ఏపీ సీఎం పేషీకి కలెక్టర్?
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మ రం చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రా ష్ట్ర ఏర్పాటు అ నంతరం సీమాంధ్ర ఉ ద్యోగులను రెండు నెలల్లో బదిలీ చే స్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసేలోగా తానే అనుకున్న స్థానానికి వెళ్లాలనే ఉద్దేశంతో కలెక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల చంద్రబాబునాయుడిని కలిసి ఈ విషయాన్ని విన్నవించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై వారం, పది రోజుల్లో ఓ కొలిక్కి రానుంది. ఈ బదిలీ వ్యవహారాన్ని జిల్లా అధికారులు సైతం ధ్రువీకరిస్తున్నారు.
ఇన్చార్జి కలెక్టర్‌గా జేసీ ఎల్.శర్మణ్
జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ సోమ, మంగళవారం వ్యక్తిగత సెలవుపై వెళ్లారు. తిరిగి ఆయన బుధవారం విధుల్లో చేరనున్నారు. ఈ రెండు రోజులు జేసీ ఎల్.శర్మణ్ ఇన్చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తారు.