బాగ్దాద్: ఇరాక్‌లో ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇరాన్ అనుకూల పార్టీలు, షియా గురువు ముఖ్తదా అల్–సదర్ వర్గాల మధ్య రాజధాని బాగ్దాద్‌లో ఘర్షణ వాతావరణం నెలకొంది. అల్–సదర్ అనుచరులు మూడు రోజులుగా పార్లమెంట్‌లో బైఠాయించారు.
గతేడాది జరిగిన ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటవలేదు. ఇరాన్ అండతో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. షియా గురువు అల్–సదర్ అనుచర వర్గం ఆ ప్రయత్నాలను అడ్డుకుంటోంది. ఇరాన్ అనుకూల శక్తుల వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం బాగ్దాద్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. సంక్షోభం మరింత ముదిరేలా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment