dro rangaiah
-
ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోండి
మచిలీపట్నం(చిలకలపూడి): దళితులు ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకుని ఆర్థిక అభివృద్ధి చెందాలని డీఆర్వో సీహెచ్ రంగయ్య సూచించారు. అంబేడ్కర్‌భవన్‌లో దళిత బహుజన పరిరక్షణ సంఘ మహాసభలు బుధవారం ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథి డీఆర్వో మాట్లాడుతూ రాజ్యాంగం లో దళితులకు పొందుపరచిన హక్కులు, చట్టాలు వివరించారు. ఎస్సీ కార్పోరేషన్ ఈడీ ఎన్వీవీ సత్యనారాయణ మాట్లాడుతూ నిరుద్యోగ ఎస్సీ యువతకు నైపుణ్యంలో శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. రిటైర్డ్ ఎస్పీ వి.ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ సమాజంలో దళితులు ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఖైతేపల్లి దాసు పాల్గొన్నారు. డీఆర్వో రంగయ్య, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ సత్యనారాయణ, రిటైర్డ్ ఎస్పీ ప్రేమ్‌కుమార్‌ను సత్కరించారు. సంఘ రాష్ట్ర కన్వీనర్ అన్నవరపు నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు ఎగ్గోని గాంధీ పాల్గొన్నారు. -
సిబ్బంది వివరాలు తెలియజేయండి
మచిలీపట్నం (చిలకలపూడి) : కృష్ణా పుష్కరాల విధుల కోసం ఆయా శాఖల అధికారులు, సిబ్బంది వివరాలు తక్షణమే తెలియపరచాలని జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వోతోపాటు బందరు ఆర్డీవో పి.సాయిబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విధులు కేటాయించిన సిబ్బంది వివరాలు తనకు పంపాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్వీవీ సత్యనారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజరు వెంకటేశ్వరరెడ్డి, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజరు కె.వరకుమార్, డీఆర్డీఏ ఏపీడీ డి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అర్జీలు ఇవే : – గుడ్లవల్లేరు మండలం కూరాడ గ్రామానికి చెందిన గోవాడ మార్తమ్మ తన తల్లికి చెందిన ఇంటి స్థలాన్ని కొంత మంది ఆక్రమించుకున్నారని, ఆక్రమణలు తొలగించి భూమిని తమకు అప్పగించాలని కోరుతూ అర్జీ ఇచ్చారు. – పమిడిముక్కల మండలం మర్రివాడ గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ శ్రీరామమూర్తి గ్రామంలోని తన ఇంటి స్థలం సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలని అర్జీ ఇచ్చారు. – చాట్రాయి మండలం ఆరుగొలనుపే గ్రామానికి చెందిన ఈ శ్రీనివాసరావు గ్రామంలోని పేద రైతులకు ఇచ్చిన పట్టా భూములపై సమగ్రమైన విచారణ జరిపి అర్హులైన వారికి న్యాయం చేయాలని కోరుతూ అర్జీ ఇచ్చారు. -
ప్రజాసాధికార సర్వేను వేగవంతం చేయండి
మచిలీపట్నం (చిలకలపూడి) : జిల్లాలో ప్రజాసాధికార సర్వేను వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఆర్వోతో పాటు బందరు ఆర్డీవో పి. సాయిబాబు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం డీఆర్వో మాట్లాడుతూ ప్రజాసాధికార సర్వే నత్తనడకన సాగుతోందని, దీనిపై పూర్తిగా దృష్టి పెట్టకపోతే సంబంధిత అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఆయా మండలాల ప్రత్యేక అధికారులు సర్వేను వేగవంతం చేసి పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సీపీవో కేవీకే రత్నబాబు, హౌసింగ్ పీడీ వీ శరత్‌బాబు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ పీఎస్ఏ ప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్వీవీ సత్యనారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరెడ్డి, డీఆర్డీఏ ఏపీడీ జీ జ్యోతి, వ్యవసాయ శాఖ జేడీ నరసింహారావు, వికలాంగుల సంక్షేమ శాఖ ఎడీ ఏవీడీ నారాయణరావు పాల్గొన్నారు. ––– అర్జీలు ఇవే.. : – యనమలకుదురు నుంచి పులిగడ్డ వరకు నిర్మించిన కృష్ణానది కరకట్ట రహదారిలో కాసరనేనివారిపాలెం నుంచి చోరగుడి వరకు ఇసుక లోడు కోసం వచ్చిన లారీలు అడ్డదిడ్డంగా నిలిపివేస్తున్నారు. నిత్యం ఈ రహదారిపై వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చల్లపల్లి మండలం మేకావారిపాలెం గ్రామానికి చెందిన యార్లగడ్డ శ్రీనివాసరావు అర్జీ ఇచ్చారు. – నివాస ప్రాంతంలో ఉన్న వాటర్ ఆర్వో ప్లాంట్ కారణంగా తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామ పంచాయతీ 3వ వార్డుకు చెందిన ప్రజలు అర్జీ ఇచ్చారు. ఆర్వో ప్లాంట్‌ను నివాస ప్రాంతాల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. – మచిలీపట్నంలోని నాగులేరు ఘాట్‌ను ప్రభుత్వం గుర్తించకపోవటంతో పట్టణం, పరిసర ప్రాంత ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని అధికారులు స్పందించి పుష్కర ఘాట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కానుకొలను ఫణికిరణ్ అర్జీ ఇచ్చారు. – మచిలీపట్నం –విజయవాడ రహదారిలో ఎక్కువ చోట్ల గోతులు పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ద్విచక్ర వాహనాలు గోతులలో పడి చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారని, శాశ్వత మరమ్మతులు చేపట్టాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు.