m.girija shankar
-
పకడ్బందీగా ‘మన ప్రణాళిక’
మహబూబ్‌నగర్ టౌన్: ‘మనఊరు.. మన ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మరో మూడురోజుల్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ మండల ప్రత్యేకాధికారులను ఆదేశించారు. రోజువారీగా చేపట్టిన వాటినే వెంటనే అప్లోడ్ చేయాలని సూచించినా.. కొందరు నిర్లక్ష్యం వహించడంపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. గురువారం మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1331 గ్రామ పంచాయతీలకు ఇప్పటివరకు కేవలం 400గ్రామాలకు చెందిన డాటా మాత్రమే అప్లోడ్ అయిందన్నారు. ఈ విషయంపై ప్రత్యేకాధికారులు ప్రత్యేకదృష్టి సారించాలని, అవసరమైతే అదనపు కంప్యూటర్లను వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నామని, ఇందుకుగాను ప్రతి మండలంలో 10లక్షల మొక్కలను నాటాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కార్యక్రమానికి ప్రతిఒక్కరూ ప్రాధాన్యమిస్తూ నిర్ధేశించిన లక్ష్యాన్ని సాధించాలన్నారు. రైతులు తమ తమ పొలాల్లో పండ్లమొక్కలతో పాటు ఇతర వాటిని నాటుకునేందుకు ప్రోత్సహించాలని కోరారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రవీందర్, డ్వామా పీడీ హరితతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఇండోర్‌కు కలెక్టర్ గిరిజా శంకర్
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మహిళలు రాజకీయంగా రాణించే విధానంపై నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌నకు కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ బుధవారం మధ్యాహ్నం ఇక్కడినుంచి బయలుదేరి వెళ్లారు. ఈనెల 26నుంచి 28వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో జిల్లాలోని 14మండలాల్లో మహిళలు రాజకీయంగా రాణించే విధానంపై చేపట్టిన కార్యక్రమాల పురోగతిని కలెక్టర్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ రవీందర్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి వెళ్లారు. ఈ మూడు రోజులపాటు ఇన్చార్జి కలెక్టర్ జేసీ ఎల్.శర్మన్ విధులు నిర్వహించనున్నారు. కలెక్టర్ ఈనెల 30న తిరిగి విధుల్లోకి చేరుతారు. -
ఇరాక్ కార్మికుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్
కలెక్టరేట్: ఇరాక్‌లో ప్రస్తుతం జరుగుతోన్న అంతర్యుద్ధం నేపథ్యంలో జిల్లా నుంచి వెళ్లిన కార్మికులతోపాటు, పర్యాటకుల సంక్షేమం కోసం ప్రత్యేక హెల్ప్లైన్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఇందుకుగాను హైద్రాబాద్‌లోని సచివాలయంలో 040-23220603, సెల్: 9440854433, అదే విధంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 9866098111నెంబర్లను ఏర్పాటు చేశామన్నారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఉన్న ఇండియన్ మిషన్‌లో కూడా సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవి ఈ నెం:009647704444899,009647704843247లతో పనిచేస్తాయని తెలిపారు. వీటిని సద్వినియోగ పరుచుకోవాలని, తమ బంధువులు, స్నేహితులు ఇరాక్‌లో ఉంటే ఈ నెంబర్లను సంప్రదించి వారి వివరాలు అందించాలన్నారు. -
ఏపీ సీఎం పేషీకి కలెక్టర్?
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మ రం చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రా ష్ట్ర ఏర్పాటు అ నంతరం సీమాంధ్ర ఉ ద్యోగులను రెండు నెలల్లో బదిలీ చే స్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసేలోగా తానే అనుకున్న స్థానానికి వెళ్లాలనే ఉద్దేశంతో కలెక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల చంద్రబాబునాయుడిని కలిసి ఈ విషయాన్ని విన్నవించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై వారం, పది రోజుల్లో ఓ కొలిక్కి రానుంది. ఈ బదిలీ వ్యవహారాన్ని జిల్లా అధికారులు సైతం ధ్రువీకరిస్తున్నారు. ఇన్చార్జి కలెక్టర్‌గా జేసీ ఎల్.శర్మణ్ జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ సోమ, మంగళవారం వ్యక్తిగత సెలవుపై వెళ్లారు. తిరిగి ఆయన బుధవారం విధుల్లో చేరనున్నారు. ఈ రెండు రోజులు జేసీ ఎల్.శర్మణ్ ఇన్చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తారు. -
పకడ్బందీగా అక్షరాభ్యాసం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పాఠశాలలు ప్రారంభం అవుతున్న సందర్భంగా చేపట్టే అక్షరాభ్యా స కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల ని కలెక్టర్ ఎం.గిరిజాశం కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈనెల 12 నుంచి అన్ని పాఠశాలల్లో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా సూచించారు. మండల విద్యాశా ఖ అధికారులు ప్రతిరోజు మూడు గ్రామా లు సందర్శించి అక్షరాభ్యాసంపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఇంటింటికీ తిరిగి బడి ఈడు పిల్లలందరిని పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేయాలన్నారు. ఇక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదివే అనాథ బాలికలు, ఏ ఆసరా లేని బాలికలకు ఇంటర్మీడియెట్, ఆ పై చదువులను దరఖాస్తు చేసుకొనేలా చూడాలన్నారు. అలాంటి వారికి అయ్యే ఖర్చును పాలమూరు సేవా నిధి నుంచి వినియోగిస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ సేవా నిధి ద్వారా గతేడాది జిల్లాలో 20మందికి పైగా విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు. ఇక కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తూ ఇప్పటి వరకు సంబంధిత ఉపాధ్యాయులకు చార్జీ ఇవ్వని ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్లను సత్వరమే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. విధుల్లో ఆలస్యం వహించే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అధికంగా చేరేందుకు టీటీసీ విద్యార్థులను భాగస్వామ్యం చే యాలని సూచించారు. ఉపాధ్యాయులు లేనిచోట అవసరమైతే సీఆర్పీలను నియమించుకో వాలని అధికారులకు వివరించారు. సమావేశంలో ఏజేసీ రాజారాం, జెడ్పీ సీఈఓ రవీందర్, డీ ఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఈఓ చంద్రమోహన్, రాజీవ్ విద్యామిషన్ సీఈఓ కుసుమ కుమారి, రవీందర్‌లు పాల్గొన్నారు. యుద్దప్రాతిపదికన మిల్లర్లకు తడిసిన ధాన్యం కలెక్టరేట్ : సోమవారం రాత్రి కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన మిల్లర్లకు తరలించాల్సిందిగా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో ధాన్యం తరలింపుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం మార్కెట్లో తడిసిన ధాన్యమే కాకుండా, మిగిలిన దాన్ని సైతం వెంటనే మిల్లర్లకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. మిల్లర్లకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందని, అదే విధంగా మిల్లర్లు ప్రభుత్వాన్నికి సహకరించాల్సిందిగా ఆయన కోరారు. ఇక ధా న్యం రవాణాకు అవసరమైన లారీలను స త్వరమే ఏర్పాటు చేయాల్సిందిగా రవాణా శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఖాళీ గోదాములను గుర్తించి వాటిని విని యోగంలోకి తీసుకోవాలన్నారు. ఇక మిల్లర్లకు రేటు విషయంలో తగిన న్యాయం చే స్తామని చెప్పారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ధాన్యం తరలింపు పక్రియలో జిల్లా యంత్రాంగం కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ ఎల్.శర్మన్, డీఆర్డీఏ పీడీ చం ద్రశేఖర్ రెడ్డి, డీఎస్ఓ సయ్యద్ యాసిన్, ఆర్టీఓ కృష్ణయ్య, మెప్మా పీడి గీతా, మిల్లర్ల సంఘం అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు. -
ఈవీఎం..భద్రత ‘స్ట్రాంగ్’
కలెక్టరేట్, న్యూస్‌లైన్: స్ట్రాంగ్ రూములకు చేరిన ఈవీ ఎంలకు పటిష్టమైన భద్రత కల్పించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.గిరిజాశంకర్ వెల్లడించారు. గురువారం ఆయన ధర్మాపూర్ జేపీఎన్సీ కళాశాలలోని మహబూబ్‌నగర్ పార్లమెంట్, దాని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను కలిశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ.. పోలింగ్‌బూత్‌ల వారీగా ఈవీఎంలలో పోలైనఓట్లను అభ్యర్థుల సమక్షంలో ఫారం 17ఏ, 17సీలను తనిఖీ చేశారు. ప్రిసైడింగ్ అధికారులు సంతకాలతో సమర్పించిన నివేదికలను పార్టీనేతలకు చూపుతూ వారి సమక్షంలోనే పోలైనఓట్లను ధ్రువీకరించారు. ఈ నివేదికలే కౌంటింగ్‌లో ఉంటాయని, ఇందులో ఎలాంటి తేడా ఉండదని స్పష్టంచేశారు. ఏవైనా సమస్యలు ఉంటే తమదృష్టికి తీసుకురావాలని కోరారు. ఈవీఎంలను స్ట్రాంగ్‌రూములకు గ ట్టి భద్రతను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ప్రతి స్ట్రాంగ్ రూంకు సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి ఏరోజుకు ఆ రోజు ఫొటోలను యూట్యూబ్‌లో పొం దుపరుస్తామని పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచిన ఈవీఎంలను అ భ్యర్థులు, వారిపక్షాన ఏజెంట్లు ఎవరైనా ప్రతిరోజు తనిఖీ చేసుకోవచ్చన్నారు. ఇ క్కడ కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నామని, ఎవరైనా ఫోన్‌చేసి అన్నివివరా లు తెలుసుకోవచ్చని వారికి సూచించారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు మహబూబ్‌నగ ర్, జడ్చర్ల, షాద్‌నగర్, కొడంగల్, మక్త ల్, నారాయణపేట, దేవరకద్ర అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్‌రూములను కలెక్టర్‌తోపాటు సాధారణ ఎన్నికల పరిశీలకు లు మోజెస్ చలాయ్, అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులు అబ్రహాం, తివారీ, ఎస్పీ డి. నాగేంద్రకుమార్, ఏజేసీ రాజారాం, డీ ఆర్ఓ రాంకిషన్, అసెంబ్లీ నియోజకవర్గా ల రిటర్నింగ్ అధికారులు హన్మంతరావు, శ్రీనివాస్‌రెడ్డి, హరిత పార్టీ నేతలతో కలిసి తనిఖీచేశారు. స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోలింగ్ యూని ట్లను ఏర్పాటు చేసిన విభాగాలను విడిగా పరిశీలించి అందరి సమక్షంలోనే వాటికి సీలు వేశారు. -
కలెక్టర్ దూకుడుకు హైకోర్టు బ్రేక్
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లా క్లబ్‌ను ఖాళీ చేయించేందుకు దూకుడు పెంచిన జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్‌కు హైకోర్టు బ్రేక్ వేస్తూ, ఖాళీ చేయించొద్దంటూ శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో జిల్లా క్లబ్ వ్యవహారం నిర్వాహకులకు, అధికారుల మధ్య రాజుకునే స్థాయి కి వెళ్లింది. జిల్లా నడిబొడ్డున ప్రభుత్వ కార్యాలయాల పక్కన విలువైన స్థలంలో క్లబ్‌ను ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని ఎప్పుడు కేటాయించారు... అందుకు సంబంధించిన పేపర్లను చూపాలనీ.. లేదంటే వెంటనే ఖాళీ చేస్తే స్వాధీనం చేసుకొని ప్రభుత్వ కార్యాలయ నిర్వహణకు అప్పగిస్తామనిబాధ్యులకు నోటీసులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన మహబూబ్‌నగర్ తహశీల్దార్ యాదగిరి రెడ్డి ఫిబ్రవరి 13న క్లబ్ నిర్వాహకులకు నోటీసులను జారీ చేశారు. వాటిని అందుకొన్న నిర్వాహకులంతా ఉలిక్కిపడ్డారు. క్లబ్ సభ్యుల్లో అధికులు రాజకీయ ముఖ్య నేతలతోపాటు, విఐపీలు ఉండడంతోవారు దీన్ని సవాలుగా తీసుకొని ఖాళీ చేసే ఆలోచనను విరమించుకోవాల్సిందిగా కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో కలెక్టర్ మరో అడుగు ముందుకు వేసి స్థల కేటాయింపుపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిం చారు. దీన్నీ నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తూ తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే క్లబ్ చైర్మన్ నటరాజ్ కలెక్టర్ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించారు. దీనితో ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టి కలెక్టర్ ఉత్తర్వులను అమలు కాకుండా బ్రేకులు వేసింది. దీనిపై తహశీల్దార్ యాదగిరి రెడ్డి వివరణ ఇస్తూ క్లబ్‌కు కేటాయించిన స్థలానికి సంబంధించి ఎలాంటి ఆధారాల్లేని కారణంగానే ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఈ విషయాన్ని కోర్టుకు వివరించి న్యాయస్థానం ద్వారానే ఖాళీ చేయిస్తామని వెల్లడించారు. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
ముచ్చటగా..3
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: ‘పరిషత్’పోరుకు నామినేషన్ల పర్వం సోమవారం ప్రారంభమైంది. నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ స్వయంగా పర్యవేక్షిం చారు. తొలిరోజు అందులో హోలీ పండుగ కావడంతో నామినేషన్ల పర్వంలో కోలాహలం కనిపించలేదు. బుధవారం అధికంగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మొదటిరోజు కాంగ్రెస్ నుం చి 12 మంది నామినేషన్ల వేసి మంచి ఊపుమీద ఉన్నా రు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి ఒక్క నామినేషన్ కూడా వేయలేదు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. నామినేషన్ పూర్తిగా భర్తి చేశారా లేదా, సంతకా లు సరిగా ఉన్నాయనే విషయాన్ని క్షణ్ణంగా పరిశీలించి స్వీకరించాలన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా హోలీ పండుగ కావడంతో నామినేషన్ల రావనుకునా జిల్లా వ్యా ప్తంగా 23 మంది అభ్యర్థులు ఎంపీటీసీలుగా అభ్యర్థులు వేశారు. జెడ్పీటీసీ అభ్యర్థులు ముగ్గురు ఉన్నారు. అం దులో కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రమే వేశా రు. ఇందులో అడ్డాకుల నుంచి బి. కృష్ణయ్య, పెబ్బేర్ నుంచి చిన్నమాసులు, కొల్లాపూర్ నుంచి బండి వెంకట్‌రెడ్డి ఉన్నారు. ఎంపీటీసీలకు 20 మంది అభ్యర్థులు నామినేషన్లు వే శారు. మహబూబ్‌నగర్ డివిజన్లో అడ్డాకులలో 3, మ హబూబ్‌నగర్‌లో 1, వనపర్తి డివిజన్ కొత్తకోటలో 1, ఖి ల్లాఘనపూర్లో 2, పాన్గల్లో 2, వీపనగండ్ల 1, నారాయణపేట్ డివిజన్ కోస్గిలో 1, మక్తల్‌లో 1, నారాయణపేట్‌లో 1, గద్వాలలో అలంపూర్‌లో 1, మానవపాడు లో 2, నాగర్‌కర్నూల్ డివిజన్ అచ్చంపేటలో 1, బిజినేపల్లిలో 2, తాడూర్‌లో 1 చొప్పున నామినేషన్లు దా ఖలయ్యాయి. ఎంపీటీసీ అభ్యర్థుల్లో సీపీఐ నుంచి ఒక రు, కాంగ్రెస్ నుంచి 12, వైఎస్ఆర్ సీపీ నుంచి ఒకరు, టీడీపీ నుంచి ఇద్దరు, నలుగురు స్వతంత్రులు నామినేషన్లు వేశారు. -
దారితప్పి..వలకు చిక్కి
హన్వాడ/నవాబ్‌పేట/మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: వేట కోసం వచ్చి దారితప్పిన ఓ చిరుతపులి వలలో చిక్కింది. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున స్థానిక రైతుల ద్వారా వెలుగుచూసింది. నవాబ్‌పేట మండలం మైసమ్మ అటవీప్రాంతం, హన్వాడ మండలం గుడిమల్కాపూర్ , రంగారెడ్డి జిల్లా సాకలిపల్లి అటవీప్రాంతంలో గతకొద్దిరోజులుగా చిరుత సంచరిస్తోంది. ఇదిలాఉండగా, పరిసర గ్రామాల్లో అడవిపందులు సంచరిస్తూ..వేరుశనగ పంటను నాశనం చేస్తూ రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వాటిబారినుంచి పంటను ఎలాగైనా కాపాడుకోవాలని స్థానిక రైతులు సాకలిపల్లి శివారులో వలను అమర్చారు. అటుగా వచ్చిన చిరుత వలలో చిక్కి కదల్లేనిస్థితిలో ఉండిపోయింది. చిరుత గాండ్రింపులు విని రైతులు భయబ్రాంతులకు గురైయ్యారు. ఈ విషయాన్ని జిల్లా అటవీశాఖ అధికారులకు తెలిపారు. వారు అక్కడికి చేరుకుని పట్టుకునేందుకు విఫలయత్నం చేశా రు. హైదరాబాద్‌లోని జూపార్కుకు చెందిన రెస్క్యూటీంకు సమాచారమందించడంతో వారు రంగంలోకి దిగారు. గ్రామస్తుల సహాయంతో వారు గాయపడిన చిరుతకు మత్తు ఇం జక్షన్ ఇచ్చి బోనులో బంధించి జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. చిరుతకు జూపార్కుకు చెందిన జంతువైద్యులు డాక్టర్ ఎండీ హాకీం వైద్యచికిత్సలు అందించారు. గాయపడిన చిరుతను కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ పరి శీలించారు. వెంటనే దానిని జూకు తరలించేందుకు ఏర్పాట్లు చేయలని అధికారులకు సూచించారు. వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. తమ ప్రాంతాల్లో పులి, చిరుత వంటి జంతువుల సంచరిస్తున్నట్లు తెలిస్తే సమాచారమివ్వాలని సూచించారు. సంఘటనకు బాధ్యుడైన రైతుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎఫ్ఓ నారేందర్రెడ్డి తెలిపారు. కాగ పంటను కాపాడుకునే ప్రయత్నంలో వన్యప్రాణులను చంపేందుకు వేస్తున్న కంచెల వల్ల వాటి ప్రాణాలు కోల్పోతున్నాయన్నారు. అనంతరం చిరుతను ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. -
వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకం
మహబూబ్‌నగర్ కల్చరల్/ విద్యావిభాగం, న్యూస్‌లైన్: స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలో వివేకానంద 151వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించి, మాట్లాడారు. విద్యార్థులందరూ వివేకానందుని సందేశాలను విన్నంత మాత్రాన సరిపోదని వాటిని ఆచరించాలని సూచించారు. విద్యార్థులు ధైర్యంగా ఉండి సంఘసేవ చేయాలన్నారు. భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, వారిని ఉత్తేజితులను చేయడం ద్వారానే జాతి భద్రంగా ఉంటుందని వివేకానందుడు ప్రవచించారని కలెక్టర్ గుర్తు చేశారు. ధైర్యంగా జీవించడం, బలాన్ని గురించి ఆలోచించడమే బలహీనతకు మంద ని, బలమే ప్రాణం-బలహీనతే మరణమనేవి స్వామిజీ సందేశాల్లో ప్రధానమైనవన్నారు. సెలవు రోజుల్లో ఒక గంటపాటు విద్యార్థులను సమీకరించి, వారిచే వివేకానందుడి గురించి మాట్లాడించాలని, తద్వారా వ్యక్తిత్వ వికాసంతో పాటు సామాజిక పరిజ్ఞానం పెంపొందుతుందన్నారు. రామకృష్ణమఠం ప్రతినిధి నియమ చైతన్యనంద మాట్లాడుతూ నిస్వార్థం, ప్రేమ, ధైర్యం, త్యాగం సేవాగుణం అలవర్చుకుంటే గొప్ప వ్యక్తులు అవుతారని అన్నారు. ప్రతి ఒక్కరూ విలువలతో కూడిన విద్యను అభ్యసించి దేశపురోభివృద్ధికి తోడ్పడాలన్నారు. రక్తదాన శిబిరంలో 150మంది విద్యార్థులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ చైర్మన్ మనోహర్‌రెడ్డి, వైస్ చైర్మన్ లయన్ నటరాజ్, జేపీఎన్‌ఈఎస్ చైర్మన్ రవికుమార్, కళాశాల కరస్పాండెంట్ ఫణిప్రసాద్‌రావు, డెరైక్టర్ సయ్యద్ ఇబ్రహీం ఖలీల్, ప్రిన్సిపల్ విఠల్‌రావు, కె.సత్యనారాయణరావు, డాక్టర్ వీరప్ప తదితరులు పాల్గొన్నారు. దేశభక్తిని పెంపొందించారు చిన్నచింతకుంట: ప్రతి భారతీయుడిలో దేశభక్తిని పెంపొందించేందుకు స్వామి వివేకానందుడు ఎంతో కృషి చేశారని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు డాక్టర్ రావుల రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. చిన్నచింతకుంట మండలం నెల్లికొండిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆరెస్సెస్ వక్త అమరలింగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వామిజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. యువత కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చని సూచించారు. వివేకానంద కలలుగన్నా దేశాన్ని స్థాపించాలన్నారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ వివేకానందుడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. గ్రామంలో స్వామిజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషిస్తున్నానని అన్నారు. మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ పేదలకు సేవ చేయడమే స్వామి వివేకానంద సిద్ధాంతమని, అన్ని మతాల సారాంశాన్ని గుర్తించి గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి, టీ.వేణుగోపాల్, సిద్దార్థారెడ్డి, సర్పంచ్ శారద, మార్కెట్ చైర్మన్ అరవింద్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, కుర్వ రమేష్, తదితరులు పాల్గొన్నారు. -
నీకు సాటి లేర య్యా!
పాలెం గ్రామాభివృద్ధి కోసం యా వత్ జీవితాన్ని త్యాగం చేసిన మహనీయు డు సుబ్బయ్య. మా చిన్నతనంలో ఉన్నప్పుడు మా నాన్న బడి, గుడిని రెండు కళ్లలా చూసుకునేవారు. ఎన్నో కష్టాలు ఎదురైనా స్కూల్, కాలేజీలను నడిపించారు. ఆయన కూతురిగా నేనెంతో గర్వపడుతున్నా. ఆయన స్థాపించిన విద్యా సంస్థలను పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు కాపాడుకోవాలి. - డాక్టర్ సుచిత్రాసంజయ్, పాలెం సుబ్బయ్య కూతురు బిజినేపల్లి, న్యూస్‌లైన్: వేంకటేశ్వరుడే జనంతో నడుస్తూ, మాట్లాడుతూ పాలెం అభివృద్ధి కోసం దివంగత సుబ్బయ్య రూపంలో ఈ నేలపై తిరుగాడారని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అన్నారు. విద్యాభివృద్ధితోపాటు గ్రామాభివృద్ధికి ఆయ న ఆనాడే పునాదులు వేశారని కొనియాడారు. 1963 లోనే స్త్రీలకు ఉన్నత చదువులు ఇక్కడ లభించడం గొప్ప విషయమన్నారు. పట్నం చదువులను పల్లెకు తీసుకొచ్చిన ఘనత సుబ్బయ్యకే దక్కిందన్నారు. పాలెం విద్యాసంస్థల 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకలు స్థానిక వెంకటేశ్వర డిగ్రీకళాశాలలో ఆదివారం ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. దశాబ్దాల నాడే పాలెం గ్రామస్తులు అన్ని అభివృద్ధి పనులను అనుభవిం చడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. పాలెం అంటే చ దువు అని.. చదువు అంటే పాలెం అన్న కీ ర్తి నలుదిశలా వ్యాపిం చిందన్నారు. నేటి సమాజంలో తన కు టుంబం కోసం పరితపించే వ్యక్తులు ఉన్నారని, ఎలాంటి అవకాశాల కోసం ఎదురుచూడకుండా విద్యావైద్యం, ఉపాధి, సాంకేతికరంగాల్లో తగిన సౌకర్యాలు కల్పించిన సుబ్బయ్య ఆదర్శప్రాయుడని కొనియాడారు. వ్యవసాయమే జీవనాధారంగా బతికిన ఆ రోజుల్లో విద్యపై దృష్టిసారించిన గొప్పవ్యక్తి అన్నారు. పూర్వవిద్యార్థులు ఆయన ఆలోచనలను కొనసాగించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న పాలెంలో జూనియర్ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వపరంగా స్థలం ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తానన్నారు. పాలెం పారిశ్రామిక వాడలో సోలార్ పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఇక్కడి వాతావరణం ఎంతో అనుకూలంగా ఉందని, పారిశ్రామిక అభివృద్ధి కోసం తనవంతుగా కృషిచేస్తానన్నారు. ఆయన శ్రమ ఫలితంగా లబ్ధిపొందిన ప్రతిపూర్వ విద్యార్థి పాలెం విద్యాసంస్థల అభివృద్ధి కోసం కృషిచేయాలని కోరారు. 50 ఏళ్లుగా విద్యనభ్యసించిన విద్యార్థులను ఒకచోటికి చేర్చడం అభినందనీయమన్నారు. సుబ్బయ్య ఆదర్శప్రాయుడు పాలమూరు యూనివర్సిటీ(పీయూ) రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటాచలం మాట్లాడుతూ.. ఆనాడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఏ కొత్త పథకాలైనా తన ఊరికే కావాలని కోరుకున్న ఆదర్శప్రాయుడు సుబ్బయ్య అని కొనియాడారు. ఆలయాన్ని, విద్యాసంస్థలను తన రెండు కళ్లుగా భావించి మహాశక్తిగా అవతరించిన వ్యక్తిగా అభివర్ణించారు. 1963లో కళాశాల స్థాపన ఆయన సాధించిన చారిత్రాత్మక విజయమని, నిరుపేదల కోసం సంక్షేమ వసతి గృహాలు నిర్మించి ఎందరో పేదవిద్యార్థులకు విద్యాప్రదాతగా నిలిచారని అన్నారు. నాన్న ఆలోచనలకు వాస్తవరూపం చూపాలి సుబ్బయ్య కూతురు డాక్టర్ సుచిత్ర మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు నాన్న ఆశయాల కోసం పాటుపడాలని, ఆయన చేసిన అభివృద్ధి నీరుగారిపోకుండా వాస్తవరూపం చూపాలన్నారు. అభివృద్ధి పనులు రాజకీయాలకు వేదికలు కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. విద్యావైద్య, ఉపాధి రంగాలు మున్ముందు ఇంకా అభివృద్ధి సాధించేందుకు ప్రతిఒక్కరి సహకారం అవసరమన్నారు. పభుత్వం పాలెం కళాశాలలపై ప్రత్యేక దృష్టిసారించి అభివృద్ధి చేసేందుకు కృషిచేయాలని కోరారు. సర్ణోత్సవ వేడుకల సందర్భంగా పూర్వ అధ్యాపకులు, ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుని విద్యార్థులు సంబరాల్లో తేలిపోయారు. వేడుకల్లో జెడ్పీ మాజీచైర్మన్ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, సర్పంచ్ పి.సుమలత, మాజీ ఎమ్మెల్యే మోహన్‌గౌడ్, మొట్టమొదటి ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావు, రంగాచార్యులు, ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, డాక్టర్ రాజేందర్‌సింగ్, కృష్ణగౌడ్, రాఘవేందర్, దయానంద్, తదితరులు పాల్గొన్నారు. సుబ్బయ్య మధుర స్వప్నాలకు ప్రతీక పాలెం చదువుకోవడానికి బడి కరువై జీవితాన్ని వెళ్లదీస్తున్న ఎంతో మంది నిరుపేద విద్యార్థుల కోసం సుబ్బయ్య స్థాపించిన విద్యా సంస్థలు ప్రతీకలుగా నిలిచాయి. ఓ కుగ్రామంలో విద్య, వైద్య, ఉపాధి రంగాలను ఏర్పాటు చేసి స్వార్థరహితంగా ఎవరూ చేయలేని పనులను ఆనాడే చేసి చూపించారు. తిరుమల శ్రీవారి దేవుల సమాన సంచార పవిత్ర ప్రాంతంగా ఆయన పాలెంకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. - డాక్టర్ సి.రంగాచార్య, ప్రాచ్య కళాశాల పూర్వ ప్రధానాచార్యులు నా పూర్వజన్మ అదృష్టం తోటపల్లి సుబ్రమణ్యం స్థాపించిన విద్యా సంస్థలకు మొట్టమొదటి ప్రిన్సిపాల్‌గా పని చేయడం నా పూర్వజన్మ అదృష్టం. 16 ఏళ్లు ఒకేచోట ప్రిన్సిపాల్‌గా పనిచేయడం అంటే శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. విద్యా సంస్థల అభివృద్ధి కోసం రాత్రనక, పగలనక సుబ్బయ్యగారు ఎంతో తపించేవారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో అదనంగా మా చేత క్లాసులు పెట్టించేవారు. కుగ్రామానికి ఇన్ని వసతులు తేవడం ఊహించలేనిది. - కె.నాగేశ్వర్రావు, డిగ్రీ కళాశాల మొట్టమొదటి ప్రిన్సిపాల్ నిరుపేదలను ఇంజనీర్లను చేశారు నాబోటి ఎందరో నిరుపేద విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పించి ఇంజనీర్లుగా చేసేందుకు అక్షర మహాయజ్ఞాన్ని నిర్వర్తించిన మహానుభావుడు. సుబ్బయ్య అంటే ఒక సంక్షేమ రాజ్యంలో ప్రజల అవసరాలను గుర్తించి పరిపాలన అందించిన మార్గ దర్శకుడు. అన్ని వనరులున్నా ప్రభుత్వాలు నిరుపేదలకు అందించలేని విద్యను అందించారు. ఆనాడే సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేసి, పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు. - బుడ్డయ్య, పూర్వ విద్యార్థి, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ పాలెం విద్యాసంస్థల అభివృద్ధికి కృషిచేస్తా నా చిన్ననాడు విద్యనభ్యసించిన పాలెం కళాశాలల అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. పాలెం వేంకటేశ్వరుడే సుబ్బయ్యగారి రూపంలో నిరుపేదలకు విద్యనందించేందుకు ఇన్ని విద్యా సంస్థలు స్థాపించారు. ఆయన స్థాపించిన విద్యాలయాల్లో నా చదువులు కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన చేసిన అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు గ్రామస్తులు పాటుపడాలి. - డాక్టర్ వెంకటాచలం, రిజిస్ట్రార్, పాలమూరు యూనివర్సిటీ పేదల పెన్నిధి పాలెం విద్యా సంస్థలు ఉచిత హాస్టల్ వసతి దొరికి ఇక్కడే డిగ్రీ చదవగలిగాను. ఎందరికో పేదల పెన్నిధిగా పాలెం విద్యా సంస్థలు విద్యాబుద్ధులు చెప్పించాయి. సుబ్బయ్య గారి కృషితోనే విద్యార్థులకు ఉచిత వసతి, భోజనాలు లభించాయి. పట్టుదలతో కృషిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి సుబ్బయ్యగారు. - ఎస్.వినయ్‌కుమార్, ప్రజాశక్తి మాజీ ఎడిటర్ రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారు చదువు అంటే పాలెం అన్నంతగా పేరు సంపాదించిపెట్టారు సుబ్బయ్య గారు. 1963లోనే జిల్లాలో ఎక్కడా లేనివిధంగా కళాశాలలు నిర్మించి, మహాశక్తిగా అవతరించిన మహనీయుడు. సొంత ఊరి అవసరాలను తీర్చని రోజుల్లో... కార్యదక్షత, పట్టుదలతో పాలెం గ్రామాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చిన వ్యక్తి. - వంగా మోహన్‌గౌడ్, పూర్వ విద్యార్థి, మాజీ ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్ -
ఇలా ముగించారు..
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఎట్టకేలకు ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్టును జిల్లా అధికారులు భర్తీచేశారు. ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు వారు నానా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అధికారుల పై రాజకీయ ఒత్తిళ్లు చోటుచేసుకుంటున్న విషయాన్ని ‘సాక్షి’ ప్రధానంగా వెలుగులోకి తెచ్చింది. దీంతో ఆ బాధ్యతను కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ స్వయంగా చేపట్టి రాతపరీక్షలో పాల్గొన్న అభ్యర్థులందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించి జి.చంద్రశేఖర్ అనే అభ్యర్థిని ఖరారు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరో ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీచేయనున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారులు మా త్రం గుట్టుగా ఉంచడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, జేసీ పరి ధిలో ఎంపిక ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా, తనపై రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆ పని నుంచి ఆయన తప్పుకున్నట్లు సమాచారం. అయితే కలెక్టర్ ఆ బాధ్యతను ట్రైనీ కలెక్టర్‌కు అప్పగించగా, ఆయనపై కూడా ఇదే రకమైన ఒత్తిళ్లు ఎదురుకావడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని గమనించిన కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఆల స్యం చేస్తే మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో రెండురోజుల్లోనే ఆ ప్రక్రియను పూర్తిచేశారు. పైరవీలకే పెద్దపీట?! ప్రస్తుతం ఎంపికచేసిన అభ్యర్థి విషయంలో అధికారుల తీరును బట్టి చూస్తే ప్రతిభకు పట్టం కట్టారా? లేక పైరవీలకు కట్టబెట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ముందుగా రాత పరీక్ష కు 38మంది అభ్యర్థులను ఎంపికచేసిన అధికారులు, ఆ తరువాత గుట్టుగా కేవలం ముగ్గురినే ఎంపికచేసినట్లు ప్రకటించారు. కానీ చివరికి ఐదుగురు అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు. అనంతరం ఐదుగురికీ ఇంటర్వ్యూలు నిర్వహించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా రాతపరీక్షలో పాల్గొన్న వారంతా ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం ఉండదు. అధికారులు ఇలా చేశారంటే పైరవీలే కారణమని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతిభకే పట్టం కట్టాం రాత పరీక్షలో పాల్గొన్న ఐదుగురు అభ్యర్థు లు సాధించిన మార్కుల ఆధారంగా అందరికీ కలెక్టరే స్వయంగా ఇంటర్వ్యూలు జరి పారు. అయితే అందరికీ ఇంటర్వ్యూలు ఎందుకు నిర్వహించామంటే రాత పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన వారు, ఇంట ర్వ్యూలో ఎక్కువ తెచ్చుకోవచ్చనే ఉద్దేశంతో నిర్వహించాం. ఆ ప్రకారమే మెరిట్ సాధిం చిన అభ్యర్థిని ఎంపికచేశాం. రాత పరీక్షలో 75శాతం, ఇంటర్వ్యూలో 25 శాతం మార్కులను పరిగణలోకి తీసుకున్నాం. నియామక ఉత్తర్వులను ఒకటిరెండు రోజుల్లో అధికారికంగా జారీచేస్తాం. - విజయరామరాజు, ట్రైనీ కలెక్టర్ -
మానవాళికే ఆదర్శం
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, న్యూస్‌లైన్: బోయవాడిగా తన జీవితాన్ని ఆరంభించి వేటకువెళ్లిన వాల్మీకి మహత్తరమైన రామాయణ గ్రంథాన్ని రాసి మానవాళికే ఆదర్శంగా నిలిచారని జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అన్నారు. ఆయన రచనలు నేడు ప్రపంచానికి ఆదర్శమయ్యాయని కొనియాడారు. రామాయణంలోని ప్రతి వాక్యం సమాజానికి అవసరమన్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం స్థానిక అంబేద్కర్ కళాభవన్‌లో జరిగిన వాల్మీకి జయంత్యుత్సవంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సమాజ శ్రేయస్సును మహర్షి వాల్మీకి రాయణంలో రూపొం దించారని అన్నారు. మంచిపనులు చేసి మంచి జీవితం గడపాలని, జీవనశైలిలో మార్పు వస్తేనే అభివృద్ధి చెందుతారని ఆకాంక్షించారు. అందుకు ప్రతిఒక్కరూ చదువుకుంటేనే ఏదైనా సాధించగలరన్నారు. అందుకు చిన్నారులను బడిలో చేర్పించి విద్యనందించేందుకు తోడ్పాటునందించాలని కోరారు. అత్యధికంగా బోయలు ఉన్న ప్రాంతాల్లో అక్షరాస్యత కోసం పాఠశాలలు, హాస్టళ్లు నెలకొల్పేందుకు కృషిచేస్తానని కలెక్టర్ చెప్పా రు. గ్రామాల్లో మహిళలను ప్రోత్సహిం చి సంఘంలో చేర్పించాలని కోరారు. 2012-13 సంవత్సరానికి మహిళా సంఘాలకు రూ.450 కోట్లు రుణాలను అందిస్తున్నామన్నారు. అదేవిధంగా సంఘాలను ఏర్పాటు చేసుకుంటే ఫెడరేషన్ ద్వారా రుణాలు అందిస్తామన్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు రాజీవ్ యువకిరణాల ద్వారా శిక్షణ, వసతిభోజన వసతి కల్పించి ఉద్యోగఅవకాశాలు కల్పిస్తుందన్నారు. ప్రభుత్వపరంగా వాల్మీకి జయంత్యుత్సవాన్ని జరపడపం ఎంతో ఆనందంగా కలెక్టర్ అన్నారు. జిల్లా కేంద్రంలో వాల్మీకి కమ్యూనిటీ హాలుకు స్థలం గుర్తిస్తే నిర్మాణానికి, విగ్రహం ఏర్పాటు కు కృషిచేస్తానన్నారు. వాల్మీకి ఐక్య సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. వాల్మీకిలు అన్ని రంగా ల్లో రాణించాలన్నారు. అలాగే బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాం డ్ చేశారు. కలెక్టర్ అంతకుముందు వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఆ ర్ఓ రాంకిషన్, ఆర్డీఓ హన్మంత్‌రావు, తహశీల్దార్ యాదగిరిరెడ్డి, బీసీసంక్షేమ శాఖ అధికారి సంధ్య, వాల్మీకి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు, ప్రచా ర కార్యదర్శి శివలింగం తదితరులు పాల్గొన్నారు. -
తలో లెక్క!
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: జిల్లాలోని బడిబయట ఉన్న పిల్లల సంఖ్యపై స్పష్టత కొరవడింది. తలో లెక్క చెప్పడంతో అయోమయ పరిస్థితి నె లకొంది. అటు అంగన్వాడీ కార్యకర్తల సర్వే.. ఇటు ఎం ఈ ఓలు నిర్వహించిన సర్వేకు చాలా వ్యత్యాసం ఉండటంతో అ ధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ తప్పుడు లెక్కల సంగతేమిటని సమావేశంలో కలెక్టర్ ఎం.గిరిజా శంకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే మూడుసార్లు విద్యాశాఖ, ఎం ఈఓలు, ఆర్వీఎం, అంగన్వాడీ అధికారులతో సమావేశం ని ర్వహించారు. అయినప్పటికీ బడిబయటి పిల్లల సంఖ్యలో స్ప ష్టత రాలేదు. ఈనెల 13న జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో ఎంఈఓలు, అంగన్వాడీ అధికారులతో సమావేశమైన కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా కాకిలెక్కలు చూపితే నమ్ముతామనుకున్నారా, స్పష్టత ఇవ్వకపోతే సస్పెండ్చేస్తానని హెచ్చరించారు. ఈనెల 26వ తేదీ లోపు స్పష్టమైన డాటా ఇవ్వాలని ఆదేశించారు. అయినప్పటికీ స్పష్టమైన సమాచారం కొరవడింది. బడిబయటి పిల్లలు లేరట! కొన్ని మండలాల నుంచి ఎంఈఓలు ఇచ్చిన లెక్కలు చూస్తే ఆ శ్చర్యం కలుగుతుంది. 11 నుంచి 14ఏళ్ల మధ్య ఉన్న బడిఈ డు పిల్లలు ఒక్కరు కూడా లేరని కొందరు ఎంఈఓలు లెక్కలు చూపారు. నవాబ్‌పేట, కొందుర్గు మండలాల పరిధిలోని గ్రామాల్లో ఒక్క బాలిక కూడా బడిబయట లేదని ఆ మండలాల ఎంఈఓలు జిల్లా అధికారులకు లెక్కలు పంపారు. అదేవిధంగా జడ్చర్ల మండలంలో ఇద్దరు, బాలనగర్ మండలంలో ఒకరు, కేశంపేట మండలంలో నలుగురు, తలకొండపల్లి మండలంలో నలుగురు, ఆమనగల్లు మండలంలో ఐదుగురు, మాడ్గుల మండలంలో ఆరుగురు మాత్రమే బడిబయట ఉన్నట్లు ఎంఈఓలు విద్యాశాఖ జిల్లా అధికారులకు ఇచ్చిన లెక్కల్లో పేర్కొన్నారు. కాగా, అదే మండలాల నుంచి అంగన్వాడీ సూపర్వైజర్లు ఇచ్చిన బడిబయటి బాలికల సంఖ్య వందల్లో ఉండటం ఆశ్చర్యకరం. అంగన్వాడీ సూపర్వైజర్లు ఇచ్చిన డాటా ప్రకారం నవాబ్‌పేట మండలంలో 350 మంది, కేశంపేటలో 149 మంది, ఆమనగల్లులో 98మంది, తలకొండపల్లిలో 73మంది, మాడ్గులలో 31 మంది, జడ్చర్లలో 258 మంది, బాలానగర్‌లో మండలంలో 245 మంది బడిఈడు గల బాలికలు బడిబయట ఉన్నట్లు గుర్తించారు. ఎంఈఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లు ఒకే మండలంలో, అదే గ్రామాల్లో సర్వే చేశామని చెబుతున్నప్పటికీ మరి వందల్లో తేడా రావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కరు కూడా బడిబయటలేరని, ఐదుగురు మంది లోపు మాత్రమే బడిబయట ఉన్నట్లు లెక్కలు చూపుతున్న ఎంఈఓలు ఎంత చిత్తశుద్ధితో పనిచేశారనే విషయం స్పష్టమవుతోంది. లెక్కలతో అధికారుల కుస్తీ బడిబయటి పిల్లల సంఖ్యలో వ్యత్యాసం చాలా ఉండటంతో అధికారులు లెక్కలు తేల్చే పనిలోపడ్డారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో 20,149 మంది 11 నుంచి 14 ఏళ్ల వయస్సు గల బాలికలు ఉన్నట్లు అంగన్వాడీ సూపర్వైజర్లు జిల్లా అధికారులకు లెక్కలు పంపించారు. అదే విధంగా ఎంఈఓలు ఇచ్చిన డాటాలో జిల్లాలో 3,385 మంది బాలికలు బడిబయట ఉన్నట్లుగా గుర్తించారు. ఇరువురు ఇచ్చిన లెక్కల్లో 17వేల పైగా వ్యత్యాసం ఉండటంతో అధికారులు అంగన్వాడీ సూపర్వైజర్లు, ఎంఈఓలతో మరోసారి సమావేశం నిర్వహించి సంఖ్యలో స్పష్టత ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. కానీ ఏ ఒక్క మండలం నుంచి కూడా ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుంటేనే బడిబయటి పిల్లల సంఖ్యలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ 3 లోగా ఇవ్వాలని ఆదేశించాం.. సెప్టెంబర్ 3వ తేదీలోపు బడిబయటి పిల్లల సంఖ్యపై ఎంఈఓలు, అంగన్వాడీ అధికారులు సమన్వయంతో సర్వే నిర్వహించి స్పష్టమైన సంఖ్య ఇవ్వాలని ఆదేశించాం. ఆదేశాలు అమలుచేయని వారిపై చర్యలు తీసుకుంటాం. - డాక్టర్ వై. చంద్రమోహన్, డీఈఓ