baghdad
-
ఫుట్‌బాల్ స్టేడియం సమీపంలో పేలుడు.. 10 మంది యువకులు మృతి
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫుట్ స్టేడియం సమీపంలో భారీ పేలుడు సంభవించి 10 మంది మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ గ్యారేజ్‌లో పేలుడు పదార్థాలున్న వాహనం పేలి మంటలు పక్కనే ఉన్న గ్యాస్ ట్యాంకర్‌కు వ్యాపించడంతో అది కూడా పేలి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా రోజూ ఫుట్‌బాల్ ఆడేందుకు స్టేడియానికి వచ్చే యువకులే అని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఇరాక్ సైన్యం ప్రకటనలో తెలిపింది. పేలుడుకు గల కరాణాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొంది. చదవండి: ఆస్పత్రులూ ఖాళీ.. ఖేర్సన్ నుంచి రష్యా సేనల పలాయనం -
హైదరాబాద్ టు బాగ్దాద్
శంషాబాద్: హైదరాబాద్ నుంచి నేరుగా బాగ్దాద్ వెళ్లేందుకు విమాన సర్వీసు ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం 3.17 గంటలకు ‘ఫ్లై బాగ్దాద్ ఎయిర్‌లైన్స్’కు చెందిన ఐఎఫ్–462 టేకాఫ్ తీసుకుని తొలి విమానం బయలుదేరింది. హైదరాబాద్–బాగ్దాద్‌ల మధ్య వారానికి రెండు రోజులు ఈ సర్వీసులు కొనసాగుతాయని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. ఇక బాగ్దాద్ నుంచి వచ్చేవిమానం ప్రతి ఆదివారం ఉదయం 11.55 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. అదేరోజు మధ్యాహ్నం 12.55 గంటలకు తిరిగి ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. మంగళవారం బాగ్దాద్ నుంచి వచ్చే విమానం ఉదయం 9.55 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. అదేరోజు ఉదయం 10.55 కు ఇక్కడి నుంచి బాగ్దాద్ బయలుదేరుతుంది. పెరుగుతున్న మెడికల్ టూరిజం ఏటా ఇరాక్ నుంచి 10 శాతానికి పైగా మెడికల్ టూరిస్టులు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారని పర్యాటక మంత్రిత్వశాఖ చెబుతోంది. అంతేగాక ఇరాక్‌లోని బాగ్దాద్, కర్బలా ప్రాంతాలకు కూడా మనదేశం నుంచి పర్యాటకుల రాకపోకలు పెరిగాయి. ఈ నేపథ్యంలో డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభించారు. -
రణరంగంలా మారిన బాగ్ధాద్.. కాల్పుల్లో 15మంది మృతి
బాగ్ధాద్: ఇరాక్ రాజధాని బాగ్ధాద్ రణరంగాన్ని తలపిస్తోంది. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు షీతె క్లెరిక్ మొఖ్తదా సదర్ ప్రకటించగానే ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. సోమవారం అత్యంత పటిష్ఠ భద్రత ఉండే గ్రీన్ జోన్‌ను(పార్లమెంటు భవనం) ముట్టడించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రీన్ జోన్లో కొందరు బాంబులతో విరుచుకుపడ్డారు. తుపాకీ కాల్పుల మోత మోగించారు. ఈ ఘటనలో 15 మంది సదర్ మద్దతుదారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 250 మంది గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపిందని వార్తలు వచ్చాయి. అయితే ప్రత్యక్షసాక్షులు మాత్రం సదర్ మద్దతుదారులకు, ప్రో-ఇరాక్ కో ఆర్డినేషన్ ఫ్రేమ్ వర్క్ అనూకుల వ్యక్తులకు మధ్య ఘర్షణలు చెలరేగాయని పేర్కొన్నారు. కో ఆర్డినేషన్ ఫ్రేంవర్క్ సానుభూతిపరులు సదర్ మద్దతుదారులపై కాల్పులు జరిపారని చెప్పారు. ఈ క్రమంలోనే సదర్ సపోర్టర్లు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని వివరించారు. మరోవైపు కో ఆర్డినేషన్ ఫ్రేమ్‌వర్క్ ఈ దాడిని ఖండించింది. సదర్ మద్దతుదారులు సంయమనం పాటించి చర్చలకు రావాలని సూచించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో నిరసనకారులపై భద్రత దళాలు గానీ, పోలీసులు గానీ కాల్పులు జరపకుండా తాత్కాలిక ప్రధాని ముస్తఫా అల్ ఖదేమీ నిషేధం విధించారు. అందరూ శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు. బాగ్ధాద్‌లో పరిణామాలపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. పరిస్థితులు చేయి దాటిపోకుండా, హింసాత్మక ఘటనలకు తావులేకుండా ఉండాలని సూచించింది. అగ్రరాజ్యం అమెరికా కూడా బాగ్ధాద్‌లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాక్‌లో ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఏర్పాటుకాక రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారీటీ రాకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. అయితే ప్రో-ఇరాక్ కో ఆర్డినేషన్ ఫ్రేం వర్క్ అన్ని పార్టీలతో కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముస్తఫా అల్ ఖదేమీని తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకుంది. దీన్ని మొఖ్తదా సదర్ మద్దతుదారాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదివరకే పలుమార్లు గ్రీన్ జోన్‌ను ముట్టడించారు. అక్టోబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సదర్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజార్టీ సీట్లు సాధించలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన విపక్షాలతో చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. చదవండి: 300 మందితో వెళ్తున్న నౌకలో భారీ అగ్ని ప్రమాదం -
ఇరాక్‌లో ఉద్రిక్తతలు.. 3 రోజులుగా పార్లమెంట్‌లోనే నిరసనకారులు
బాగ్దాద్: ఇరాక్‌లో ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇరాన్ అనుకూల పార్టీలు, షియా గురువు ముఖ్తదా అల్–సదర్ వర్గాల మధ్య రాజధాని బాగ్దాద్‌లో ఘర్షణ వాతావరణం నెలకొంది. అల్–సదర్ అనుచరులు మూడు రోజులుగా పార్లమెంట్లో బైఠాయించారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటవలేదు. ఇరాన్ అండతో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. షియా గురువు అల్–సదర్ అనుచర వర్గం ఆ ప్రయత్నాలను అడ్డుకుంటోంది. ఇరాన్ అనుకూల శక్తుల వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం బాగ్దాద్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. సంక్షోభం మరింత ముదిరేలా కనిపిస్తోంది. -
మెడికల్ టూరిజానికి హబ్‌గా మారిన హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: మెడికల్ టూరిజానికి ప్రధాన హబ్‌గా మారిన హైదరాబాద్ నుంచి ఢాకా, బాగ్దాద్ నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఆయా నగరాల నుంచి సిటీకి ఎక్కువగా రోగులు వస్తుండటంతో మెడికల్ టూరిస్టుల డిమాండ్, ఆస్పత్రుల విజ్ఞప్తి మేరకు విమానాలు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 15 నుంచి ఢాకాకు సర్వీసులు ప్రారంభం కానుండగా త్వరలో బాగ్దాద్‌కు కూడా మొదలుకానున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు మీదుగా.. ప్రస్తుతం బంగ్లాదేశ్, ఇరాక్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వైద్య చికిత్సల కోసం నగరానికి వస్తున్నారు. నేరుగా నగరానికి చేరుకునే సదుపాయం లేక ఢిల్లీ, ముంబై, బెంగళూరు మీదుగా చేరుకుంటున్నారు. దీంతో రోగులు, వారి బంధువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విమానయాన సంస్థలు, జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పలు కార్పొరేట్ ఆస్పత్రులు వివరించాయి. దీంతో బాగ్దాద్, ఢాకా నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ఎయిర్‌పోర్టు అధికారులు చర్యలు చేపట్టారు. చికిత్సలకు తక్కువ ఖర్చు అవుతుండటంతో.. ఒక్క ఢాకా నుంచే రోజూ 100 మందికి పైగా రోగులు హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్ ఆస్పత్రులకు వస్తున్నారు. బాగ్దాద్ నుంచి కూడా దాదాపు ఇదే స్థాయిలో రోగుల తాకిడి ఉంది. గుండె జబ్బులు, కాలేయ సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులకు అమెరికా, యూరోప్ దేశాల కంటే తక్కువ ఖర్చులతో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందిస్తుండటంతో చాలా మంది నగరంలో పేరొందిన ఆస్పత్రులకు వస్తున్నారు. దీంతో హైదరాబాద్ మెడికల్ టూరిజానికి కేంద్రబిందువుగా మారింది. నగరానికి ఏటా 50 వేల మంది విదేశీ రోగులు వైద్య చికిత్సల కోసం ఏటా సుమారు 2 లక్షల మంది విదేశీ రోగులు దేశంలోని పలు ఆస్పత్రులకు వస్తారు. వీరిలో 50 వేల మందికి పైగా హైదరాబాద్‌కే వస్తున్నట్టు అంచనా. కరోనా వల్ల రెండేళ్లుగా రాకపోకలు నిలిచిపోగా ప్రస్తుతం పలు దేశాలకు విమాన సర్వీసులు తిరిగి మొదలవడంతో రోగుల తాకిడి కూడా మొదలైంది. ఆఫ్రికా, ఇథియోపియా, నైజీరియా, ఒమన్, ఖతర్, కంబోడియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, ఇరాక్, మస్కట్, దోహ, సౌదీ, సూడాన్, సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మాల్దీవులు తదితర దేశాల నుంచి రోగులు ఎక్కువగా నగరానికి వస్తారు. కొద్ది రోజులుగా ఢాకా, బాగ్దాద్‌ల నుంచి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. (చదవండి: స్కిల్, అప్‌స్కిల్, రీ–స్కిల్ ) -
నేరుగా నగరానికే...
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఢాకా, బాగ్దాద్ నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఆయా నగరాల నుంచి సిటీకి ఎక్కువగా రోగులు వస్తుండటంతో మెడికల్ టూరిస్టుల డిమాం డ్, ఆస్పత్రుల విజ్ఞప్తి మేరకు విమానాలు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 15 నుంచి ఢాకాకు సర్వీసులు ప్రారంభం కానుండగా త్వరలో బాగ్దాద్‌కు కూడా మొదలుకానున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు మీదుగా.. ప్రస్తుతం బంగ్లాదేశ్, ఇరాక్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వైద్య చికిత్సల కోసం నగరానికి వస్తున్నారు. నేరుగా నగరానికి చేరుకునే సదుపాయం లేక ఢిల్లీ, ముంబై, బెంగళూరు మీదుగా చేరుకుంటున్నారు. దీంతో రోగులు, వారి బంధువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విమానయాన సంస్థలు, జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పలు కార్పొరేట్ ఆస్పత్రులు వివరించాయి. దీంతో బాగ్దాద్, ఢాకా నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ఎయిర్‌పోర్టు అధికారులు చర్యలు చేపట్టారు. వైద్యానికి తక్కువ ఖర్చు.. ఒక్క ఢాకా నుంచే రోజూ 100 మందికి పైగా రోగులు హైదరాబాద్‌లోని పలు కా ర్పొరేట్ ఆస్పత్రులకు వస్తున్నారు. బా గ్దాద్ నుంచి కూడా దాదాపు ఇదే స్థాయి లో రోగుల తాకిడి ఉంది. గుండె జబ్బు లు, కాలేయ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులకు అమెరికా, యూరోప్ దేశాల కంటే తక్కువ ఖర్చులతో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందిస్తుండటంతో చాలా మంది నగరంలో పేరొందిన ఆస్పత్రుల కు వస్తున్నారు. దీంతో హైదరాబాద్ మెడికల్ టూరిజానికి కేంద్రబిందువుగా మారింది. నగరానికి ఏటా 50 వేల మంది.. వైద్య చికిత్సల కోసం ఏటా సుమారు 2 లక్షల మంది విదేశీ రోగులు దేశంలోని పలు ఆస్పత్రులకు వస్తారు. వీరిలో 50 వేల మందికి పైగా హైదరాబాద్‌కే వస్తున్నట్టు అంచనా. కరోనా వల్ల రెండేళ్లుగా రాకపోకలు నిలిచిపోగా ప్రస్తుతం పలు దేశాలకు విమాన సర్వీసులు తిరిగి మొదలవడంతో రోగుల తాకిడి కూడా మొ దలైంది. ఆఫ్రికా, ఇథియోపియా, నైజీరి యా, ఒమన్, ఖతర్, కంబోడియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, ఇరాక్, మస్కట్, దోహ, సౌదీ, సూడాన్, సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మాల్దీవులు తదితర దేశాల నుంచి రోగు లు ఎక్కువగా నగరానికి వస్తారు. కొద్ది రోజులుగా ఢాకా, బాగ్దాద్‌ల నుంచి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. -
ఇరాక్ ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి
బాగ్దాద్: ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ కధిమి నివాసంపై డ్రోన్ దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్ ఆదివారం తెల్లవారుజామున బాగ్దాద్‌లోని ప్రధాని నివాసాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇరాక్ ప్రధాని కధిమి ఈ డ్రోన్ దాడి నుంచి తప్పించుకున్నారు. ఇరాక్ మిలటరీ దీన్ని హత్యాప్రయత్నమని పేర్కొంది. బాగ్దాద్‌లోని పటిష్టమైన గ్రీన్జోన్లో ఉన్న కధిమి నివాసమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ఇరాక్ మిలిటరీ ఓ ప్రకటనలో తెలిపింది. 'నేను క్షేమంగా ఉన్నాను, అంతా ప్రశాంతంగా ఉండాలని' కధిమి తన అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు దాడికి తామే బాధ్యులమని ఏ సంస్థ ప్రకటించలేదు. చదవండి: (పునీత్ రాజ్‌కుమార్‌కు మొదట వైద్యం చేసిన డాక్టర్ ఇంటికి భారీ బందోబస్తు) -
భారీ పేలుడు.. రద్దీమార్కెట్ మొత్తం రక్తసిక్తం
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో మరో మారణ హోమం చోటు చేసుకుంది. ఈద్ లక్క్ష్యంగా చేసుకుని భారీ కుట్రకు పాల్పడ్డారు మిలిటెంట్లు. బాగ్దాద్ శివారు నగరం సద్ర్‌లోని ఓ రద్దీ మార్కెట్లో భారీ బాంబు పేలుడుకు పాల్పడగా.. ఆ ప్రాంతం రక్తపు ముద్దలతో భీకరంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటిదాకా 35 మంది చనిపోగా, 60 మందికిపైగా గాయపడ్డారు. సద్ర్ సిటీ వహాయిలత్ మార్కెట్లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బక్రీద్ కోసం మార్కెట్లకు క్యూ కట్టిన జనాలను లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. రద్దీ మార్కెట్ కావడంతో ఎటు చూసినా తెగిపడిన అవయవాలు, రక్తపు ముద్దలే కనిపిస్తున్నాయి. మృతుల్లో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నారు. గాయపడ్డ వాళ్లలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఘటనకు స్థానికంగా తయారుచేసిన పేలుడు పదార్థాన్నే ఉపయోగించినట్లు అధికారులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే ఈ దాడి తమ పనేనని ఐఎస్ఐఎల్(ఐఎస్ఐఎస్) ప్రకటించుకుంది. ఇరాక్ అధ్యక్షుడు బర్హమ్ సాలి ఈ దాడిని ‘క్రూరమైన నేరం’గా అభివర్ణించాడు. కాగా, ఈ ఏడాదిలో ఈ తరహా దాడి ఇది మూడోది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. -
మంటల్లో కోవిడ్ ఆస్పత్రి.. 82 మంది మృతి
బాగ్దాద్: మహారాష్ట్రలోని కోవిడ్ ఆస్పత్రుల్లో ప్రమాదాలు స్ఫురించేలా ఇరాక్‌లోని బాగ్దాద్‌లో కూడా ఘోరం జరిగింది. బాగ్దాద్‌లోని ఇబన్ అల్‌ఖతీబ్ ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 82 మంది మృతి చెందారు. మరో 110 మంది కాలిన గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా బాధితుల కోసం ఉంచిన ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో ఆస్పత్రిలో మంటలు వ్యాపించాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉన్న అంతస్తులోనే ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో వెంటిలేటర్ మీద ఉన్న 28 మంది రోగులు మంటలకి ఆహుతయ్యారు. మరికొందరు దట్టంగా వ్యాపించిన పొగతో ఊపిరాడక మరణించారు. ఈ ఘటన నిర్లక్ష్యం కారణంగా జరిగిందని తేలడంతో ఆరోగ్య మంత్రి హసన్ అల్ తమిమీని ప్రధాని సస్పెండ్ చేశారు. ప్రమాదం సమయంలో ఆస్పత్రిలో హృదయ విదారక సన్నివేశాలు కనిపించాయి ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్న కొందరు రోగులు వాటిని తీసేసి పరుగులు పెట్టే దృశ్యాలు మనసుల్ని కలిచివేశాయి. రోగుల కోసం వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు కూడా మంటల్లో చిక్కుకున్నారు. ఆ ఆçస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగితే రక్షించే వ్యవస్థ లేకపోగా, ఫాల్ సీలింగ్‌లో వినియోగించిన సామగ్రితో మంటలు మరింత విస్తృతంగా వ్యాపించాయని దేశ మానవ హక్కుల కమిషన్ అధికార ప్రతినిధి అలీ అల్–బయతి చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తేవడానికి కొన్ని గంటల సేపు శ్రమించారు. దాదాపు 200 మంది ప్రాణాలను కాపాడారు. -
వరుస పేలుళ్లతో వణికిన బాగ్దాద్
బాగ్దాద్: రెండు ఆత్మాహుతి బాంబు దాడులతో గురువారం ఇరాక్ రాజధాని బాగ్దాద్ వణికి పోయింది. సెంట్రల్ బాగ్దాద్‌లోని నిత్యం రద్దీగా ఉండే ‘బాబ్ అల్ షార్కి’లో జరిగిన ఈ రెండు వరుస పేలుళ్లలో కనీసం 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 110 మందికి పైగా గాయాల పాలయ్యారు. చెల్లాచెదురుగా పడిన మృతులు, క్షతగాత్రుల దేహాలతో ఘటనాస్థలి హృదయవిదారకంగా మారింది. ఈ పేలుళ్లకు ఇంతవరకు ఏ సంస్థ కూడా బాధ్యత తీసుకోలేదు. కానీ, అధికారులు మాత్రం ఇది ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్ర సంస్థ పనేనని ధ్రువీకరించారు. ఆర్థిక సంక్షోభంతో పాటు ముందస్తు ఎన్నికలు జరగనున్నాయన్న వార్తలతో రాజకీయంగా దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మాహుతికి సిద్ధమైన వ్యక్తి మొదట, మార్కెట్ మధ్య నిల్చుని తనకు ఆరోగ్యం బాలేదంటూ గట్టిగా అరిచాడని, దాంతో అందరూ ఆయన చుట్టూ మూగారని, అదే సమయంలో ఆ ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడని జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ మేజర్ జనరల్ తహసిన్ అల్ ఖఫాజీ వివరించారు. ఆ తరువాత కాసేపటికే మరో వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ స్లీపర్ సెల్ చేసిన దారుణమిదని అన్నారు. -
ఆత్మాహుతి దాడులు: 13 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ ఆత్మాహుతి దాడులలో దద్దరిల్లింది. గురువారం చోటు చేసుకున్న వరుస సూసైడ్ ఎటాక్స్‌లో పలువురు ప్రాణాలు కోల్పోగా అనేకమంది గాయాల పాలయ్యారు. సెంట్రల్ బాగ్దాద్‌లో రెండు ఆత్మాహుతి పేలుళ్లు కలకలం సృష్టించాయి. తాయరన్ స్క్వేర్‌లో రద్దీగా ఉన్న మార్కెట్ వద్ద ఇద్దరు వ్యక్తులు తమను తాము బాంబులతో పేల్చుకున్న ఘటనలో 13 మంది మృతి చెందారని ప్రాథమిక నివేదికలు ద్వారా తెలుస్తోంది. మరో 30 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్తానిక పోలీసులు వెల్లడించారు. ఇరాక్ రాజధానిలో నగరంలో 2017 తరువాత ఇదే అదిపెద్ద దాడి అని భావిస్తున్నారు. -
ఇరాక్ ఆర్మీ స్థావరంపై ముష్కర దాడి
బాగ్దాద్ : ఇరాక్‌పై ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పశ్చిమ బాగ్దాద్‌లోని ఇరాక్ ఆర్మీ స్థావరంపై సాయుధులైన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో11 మంది పౌరులు మరణించారు. సైన్యం సహా మొత్తం 8మంది గాయాలపాలయ్యారని పోలీసు, వైద్య వర్గాల నుంచి సమాచారం. అల్-రద్వానియా ప్రాంతంలోని ఆర్మీ స్థావరంపై జరిగిన దాడిలో దుండగులు గ్రేనెడ్, అధునాతన ఆయుధాలను వాడినట్టు తెలుస్తోంది. ఈ దాడి పాల్పడిన ఉగ్రవాదులు నాలుగు వాహనాల్లో వచ్చారని తెలుస్తోంది. ఉగ్రదాడిపై స్పందించిన ‘ఇరాక్ మిలిటరీ దాడి జరిగింది. ప్రభుత్వ మద్దతు ఉన్న సున్నీ మిలిషియా ఆర్మీపైనా అని ఇందులో నలుగురు మరణించారు. ముగ్గురు గాయపడ్డార’ని అధికార వర్గాలు తెలిపాయి. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం ఆర్మీ, పోలీసు బృందాలు అపరేషన్ మొదలెట్టినట్టు పోలీసు వర్గాల సమాచారం. -
అమెరికా ఎంబసీపై రాకెట్ దాడి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీకి సమీపంలో రాకెట్ దాడి జరిగింది. మూడు కత్యూష రాకెట్లు ఎంబసీ హై సెక్యూరిటీ కాంపౌండ్ వద్ద పడ్డాయని ఒకరు చెప్పగా, దాదాపు 5 రాకెట్లు పడ్డాయని మరొక సాక్షి తెలిపారు. అయితే హై సెక్యూరిటీ గ్రీన్ జోన్ వద్ద 5 రాకెట్లు పడ్డాయని ఇరాక్ భద్రతా బలగాలు అధికారికంగా ప్రకటించాయి. అయి తే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపాయి. ఈ ప్రాంతంలో ఇతర దేశాలకు సంబంధించిన ఎంబసీలు కూడా ఉన్నా యి. రెండు రోజుల క్రితమే బాగ్దాద్‌లో అమెరికా బలగాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిగింది. ఇరాన్ జనరల్ సులేమానీని అమెరికా హతమార్చినప్పటి నుంచి ఈ ప్రాంతంలో అస్థిరత నెలకొంది. -
ట్రంప్ తలపై భారీ రివార్డు ప్రకటించిన ఇరాన్..!
టెహ్రాన్ : ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సోలెమన్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశం మరోసారి స్పష్టం చేసింది. ఇరాన్ అధికారిక ఛానెల్ ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చిన వారు 80 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.570 కోట్లు) గెలుచుకోవచ్చని తెలిపింది. దేశంలోని ప్రతి పౌరుడు తలా ఒక డాలర్ చొప్పున పోగుచేసి ఆ మొత్తాన్ని ట్రంప్ ప్రాణాలు తీసిన వారికి రివార్డుగా ఇస్తామని వెల్లడించింది. ‘ఇరాన్ జనాభా 8 కోట్లు. మా దేశ జనాభా ఆధారంగా ట్రంప్ తల నరికి తెచ్చివారికి రివార్డు ప్రకటించాం’అని సదరు టీవీ ఛానెల్ పేర్కొంది. (చదవండి : నిశ్శబ్దంగా చంపేశారు) కాగా, ఇరాక్‌లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై శుక్రవారం అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ టాప్ సైనిక కమాండర్, ఖడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సోలెమన్, ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ ముహండిస్ మృతిచెందిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మృతితో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అమెరికా తాజా చర్యతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ఎలాంటి ప్రతీకార చర్యకు దిగుతుందోనన్న ఆందోళన నెలకొంది. అయితే, ఇరాన్ తమపై దాడికి తెగబడితే.. మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్లో 52 కీలక, వ్యూహాత్మక ప్రాంతాలను గుర్తించామని, తమపై దాడి చేస్తే ఆ 52 ప్రాంతాలను ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తూ శనివారం రాత్రి ఆయన ట్వీట్ చేశారు. (చదవండి : మా ప్రతీకారం భీకరం) -
ఎప్పుడో చంపేయాల్సింది
వాషింగ్టన్/బాగ్దాద్/టెహ్రాన్: ఇరాన్లో అత్యంత శక్తిమంతమైన నాయకుడు, ఆ దేశ రివల్యూషనరీ గార్డ్ కమాండర్ జనరల్ ఖాసీం సులేమాని అమెరికా జరిపిన దాడుల్లో మృతి చెందారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున సులేమాని ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై గగనతలం నుంచి డ్రోన్ల సాయంతో క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సులేమానితోపాటు ఇరాక్‌కు చెందిన హషద్ అల్ షాబి పారామిలటరీ బలగాల డిప్యూటీ చీఫ్, ఇరాన్‌కు మద్దతుగా వ్యవహరించే కొందరు స్థానిక మిలిమెంట్లు మరణించినట్టు బాగ్దాద్ మీడియా వెల్లడించింది. లెబనాన్ లేదంటే సిరియా నుంచి బాగ్దాద్‌కు వచ్చినట్టుగా భావిస్తున్న సులేమాని విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి రెండు కార్లలో తన సన్నిహితులతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. ఇరాక్‌లో అమెరికా సిబ్బంది రక్షణ కోసమే తాము వైమానిక దాడులకు దిగామని పెంటగాన్ ప్రకటించింది. ఈ దాడుల్లో సులేమాని మరణించారని ధ్రువీకరించింది. ఎప్పుడో చంపేయాల్సింది: ట్రంప్ విదేశాల్లో నిఘా కార్యకలాపాలు నిర్వహించే ఇరాన్ అల్ ఖుద్స్ చీఫ్ జనరల్ సులేమానిని కొన్నేళ్ల క్రితమే చంపేయాల్సి ఉండేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాక్‌తో పాటు మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాల్లో అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులకి, వేలాది మంది అమెరికన్ సిబ్బంది మృతికి సులేమాని కారకుడని ధ్వజమెత్తారు. ఈ మధ్యకాలంలో ఇరాక్‌లో అమెరికా దౌత్యకార్యాలయం దగ్గర జరిగిన దాడుల వెనుక సులేమాని హస్తం ఉందని అన్నారు. అమెరికా రాయబారులు ఇతర అధికారులు, సైనికులపై మరిన్ని దాడులకు సులేమాని వ్యూహాలు పన్నుతున్నారని ఆరోపించారు. సులేమాని మృతి వార్త తెలిసిన వెంటనే అధ్యక్షుడు ట్రంప్ అమెరికా జాతీయ జెండా ఇమేజ్‌ని తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. కొద్ది గంటల తర్వాత మరో ట్వీట్లో ‘‘ఇరాన్ ఎప్పుడూ యుద్ధం గెలవలేదు. అలాగే సంప్రదింపుల్ని ఎప్పుడూ వదులుకోలేదు’’అని పేర్కొన్నారు. 2018లో అమెరికా ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నప్పట్నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడితో మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతలు చెలరేగాయి. అమెరికాలో ట్రంప్‌పై అవిశ్వాసం ప్రబలుతోన్న సందర్భంలో ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఈ దాడులకి దిగారన్న విమర్శలు ఉన్నాయి. ఇరాక్ నుంచి వెనక్కి రండి ఇరాక్‌లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని అమెరికా విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది. ఇరాన్ మద్దతున్న మిలిటెంట్లు అమెరికా దౌత్యకార్యాలయం దగ్గర జరిపిన దాడులతో ఎంబసీలో కార్యకలాపాలు నిలిపివేశామని, పౌరులెవరూ అక్కడికి వెళ్లవద్దని ట్వీట్ చేసింది. ఈ పరిణామాలతో మధ్య ప్రాచ్యానికి అమెరికా మరో 3,500 మంది బలగాలను తరలించింది. ఇరాకీల సంబరాలు బాగ్దాద్‌లో జరిగిన దాడుల్లో జనరల్ సులేమాని మృతి చెందడంతో ఇరాక్‌లో ప్రభుత్వ వ్యతిరేకులు సంబరాలు చేసుకున్నారు. మరో యుద్ధం భరించలేం: ఐరాస గల్ఫ్‌లో మరో యుద్ధాన్ని ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్ వ్యాఖ్యానించారు. సులేమాని మృతి చెందడంతో అమెరికా, ఇరాన్‌ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యుటెరస్ పై విధంగా స్పందించారు. ఎవరీ ఖాసీం సులేమాని? 1955లో ఇరాన్లో ఒక నిరుపేద రైతు కుటుంబంలో సులేమాని జన్మించారు. మొదట్లో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేశారు. 1979లోఇరాన్ విప్లవం సమయంలో రివ్యల్యూషనరీ గార్డ్‌లో చేరారు. 1980లో ఇరాన్, ఇరాక్ యుద్ధంలో పాల్గొని ధైర్యసాహసాలు కలిగిన కమాండర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌లో కీలకమైన నిఘా విభాగం అయిన ఖుద్స్ ఫోర్స్‌కి 1998 సంవత్సరం నుంచి సులేమాని మేజర్ జనరల్‌గా ఉన్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాబల్యాన్ని పెంచడానికి, దానిని బలమైన దేశంగా నిలపడానికి చాలా ఏళ్లుగా శ్రమిస్తున్నారు. సులేమాని విదేశాల్లో కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించడంలో దిట్ట. సమయానుకూలంగా మిత్రపక్షాల్ని మార్చేయడంలోనూ, చుట్టుపక్కల ముస్లిం దేశాల్లో షియా అనుకూల ప్రభుత్వ ఏర్పాట్లలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్‌పై పోరాటంలోనూ సులేమాని ప్రధాన పాత్ర పోషించారు. ఇరాన్ సరిహద్దులు దాటి జరిగే దాడులన్నింటి వెనుక వ్యూహ ప్రతివ్యూహాలు ఆయనే రచిస్తారు. ఇరాన్ సుప్రీం నాయకుడు అయోతల్లా ఖామినేయీ తర్వాత దేశంలో అంతటి శక్తిమంతుడిగా అల్–ఖుద్స్ బలగాల చీఫ్ అయిన జనరల్ సులేమానికి పేరుంది. ఇరాన్ ప్రజలు ఆయనని ఆరాధ్య దైవంగా కొలుస్తారు. 2017లో టైమ్ మ్యాగజైన్ ఆయనని అత్యంత ప్రభావశీలుర జాబితాలో చేర్చింది.జేమ్స్ బాండ్, ఎర్విన్ రోమెల్, లేడీ గాగా ఒక రూపంలోకి వస్తే అదే సులేమాని అంటూ కీర్తించింది. అయితే ఎన్నో దేశాల్లో మిలటరీ దాడుల వ్యూహకర్త అయిన సులేమానిని అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్ సులేమాని చంపేసినందుకు అమెరికాపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయోతొల్లా అలీ ఖమేనియా హెచ్చరించారు. ఇస్మాయిల్ ఖానీని సులేమాని స్థానంలో ఖుద్స్ బలగాల చీఫ్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇరాన్ గుండెకు గాయం చేసిన వారిని విడిచిపెట్టమని తమకు సహకరించే దేశాలతో కలిసి బదులు తీర్చుకుంటామని అధ్యక్షుడు హసన్ రౌహని హెచ్చరించారు. -
కమాండర్ హత్య: వీడియో పోస్టు చేసిన అమెరికా
వాషింగ్టన్: అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్ టాప్ సైనిక కమాండర్ ఖాసీం సొలెమాన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఖాసీం హత్యతో ఇరాకీలు సంబరాలు చేసుకుంటున్నారని, జాతీయ పతాకంతో ఇరాకీ వీధుల్లో కోలాహలం నెలకొందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో ఒక వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘స్వేచ్ఛ కోసం ఇరాకీలు వీధుల్లో నృత్యాలు చేస్తున్నారు. జనరల్ సోలెమాన్ లేకపోవడమే అందుకు కారణం’ అని పేర్కొన్నారు. రోడ్డు మీద ఇరాకీలు జాతీయ జెండాతో, ఇతర బ్యానర్లతో పరిగెత్తుతున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఇరాక్‌లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ టాప్ సైనిక కమాండర్, ఖడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సోలెమన్, ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ ముహండిస్ మృతిచెందారు. వీరిద్దరి మృతితో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిపోయాయి. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు సోలెమన్‌ను చంపినట్టు అమెరికా ప్రకటించగా.. అమెరికా అవివేక చర్యకు తీవ్ర ప్రతీకారం తప్పదంటూ ఇరాన్ హెచ్చరించింది. అమెరికా తాజా చర్యతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ఎలాంటి ప్రతీకార చర్యకు దిగుతుందోనన్న ఆందోళన నెలకొంది. చదవండి: అమెరికాది అవివేకపు చర్య : ఇరాన్ ట్రంప్ ఆదేశాలతోనే దాడి : వైట్ హౌస్ -
‘కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం’
టెహ్రాన్: ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సోలేమన్‌ను హతమార్చిన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ అధినాయకుడు అయాతోల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. సోలేమన్‌ను అంతం చేసినా.. ఆయన చూపిన బాటలో నడవకుండా ఎవరినీ కట్టడి చేయలేరని వ్యాఖ్యానించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా శుక్రవారం రాకెట్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సోలేమన్ సహా మరో 8 మంది మృతి చెందారు. ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ బ్రిగేడ్ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు.. మంగళవారం ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై చేసిన విషయం విదితమే. ఇందుకు ప్రతీకారంగానే అమెరికా రాకెట్ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయంపై స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖామేనీ... స్థానిక మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నో ఏళ్లుగా ఇరాన్ మంచి కోసం అవిశ్రాంత కృషి చేసిన సోలేమన్‌కు నేడు అమరత్వం సిద్ధించింది. ఆయన వెళ్లిపోయాడు గానీ ఆయన చూపిన దారిలో సాగడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఆయన రక్తంతో చేతులు తడుపుకొన్న నేరగాళ్లపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుని తీరతాం. మా శత్రువులు ఒక విషయం తెలుసుకోవాలి. మీరిలా చేసినందుకు జీహాద్ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతుంది. పవిత్ర యుద్ధంలో మాకోసం విజయం ఎదురుచూస్తోంది’ అని వ్యాఖ్యానించారు. అదే విధంగా సోలేమన్‌తో పాటు అమరులైన మరికొందరు అధికారుల తరఫున ప్రతీకారం తీర్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ మాట్లాడుతూ... ఇస్లామిక్ విలువలను పరిరక్షించేందుకు తమతో పాటు స్వాత్రంత్యం కోరుకునే మరికొన్ని దేశాలు అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. సోలేమన్ అమరత్వం తమను ఇందుకు కార్యోన్ముఖుల్ని చేసిందని వ్యాఖ్యానించారు. (చదవండి: ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ దాడి.. 8 మంది మృతి) చదవండి: ట్రంప్ ఆదేశాలతోనే దాడి : వైట్ హౌస్ -
అమెరికాది అవివేకపు చర్య : ఇరాన్
టెహ్రాన్ : బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా బలగాలు రాకెట్ దాడి జరపడాన్ని ఇరాన్ అవివేకపు చర్యగా అభివర్ణించింది. ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సోలెమన్‌ను చంపాడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ దాడి భయంకరమైనదని ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావేద్ జరీఫ్ అన్నారు. అమెరికా చర్యను అంతర్జాతీయ ఉగ్రవాదంగా పేర్కొన్నారు. ఈ వంచన చర్యతో ఎదురయ్యే పరిణామాలకు అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇరాన్లో అమెరికా ప్రయోజనాలను చూస్తున్న స్విస్ దౌత్యకార్యాలయానికి సమన్లు పంపారు. అలాగే మూడు రోజులపాటు సంతాప దినాలను ప్రకటించారు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అమెరికా చర్యను తీవ్రంగా ఖండించారు. సోలెమాన్ హత్యకు తీవ్ర ప్రతీకారం తప్పదని అమెరికాను హెచ్చరించారు. కాగా, శుక్రవారం బాగ్దాద్ ఎయిర్‌పోర్ట్‌పై అమెరికా జరిపిన రాకెట్ దాడిలో ఇరాన్ క్వాడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సోలెమన్, ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ ముహండిస్‌తోపాటు మరో ఆరుగురు మృతిచెందారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని పెంటగాన్ వెల్లడించింది. చదవండి : ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ దాడి.. 8 మంది మృతి ట్రంప్ ఆదేశాలతోనే దాడి : వైట్ హౌస్ -
ట్రంప్ ఆదేశాలతోనే దాడి : వైట్ హౌస్
వాషింగ్టన్ : బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్ దాడికి పాల్పడింది తామేనని అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సులేమానీని హతమార్చినట్టు ఆ దేశ రక్షణ విభాగం(పెంటగాన్) వెల్లడించింది. ఇరాక్‌లో అమెరికా అధికారులపై జరిగిన దాడుల్లో సులేమానీ కీలక పాత్ర పోషించాడని పెంటగాన్ ఆరోపించింది. వందలాది మంది అమెరికా, దాని సంకీర్ణ సేనలకు చెందిన సభ్యుల మృతికి సులేమానీ బాధ్యుడని తెలిపింది. విదేశాల్లో ఉన్న అమెరికా అధికారులపై సులేమానీ దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. అలాగే ఈ దాడిని రక్షణాత్మక చర్యగా పేర్కొంది. వైట్ హౌస్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. బాగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై రెండు రోజుల క్రితం ఇరాన్ మద్ధతు ఉన్న నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ట్రంప్ ఇరాక్‌కు ప్రత్యేక బలగాలు పంపించారు. సులేమానీని మట్టుబెట్టడంతో అమెరికా రెండు రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. కాగా, సులేమానీ సిరియా నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం తెల్లవారుజామున బాగ్దాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలకడానికి రెండు ప్రత్యేక కాన్వాయ్‌లు ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకున్నాయి. అయితే సులేమానీ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టిన కొన్ని క్షణాల్లోనే ఈ దాడులు జరిగాయి. అమెరికా జెండాను పోస్ట్ చేసిన ట్రంప్.. బాగ్దాద్ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ దాడిలో సులేమానీ మృతి చెందిన కొద్దిసేపటికే డోనాల్డ్ ట్రంప్ ట్విటర్లో అమెరికా జాతీయ జెండాను పోస్ట్ చేశాడు. దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సులేమానీని మట్టుపెట్టడం ద్వారా అమెరికా విజయం సాధించిందని చెప్పడానికే ఆయన ఈ విధమైన పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. కాగా, అమెరికా జరిపిన ఈ రాకెట్ దాడిలో ఖాసీం సులేమానీ, ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ ముహండిస్‌తోపాటు మరో ఆరుగురు మృతిచెందారు. చదవండి : ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ దాడి.. 8 మంది మృతి -
ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ దాడి.. 8 మంది మృతి
బాగ్దాద్ : ఇరాక్‌లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్ దాడి జరిగింది. ఎయిర్ కార్గో టెర్మినల్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దాడి చోటుచేసుకుంది. మొత్తంగా మూడు రాకెట్ దాడులు జరిగినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో రెండు కార్లు ధ్వంసం కాగా, 8 మంది మృతిచెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇరాన్, ఇరాక్‌కు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు ఉన్నట్టు ఇరాక్ మీడియా పేర్కొంది. ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సోలెమన్, ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ ముహండిస్ మృతిచెందినట్టు ఇరాక్ మిలీషియా ప్రతినిధి వెల్లడించారు. ఈ దాడికి పాల్పడింది అమెరికా బలగాలే అని ఇరాక్ పీఎంఎఫ్ ప్రతినిధి అహ్మద్ అల్ అస్సాది ఆరోపించారు. దీనిపై యూఎస్ అధికారులు స్పందిస్తూ.. బాగ్దాద్‌లో ఇరాన్‌తో ముడిపడి ఉన్న రెండు లక్ష్యాలపై దాడి జరిగినట్టు తెలిపారు. అయితే మరింత సమాచారం వెల్లడించేందుకు వారు నిరాకరించారు. మరోవైపు.. మూడు రాకెట్లతో బాగ్దాద్ విమానాశ్రయంపై దాడి జరిగిందని ఇరాక్ పారా మిలటరీ గ్రూప్స్ తెలిపాయి. ఈ దాడిలో ఇరాక్ పారా మిలటరీకి చెందిన ఆరుగురు సభ్యులు, ఇద్దరు అతిథులు ఉన్నట్టు వారు పేర్కొన్నారు. కాగా, ఇటీవల ఇరాన్ అనుకూల మిలీషియా సభ్యులు, పలువురు నిరసనకారులు బాగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై దాడిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన అమెరికా.. ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. ఈ క్రమంలోనే బాగ్దాద్ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ దాడులు జరగడం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉంది. అయితే ఇప్పటివరకు ఈ దాడికి పాల్పడింది ఎవరనే దానిపై స్పష్టత లేదు. ఈ దాడులతో మధ్య ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తలు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. -
ప్రతీకారం తీర్చుకోం: ట్రంప్
వాషింగ్టన్: తాను శాంతి కాముకుడినని, తనకు యుద్ధం అంటే ఇష్టం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకోబోమని, యుద్ధం చేసే ఆలోచన లేదని తెలిపారు. ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ బ్రిగేడ్ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు మంగళవారం ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇరాన్‌లోని పరిస్థితిని చాలా బాగా చక్కదిద్దామని చెప్పారు. ఇరాన్‌తో యుద్ధం చేసే ఆలోచన ఉందా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘యుద్ధం చేయాలన్న ఆలోచన ఇరాన్‌కు మంచిదని నేను అనుకోవడం లేదు. నేను శాంతి కోరుకుంటున్నాను. యుద్ధం రావాలని అనుకోవడం లేద’ని ట్రంప్ సమాధానం ఇచ్చారు. బాగ్దాద్‌లో తమ రాయబార కార్యాలయంపై దాడికి ఇరాన్‌దే పూర్తి బాధ్యత అని, దీనికి ఇరాన్ భారీగా మూల్యం చెల్లించుకుంటుందని అంతకుముందు ట్రంప్ హెచ్చరించారు. ‘ఇది హెచ్చరిక కాదు, ఇది ముప్పు’ అంటూ ట్వీట్ చేశారు. తమ కార్యాలయంపై దాడిని భద్రత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని, సిబ్బంది సురకక్షితంగా ఉన్నారని తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు వెంటనే స్పందించిన ఇరాక్ ప్రధాని, అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, దాడి జరిగిన వెంటనే బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి అదనపు బలగాలను తరలించినట్టు పెంటగాన్ ప్రకటించింది. మంగళవారం ఇరాక్ ప్రధాని ఆదిల్ అబ్దుల్ ఆల్-మహదితో ఫోన్ మాట్లాడినట్టు వెల్లడించింది. (చదవండి: ఇరాక్‌లో యూఎస్ ఎంబసీపై దాడి) -
ఇరాక్‌లో యూఎస్ ఎంబసీపై దాడి
బాగ్దాద్: ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ బ్రిగేడ్ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు మంగళవారం ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కార్యాలయం ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేసి, రిసెప్షన్ ప్రాంతాన్ని తగలబెట్టారు. ఇరాన్ మద్దతున్న తీవ్రవాద సంస్థ హషెద్ అల్ షాబికి హిజ్బుల్ బ్రిగేడ్ సాయుధ విభాగం. దానికి ఇరాక్‌లో, సిరియాలో ఉన్న కీలక స్థావరాలపై అమెరికా ఆదివారం వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో పాతికమందికి పైగా చనిపోయారు. ఆ దాడులకు ప్రతీకారంగానే యూఎస్ రాయబార కార్యాలయంపై సోమవారం దాడి జరిగింది. మిలటరీ యూనిఫాం వేసుకున్న ఆందోళనకారులు ‘ఆక్రమణదారు అమెరికా’ అని ఉన్న ప్లకార్డులు పట్టుకుని ఈ దాడిలో పాల్గొన్నారు. ఆందోళనకారులను చెదర గొట్టడానికి అమెరికా సైనికులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. -
మోడల్ దారుణ హత్య
బాగ్దాద్ : తారా ఫేర్స్ అనే ఇరాకీ మోడల్ దారుణ హత్యకు గురైంది. తన ఇంటి నుంచి పోర్షే వాహనంలో బయల్దేరిన తారా(22)పై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి కాల్చి చంపారు. కారులో నుంచి ఆమెను కిందకి లాగి తుపాకీ గురిపెట్టి వరుసగా మూడు బుల్లెట్లు తలలోకి దించారు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాల్సిందిగా ఇరాక్ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. కాగా తారా మోడల్‌గా రాణిస్తూ తనకంటూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తారాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అయితే సంప్రదాయాలకు విరుద్ధంగా మోడల్‌గా పని చేస్తుందన్న కారణంగానే ఛాందసవాదులు తారను అత్యంత దారుణంగా చంపివేశారంటూ ఆమె అభిమానులు ఆరోపిస్తున్నారు. ‘అందరు అమ్మాయిల్లాగే జీవితాన్ని తనకు నచ్చినట్టుగా, సంతోషంగా గడపాలనుకున్న తారాను కొంత మంది ఉగ్రవాదులు కాల్చి చంపారు. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ గురువారం తారా వాళ్ల టార్గెట్. వచ్చే గురువారం ఇంకెవరో. స్వేచ్ఛగా జీవించాలనుకునే అమ్మాయిలకు ఇక్కడ ఇలా జరగడం సాధారణమైపోయింది కదా. నిజంగా సిగ్గు పడాల్సిన విషయం’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఇరాకీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కర్నూలు వాసి బాగ్దాద్‌లో మృతి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు నగరానికి చెందిన వ్యక్తి ఆదివారం రాత్రి బాగ్దాద్‌లో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని అక్కడే ఖననం చేస్తుండటంతో కుటుంబ సభ్యులు కడచూపు దర్శనానికి కూడా నోచుకోలేకపోయారు. పూర్తి వివరాలు.. కర్నూలు నగరం ధర్మపేటకు చెందిన టి.దస్తగీర్ సాహెబ్ (65) ఆర్మీలో 20 ఏళ్లు పనిచేసి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం స్టేట్‌బ్యాంక్ మార్కెట్‌యార్డు బ్రాంచ్‌లో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. 20 రోజుల క్రితం బాగ్దాద్ యాత్రకు వెళ్లి అక్కడి పవిత్ర పుణ్యస్థలం మాబుసుభాని (దస్తగీర్) సమాధి వద్ద మృతిచెందాడు. ఇమామ్ గజాలి రహ్మతుల్లా అలై ఖబరస్తాన్‌లో ఖననం చేశారు. ఈయనకు నలుగురు కుమారులు, కుమార్తె సంతానం. -
ఉగ్రదాడి: 13 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో మరోమారు ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. కరాడా సెంట్రల్లో గల ఓ ఐస్‌క్రీం పార్లర్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 22 మందికి పైగా గాయాలయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే పార్లర్లో ప్రజలే లక్ష్యంగా ఉగ్రదాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాంబు దాడి అనంతరం ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. గాయాలపాలైన వారి ఆర్తనాదాలు, రోదనలతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.