విశ్వాసఘాతకుడు.. మిస్త్రీ! | Cyrus Mistry was made chairman because there was no alternative: Tata Sons | Sakshi
Sakshi News home page

విశ్వాసఘాతకుడు.. మిస్త్రీ!

Published Fri, Nov 11 2016 1:01 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

విశ్వాసఘాతకుడు.. మిస్త్రీ!

విశ్వాసఘాతకుడు.. మిస్త్రీ!

నమ్మకంతో అప్పగిస్తే దెబ్బతీశారు
ప్రధాన కంపెనీలపై పెత్తనానికి ప్రయత్నించారు...
ఇండియన్ హోటల్స్‌ను చెప్పుచేతల్లో ఉంచుకోవాలనుకున్నారు...
ఇందుకు స్వతంత్ర డెరైక్టర్లను వాడుకున్నారు...
టాటా మోటార్స్ దేశీ మార్కెట్ వాటా పడిపోయింది..
గత నాలుగేళ్లలో గ్రూప్ రుణ భారం రూ.69 వేల కోట్ల నుంచి
రూ.2.25 లక్షల కోట్లకు పెరిగిపోరుుంది...
టర్న్‌ఎరౌండ్ చేయడం చేతకాక, పెట్టుబడులను రైటాఫ్ చేశారు..
మాజీ చైర్మన్‌పై టాటా సన్స్ ఎదురుదాడి...
తొమ్మిది పేజీల లేఖలో మిస్త్రీపై ప్రత్యారోపణలు... 

ముంబై: సైరస్ మిస్త్రీ- టాటాల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నారుు. చైర్మన్ పదవి నుంచి తొలగించిన తర్వాత మిస్త్రీపై టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అరుున టాటా సన్స్ మరోసారి తీవ్రంగా విరుచుకుపడింది. 100 బిలియన్ డాలర్ల విలువైన గ్రూప్‌లోని ప్రధాన కంపెనీలపై పెత్తనం చేయాలని ప్రయత్నించారని... విశ్వాస ఘాతకానికి పాల్పడ్డారని పేర్కొంది. మిస్త్రీ చేసిన ప్రతి ఆరోపణనూ తిప్పికొడుతూ సవివరంగా గురువారం తొమ్మిది పేజీల లేఖను విడుదల చేసింది. గత నెల 24న మిస్త్రీని టాటా సన్స్ డెరైక్టర్ల బోర్డు ఉన్నపళంగా చైర్మన్ పదవి నుంచి తొలగించి మళ్లీ రతన్ టాటాను తాత్కాలిక చైర్మన్‌గా నియమించటం తెలిసిందే.

ఇన్నాళ్లూ తమపై మిస్త్రీ బురదజల్లుతున్నారని పేర్కొన్న టాటా సన్స్... మొత్తమ్మీద మిస్త్రీకి ఉద్వాసన చెప్పటానికి వెనకున్న కారణాలన్నింటినీ బయటపెట్టింది. ‘‘నాలుగేళ్ల క్రితంమిస్త్రీపై ఎంతో నమ్మకం ఉంచి, ముందుచూపుతో చైర్మన్ పదవిలో కూర్చోబెట్టాం. కానీ ఆయన మమ్మల్నే కాక టాటా ప్రతినిధులెవరినీ కూడా పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. గ్రూప్‌లోని కీలకమైన కంపెనీలపై నియంత్రణ కోసం పాకులాడారు. మా విశ్వాసాన్ని పూర్తిగా వమ్ముచేశారు’ అని టాటా సన్స్ తీవ్రంగా దుయ్యబట్టింది.

ఇన్వెస్టర్లకు డివిడెండ్లు తగ్గిపోయారుు...
‘‘నాలుగేళ్లు చైర్మన్‌గా కొనసాగిన మిస్త్రీ హయాంలో గ్రూప్‌లోని 40కి పైగా కంపెనీల్లో ఇన్వెస్టర్లకు ఒకపక్క డివిడెండ్లు తగ్గిపోయారుు. మరోవంక వ్యయాలు తీవ్రంగా పెరిగిపోయారుు. గ్రూప్ కంపెనీల నిర్వహణ కోసం అనేక ఏళ్లుగా టాటా సన్స్ అనుసరిస్తున్న చరిత్రాత్మక యాజమాన్య స్వరూపాన్ని మిస్త్రీ మంటగలిపారు. చైర్మన్‌గా ఉన్న వ్యక్తి కంపెనీలన్నింటిలోనూ కామన్‌గా డెరైక్టర్‌గా కొనసాగేలా నిబంధనలు మార్చారు. ఇకపై గ్రూప్‌లో ఇలాంటి పరిస్థితిని కొనసాగనివ్వం’’ అని టాటా సన్స్ స్పష్టం చేసింది.

ఇండియన్ హోటల్స్‌పై ఆధిపత్యానికి...
తాజ్ గ్రూప్ ఆఫ్ హోటళ్లను నిర్వహిస్తున్న ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్‌ను (ఐహెచ్‌సీఎల్) మిస్త్రీ తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని చూశారని టాటా సన్‌‌స ఆరోపించింది. మిస్త్రీ చైర్మన్‌గా ఉన్న ఐహెచ్‌సీఎల్‌లో టాటా సన్స్ కు 28.01 శాతం వాటా మాత్రమే ఉంది. ‘‘ఇందుకోసం ఆయన స్వతంత్ర డెరైక్టర్లందరినీ తనకు అనుకూలంగా మార్చుకున్నారు’’ అని సంస్థ పేర్కొంది. గత వారంలో జరిగిన బోర్డు సమావేశంలో కంపెనీ స్వతంత్ర డెరైక్టర్లు మిస్త్రీ నాయకత్వాన్ని కీర్తించడంతోపాటు ఆయనను పూర్తిగా సమర్థించడం తెలిసిందే.

నిర్వహణ చేతకాలేదు...
నాలుగేళ్ల సారథ్యంలో మిస్త్రీ పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదని.. కంపెనీల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని టాటా సన్స్ తేల్చి చెప్పింది. ‘‘టాటా స్టీల్ యూరప్ (రతన్ టాటా హయాంలో కోరస్‌ను కొనుగోలు చేసిన తర్వాత పేరు మార్చారు), టాటా-డొకోమో జారుుంట్ వెంచర్, టాటా మోటార్స్ భారతీయ కార్యకలాపాలను మిస్త్రీ పూర్తిగా దెబ్బతీశారు. ఈ కంపెనీలన్నీ తీవ్ర సమస్యల్లోకి కూరుకుపోయారుు. నష్టాలు, రుణ భారం భారీగా పెరగడమే కాకుండా... మార్కెట్ వాటా పడిపోరుుంది. దీనికి ఆయన అనుసరించిన విధానాలే కారణం. టర్న్‌ఎరౌండ్ చేయడం చేతకాలేదు కానీ, ఆయా కంపెనీల్లో చేసిన భారీ మొత్తంలోని పెట్టుబడులను కోల్పోయేలా (రైటాఫ్) చేశారు’’ అని టాటా సన్స్ తెలియజేసింది.

ఇక టాటా స్టీల్ యూరప్‌లో సంక్షోభం, జపాన్ టెలికం కంపెనీ డొకోమోతో జేవీ విఫలం కావడానికి మిస్త్రీయే కారణమని పేర్కొంది. కాగా, మిస్త్రీ తన ఉద్వాసన తర్వాత రాసిన లేఖలో తన ముందు చైర్మన్ (రతన్ టాటా) హయాంలో తీసుకున్న నిర్ణయాలు, విదేశీ కొనుగోళ్ల కారణంగా గ్రూప్‌లోని 5 కంపెనీలు రూ.1.18 లక్షల కోట్ల పెట్టుబడి నష్టాలను చవిచూడాల్సి వస్తుందని ఆరోపించారు. అరుుతే, ఈ విషయాన్ని ఆయా కంపెనీల బోర్డు సభ్యులకు చెప్పానంటున్న మిస్త్రీ.. దీన్ని అప్పుడే ఎందుకు బయటపెట్టలేదని టాటా సన్స్ ప్రశ్నించింది.

అప్పులు మూడింతలు...: ‘నాలుగేళ్ల క్రితం రూ.69,877 కోట్లుగా ఉన్న గ్రూప్ రుణ భారం ఇప్పుడు రూ.2,25,740 కోట్లకు ఎగబాకింది. సమస్యలున్నాయని చెబుతున్న ఐదు కంపెనీలనూ మళ్లీ గాడిలో పెట్టడానికి ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. వదిలించుకోవడానికే ప్రయత్నించారు. ఆయన అమ్మేసిన టాటా స్టీల్ యూరోపియన్ ఆస్తులను కొన్న కంపెనీ మాత్రం తొలి ఏడాదిలోనే వాటిని టర్న్ ఎరౌండ్ చేసింది’’ అని టాటా సన్స్ వివరించింది.

తప్పుదోవ పట్టించారు...
గ్రూప్ వ్యవహారాల్లో టాటా ట్రస్టులు జోక్యం చేసుకున్నాయని మిస్త్రీ చేసిన ఆరోపణలను కూడా తిప్పికొట్టింది. ‘‘నిజానికి ఇందులో తప్పేముంది? అరుుతే, మిస్త్రీ ఈ వ్యవహరంలో అందరినీ తప్పుదోవపట్టించారు. ట్రస్టులు తమ ఆస్తుల పరిరక్షణపై దృష్టిపెడతారుు. అంతేకాదు టాటా సన్‌‌సలో తమకున్న విలువైన పెట్టుబడులు కూడా వాటికి ముఖ్యమే. అందుకే అన్‌లిస్టెడ్ హోల్డింగ్ కంపెనీకి (టాటా సన్‌‌స) సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవటం అత్యవసరం కూడా.

టాటా మోటార్స్ మార్కెట్ వాటా పడిపోరుుంది...
మిస్త్రీ నాయకత్వంలో టాటా మోటార్స్ దేశీ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని టాటా సన్స్ తెలిపింది. ‘‘గత మూడేళ్లలో కార్లు, వాణిజ్య వాహనాల్లోనూ దేశీ మార్కెట్ వాటా ఘోరంగా పడిపోరుుంది. కార్ల విషయానికొస్తే.. 2012-13లో 13% మార్కెట్ వాటా ఉంటే.. ఇప్పుడు 5%కి దిగజారింది. వాణిజ్య వాహనాల మార్కెట్ వాటా 60% నుంచి 40%కి క్షీణించింది. ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న కంపెనీకి చరిత్రలో ఇదే అత్యంత ఘోరమైన స్థారుు’’ అని వివరించింది. అరుుతే, నానో కార్ల వల్లే టాటా మోటార్స్ దేశీయంగా నష్టాల్లోకి కూరుకుపోరుుందని.. దీన్ని మూసేస్తేనే కంపెనీ బాగుపడుతుందని మిస్త్రీ చేసిన ఆరోపణలపై టాటా సన్స్ తాజా లేఖలో వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.

టీసీఎస్ చైర్మన్ పదవి నుంచి ఔట్
ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి తొలగించిన మిస్త్రీకి గ్రూప్ కార్యకలాపాలతో సంబంధం లేకుండా చేసే పనిని టాటా సన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా కీలకమైన టీసీఎస్ చైర్మన్ పదవి నుంచి కూడా ఆయనను తొలగించింది. తాత్కాలికంగా ఇషాత్ హుస్సేన్‌ను కంపెనీ చైర్మన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ‘మిస్త్రీ తొలగింపు తీర్మానాన్ని ఆమోదించడానికి అసాధారణ వాటాదారుల సమావేశం (ఈజీఎం) కోసం నోటీసులు జారీ చేసినట్లు టాటా సన్స్ ఈ నెల 9న మాకు తెలియజేసింది. దీంతో తక్షణం మిస్త్రీని తొలగించి ఇషాత్ హుసేన్‌కు ఆయన స్థానంలో బాధ్యతలను అప్పగిస్తున్నట్లు కూడా పేర్కొంది.

కొత్తగా పూర్తిస్థారుు చైర్మన్‌ను నియమించేవరకూ హుస్సేన్ కొనసాగుతారని తెలిపింది’ అని ఎక్స్ఛేంజీలకు వెల్లడించిన సమాచారంలో టీసీఎస్ వెల్లడించింది. టాటా గ్రూప్‌లోని టాటా స్టీల్, వోల్టాస్‌తో సహా చాలా కంపెనీల్లో హుస్సేన్ డెరైక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం వోల్టాస్, టాటా స్కైలకు చైర్మన్‌గానూ సేవలందిస్తున్నారు. కాగా,టాటా సన్స్ కు టీసీఎస్‌లో 73.26% వాటా ఉంది. గ్రూప్ చైర్మన్‌గా ఉద్వాసన పలికినప్పటికీ.. టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్, టాటా కెమికల్స్, టాటా పవర్ సహా పలు టాటా గ్రూప్ కంపెనీలకు ఆయన చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటి నుంచి కూడా ఆయనను తొలగించాలనేది టాటా సన్స్ వ్యూహం.

ఇండియన్ హోటల్స్ నుంచి కూడా...
ఇండియన్ హోటల్స్ డెరైక్టర్ల బోర్డు నుంచి కూడా మిస్త్రీని తొలగించేందుకు రంగం సిద్ధమైంది. చైర్మన్ పదవి నుంచి మిస్త్రీకి ఉద్వాసన తీర్మానాన్ని ఆమోదించేందుకు కంపెనీ ఈజీఎంను నిర్వహించనున్నట్లు టాటా సన్స్ తెలియజేసిందని ఇండియన్ హోటల్స్ బీఎస్‌ఈకి సమాచారం ఇచ్చింది. గత వారంలోనే కంపెనీ స్వతంత్ర డెరైక్టర్లు ఆయన నాయకత్వాన్ని సమర్థించడం, చైర్మన్‌గా ఆయనను కొనసాగించేందుకు మద్దతుపలకడం తెలిసిందే. కాగా, తాజాగా టాటా కెమికల్స్ ఇండిపెండెంట్ డెరైక్టర్లు కూడా మిస్త్రీని చైర్మన్‌గా కొనసాగించాలంటూ సమర్థించడం విశేషం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement