న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), దర్యాప్తు సంస్థ సీబీఐకు సోమవారం నోటీసులు జారీ చేసింది. బ్యాంకు రుణాల మోసం కేసుల్లో ఆర్‌బీఐ నామినీ డైరెక్టర్, ఇతర సిబ్బంది పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం తాజా నోటీసు లిచ్చింది.
వివిధ బ్యాంకింగ్ స్కామ్‌లలో ఆర్‌బీఐ అధికారుల పాత్రపై విచారణ జరపాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పీటీషన్‌ను సుప్రీం విచారణకు స్వీకరించింది. జస్టిస్ బీఆర్ గవాయి, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం బీజేపీ నేత పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఆర్‌బీఐ, సీబీఐను కోరింది.
కాగా కింగ్‌ఫిషర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యెస్ బ్యాంక్ లాంటి వివిధ కుంభకోణాల్లో ఆర్‌బీఐ అధికారుల ప్రమేయంపై విచారణ జరగలేదని స్వామి ఆరోపించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంతో సహా, పలు చట్టాలను ప్రత్యక్షంగా ఉల్లంఘిస్తూ ఆర్‌బీఐ అధికారులు నిర్లక్క్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు.
Supreme Court issues notice to Reserve Bank of India (RBI) and Central Bureau of Investigation (CBI) on a plea filed by BJP member Subramanian Swamy seeking a CBI probe into the alleged role of RBI's nominee director in bank loan fraud cases.
— ANI (@ANI) October 17, 2022
Comments
Please login to add a commentAdd a comment