పాలెం గ్రామాభివృద్ధి కోసం యా వత్ జీవితాన్ని త్యాగం చేసిన మహనీయు డు సుబ్బయ్య. మా చిన్నతనంలో ఉన్నప్పుడు మా నాన్న బడి, గుడిని రెండు కళ్లలా చూసుకునేవారు. ఎన్నో కష్టాలు ఎదురైనా స్కూల్, కాలేజీలను నడిపించారు. ఆయన కూతురిగా నేనెంతో గర్వపడుతున్నా. ఆయన స్థాపించిన విద్యా సంస్థలను పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు కాపాడుకోవాలి.
- డాక్టర్ సుచిత్రాసంజయ్, పాలెం సుబ్బయ్య కూతురు
బిజినేపల్లి, న్యూస్‌లైన్: వేంకటేశ్వరుడే జనంతో నడుస్తూ, మాట్లాడుతూ పాలెం అభివృద్ధి కోసం దివంగత సుబ్బయ్య రూపంలో ఈ నేలపై తిరుగాడారని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అన్నారు. విద్యాభివృద్ధితోపాటు గ్రామాభివృద్ధికి ఆయ న ఆనాడే పునాదులు వేశారని కొనియాడారు. 1963 లోనే స్త్రీలకు ఉన్నత చదువులు ఇక్కడ లభించడం గొప్ప విషయమన్నారు. పట్నం చదువులను పల్లెకు తీసుకొచ్చిన ఘనత సుబ్బయ్యకే దక్కిందన్నారు.
పాలెం విద్యాసంస్థల 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకలు స్థానిక వెంకటేశ్వర డిగ్రీకళాశాలలో ఆదివారం ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. దశాబ్దాల నాడే పాలెం గ్రామస్తులు అన్ని అభివృద్ధి పనులను అనుభవిం చడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. పాలెం అంటే చ దువు అని.. చదువు అంటే పాలెం అన్న కీ ర్తి నలుదిశలా వ్యాపిం చిందన్నారు.
నేటి సమాజంలో తన కు టుంబం కోసం పరితపించే వ్యక్తులు ఉన్నారని, ఎలాంటి అవకాశాల కోసం ఎదురుచూడకుండా విద్యావైద్యం, ఉపాధి, సాంకేతికరంగాల్లో తగిన సౌకర్యాలు కల్పించిన సుబ్బయ్య ఆదర్శప్రాయుడని కొనియాడారు. వ్యవసాయమే జీవనాధారంగా బతికిన ఆ రోజుల్లో విద్యపై దృష్టిసారించిన గొప్పవ్యక్తి అన్నారు. పూర్వవిద్యార్థులు ఆయన ఆలోచనలను కొనసాగించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
అభివృద్ధి చెందుతున్న పాలెంలో జూనియర్ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వపరంగా స్థలం ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తానన్నారు. పాలెం పారిశ్రామిక వాడలో సోలార్ పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఇక్కడి వాతావరణం ఎంతో అనుకూలంగా ఉందని, పారిశ్రామిక అభివృద్ధి కోసం తనవంతుగా కృషిచేస్తానన్నారు. ఆయన శ్రమ ఫలితంగా లబ్ధిపొందిన ప్రతిపూర్వ విద్యార్థి పాలెం విద్యాసంస్థల అభివృద్ధి కోసం కృషిచేయాలని కోరారు. 50 ఏళ్లుగా విద్యనభ్యసించిన విద్యార్థులను ఒకచోటికి చేర్చడం అభినందనీయమన్నారు.
సుబ్బయ్య ఆదర్శప్రాయుడు
పాలమూరు యూనివర్సిటీ(పీయూ) రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటాచలం మాట్లాడుతూ.. ఆనాడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఏ కొత్త పథకాలైనా తన ఊరికే కావాలని కోరుకున్న ఆదర్శప్రాయుడు సుబ్బయ్య అని కొనియాడారు. ఆలయాన్ని, విద్యాసంస్థలను తన రెండు కళ్లుగా భావించి మహాశక్తిగా అవతరించిన వ్యక్తిగా అభివర్ణించారు. 1963లో కళాశాల స్థాపన ఆయన సాధించిన చారిత్రాత్మక విజయమని, నిరుపేదల కోసం సంక్షేమ వసతి గృహాలు నిర్మించి ఎందరో పేదవిద్యార్థులకు విద్యాప్రదాతగా నిలిచారని అన్నారు.
నాన్న ఆలోచనలకు వాస్తవరూపం చూపాలి
సుబ్బయ్య కూతురు డాక్టర్ సుచిత్ర మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు నాన్న ఆశయాల కోసం పాటుపడాలని, ఆయన చేసిన అభివృద్ధి నీరుగారిపోకుండా వాస్తవరూపం చూపాలన్నారు. అభివృద్ధి పనులు రాజకీయాలకు వేదికలు కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. విద్యావైద్య, ఉపాధి రంగాలు మున్ముందు ఇంకా అభివృద్ధి సాధించేందుకు ప్రతిఒక్కరి సహకారం అవసరమన్నారు.
పభుత్వం పాలెం కళాశాలలపై ప్రత్యేక దృష్టిసారించి అభివృద్ధి చేసేందుకు కృషిచేయాలని కోరారు. సర్ణోత్సవ వేడుకల సందర్భంగా పూర్వ అధ్యాపకులు, ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుని విద్యార్థులు సంబరాల్లో తేలిపోయారు. వేడుకల్లో జెడ్పీ మాజీచైర్మన్ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, సర్పంచ్ పి.సుమలత, మాజీ ఎమ్మెల్యే మోహన్‌గౌడ్, మొట్టమొదటి ప్రిన్సిపాల్ నాగేశ్వర్‌రావు, రంగాచార్యులు, ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, డాక్టర్ రాజేందర్‌సింగ్, కృష్ణగౌడ్, రాఘవేందర్, దయానంద్, తదితరులు పాల్గొన్నారు.
సుబ్బయ్య మధుర స్వప్నాలకు ప్రతీక పాలెం
చదువుకోవడానికి బడి కరువై జీవితాన్ని వెళ్లదీస్తున్న ఎంతో మంది నిరుపేద విద్యార్థుల కోసం సుబ్బయ్య స్థాపించిన విద్యా సంస్థలు ప్రతీకలుగా నిలిచాయి. ఓ కుగ్రామంలో విద్య, వైద్య, ఉపాధి రంగాలను ఏర్పాటు చేసి స్వార్థరహితంగా ఎవరూ చేయలేని పనులను ఆనాడే చేసి చూపించారు. తిరుమల శ్రీవారి దేవుల సమాన సంచార పవిత్ర ప్రాంతంగా ఆయన పాలెంకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు.
- డాక్టర్ సి.రంగాచార్య, ప్రాచ్య కళాశాల పూర్వ ప్రధానాచార్యులు
నా పూర్వజన్మ అదృష్టం
తోటపల్లి సుబ్రమణ్యం స్థాపించిన విద్యా సంస్థలకు మొట్టమొదటి ప్రిన్సిపాల్‌గా పని చేయడం నా పూర్వజన్మ అదృష్టం. 16 ఏళ్లు ఒకేచోట ప్రిన్సిపాల్‌గా పనిచేయడం అంటే శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. విద్యా సంస్థల అభివృద్ధి కోసం రాత్రనక, పగలనక సుబ్బయ్యగారు ఎంతో తపించేవారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో అదనంగా మా చేత క్లాసులు పెట్టించేవారు. కుగ్రామానికి ఇన్ని వసతులు తేవడం ఊహించలేనిది.
- కె.నాగేశ్వర్‌రావు, డిగ్రీ కళాశాల మొట్టమొదటి ప్రిన్సిపాల్
నిరుపేదలను ఇంజనీర్లను చేశారు
నాబోటి ఎందరో నిరుపేద విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పించి ఇంజనీర్లుగా చేసేందుకు అక్షర మహాయజ్ఞాన్ని నిర్వర్తించిన మహానుభావుడు. సుబ్బయ్య అంటే ఒక సంక్షేమ రాజ్యంలో ప్రజల అవసరాలను గుర్తించి పరిపాలన అందించిన మార్గ దర్శకుడు. అన్ని వనరులున్నా ప్రభుత్వాలు నిరుపేదలకు అందించలేని విద్యను అందించారు. ఆనాడే సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేసి, పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు.
- బుడ్డయ్య, పూర్వ విద్యార్థి, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్
పాలెం విద్యాసంస్థల అభివృద్ధికి కృషిచేస్తా
నా చిన్ననాడు విద్యనభ్యసించిన పాలెం కళాశాలల అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. పాలెం వేంకటేశ్వరుడే సుబ్బయ్యగారి రూపంలో నిరుపేదలకు విద్యనందించేందుకు ఇన్ని విద్యా సంస్థలు స్థాపించారు. ఆయన స్థాపించిన విద్యాలయాల్లో నా చదువులు కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన చేసిన అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు గ్రామస్తులు పాటుపడాలి.
- డాక్టర్ వెంకటాచలం, రిజిస్ట్రార్, పాలమూరు యూనివర్సిటీ
పేదల పెన్నిధి పాలెం విద్యా సంస్థలు
ఉచిత హాస్టల్ వసతి దొరికి ఇక్కడే డిగ్రీ చదవగలిగాను. ఎందరికో పేదల పెన్నిధిగా పాలెం విద్యా సంస్థలు విద్యాబుద్ధులు చెప్పించాయి. సుబ్బయ్య గారి కృషితోనే విద్యార్థులకు ఉచిత వసతి, భోజనాలు లభించాయి. పట్టుదలతో కృషిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి సుబ్బయ్యగారు.
- ఎస్.వినయ్‌కుమార్, ప్రజాశక్తి మాజీ ఎడిటర్
రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారు
చదువు అంటే పాలెం అన్నంతగా పేరు సంపాదించిపెట్టారు సుబ్బయ్య గారు. 1963లోనే జిల్లాలో ఎక్కడా లేనివిధంగా కళాశాలలు నిర్మించి, మహాశక్తిగా అవతరించిన మహనీయుడు. సొంత ఊరి అవసరాలను తీర్చని రోజుల్లో... కార్యదక్షత, పట్టుదలతో పాలెం గ్రామాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చిన వ్యక్తి.
- వంగా మోహన్‌గౌడ్, పూర్వ విద్యార్థి,
మాజీ ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్
నీకు సాటి లేర య్యా!
Published Mon, Dec 30 2013 3:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM
Advertisement