ప్రజాసాధికార సర్వేను వేగవంతం చేయండి | pulse survey speedup | Sakshi
Sakshi News home page

ప్రజాసాధికార సర్వేను వేగవంతం చేయండి

Published Mon, Jul 25 2016 10:17 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

pulse survey speedup

మచిలీపట్నం (చిలకలపూడి) : జిల్లాలో ప్రజాసాధికార సర్వేను వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు.  డీఆర్వోతో పాటు బందరు ఆర్డీవో పి. సాయిబాబు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం డీఆర్వో మాట్లాడుతూ ప్రజాసాధికార సర్వే నత్తనడకన సాగుతోందని, దీనిపై పూర్తిగా దృష్టి పెట్టకపోతే సంబంధిత అధికారులపై కలెక్టర్‌ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.  ఆయా మండలాల ప్రత్యేక అధికారులు సర్వేను వేగవంతం చేసి పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సీపీవో కేవీకే రత్నబాబు, హౌసింగ్‌ పీడీ వీ శరత్‌బాబు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ పీఎస్‌ఏ ప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎన్‌వీవీ సత్యనారాయణ, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ వెంకటేశ్వరరెడ్డి, డీఆర్‌డీఏ ఏపీడీ జీ జ్యోతి, వ్యవసాయ శాఖ జేడీ నరసింహారావు, వికలాంగుల సంక్షేమ శాఖ 
ఎడీ ఏవీడీ నారాయణరావు పాల్గొన్నారు. 
–––
అర్జీలు ఇవే.. :
– యనమలకుదురు నుంచి పులిగడ్డ వరకు నిర్మించిన కృష్ణానది కరకట్ట రహదారిలో కాసరనేనివారిపాలెం నుంచి చోరగుడి వరకు ఇసుక లోడు కోసం వచ్చిన లారీలు అడ్డదిడ్డంగా నిలిపివేస్తున్నారు. నిత్యం ఈ రహదారిపై వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చల్లపల్లి మండలం మేకావారిపాలెం గ్రామానికి చెందిన యార్లగడ్డ శ్రీనివాసరావు అర్జీ ఇచ్చారు. 
 
– నివాస ప్రాంతంలో ఉన్న వాటర్‌ ఆర్వో ప్లాంట్‌ కారణంగా తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామ పంచాయతీ 3వ వార్డుకు చెందిన ప్రజలు అర్జీ ఇచ్చారు.  ఆర్వో ప్లాంట్‌ను నివాస ప్రాంతాల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 
– మచిలీపట్నంలోని నాగులేరు ఘాట్‌ను ప్రభుత్వం గుర్తించకపోవటంతో పట్టణం, పరిసర ప్రాంత ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని అధికారులు స్పందించి  పుష్కర ఘాట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కానుకొలను ఫణికిరణ్‌ అర్జీ ఇచ్చారు. 
– మచిలీపట్నం –విజయవాడ రహదారిలో ఎక్కువ చోట్ల  గోతులు పడటంతో  ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  ద్విచక్ర వాహనాలు గోతులలో పడి  చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారని, శాశ్వత మరమ్మతులు చేపట్టాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్‌ అర్జీ ఇచ్చారు.
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement