సాక్షి, న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌తో వివాదంపై మార్చి 26న అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ .. సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేసింది. సదరు తీర్పులో లోపాలు ఉన్నాయని, కంపెనీల చట్టం మూలాలనే దెబ్బ కొట్టే విధంగా ఉందని పేర్కొంది. దీన్ని సరిచేయని పక్షంలో మైనారిటీ షేర్‌హోల్డర్ల హక్కులపై గణనీయంగా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని తెలిపింది. దాదాపు నాలుగేళ్ల క్రితం టాటా గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపును సమర్ధిస్తూ సుప్రీం కోర్టు ఈ ఏడాది మార్చి 26న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులనే తిరిగి సమీక్షించాలంటూ మిస్త్రీ కుటుంబానికి చెందిన షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment