మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, న్యూస్‌లైన్: బోయవాడిగా తన జీవితాన్ని ఆరంభించి వేటకువెళ్లిన వాల్మీకి మహత్తరమైన రామాయణ గ్రంథాన్ని రాసి మానవాళికే ఆదర్శంగా నిలిచారని జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అన్నారు. ఆయన రచనలు నేడు ప్రపంచానికి ఆదర్శమయ్యాయని కొనియాడారు. రామాయణంలోని ప్రతి వాక్యం సమాజానికి అవసరమన్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం స్థానిక అంబేద్కర్ కళాభవన్‌లో జరిగిన వాల్మీకి జయంత్యుత్సవంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సమాజ శ్రేయస్సును మహర్షి వాల్మీకి రాయణంలో రూపొం దించారని అన్నారు. మంచిపనులు చేసి మంచి జీవితం గడపాలని, జీవనశైలిలో మార్పు వస్తేనే అభివృద్ధి చెందుతారని ఆకాంక్షించారు. అందుకు ప్రతిఒక్కరూ చదువుకుంటేనే ఏదైనా సాధించగలరన్నారు.
అందుకు చిన్నారులను బడిలో చేర్పించి విద్యనందించేందుకు తోడ్పాటునందించాలని కోరారు. అత్యధికంగా బోయలు ఉన్న ప్రాంతాల్లో అక్షరాస్యత కోసం పాఠశాలలు, హాస్టళ్లు నెలకొల్పేందుకు కృషిచేస్తానని కలెక్టర్ చెప్పా రు. గ్రామాల్లో మహిళలను ప్రోత్సహిం చి సంఘంలో చేర్పించాలని కోరారు. 2012-13 సంవత్సరానికి మహిళా సంఘాలకు రూ.450 కోట్లు రుణాలను అందిస్తున్నామన్నారు. అదేవిధంగా సంఘాలను ఏర్పాటు చేసుకుంటే ఫెడరేషన్ ద్వారా రుణాలు అందిస్తామన్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు రాజీవ్ యువకిరణాల ద్వారా శిక్షణ, వసతిభోజన వసతి కల్పించి ఉద్యోగఅవకాశాలు కల్పిస్తుందన్నారు. ప్రభుత్వపరంగా వాల్మీకి జయంత్యుత్సవాన్ని జరపడపం ఎంతో ఆనందంగా కలెక్టర్ అన్నారు.
జిల్లా కేంద్రంలో వాల్మీకి కమ్యూనిటీ హాలుకు స్థలం గుర్తిస్తే నిర్మాణానికి, విగ్రహం ఏర్పాటు కు కృషిచేస్తానన్నారు. వాల్మీకి ఐక్య సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. వాల్మీకిలు అన్ని రంగా ల్లో రాణించాలన్నారు. అలాగే బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాం డ్ చేశారు. కలెక్టర్ అంతకుముందు వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఆ ర్‌ఓ రాంకిషన్, ఆర్డీఓ హన్మంత్‌రావు, తహశీల్దార్ యాదగిరిరెడ్డి, బీసీసంక్షేమ శాఖ అధికారి సంధ్య, వాల్మీకి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు, ప్రచా ర కార్యదర్శి శివలింగం తదితరులు పాల్గొన్నారు.
మానవాళికే ఆదర్శం
Published Sat, Oct 19 2013 4:52 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement