగిన నేరంగా దీన్ని పేర్కొంది. వెంటనే 48 గంటల్లోపు వాటిని తమకు స్వాధీనం చేయాలని, కాపీలను కూడా తన దగ్గర ఉంచుకోవద్దని కోరింది. ఆ సమాచారాన్ని భవిష్యత్తులో ఎప్పుడూ బహిర్గతపరచనని, గోప్యతను కాపాడతానని హామీ పత్రంపై సంతకం చేయాలంటూ గురువారం లీగల్ నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లో మిస్త్రీకి ఇది రెండో లీగల్ నోటీసు కావడం గమనార్హం. ‘‘టాటా సన్స్‌తోపాటు, నిర్వహణ కంపెనీలకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్, డైరెక్టర్‌గా వ్యవహరించిన మీ దగ్గర కంపెనీకి సంబంధించిన రహస్య, వాణిజ్యపరంగా సున్నితమైన సమాచారం ఉంది. చట్ట ప్రకారం విధుల్లో భాగంగా ఆ గోప్యతను, డైరెక్టర్‌గా మీకు తెలిసిన రహస్య సమాచారాన్ని కాపాడాల్సి ఉంటుంది. దీన్ని వెల్లడించరాదు. ఈ సమాచారాన్ని దేనికీ వినియోగించరాదు. అలాగే, అనుబంధ సంస్థలు, బంధువులు, కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయరాదు’’ అంటూ టాటా సన్స్ తన నోటీసులో మిస్త్రీని కోరింది. చట్టబద్ధమైన ఈ విధులను ఉల్లంఘిస్తే టాటా సన్స్‌కు కోలుకోలేని నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. టాటా సన్స్, టాటా గ్రూపునకు సంబంధించి ఎంతో విలువైన సమాచారం మిస్త్రీ వద్ద ఉందని పేర్కొంది. అభ్యర్థన మాత్రమే... టాటా సన్స్ పంపిన లీగల్ నోటీసుపై మీడియా విచారణలకు మిస్త్రీ కార్యాలయం స్పందించింది. నోటీసుగా పేర్కొంటున్న టాటా లేఖ... కోర్టులు, ట్రిబ్యునళ్లకు డాక్యుమెంట్లను, రికార్డులను అందించవద్దని, అవి గోప్యంగా ఉంచాల్సినవంటూ చేసిన అభ్యర్థన మాత్రమేనని పేర్కొంది. దీనిపై బహిరంగంగా వ్యాఖ్యానించబోమని, వార్తల కోసం ప్రత్యుత్తరం ఇవ్వబోమని మిస్త్రీ కార్యాలయం స్పష్టం చేసింది. గోప్యత అంటూ వారు తమ లేఖలను మీడియాకు విస్తృతంగా పంపిణీ చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించింది. ఈ విధమైన ప్రవర్తన న్యాయ వ్యవస్థ పరిధిలో జోక్యం చేసుకోవడంగా భావిస్తున్నట్టు మిస్త్రీ కార్యాలయం ప్రకటన జారీ చేసింది. -
రహస్యాల ఉల్లంఘనకు పాల్పడ్డారు!
మిస్త్రీకి టాటా సన్స్ లీగల్ నోటీస్ • ఎన్సీఎల్టీ ముందు సున్నితమైన కంపెనీ పత్రాలను ఉంచారని విమర్శ • ఈ చర్యలకు పాల్పడవద్దని స్పష్టీకరణ ముంబై: ‘‘మీరు అనుసరిస్తున్న విధానాలు, చేస్తున్న పనులు నేరపూరిత విశ్వాస ఘాతుక చర్యల పరిధిలోకి వస్తాయి’’ ఇది తాజాగా బహిష్కృత చైర్మన్ సైరస్ మిస్త్రీపై టాటా సన్స్ విమర్శ. ఈ మేరకు మంగళవారం మిస్త్రీకి టాటా సన్స్ ఒక లీగల్ నోటీస్‌ను జారీ చేసింది. తనను చైర్మన్‌గా తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దాఖలు చేసిన పిటిషన్లో పలు కీలక సున్నిత కంపెనీ పత్రాలను బహిరంగ పరిచారని టాటా సన్స్ ఈ లీగల్ నోటీసుల్లో పేర్కొంది. ఇందులో బోర్డ్ సమావేశాల మినిట్స్, ఫైనాన్షియల్ అంశాలు, గణాంకాలు ఉన్నాయని పేర్కొన్న టాటా సన్స్, ఇది రహస్యాల ఉల్లంఘనలకు పాల్పడ్డమేనని పేర్కొంది. ‘‘టాటా సన్స్ డైరెక్టర్ హోదాలో మీకు అందిన కీలక, రహస్య, సున్నిత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడాన్ని ఇకముందు మానుకోండి’’ అని టాటా సన్స్ డిమాండ్ చేసింది. నేపథ్యం ఇదీ... టాటా గ్రూపు చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన మిస్త్రీ, ఆ తర్వాత గ్రూపు నిర్వహణ లోపాలపై సంచలన ఆరోపణలకు దిగిన విషయం తెలిసిందే. అనూహ్యంగా టాటా గ్రూపు కంపెనీల బోర్డు డైరెక్టర్ పదవులకు రాజీనామా చేసిన మిస్త్రీ మరుసటి రోజే అంటే ఈ నెల 20న కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ తరఫున పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌తోపాటు, మిస్త్రీ కుటుంబానికే చెందిన స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ దాఖలు చేసింది. టాటా సన్స్ బోర్డ్ నిర్ణయాలను తోసిపుచ్చాలని, యాజమాన్య లోపాలను సరిదిద్దేలా తగిన చర్యలు తీసుకోవాలని ట్రిబ్యునల్‌ను పిటిషన్ కోరింది. అయితే పిటిషన్లపై జనవరి 31, ఫిబ్రవరి 1తేదీల్లో విచారణ జరిపేందుకు ట్రిబ్యునల్ డివిజన్ బెంచ్ అంగీకరించింది. అప్పటికప్పుడు మధ్యం తర ఉపశమనం కల్పించాలన్న పిటిషనర్ వినతిని పరిశీలించబోమని... అసలు మధ్యంతర చర్యలను అనుమతించబోమని మాత్రం స్పష్టం చేసింది. అయితే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ట్రిబ్యునల్, విచారణను వేగంగా పూర్తి చేసి ఓ నెలలో ఆదేశాలు జారీకి అంగీకరించడం మిస్త్రీకి కొంతలో కొంత ఊరట. ఆయా పరిణామాల నేపథ్యంలో తాజాగా మిస్త్రీకి ఈ లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. మిస్త్రీకి టాటా సన్స్ తరఫున లా ఫామ్ ష్రాదుల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కంపెనీ జారీ చేసిన తాజా లీగల్ నోటీసులో మరికొన్ని ముఖ్యాంశాలు... ⇔ పిటిషన్లో భాగంగా సైరస్ మిస్త్రీకి సంబంధించి రెండు కంపెనీలు ఉద్దేశపూర్వకంగా పలు కీలక పత్రాలను దాఖలు చేశాయి. వీటిలో టాటా సన్స్, టాటా గ్రూప్ కంపెనీలు, జాయింట్ వెంచర్లకు సంబంధించిన ఆర్థిక సమాచార అంశాలు, వ్యాపార వ్యూహాలు రహస్య గణాంకాలు ఉన్నాయి. ⇔ టాటా కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద మీ బాధ్యతలను, టాటా సన్స్ పట్ల మీ విశ్వాస విధులను, రహస్య, కీలక సమాచారాన్ని బహిరంగ పరచకూడదన్న నిబంధనలను అన్నింటినీ మీరు ఉల్లంఘించారు. ⇔ ఒక డైరెక్టర్‌గా ఇది మీ న్యాయపరమైన బాధ్యతలను ఉల్లంఘించడమే కాదు, మా క్లయింట్ల ప్రయోజనాలకు విఘాతం కలిగేలా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మీరు చేసిన చర్యలు టాటా సన్స్‌కు, టాటా గ్రూప్ కంపెనీల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయి. ⇔ మీ చర్యలు అన్నీ నిర్వహణారాహిత్య చర్యల కిందకి వస్తాయి. టాటా సన్స్, టాటా గ్రూప్ కంపెనీల శ్రేయస్సును మీరు ఎంతమాత్రం కోరుకోవడం లేదన్న విషయాన్ని మీ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. జేఎన్ టాటా సౌశీల్యతలు మీ ప్రవర్తనలో కనిపించడం లేదు. ⇔ మీ లీగల్ పొసీడింగ్స్లో ఇచ్చే సమాచారం, వినియోగించే పత్రాలు టాటా సన్స్, టాటా గ్రూప్ కంపెనీల ప్రయోజనాలకు ఎంతమాత్రం విఘాతం కలిగించరాదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ⇔ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే... న్యాయపరమైన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. -
సైరస్ మిస్త్రీని వెంటాడుతున్న కష్టాలు
ముంబై: టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీని కష్టాలు వెంటాడుతున్నాయి. కంపెనీకి చెందిన రహస్య విషయాలు వెల్లడించారని ఆరోపిస్తూ టాటా సన్స్ మంగళవారం ఆయనకు లీగల్ నోటీసు పంపించింది. టాటా గ్రూపు నియమావళి, గోప్యతను ఉల్లంఘించారని ఆరోపించింది. టాటా సన్స్ డైరెక్టర్‌గా మిస్త్రీ కీలక, రహస్య సమాచారాన్ని వెల్లడించారని నోటీసులో పేర్కొంది. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన సంగతి తెలిసిందే. దిగ్గజ గ్రూప్‌ను ముందుకు నడిపించే విషయంలో సైరస్ మిస్త్రీపైనా, ఆయన సామర్ధ్యంపైనా నమ్మకం కోల్పోయినందునే బోర్డు ఉద్వాసన పలికిందని టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత టాటా గ్రూప్ సంస్థల బోర్డుల్లో డైరెక్టర్ హోదా నుంచి సైరస్ మిస్త్రీ వైదొలిగారు. టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్ సహా ఆరు లిస్టెడ్‌కంపెనీల బోర్డుల నుంచి వైదొలుగుతున్నట్లు మిస్త్రీ వెల్లడించారు. -
నా ప్రతిష్టను మంటగలపడమే లక్ష్యం
ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేశారు... • ఈ రెండు నెలలు ఒంటరివాడినయ్యా • మీడియాలో వార్తలు ఎంతో బాధను కలిగించాయి • రతన్ టాటా భావోద్వేగ ప్రసంగం • సైరస్మిస్త్రీ తొలగింపు అనంతర పరిణామాలపై విచారం ముంబై: టాటా గ్రూపు తాత్కాలిక చైర్మన్ రతన్‌టాటా... చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపు అనంతర పరిణామాలపై తొలిసారిగా నోరు విప్పారు. నుస్లీ వాడియాను డైరెక్టర్‌గా తొలగించేందుకు టాటా కెమికల్స్ కంపెనీ శుక్రవారం ముంబైలో నిర్వహించిన ఈజీఎం వేదికగా ఈ అంశంపై రతన్ భావోద్వేగంతో స్పందించారు. ‘‘గత రెండు నెలల కాలంలో నా వ్యక్తిగత ప్రతిష్ట... గొప్ప చరిత్ర ఉన్న టాటా గ్రూపు ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశపూర్వక ప్రయత్నం జరిగింది. ఈ కాలంలో మీడియా చేసిన దాడితో ఒంటరి వాడినయ్యాను. వాటిలో చాలా వరకు నిరాధారమైనవే. చాలా బాధకు గురిచేశాయి. ఈ ప్రక్రియ బాధాకరమే అయినప్పటికీ చివరికి నిజమే గెలుస్తుంది’’ అని రతన్ టాటా వాటాదారుల సమక్షంలో పేర్కొన్నారు. గత అక్టోబర్ 24న సైరస్ మిస్త్రీని టాటా గ్రూపు చైర్మన్‌గా తప్పించిన అనంతరం రతన్‌టాటా తాత్కాలిక చైర్మన్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. పదవీచ్యుతుడిని చేయడంపై సైరస్ మిస్త్రీ మండిపడడం, రతన్‌టాటా, టాటాసన్స్పై ఆరోపణలు చేయడం, దానికి రతన్ టాటా వర్గం బదులివ్వడం.... ఇదో వివాదంగా మారింది. ఇరు వర్గాల మధ్య ఇన్నాళ్లూ బహిరంగ మాటల యుద్ధం కొనసాగగా చివరికి అది కంపెనీ లా బోర్డుకు చేరిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో రతన్ టాటా మాట్లాడుతూ... టాటా గ్రూపు 150 ఏళ్ల నుంచీ ఉందని, కార్పొరేట్ పాలన, పారదర్శక విధానాలతో కొనసాగుతోందన్నారు. నిజం నిగ్గుతేలి, దేశంలో ఉన్న వ్యవస్థలు పనిచేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ‘‘ఇక ఈ వారం నేను ఎంతో భావోద్వేగానికి లోనయ్యా. వాటాదారుల అభిమానం, మద్దతు నన్ను ఎంతగానో కదిలించింది. వాటాదారులకు నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పకుండా ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్లలేను’’ అని రతన్ టాటా పేర్కొన్నారు. వాటాదారుల వైపు ఉండడం ఆనందంగా ఉందన్నారు. టాటాలపై వాడియా పరువునష్టం కేసు ప్రముఖ పారిశ్రామిక వేత్త నుస్లీ ఎన్ వాడియా టాటా గ్రూపు నిర్వహణ సంస్థ టాటా సన్స్‌తోపాటు ఆ గ్రూపు తాత్కాలిక చైర్మన్ రతన్‌టాటా, పలువురు డైరెక్టర్లపై ‘నేరపూరిత పరువునష్టం’ కేసు దాఖలు చేశారు. ముంబైలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో శుక్రవారం పిటిషన్ వేశారు. టాటా కెమికల్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్ బోర్డుల నుంచి ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నుస్లీ వాడియాను తొలగించేందుకు వాటాదారులకు టాటా సన్స్ జారీ చేసిన ప్రత్యేక తీర్మానం... తన పేరు, ప్రతిష్టలకు తీవ్ర నష్టం కలిగించాయని పిటిషన్లో వాడియా పేర్కొన్నారు. ఈ చర్య పలు ఇతర కంపెనీల్లో స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న తన హోదాపై ప్రభావం చూపిందని.. దేశీయంగాను, విదేశాల్లోని వ్యాపా ర వర్గాల్లో తన పేరు ప్రతిష్టలకు విఘాతం కలిగిస్తుందని వాడియా ఆరోపించారు. ఐపీసీలోని సెక్షన్ 500 (పరువు నష్టం), సెక్షన్ 109 (నేర ప్రేరేపణ), సెక్షన్ 34 (ఉద్దేశపూర్వక నేరపూరిత చర్య) కింద టాటా సన్స్తోపా టు మరో 11 మందిపై విచారణ జరపాలని వాడియా కోర్టును కోరారు. రతన్, టాటా సన్స్ డైరెక్టర్లు అజయ్ పిరమల్, అమిత రణబీర్ చంద్ర, ఇషాత్ హుస్సేన్, నితిన్ నోహ్రియా, విజయ్‌సింగ్, వేణు శ్రీనివాసన్, రాల్ప్స్పెత్, ఎన్.చంద్రశేఖరన్, రణేంద్ర సేన్‌తోపాటు టాటాసన్స్ కంపెనీ సెక్రటరీ, సీఈవోల పేర్లు ఇందులో ఉన్నాయి. వాడియా లోగడ బోంబే హైకోర్టులో ఇదే విషయమై రూ.3,000 కోట్ల పరిహారం కోరుతూ పరువునష్టం కేసు దాఖలు చేసినట్టు సమాచారం. టాటా మోటార్స్ బోర్డు వాడియాకు ఉద్వాసన న్యూఢిల్లీ: స్వతంత్ర డైరెక్టర్ నుస్లీ వాడియాను బోర్డు నుంచి తొలగించే ప్రతిపాదనకు టాటా మోటార్స్ షేర్హోల్డర్లు ఆమోదముద్ర వేశారు. గురువారం జరిగిన అసాధారణ సర్వ సభ్య సమావేశంలో ఓటింగ్ ఫలితాలను కంపెనీ వెల్లడించింది. వాడియా తొలగింపునకు సంబంధించి టాటా సన్స్ ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు అనుకూలంగా 71.20 శాతం ఓట్లు, వ్యతిరేకంగా 28.80 శాతం ఓట్లు వచ్చినట్లు సంస్థ పేర్కొంది. ఇప్పటికే టాటా స్టీల్ బోర్డు నుంచి ఆయన్ను తప్పించిన సంగతి తెలిసిందే. -
టాటా స్టీల్ బోర్డు నుంచి నుస్లీవాడియా ఔట్
-
మిస్త్రీకి దక్కని ఊరట!
• మధ్యంతర ఆదేశాల జారీకి కంపెనీ లా ట్రిబ్యునల్ తిరస్కరణ • జనవరి 31, ఫిబ్రవరి 1న విచారణ • నెలలో విచారణ ముగించి ఆదేశాల జారీకి సమ్మతి • స్పందన తెలియజేయాలని టాటాసన్స్కు ఆదేశాలు ముంబై: మధ్యంతర ఆదేశాలు కోరుతూ టాటా గ్రూపుపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన సైరస్ మిస్త్రీకి నిరాశ ఎదురైంది. టాటా గ్రూపు చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ ఆ తర్వాత గ్రూపు నిర్వహణ లోపాలపై సంచలన ఆరోపణలకు దిగిన విషయం తెలిసిందే. అనూహ్యంగా టాటా గ్రూపు కంపెనీల బోర్డు డైరెక్టర్ పదవులకు రాజీనామా చేసిన మిస్త్రీ మరుసటి రోజే కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ తరఫున పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్Sతోపాటు, మిస్త్రీ కుటుంబానికే చెందిన స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై కూడా జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో విచారణ జరిపేందుకు ట్రిబ్యునల్ డివిజన్ బెంచ్ అంగీకరించింది. అయితే, ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉపశమనం కల్పించాలన్న పిటిషనర్ వినతిని పరిశీలించబోమని... అసలు మధ్యంతర చర్యలను అనుమతించబోమని స్పష్టం చేసింది. వారంలోగా పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని సైరస్ పల్లోంజి మిస్త్రీని బెంచ్ కోరింది. అలాగే, 15 రోజుల్లోగా స్పందన తెలియజేయాలని టాటా సన్స్, పిటిషన్లో ఇతర ప్రతివాదులను ఆదేశించింది. తాత్కాలిక ఉపశమనంపై విచారణకు తిరస్కరించిన డివిజన్ బెంచ్... విచారణను వేగంగా పూర్తి చేసి ఓ నెలలో ఆదేశాలు జారీకి అంగీకరించడం పిటిషనర్లకు దక్కిన కొంచెం ఊరటగా చెప్పుకోవచ్చు. రతన్ టాటాను బోర్డుకు దూరంగా ఉంచాలి... కంపెనీ లా బోర్డు (ఎన్సీఎల్టీ)లో మిస్త్రీ కుటుంబ నిర్వహణలోని కంపెనీలు సెక్షన్ 241, 242 కింద పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గురువారం డివిజన్‌బెంచ్ ముందు ఈ పిటిషన్ విచారణకు రాగా, దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎ.సుందరం తన వాదనలు వినిపించారు. పిటిషన్‌పై విచారణ జరిగేంత వరకు సైరస్ మిస్త్రీని టాటా సన్స్ (టాటా గ్రూపు కంపెనీల నిర్వహణ సంస్థ) బోర్డు, ఇతర టాటా గ్రూపు కంపెనీల నుంచి తొలగించకుండా... గ్రూపు తాత్కాలిక చైర్మన్ రతన్‌టాటా, టాటాసన్స్ను ఆదేశించాలని ట్రిబ్యునల్‌ను కోరారు. రతన్ టాటా బోర్డు సమావేశాలకు హాజరు కాకుండా, టాటా సన్స్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా నిరోధిస్తూ తాత్కాలిక ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించి... వారి సారధ్యంలో కొత్తగా స్వతంత్ర డైరెక్టర్లను నియమించాలని కూడా కోరారు. అలాగే, టాటా సన్స్‌లో పిటిషనర్ల (మిస్త్రీ కుటుంబం)కు ప్రస్తుతం ఉన్న వాటాను తగ్గించే దిశగా కొత్తగా ఎలాంటి సెక్యూరిటీలను జారీ చేయకుండా టాటా సన్స్‌ను ఆదేశించాలని పేర్కొన్నారు. టాటా సన్స్‌లో మిస్త్రీ కుటుంబానికి చెందిన పల్లోంజీ గ్రూపునకు 18 శాతం వాటా ఉంది. టాటాసన్స్ అణచివేత ధోరణిని ప్రశ్నిస్తూ... మిస్త్రీని డైరెక్టర్‌గా తొలగించే విషయంలో టాటా కంపెనీలు, నాన్ ప్రమోటింగ్ డైరెక్టర్ల మద్దతు లేకపోయినా టాటా సన్స్ సెక్షన్ 169 కింద ప్రత్యేక నోటీసు జారీ చేయడం ముసుగు దాడిగా పిటిషనర్ పేర్కొన్నారు. సైరస్ పీ మిస్త్రీ, నుస్లీ వాడియాలు చేసిన ఆరోపణలను ఇంతవరకు ప్రతివాదులు ఖండించలేదని న్యాయవాది సుందరం ట్రిబ్యునల్‌కు వివరించారు. అయితే, టాటా సన్స్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్సింఘ్వి మాత్రం పిటిషనర్ల ఆరోపణలు ఆధారరహితమని పేర్కొన్నారు. దీనిపై ట్రిబ్యునల్ ఆదేశిస్తే స్పందన దాఖలు చేస్తామన్నారు. నోటీసు లేకుండా తప్పించారు... ‘‘ముందస్తు నోటీసు ఇవ్వకుండా టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మిస్త్రీని తొలగించారు. అసలు కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా కల్పించలేదు. నుస్లీ వాడియా సహా టాటా గ్రూపు లిస్టెడ్ కంపెనీల్లో పలువురు స్వతంత్ర డైరెక్టర్లను సైతం ఇదే విధంగా అణచివేసే ప్రయత్నం జరిగింది. టాటా సన్స్‌లో టాటా ట్రస్టీల పాత్రపై విచారణకు ఆదేశాలు ఇవ్వాలి. అలాగే, టాటా సన్స్, టాటా గ్రూపు కంపెనీల్లో వీరిని జోక్యం చేసుకోకుండా అడ్డుకోవాలి. టాటాసన్స్, సి.శివశంకరన్, అతని వ్యాపార సంస్థల మధ్య... మెహ్లీమిస్త్రీ, అతని అనుబంధ కంపెనీలతో జరిగిన అన్ని లావాదేవీలు, వ్యవహారాలపై ఫోరెన్సిక్ ఆడిట్ కోసం స్వతంత్ర ఆడిటర్‌ను నియమించాలి. అలాగే, స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి. ‘మిస్త్రీని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా తప్పించేందుకు టాటా సన్స్... టాటామోటార్స్ షేర్లను కొనుగోలు చేయడం వల్ల రూ.158.65 కోట్ల నష్టం వాటిల్లింది. ఇది మిస్త్రీని బయటకు పంపేందుకు వీలుగా టాటా మోటార్స్‌లో టాటా సన్స్ తన ఓటింగ్ బలాన్ని పెంచుకునేందుకే. టాటాసన్స్, వాటాదారుల ప్రయోజనాల కోసం కాదు. ఈ నిధులను వెనక్కి తీసుకోవాలని టాటా సన్స్‌ను ఆదేశించాలి’’ అని పిటిషన్లో మిస్త్రీ కుటుంబ కంపెనీలు కోరాయి. అలాగే, రతన్‌టాటా, ఎన్ఏ సూనవాలా తదితరులు ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘనపై విచారణకు ఇన్స్పెక్టర్ను నియమించాలని ట్రిబ్యునల్‌ను కోరడం గమనార్హం. టాటా స్టీల్ బోర్డు నుంచి నుస్లీవాడియా ఔట్ న్యూఢిల్లీ: టాటా స్టీల్ కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్న నుస్లీవాడియాను తొలగించింది. వాడియాను తొలగించే తీర్మానంపై మెజారిటీ వాటాదారులు అనుకూలంగా ఓటు వేశారు. మొత్తం 97.12 కోట్ల షేర్లకు గాను 62.54 శాతం వాటాలకు సంబంధించిన ఓట్లు పోలయ్యాయని, ఇందులో మిస్త్రీని తొలగించాలన్న తీర్మానానికి అనుకూలంగా 56.79 కోట్లు (90.80).. వ్యతిరేకంగా 5.75 కోట్ల ఓట్లు (9.20%) వచ్చాయని టాటా స్టీల్ బీఎస్ఈకి సమాచారం ఇచ్చింది. టాటా స్టీల్‌లో ప్రమోటర్ అయిన టాటా సన్స్, ఇతర ప్రమోటింగ్ కంపెనీలకు కలిపి మొత్తం 30.45 కోట్ల షేర్లున్నాయి. ఇందులో వాడియాను తొలగించే తీర్మానంపై 29.59 కోట్ల వాటాలకు సంబంధించిన ఓట్లు నమోదైనట్లు టాటా స్టీల్ తెలిపింది. ప్రమోటర్లను మినహాయించి చూసినా... సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్లలో నాలుగింట మూడొం తుల ఇన్వెస్టర్లు వాడియాను తొలగించాలని ఓటు వేసినట్టు పేర్కొంది. సైరస్ మిస్త్రీ, నుస్లీ వాడియాలను బోర్డు నుంచి తొలగించేందుకు టాటా కెమికల్స్ ఈజీఎం ఏర్పాటు చేయగా, మిస్త్రీ ఇంతకుముందే రాజీనామా చేయడంతో వాడియాను తొలగించే తీర్మానంపై మాత్రమే ఓటింగ్ జరిగింది. టాటా సన్స్ చేసిన ఆరోపణలపై రతన్‌టాటా, టాటాసన్స్, పలువురు డైరెక్టర్లపై వాడియా రూ.3,000 కోట్ల పరువు నష్టం వ్యాజ్యం దాఖలు చేయడం తెలిసిందే. -
‘టాటా’పై సంధి లేదు.. సమరమే!
గ్రూప్‌లో వాటాలు వదులుకోం: బహిష్కృత చైర్మన్ సైరస్ మిస్త్రీ • నిర్వహణా లోపాలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ ముంబై: రతన్ టాటాతో రాజీపడే ప్రసక్తేలేదని.. గ్రూప్ కంపెనీల్లో నిర్వహణా లోపాలపై తన పోరాటం కొనసాగుతుందని సైరస్ మిస్త్రీ తేల్చిచెప్పారు. గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్ధంతరంగా తనను తొలగించడంపై టాటా సన్స్‌తో న్యాయ పోరాటానికి దిగిన మిస్త్రీ.. ఈ విషయంలో వెనక్కు తగ్గే ప్రశ్నేలేదని స్పష్టం చేశారు. ఉప్పు నుంచి సాఫ్ట్వేర్ దిగ్గజం వరకూ ఎదిగిన 149 సంవత్సరాల గ్రూప్‌కు టాటా కుటుంబ యేతర చైర్మన్‌గా మొట్టమొదటిసారి బాధ్యతలు చేపట్టి, అనూహ్య పరిస్థితిల్లో ఈ బాధ్యతలను కోల్పోయిన మిస్త్రీ ఆయా అంశాలకు సంబంధించి ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూ్యలో కొన్ని ముఖ్యాంశాలు ... ⇔ 103 బిలియన్ అమెరికా డాలర్ల విలువైన గ్రూప్‌లో దాదాపు 18.5%గా మా హోల్డింగ్‌ను వదులుకోకుండా, గ్రూప్‌లో నిర్వహణా పరమైన సవ్యతలకోసం నా పోరాటం కొనసాగుతుంది. ⇔ పోరు విస్తృత స్థాయిలో ఉంటుంది. ఒకవేళ న్యాయపోరాటంలో ఓడిపోయినా... గ్రూప్ నుంచి మా కుటుంబ వాటాల ఉపసంహరణ జరగదు. ⇔ గ్రూప్‌లో నిర్వహణ, సంస్కరణల గురించే నేను పోరాడాను. పోరాడతాను. ఒకటి, రెండు రోజులుకాదు... 50 సంవత్సరాల నుంచీ మేము అక్కడ ఉన్నాము. నిర్వహణ మెరుగుపడితే అంతా మంచే జరుగుతుంది. ⇔ ఇప్పుడు జరుగుతోంది బిజినెస్ గ్రూప్ పోరాటం కాదు. అలాంటి తరహా పరిస్థితి ఇక్కడ తలెత్తలేదు. అదే అయితే నేను అక్కడ (బోర్డులో) కూర్చోవడానికే ఇష్టపడేవాడిని. వ్యాపార అంశాలకు సంబంధించినది కాదుకాబట్టే నేను అక్కడి నుంచి నాకునేనుగా తప్పుకున్నాను. ⇔ నన్ను చైర్మన్ బాధ్యతల నుంచి తొలగించడం నిర్వహణ లోపాన్ని, విలువలు తగ్గడాన్ని సూచిస్తోంది. టాటాల నిర్వహణకు సంబంధించి ఒక మార్పు స్థితిలో గ్రూప్ ఉంది. వ్యాపారాలకు భవిష్యత్ రక్షణ అవసరం. ఇందుకు వ్యవస్థాగతమైన ప్రక్రియ ప్రారంభంకాక తప్పదు. లేదంటే వాణిజ్య ప్రయోజనాలు కిందకు జారే అవకాశం ఉంది. ⇔ ట్రస్టులు తప్పుడు నిర్ణయాలు తీసుకునే వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయే పరిస్థితి ఉంటే, నిర్వహణ కూడా గాడి తప్పుతుంది. అలాంటప్పుడు కంపెనీల పరిస్థితి ఏమవుతుంది? ఇలాంటి ధోరణి దీర్ఘకాలంలో కంపెనీ ప్రయోజనాలకు తగింది కాదు. ⇔ నా చర్యల వల్ల గ్రూప్ విలువ పడిపోతోందన్న ఇన్వెస్టర్లు కొందరు ఆందోళనగా ఉన్న విషయం వాస్తవమే. అయితే అసలు నిజం ఏమిటన్న విషయం తెలుసుకోడానికి కొంత సమయం పడుతుంది. దీర్ఘకాలంలో జరిగే మంచి ఫలితం కోసం తగిన కృషి చేయడం ఎప్పుడూ అవసరమే. ⇔ నిర్వహణ పరమైన అంశాలకు సంబంధించి ఎంతో చర్చ జరుగుతోంది. టాటా ట్రస్టులు, టాటా సన్స్ బోర్డు, ఆపరేటింగ్ కంపెనీల బోర్డుల విషయంలో ఎంత కార్పొరేట్ గవర్నెర్స్ ఉందన్న అంశం నన్ను చైర్మన్‌గా తొలగించడానికి ఉద్దేశించి, నాడు టేబుల్లో ఉంచిన ఒక ముసాయిదా తెలియజేస్తోంది. న్యాయపోరాటం షురూ.. • నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్ • రేపు విచారణ జరిగే అవకాశం ముంబై: ఆరు టాటా లిస్టెడ్ కంపెనీల బోర్డుల నుంచీ తనకుతానుగా తప్పుకున్న మరుసటి రోజే టాటా సన్స్‌పై సైరెస్ మిస్త్రీ న్యాయ పోరాటం ప్రారంభించారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. టాటా సన్స్‌పై ఇక్కడి ఎన్సీఎల్టీలో మిస్త్రీ నియంత్రిత ఇన్వెస్ట్మెంట్ సంస్థలు తాజా పిటిషన్‌ను దాఖలు చేసినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ వర్గాల సమాచారం ప్రకారం– కంపెనీ చట్టంలోని 241వ సెక్షన్ కింద టాటా సన్స్‌కు వ్యతిరేకంగా అణచివేత, నిర్వహణా లోపాల ఆరోపణలతో ఈ పిటిషన్ దాఖలయ్యింది. ఈ పిటిషన్‌పై విచారణ డిసెంబర్ 22న జరుగుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. టాటా గ్రూప్ సంస్థల బోర్డులకు రాజీనామా చేస్తూనే రతన్ టాటాపై ఆయన పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు సంధించారు. తన పోరాటాన్ని మరింత విస్తృత వేదికకు తీసుకువెళ్లనున్నట్లూ తెలిపారు. అసాధారణ సర్వ సభ్య సమావేశాల వేదికల నుంచి దూరంగా వెళ్లగలిగితేనే.. సంస్కరణల అమలు, ఉద్యోగులు.. షేర్హోల్డర్లు, ఇతర వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యాల సాధనకు సమర్ధంగా పనిచేయడం సాధ్యపడుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. -
సమరానికి సై అంటున్నమిస్త్రీ
ముంబై: టాటాసన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అన్నంత పనీ చేస్తున్నారు. టాటా గ్రూపు అరాచకాలపై పోరాడుతానని చెప్పిన మిస్త్రీ మంగళవారం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు. కంపెనీల చట్టం సెక్షన్ 241, 242 కింద టాటా సన్స్ అణచివేత మిస్ మేనేజ్మెంట్ కు వ్యతిరేకంగా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మొదటి విచారణను ఎస్ సీఎల్ టీ డిసెంబర్ 22న చేపట్టనుంది. మరోవైపు సైరస్ మిస్త్రీ తాజా ఆరోపణలను టాటా గ్రూపు ఖండించింది. కాగా చట్టవిరుద్ధంతా తనను పదవి నుంచి తొలగించారని ఆరోపిస్తున్న మిస్త్రీ సోమవారం టాటా గ్రూపులోని అన్ని గ్రూపులకు రాజీనామా చేస్తూ ఒకప్రకటన విడుదల చేశారు. టాటా గ్రూపులోని ఆరు కంపెనీలకు రాజీనామా చేసిన ఆయన రతన్ టాటాకు వ్యతిరేకంగా చట్టానికి, సమానత్వానికి గౌరవం దక్కే సంస్థ ద్వారా తనపోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. తనపోరాటాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మిస్త్రీ... ‘టాటా’ చెప్పేశారు!
• టాటా గ్రూప్‌లో 6 కీలక సంస్థల బోర్డు పదవులకు రాజీనామా • రతన్ టాటా కుట్ర చేశారని ఆరోపణ • మరో వేదిక నుంచి పోరాటం చేస్తానని ప్రకటన ముంబై: దాదాపు ఎనిమిది వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ టాటా గ్రూప్ సంస్థల బోర్డుల్లో డైరెక్టర్ హోదా నుంచి సైరస్ మిస్త్రీ వైదొలిగారు. టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్ సహా ఆరు లిస్టెడ్‌కంపెనీల బోర్డుల నుంచి వైదొలుగుతున్నట్లు మిస్త్రీ వెల్లడించారు. తాత్కాలిక చైర్మన్ రతన్ టాటాపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ .. తన పోరును మరింత పెద్ద వేదిక నుంచి కొనసాగిస్తానని ప్రకటించారు. అసాధారణ సర్వసభ్య సమావేశాల వేదికల నుంచి దూరంగా వెళ్లగలిగితేనే.. సంస్కరణల అమలు, ఉద్యోగులు.. షేర్హోల్డర్లు, ఇతర వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యాల సాధనకు సమర్ధంగా పనిచేయడం సాధ్యపడుతుందనితాను భావిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రెండు పేజీల ప్రకటన, రికార్డు చేసిన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా హయాంలో .. ఎయిర్‌ఏషియాకు మరిన్ని నిధులు విడుదలచేయడం తదితర వివాదాస్పద డీల్స్ విషయాన్నీ ఆయన ప్రస్తావించారు. టాటా గ్రూప్ చైర్మన్‌గా తప్పించిన మిస్త్రీని బోర్డు పదవి నుంచి కూడా తొలగించే ప్రతిపాదనతో పలు టాటా గ్రూప్ కంపెనీలు వరుసగా అసాధారణసర్వ సభ్య సమావేశాలు (ఈజీఎంలు) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాటా ఇండస్ట్రీస్, టీసీఎస్ సంస్థలు ఆయన తొలగింపునకు ఆమోదముద్ర వేశాయి. ప్రక్షాళనకు పోరు కొనసాగిస్తా..: గవర్నెన్స్‌ను ప్రక్షాళన చేసేందుకు, కోల్పోయిన నైతిక ప్రమాణాలను పునరుద్ధరించేందుకు చేపట్టిన ఉద్యమంగా తన పోరును అభివర్ణించారు మిస్త్రీ. టాటా గ్రూప్ ప్రయోజనాలనుకాపాడేందుకు వేగగతిని, గేరును మార్చాల్సిన సమయం వచ్చిందని.. ప్రతి అంశాన్ని మరింత నిశితంగా పరిశీలించాల్సి ఉందని ఆయన చెప్పారు. అందుకే న్యాయం, చట్టం తూచా తప్పకుండా అమలయ్యే మరింత పెద్దవేదిక నుంచి పోరు కొనసాగించాలని నిర్ణయించుకున్నానని మిస్త్రీ పేర్కొన్నారు. టాటా గ్రూప్ దీర్ఘకాలిక ప్రయోజనాలను పరిరక్షించే విధంగానే తాను వ్యవహరిస్తున్నానని ఆయన చెప్పారు. వేదిక విషయంలో మిస్త్రీపూర్తిగా వివరణ ఇవ్వకపోయినప్పటికీ .. తన తొలగింపును సవాల్ చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించే ఆలోచన ఆయనకు ఉండి ఉండొచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తనంత తానుగా పక్కకుతప్పుకోవడం ద్వారా.. ఈ పోరు హోదా కోసం కాదు.. టాటా గ్రూప్ చిరకాలం వృద్ధి చెందేలా దీర్ఘకాలిక సంస్కరణల అమలు కోసమేనని తెలియజేయదల్చుకున్నట్లు మిస్త్రీ చెప్పారు. తనకు మద్దతుగా నిల్చినషేర్హోల్డర్లకు ధన్యవాదాలు తెలిపిన మిస్త్రీ.. సరైన చర్యలు తీసుకునేలా యాజమాన్యాన్ని ప్రశ్నించడం కొనసాగించాలని కోరారు. వ్యూహాత్మకంగానే మిస్త్రీ రాజీనామా: టాటా సన్స్ మెజారిటీ వాటాదారులు తనకు మద్దతుగా లేరన్నది గుర్తించే మిస్త్రీ రాజీనామా చేశారని, ఇది బాగా ఆలోచించుకుని అమలు చేసిన వ్యూహమని టాటా సన్స్ వ్యాఖ్యానించింది. మిస్త్రీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారం,విషపూరితమైనవని పేర్కొంది. వీటన్నింటికి తగు విధంగా జవాబు చెబుతామని తెలిపింది. మరోవైపు, టాటా సంస్థల నుంచి డైరెక్టర్‌గా మిస్త్రీ తప్పుకున్నప్పటికీ .. టాటాపై పోరు విషయంలో వెనక్కి తగ్గే యోచనేదీ నుస్లీవాడియాకి లేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంతా ఆయనే చేశారు... టాటా సన్స్ నుంచి తనను తొలగించిన తర్వాత రతన్ టాటా మళ్లీ తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడాన్ని మిస్త్రీ అక్రమ కుట్రగా అభివర్ణించారు. ’అక్టోబర్ 24నాటి అక్రమ కుట్రకు రతన్ టాటా తగు కారణాలుచూపుతారేమోనని ఎదురుచూస్తూ ఇప్పటికి 8 వారాలు గడిచిపోయింది. ఇంతవరకూ ఒక్కటీ కనిపించలేదు’ టాటా ట్రస్ట్‌కి చెందిన ట్రస్టీల చర్యల కారణంగా టాటా సన్స్‌లో గవర్నెన్స్ ఏ విధంగా దెబ్బతిన్నదీ తానుపత్రాలతో సహా షేర్‌హోల్డర్ల ముందు ఉంచానని చెప్పారు. ’ఇటీవలి వారాల్లో అత్యున్నత స్థాయిల్లో ఉన్న వారు వ్యవహరించిన తీరు నైతిక ప్రమాణాల విషయంలో వారి ముసుగును తొలగించాయి’ అన్నారు. -
టాటా టెలీ చైర్మన్‌గా మిస్త్రీ ఔట్!
-
టాటా టెలీ చైర్మన్‌గా మిస్త్రీ ఔట్!
ఈజీఎంలో ఏకగ్రీవంగా తీర్మానం ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీకి తాజాగా మరో టాటా గ్రూప్ కంపెనీ ఉద్వాసన పలికింది. డైరెక్టరు, చైర్మన్ హోదా నుంచి ఆయన్ను తొలగిస్తున్నట్లు టాటా టెలీసర్వీసెస్ తెలిపింది. బుధవారం నిర్వహించిన అసాధారణ వాటాదారుల సమావేశంలో(ఈజీఎం) టాటా సన్స్ ప్రతిపాదించిన తీర్మానానికి షేర్హోల్డర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు సంస్థ వివరించింది. దీంతో టాటా గ్రూప్ సంస్థల్లో మిస్త్రీని బోర్డు నుంచి తొలగించిన మూడో కంపెనీగా టాటా టెలీ నిల్చింది. ఇప్పటికే టాటా ఇండస్ట్రీస్, టీసీఎస్ ఆయనకు ఉద్వాసన పలకడం తెలిసిందే. మరోవైపు, టాటా గ్రూప్‌లో ప్రక్షాళనకు, గవర్నెన్స్ అమలుకు, వాటాదారుల హక్కుల పరిరక్షణ కోసం వివిధ వేదికల నుంచి పోరు కొనసాగిస్తానని మిస్త్రీ స్పష్టం చేశారు. టీసీఎస్ డైరెక్టరుగా తనను తొలగించడాన్ని ప్రస్తావిస్తూ.. దాదాపు 70% మంది నాన్ ప్రమోటర్ టీసీఎస్ షేర్హోల్డర్లు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడమో లేదా ఓటింగ్‌కు దూరంగా ఉండటమో జరిగిందన్నారు. ’నన్ను తొలగించే తీర్మానానికి వ్యతిరేకంగా 78% మంది రిటైల్ ఇన్వెస్టర్లు, దాదాపు 48% మంది సంస్థాగత ఇన్వెస్టర్లు ఓటు వేశారు’ అని ఆయన చెప్పారు. ఈ ఓటింగ్ ద్వారా గ్రూప్‌లో కార్పొరేట్ గవర్నెన్స్‌ను అమలు చేయాలన్న సూచన పెడచెవిన పెట్టరాదని మైనారిటీ షేర్హోల్డర్లు స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు మిస్త్రీ పేర్కొన్నారు. నానోపై రతన్ టాటాతో విభేదాలు: వాడియా కంపెనీ ఆర్థిక వనరులకు పెను భారంగా మారిన నానో కారు ప్రాజెక్టుపై టాటా గ్రూప్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటాకు, తనకు మధ్య తీవ్ర విభేదాలు ఉండేవని టాటా మోటార్స్ స్వతంత్ర డైరెక్టర్ నుస్లీ వాడియా వెల్లడించారు. నానోపై పెట్టుబడులు, నష్టాలు వేల కోట్ల రూపాయల స్థాయిలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. టాటా మోటార్స్ స్వతంత్ర డైరెక్టరుగా ఆయన తొలగింపునకు సంబంధించి ఈ నెల 26న ఈజీఎం జరగనున్న నేపథ్యంలో షేర్హోల్డర్లకు రాసిన లేఖలో వాడియా ఈ విషయాలు తెలిపారు. ’రూ. 1 లక్ష రేటుతో అమ్మే ఆలోచనతో 2008లో నానో కారు తెరపైకి వచ్చింది. కానీ ఇది టాటా మోటార్స్‌కు ఆర్థికంగా పెనుభారంగా మారింది. రూ. 2.25 లక్షల రేటు పెట్టినా కూడా కారు అమ్మకాలు లేవు. పోనీ అమ్ముడైనా కూడా కంపెనీకి గణనీయంగా నష్టమే మిగులుతోంది’ అని వాడియా చెప్పారు. వాణిజ్యపరంగా నానో విఫలం కావడంతో ఆ ప్రాజెక్టును కొనసాగించడాన్ని తాను గట్టిగా వ్యతిరేకించానని తెలిపారు. -
మిస్త్రీకి టీసీఎస్ టాటా..
• బోర్డు నుంచి ఉద్వాసనకు ఈజీఎంలో మెజారిటీ ఓటింగ్ • మిస్త్రీకి బాసటగా కొందరు షేర్హోల్డర్లు ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీని మిగతా గ్రూప్ సంస్థల బోర్డుల నుంచి కూడా సాగనంపే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మంగళవారం జరిగిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అసాధారణ సర్వ సభ్య సమావేశంలో (ఈజీఎం) సంస్థ డైరెక్టరుగా ఆయన్ను తొలగించే ప్రతిపాదనకు మెజారిటీ షేర్హోల్డర్లు అనుకూలంగా ఓటేశారు. మిస్త్రీ తొలగింపుపై మొత్తం 86.71 శాతం వాటాలున్న షేర్హోల్డర్లు ఓటింగ్ వేయగా.. 93.11 శాతం మంది అనుకూలంగా, 6.89 వ్యతిరేకంగాను ఓటు వేశారు. రిటైల్ ఇన్వెస్టర్లలో మాత్రం 78 శాతం మంది మిస్త్రీ తొలగింపును వ్యతిరేకిస్తూ ఓటు వేశారు. సైరస్ మిస్త్రీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా మాత్రం ఈజీఎం ఆసాంతం ఉన్నారు. టీసీఎస్ మధ్యంతర చైర్మన్ ఇషాత్ హుస్సేన్ ఈజీఎంకి సారథ్యం వహించకుండా పక్కకు తప్పుకోవడంతో ఆయన స్థానంలో స్వతంత్ర డైరెక్టర్ అమన్ మెహతా..సమావేశాన్ని నిర్వహించారు. మిస్త్రీ తొలగింపు అంశం కేవలం పని తీరుకు మాత్రమే సంబంధించినది కాదని.. ప్రమోటర్ గ్రూప్ టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ విశ్వాసాన్ని కోల్పోయినందుకే ఆ యన్ను తొలగించినట్లు మెహతా చెప్పారు. ఈ పరిస్థితుల్లో టీసీఎస్ బోర్డు నుంచి ఆయన తనంత తానుగా తప్పుకోవడమే కంపెనీకి శ్రేయస్కరమని మెహతా పేర్కొన్నారు. కారణాలు చెప్పాలన్న అదిల్ ఇరానీ టీసీఎస్‌లో టాటా సన్స్‌కి మెజారిటీ వాటాలు ఉన్నందున ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది అంతా ముందుగానే ఊహించినదే అయినా .. సమావేశంలో కొంత మంది షేర్హోల్డర్లు మిస్త్రీకి మద్దతుగా మాట్లాడటం గమనార్హం. దాదాపు 150 నిమిషాల పాటు సాగిన ఈజీఎంలో 38 మంది షేర్హోల్డర్లు మాట్లాడారు. వీరిలో చాలా మంది టాటాకే మద్దతు ప్రకటించారు. అయినప్పటికీ.. మిస్త్రీకి మద్దతుగా మాట్లాడిన వారికీ అభినందనలు దక్కాయి. అసలు మిస్త్రీని తొలగించడానికి సరైన కారణాలేమిటో చెప్పాలంటూ అదిల్ ఇరానీ తదితర షేర్హోల్డర్లు నిగ్గదీశారు. ’మీ డ్రైవర్నో, ఆఫీస్ బాయ్‌నో ఈ విధంగా తీసేస్తారా.. అలాంటిది మా చైర్మన్‌ను ఎందుకు తీసేశారు. సరైన కారణాలు చెప్పాలి’ అంటూ డిమాండ్ చేశారు. సమావేశంలో కొన్ని నాటకీయ పరిణామాలూ చోటు చేసుకున్నాయి. రతన్ టాటా ఆశయాల కోసం తాము ప్రాణత్యాగానికి కూడా సిద్ధమంటూ ఇద్దరు షేర్హోల్డర్లు పేర్కొన్నారు. టాటా గ్రూప్‌నకు ’టాటా’ వారసులే సారథ్యం వహించాలని కొందరు అభిప్రాయపడ్డారు. టాటా–మిస్త్రీ మధ్య పోరుతో 149 ఏళ్ల చరిత్ర గల గ్రూప్ ప్రతిష్ట మసకబారుతోందని మరో షేర్‌హోల్డరు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం కోసం పాకులాడటం లేదు: మిస్త్రీ టాటా ఇండస్ట్రీస్ బోర్డు నుంచి కూడా ఉద్వాసనకు గురైన మిస్త్రీ.. తాజాగా ఓటింగ్ సందర్భంగా టీసీఎస్ షేర్హోల్డర్లకు మిస్త్రీ లేఖ రాశారు. తాను అధికారం కోసం తాను పాకులాడటం లేదని, టాటా గ్రూప్ విలువలను కాపాడేందుకే పోరాడుతున్నానని ఆయన తెలిపారు. టీసీఎస్ బోర్డు నుంచి తనను తొలగించే ప్రతిపాదనకు సంబంధించి మనస్సాక్షికి అనుగుణంగా ఓటెయ్యాలని కోరారు. గడిచిన కొన్ని వారాలుగా గ్రూప్‌లో గుడ్ గవర్నెన్స్‌ను గాలికొదిలేశారని, ఇష్టారీతిగా వ్యవహరించడం.. వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్ద పీట వేయడం జరుగుతోందని మిస్త్రీ ఆరోపించారు. టాటా గ్రూప్ చైర్మన్‌గా మిస్త్రీని తొలగిస్తున్నట్లు అక్టోబర్ 24న టాటా సన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పలు గ్రూప్ సంస్థల బోర్డుల్లోని డైరెక్టర్ హోదా నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడానికి మిస్త్రీ నిరాకరించడంతో ఆయన్ను తప్పించే అంశంపై ఏడు గ్రూప్ సంస్థలు డిసెంబర్లో ఈజీఎంలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే టీసీఎస్ ఈజీఎం జరిగింది. దీని ఫలితాలు ఇతర గ్రూప్ కంపెనీల ఈజీఎంల మీద ప్రభావం చూపనుండటంతో ఈ పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీసీఎస్‌లో ప్రమోటర్లకు మెజారిటీ హోల్డింగ్స్ ఉన్నప్పటికీ.. ఈజీఎంలు నిర్వహించనున్న కొన్ని సంస్థల్లో కేవలం 28% వాటాలే ఉన్నాయి. దీంతో సంస్థాగత షేర్హోల్డర్లు ఎటు మొగ్గు చూపుతారన్నది కీలకంగా మారింది. టీసీఎస్‌లో విదేశీ ఇన్వెస్టర్లకు 17.02%, బీమా కంపెనీలకు 4.1%, మ్యూచువల్ ఫండ్స్.. దేశీ ఆర్థిక సంస్థలు.. బ్యాంకులకు 1.03% వాటాలు ఉన్నాయి. -
మిస్త్రీకి టాటా ఇండస్ట్రీస్ గుడ్‌బై
• డైరెక్టర్‌గా తొలగింపునకు ఓకే • నేడు టీసీఎస్ వాటాదారుల భేటీ ముంబై: టాటా గ్రూపు చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీని... టాటా ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్ పదవి నుంచి కూడా తొలగించారు. సోమవారం ముంబైలో జరిగిన టాటా ఇండస్ట్రీస్ ఈజీఎంలో వాటాదారులు ఓటు వేసి మిస్త్రీని డైరెక్టర్‌గా తొలగించినట్టు కంపెనీ ప్రకటించింది. ఆయన చైర్మన్ బాధ్యతలు కూడా ముగిసిపోయినట్టేనని స్పష్టంచేసింది. టాటా గ్రూప్ చైర్మన్‌గా తొలగించాక జరిగిన పరిణామాలతో... ఆయన్ను గ్రూపులోని అన్ని కంపెనీల నుంచీ బయటకు పంపటానికి టాటా సన్స్ ప్రయత్నిస్తోంది. దీనికోసం ఈ నెలలో పలు కంపెనీలు వాటాదారుల అత్యవసర సమావేశాలను నిర్వహిస్తున్నాయి కూడా. టీసీఎస్ మంగళవారం.. ఇండియన్ హోటల్స్ ఈనెల 20న, టాటా స్టీల్ 21న, టాటా మోటార్స్ 22న, టాటా కెమికల్స్ 23న, టాటా పవర్ 26న ఈజీఎంలు జరపనున్నాయి. ఇండియన్ హోటల్స్ దిశను మార్చా: మిస్త్రీ కాగా ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్‌లో డైరెక్టర్ పదవి నుంచి తొలగింపు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న సైరస్ మిస్త్రీ... వాటాదారుల మద్దతు కోరారు. ఐహెచ్‌సీఎల్ టర్న్ అరౌండ్ అయ్యేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నానని, వీటి ఫలాలు భవిష్యత్తులో కనిపించనున్నాయని వాటాదారులకు వివరించే ప్రయత్నం చేశారు. డైరెక్టర్ పదవి నుంచి మిస్త్రీని తొలగించేందుకు ఐహెచ్‌సీఎల్ ఈ నెల 20న ఈజీఎం నిర్వహించనున్న విషయం తెలిసిందే. -
మిస్త్రీకి మరో షాక్!
ముంబై: టాటా గ్రూప్ ఛైర్మన్ గా తొలగించబడిన సైరస్ మిస్త్రీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛైర్మన్ గా తొలగించబడిన తరువాత ఆయన అధికారాలకు, పదవులకు చెక్ పెడుతున్న సంస్థ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. టాటా గ్రూపుకు చెందిన టాటా ఇండస్ట్రీస్ డైరెక్టర్ పదవి నుంచి కూడా తొలగించింది. ఈ మేరకు సోమవారం జరిగిన షేర్ హోల్డర్స్ సమావేశంలో నిర్ణయం జరిగింది. టాటా ఇండస్ట్రీస్ అసాధారణ సర్వ సభ్య సమావేశంలో (ఈజీఎం) ఆయన్ను డైరెక్టర్ గా తొలగిస్తూ నిర్ణయం జరింగింది. మిస్త్రీ తొలగింపుకు అనుకూలంగా వాటాదారులు ఓటు వేశారు. ఆయన డైరెక్టర్ గా కొనసాగితే టాటా గ్రూపు మరింత విచ్ఛిన్నమవుతుందని పేర్కొన్న సంస్థ ఆయన్ను తొలగించాల్సిందిగా వాటాదారులకు విజ్ఞప్తి చేసింది. అలాగే రానున్న రోజుల్లో మిస్త్రీ తొలగింపు కోసం మరో ఆరు టాటా గ్రూపులు సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందే ఆయన్ను టాటా ఇండస్ట్రీస్ ఛైర్మన్ గా తొలగించారు. తాజాగా డైరెక్టర్ పదవి నించి కూడా తొలగించిన టాటా సంస్థ మిస్త్రీపై మరింత పట్టు సాధించింది. కాగా టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీపై గ్రూప్ కంపెనీలు కూడా వేటువేస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీల చైర్మన్‌గా బోర్డు సభ్యుడిగా ఆయన్ని తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైరస్ మిస్త్రీ ఇక షేర్‌హోల్డర్స్ మద్దతుపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. -
సైరస్ మిస్త్రీపై టాటా సంచలన ఆరోపణలు
తప్పుదోవ పట్టించి చైర్మన్ అయినట్టు ఆరోపణ దేశంలో అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకటైన టాటా కంపెనీలో బోర్డ్‌రూమ్ సంగ్రామం ఇంకా కొనసాగుతూనే ఉంది. టాటా సన్స్ చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీపై టాటా గ్రూప్ సంచలన ఆరోపణలు చేసింది. రతన్ టాటా వారసుడి విషయంలో సెలెక్టర్లను తప్పుదోవ పట్టించి మిస్త్రీ చైర్మన్‌గా ఎన్నికయ్యారని, ఆయన తన వాగ్దానాలను నిలబెట్టుకోలేదని, కంపెనీ అధికారాలన్నింటినీ తన చేతుల్లోకి తీసుకోవడంపైనే దృష్టిపెట్టిన మిస్త్రీ.. తనకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరిచి మేనేజమెంట్ స్ట్రక్చర్‌ను బలహీనపరిచారని ఆరోపించింది. టాటా గ్రూప్‌కు చెందిన కీలక లిస్టెడ్ కంపెనీల బోర్డు నుంచి మిస్త్రీని తొలగించేందుకు మరికొన్నిరోజుల్లో వాటాదారుల సమావేశం జరగనున్న నేపథ్యంలో మిస్త్రీపై విశ్వాసం సన్నగిల్లి.. ఆయనకు ఉద్వాసన పలుకడానికి కారణమైన కీలక వాస్తవాలు వెలుగులోకి తెస్తున్నట్టు టాటా సన్స్ తన తాజా లేఖలో తెలిపింది. రతన్‌టాటా వారసుడిగా టాటా సన్స్ చైర్మన్ ఎంపిక కోసం 2011లో ఏర్పాటుచేసిన సెలక్షన్ కమిటీని మిస్త్రీ తప్పుదోవ పట్టించారని, టాటా గ్రూప్ గురించి తన ప్రణాళికలపై ఆడంబర ప్రకటనలు చేశారని, టాటా గ్రూప్ కోసం విస్తారమైన మేనేజ్మెంట్ స్ట్రక్చర్‌ను ఏర్పాటుచేస్తానని, గ్రూప్‌కు ఉన్న విభిన్న వ్యాపారాల నేపథ్యంలో అధికార, బాధ్యతల విభజన కోసం మేనేజ్మెంట్ నిర్మాణాన్ని మారుస్తానని ఆయన చెప్పుకొచ్చారని, ఈ ప్రకటనలే మిస్త్రీని చైర్మన్‌గా ఎంపిక చేయడానికి ప్రధాన కారణమని, కానీ వాస్తవానికి నాలుగేళ్లు అయినా మేనేజ్మెంట్ స్ట్రక్చర్ విషయంలో ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని, కాబట్టి ఇది సెలక్షన్ కమిటీని తప్పుదోవ పట్టించడమేనని టాటా సన్స్ పేర్కొంది. -
నాకు సపోర్టు ఇవ్వండి ప్లీజ్ : మిస్త్రీ
న్యూఢిల్లీ : టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీపై గ్రూప్ కంపెనీలు కూడా వేటువేస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీల చైర్మన్‌గా బోర్డు సభ్యుడిగా ఆయన్ని పీకేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైరస్ మిస్త్రీ ఇక షేర్‌హోల్డర్స్ మద్దతుపై దృష్టిసారించారు. టాటా పవర్ బోర్డు నుంచి తనను పీకేయకుండా ఉండేందుకు వారి మద్దతును కోరారు. బోర్డు నుంచి తనను వైదొలగించే ప్రతిపాదనను వ్యతిరేకించాలని అభ్యర్థిస్తూ ఆయన షేర్హోల్డర్స్కు ఓ లేఖ రాశారు. తన కాలంలో టాటా పవర్, పోటీదారులకంటే మెరుగైన ప్రదర్శనను కనబరిచిందని మిస్త్రీ ఆ లేఖలో పేర్కొన్నారు. గత మూడేళ్లలో ఈబీఐటీడీఏలు మెరుగుపడ్డాయని, దేశీయ పవర్ సెక్టార్లో కంపెనీకి పునఃరేటింగ్ కల్పించానని చెప్పారు. 2006లో మిస్త్రీ సన్స్ బోర్డులో చేరారు. తర్వాత 2012 డిసెంబర్లో బోర్డు చైర్మన్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన టాటా పవర్ చైర్మన్‌గా ఉన్నారు. కాగ, సైరస్ మిస్త్రీని బోర్డు నుంచి తొలగించడానికి టాటా పవర్ కంపెనీ 2016 డిసెంబర్ 26న అసాధారణ జనరల్ మీటింగ్ నిర్వహిస్తోంది. ఈ భేటీలో సైరస్ మిస్త్రీని బోర్డు నుంచి వైదొలగించే ప్రతిపాదనను తీసుకొస్తోంది. -
నమ్మకం పోగొట్టుకున్నందుకే మిస్త్రీపై వేటు
ముంబై: దిగ్గజ గ్రూప్‌ను ముందుకు నడిపించే విషయంలో సైరస్ మిస్త్రీపైనా, ఆయన సామర్ధ్యంపైనా నమ్మకం కోల్పోయినందునే బోర్డు ఉద్వాసన పలికిందని టాటా సన్స తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానించారు. బోర్డుకు, మిస్త్రీకి మధ్య ఉన్న సత్సంబంధాలు క్రమంగా చెడ్డాయని, సరిదిద్దుకునేందుకు అనేక అవకాశాలు ఇచ్చినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. మిస్త్రీ ఉద్వాసనకు ఇది కూడా కారణమన్నారు. డెరైక్టర్‌గా మిస్త్రీని తొలగించే ప్రత్యేక తీర్మానానికి మద్దతు కూడగట్టే దిశగా షేర్హోల్డర్లకు రాసిన లేఖలో రతన్ టాటా ఈ విషయాలు వివరించారు. ఉద్వాసనకు గురైన వ్యక్తిని బోర్డు పదవుల్లో కొనసాగించడం వల్ల గ్రూప్ కంపెనీల కార్యకలాపాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ’డెరైక్టరుగా ఆయన రాజీనామా చేసి ఉంటే బాగుండేది. దురదృష్టవశాత్తూ ఆయన ఇంకా చేయలేదు. డెరైక్టరు హోదాలో ఆయన అలాగే కొనసాగడం ఆయా కంపెనీల బోర్డులపై విధ్వంసక ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధాన ప్రమోటర్ అయిన టాటా సన్సని ఆయన బాహాటంగానే విరోధిస్తున్న నేపథ్యంలో కంపెనీ పనితీరు దెబ్బతినవచ్చు’ అని రతన్ టాటా పేర్కొన్నారు. చైర్మన్ హోదా నుంచి తనంతట తానే వైదొలిగేందుకు మిస్త్రీకి అవకాశం కల్పించినప్పటికీ, ఆయన తోసిపుచ్చారని టాటా వివరించారు. మిస్త్రీ తొలగింపు అంశంపై నిర్ణయానికి సంబంధించి టాటా గ్రూప్‌నకు చెందిన ఆరు సంస్థలు ఈ నెలలో అసాధారణ సర్వ సభ్య సమావేశాలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
టాటా గ్రూప్ ఏ ఒక్కరిదో కాదు..
అది వాటాదారులందరిదీ ట్రస్ట్‌ల వ్యవహారంపై జోక్యం చేసుకోండి ప్రభుత్వాన్ని కోరిన సైరస్ మిస్త్రీ టీసీఎస్ ఈజీఎం నేపథ్యంలో వాటాదారులకు మిస్త్రీ లేఖ ముంబై: టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ... టాటాలపై ముఖ్యంగా రతన్‌టాటాపై పోరును మరింత ఉధృతం చేశారు. టాటా ట్రస్ట్ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 10 వేల కోట్ల డాలర్ల టాటా సామ్రాజ్యానికి హోల్డింగ్ కంపెనీ అరుున టాటా సన్సను టాటా ట్రస్టే నిర్వహిస్తోంది. ‘‘నిర్ణయాధికారం ఒక్క మనిషి చేతిలో ఉండటమనేది మంచిది కాదు. ఇలాంటి అధిష్టానం నీతిబాహ్యం, మోసపూరితం’’ అని ఆయన తీవ్రంగా విమర్శించారు. టాటా గ్రూప్ ఏ ఒక్కరిదో కాదని, అది వాటాదరులందరికీ చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ‘‘టాటా గ్రూప్ ఏ ఒక్క వ్యక్తి సొత్తూ కాదు. టాటా ట్రస్ట్‌ల ట్రస్టీలదో, టాటా సన్స డెరైక్టర్లదో లేదా టాటా కంపెనీలను నిర్వహిస్తున్న ఆయా కంపెనీల డెరైక్టర్లదో కాదు. అది టాటా గ్రూప్ వాటాదారులందరిదీ’’ అని ఆయన పేర్కొన్నారు. 20 లక్షలకు పైగా మైనారిటీ వాటాదారులకు రాసిన లేఖలో ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. ఇష్టానుసారం రతన్ టాటా నిర్ణయాలు.. టీసీఎస్ నుంచి మిస్త్రీని డెరైక్టర్ల బోర్డ్ నుంచి తొలగించడానికి ఈ నెల 13న టీసీఎస్ అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని (ఈజీఎమ్) నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన వాటాదారులకు ఒక లేఖ రాశారు. రతన్ టాటా బాధ్యత లేకుండా తన చిత్తానుసారం నిర్ణయాలు తీసుకున్నారని లేఖలో మిస్త్రీ విమర్శించారు. పరిణామాల గురించి ఆలోచించకుండా రతన్ టాటా పలు తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. పరోక్షంగా వ్యక్తిగత ప్రయోజనాలు పొందే నిర్ణయాలపై నియంత్రణ ఉండాల్సిన అవసరముందన్నారు. టాటా సన్‌సలో మిస్త్రీ కుటుంబానికి 18.4 శాతం వాటా ఉండగా, దాన్లో 66 శాతానికి పైగా వాటాలున్న వివిధ టాటా ట్రస్ట్‌లకు రతన్ టాటా జీవిత కాల చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించండి గ్రూప్ కంపెనీలపై టాటా ట్రస్ట్ల్లోని నామినీ డెరైక్టర్లకున్న వీటో అధికారాలను రతన్ టాటా దుర్వినియోగం చేశారని మిస్త్రీ విమర్శించారు. ఇటీవలి పరిణామాల కారణంగా టాటా ట్రస్ట్‌లు, టాటా సన్సల్లో గవర్నెన్స పూర్తిగా స్తంభించిపోరుుందని తెలిపారు. ‘‘టాటా మోటార్స్‌కు ఉత్పాదకతతో కూడిన ప్రోత్సాహకాలివ్వాలనే నా కీలకమైన సంస్కరణను రతన్ టాటా తుంగలో తొక్కారు. వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి కాకుండా ఇంటా బయటా వస్తున్న ప్రమాదాల నుంచి టాటా గ్రూప్‌ను రక్షించడానికే నేను పనిచేశా. నా నాలుగేళ్ల చైర్మన్ పదవీ కాలంలో మీడియాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. చైర్మన్‌గా పనిచేసిన కాలం నాకు సంతృప్తికరంగా ఉంది. మంచి ఫలితాలు వచ్చారుు’’ అని మిస్త్రీ పేర్కొన్నారు. వాటాదారులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా, స్పష్టంగా వెల్లడించాలంటూ ఈ లేఖను ఆయన ముగించారు. నష్టాలకు మిస్త్రీయే బాధ్యుడు: టాటా సన్స్ టాటా సన్స ట్రస్ట్‌ల గవర్నెన్స సవ్యంగా లేదంటూ సైరస్ మిస్త్రీ చేసిన ఆరోపణలను టాటా సన్స తోసిపుచ్చింది. జెంషెడ్జీ టాటా, ఆయన ఇరువురి కుమారులు, దొరాబ్జి టాటా, రతన్జీ టాటా, ఇతర వ్యవస్థాపకుల ఆశయాలకనుగుణంగానే టాటా ట్రస్ట్‌లు పనిచేస్తున్నాయని టాటా సన్స పేర్కొంది. గ్రూప్ కంపెనీలకు భారీగా ఆర్థిక నష్టాలు రావడానికి సైరస్ మిస్త్రీయే కారణమని విమర్శించింది. టాటా సన్స చైర్మన్ అరుున తర్వాత సైరస్ మిస్త్రీ టాటా గ్రూప్‌ను సొంత సామ్రాజ్యంగా మార్చుకున్నారని, ఏక్షపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని దాడి చేసింది. సైరస్కు ఐఎస్ఎస్ బాసట.. కాగా టీసీఎస్, ఇతర టాటా గ్రూప్ కంపెనీల నుంచి డెరైక్టర్‌గా సైరస్ మిస్త్రీని తొలగించడానికి వ్యతిరేకంగా వాటాదారులు ఓటు వేయాలని గ్లోబల్ ప్రాక్సీ సలహా సంస్థ ఐఎస్ఎస్ కోరింది. మిస్త్రీని తొలగించడానికి టాటా సన్స సరైన ఆధారాలు చూపలేకపోరుుందని అభిప్రాయపడింది. మరోవైపు మరో రెండు ప్రాక్సీ అడ్వైజరీ సంస్థలు-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ (ఐఐఏఎస్), ఎస్ఈఎస్లు మాత్రం మిస్త్రీని తొలగించే ప్రతిపాదనకే ఓటు వేయాలని మైనారిటీ వాటాదారులను కోరారుు. -
గతవారం బిజినెస్
టాటా స్టీల్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీ ఔట్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని టాటా స్టీల్ డెరైక్టర్ల బోర్డు తొలగించింది. శుక్రవారం ఈ మేరకు టాటా స్టీల్ స్టాక్ ఎక్స్చేంజీలకు అందించిన సమాచారంలో వెల్లడిస్తూ, మిస్త్రీ స్థానంలో స్వతంత్ర డెరైక్టర్ ఓపీ భట్‌ను తాత్కాలిక చైర్మన్‌గా బోర్డు నియమించినట్లు తెలిపింది. కంపెనీ ప్రమోటింగ్ సంస్థ అరుున టాటా సన్స నుంచి అందుకున్న ప్రత్యేక నోటీసు ప్రకారం నవంబర్ 25న తమ డెరైక్టర్ల బోర్డు సమావేశమై ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు టాటా స్టీల్ పేర్కొంది. ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐకి గతంలో చైర్మన్‌గా వ్యవహరించిన ఓపీ భట్...తమ తదుపరి జరిపే అత్యవసర సర్వసభ్య సమావేశం వరకూ పదవిలో కొనసాగుతారని కంపెనీ తెలిపింది. మూడోసారి వేలానికి ’కింగ్‌ఫిషర్’ భవనం కింగ్‌ఫిషర్ ఎరుుర్‌లైన్‌సకు భారీగా అప్పులిచ్చి పీకల్లోతు ఇరుక్కుపోరుున 17 బ్యాంకుల కన్సార్టియమ్, ఆ సంస్థకు చెందిన ముంబైలోని ప్రధాన కార్యాలయ భవనాన్ని మూడోసారి వేలానికి పెడుతోంది. ఈ సారి రిజర్వ్ ధరను 15% తగ్గించి రూ.115 కోట్లుగా నిర్ణరుుంచారు.ముంబైలోని విమానాశ్రయం సమీపంలో ప్లష్ విలేపార్లేలో ఇది ఉంది. 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం వేలం వచ్చే నెల 19న జరగనుంది. రికార్డు కనిష్టానికి రూపారుు డీమానిటైజేషన్ తదితర పరిణామాల నేపథ్యంలో రూపారుు పతనం కొనసాగుతోంది. గురువారం ఇంట్రా డేలో డాలర్‌తో పోలిస్తే రూపారుు మారకం విలువ 68.86 స్థారుుకి పడిపోరుుంది. ఇప్పటిదాకా 2013 ఆగస్టు 28 ఇంట్రాడేలో నమోదైన 68.85 స్థాయే ఆల్‌టైమ్ కనిష్టంగా ఉంది. ఆ రోజున దేశీ కరెన్సీ 68.80 వద్ద ముగిసింది. ఇటు పెద్ద నోట్ల రద్దు, అటు సమీప భవిష్యత్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు తదితర పరిణామాలు రూపారుు పతనానికి దారి తీస్తున్నాయని పరిశీలకులు పేర్కొన్నారు. భారత్‌లో సంపద అసమానత్వం అధికం భారత్‌లో సంపద విషయమై అసమానత్వం అధికంగా ఉందని గ్లోబల్ వెల్త్ రిపోర్ట్-2016 తెలిపింది. మొత్తం జనాభాలో ఒక్క శాతం మంది దగ్గరే మొత్తం సంపదలో 60 శాతం ఉందని క్రెడిట్ సూచీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన ఈ నివేదిక పేర్కొంది. భారత్‌లో సంపన్న పేదరికం ఉందని వివరించింది. జనాభాలో 96 శాతం మందికి పైగా పదివేల డాలర్లు (రూ.6,80,000)లోపు సంపద ఉన్నవారేనని పేర్కొంది. ప్రపంచ దేశాల్లో సంపద విషయంలో అసమానత్వం అధికంగా ఉన్న రెండో దేశం భారత్ అని వివరించింది. భారత్‌లో సంపద పెరుగుతున్నా, ఈ వృద్ధిలో అందరికి భాగస్వామ్యం ఉండడం లేదని పేర్కొంది. జీడీపీలో మొబైల్ రంగం వాటా 8.2%! దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో మొబైల్ రంగం వాటా 2020 నాటికి 8.2 శాతానికి చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక విభాగం, టెలికం శాఖలు సంయుక్తంగా ఓ నివేదికలో తెలిపారుు. ప్రస్తుతం జీడీపీలో ఈ రంగం తోడ్పాటు 6.5 శాతం (140 బిలియన్ డాలర్లు/రూ.9.38 లక్షల కోట్లు)గా ఉందని... 40 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందని పేర్కొన్నారుు. మొబైల్ తయారీ యూనిట్లు గత రెండేళ్లలో 38,300 ఉద్యోగాలను అందించినట్టు పేర్కొంది. 2014 ఏప్రిల్ నుంచి 2016 మార్చి మధ్య కాలంలో టెలికం రంగంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 4.19 బిలియన్ డాలర్లు (రూ.28,000 కోట్లు)గా ఉన్నట్టు తెలిపింది. ఎస్బీఐ బల్క్ డిపాజిట్ల రేట్లు 1.9% తగ్గింపు బల్క్ డిపాజిట్ల రేట్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.9 శాతం వరకూ తగ్గించింది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో డిపాజిట్లు భారీగా వచ్చిన నేపథ్యంలో రూ.1-10 కోట్ల బల్క్ డిపాజిట్ల రేట్లను తగ్గించామని ఎస్బీఐ తెలిపింది. 18-210 రోజుల డిపాజిట్లపై రేట్లను 5.75 శాతం నుంచి 3.85 శాతానికి, ఏడాది నుంచి 455 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై రేట్లను 6 శాతం నుంచి 4.25 శాతానికి, ఏడు రోజుల నుంచి 45 రోజుల డిపాజిట్లపై రేట్లను 5 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గించామని ఎస్బీఐ తెలిపింది. ఎరుుర్‌టెల్ పేమెంట్ బ్యాంకు షురూ! టెలికం రంగంలో దేశీయ అగ్రగామి కంపెనీ అరుున భారతీ ఎరుుర్‌టెల్ పేమెంట్ బ్యాంకు సేవల్లోకి అడుగుపెట్టింది. ఎరుుర్‌టెల్ పేమెంట్ బ్యాంకు పేరుతో రాజస్థాన్‌లో ప్రయోగాత్మకంగా బుధవారం సేవల్ని ప్రారంభించింది. దేశంలో పేమెంట్ బ్యాంకు సేవలు ప్రారంభించిన తొలి కంపెనీ ఇదే. కస్టమర్లు రాజస్థాన్ వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 10 వేల ఎరుుర్‌టెల్ అవుట్లెట్లలో ఇక బ్యాంకు ఖాతాలు ప్రారంభించవచ్చని కంపెనీ తెలిపింది. ఎరుుర్‌టెల్ అవుట్లెట్లు బ్యాంకింగ్ కేంద్రాలుగా పనిచేస్తాయని, ఖాతాల ప్రారంభం, నగదు డిపాజిట్, విత్‌డ్రా సేవలు అందిస్తాయని పేర్కొంది. ⇔ 2,071 మంది.. 3.89 లక్షల కోట్లు బకారుులు దేశంలో 2,071 మంది పారిశ్రామిక వేత్తలకు ఇచ్చిన రూ.3,88,919 కోట్ల రుణాలు వసూలు కాని మొండి బకారుులు (ఎన్పీఏ)గా మారినట్టు కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ రాజ్యసభకు మంగళవారం వెల్లడించారు. ఈ పారిశ్రామిక పెద్దలు ఒక్కొక్కరు రూ.50 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకున్నవారేనని తెలిపారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి రూ.50 కోట్లకు మించిన ఎన్పీఏ ఖాతాలు 2,071గా ఉన్నాయని పేర్కొన్నారు. డీల్స్.. ⇔ మొబిక్విక్ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)తో ఒప్పందం చేసుకుంది. దేశవ్యాప్తంగా 391 టోల్ ప్లాజాల వద్ద తమ కస్టమర్లు మొబిక్విక్ వ్యాలెట్ ద్వారా టోల్ రుసుములు చెల్లించవచ్చని సంస్థ తెలిపింది. అతి త్వరలోనే ఈ సేవలు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. ⇔ అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్‌నకు (అడాగ్) చెందిన టీవీ చానళ్లను సుభాష్ చంద్రకు చెందిన జీగ్రూప్ కొనుగోలు చేయనుంది. ఎంటర్టైన్మెంట్ టీవీ చానళ్లలో 100% వాటాతో పాటు రిలయన్స రెడియో వ్యాపారంలో 49% వాటాను కూడా అడాగ్ విక్రరుుస్తోంది. ఈ డీల్ విలువ రూ.1,900 కోట్లు. ⇔ దేశీ ఫార్మా అగ్రగామి సన్ ఫార్మా.. రష్మా కంపెనీ జేఎస్సీ బయోసింటెజ్‌ను కొనుగోలు చేసింది. బయోసింటెజ్‌లో 85.1% వాటాను చేజిక్కించుకుంటున్నామని.. ఇందుకోసం 2.4 కోట్ల డాలర్లను చెల్లిస్తున్నట్లు సన్ ఫార్మా తెలిపింది. అదేవిధంగా ఆ కంపెనీకి చెందిన 3.6 కోట్ల డాలర్ల రుణాన్ని కూడా తామే భరించాల్సి వస్తుందని వెల్లడించింది. దీనిప్రకారం చూస్తే... మొత్తం డీల్ విలువ 6 కోట్ల డాలర్లు(దాదాపు రూ.400 కోట్లు)గా లెక్కతేలుతోంది. -
మిస్త్రీకి ఇక దేవుడే దిక్కేమో!
అహ్మదాబాద్ : టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా ఉద్వాసనకు గురవ్వడం... తదుపరి జరిగిన పరిణామాలతో గ్రూప్‌లోని మిగతా కంపెనీలు టాటా వపర్, టాటా కెమెకిల్స్, టాటా స్టీల్లూ సైరస్ మిస్త్రీని చైర్మన్‌గా తొలగించడం ఆయన్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందేమో. ప్రశాంతత కోసం ఇక ఆయన ఆలయాల బాట పట్టారు. నిన్న జరిగిన టాటాస్టీల్ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఆయన, ఆ కంపెనీ చైర్మన్‌గా ఉద్వాసనకు గురయ్యారు. ఆ సమావేశం అనంతరం వెంటనే మిస్త్రీ షిర్టీలోని సాయిబాబా టెంపుల్, శని శింగనాపూర్ దేవస్థానాలను దర్శించుకునేందుకు వెళ్లారు. టాటాస్టీల్ బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతరం మొదట షిర్డీలోని సాయిబాబా టెంపుల్‌ను దర్శించుకున్నారు. భార్యతో కలిసి ఆయన ఈ ఆలయానికి వెళ్లారు. వారు సాయిబాబా సమాధిని, విగ్రహాన్ని దర్శించుకుని, టెంపుల్ ప్రసాదాన్ని స్వీకరించినట్టు ఆలయ అధికారప్రతినిధి మోహన్ యాదవ్ తెలిపారు. అనంతరం షిర్డీ సాయిబాబా టెంపుల్‌కు 30 నిమిషాల వ్యవధి దూరంలో ఉన్న శని శింగనాపూర్ దేవస్థానానికి వెళ్లారు. ఆలయంలో వారు పూజలు చేయించుకుని, శని దేవుడికి అభిషేకం నిర్వహించినట్టు అక్కడి అధికార ప్రతినిధి పేర్కొన్నారు. -
టాటా స్టీల్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీ తొలగింపు
న్యూఢిల్లీ: చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని టాటా స్టీల్ డెరైక్టర్ల బోర్డు తొలగించింది. శుక్రవారం ఈ మేరకు టాటా స్టీల్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారంలో వెల్లడిస్తూ, మిస్త్రీ స్థానంలో స్వతంత్ర డెరైక్టర్ ఓపీ భట్‌ను తాత్కాలిక ఛైర్మన్‌గా బోర్డు నియమించినట్లు తెలిపింది. కంపెనీ ప్రమోటింగ్ సంస్థ అరుున టాటా సన్స నుంచి అందుకున్న ప్రత్యేక నోటీసు ప్రకారం నవంబర్ 25న తమ డెరైక్టర్ల బోర్డు సమావేశమై ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు టాటా స్టీల్ పేర్కొంది. ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐకి గతంలో చైర్మన్‌గా వ్యవహరించిన ఓపీ భట్...తమ తదుపరి జరిపే అత్యవసర సర్వసభ్య సమావేశం (ఈజీఎం) వరకూ ఈ పదవిలో కొనసాగుతారని కంపెనీ తెలిపింది. కంపెనీ డెరైక్టర్ల పదవుల నుంచి సైరస్ మిస్త్రీని, నుస్లీ వాడియాని తొలగించేందుకు ఉద్దేశించిన ఈజీఎం డిసెంబర్ 21న జరుగుతుంది. టాటా స్టీల్‌లో ప్రధాన ప్రమోటరైన టాటా సన్సకు 29.75 శాతం వాటా వుంది. -
టీసీఎస్ చేజారిపోయేది..!
• రతన్ టాటా కంపెనీని అమ్మాలని చూశారు... • రెట్టింపు వ్యయంతో కోరస్ కొనుగోలు • ఈగో కారణంగా చెత్త నిర్ణయాలు... • సైరస్ మిస్త్రీ తీవ్ర విమర్శలు... ముంబై: టాటా గ్రూపు చైర్మన్ రతన్ టాటాను లక్ష్యంగా చేసుకుని ఆ గ్రూపు మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మంగళవారం పలు తీవ్ర విమర్శలు చేశారు. టాటా గ్రూపునకు పాడి ఆవులుగా ఉన్న టీసీఎస్, జేఎల్ఆర్ విషయంలో తాను చేసిందేమీ లేదంటూ టాటా గ్రూపు మాతృ సంస్థ టాటా సన్స చేసిన ఆరోపణలను ఖండించిన మిస్త్రీ, రతన్‌టాటా విధానాలను ఎండగట్టారు. ఒకప్పుడు ఇదే పాడి ఆవు అరుున టీసీఎస్‌ను రతన్ టాటా ఐబీఎంకు విక్రరుుంచే ప్రయత్నం చేశారని బయటపెట్టారు. ఆయన ఈగో చెత్త నిర్ణయాలకు దారి తీసిందని, బ్రిటన్ స్టీల్ దిగ్గజం కోరస్‌ను రెట్టింపు ధరకు కొనుగోలు చేయడం, సీడీఎంఏ టెలికం వ్యాపారాన్ని అంటి పెట్టుకుని ఉండడం ఇందులో భాగమేనని మిస్త్రీ విమర్శించారు. టీసీఎస్, జేఎల్ఆర్ విజయానికి మిస్త్రీ నిజంగా పాటు పడలేదని, ఇవి రతన్ టాటా కృషి ఫలితంగానే పురోగమించి వారసత్వంగా మిస్త్రీకి అందివచ్చాయని, వాటి అద్భుత పనితీరు తన గొప్పతనంగా మిస్త్రీ చెప్పుకునేందుకు వీల్లేదంటూ టాటా సన్స ఈ నెల 10న లేఖను విడుదల చేసిన విషయం విదితమే. దీనికి ప్రతిగా మిస్త్రీ కార్యాలయం ఐదు పేజీల లేఖను తాజాగా విడుదల చేసింది. టీసీఎస్, జేఎల్ఆర్ (టాటా మోటార్స్‌లో భాగం) విషయంలో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మిస్త్రీ చేసిన ప్రయత్నాలను ఇందులో పేర్కొంది. ఈ రెండు కంపెనీల విజయం వెనుక ఎఫ్‌సీ కోహ్లీ, ఎన్ చంద్రశేఖరన్ (టీసీఎస్)... రాల్ఫ్ స్పెత్, రవికాంత్ (జెఎల్ఆర్) కృషే కారణమని స్పష్టం చేసింది. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మిస్త్రీ వ్యూహాత్మక మార్గదర్శనం చేశారని వివరించింది. టీసీఎస్ కోసం ప్రపంచవ్యాప్తంగా 60 మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో ఆయన భేటీ అయ్యారని తెలిపింది. నాలుగేళ్ల మిస్త్రీ హయాంలో టీసీఎస్ నగదు నిల్వలు రెట్టింపై రూ.20,500 కోట్లకు చేరాయని వెల్లడించింది. జేఎల్ఆర్ విషయంలో ఈ రోజు తీసుకున్న నిర్ణయాల ప్రభావం భవిష్యత్తులో కనిపిస్తుందని పేర్కొంది. గ్రూపు మొత్తం లాభంలో ఈ రెండింటి ద్వారానే 90 శాతం సమకూరుతున్న విషయం గమనార్హం. కోహ్లీ అనారోగ్యమే టీసీఎస్‌ను కాపాడింది రతన్ టాటా టీసీఎస్‌ను ఐటీ దిగ్గజం ఐబీఎంకు విక్రరుుంచే ప్రయత్నం చేశారని మిస్త్రీ దుయ్యబట్టారు. టీసీఎస్ వ్యవస్థాపక చైర్మన్ అరుున ఎఫ్‌సీ కోహ్లీ అనారోగ్యమే రతన్ టాటా ప్రతిపాదనను జేఆర్డీ టాటా అమలు చేయకుండా ఆపిందన్నారు. ‘‘ఐబీఎంతో టాటా ఇండస్ట్రీస్‌కు ఉన్న జారుుంట్ వెంచర్‌కు రతన్ టాటా అధిపతిగా ఉన్న సమయంలో ఐబీఎం టీసీఎస్‌ను కొనుగోలు చేస్తుందన్న ప్రతిపాదనను జేఆర్డీ టాటా ముందుంచారు. అరుుతే, అప్పుడు కోహ్లీ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నందున రతన్ టాటా ప్రతిపాదనపై చర్చించేందుకు జేఆర్డీ టాటా నిరాకరించారు’’ అని మిస్త్రీ కార్యాలయం వెల్లడించింది. అరుుతే, దేశీయ సాఫ్ట్వేర్ రంగానికి ఆద్యుడైన కోహ్లీ టీసీఎస్ విక్రయ ప్రతిపాదనను తిరస్కరించారని, బంగారు భవిష్యత్తు ఉన్నందున టాటా గ్రూపు దాన్ని విక్రరుుంచవద్దని స్పష్టం చేశారని తెలిపింది. దీంతో ఆ ప్రతిపాదనను జేఆర్డీ టాటా తోసిపుచ్చారని... రతన్‌టాటా వల్ల టీసీఎస్ మరణానికి దగ్గరగా వెళ్లొచ్చిన సందర్భం ఇదని అభివర్ణించింది. టాటా, ఐబీఎం చెరిసగం వాటాతో 1992లో జారుుంట్ వెంచర్‌ను ఏర్పాటు చేయగా 1999లో విడిపోయారుు. వన్‌మ్యాన్ ఇగో... ఈ లేఖలో ఓ భాగాన్ని ‘ఒక వ్యక్తి ఇగో వర్సెస్ ఓ సంస్థ’గా పేర్కొంటూ... టాటాల ఇగో ఫలితం కోరస్‌ను 12 బిలియన్ డాలర్లకు (రూ.80 వేల కోట్లు సుమారు) కొనుగోలు చేయడమని పేర్కొంటూ... ఇది అంతకు ఏడాది ముందు ధర కంటే రెట్టింపుగా మిస్త్రీ కార్యాలయం పేర్కొంది. కోరస్‌కు అధికంగా చెల్లించడం వల్ల పెట్టుబడులు కష్టంగా మారి నిర్లక్ష్యానికి గురైందని, ఫలితంగా చాలా ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని విమర్శించింది. టెలికం వ్యాపారానికి సంబంధించి సలహాలను పెడచెవిన పెట్టి ప్రాచుర్యంలో ఉన్న జీఎస్‌ఎంను కాదని సీడీఎంఏ వ్యాపారంలోకి ప్రవేశించాలని టాటాలు నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. ఒక వ్యక్తి నిర్ణయం వేలాది మంది ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించింది. -
మిస్త్రీని డైరెక్టర్‌గానూ తీసేద్దాం!
• వాటాదారులకు టీసీఎస్ నోటీసు వచ్చేనెల 13న ఈజీఎం • టాటా సన్స విశ్వాసాన్ని కోల్పోరుునందుకేనని వివరణ న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు (టీసీఎస్) సైరస్ మిస్త్రీ తీవ్ర హాని తలపెట్టారంటూ ఆ కంపెనీలో ప్రధాన వాటాదారైన టాటా సన్స తాజాగా ఆరోపించింది. కంపెనీ బోర్డు డెరైక్టర్‌గా సైరస్ మిస్త్రీని తొలగించేందుకు వాటాదారుల సమ్మతిని కోరింది. టాటా గ్రూపు తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా బాధ్యతలు చేపట్టాక టీసీఎస్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీ ఉద్వాసనకు గురైన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో చైర్మన్‌గా ఇషాంత్ హుస్సేన్‌ను నియమించారు. అంతేకాదు, టీసీఎస్ డెరైక్టర్ పదవి నుంచీ మిస్త్రీని తొలగించేందుకు వాటాదారుల అసాధారణ సమావేశం (ఈజీఎం) నిర్వహించాలని టాటా సన్స కోరింది. దీంతో గతవారం సమావేశమైన టీసీఎస్ బోర్డు వచ్చే నెల 13న ఈజీఎం నిర్వహించాలని నిర్ణరుుంచింది. ఈజీఎం నోటీసును టీసీఎస్ తన వాటాదారులకు పంపించింది. ‘‘టాటా సన్స ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా తొలగింపునకు గురైన తర్వాత మిస్త్రీ నిరాధారమైన ఆరోపణలు చేశారు. టాటా సన్సపై మాత్రమే కాకుండా బోర్డు డెరైక్టర్లు, టాటా గ్రూపు మొత్తంపై నిందలు మోపారు. టీసీఎస్ కూడా గ్రూపులో భాగమే. గోప్యత అంటూనే ఆరోపణలను బహిరంగ పరిచారు. మిస్త్రీ తన ప్రవర్తనతో టాటా గ్రూప్, టీసీఎస్, టీసీఎస్ వాటాదారులు, ఉద్యోగులకు తీవ్ర హాని కలిగించారు. ఈ నేపథ్యంలో డెరైక్టర్‌గా సైరస్ మిస్త్రీని తొలగించాలని డెరైక్టర్ల బోర్డు నిర్ణరుుంచింది’’ అని టీసీఎస్ వాటాదారులకు టాటా సన్స వివరించింది. మిస్త్రీ టాటా సన్స విశ్వాసాన్ని కోల్పోయారని పేర్కొంది. ఇండియన్ హోటల్స్ ఈజీఎం 20న టాటా గ్రూపులో భాగమైన ఇండియన్ హోటల్స్ సైతం మిస్త్రీని డెరైక్టర్‌గా తొలగించే అంశాన్ని తేల్చేందుకు వచ్చే నెల 20న వాటాదారుల సమావేశం నిర్వహిస్తోంది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో కంపెనీ నిర్ణయం తీసుకుంది. వాడియా పరువు నష్టం నోటీసు ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త, బోంబే డైరుుంగ్ చైర్మన్ నుస్లీ వాడియా టాటా సన్సకు పరువు నష్టం నోటీసులు పంపించారు. టాటా గ్రూపులోని పలు కంపెనీలకు స్వతంత్ర డెరైక్టర్‌గా ఉన్న వాడియా... తనపై చేసిన నిరాధార, తప్పుడు, పరువుకు భంగం కలిగించే, అసత్య ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని నోటీసులో డిమాండ్ చేశారు. కాగా, నుస్లీ వాడియా నోటీసుకు తగిన విధంగా స్పందిస్తామని టాటా సన్స స్పష్టం చేసింది. -
మ్యూచువల్ ఫండ్స్ దృష్టి...
న్యూఢిల్లీ: టాటా గ్రూపు చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపుతో మొదలైన వివాదం ఇప్పటికీ కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్ల ప్రయోజనాల రీత్యా మ్యూచువల్ ఫండ్స ఒక్కటయ్యారుు. టాటా గ్రూపు కంపెనీల్లో ఫండ్స పెట్టుబడులు రూ.20 వేల కోట్లకు పైగా ఉండడం, అదే సమయంలో డెట్, ఈక్విటీ ఫండ్సలో టాటా కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టి ఉన్న నేపథ్యంలో జరుగుతున్న తాజా పరిణామాలను అవి సునిశితంగా పరిశీలిస్తున్నారుు. ఓ ప్రముఖ ప్రైవేటు మ్యూచువల్ ఫండ్ చీఫ్ అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీ టాటా గ్రూపులో పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపారుు. ఈ కమిటీలో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్లు సహా మొత్తం 19 మంది సభ్యులు ఉన్నారు. వారి పేర్లను బయటకు వెల్లడించడానికి ఆ వర్గాలు నిరాకరించారుు. టాటా గ్రూపు చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగించి, తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఇరు వర్గాల మధ్య ఆరోపణలతో వివాదం నడుస్తున్న విషయం విదితమే. ఈ అంశాలన్నింటినీ గమనిస్తున్న ఫండ్స అవసరమైతే కలసికట్టుగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నారుు. ఇప్పటికే రతన్ టాటా, సైరస్ మిస్త్రీ వర్గాలు తమ మద్దతు కోరినట్టు ఫండ్ మేనేజర్లు వెల్లడించారు. సంస్థాగత ఇన్వెస్టర్లలో ఆందోళన మరోవైపు టాటా గ్రూపు కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సైతం ఈ విషయంలో ఇప్పటికే సెబీని ఆశ్రరుుంచగా, తాజా పరిణామాలపై వారు సైతం ఓ కన్నేసి ఉంచారు. వాస్తవానికి టాటా గ్రూపులో వివాదంతో ఆ కంపెనీల షేర్ల విలువలు క్షీణించడం విదేశీ, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. -
తాజ్ ఉద్యోగినికి వేధింపులు
న్యూఢిల్లీ: హోదా తగ్గింపు, అభద్రత, లైంగిక వేధింపులతో టాటా గ్రూపుకు చెందిన ఉన్నత స్థాయి ఉద్యోగిని జాబ్ వదులుకుంది. టాప్ ఎగ్జిక్యూటివ్ పై ఫిర్యాదు చేసినందుకు ఆమె ఉద్యోగం కోల్పోయింది. అప్పటి టాటా గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ, హెచ్ ఆర్ హెడ్ ఎన్ ఎస్ రాజన్ కు మొరపెట్టుకున్నా ఆమెకు న్యాయం జరగలేదు. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ బాధితురాలు బాధితురాలు గతేడాది నవంబర్ 3న మిస్త్రీకి ఈ-మెయిల్ పంపింది. ఇందులో తన గోడును వెళ్లబోసుకుంది. తాజ్ హోటల్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తనను ఆరు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించింది. తాను ఎదురు తిరగడంతో తన హోదాను జనరల్ మేనేజర్ నుంచి సీనియర్ మేనేజర్ కు తగ్గించారని వాపోయింది. ఇన్ని అవమానాలు జరిగిన తర్వాత ఇక్కడ పనిచేయలేనని ఈ-మెయిల్ లో పేర్కొంది. దీనిపై స్పందించిన మిస్త్రీ ఒక కమిటీ వేశారు. అయితే 18 నెలలు గడిచినా కమిటీ నివేదిక ఇవ్వలేదు. మహిళా ఉద్యోగుల భద్రత విషయంలో మిస్త్రీ రాజీపడలేదని ఆయన తరపు ప్రతినిధులు తెలిపారు. నివేదిక ఇవ్వాలని కమిటీని మిస్త్రీ కోరారని, రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు చేపడతామని చెప్పారు. ఏడాదిన్నర గడిచినా బాధితురాలికి న్యాయం చేయకపోవడం మిస్త్రీకి నిష్ఫూచికి రుజువన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. -
ఆ 6 కంపెనీల చైర్మన్‌గా తొలగింపు అంతతేలిక్కాదు..
న్యూఢిల్లీ: ఏడు లిస్టెడ్ కంపెనీల్లో ఆరు సంస్థల చైర్మన్ బాధ్యతల నుంచి సైరస్ మిస్త్రీని తొలగించాలని టాటా సన్స భావిస్తే, అది అంత తేలిక వ్యవహారం కాదని ఇన్‌గవర్న్ రిసెర్చ్ సర్వీసెస్ తన నివేదికలో పేర్కొంది. ‘నేడు మిస్త్రీని చైర్మన్ బాధ్యతల నుంచి తప్పించిన టీసీఎస్‌ను మినహారుుస్తే... మిగిలిన 6 సంస్థల్లో ప్రమోటర్ హోల్డింగ్ 30-39% మధ్య ఉంది. కనుక టాటా సన్స కోరిక నెరవేరాలంటే, వ్యవస్థాత ఇన్వెస్టర్ల మద్దతు తప్పనిసరి’ అని నివేదిక పేర్కొంది. ఈ 6 కంపెనీల్లో టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్, టాటా కెమికల్స్, గ్లోబల్ బేవరేజెస్లు ఉన్నారుు. టాటా మోటార్స్ యూనియన్‌తో రతన్ భేటీ టాటా గ్రూప్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా గురువారం మోటార్స్ ఉద్యోగ యూనియన్ నాయకులతో సమావేశమయ్యారు. వచ్చే వారం టాటా మోటార్స్ కీలక బోర్డ్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. -
విశ్వాసఘాతకుడు.. మిస్త్రీ!
• నమ్మకంతో అప్పగిస్తే దెబ్బతీశారు • ప్రధాన కంపెనీలపై పెత్తనానికి ప్రయత్నించారు... • ఇండియన్ హోటల్స్‌ను చెప్పుచేతల్లో ఉంచుకోవాలనుకున్నారు... • ఇందుకు స్వతంత్ర డెరైక్టర్లను వాడుకున్నారు... • టాటా మోటార్స్ దేశీ మార్కెట్ వాటా పడిపోయింది.. • గత నాలుగేళ్లలో గ్రూప్ రుణ భారం రూ.69 వేల కోట్ల నుంచి • రూ.2.25 లక్షల కోట్లకు పెరిగిపోరుుంది... • టర్న్‌ఎరౌండ్ చేయడం చేతకాక, పెట్టుబడులను రైటాఫ్ చేశారు.. • మాజీ చైర్మన్‌పై టాటా సన్స్ ఎదురుదాడి... • తొమ్మిది పేజీల లేఖలో మిస్త్రీపై ప్రత్యారోపణలు... ముంబై: సైరస్ మిస్త్రీ- టాటాల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నారుు. చైర్మన్ పదవి నుంచి తొలగించిన తర్వాత మిస్త్రీపై టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అరుున టాటా సన్స్ మరోసారి తీవ్రంగా విరుచుకుపడింది. 100 బిలియన్ డాలర్ల విలువైన గ్రూప్‌లోని ప్రధాన కంపెనీలపై పెత్తనం చేయాలని ప్రయత్నించారని... విశ్వాస ఘాతకానికి పాల్పడ్డారని పేర్కొంది. మిస్త్రీ చేసిన ప్రతి ఆరోపణనూ తిప్పికొడుతూ సవివరంగా గురువారం తొమ్మిది పేజీల లేఖను విడుదల చేసింది. గత నెల 24న మిస్త్రీని టాటా సన్స్ డెరైక్టర్ల బోర్డు ఉన్నపళంగా చైర్మన్ పదవి నుంచి తొలగించి మళ్లీ రతన్ టాటాను తాత్కాలిక చైర్మన్‌గా నియమించటం తెలిసిందే. ఇన్నాళ్లూ తమపై మిస్త్రీ బురదజల్లుతున్నారని పేర్కొన్న టాటా సన్స్... మొత్తమ్మీద మిస్త్రీకి ఉద్వాసన చెప్పటానికి వెనకున్న కారణాలన్నింటినీ బయటపెట్టింది. ‘‘నాలుగేళ్ల క్రితంమిస్త్రీపై ఎంతో నమ్మకం ఉంచి, ముందుచూపుతో చైర్మన్ పదవిలో కూర్చోబెట్టాం. కానీ ఆయన మమ్మల్నే కాక టాటా ప్రతినిధులెవరినీ కూడా పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. గ్రూప్‌లోని కీలకమైన కంపెనీలపై నియంత్రణ కోసం పాకులాడారు. మా విశ్వాసాన్ని పూర్తిగా వమ్ముచేశారు’ అని టాటా సన్స్ తీవ్రంగా దుయ్యబట్టింది. ఇన్వెస్టర్లకు డివిడెండ్లు తగ్గిపోయారుు... ‘‘నాలుగేళ్లు చైర్మన్‌గా కొనసాగిన మిస్త్రీ హయాంలో గ్రూప్‌లోని 40కి పైగా కంపెనీల్లో ఇన్వెస్టర్లకు ఒకపక్క డివిడెండ్లు తగ్గిపోయారుు. మరోవంక వ్యయాలు తీవ్రంగా పెరిగిపోయారుు. గ్రూప్ కంపెనీల నిర్వహణ కోసం అనేక ఏళ్లుగా టాటా సన్స్ అనుసరిస్తున్న చరిత్రాత్మక యాజమాన్య స్వరూపాన్ని మిస్త్రీ మంటగలిపారు. చైర్మన్‌గా ఉన్న వ్యక్తి కంపెనీలన్నింటిలోనూ కామన్‌గా డెరైక్టర్‌గా కొనసాగేలా నిబంధనలు మార్చారు. ఇకపై గ్రూప్‌లో ఇలాంటి పరిస్థితిని కొనసాగనివ్వం’’ అని టాటా సన్స్ స్పష్టం చేసింది. ఇండియన్ హోటల్స్‌పై ఆధిపత్యానికి... తాజ్ గ్రూప్ ఆఫ్ హోటళ్లను నిర్వహిస్తున్న ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్‌ను (ఐహెచ్‌సీఎల్) మిస్త్రీ తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని చూశారని టాటా సన్స ఆరోపించింది. మిస్త్రీ చైర్మన్‌గా ఉన్న ఐహెచ్సీఎల్లో టాటా సన్స్ కు 28.01 శాతం వాటా మాత్రమే ఉంది. ‘‘ఇందుకోసం ఆయన స్వతంత్ర డెరైక్టర్లందరినీ తనకు అనుకూలంగా మార్చుకున్నారు’’ అని సంస్థ పేర్కొంది. గత వారంలో జరిగిన బోర్డు సమావేశంలో కంపెనీ స్వతంత్ర డెరైక్టర్లు మిస్త్రీ నాయకత్వాన్ని కీర్తించడంతోపాటు ఆయనను పూర్తిగా సమర్థించడం తెలిసిందే. నిర్వహణ చేతకాలేదు... నాలుగేళ్ల సారథ్యంలో మిస్త్రీ పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదని.. కంపెనీల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని టాటా సన్స్ తేల్చి చెప్పింది. ‘‘టాటా స్టీల్ యూరప్ (రతన్ టాటా హయాంలో కోరస్‌ను కొనుగోలు చేసిన తర్వాత పేరు మార్చారు), టాటా-డొకోమో జారుుంట్ వెంచర్, టాటా మోటార్స్ భారతీయ కార్యకలాపాలను మిస్త్రీ పూర్తిగా దెబ్బతీశారు. ఈ కంపెనీలన్నీ తీవ్ర సమస్యల్లోకి కూరుకుపోయారుు. నష్టాలు, రుణ భారం భారీగా పెరగడమే కాకుండా... మార్కెట్ వాటా పడిపోరుుంది. దీనికి ఆయన అనుసరించిన విధానాలే కారణం. టర్న్‌ఎరౌండ్ చేయడం చేతకాలేదు కానీ, ఆయా కంపెనీల్లో చేసిన భారీ మొత్తంలోని పెట్టుబడులను కోల్పోయేలా (రైటాఫ్) చేశారు’’ అని టాటా సన్స్ తెలియజేసింది. ఇక టాటా స్టీల్ యూరప్‌లో సంక్షోభం, జపాన్ టెలికం కంపెనీ డొకోమోతో జేవీ విఫలం కావడానికి మిస్త్రీయే కారణమని పేర్కొంది. కాగా, మిస్త్రీ తన ఉద్వాసన తర్వాత రాసిన లేఖలో తన ముందు చైర్మన్ (రతన్ టాటా) హయాంలో తీసుకున్న నిర్ణయాలు, విదేశీ కొనుగోళ్ల కారణంగా గ్రూప్‌లోని 5 కంపెనీలు రూ.1.18 లక్షల కోట్ల పెట్టుబడి నష్టాలను చవిచూడాల్సి వస్తుందని ఆరోపించారు. అరుుతే, ఈ విషయాన్ని ఆయా కంపెనీల బోర్డు సభ్యులకు చెప్పానంటున్న మిస్త్రీ.. దీన్ని అప్పుడే ఎందుకు బయటపెట్టలేదని టాటా సన్స్ ప్రశ్నించింది. అప్పులు మూడింతలు...: ‘నాలుగేళ్ల క్రితం రూ.69,877 కోట్లుగా ఉన్న గ్రూప్ రుణ భారం ఇప్పుడు రూ.2,25,740 కోట్లకు ఎగబాకింది. సమస్యలున్నాయని చెబుతున్న ఐదు కంపెనీలనూ మళ్లీ గాడిలో పెట్టడానికి ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. వదిలించుకోవడానికే ప్రయత్నించారు. ఆయన అమ్మేసిన టాటా స్టీల్ యూరోపియన్ ఆస్తులను కొన్న కంపెనీ మాత్రం తొలి ఏడాదిలోనే వాటిని టర్న్ ఎరౌండ్ చేసింది’’ అని టాటా సన్స్ వివరించింది. తప్పుదోవ పట్టించారు... గ్రూప్ వ్యవహారాల్లో టాటా ట్రస్టులు జోక్యం చేసుకున్నాయని మిస్త్రీ చేసిన ఆరోపణలను కూడా తిప్పికొట్టింది. ‘‘నిజానికి ఇందులో తప్పేముంది? అరుుతే, మిస్త్రీ ఈ వ్యవహరంలో అందరినీ తప్పుదోవపట్టించారు. ట్రస్టులు తమ ఆస్తుల పరిరక్షణపై దృష్టిపెడతారుు. అంతేకాదు టాటా సన్‌సలో తమకున్న విలువైన పెట్టుబడులు కూడా వాటికి ముఖ్యమే. అందుకే అన్‌లిస్టెడ్ హోల్డింగ్ కంపెనీకి (టాటా సన్స) సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవటం అత్యవసరం కూడా. టాటా మోటార్స్ మార్కెట్ వాటా పడిపోరుుంది... మిస్త్రీ నాయకత్వంలో టాటా మోటార్స్ దేశీ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని టాటా సన్స్ తెలిపింది. ‘‘గత మూడేళ్లలో కార్లు, వాణిజ్య వాహనాల్లోనూ దేశీ మార్కెట్ వాటా ఘోరంగా పడిపోరుుంది. కార్ల విషయానికొస్తే.. 2012-13లో 13% మార్కెట్ వాటా ఉంటే.. ఇప్పుడు 5%కి దిగజారింది. వాణిజ్య వాహనాల మార్కెట్ వాటా 60% నుంచి 40%కి క్షీణించింది. ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న కంపెనీకి చరిత్రలో ఇదే అత్యంత ఘోరమైన స్థారుు’’ అని వివరించింది. అరుుతే, నానో కార్ల వల్లే టాటా మోటార్స్ దేశీయంగా నష్టాల్లోకి కూరుకుపోరుుందని.. దీన్ని మూసేస్తేనే కంపెనీ బాగుపడుతుందని మిస్త్రీ చేసిన ఆరోపణలపై టాటా సన్స్ తాజా లేఖలో వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. టీసీఎస్ చైర్మన్ పదవి నుంచి ఔట్ ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి తొలగించిన మిస్త్రీకి గ్రూప్ కార్యకలాపాలతో సంబంధం లేకుండా చేసే పనిని టాటా సన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా కీలకమైన టీసీఎస్ చైర్మన్ పదవి నుంచి కూడా ఆయనను తొలగించింది. తాత్కాలికంగా ఇషాత్ హుస్సేన్‌ను కంపెనీ చైర్మన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ‘మిస్త్రీ తొలగింపు తీర్మానాన్ని ఆమోదించడానికి అసాధారణ వాటాదారుల సమావేశం (ఈజీఎం) కోసం నోటీసులు జారీ చేసినట్లు టాటా సన్స్ ఈ నెల 9న మాకు తెలియజేసింది. దీంతో తక్షణం మిస్త్రీని తొలగించి ఇషాత్ హుసేన్‌కు ఆయన స్థానంలో బాధ్యతలను అప్పగిస్తున్నట్లు కూడా పేర్కొంది. కొత్తగా పూర్తిస్థారుు చైర్మన్‌ను నియమించేవరకూ హుస్సేన్ కొనసాగుతారని తెలిపింది’ అని ఎక్స్ఛేంజీలకు వెల్లడించిన సమాచారంలో టీసీఎస్ వెల్లడించింది. టాటా గ్రూప్‌లోని టాటా స్టీల్, వోల్టాస్‌తో సహా చాలా కంపెనీల్లో హుస్సేన్ డెరైక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం వోల్టాస్, టాటా స్కైలకు చైర్మన్‌గానూ సేవలందిస్తున్నారు. కాగా,టాటా సన్స్ కు టీసీఎస్‌లో 73.26% వాటా ఉంది. గ్రూప్ చైర్మన్‌గా ఉద్వాసన పలికినప్పటికీ.. టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్, టాటా కెమికల్స్, టాటా పవర్ సహా పలు టాటా గ్రూప్ కంపెనీలకు ఆయన చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటి నుంచి కూడా ఆయనను తొలగించాలనేది టాటా సన్స్ వ్యూహం. ఇండియన్ హోటల్స్ నుంచి కూడా... ఇండియన్ హోటల్స్ డెరైక్టర్ల బోర్డు నుంచి కూడా మిస్త్రీని తొలగించేందుకు రంగం సిద్ధమైంది. చైర్మన్ పదవి నుంచి మిస్త్రీకి ఉద్వాసన తీర్మానాన్ని ఆమోదించేందుకు కంపెనీ ఈజీఎంను నిర్వహించనున్నట్లు టాటా సన్స్ తెలియజేసిందని ఇండియన్ హోటల్స్ బీఎస్ఈకి సమాచారం ఇచ్చింది. గత వారంలోనే కంపెనీ స్వతంత్ర డెరైక్టర్లు ఆయన నాయకత్వాన్ని సమర్థించడం, చైర్మన్‌గా ఆయనను కొనసాగించేందుకు మద్దతుపలకడం తెలిసిందే. కాగా, తాజాగా టాటా కెమికల్స్ ఇండిపెండెంట్ డెరైక్టర్లు కూడా మిస్త్రీని చైర్మన్‌గా కొనసాగించాలంటూ సమర్థించడం విశేషం. -
మిస్త్రీపై టాటా సన్స్ మరో లేఖాస్త్రం
టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తనను అర్థాంతరంగా తొలగించారంటూ వాదిస్తున్న సైరస్ మిస్త్రీ ఆరోపణలను ఖండిస్తూ.. టాటా గ్రూప్ హోల్డిండ్ కంపెనీ టాటా సన్స్ తొమ్మిది పేజీల ప్రటకనను విడుదల చేసింది. గతనెల ఉన్నపళంగా సైరస్ మిస్త్రీని తొలగించడానికి గల కారణాలను ఆ ప్రకటనలో వివరణ ఇచ్చింది. మిస్త్రీని అర్థాంతంరంగా తొలగించామన్న వాదన సరికాదని పేర్కొంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఆదాయాలను పక్కనపెడితే, గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ ఎలాంటి గణనీయమైన సహకారాన్ని నిర్వర్తించలేదని తెలిపింది. మిస్త్రీ హయాంలో టాటా గ్రూప్‌లోని 40 ఇతర కంపెనీల డివిడెంట్లు క్రమంగా క్షీణించాయని వెల్లడించింది. 2012-13లో రూ.1,000 కోట్లగా ఈ ఇతర కంపెనీలు తీసుకునే డివిడెంట్స్ 2015-16 సంవత్సరానికి వచ్చేసరికి రూ.780 కోట్లకు దిగజారాయని మిస్త్రీ ఆరోపణలపై టాటాసన్స్ మండిపడింది. మిస్త్రీ అంతకముందు గ్రూప్ కంపెనీల వృద్ధికి, మేనేజ్మెంట్ రూపురేఖలకు కొన్ని ప్రణాళికలను తమతో షేర్ చేసుకునేవాడని, కానీ చైర్మన్‌గా ఎన్నికయ్యాక మాత్రం నాలుగేళ్ల కాలంలో ఈ ప్రణాళికలను అసలు అమలుపరుచలేదని ప్రకటనలో పేర్కొంది. వాటిని పక్కన బెడితే, చాలా కంపెనీలు ఇప్పుడు ఆ కొత్త నిర్మాణాలను అసలు ఆమోదించడం లేదని వెల్లడించింది. టాటా గ్రూప్‌లో ప్రధానమైన ఆపరేటింగ్ కంపెనీలను తన ఆధీనంగా తెచ్చుకోవాలనుకునేవాడని, చాలా మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడేవాడని టాటా సన్స్ ఆరోపించింది. టాటా సన్స్ చైర్మన్‌గా బయటికి నెట్టేసిన అనంతరం సైరస్ మిస్త్రీ గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలకు పాల్పడారు. తన తొలగింపు చట్టవిరుద్దమని, ఈ నిర్ణయం పనిచేయదని వ్యాఖ్యానించారు. మిస్త్రీ తొలగింపు అనంతరం ప్రపంచవ్యాప్తంగా చాలా ఈమెయిల్స్, కాల్స్‌ను తాము అందుకున్నామని, ఈ నిర్ణయంపై వారికి వివరణ ఇచ్చినట్టు టాటా సన్స్ గురువారం ప్రకటనలో తెలిపింది. గ్రూప్ కంపెనీల భవితవ్యంపై కూడా చాలామంది అడిగారని, వారిని ఆందోళనల నుంచి బయటపడేయడానికి ఈ ప్రకటనను వెలువరిచినట్టు పేర్కొంది. -
టీఎసీఎస్ కు కొత్త చైర్మన్
ముంబై: సైరస్ మిస్త్రీ స్ధానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) చైర్మన్ గా ఇషాత్ హుస్సేన్ ను నియమిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కొద్ది రోజులుగా టాటా గ్రూప్ సన్స్ తో మిస్త్రీ వివాదం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీసీఎస్ చైర్మన్ గా ఇషాత్ హుస్సేన్ పగ్గాలు చేపడుతున్నట్లు కంపెనీ తెలిపింది. గురువారం నుంచి ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు బాంబే స్టాక్ ఎక్చేంజ్ కు వెల్లడించింది. ఇషాత్ హుస్సేన్ ను టీసీఎస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ గా ఎంపిక చేస్తున్నట్లు టాటా సన్స్ నుంచి లేఖ అందినట్లు చెప్పింది. కొత్త చైర్మన్ ను నియమించే వరకూ ఇషాత్ హుస్సేన్ ఆ బాధ్యతలను నిర్వర్తిస్తారని పేర్కొంది. -
టాటా గ్రూప్ పరిణామాలపై కన్నేసి వుంచాలి
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌లో జరుగుతున్న బోర్డ్‌రూమ్ వివాదం నేపథ్యంలో ఆ గ్రూప్ కంపెనీల పరిణామాలపై కన్నేసి వుంచాలంటూ ఎల్ఐసీ, బ్యాంకులకు ఆర్థిక శాఖ సూచించింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాల దష్ట్యా ఈ గ్రూప్‌పై అప్రమత్తంగా వుండాలని కోరినట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. టాటా గ్రూప్‌నకు చెందిన పలు కంపెనీల్లో ఎల్ఐసీతో పాటు బ్యాంకులు కూడా ఇన్వెస్టర్ల డబ్బును పెట్టుబడి చేయడం లేదా రుణాలుగా ఇచ్చినందున, డిపాజిటర్ల డబ్బు రిస్క్‌లో పడకుండా చూడాల్సిన బాధ్యత ఆర్థిక సంస్థల మీద వుందని ఆ వర్గాలు వివరించాయి. దేశంలో టాటా గ్రూప్ అతిపెద్ద, ప్రతిష్టాత్మకమైన పారిశ్రామిక గ్రూప్‌ల్లో ఒకటనడంలో సందేహం లేదని, అయితే టాటా సన్స చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన తర్వాత జరుగుతున్న పలు పరిణామాలను గమనించాల్సివుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఎల్ఐసీ పెట్టుబడులు రూ. 37,500 కోట్లు.. వివిధ టాటా గ్రూప్ కంపెనీల్లో కేవలం ఎల్ఐసీకే రూ. 37,500 కోట్ల విలువైన పెట్టుబడులు వున్నాయి. గ్రూప్‌లో అత్యధిక లాభదాయక కంపెనీ అయిన టీసీఎస్‌లో ఎల్ఐసీకి 3.2 శాతం వాటా వుండగా, యూరప్ కార్యకలాపాల కారణంగా తీవ్ర సంక్షోభంలో వున్న టాటా స్టీల్‌లో 13.6 శాతం వాటా వుంది. మరో ప్రభుత్వ రంగ బీమా సంస్థ న్యూ ఇండియా అష్యూరెన్సకు టాటా స్టీల్‌లో 1.17 శాతం వాటా వుంది. ఎల్ఐసీకి టాటా పవర్లో 13.1 శాతం, టాటా మోటార్స్‌లో 7.13 శాతం, ఇండియన్ హోటల్స్‌లో 8.8 శాతం, టాటా గ్లోబల్ బేవరేజెస్లో 9.8 శాతం చొప్పున వాటాలు వున్నాయి. మిస్త్రీతో కలిసిపనిచేస్తున్నందుకే తొలగించారు-నిర్మల్యాకుమార్ న్యూఢిల్లీ: టాటా సన్స మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీతో కలసికట్టుగా పనిచేస్తున్నందుకే తనను గ్రూప్ పదవుల నుంచి తొలగించారని టాటా గ్రూప్ స్ట్రాటజిస్ట్‌గా వ్యవహరించిన నిర్మల్యా కుమార్ ఆరోపించారు. అలాగే గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఆయన కొనసాగారు. టాటా సన్స చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తప్పించిన తర్వాత గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను రద్దుచేశారు. అలాగే ఆ రెండు పదవుల నుంచి కుమార్‌కు స్వస్తిచెప్పారు. టాటా కెమికల్స్ డెరైక్టర్ల బోర్డు నుంచీ కుమార్ గతవారం వైదొలిగారు. తాను 100 మంది విద్యార్థులు, యువ మేనేజర్ల ఎదుట ఒక ప్యానల్లో వుండగా, తన తొలగింపు సమాచారాన్ని తనకు అందించారని, ఎందుకు తొలగిస్తున్నారో వివరణ కూడా ఇవ్వలేదంటూ కుమార్ తన బ్లాగ్‌లో ఆవేదన వ్యక్తంచేశారు. -
మిస్త్రీకి ఇండియన్ హోటల్స్ దన్ను!
• ఆయన నాయకత్వమే బాగుందన్న డెరైక్టర్లు • చైర్మన్‌గా కొనసాగింపునకు సంపూర్ణ మద్దతు ముంబై: టాటా గ్రూపు చైర్మన్ పదవిని కోల్పోరుున సైరస్ మిస్త్రీకి పెద్ద ఊరట లభించింది. గ్రూపులో భాగమైన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్) డెరైక్టర్ల బోర్డు... చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ నాయకత్వానికి, చైర్మన్‌గా ఆయన్ను కొనసాగిం చేందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కంపెనీ స్వతంత్ర డెరైక్టర్లు ప్రత్యేకంగా సమావేశమై మిస్త్రీ పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నట్టు ఏకగ్రీవంగా నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయానికి కంపెనీలోని మిగిలిన డెరైక్టర్లు సైతం మద్దతిచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపారుు. కాగా, ఈ విషయమై స్వతంత్ర డెరైక్టర్ల అభిప్రాయాలను ఐహెచ్‌సీఎల్ బీఎస్ఈకి తెలియజేసింది. టాటా గ్రూపు కంపెనీల హోల్డింగ్ సంస్థ టాటా సన్స చైర్మన్‌గా మిస్త్రీ ఉద్వాసనకు గురైనా... గ్రూపులోని కొన్ని కంపెనీలకు ఇప్పటికీ ఆయనే చైర్మన్‌గా కొనసాగుతున్నారు. దీంతో రతన్‌టాటా ఆధ్వర్యంలోని యాజమాన్యం గ్రూపు కంపెనీల నుంచీ మిస్త్రీని తొలగించాలని చూస్తున్న విషయం తెలిసిందే. స్వతంత్ర డెరైక్టర్ల భేటీ...:ఐహెచ్‌సీఎల్ బోర్డు సమావేశం సైరస్ మిస్త్రీ అధ్యక్షతన శుక్రవారం ముంబైలో జరిగింది. ఇందులో కంపెనీ రెండో త్రైమాసిక ఫలితాలను ఆమోదించారు. దీనికంటే ముందు కంపెనీ స్వతంత్ర డెరైక్టర్లు అరుున బ్యాంకర్ దీపక్ పరేఖ్, నాదిర్ గోద్రెజ్, గౌతం బెనర్జీ, కేకీ దాదిసేత్, విభా రిషీపౌల్, ఇరీనా విట్టల్ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే వారు మిస్త్రీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు పలికారు. ముంబైలో టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం ‘బాంబే హౌస్’లో శుక్రవారం ఇండియన్ హోటల్స్ కంపెనీ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టాటా సన్స చైర్మన్‌గా తొలగించిన సైరస్ మిస్త్రీ ఆయన సోదరడు షాపూర్ మిస్త్రీలు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన ఫోటో జర్నలిస్టులపై బాంబే హౌస్ భద్రతా సిబ్బంది దాడిచేశారు. కిందపడేసి కొట్టారు. అప్పటి చిత్రాలే ఇవి. జరిగిన ఘటనపై టాటా గ్రూప్ ప్రతినిధి విచారం వ్యక్తం చేశారు. నానోపై పెట్టుబడిలో చాలా వరకు నష్టపోయాం.. నిజాన్ని ఒప్పుకున్న టాటా మోటార్స్ న్యూఢిల్లీ: సైరస్ మిస్త్రీ ఆరోపణలు నిజమేనని తేలింది. నానో విషయంలో ఇప్పటిదాకా గుంభనంగా ఉన్న టాటా మోటార్స్... దీనిపై పెట్టిన పెట్టుబడుల్లో చాలా వరకూ నష్టపోరుునట్లు అంగీకరించింది. నానో కారు అభివృద్ది కోసం చేసిన వ్యయం, సంబంధిత ప్రాజెక్టుపై చేసిన పెట్టుబడుల్లో చాలా వరకు నష్టపోయామని, చాలా నష్టాల్ని కొన్నేళ్లుగా కంపెనీ ఖాతాల్లో చూపించామని సంస్థ తెలియజేసింది. వీటిని రైటాఫ్ చేసినట్లు వెల్లడించింది. ప్యాసింజర్ కార్లకు సంబంధించి తమ విధానాన్ని సమీక్షించుకుంటామని ప్రకటించింది. నానో కారు గుదిబండలా తయారైం దని, దానివల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని, అరుుతే, రతన్ టాటా కలల ప్రాజెక్టు కావడంతో కొనసాగించాల్సి వచ్చిందంటూ గ్రూపు మాజీ చైర్మన్ మిస్త్రీ ఆరోపించటం తెలిసిందే. -
టాటాపై మరోసారి స్వామి సంచలన వ్యాఖ్యలు
రాయపూర్ : టాటా- మిస్త్రీ వివాదంలో ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మరోసారి టాటా చైర్మన్ పై ధ్వజమెత్తారు. టాటా గ్రూపు చరిత్రలోనే రతన్ టాటా అంత అవినీతి పరుడు లేడంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాయపూర్ లో మీడియాతో మాట్లాడిన స్వామి, అసలు రతన్ టాటా టాటానే కాదు, ఆయన తండ్రి ఓ దత్త పుత్రుడంటూ మరింత అగ్గిని రాజేశారు. కేవలం తనను తాను రక్షించుకోవడానికే సైరస్ మిస్త్రీకి ఆయన అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ సందర్భంగారెండు నెలల క్రితం సైరస్ మిస్త్రీని టాటాల బోర్డు ఎంతో మెచ్చుకుందన్న విషయాన్ని స్వామి గుర్తు చేశారు. ఎంటైర్ బోర్డు అతని కృషిని ప్రశంసించిందని పేర్కొన్నారు. దీంతో అసూయతోనే రతన్ టాటా ఈ చర్యలకు దిగారని ఆరోపించారు. 2012 లో టాటా సన్స్ చైర్మన్ అయిన సైరస్ మిస్త్రీపై లేనిపోని, దారుణమైన ఆరోపణలు, నిరూపించలేని వాదనలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2జీ, ఎయిర్ ఆసియా, విస్తారా భాగస్వామ్య ఒప్పందం, జాగ్వార్ డీల్ వంటి కుంభకోణాల్లో రతన్ టాటాకు పాత్ర ఉందని స్వామి ఆరోపించారు. ఈ స్కాముల్లో ఇరుక్కోకుండా తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే మిస్త్రీని తొలగించా రన్నారు. కానీ చట్టం నుంచి రతన్ టాటా తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసారని చెప్పారు. రతన్ టాటా అవినీతిపై భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఏయే సెక్షన్లు వర్తిస్తాయో తెలిపానన్నారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని , సిట్ తో విచారణ జరిపించాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. -
బిజినెస్ స్కూళ్లకి పాఠంగా మిస్త్రీ రగడ
ముంబై : బోర్డు రూంలో జరిగిన టాటా గ్రూప్ వివాదం దేశీయ కార్పొరేట్ చరిత్రలో కనివినీ ఎరుగనిది. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని అర్థాంతరంగా పీకివేసిన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు ఇటు కార్పొరేట్ రంగానికి, అటు బిజినెస్ స్కూళ్లకి ఓ ప్రత్యక్ష పాఠంగా నిలుస్తున్నాయి. లైవ్ లెసెన్స్కు ఇది ఓ మంచి ఉదాహరణ అని భావించిన బిజినెస్ స్కూళ్ల ప్రొఫెసర్లు, స్టూడెంట్స్‌కు గ్రూప్ బోర్డుల్లో జరిగే నిరంతర పరిణామాలపై పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. విజయవంతమైన కార్పొరేట్ రంగాల పాలనలు, సంక్షోభ వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఏ విధంగా ఉంటాయో టాటా గ్రూప్‌ను ఓ మంచి ఉదాహరణగా తీసుకుని లైవ్ లెసెన్స్గా తమ విద్యార్థులకు వివరిస్తున్నట్టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ మేనేజ్మెండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ వంటి టాప్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్లు చెబుతున్నారు. సైరస్ మిస్త్రీ తొలగింపు వ్యవహారంలో, యాజమాన్య హక్కులు, సంస్థాగత పరిపాలన హక్కులపై ఎక్కువగా ఫోకస్ చేశామని ఐఐఎమ్-బెంగళూరులో కార్పొరేట్ స్ట్రాటజీ బోధించే రామచంద్రన్ జే తెలిపారు. బిజినెస్ గ్రూప్‌కు, సమ్మేళనానికి మధ్య ఉన్న తేడాను వివరించడంలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. టాటా గ్రూప్ చైర్మన్ పదవి, జనరల్ ఎలక్ట్రిక్ చైర్మన్ పదవి ఒకేలా ఉండవని పేర్కొన్నారు. జనరల్ ఎలక్ట్రిక్, ఒకే చట్టపరిధికిందకు వస్తే, టాటా గ్రూప్ బహుళ చట్టపరిధిల కిందకు వస్తాయని తెలుపడంతో ఇది ఓ ఉదాహరణ అని వెల్లడించారు. చైర్మన్ పోస్టు నుంచి ఓ వ్యక్తిని అర్థాంతరంగా తొలగించినప్పుడు ఇతర వ్యాపారాలపై పడే ప్రభావాన్ని వివరించడానికి కూడా బిజినెస్ స్కూళ్లకు ఇది ఓ కేస్ స్టడీలా ఉపకరిస్తుంది. ఫ్యామిలీ బిజినెస్‌లను, ఎమ్ఎఫ్ఏబీలను ప్రత్యేకంగా తమ కోర్సులో చేర్చినట్టు ఐఐఎమ్ ప్రొఫెసర్లు చెబుతున్నారు. నాయకత్వం, కార్పొరేట్ పాలన, సంస్థాగత సంస్కృతి, విక్రయించడం, విజన్, మిషన్ , బోర్డు విశ్వాసపాత్రమైన విధులు వంటి అన్నీ విషయాలను ఈ కేస్ స్టడీతో కవర్ చేస్తున్నామని ఎండీఐ-గూర్గావ్ స్ట్రాటజిగ్ మేనేజ్మెంట్ ఏరియా చైర్పర్సన్ విరేష్ శర్మ తెలిపారు. ఇది ఎంతో విలువైన లెసెన్స్ అని చెప్పారు. -
టాటా-మిస్త్రీ వివాదంతో...ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
• పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం.. • ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ న్యూఢిల్లీ: టాటా-మిస్త్రీ కార్పొరేట్ వివాదాన్ని నిశితంగా గమనిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. 100 బిలియన్ డాలర్ల విలువైన టాటా గ్రూప్‌లో సంక్షోభం కారణంగా దేశీ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని.. అందుకే దీనిపై ఓ కన్నేసి ఉంచినట్లు ఆయన వెల్లడించారు. ‘సాధారణంగా కొర్పొరేట్ వివాదాలు తలెత్తినప్పుడు ప్రభుత్వం తలదూర్చదు. టాటా సన్స వివాదం కూడా ఇలాంటిదే. ప్రభుత్వం ఈ విషయంలో చేసేదేమీ ఉండదు. ఇది వారి అంతర్గత వ్యవహారం. అరుుతే, దేశంలో అతిపెద్ద కార్పొరేట్ గ్రూప్ కావడంతో సహజంగానే ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఉంటుంది. అందుకే అక్కడ జరిగే పరిణామాలకు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలు, ఇతరత్రా వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నాం. అరుుతే, ప్రస్తుతానికి దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం’ అని మేఘ్వాల్ పేర్కొన్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంసీఏ)కు కూడా ఆయన ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఈ వివాదం అంశాన్ని నియంత్రణ సంస్థలేవీ ఇంకా తమ(ఎంసీఏ) దృష్టికి తీసుకురాలేదని చెప్పారు. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని అర్ధాంతరంగా తొలగించడం.. ఆతర్వాత రతన్ టాటా, టాటా గ్రూప్‌పై మిస్త్రీ తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. ప్రస్తుతం రతన్-మిస్త్రీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భయపడాల్సిన పనిలేదు... ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన అంశంపై స్పందిస్తూ... ఎల్ఐసీ ఒక్కటే కాదు.. దేశీ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు టాటా గ్రూప్‌తో సంబంధం ఉంది. ఆర్థిక వ్యవస్థలో టాటాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. అరుుతే, ప్రతిష్టాత్మకమైన గ్రూప్‌గా పేరొందిన టాటా.. ఈ అంతర్గత వ్యవహరాన్ని పరిష్కరించుకోగలదని భావిస్తున్నా. కాబట్టి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. ఈ అంశం ప్రభుత్వం, నియంత్రణ సంస్థల ముందుకు వస్తే... నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని మేఘ్వాల్ పేర్కొన్నారు. ఎల్ఐసీకి టాటా మోటార్స్‌లో 7%, టాటా స్టీల్‌లో 13.91%, టాటా పవర్లో 13.12%, ఇండియన్ హోటల్స్‌లో 8.76% చొప్పున వాటాలున్నారుు. దొరాబ్జీ ట్రస్ట్‌కు ఖంబాటా రాజీనామా... టాటా కుటుంబానికి చెందిన కీలక ట్రస్టుల్లో ఒకటైన సర్ దొరాబ్జీ ట్రస్టీ సారథ్యం నుంచి డేరియస్ ఖంబాటా వైదొలిగారు. మాజీ అదనపు సొలిసిటర్ జనరల్, లాయర్ అరుున ఖంబాటా ట్రస్ట్రీ పదవికి గత నెల 25న రాజీనామా చేశారు. తన వృత్తిపరమైన అవసరాలు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, మిస్త్రీని చైర్మన్ పదవి నుంచి తొలగించిన(అక్టోబర్ 24న) మర్నాడే ఈ ఖంబాటా రాజీనామా చోటుచేసుకోవడం గమనార్హం. టాటా ట్రస్ట్‌ల సూచనల మేరకే మిస్త్రీని తొలగించినట్లు టాటా సన్స ప్రకటించిన విషయం తెలిసిందే. టాటా గ్రూప్ కంపెనీలకు హోల్డింగ్ కంపెనీ అరుున టాటా సన్‌సలో టాటా ట్రస్ట్‌లకు 66 శాతం వాటా ఉంది. ఈ ట్రస్టుల్లో సర్ దొరాబ్జీ, రతన్ టాటా ట్రస్టులో అతిపెద్దవి. నిబంధనల ప్రకారమేముంద్రా ప్రాజెక్టు: టాటా పవర్ ముంద్రా అల్ట్రా పవర్ ప్రాజెక్టు(యూఎంపీపీ) విషయంలో చట్టపరమైన అంశాలన్నింటినీ పూర్తిగా పాటించామని టాటా పవర్ వివరణ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు అనవసరంగా అధిక ధరకు టాటా పవర్ బిడ్ చేసిందని.. దీని వల్ల భారీ మొత్తంలో పెట్టుబడులను నష్టపోవాల్సి(రైట్ డౌన్) వస్తుందంటూ చైర్మన్ పదవి నుంచి వేటు పడిన మిస్త్రీ తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. టాటా పవర్‌తో పాటు టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా డొకోమో తదితర గ్రూప్ కంపెనీలకు సంబంధించి 18 బిలియన్ డాలర్లకు(దాదాపు రూ.1.2 లక్షల కోట్లు)పైగానే రైట్‌డౌన్ చేయాల్సి రావచ్చని మిస్త్రీ బాంబు పేల్చడంతో.. సంబంధిత కంపెనీలను స్టాక్ ఎక్స్ఛేంజీలు వివరణ కోరారుు. ‘2006లో ముంద్రా యూఎంపీపీకి బిడ్ చేసినప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ పరిశీలన విధానం అమల్లోలేదు. ప్రతిపాదనలపై బోర్డు చర్చించాకే ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు వివరాలు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాటాదారులకు తెలియజేస్తున్నాం. సెబీ నిబంధనలమేరకే నడుచుకుంటున్నాం’ అని టాటా పవర్ పేర్కొంది. ఇండియన్ హోటల్స్ కూడా.. సైరస్ మిస్త్రీ ఆరోపణల నేపథ్యంలో ఇండియన్ హోటల్స్ కూడా స్టాక్ ఎక్స్ఛేంజీలకు వివరణ ఇచ్చింది. నిబంధనలు, చట్టప్రకారమే తాము ఎప్పటికప్పుడు కంపెనీ ఫలి తాలు, వివరాలన్నింటినీ వెల్లడిస్తూ వస్తున్నామని పేర్కొంది. ఇండియన్ హోటల్స్‌కు విదేశాల్లో ఉన్న ఆస్తులతో పాటు ఓరియంట్ హోటల్స్‌లో ఉన్న వాటాలను నష్టాలకు అమ్ముకోవాల్సి వచ్చిందని మిస్త్రీ పేర్కొనడం తెలిసిందే. అంతేకాదు... తన హయాంకు ముందు(రతన్ టాటా చైర్మన్‌గా ఉన్నప్పుడు)అనుసరించిన విదేశీ కొనుగోళ్ల వ్యూహమే దీనికి కారణమని ఆయన ఆరోపించారు. -
మోదీ వద్దకు టాటాసన్స్ వివాదం ఎందుకు?
న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు రాజకీయాలకు, కేంద్రానికి మధ్యనున్న పారదర్శక పొర మరింత పలుచబడుతున్నట్లుంది. పదివేల కోట్ల డాలర్ల హోల్డింగ్ కంపెనీ ‘టాట్ సన్స్’ సంక్షోభం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వద్దకు వెళ్లడం ఈ విషయాన్ని సూచిస్తోంది. పదవీచ్యుతుడైన సైరస్ మిస్త్రీ, ఆయన స్థానంలో టాటా సన్స్ చైర్మన్‌గా తాత్కాలిక బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా పోటీ పడి ఒకరి తర్వాత ఒకరు వెళ్లి నరేంద్ర మోదీని కలుసుకొని ‘అసలు ఏం జరిగిందంటే...’అంటూ వివరణలు ఇచ్చుకోవడం కార్పొరేట్ రంగంలో చర్చనీయాంశం అయింది. అక్టోబర్ 24వ తేదీన టాటా సన్స్ కంపెనీ బోర్డు మీటింగ్‌లో చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన విషయం తెల్సిందే. అనంతరం కంపెనీ తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా ప్రధాని మోదీకి సుదీర్ఘ లేఖ రాశారు. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన్ని తొలగించాల్సి వచ్చిందో ఆ లేఖలో వివరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత టాటా కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీకి స్వయంగా ఫోన్‌చేసి కంపెనీలో చోటుచేసుకున్న పరిణామాలను వివరించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నరేంద్ర మోదీ, టాటాకు సుపరిచితుడు. పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో కంపెనీకి కేటాయించిన స్థలం వివాదం అవడంతో నానో కార్ల కంపెనీని అక్కడి నుంచి గుజరాత్‌కు తరలించేందుకు టాటాకు మోదీ సహకరించిన విషయం తెల్సిందే. ప్రధానితో టాటాకున్న సాన్నిహిత్యం గురించి బాగా తెల్సిన సైరస్ మిస్త్రీ అక్టోబర్ 27వ తేదీన ఢిల్లీకి వెళ్లి మోదీని కలుసుకున్నారు. టాటాసన్స్ పరిణామాలపై తన కథనాన్ని వినిపించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెల్సిన మరునాడే కంపెనీ విమానంలో రతన్‌టాటా ఢిల్లీకి వెళ్లి మోదీతో భేటి అయ్యారు. ప్రధాని మోదీ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇద్దరికీ సమయం కేటాయించారు. వారు చెప్పిన అంశాలను ఆసక్తిగా ఆలకించారని తెల్సింది. అయితే వీరేమీ చెప్పారో, వాటిపై ఆయన స్పందన ఏమిటో మాత్రం తెలియరాలేదు. ఓ కార్పొరేట్ కంపెనీలో చోటు చేసుకున్న అంతర్యుద్ధాన్ని రాజకీయ వేదికపైకి ఎందుకు తీసుకెళ్లారో అర్థం కావడంలేదని మిగతా కార్పొరేట్ ప్రపంచం విస్తుపోతోంది. ఇదివరకు ఏ కంపెనీ అంతర్గత కలహాల అంశంలో ఇలా జరగిన దాఖలాలు లేవని అంటోంది. ఇతర కంపెనీలకు టాటాసన్స్ గ్రూప్‌కు చాలా తేడా ఉందని, ఇది పబ్లిక్ ఇష్యూ కంపెనీల గ్రూపు కావడమే కాకుండా, దానిలో చోటుచేసుకునే పరిణామాలు మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందువల్ల ప్రధాని దృష్టికి తీసుకెళ్లడంలో తప్పేమి లేదని కొంత మంది ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. సైరస్ మిస్త్రీని కంపెనీ చైర్మన్ పదవి నుంచి తొలగించడంతో సంక్షోభ పరిస్థితులు సమసిపోలేదు. అసలు సంక్షోభ పరిస్థితులు ఆరంభమైనట్లు భావించవచ్చు. ఎందుకంటే మిస్త్రీ కుటుంబానికి టాటాసన్స్లో 18.4 శాతం వాటా ఉంది. అంటే ఆయన కుటుంబ సభ్యుల పేరిట 90వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నాయి. ఆయన్ని టాటాసన్స్ నుంచి తప్పించినా, అందులో డైరెక్టర్‌గా కొనసాగుతారు, టాటా పవర్, టాటా కెమికల్స్, జాగ్వర్ ల్యాండ్ రోవర్ లాంటి పలు టాటా గ్రూప్ కంపెనీలకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వాటి నుంచి కూడా ఆయన్ని తప్పించేందుకు ప్రయత్నిస్తే కంపెనీలో సంక్షోభ పరిస్థితులు మరింత తీవ్రం కాకతప్పదు. అప్పుడు ఎలాగు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు భారీ ఎత్తున టాటా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయి. ఒక్క యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ రెండు సంస్థలకు కలిపే టాటా స్టీల్స్‌లో 21 శాతం వాటా ఉంది. టాటా సన్స్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను స్టాక్ మార్కెట్‌ను నియంత్రించే సెబీ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. ఇందులో షేర్ హోల్డర్ల హక్కుల అంశం కూడా ఇమిడి ఉన్నందున సెబీ కూడా ఏ దశలోనైనా జోక్యం చేసుకోవచ్చు. అప్పుడు ప్రభుత్వ, సెబీ వైఖరుల ఎలా ఉంటాయో రానున్న పరిణామాలే సూచిస్తాయి. -
గ్రూప్ భవిష్యత్తు కోసమే మిస్త్రీపై వేటు..
• ఘాటుగా స్పందించిన రతన్ టాటా • అన్నీ ఆలోచించాకే కఠిన నిర్ణయం తీసుకున్నాం.. ముంబై: టాటా గ్రూప్‌లో ‘మిస్త్రీ’ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వేటు పడిన సైరస్ మిస్త్రీ, తాత్కాలిక చైర్మన్‌గా మళ్లీ బాధ్యతలు చేపట్టిన రతన్ టాటాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. మిస్త్రీ తాజా ఆరోపణలను తిప్పికొడుతూ రతన్ టాటా తమ ఉద్యోగులకు రాసిన తాజా లేఖలో తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘టాటా గ్రూప్ ఉజ్వల భవిష్యత్తు కోసమే మిస్త్రీని తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించాం. బోర్డు సభ్యులు దీన్ని తీవ్రంగా పరిశీలించి, చర్చించిన తర్వాతే నాయకత్వ మార్పు తప్పనిసరి అన్న కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. గ్రూప్ భవిష్యత్తు బాగుండాలంటే మిస్త్రీపై వేటు అత్యంత ఆవశ్యకమని బోర్డు సభ్యులంతా భావించారు’ అని రతన్ టాటా లేఖలో తేల్చిచెప్పారు. కొత్త నాయకత్వం వచ్చేంతవరకూ గ్రూప్‌లో స్థిరత్వం, నాయకత్వ లేమి లేకుండా చూడటం కోసమే తాను మళ్లీ తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించానని తన పునరాగమనాన్ని సమర్థించుకున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో టాటా గ్రూప్ అత్యున్నన్న స్థానాన్ని నిలబెట్టడమే తన ప్రస్తుత కర్తవ్యమని స్పష్టం చేశారు. డొకోమోతో నిర్ణయాలన్నీ రతన్‌కు తెలుసు: మిస్త్రీ జపాన్ టెలికం దిగ్గజం ఎన్టీటీ డొకోమోతో జాయింట్ వెంచర్‌కు (జేవీ) సంబంధించిన వివాదంలో సరిగ్గా వ్యవహరించలేదంటూ తనపై చేసిన పరోక్ష విమర్శలను తిప్పికొడుతూ మిస్త్రీ తాజా లేఖాస్త్రం సంధించిన కొద్దిసేపటికే రతన్ టాటా కూడా లేఖ రాయడం గమనార్హం.‘టాటా డొకోమో జేవీకి సంబంధించి, ఆ తర్వాత తలెత్తిన వివాదం విషయంలో అన్ని నిర్ణయాలకూ టాటా సన్స్ బోర్డు ఏకగ్రీవ ఆమోదం ఉంది. రతన్ టాటాకు తెలిసే ఇవన్నీ జరిగాయి’ అని మంగళవారం మిస్త్రీ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. డొకోమో వివాదాన్ని పరిష్కరించుకోవడంలో మిస్త్రీ అసమర్థంగా వ్యవహరించారని.. ఇది టాటా గ్రూప్ సంస్కృతి, సాంప్రదాయాలకు విరుద్ధమంటూ చేస్తున్న విమర్శలన్నీ నిరాధారమని మిస్త్రీ తిప్పికొట్టారు. దీనిపై టాటా గ్రూప్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. డొకోమో వివాదంలో తనను విమర్శిస్తున్నారన్న భావనలో మిస్త్రీ ఉన్నారని.. అయినా, ఈ అంశం కోర్టులో ఉందని చెప్పారు. లాభాలపైనే దృష్టిపెట్టండి.. మిస్త్రీపై వేటు(అక్టోబర్ 24న) తర్వాత గ్రూప్‌లోని దాదాపు 6.6 లక్షల మంది ఉద్యోగులను ఉద్దేశిస్తూ రతన్ టాటా లేఖ రాయడం ఇది రెండోసారి. కాగా, గ్రూప్ కంపెనీలన్నీ లాభాల మార్జిన్లు మెరుగుపరుచుకోవడం, మార్కెట్ వాటాను మరింత పెంచుకోవడంపైనే దృష్టిసారించాలని ఆయన నిర్ధేశించారు. గతంతో పోల్చుకోవద్దని.. ఒకరిని అనుసరించడం కాకుండా, ముందుండి నడిపించడమే లక్ష్యంగా పనిచేయాలని ఉద్యోగులకు ఉద్బోధించారు. ‘మీతో మళ్లీ కలిసిపనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఒక అత్యున్నత కార్పొరేట్ గ్రూప్‌గా దశాబ్దాలుగా పటిష్టంగా ఉన్న టాటా సంస్కృతి, విలువలను కాపాడేందుకు ప్రతిఒక్కరూ నిబద్ధతతో కృషిచేయాలి. అనేక సవాళ్లు, ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ.. గొప్ప కంపెనీలను నెలకొల్పడంలో, వాటాదారులకు మరింత విలువను అందించడంలో మీరు(ఉద్యోగులు) కనబరిచిన స్ఫూర్తి అద్వితీయం’ అని ఆయన రతన్ వ్యాఖ్యానించారు. రాజీనామా ప్రకంపనలు.. మిస్త్రీపై వేటు నేపథ్యంలో టాటా గ్రూప్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామాలు ఊపందుకుంటున్నాయి. చైర్మన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మిస్త్రీ హయాంలో ఏర్పాటైన గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను (జీఈసీ) కూడా టాటా సన్స్ డెరైక్టర్ల బోర్డు రద్దు చేయటంతో వీటిలో కీలక సభ్యులుగా ఉన్న ముకుంద రాజన్, నిర్మల్య కుమార్ తమ పదవుల నుంచి వైదొలిగారు. అదేవిధంగా టాటా కెమికల్స్ కూడా తమ నాన్-ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నిర్మల్య కుమార్ అక్టోబర్ 31న రాజీనామా చేసినట్లు తెలిపింది. జీఈసీలో మరో సుభ్యుడైన మధు కన్నన్ కూడా గత వారంలోనే టాటా గ్రూప్ నుంచి తప్పుకోవడం గమనార్హం. డొకోమో వివాదమేంటి..? 2009లో టాటా టెలీ సర్వీసెస్‌తో జాయింట్ వెంచర్(జేవీ) ఒప్పందం కుదుర్చుకున్న జపాన్ దిగ్గజం ఎన్టీటీ డొకోమో... 26.5 శాతం వాటాను రూ.12,700 కోట్లకు (షేరుకు రూ.117 విలువతో) కొనుగోలు చేసింది. అయితే, ఐదేళ్ల తర్వాత తాము కొనుగోలు చేసిన ధరలో సగం రేటుకు జేవీ నుంచి అవసరమైతే వైదొలిగే షరతుపై డొకోమో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టాటా డొకోమో జేవీ అనుకున్నంత విజయం సాధించకపోవడతో డొకోమో 2014 ఏప్రిల్‌లో వైదొలగాలని నిర్ణయించుకుం ది. షేరుకు రూ.58 ధర చొప్పున రూ.7,200 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది. అయితే, టాటాలు షేరుకు రూ.23.34 మాత్రమే ఇస్తామన్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏదైనా విదేశీ సంస్థ జేవీ తమ పెట్టుబడులను వెనక్కితీసుకోవాలంటే.. రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) ఆధారంగా కంపెనీ విలువను (వేల్యుయేషన్) లెక్కించాల్సి వస్తుందంటూ టాటా మెలికపెట్టింది. జేవీ నుంచి వైదొలగడానికి తమకు అవకాశం ఇవ్వడం లేదంటూ డొకోమో టాటా గ్రూప్‌పై అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది. టాటాలు ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకుగా ను 1.17 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.7,800 కోట్లు) నష్టపరిహారాన్ని ఇవ్వాలంటూ లండన్ ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశించింది. అయితే, భారతీయ విధానాలు, చట్టాలమేరకే తాము వ్యవహరిస్తామని.. ఆర్బిట్రేషన్ ఉత్తర్లులను అమలు చేయడం కుదరదని టాటా సన్స్ చెబుతోంది. -
మిస్త్రీకి దొరకని జైట్లీ అపాయింట్మెంట్..
• గొడవలో ప్రస్తుతానికి • తలదూర్చకూడదని ప్రభుత్వం నిర్ణయం! న్యూఢిల్లీ: టాటా గ్రూప్ ఆధిపత్య పోరులో ప్రస్తుతానికి జోక్యం చేసుకోకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసి తన వాదన వినిపించడం కోసం సైరస్ మిస్త్రీ ఆయన అపాయింట్మెంట్ అడిగారు. దీనికి జైట్లీ విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయంలో అటు మిస్త్రీ, ఇటు రతన్ టాటా... ఎవరినీ ప్రస్తుతానికి కలవకూడదని ఆర్థిక మంత్రి నిర్ణయించినట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘నాయకత్వ పోరులో ప్రభుత్వం ప్రస్తుతానికి వేలుపెట్టకూడదని భావిస్తోంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లేదా కోర్టులకు ఈ వివాదం చేరేవరకూ మంత్రులెవరూ మిస్త్రీ, టాటాలను కలిసే అవకాశం లేదు. ఒకరిపక్షాన నిలిచిందన్న ముద్ర పడకుండా ఉండటమే దీనికి ప్రధానకారణం. ఒకవేళ న్యాయపోరాటం మొదలైతే వివాదంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు’ అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, టాటా-మిస్త్రీ వివాదంలో చోటుచేసుకుంటున్న సంఘటనలను నిశితంగా గమనిస్తున్నామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. -
మిస్త్రీని తిలగిస్తే లక్ష కోట్లు చెల్లించాలా ?
-
టాటా- మిస్త్రీ మధ్య చర్చలు?
ముంబై: టాటా- మిస్త్రీ వివాదంలో ఆసక్తికర పరిణామాలుచోటు చేసుకుంటున్నాయి. గత వారంరోజులుగా సంచలనంగా మారిన టాటా- మిస్త్రీ వివాదానికి తెరపడనుందా? రచ్చకెక్కిన టాటా బోర్డు రూం డ్రామా కు చర్చల ద్వారా ముగింపు పలకాలని రతన్ టాటా చూస్తున్నారా? జాతీయ మీడియా అంచనాల ప్రకారం ఈ మేరకు రతన్ టాటా, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మధ్య మధ్యవర్తిత్వ చర్చలకు రంగం సిద్ధమైంది. సీనియర్ న్యాయవాది, టాటా సంస్థ ట్రస్టీ అయిన దారియస్ కాంబట ఈ చర్చలకు నేతృత్వం వహిస్తున్నట్టు సీఎన్ బీసీ టీవీ -18 పేర్కొంది. ఈ మేరకు ఆయన ఇద్దర్నీ కలిసి చర్చించనున్నారని సన్నిహిత వర్గాల సమాచారమని నివేదించింది. ఒకవైపు టాటాలోని మెజార్టీ స్టాక్ హోల్డర్స్, టాటా సన్స్ లోని షాపూర్జీ పల్లోంజి 18 శాతం ఆసక్తిగల కొనుగోలు దారులకోసం వెదుకుతోందని వార్తలు వచ్చాయి మరోవైపు టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు చెందిన ముగ్గురు సభ్యులు తాజాగా సంస్థకు గుడ్‌బై చెప్పారు. టాటా సన్స్ అడ్వైజరీ కౌన్సిల్లో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ మధు కన్నన్, వ్యూహకర్త నిర్మాల్య కుమార్, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ ఎన్ఎస్ రాజన్ ఉన్నారు. కాగా మహారాష్ట్ర మాజీ అటార్నీ జనరల్ దరియాస్ కాంబట టాటా గ్రూపునకు అత్యంత సన్నిహితులు. మరోవైపు ఈ వార్తలపై అటు టాటా సంస్థలనుంచి గానీ, మిస్త్రీ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. -
టాటా-మిస్త్రీ డైవర్స్ సెటిల్మెంట్ ఎంతో తెలుసా?
వారం రోజులుగా టాటా గ్రూప్ లో చెలరేగిన మిస్త్రీ రగడ తెగదెంపులు స్థాయికి చేరుకుంది. చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా మిస్త్రీని వెళ్లగొట్టిన టాటా గ్రూప్.. ఆయన కుటుంబ మెజార్టీ వాటాలను కూడా అమ్మేసి ఆ గ్రూప్‌ను వెళ్లగొట్టాలని పావులు కదుపుతోంది. అయితే ఈ తెగదెంపుల సెటిల్మెంట్ ఎంతో తెలుసా? అక్షరాలా 16బిలియన్ డాలర్లని(రూ. 1,06,886కోట్లు) బ్లూమ్ బర్గ్ నివేదించింది. టాటా సన్స్‌లో మిస్త్రీ కుటుంబం షాపూర్జీ, పల్లోంజి గ్రూప్ 18.4 శాతం స్టాక్ కలిగి ఉంది. ఆ స్టాక్ మిస్త్రీ 16 బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు డైవర్స్ సెటిలిమెంట్ కుదుర్చుకోవచ్చని తెలిపింది. టాటా సన్స్ లోని షాపూర్జీ పల్లోంజి 18 శాతం వాటాను విక్రయించాలనుకుంటే... ఆసక్తిగల ఫ్రెండ్లీ పార్టనర్స్ కోసం టాటా గ్రూప్ వెతుకుతోందని పేర్కొంది. సమర్థవంతమైన కొనుగోలుదారుల ప్రాథమిక చర్చలు కూడా ప్రారంభించినట్టు తెలిసింది. అర్థాంతరంగా తనపై వేటు వేయడంతో టాటా గ్రూప్‌పై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రతన్ టాటా హయాంలో జరిగిన కొనుగోళ్లు గ్రూప్‌పై తీవ్ర నష్టాల బారిన మోపాయని మిస్త్రీకి పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న టాటా స్టీల్ యూకే బిజినెస్‌లను విక్రయించడం వల్ల సంస్థకు నష్టమేమీ వాటిల్లలేదని ఆరోపించారు. టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన మిస్త్రీ, రతన్ టాటా మాదిరి సంస్థ ఆస్తులను పెంచలేకపోయారని వాదనలు ఉన్నాయి. అయితే రతన్ టాటా కూడా ఈ 2004-12 కాలంలో గ్రూప్ బుక్ విలువను ఏడు రెట్లు పెంచలేకపోవచ్చని పలువురు విశ్లేషకులంటున్నారు. ఒకవేళ అంతర్జాతీయంగా డిమాండ్ స్థిరంగా ఉంటే, గ్రూప్ ఆస్తుల బుక్ విలువ 28 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కంపెనీ 26 బిలియన్ డాలరల్ బుక్ విలువను కలిగి ఉంది. -
మిస్త్రీ.. ఏం చేస్తిరి?
-
విశ్వాసం కోల్పోయినందుకే వేటు!
మిస్త్రీ లేఖాస్త్రంపై తీవ్రంగా స్పందించిన టాటా సన్స్ • సారథిగా పూర్తి అధికారాలిచ్చాం...ఆరోపణలన్నీ నిరాధారం, కుట్రపూరితం... • బోర్డు సభ్యులకు రాసిన ‘రహస్య’ ఈ-మెయిల్ బయటికెలావచ్చింది? • మాపై బురదజల్లడం కోసమే లీక్ చేశారు.ఇది సంస్కారహీనమైన చర్య... • టాటాల సంస్కృతి, సాంప్రదాయాలను ఆయన మంటగలిపారు... ముంబై: విద్వేషాలు ఒక స్థాయికి చేరిపోతే ఇక పరువు మర్యాదల గురించి పట్టించుకోరనేది నానుడి. టాటా గ్రూప్ విషయంలో అలాగే జరుగుతోంది. దేశంలో నంబర్-1 గ్రూప్‌గా ఇన్నాళ్లూ ప్రజల విశ్వసనీయతను, గౌరవాన్ని అందుకున్న ఈ గ్రూప్ పరువు తాజా పరిణామాలతో వీధికెక్కుతోంది. సైరస్ మిస్త్రీని తొలగించాక ఆయన సంధించిన లేఖాస్త్రానికి... మళ్లీ టాటా సన్స్ డెరైక్టర్ల బోర్డు స్పందిం చింది. మిస్త్రీ ఏ స్థాయిలో అయితే విమర్శలు చేశారో... అదే స్థాయిలో టాటా గ్రూప్ కూడా విరుచుకుపడింది. డైరెక్టర్ల విశ్వాసాన్ని కోల్పోయినందుకే మిస్త్రీపై వేటు వేయాల్సివచ్చిందంటూ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘మిస్త్రీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమే కాదు! కుట్రపూరితమైనవి కూడా. ప్రతిష్టాత్మక టాటా గ్రూప్‌ను నడిపించే బాధ్యతను ఆయనకు పూర్తి అధికారాలతోనే కట్టబెట్టాం. అయినా, ఆయన అనేక విషయాల్లో డైరెక్టర్ల విశ్వాసాన్ని కోల్పోయారు. అసలు బోర్డు సభ్యులకు రాసిన రహస్య ఈ-మెయిల్లోని విషయాలు బయటికెలా వచ్చాయి? కావాలనే దీన్ని వెల్లడి చేశారనేది అర్థమవుతోంది కదా!! ఇది చాలా దురదృష్టకరం, సంస్కారహీనమైన చర్య’’ అని టాటా సన్స్ పేర్కొంది. మా సంస్కృతిని అతిక్రమించారు... ‘‘టాటా గ్రూప్‌లో ఉన్న విశిష్టమైన సంస్కృతి, సాంప్రదాయాలకు భిన్నంగా మిస్త్రీ పలుమార్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. టాటా గ్రూపు, టాటా సన్స్ బోర్డు, గ్రూప్‌లోని అనేక కంపెనీలతో పాటు గౌరవప్రదమైన వ్యక్తులపై కావాలని బురదజల్లడం కోసమే మిస్త్రీ తన లేఖలో నిరాధారమైన కుట్రపూరిత ఆరోపణలను చేశారు’’ అని టాటా సన్స్ తిప్పికొట్టింది. అంతేకాదు తనను ‘అచేతన’ చైర్మన్‌గా మార్చేశారన్న వ్యాఖ్యలను కూడా కొట్టిపారేసింది. ‘‘స్వతంత్రంగా వ్యవహరించేలానే ఆయనకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు అప్పగించాం. కానీ పదవి నుంచి తొలగించామనే ఉక్రోషంతో రతన్ టాటా హయాంలో తీసుకున్న నిర్ణయాలపై తప్పుదోవపట్టించే ఆరోపణలు చేశారు. అది చాలా దురదృష్టకరం. అంతేకాదు 2006 నుంచీ టాటా గ్రూప్‌తో ప్రత్యక్ష సాన్నిహిత్యం ఉన్న మిస్త్రీకి... గ్రూపుతో పాటు వివిధ కంపెనీలకు సంబంధించిన యాజమాన్య స్వరూపం, ఆర్థిక, నిర్వహణపరమైన విధివిధానాలన్నీ పూర్తిగా తెలుసు. గ్రూప్ ప్రతిష్టను మంటగలపడమే మిస్త్రీ ఆరోపణల లక్ష్యం. ఈ విషయంలో ఆయనను ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించలేం’’ అని కూడా టాటా సన్స్ తేల్చిచెప్పింది. పదవిలో ఉన్నప్పుడు గుర్తుకురాలేదా... టాటా గ్రూప్ కంపెనీల్లో కార్పొరేట్ నైతిక నిమయాల ఉల్లంఘన జరిగిందని మిస్త్రీ ఆరోపించటంపై కూడా టాటా సన్స్ తీవ్రంగానే స్పందించింది. ‘ఆయన చైర్మన్‌గా పదవిలో ఉన్నప్పుడు ఇవన్నీ ఆయనకు గుర్తుకురాలేదా? అప్పుడే వీటిని లేవనెత్తి ఉంటే బాగుండేది. అయినా, ఆయన చేసిన ఆరోపణలన్నీ అర్థరహితమని చెప్పేందుకు కంపెనీల వద్ద అనేక ఆధారాలున్నాయి. వీటన్నిటినీ అవసరమైనపుడు నియంత్రణ సంస్థలు, ఇతర ఏజెన్సీలకు అందిస్తాం’ అని పేర్కొంది. ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కలేదు.. ఉన్నపళంగా మిస్త్రీ ఉద్వాసనకు కారణాలేంటనేటు విషయమై టాటా సన్స్ వివరణిచ్చే ప్రయత్నం చేసింది. ‘‘మిస్త్రీ తీసుకున్న కొన్ని వ్యాపారపరమైన నిర్ణయాలు, అంశాలకు సంబంధించి బోర్డు డెరైక్టర్లు పదేపదే ప్రశ్నించారు. ఆందోళన కూడా వ్యక్తం చేశారు. టాటా ట్రస్ట్‌ల ధర్మకర్తలు కూడా మిస్త్రీ విశ్వసనీయత కోల్పోతున్నారంటూ అనేకమార్లు ఆందోళన వ్యక్తపరిచారు. ఆయన ఇవేమీ పట్టనట్లు వ్యవహరించారు. ఆయన తొలగింపు బోర్డు సభ్యుల సమిష్టి నిర్ణయం. మిస్త్రీ ఆరోపణలన్నీ అబద్ధాలే. వాటిపై మాట్లాడటమంటే మా గ్రూపు పేరుప్రతిష్టలకే అవమానకరం. సమస్యల నుంచి పారిపోవటమనేది మా గ్రూప్ మనస్తత్వం కాదు. అదేవిధంగా ఆరోపణల్ని అదేపనిగా తిప్పికొట్టాల్సిన పనీలేదు. గ్రూపు ఉజ్వల భవిత లక్ష్యంగా ఎలాంటి సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కొంటాం’’ అని టాటా సన్స్ స్పష్టం చేసింది. 6 లక్షల మంది ఉద్యోగుల స్ఫూర్తితోనే... ‘బోర్డు రూమ్‌లో అనుసరించే సాంప్రదాయాలు, విలువలు ఒక్కటే గ్రూప్ పటిష్టతకు కారణం కాదు. మొత్తం 6 లక్షల మందికిపైగా ఉద్యోగులు తమ విలువలకు కట్టుబడి పనిచేయడమే అన్నింటికంటే కీలకమైన అంశం. వారు అందిస్తున్న స్ఫూర్తి, సహకారంవల్లే గ్రూప్ ఇప్పుడు ఇంత ఉన్నతస్థానంలో నిలబడగలిగింది’ అని టాటా సన్స్ వ్యాఖ్యానించింది. ఆరోపణలపై దృష్టి పెడతాం...విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు టాటాల జాయింట్ వెంచర్ కంపెనీ ఎయిర్ ఏషియా ఇండియాలో రూ.22 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయంటూ మిస్త్రీ చేసిన ఆరోపణలపై కేంద్రం స్పందించింది. దీనిపై దృష్టిపెడతామని.. ఒకవేళ ఏవైనా నిబంధనల ఉల్లంఘన, ఆర్థిక అవకతవకలు జరిగినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తప్పవని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు గురువారం విలేకరులకు చెప్పారు. మలేసియాకు చెందిన ఎయిర్ ఏషియా, సింగపూర్ ఎయిర్లైన్స్లతో వేర్వేరు జాయింట్ వెంచర్ల ఏర్పాటు ద్వారా టాటా గ్రూప్ మళ్లీ విమానయాన రంగంలోకి అడుగుపెట్టడం తెలిసిందే. అయితే, రతన్ టాటా ఒత్తిడివల్లే ఈ రంగంలోకి గ్రూప్ మళ్లీ రావాల్సి వచ్చిందని మిస్త్రీ ఆరోపించారు. జేవీతో ఎఫ్‌డీఐ విధానానికి విఘాతం..: ఎఫ్ఐఏ న్యూఢిల్లీ: టాటా-ఎయిర్ఏషియా ఒప్పందం డీజీసీఏ (డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానానికి పూర్తి వ్యతిరేకమని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఎఫ్ఐఏ) పేర్కొంది. టాటా-ఎయిర్‌ఏషియాకు మంజూరు చేసిన ఆపరేషన్ ఏవియేషన్ అనుమతుల రద్దు కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు 2014 ఏప్రిల్ నుంచీ ఢిల్లీ హైకోర్టులో పెండింగులో ఉందని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లింది. ఢిల్లీ హైకోర్టులో ఇప్పటికి ఈ కేసు విచారణ 17 సార్లు వాయిదా పడిందని పేర్కొన్న ఎఫ్ఐఏ, కనీసం కేసు విచారణ వేగవంతానికైనా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. లెసైన్సుకు దరఖాస్తు చేసేటప్పుడు ఎయిర్ఏషియా తన బ్రాండ్ ఈక్విటీ ఎగ్రిమెంట్ వివరాలను వెల్లడించలేదని ఎఫ్ఐఏ పేర్కొంది. ‘నానో’ ఘనత రతన్దే: భార్గవ సామాన్యులకూ అందుబాటు ధరల్లో కారును అందించడం కోసం ‘నానో’కు రూపకల్పన చేసిన ఘనత రతన్ టాటా సొంతమని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ వ్యాఖ్యానించారు. టాటా మోటార్స్‌కు నానో గుదిబండగా మారిందని.. దీన్ని మూసేస్తేనే కంపెనీ బాగుపడుతుందంటూ మిస్త్రీ తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. ‘అత్యంత చౌక ధరకే కారు అందించాలన్న టాటాల ఉద్దేశం చాలా అభినందించదగినది. మేం (మారుతీ) కూడా ఇందుకు ప్రయత్నించలేదు. వాళ్లు చేసి చూపించారు’ అన్నారు. తాజా పరిణామాలపై స్పందిస్తూ... ఇది టాటా గ్రూప్ అంతర్గత వ్యవహారమని.. బయటి వ్యక్తులు దీనిపై వ్యాఖ్యలు చేయడం మంచిదికాదని చెప్పారు. మిస్త్రీని తొలగించిన విధానం తప్పు: సుప్రియా సూలే సైరస్ మిస్త్రీని తొలగించిన విధానం సరికాదని ఎన్సీపీ ఎంపీ, శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సూలే పేర్కొన్నారు. ‘పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలున్న టాటా గ్రూప్‌లో నిర్ణయాలన్నీ పారదర్శకంగా ఉంటాయి. విభేదాలుంటే ఉండొచ్చు. బోర్డు సభ్యులకు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం ఉంది. అయితే, చైర్మన్‌ను తొలగించే విషయంలో వారు అనుసరించిన విధానాన్నే నేను తప్పుబడుతున్నా. గౌరవప్రదంగా వ్యవహరించి ఉండాల్సింది’ అని ఆమె వ్యాఖ్యానించారు. సుప్రియకు మిస్త్రీ, ఆయన భార్య రోహికా మంచి స్నేహితులు కావడం గమనార్హం. అన్ని విషయాలను తెలియజేశాం: టాటా స్టీల్ తమ కంపెనీ కార్యకలాపాలు, వ్యవహరాలకు సంబంధించిన వివరాలన్నింటినీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేశామని టాటా స్టీల్, ఇండియన్ హోటల్స్ గురువారం వివరణ ఇచ్చాయి. మిస్త్రీ ఆరోపణలపై ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయాలేవీ లేవని స్పష్టం చేశాయి. కాగా, టాటా గ్రూప్‌లోని టాటా స్టీల్, ఇండియన్ హోటల్స్ ఇతరత్రా కంపెనీలు దాదాపు రూ.1.18 లక్షల కోట్ల నష్టాలను చవిచూడాల్సి(రైట్‌డౌన్) వస్తుందంటూ మిస్త్రీ లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. -
'మిస్త్రీ చేసింది క్షమించరాని తప్పు'
-
'మిస్త్రీ చేసింది క్షమించరాని తప్పు'
న్యూఢిల్లీ: టాటా సన్స్ సైరస్ మిస్త్రీల మధ్య పోటాపోటీ మాటల యుద్ధం మొదలైంది. తనకు వద్దన్నా బాధ్యతలు కట్టబెట్టి అనంతర స్వేచ్ఛ లేకుండా చేశారని, ప్రతి విషయంలో రతన్ టాటా జోక్యం చేసుకున్నారని, బోర్డు సభ్యులెవరూ తన మాటను సరిగా వినలేదని సైరస్ మిస్త్రీ చెప్పగా.. అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలని టాటా సన్స్ కొట్టి పారేసింది. టాటా సన్స్ బోర్డు సైరస్ మిస్త్రీపై విశ్వాసం కోల్పోయిందని చెప్పింది. సైరస్ మిస్త్రీ చేసిన ఏ ఆరోపణలకు కూడా ఆధారాలే లేవని, ఆయన తనను తాను రక్షించుకునేందుకు చేసిన చర్యేనని గురువారం ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. 'టాటా సన్స్ బోర్డు తన చైర్మన్‌కు అవకాశాలను సమన్వయం చేసుకునేందుకు సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన స్వయం అధికారాన్ని ఇచ్చింది. కానీ, కంపెనీ విలువలకు, పద్ధతికి మిస్త్రీ దూరంగా జరిగారు. మొత్తానికి పలు కారణాల మూలంగా మిస్త్రీ బోర్డు సభ్యుల విశ్వాసాన్ని కోల్పోవడం దురదృష్టకరం' అని కూడా ఆ ప్రకటన పేర్కొంది. మిస్త్రీ కంపెనీ ప్రతిష్టను ఉద్యోగుల దృష్టిలో కళంకితం చేశారు. అది క్షమించరానిది' అని కూడా లేఖలో చెప్పారు. -
బ్రాండ్ ఇమేజ్‌కు ‘టాటా’
సాక్షి, బిజినెస్ విభాగం : టాటా గ్రూప్‌లో సంక్షోభానికి రతన్‌టాటా-సైరస్ మిస్త్రీల మధ్య ఏర్పడిన వ్యక్తిగత విబేధాలే కారణమన్నది మెల్లగా స్పష్టమవుతోంది. ఇంటిపేరు కూడా కలిసిన వారసుడు రతన్‌టాటా... గ్రూప్‌లో అతిపెద్ద వాటాదారుకు వారసుడు సైరస్ మిస్త్రీ... ఇద్దరిలో ఎవరూ కూడా వందేళ్ల టాటా గ్రూప్ ఇమేజ్ను పట్టించుకోలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. కుటుంబ అధిపత్యం ఉన్న కార్పొరేట్ కంపెనీలు కూడా ఏ సీఈఓనూ, ఎండీనీ బయటకు పంపించని రీతిలో మిస్త్రీని టాటాలు అగౌరవ పరిచి ఉద్వాసన చెప్పారన్నది నిస్సందేహం. ఇక ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ టాటా సన్స్ డెరైక్టర్ల బోర్డుకు రాసిన లేఖలో రతన్‌పై చేసిన తీవ్ర ఆరోపణలు గ్రూప్ స్థాయిని మరింత దిగజార్చాయి. రతన్- సైరస్ మిస్త్రీ ఇద్దరూ ఒకరిపై ఒకరు బురద చల్లుకునే స్థితికి వచ్చేశారంటే వ్యక్తిగత విబేధాలు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు. టాటా గ్రూప్ వెతలకు బాధ్యులెవరు? ఇక్కడ గమనించాల్సిందొకటుంది. మిస్త్రీ లేఖలో చేసిన ఆరోపణల్లో వ్యక్తిగతమైనవి పక్కనబెడితే ప్రధానమైనది గ్రూప్ రుణభారం పెరిగిపోయిందనేది. కోరస్ స్టీల్ కొనుగోలు, ముంద్రా ప్రాజెక్టులో టాటా పవర్ పెట్టిన పెట్టుబడులు, ఇండియన్ హోటల్స్ విదేశాల్లో భారీ ధరకు కొన్న హోటళ్లు... వాటన్నిటితో రూ.1.18 లక్షల కోట్లు రైటాఫ్ చేయాల్సి ఉంటుందని మిస్త్రీ పేర్కొన్నారు. నిజానికివన్నీ రతన్ టాటా హయాంలో జరిగినవే. కానీ ఆ మూడు రంగాల పనితీరూ కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా బాగులేదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నపుడు, ఆయా రంగాల వృద్ధి జోరుగా వున్నపుడు చేసిన టేకోవర్లు అవి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ వ్యాపారాలు బాగులేనపుడు... మిస్త్రీ వాటిని చక్కదిద్దలేకపోయారని నిందించటమూ సరికాదు. ఉక్కుకు డిమాండ్ లేనంత మాత్రాన మిట్టల్ ఉక్కు వ్యాపారాన్ని వదిలేశారా? అనిల్ అంబానీ, అదానీలు పవర్ వ్యాపారాన్ని అమ్ముకున్నారా? అలాంటిది వందేళ్లుగా 100 రకాల వ్యాపారాన్ని చేస్తూ...ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్న టాటా గ్రూప్ వీటిని వదిలించుకోవాల్సిన పనిలేదన్నది రతన్ వాదన కావొచ్చు. గ్రూప్ ప్రమోటర్లయిన టాటా ట్రస్టులు.. తన పనితీరునే ప్రామాణికంగా చూస్తున్నపుడు ఈ వ్యాపారాల నుంచి వైదొలిగి.. గ్రూప్ రుణభారాన్ని తగ్గించే ప్రయత్నా ల్ని చేయటం తప్పు కాదన్నది మిస్త్రీ మాట. ఈ లెక్కన గ్రూప్ వెతలకు ఇద్దరినీ బాధ్యులుగా చూడలేం. ఆ ‘తీరే’ ఇబ్బందికరం... పనితీరు నచ్చనంత మాత్రాన ఏ కంపెనీ సీఈఓకూ హఠాత్తుగా ఉద్వాసన చెప్పరు. గౌరవంగా వైదొలిగే మార్గాన్ని కల్పిస్తారు. తాజా పరిణామాలు చూస్తే... మిస్త్రీ తీరు కొన్నాళ్లుగా రతన్ టాటాకు నచ్చకపోయి ఉండొచ్చు. కానీ తొలగింపు నిర్ణయం ఆకస్మికమేనని స్పష్టమవుతోంది. మిస్త్రీ తాజా లేఖ దీనికి అద్దం పడుతోంది. నిజానికి ఈ తొలగింపునకు రతన్ టాటాలో పెరిగిన వ్యక్తిగత విద్వేషమే కారణమై ఉండొచ్చని మిస్త్రీ లేఖ చెబుతోంది. రతన్ టాటాపై ఆయన చేసిన వ్యక్తిగత ఆరోపణలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఇక టాటా సన్స్ బోర్డు సమావేశం జరుగుతున్నపుడు డెరైక్టర్లు బోర్డు రూమ్ నుంచి వెలుపలికి వెళ్లి రతన్ టాటాకు ఫోన్లు చేసేవారని, ఇవి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు దారితీస్తాయన్న తీవ్ర ఆరోపణను కూడా మిస్త్రీ సంధించారు. ఇవన్నీ వీరిద్దరి మధ్య ఉన్న అగాథాన్ని బయటపెట్టేవే. అ అగాథం సంగతెలా ఉన్నా... మిస్త్రీ లేఖతో కొంత మిస్టరీ వీడింది. బ్రాండ్ పరువు బజారులో పడింది. -
‘మిస్టరీ’ బాంబు పేలింది!
రతన్‌టాటాపై తీవ్రంగా విరుచుకుపడుతూ సైరస్ మిస్త్రీ లేఖ ♦ నన్ను ‘అచేతన’ చైర్మన్‌గా మార్చారు.. ♦ నాకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ పవర్ సెంటర్లను ప్రోత్సహించారు.. ♦ బోర్డు సమావేశంలో నాపై వేటుకు షాక్ తిన్నా... ♦ కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు.. ♦ కార్పొరేట్ రంగ చరిత్రలో ఇలాంటిదెప్పుడూ జరిగి ఉండదు... ♦ నానోను మూసేస్తేనే టాటా మోటార్స్ బాగుపడుతుంది ♦ ఆ 5 కంపెనీలతో రూ.1.18 లక్షల కోట్ల నష్టం ♦ కోరస్ స్టీల్‌తోనే 10 బిలియన్ డాలర్లను వదులుకోవాల్సి వస్తోంది ♦ రతన్ హయాంలో విదేశీ కొనుగోళ్లతో గ్రూప్ సమస్యల్లో కూరుకుపోయిందని ఆరోపణలు... ముంబై: టాటా గ్రూప్‌లో యాజమాన్య లుకలుకలపై ‘మిస్త్రీ’ బాంబు పేల్చారు. తనపై వేటు వెనుక ‘మిస్టరీ’ గుట్టువిప్పారు. తొలిసారి లేఖ రూపంలో మాటల యుద్ధానికి తెరతీశారు. అర్ధంతరంగా చైర్మన్ పదవి నుంచి తొలగించాక ఆయన రతన్ టాటా, టాటా సన్స్ బోర్డు సభ్యులపై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. తనపై వేటు వేయడం షాక్‌కు గురిచేసిందంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. టాటా సన్స్ బోర్డు సభ్యులకు ఈ-మెయిల్ ద్వారా మంగళవారమే ఆయన లేఖను పంపారు. ‘‘గ్రూప్ నాయకత్వ బాధ్యతలు అప్పగించాక స్వేచ్ఛగా పనిచేయకుండా నా చేతులు కట్టేశారు. అచేతన చైర్మన్‌గా మార్చేశారు. అంతేకాదు! టాటా గ్రూప్‌లో నిర్ణయాధికారాలకు సంబంధించి మార్పులు చేయడం ద్వారా రతన్ టాటా.. నాకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ అధికార కేంద్రాలనూ సృష్టిం చారు’’ అని కుండబద్దలుగొట్టారు. రతన్ టాటా గతంలో కొనుగోలు చేసిన విదేశీ సంస్థలు.. ముఖ్యంగా టాటా స్టీల్ యూకే(గతంలో కోరస్) కారణంగా గ్రూప్ తీవ్ర నష్టాలను చవిచూసిందని కూడా చెప్పారు. మొత్తంమీద మిస్త్రీ ఉద్వాసనకు రతన్ టాటాతో ఆయనకున్న విభేదాలే కారణమన్నది ఆయన లేఖ ద్వారా స్పష్టమయ్యింది. అంతేకాదు.. మిస్త్రీ రతన్ టాటాపై, గ్రూప్ కార్యకలాపాలపై చేసిన ఆరోపణలు కూడా టాటా బ్రాండ్ ఇమేజ్, పేరు ప్రతిష్టలను దెబ్బతీస్తాయనేది పరిశీలకుల అభిప్రాయం. వేటు అన్యాయం... ‘‘దేశంలో అతిపెద్ద కార్పొరేట్ గ్రూప్ చైర్మన్ పదవి నుంచి నన్ను తొలగిస్తున్నామని చెప్పిన బోర్డు సభ్యులు... కనీసం తగిన వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా సంప్రదాయాలను తుంగలో తొక్కారు. బహుశా ప్రపంచ కార్పొరేట్ రంగ చరిత్రలోనే మునుపెన్నడూ ఇలాంటిది జరిగి ఉండదని నా ఉద్దేశం. బోర్డు సమావేశంలో జరిగిన సంఘటనలతో షాక్ తిన్నా. దీన్ని మాటల్లో చెప్పలేను కూడా. చడీచప్పుడు కాకుండా నన్ను తొలగించడం అన్యాయం. ఇది చెల్లుబాటు కూడా కాదు. దీన్ని పక్కనబెడితే.. మీరు (బోర్డు డెరైక్టర్లు) అనుసరించిన విధానం అత్యంత హేయం’’ అని మిస్త్రీ లేఖలో విరుచుకుపడ్డారు. స్వేచ్ఛ ఇస్తామన్న హామీ గాలికి... ‘‘2012, డిసెంబర్లో నన్ను టాటా సన్స్ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టినప్పుడు.. నాయకత్వం, నిర్ణయాల విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇస్తామని బోర్డు హామీనిచ్చింది. కానీ ఆ తర్వాత టాటాల కుటుంబ నిర్వహణలో ఉన్న ట్రస్టులు, టాటా సన్స్ బోర్డుల మధ్య నిర్ణయాధికారాలకు సంబంధించిన కంపెనీ నిబంధనలన్నింటినీ (ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్) మార్చేశారు. తద్వారా గ్రూపులో ప్రత్యామ్నాయ అధికార కేంద్రాలను సృష్టించారు. నన్ను స్వేచ్ఛగా పనిచేయనీయకుండా అడ్డుకున్నారు. హామీలన్నింటినీ గాలికి వదిలేశారు’’ అని మిస్త్రీ ఆవేదన వ్యక్తంచేశారు. డెరైక్టర్లు కాదు... రతన్‌కు పోస్ట్మన్లు! చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించినప్పటికీ తెరవెనుక నుంచి కథంతా రతన్ టాటాయే అనధికారికంగా నడిపించేవారని మిస్త్రీ పేర్కొనడం కూడా సంచలనం కలిగిస్తోంది. దేశంలో ఎంతో పేరు ప్రతిష్ఠలున్న టాటా గ్రూప్‌లో కార్పొరేట్ నైతిక నియమావళి (గ వర్నెన్స్) ఒట్టి మాటేనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘‘టాటాల కుటుంబ అదీనంలో ఉన్న టాటా ట్రస్ట్స్ (టాటా సన్స్‌లో 66% మెజారిటీ వాటా వీటిదే) ప్రతినిధులుగా బోర్డులో ఉన్న డెరైక్టర్లను రతన్ టాటా పోస్ట్మన్లుగా మార్చేశారు. వాళ్లు బోర్డు సమావేశాల మధ్యలో వెళ్లిపోయి రతన్ టాటా నుంచి సూచనలను తీసుకొని మళ్లీ వచ్చేవారు’’ అని మిస్త్రీ లేఖలో పేర్కొన్నారు. దీన్నిబట్టి.. రతన్‌టాటాతో పొరపొచ్చాలే మిస్త్రీపై వేటుకు ప్రధాన కారణమన్నది వాస్తవమని వెల్లడవుతోంది. నాయకత్వ బాధ్యతలు ఇచ్చినట్టే ఇచ్చి నా చేతులు కట్టేశారు. నన్నొక ‘అచేతన’ చైర్మన్‌గా మార్చేశారు. హఠాత్తుగా నన్ను తీసేస్తూ నిర్ణయం తీసుకోవడం, కనీసం వివరణ ఇచ్చుకోకుండా చేయడం... దీనిపై చిలువలుపలువలుగా ఊహాగానాలు వెల్లువెత్తేందుకు దారితీసింది. దీనివల్ల నాతోపాటు టాటా గ్రూప్ ప్రతిష్టకు కూడా తీవ్రమైన నష్టం వాటిల్లింది. పనితీరు నచ్చకపోవడంవల్లే నన్ను తొలగించారంటే నేను నమ్మను. ఎందుకంటే ఇద్దరు డెరైక్టర్లు ఇటీవలే నేను చాలా బాగా పనిచేస్తున్నానని ప్రశంసించారు కూడా. నా హయాంలో తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు(టాటా స్టీల్ యూకేను విక్రయించాలన్న నిర్ణయం సహా)... గ్రూప్ పతిష్ట, పేరు ప్రఖ్యాతులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చాలా ఆచితూచి తీసుకున్నవే. రతన్ టాటా హయాంలో తీసుకున్న చర్యలు, విదేశీ కొనుగోళ్లు, కొన్ని ప్రాజెక్టులు టాటా గ్రూప్‌ను తీవ్రంగా దెబ్బతీశాయని మిస్త్రీ తేల్చిచెప్పారు. ఇవన్నీ గ్రూపు ఆదాయాలను హరించేయడం కాకుండా.. బ్రాండ్ ఇమేజ్ను కూడా దెబ్బతీశాయనేది ఆయన స్పష్టం చేశారు. రతన్‌పై మిస్త్రీ ఆరోపణల్లో ప్రధానమైనవి ఇవి... నానో... కలల కారు కాదు, గుదిబండ! రతన్ టాటా తన ‘మానస పుత్రిక’గా ‘కలల కారు’గా రూపొందించిన నానో కారు ప్రాజెక్టు ఎందుకూ కొరగానిదిగా మారిందని మిస్త్రీ చెప్పారు. ‘ఈ నానో ప్రాజెక్టు వల్ల గ్రూప్ భారీ మొత్తంలో పెట్టుబడులను నష్టపోయింది. అయినాసరే భావోద్వేగాల (రతన్ కలల ప్రాజెక్టు అన్న కారణంగా) కారణంతో దీన్ని మూసేయకుండా కొనసాగిస్తున్నారు. అంతేకాదు!! ఈ ప్రాజెక్టును అపేస్తే... ఒక ఎలక్ట్రిక్ కారు కంపెనీకి ‘నానో గ్లైడర్స్’ సరఫరా నిలిచిపోతుంది. ఆ కంపెనీలో (యాంపియర్ అనే స్టార్టప్) రతన్ టాటాకు వాటా ఉంది కూడా. నానో గుదిబండగా మారినా మూసేయకపోవటానికి ఇదో కారణం’’ అని మిస్త్రీ ఆరోపించారు. రూ.లక్ష కంటే తక్కువకే నానో కారును ఇస్తామంటూ తీవ్రంగా ప్రచారం చేశారని.. అయితే, తయారీ వ్యయమే దీనికంటే అధికంగా ఉంటే ఎలా సాధ్యమని రతన్ టాటాపై చెణుకులు విసిరారు. ‘నానో వల్ల టాటా మోటార్స్ రూ.1,000 కోట్ల మేర నష్టపోవాల్సి వచ్చింది. దేశీ కార్యకలాపాలకు సంబంధించి కంపెనీ టర్న్ అరౌండ్ అవ్వాలంటే నానో ప్రాజెక్టును మూసేయడమే పరిష్కారం. అయితే, భావోద్వేగాల కారణంగా ఈ కీలక నిర్ణయం తీసుకోనివ్వలేదు’’ అన్నారు. విమానయాన రీఎంట్రీ రతన్ ఒత్తిడివల్లే... ‘‘టాటా గ్రూప్ మళ్లీ విమానయాన రంగంలోకి అడుగుపెట్టడానికి కూడా ఒకరకంగా రతన్ టాటా ఒత్తిడే కారణం. ఎయిర్ ఏషియా.. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో జాయింట్ వెంచర్ల (జేవీ) ఏర్పాటుకు బలవంతంగా నాతో ఒప్పించారు. ముందుగా అనుకున్నదానికంటే అధికంగా ఈ జేవీల్లో పెట్టుబడులు పెట్టేలా చేశారు. దీనిపై నాకు నిర్ణయాధికారం లేకుండా చేశారు’’ అని మిస్త్రీ పేర్కొన్నారు. అంతేకాదు.. టాటా గ్రూప్‌తో సంబంధం లేని సంస్థల ప్రమేయంతో సింగపూర్, భారత్‌లలో దాదాపు రూ.22 కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు తాజాగా ఫోరెన్సిక్ దర్యాప్తులో తేలినట్లు వెల్లడించారు. తద్వారా గ్రూపు కార్యకలాపాలకు సంబంధించి నైతికతపై కూడా ప్రశ్నలు తలెత్తేలా చేశారు. ఐదు కంపెనీలతో రూ.1.18 లక్షల కోట్ల నష్టం... రతన్ టాటా హయాం నుంచి తనకు వారసత్వంగా గుదిబండల్లాంటి కొన్ని వ్యాపారాలను అప్పగించారన్నారని మిస్త్రీ పేర్కొన్నారు. ‘‘ప్రధానంగా ఐదు నష్టజాతక వ్యాపారాల వల్ల సుమారు రూ.1.18 లక్షల కోట్లను కంపెనీ నష్టపోవాల్సిన (రైట్ డౌన్ చేసుకోవాల్సి రావడం) పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గ్రూప్ నెట్‌వర్త్ రూ.1.74 లక్షల కోట్లుగా ఉంది. ఇండియన్ హోటల్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ల కార్యకలాపాలు, టాటా స్టీల్ యూరోపియన్ కార్యకలాపాలు, టాటా పవర్‌కు చెందినకొన్ని విద్యుత్ యూనిట్లు, టెలికం వెంచర్ (టాటా డొకోమో) ఇందులో ఉన్నాయి. వీటికి మోయలేనంత రుణభారం కూడా ఉంది’’ అని పేర్కొన్నారు. టాటా స్టీల్‌తో 10 బిలియన్ డాలర్లు హుష్! రతన్ టాటా హయాంలో జరిపిన విదేశీ కొనుగోళ్లు కూడా గ్రూప్‌పై నష్టాల భారాన్ని మోపిందని మిస్త్రీ ఆరోపించారు. ఒక్క జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్), టెట్లే టీ కంపెనీలు మినహా మిగిలిన కంపెనీల కారణంగా గ్రూప్ అప్పుల భారం తారస్థాయికి చేరిందన్నారు. ఈ సమస్యాత్మక కంపెనీలన్నిటినీ వారసత్వంగా తనకు రతన్ టాటా అప్పగించారని కూడా పేర్కొన్నారు. ‘‘ముఖ్యంగా టాటా స్టీల్ యూరోపియన్ స్టీల్ వ్యాపారం (రతన్ టాటా కోరస్‌ను కొనుగోలు చేయడం ద్వారా వచ్చింది) వల్ల 10 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.67 వేల కోట్లు) పైగా విలువైన పెట్టుబడులను నష్టపోవాల్సి వస్తోంది. ఇండియన్ హోటల్స్‌కు (ఐహెచ్‌సీఎల్) చెందిన అనేక విదేశీ ఆస్తులతో పాటు ఓరియంట్ హోటల్స్‌లో వాటాలను కూడా తీవ్రమైన నష్టాలకు విక్రయించాల్సి వచ్చింది. గత హయాంలో ఐహెచ్‌సీఎల్ జరిపిన విదేశీ కొనుగోళ్ల వల్ల గడిచిన మూడేళ్లలో కంపెనీ మొత్తం నెట్‌వర్త్‌తో సమానమైన మొత్తాన్ని రైట్‌డౌన్ చేసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల ఇన్వెస్టర్లకు డివిడెండ్లు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. మరోపక్క, టాటా కెమికల్స్‌కు చెందిన యూకే, కెన్యా కార్యకలాపాలు కూడా నష్టాల్లో ఉన్నాయి. వీటికి సంబంధించి వదిలించుకోవటం వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇన్ఫ్రా రంగానికి టాటా క్యాపిటల్ ఇచ్చిన భారీ రుణాలన్నీ మొండిబకాయిలుగా మారాయి. వీటిని రాబట్టుకోవడం సవాలుతో కూడిన పని’’ అని పేర్కొన్నారు. తీవ్ర సమస్యల్లో టెలికం వ్యాపారం... ‘‘టాటా గ్రూప్ టెలికంలో ముందునుంచీ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. నా హయాంలోకి వచ్చేటప్పటికి చక్కదిద్దలేని స్థాయికి చేరింది. ఒకవేళ దీన్నుంచి వైదొలగితే (మూసేయడం లేదా అయినకాడికి అమ్మేయడం) 4-5 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుంది. టాటా డొకోమో జాయింట్ వెంచర్ సంస్థ నుంచి బయటికెళ్లిపోయిన జపాన్ కంపెనీ డొకోమోకు చెల్లించాల్సిన బిలియన్ డాలర్లకుపైగా మొత్తానికిది అదనం. ఇన్ని సమస్యలున్నప్పటికీ.. టాటా డొకోమో స్థూల లాభాలు గత మూడేళ్లలో రూ.400 కోట్ల నుంచి రూ.2,500 కోట్లకు పెరిగాయి.’’ టాటా పవర్‌కు ‘ముంద్రా’ షాక్... ఇండోనేసియా బొగ్గు తక్కువ ధరకు వస్తుందన్న అంచనాలతో ముంద్రా విద్యుత్ ప్రాజెక్టుకు టాటా పవర్ అధిక మొత్తానికి బిడ్డింగ్ వేయడంతో చేతులు కాలాయని మిస్త్రీ చెప్పారు. ప్రాజెక్టు వచ్చాక నిబంధనలు మారిపోవడంతో 2013-14లో రూ.1,500 కోట్ల నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చిందన్నారు. ముంద్రాలో రూ.18,000 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందని, భవిష్యత్తులో భారీగా పెట్టుబడులు కోల్పోవాల్సి వస్తుందని మిస్త్రీ పేర్కొన్నారు. -
మిస్త్రీ.. కుటుంబాన్ని త్యాగం చేశారు: మహిళా ఎంపీ
టాటా గ్రూపును బలోపేతం చేయడానికి, ఆ సంస్థలను లాభాల బాట పట్టించడానికి సైరస్ మిస్త్రీ ఎంతగానో కష్టపడ్డారని, అందుకోసం ఆయన తన కుటుంబ జీవితాన్నికూడా త్యాగం చేశారని మిస్త్రీ కుటుంబానికి స్నేహితురాలు, మహిళా ఎంపీ సుప్రియా సూలే అన్నారు. ఆయన పనితీరు బాగోలేదని చెప్పడం సరికాదని ఆమె అన్నారు. సైరస్ మిస్త్రీ, ఆయన భార్య రోహికా చాగ్లా ఇద్దరూ తనకు మంచి మిత్రులని ఆమె చెప్పారు. టాటా గ్రూపు చైర్మన్‌గా ఉన్న సైరస్ మిస్త్రీ (48)ని సోమవారం సాయంత్రం మార్కెట్లు ముగిసిన తర్వాత హఠాత్తుగా ఆ పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో మళ్లీ రతన్ టాటాను నియమించిన విషయం తెలిసిందే. టాటా గ్రూపులో అతిపెద్ద స్టేక్‌హోల్డర్లలో ఒకటైన షాపూర్జీ పల్లోంజీ గ్రూపునకు చెందిన సైరస్ పల్లోంజీ మిస్త్రీని తొలగించడానికి ప్రధాన కారణం ఆయన పనితీరు బాగోకపోవడమేనని చెప్పారు. అయితే, సైరస్ మిస్త్రీ తన కుటుంబ వ్యాపారాలను కూడా విజయవంతంగా నడిపిస్తున్నారని ప్రముఖ మరాఠా నాయకుడైన శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే అన్నారు. టాటా గ్రూపు సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఆయన చాలా కష్టపడ్డారని తెలిపారు. -
బోర్డుపై మిస్త్రీ ఈమెయిల్ అస్త్రం!
-
కుండబద్దలు కొట్టిన టాటా!
మిస్త్రీ తొలగింపుపై తొలిసారి అధికారికంగా మీడియాకు వివరణ న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక రంగాన్ని తీవ్రంగా కుదిపేసిన ఘటన.. టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని ఉన్నపళంగా తొలగించడం.. చడీచప్పుడు లేకుండా, ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా హఠాత్తుగా ఇంత తీవ్రమైన నిర్ణయాన్ని టాటా గ్రూప్ తీసుకోవడానికి కారణం ఏమిటి? అన్నదానిపై అనేక కథనాలు వస్తూనే ఉన్నాయి. టాటా గ్రూప్ నష్టాల్లో ఉండటం, యూకే స్టీల్ పరిశ్రమను అమ్మేయడం వంటి కారణాల వల్లే మిస్త్రీని తొలగించినట్టు అనధికారిక వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తొలిసారిగా టాటా గ్రూప్ యాజమాన్యం అధికారికంగా ఈ విషయంలో స్పందించింది. టాటా గ్రూప్‌కు చెందిన సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ సభ్యుడైన వీఆర్ మెహతా తాజాగా ఈ విషయమై మీడియాతో ముచ్చటించారు. టాటా గ్రూప్‌లో 60శాతం వాటా కలిగిన ఈ ట్రస్ట్ అత్యంత శక్తిమంతమైనది. టాటా గ్రూప్ వ్యవహారాలన్నింటిలోనూ చాలావరకు ఈ ట్రస్ట్ మాటే చెల్లుబాటు అవుతుంది. దీని ట్రస్టీ అయిన వీర్ మెహతా ఓ టీవీచానెల్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ అనేక విషయాలు వెల్లడించారు. టాటా గ్రూప్ వరుసగా ఎదుర్కొంటున్న నష్టాలే మిస్త్రీ తొలగింపునకు బలమైన కారణమని ఆయన కుండబద్దలు కొట్టారు. గ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, జేఎల్ఆర్ (జాగ్వర్ ల్యాండ్ రోవర్) రెండు కంపెనీలపైనే మిస్త్రీ దృష్టి పెట్టారని చెప్పారు. ఈ రెండు కంపెనీలు తప్ప మిగతావన్నీ నష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా కంపెనీలు నష్టాల్లో ఉండటంతో ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు కోత పెట్టాల్సిన అగత్యం ఏర్పడిందని, దీనిని టాటాలు ఎంతమాత్రం ఒప్పుకోలేదని ఆయన వెల్లడించారు. మిస్త్రీ చైర్మన్‌గా టాటా గ్రూప్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకున్నారని, టాటా సైద్ధాంతిక ధర్మాలను ఆయన ఉల్లంఘించారని మెహతా స్పష్టం చేశారు. ముఖ్యంగా తన టెలికం భాగస్వామి అయిన డొకోమోకు వ్యతిరేకంగా న్యాయపోరు చేయాల్సి రావడం, ఈ పోరాటంలో ఓడిపోవడం వల్ల ఏకంగా 1.2 బిలియన్ డాలర్ల జరిమానా కట్టాల్సిన పరిస్థితి గ్రూప్‌కు ఏర్పడటాన్ని ఆయన ప్రస్తావించారు. 'ఇది '(డొకోమో కేసు) టాటాల సిద్ధాంతాలు, ధర్మాలకు అనుగుణమైనది కాదు. దీనిని మరింత సమర్థంగా ఎదుర్కొని ఉండాల్సింది' అని ఆయన అభిప్రాయపడ్డారు. అదేసమయంలో మిస్త్రీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత టాటా గ్రూప్, ట్రస్ట్ మధ్య అగాథం పెరిగిపోయిందని, ఇది కూడా మిస్త్రీ తొలగింపునకు దారితీసిన అంశాల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు. 'మిస్త్రీకి టాటా సన్స్ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన తర్వాత ట్రస్ట్ చైర్మన్‌గా రతన్ టాటానే కొనసాగారు. ఈ సమయంలో ట్రస్ట్‌కు, గ్రూప్‌కు మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. రతన్, మిస్త్రీ భేటీ అయినప్పుడు ట్రస్ట్ అంశాల గురించి చర్చించేవారు. కానీ ట్రస్ట్ వ్యక్తం చేసిన ఆందోళనలు చాలావరకు పరిష్కరించబడలేదు' అని ఆయన పేర్కొన్నారు. అయితే, మిస్త్రీని అకస్మాత్తుగా తొలగించిన వ్యవహారం తమకు బాధ కలిగిస్తున్నదని పేర్కొన్నారు. -
బోర్డుపై మిస్త్రీ ఈమెయిల్ అస్త్రం!
ముంబై: టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్ధాంతరంగా ఉద్వాసనకు గురైన సరైస్ మిస్త్రీ ఎట్టకేలకు స్పందించారు. చైర్మన్ పదవి నుంచి తనను తొలగించిన పద్ధతి షాక్ గురిచేసిందంటూ బోర్డు సభ్యలకు ఆయన ఈమెయిల్ సంధించారు. ఇలా తనను తొలగించడం బోర్డుకు ఏమాత్రం శోభకరం కాదని పేర్కొన్నారు. కనీసం తన వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశంలో అసాధారణ విపరీత చర్య అంటూ బోర్డు మీద మండిపడ్డారు. టాటా బోర్డులో తొమ్మిది మంది సభ్యలు ఉండగా.. అందులో ఆరుగురు మిస్త్రీ ఉద్వాసనను సమర్థించిన విషయం తెలిసిందే. దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒక్కటైన టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని తొలగించి.. ఆయన స్థానంలో తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటాను నియమించిన సంగతి తెలిసిందే. అత్యంత అవమానకరరీతిలో తనను తొలగించడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని మిస్త్రీ భావిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. అయితే, మిస్త్రీ లీగల్చర్యలు తీసుకోకుండా టాటా గ్రూప్ కూడా జాగ్రత్తలు తీసుకోంటుంది. లీగల్ చర్యలు నివారించేందుకు ఉద్దేశించిన కేవియట్ పిటిషన్లను బొంబాయి హైకోర్టులో టాటా గ్రూప్ దాఖలు చేసింది. అయితే, ప్రస్తుత దశలో లీగల్ చర్యలు తీసుకొనేందుకు మిస్త్రీ సిద్ధపడటం లేదని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. టాటా కంపెనీ ఆస్తులను అమ్మడం, ముఖ్యంగా రతన్ టాటా కొనుగోలు చేసిన యూకే స్టీల్ పరిశ్రమను అమ్మడం వల్లే టాటాలకు మిస్త్రీపై కోపం వచ్చిందని, అందుకే ఆయనను అర్ధంతరంగా తొలగించినట్టు రతన్ టాటా లీగల్ అడ్వైజర్ హరీష్ సాల్వే తెలిపారు. -
వ్యాపారం కంటే విలువలే ముఖ్యం : టాటా గ్రూప్
-
మిస్త్రీకి ‘టాటా’..బంతి ఇక కోర్టులోకి..!
-
బోర్డు రూం నుంచి కోర్టెక్కిన మిస్త్రీ వ్యవహారం!
టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ పల్లోంజి మిస్త్రీని ఉన్నపళంగా తప్పించడం తదుపరి దేశీయ కార్పొరేట్ రంగంలో పలు ఊహించని పరిణామాలు చేటుచేసుకుంటున్నాయి. బోర్డు రూం సైలెంటుగా జరిగిన ఈ రగడ.. కోర్టు గడప తొక్కే స్థాయికి వెళ్లింది. మిస్త్రీని తొలగిస్తూ గ్రూప్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని, దీనిపై పల్లోంజి గ్రూప్, సైరస్ మిస్త్రీ కోర్టుకు వెళ్లనున్నట్టు వదంతులు వచ్చాయి. దీంతో థర్డ్ పార్టీ ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే, కోర్టులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా ఉండేందుకు టాటా గ్రూప్ ముందస్తు జాగ్రత్తలు పడింది. బొంబాయి హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లలో టాటా గ్రూప్ కేవియట్ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్‌తో కోర్టును ఆశ్రయించిన వారి వాదనలే కాక, ఇతరుల అభిప్రాయాలను కూడా కోర్టులు పరిగణనలోకి తీసుకునే వీలుంటుంది. అనంతరం సైరస్ మిస్త్రీ కూడా రతన్‌టాటాకు, టాటా సన్స్‌కు, సర్ దోరబ్జీ సన్స్‌కు వ్యతిరేకంగా నాలుగు కేవియట్ పిటిషన్లు దాఖలు చేసినట్టు వార్తలొచ్చాయి. కానీ ఆ వదంతులను సైరస్ మిస్త్రీ, పల్లోంజి గ్రూప్ కొట్టేసింది. తాము ఎలాంటి కేవియట్ పిటిషన్లను దాఖలు చేయలేదని పల్లోంజి గ్రూప్ పేర్కొంది. ఎల్లప్పుడూ ప్రశాంతంగా జరిగే టాటా సన్స్ బోర్డు సమావేశాలు, సోమవారం నాటి భేటీలో మాత్రం ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. చిన్న చిన్న ఉద్యోగులకే నోటీసులు ఇచ్చిన తర్వాత తొలగించే కంపెనీలు, అత్యున్నత స్థాయి వారికి ఎంతో గౌరవమైన రీతిలో గుడ్ బై చెబుతాయి. కానీ టాటా గ్రూప్ అలా చేయలేదు. ఎలాంటి నోటీసులు లేకుండానే, అగౌరవమైన రీతిలో సైరస్ మిస్త్రీని తప్పించింది. దాని వెనుక కారణాలు కూడా టాటా గ్రూప్ వెల్లడించలేదు. లాభాపేక్ష లేని వ్యాపారాలకు సైరస్ మిస్త్రీ నిర్లక్ష్యం వహిస్తూ.. వాటికి ఉద్వాసన పలుకతున్నాడనే ఆరోపణలతో ఆయన్ను తప్పించినట్టు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. వాటిలో మేజర్ డీల్ యూరప్‌లో టాటా స్టీల్ వ్యాపారాలను విక్రయించడమేనని పేర్కొన్నాయి. ఈ నిర్ణయం సైరస్ మిస్త్రీ నేతృత్వంలోనే జరిగింది. ప్రస్తుతం టాటా గ్రూప్ తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటాను ఆ గ్రూప్ నియమించింది. నాలుగు నెలలో శాశ్వత చైర్మన్‌ను నియమించేందుకు ఓ కమిటీని కూడా గ్రూప్ ఎంపికచేసింది. కోర్టు రూంలో ఇదంతా సైలెంట్‌గానే జరిగింది. ఆ వార్త బయటికి వచ్చే దాక, మార్కెట్లకు గానీ, ఇతర కంపెనీ సంబంధిత వర్గాలకు కానీ ఈ న్యూస్ తెలియదు. ఎప్పుడైతే బోర్డు సైరస్ మిస్త్రీని తొలగిస్తున్నట్టు నిర్ణయించిందో అనంతరం మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మంగళవారం స్టాక్ మార్కెట్లలో కూడా ఎఫెక్టు కనిపించింది. టాటా గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయాయి. మిస్త్రీని తొలగించిన అనంతరం రతన్ టాటా, గ్రూప్ కంపెనీల సీఈవోలతో మంగళవారం భేటీ అయ్యారు. తమ తమ వ్యాపారాలపై దృష్టిసారించాలని ఆ గ్రూప్ అధినేతలను రతన్ టాటా ఆదేశించారు. కానీ సైరస్ మిస్త్రీని ఎందుకు తొలగించారనే దానిపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఈ రగడ కోర్టు మెట్లెక్కింది. తదుపరి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి. -
పెదవి విప్పిన సైరస్ మిస్త్రీ
ముంబై : మార్కెట్ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి రేపుతూ టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తనను ఉన్న పళంగా తొలగించడంపై వస్తున్న పుకార్లను సైరస్ మిస్త్రీ కొట్టిపారేశారు. నేడు ఓ మీడియా ప్రకటనను విడుదల చేశారు. ఈ 24 గంటలు జరిగిన తతంగమంతా ఆశ్చర్యకరమైనది కానప్పటికీ, చాలా సెన్సిటివ్ అని మాత్రం మిస్త్రీ పేర్కొన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అగౌరవమైన రీతిలో మిస్త్రీని తొలగించడంపై బోర్డు నిర్ణయంపై పల్లోంజి గ్రూప్, మిస్త్రీ కోర్టులో సవాలుచేయనున్నట్టు పలు టీవీ చానెల్స్ రిపోర్టు చేశాయి. ఈ మధ్యాహ్నం లోపు ఆయన బొంబాయి హైకోర్టు ఆశ్రయించనున్నట్టు పేర్కొన్నాయి. కానీ వ్యాజ్యాన్ని దాఖలు చేయడానికి పబ్లిక్ ప్రకటన తప్పనిసరి అని షాపూర్జీ పల్లోంజి గ్రూప్, మిస్త్రీ పేర్కొన్నారు. షాపూర్జీ గ్రూప్ కానీ, సైరస్ మిస్త్రీ గ్రూప్ కానీ ఇప్పటివరకు కోర్టుకు వెళ్తున్నట్టు ఎలాంటి ప్రకటన చేయలేదని, వ్యాజ్యాన్ని దాఖలు చేస్తాం అనే మీడియా ఊహాగానాలకు ఎలాంటి ఆధారాలు లేవని పల్లోంజి గ్రూప్ తెలిపింది. కోర్టుకు వెళ్లాలంటే పబ్లిక్ ప్రకటన తప్పనిసరి అని గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు. టాటా గ్రూప్ ముందస్తు జాగ్రత్తలు మరోవైపు టాటా గ్రూప్, సైరస్ మిస్త్రీలు కోర్టులో తమ వాదనలు వినిపించుకోవడానికి ముందస్తుగా జాగ్రత్తులు పడినట్టు తెలిసింది. టాటా గ్రూప్ హైకోర్టులో ముందస్తుగా ఓ కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేయగా... మిస్త్రీ కూడా టాటా సన్స్‌కు, రతన్‌టాటాకు, సర్ దోరబ్జీ ట్రస్ట్‌లకు వ్యతిరేకంగా నాలుగు కేవియట్ పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేసినట్టు వార్తలొచ్చాయి. కానీ తాను ఎలాంటి కేవియట్ పిటిషన్లను దాఖలు చేయలేదని మిస్త్రీ పేర్కొన్నారు. ఏకపక్షంలో వాదనలు మాత్రమే వినకుండా ఇతరుల అభిప్రాయాలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకునేలా ఈ కేవియట్ పిటిషన్లు దోహదం చేయనున్నాయి. సీఈవోలతో రతన్ టాటా భేటీ సోమవారం జరిగిన అనూహ్య నిర్ణయాల నేపథ్యంలో టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా, తన గ్రూప్ సీఈవోలందరితో భేటీ అయ్యారు. గ్రూప్ హెడ్ ఆఫీసు బొంబాయిలో ఈ భేటీ జరిగింది. ఇదేమీ యజమాన్య పరంగా వస్తున్న యుద్ధం కాదని మిస్త్రీ తొలగింపుపై రతన్ టాటా వ్యాఖ్యానించారు. సంబంధిత వ్యాపారాల్లో సహ అధినేతలు ఎక్కువగా దృష్టిసారించాలని రతన్ టాటా ఆదేశించారు. తన ఎంపిక స్వల్పకాలం మాత్రమేనని, కొత్త చైర్మన్ ఈ పదవికి త్వరలోనే ఎంపికవుతారని పేర్కొన్నారు. మార్కెట్ పొజిషన్‌పై దృష్టిసారిస్తూనే, పోటీవాతావరణంపై కూడా ఫోకస్ చేయాలని గ్రూప్ సీఈవోలకు రతన్ టాటా తెలిపారు. -
టాటా తదుపరి చైర్మన్ ఎవరు..?
ముంబై: టాటా గ్రూపు చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తప్పించడంతో ఖాళీ కానున్న పదవికి తగిన సమర్థులు ఎవరు? అన్న ఆసక్తికరమైన ప్రశ్నపై ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. అయితే, పెప్సీకో సీఈవో ఇంద్రానూయి, వొడాఫోన్ మాజీ సీఈవో అరుణ్శరీన్, నోయెల్ టాటా, టీసీఎస్ సీఈవో, ఎండీ ఎన్ చంద్రశేఖరన్, టాటా గ్రూపునకే చెందిన ఇషాంత్ హుస్సేన్, బి.ముత్తురామన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. టాటా గ్రూపు కంపెనీల హోల్డింగ్ సంస్థ టాటాసన్స్ తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా వ్యవహరించనున్నప్పటికీ... కొత్త చైర్మన్ ఎంపిక పూర్తి కావడం ఆలస్యం ఆయన నూతన వారసుడికి బాధ్యతలు అప్పగించి తన పదవి నుంచి తప్పుకోనున్నారు. పరిశీలనలో ఉన్న పేర్లు ఇవీ... టాటా గ్రూపు నూతన చైర్మన్ ఎంపిక ప్రక్రియ వచ్చే రెండు వారాల్లో ప్రారంభం అవుతుందని... మూడు నుంచి నాలుగు నెలలు ఇందుకు సమయం పడుతుందని ఎంపిక కమిటీ సన్నిహిత వర్గాల సమాచారం. అయితే, ఇప్పటికే పలు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా ఇద్దరి విషయంలో రతన్ టాటా చాలా సానుకూలతతో ఉన్నట్టు తెలుస్తోంది. వారు నోయెల్ టాటా, ఇంద్రానూయి. నోయెల్ టాటా తమ కుటుంబంలో వ్యక్తి కాగా, ఇంద్రానూయి పనితీరు రతన్ టాటాను ఆకట్టుకుంది. ముఖ్యంగా నోయెల్‌కు ఎక్కువ అవకాశాలున్నాయని, బయటి వ్యక్తి కంటే తమ కుటుంబంలో భాగమైన వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించవచ్చని ఆ వర్గాలు అంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన కంపెనీలతో విస్తరించిన టాటాగ్రూపును నడిపించేందుకు లోకల్ వ్యక్తి కాకుండా అంతర్జాతీయంగా పేరున్న వ్యక్తి అయితే బాగుంటుందన్నది టాటా గ్రూపు ఆలోచనగా తెలుస్తోంది. అలా చూసుకుంటే ఇంద్రానూయి ఈ విషయంలో ముందుంటారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆశ్చర్యం నుంచి అర్ధాంతరంగా.. సైరస్ మిస్త్రీ 1968, జూలై 4న జన్మించారు. లండన్ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్-టెక్నాలజీ అండ్ మెడిసిన్ నుంచి సివిల్ ఇంజినీరింగ్ పట్టా(గ్రాడ్యుయేషన్) పొందారు. తర్వాత లండన్ బిజినెస్ స్కూల్ నుంచి మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. 1991లో తండ్రి స్థాపించిన షాపూర్జీ పలోంజీ గ్రూప్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. కాగా, రతన్ స్థానంలో వారసుడిని ఎంపిక చేయటానికి నియమించిన కమిటీలో డెరైక్టర్ హోదాలో మిస్త్రీ కూడా అప్పుడు సభ్యుడే. అనూహ్యంగా కమిటీ మిస్త్రీనే నియమించింది. ఇక తొలగింపు నిర్ణయం తీసుకున్న బోర్డు సమావేశంలోనూ మిస్త్రీ పాల్గొన్నారు. ఆరుగురు సభ్యులు వేటు వేసేందుకు అనుకూలంగా ఓటేయగా... ఒక్క మిస్త్రీ మాత్రమే ప్రతిఘటించినట్లు సమాచారం. ఇది కూడా ఆయనకు ఒక విధంగా అనూహ్య సంఘటనే. 150 ఏళ్ల టాటా సామ్రాజ్య చరిత్రలో(1868లో ఆవిర్భావం) 1932లో నౌరోజీ సక్లత్వాలా తర్వాత టాటా గ్రూపునకు సారథ్యం వహించిన టాటాల కుటుంబేతర వ్యక్తి మిస్త్రీయే. అంతేకాదు! ఇప్పటివరకూ టాటా సన్స్‌కు ఆరుగురు చైర్మన్లుగా వ్యవహరించగా.. అతితక్కువ కాలం పదవిలో కొనసాగింది కూడా మిస్త్రీయే. మొత్తం తొమ్మిది మంది టాటా సన్స్ డెరైక్టర్ల బోర్డులో, అదేవిధంగా ఇతర గ్రూప్ కంపెనీల్లో కూడా డెరైక్టర్‌గా మిస్త్రీ కొనసాగనున్నారు. ప్రస్తుతం టాటా గ్రూప్‌లో 7 లక్షల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 100కు పైగా విభిన్న వ్యాపారాలను నిర్వహిస్తోంది. పదవీ విరమణ తర్వాత రతన్ టాటా గౌరవ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. -
మిస్త్రీ తొలగింపు వెనుక షాకింగ్ మిస్టరీ!
బోర్డు సమావేశంలో తీవ్ర గందరగోళం చెప్పపెట్టకుండా తొలగించిన టాటా గ్రూప్ కారణమిదే అంటున్న ఇన్సైడర్లు దేశ కార్పొరేట్ రంగాన్ని ఒక కుదుపు కుదిపిన సంఘటన.. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ పల్లోంజీ మిస్త్రీని తొలగించడం.. వందల బిలియన్ డాలర్లకుపైగా విలువైన టాటా గ్రూప్‌నకు సారథిగా వచ్చిన మిస్త్రీని... నిండా నాలుగేళ్లు కూడా కొనసాగకముందే సాగనంపారు. దేశ పారిశ్రామిక వర్గాల్ని తీవ్ర షాక్‌కు గురిచేసిన ఈ ఘటనకు అసలు కారణం ఏమిటి? సైరస్ మిస్త్రీని ఉన్నపళంగా అర్ధంతరంగా, అత్యంత అగౌరవమైనరీతిలో ఎందుకు తొలగించారు. మిస్త్రీని తొలగించడానికి కారణమైన సోమవారం నాటి బోర్డ్ మీటింగ్‌లో ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన వివరాల్ని ఒక జాతీయ మీడియా చానెల్ తన ఎక్స్‌క్లూజివ్ కథనంలో వివరించింది. ఆ వివరాలివి.. సాధారణంగా టాటా సన్స్ బోర్డ్ సమావేశాలు ప్రశాంతంగా ఒకింత ఊహించేరీతిలోనే జరుగుతాయి. కానీ సోమవారం నాటి భేటీ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. ఈ భేటీలోనే సైరస్ మిస్త్రీని ఉన్నపళంగా తొలగించాలన్న షాకింగ్ నిర్ణయాన్ని తీసుకొన్నారు. ఈ ఘటన గురించి విశ్వసనీయంగా తెలిసిన ఇద్దరు కంపెనీ ఇన్సైడర్లు (ఒకరు ఈ బోర్డు మీటింగ్‌లో పాల్గొన్నారు కూడా) అసలు ఏం జరిగిందో వివరించారు. మిస్త్రీ ఉద్వాసన నిర్ణయం ప్రకటించడంతో ఒక్కసారిగా బోర్డు మీటింగ్‌లో గందరగోళంతోపాటు అసాధారణ దృశ్యాలు కనిపించాయని వారు వివరించారు. కావాలనే బోర్డు ఎజెండాలో మిస్త్రీ ఉద్వాసన అంశాన్ని చేర్చలేదని తెలుస్తోంది. ఇతరత్రా కేటగిరీలో భాగంగా బోర్డు భేటీ ముందుకు వచ్చే అదనపు అంశంగా దీనిని చేపట్టినట్టు ఒక ఇన్సైడర్ తెలిపారు. (టాటా తదుపరి చైర్మన్ ఎవరు..?) తన తొలగింపు అంశం చర్చకు రావడంతో షాక్ తిన్న మిస్త్రీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది అక్రమమని మండిపడ్డారు. టాటా నిబంధనల పుస్తకం ప్రకారం కనీసం 15రోజుల ముందైనా నోటీసు ఇచ్చిన తర్వాత బోర్డు ఎదుట దీనిపై చర్చించాలని, అప్పుడు తన వాదన వినిపించుకొనేందుకు అవకాశముంటుందని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. అయితే, తాము ముందే "న్యాయసలహా' తీసుకున్నట్టు బోర్డు ఆయనకు స్పష్టం చేసింది. ఆ న్యాయసలహా తనకు చూపించాల్సిందిగా మిస్త్రీ డిమాండ్ చేయగా.. ఇదేమీ కోర్టు హియరింగ్ కాదంటూ తోసిపుచ్చింది. బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేయాలని మిస్త్రీ నిర్ణయించారు. మంగళవారం మధ్యాహ్నంలోపు ఆయన బొంబాయి హైకోర్టును ఆశ్రయించనున్నారు. టాటా సన్స్ బోర్డులో మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉండగా.. అందులో ఆరుగురు మిస్త్రీ ఉద్వాసనకు మద్దతు పలికారు. ఇద్దరు గైర్హాజరయ్యారు. తొమ్మిదో సభ్యుడైన మిస్త్రీ ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు నిరాకరించారు. అయితే, టాటా బోర్డు సభ్యుడిగా, డైరెక్టర్‌గా ఆయన కొనసాగనున్నారు. సైరస్ మిస్త్రీ ఉద్వాసనకు కారణం ఏమిటన్న దానిపైనా ఇన్సైడర్లు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. మిస్త్రీపై టాటా బోర్డుకు వ్యక్తిగత కోపం ఏమీ లేదని, కేవలం సీఈవోగా ఆయన పనితీరు నచ్చకపోవడం వల్లే ఇలా అర్థంతరంగా తొలగించారని చెప్తున్నారు. టాటా గ్రూప్‌లోని ఎన్నో కంపెనీలు ఉండగా మిస్త్రీ సారథ్యంలో కేవలం రెండు కంపెనీలు మాత్రమే లాభాల్లో ఉన్నాయని, మిగతా కంపెనీలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయని వారు తెలిపారు. టాటా గ్రూప్ సంప్రదాయ మర్యాదలు పాటించడం కంటే.. అంతర్జాతీయ పద్ధతి అయిన ఒక్కవేటుతో మిస్త్రీని తొలగించడానికి బోర్డు మొగ్గు చూపిందని మరో ఇన్సైడర్ వివరించారు. -
పనితీరు నచ్చకపోవడమే కారణమా...!
గ్రూపులోని వ్యాపారాలపై ఇప్పటికీ మిస్త్రీ పెద్దగా పట్టు సాధించలేకపోయారన్న విమర్శలున్నాయి. పెపైచ్చు ప్రధానంగా లాభాల్లో ఉన్న కంపెనీలపైనే (టీసీఎస్ ఇతరత్రా) అధికంగా దృష్టిపెట్టారని, నష్టజాతక కంపెనీలను సరిగ్గా పట్టించుకోవడం లేదని కూడా విమర్శలొస్తున్నాయి. వీటన్నిటికీ తోడు... టాటా గ్రూప్ ఇప్పటిదాకా ఉద్యోగాల్లో కోత పెట్టిన సందర్భాలు లేవని, మిస్త్రీ మాత్రం నష్టాలొస్తున్న కంపెనీల్లో ఉద్యోగుల్ని తొలగించడానికి ఏమాత్రం వెనకాడటం లేదని, ఇది టాటా గ్రూప్ విధానానికి వ్యతిరేకం కనక టాటా సన్స్‌కు ఇది నచ్చటం లేదన్న కథనాలూ వినవస్తున్నాయి. నష్టాల్లో ఉన్న కొన్ని కంపెనీల తీరును చూస్తే... టాటా స్టీల్ యూకే... బ్రెగ్జిట్ ఎఫెక్ట్ యూరప్‌లో తీవ్ర నష్టాల్లో ఉన్న స్టీల్ వ్యాపారం (గతంలో కోరస్ స్టీల్.. ఇప్పుడు టాటా స్టీల్ యూకే) సహా, ఇతర నష్టాల్లో ఉన్న కంపెనీలను వదిలించుకునే విషయంలో మిస్త్రీ ధోరణి బోర్డు సభ్యులకు నచ్చలేదని భావిస్తున్నారు. ముఖ్యంగా టాటా స్టీల్ యూకే ఆస్తులను రైటాఫ్ చేయడం, ఆ తర్వాత వాటిని విక్రయించడంపై టాటా ట్రస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 2016 తొలి త్రైమాసికంలో టాటా స్టీల్ రూ.3,000 కోట్ల భారీ నష్టాలను చవిచూడటానికి యూరప్ కార్యకలాపాలే కారణం. ఇక యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడం(బ్రెగ్జిట్) కూడా టాటా స్టీల్ యూకేతో పాటు మొత్తం గ్రూప్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. డొకోమో కేసు.... టాటా డొకోమో జాయింట్ వెంచర్ తెగదెంపులకు సంబంధించి జపాన్ భాగస్వామ్య సంస్థ డొకోమోతో కోర్టుల్లో న్యాయపోరాటం కూడా టాటా గ్రూప్‌పై తీవ్ర ప్రభావాన్నే చూపింది. దీన్ని ఎదుర్కోవడంలో కూడా మిస్త్రీ సమర్థంగా వ్యవహరించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తెగదెంపుల్లో తమకు 1.2 బిలియన్ డాలర్ల పరిహారాన్ని టాటా సన్స్ చెల్లించాలంటూ బ్రిటన్‌లో ఆర్బిట్రేషన్‌కు కూడా డొకోమో తెరతీసింది. ఈ మొత్తాన్ని చెల్లించకుంటే టాటాల ఆస్తులను అటాచ్ చేయాలని కూడా కోరుతోంది. చతికిలపడిన కొత్త కార్లు... టాటా మోటార్స్ ప్రతియేటా రెండు కొత్త కార్లను తీసుకొస్తుందంటూ మిస్త్రీ ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదు. విడుదల చేసిన టియాగో(జికా పేరును మార్చారు) బోల్ట్‌లు కూడా దేశీ మార్కెట్లో నిరాశపరిచాయి. మరోపక్క, బ్రెగ్జిట్ కారణంగా జేఎల్ఆర్పైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. దీన్ని ఎదుర్కొనే ప్రణాళికలను మిస్త్రీ సరిగ్గా రూపొందించలేదనే వాదనలు ఉన్నాయి. టర్నోవర్ పెద్దగా పెరగలేదు... మిస్త్రీ బాధ్యతలు చేపట్టేనాటికి టాటా గ్రూప్ టర్నోవర్ 100.99 బిలియన్ డాలర్లు (20-11-12లో) కాగా.. 2015-16లో 103 బిలియన్ డాలర్లకు చేరింది. వ్యాపారాల్లో వృద్ధి అంతంతమాత్రంగా ఉండటానికి నాయకత్వలోపమే కారణమని గ్రూప్ వర్గాలు భావిస్తున్నాయి. -
సైరస్ మిస్త్రీ తొలగింపుపై విమర్శలు
టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలకడం చట్టవిరుద్ధమని టాటా గ్రూప్‌లోని మెజార్టీ స్టాక్హోల్డర్స్ షాపూర్జీ, పల్లోంజి గ్రూప్ విమర్శిస్తోంది. మిస్త్రీని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం ఏకగ్రీవంగా జరిగిందని కాదని పేర్కొంటోంది. ఈ విషయాన్ని సీనియర్ లాయర్ మోహన్ పరశారణ్ నిర్థారించారు.మొత్తం తొమ్మిది మంది బోర్డు సభ్యులో ఎనిమిది మంది ఈ నిర్ణయం తీసుకోవడంలో ఓటింగ్‌లో పాల్గొన్నారని పల్లోంజి గ్రూప్ తెలిపింది. వారిలో ఆరుగురు మిస్త్రీ ఉద్వాసనకు మద్దతు పలుకగా, మిగిలిన ఇద్దరు వ్యతిరేకించారని వెల్లడించింది. సైరస్ మిస్త్రీని తప్పించే నిర్ణయం ఏకగ్రీవంగా జరిగిందనే టాటా సన్స్ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశీయ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలో ఒకటైన టాటా సన్స్ సైరస్ మిస్త్రీని విధుల నుంచి తప్పిస్తూ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటాను నియమించింది. పూర్తిస్థాయి చైర్మన్‌ను నాలుగు నెలల్లో సెలక్షన్ కమిటీ నియమించనుంది. ఈ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా రతన్ టాటా, వేణు శ్రీనివాసన్, అమిత్ చంద్రా, రోనెన్ సేన్, లార్డ్ కుమార్ భట్టాచార్య ఉన్నారు. మిస్త్రీ తొలగింపుపై ఎలాంటి కారణాలను టాటా సన్స్ వెల్లడించలేదు. కానీ లాభాపేక్ష లేని కంపెనీలను తొలగిస్తూ మిస్త్రీ తీసుకుంటున్న చర్యలతో టాటా సన్స్ అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను తొలగించిన్నట్టు సమాచారం. -
సైరస్ మిస్త్రీని ఎందుకు తప్పించారు?
-
సైరస్ మిస్త్రీని ఎందుకు తప్పించారు?
దేశీయ అతి పెద్ద ప్రైవేటు కార్పొరేట్‌గా పేరుగాంచిన టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ పల్లోంజి మిస్త్రీని తప్పించడం వెనుక కారణాలేమిటా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటాను నియమిస్తూ బోర్డు సోమవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. చైర్మన్ పదవి మార్పునకు టాటా గ్రూప్ ఎలాంటి కారణాలు వెల్లడించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. లాభాపేక్ష లేని వ్యాపారాలపై మిస్త్రీ అశ్రద్ధ వహించడం, వాటి విక్రయాలు జరుపుతూ ఇటీవల పలు నిర్ణయాలు తీసుకోవడం ఆయనపై వేటు వేయడానికి కారణాలుగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. వాటిలో మేజర్ డీల్ యూరప్‌లో ఉక్కు వ్యాపారాలను విక్రయించడం. సైరస్ మిస్త్రీ నేతృత్వంలోనే యూరప్‌లో తమకున్న యూరప్‌లో లాంగ్ ప్రొడక్ట్స్ ఉక్కు వ్యాపారాన్ని విక్రయించినట్లు టాటా స్టీల్ (యూకే) ప్రకటించింది. కేవలం ఆదాయాలపై మాత్రమే శ్రద్ధ వహించడం, లాభాపేక్ష లేని వ్యాపారాల నుంచి వైదొలగడం వంటివి మిస్త్రీ నిర్వహించే వాటిలో టాటా సన్స్‌కు అసంతృప్తి కలిగించే అంశాలుగా మారినట్టు సమాచారం. దీంతో కంపెనీ బోర్డు సైరస్ మిస్త్రీని తొలగించిందని వాదన వినిపిస్తోంది. బోర్డు సామూహికంగా ఈ నిర్ణయం తీసుకుందని, ప్రిన్సిపల్ షేర్‌హోల్డర్స్ (టాటా ట్రస్ట్స్) ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం వెలువడినట్టు టాటా గ్రూప్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. టాటాసన్స్, టాటా గ్రూప్ దీర్ఘకాలిక ప్రయోజనాలకు అనుకూలంగా ఆయన్ను మార్పు చేసి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఆపరేటింగ్ స్థాయిలోని సీఈవోలో ఎలాంటి మార్పులు లేవని ఆయన తెలిపారు. నాలుగు నెలలో శాశ్వత చైర్మన్‌ను గ్రూప్ నియమిస్తుందని ప్రకటించారు. -
టాటా గ్రూప్‌లో భారీ సంచలనం
ముంబయి: ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థ టాటా సన్స్‌లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. ఆ సంస్థ చైర్మన్ గా ఉన్న సైరస్ పల్లోంజి మిస్త్రీని విధుల నుంచి తప్పించారు. తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటాను నియమిస్తూ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పూర్తి స్థాయి చైర్మన్ ను నాలుగు నెలల్లో సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. ఈ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా రతన్ టాటా, వేణు శ్రీనివాసన్, అమిత్ చంద్రా, రోనెన్ సేన్, లార్డ్ కుమార్ భట్టాచార్య ఉన్నారు. సోమవారం నిర్వహించిన బోర్టు సమావేశంలో ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సైరస్ మిస్త్రీ నాలుగు సంవత్సరాలపాటు టాటా సన్స్‌కు చైర్మన్ గా పనిచేశారు. తొలిసారి 2012 డిసెంబర్ 28న ఆయన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. సైరస్ ఐరిష్ జాతీయుడు. పూర్తి స్థాయి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
తప్పనిసరైతేనే వ్యాపారాలకు గుడ్‌బై: సైరస్ మిస్త్రీ
న్యూయార్క్: టాటా గ్రూపు కొన్ని వ్యాపారాల నుంచి వైదొలగడం పట్ల తానేమీ కలత చెందడం లేదని గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ అన్నారు. గత 20 ఏళ్ల కాలంలో టాటా గ్రూపు 40కు పైగా వ్యాపారాల నుంచి తప్పుకోవడంపై మాట్లాడుతూ.... చిట్టచివరికి తప్పనిస్థితిలో వ్యాపారం నుంచి వైదొలుగుతాం గానీ, స్వల్ప కాల దృష్టితో నిర్ణయాలు తీసుకోబోమని చెప్పారు. టాటా జ్యుయెలరీ బ్రాండ్ తనిష్క్, ఐటీ విభాగం టీసీఎస్ టర్న్ ఎరౌండ్ అయ్యి, వృద్ధి చెందడానికి పట్టిన కాలాన్ని మిస్త్రీ ఉదాహరణలుగా పేర్కొన్నారు. వీటి విషయాల్లో పట్టుదల, దీర్ఘకాల దృష్టి ఫలితాన్నిచ్చాయన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చిన సందర్భంగా మిస్త్రీ ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. టాటా గ్రూపు 20 ఏళ్లలో 40కు పైగా వ్యాపారాల నుంచి తప్పుకుంది. -
కొనుగోళ్లకు ఎప్పుడూ సిద్ధమే..
• వచ్చే 150 ఏళ్ల కోసం టాటా గ్రూపు నిర్మాణం: చైర్మన్ సైరస్ మిస్త్రీ • వేగం, చురుకుదనంతోనే ముందుంటాం • వృద్ధికి ఆవిష్కరణలు, టెక్నాలజీ కీలకం • గ్రూపు ఆదాయంలో 70% విదేశాల నుంచేనని వెల్లడి న్యూఢిల్లీ: టాటా గ్రూపు దేశీయంగా, విదేశాల్లో కంపెనీల కొనుగోళ్లకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంచుతుందని గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ అన్నారు. తమ వ్యాపారాలు కొన్ని సవాళ్లతో కూడిన పరిస్థితులను ఎదుర్కొన్నాయని చెప్పిన ఆయన, పోర్ట్‌ఫోలియో తగ్గించుకునే దిశగా కఠినమైన, బలమైన నిర్ణయాలకు పిలుపునివ్వాల్సిన అవసరాన్ని కల్పించాయన్నారు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు గ్రూపు కంపెనీలు వేగం, చురుకుదనంతో పనిచేయాలని తాను కోరుకుంటానని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూపు చైర్మన్‌గా మిస్త్రీ... కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్లు, టెక్నాలజీ ఆవశ్యకత, ఆవిష్కరణలు, వినియోగదారుల అవసరాల గురించి గ్రూపు అంతర్గత మేగజైన్‌కు వివరించారు. సామాజిక బాధ్యతకు టాటా కట్టుబడి ఉంటుందన్న ఆయన వచ్చే 150 ఏళ్ల కోసం టాటా గ్రూపును నిర్మించే పనిలో ఉన్నామన్నారు. రెండు విధానాలు సహజసిద్ధంగా ఎదుగుతూనే, కొనుగోళ్ల ద్వారా దేశీయంగా, విదేశాల్లో వృద్ధి అవకాశాలను అందుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం. స్థిరమైన, లాభదాయకమైన వృద్ధి సాధించేందుకు గ్రూపులోని ప్రతి కంపెనీ తనదైన అభివృద్ధి విధానాన్ని రూపొందించుకుంది. గత దశాబ్ద కాలంలో రూ.4,15,000 కోట్ల రూపాయలను విస్తరణపై వెచ్చించాం. ఇందులో రూ.1.7 లక్షల కోట్లు గత మూడేళ్లలో ఖర్చు చేసిందే. 2016 మార్చి నాటికి గ్రూపు నికర రుణాలు 24.5 బిలియన్ డాలర్లు కాగా, నిర్వహణ ఆదాయాలు 9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత మూడేళ్లలో గ్రూపు నిర్వహణ ఆదాయాలు వార్షిక చక్రగతిన (సీఏజీఆర్) 30 శాతం వృద్ధి నమోదు చేశాయి. అయితే, స్థూలంగా కాకుండా... విడిగా ప్రతీ కంపెనీ కూడా ఇదే స్థాయిలో వృద్ధి సాధించాలి. అందుకే విడిగా ప్రతీ కంపెనీపై ఫోకస్ పెట్టాం. టాటా గ్రూపు మొత్తం ఆదాయంలో అంతర్జాతీయ ఆదాయం 70 శాతంగా ఉంది. అందుకే గత మూడేళ్లలో మూల ధన వ్యయం ఎక్కువ భాగం విదేశాల్లోనే ఖర్చు పెట్టాం. 103 బిలియన్ డాలర్ల విలువైన జాయింట్ ప్రాజెక్టులపై టాటా గ్రూపు పరిధిలో అంతర్గత సహకారంపై దృష్టి సారించాం. మూలధన వ్యయం అనేది టాలెంట్, బ్రాండ్లు, టెక్నాలజీపై ఉండాలి. భవిష్యత్తులో అసలైన మార్పును తీసుకొచ్చేవి ఇవే. కొత్తగా ఇరాన్, మయన్మార్‌లోకి ప్రవేశించాం. చురుగ్గా లేకుంటే వెనుకనే... చురుగ్గా లేకుంటే వెనుకబడిపోతాం. సంస్థాగతమైన వేగం, చురుకుదనం, మార్పునకు సిద్ధంగా ఉండడం అవసరం. కల్లోల పరిస్థితులను ఎదుర్కొనేందుకు చురుకుదనం అనేది చాలా కీలకం అవుతుంది. మారుతున్న సమయాల్లోనూ వృద్ధి చెందేందుకు ఆవిష్కరణలు, టెక్నాలజీ దోహదపడతాయి. పరిశోధన, అభివృద్ధిపై తగినంత పెట్టబడులు పెట్టడంతోపాటు వినియోగదారుల అవసరాలను భిన్న విధాలుగా అర్థం చేసుకోవడం ద్వారా కొత్త పరిశ్రమలు, ఉత్పత్తులు, వ్యాపార అవకాశాలను గుర్తించవచ్చు. అదే టాటా స్టీల్‌ను నిలబెట్టింది భిన్న రకాల ఉత్పత్తులను టాటా స్టీల్ తక్కువ వ్యయానికే ఉత్పత్తి చేస్తోంది. పైగా బలమైన బ్రాండ్. ప్రపంచ వ్యాప్తంగా ఉక్కు రంగంలో ఎన్నో సంస్థలు మునిగినా టాటా స్టీల్ నిలదొక్కుకునేందుకు ఇవే కారణాలు. ‘టాటా మోటార్స్, టాటా స్టీల్ టర్న్ ఎరౌండ్ అవకాశాలు కనిపిస్తున్నాయి. గణనీయంగా వృద్ధి చెందేందుకు తగినంత సామర్థ్యం ఉంది. ప్యాసింజర్ కార్లు తదితర విభాగాల్లో సవాళ్లు కొనసాగుతాయి. కంపెనీకి సంబంధించి ఎనిమిది వ్యూహాత్మక విధానాలను గుర్తించాం. భిన్న స్థాయిల్లోని ఎగ్జిక్యూటివ్‌లతో 100 బృందాలను ఏర్పాటు చేశాం. ముఖ్యంగా యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వడమే మా ఉద్దేశం. మా అసలు ప్రయాణం ఇప్పుడే మొదలైంది’ అని మిస్త్రీ చెప్పారు. డిజిటల్ విప్లవం డిజిటల్ రంగంలోని అవకాశాలను గుర్తించి టాటా మూడు కంపెనీలను ఏర్పాటు చేసింది. ఈ కామర్స్ రంగం కోసం టాటా క్లిక్, డేటా అనలటిక్స్ అవసరాల కోసం టాటా ఐక్యూ, ఆరోగ్య రంగం కోసం టాటా డిజిటల్ హెల్త్ ఏర్పడ్డాయి. మా అన్ని వ్యాపారాల్లోనూ కార్పొరేట్, కస్టమర్ వైపు నుంచి అంశాలను అర్థం చేసుకోవడంపై దృష్టి ఉంటుంది. ఏడువేల పెటెంట్లను అధిగమించాం. నాయకత్వం గురించి... నా మొట్టమొదటి విధానం ఎదుటి వారు చెప్పేది వినడం. దాంతో నాయకత్వ పరంగా శూన్యాన్ని భర్తీ చేయగలం. గ్రూప్‌ను విజయవంతంగా నడిపించడానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, బోర్డ్ డెరైక్టర్లు, భాగస్వాముల విశ్వాసం, గౌరవాన్ని పొందడమే కారణం. సరైన కారణాలు ఉంటే కఠినమైన నిర్ణయాలకు వెనుకాడరాదు. టాటా గ్రూపును నడిపించేది క్రియాశీల పరివర్తనే. -
టాటా మిస్త్రీతో బ్రిటన్ వాణిజ్య మంత్రి సమావేశం
ముంబై: బ్రిటన్ వాణిజ్య మంత్రి సాజిద్ జావీద్, టాటా గ్రూప్ చీఫ్ సైరస్ మిస్త్రీతో బుధవారం ముంబైలో రెండు గంటల పాటు సమావేశం జరిపారు. టాటా స్టీల్ ఇంగ్లాండ్ కార్యకలాపాల విక్రయంపై చర్చలు జరిగాయి. ఇక్కడి బాంబే హౌస్‌లో మిస్త్రీ, ఇతర ఉన్నతాధికారులతో జావీద్ చర్చలు జరిపారు. భారీగా నష్టాలు వస్తుండటంతో ఇంగ్లాండ్ కార్యకలాపాలను విక్రయించాలని టాటా స్టీల్ నిర్ణయించడం తెలిసిందే. ఈ ప్లాంట్ల కొనుగోలుకు తగిన కంపెనీని ఎంచుకోవడం, వేలాది కార్మికులు వీధినపడకుండా చూడడం ప్రధానాంశాలుగా ఈ చర్చలు జరిగాయి. అయితే చర్చల వివరాలను టాటా గ్రూప్‌గానీ, జావీద్ గానీ వెల్లడించలేదు. జావీద్ టాటా స్టీల్ గ్రూప్ ఈడీ కౌశిక్ చటర్జీని కూడా కలిశారు. ఎలాంటి ఉద్యోగాల కోత ఉండకుండా చూడాలని టాటా కంపెనీపై ఆయన ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. భారత్‌కు వచ్చే ముందు లిబర్టీ గ్రూప్‌కు చెందిన సంజీవ్ గుప్తాతో జావీద్ చర్చలు జరిపారు. సౌత్‌వేల్స్‌లోని టాటా స్టీల్‌కు చెందిన పోర్ట్తాల్బోట్ప్లాంట్ను కొనుగోలు చేయాలని సంజీవ్ గుప్తా యోచిస్తున్నారు. -
డబుల్ బెడ్ రూమ్ పథకంలో టాటా గ్రూప్
ముంబై: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ పథకంలో భాగస్వామ్యం అయ్యేందుకు టాటా గ్రూప్ అంగీకరించిందని మున్సిపల్, ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం ఆయన ముంబైలో టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో టాటా ఏఐజీ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుతో పాటు టీ-హబ్ ఇన్నోవేషన్ ఫండ్‌కు టాటా క్యాపిటల్‌తో సహకారం అందించనున్నారని కేటీఆర్ తెలిపారు. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ ఆసక్తిగా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. -
అందరికన్నా ముందుండాలి
♦ చురుగ్గా అవకాశాలు అందిపుచ్చుకోవాలి ♦ గ్రూప్ సంస్థల ఉద్యోగులకు ♦ టాటా’ చైర్మన్ సైరస్ మిస్త్రీ లేఖ న్యూఢిల్లీ: టాటా గ్రూప్ మార్కెట్ లీడరుగా స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా గ్రూప్ కంపెనీలు సంస్థాగతంగానూ, వ్యూహాత్మకంగానూ మరింత చురుగ్గా వ్యవహరించాలని చైర్మన్ సైరస్ మిస్త్రీ సూచించారు. అమెరికాలో రికవరీ, ఆసియా.. ఆఫ్రికా ఖండాల్లో వృద్ధి మెరుగుపడుతుండటం, చైనా ఎకానమీలో మార్పులు చోటు చేసుకుంటుండటం తదితర పరిస్థితుల నేపథ్యంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. గ్రూప్ కంపెనీల్లోని దాదాపు ఆరు లక్షల పైచిలుకు ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాలు తెలిపారు. వ్యాపార అవకాశాలను నిరంతరం దక్కించుకోవాలంటే టాటా కంపెనీలన్నీ కొంగొత్త టెక్నాలజీలను (ముఖ్యంగా డిజిటల్ మాధ్యమంలో) అందిపుచ్చుకోవాలని, వివిధ విభాగాల మధ్య వ్యత్యాసాలు తగ్గించి మరింత సమష్టిగా కృషి చేయాలని మిస్త్రీ సూచించారు. చైనా ఎకానమీలో చోటు చేసుకుంటున్న మార్పులు పలు దేశాలపై ప్రభావాలు చూపుతున్నాయని, ఈ క్రమంలో తెరపైకి వచ్చే కొత్త వ్యాపారావకాశాలను గుర్తించి, దక్కించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. రాబోయే సంవత్సర కాలం గ్రూప్ కంపెనీల శక్తిసామర్థ్యాలను పరీక్షించేదిగాను, అదే సమయంలో కొత్త వ్యాపార మార్గాలను చూపించేదిగా ఉండబోతోందని మిస్త్రీ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాయకత్వ స్థాయిని నిలబెట్టుకోవాలంటే గ్రూప్ కంపెనీలు వ్యూహాత్మకంగానూ, సంస్థాగతంగానూ చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. వివిధ దేశాల్లో కార్యకలాపాలు ఉన్న గ్రూప్ కంపెనీలు.. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు ఇతోధికంగా తోడ్పాటు అందించాలని సూచించారు. -
‘అమరావతి’లో భాగస్వాములు కండి
టాటా గ్రూప్ చైర్మన్‌కు వెంకయ్య విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీకి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. మంగళవారం వెంకయ్యతో సైరస్ మిస్త్రీ భేటీ అయ్యారు. స్మార్ట్ సిటీస్, స్వచ్ఛ భారత్, అందరికీ ఇల్లు తదితర అంశాలపై వీరిరువురూ చర్చించారు. ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధిలో పాలుపంచుకోవాలని మిస్త్రీని వెంకయ్య కోరారు. నిర్మాణ రంగంలో క్రియాశీలక పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణాభివృద్ధిలో నూతన అభివృద్ధి కార్యక్రమాల అమలుకు సహకారం అందించాలని కోరారు. మిస్త్రీ స్పం దిస్తూ, ఇప్పటికే స్వచ్ఛభారత్‌లో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. -
డివిడెండ్ లేదు.. బాధపడుతున్నా..!
ముంబై : టాటా మెటార్స్ కంపెనీ వాటాదారులకు గత ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్ చెల్లించలేకపోతున్నందుకు బాధపడుతున్నానని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ చెప్పారు. కంపెనీ ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకోవాలని ఆయన వాటాదారులను కోరారు. గురువారం ఇక్కడ జరిగిన కంపెనీ 70వ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ఆయన మాట్లాడారు. గత 15 ఏళ్లుగా డివిడెండ్ చెల్లిస్తూ వచ్చిన ఈ కంపెనీ ఈ సారి మాత్రం డివిడెండ్ చెల్లించలేదు. దీర్ఘకాలంలో కంపెనీకి మంచి కోసం కొన్ని త్యాగాలు తప్పవని సైరస్ మిస్త్రీ చెప్పారు. పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతులు, ప్రపంచ స్థాయి నాణ్యత, వినూత్నమైన ఉత్పత్తుల ద్వారా ఉత్తమమైన లాభదాయకతను టాటా మోటార్స్ సాధించగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే సైరస్ మిస్త్రీ వివరణ పట్ల పలువురు ఇన్వెస్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిడెండ్ చెల్లించలేకపోవడానికి సరైన కారణాలు చెప్పడం లేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. కంపెనీ ఉన్నతాధికారుల వేతనాలు పెంచుకోవడానికి తమ ఆమోదం పొందారని, తమకు మాత్రం డివిడెండ్ చెల్లించలేకపోతున్నారని ఒక ఇన్వెస్టర్ విమర్శించారు.గతంలో రతన్ టాటా చైర్మన్‌గా ఉన్నప్పుడు 2000-01 ఆర్థిక సంవత్సరానికి కూడా టాటా మోటార్స్ కంపెనీ తన వాటాదారులకు డివిడెండ్ చెల్లించలేకపోయింది. -
కొత్త మోడళ్ల కోసం భారీగా పెట్టుబడులు
టాటా మోటార్స్ వార్షిక నివేదికలో మిస్త్రీ వెల్లడి ముంబై : టాటా మోటార్స్ కంపెనీ కొత్త మోడళ్ల కోసం భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. ప్రయాణికుల, వాణిజ్య వాహనాల సెగ్మెంట్లో మరిన్ని కొత్త మోడళ్లను అందించనున్నామని కంపెనీ చైర్మన్ సైరస్ మిస్త్రీ పేర్కొన్నారు. వినియోగదారుల వివిధ అవసరాలకు తగ్గట్లుగా కొత్త టెక్నాలజీలతో కార్లను అందించనున్నామని కంపెనీ 70వ వార్షిక నివేదికలో ఆయన పేర్కొన్నారు. గత మూడేళ్లుగా ఈ కంపెనీ భారీ నష్టాల్లోనే ఉందని, ఈ ఏడాది మార్చినాటికి కంపెనీ కన్సాలిడేటెట్ నికర రుణం రూ.73,600 కోట్లుగా ఉందని తెలిపారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3,000-4,000 కోట్ల రేంజ్లో మూలధన పెట్టుబడులు పెట్టనున్నామన్నారు. -
‘టాటా’కు అమెరికా జేజేలు
వాషింగ్టన్: అమెరికాలో వేలాది ఉద్యోగాలు కల్పిస్తున్న భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా గ్రూప్‌ను ఆ దేశ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పొగడ్తలతో ముంచెత్తారు. ‘అమెరికాలో వాహన విక్రయాలు, డిజైన్లు విస్తరించడం ద్వారా టాటా గ్రూప్ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తోందో చూడండి. ఈ దేశంలో ఆ సంస్థకు ఇప్పటికే 24 వేల మందికిపైగా ఉద్యోగులున్నారు..’ అని వాషింగ్టన్లో జరిగిన ఓ సదస్సులో ఆయన అన్నారు. టాటా గ్రూప్‌నకు చెందిన 12 విభిన్న కంపెనీలు అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ, గుడ్ఎర్త్, ఎయిట్ ఓ క్లాక్ కాఫీ వంటి ప్రసిద్ధిచెందిన బ్రాండ్లు టాటాల సొంతమని పేర్కొన్నారు. భారతీయ కంపెనీలు అమెరికాలో దాదాపు లక్ష ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని చెప్పారు. ఇండియాలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న అమెరికన్ మోటార్ కంపెనీ ఫోర్డ్‌ను కూడా కెర్రీ ప్రశంసించారు. ఇండియా, అమెరికాల మధ్య వార్షిక వాణిజ్య పరిమాణాన్ని 10 వేల కోట్ల డాలర్ల నుంచి 50 వేల కోట్ల డాలర్లకు పెంచడానికి కృషిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. మూడేళ్లలో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్ మూడేళ్లలో 35 బిలియన్ డాలర్లు(రూ. 2.10 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా దశాబ్ద కాలంలో మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రీత్యా ప్రపంచంలోని టాప్-25 కంపెనీల సరసన చేరే అవకాశమున్నట్లు భావిస్తోంది. విజన్ 2025లో భాగంగా వేసుకున్న ప్రణాళికలను టాటా గ్రూప్ వార్షిక నాయకత్వ సదస్సును ఉద్ధేశించి ప్రసంగించిన గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆవిష్కరించారు. దీనిలో భాగంగా మాతృ సంస్థను కేంద్రంగా చేసుకుని గ్రూప్‌లోని సంస్థలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని, పరస్పర సహకారంతో అభివృద్ధి బాటన నడిపించాలని భవిష్యత్ ప్రణాళికలు వేసినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. 2025కల్లా కస్టమర్లు, తదితర సంస్థలకు అత్యుత్తమ సేవలు, సర్వీసులను అందించడంలో టాటా గ్రూప్‌కున్న కట్టుబాటు ప్రపంచ జనాభాలో 25 శాతం మందికి అవగతమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తొలిసారి రూ. 6 లక్షల కోట్ల ఆదాయం గతేడాది(2013-14)లో గ్రూప్ మొత్తం ఆదాయం తొలిసారి 100 బిలియన్ డాలర్ల(రూ. 6.24 లక్షల కోట్లు)ను దాటడం విశేషం. -
ఈ ఏడాది మరింత ప్రగతి
టీసీఎస్ వృద్ధి అవకాశాలపై చైర్మన్ సైరస్ మిస్త్రీ న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కి క్రితం ఆర్థిక సంవత్సరం కన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరింత మెరుగ్గా ఉండగలదని సంస్థ చైర్మన్ సైరస్ మిస్త్రీ చెప్పారు. ప్రపంచ ఎకానమీ మెరుగుపడుతున్న నేపథ్యంలో వృద్ధి అవకాశాలు భారీగా ఉండగలవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన కంపెనీ సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మిస్త్రీ ఈ విషయాలు తెలిపారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ సగటు 8.8 శాతం కన్నా అధికంగా టీసీఎస్ 16 శాతం వృద్ధి సాధించిందని ఆయన వివరించారు. గతంలో ఎదురైన గడ్డు పరిస్థితులను పక్కన పెట్టి ఇటు కంపెనీ, అటు పరిశ్రమ ముందుకు సాగడానికి అవకాశం లభించినట్లేనని మిస్త్రీ తెలిపారు. ఇలాంటి సమస్యలను టీసీఎస్ ఇకపై మరింత సమర్ధంగా ఎదుర్కొనగలదన్నారు. పోటీ కంపెనీలు, పరిశ్రమ సగటు కన్నా అధిక వృద్ధిని సాధించే సంప్రదాయాన్ని కొనసాగించగలమని మిస్త్రీ చెప్పారు. కొత్త టెక్నాలజీపై పెట్టుబడులు.. కొత్త టెక్నాలజీలు సహా పలు విభాగాల్లో టీసీఎస్ పెట్టుబడులు పెట్టనున్నట్లు మిస్త్రీ తెలిపారు. ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారిన మొబిలిటీ, బిగ్ డేటా, క్లౌడ్ ఆధారిత కంప్యూటింగ్, రోబోటిక్స్ వంటి విభాగాలు ఐటీ ముఖచిత్రాన్ని మార్చివేయగలవని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే అమెరికా, యూరప్, ఆసియా-పసిఫిక్ దేశాల్లో కొంగొత్త డిజిటల్ టెక్నాలజీలపై కంపెనీ ఇన్వెస్ట్ చేస్తోందని మిస్త్రీ పేర్కొన్నారు. ఇక, మౌలికరంగ సర్వీసులు, ఇంజనీరింగ్ సేవలు, కన్సల్టింగ్ వి భాగాలు అత్యంత వేగంగా ఎదుగుతున్నాయన్నారు. ఇన్వెస్టర్లకు పదేళ్లలో పది రెట్లు రాబడి.. కంపెనీ లిస్టయి పదేళ్లు గడిచాయని, ఈ వ్యవధిలో మదుపుదారులు చేసిన ఇన్వెస్ట్మెంట్లపై రాబడులు పది రెట్లు పెరిగాయని మిస్త్రీ చెప్పారు. అలాగే, ప్రతి షేరుపై ఆదాయం 8 రెట్లు పెరిగిందన్నారు. -
ప్రధాని మోడీతో టాటా గ్రూప్ చైర్మన్ మిస్త్రీ భేటీ
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఈ సమావేశం సుహృద్భావపూర్వకంగా జరిగిందేనని అధికార వర్గాలు తెలిపాయి. గత నెల 26న మోడీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టాటా గ్రూప్ గౌరవాధ్యక్షుడు రతన్ టాటాతో పాటు మిస్త్రీని కూడా ఆహ్వానించారు. అయితే విదేశీ పర్యటనలో ఉన్నందున వారిరువురూ రాలేకపోయారు. -
సమన్వయంతో ముందుకెళ్దాం
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ కంపెనీలు తమలో తాము ఎలాంటి దాపరికాలకూ తావివ్వకుండా సమన్వయంతో ముందుకెళ్లాలని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ పిలుపునిచ్చారు. వినూత్నతపై దృష్టిపెట్టడంతోపాటు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొని విజయాన్ని సొంతం చేసుకునే తత్వాన్ని అలవర్చుకోవాలని ఉద్బోధించారు. గ్రూప్ సంస్థల వద్దనున్న వనరులను తగినవిధంగా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యమన్నారు. చైర్మన్‌గా పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఉద్యోగులకు ఆయనొక లేఖ రాశారు. ‘‘టాటా వ్యాపార సామ్రాజ్యంలో ప్రతి సంస్థకూ తనదైన ప్రత్యేకత ఉంది. ఇది గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటా 175వ జయంతి. ఆయన వారసత్వాన్ని మున్ముందుకు తీసుకెళ్లడానికి ఉద్యోగులంతా తమవంతు కృష్టిచేయాలి’’ అని మిస్త్రీ తన లేఖలో పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారంటే... వ్యూహాలకు మరింత పదును పెట్టాలి... 2013 సంవత్సరమంతా అనిశ్చితి, ప్రతికూలతలు, సవాళ్లతో గడిచింది. మన వ్యూహాల్లో కొన్నింటిని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వ్యాపార విధానాల్లో మార్పుచేర్పులు, నిర్వహణ సామర్థ్యానికి మరింత పదునుపెట్టడం, పెట్టుబడుల్లో భవిష్యత్ ధోరణికి పెద్దపీటవేయడం వంటివి అత్యంత కీలకం. భారత్, యూరప్ వంటి కీలక మార్కెట్లలోని ఆర్థిక మందగమనం ప్రభావం గ్రూప్‌లోని అనేక కంపెనీలపై పడింది. ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. ఈ అనిశ్చితిని తట్టుకొని విజయం సాధించాలన్నా, ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలన్నా సమష్టితత్వం, భవిష్యత్తును దృష్టిలోపెట్టుకొని వ్యూహాలను రూపొందించుకోవడం, కొత్తపోకడలను నేర్పుగా ఒడిసిపట్టుకోవడం వంటివి కావాలి. వినూత్నతతో పాటు పరిశోధన-అభివృద్ధి(ఆర్అండ్డీ)లో పెట్టుబడుల్ని, నిపుణుల్ని పెంచుకోవాలి. సామాజిక బాధ్యతా ముఖ్యమే... గ్రూప్ సంస్థలు వందకు పైగా ఉన్నాయి. ఉద్యోగులు 5 లక్షలపైనే ఉన్నారు. ఇలాంటి టాటా గ్రూప్ వ్యాపారంలోనే కాక సామాజిక బాధ్యతలో కూడా ప్రపంచ శక్తిగా ఆవిర్భవించింది. సామాజికాభివృద్ధి విషయంలో గ్రూప్ ఉద్యోగులు తమవంతు పాత్ర పోషించాలి. నాకైతే వాటాదారులకు దీర్ఘకాలంలో మరింత సంపదను సృష్టించి పెట్టగలమనే దృఢమైన విశ్వాసం ఉంది. గ్రూప్ బ్రాండ్ విలువను పెంపొందించడం, నైతిక విలువలతో కూడిన వ్యాపార విధానాలకు కట్టుబడటంలో... వ్యవస్థాపకుడు జంషెట్జీ నుంచి జేఆర్డీ టాటా, తాజాగా రిటైరయిన రతన్ టాటాల అంకితభావాన్ని ఉద్యోగులు గుర్తుంచుకోవాలి. దీన్ని పరిరక్షించే బాధ్యత మనందరిపైనా ఉంది. ఇదీ టాటా సామ్రాజ్యం... 2012-13 ఆర్థిక సంవత్సరంలో టాటా గ్రూప్ కంపెనీల మొత్తం ఆదాయం 96.79 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 5,27,047 కోట్లు). దీన్లో 63 శాతం మేర విదేశీ కార్యకలాపాల నుంచే లభిస్తోంది. 100కు పైగా దేశాల్లో కార్యకలాపాలున్న టాటా గ్రూప్... 150 దేశాలకు తమ ఉత్పత్తులు, సేవలను ఎగుమతి చేస్తోంది. -
సౌదీలో టీసీఎస్ మహిళా బీపీవో సెంటర్
రియాద్: దేశీ ఐటీ అగ్రగామి టీసీఎస్... పూర్తిగా మహిళలు పనిచేసే బీపీవో సెంటర్‌ను సౌదీ అరేబియా లో ప్రారంభించింది. జీఈ, సౌదీ ఆరామ్కో భాగస్వామ్యంతో ఈ మహిళా బీపీవోను ఏర్పాటు చేశామని టీసీఎస్ పేర్కొంది. గల్ఫ్‌లో 3,000 ఉద్యోగాలను ఈ సెంటర్ కల్పిస్తుందని తెలి పింది. సౌదీ ఆరామ్కో కేంద్ర కార్యాలయం దహ్రన్లో దీన్ని ఏర్పాటు చేశామని పేర్కొంది. ఈ ప్రాంత మహిళలకు మంచి కెరీర్‌ను అందించడానికి సౌదీ ఆరామ్కో, జీఈలతో కలిసి ఈ సెం టర్ను నెలకొల్పడం సంతోషంగా ఉందని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ వ్యాఖ్యానించారు. -
మిస్త్రీని నిలదీసిన వాటాదారులు
ముంబై: టాటా స్టీల్ చైర్మన్ సైరస్ మిస్త్రీకి తొలిసారి ఆ సంస్థ వార్షిక సర్వ సభ్య సమావేశంలో వాటాదారుల నుంచి కఠిన ప్రశ్నలు ఎదురయ్యాయి. టాప్ మేనేజ్మెంట్లో జీతాలు పెరుగుతున్నప్పటికీ వాటాదారులకు చెల్లించే డివిడెండ్ తగ్గడంపై నిరసన వ్యక్తమైంది. 2007-08లో షేరుకి రూ. 16 డివిడెండ్‌ను చెల్లించగా, ప్రస్తుతం రూ. 8కి పడిపోవడంపై ఒక వాటాదారుడు సైరస్ను నిలదీశాడు. అయితే ప్రపంచస్థాయిలో స్టీల్‌కు డిమాండ్ పడిపోయిందని, దీంతో కంపెనీ లాభాలు సైతం భారీగా క్షీణించాయని సైరస్ వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో కంపెనీ విస్తరణ బాటలో ఉన్నందువల్ల కొంత డివిడెండ్‌ను తగ్గించాల్సి వచ్చిందని వివరించారు.