సిబ్బంది వివరాలు తెలియజేయండి
సిబ్బంది వివరాలు తెలియజేయండి
Published Mon, Aug 8 2016 7:05 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
మచిలీపట్నం (చిలకలపూడి) : కృష్ణా పుష్కరాల విధుల కోసం ఆయా శాఖల అధికారులు, సిబ్బంది వివరాలు తక్షణమే తెలియపరచాలని జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వోతోపాటు బందరు ఆర్డీవో పి.సాయిబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విధులు కేటాయించిన సిబ్బంది వివరాలు తనకు పంపాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్‌వీవీ సత్యనారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజరు వెంకటేశ్వరరెడ్డి, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజరు కె.వరకుమార్, డీఆర్డీఏ ఏపీడీ డి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
అర్జీలు ఇవే :
– గుడ్లవల్లేరు మండలం కూరాడ గ్రామానికి చెందిన గోవాడ మార్తమ్మ తన తల్లికి చెందిన ఇంటి స్థలాన్ని కొంత మంది ఆక్రమించుకున్నారని, ఆక్రమణలు తొలగించి భూమిని తమకు అప్పగించాలని కోరుతూ అర్జీ ఇచ్చారు.
– పమిడిముక్కల మండలం మర్రివాడ గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ శ్రీరామమూర్తి గ్రామంలోని తన ఇంటి స్థలం సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలని అర్జీ ఇచ్చారు.
– చాట్రాయి మండలం ఆరుగొలనుపే గ్రామానికి చెందిన ఈ శ్రీనివాసరావు గ్రామంలోని పేద రైతులకు ఇచ్చిన పట్టా భూములపై సమగ్రమైన విచారణ జరిపి అర్హులైన వారికి న్యాయం చేయాలని కోరుతూ అర్జీ ఇచ్చారు.
Advertisement
Advertisement