కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల తొలి ఘట్టం నేటి నుంచి షురూ కానుంది. సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నామినేషన్లు స్వీకరించేందుకు అన్ని సిద్ధంచేశారు. నియోజకవర్గాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. పోలీస్‌బందోబస్తు ఏర్పాటుచేశారు. కార్పొరేషన్లలో ఈ నెల 10 నుంచి 13వరకు, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో 14వతేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అభ్యర్థులు సైతం మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్‌లో- 17 కౌంటర్లు
17 మంది ఆర్‌వోలు, 17 ఏఆర్‌వోలు ఉంటారు. నగరపాలకసంస్థ కార్యాలయంలో 17కౌంటర్లు ఏర్పాటు చే శారు. ఒక్కో కౌంటర్‌కు ఆర్‌వో, ఏఆర్‌వోలుంటారు. మూడు వార్డుల చొప్పున నామినేషన్లు స్వీకరిస్తారు.
రామగుండం కార్పొరేషన్లలో- 17 కౌంటర్లు
17 మంది ఆర్‌వోలు, 17 ఏఆర్‌వోలు ఉంటారు. నగరపాలకసంస్థ కార్యాలయంలో 17 కౌంటర్లు ఏర్పాటు చే శారు. ఒక్కో కౌంటర్‌కు ఆర్‌వో, ఏఆర్‌వో ఉంటారు. మూడు వార్డుల చొప్పున నామినేషన్లు స్వీకరిస్తారు.
జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లో ఒక్కో కౌంటర్ ఏర్పాటు చేయగా.. మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్‌తోపాటు రిటర్నింగ్ ఆఫీసర్లు నామినేషన్లు స్వీకరిస్తారు.
జమ్మికుంట, వేములవాడ, పెద్దపెల్లి, హుస్నాబాద్, హుజూరాబాద్ నగరపంచాయతీల్లో ఒక్కో కౌంటర్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు నామినేషన్లు స్వీకరిస్తారు.
నేడే నామినేషన్లు
Published Mon, Mar 10 2014 4:10 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement
Advertisement