మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: జిల్లాలోని బడిబయట ఉన్న పిల్లల సంఖ్యపై స్పష్టత కొరవడింది. తలో లెక్క చెప్పడంతో అయోమయ పరిస్థితి నె లకొంది. అటు అంగన్‌వాడీ కార్యకర్తల సర్వే.. ఇటు ఎం ఈ ఓలు నిర్వహించిన సర్వేకు చాలా వ్యత్యాసం ఉండటంతో అ ధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ తప్పుడు లెక్కల సంగతేమిటని సమావేశంలో కలెక్టర్ ఎం.గిరిజా శంకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే మూడుసార్లు విద్యాశాఖ, ఎం ఈఓలు, ఆర్వీఎం, అంగన్‌వాడీ అధికారులతో సమావేశం ని ర్వహించారు.
అయినప్పటికీ బడిబయటి పిల్లల సంఖ్యలో స్ప ష్టత రాలేదు. ఈనెల 13న జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో ఎంఈఓలు, అంగన్‌వాడీ అధికారులతో సమావేశమైన కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా కాకిలెక్కలు చూపితే నమ్ముతామనుకున్నారా, స్పష్టత ఇవ్వకపోతే సస్పెండ్‌చేస్తానని హెచ్చరించారు. ఈనెల 26వ తేదీ లోపు స్పష్టమైన డాటా ఇవ్వాలని ఆదేశించారు. అయినప్పటికీ స్పష్టమైన సమాచారం కొరవడింది.
బడిబయటి పిల్లలు లేరట!
కొన్ని మండలాల నుంచి ఎంఈఓలు ఇచ్చిన లెక్కలు చూస్తే ఆ శ్చర్యం కలుగుతుంది. 11 నుంచి 14ఏళ్ల మధ్య ఉన్న బడిఈ డు పిల్లలు ఒక్కరు కూడా లేరని కొందరు ఎంఈఓలు లెక్కలు చూపారు. నవాబ్‌పేట, కొందుర్గు మండలాల పరిధిలోని గ్రామాల్లో ఒక్క బాలిక కూడా బడిబయట లేదని ఆ మండలాల ఎంఈఓలు జిల్లా అధికారులకు లెక్కలు పంపారు.
అదేవిధంగా జడ్చర్ల మండలంలో ఇద్దరు, బాలనగర్ మండలంలో ఒకరు, కేశంపేట మండలంలో నలుగురు, తలకొండపల్లి మండలంలో నలుగురు, ఆమనగల్లు మండలంలో ఐదుగురు, మాడ్గుల మండలంలో ఆరుగురు మాత్రమే బడిబయట ఉన్నట్లు ఎంఈఓలు విద్యాశాఖ జిల్లా అధికారులకు ఇచ్చిన లెక్కల్లో పేర్కొన్నారు. కాగా, అదే మండలాల నుంచి అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు ఇచ్చిన బడిబయటి బాలికల సంఖ్య వందల్లో ఉండటం ఆశ్చర్యకరం.
అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు ఇచ్చిన డాటా ప్రకారం నవాబ్‌పేట మండలంలో 350 మంది, కేశంపేటలో 149 మంది, ఆమనగల్లులో 98మంది, తలకొండపల్లిలో 73మంది, మాడ్గులలో 31 మంది, జడ్చర్లలో 258 మంది, బాలానగర్‌లో మండలంలో 245 మంది బడిఈడు గల బాలికలు బడిబయట ఉన్నట్లు గుర్తించారు. ఎంఈఓలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు ఒకే మండలంలో, అదే గ్రామాల్లో సర్వే చేశామని చెబుతున్నప్పటికీ మరి వందల్లో తేడా రావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కరు కూడా బడిబయటలేరని, ఐదుగురు మంది లోపు మాత్రమే బడిబయట ఉన్నట్లు లెక్కలు చూపుతున్న ఎంఈఓలు ఎంత చిత్తశుద్ధితో పనిచేశారనే విషయం స్పష్టమవుతోంది.
లెక్కలతో అధికారుల కుస్తీ
బడిబయటి పిల్లల సంఖ్యలో వ్యత్యాసం చాలా ఉండటంతో అధికారులు లెక్కలు తేల్చే పనిలోపడ్డారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో 20,149 మంది 11 నుంచి 14 ఏళ్ల వయస్సు గల బాలికలు ఉన్నట్లు అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు జిల్లా అధికారులకు లెక్కలు పంపించారు. అదే విధంగా ఎంఈఓలు ఇచ్చిన డాటాలో జిల్లాలో 3,385 మంది బాలికలు బడిబయట ఉన్నట్లుగా గుర్తించారు.
ఇరువురు ఇచ్చిన లెక్కల్లో 17వేల పైగా వ్యత్యాసం ఉండటంతో అధికారులు అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, ఎంఈఓలతో మరోసారి సమావేశం నిర్వహించి సంఖ్యలో స్పష్టత ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. కానీ ఏ ఒక్క మండలం నుంచి కూడా ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుంటేనే బడిబయటి పిల్లల సంఖ్యలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 3 లోగా
ఇవ్వాలని ఆదేశించాం..
సెప్టెంబర్ 3వ తేదీలోపు బడిబయటి పిల్లల సంఖ్యపై ఎంఈఓలు, అంగన్‌వాడీ అధికారులు సమన్వయంతో సర్వే నిర్వహించి స్పష్టమైన సంఖ్య ఇవ్వాలని ఆదేశించాం. ఆదేశాలు అమలుచేయని వారిపై చర్యలు తీసుకుంటాం.
- డాక్టర్ వై. చంద్రమోహన్, డీఈఓ
తలో లెక్క!
Published Fri, Aug 30 2013 4:06 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement