Surpeme court
-
ఆర్బీఐ, సీబీఐకి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), దర్యాప్తు సంస్థ సీబీఐకు సోమవారం నోటీసులు జారీ చేసింది. బ్యాంకు రుణాల మోసం కేసుల్లో ఆర్బీఐ నామినీ డైరెక్టర్, ఇతర సిబ్బంది పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం తాజా నోటీసు లిచ్చింది. వివిధ బ్యాంకింగ్ స్కామ్‌లలో ఆర్బీఐ అధికారుల పాత్రపై విచారణ జరపాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పీటీషన్ను సుప్రీం విచారణకు స్వీకరించింది. జస్టిస్ బీఆర్ గవాయి, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం బీజేపీ నేత పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఆర్బీఐ, సీబీఐను కోరింది. కాగా కింగ్‌ఫిషర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యెస్ బ్యాంక్ లాంటి వివిధ కుంభకోణాల్లో ఆర్బీఐ అధికారుల ప్రమేయంపై విచారణ జరగలేదని స్వామి ఆరోపించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంతో సహా, పలు చట్టాలను ప్రత్యక్షంగా ఉల్లంఘిస్తూ ఆర్బీఐ అధికారులు నిర్లక్క్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. Supreme Court issues notice to Reserve Bank of India (RBI) and Central Bureau of Investigation (CBI) on a plea filed by BJP member Subramanian Swamy seeking a CBI probe into the alleged role of RBI's nominee director in bank loan fraud cases. — ANI (@ANI) October 17, 2022 -
ఆ గృహ కొనుగోలుదారులకు శుభవార్త! 3 నెలల్లో ఫ్లాట్లు
న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్‌కు చెందిన గృహ కొనుగోలుదారులకు శుభవార్త. 2 నుంచి 3 నెలల్లో 11,858 ఫ్లాట్లను డెలివరీ చేస్తామని కోర్టు రిసీవర్ సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి సుప్రీం ధర్మాసనానికి శుక్రవారం తెలియజేశారు. నిర్మించాల్సిన 38,000 ఫ్లాట్లలో 11,000 యూనిట్లకు పైగా ఫ్లాట్ కొనుగోలుదారులకు అప్పగిస్తున్నారని ఇది చాలా కీలక పరిణామమని తెలిపారు. వచ్చే నెలలో వచ్చే పండుగ సీజన్లో ఎన్బీసీసీ పూర్తి చేసిన 5,428 ఫ్లాట్లను గృహ కొనుగోలు దారులకు ఇవ్వనున్నట్లు, సుప్రీంకు సీనియర్ న్యాయవాది తెలిపారు. విద్యుత్ నీటి కనెక్షన్‌తో గృహ కొనుగోలుదారులకు ఇవ్వనున్నట్లు కోర్టు రిసీవర్ వెంకటరమణి ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనానికి నివేదించారు. ఈ పూర్తయిన ఫ్లాట్లన్నీ గృహ కొనుగోలుదారుల నుండి పూర్తి చెల్లింపు తర్వాత మాత్రమే అప్పగిస్తామనివెంకటరమణి స్పష్టం చేశారు. అలాగే ఫోరెన్సిక్ ఆడిటర్లు రూ. 3870.38 కోట్లను గృహ కొనుగోలుదారుల నుండి గ్రహించాల్సిన మొత్తంగా అందించారని, అయితే క్రాస్-చెకింగ్‌లో ఈ మొత్తం 3,014 కోట్లుగా గుర్తించామన్నారు. రూ. 3,014 కోట్లలో ఇప్పటి వరకు 22,701 మంది గృహ కొనుగోలుదారుల నుంచి రూ. 1,275 కోట్లు పొందామని, మిగిలిన మొత్తాన్ని 7939 మంది గృహ కొనుగోలుదారుల నుంచి స్వీకరించాల్సి ఉందని, ఈ విషయంలో షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. చెల్లింపు ప్లాన్ ప్రకారం అక్టోబర్ 2024 నాటికి పూర్తికావాల్సిఉందని వెంకటరమణి తెలిపారు. -
విజయ్ మాల్యాకు భారీ షాక్, మొత్తం చెల్లించకపోతే: సుప్రీం కొరడా
సాక్షి, న్యూఢిల్లీ: వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు కోర్టు ధిక్కారణ కేసు కింద సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. భారతీయ బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన మాల్యాకు సుప్రీంకోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. కోరు ధిక్కారం నేరం కింద జైలు శిక్షతోపాటు, 2 వేల రూపాయల జరిమానా విధించింది. అలాగే కుటుంబానికి అక్రమంగా తరలించిన 40 మిలియన్ల డాలర్ల సొమ్మును తిరిగివ్వాలని మాల్యా కుటుంబ సభ్యులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు యుయు లలిత్, ఎస్ రవీంద్ర భట్, పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు కోర్టు నుంచి సమాచారాన్ని దాచిపెట్టినందుకు దోషిగా తేలడంతో సుప్రీం తాజా తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలకు భిన్నంగా 40 మిలియన్ డాలర్లను కుటుంబానికి బదిలీ నేరం కింద మాల్యాకు "ఈ శిక్ష తప్పదు. మాల్యా ఎలాంటి పశ్చాత్తాపం చూపలేదు" అని సుప్రీం పేర్కొంది. జరిమానాను నాలుగు వారాల్లోగా సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని, లేని పక్షంలో మరో రెండు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని కోర్టు తెలిపింది. ఈ మొత్తాన్ని 8 శాతం వడ్డీతో నాలుగు వారాల్లోగా రికవరీ అధికారికి తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వకపోతే మాల్యా ఆస్తులను అటాచ్ చేసుకోవచ్చని కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ అంశంపై 2017లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ మాల్యా పిటిషన్‌ను 2020లో అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే. కాగా 9వేల కోట్లకు పైగా రుణాన్ని ఎగవేసి లండన్‌కు పారిపోయిన మాల్యాపై ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం కేంద్రం దర్యాప్తు సంస్థలు, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వాస్తవాలను దాచిపెట్టి, డియాజియో నిధులను తన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా, కుమార్తెలు లియానా మాల్యా, తాన్యా మాల్యాలకు డబ్బును మళ్లించారని, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను 'ద్వేషపూరితంగా ఉల్లంఘించారని' బ్యాంకులు ఆరోపించాయి. 2016 మార్చిలో యూకేకు పారిపోయిన మాల్యాను ఏప్రిల్ 18, 2017న స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. -
భద్రత రికార్డులను భద్రపరచండి
న్యూఢిల్లీ: పంజాబ్‌లో ప్రధాని మోదీ బుధవారం నాటి పర్యటనలో భద్రతా వైఫల్యం ఘటనకు సంబంధించి అన్ని రికార్డులను తక్షణమే భద్రపరచాలని పంజాబ్ హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధానికి చేసిన రక్షణా ఏర్పాట్లకు సంబంధించి పోలీసులు, కేంద్ర రక్షణ, నిఘా సంస్థల నుంచి అన్ని రకాల వివరాలను సమీకరించి భద్రపరచాలని సూచించింది. ఘటనపై విచారణకు ఏర్పాటు చేసిన కమిటీల పరిశోధనను సోమవారం వరకు నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఫిరోజ్‌పూర్ ఘటనపై లాయర్స్ వాయిస్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించింది. ఇది ప్రధాని భద్రతకు సంబంధించిన అంశమని గుర్తించి సంబంధిత రికార్డులన్నిటినీ భద్రపరచమని హైకోర్టు రిజిస్ట్రార్‌ను సుప్రీం ఆదేశించింది. రిజిస్ట్రార్‌కు చండీగఢ్ డీజీపీ, జాతీయ భద్రతా సంస్థకు చెందిన ఐజీ ర్యాంకుకు తగ్గని అధికారి సహకరించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. రిజిస్ట్రార్ జనరల్‌కు రికార్డుల అందజేత విషయంలో పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీలను ఆదేశించింది. ఫిరోజ్‌పూర్ ఘటన ఉద్దేశపూర్వక కుట్రని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్య కార్యదర్శి, డీజీపీలు బాధ్యతలు మరిచారని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. సీఎస్, డీజీపీపై తగిన చర్యలు(సస్పెన్షన్) తీసుకోవాలని కోరారు. అధికారిక రికార్డుల మార్పిడి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సుప్రీంను కోరారు. మాకు ఓకే జరిగిన ఘటనపై లోతైన విచారణ జరపాలన్న పిటిషనర్ డిమాండ్‌పై తమకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. పంజాబ్ పోలీసులు రూట్ క్లియర్ చేసిన తర్వాతే ప్రధాని కాన్వాయ్ బయలుదేరిందని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ప్రధాని పర్యటనకు ముందే సిక్స్ ఫర్ జస్టిస్ అనే నిషేధిత సంస్థ చైర్మన్ పన్ను ఒక వీడియోను సర్క్యులేట్ చేసిన విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. అందువల్ల ఈ ఘటనలో అంతర్జాతీయ ఉగ్రవాద కోణం ఉండే అవకాశం ఉందని, కనుక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జోక్యం అవసరమేనని చెప్పారు. ఘటనకు సంబంధించిన మొత్తం రికార్డులను ఎన్ఐఏ అధికారి సహకారంతో ఒక స్వతంత్ర వ్యక్తి సేకరించి భద్రపరిచేలా ఆదేశించాలన్నారు. ఇది ఒక ప్రత్యేక ఘటనని, అంతర్జాతీయంగా సిగ్గుపడేలా చేసిందన్నారు. రోడ్డు దిగ్భంధంపై స్థానిక పోలీసులు ముందుగా వార్నింగ్ వాహనంలోని వారికి సమాచారమివ్వలేదన్నారు. ఫ్లైఓవర్‌కు రెండో వైపు నిరసనకారులు చేరి ఉంటే పరిస్థితి విషమించేదన్నారు. ఇది సీరియస్ సంఘటనని తాము కూడా అంగీకరిస్తున్నట్లు పంజాబ్ అడ్వకేట్ జనరల్ పట్వాలియా తెలిపారు. పిటిషన్‌లోని అంశాలపై భేదాభిప్రాయమున్నా, ఘటనను తేలిగ్గా తీసుకోవడం లేదన్నారు. దీనితో ఎవరైనా అధికారులకు సంబంధం ఉంటే వారు విచారణ ఎదుర్కోక తప్పదన్నారు. ఘటనపై ఎలాంటి విచారణకు కోర్టు ఆదేశించినా అభ్యంతరం లేదన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ అంతర్గతమైనదని, అందువల్ల దాని విచారణ కొనసాగించే అవకాశమివ్వమని కోర్టును తుషార్ కోరారు. అయితే కేంద్ర కమిటీలో సురేశ్ ఉండకూడదని రాష్ట్ర న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఫిరోజ్‌పూర్‌కు కేంద్ర బృందం ప్రధాని భద్రతా లోపంపై విచారణకు కేంద్రం నియమించిన త్రిసభ్య కమిటీ శుక్రవారం ఫిరోజ్‌పూర్ ఫ్లై ఓవర్‌ను పరిశీలించింది. ఈ ఘటనపై కేంద్రానికి పంజాబ్ ప్రభుత్వం నివేదిక అందజేసింది. ఫిరోజ్‌పూర్ ఘటనలో గుర్తుతెలియని 150 మంది నిరసనకారులపై పంజాబ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, శుక్రవారం ప్రత్యక్షంగా హాజరవ్వాలని ప్రధాని పర్యటనతో సంబంధమున్న పలువురు అధికారులకు కేంద్ర బృందం ముందే సమన్లు జారీ చేసింది. ఈ విచారణకు పంజాబ్ డీజీపీ సిద్ధార్ధ్ చటోపాధ్యాయ హాజరవలేదు. ఆగని విమర్శల పర్వం ఫిరోజ్‌పూర్ ఘటనపై ఆయా పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పంజాబ్‌లో చన్నీ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ డిమాండ్ చేశారు. ప్రధాని పర్యటనలో భద్రతాలోపాలు కల్పించడం ద్వారా కాంగ్రెస్ కుట్రపూరిత బుద్ధి బయటపడిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్శించారు. ఘటనపై కాంగ్రెస్ అగ్రనా యకత్వం ఎందుకు మౌనం వహిస్తోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. మరోవైపు మోదీ హాజరవ్వాల్సిన ర్యాలీకి అతి తక్కువ మంది హాజరైన విషయం తెలిస్తే పరువు పోతుందని పసిగట్టే బీజేపీ ఈ భద్రతాలోపం నాటకం ఆడుతోందని పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఆరోపించారు. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే ఈ సంఘటన జరిగిందని పంజాబ్ సీఎం చన్నీ ఆరోపించారు. ప్రధానిని ర్యాలీ వద్దకు చేరకుండా రైతులు అడ్డుకోకుండా ఉండాల్సిందని, అప్పుడు ఖాళీ కుర్చీలు చూసి ప్రధాని సంతోషపడేవారని, వాటిని ఉద్దేశించి ప్రసంగించేవారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఎద్దేవాచేశారు. గతంలో తన సభకు కేవలం 25 మంది వచ్చినా తాను వెళ్లి, వారితో మాట్లాడాకే వెనుతిరిగానన్నారు. ఉల్లంఘనకు మరో నిదర్శనం.. బుధవారం ప్రధాని కాన్వాయ్ పంజా బ్లోని ఫ్లైఓవర్‌పై నిలిచిపోయినప్పుడు చాలా దగ్గరగా కొందరు బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్న వీడియో ఒకటి మీడియా లో ప్రత్యక్షమైంది. వారు ‘బీజేపీ జిందాబాద్’ అని నినాదాలు చేస్తుండగా ప్రధాని కారును ఎస్పీజీ సిబ్బంది కవచంలాగా ఏర్పడి తరలించడం వీడియోలో కనిపించింది. బుధవారం ప్రధాని భద్రతా ఏర్పాట్ల ఉల్లం ఘనకు ఇది మరో ఉదాహరణ అని నిపుణులు అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రధాని కాన్వాయ్‌కు కొంత దూరంలో రైతులున్న వీడియో సైతం తాజాగా మీడియాలో షేర్ అవుతోంది. తమకన్నా బీజేపీ కార్యకర్తలే ప్రధాని కారుకు దగ్గరగా ఉన్నారని కొందరు రైతులు ఆరోపించారు. చదవండి: నీట్ పీజీ కౌన్సిలింగ్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ -
న్యాయమూర్తులకు నైతికతే కీలకం
న్యూఢిల్లీ: సమాజంలో న్యాయమూర్తులు అత్యున్నత నైతిక స్థలాన్ని ఆక్రమిస్తారని, న్యాయ కల్పనపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడంలో వీరు ఎంతదూరమైనా వెళ్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏస్థాయిలోని న్యాయమూర్తైనా అత్యున్నత ప్రమాణాలను ఆచరించాలని తెలిపింది. సివిల్ జడ్జిగా నియమించేందుకు తాను అనర్హుడినంటూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు న్యాయమూర్తి, నైతికతపై వ్యాఖ్యలు చేసింది. పిటీషనర్‌పై కొన్ని ఎఫ్ఐఆర్లు దాఖలైనట్లు, కొన్నికేసుల్లో రాజీ కుదుర్చుకున్నట్లు గమనించామని కోర్టు తెలిపింది. ఏ కేసులో శిక్ష పడనందున ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను పక్కనబెడుతున్నట్లు తెలిపింది. సివిల్ జడ్జి పోస్టుకు సరైనవారిని ఎంపిక చేయడం హైకోర్టు బాధ్యతని, కానీ ఈ సందర్భంలో హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. చదవండి: ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ -
పెగాసస్‌పై సుప్రీం విచారణ వాయిదా
సాక్షి,ఢిల్లీ: పార్లమెంటులో ప్రకంపనలు రేపుతున్న పెగాసస్ స్నూపింగ్ కుంభకోణంపై సుప్రీంకోర్టులో మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. పెగాసస్‌పై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంలో దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను ఆగస్టు 16వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, జస్టిస్ వినీత్ శరణ్ , జస్టిస్ సూర్య కాంత్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది. ఈ సందర్భంగా సుప్రీం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవైపు కోర్టులో కేసు వాదనలు జరుగుతుండగానే, పిటీషనర్లు సోషల్ మీడియాలో సమాంతర చర్చలు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించింది. ఏదైనా చెప్పాలనుకుంటే, కోర్టులోనే చెప్పాలని సీజే పేర్కొన్నారు. ఒకసారి కోర్టులను ఆశ్రయించిన తరువాత కోర్టులపై విశ్వాసముంచాలని ఆయన సూచించారు. దీనిపై స్పందించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కేసు విచారణలో ఉన్న విషయాన్ని బయట చర్చించకూడని తామూ అంగీకరిస్తున్నామన్నారు. పిటిషన్లు అందాయని కోర్టుకు తెలిపిన సొలిసిటర్ జనరల్(ఎస్జీ) తుషార్ మెహతా ప్రభుత్వం నుంచి తమకు సమాచారం రావాల్సి ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ సూచనలు, సలహాల నిమిత్తం శుక్రవారం వరకు సమయం కావాలని కోరారు. దీనిని వ్యతిరేకించిన పిటిషనర్ల తరపు న్యాయవాది కబిల్ సిబల్ తక్షణమే కేంద్రానికి నోటీసులు జారీ చేయాలని కోరారు. కానీ సోమవారం వరకు సీజేకు గడువు ఇచ్చిన సుప్రీం, తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా ఇప్పటికే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆరోపణలు నిజమైతే ఇవిచాలా తీవ్రమైనవని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. రాజకీయ, న్యాయ, రక్షణ రంగ ప్రముఖులు, జర్నలిస్టులు సహా 300మందికి పైగా ప్రముఖుల ఫోన్ నంబర్ల హ్యాంకింగ్ వ్యవహారం దుమారాన్ని రాజేసింది. అయితే భారత్‌లో నిఘా లేదంటూ కేంద్రం ఇప్పటికే పార్లమెంట్లో ప్రకటించింది. -
పెగాసస్ స్పైవేర్‌పై విచారణ: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరసన సెగలు రేపుతున్న పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో గురువారం ప్రారంభమైంది. పెగాసస్ స్పైవేర్ స్కాంపై దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన 9 పిటిషన్లను గురువారం సుప్రీం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పలువురు రాజకీయ ప్రముఖులు, రాజ్యాంగ అధికారులు, జర్నలిస్టులు, జడ్జిలు, హక్కుల నేతలే టార్గెట్‌గా చేసిన ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేయకపోవడాన్ని పిటిషన్ల తరపు వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది కబిల్ సిబల్ ప్రశ్నించారు. స్పైవేర్‌ను కొనుగోలు చేసింది ఎవరు, హార్డ్‌వేర్ ఎక్కడ ఉంచారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఇది తమ వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవానికి భంగకరమని సిబల్ వాదించారు. ఈవ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులివ్వాలన్నారు. మరోవైపు ఈ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. పెగాసస్ గురించి మీడియా నివేదిక నిజమైతే, ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవన్నారు. వీటిపై లోతైన విచారణ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. కానీ తమ వాదనలకు అనుకూలమైన మెటీరియల్‌ని అందించలేకపోవడం దురదృష్టకరమన్నారు. ఎంతో పరిజ్ఞానం ఉన్న వ్యక్తులై వుండీ వివరాలు సేకరించడానికి అంతగా ప్రయత్నించలేదన్నారు. అలాగే దీనివల్ల తాము ప్రభావితమయ్యామని చెప్పుకుంటున్న వారు, ఇంతవరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. అంతేకాదు రెండేళ్ల తర్వాత ఈ విషయాన్ని ఎందుకు లేవనెత్తుతున్నారని ప్రశ్నించారు. . ఫోన్లు హ్యాక్ అవుతున్న విషయంపై ఫిర్యాదు చేశారా.. చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు అయిందా అని సీజేఐ ప్రశ్నించారు. తదుపరి విచారణను ఆగస్టు 10కి(మంగళవారం) వాయిదా వేశారు. కాగా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, రాజ్యసభ ఎంపీ, న్యాయవాది పెగాసస్ అంశంపై విచారణకు సుప్రీంకోర్టు పిటిషన్లను దాఖలు చేశారు. సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామ్, శశికుమార్, సీపీఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిటాస్, న్యాయవాది ఎంఎల్ శర్మ ఇందులో ఉన్నారు. దాదాపు 300 మందికిపైగా ప్రముఖులపై నిఘా పెట్టి గూఢచర్యానికి పాల్పడిన కుంభకోణంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ జర్నలిస్టులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే ఈ వ్యవహరాంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేయాలని ఎడిటర్స్ గిల్డ్ మరో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు పెగాసస్ వివాదం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తోంది. దీనిపై చర్చ జరపాలని, ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నిరసనలు, వాగ్వాదాల నడుమ పెగాసస్ నిఘాపై చర్చకు అంగీకరించేది లేదని సర్కార్ ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం. -
కార్పొరేట్ వార్: సుప్రీంకోర్టుకు సైరస్ మిస్త్రీ
సాక్షి, న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌తో వివాదంపై మార్చి 26న అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ .. సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేసింది. సదరు తీర్పులో లోపాలు ఉన్నాయని, కంపెనీల చట్టం మూలాలనే దెబ్బ కొట్టే విధంగా ఉందని పేర్కొంది. దీన్ని సరిచేయని పక్షంలో మైనారిటీ షేర్‌హోల్డర్ల హక్కులపై గణనీయంగా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని తెలిపింది. దాదాపు నాలుగేళ్ల క్రితం టాటా గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపును సమర్ధిస్తూ సుప్రీం కోర్టు ఈ ఏడాది మార్చి 26న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులనే తిరిగి సమీక్షించాలంటూ మిస్త్రీ కుటుంబానికి చెందిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. -
కార్తీ మరో రూ. 10 కోట్లు కట్టి వెళ్లండి..
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం కొడుకు కార్తీకి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. మే, జూన్ నెలల మధ్యలో ఆయన విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. గతంలోవి కాకుండా పూచీకత్తు కింద మరో రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని సీజేఐ జస్టిస్ గొగోయ్, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల బెంచ్ కార్తీని ఆదేశించింది. ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులకు సంబంధించి సీబీఐ, ఈడీ సంస్థలు ప్రస్తుతం కార్తీని విచారిస్తున్నాయి. అయితే టోటస్ టెన్నిస్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ల కోసం తాను అమెరికా, జర్మనీ, స్పెయిన్ దేశాలకు వెళ్లాల్సి ఉందని కోర్టుకు కార్తీ తెలిపారు. -
జయ ఆశలపై సుప్రీం నీళ్లు
రాజీవ్ హంతకుల విడుదలకు బ్రేక్ న్యూఢిల్లీ: రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషుల తక్షణ విడుదలకు సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో బ్రేక్ పడింది. దోషుల విడుదలకు తమిళనాడు ప్రభుత్వం అనుసరించిన విధానపరమైన లోపాలను ఎత్తిచూపిన చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. తాము శిక్ష తగ్గించిన ముగ్గురు దోషులు మురుగన్, శంతన్, పెరారి వాలన్ విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వంతో పాటు జైలు ఉన్నతాధికారులు, ఇతరులకు ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్ హత్య కేసులో ముగ్గురు దోషులకు పడిన మరణశిక్షను జీవితఖైదుకు తగ్గిస్తూ సుప్రీం తీర్పు వెలువరించిన 24 గంటల్లోగానే ఈ కేసుకు సంబంధించిన మొత్తం ఏడుగురు దోషులను జైలు నుంచి విడుదల చేయూలని జయలలిత సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనిపై స్టే కోరుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టును ఆశ్రరుుంచింది. ఈ నేపథ్యంలో స్టే మంజూరు చేసిన బెంచ్ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్లో కేవలం ముగ్గురు పేర్లను మాత్రమే పేర్కొన్నందున శిక్ష మాఫీ పొందిన మిగతా న లుగురి విషయంలో తాజాగా మరో పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. దీంతో మొత్తం ఏడుగురు దోషుల విడుదలకు బ్రేక్ పడినట్టరుుంది. తదుపరి విచారణను మార్చి 6కు వారుుదా వేసింది. సుప్రీం తీర్పు వెలువడిన తర్వాత ఒక్కరోజులోనే తమిళనాడు ప్రభుత్వం విధానపరమైన చర్యలన్నిటినీ ఎలా పూర్తి చేయగలిగిందని న్యాయమూర్తులు రంజన్ గొగోయ్, ఎన్.వి.రమణలతో కూడిన బెంచ్ విస్మయం వ్యక్తం చేసింది. దేశ అంతరాత్మపై దాడి: ప్రధాని రాజీవ్ హత్య భారతదేశ అంతరాత్మపై జరిగిన దాడిగా ప్రధాని మన్మో హన్‌సింగ్ అభివర్ణించారు. రాజీవ్ హంతకుల విడుదల అన్ని న్యాయ సూత్రాలకూ విరుద్ధమన్నారు. న్యాయపరంగా సమర్థనీయం కాని విషయంలో ముందుకువెళ్లరాదని తమిళనాడు ప్రభుత్వానికి స్పష్టం చేశారు.