కళకళలాడిన కలెక్టరేట్
మచిలీపట్నం (చిలకలపూడి) : చాలా రోజుల తర్వాత మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయం కళకళలాడింది. ఇప్పటి వరకు పుష్కరాలు, స్మార్ట్ పల్స్ సర్వే విధులతో అధికారులు బిజీబిజీగా ఉన్నారు. దీంతో రెండు నెలలుగా అధికారులు కలెక్టరేట్వైపు రాలేదు. కృష్ణా పుష్కరాల ముగిసిన తర్వాత తొలి సోమవారం నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమానికి అధికారులు పూర్తిస్థాయిలో హాజరయ్యారు. తమ సమస్యలు తెలియజేసేందుకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో కలెక్టరేట్లో సందడి వాతావరణం నెలకొంది.