Help lines
-
ఉబెర్ నిరంతర భద్రతా హెల్ప్‌లైన్ సేవలు
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్.. నిరంతర భద్రతా హెల్ప్‌లైన్ సేవలను ప్రారంభించింది. డ్రైవర్ల దుష్ప్రవర్తన, బ్రేక్ డౌన్స్, డ్రైవర్లతో వివాదం వంటి సమస్యలకు వెంటనే పరిష్కారం పొందడం కోసం కంపెనీ ఇన్‌హౌస్ సేఫ్టీ టీమ్‌తో మాట్లాడే వెసులుబాటును కల్పిస్తోంది. చండీగఢ్‌లో మార్చి నుంచి ప్రయోగాత్మకంగా నడుస్తోన్న ఈ సేవలను మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా విస్తరించామని కంపెనీ సెంట్రల్ ఆపరేషన్స్ హెడ్ పవన్ వైష్ వెల్లడించారు. యాప్ వినియోగదారులకు ఎస్ఓఎస్ బటన్ ఇప్పటికే అందుబాటులో ఉండగా.. నూతన సేవలు మరింత భద్రతా కల్పించనున్నాయని పేర్కొన్నారు. -
పట్నమొచ్చి పరేషాన్!
కృష్ణా జిల్లా ఏలూరుకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని శిరీష (పేరు మార్చాం) ఇంట్లోంచి కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ఆ తర్వాత ఎక్కడికెళ్లాలో అర్థం కాలేదు. బాలిక బిత్తర చూపులను కనిపెట్టిన కొందరు మాయమాటలు చెప్పి తమ వెంట తీసుకెళ్లారు. ఆ రాత్రంతా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తెల్లవారు జామున తిరిగి రైల్వేస్టేషన్లో వదిలి వెళ్లారు. ఓ మూలన కూర్చున్న ఆ చిన్నారిని గమనించిన అధికారులు నిందితులను గుర్తించారు. చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు పంపించారు. ఇది ఒక్క శిరీష ఉదంతం మాత్రమే కాదు. ఇంటి నుంచి పారిపోయి వస్తున్న ఎంతోమంది చిన్నారుల వ్యధ. పేదరికం, పని ఒత్తిడి, కుటుంబంలో నిరాదరణ, పెద్దల నిర్లక్ష్యం వంటి అనేక కారణాలతో ఇల్లు వదిలి వస్తున్న పిల్లలు వీధి పాలవుతున్నారు. ఇలా నగరానికి వస్తున్న చిన్నారులు ఏటా వేల సంఖ్యలోనే ఉంటున్నారు. గత రెండేళ్లలో నగరంలోని సహాయ కేంద్రాల ద్వారా పునరావాసం పొందిన చిన్నారులు 3000 మందికి పైగా ఉన్నారు. సహాయ కేంద్రాలు, పోలీసులు, రైల్వే అధికారుల దృష్టిలో పడకుండా కార్ఖానాల్లో బాలకార్మికులుగా బందీ అవుతున్న వాళ్లు, దళారుల బారిన పడి అక్రమ రవాణాకు గురవుతున్న వాళ్లు, వీధుల్లోనే సంచరిస్తూ అనేక రకాల దురలవాట్లకు గురవుతున్నారు. పలువురి బాలల భవిత ప్రశ్నార్థకంగా మారుతోంది. సాక్షి, సిటీబ్యూరో : స్వచ్ఛంద సంస్థల అంచనాల ప్రకారం ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్ తదితర ఉత్తరాది రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వస్తున్న చిన్నారులు నగరంలోని అనేక చోట్ల చిన్నచిన్న పరిశ్రమల్లో కార్మికులుగా పని చేస్తున్నారు. ‘పిల్లలు ఇళ్ల నుంచి బయటికి వస్తున్నారంటే పేదరికమే కారణమని భావించలేం. తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం, పిల్లల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం కూడా ఇందుకు దోహదపడుతోంది. ఇలాంటి ఎంతోమంది పిల్లలు అనేక ప్రాంతాల నుంచి నగరానికి వస్తున్నారు. వీరి సంరక్షణ, చక్కటి భవితవ్యాన్ని అందివ్వడాన్ని సమాజం మొత్తం బాధ్యతగా భావించాలి’ అంటున్నారు దివ్య దిశ వ్యవస్థాపకులు ఫిలిప్స్. నాలుగు దశాబ్దాలుగా పిల్లల కోసం పని చేస్తున్న ఆ సంస్థ ఆధ్వర్యంలోనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 2015లో సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇది 24 గంటలు పని చేస్తుంది. దారితప్పి వచ్చే పిల్లలను చేరిదీసి పునరావాసం కల్పిస్తోంది. తిరిగి తల్లిదండ్రులకు అప్పగిస్తోంది. రైళ్లనే ఎంచుకొంటున్నారు.. తల్లిదండ్రులు కొట్టారని పారిపోయి వచ్చేవాళ్లు కొందరైతే, హైదరాబాద్ చూసేందుకు వచ్చేవాళ్లు మరికొందరు. తప్పిపోయి వచ్చేవాళ్లు ఇంకొందరు. ‘బస్సయితే అందరికీ తెలిసిపోతుంది. పైగా టిక్కెట్‌కు డబ్బులు కావాలి. ట్రైన్లో ఆ ఇబ్బంది ఉండదు. ఒక బోగీలోంచి మరో బోగీలోకి మారిపోవచ్చు. ఆఖరికి సీట్ల కింది దాక్కొని రావచ్చు.. 6 నెలల క్రితం అలా హైదరాబాద్‌కు వచ్చిన ఓ పదేళ్ల బాలుడు చెప్పిన మనసులోని మాట ఇది. ఇలా వస్తున్న వారిపై పోలీసులు, రైల్వే అధికారులు, సహాయ కేంద్రాల దృష్టికి చేరితే ఇబ్బంది ఉండదు. సురక్షితంగా తిరిగి ఇళ్లకు చేరుకుంటారు. కానీ మోసగాళ్ల బారినపడ్డవాళ్లు మాత్రం అక్రమ రవాణాకు గురవుతున్నారు. ‘ఇందుకోసం దళారీ వ్యవస్థ ఒక పటిష్టమైన నెట్‌వర్క్‌తో పని చేస్తోంది. దళారులకు పట్టుబడిన పిల్లలను మొదటి వారం పాటు సినిమాలు, షికార్లకు తిప్పుతారు. బాగా డబ్బులు ఇస్తారు. బిర్యాని తినిపిస్తారు. ఆ తర్వాత క్రమంగా కార్మికులుగా, సెక్స్‌వర్కర్లుగా మారుస్తుంటార’ని చెబుతున్నారు సహాయ కేంద్రం నిర్వాహకుడు విజయ్. సహాయ కేంద్రం 1098కు ఫోన్ చేయండి.. ప్రస్తుతం సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో 2 సహాయ కేంద్రాలు పని చేస్తున్నాయి. త్వరలో నాంపల్లి స్టేషన్లోనూ ప్రారంభించనున్నారు. స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలతో పాటు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు, రైల్వే అధికారులు, రైల్వేస్టేషన్లలోని స్టాల్స్, దుకాణాలు, హోటళ్ల నిర్వాహకులు పిల్లల రక్షణలో భాగస్వాములవుతున్నారు. అనుమానాస్పదంగా కనిపించే పిల్లల సమాచారాన్ని 1098కు ఫోన్ చేసి చెబితే సహాయ కేంద్రాల నిర్వాహకులు వచ్చి తీసుకెళ్తారు. -
భూకంపం బాధితులకు హెల్ప్ లైన్ నంబర్లు ఇవే
-
భూకంపం బాధితులకు హెల్ప్ లైన్ నంబర్లు ఇవే
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న తెలుగువారి సహాయార్థం ఏపీ ప్రభుత్వం ఢిల్లీ, హైదరాబాద్‌లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటుచేంది. అటు విదేశాంగ శాఖ కూడా హెల్స్ లైన్ల ద్వారా సహాయ కార్యక్రమాల సమాచారాన్ని అందిస్తోంది. నేపాల్ సహా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయినవారు లేదా వారి బంధువులు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి కావలసిన సమాచారాన్ని పొందవచ్చని ఢిల్లీలో ప్రభుత్వం ప్రతినిధి కంభంపాటి తెలిపారు. కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు ఇవే.. హైదరాబాద్: 040- 23456005 ఏపీ భవన్ (ఢిల్లీ): 011- 23782388 విదేశాంగ శాఖ కార్యాలయం (ఢిల్లీ): 011- 230123113 లేదా 011- 23014104 -
ఇరాక్ కార్మికుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్
కలెక్టరేట్: ఇరాక్‌లో ప్రస్తుతం జరుగుతోన్న అంతర్యుద్ధం నేపథ్యంలో జిల్లా నుంచి వెళ్లిన కార్మికులతోపాటు, పర్యాటకుల సంక్షేమం కోసం ప్రత్యేక హెల్ప్లైన్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఇందుకుగాను హైద్రాబాద్‌లోని సచివాలయంలో 040-23220603, సెల్: 9440854433, అదే విధంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 9866098111నెంబర్లను ఏర్పాటు చేశామన్నారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఉన్న ఇండియన్ మిషన్‌లో కూడా సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవి ఈ నెం:009647704444899,009647704843247లతో పనిచేస్తాయని తెలిపారు. వీటిని సద్వినియోగ పరుచుకోవాలని, తమ బంధువులు, స్నేహితులు ఇరాక్‌లో ఉంటే ఈ నెంబర్లను సంప్రదించి వారి వివరాలు అందించాలన్నారు. -
ఇరాక్‌లో బిక్కు బిక్కు
హెల్ప్లైన్లు ఇవే... ఇరాక్‌లో యుద్ధం వల్ల వలస కార్మికుల కుటుంబాల సమాచారం తెలుసుకునేందుకు రాజధాని బాగ్దాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో హెల్ప్లైన్లు ఏర్పాటు చేశారు. 009647704444899, 00964770484324 నంబర్లను సంప్రదించాలని భారత రాయబార కార్యాలయ సిబ్బంది ప్రకటన విడుదల చేశారు. రాయికల్ : ఇరాక్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు నాలుగైదు రోజులుగా హోరాహోరీ యుద్ధం జరుగుతుండగా అక్కడి తెలంగాణవాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వారిని పనికి వెళ్లనీయకుండా యజమానులు క్యాంపులకే పరిమితం చేస్తున్నారు. రెండు రోజులుగా సెల్‌ఫోన్, ఇంటర్నెట్ వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో తమ వారి యోగక్షేమాలు తెలియక ఇక్కడ వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాల నుంచి 20 వేల మంది కార్మికులు ఉపాధి నిమిత్తం ఇరాక్‌లోని బాస్రా, బాగ్దాద్, మన్సూరియా ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. యుద్ధ వాతావరణంతో వీరంతా క్యాంపులకే పరి మితమయ్యారు. జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియో జకవర్గాల నుంచి దాదాపు 1000 మంది వరకు ఇరాక్‌లో ఉంటారు. ఏం జరుగుతోంది? ఇరాక్‌లో అంతర్యుద్ధం కారణంగా అక్కడ ఉన్న తెలంగాణ ప్రజల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మన వారి యోగక్షేమాలు తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి కేంద్ర విదేశాంగ మంత్రితో సంప్రదింపులు జరిపారు.