governemnt
-
పాజిటివ్ న్యూస్: 50 దాటిన రికవరీ శాతం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసలు సంఖ్య పెరుగుతోంది. కేసుల పెరుగుదలతో పాటు వైరస్ సోకి చికిత్స అనంతరం ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యేవారి శాతం కూడా పెరుగుతోంది. తాజాగా ఆదివారం కరోనా వైరస్ రికవరీ రేటు 50 శాతం దాటిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 11,929 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 50.60 శాతం మంది కోలుకున్నారని పేర్కొంది. దీంతో దేశంలో వైరస్ సోకిన వారిలో సగం కంటే ఎక్కువ మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది. (సంప్రదింపులతో సరిహద్దు సమస్యకు పరిష్కారం) గత రెండు రోజులుగా.. రోజుకు 11 వేల చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ రికవరీ రేటు కూడా అదే స్థాయిలో రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,49,348 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1,62,378 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక 9,195 మంది కరోనా వైరస్ బారినపడి మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. (‘కరోనా దేవి’కి కేరళలో నిత్య పూజలు) ఇక శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం హోం మంత్రి అమిత్ షా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను బలోపేతం చేస్తామని తెలిపారు. ఢిల్లీలో కరోనా నిర్ధారణ పరీక్షలు అధిక సంఖ్యలో పెంచుతామని పేర్కొన్న విషయం తెలిసిందే. అదే విధంగా ఆరోగ్య మౌలిక సదుపాయలను కల్పిస్తామని, ఆస్పత్రుల్లో బెడ్ల కొరతను నివారించాడానికి 500 రైల్వే కోచ్‌లను కరోనా బాధితులకు కేటాయిస్తామన్న విషయం తెలిసిందే. (‘ప్రేమ పేరుతో రూ.16 లక్షలు మోసం’) -
ఏమి సేతుర లింగా..!
రోజుకో నిర్ణయం.. పూటకో ప్రకటనతో డీఎస్సీ అభ్యర్థులను ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినా ప్రక్రియ పూర్తయే వరకూ నమ్మకం కుదరక అభ్యర్థులు తీవ్ర మనోవేదనలో ఉన్నారు. ఎందుకంటే ఇందుకు సంబంధించిన పరిణామాలు రోజుకో విధంగా మారుతుండడమే. నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి జిల్లాలో 520 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ లెక్కలు తూచ్ అంటూ 319 పోస్టులకు కుదించింది. అంతేకాకుండా జిల్లాలో విద్యాశాఖ తాజాగా చేపట్టిన టీచర్లు, విద్యార్థుల నిష్పత్తి నివేదికల తయారీ ప్రక్రియ అభ్యర్థులను అయోమయంలోకి నెట్టేస్తోంది. విజయనగరం అర్బన్: ఎట్టకేలకు డీఎస్సీ నోటిఫికేషన్‌ను నవంబర్ 20వ తేదీన ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో 319 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి తొలుత 25 వేల మందికి పైగా అభ్యర్థులు ఆన్లైన్ చేసుకోగా చివరి తేదీ నాటికి 23 వేలమంది అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియలో మిగిలారు. వీరంతా కొన్ని నెలలుగా డీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యే పనిలో భాగంగా కోచింగ్ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదే సమయంలో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి పేరుతో ప్రభుత్వం కొత్త ఉపాధ్యాయ నియామకాలకు మంగళం పాడే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. దీంతో డీఎస్సీ అభ్యర్థులు గుటకలు మింగలేకపోతున్నారు. రాష్ట్రంలో విద్యార్థుల నిష్పత్తిని మించి టీచర్ల సంఖ్య ఎక్కువ ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సిసోడియా ఆదేశాల మేరకు జిల్లాస్థాయిలో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి తాజా నివేదికను విద్యాశాఖ ఆగమేఘాలపై తయారు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఎంఈఓలు ఇప్పటికే పాఠశాలల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య వివరాలను సేకరిస్తున్నారు. టీచర్ల రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ), బదిలీల ప్రక్రియతో కొత్త ఉపాధ్యాయ నియామకాల్లో కోత పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఈ చర్యల ద్వారా అర్థమవుతోంది. గత ఏడాది అక్టోబర్ నాటికి చూపిన యూ-డైస్ నివేదిక ఆధారంగా జిల్లాలో 319 పోస్టుల వరకు ఖాళీలను భర్తీ చేయొచ్చని ఆ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే తాజాగా విద్యార్థి ఆధార్ నంబర్ అనుసంధానం చేసిన తరువాత డబుల్ ఎంట్రీలను తీసివేసిన నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి భారీగా తగ్గిపోయే పరిస్థితి ఉందని ఉపాధ్యాయవర్గాలే చెబుతున్నాయి. నోటిఫికేషన్‌లోని అన్ని పోస్టులూ అవసరం కాకపోవచ్చని విద్యాశాఖ భావిస్తోంది. నోటిఫికేషన్ రద్దుచేయలేని పరిస్థితి ఉంది కాబట్టి డీఎస్సీ ప్రక్రియ మరింత జాప్యం జరిగే అవకాశమున్నట్లు అధికారికవర్గాలు పేర్కొంటున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. 9 నుంచి 10 తరగతి వరకు 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. దీనిని ఆధారంగా చేసుకుని ప్రస్తుతమున్న టీచర్లనే సర్దుబాబు చేస్తే సరిపోతుందని అధికారులు ప్రభుతానికి సూచించినట్లు సమా చారం. జిల్లాలో 2,931 పాఠశాలలుండగా 10 వేలమంది ఉపాధ్యాయులున్నారు. ఈ పాఠశాలల్లో 3,41,120 మంది విద్యార్థులున్నారు. ఈ లెక్కన 34 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిబంధనల మేరకు ఈ నిష్పత్తి సరిపోతుంది. మరోవైపు వయోపరిమితి పెంచడం వల్ల మరో రెండేళ్ల వరకు ఖాళీలు ఏర్పడే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకముందే గణాంకాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని, తీరా నోటిఫికేషన్ విడుదల చేశాక రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టడం అన్యాయమని అభ్యర్థులు వాపోతున్నారు. ఆది నుంచీ గందరగోళమే డీఎస్సీ నిర్వహణలో ప్రభుత్వం ఆది నుంచీ అభ్యర్థులను గందరగోళానికి గురి చేస్తూనే ఉంది. ఐదుసార్లు ఊరించి చివరికి నోటిఫికేషన్ జారీచేసింది. అయితే అందులో కూడా ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీపై బీఈడీ చేసినవారు అర్హులు కాదనడం, అటు టెట్, డీఎస్సీని అనుసంధానించడం, డీఈడీలు, బీఈడీలను విభజించడం తదితర నిర్ణయాలతో ప్రభుత్వం నిరుద్యోగులకు భరోసా ఇవ్వలేకపోతోంది. -
ఏపీ సీఎం పేషీకి కలెక్టర్?
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మ రం చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రా ష్ట్ర ఏర్పాటు అ నంతరం సీమాంధ్ర ఉ ద్యోగులను రెండు నెలల్లో బదిలీ చే స్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసేలోగా తానే అనుకున్న స్థానానికి వెళ్లాలనే ఉద్దేశంతో కలెక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల చంద్రబాబునాయుడిని కలిసి ఈ విషయాన్ని విన్నవించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై వారం, పది రోజుల్లో ఓ కొలిక్కి రానుంది. ఈ బదిలీ వ్యవహారాన్ని జిల్లా అధికారులు సైతం ధ్రువీకరిస్తున్నారు. ఇన్చార్జి కలెక్టర్‌గా జేసీ ఎల్.శర్మణ్ జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ సోమ, మంగళవారం వ్యక్తిగత సెలవుపై వెళ్లారు. తిరిగి ఆయన బుధవారం విధుల్లో చేరనున్నారు. ఈ రెండు రోజులు జేసీ ఎల్.శర్మణ్ ఇన్చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తారు. -
తెగిన లెక్కలు
సమైక్య రాష్ట్రంతో ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక బంధం పూర్తిగా తెగిపోయింది. శనివారం వారు ఆఖరి వేతనం అందుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ పరిధిలో చెల్లింపులు పూర్తయ్యాయి. జిల్లా ట్రెజరీ ద్వారా ఒక్కరోజే రూ.112 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఇకనుంచి ఏ రాష్ట్ర ఖర్చులు, చెల్లింపులు, ఆ రాష్ట్రం పరిధిలోకే వెళ్లనున్నాయి. కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మరో ఎనిమిది రోజులే మిగిలిఉంది. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక అంశాలకు ఈ నెల 24 వరకు ప్రభుత్వం గడువు విధించింది. ఈ మేరకు శనివారం చెల్లింపులన్నీ పూర్తయ్యాయి. ఇకనుంచి తెలంగాణ, సీమాంధ్ర లెక్కలు వేటికవే అంటూ ఇప్పటికే ట్రెజరీ శాఖకు ఉత్తర్వులు అందాయి. ఆర్థిక ప్రక్రియ అంతా పూర్తి చేసి ఉద్యోగులకు, పెన్షనర్లకు 1750 బిల్లుల రూపంలో శనివారం ఒక్కరోజే రూ.112 కోట్లు చెల్లించారు. జిల్లాలో అన్ని విభాగాల్లో కలిపి 31 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు (కేంద్ర ప్రభుత్వం, సింగరేణి, ఆర్టీ సీ ఉద్యోగులు, కార్మికులు మినహాయించి) ఉ న్నారు. ట్రెజరీ శాఖ పరిధిలోని 15వేల మంది ఉద్యోగులకు మే నెల వేతనాలు రూ.50 కోట్లు, 20,700 మంది పెన్షనర్లకు రూ.45 కోట్లు, జూన్ ఒకటో తేదీ వేతనం, టీఏ, డీఏ, ఇతర అలవెన్సులు రూ.17 కోట్లు కలిపి మొత్తంగా రూ.112 కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి. ట్రెజరీ పరిధి లో లేని మరో 15వేల మంది ఉద్యోగులకు రూ.30కోట్ల చెల్లింపులు జరిగినట్లు సమాచారం. పదిహేను రోజులు సేవలకు బ్రేక్! రాష్ట్ర విభజన నేపథ్యంలో ట్రెజరీ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. నేడు ఆదివారం సెల వు దినం కాగా, సోమవారం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సేవలు ఆధారపడి ఉన్నాయి. సాంకేతికపరంగా ఇబ్బందులొస్తే అన్ని రకాల బిల్లుల చెల్లింపులు జరిపేందుకు ఈనెల 26 వరకు గడువు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ట్రెజరీ డీడీ పవన్‌కుమార్ తెలిపారు. జూన్ 2న రాష్ట్రం ఏర్పడుతుండడంతో వచ్చే నెల నుంచి బడ్జెట్ విధానం తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి రానుంది. ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో కొత్త ఖాతాలు తెరుస్తుండగా 15 రోజులపాటు లావాదేవీలు నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంచాయతీరాజ్, శాసనసభ, పార్లమెంట్, సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి పనుల బిల్లులు, కాంట్రాక్ట్, మెడికల్, రీయింబర్స్మెంట్ తదితర బిల్లుల చెల్లింపులు ఆగిపోనున్నాయి. ఉద్యోగుల్లో ఆనందం ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నామని సమైక్య రాష్ట్రంలో శనివారం చివరి వేతనం తీసుకున్న పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు పేర్కొన్నారు. జూన్ 2 తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం లాగా అనిపిస్తోందని పేర్కొంటున్నారు. సొంత రాష్ట్ర వికాసంలో కీలక భూమిక పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అందుకునే మొదటి వేతనాన్ని తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, రాష్ట్ర వికాసానికి విరాళంగా అందిస్తామని కొందరు ఉద్యోగులు గర్వంగా తెలుపుతున్నారు. బంగారు తెలంగాణకు పునరంకితం సమైక్య రాష్ట్రంలో ఆఖరి వేతనం అందుకోవడం భవిష్యత్‌కు శుభపరిణామం. ఇకనుంచి తెలంగాణ వికాసంలో కీలకభూమిక పోషిస్తాం. అదనపు పని గంటలు, సెలవుదినాల్లో పనిచేసి బంగారు తెలంగాణ నిర్మించుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలోని మొదటి నెల వేతనాన్ని రాష్ట్ర పునర్నిర్మాణానికి, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు విరాళంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. - సుబేదారి రమేశ్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రజల పక్షాన పోరాటం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉద్యోగుల పాత్ర క్రియాశీలకంగా ఉంటుంది. వివిధ ఉద్యమాల్లో పనిచేసిన అనుభవం మేరకు ప్రజల పక్షాన పోరాడుతాం. జూన్ 2తో ఉమ్మడి రాష్ట్రంతో విముక్తి లభించబోతోంది. ఆర్థిక పరమైన విముక్తి లభించినప్పటికీ తెలంగాణ స్వాతంత్య్రం కోసం ఎదురుచూస్తున్నాం. తెలంగాణలో తీసుకునే మొదటి వేతనంలో కొంతభాగాన్ని అమరవీరుల కుటుంబాలకు సాయంగా అందిస్తా. - ఫయాజ్ అలీ, తెలంగాణ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అదనపు పని గంటలు ఆరు దశాబ్దాల ఉద్యమం, ఆత్మత్యాగాల ఫలితంగా సాధించిన ప్రత్యేక రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటాం. అదనపు పని గంటలతో అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తాం. జూన్ 2 తర్వాత ప్రతీ రోజూ కీలకమే. ఆర్థికపరమైన తెగతెంపులు వేగవంతంగా జరిగిపోవడం సంతోషంగా ఉంది. రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరం భాగస్వాములం కావాలి. తెలంగాణలో జూన్ నెల వేతనాన్ని అమరవీరుల కుటుంబానికి సాయంగా అందిస్తా. - మర్రి శ్రీనివాస్‌యాదవ్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
ఆర్టీసీ కార్మిక సంఘాలతో సర్కారు చర్చలు సఫలం