కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఎట్టకేలకు ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్టును జిల్లా అధికారులు భర్తీచేశారు. ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు వారు నానా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అధికారుల పై రాజకీయ ఒత్తిళ్లు చోటుచేసుకుంటున్న విషయాన్ని ‘సాక్షి’ ప్రధానంగా వెలుగులోకి తెచ్చింది. దీంతో ఆ బాధ్యతను కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ స్వయంగా చేపట్టి రాతపరీక్షలో పాల్గొన్న అభ్యర్థులందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించి జి.చంద్రశేఖర్ అనే అభ్యర్థిని ఖరారు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరో ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీచేయనున్నారు.
అయితే ఈ విషయాన్ని అధికారులు మా త్రం గుట్టుగా ఉంచడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, జేసీ పరి ధిలో ఎంపిక ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా, తనపై రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆ పని నుంచి ఆయన తప్పుకున్నట్లు సమాచారం. అయితే కలెక్టర్ ఆ బాధ్యతను ట్రైనీ కలెక్టర్‌కు అప్పగించగా, ఆయనపై కూడా ఇదే రకమైన ఒత్తిళ్లు ఎదురుకావడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని గమనించిన కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఆల స్యం చేస్తే మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో రెండురోజుల్లోనే ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
పైరవీలకే పెద్దపీట?!
ప్రస్తుతం ఎంపికచేసిన అభ్యర్థి విషయంలో అధికారుల తీరును బట్టి చూస్తే ప్రతిభకు పట్టం కట్టారా? లేక పైరవీలకు కట్టబెట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ముందుగా రాత పరీక్ష కు 38మంది అభ్యర్థులను ఎంపికచేసిన అధికారులు, ఆ తరువాత గుట్టుగా కేవలం ముగ్గురినే ఎంపికచేసినట్లు ప్రకటించారు. కానీ చివరికి ఐదుగురు అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు. అనంతరం ఐదుగురికీ ఇంటర్వ్యూలు నిర్వహించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా రాతపరీక్షలో పాల్గొన్న వారంతా ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం ఉండదు. అధికారులు ఇలా చేశారంటే పైరవీలే కారణమని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రతిభకే పట్టం కట్టాం
రాత పరీక్షలో పాల్గొన్న ఐదుగురు అభ్యర్థు లు సాధించిన మార్కుల ఆధారంగా అందరికీ కలెక్టరే స్వయంగా ఇంటర్వ్యూలు జరి పారు. అయితే అందరికీ ఇంటర్వ్యూలు ఎందుకు నిర్వహించామంటే రాత పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన వారు, ఇంట ర్వ్యూలో ఎక్కువ తెచ్చుకోవచ్చనే ఉద్దేశంతో నిర్వహించాం. ఆ ప్రకారమే మెరిట్ సాధిం చిన అభ్యర్థిని ఎంపికచేశాం. రాత పరీక్షలో 75శాతం, ఇంటర్వ్యూలో 25 శాతం మార్కులను పరిగణలోకి తీసుకున్నాం. నియామక ఉత్తర్వులను ఒకటిరెండు రోజుల్లో అధికారికంగా జారీచేస్తాం.
- విజయరామరాజు, ట్రైనీ కలెక్టర్
ఇలా ముగించారు..
Published Fri, Nov 15 2013 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
Advertisement
Advertisement