హెల్ప్‌లైన్లు ఇవే...
ఇరాక్‌లో యుద్ధం వల్ల వలస కార్మికుల కుటుంబాల సమాచారం తెలుసుకునేందుకు రాజధాని బాగ్దాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. 009647704444899, 00964770484324 నంబర్లను సంప్రదించాలని భారత రాయబార కార్యాలయ సిబ్బంది ప్రకటన విడుదల చేశారు.
రాయికల్ : ఇరాక్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు నాలుగైదు రోజులుగా హోరాహోరీ యుద్ధం జరుగుతుండగా అక్కడి తెలంగాణవాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వారిని పనికి వెళ్లనీయకుండా యజమానులు క్యాంపులకే పరిమితం చేస్తున్నారు. రెండు రోజులుగా సెల్‌ఫోన్, ఇంటర్నెట్ వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో తమ వారి యోగక్షేమాలు తెలియక ఇక్కడ వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాల నుంచి 20 వేల మంది కార్మికులు ఉపాధి నిమిత్తం ఇరాక్‌లోని బాస్రా, బాగ్దాద్, మన్సూరియా ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. యుద్ధ వాతావరణంతో వీరంతా క్యాంపులకే పరి మితమయ్యారు. జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియో జకవర్గాల నుంచి దాదాపు 1000 మంది వరకు ఇరాక్‌లో ఉంటారు.
ఏం జరుగుతోంది?
ఇరాక్‌లో అంతర్యుద్ధం కారణంగా అక్కడ ఉన్న తెలంగాణ ప్రజల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మన వారి యోగక్షేమాలు తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి కేంద్ర విదేశాంగ మంత్రితో సంప్రదింపులు జరిపారు.
ఇరాక్‌లో బిక్కు బిక్కు
Published Wed, Jun 18 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM
Advertisement
Advertisement