conflicts
-
ఈ ఏడాది.. పిల్లల పాలిట పెనుశాపమే!
పిల్లల పాలిట చరిత్రలో ఎన్నడూ లేనంతటి దారుణ సంవత్సరంగా నిలిచింది 2024. యుద్ధాలు, ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బాలలు భారీ సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఏకంగా 47.3 కోట్ల మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆరుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది కల్లోల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఒకప్పుడు పేదరికం, కరువు, వంటివాటితో అల్లాడే పిల్లలు ఇప్పుడు ఘర్షణల్లో సమిధలవుతున్నారు. చదువు మాట అటుంచి వారికి పోషకాహారమే గగనమైపోయింది! గాజా, సూడాన్, ఉక్రెయిన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలతో బాలలు విపరీతంగా సతమతమవుతున్నట్టు ఐరాస బాలల సంస్థ యునిసెఫ్ తాజాగా పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 15 నెలల్లో కనీసం 17,492 మంది బాలలు మరణించినట్లు తెలిపింది...! మునుపెన్నడూ లేనంతంగా ఎక్కువ మంది పిల్లలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. బలవంతంగా నిరాశ్రయులవుతున్నారు. ఘర్షణలో మరణిస్తున్న, గాయపడుతున్న పిల్లల సంఖ్య పెరిగింది. పాఠశాలలపై బాంబుల వర్షం కురుస్తోంది. ఇళ్లు ధ్వంసమయ్యాయి. కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. భద్రత మాట పక్కకు పెడితే.. ప్రాథమిక అవసరాలు తీర్చుకునే అవకాశమూ ఉండటం లేదు. వాళ్లు ఆడుకోవడం, నేర్చుకోవడం ఎప్పుడో మరిచారు. ఈ యుద్ధాలు పిల్లల హక్కులను హరిస్తున్నాయి. ఇక, ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్లు, పోషకాహారం విలాసంగా మారాయి. ‘‘ప్రపంచంలో అనియంత్రిత యుద్ధాలకు ఒక తరం పిల్లలు బలవుతున్నారు. యుద్ధ ప్రాంతాల్లోని పిల్లలు మనుగడ కోసం పోరాటమే చేస్తున్నారు. దానికి తమ బాల్యాన్ని పణంగా పెడుతున్నారు. సర్వహక్కులు కోల్పోతున్నారు. ఇది దారుణం’’ అని యునిసెఫ్ డైరెక్ట్ కేథరిన్ రస్సెల్ వాపోయారు. గణాంకాలు చెబుతున్న విషాదాలు.. యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో పిల్లలు 30 శాతం ఉన్నారు. వారిలో 47.3 కోట్ల మంది యుద్ధ ప్రభావింత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రతి ఆరుగురిలో ఒకరు సంఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్నారని అంతర్జాతీయ ఏజెన్సీ తెలిపింది. 1990లలో సుమారు 10 శాతం మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో ఉండగా ఇప్పుడది ఏకంగా రెట్టింపుకు, అంటే 19 శాతానికి పెరిగింది. ఈ యుద్ధాల కారణంగా 2023 చివరి నాటికి 4.7 కోట్ల మంది పిల్లలు నిర్వాసితులయ్యారు. 2024లో హై తీ, లెబనాన్, మయన్మార్, పాల స్తీనా, సూడాన్ నుంచి అత్యధికంగా శరణార్థులుగా వెళ్లారు. ప్రపంచ శరణార్థుల జనాభాలో సుమారు 40 శాతం బాలలే. ఆయా దేశాల్లో నిర్వాసితులయినవారిలో బాలలు 49 శాతమున్నారు. 2023 నుంచి ఇప్పటిదాకా 22,557 మంది పిల్లలపై రికార్డు స్థాయిలో 32,990కు పైగా తీవ్రమైన హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. ముఖ్యంగా బాలికల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంఘర్షణ ప్రాంతాల్లో అత్యాచారాలు, లైంగిక హింస పెచ్చరిల్లాయి. ప్రమాదకర స్థాయిలో యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో విద్యకు తీవ్ర అంతరాయం కలిగింది. సంఘర్షణ ప్రభావిత దేశాలలో 52 మిలియన్లకు పైగా పిల్లలు పాఠశాలకు దూరంగా ఉన్నారు. విద్యా మౌలిక సదుపాయాల విధ్వంసం, పాఠశాలల సమీపంలో అభద్రతా భావం వల్ల ఈ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ పిల్లల్లో పోషకాహార లోపం కూడా ప్రమాదకర స్థాయికి పెరిగింది. యుద్ధం పిల్లల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధాలు జరుగుతున్న దేశాల్లోని పిల్లల్లో 40శాతం మంది టీకాలు అందడం లేదు. వారి మానసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. హింస, విధ్వంసం, కుటుంబ సభ్యులను కోల్పోవడం వల్ల పిల్లల్లో నిరాశ పెరిగింది. పిల్లల్లో ఆగ్రహావేశాలు పెరిగాయి. విచారం, భయం వంటి వాటితో బాధపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఛీ.. ఇంట్లో రోజూ గొడవలే
ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. రెండు వేర్వేరు కుటుంబాల్లో, నేపథ్యాల్లో పెరిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వారి మధ్య విభేదాలు సహజం. అయితే వాటిని ఎలా, ఎంత త్వరగా పరిష్కరించుకున్నానేదే వారి బంధంలోని సంతోషాన్ని నిర్ణయిస్తుంది. విభేదాలను పరిష్కరించుకోకుండా చిన్న చిన్న వాదనలను కూడా పెద్ద పెద్ద గొడవలుగా మార్చుకుంటే కుటుంబ జీవితాన్ని నరకంగా మారుతుంది. అలాంటి ఒక జంట గురించి ఈరోజు మాట్లాడుకుందాం.రవి (32) ప్రియ (30)లకు ఐదేళ్ల కిందట పెళ్లయింది. రవి ఐటీ కన్సల్టెంట్, ప్రియ హెచ్ ఆర్ మేనేజర్. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, ప్రేమ. తమ బిడ్డ కీర్తన అంటే ప్రాణం. ఇంటి పనులతో సహా బాధ్యతలను సమానంగా పంచుకుంటారు. వారాంతాల్లో సినిమాలు, షికార్లు. అప్పుడప్పుడూ విహారయాత్రలు. సుఖంగా సంతోషంగా జరుగుతున్న కాపురం.కానీ గత కొద్ది నెలలుగా మారి మధ్య తరచూ గొడవలవుతున్నాయి. గత నెల జరిగిన గొడవ ఇద్దరూ కొట్టుకునేవరకూ వెళ్లింది. ఆ తర్వాత తమ ప్రవర్తనకు ఇద్దరూ సిగ్గుపడ్డారు. ఎలాంటి విభేదాలున్నా చర్చించుకుని పరిష్కరించుకోవాలే తప్ప గొడవ పడకూడదని నిర్ణయించుకున్నారు. కానీ మళ్లీ పెద్ద గొడవలయ్యాయి. ఇక తమ వల్ల కాదనుకుని కౌన్సెలింగ్ కు వచ్చారు. ఇద్దరితో విడివిడిగా, కలివిడిగా మాట్లాడాను.చిన్న చిన్న అసమ్మతులు, ఇంటి పనులు, బిడ్డ సంరక్షణ లేదా ఆర్థిక విషయాలు అతి త్వరగా తీవ్రమైన గొడవలుగా మారుతున్నాయని చెప్పారు. ఆ తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేసినా, మళ్లీ గొడవలు ఆపలేకపోతున్నామన్నారు. దీంతో ఎమోషనల్ గా దూరమవుతున్నామని, ఇంటిమసీ కోల్పోతున్నామని చెప్పారు. ఇలా జరగడం చాలా బాధగా ఉందన్నారు.ఆఫీసులో ప్రాజెక్ట్ వర్క్ వల్ల ఒత్తిడి పెరిగిందని, మళ్లీ ఇంటికి వచ్చి పనిచేయాలంటే కష్టంగా ఉందని రవి చెప్పాడు. తనకు కూడా ఆఫీసులో చాలా వర్క్ ఉంటోందని, ఇంటికి వచ్చాక పాపతో సరిపోతుందని, మళ్లీ ఇంటి పని చేయాలంటే తన వల్ల కావట్లేదని ప్రియ చెప్పింది. అయినప్పటికీ తాను చేస్తున్నా ఎలాంటి గుర్తింపు లేకపోగా, కూరలో ఉప్పు ఎక్కువైనా గొడవ పడుతున్నాడని చెప్పింది.ఇలాంటి విషయాలన్నీ కలిసి కుటుంబం కోసం ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారనే వాదనలుగా మారాయి. అవి వ్యక్తిగత దూషణలుగా మారాయి. పెళ్లికి ముందు జరిగిన విషయాలనుంచి, పెళ్లి రోజు జరిగిన గొడవల వరకూ తవ్విపోసుకున్నారు. ఒకరి తల్లిదండ్రులను మరొకరు విమర్శించారు. వాదనల తర్వాత రవి ఇంటినుంచి బయటకు వెళ్లిపోగా, ప్రియ ఒంటరిగా ఏడుస్తూ కూర్చుంటుంది.వాదనలు వర్సెస్ తగాదాలుమనం మొదట్లో చెప్పినట్లు ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. ఆరోగ్యకరమైన వాదనలు పరిష్కారానికి దారితీస్తే, తగాదాలు భావోద్వేగ గాయాలను మిగుల్చుతాయి. అందుకే వాదనలకు, తగాదాలకు మధ్య తేడా తెలుసుకోవడం అవసరం. 👉 ఒక సమస్యను చర్చించడం, భావాలు, పరిష్కారాలను చర్చించడం, ఆరోపణలు చేయకపోవడం ఆరోగ్యకరమైన వాదనల లక్షణం. ఉదాహరణకు, రవి ఇంటి పనుల కారణంగా ఒత్తిడిగా అనిపిస్తే, ప్రియ వ్యక్తిత్వంపై దాడి చేయకుండా తన అభిప్రాయం చెప్తాడు. ఆరోగ్యకరమైన వాదనలు 👉 విభేదాల సమయంలో కూడా భాగస్వామి పట్ల గౌరవం తొలగిపోదు. భాగస్వామి వాదన వినడం, అది భిన్నమైనదైనా అంగీకరిస్తారు. 👉 ఇద్దరూ ఎమోషనల్ గా ఉన్నప్పుడు అది మరింత దిగజారకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. 👉 విధ్వంసకరమైన తగాదాల్లో సమస్యను గాలికి వదిలి వ్యక్తిగతంగా విమర్శిస్తారు. రవి, ప్రియల మధ్య జరుగుతున్నది ఇదే. 👉 తగాదాల్లో తరచుగా గతం నుండి సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తారు. 👉 ఇద్దరూ గొంతు పెంచి అరచుకోవడం, ఒకరినొకరు అడ్డుకోవడం జరుగుతుంది. రవి తరచుగా వాదన మధ్యలో బయటకు వెళ్లిపోవడం ప్రియకు తనను పట్టించుకోవడం లేదనే అనుభూతిని కలిగించింది. కౌన్సెలింగ్ తో పరిష్కారం... రవి, ప్రియల సమస్య వాదనలు తగాదాలుగా మారడమే. అందుకే వారి మధ్య హెల్తీ కమ్యూనికేషన్ పెంపొందించేలా కౌన్సెలింగ్ సెషన్లు ప్లాన్ చేశాను. 👉 ఏ బంధంలోనైనా యాక్టివ్ లిజనింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కౌన్సెలింగ్ సమయంలో వారు ఒకరినొకరు అడ్డుకోవడం లేదా వ్యక్తిగత దాడులు చేయకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం నేర్చుకున్నారు.👉 ఉద్రిక్తత పెరిగినప్పుడు ఒక చిన్న విరామం తీసుకోవడానికి అంగీకరించారు. దీనివల్ల భావోద్వేగ నష్టం తగ్గుతుంది. వారి వాదనలు నిర్మాణాత్మకంగా మారాయి.👉 వాదనల్లో ఒకే సమస్యపై కేంద్రీకరించాలని, అనవసర విషయాలు తీసుకురాకూడదని తీర్మానించుకున్నారు. 👉 ఒకరి లవ్ లాంగ్వేజ్ ను మరొకరు అర్థం చేసుకున్నారు. తగాదా సమయంలో కూడా పరస్పర గౌరవంతో, ప్రేమతో వ్యవహరించడం నేర్చుకున్నారు. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.com -
కలిసుంటే కలదు సుఖం
పదేళ్లు కలిసి కాపురం చేసిన ఫతేనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నివాసం ఉండే శ్రీలత (పేరు మార్చాం), మురళి(పేరు మార్చాం) దంపతులు ఇటీవల కాపురంలో కలహాలు పెరగడంతో విడాకుల కోసం పోలీసులను ఆశ్రయించారు. ముగ్గుaరు పిల్లల తర్వాత భర్త మద్యానికి బానిసై, మానసికంగా శారీరకంగా హింసిస్తుండడంతో శ్రీలత భర్త నుంచి విడాకులు తీసుకోవాలని ధృడంగా నిశ్చయించుకుంది.దంపతులిద్దరికీ జీడిమెట్లలోని సీడీఈడబ్ల్యూ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్) సెంటర్లో అధికారులు కౌన్సిలింగ్ చేశారు. పలు దఫాల్లో సర్థిచెప్పిన తర్వాత వారి మధ్య సయోధ్య కుదిరింది. మురళిలోనూ మార్పు వచ్చింది. వారిప్పుడు సంతోషంగా కలిసి ఉంటున్నారు. లక్డీకపూల్‌లోని నీలోఫర్ ఆసుపత్రి సమీపంలో నివాసం ఉండే 43 ఏళ్ల ముంతాజ్ బేగం (పేరు మార్చాం) 2013 వరకు సెక్యూరిటీ గార్డుగా పనిచేసి ఉద్యోగం మానేశారు. 63 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్ ఖలీల్ (పేరు మార్చాం)ను రెండో వివాహం చేసుకున్నారు. లాక్డౌన్ ముందు వరకు ముంతాజ్‌ను బాగానే చూసుకున్న ఖలీల్ ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఆమెను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టడం మొద లు పెట్టాడు. తన బతుకుతెరువుకు సైతం డబ్బు ఇవ్వకపోవడంతో బషీర్‌బాగ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నాంపల్లి సీడీఈడబ్ల్యూ సెంటర్లో దంపతులకు కౌన్సిలింగ్ చేయడంతో ఖలీల్‌లో మార్పు వచ్చింది. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఉంటున్నారు. కొద్దిపాటి మనస్పర్థలు కాపురాలు కూల్చేస్తున్నాయి. ఇక మద్యం మహమ్మారి దంపతుల మధ్య గొడవలకు మరింత ఆజ్యం పోస్తోంది. దంపతుల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం సన్నగిల్లడంతో అనుమానం పెనుభూతమవుతోంది. దీంతో వివాహబంధాన్ని తెంచుకోవాలన్న కఠిన నిర్ణయానికి వస్తున్నారు. విడాకుల కోసం కోర్టు మెట్లు తొక్కుతూ ఏళ్లపాటు వ్యక్తిగత జీవితాలు బలిపెట్టుకుంటున్నారు కొందరు. ఈ నేపథ్యంలో బలమైన కారణం లేకుండానే వివాహ బంధాలను బలి చేసుకోకుండా, కొద్దిపాటి సర్దుబాట్లతో కాపురం తిరిగి కాపురాలు నిలబడేలా తెలంగాణ పోలీసులు ప్రయvస్తున్నారు. కుటుంబ కలహాలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే జంటలకు ప్రాథమికంగా కౌన్సెలింగ్ ఇచ్చేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీస్‌శాఖలోని మహిళా భద్రత విభాగం అధికారులు సీడీఈడబ్ల్యూ సెంటర్లు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కలిపి మొత్తం 27 కౌన్సిలింగ్ సెంటర్లను నెలకొల్పారు. 2023 ఫిబ్రవరి నుంచి ఈ సెంటర్లు పనిచేస్తున్నాయి. వీటిల్లో గృహహింస కేసుల్లో బాధిత మహిళలు, వారి భర్తలు, అవసరం మేరకు ఇతర కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తున్నారు. ఇలా పోలీసులను ఆశ్రయించిన జంటల్లో 42 శాతం మందిని తిరిగి కలిపినట్టు మహిళా భద్రత విభాగం ఉన్నతాధికారులు తెలిపారు. మరో 29 శాతం మంది మాత్రం విడాకులు తీసుకునేందుకే నిశ్చయించుకున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి 27 కౌన్సిలింగ్ సెంటర్ల పరిధిలో ఏప్రిల్ 26 నాటికి మొత్తం 7,474 ఫిర్యాదులు నమోదైనట్టు వారు వెల్లడించారు. మొత్తం అందిన ఫిర్యాదుల్లో 853 మంది బాధితుల్లో ఆత్మహత్యలు చేసుకునే మానసిక స్థితి ఉండడంతో వారిని మానసిక నిపుణులైన కౌన్సిలర్ల వద్దకు పంపి వారిలో తిరిగి స్థైర్యాన్ని నింపేలా కౌన్సిలింగ్ ఇప్పించినట్టు అధికారులు తెలిపారు. మొత్తం అందిన 7,474 ఫిర్యాదుల్లో 6,600 కేసులలో పరిష్కారం లభించినట్టు తెలిపారు.ఏమిటీ సీడీఈడబ్ల్యూ సెంటర్లుగృహ హింస కేసుల్లో దంపతులు విడాకులు తీసుకోకుండా, సమస్యను గుర్తించి.. వారికి అర్థమయ్యేలా సర్దుబాటు చేసి తిరిగి కలిపేందుకు తెలంగాణ పోలీస్‌శాఖ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో సేఫ్ సిటీ ప్రాజెక్టు నిధులతో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక మహిళా కౌన్సెలర్, మహిళా సిబ్బంది ఉంటారు. వీరు గృహహింసకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లకు వచ్చే జంటలకు, అవసరం మేరకు వారి కుటుంబ సభ్యులకు పలు దశల్లో కౌన్సిలింగ్ నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. - సాక్షి, హైదరాబాద్ -
బ్యాంకుల ఎస్ఎఫ్టీ నివేదికల్లో వైరుధ్యాలు
న్యూఢిల్లీ: అధిక విలువ కలిగిన లావాదేవీలకు సంబంధించి కొన్ని బ్యాంకులు సమరి్పంచిన ‘స్టేట్మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ (ఎస్ఎఫ్టీ)’ విషయంలో వైరుధ్యాలు ఉన్నట్టు ఆదాయన్ను శాఖ గుర్తించింది. ఆదాయపన్ను శాఖ నిర్ధేశించిన లావాదేవీల వివరాలను ఎస్ఎఫ్టీ కింద ఏటా బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్, వివిధ సంస్థలు ఆదాయపన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్ఎఫ్టీని మే 31 నాటికి దాఖలు చేయాలి. ఫారెక్స్ డీలర్లు, బ్యాంక్‌లు, సబ్ రిజి్రస్టార్, ఎన్బీఎఫ్సీ, పోస్టాఫీసులు, బాండ్లు/డిబెంచర్లు జారీ చేసిన సంస్థలు, మ్యూచువల్ ఫండ్ ట్రస్టీలు, షేర్ల బైబ్యాక్ చేసిన కంపెనీలు, డివిడెండ్ చెల్లించిన కంపెనీలు ఎస్ఎఫ్టీ పరిధిలోకి వస్తాయి. తమిళనాడుకు చెందిన ప్రముఖ బ్యాంక్ నివేదించిన ఎఫ్ఎఫ్టీలో వ్యత్యాసాలను గుర్తించినట్టు ఆదాయపన్ను శాఖ అత్యున్నత విభాగం సీబీడీటీ ప్రకటించింది. కొన్ని లావాదేవీలను అసలుకే వెల్లడించకపోగా, కొన్ని లావాదేవీల సమాచారం కచి్చతంగా పేర్కొనలేదని వెల్లడించింది. ఉత్తరాఖండ్‌లో రెండు కోపరేటివ్ బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహించగా, వేలాది కోట్ల రూపాయల లావాదేవీలను రిపోర్ట్ చేయాలేదని బయటపడినట్టు తెలిపింది. వివిధ సంస్థలు ఎస్ఎఫ్టీ ద్వారా ఆదాయపన్ను శాఖకు వివరాలు తెలియజేస్తే.. ఆయా సమాచారాన్ని పన్ను చెల్లింపుదారుల వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో చేరుస్తారు. దీంతో పన్ను చెల్లింపుదారులు తమ ఏఐఎస్‌ను పరిశీలించుకుని రిటర్నులు దాఖలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎస్ఎఫ్టీల్లో వ్యత్యాసాలు గుర్తించినట్టు ప్రకటించిన సీబీడీటీ, తీసుకున్న చర్యలపై సమాచారం తెలియజేయలేదు. -
విచిత్ర ఘటన: ఓ వృద్ధుడు బతికుండగానే.. తన అంత్యక్రియలు తానే..
బతికుండగానే ఓ వ్యక్తి తన అంత్యక్రియలు తానే నిర్వహించుకున్నాడు. తాను చనిపోయినప్పుడూ ఇక్కడే చివరి కార్యక్రమాలు చేయాలని అభ్యర్థించాడు. తద్దినం దగ్గర నుంచి దశదిన కర్మల వరకు అన్ని తానే నిర్వహించుకున్నాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అతను ఎందుకిలా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడంటే.. అసలేం జరిగందంటే..యూపీలోని కేవాన్ గ్రామానికి చెందిన జటా శంకర్‌కి తన కుటుంబంతో చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. తాను చనిపోతే అంత్యక్రియలు చేస్తారో లేదో అన్న భయంతో అన్ని కార్యక్రమాలను తాను బతికుండగానే తానే చేసుకున్నాడు. అందుకోసం తన భార్యతో దెబ్బలాడి మరీ ఒప్పించాడు. జూన్15 తాను చనిపోయిన 13వ రోజుగా తీర్మానించి తనకు తానుగా పిండం పెట్టుకున్నాడు. ఆ తర్వాత గ్రామస్తులకు గ్రాండ్‌గా విందు కూడా ఏర్పాటు చేశాడు. అంతేగాదు శంకర్ తన సమాధి కోసం ఓ కాంక్రీట్ ఫ్లాట్‌ఫాంని కూడా నిర్మించాడు. తన అంత్యక్రియలు అక్కడే జరగాలని శంకర్ తమతో చెబుతుండేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. తరుచుగా తన కుటుంబంతో తగాదాలు జరగడంతో విరక్తి చెంది ఇంతటి దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు పలువురు చెబుతున్నారు. ఈ విషయం గ్రామంలో దావానంలా వ్యాపించడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. (చదవండి: కెఫిన్ లేని కాఫీ గింజలు..హాయిగా సిప్ చేయొచ్చు) -
ఇందుకే టీడీపీ అధికారంలోకి రానిది
-
గవర్నర్ల సొంత ఎజెండా!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును వివరిస్తూ పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలకు సూచించారు. ఆయా రాష్ట్రాల్లో వారి వ్యవహారం ఆందోళనకరంగా ఉందన్నారు. తెలంగాణతో పాటు కేరళ, తమిళనాడు, కేరళ, ఢిల్లీ మొదలైన చోట్ల గవర్నర్లు సొంత ఎజెండాతో పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో అనేక అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో గవర్నర్ల జోక్యాన్ని నిరోధించడంపై దేశంలోని విపక్ష పారీ్టల నేతలతో కలిసి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, దుర్మార్గమైన తీరును దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగాన్ని బహిష్కరించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకోసం వివిధ రాష్ట్రాల విపక్ష పారీ్టలను కూడా కలుపుకొని పోవాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా ఈ మేరకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన విపక్ష నేతలతో మాట్లాడుతున్నట్లుగా కేసీఆర్ తెలిపారని పార్టీవర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ, తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, స్టాలిన్, విజయన్‌లతో పాటు విపక్ష నేతలు అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్ తదితరులతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలిపాయి. విపక్ష పార్టీల సహకారంతో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని ముఖ్యమంత్రి సూచించినట్లు వివరించాయి. ఇలావుండగా కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్యపూరిత, ప్రమాదకర విధానాల వల్ల దేశ భవిష్యత్తుకు జరుగుతున్న తీరని నష్టాన్ని ఎంపీలకు కేసీఆర్ వివరించారు. పార్లమెంటు జరిగినన్ని రోజులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రజా సమస్యలపై గళం వినిపిస్తూ, కేంద్రం చేస్తున్న తప్పులను దేశం దృష్టికి తీసుకురావాలని సూచించారు. గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్పూర్తికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రగతిలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా అనేక రకాలుగా ఆటంకాలు సృష్టిస్తోంది. గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రాలను నిర్వీర్యపరిచే దిశగా గవర్నర్లను కేంద్రం తమ చెప్పుచేతుల్లో పెట్టుకోవడం అప్రజాస్వామికం. రాజ్యాంగబద్ధమైన విధులను నిర్వర్తిస్తూ కేంద్రం, రాష్ట్రాల నడుమ సంధానకర్తలుగా ఉండాల్సిన గవర్నర్ల వ్యవస్థను తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న దుర్మార్గ విధానాలను బీఆర్ఎస్ ఎంపీలు ఉభయ సభల్లో తీవ్రంగా వ్యతిరేకించాలి. రాష్ట్ర కేబినెట్ సహా, అత్యున్నత సభలైన శాసనసభ, శాసనమండలి తీసుకున్న నిర్ణయాలను సైతం బేఖాతరు చేస్తూ గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా పెండింగులో పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ప్రభావితం చేయాలని, అభివృద్ధిని, పాలనను అడ్డుకోవాలని చూస్తున్న గవర్నర్ల అప్రజాస్వామిక విధానాలను, కేంద్రం వైఖరిని ఎండగట్టాలి..’ అని కేసీఆర్ ఆదేశించారు. అభివృద్ధికి ఆటంకాలుగా కేంద్రం విధానాలు ‘కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశ సమగ్రతకు, అభివృద్ధికి ఆటంకాలుగా మారాయి. దేశ ప్రజలు కష్టార్జితంతో కూడబెట్టుకుంటున్న సంపదనంతా అప్పనంగా తమ కార్పొరేట్ స్నేహితులకు కట్టబెడుతున్నారు. తమకు అనుకూల కార్పొరేట్ శక్తులపై ప్రేమ కురిపిస్తూ లక్షల కోట్ల రూపాయల రుణాలను కేంద్రం రద్దు చేస్తోంది. ఎల్ఐసీ వంటి ప్రభుత్వరంగ సంస్థల్లో అదానీ వంటి బడా వ్యాపారవేత్తలకు వాటాలను అప్పనంగా కట్టబెట్టడంతో వారి కంపెనీల డొల్లతనం బయటపడుతూ షేర్ల విలువ హఠాత్తుగా పడిపోయింది. ఒక్క రోజులోనే రూ.లక్షల కోట్లు నష్టపోతున్న వాస్తవాన్ని దేశం గమనిస్తోంది. వారి లాభాలు, సంపద అంతా నీటి బుడగేనని స్పష్టమవుతోంది. ఇలాంటి ఆర్థిక అవకతవకలకు దోహదం చేసే విధంగా దేశ సంపదనంతా ప్రైవేట్ పరం చేస్తూ, కేంద్రం తీరని నష్టం చేస్తోంది. లాభాలను ప్రైవేట్ పరం చేస్తూ నష్టాలను దేశ ప్రజల మీద రుద్దుతోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రమాదకర ఆర్ధిక విధానాలపై పార్లమెంటు ఉభయ సభల్లో గొంతెత్తాలి. దేశ ప్రజల ప్రయోజనాలకు తూట్లు పొడుస్తున్న తీరును బీఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా ఖండించాలి. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ తదితర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యుడి బతుకు రోజురోజుకూ భారమైపోతున్నా కేంద్రానికి ఏమాత్రం పట్టింపులేదు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను పార్లమెంటు వేదికగా దేశ ప్రజల దృష్టికి తీసుకుపోవాలి. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేయాలి. రాష్ట్ర విభజన హామీలపై కూడా నిలదీయాలి. కేంద్ర ప్రభుత్వం మీద పోరాటానికి కలిసివచ్చే దేశంలోని ప్రతి పార్టీ ఎంపీని కలుపుకొని పోవాలి. ఆయా అంశాలపై ఉభయ సభల్లో నిలదీయాలి..’ అని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు (రాజ్యసభ), నామా నాగేశ్వర్రావు (లోక్‌సభ), ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్, కేఆర్ సురేష్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి, దీవకొండ దామోదర్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాలోత్ కవితా నాయక్, పసునూరి దయాకర్, బొర్లకుంట వెంకటేశ్, పోతుగంటి రాములు పాల్గొన్నారు. -
ఖతార్ నుంచి హతమార్చేందుకు ప్లాన్.. చంపేందుకు వెళ్తూ..
గుంటూరు రూరల్: వాళ్లిద్దరూ చిన్నప్పటి నుంచీ ప్రాణ స్నేహితులు. బాగా చదువుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆ తరువాత ఇద్దరిమధ్యా తలెత్తిన ఆర్థిక లావాదేవీలు దూరం పెంచాయి. చివరకు కిరాయి హంతకుల సాయంతో మిత్రుడునే హత్య చేయించే స్థాయికి పురిగొల్పాయి. చివరకు పన్నాగం బెడిసికొట్టడంతో నిందితులు పోలీసులకు చిక్కారు. గుంటూరు జిల్లా నల్లపాడు సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు మండలం ఏటీ అగ్రహారానికి చెందిన ప్రశాంత్, అవినాష్‌రెడ్డి చిన్ననాటి నుంచి స్నేహితులు. చదవండి: ఒకే మహిళతో ఇద్దరు వివాహేతర సంబంధం.. మర్మాంగాలను కోసి.. ప్రశాంత్ ఖతార్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుండగా.. అవినాష్‌రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ రంగంలోనే స్థిరపడ్డారు. కాగా, అవినాష్‌రెడ్డికి ప్రశాంత్ తన సొంత ఖర్చుతో పెళ్లి చేశాడు. అనంతరం ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదాలు ఏర్పడ్డాయి. అవినాష్‌రెడ్డి వైఖరిపై విసుగు చెందిన ప్రశాంత్ అతడిని అంతం చేయాలని పథకం పన్నాడు. తాను ఖతార్‌లో నుంచి గుంటూరు సుందరయ్య కాలనీకి చెందిన నామాల చందు, దేవళ్ల సూర్య, రాచకొండ గోపీకృష్ణ, వెంగలశెట్టి దుర్గాప్రసాద్, షేక్ కరీముల్లా, షేక్ బాజీ, పూసల బాలాజీ, కమతం కృష్ణను సంప్రదించాడు. అవినాష్‌రెడ్డిని హతమార్చాలని, ఇందుకోసం ఎంత ఖర్చయినా భరిస్తానని చెప్పాడు. సుమారు రూ.30 లక్షల వరకు సుపారీ చెల్లించాడు. చంపేందుకు వెళ్తూ దొరికిపోయారు సుపారీ తీసుకున్న 8 మంది ఇటీవల విజయవాడలో కత్తులు కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. కాగా, నిందితులకు స్థానికంగా కొందరితో వివాదాలు ఉండటంతో.. హైదరాబాద్‌లో హత్య చేసి తిరిగొచ్చాక ఇక్కడి వారి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. అనంతరం శుక్రవారం రాత్రి వారంతా కారులో హైదరాబాద్ బయలుదేరగా.. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న నల్లపాడు పోలీసులు పేరేచర్ల వద్ద 8 మందినీ అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కత్తులు, ఇతర మారణాయుధాలు, కారును స్వాధీనం చేసుకున్నారు. స్నేహితుడి హత్యకు పథకం వేసిన ప్రశాంత్‌ను ఖతార్ నుంచి స్వగ్రామానికి రప్పించేందుకు చర్యలు చేపట్టారు. -
ఇరాక్‌లో ఉద్రిక్తతలు.. 3 రోజులుగా పార్లమెంట్‌లోనే నిరసనకారులు
బాగ్దాద్: ఇరాక్‌లో ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇరాన్ అనుకూల పార్టీలు, షియా గురువు ముఖ్తదా అల్–సదర్ వర్గాల మధ్య రాజధాని బాగ్దాద్‌లో ఘర్షణ వాతావరణం నెలకొంది. అల్–సదర్ అనుచరులు మూడు రోజులుగా పార్లమెంట్లో బైఠాయించారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటవలేదు. ఇరాన్ అండతో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. షియా గురువు అల్–సదర్ అనుచర వర్గం ఆ ప్రయత్నాలను అడ్డుకుంటోంది. ఇరాన్ అనుకూల శక్తుల వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం బాగ్దాద్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. సంక్షోభం మరింత ముదిరేలా కనిపిస్తోంది. -
ఔను.. వారిద్దరు మళ్లీ కలిశారు..
ఔను.. వారిద్దరు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఏకమయ్యారు. వీరి పదేళ్ల దాంపత్య జీవితంలో ఇద్దరు కూతుర్లు జన్మించారు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య అనుమానాలు తలెత్తాయి. దీంతో భార్యకు సంబంధించిన తప్పులు భర్త, భర్తకు సంబంధించిన తప్పులతో భార్య స్థానిక మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇక ఇద్దరం కలిసి ఉండలేమని నిర్ణయం తీసుకొని విడాకులు కావాలనుకున్నారు. పోలీస్ సిబ్బంది ఇరువురి కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో మూడు దఫాలుగా వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం తిరిగి వారి తప్పులను తెలుసుకున్నారు. దీంతో వారు మళ్లీ కలిశారు. ఇలా జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి మే 15 వరకు 197 ఫిర్యాదులు రాగా అందులో 144 కేసులను కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించారు. సాక్షి, మంచిర్యాలక్రైం: సర్దుకుపోతే సంస్కారం ఒక స్వర్గసీమ. కానీ ప్రస్తుతం పలువురు దంపతులు చిన్నచిన్న సమస్యలనే పెద్దగా చూస్తూ గొడవలు పడుతున్నారు. అనంతరం పెద్దల సమక్షంలో పంచాయితీలు, ఆ తరువాత పోలీస్స్టేషన్ల వరకు చేరి విడిపోతున్నారు. పచ్చటి సంస్కారాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. వారికి పుట్టిన సంతానానికి తల్లిదండ్రుల ప్రేమను దూరం చేస్తూ వారిలో మానసిక ఆందోళనకు కారణమవుతున్నారు. ఇలాంటి సంఘటనలకు కారణాలు ఏమైనా ఉమ్మడి కుటుంబంలో సర్ధిచెప్పేవారు ఉండేవారు. కానీ ప్రస్తుతం చిన్న చిన్న కుటుంబాల్లో చెప్పేవారు లేక భార్యాభర్తలు చిన్నచిన్న గొడవలకే పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లి పచ్చని సంసారాన్ని విచ్ఛినం చేసుకుంటున్నారు. కౌన్సెలింగ్‌తో ఏకమవుతున్నారు... క్షణికావేశంతో చిన్నచిన్న సమస్యలకే దంపతులు సమన్వయం కోల్పోతున్నారు. ఉమ్మడి కుటుంబాలు ఉంటే పెద్దలు ఇద్దరిని సమన్వయం చేసేవారు. దీంతో కుటుంబంలో తగాదాలు రోడ్డున పడేవి కాదు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబం అనే ఊసే లేదు. కొందరు ఉద్యోగ రీత్యా, మరికొందరు వ్యాపారం ని మి త్తం, ఇంకొందరు అత్తమామ, కుటుంబ సభ్యులతో పడకపోవడం, కారణం ఏదైనా ఉమ్మడి కుటుంబా లు కానరావడం లేదు. ఈ నేపథ్యంలో కుటుంబా ల్లో చిన్నచిన్న సమస్యలు తలెత్తినప్పుడు ఇద్దరికి చె ప్పె వారు లేక కుటుంబాలు పోలీస్‌స్టేషన్ వరకు వస్తున్నాయి. ఎందుకీ పరిస్థితి... గతంలో పెళ్లైన కొంతకాలం పాటు ఉమ్మడి కుటుంబంతో కలిసిఉండే వారు. ఇంటి యజమాని చెప్పిందే వేదం అన్నట్లుగా కుటుంబమంత నడుచుకునేవారు. ఇది కాస్త రానురాను ఉమ్మడి కుటుంబం కాస్త ఒంటరి కుటుంబంగా తయారైంది. దీంతో చిన్న చిన్న సమస్యలతో భార్యాభర్తలు పంతాలకు పోయి కాపురాన్ని కూల్చుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్‌కు రోజుకు సుమారు 25నుంచి 30మంది వరకు కుటుంబ సమస్యలతో పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించడం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, పది మంది ముందు చులకన చేసుకోవడంతో పాటు వారి గౌరవాన్ని కించపరుచుకుంటున్నారు. సర్దుకుపోతేనే సమస్యకు పరిష్కారం గతంలో ఉమ్మడి కుటుంబాలుగా ఉండే వారు దీంతో ఎలాంటి గొడవలు వచ్చేవి కావు. ఒక వేల వచ్చిన ఇరుకుటుంబాల పెద్దలు ఇద్దరిని సమన్వయం చేసి పంపించేవారు. అప్పుడు కుటుంబాల్లో విలువలు, మర్యాద, గౌరవం, భయం భక్తి ఉండేది. అవి ప్రస్తుతం లేకపోవడంతో కుటుంబాల్లో చిన్నచిన్న గొడువలకు, పంతాలకు వెళ్లి పెద్దగా చేసుకుంటున్నారు. మొదట క్షణికావేశంతోనే ఏవెవో మాట్లాడుతారు. కౌన్సెలింగ్ ద్వారా 80శాతం కుటుంబాలు కలిసి పోతున్నారు. – బి.శ్రీనివాస్, సీఐ, మహిళా పోలీస్‌స్టేషన్, మంచిర్యాల -
సీఎస్కే, రవీంద్ర జడేజా మధ్య విబేధాలు.. ఎస్ఆర్హెచ్ బాటలోనేనా!
సీఎస్కే యాజమాన్యం, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాల మధ్య విబేధాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ధోని స్థానంలో జట్టును నడిపించడంలో విఫలమైన జడ్డూపై సీఎస్కే గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అందుకు తగ్గట్లే సీఎస్కే ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌లో జడేజాను అన్‌ఫాలో చెయ్యడం పలు అనుమానాలకు తావిస్తుంది. దీనికి తోడూ ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యా్చ్కు జడేజాను పక్కనబెట్టడం వెనుక సీఎస్కే ఫ్రాంచైజీ హస్తం ఉన్నట్లు క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. ఇదే నిజమైతే ఎన్నో ఏళ్లుగా సీఎస్కేకు నమ్మదగిన ఆటగాడిగా ఉన్న జడేజాకు ఆ జట్టుతో అనుబంధం ఇదే ఆఖరు కావచ్చొని పలు వర్గాలు పేర్కొన్నాయి. PC: IPL Twitter ఇక ఐపీఎల్ 2022 సీజన్లో సీఎస్కే దారుణ ప్రదర్శన చేసింది. గతేడాది చాంపియన్‌గా నిలిచిన సీఎస్కే ఈసారి మాత్రం ఆ స్థాయి ప్రదర్శన చేయలేక చతికిలపడింది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 4 ఓటములు, ఏడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎస్కే ప్లే ఆఫ్‌కు చేరడం కష్టమే. అయితే సీఎస్కే దారుణ ప్రదర్శనకు కెప్టెన్సీ మార్పు కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి ముందే ధోని కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్నాడు. దీంతో సీఎస్కే మేనేజ్మెంట్ జట్టులో సీనియర్‌గా ఉన్న జడేజాపై నమ్మకముంచి నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. జడ్డూ కెప్టెన్సీని సంతోషంగా అంగీకరించినప్పటికి.. నాయకత్వంలో ఘోరంగా విఫలమయ్యాడు. ధోని పెద్దన్న పాత్ర పోషించినప్పటికి సీఎస్కేకు వరుసగా పరాజయాలే ఎదురయ్యాయి. దీంతో ఒత్తిడిని తట్టుకోలేక జడేజా కెప్టెన్సీని తిరిగి ధోనికే అప్పగించాడు. అయితే కెప్టెన్‌గా సక్సెస్ కాలేకపోయిన జడ్డూ బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ పెద్దగా మెరవలేదు. టాప్ క్లాస్ ఆల్‌రౌండర్‌గా పేరు ఉన్న జడేజా నుంచి ఇలాంటి ప్రదర్శనను సీఎస్కే కూడా ఊహించలేదు. ధోని చేతికి కెప్టెన్సీ వచ్చిన తర్వాత రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జడ్డూ తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు జడేజాను పక్కనబెట్టడం ఆసక్తి కలిగించింది. CSK Unfollowed Jadeja in Instagram? 🙄 pic.twitter.com/ARDyYtwbvt — K O M B A N (@ValimaiKomban) May 9, 2022 ధోని, రైనా తర్వాత నమ్మదగిన ఆటగాడిగా.. PC: IPL Twitter ఇక ధోని, రైనా తర్వాత సీఎస్కేలో మంచి పేరు జడేజాకే ఉంది. 2012లో తొలిసారి సీఎస్కేలో అడుగుపెట్టిన జడేజా.. మధ్యలో గుజరాత్ లయన్స్(రెండు సీజన్లు సీఎస్కేపై నిషేధం)కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 2016లో రూ. 9.5 కోట్లకు జడేజాను సీఎస్కే కొనుగోలు చేసింది. అప్పటినుంచి జడ్డూ సీఎస్కేకు ఆడుతూ వస్తున్నాడు. గతేడాది మెగావేలానికి ముందు సీఎస్కే ధోని, రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు రూ.12 కోట్లకు జడేజాపు రిటైన్ చేసుకుంది. అయితే ధోని తనకు పెద్ద మొత్తం వద్దని.. జడేజాకు ఎక్కువ మొత్తంలో చెల్లిస్తే బాగుంటుందని తనకు తానుగా చెప్పడంతో సీఎస్కే కూడా జడ్డూపై నమ్మకంతో అతనికి ఎక్కువ మొత్తం అందించింది. అయితే తాజా సీజన్లో జడేజా తన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడూ చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ జడేజా- సీఎస్కే వైఖరిని.. వార్నర్- ఎస్ఆర్హెచ్ ఉదంతంతో పోలుస్తున్నారు. ఎస్ఆర్హెచ్ బాటలోనేనా.. గత సీజన్లో వార్నర్‌కు ఎస్ఆర్హెచ్ నుంచి ఎలాంటి అవమానాలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పవనసరం లేదు. 2016లో వార్నర్ కెప్టెన్సీలోనే ఎస్ఆర్హెచ్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత కూడా ప్రతీ సీజన్లో వార్నర్ జట్టును ప్లే ఆఫ్ చేర్చాడు.(2018లో తప్ప.. వార్నర్‌పై నిషేధం కారణంగా కేన్ విలియమ్సన్ కెప్టెన్సీ). అయితే ఇవేవి పట్టించుకోని ఎస్ఆర్హెచ్ గత సీజన్లో వార్నర్‌ను ఘోరంగా అవమానించింది. PC: IPL Twitter ముందు కెప్టెన్సీ నుంచి తొలగించింది.. ఆ తర్వాత తుది జట్టు నుంచి పక్కకు తప్పించింది.. ఆ తర్వాత మ్యాచ్‌లు ఆడకపోవడంతో డ్రింక్స్ బాయ్ అవతారంలో వార్నర్‌ను చూసి సొంత అభిమానులే జీర్ణించుకోలేకపోయారు. అప్పట్లో వార్నర్పట్ల ఎస్ఆర్హెచ్ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. అదే వార్నర్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతూ.. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో 92 పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్ ఆడి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. తాజా పరిణామాలు కూడా కాస్త అటూ ఇటుగా ఉన్నాయి. అయితే ఇక్కడ జడేజా తనంతట తానే కెప్టెన్‌గా తప్పుకున్నాడు. కానీ సీజన్లో జడేజా ఆటగాడిగా పూర్తిగా విఫలమయ్యాడు. అందుకే ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో జడేజాను పక్కనబెట్టారు. మరి ఇది ఒక్క మ్యాచ్‌కే పరిమితమవుతుందా లేక వార్నర్ బాటలోనే జడేజాకు అవమానాలు ఎదురవుతాయా అనేది ఇప్పటికే ప్రశ్నగానే ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ ప్రశ్నలన్నింటికి ఒక క్లారిటీ వస్తుంది. ఇక సీఎస్కే తన తర్వాతి మ్యాచ్ మే 12న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. PC: IPL Twitter చదవండి: Sri Lanka Economic Crisis: దేశం దుర్భర స్థితికి ప్రభుత్వమే కారణం.. అసహ్యమేస్తోంది : లంక మాజీ క్రికెటర్లు Mumbai Indians: ప్లేఆఫ్ అవకాశాలు ఖేల్‌ఖతం.. ఇంతకుమించి ఏం చేస్తారులే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కన్నకొడుకును నరికి చంపిన తండ్రి
వీరులపాడు (నందిగామ): నిద్రిస్తున్న కుమారుడిని గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు ఓ తండ్రి. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలంలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి కథనం మేరకు.. మండల కేంద్రమైన వీరులపాడు గ్రామానికి చెందిన బొల్లెద్దు గాబ్రియేలు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గాబ్రియేల్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలకు వివాహాలయ్యాయి. గాబ్రియేల్ భార్య మృతి చెందటంతో 2007లో తిరుపతమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇంటర్ పూర్తి చేసి పెయింటింగ్ పనులు చేస్తున్న కుమారుడు కిరణ్‌తో కలిసి గాబ్రియేల్ దంపతులు ఉంటున్నారు. అయితే తిరుపతమ్మ, కిరణ్ మధ్య తరచూ వాగ్వాదాలు, ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వారం రోజులుగా కిరణ్‌ను ఇంట్లో నుంచి పంపించాలని గాబ్రియేల్‌ను తిరుపతమ్మ వత్తిడి చేస్తోంది. ఈ విషయమై తిరుపతమ్మ, కిరణ్ మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. కిరణ్ ఉన్న ఇంట్లో తాను ఉండనని భర్తకు చెప్పి ఆమె పుట్టింటికి వెళ్లింది. అదే రోజు రాత్రి గాబ్రియేలు కూడా ఇంటి నుంచి వెళ్లిపోవాలని చెప్పగా, ఇల్లు తనదని, తాను వెళ్లాల్సినవసరం లేదని కిరణ్ గట్టిగా చెప్పాడు. ఇది మనసులో పెట్టుకున్న గాబ్రియేలు శనివారం తెల్లవారుఝామున 5.30 గంటల సమయంలో నిద్రపోతున్న కిరణ్ మెడపై గొడ్డలితో కిరాతంగా నరికాడు. తీవ్రంగా గాయపడిన కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు వీరులపాడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని నందిగామ రూరల్ సీఐ ఐ.వి.నాగేంద్రకుమార్‌తో కలిసి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. (చదవండి: వీడియో కాల్‌తో వివాహితకు వేధింపులు) -
గవర్నర్‌లా వ్యవహరిస్తే గౌరవిస్తాం: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: ‘గవర్నర్‌తో మాకు పంచాయితీ లేదు. ఆమెను ఎక్కడా అవమాన పరచలేదు. ఎక్కడ అవమాన పరిచామో చెబితే వింటాం. అర్థం చేసుకుంటాం..’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. గవర్నర్ వ్యవస్థపై తమకు గౌరవం ఉందని, గవర్నర్‌లా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తామని చెప్పారు. గురువారం సిరిసిల్ల కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. గవర్నర్ గౌరవానికి భంగం వాటిల్లేలా తాము ఏమీ చేయలేదని కేటీఆర్ చెప్పారు. ‘ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి విషయంలో అభ్యంతరం పెట్టినందుకు ఆమెను అవమానిస్తున్నారని అన్నట్లు విన్నా. కౌశిక్‌రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉన్నందున ఎమ్మెల్సీగా అనుమతించలేదని ఆమె చెప్పినట్లు విన్నా. అయితే.. గవర్నర్ కాకముందు ఆమె ఎవరు? బీజేపీ తమిళనాడు పార్టీ అధ్యక్షురాలు కాదా?’అని మంత్రి ప్రశ్నించారు. గవర్నర్ కావడానికి రాజకీయ నేపథ్యం అడ్డం రాదు కానీ ఎమ్మెల్సీ అయ్యేందుకు అడ్డం వస్తదా? అని కేటీఆర్ నిలదీశారు. నరసింహన్ ఉన్నప్పుడు ఏ పంచాయితీ లేదు గవర్నర్‌గా నరసింహన్ ఉన్నప్పుడు ఏ పంచాయితీ లేదని, వీరితో పంచాయితీ ఉంటదని ఎందుకు ఊహించుకుంటున్నారో వారే ఆలోచించుకోవాలని మంత్రి అన్నారు. తాము రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తున్నామని చెప్పారు. శాసనసభ సమావేశాలు ఒక సంవత్సరంలో మొట్టమొదటిసారి జరుగుతున్నప్పుడు గవర్నర్ ప్రసంగం ఉండాలని రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉందని.. అయితే ఇటీవలి సమావేశం మొదటిది కాదని చెప్పారు. ఆ సమావేశం సైనడై (నిరవధిక వాయిదా) అయిందని, ప్రోరోగ్ కాలేదని తెలిపారు. అందువల్లే గవర్నర్ ప్రసంగం లేదని.. దాన్ని అవమానం కింద తీసుకుంటే తాము చేయగలిగింది ఏమీ లేదని కేటీఆర్ అన్నారు. (చదవండి: తారా స్థాయికి చేరిన గవర్నర్, రాష్ట్ర సర్కార్ మధ్య విభేదాలు..) -
ముదిరిన పంచాయితీ..
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి నడుమ సాగుతున్న ‘పంచాయితీ’ ముదిరి పాకాన పడింది. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వతీరు, టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై గవర్నర్ తీవ్రం గా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం తనను గౌరవించడం లేదని, రాజ్యాంగబద్ధంగా పనిచేయడం లేదనే రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఇందుకు ప్రతిగా కొందరు రాష్ట్ర మంత్రులు కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు. రాజ్‌భవన్ బీజేపీ పార్టీ కార్యాలయంలా మారిందని విమర్శలు గుప్పిస్తున్నారు. మోదీ, అమిత్ షాతో భేటీపై ఆసక్తి రాష్ట్ర ప్రభుత్వం తన పట్ల అనుసరిస్తున్న తీరుపై తమిళిసై గతంలోనే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతోపాటు రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకల సందర్భంగా.. తాను శక్తిమంతురాలినని, బలవంతంగా ఎవరూ తన తలవంచలేరంటూ స్వ రం పెంచారు. అదే సమయంలో సీఎం, మంత్రులతో చర్చకు సిద్ధమని, ఎవరికైనా రాజ్‌భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని కూడా అన్నారు. తాజాగా రెండు రోజులు ఢిల్లీలో మకాం వేసి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా ను కలవడం ద్వారా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడం మొదలు మండలి ప్రొటెమ్ చైర్మన్ నియామకం, బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం, మేడారం జాతర, యాదగిరిగుట్ట పర్యటనలో ప్రొటోకాల్‌కు తిలోదకాలివ్వడం తదితర అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. వీటిపై ఫిర్యాదులతోపాటు ప్రభుత్వ పా లన వైఫల్యాలు, శాంతిభద్రతలు, డ్రగ్స్, అవినీతి వంటి అం శాలపై గవర్నర్ నివేదిక సమర్పించినట్లు తెలిసింది. మీకే కాదు..మాకూ అవమానమే! రాష్ట్రంలో తనకు ఎదురైన అవమానాల గురించి కేంద్ర పెద్దలకు గవర్నర్ వివరించగా.. ‘ఈ అవమానం మీకే కాదు.. మాకూ జరిగినట్టు భావిస్తున్నాం’ అని వారు బదులిచ్చారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగేలా రోడ్డు, రైలు మార్గాల్లో రాష్ట్రం నలుమూలలా పర్యటించేందుకు గవర్నర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు, విజ్ఞాపనలను స్వీకరించడానికి వచ్చే నెల నుంచి రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. (చదవండి: బీజేపీ బెటాలియన్ ఏదైనా నాతో యాదాద్రికి వచ్చిందా?) -
హోంమంత్రితో వివాదాలు.. క్లారిటీ ఇచ్చిన సీఎం
సాక్షి, ముంబై: రాష్ట్ర హోంశాఖ మంత్రి దిలీప్ వాల్సే పాటిల్(ఎన్సీపీ)తో వివాదాలున్నట్లు వస్తున్న వార్తలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కొట్టి పారేశారు. ఒక్క పాటిల్‌పైనే కాదు.. మొత్తం కేబినెట్‌పైనా తనకు పూర్తి విశ్వాసముందని స్పష్టం చేశారు. మంత్రులందరూ అద్భుతంగా పనిచేస్తున్నారని, తప్పుదారి పట్టించేందుకే అలాంటి నిరాధార వార్తలు ప్రచారం చేస్తున్నారని ఉద్ధవ్ శుక్రవారం ఒక ప్రటకన విడుదల చేశారు. రాష్ట్రంలోని శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ నేతలను కేసుల్లో ఇరికించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీ మంత్రి ఫడ్నవీస్ ఆరోపణలపై.. హోంమం త్రివాల్సే అసెంబ్లీ సరైన సమాధానం ఇవ్వలేదని సీఎం అభిప్రాపడినట్లుగా వార్తలొచ్చాయి. కేబినెట్ సమావేశాల్లోనూ ఠాక్రే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వాల్సే... శుక్రవారంనాడు ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తాను పాలనాపరమైన అంశాలు చర్చించేందుకే ముఖ్యమంత్రిని కలిసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే వివరణ ఇచ్చిందని, అందరినీ పరిగణనలోకి తీసుకునే కేబినెట్ నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. చదవండి: బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలి అయితే అంతకుముందు.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. హోంశాఖ బలంగా లేనందునే ఈడీ వంటి ఏజెన్సీలతో మహారాష్ట్ర ప్రభుత్వంపై, ప్రత్యేకించి హోంశాఖపై కేంద్రం దాడి చేస్తోందని అన్నారు. సాధారణంగా సీఎంతో ఉండాల్సిన హోంశాఖ ఎన్సీపీకి వెళ్లిందని అభిప్రాయపడ్డారు. అయితే రౌత్ చెప్పినదాంట్లో తప్పేం లేదని, అలాంటివేమైనా ఉంటే పరిష్కరిస్తామని వాల్సే తెలిపారు. హోంశాఖపై శివసేన దృష్టి పడిందా అన్న ప్రశ్నకు పాటిల్ సమాధానమిస్తూ తానలా భావించడం లేదని, చట్టం ప్రకారమే ప్రభుత్వం నడుస్తుందని, ప్రతి కేసులోనూ హోంశాఖమంత్రి ఉత్తర్వులు ఇవ్వలేరని చెప్పారు. చాలా నిర్ణయాలు డీజీపీ, సీపీ, ఇతర ఉన్నతాధికారుల పరిధిలోనే జరిగిపోతాయని, ఏదైనా ఆలస్యం జరిగితే మాత్రమే హోంశాఖ జోక్యం చేసుకుంటుందని వివరించారు. బీజేపీ పట్ల ఎన్సీపీ మెతకధోరణి అవలంభిస్తోందన్న ఆరోపణలను వాల్సే కొట్టిపారేశారు. మసీదుల్లో అజా(ప్రార్థన)లకు ఉపయోగించే లౌడ్స్పీకర్లను నిషేధించాలన్న బీజేపీ డిమాండ్ గురించి ప్రశ్నించగా... ధరల పెరుగుదల వంటి సమస్యలనుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు బీజేపీ ఇలాంటివి ముందుకు తెస్తుందని మండిపడ్డారు. -
కుమ్ములాటలు షురూ.. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ
లక్నో: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో సమాజ్‌వాదీపార్టీలో మళ్లీ కుటుంబ కలహాలు మొదలైనట్లు కనిపిస్తున్నాయి. శాసనసభా పక్ష సమావేశానికి తనను పిలవలేదని అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివపాల్ ఆరోపించారు. సైకిల్ గుర్తుపైనే తానూ గెలిచానని ఈ సందర్భంగా గుర్తుచేశారు. శివపాల్ ఆరోపణలపై ఎస్పీ వివరణ ఇచ్చింది. లక్నోలో జరిగింది ఎస్పీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశమని యూపీ ఎస్పీ చీఫ్ నరేషోత్తమ్ అన్నారు. సోమవారం సాయంత్రం భాగస్వామ్యపక్షాలతో అఖిలేష్ భేటీ అవుతారని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో అఖిలేష్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు. ఆయనను ఎస్పీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన అఖిలేష్ కర్హాల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే అజంఘడ్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. చదవండి: (కోదండరామ్‌కు అరవింద్ కేజ్రీవాల్ ఆఫర్! ఆ పార్టీ విలీనం తప్పదా?) కాగా, 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు సమాజ్‌వాది పార్టీలో కుటుంబ కలహాలు భగ్గుమన్నాయి. పార్టీపై ఆధిపత్యం కోసం శివపాల్, అఖిలేష్ పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో 2019లో ఎస్పీ నుంచి బయటకొచ్చిన శివపాల్ యాదవ్ ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీని పెట్టారు. 2022 అసెంబ్లీ ఎన్నికల ముందు బాబాయ్, అబ్బాయ్‌కి మధ్య రాజీ కుదిరింది. దీంతో జశ్వంత్‌నగర్ నుంచి ఎస్పీ టికెట్‌పై పోటీచేసి శివపాల్ 90వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. అయితే తాజాగా సైకిల్ గుర్తుపై గెలిచిన తనను ఎస్పీ శాసనసభా పక్ష సమావేశానికి ఆహ్వానించకపోవడంపై శివపాల్ గుర్రుగా ఉన్నారు. తన అనుచరులతో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని శివపాల్ తెలిపారు. దీంతో సమాజ్‌వాదీ పార్టీలో మళ్లీ చీలిక తప్పదనే వార్తలు గుప్పుమంటున్నాయి. -
ఉక్రెయిన్ ఉద్రిక్తతలను అంతం చేసే శాంతి ప్రణాళికలు లేవు
Russian President Vladimir Putin said No Prospects: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫ్రాన్స్, జర్మనీ, కైవ్‌లతో అంగీకరించిన కీలకమైన 2015 ప్రణాళిక ఒప్పందం ఉక్రెయిన్ వేర్పాటువాద వివాదాన్ని పరిష్కరించగలదని తాను ఇకపై భావించడం లేదని అన్నారు. అంతేకాదు 2015 మిన్స్క్ శాంతి ఒప్పందాల అమలుకు ఎటువంటి అవకాశాలు లేవని మేము అర్థం చేసుకున్నాం. బెలారస్ రాజధానిలో ఉక్రెయిన్ సైన్యం తూర్పున ఉన్న మాస్కో అనుకూల తిరుగుబాటుదారుల మధ్య పోరాటాన్ని ముగించడానికి అంగీకరించినట్లు పుతిన్ తన భద్రతా మండలికి తెలిపారు. రష్యా భద్రతకు ముప్పు కలిగించేలా పాశ్చాత్య శక్తులు ఉక్రెయిన్‌తో ఉన్న మాస్కో వైరాన్ని ఉపయోగించుకుంటున్నాయంటూ ఆగ్రహం చెందారు. ఉక్రెయిన్ నుంచి విడిపోయిన రష్యా-మద్దతుగల ప్రాంతాల స్వాతంత్య్రాన్ని గుర్తించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. రష్యా ఇలా బహిరంగంగా మద్దతు ఇస్తే అస్థిరమైన శాంతి ప్రణాళికను భంగం వాటిల్లుతుంది. ఒక రకంగా రష్యా నాటకీయంగా దాడిచేసే క్రమంలోని వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందన్న అనుమానాలకు తావిస్తోంది కూడా. రష్యా భూభాగంలోకి చొరబడిన ఐదుగురు ఉక్రెనియన్ విధ్వంసకారులను తమ బలగాలు అడ్డగించి చంపేశాయని, సరిహద్దు పోస్ట్‌పై ఉక్రెయిన్ షెల్ దాడి చేసిందని రష్యా ఆరోపణలు చేస్తోంది. అయితే కైవ్ వాటన్నింటిని ఖండించింది. నిజానికి మాస్కో అటువంటి ఆపరేషన్‌కు ఇప్పటికే పునాది వేస్తున్నట్లు కనిపించింది. (చదవండి: పుతిన్- బైడెన్ల అత్యవసర భేటీ!) -
యుద్ధానికి బీ రెడీ!.. ఉక్రెయిన్ వేర్పాటువాదుల ప్రకటనతో ఉలిక్కిపాటు
Ukraine's two breakaway regions announced a general mobilisation: ఉక్రెయిన్ నుంచి విడిపోయిన రెండు ప్రాంతాల వేర్పాటువాద నాయకులు శనివారం యుద్ధానికి సిద్దం అని ప్రకటించారు. దీంతో ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణ దాడులు మరింత తీవ్రతరం అవుతాయనే భయాలు మొదలయ్యాయి. యూరప్‌లోని ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ నిపుణులు రష్యా అనుకూల తిరుగుబాటుదారులచే నియంత్రించబడుతుందని, తూర్పు ఉక్రెయిన్‌లోని కొన్ని భాగాలలో దాడులు గణనీయంగా పెరిగాయని నివేదిక ఇచ్చిన కొద్ది వ్యవధిలోనే ఈ ప్రకటనలు వెలువడటం గమనార్హం. ఈ మేరకు శనివారం తాజాగా జరిగిన దాడులపై ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ నాయకుడు డెనిస్ పుషిలిన్ తన తోటి సైనికులను సైనిక నిర్భంధ కార్యాలయానికి రావాలని కోరడమే కాక తాము యుధ్దానికి సిధ్దం అనే డిక్రి పై సంతకం చేసిన విషయం గురించి ఒక వీడియోలో వెల్లడించారు. లుగాన్స్ వేర్పాటువాద ప్రాంతం నాయకుడు లియోనిడ్ పసెచ్నిక్, అదే సమయంలో తన ప్రాంతంలోని దాడులను తిప్పికొట్టేందుకు సిద్ధం అని సంతంకం చేసిని డిక్రిని ప్రచురించాడు. అయితే ఉక్రెయిన్ భద్రతా దళాలే దాడులు మొదలుపెట్టాయని.. తాము ఆ దాడులను అడ్డుకున్నామని వేర్పాటువాద నాయకుడు పుషిలిన్ పేర్కొన్నాడు. అంతేకాదు తాము కలిసి విజయాన్ని సాధించడమే కాక రష్యా ప్రజలను రక్షిస్తాం అని ప్రకటించాడు. మరోవైపు వాషింగ్టన్ కూడా ఏ క్షణంలోనే రష్యా దాడులు చేస్తోందంటూ హెచ్చరిస్తోంది. ఇవన్నీ ఉక్రెయిన్‌ని ప్రధానంగా భయపెడుతున్న అంశాలు. 2014లో రష్యాలో విలీనం అయిన క్రిమియన్ ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకునే నిమిత్తం ఉక్రెయిన్ వేర్పాటు వాదులపై దాడులు జరుపుతోందంటూ వస్తున్న ఆరోపణలను ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఖండించింది. అంతేకాదు 2014లో వేర్పాటు దారులు చేసిన దాడులలో ఉక్రెయిన్ సైన్యం సుమారు 14 వేల మంది చనిపోయారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం బలగాలు వెనుకకు వచ్చేసినట్లు చెబుతుండటం విశేషం. ఉపగ్రహ చిత్రాలలో ఉక్రెయిన్ చుట్టూ రష్యా దళాలు మోహరింపు స్పష్టంగా కనిపిస్తోంది.బెలారస్, క్రిమియా, పశ్చిమ రష్యాలోని అనేక కీలక ప్రదేశాలలో రష్యా సైన్యం కార్యకలాపాల పరిధిని కొత్త ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ ఎప్పటికీ నాటోలో చేరదని హామీ పై బలగాలను వెనుక్కుతగ్గుతాయని రష్యా చెప్తుండడం తెలిసిందే. (చదవండి: : రష్యా అణు విన్యాసాలు) -
కాంగ్రెస్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతోంది
ఫతేపూర్: కాంగ్రెస్ పనిగట్టుకొని ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఇలా విభేదాలను రెచ్చగొట్టే పార్టీలకు పరిపాలించే అధికారం ఉండదన్నారు. యూపీ, బిహార్, ఢిల్లీకి చెందినవారంతా ఒక్కటేనని వారిని పంజాబ్‌లోకి అడుగు పెట్టనివ్వకూడదంటూ ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ తన స్వప్రయోజనాల కోసం ఒక ప్రాంతం వారిని మరో ప్రాంతంపైకి ఉసిగొల్పుతూ ఉంటుందని నిందించారు. పంజాబ్ అబోహర్లో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ చన్నీ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. చన్నీ అలా మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న ప్రియాంకా గాంధీ చప్పట్లు కొడుతున్నారని యావత్‌దేశం దీనిని చూసిందన్నారు. యూపీలోని ఫతేపూర్‌లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎంతో స్వార్థంతో ఆలోచిస్తాయని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్‌ని రద్దు చేస్తూ చట్టం తెస్తే విపక్షాలన్నీ ఏకమై వ్యతిరేకించాయని గుర్తు చేశారు. అయితే తన నిర్ణయానికి ముస్లిం మహిళలు అంతా అండగా ఉన్నారని, వారి బతుకులు బాగు చేసినందుకు కృతజ్ఞతలు వెల్లడించారని మోదీ పేర్కొన్నారు. -
Kurnool: టీడీపీలో వర్గపోరు.. తారా స్థాయికి విభేదాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అసెంబ్లీ, పార్లమెంట్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యంలేని దారుణ స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ వర్గపోరుతో మరింత బలహీనపడుతోంది. నేతల మధ్య విభేదాలు ముదిరి పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఆలూరు, ఎమ్మిగనూరు, డోన్‌తో పాలు పలు నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ ప్రత్యామ్నాయ పారీ్టల వైపు చూస్తోంది. ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే, ఇన్చార్జ్ బీవీ జయనాగేశ్వరరెడ్డికి వ్యతిరేకంగా మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పనిచేస్తున్నారు. ఈనెల 2వ తేదీన కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. చదవండి: అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తాడు బీవీని వ్యతిరేకించే గోనెగండ్ల మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు పరమేశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్ రంగముణితో పాలు పలువురికి కోట్ల అండగా నిలిచారు. పైగా పార్టీ ఆదేశిస్తే ఎవ్వరైనా పోటీ చేయొచ్చని ఆయన చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. దీంతో జయనాగేశ్వరరెడ్డికి పార్టీలో ప్రాధాన్యం లేదని టీడీపీ శ్రేణులతో పాటు ఎమ్మిగనూరు ప్రజల్లో భావన మొదలైంది. రెండున్నరేళ్లుగా నాగేశ్వరరెడ్డి నియోజకవర్గాన్ని, టీడీపీ కార్యకర్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కార్యకర్తలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్‌కు మకాం మార్చారు. దీంతో ప్రణాళిక ప్రకారం అతన్ని తప్పించేందుకు పార్టీ అధిష్టానమే ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తోందనే వాదన విన్పిస్తోంది. ఇదిలా ఉండగా జయనాగేశ్వరరెడ్డి పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి.. పార్టీ వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారని, ఇది సరికాదని వ్యాఖ్యలు చేశారు. వార్డు పర్యటనలు సైతం చేస్తున్నారు. అయితే ఆయన వెంట టీడీపీ ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు కలిసి రావడం లేదు. డోన్‌లో సుబ్బారెడ్డికి వ్యతిరేక పవనాలు డోన్ నియోజకవర్గంలో పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా కేఈ ప్రతాప్ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్చార్జ్గా ధర్మవరం సుబ్బారెడ్డిని నియమించారు. అయితే సుబ్బారెడ్డి నాయకత్వాన్ని మండల స్థాయి నాయకులు అంగీకరించడం లేదు. ప్యాపిలి మాజీ ఎంపీపీలు తొప్పెర శీను, సరస్వతి, చెన్నయ్య తదితరులు సుబ్బారెడ్డి నాయకత్వంలో తాము పనిచేసే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. సుబ్బారెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్, అక్కడి నుంచి వైఎస్సార్సీపీ, ఆపై టీడీపీలో చేరి రోజుకో పార్టీ మార్చి, వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. ఎవ్వరితో చర్చించకుండా పార్టీ నిర్ణయం తీసుకోవడాన్ని కూడా తప్పుబట్టారు. ఈ పరిణామాలపై ఏకంగా కరపత్రాలు ముద్రించి నియోజకవర్గంలో పంపిణీ చేశారు. డోన్ మునిసిపాలిటీలోని టీడీపీ నాయకులు చిట్యాల మద్దయ్యగౌడ్, కేశన్నగౌడ్లు కూడా సుబ్బారెడ్డి నాయకత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని బాహాటంగానే ప్రకటించారు. సుబ్బారెడ్డిని కేడర్ అంగీకరించకపోవడం, కేఈ ప్రతాప్‌ను అధిష్టానం వద్దనడంతో డోన్‌లో నాయకత్వలేమితో టీడీపీ కొట్టుమిట్టాడుతోంది. దీంతో కోట్ల సుజాతమ్మను డోన్‌కు వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించినట్లు సమాచారం. అయితే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అత్యంత బలంగా ఉన్న డోన్‌లో తాను గెలవడం సాధ్యం కాదని సుజాతమ్మ డోన్‌పై విముఖత ప్రదర్శిస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో అంతర్గత పోరు, ఆధిపత్య పోరుతో టీడీపీ కొట్టుమిట్టాడుతోంది. నేతల తీరుతో టీడీపీలో ఉంటే భవిష్యత్ లేదని ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు మండల, గ్రామస్థాయి నాయకులు ఇతరపారీ్టల వైపు చూస్తున్నారు. ముదురుతున్న ఆలూరు పంచాయితీ ఆలూరులో కోట్ల సుజాతమ్మ, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ మధ్య వర్గపోరు రోజురోజుకు ముదురుతోంది. ఈనెల 8న కేఈ ప్రభాకర్ మొలగవెల్లిలోని చెన్నకేశవస్వామి రథోత్సవానికి వెళ్లారు. ఆలూరు, కర్నూలు అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్నానని, అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడైనా సరే పోటీ చేస్తానని చెప్పారు. కేఈ వెంట ఆలూరు మాజీ ఇన్చార్జ్ వైకుంఠం మల్లికార్జున చౌదరి, మాజీ ఎంపీపీ దేవేంద్రప్ప కూడా ఉన్నారు. ఈ క్రమంలో వెంటనే మరుసటి రోజు కోట్ల సుజాతమ్మ ఆలూరు, ఆస్పరితో పాటు పలు చోట్ల పర్యటించారు. ఆలూరు నుంచి తానే పోటీ చేస్తానని, అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు తమకు ఉన్నాయని, ఎవ్వరు ఎలాంటి ప్రకటనలు చేసినా నమ్మొద్దని టీడీపీ శ్రేణులకు చెప్పారు. సీనియర్లను కాదని జూనియర్లను మండల కన్వీనర్లుగా నియమించడంతో సుజాతమ్మను టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. వీరంతా కేఈ వర్గం వైపు నడుస్తున్నారు. ఇదిలా ఉండగా 2014లో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన వీరభద్రగౌడ్ కొత్తగా తెరపైకి వచ్చారు. ఆలూరులో ఇటీవలే ఇల్లు తీసుకుని, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు. దీంతో ఇక్కడ టీడీపీ మూడు వర్గాలుగా విడిపోయింది. -
పంజాబ్‌కు 13 పాయింట్ల ఎజెండా
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూకి, సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీకి మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఇదే ఆఖరి అవకాశం అంటూ 13 పాయింట్ల ఎజెండాను సూచిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సిద్ధూ లేఖ రాశారు. 2017 ఎన్నికల హామీలన్నీ నెరవేర్చేలా పంజాబ్ ప్రభుత్వాన్ని కదిలించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అక్టోబర్ 15న రాసిన ఆ లేఖను ఆదివారం సిద్ధూ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ 13 పాయింట్ల ఎజెండాపై సోనియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని సిద్ధూ వెల్లడించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న పంజాబ్‌అప్పుల ఊబిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వ్యవసాయం, ఉపాధి అవకాశాలు, ఇసుక మాఫియా, విద్యుత్, రవాణా రంగాల్లో సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. -
పోడు వివాదానికి ఇక తెర!
సాక్షి, మహబూబాబాద్: దశాబ్దాల తరబడి పోడు రైతులకు, అటవీ అధికారులకు మధ్య జరుగుతున్న వివాదానికి తెరపడనుంది. అయితే భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్న రైతులు భూమిని విడిచి పెట్టేందుకు సిద్ధంగా లేకపోగా, ఫారెస్టు భూమిని సైతం తగ్గించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. ఇందులో మధ్యేమార్గంగా వేసిన మంత్రివర్గ ఉపసంఘం చైర్పర్సన్, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, జగదీశ్వర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఉపసంఘం మూడుసార్లు సమావేశమైంది. అయితే సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకోలేదని చెబుతూనే.. ఇప్పటికే ప్రాథమిక నివేదికను తయారు చేసి సీఎం కేసీఆర్‌కు అందజేసినట్లు సమాచారం. 2005కు ముందున్నవారికే ప్రాధాన్యం! రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో 2005కు ముందు నుంచి సాగులో ఉన్నవారికే హక్కుపత్రాలు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. అందుకు ఆధారాలుగా గిరిజన ప్రాంతంలోని రేషన్‌కార్డు, ఓటరు ఐడీ, లేదా ఫారెస్టు, పోలీసు కేసు రికార్డులు ఉంటే సరిపోతుందనే నిబంధనలు పెట్టారు. గిరిజనేతరులైతే మూడు తరాలుగా ఏజెన్సీ ప్రాంతంలో ఉంటూ భూమిని సాగు చేసుకున్నవారు అర్హులు. ఇందుకోసం 25 ఏళ్లకు ఒక తరం చొప్పున 75 ఏళ్లు, 2005 నుంచి ఇప్పటివరకు 16 ఏళ్లు.. ఇలా మొత్తం 91 ఏళ్లుగా గిరిజనేతరులు సాగులో ఉండాల్సి ఉంటుంది. అయితే గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతంలో ఎలా ఉన్నారనే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు రామప్ప దేవాలయం ఎనిమిది శతాబ్దాల క్రితం నిర్మించారు. అప్పటికే అక్కడే బ్రాహ్మణులు, ఇతర కులాలవారు వ్యవసాయం చేసుకుంటూ జీవించారనే చారిత్రక ఆధారాలు ఉన్నట్లు చర్చ జరిగింది. ఇలా గిరిజనేతరులకు కూడా పట్టాలు ఇవ్వాల్సిన ఆవశ్యకతను కమిటీ చర్చించింది. గొత్తికోయలు మనోళ్లు కాదు.. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాల్సి వస్తే ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గొత్తికోయలకు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రధానంగా ములుగు, మహబూబాబాద్‌తోపాటు ఖమ్మం జిల్లా చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం మండలాలు, భూపాలపల్లి జిల్లాలోని వాజేడు ప్రాంతంలో గొత్తికోయలు ఉంటున్నారు. వీరు సంచార జీవనంగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చినవారే కానీ, స్థానికులు కాదనే అభిప్రాయానికి వచ్చారు. ఒక్కొక్కరికి నాలుగు హెక్టార్ల వరకే పట్టాలు.. అటవీశాఖ భూములే కదా.. అని గిరిజనులు, గిరిజనేతరులు వందల ఎకరాలు ఆక్రమించుకున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. అయితే ఒక్కొక్కరికి 4 హెక్టార్లు(పది ఎకరాలు) భూమికి మాత్రమే పట్టాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకోనుంది. మిగిలిన భూమిని ఫారెస్టులో కలుపుకోవాలని భావిస్తోంది. పండుగ తర్వాతే.. పోడు భూముల పట్టాలు అందించేందుకు అర్హులైన రైతులను ఎంపిక చేసే ప్రక్రియ దసరా తర్వాత ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రొఫార్మా తయారు చేసి దరఖాస్తులను ఏజెన్సీ ప్రాంతాల్లోని రైతులకు అందుబాటులో ఉంచుతారు. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ముందుగా గ్రామపంచాయతీ, మండలస్థాయిలో, రెండో దశలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో, కలెక్టర్, భూ పరిపాలనా విభాగం, ఫారెస్టు, ఐటీడీఏ పీవో స్థాయి అధికారులు పరిశీలించి తుది జాబితా రూపొందిస్తారు. నిజమైన రైతులకు న్యాయం.. భూమినే నమ్ముకొని జీవిస్తున్న నిజమైన రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం తీసుకునే నిర్ణయాలు వారికి అనుకూలంగా ఉంటాయి. ఎన్ని ఎకరాలు ఇవ్వాలి.. ఎప్పటి నుంచి భూమిని సాగు చేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలి.. ఎవరికి ఇవ్వాలి.. అనేవి కీలకాంశాలుగా చర్చ జరుగుతోంది. – సత్యవతి రాథోడ్, రాష్ట్ర మంత్రి, ఉపసంఘం చైర్పర్సన్ శాశ్వత పరిష్కారం చూపాలి ఏజెన్సీ మండలాల్లో ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపాలి. 2005 కంటే ముందు సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇచ్చి రైతుబంధు, రైతుబీమా, సాగునీరు అందించినట్లయితే ఉన్న అడవులను స్థానికులే కాపాడుకుంటారు. – సీతక్క, ములుగు ఎమ్మెల్యే స్వేచ్ఛగా సాగు చేసుకోనివ్వాలి.. ఏజెన్సీ గ్రామాల్లోని పోడు భూముల్లో స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకునే విధంగా చూడాలి. అర్హులైన ప్రతి వ్యక్తికి పట్టాలు ఇచ్చి రెండు పంటలకు నీరందించాలి. అప్పుడే ఆదివాసీల అభివృద్ధి సాధ్యమవుతుంది. – ఆగబోయిన రవి, తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు -
వాళ్లిద్దరి మధ్య విభేదాలా!.. మరోసారి నిరూపితమైంది
Virat Kohli And Rohit Sharma Conflicts.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొంతకాలం కిందట వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ఒక్కోసారి వీరిద్దరి ప్రవర్తన ఉండడంతో మీడియా వార్తలు రాసుకొచ్చేది. అది చూసి ఫ్యాన్స్ కూడా నిజమేనని భావించారు. అయితే అవన్నీ తప్పుడు వదంతులని.. మా మధ్య అలాంటిదేం లేదని కోహ్లి, రోహిత్‌లు చూపించారు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మ్యాచ్‌లు విజయం సాధించినప్పుడు.. ఇంగ్లండ్ వికెట్లు కోల్పోయినప్పుడు ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకోవడం.. అభినందించుకోవడం చేశారు. చదవండి: T20 World Cup 2021: సూర్య, ఇషాన్‌లు ఫామ్‌లో లేరు.. ఆ స్థానాల్లో వీరే కరెక్ట్ Courtesy: IPL Twitter తాజాగా ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఆదివారం ఆర్సీబీ, ముంబై మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై 54 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి రోహిత్ వద్దకు వచ్చి మాట్లాడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇద్దరు మాట్లాడుకుంటున్న సందర్భంలో ముఖాల్లో నవ్వులు పూయడం అభిమానులను సంతోషపరిచింది. ఈ సందర్భంగా వారి ఫోటోను షేర్చేస్తూ ట్వీట్స్‌తో రెచ్చిపోయారు. '' ఎంతైనా కాబోయే కెప్టెన్.. కాబోయే కెప్టెన్ వద్దకు వచ్చి ప్రస్తుత కెప్టెన్ చర్చలు.. వారిద్దరి మధ్య విభేదాలు లేవనడానికి ఈ ఫోటోనే నిదర్శనం'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: "నువ్వు సూపరప్పా ఊతప్ప".. సీఎస్కే ప్లేయర్ క్రీడాస్పూర్తికి నెటిజన్లు ఫిదా Win or lose but these moments is made my morning beautiful #Rohirat #ViratKohli #RohitSharma pic.twitter.com/P2jUlM3Clv — Maulik Vadariya (@MaulikVadariya) September 27, 2021 -
అనంతపురం జిల్లాలో రోడ్డున పడ్డ టీడీపీ విభేదాలు
-
కాంగ్రెస్ – ట్విట్టర్ వార్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ, సామాజిక మాధ్యమం ట్విట్టర్ మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఇంకా కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికారిక అకౌంట్, పార్టీ నేతలు, కార్యకర్తల ఖాతాలను ట్విట్టర్ బ్లాక్ చేసిందని ఆ పార్టీ గురువారం వెల్లడించింది. ఢిల్లీలో అత్యాచారం, హత్యకి గురైనట్టుగా అనుమానిస్తున్న దళిత బాలిక కుటుంబం ఫొటోలను కాంగ్రెస్ నేత రాహుల్ ఇటీవల ట్విట్టర్లో షేర్ చేసినందుకు ఆయన ఖాతాను తాత్కాలికంగా స్తంభింపజేసింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతాని బ్లాక్ చేయడంతో ఆ పార్టీ ట్విట్టర్‌పైనా, కేంద్రంలో మోదీ ప్రభుత్వంపైనా విరుచుకుపడింది. కేంద్రం ఆదేశాల మేరకే ట్విట్టర్ ఇలా వ్యవహరిస్తోందని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు సుర్జేవాలా, అజయ్ మాకెన్, లోక్‌సభలో పార్టీ విప్ మాణిక్యం ఠాగూర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మిత దేవ్ తదితరుల ఖాతాలను ట్విట్టర్ నిలిపివేసింది. పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలకు చెందిన మొత్తంగా 5,000 ఖాతాలను ట్విట్టర్ స్తంభింపజేసిందని కాంగ్రెస్ సోషల్‌మీడియా విభాగం చీఫ్ రోహన్ గుప్తా అన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ట్విట్టర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతల అకౌంట్లు బ్లాక్ చేసే అంశంలో ఆ సంస్థ తన సొంత నిబంధనలు పాటిస్తుందా లేదంటే మోదీ ప్రభుత్వం ఆదేశాల మేరకు నడుచుకుంటుందా అని ప్రశ్నించారు. కాగా, ట్విట్టర్ తమ చర్యల్ని సమర్థించుకుంది.