కలెక్టరేట్: ఇరాక్‌లో ప్రస్తుతం జరుగుతోన్న అంతర్యుద్ధం నేపథ్యంలో జిల్లా నుంచి వెళ్లిన కార్మికులతోపాటు, పర్యాటకుల సంక్షేమం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఇందుకుగాను హైద్రాబాద్‌లోని సచివాలయంలో 040-23220603, సెల్: 9440854433, అదే విధంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 9866098111నెంబర్లను ఏర్పాటు చేశామన్నారు.
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఉన్న ఇండియన్ మిషన్‌లో కూడా సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవి ఈ నెం:009647704444899,009647704843247లతో పనిచేస్తాయని తెలిపారు. వీటిని సద్వినియోగ పరుచుకోవాలని, తమ బంధువులు, స్నేహితులు ఇరాక్‌లో ఉంటే ఈ నెంబర్లను సంప్రదించి వారి వివరాలు అందించాలన్నారు.
ఇరాక్ కార్మికుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్
Published Wed, Jun 18 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM
Advertisement
Advertisement