Integrated Child Development Services (ICDS)
-
అక్షరాభ్యాసం చేయుంచిన మహిళా మంత్రి
సాక్షి, కొవ్వూరు: ఐసీడీఏస్ కొవ్వూరులోని లిటరి క్లబ్లో పోషక పదార్థాలు కలిగిన తినుబండారాల స్టాల్‌ను నిర్వహించింది. ఓఎన్జీసీ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ స్టాల్లో ఐసీడీఎస్ వివిధ రకాల పోషకాహర పదార్థాలను ఏర్పాటు చేసింది. గర్భిణి స్ర్తీలకు, పిల్లలకు పోషక పదార్థాలు అందేలా చూసి, వారికి అవగాహన కల్పించడంమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. మంత్రి తానేటి వనిత స్టాల్స్‌ను సందర్శించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే అంగన్వాడి విద్యార్థులకు తన చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించి ఆనంతరం ఆమె పిల్లలకు స్కూల్ బ్యాగ్‌లను, పలకలను పంపిణీ చేశారు. -
అందినంతా తిన్నారు!
మంకమ్మతోట(కరీంనగర్): ఐసీడీఎస్‌లో అక్రమాల పర్వం బట్టబయలైంది. గర్భిణులు, బాలింతలకు సరఫరా చేసే పౌష్టికాహారం మాయమైంది. అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం, న్యూట్రీషియన్ పౌడర్ సరఫరా చేయకుండానే బిల్లులు కాజేశారు అధికారులు. దాదాపు 60 బిల్లుల్లో కోట్లాది రూపాయలు మింగేశారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతల కోసం పౌష్టికాహారం అందజేస్తున్నారు. అయితే వీటిని కేంద్రాలకు సరఫరా చేయకుండానే బిల్లులు కాజేసినట్లు ఐసీడీఎస్ కమిషనర్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆడిట్ అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆడిట్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 11 ప్రాజెక్టులకు గతంలో కరీంనగర్ నుంచే పౌష్టికాహారం, న్యూట్రిషీయన్ పౌడర్ సరఫరా చేసేవారు. ఈ వ్యవహారం అంతా జిల్లా పీడీ, సీడీపీవోల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం సరఫరాలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందడంతో కరీంనగర్‌లోని పీడీ కార్యాలయంలో ఆడిట్ అధికారులు రికార్టులు పరిశీలించారు. 2011 నుంచి 2015 వరకు లోకల్ఫుడ్, 2015 నుంచి 2018 వరకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద పౌష్టికాహారం సరఫరాలోజగిత్యాల, మెట్పల్లి ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ సమయంలో ఉమ్మడి జిల్లా పీడీలుగా రాములు, మోహన్‌రెడ్డి వ్యవహరించారు. 60 బిల్లులు రూ.2.15కోట్లు రాములు, మోహన్‌రెడ్డి పీడీలుగా ఉన్న సమయంలో ఆరోగ్యలక్ష్మి పథకానికి సంబంధించిన మొత్తం 85 బిల్లులు చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు ఎలాంటి పౌష్టికాహారం సరఫరా చేయకుండానే రూ.2.15కోట్లు చెల్లించినట్లు 60 బిల్లులు చేశారు. ఈ విషయంపై ఫిర్యాదులు అందగా.. గతంలోనే విచారణ చేసిన అధికారులు పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. అయినా అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆర్జేడీకి ఫిర్యాదు చేశారు. దీంతో నెల రోజులుగా ఆయా ప్రాంతాల్లో ఆడిట్ నిర్వహిస్తున్నారు. గతంలో కరీంనగర్‌రూరల్, సుల్తానాబాద్, పెద్దపల్లి, భీమదేరవరపల్లి ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిని సీరియస్‌గా తీసుకున్న అధికారులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 11 ప్రాజెక్టుల రికార్డులను కరీంనగర్ పీడీ కార్యాలయంలో పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా గతంలో వచ్చిన ఫిర్యాదులు నిర్ధారణవడంతో అన్ని ప్రాజెక్టుల రికార్డులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎన్పీలోనూ.. ప్రభుత్వం సరఫరా చేసే ఆహార పదార్థాలతోపాటు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు ఎస్ఎన్పీ (స్పెషల్ న్యూట్రీషియన్ ఫుడ్) సరఫరా చేస్తుంటారు. వీటి సరఫరాలోనూ పీడీ, సీడీపీవోలతోపాటు పైస్థాయి అధికారులు దాదాపు రూ.5కోట్ల బిల్లులు కాజేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ విషయంపై 2014లోనే ముఖ్యమంత్రి, ప్రిన్సిపల్ సెక్రెటరీ కార్యాలయంలో ఫిర్యాదులు అందాయి. వీటిపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనూ చర్చించారు. ప్రస్తుతం వీటిపై కూడా ఆడిట్ చేస్తున్నారు. మెట్పల్లిలో బూడిదైన రికార్డులు మెట్పల్లి ప్రాజెక్టులో 2009–2012 కాలంలో పౌష్టికాహారం సరఫరా వివరాలు ఇవ్వాలని సమాచారహక్కు చట్టం కింద పలువురు దరఖాస్తు చేసుకున్నారు. సరఫరా చేయకుండానే బిల్లులు కాజేయడంతో వివరాలు ఇస్తే దొరికిపోతామనే భయంతోనే రికార్డులు కాల్చి బూడిద చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే కార్యాలయంలో రికార్డులు లభించకపోవడంతో ఆరోపణలకు బలం చేకూరుతుంది. అధికారులు అండదండలతోనే కింది స్థాయి సిబ్బంది రికార్డులను కాల్చివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
ఆ పాలు తాగలేం బాబూ!
సాక్షి, హైదరాబాద్: ‘కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లయింది’అన్నట్లుగా ఉంది అంగన్వాడీ సెంటర్ల తీరు. గతంలో పాలు పల్చగా ఉంటున్నాయి, లబ్ధిదారులకు అందకుండా పక్కదారి పడుతున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం విజయ ప్యాకెట్ పాలు పంపిణీ చేస్తుండగా, వాటిని తాగడానికి చాలా మంది ఇష్టపడటం లేదని ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలనలో వెల్లడైంది. సమీకృత శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) ద్వారా గర్భిణులకు, పిల్లలకు అందించే పాలు పక్కదారి పట్టకుండా, కల్తీ కాకుండా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టెట్రా ప్యాకెట్లలో పాలను అందిస్తోంది. అయితే ప్రస్తుతం అమలవుతున్న ఈ విధానం సైతం విమర్శల పాలవుతోంది. ఆ పాలను పిల్లలతో పాటు బాలింతలు తాగలేకపోతున్నారు. ఈ ప్యాకెట్ పాల నుంచి వాసనరావడం, తొందరగా పాడవుతుండటం, రుచి లేకపోవడంతో తాగడానికి విముఖత చూపుతున్నారు. దీంతో వృథాను, సిబ్బంది చేతివాటాన్ని అరికట్టడానికి తీసుకున్న ఈ నిర్ణయంతో ఫలితం లేకుండా పోయిందనే విమర్శలొస్తున్నాయి. పోషకాహార మాసంలో వెలువడిన ఒక సర్వే వివరాల ప్రకారం తెలంగాణలో చాలా మంది గర్భిణులు రక్తహీనతతో, చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. ఒక పూట పోషకాహారం అందించడమే లక్ష్యంగా ఏర్పాటైన అంగన్వాడీలు సంపూర్ణ ఆహారం అందించడంలో విఫలమవుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్యాకెట్లతోనే తంటా.. ఐసీడీఎస్ కేంద్రాల ద్వారా ఒక్కో ప్యాకెట్ పాలు 500 మి.లీ.పరిమాణంలో ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అయితే ఒక్కొక్కరికి 200 మి.లీ. పరిమాణంలో అందించాల్సి ఉండటంతో, ప్యాకెట్‌ను చించి ఇద్దరికి సరఫరా చేయాల్సి వస్తోంది. ఒక్కసారి ప్యాకెట్ తెరిచిన తరువాత గంట వ్యవధిలోనే పాలు పాడవుతున్నాయి. ఒక్కో కార్టన్ డబ్బాలో పదిలీటర్ల వరకు పాలప్యాకెట్లు రాగా ఒక్కోసారి పాలన్నీ పాడవుతున్నాయి. దీంతో సిబ్బంది ముందుగానే గుర్తించి పారబోస్తున్నారు. రసాయనాలు మొదలైన వాటితో తయారవుతాయనే ఉద్దేశంతో ప్యాకెట్ పాలు తాగడానికి విముఖత చూపుతూ కొంతమంది అసలు పాలప్యాకెట్లనే తీసుకోవడం లేదు. దీంతో స్త్రీ, శిశు పోషణకోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం నీరుగారిపోతోంది. రెండు మూడు విడతలుగా మేలు నిర్ణీత ప్రమాణాలతో ప్రాసెస్ చేసి, ప్యాక్ చేసిన పాలే అయినప్పటికీ ఎక్కువకాలం నిల్వ ఉండటం లేదు. నెలలో అవసరమైన అన్ని ప్యాకెట్లను ఒకేసారి కేంద్రాలకు తరలించడం వల్ల ఆ పాలు మాసాంతం ఉండటం లేదు. అలాకాకుండా నెలలో రెండు మూడు విడతలుగా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తే ప్రయోజనం ఉంటుందని అంగన్వాడీ కార్యకర్తలు అంటున్నారు. పాలు తీసుకునేందుకు ఇష్టపడటంలేదు ఒక్కోసారి పాలన్నీ చెడిపోతున్నాయి. దీంతో చేసేదేంలేక వాటిని బాలింతలకు పంపిణీ చేయకముందే పారబోస్తున్నాం. కొంత మంది వీటిని తీసుకోవడానికి అయిష్టత చూపుతున్నారు. నెలకు కావల్సిన ప్యాకెట్లన్నీ ఒకేసారి కాకుండా విడతలవారీగా అందజేస్తే బాగుంటుంది. – కె.వింధ్యారాణి, అంగన్వాడీ కార్యకర్త ‘హాకా’ ద్వారా పంపిణీ చేయాలనుకుంటున్నాం పాలను ప్యాకెట్ల ద్వారా అందించడం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న విధానం. అన్ని ప్రమాణాలతో పూర్తిగా ప్రాసెస్ అయ్యి ధ్రువీకరించిన తర్వాతే పంపిణీ చేస్తారు. పాలు పాడైతే రీప్లేస్ చేస్తాం. విజయడెయిరీ టెట్రా ప్యాకెట్ పాలు బాలింతలు, పిల్లలు తాగడం లేదని అంగన్వాడీల ద్వారా మా దృష్టికి వచ్చింది. అందుకోసం ప్రభుత్వం హాకా అనే నోడల్ ఏజెన్సీ ద్వారా పాలు సరఫరా చేసే ఆలోచనలో ఉంది. అయితే ఫినోప్యాక్స్ ద్వారా సరఫరా చేయడంకంటే బ్రిక్ ప్యాక్స్ ద్వారా పంపిణీ చేయాలనుకుంటున్నాం. ఈ విషయంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. – విజయేందిర బోయి, ఐసీడీఎస్ సంచాలకులు బిల్లులు రావు.. ఈ చిత్రంలోని అంగన్వాడీ కేంద్రం మానుకోట మండలం పత్తిపాక గ్రామంలోని అద్దె భవనంలో నడుస్తోంది. దీన్ని నెలకు రూ.500తో అద్దెకు తీసుకుని నడిపిస్తున్నారు. గత ఆరునెలలుగా బకాయిలు రాకపోవడంతో అంగన్వాడీ టీచర్లే తమ సొంత జీతంలో నుంచి కడుతున్నారు. పాలు వాసన వస్తున్నాయి అంగన్వాడీ కేంద్రంలో ప్యాకెట్లో వచ్చే పాలను వేడి చేసి ఇస్తున్నారు. కానీ అవి ఎర్రగా, తాగుతుంటే వాసన వస్తున్నాయి. ఒకసారి ఆ పాలను ఇంటికి తీసుకెళ్లి తాగుదామనుకునేలోపు ప్యాకెట్ పగిలిపోయి భరించలేని దుర్వాసన వచ్చాయి. ఇప్పటికైనా ప్రభుత్వం టెట్రా ప్యాకెట్ పాలకు బదులు వేరే పాలు ఇవ్వాలి. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం ప్యాకెట్లు ఇవ్వడం లేదు. కోడిగుడ్లు కూడా నెలకు ఎనిమిది మాత్రమే ఇస్తున్నారు. –బండారి శ్యామల, నెల్లికుదురు, మహబూబాబాద్ -
పెళ్లి వేడుకపై ప్రతిష్టంభన
కర్నూలు, తుగ్గలి: మండలంలోని బొందిమడుగుల గ్రామంలో శుక్రవారం జరుగనున్న పెళ్లిపై ప్రతిష్టంభన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బొందిమడుగుల గ్రామానికి చెందిన దళితుడు రాజుకు తుగ్గలికి చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. అయితే పెళ్లి కుమార్తెకు వయసు లేదంటూ తహసీల్దార్ రామకృష్ణకు కొందరు సమాచారమివ్వడంతో ఆయన ఐసీడీఎస్ అధికారులను విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో గురువారం పెళ్లి కూతురు వయసుపై తుగ్గలి పోలీస్ స్టేషన్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మావతి విచారణ చేపట్టారు. పెళ్లి కుమార్తె ఆధార్ కార్డు ప్రకారం అమ్మాయి వయసు తక్కువగా ఉందన్నారు. కాగా పెళ్లి కూతురు హైదరాబాద్‌లో 10వ తరగతి పూర్తి చేసిందని, అందుకు సంబంధించి పత్రాలను వారి కుటుంబ సభ్యులు పోలీసులకు అందజేశారు. ఆధార్‌కార్డు, స్టడీకి సంబం«ధించిన పత్రాలో పెళ్లి కూతరు వయసు వ్యత్యాసం ఉండడంతో జిల్లా చైల్డ్‌లైన్ ఆఫీసర్ విచారణ చేసి నిర్ణయం చెబుతారని ఐసీడీఎస్ సూపర్వైజర్ తెలిపారు. అధికారులు వధువు వయసును నిర్ధారించాల్సి ఉంది. పెళ్లిపై ప్రతిష్టంభన కొనసాగడంతో వధువు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెళ్లి వేడుక సమస్యాత్మకంగా మారుతుందని పసిగట్టిన పోలీసులు బొందిమడుగుల గ్రామంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ముందస్తుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డోన్ డీఎస్పీ ఖాదర్‌బాషా ఆధ్వర్యంలో పత్తికొండ, బేతంచెర్ల సీఐలు భాస్కరరెడ్డి, కంబగిరి రాముడు, తుగ్గలి, జొన్నగిరి, పత్తికొండ, దేవనకొండ ఎస్ఐలు పులిశేఖర్, సతీష్‌కుమార్, మారుతి, శ్రీనివాసులు, గంగయ్యయాదవ్తో పాటు 50మందికి పైగా బందోబస్తు చర్యలు చేపట్టారు. -
కవలల్ని విడదీసిన తల్లిదండ్రులు
ఇబ్రహీంపట్నం : ఆడబిడ్డను సాకలేమని 13 రోజుల శిశువును తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. మంచాల మండలం వెంకటేశ్వర తండాకు చెందిన ఆ శిశువు తల్లిదండ్రులకు (పేర్లు వెల్లడించేందుకు నిరాకరణ) అంతకు ముందు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. మూడో కాన్పుల్లో అడ, మగ కవల పిల్లలకు ఆ తల్లి జన్మనిచ్చింది. కవలల్లో మగ పిల్లాడిని ఉంచుకొని, ఆడపిల్లను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. నలుగురిని సాకే ఆర్థిక స్థోమత తమకు లేదని తల్లిదండ్రులు తెలిపారు. ఆడ శిశువును ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిణి శాంతిశ్రీకి అప్పగించారు. ఆ శిశువును నగరంలోని శిశువిహార్‌కు తరలించినట్లు శాంతిశ్రీ తెలిపారు. తమ వివరాలు వెల్లడించవద్దని ఆ కుటుంబసభ్యులు తెలిపినట్లు ఆమె చెప్పారు. 1 -
ఐసీడీఎస్ కార్యాలయంలో పేలిన సెల్‌ఫోన్
వీరఘట్టం విజయనగరం : అంగన్వాడీ కేంద్రాల వివరాలు నమోదు చేసేందుకు ప్రభుత్వం అందించిన స్మార్ట్‌ఫోన్ పేలిపోయింది. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో సోమవారం ఈ ఘటన జరిగింది. దీంతో భయభ్రాంతులకు గురైన అంగన్వాడీ కార్యకర్తలు ఉరుకులు పరుగులు తీశారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఐసీడీఎస్ కార్యాలయంలో సమావేశం ఉండటంతో అంగన్వాడీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. సూపర్ వైజర్ రాకపోవడంతో చేబియ్యంవలస అంగన్వాడీ కార్యకర్త ఎం.వెంకటమ్మ ప్రభుత్వం అందించిన స్మార్ట్‌ఫోన్‌లో అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ సమయంలో ఫోన్ ఒక్కసారిగా వేడెక్కి పొగలు రావడంతో వెంటనే విసిరేశారు. తర్వాత పెద్ద శబ్దంతో ఫోన్ పేలిపోయిందని ఆమె తెలిపారు. దూరంగా విసిరేయడంతో ప్రమాదం తప్పిందని వివరించారు. ఆరు నెలల కిందట వీరఘట్టం ప్రాజెక్టు పరిధిలోని 143మంది అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం కార్బన్ స్మార్ట్ఫోన్లను అందజేసింది. వీటిలో అంగన్వాడీ కేంద్రాల సమాచారం, కేంద్రాల పరిధిలో ఉన్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల వివరాలతో పాటు కేంద్రంలో ఉన్న స్టాకు వివరాలు మొబైల్లో నమోదు చేయాలి. ఇప్పటికే జిల్లాలో చాలా చోట్ల ఈ ఫోన్లు చార్జింగ్ పెట్టేటప్పుడు పేలిపోయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరో సంఘటన జరగడంతో ప్రభుత్వం ఇచ్చిన సెల్ఫోన్లు ఉపయోగించేందుకు మిగిలిన అంగన్వాడీ కార్యకర్తలు భయపడుతున్నారు. -
బతికేదెలా?
చిన్నారుల ఆలనా.. పాలనా చూసే అంగన్వాడీ కేంద్రాల సక్రమ నిర్వహణను పర్యవేక్షించే లింక్ సూపర్వైజర్లను ప్రభుత్వం ఇంటికి పంపింది. బాబు వస్తే జాబు వస్తుందని.. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీడీపీ తీరా గద్దెనెక్కాక ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టడంతో వారు నిశ్చేష్టులయ్యారు. ఇకపై తమ జీవనం సాగెదెలా అని మదనపడ్డారు. తమ బాధలు చెప్పుకోవడానికి కలెక్టరేట్‌కు తరలివచ్చారు. చిత్తూరురూరల్: ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నడిచే అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించే లింక్ సూపర్వైజర్లను తొలగిస్తూ ప్రభుత్వం బుధవారం గుట్టుచప్పుడు కాకుండా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారు గురువారం జిల్లా అధికారులను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. జిల్లాలోని ఐసీడీఎస్ పరిధిలో 21 ప్రాజెక్టుల కింద మొత్తం 4, 768 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 3,640, మినీ కేంద్రాలుగా 1,128 నడుస్తున్నాయి. ఈ కేంద్రాల్లో 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు 1,23,517 మంది, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు 72,087 మంది వరకు లబ్ధి పొందుతున్నారు. అలాగే బాలింతలు, గర్భిణులు 42,763 మంది అంగన్వాడీల ద్వారా అమలయ్యే పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, కార్యకలపాలు, పథకాలు సక్రమంగా అమలువుతున్నాయా..లేదా పర్యవేక్షించడానికి ప్రాజెక్టుల వారీగా సూపర్వైజర్లు అవసరం. అయితే జిల్లా వ్యాప్తంగా 75 సూపర్వైజర్ పోస్టులు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోలేదు. సిబ్బంది కొరత కారణంగా కేంద్రం నిర్వహణలో లోపాలు అధికమయ్యాయి. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం లింక్ సూపర్వైజర్ల పోస్టులకు ఆహ్వానం పలికింది. ఈ బాధ్యతలను అంగన్వాడీ కార్యకర్తలకు అప్పగిస్తేనే సమస్యలను సత్వరం పరిష్కరించగలమని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మేరకు 2017 ఆగస్టులో ఉత్తర్వులు జారీ చేస్తూ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందుకు డిగ్రీ విద్యార్హత కలిగివుండి, పదేళ్లు కార్యకర్తగా పనిచేసిన వారు అర్హులుగా పేర్కొంది. ఈ పోస్టుకు పోటీలు పడి చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించి 60 మందిని లింక్ సూపర్ వైజర్లుగా భర్తీ చేసుకున్నారు. వెట్టి చాకిరీ.. లింక్ సూపర్ వైజర్లు అంగన్వాడీ నిర్వహణతో పాటు సూచించిన ప్రాజెక్టుల్లో నిత్యం పర్యవేక్షించాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వం రూ.2,500 అదనపు వేతనంగా నిర్ణయించింది. దీంతో పాటు ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్(ఎఫ్‌టీఏ), డీఏలు కూడా అందిస్తామని ప్రకటించింది. అయితే ఏడాదికి గాను ఇంత వరకు లింక్ సూపర్వైజర్లకు ఒక్క పైసా ఇవ్వలేదు. నిత్యం అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించేందుకు సూపర్ వైజర్లే ఖర్చు మొత్తం భరించారు. అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన ఆన్లైన్ పనులను పూర్తి చేసి, అపై సూపర్వైజర్ వృత్తిని కొనసాగిస్తూ వచ్చారు. ఈ వృత్తిలో కొనసాగితే భవిష్యత్‌లో పై పోస్టులకు ప్రాధాన్యత ఉంటుందని భావించి పని ఒత్తిడి ఉన్నా చేస్తూ వచ్చారు. తొలగింపు ఉత్తర్వులు.. లింక్ సూపర్ వైజర్లను అర్ధాంతరంగా తొలగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి సమాచారం లేకుండా తొలగించడంపై వారు భగ్గుమంటున్నారు. కనీసం ఏడాది పాటుగా విధులు నిర్వహించినందుకు అదనపు వేతనం ఇవ్వకుండానే తొలగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కనీసం టీఏ, డీఏలు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు 60 మంది సూపర్వైజర్లు గురువారం సాయంత్రం జిల్లా అధికారులను కలిసి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇవ్వాల్సిన అదనపు బకాయిలను వెంటనే చెల్లించాలని, రెగ్యులర్ సూపర్వైజర్ల పోస్టుల భర్తీలో వయస్సు సడలింపునకు మొదటి ప్రాధన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. -
ఐసీడీఎస్‌కు ప్రాజెక్ట్ డైరెక్టర్ కావలెను
నెల్లూరు (వేదాయపాళెం): మహిళా శిశు సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఆశాఖకు జిల్లాలో ప్రాజెక్ట్ డైరెక్టర్ నియామకం రెండేళ్ల నుంచి జరుపకపోవటంతో ఇన్‌చార్జిలే దిక్కుగా మారుతోంది. ఫలితంగా ఆశాఖ కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. వరుసగా ఇతర మాతృశాఖల అధికారులను ఐసీడీఎస్‌కు ఇన్చార్జిలుగా నియమించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఇన్చార్జిల పాలనతో ఐసీడీఎస్‌కు గ్రహణం పట్టినట్లైంది. మాతృశాఖల పర్యవేక్షణలకు వారు ప్రాధాన్యత నివ్వటంతో ఎంతో కీలకమైన ఐసీడీఎస్‌ను పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఆయా సందర్భాల్లో ఇన్చార్జిలుగా కొనసాగుతూ వస్తున్న అధికారులు మొక్కుబడిగా విధులకు పరిమితమవుతున్నారు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పూర్వప్రాథమిక విద్యను విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో లక్ష్యాలను చేరుకోలేకుంది. అశాఖలోని వివిధ పథకాల అమలు సజావుగా సాగే పరిస్థితి కానరావటంలేదు. మహిళా శిశు సంక్షేమానికి రూ.కోట్లు విడుదల అవుతున్నప్పటికీ వాటి సద్వినియోగం ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లాలో 3,454 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు, 320 మిని అంగన్వాడీ కేంద్రాలున్నాయి. 17 ప్రాజెక్టులున్నాయి. వీటిల్లో మూడేళ్ల లోపు పిల్లలు 89,856 మంది, 3 నుంచి ఆరేళ్ల పిల్లలు 82,736 మంది ఉన్నారు. అలాగే బాలింతలు 17,786 మంది, గర్భిణీలు 18,943 మంది ఉన్నారు.వీరికి ప్రభుత్వ పరంగా లబ్ధి చేకుర్చే విషయంలో పర్యవేక్షణ ఎంతో కీలకం. ఇన్చార్జిల పరంపర రెండేళ్ల క్రితం రెగ్యులర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యావతి బదిలీ అనంతరం అప్పటి డ్వామా పీడీ ఇప్పటి నెల్లూరు ఆర్డీఓ డి,హరితను ఇన్చార్జిగా నియమించారు. ఆమె ఆరు నెలల పాటు ఇన్చార్జిగా కొనసాగారు. ఆనంతరం మంత్రి నారాయణ జోక్యంతో తెలుగుగంగ స్పెషల్ కలెక్టర్‌గా, అలాగే ఐసీడీఎస్ ఇన్చార్జిగా ఏకకాలంలో నియమించారు. ఆమె ఎడాదికిపైగా ఇన్చార్జిగా కొనసాగారు. గత నెల చివరి వారంలో అనంతపురంకు బదిలీ అయ్యారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్న కమలకుమారిని నెల్లూరు జేసీ–2గా పదోన్నతి కల్పిస్తూ నియమించారు. అలాగే ఐసీడీఎస్‌కు ఇన్చార్జిగా నియమించారు. ఈమెను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన ఐదు రోజుల తరువాత మొక్కుబడిగా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ట్ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చి కాసేపు అందరిని పలకరించి సమీపంలో ఉన్న శిశుగృహాన్ని సందర్శించి వెళ్లారు. అప్పటి నుంచి కార్యాలయానికి వచ్చిన దాఖలాలులేవు. ఐసీడీఎస్ కార్యాలయం ఫైల్స్‌ను కార్యాలయ అధికారులను జేసీ–2 చాంబర్‌కు తెప్పించుకుని నామమాత్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పటి వరకూ అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయకపోగా సీడీపీఓలతో సమావేశం ఏర్పాటు చేయలేదు. కమలకుమారికి ఐసీడీఎస్ ఇన్చార్జి బాధ్యతలు చేపట్టడంపై తొలి నుంచి నిరాసక్తతగానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల తనను ఐసీడీఎస్ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా మంత్రి నారాయణను కమలకుమారి కోరినట్లు సమాచారం. అధిక పని ఒత్తిడి బాధ్యత ఉన్న ఐసీడీఎస్‌కు శాశ్వత పీడీని నియమించటంలో ఉన్నతాధికారులు ఎందుకు మీనమేషలు లెక్కిస్తున్నారనేది ఆశాఖ అధికారులలో చర్యనీయంశంగా మారింది. ఐసీడీఎస్‌ని గాడిలో పెట్టేందుకు శాశ్వత ప్రాజెక్టు డైరెక్టర్‌ను నియమించాల్సి అవసరం ఎంతైనా ఉంది. -
అద్దె మోత
మహిళా శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే ప్రకటనలు చేస్తున్నప్పటికీ జిల్లాలో వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోంది. నిధుల విడుదల ఎలా ఉన్నప్పటికీ పాలకులకు, ఆ శాఖ అధికారులకు చిత్తశుద్ధి లేకపోవడంతో ఐసీడీఎస్‌ను భవనాల కొరత వెంటాడుతోంది. ఏళ్ల తరబడి అంగన్వాడీ కేంద్రాలు, సీడీపీఓల కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. నెలకు లక్షలాది రూపాయలు ఆ శాఖ ద్వారా అద్దెలకు కేటాయించడం పరిపాటిగా మారుతోంది. నెల్లూరు(వేదాయపాళెం): ఐసీడీఎస్ భవనాల కోసం స్థలసేకరణ విషయంలో ప్రతిపాదనలకు, హామీలకు మాత్రమే పరిమితమవుతున్నారు. మంజూరైన అరకొర భవనాల నిర్మాణాల్లో అలసత్వం ప్రదర్శిస్తుండడంతో అవి అసంపూర్తిగా ఉంటున్నాయి. జిల్లాలోని 17 ప్రాజెక్టుల్లో 3454 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు, 320 మినీ అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. అందులో 3 ఏళ్ల లోపు చిన్నారులు 89,856 మంది, 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలు 82,736 మంది ఉన్నారు. వీరికి పూర్వ ప్రాథమిక విద్యతోపాటు పౌష్టికాహారం అందించాల్సిఉంది. వీరితోపాటు గర్భిణులు 18,943 మంది, బాలింతలు 17,786 మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు 1311 సొంత భవనాలు ఉండగా 1272 కేంద్రాలను అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అర్బన్ ప్రాంతాల్లో అధికంగా అద్దె భవనాల్లోనే కేంద్రాల నిర్వహణ జరుగుతోంది. నెల్లూరు అర్బన్ ప్రాజెక్టులో పూర్తిగా అద్దె భవనాల్లోనే కేంద్రాలు కొనసాగుతున్నాయి. అర్బన్ ప్రాంతాల్లో ఒక్కో కేంద్రానికి రూ.3 వేలు, రూరల్ ప్రాంతాల్లో రూ.700 అద్దె చెల్లిస్తున్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న సీడీపీఓ కార్యాలయాలకు రూ.6600 చొప్పున చిల్లిస్తున్నారు. నెలల తరబడి అద్దె బకాయిలు జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు నెలల తరబడి అద్దె బకాయిలు పెరిగిపోతుండటంతో అంగన్వాడీ కార్యకర్తలు ఇబ్బందులు పడాల్సివస్తోంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో భవనాల యాజమానులు అద్దె చెల్లింపుల విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తుండడంతో కార్యకర్తలు అప్పులు చేసి మరీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల కేంద్రాలను ఖాళీ చేయాల్సిందిగా యాజమానుల నుంచి కార్యకర్తలకు ఒత్తిళ్లు కూడా ఎదురవుతున్నాయి. అసంపూర్తి పరంపర 2017వ సంవత్సరానికి ముందు నాబార్డు నిధులతో 102 భవనాలు మంజూరు కాగా అందులో 31 భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి. 2017–18కి గాను జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో అంగన్వాడీ కేంద్రం భవనానికి రూ.7.50 లక్షల అంచనా వ్యయంతో 371 భవనాలు మంజూరయ్యాయి. 188 భవనాలు పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్నాయి. ఈ భవనాల నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్, హౌసింగ్ శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే 2016–17 ఏడాదికి గానూ సీడీపీఓల కార్యాలయాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. మహిళా శిశు సంక్షేమశాఖ నిధులతో ఒక్కో భవనానికి రూ.53 లక్షల అంచనా వ్యయంతో పనులను చేపట్టారు. రెండేళ్ల నుంచి కొన్ని భవనాలు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. నెల్లూరుఅర్బన్, నాయుడుపేట, పొదలకూరు, బుచ్చి, ఆత్మకూరు, వింజమూరు, సీడీపీఓల కార్యాలయాల భవనాలు పూర్తి దశకు చేరుకోలేకున్నాయి. నెరవేరని మంత్రి హమీ అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు దీటుగా చేస్తామని చెబుతున్న మంత్రి నారాయణ హామీ నెరవేరలేదు. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనాలు నిర్మించేందుకు యుద్ధప్రతిపాదికన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో మాత్రం ముందుకు సాగడం లేదు. కనీసం స్థల సేకరణ జరిపిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. కార్యకర్తలకు ఆర్థిక ఇబ్బందులు అద్దెల చెల్లింపు విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో అంగన్వాడీ కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తోంది. గృహాల యాజమానుల ఒత్తిళ్లను భరించాల్సివస్తోంది. శాశ్వత భవనాల నిర్మాణాల విషయంలో ప్రతిపాదనలకే పరిమితమవుతున్నారు. పాలకులు అధికారులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. – షేక్ మస్తాన్‌బీ, నెల్లూరు అర్బన్ ప్రాజెక్ట్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కార్యదర్శి -
బాలికకు వివాహం చేసే ప్రయత్నం
చిల్లకూరు: పదో తరగతి చదువుతున్న కుమార్తెకు తల్లిదండ్రులు వివాహం చేసే ప్రయత్నం చేయగా సదరు బాలిక విషయాన్ని అంగన్వాడీ కార్యకర్త దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఐసీడీఎస్ అధికారులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తిమ్మనగారిపాళెం గ్రామానికి చెందిన తల్లిదండ్రులు తమ కుమార్తెను గూడూరు రూరల్ పరిధిలోని చెంబడిపాళెంకి చెందిన ఓ యువకుడికి ఇచ్చి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే బాలికకు వివాహం ఇష్టం లేకపోవడంతో స్థానికంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తను కలుసుకుని సమాచారం ఇచ్చింది. దీంతో ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం సూపర్వైజర్ క్రిష్ణమ్మ సిబ్బందితో కలసి గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడింది. తర్వాత వారిని ఎస్సై శ్రీనివాసరావు వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించారు. -
తెలంగాణ, ఏపీలో ‘పోషకాహార పర్యవేక్షణ’
న్యూఢిల్లీ: ‘చిన్నారులకు అంగన్వాడీలు అందజేస్తున్న పోషకాహారంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచేందుకు ఏర్పాటు చేసిన కొత్త సాఫ్ట్వేర్ 7 రాష్ట్రాల్లో అమలవుతోంది. త్వరలో దేశవ్యాప్తంగా దాన్ని విస్తరిస్తాం. దీంతో 10 కోట్ల మంది చిన్నారులకు లబ్ధి చేకూరుతుంది’ అని మహిళా శిశు సంక్షేమ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్–కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ (ఐసీడీఎస్–సీఏఎస్) మే నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్‌లోని 57 జిల్లాల్లో అమల్లోకి వచ్చింది. ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా నూట్రిషన్ ప్రొఫైల్ తయారు చేసేందుకు, శాశ్వత ప్రాతిపాదికన పోష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఈ సాఫ్ట్వేర్ సాయపడుతుంది. చిన్నారులకు సంబంధించిన సమాచారాన్ని అంగన్వాడీలు ఆఫ్‌లైన్‌లో నమోదు చేయవచ్చని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాకేశ్ శ్రీవాస్తవ వెల్లడించారు. -
తెలంగాణ, ఏపీలో ‘పోషకాహార పర్యవేక్షణ’
న్యూఢిల్లీ: ‘చిన్నారులకు అంగన్వాడీలు అందజేస్తున్న పోషకాహారంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచేందుకు ఏర్పాటు చేసిన కొత్త సాఫ్ట్వేర్ 7 రాష్ట్రాల్లో అమలవుతోంది. త్వరలో దేశవ్యాప్తంగా దాన్ని విస్తరిస్తాం. దీంతో 10 కోట్ల మంది చిన్నారులకు లబ్ధి చేకూరుతుంది’ అని మహిళా శిశు సంక్షేమ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్–కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ (ఐసీడీఎస్–సీఏఎస్) మే నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్‌లోని 57 జిల్లాల్లో అమల్లోకి వచ్చింది. ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా నూట్రిషన్ ప్రొఫైల్ తయారు చేసేందుకు, శాశ్వత ప్రాతిపాదికన పోష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఈ సాఫ్ట్వేర్ సాయపడుతుంది. చిన్నారులకు సంబంధించిన సమాచారాన్ని అంగన్వాడీలు ఆఫ్‌లైన్‌లో నమోదు చేయవచ్చని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాకేశ్ శ్రీవాస్తవ వెల్లడించారు. -
చట్టవిరుద్ధంగా బాలుడి స్వీకరణ
కనిగిరి: ఏడేళ్లుగా పిల్లలు లేక తిరుగుతున్న ఓ నిరక్షరాస్య జంట.. బిడ్డను వదలించుకోవాలనే ఓ బాధ్యత రహిత్యం గల తల్లి.. వెరసి ఓ బాలుడిని చట్టవిరుద్ధ దత్తత శ్రీకారానికి దారితీసింది. వాస్తవానికి ఆ బాలుడు దత్తతస్వీకర్తల వద్ద అల్లారుముద్దుగా పెరుగుతున్నా.. ఆ నోట ఈనోట విషయం ఐసీడీఎస్ అధికారుల దృష్టికి చేరింది. ఐసీడీఎస్ అధికారులు బాలుడిని దత్తత తీసుకున్న దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన గురువారం కనిగిరిలో వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసుస్టేషన్లో ఐసీడీఎస్ అధికారులు బాలుడిని స్వాధీనం చేసుకుని ఒంగోలు డీసీపీఓకు అప్పగించారు. వివరాలు.. హెచ్‌ఎంపాడు మండలం వేములపాడుకు చెందిన ధనలక్ష్మి, చెన్నకేశవులు దంపతులకు పెళ్లి జరిగి ఏడేళ్లయినా సంతానం లేరు. కూలీనాలి చేసుకుని జీవించే వీరు పిల్లల కోసం ఆస్పత్రిల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో వేములపాడుకు చెందిన లారీ డ్రైవర్ అంకయ్య.. వేరే ప్రాంతం నుంచి వెన్నపూస ధనలక్ష్మిని (రెండో భార్యగా, వివాహం లేదు) తెచ్చుకుని సహజీవనం చేస్తున్నాడు. వీరికి మూడు నెలల బాబు ఉన్నాడు. ఈ క్రమంలో కొద్దికాలం నుంచి అంకయ్యకు, వెన్నపూస ధనలక్ష్మికి మనస్పర్థలు వచ్చి రోజూ గోడవపడి కొట్టుకుంటున్నారు. ధనలక్ష్మి కూలి పనులకు వెళ్లే మహిళలతో తన బిడ్డను ఎవరికైనా ఇస్తానని చెబుతోంది. పిల్లలు లేక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న ధనలక్ష్మి అత్త తిరుపాలమ్మకు కొందరు విషయం చేరవేశారు. ధనలక్ష్మి కూడా తిరుపాలమ్మకు ఫోన్ చేసింది. ఈ నెల 11న కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్‌లో చెట్టు వద్ద వెన్నపూసల ధనలక్ష్మి తన బిడ్డను ఇష్టపూర్వకంగా ఇస్తున్నానని.. ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి మూడు నెలల బాలుడిని అప్పగించింది. ఐసీడీఎస్ అధికారులకు సమాచారం వేములపాడులో సెక్టార్ సమావేశానికి వెళ్లిన సీడీపీఐ లక్ష్మీప్రసన్న దృష్టికి బాలుడి దత్తత విషయం వెళ్లింది. ఆమె విచారణ చేపట్టి వారి ఇంటికి వెళ్లి ప్రశ్నించింది నిరక్ష్యరాస్యులైన తిరుపాలమ్మ, కొడలు ధనలక్ష్మిలు జరిగిన విషయాన్ని పూర్తిగా చెప్పారు. నగదు ఇచ్చి బాలుడిని చట్టవిరుద్ధ దత్తతగా(కొనుగోలు చేయడం) నేరంగా తెలిపి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు పోలీసుస్టేషన్లో మూడు నెలల బాలుడిని సీడీపీఓకు అప్పగించారు. బాలల సంరక్షణ కార్యాలయానికి సమాచారం అందించారు. డీసీపీఓ జిల్లా అధికారి జ్యోతి సుప్రియకు బాలుడిని అప్పగించినట్లు సీడీపీఓ లక్ష్మీప్రసన్న విలేకరులకు తెలిపారు. అత్త, కొడలిపై కేసు రూ.20 వేలు ఇచ్చి అత్త, కొడలు తిరుపాలమ్మ, ధనలక్ష్మిలు చట్టవిరుద్ధంగా బాలుడిని కొనుగోలు చేశారని ఐసీడీఎస్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీడీపీఓ ఫిర్యాదు మేరకు అత్త, కోడలిపై సెక్షన్ 81 బాలల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు విలేకరులకు తెలిపారు. -
భయం పెట్టాలని చేతులు కాల్చింది
నెల్లూరు,నాయుడుపేటటౌన్: కొడుక్కి భయం పెట్టాలని ఓ తల్లి ఏడేళ్ల కొడుకు చేతులపై వాతలపెట్టిన ఘటన పట్టణంలోని మునిరత్నంనగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరులోని గుంటూరువారితోటకు చెందిన బోంతపూడి ధనలక్ష్మి పదేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన సురేష్‌ను ప్రేమవివాహం చేసుకుంది. వీరికి 5వ తరగతి చదువుతున్న పవన్, రెండో తరగతి చదువుతున్న ప్రభాకర్, ఒకటో తరగతి చదువుతున్న రోజా అనే ముగ్గురు పిల్లలున్నారు. సురేష్ నాయుడుపేట పట్టణంలో నివాసముంటూ ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తూ భార్యాపిల్లలను పోషించేవాడు. రెండునెలల క్రితం భార్యాభర్తల మధ్య కలహాలు చెలరేగి సురేష్ ఇంటినుంచి వెళ్లిపోయాడు. దీంతో ధనలక్ష్మి కూలి పనులకు వెళుతూ పిల్లలను పోషిస్తోంది. ఈ క్రమంలో వారంరోజుల క్రితం ప్రభాకర్ తరచూ ఇంటిపక్కన ఉన్న పిల్లలతో గొడవకు దిగడమే కాకుండా మలవిసర్జనను పక్క ఇళ్లలో పడవేస్తున్నట్లుగా పొరుగింటి వారు వివాదానికి దిగారు. దీంతో కొడుక్కి భయపెట్టాలని ధనలక్ష్మి అట్లకాడను కాల్చి ప్రభాకర్ రెండు చేతులపై వాతలు పెట్టింది. అయితే చేతులకు పెద్దఎత్తున బొబ్బలు లేసి చీముపట్టి ఉండటాన్ని స్థానికులు బుధవారం గుర్తించి విచారించారు. అంతేకాకుండా బాలుడికి సరైన వైద్యచికిత్స సైతం అందించకుండా ఇంటి వద్ద వదిలేసి ధనలక్ష్మి ఉదయం వెళ్లి సాయంత్రం వస్తుండటంతో స్థానికులు ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయమై అక్కడ ఉన్న అంగన్వాడీ కార్యకర్త సూపర్వైజర్ ఉమామహేశ్వరికి విషయం తెలియజేసింది. ఆమె మునిరత్నంనగర్కు వెళ్లి ప్రభాకర్ పరిస్థితి చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తల్లితో పాటు బాలుడిని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. కుమారుడికి భయం పెట్టేందుకే కాల్చానని ఇంత గాయమవుతుందని తెలియదని ధనలక్ష్మి వాపోయింది. తన కోపం కారణంగానే భర్త కూడా వెళ్లిపోయాడని చెప్పడంతో వారు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు బాలుడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లి చికిత్స చేయిస్తున్నారు. -
‘ఐసీడీఎస్‌లో సూపర్వైజర్ అర్హత డిగ్రీనే’
సాక్షి, హైదరాబాద్: సమ గ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్)లో సూపర్వైజర్ (గ్రేడ్–2) పోస్టులను పూర్తిస్థాయిలో పదోన్నతుల ద్వారానే ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు సోమవారం ఆ శాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పదోన్నతుల విషయంలో అంగన్వాడీ టీచర్ల అర్హతల నిబంధనల్లో కాస్త ఊరట కలగనుంది. అంగన్వాడీ టీచర్లలో అనుభవజ్ఞులు, అర్హత కలిగిన వారినే సూపర్వైజర్లు (గ్రేడ్–2)గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ..వారి విద్యార్హత కనీసం డిగ్రీ ఉండాల్సిందిగా పేర్కొంది. క్షేత్రస్థాయిలో డిగ్రీ చదివిన వారు అతి తక్కువ మంది ఉండటంతో ప్రభుత్వానికి పలు వినతులు అందాయి. డిగ్రీ అర్హత కాకుండా పదోతరగతిని ప్రామాణికంగా తీసుకోవాలని మెజార్టీ టీచర్లు కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం పదోతరగతి అర్హత ఉన్నవారికి పదోన్నతి కల్పిస్తామని కానీ, ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. -
ఆడబిడ్డను సాకలేం.. తీసుకోండి
ఇబ్రహీంపట్నం : ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో ఆడబిడ్డను సాకలేమని తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ ఆధికారులను సోమవారం ఆశ్రయించారు. కూలీ పని చేసుకుని జీవించే మంచాల మండలం బండలేమూర్ గ్రామానికి చెందిన పత్లోత్ శోభ, పాండు దంపతులకు మూడో కాన్పులోనూ ఆడపిల్ల జన్మించింది. అప్పటికే ఉన్న ఇద్దరు ఆడబిడ్డలతోపాటు మరో బిడ్డ పుట్టడంతో సాకలేమని భావించిన ఆ తల్లిదండ్రులు స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని సంప్రదించి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. -
శోభరాణి ఆత్మహత్యకు నిరసనగా కలెక్టరేట్ వద్ద ఆందోళన
సాక్షి, కర్నూలు: ఆళ్లగడ్డలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ లో సూపర్వైజర్గా పనిచేస్తున్న శోభారాణి శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తన భార్య ఆత్మహత్యకు సంక్షేమ శాఖ సీపీడీఓ పద్మావతి కారకురాలని మృతురాలి భర్త ఆరోపించిన విషయం తెలిసిందే. ఆరోగ్యం బాగలేకపోయినా తీవ్ర పని ఒత్తిడికి గురిచేశారని ఆయన ఆరోపించాడు. మెమోలు ఇచ్చి మనోవేదనకు గురిచేయడం వల్లే శోభారాణి బలవన్మరణం చెందిందని తెలిపాడు. కాగా, శోభారాణిని మానసిక వేదనకు గురిచేసి, ఆమె ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఐసీడీఎస్ (అంగన్వాడీ) ఉద్యోగ సంఘాలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టాయి. శోభారాణి కుటుంబానికి రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియాగా చెల్లించాలని, ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అంగన్వాడీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. -
కర్నూలు జిల్లాలో దారుణం
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనం పైనుంచి దూకి ఓ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని ఆళ్లగడ్డలో శోభారాణి అనే మహిళ స్త్రీ,శిశు సంక్షేమ శాఖలో సూపర్ వైజర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఈరోజు డీఆర్సీ మీటింగ్ ఉండటంతో ఆమె కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. మీటింగ్ జరుగుతుండగానే శోభారాణి భవనంపైకి వెళ్లి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. సిబ్బంది అప్రమత్తమై ఆస్పత్రికి తరలించే లోపలే శోభారాణి మృతి చెందింది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహ్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. మనోవేదనకు గురి చేశారు తన భార్య శోభారాణి ఆత్మహత్యకు సంక్షేమ శాఖ సీపీడీఓ పద్మావతి కారకురాలని మృతురాలి భర్త ఆరోపిస్తున్నాడు. ఆరోగ్యం బాగలేకపోయినా.. మెమోలు ఇచ్చి మనోవేదనకు గురి చేశారన్నారు. వేధింపులు తట్టుకోలేక ఆమె బలవన్మరణం చెందిందన్నారు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అతను డిమాండ్ చేశాడు. -
కంపకళ్లితో ముగిసిన తిరునాళ్ల
చిన్నగొల్లపల్లి (హనుమంతునిపాడు): మండలంలోని చిన్నగొల్లపల్లిలో శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి తిరునాళ్లలో భాగంగా కంపకళ్లిని బుధవారం పోలీసులు, ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో నిర్వహించారు. ఆరు నుంచి పది అడుగుల ఎత్తున పేర్చిన ముళ్ల కంపపై నుంచి చిన్న పిల్లలను కిందకు దొర్లించడం వినేందుకే భయంగా ఉన్నా ఈ ప్రాంత భక్తులు దాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. కంపకళ్లిపై దొర్లిన బిడ్డకు ఎలాంటి రోగాలు దరి చేరవని భక్తుల అపార నమ్మకం. తరతరాలుగా ముళ్లకంపపై చిన్నారులను దొర్లించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఆరేళ్ల నుంచి 14 ఏళ్ల పిల్లలను కంపకళ్లిపై దొర్లించడం చట్టరీత్య నేరమని అధికారులు అడ్డుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది ఐసీడీఎస్, పోలీసు అధికారులు చిన్న పిల్లలను ముళ్లకంపై దొర్లించకుండా అడ్డుకున్నారు. సుదూర ప్రాంతల నుంచి వచ్చిన పెద్దలు మాత్రమే దొర్లి పిల్లలను కంపకళ్లి తాకించుకుని తీసకెళ్లారు. భక్తులు అర్ధనగ్నంగా ముళ్లకంపపై దొర్లుతూ గోవింద..అంటూ తమ భక్తి చాటుకున్నారు. పాలెగాళ్లు కొనతాళ్లను ఎత్తుకుని పోతురాజుతో కంపకల్లి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. చెన్నకేశవస్వామి తిరునాళ్ల కంపకల్లి కార్యక్రమంతో వైభవంగా ముగిసింది. ఐసీడీఎస్ వెలిగండ్ల ప్రాజెక్టు అధికారి లక్ష్మీప్రసన్న, కనిగిరి సీఐ సుబ్బారావుతో పాటు పలువురు పోలీసు అధికారులు దగ్గరుండి కంపకళ్లి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
అరకులోయ : సమస్యలు పరిష్కారం కోసం విశాఖలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ఆందోళన చేపడుతున్న అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేసిన సంఘటనకు నిరసనగా అరకులోయ పట్టణంలో సీఐటీయూ నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులతో దాడులు చేయించిన చంద్రబాబు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇక్కడి నాలుగురోడ్ల జంక్షన్లో రాస్తారోకో చేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని, మహిళలపై పోలీసు ల లాఠిచార్జీ సంఘటనను అన్ని వర్గాల ప్రజ లు ఖండించాలని నినదించారు. సీఐటీయూ నేత ఉమామహేశ్వరరావు, సంఘ నేతలు మణి, పి.విమల, నిర్మల, భాను, జానకి పాల్గొన్నారు. -
అంగన్వాడీ వర్కర్ల వేతనాలు పెంచనందుకు సిగ్గుగా లేదా?
సాక్షి, అమరావతి: అంగన్వాడీ వర్కర్లకు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మాదిరిగా రాష్ట్రంలో వేతనాలను పెంచనందుకు సిగ్గుగా లేదా? అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. విజయనగరంలో తమ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీ వర్కర్లపై లాఠీచార్జి చేయడాన్ని మంగళవారం వైఎస్ జగన్ ట్వీటర్లో తీవ్రంగా ఖండించారు. ‘తమ హక్కుల సాధన కోసం విజయనగరంలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీ వర్కర్లపై జరిగిన పాశవికమైన లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబూ.. మీరు మహిళా సాధికారత గురించి మాట్లాడతారు. మళ్లీ వారిపై తీవ్ర అణచివేత చర్యలకు ఒడిగడతారు. తెలంగాణలో మాదిరిగా అంగన్వాడీ వర్కర్ల వేతనాలు పెంచనందుకు మీకు సిగ్గుగా లేదా?’అని జగన్ ట్వీటర్లో పేర్కొన్నారు. Strongly condemn brutal lathi charge on Anganwadi workers agitating for their rights at Vizianagram. @ncbn, you speak of women empowerment, yet you resort to oppressive measures against them. Aren't you ashamed of failing to provide them with enhanced wages, as done in Telangana? — YS Jagan Mohan Reddy (@ysjagan) April 24, 2018 -
మహిళలపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
-
లైంగిక వేధింపులు..ఐసీడీఎస్ పీడీపై వేటు
అనంతపురం : జిల్లాకు చెందిన ఐసీడీఎస్ పీడీ వెంకటేశంపై వేటు పడింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, వెంకటేశంను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఓ మహిళా ఉద్యోగిపై గతంలో పీడీ వెంకటేశం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ రమామణి విచారణలో ఆరోపణలు రుజువు కావటంతో కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నారు. -
లైంగిక వేధింపులు: బుక్కైన స్త్రీ సంక్షేమ శాఖ అధికారి
-
నా కోరిక తీర్చు.. లేకపోతే అంతే
సాక్షి, అనంతపురం : అది స్త్రీ సంక్షేమ శాఖ. అంటే మహిళలు, యువతుల సంక్షేమం కోసం పనిచేసే సంస్థ. కానీ అందులో పనిచేసే ఉద్యోగునులకే భద్రత లేకుండా పోయింది. తమ లైంగిక వాంఛ తీర్చాలంటూ ప్రతిరోజు వేధింపులే. పైఅధికారుల తీరుతో విరక్తి చెందిన ఓ మహిళా ఉద్యోగి, తన ఉన్నతాధికారికి తగిన రీతిలో బుద్ది చెప్పింది. అధికారి భాగోతాన్ని బట్టబయలు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం ఐసీడీఎస్ పీడీ వెంకటేశం ఓ మహిళా ఉద్యోగిపట్ల గత కొద్ది కాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. తన కోరిక తీర్చాలని లేకపోతే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రతిరోజు వెంకటేశం ఫోన్లో సదరు మహిళా ఉద్యోగిని వేధిస్తున్నాడు. అయితే అధికారి ఫోన్‌కాల్స్ అన్నింటిని మహిళా ఉద్యోగి రికార్డు చేసి తండ్రికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఉద్యోగి తండ్రి వెంకటేశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులు ఆపకపోతే ఆడియో టేపులను బయటపెడతామని హెచ్చరించారు. దీంతో దారికి వచ్చిన వెంకటేశం తన బాగాతాన్ని బయటపెట్టొద్దని, తన ఉద్యోగం పోతుందంటూ ఫోన్లోనే క్షమాపణ కోరాడు. దీంతో విషయం కొద్ది మేర సద్దుమణిగింది. గతంలోనే వెంకటేశంపై పలు ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నవెంకటేశంను సస్పెండ్ చేయాలంటూ జిల్లా ఐద్వా అధ్యక్షురాలు సావిత్రి డిమాండ్ చేశారు. -
ఐసీడీఎస్‌లో వసూళ్ల దందా
నెల్లూరు (వేదాయపాళెం): అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ఖాతాలలో బిల్లులు జమ కావడంతోనే వారివద్దనుంచి నిర్దేశిత పర్సంటేజీలలో కొందరు సీడీపీఓలు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆయా సెక్టార్లలో అంగన్వాడీ కార్యకర్తలుగా పనిచేస్తూ సెక్టార్ల లీడర్లుగా కొనసాగేవారే తోటి అంగన్వాడీ కార్యకర్తల నుంచి బలవంతపు వసూళ్లు సాగిస్తూ కీలకంగా మారుతున్నారు. అంగన్వాడీ కార్యకర్తల నుంచి వసూలు చేసిన పర్సంటేజీల నగదును గుట్టుచప్పుడు కాకుండా సూపర్వైజర్లకు అందజేస్తుంటారు. సూపర్వైజర్లు సీడీపీఓలకు చెల్లించాల్సిన స్థాయి మొత్తాన్ని గోప్యంగా వారికి చేరుస్తున్నారు. ఆయా ప్రాజెక్ట్‌ల పరిధిలో నెలవారీ మామూళ్లు రూ.లక్షలు సీడీపీఓలు, సూపర్వైజర్ల పరమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలున్నాయి. వసూళ్ల పరంపర ఇలా.. టీఏ బిల్లులలో 10 శాతం వసూలు చేస్తున్నారు. అదేమిటంటే ట్రెజరీలో మూడు శాతం సమర్పించుకోవాలని, మిగతాది వేరే ఖర్చులు అంటూ అక్రమ వసూళ్లను సమర్థించుకుంటున్నారు. గ్యాస్ బిల్లులు, అంగన్వాడీ కేంద్రం అద్దె బిల్లులు విషయంలో ఐదు శాతం వసూలు చేస్తున్నారు. ఇచ్చే నెల వారీ గ్యాస్ బిల్లులు అంతంత మాత్రంగా ఉండగా పర్సంటేజ్‌లు వసూలు చేస్తుండటంతో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లపై ఆర్థికభారం పడుతోంది. అలాగే అర్బన్ ప్రాంతాల్లో ఇంటి అద్దెలు అధికంగా ఉన్నా రూ.3వేలు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారు. అద్దె బిల్లులు విషయంలో కూడా సూపర్వైజర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కోతలు విధిస్తున్నారు. నెల వారీ ఇంటి అద్దెలు సక్రమంగా పడకున్నప్పటికీ అంగన్వాడీ కార్యకర్తలే ఇంటి యజమానులకు నచ్చజెప్పకోవడమో లేదా తామే ఆర్థిక భారాన్ని భరించటమో చేస్తున్నారు. ఈ క్రమంలో బిల్లులు పడినప్పడు తమ పర్సంటేజ్‌లు తమకు ఇవ్వాల్సిందేనంటూ బెదిరింపులకు పాల్పడటం కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్లలోనూ కమీషన్లే.. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ నుంచి అధికారులు నెలవారీ మామూళ్లకు పాల్పడుతున్నారు. నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ కమీషన్ దండుకుంటున్నారు. అక్రమ వసూళ్ల కారణంగా కోడిగుడ్ల సరఫరాలో లోపాలున్నప్పటికీ సీడీపీఓలు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కనీస గుడ్డు బరువు 50 గ్రాములు ఉండాల్సి ఉండగా తక్కువ బరువు కలిగిన గుడ్డులు సరఫరా చేస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంగన్వాడీ కార్యకర్తలు కోడిగుడ్ల విషయం సూపర్వైజర్లు, సీడీపీఓలకు చెబుతున్నప్పటికీ పట్టించుకోవటంలేదు. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోవాలంటూ సూపర్వైజర్లు, సీడిపీఓలు అంగన్వాడీ కార్యకర్తలకు సర్దిచెబుతున్నారు. కమీషన్లే ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమావేశాల్లో బెదిరింపులు ప్రాజెక్ట్, సెక్టార్ మీటింగ్‌లలో పర్సంటేజీలు చెల్లించని అంగన్వాడీ కార్యకర్తలను సీడీపీఓలు, సూపర్వైజర్లు బెదరిస్తున్నారు. విధి నిర్వహణలో రికార్డులన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ సమావేశంలో నిలబెట్టి దూషిస్తున్నారు. పర్సంటేజీలు ఇవ్వకపోవడమే ఇందకు కారణమని సమాచారం. జిల్లా అధికారులు దృష్టి సారించి ఐసీడీఎస్‌లో ఉన్న అవినీతిని ప్రక్షాలన చేయాల్సిన అవసరం ఉంది. ట్రెజరీలో పర్సంటేజీల మోత ప్రతిబిల్లు విషయంలో జిల్లాలోని 17 ప్రాజెక్ట్‌లలో అంగన్వాడీ కార్యకర్తల నుంచి పర్సంటేజీలు వసూలు చేస్తున్న మాట వాస్తవమే. టీఏ బిల్లులు, గ్యాస్, ఇంటి అద్దె బిల్లులు విషయంలో సీడీపీఓలు బలవంత వసూళ్లకు పాల్పడుతున్నారు. –వై.సుజాతమ్మ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఫిర్యాదు చేస్తే చర్చలు తీసుకుంటాం ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లలో బిల్లుల చెల్లింపుల విషయంలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు ఈ విషయంలో ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకుని వస్తే పరిస్థితిని చక్కదిద్దుతాం. –పి.ప్రశాంతి, ఇన్చార్జి పీడీ, ఐసీడీఎస్ -
దొరికాడు..
అడ్డతీగల (రంపచోడవరం): అడ్డతీగల ఐసీడీఎస్ కార్యాలయంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు గురువారం దాడి చేసి రూ.11 వేలు లంచం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్ బద్దపు సత్యనారాయణను అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకరరావు కథనం ప్రకారం.. కార్యాలయంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న జి.నాగేశ్వరరావు ఇక్కడ జీపు లేకపోవడంతో పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం ఐసీడీఎస్ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. జీతభత్యాలన్నీ అడ్డతీగల కార్యాలయం నుంచే పొందుతున్నారు. తన భార్యకు అనారోగ్యంగా ఉండడంతో తన జీపీఎఫ్ ఖాతాలో నిల్వ ఉన్న రూ.1.29 లక్షలు, సరెండర్ లీవు ఎన్‌క్యాష్‌మెంట్ కింద రూ.56,940 పొందడానికి జూనియర్ అసిస్టెంట్‌ని ఖజానా శాఖకు బిల్లు పెట్టమని కోరాడు. తనతో పాటు ఖజానా శాఖలో సిబ్బందికి కలిపి రూ.15 వేలు లంచం ఇస్తే బిల్లు పెడతానని డ్రైవర్ నాగేశ్వరరావును జూనియర్ అసిస్టెంట్ బద్దపు సత్యనారాయణ డిమాండ్ చేశారు. తాను ఉన్న పరిస్థితుల్లో అంత సొమ్ము ఇచ్చుకోలేనని రూ.11 వేల నగదు అయితే ఇస్తానని చెప్పాడు. బిల్లు మంజూరు అయ్యాక ఇవ్వమని చెప్పడంతో ఆ సొమ్ము డ్రైవర్ నాగేశ్వర్రావు ఖాతాలో పడగా లంచం సొమ్ము కోసం జూనియర్ అసిస్టెంట్ నుంచి వేధింపులు ఎక్కువకావడంతో బాధితుడు నాగేశ్వరరావు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకుని గురువారం జూనియర్ అసిస్టెంట్ బద్దపు సత్యనారాయణకి డ్రైవర్ నాగేశ్వరరావు లంచం సొమ్ము రూ.11 వేలు ఇస్తుండగా వల పన్ని పట్టుకున్నామని డీఎస్పీ సుధాకర్‌రావు తెలిపారు. రూ.11 వేలు నగదు స్వాధీనపర్చుకుని బద్దపు సత్యనారాయణ వద్ద వాంగ్మూలం నమోదు చేసుకుని అతడిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుడిని శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఖజానాశాఖలోని సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా? అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ దాడుల్లో సీఐలు పుల్లారావు, మోహనరావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
బాల్యానికి మూడుముళ్లు
బాల్యవివాహాలను అరికట్టేందుకు అధికారులు చర్యలెన్ని చేపడుతున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నా.. తలెత్తే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నా చాటుమాటుగా పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో 50 రోజుల వ్యవధిలో ఆరు బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. మరికొన్ని చాటుమాటుగా జరిగినట్లు తెలుస్తోంది. అభద్రత, నిరక్షరాస్యత, అజ్ఞానం, పేదరికం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. సాక్షి, యాదాద్రి : ప్రజల అజ్ఞానం, నిరక్షరాస్యత, బాలికలపై అభద్రతాభావంతో బాల్య వివాహాలు జిల్లాలో జరుగుతున్నాయి. 13, 14 ఏళ్ల వయసులోనే బాలికల వివాహం చేసి అత్తింటికి పంపిస్తున్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాల కుటుంబాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు చోటు చేసుకున్న సంఘటనలు చూస్తే తెలుస్తోంది. అధికారులకు అందిన సమాచారం మేరకు కొంత మేరకు అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో నియంత్రించలేక పోతున్నారు. జిల్లాలోని 16మండలాల్లోనూ ఈ పరిస్థితి ఉంది. హైదరాబాద్ శివారులో గల అభివృద్ధి చెందుతున్న భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, చౌటుప్పల్, బొమ్మలరామారం, తుర్కపలి లాంటి మండలాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రెండేళ్ల కాలంలో పలు ఘటనలు బీబీనగర్ మండలంలోని రెండేళ్ల కాలంలో నాలుగు బాల్య వివాహాలను అధికారులు నిలిపివేయించారు. 2016లో జియాపల్లి తండా, 2017లో రుద్రవెళ్లి, కొండమడుగు, యాపగానితండాలో, మోత్కూరు మండలంలో తొమ్మది బాల్యవివాహాలను అధికారులు అడ్డుకున్నారు. మోత్కూరు మండలం కొండగడప, దాచారంలో ఒక్కటి, అడ్డగూడూర్ మండలం కంచనపల్లిలో మూడు, అడ్డగూడూర్, హజీంపేట, మంగమ్మగూడెం, గట్టుసింగారం గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున అడ్డుకుని వారి తల్లి దండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే రాజాపేట మండలం నెమిలో ఒకటి, సంస్థాన్ నారాయణపురం మండలంలో మూడు జరిగాయి. వీటిలో బాల్యవివాహాలలో రెండు ఘటనలు తండాల్లో జరిగినవి కాగా, ఒకటి ఉన్నత వర్గానికి చెందినది. వీటిని రెవెన్యూ, పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు, చైల్డ్‌కేర్ ప్రతినిధులు బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా అడ్డుకట్ట పడడం లేదు. గడిచిన 45 రోజుల్లో జిల్లాలో ఆరు బాల్య వివాహాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. కల్యాణలక్ష్మికి దూరం ఆడ పిల్ల పెళ్లి కోసం పభుత్వం కల్యాణ లక్ష్మి పథ కం కింద ఆర్థిక సాయం అందజేస్తోంది. బాల్య వి వాహాలు చేస్తే ఈ పథకానికి అర్హులు కారు. అయి తే కొందరు అధికారులు కల్యాణలక్ష్మి పథకాన్ని బాల్య వివాహం చేసుకున్న వారికి కూడా వర్తింపజేస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరు(ఎం) మండలంలో బాల్య వివాహం జరిగిన బాలిక కుటుంబానికి కళ్యాణలక్ష్మి చెక్కు అందజేశారు. ఈవిషయంలో అధికారులు విచారణ కూడా చేపట్టారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ, 21 ఏళ్లు నిండిన యువకుడితో వివాహం జరిగితే కల్యాణ లక్ష్మి పథకంలో అర్హత సాధిస్తారని అధికారులు చెబుతున్నారు. నిరక్ష్యరాస్యత, పేదరికం గ్రామీణ ప్రాంతాల్లో బాల్యవివాహాలు జరిగేందుకు నిరక్షరాస్యత, పేదరికం, ఆర్థిక భారం, ఆడపిల్లంటే అభద్రతాభావం ప్రధాన కారణాలని తెలుస్తోంది. కొందరు తల్లిదండ్రులు తమ కుమార్తెకు వివాహం చేయడానికి ఆర్థిక స్థోమత ఎక్కడ అడ్డువస్తుందోన ని చిన్న వయస్సులోనే పెళ్లి చేస్తున్నారు.ఆడపిల్ల ఏ దో ఒక రోజు బయటకు వెళ్లాల్సిందేనని, అదేదో వచ్చిన మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకోవా లని అని కూడా బాల్య వివాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి మార్చి 19 వరకు వెలుగుచూసినవి.. ఫిబ్రవరి 1న : తుర్కపల్లి మండలం ముల్కలపల్లి పంచాయతీ కిమ్యాతండా ఫిబ్రవరి 27న : తుర్కపల్లి మండలం గొల్లగూడెం పంచాయతీ పరిధిలో రామోజీనాయక్ తండాలో మార్చి 2న : వలిగొండ మండలం పహిల్వానర్పురంలో మార్చి 10న : సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్లో మార్చి 12 : తుర్కపల్లి మండలం దత్తాయపల్లిలో మార్చి 19 : భువనగిరి మండలం పచ్చబొర్లతండాలో 18వివాహాలు అడ్డుకున్నాం జిల్లాలో 18 బాల్య వివాహాలను అడ్డుకున్నాం. జిల్లా ఆవిర్భావం తర్వాత ఆలేరు, మోత్కూర్, భువనగిరి, రామన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో జరిగిన బాల్య వివాహాలపై స్పందించాం. వెంటనే అక్కడికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వివాహాలను అడ్డుకున్నాం. బాల్య వివాహాలు చేస్తే ప్రభుత్వ పథకాలు అందవు. చట్టపరంగా శిక్షలు ఉంటాయి. –జిల్లా మహిళా సంక్షేమాధికారి శారద -
ఊరిస్తున్న ఉద్యోగాలు
సాక్షి, జనగామ: ఐసీడీఎస్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీకి గ్రహణం పట్టింది. నాలుగు నెలల క్రితమే నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పిన అధికారులు చివరకు ఆగిపోయారు. దీంతో అంగన్వాడీ పోస్టుల కోసం జిల్లాలోని నిరుద్యోగ మహిళలు ఎదురు చూస్తున్నారు. 1977లో మాతాశిశు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టాయి. ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలను నెలకొల్పి గర్భిణులు, బాలింతలు, ఆరు ఏళ్లలోపు చిన్నారులకు సేవలందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, కొడకండ్ల ప్రాజెక్టుల పరిధిలో 732 కేంద్రాలున్నాయి. కేజీ టు పీజీ పథకానికి తొలిమెట్టు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కేజీ టు పీజీ ఉచిత విద్య పథకానికి అంగన్వాడీ కేంద్రాలను తొలిమెట్టుగా భావిస్తున్నారు. అర్హత ఉన్న అంగన్వాడీ టీచర్లకు ఉపాధ్యాయ శిక్షణను ఇప్పించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కేజీ టు పీజీ విద్య పథకం విజయవంతం కావాలంటే అంగన్వాడీలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో అంగన్వాడీ కేంద్రాల ప్రాధాన్యం పెరిగింది. ఇన్‌చార్జిలతోనే.. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి 2017 నవంబర్ నెలలో సన్నాహాలను ప్రారంభించారు. నాలుగేళ్ల తర్వాత ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, నోటిఫికేషన్ ఇప్పటివరకు జారీ చేయలేదు. జనగామ ప్రాజెక్టు పరిధిలో 16 మంది అంగన్వాడీ టీచర్లు, 9 మినీ అంగన్వాడీ టీచర్లు, 24 ఆయా పోస్టుల చొప్పున ఖాళీ ఉన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్ ప్రాజెక్టు పరిధిలో 10 అంగన్వాడీ టీచర్లు, 7 మినీ అంగన్వాడీ టీచర్లు, 14 ఆయా పోస్టులు, కొడకండ్ల ప్రాజెక్టు పరిధిలో 13 అంగన్వాడీ టీచర్లు, 9 మినీ టీచర్లు, 21 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నవంబర్ నెలలో ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి వచ్చినప్పటికి వాటి ఊసే లేకుండా పోయింది. ఇన్‌చార్జిలతోనే నెట్టుకు వస్తున్నారు. ప్రభుత్వానికి నివేదిక పంపాం.. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నవంబర్ నెలలో గుర్తించాం. ఖాళీ పోస్టుల వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ జారీ చేస్తాం. మాకున్న సమాచారం మేరకు త్వరలోనే పోస్టులను భర్తీ చేసే అవకాశాలున్నాయి. పద్మజారమణ, జిల్లా మహిళా సంక్షేమ అధికారి -
నవ కిశోరం
హుస్నాబాద్‌రూరల్: బాలికల సంరక్షణ కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లోని కిశోర బాలికలు ఎంత మంది ఉన్నారు? ఎంత వరకు చదువుకున్నారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? చదువు ఎందుకు మానేశారు? కుటుంబ నేపథ్యం, ఆరోగ్య సమాచారంపై సర్వే చేస్తున్నారు. బాలికలకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చి.. పురుషులకు సమానంగా నిలిపేలా చర్యలు తీసుకుంటున్నారు. బాలికలకు మహిళా సంక్షేమం, హక్కులపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో 57,615 మంది కిషోర బాలికలు సిద్దిపేట జిల్లాలోని 399 గ్రామాల్లో 57,615 మంది కిశోర బాలికలు ఉన్నట్టు ఐసీడీఎస్ అధికారులు సర్వే ద్వారా గుర్తించారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 25 మంది బాలికలను ఎంపిక చేసి.. వీరికి కంప్యూటర్ శిక్షణ అందిస్తున్నారు. ఇప్పటికే గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక ప్రాజెక్టులో బాలికలు శిక్షణ పొందుతున్నారు. అంతేకాదు గ్రామీణ ప్రాంతాలలో బాలికలు, స్త్రీలలో చైతన్యం తీసుకొచ్చేలా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోనే సమన్వయకర్తలను నియమించనున్నారు. పల్లెకు చేరి కిశోర బాలికలకు మహిళల హక్కులపై అవగాహన కల్పించడం, మహిళా సంక్షేమ పథకాలు, దగా పడ్డ మహిళలకు న్యాయ సలహాలు ఎక్కడ అందుతాయి? అనే విషయాలపై అవగహన కల్పించేలా సమన్వయకర్తలు పనిచేయనున్నారు. కిశోర బాలికల ఆరోగ్య పరిరక్షణ సరైన వసతులు లేక గ్రామీణ ప్రాంతాలకు చెందిన కిశోర బాలికలు చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. అంతేకాదు కూలి పనులు సైతం చేస్తున్నారు. కాగా, అభద్రతా భావంతో కొందరు తల్లిదండ్రులు తమ కుమార్తెలను దూర ప్రాంతాల్లో చదువుకునేందుకు పంపించడం లేదు. ఫలితంగా చాలమంది బాలికల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థినులు ఇంటర్మీడియట్ చేయడం లేదు. అదే ఇంటర్ చేసిన వారు డిగ్రీలో చేరడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కిశోర బాలికల సర్వే చేసి.. వారికి జీవన నైపుణ్యాల కల్పన చేపట్టనుంది. జీవన నైపుణ్యాల కల్పన ప్రభుత్వ ఆదేశాల మేరకు కిశోర బాలికల సర్వే చేపట్టి.. వారి వివరాలను అన్లైన్లో నమోదు చేస్తున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చదువులు మానేసిన బాలికలను చేరదీసి.. వారికి వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం గజ్వేల్, సిద్దిపేటలో కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నాం. త్వరలో హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల ఐసీడీఎస్ పరిధిలోని బాలికలకు కంప్యూటర్ శిక్షణ ఇస్తాం. చదువు మానేసిన బాలికలను గుర్తించి.. వారికి మహిళా హక్కులపై అవగాహన కల్పిస్తాం. అంతేకాదు బాలికల ఆరోగ్య పరిరక్షణకు శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. – జరీనాబేగం, ఐసీడీఎస్ పీడీ త్వరలో కంప్యూటర్ శిక్షణ గ్రామీణ బాలికలకు స్వయం ఉపాధి కోసం కంప్యూటర్ విద్యలో శిక్షణ ఇస్తున్నాం. ఇందుకోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లో కిశోర బాలికలపై సర్వే పూర్తి చేశాం. ప్రాజెక్టు పరిధిలో 6,450 మంది కిశోర బాలికలు ఉన్నారు. 20 మందికి కంప్యూటర్ శిక్షణ ఇచ్చేందుకు బ్యాచ్ తయారు చేశాం. త్వరలో హుస్నాబాద్‌లో ప్రారంభిస్తాం. మహిళల హక్కులపై అవగహన కల్పించి.. బాలికలను శక్తిగా తీర్చిదిద్దుటకు కృషి చేస్తున్నాం. – ఫ్లోరెన్స్, సీడీపీఓ, హుస్నాబాద్ -
గుడ్డలు కుక్కి... చేతులు విరిచి
ఖమ్మం క్రైం: అనారోగ్యంతో తల్లి చనిపోవటంతో పసిబిడ్డలు ఆకలితో అలమటిస్తూ ఏడుస్తున్నారు.. తల్లి లాంటి అమ్మమ్మ వారిని సముదాయించాల్సింది పోయి.. మద్యం మత్తులో వారిని చితకబాదింది. ఏడాదిన్నర బిడ్డ తల్లి కోసం ఏడుస్తుండటంతో ఆ చిన్నారి చేతులను విరిచేసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. జిల్లా కేంద్రంలోని త్రీటౌన్ ప్రాంతంలోని కాల్వొడ్డుకు చెందిన షేక్ సోందు కొంతకాలం క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. భార్య సైదాబీ తన ముగ్గురు ఆడపిల్లలు హుస్సేన్‌బీ(6), ఆసియా(3), జైనా(ఏడాదిన్నర), తల్లి కాశీంబీతో కలసి వెంకటగిరి ప్రాంతంలో ప్లాస్టిక్ కవర్లతో నివాసం ఏర్పాటు చేసుకొని.. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అమ్మమ్మ కాశీంబీ మద్యానికి బానిసైంది. ఈ క్రమంలో సైదాబీ ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం మృతి చెందింది. ఈ విషయం తెలియని ఇద్దరు చిన్నారులు తల్లికోసం ఏడుస్తుండటంతో.. మద్యం మత్తులో ఉన్న అమ్మమ్మ కాశీంబీ వారిని తీవ్రంగా కొట్టింది. భయపడిన చిన్నారి ఆసియా ఏడుపు ఆపింది. మరో చిన్నారి జైనా ఏడుపు ఆపకపోవటంతో చితక్కొట్టింది. పక్కనున్న వారి గద్దించడంతో కొట్టడం ఆపేసింది. చుట్టుపక్కల వారు పడుకున్న తర్వాత కాశీంబీ తల్లిపాల కోసం ఏడుస్తున్న జైనా నోట్లో గుడ్డలు కుక్కి.. దారుణంగా చేతులు విరిచేసింది. భయంతో ఆసియా ఓ మూలన నక్కి పడుకుంది. ఉదయం 10 గంటల సమయంలో సైదాబీ మృతదేహం చూసేందుకు వచ్చిన ఇరుగుపొరుగు వారు వేలాడుతున్న చిన్నారి చేతులను చూసి కాశీంబీని గద్దించారు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తుండగా.. ఆశియా తన చెల్లెలిని రాత్రి నుంచి కొడుతూనే ఉందని చెప్పింది. స్థానికులు స్వచ్ఛంద సంస్థ అన్నం ఫౌండేషన్‌కు ఫోన్ చేయడంతో ఆ సంస్థ నిర్వాహకుడు అన్నం శ్రీనివాసరావుతో పాటుగా వన్‌టౌన్ సీఐ రమేశ్ వచ్చి చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. చింతకాని హాస్టల్లో ఉంటోన్న పెద్ద కుమార్తె హుస్సేన్‌బీని తీసుకొచ్చి గంజేషాహిద్ మసీద్ కమిటీ వారు సైదాబీకి అంత్యక్రియలు నిర్వహించారు. జైనా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, హుస్సేన్‌బీ.. ఆసియాలను అన్నం ఫౌండేషన్ చేరదీసింది. వారు ఐసీడీఎస్ అధికారులతో మాట్లాడి.. ఆ చిన్నారులను బాలసదన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మమ్మ కాశీంబీ పారిపోయింది. -
అనారోగ్యలక్ష్మి
ఆదిలాబాద్ టౌన్ : గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారించేందుకు ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ జిల్లాలో పథకం అనారోగ్యలక్ష్మీగా మారింది. పలు అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు పూర్తి స్థాయిలో సరఫరా కాకపోవడంతో పథకానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. జిల్లాలోని పలు అంగన్వాడీ కేంద్రాలలో పాలు, నూనె, పప్పు సరఫరా కావడంలేదు. కోడిగుడ్లు సరఫరా అవుతున్నప్పటికీ కొన్ని సెంటర్లలో వాటిని సక్రమంగా పంపిణీ చేయడం లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో 5 ప్రాజెక్టులు, 51 సెక్టార్లు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 1,256 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 987 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు, 269 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 6నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 21,685 మంది, 3 నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 30,503 మంది, గర్భిణీ, బాలింతలు 10,520 మంది ఉన్నారు. కాగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ప్రతిరోజు ఒక పూట మధ్యాహ్నం పూర్తి స్థాయి భోజనం వండిపెట్టాలి. కానీ జిల్లాలో ఏ కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ప్రస్తుతం చాలా కేంద్రాల్లో పాలు, నూనె, పప్పులు లేవు. ఉడికించిన కొడిగుడ్లు ఇవ్వాల్సి ఉండగా ఉడికించకుండానే కార్యకర్తలు వాటిని ఇంటికి ఇస్తున్నారు. లోపించిన పర్యవేక్షణ.. ఐసీడీఎస్‌లో రెగ్యూలర్ అధికారులు లేకపోవడంతో పర్యవేక్షణ లోపించింది. ఆదిలాబాద్ అర్బన్ ప్రాజెక్టుకు గత ఐదారు సంవత్సరాలుగా ఇన్చార్జి అధికారులతో కాలం వెల్లదీస్తున్నారు. దీంతో చాలా అంగన్వాడీ కార్యకర్తలు సమయపాలన పాటించడంలేదు. దీంతో కొంత మంది అంగన్వాడీ కార్యకర్తలు లబ్ధిదారులకు అందజేయాల్సిన గుడ్లు, ఇతర సరుకులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపనలు ఉన్నాయి. ఆదిలాబాద్ అర్బన్ ప్రాజెక్టులో డిసెంబర్ 20 నుంచి పాల సరఫరా లేదు. ఉట్నూర్, బోథ్ ప్రాజెక్టులో కూడా అదే పరిస్థితి. పాలసరఫరా నిలిచి నెలరోజులు దాటినా అధికారులు పట్టించుకోవడంలేదని అంగన్వాడీ కార్యకర్తలు, లబ్ధిదారులు పేర్కొంటున్నారు. పాలకోసం టెండర్ వేస్తాం.. గత కొన్ని రోజులుగా పాల సరఫరా నిలిచిపోయింది. త్వరలో కొత్త టెండర్లు వేస్తాం. పప్పు, నూనె, సరుకులు ఉన్నాయి. అంగన్వాడీ కార్యకర్తలు మెనూ ప్రకారం భోజనం వండిపెట్టాలి. సమయానికి కేంద్రాలను తెరవాలి. – మిల్కా, జిల్లా సంక్షేమ అధికారి -
అద్దె చెల్లించలేదని..అమ్రపాలిపై కోర్టు ఆగ్రహం
-
కలెక్టర్ అమ్రపాలిపై కోర్టు ఆగ్రహం
సాక్షి, వరంగల్ అర్బన్ : జిల్లా కలెక్టర్ అమ్రపాలిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ కార్యాలయం ఉన్న ప్రైవేటు భవనానికి అద్దె చెల్లించనందుకు కలెక్టర్ వాహనాన్ని సీజ్ చేయాలని జిల్లా కోర్టు శనివారం ఆదేశాలు ఇచ్చింది. తన భవనాన్ని ఐసీడీఎస్ కార్యాలయం కోసం వాడుకుంటూ.. రెండేళ్లుగా అద్దె చెల్లించడం లేదని, అద్దె బకాయిలు రూ.3 లక్షల చెల్లించాలని నోటీసులు జారీచేసినా కలెక్టర్ స్పందించలేదని పేర్కొంటూ ఇంటి యజమాని కృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన సీనియర్ సివిల్ జడ్జి.. జిల్లా కలెక్టర్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వాహనం జప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. బకాయిలు చెల్లించిన తర్వాతే వాహనాన్ని తిరిగి అప్పగించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ ఫార్చున్ వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు కోర్టు సిబ్బంది కలెక్టరేట్‌కు వచ్చారు. -
అమ్మో..ఆడపిల్ల.. మాకొద్దు !
ఆడపిల్ల ఉంటే.. ఆ ఇంటికి వెలుగు.. ఈ నినాదం.. ప్రసంగాలకే పరిమితమవుతుందా.. వరుసగా మూడు, నాలుగు కాన్పుల్లోనూ ఆడపిల్ల పుడితే.. ఆమ్మో..ఆడపిల్ల అని బావురుమంటున్నారు.. ఈ ‘బరువు’ మోయలేమని చేతులెత్తేస్తున్నారు.. ఒకవైపు..కుటుంబ ఆర్థిక పరిస్థితులు మరోవైపు అవగాహనలోపం.. కారణం ఏదైనా ఆడపిల్ల అంటే అరిష్టం అనుకుంటున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో గిరిజన తల్లిదండ్రులు మూడు, నాలుగు కాన్పుల్లోనూ ఆడపిల్ల పుడితే తాము సాకలేమని ఐసీడీఎస్ అధికారులకు అప్పగిస్తున్నారు..ఇలాంటి ఘటనే శుక్రవారం చోటుచేసుకుంది. చందంపేట మండలంలో నాలుగు జంటలు తమకు పుట్టిన ఆడపిల్లలను సాకలేమంటూ తెగేసి చెప్పారు. వారికి ఐసీడీఎస్ అధికారులు, జెడ్పీచైర్మన్ స్వయంగా కౌన్సిలింగ్ ఇవ్వగా, రెండు జంటలు తమ పిల్లలను తిరిగి తీసుకోగ, మరో రెండు జంటలు ఆరునెలల వరకు సాకి ఆ తర్వాత శిశుగృహకు అప్పగిస్తామని చెప్పారు. – చందంపేట చందంపేట (దేవరకొండ) : సృష్టికి మూలం అమ్మ... ఆ తల్లిదండ్రులకు జన్మచ్చింది కూడా ఓ మాతృమూర్తే... అలాంటిది నవమాసాలు మోసి కన్నాక ఆడపిల్ల అని తెలియడంతో సాకలేమని సాకులు చెబుతున్నారు.. నన్ను కన్న నా తల్లి కూడా ఆడదే అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఆడ పిల్లల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ప్రభుత్వం అంగన్వాడీ పాఠశాలల నుంచి పాలు, గుడ్డు, పౌష్టికాహారం కూడా అందిస్తోంది. అదే విధంగా ఆడ పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం కూడా పథకాలు అమలవుతున్నాయి. అయినా చందంపేట మండల ప్రజల ధో రణిలో మార్పు రావడం లేదు. తాజాగా ఒకే రోజు నలు గురు తల్లిదండ్రులు తమ ఆడ పిల్లలను సాకలేమని ఐసీ డీఎస్ అధికారులకు అప్పగించేందుకు ముందుకొచ్చారు. ఆడశిశువులు వద్దనుకున్న ఆ నలుగురు.. ♦ నేరెడుగొమ్ము మండలం పీర్లచావిడి గ్రామానికి చెందిన నేనావత్ సరస్వతి, లక్ష్మణ్ దంపతులకు మొదట మగ సంతానం కలుగగా, 2,3,4వ కాన్పుల్లో ఆడ పిల్లలు జన్మించారు. దీంతో 4వ కాన్పులో జన్మించిన ఆడపిల్లను వదిలించుకునేందుకు ఆ తల్లిదండ్రి సిద్ధమయ్యారు. ఇదే విషయమై ఐసీడీఎస్ అధికారులు చందంపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్మన్ బాలునాయక్ దృష్టికి విషయాన్ని తీసుకురావడంతో స్పందించిన ఆయన దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఆదుకునేలా చూస్తానని హామీనిచ్చారు. దీంతో దంపతులు శిశువును సాధుకుంటామని చెప్పడంతో వారిని ‘మన ఇంటి లక్ష్మి’ కార్యక్రమంలో భాగంగా జెడ్పీ చైర్మన్ సన్మానించారు. ♦ నేరెడుగొమ్ము మండల పరిధిలోని పందిరిగుండుతండాకు చెందిన జ్యోతి, లాలు దంపతులకు 1,2,3 కాన్పుల్లో ఆడ శిశువులు జన్మించడంతో 3వ సంతానాన్ని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. కాగా పీడీ పుష్పలత వారికి కౌన్సిలింగ్ నిర్వహించి ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు తాగించాలని సూచించారు. అనంతరం ఆడ పిల్లను వదులుకోవాలనుకుంటే ముందుకు రావా లని అన్నారు. అప్పటి దాకా శిశువుకు ఎలాంటి హాని తలపెట్టొద్దని రాతపూర్వకంగా పత్రం తీసుకున్నారు. ♦ చందంపేట మండలం తెల్దేవర్పల్లి పరిధిలోని బాపన్మోట్తండాకు చెందిన నేనావత్ సుశీల, గోపాల్ దంపతులకు 1,2 కాన్పుల్లో ఆడ శిశువులు జన్మించారు. దీంతో 2వ కాన్పులో పుట్టిన ఆడ శిశువును శిశుగృహకు అప్పగిస్తామని అనడంతో ఐసీడీఎస్ అధికారులు కౌన్సి లింగ్ నిర్వహించారు. తమ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రుణ సదుపాయం కల్పిస్తే తమ శిశువును కాపాడుకుంటామని పేర్కొన్నారు. పీడీ పుష్పలత కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆర్థికసాయానికి హామీఇవ్వడంతో వారు శిశువును వదులకునే నిర్ణయాన్ని విరమించుకున్నారు. ♦ చందంపేట మండలం యల్మలమంద గ్రామపంచాయతీ బిచ్చితండాకు చెందిన బాణావత్ లక్ష్మి, బిచ్చు దంపతులకు వరుసగా మూడు కాన్పుల్లో ఆడ శిశువులు జన్మించారు. దీంతో 3వ కాన్పులో జన్మించిన ఆడ శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. దీంతో ఐసీడీఎస్ అధికారులు ఆ పాపకు ఆరు నెలలు తల్లిపాలు అందించాలని సూచించారు. -
పేగుబంధం తెంచుకున్న కన్నతల్లి
-
అమ్మా.. అప్పుడే పెళ్లొద్దమ్మా..!
వెలిగండ్ల: జిల్లాలో బాల్య వివాహాలు ఏదోఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా వివాహ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఐసీడీఎస్, పోలీసు అధికారులు కొన్ని బాల్య వివాహాలను అడ్డుకుంటున్నా.. ఆడపిల్లల తల్లిదండ్రుల్లో మార్పు రావడం లేదు. కొన్నిచోట్ల రాత్రికి రాత్రే పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. రాష్ట్రంలో బాల్య వివాహాలు నమోదు విషయంలో జిల్లా చెప్పుకోదగ్గ స్థానంలోనే ఉన్నట్లు అధికారులే చెబుతున్నారు. బాల్య వివాహాల గణాంకాలు ప్రమాద స్థాయికి చేరుకుంటున్నాయి. పేదరికం, నిరక్ష్యరాస్యత, చైతన్యం లేకపోవడం ప్రధాన కారణం. బాల్య వివాహాలను నిరోధించేందుకు నిరంతర ప్రచారం అవసరం. ముఖ్యంగా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలి. మతాల పెద్దలు, తల్లిదండ్రులకు బాల్య వివాహాలతో కలిగే నష్టాలు, వాటి చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. గణాంకాలు ఇలా.. జిల్లాలో 2014 నుంచి 2017 డిసెంబర్ వరకు 804 బాల్య వివాహాలను అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అడ్డుకున్నారు. 2014లో 237, 2015లో 274, 2016లో 249, 2017లో నేటి వరకు 44 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది వెలిగండ్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని మూడు మండలాల్లో బాల్య వివాహాలను ఐసీడీఎస్ అధికారులు, పోలీస్ అధికారులు అడ్డుకున్నారు. వెలిగండ్ల మండలం కంకణంపాడులో అక్టోబర్‌లో బాల్యవివాహం జరుగుతోందని సమాచారం తెలియడంతో సీడీపీఓ బి.లక్ష్మీప్రసన్న, ఎస్ఐ పి.చౌడయ్యలు రాత్రి వేళ ఆ గ్రామానికి వెళ్లి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ నెల 19వ తేదీన మండలంలోని కొట్టాలపల్లిలో బాల్య వివాహం చేస్తున్నారని స్వయంగా ఓ మైనర్ 100 నంబర్‌కు కాల్ చేసి వివాహాన్ని ఆపాలని కోరడం విశేషం. స్పందించిన సీడీపీఓ బి. లక్ష్మీప్రసన్న, ఎస్ఐ పి.చౌడయ్యలు జరగబోయే బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఆ మైనర్‌ను ఒంగోలు బాలసదన్‌కు తరలించారు. ఈ ఏడాది సీఎస్‌పురం మండలం కె.అగ్రహారంలో ఒకే రోజు రెండు బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. హనుమంతునిపాడు హాజీపురంలో జరగబోయే బాల్య వివాహాన్ని నిలువరించగలిగారు. ఇవిగో..అనర్థాలు ♦ బాల్య వివాహాలు చేస్తే ముఖ్యంగా బాలికల విషయంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ♦ చిన్న వయసులోనే గర్భిణులు కావడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ♦ నెలలు నిండకముందే ప్రసవించే ప్రమాదం ఉంటుంది. ప్రసవ సమయంలో మాతృ మరణాలు జరిగే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి.. ♦వైకల్యంతో కూడిన శిశు జననాలు, మరణాలు జరగవచ్చు. ♦మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ♦శారీరక ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది. ♦భయంతో, సిగ్గుతో చదువు మధ్యలో నిలిపేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. నిరక్ష్యరాస్యతే కారణం బాల్య వివాహాలు జరిగేందుకు ముఖ్యకారణం నిరక్ష్యరాస్యత. కుటుంబ పరిస్థితులను ఆధారం చేసుకొని బాల్యవివాహాలు చేయడం పరిపాటైంది. తల్లిదండ్రుల్లో అభద్రతా భావాన్ని పోగొట్టాలి. ప్రజలను చైతన్యవంతులను చేసి బాల్యవివాహాలను నిరోధించేందుకు తగు చర్యలు చేపడుతున్నాం. – బి.లక్ష్మీప్రసన్న, సీడీపీఓ, వెలిగండ్ల -
అంగన్వాడీలకు ‘ఆన్లైన్’లో సరుకులు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కొత్తగా సప్లై చైన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు చేరవేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ట్యాబ్‌లు, బార్‌కోడింగ్ విధానాన్ని తీసుకొస్తోంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఇదే నమూనాను జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. బార్కోడ్ ద్వారానే పంపిణీ.. రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా 22.28 లక్షల మంది బాలింతలు, గర్భిణులు, శిశువులకు పోషకాహారాన్ని అందిస్తున్నారు. పోషకాహార పంపిణీకి ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తుండగా... కొన్నిచోట్ల ఈ సరుకులు పక్కదారి పడుతుండడంతో లక్ష్యం గాడితప్పుతోంది. దీంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో క్షేత్రస్థాయిలో అక్రమాలను అరికట్టేందుకు సర్కారు ఉపక్రమించింది. రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టు పరిధిలో ఒకటి చొప్పున 149 గోదాములున్నాయి. వీటి ద్వారా పప్పులు, వంటనూనె, మురుకులు, బాలామృతం ప్యాకెట్లను అంగన్వాడీ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారుల నుంచి జారీ అయ్యే ప్రొసీడింగ్ల ద్వారా కేంద్రాలకు సరుకులను సరఫరా చేస్తుండగా... ఇకనుంచి బార్కోడ్ పద్ధతిని అమలు చేయనున్నారు. అంగన్వాడీ కేంద్రం స్థాయిలో అవసరమైన కోటా వివరాలను ఐసీడీఎస్ ప్రాజెక్టుకు ముందుగా చేరవేయాల్సి ఉంటుంది. అనంతరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు ఆయా కేంద్రాలకు అవసరమైన కోటా విడుదల చేస్తూ.. సరుకుల వారీగా బార్‌కోడ్‌ను ఆన్లైన్లో కేంద్రం నిర్వాహకులకు జారీ చేస్తారు. అలాగే సరుకులు పంపిణీ చేసే కాంట్రాక్టరు సదరు కోటాను అంగన్వాడీ కేంద్రానికి తీసుకెళ్లినప్పుడు అంగన్వాడీ టీచర్ వేలిముద్రలు నమోదు చేస్తేనే కోటా పంపిణీకి సంబంధించిన ఫైలు తెరుచుకుంటుంది. అనంతరం బార్కోడ్ ద్వారా సరుకులను పొందాల్సి ఉంటుంది. వేలిముద్రల నమోదుకు కాంట్రాక్టరు వద్ద ట్యాబ్ ఉంటుంది. అదేవిధంగా బార్కోడ్ వివరాలు, సరుకుల పంపిణీ సమాచారం ట్యాబ్‌లో నిక్షిప్తం కావడంతో పంపిణీ చేసిన వెంటనే ఆ సమాచారం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలోని సెంట్రల్ సర్వర్‌కు చేరుతుంది. దీంతో కాంట్రాక్టరు రూటుమ్యాపు సైతం తెలుస్తుందని, సరుకులు దారితప్పే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో బార్కోడ్ విధానాన్ని మూడు నెలల క్రితం ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ కార్యక్రమం అక్కడ సత్ఫలితాలిచ్చింది. దీంతో ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. -
నారాయణ.. నారాయణ!
ఓ సీనియర్ అసిస్టెంట్ కూడబెట్టిన ఆస్తుల విలువ రూ.50కోట్లు. జీవితాంతం కష్టపడినా నాలుగు రాళ్లు మిగుల్చుకునేందుకు చిరుద్యోగుల ఎన్నో లెక్కలు వేసుకుంటారు. అలాంటిది.. కోట్లాది రూపాయలు కూడబెట్టిన నారాయణరెడ్డి ఇప్పుడు ఆ స్థాయి ఉద్యోగులతో పాటు జిల్లా అధికారుల్లోనూ చర్చనీయాంశంగా మారారు. అసలు ఎవరీయన? ఈ స్థాయికి ఎలా ఎదిగారు? మూలాల్లోకి వెళితే.. వాస్తవాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కదిరి: ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించాడనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఐసీడీఎస్ సీనియర్ అసిస్టెంట్ నారాయణరెడ్డి పేరు జిల్లా వ్యాప్తంగా మార్మోగుతోంది. ధర్మవరం–బత్తలపల్లి మార్గమ««ధ్యంలోని వేల్పుమడుగు ఇతని స్వగ్రామం. పిల్లల పోషణలో భాగంగా 1980లో అనంతపురానికి మకాం మారింది. తపోవనం ప్రాంతంలో నివాసం ఉంటూ సైకిల్‌పై ఇంటింటికీ వెళ్లి పాలమ్మేవాడు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతంలో కాపురం ఉంటున్న అప్పటి ఐసీడీఎస్ పీడీ భగీరథమ్మ(ప్రముఖ రచయిత కొలకనూరి ఇనాక్ సతీమణి) ఇంటికీ పాలు పోస్తుండేవాడు. ఆ సందర్భంలో ‘మేడం.. ఇల్లు జరగటం కష్టంగా ఉంది. పిల్లలను బాగా చదివించాలని అనంతపురానికి చేరుకున్నా. సాయం చేయాలని ప్రతిరోజూ ప్రా«ధేయపడేవాడు. జాలిపడిన ఆమె.. ఐసీడీఎస్ శాఖకు అనుబంధంగా ఉన్న సేవాసదన్‌లో గుంతలు తీసి మొక్కలు నాటేందుకు ఎన్‌ఎంఆర్‌గా ఉద్యోగ అవకాశం కల్పించారు. ఆ తర్వాత అటెండర్‌గా.. జూనియర్ అసిస్టెంట్‌గా.. ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్ స్థాయికి ఎదిగాడు. ఇప్పటికీ ఇతను జిల్లా కేంద్రంలోని కొవూరునగర్, తపోవనం ప్రాంతాల్లో పాలనారాయణరెడ్డిగానే చిరపరిచుతులు. ఒకప్పుడు ఇక్కడే పాలమ్మేవాడు.. రూ.కోట్లు ఎలా సంపాదించాడని స్థానికులు ఆశ్యర్యపోతున్నారు. ఆ ఫైల్‌ను మాయం చేశారట.. అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లను సరఫరా చేసే టెండర్‌కు సంబంధించిన టెండర్ బాక్స్‌ను పై అధికారులకు తెలియకుండా నారాయణరెడ్డి గోల్మాల్ చేస్తున్నట్లు గ్రహించిన అప్పటి ఏజేసీ చెన్నకేశవరావు ఇతన్ని సస్పెండ్ చేశారు. విచారణ చేపట్టాలని అప్పట్లో ఆదేశించారు. ఆ బాధ్యతలను అప్పటి బీసీ కార్పొరేషన్ ఈడీ, ప్రస్తుత ఐసీడీఎస్ పీడీ అయిన వెంకటేశంకు ఆ ఫైల్‌ను అప్పగించండని అప్పటి పీడీ విజయలక్ష్మిని ఆదేశించారు. అయితే నారాయణరెడ్డి ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఫైల్ వెంకటేశంకు చేరకుండా జాగ్రత్త పడ్డారు. తనకున్న పలుకుబడితో మళ్లీ మూడు రోజుల్లోనే సస్పెన్షన్‌ను ఎత్తివేయించుకున్నట్లు తెలిసింది. అలాగే తనపై ఆ రోజు ఏజేసీ విచారణకు ఆదేశించిన ఫైల్‌నే మాయం చేశారనే చర్చ జరుగుతోంది. పెద్ద మోసగానివే! నారాయణరెడ్డి ఆస్తులకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తూ పెద్ద మెసగానివే అని ఏసీబీ ఇన్చార్జ్ డీఎస్పీ జయరామరాజు అన్నట్లు తెలుస్తోంది. ఆ మాట ఎందుకన్నారంటే.. జీసెస్ నగర్లో ఓ దళిత మహిళ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకొని ఆమెకు సంబంధించిన రూ.22.50 లక్షల విలువ చేసే 3 సెంట్ల స్థలాన్ని కేవలం రూ.10 లక్షలు ఇచ్చి తన పేరిట రాయించుకున్నట్లు సమాచారం. అయితే అగ్రిమెంట్ పత్రాల్లో మాత్రం రూ.22.50 లక్షలని కనబర్చినట్లు తెలిసింది. కాకపాతే.. ఆ తర్వాత స్థలం విలువ కేవలం రూ.5 లక్షలని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గమనార్హం. అగ్రిమెంట్లో అలా.. రిజిస్ట్రేషన్‌లో ఇలా.. అంటూ పెద్ద మెసగానివే.. అని డీఎస్పీ అన్నట్లు విశ్వసనీయ సమాచారం. బెయిల్‌కు సన్నాహాలు ఏసీబీకి పట్టుబడిన నారాయణరెడ్డి అప్పుడే ఏసీబీ కోర్టు నుంచి బెయిల్ తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో నారాయణరెడ్డి రూ.2.30 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నాడని చూపారని, ఇప్పటికే ఆయన ఆ డబ్బుకు లెక్కాచారాలు సిద్ధం చేసినట్లు సమాచారం. తాను అక్రమంగా సంపాదించలేదని, తనది సక్రమ సంపాదనేనని.. బెయిల్ మంజూరు చేయాలని శుక్రవారం ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరనున్నట్లు తెలిసింది. -
పిల్లలను దత్తత తీసుకుంటున్నారా..అయితే !
► చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష తప్పదు ► అవగాహన లేమితో అనర్థాలు చిత్తూరు : పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకుంటూ ఉంటారు. దత్తత తీసుకునేందుకు ప్రభుత్వం విధించిన విధి విధానాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. కొందరు వాటికి కట్టుబడకుండా అక్రమంగా పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. ఇలా చేయడం తప్పు అని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష తప్పదని పేర్కొంటున్నారు. అవగాహన లేమితో అనర్థాలు కొనితెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. నాలుగు గోడల మధ్య చేసుకున్న ఒప్పందం కొంతకాలం తరువాత బయటపడుతుండడంతో జన్మనిచ్చిన తల్లులే కాకుండా పెంచుకున్న తల్లులు కూడా ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. అభం, శుభం తెలియని చిన్నారులు ఏ తల్లి ఒడికీ చేరక శిశు గృహాలకే చేరుకుంటున్నారు. దత్తత తీసుకోవాలంటే.. పిల్లలు లేని దంపతులకు ఆ లోటు ఉండకూడనే ఉద్దేశంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ దత్తత పక్రియను ప్రవేశపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక విభాగం కూడా ఉంది. ప్రతి జిల్లా కేంద్రంలో శిశు గృహాలను ఏర్పాటు చేశారు. పిల్లలు లేని తల్లిదండ్రులకు ఆ లోటును పూడ్చేందుకు, అనాథ పిల్లలకు తల్లిదండ్రులు లేని లోటును తీర్చేందుకు ఐసీడీఎస్ పని చేస్తోంది. 15 ఏళ్లలోపు బాలబాలికలను దత్తతకు అర్హులు. దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులకు వారి అర్హత ఆధారంగా పిల్లలను ఇస్తారు. పిల్లలను దత్తత తీసుకోవాలనే వారు ఆన్లైన్లో దరఖాస్తును పూరించాలి. భార్యాభర్తల ప్రస్తుత ఫొటో, వారి వయస్సు, ఇంటి చిరునామా, నివాస, ఆధార్ కార్డులు, ఆదాయ (రూ.లక్షకు పైగా ఉండాలి), వేతనం, వివాహ ధ్రువీకరణ పత్రాలతోపాటు పాన్ కార్డు నమోదు చేయాల్సి ఉంటుంది. ఐసీడీఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేస్తారు. దత్తత తీసుకునే తల్లిదండ్రులు ప్రత్యేక వైద్య పరీక్షలు చేయించుకుని ఫిట్నెస్ సర్టిపికెట్లను అధికారులకు అందజేయాలి. భవిష్యత్తులో ఇబ్బందులు అక్రమ పద్ధతిలో దత్తత తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అర్హులు పిల్లలను దత్తత తీసుకోవచ్చు. దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. – లక్ష్మీ, ఐసీడీఎస్, పీడీ -
సారథి లేక.. జీతాలు రాక..!
– నెల రోజులుగా సెలవులో ఐసీడీఎస్ పీడీ – తాజాగా రెండు నెలల గడువు పొడిగింపు – ఉద్యోగులకు అందని జూలై వేతనాలు అనంతపురం టౌన్: మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆగస్టు ప్రారంభమై ఐదు రోజులు దాటినా ఇంకా వేతనాలు పడని పరిస్థితి. అసలు వేతనాలు పడుతాయా లేక మరోరెండు నెలలపాటు వేచి ఉండాల్సి వస్తుందా అన్నదిక్కుతోచని స్థితిలో ఉద్యోగులు ఉన్నారు. జిల్లాలో 17 సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) ప్రాజెక్టులుండగా అన్ని కార్యాలయాల్లోని ఉద్యోగుల జీతాల బిల్లులపై ఆయా ప్రాజెక్టుల్లోని సీడీపీఓ (డ్రాయింగ్ ఆఫీసర్లు)లే సంతకాలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల్లోని ఉద్యోగులకు ఎలాంటి సమస్య లేదు. అయితే అనంతపురంలోని మహిళా శిశు సంక్షేమశాఖ ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు మంజూరు కావాలంటే డ్రాయింగ్ ఆఫీసర్‌గా ఉన్న ప్రాజెక్ట్ డైరెక్టర్ సంతకం తప్పనిసరి. ఇక్కడ పీడీగా ఉన్న జుబేదాబేగం రెండు నెలల క్రితం కర్నూలుకు బదిలీపై వెళ్లారు. దీంతో ఏపీడీగా ఉన్న ఉషాఫణికర్కు పీడీగా ఎఫ్ఏసీ ఇచ్చారు. నెల క్రితం ఆమె సైతం సెలవు పెట్టారు. కుటుంబ సభ్యులకు అనారోగ్యంగా ఉన్న కారణంగా సెలవులో వెళ్లిన ఆమె తాజాగా మరో రెండు నెలల పాటు సెలవు పొడిగించుకున్నారు. ఇప్పటికే అనంతపురం అర్బన్ ప్రాజెక్ట్ సీడీపీఓగా ఉన్న కృష్ణకుమారికి తాత్కాలిక ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ వీరపాండియన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈమెకు చెక్‌పవర్ లేని కారణంగా ప్రస్తుతం తన ప్రాజెక్టులో మినహా ప్రధాన కార్యాలయంలోని ఉద్యోగుల జీతాల బిల్లులపై సంతకం చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ కార్యాలయంలో నలుగురు సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఒక టైపిస్ట్, ఒక వాచ్‌మన్, ఇద్దరు అటెండర్లు, ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులున్నారు. ప్రతి నెలా వీరి జీతాల కోసం రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు చెల్లిస్తున్నారు. పీడీ లేని పక్షంలో ఏపీడీ ఉన్నా జీతాల మంజూరుకు వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం ఇద్దరూ లేకపోవడంతో ఉద్యోగులకు జీతాల వెతలు తప్పేలా లేదు. పీడీగా ఉన్న ఉషాఫణికర్ కూడా సెలవు పొడిగించుకున్న నేపథ్యంలో అన్ని రోజులు వేతనాల కోసం ఎదురుచూడాలా అన్న సందేహం ఉద్యోగుల్లో నెలకొంది. ఇదిలా ఉండగా ఐసీడీఎస్ పీడీగా వెంకటేశం వస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా ప్రస్తుతం వెంకటేశం జిల్లా యువజన సంక్షేమ అధికారిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ వీరపాండియన్ ప్రత్యేక దృష్టి సారిస్తే అటు ఉద్యోగుల సమస్యలతో పాటు అంగన్వాడీల బలోపేతం జరిగే అవకాశం ఉంది. -
అనారోగ్యలక్ష్మి..!
► ఆరోగ్యలక్ష్మి పథకానికి సరుకుల కొరత ► అంగన్వాడీ కేంద్రాల్లో అమలుకు నోచుకోని మెనూ ► నిలిచిన భోజనం ► గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అందని పౌష్టికాహారం ► ఐదు నెలలుగా సరఫరా కాని నూనె ► పర్యవేక్షణ లోపం ఆదిలాబాద్‌టౌన్: గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు పూర్తి స్థాయిలో సరఫరా కాకపోవడంతో పథకం అమలులో ఆటంకం ఎదురవుతోంది. ఫలితంగా జిల్లాలో ఆరోగ్యలక్షి పథకం అనారోగ్యలక్ష్మిగా మారింది. జిల్లాలోని చాలా అంగన్వాడీ కేంద్రాల్లో బియ్యం, పాలు, కంది పప్పు, నూనె సరఫరా కావడం లేదు. కోడి గుడ్ల సరఫరా పూర్తిస్థాయిలో జరగడం లేదు. మురుకులు కూడా లేకపోవడంతో కేంద్రాలకు వచ్చే పిల్లల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. దీంతో ఐసీడీఎస్ అస్తవ్యస్తంగా మారుతోంది. ఆకుకూరలు, కోడిగుడ్లు, పాలు, పెరుగుతో కూడిన పౌష్టికాహారం అందించాల్సి ఉన్నప్పటికీ కనీసం పప్పు అన్నం కూడా పెట్టడం లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. సరకులు లేకపోవడంతో చాలా కేంద్రాల్లో వంట చేయడం లేదు. సమయానికి కేంద్రాలు తెరవడం లేదు. పిల్లల సంఖ్య ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ ఉండడం లేదు. కొన్ని సెంటర్లలో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు వండిన భోజనం టిఫిన్ బాక్స్‌ల్లో పెట్టి ఇంటికి పంపిస్తున్నారు. జిల్లాలో అంగన్వాడీ పోస్టుల, సూపర్వైజర్ల పోస్టులు ఖాళీగా ఉండడంతో ఐసీడీఎస్ గాడితప్పింది. రెగ్యులర్ అధికారులు లేక పోవడంతో పర్యవేక్షణ కొరవడుతోంది. జిల్లాలో.. జిల్లాలోని 18 మండలాల్లో 5 ప్రాజెక్టులు, 51 సెక్టార్లు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 1,256 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 987 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 269 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 6 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలు 31,471 మంది, 3 సంవత్సరాల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 22,053 మంది, గర్భిణులు, బాలింతలు 13,357 మంది ఉన్నారు. కాగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ప్రతి రోజు ఒక పూట మధ్యాహ్నం పూర్తి స్థాయి భోజనం వండిపెట్టాలి. కానీ జిల్లాలో ఏ కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. చాలా కేంద్రాల్లో ప్రస్తుతం నూనె, కందిపప్పు, బియ్యం సరుకులు లేవు. నాణ్యమైన భోజనం వండిపెట్టకపోవడంతో లబ్ధిదారులు కేంద్రాలకు రావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఉడికించిన కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉండగా ఉడికించకుండానే కార్యకర్తలు వాటిని ఇంటికి ఇస్తున్నారు. అయితే ఈ నెలకు సంబంధించి ఇంకా కోడి గుడ్లు కేంద్రాలకు సరఫరా చేయలేదని అంగన్వాడీ కార్యకర్తలు పేర్కొంటున్నారు. లోపించిన పర్యవేక్షణ.. ఐసీడీఎస్‌లో రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో పర్యవేక్షణ లోపించింది. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు చాలామంది సమయపాలన పాటించడంలేదు. సక్రమంగా కేంద్రాలను తెరవడంలేదు. దీంతో పిల్లలు, గర్భిణులు, బాలింతలు కేంద్రాలకు రావడానికి ఆసక్తి చూపడంలేదు. కేంద్రాలు తెరిచిన వారిలో చాలామంది అంగన్వాడీలు భోజనం సక్రమంగా వండి పెట్టడం లేదు. సరుకులు ఉన్న కేంద్రాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. పర్యవేక్షించాల్సిన కొంతమంది సూపర్వైజర్లు కార్యాయానికి పరిమితం అవుతున్నారు. దీంతో కొందరు అంగన్వాడీ కార్యకర్తలు లబ్ధిదారులకు అందజేయాల్సిన గుడ్లు, ఇతర సరుకులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరో పణలు ఉన్నాయి. కాగా ఆదిలాబాద్, ఉట్నూర్ ప్రాజెక్టుల సీడీపీవోలు డిప్యూటేషన్‌లో ఉండడంతో సూపర్వైజర్లు ఇన్చార్టీలుగా వ్యవహరిస్తున్నారు. 51 మంది సూపర్వైజర్లకు గాను 29 మంది మాత్రమే పని చేస్తున్నారు. 26 పోస్టులు ఖాళీగా దీంతో కేంద్రాల పర్యవేక్షణ లోపించి ఆరోగ్యలక్ష్మి అనారోగ్యలక్ష్మిగా మా రుతోందని పలువురు పేర్కొంటున్నారు. ఈ పథకంలో భాగంగా మెనూ ప్రకారం భోజనం పెట్టాలి. కానీ ఏ కేం ద్రంలో మెనూ పాటించడం లేదు. ఆకుకూరలు, కూరగాయలు, పెరుగు జాడలేదు. పప్పునీళ్లు, ఉడికించిన గుడ్డును మాత్రమే ఇస్తున్నారు. దొడ్డు బియ్యంతో భోజనం పెట్టడంతో చాలా మంది తినడానికి కేంద్రాలకు రావడం లేదు. వారం ఇవ్వాల్సిన భోజనం సోమవారం అన్నం, కూరగాయలతో సాంబారు, గుడ్డు కూర, పాలు మంగళవారం అన్నం, పప్పు, ఆకు కూరలు, గుడ్డు, పాలు బుధవారం అన్నం, ఆకు కూరలతో పప్పు, గుడ్డుకూర, గుడ్డు, పాలు గురువారం అన్నం,కూరగాయలతో సాంబారు, పెరుగు,గుడ్డుకూర, పాలు శుక్రవారం అన్నం, పప్పు, ఆకుకూరలతో కూర, గుడ్డు, పాలు శనివారం ఆకుకూరలతో పప్పు, పెరుగు, గుడ్డు, పాలు నూనె సరఫరా లేదు.. గత కొన్ని నెలలుగా నూనె సరఫరా కావడం లేదు. పాలు, గుడ్లు, బియ్యం, కంది పప్పు సరుకులు కేంద్రాల్లో ఉన్నాయి. అంగన్వాడీ కార్యకర్తలు ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు, పిల్లలకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలి. ప్రతి రోజు కేంద్రాలను తెరవాలి. – ఉమారాణి, ఇన్చార్జి సంక్షేమాధికారి, ఆదిలాబాద్ -
ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీగా ఉషాఫణికర్
అనంతపురం టౌన్ : మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) ఇన్చార్జ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉషాఫణికర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పీడీగా ఉన్న జుబేదాబేగం ఇటీవల కర్నూలుకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో రెగ్యులర్‌గా ఎవరినీ నియమించలేదు. అసిస్టెంట్ పీడీగా ఉన్న ఉషాఫణికర్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. పీడీ జుబేదాబేగం రిలీవ్ అయ్యారు. -
ఐసీడీఎస్‌లో బినామీ కాంట్రాక్టర్!
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు ఓ బినామీ కాంట్రాక్టర్‌కు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిచ్పల్లి మండలంలోని ఓ ఎంపీటీసీ సభ్యుడి తమ్ముడు వేరే వ్యక్తి పేరుపై అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు రవాణా చేసే టెండరును దక్కించుకున్నాడని తెలిసినా.. అధికారులు తెలియనట్లుగా ప్రవర్తిస్తున్నారు. కాగా ప్రస్తుతం బినామీ కాంట్రాక్టర్‌గా ఉన్న శ్రావణ్ సరుకులు సరఫరా చేస్తుండగా, ఎంపీటీసీ సభ్యుడి తమ్ముడు పలుమార్లు ప్రాజెక్టు కార్యాలయానికి వచ్చి దగ్గరుండి సరుకులను రవాణా చేయించినా అధికారులు ఆయన ఎవరనేది కూడా పట్టించుకోకపోవడం వెనుక అనుమానాలకు తావిస్తోంది. అధికారులకు ప్రతినెలా ముడుపులు కూడా అందుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే నాలుగు నెలల క్రితం నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న 258 అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం, పప్పులు, నూనెలు, బాలామృతం ఇతర సరుకులను సరఫరా చేయడానికి జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి అధ్యక్షతన టెండర్లు జరిగాయి. అయితే అప్పటికే డిచ్పల్లి ప్రాజెక్టుకు టెండర్ దక్కించుకున్న సదరు ఎంపీటీసీ సభ్యుడి తమ్ముడు నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టులో కూడా సరుకులు రవాణా చేయడానికి పాలువు కదిపాడు. తాను ఇది వరకే ఓ ప్రాజెక్టులో టెండరు దక్కించుకున్న నేపథ్యంలో వేరే ప్రాజెక్టులో టెండరు వేయడానికి వీలు పడదని శ్రావణ్ అనే వ్యక్తి పేరుపై అర్బన్ ప్రాజెక్టుకు టెండరు వేసి కాంట్రాక్టును దక్కించుకున్నట్లు తెలిసింది. పేరు, బిల్లులను శ్రావణ్ పేరుపైనే అధికారులు చేస్తున్నా.. డబ్బులు మాత్రం సదరు ఎంపీటీసీ సభ్యుడి తమ్ముడికే ముడుతున్నట్లు సమాచారం. అయితే కమిషన్ మట్టుకే టెండరు దక్కించుకున్న శ్రావణ్ పని చేస్తున్నట్లు సమాచారం. విషయం తెలిసినా పట్టింపులేదు.. బినామీ కాంట్రాక్టర్‌గా శ్రావణ్ కొనసాగుతున్నాడనే దానికి ఆయనే గతంలో ఒప్పుకున్నట్లు సాక్ష్యాలు ప్రాజెక్టు కార్యాలయంలోని ఓ అధికారికి తెలిసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ విషయం సీడీపీవో వరకు వెళ్లినప్పటికీ శ్రావణ్‌తో మిలాఖత్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బినామీ పేరుపై శ్రావణ్ కాంట్రాక్టర్‌గా చలామణి అవుతున్నాడని.. ఈ విషయంపై ప్రాజెక్టు అధికారులను వివరణ కోరగా తమకేమీ తెలియదని మాట దాటవేస్తున్నారు. అలాగే కాంట్రాక్టర్ శ్రావణ్‌ను వివరణ కోరగా వేరే వ్యక్తుల ప్రమేయం లేదని, తానే కాంట్రాక్ట్‌ను దక్కించుకుని సరుకులు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ప్రొసీడింగ్‌లో శ్రావణ్ పేరే ఉంది జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన టెండర్లు జరిగా యి. జేసీ ఇచ్చిన ప్రొసీడింగ్‌లో మాత్రం కాంట్రాక్ట్‌ను శ్రావణ్ దక్కించుకున్నట్లు ఉంది. ఓ ఎంపీటీసీ సభ్యుడి తమ్ముడు శ్రావణ్‌ను బినామీగా పెట్టుకుని కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న విషయం నాదృషికి రాలేదు. – డెబోరా, సీడీపీవో, నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టు -
ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం బదిలీ
అనంతపురం టౌన్ : మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జుబేదాబేగంను కర్నూలుకు బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి అపర్ణ ఉపాధ్యాయ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలులో పీడీ పోస్టు ఖాళీగా ఉండడంతో మెడికల్ గ్రౌండ్స్ కింద బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జుబేదాబేగం గతంలో వైఎస్ఆర్ జిల్లా, కర్నూలు, హైదరాబాద్‌లో పనిచేశారు. తాజాగా ఈమెను కర్నూలుకు బదిలీ చేసిన ప్రభుత్వం ఇక్కడికి మాత్రం ఎవరినీ నియమించలేదు. అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్న ఉషాఫణికర్కు ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
అమ్మా థ్యాంక్స్ !
నన్ను చంపనందుకు.. ‘అమ్మా.. నీకు ఏ కష్టమొచ్చిందో తెలియదు.. పెళ్లి కాకుండానే నన్ను కన్నావో.. కఠినాత్ముడైన నాన్నను పరిచయం చేయలేకనో.. ఆడపిల్లననే కారణమో.. మరో సమస్యనో తెలియదు.. కన్న పేగు బంధాన్ని తెంచుకోవాలనుకున్నావు. బొడ్డు పేగు కూడా ఆరకుండానే నన్ను వదిలించుకున్నావు. కొందరు తల్లులా ప్రాణం తీయకుండా అందరికీ కనిపించేలా ముళ్ల కంపల మధ్య వదిలేసి వెళ్లావు. థ్యాంక్స్ అమ్మా.. ఈ లోకాన్ని చూపినందుకు.. నన్ను చంపనందుకు. నేను ఆసుపత్రిలో క్షేమంగా ఉన్నాను.. నీవు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను’. అంటూ ఓ నవజాత శిశువు ఆదోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆదోని పట్టణంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఎమ్మిగనూరు బైసాప్ రోడ్డులో ముళ్ల కంపల మధ్య అప్పుడే కళ్లు తెరిచిన పసికందను గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. అటుగా వెళ్తున్న తులసి అనే మహిళ పసికందు ఏడుపు వినిపించి దగ్గరికి వెళ్లి చూసింది. స్థానికులకు సమాచారం అందించడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సీడీపీఓ సఫర్నిసా బేగం, సూపర్వైజర్లు అంజినమ్మ, ఆశీర్వాదమ్మ ఆసుపత్రికి వెళ్లి పసికందు పరిస్థితిని తెలుసుకున్నారు. ఆడపిల్ల కావడంతోనే ముళ్ల కంపల్లో పారవేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. వైద్యులు చిన్నారికి చికిత్సలు చేయడంతో ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సీడీపీఓ తెలిపారు. కర్నూలు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని తెలిపారు. - ఆదోని అగ్రికల్చర్ -
పౌష్టికాహారంపై నిర్లక్ష్యం తగదు
– సాక్షి ఎఫెక్ట్ కనగానపల్లి (రాప్తాడు) : అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహారం నాణ్యత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం తగదని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ఐసీడీఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న కోడిగుడ్లు నాణ్యత లేకపోవడంపై ‘సాక్షి’లో శనివారం ‘ఉడికించు చూడ రబ్బరు గుడ్డు’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి మంత్రి స్పందించారు. మండల కేంద్రం కనగానపల్లిలో అధికారులతో సమావేశం నిర్వహించారు. నాసిరకం గుడ్లు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయో గుర్తించాలని సీడీపీఓ వనజాక్షిని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన పీడీ నాసిరకం గుడ్లు బయటపడిన కనగానపల్లి మండలం కుర్లపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా నిర్ణీత కాల వ్యవధిలోనే గుడ్లను వినియోగించుకోవాలని సూచించారు. -
బాలిక నిశ్చితార్థాన్ని ఆపిన అధికారులు
చండూరు(నల్గొండ) : ఓ మైనర్ బాలిక కు నిశ్చితార్థాన్ని ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటన గుండ్రపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కస్తాల గ్రామానికి చెందిన ఓ బాలిక చండూరు హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. ఈమె తల్లి కొంతకాలం కింద చనిపోయింది. దీంతో తండ్రి వెంకన్న ఆమె ఆలనాపాలన చూస్తున్నాడు. ఈ క్రమంలో గుండ్రపల్లికి చెందిన బాలిక మేనమామ శంకర్ మర్రిగూడ మండలం ఒట్టిపల్లి గ్రామానికి చెందిన ఓ అబ్బాయితో పెళ్లి చేసేందుకు నిర్ణయించాడు. రెండు రోజుల్లో నిశ్చితార్ధం పెట్టుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఐసీడీఎస్ సూపర్వైజర్ జయమ్మ ఏఎస్ఐ శంకరయ్యతో కలిసి గ్రామానికి చేరుకుని బాలిక బంధువులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దాంతో బాలికకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు పెళ్లి చేయమని కుటుంబ సభ్యులు హామీ ఇచ్చారు. -
ఐసీడీఎస్ అధికారులపై విచారణ
ప్రొద్దుటూరు: ఐసీడీఎస్ ప్రొద్దుటూరు అర్బన్ ప్రాజెక్టు అధికారిణిపై చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి మంగళవారం కర్నూలు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ శారదాదేవి అంగన్వాడీలను విచారణ చేశారు. ప్రాజెక్టు పరిధిలోని కార్యకర్తలను హాజరు పరిచారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా తయారు చేసిన ప్రశ్నావళి పత్రాన్ని ఇచ్చి సంతకాలు చేసి నింపాలని కోరారు. ఇందులో ‘సీడీపీఓ రాజేశ్వరిదేవి, సూపర్వైజర్ సావిత్రి ప్రతి విషయానికి ఇబ్బంది పెట్టి, భయపెట్టి, డబ్బు ఇవ్వకపోతే మీపై అధికారులకు రిపోర్టు చేస్తామని మిమ్మల్ని బెదిరిస్తున్నారన్నది వాస్తవమా కాదా?, సీనియర్ అసిస్టెంట్ బాషా పనితీరు సరిగా లేదని ఆరోపణలు చేయడం జరిగింది. వివరాలు తెలపగలరు?, ప్రతి నెల ఒకటో తేదీన ప్రతి అంగన్వాడీ కార్యకర్త రూ.1000 అందించాలని సీడీపీఓతోపాటు సూపర్వైజర్లు మిమ్మల్ని ఆదేశించారా లేదా?, ఆరోపణ నిజమైనచో మీరు ఎంత మొత్తం, ఎవరికి చెల్లించారో తెలపగలరు?, సీడీపీఓ ట్రైనింగ్ పేరిట మీతో సంతకాలు తీసుకుని మీకు డబ్బు చెల్లించలేదన్న ఆరోపణ నిజమా కాదా? నిజమైనచో ఆ ట్రైనింగ్ వివరాలు, తేదీలతోపాటు హాజరయ్యారో లేదో తెలపగలరు?, ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌ను ఏర్పాటు చేశామని ప్రతి నెల రూ.6 వేలు మీ వద్ద నుంచి వసూలు చేయడం జరిగిందా లేదా? మీరు ఆ సొమ్ము ఎవరికి ఇచ్చారో తెలపగలరు?, అర్బన్ ప్రాజెక్టులోని మురికి వాడల్లో ఉన్న ఎస్సీ అంగన్వాడీ కార్యకర్తలను సూపర్వైజర్ సావిత్రి నోటికి వచ్చినట్లు కులం పేరుతో దూషించడం జరిగిందన్న ఆరోపణలపై మీరు వివరణ ఇవ్వడంతోపాటు ఎవరిని దూషించారో తెలపగలరు?’ తదితర ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సమాధానాలు రాసిన అనంతరం పత్రాలను తీసుకున్నారు. ఉద్దేశ పూర్వకంగానే ఫిర్యాదు సమావేశం అనంతరం కొంత మంది అంగన్వాడీలు ఆర్డీడీని కలిశారు. సీడీపీఓ తాము చెప్పినట్లు వినలేదనే కారణంతో యూనియన్ నేతలు కొంత మంది ఉద్దేశ పూర్వకంగానే ఈ విధంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆరోపణలకు సంబంధించి ఫిర్యాదు చేసిన వారిని ఆమె పిలిపించారు. యూనియన్ నేతల ఒత్తిడి వల్లే తాము ఫిర్యాదు చేశామని వారు కూడా ఆర్డీడీకి వివరించారు. అనంతరం యూని యన్ నేతలను పిలిపించి మాట్లాడారు. తర్వాత లెటర్ హెడ్‌పై ఫిర్యాదు చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వరదరాజులరెడ్డిని కలిశారు. అలాగే అధికారులను విచారణ చేశారు. ఆర్డీడీ వెంట ఆర్డీడీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నాగేశ్వరమ్మ, సూపరింటెండెంట్ పద్మిని ఉన్నారు. -
లక్కిరెడ్డిపల్లె సీడీపీఓ అరుణశ్రీ సస్పెన్షన్
లక్కిరెడ్డిపల్లె: అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న లక్కిరెడ్డిపల్లె సీడీపీఓ అరుణశ్రీని కమిషనర్ చక్రపాణి శుక్రవారం సస్పెండ్ చేశారు. శనివారం జిల్లా అధికారులు సస్పెన్షన్ ఆర్డర్‌ను ఇవ్వడానికి లక్కిరెడ్డిపల్లె ఐసీడిఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమె అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో సంప్రదించారు. స్పందించకపోవడంతో చివరకు ఆమె ఉంటున్న ఇంటి బయట గోడకు అతికించడం అందరినీ విస్మయానికి గురి చేసింది. అరుణశ్రీ లక్కిరెడ్డిపల్లెలో విధులు చేపట్టాక అంగన్వాడీ వర్కర్ల నుంచి ఆయాల వరకు బెదిరింపు ధోరణితో వ్యవహరించేవారు. అంగన్వాడీ కేంద్రాలకు అందాల్సిన పౌష్టికాహారాన్ని కాంట్రాక్టర్లతో కుమ్మక్కై దోచుకున్నారని ఆరోపణలు వచ్చాయి. సాక్షాత్తు పీడీ కూడా ఆమెకు తలొగ్గి పని చేసే నేపథ్యంలో ఇక్కడి అవినీతి భాగోతాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు నాయకురాలు ప్రభావతమ్మ తెలిపారు. కడప ఐసీడీఎస్ కార్యాలయంలో ఏసీడీపీఓగా పనిచేస్తున్న రెడ్డి రమణమ్మ కమిషనర్ ఉత్తర్వుల మేరకు లక్కిరెడ్డిపల్లె ఇన్ఛార్జ్ సీడీపీఓగా భాధ్యతలు చేపట్టారు. -
మళ్లీ ఆడపిల్ల పుట్టిందని..
⇒పసికందును చంపేందుకు కసాయిగా మారిన కన్నతండ్రి ⇒కుటుంబసభ్యులు బతిమలాడినా కరగని మనసు ⇒పోలీసులకు, ఐసీడీఎస్‌కు సమాచారం ఇచ్చిన 108 సిబ్బంది ⇒తండ్రికి కౌన్సెలింగ్ ఇచ్చి స్టేట్మెంటు రాసుకున్న పోలీసులు ⇒పలమనేరులో సంచనలం రేపిన ఘటన పలమనేరు: రెండో బిడ్డకూడా ఆడపిల్లే పుట్టిందని చంపేందుకు సిద్ధమయ్యాడో కసాయి తండ్రి. భార్య, కుటుంబసభ్యులు ఎంత వారించినా మనసు కరగలేదు. విషయం పోలీసులు, స్త్రీ–మహిళాసంక్షేమశాఖకు చేరడంతో వారు కౌన్సెలింగ్ ఇచ్చి బిడ్డకు హాని తలపెట్టనంటూ వాంగ్మూలం తీసుకున్నారు. ఈసంఘటన శుక్రవారం పలమనేరు ఏరియా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాలు.. గంగవరం మండలం గండ్రాజుపల్లెకు చెందిన శంకరప్ప(30), నాగమ్మ(24)కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. మూడేళ్ల ఆడపిల్ల ఉంది. శంకరప్ప తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాగమ్మ మళ్లీ గర్భం దాల్చింది. రెండోబిడ్డ అయినా మగబిడ్డే కావాలని శంకరప్ప కలలుగన్నాడు. ఈనెల14న నాగమ్మకు ప్రసవనొప్పులు రావడంతో 108కు సమాచారం ఇచ్చారు. వారు ఆమెను పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. రెండో కాన్సులోనూ ఆడపిల్ల జన్మించింది. దీన్ని తట్టుకోలేని తండ్రి అప్పుడే శిశువు గొంతు నులిమి చంపేందుకు యత్నించా డు. దీంతో భార్య అడ్డుకుంది. ఈ విషయం తెలిసిన నాగమ్మ తండ్రి బిడ్డను తాను సంరక్షిస్తానని ముందుకొచ్చాడు. అయినా ఖాతరుచేయని తండ్రి తాను బిడ్డను చంపేయాలని నిర్ణయించుకున్నానని చెప్పడంతో కుటుంబ సభ్యులంతా బతిమలాడారు. అయినా అతని మనసు కరగలేదు. గురువారం ఆమెను ఆస్పత్రినుంచి డిశ్చార్చి చేయగా నాగమ్మ ఇంటికెళ్లలేదు. ఇంటికెళితే తనభర్త అన్నంత పనిచేస్తాడంటూ ఆస్పత్రిలోనే ఉండిపోయింది. ఈ విష యం తెలుసుకున్న 108 సిబ్బంది కిశోర్, బాబా జాన్ స్థానిక ఉమెన్ అండ్ జువనైల్వింగ్కు సమాచారం ఇచ్చారు. సీడీపీవో రాజేశ్వరి, గ్రామ అంగ న్ వాడీ వర్కర్ సరసమ్మ, మహిళా పోలీస్‌స్టేషన్ ఏఎస్ఐ కీరీమున్నీసా సిబ్బందితో కలసి ఆస్పత్రికి చేరుకున్నారు. శంకరప్పకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బిడ్డ ప్రాణానికి ఏం జరిగినా బాధ్యత తండ్రిదేనని వాగ్మూలం తీసుకున్నారు. అంగన్వాడీ వర్కర్ పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. వీరి వెంట సూపర్వైజర్ ప్రసన్న, షీ టీం సిబ్బంది కవిత తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు
కర్నూలు(హాస్పిటల్): దేవనకొండ మండలం నల్లచెలిమల గ్రామంలో త్వరలో జరగబోయే బాల్యవివాహాలను స్త్రీ,శిశు సంక్షేమ అధికారులు సోమవారం అడ్డుకున్నారు. గ్రామంలో 15 సంవత్సరాలు, 17 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు బాలికలకు వారి తల్లిదండ్రులు మార్చి 2, 3వ తేదీల్లో వివాహం జరిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందింది. విషయం తెలుసుకున్న వెంటనే ఐసీపీఎస్ డీపీసీవో శారద, ఐసీడీఎస్ పత్తికొండ సీడీపీవో టి. విద్య గ్రామానికి వెళ్లి బాలికల తల్లిదండ్రులతో మాట్లాడారు. బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి, చట్టం గురించి వివరించారు. బాలికలకు మైనార్టీ(18 సంవత్సరాలు వచ్చేంత వరకు) తీరేంత వరకు పెళ్లి చేయబోమని వారితో అంగీకార పత్రాలు తీసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామాంజనమ్మ, ఐసీడీఎస్ సూపర్వైజర్ సుచరిత, చైల్డ్‌లైన్ టీమ్ మెంబర్ అనిత ఉన్నారు. -
మాతాశిశు మరణాలను తగ్గించమే లక్ష్యం
ఎమ్మిగనూరురూరల్: మాతా శిశు మరణాలను తగ్గించటమే ఐసీడీఎస్ లక్ష్యమని వరల్డ్ బ్యాంక్ స్టేట్ కో–ఆర్డినేటర్ కృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలో ఎస్సీకాలనీలో 44 వ అంగ్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రా పనితీరును తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇస్నిప్ సంస్థ అంగన్వాడీ కేంద్రాల్లో సామాజిక వేడుకలను ఏవిధంగా నిర్వహించాలి, ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలి అనే అంశాలపై అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇస్తుందని తెలిపారు. ప్రతి నెలా గర్భిణులు ఆరోగ్య పరిక్షలు చేయించుకుంటున్నారా? లేదా, వారు తీసుకొవాల్సిన పోషక విలువలు, బిడ్డకు తల్లిపాల ఆవశ్యకతపై సెక్టారు సమావేశాల్లో సూపర్వైజర్లు వర్కర్లకు వివరించాలని సూచించారు. సమావేశంలో సీడీపీఓ నాగమణి పాల్గొన్నారు. -
మాతాశిశు మరణాలు తగ్గించాలి
అనంతపురం టౌన్ : మాతాశిశు మరణాలు తగ్గించడానికి కృషి చేయాలని జేసీ–2 ఖాజామొహిద్దీన్ సూచించారు. మంగళవారం నగర శివారులోని మహిళా ప్రాంగణంలో ఐసీడీఎస్ 17 ప్రాజెక్టులకు సంబంధించిన జిల్లా రిసోర్స్ గ్రూప్ సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన సేవలు అందించాలన్నారు. అనంతరం వరల్డ్ బ్యాంక్ రాష్ట్ర కో ఆర్డినేటర్ కృష్ణ వివిధ పథకాలను వివరించారు. రాష్ట్ర రిసోర్స్ గ్రూప్ సభ్యులు శ్రీదేవి, నాగమల్లీశ్వరి, పద్మావతి, విజయకుమారి, నాగమణి, సుధాకర్, ఐసీడీఎస్ ఏపీడీ ఉషాఫణికర్, పీఓడీటీటీ సుజాత, డీపీహెచ్ఎన్ఓ రాణి, ప్రాంగణం మేనేజర్ నాగమణి పాల్గొన్నారు. -
మహిళా శక్తి... మాటలకేనా?
ఈ ఫేస్బుక్, వాట్సాప్ యుగంలో మెజారిటీ జనం సూక్తులు చెప్పేవారే!!. సమాజ వికాసం ఆడపిల్లలతోను, మహిళలతోనే మొదలవుతుందని జైట్లీ కూడా చెప్పారు. మరి వారికోసం ఏం చేశారు? 14 లక్షల ఐసీడీఎస్ అంగన్వాడీలలో మహిళా శక్తి కేంద్రాల్ని ఏర్పాటు చేస్తామంటూ దానికి రూ.500 కోట్లిచ్చారు. ఒకో కేంద్రానికి రూ.4వేలకన్నా తక్కువే. దీంతో మహిళల సాధికారత, స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, డిజిటల్ అక్షరాస్యత, ఆరోగ్యం, పౌష్ఠికాహారం అన్నీ సాధ్యమవుతాయట!! గర్భిణీ స్త్రీలకు రూ.6 వేలిచ్చే పథకానికి అధికారిక ట్యాగ్ వేశారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో 48 శాతంగా ఉన్న మహిళల భాగస్వామ్యం ఇపుడు 55కు చేరిందట. దీన్ని పురోగతిగా అనొచ్చా? దేశంలో మహిళలు : 58.6 కోట్లు (2011జనాభా లెక్కల ప్రకారం) -
సంక్షేమం నాస్తి.. సంపాదన జాస్తి!
– అవినీతి నిలయాలుగా ఐసీడీఎస్ ప్రాజెక్టులు – చిన్నారుల పొట్టకొట్టి దర్జాగా వసూళ్లు – అన్నింట్లోనూ సీడీపీఓల చేతివాటం – సూపర్వైజర్లు, కార్యాలయ సిబ్బందికీ వాటాలు ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించడంలో భాగంగా ఏర్పాటు చేసిన సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడీఎస్) అక్రమాలకు నిలయంగా మారింది. ఈ పథకానికి ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను కొందరు అవినీతి అధికారిణులు స్వాహా చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలను నివారించాల్సిన సీడీపీఓలు, జిల్లా ఉన్నతాధికారులే అవినీతిని ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అంగన్వాడీ కార్యకర్తల నుంచి వసూళ్లకు పాల్పడడం.. కాదూ కూడదంటే వేధింపులకు గురిచేయడం రివాజుగా మారింది. అధికారుల ఇళ్లలో ఎలాంటి శుభకార్యం జరిగినా ఆ ఆర్థిక భారాన్ని కార్యకర్తలపై మోపుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అనంతపురం టౌన్ : జిల్లా వ్యాప్తంగా 17 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 4,286 మెయిన్, 840 మినీ అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. 4,082 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 3,698 మంది ఆయాలు పని చేస్తున్నారు. ఈ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత సూపర్వైజర్లు, అసిస్టెంట్ సీడీపీఓలు, సీడీపీఓలు, అసిస్టెంట్ పీడీ, ప్రాజెక్ట్ డైరెక్టర్‌పై ఉంటుంది. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల కోసం ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోంది. అవినీతికి అలవాటుపడిన పలువురు పర్యవేక్షణాధికారులు సరుకులను దారి మళ్లించి సొమ్ము చేసుకుంటున్నారు. కాంట్రాక్టర్ల వద్ద పర్సెంటేజీలకు కక్కుర్తి పడి బిల్లులు చేస్తున్నారు. కొందరైతే అంగన్వాడీ కార్యకర్తలనూ మామూళ్ల కోసం పీడిస్తున్నారు. వారి నుంచి బహుమతులు, పట్టుచీరలు లాంటివి తీసుకోవడమే కాకుండా చివరకు ఇళ్లలో పనులు చేసేందుకు కూడా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లను వినియోగించుకుంటున్నారు. సెక్టార్ లీడర్ల స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరి వాటాలు వారికి ఉండడంతో అక్రమాలు సాఫీగా సాగిపోతున్నాయి. – శింగనమల ప్రాజెక్ట్ పరిధిలోని ఓ అధికారి చేతివాటానికి హద్దేలేకుండా పోతోంది. తన పరిధిలోని అంగన్వాడీ సెంటర్ల నుంచి నెలవారీగా సరుకులు ఇవ్వకపోతే ఇంక అంతే సంగతి. బుక్కరాయసముద్రం మండలంలోని ఓ అంగన్వాడీ కార్యకర్త ఏకంగా సదరు అధికారి ఇంట్లో పనులు చేసేందుకే పరిమితమవుతోంది. ఓ స్కూల్లో మధ్యాహ్న భోజనం వండిపెడితే ఆ ఆహారాన్ని సెంటర్లోని పిల్లలకు పెడుతూ సరుకులను అమ్ముకుంటున్న పరిస్థితి. – గతంలో కదిరిలోని ఓ ప్రాజెక్ట్‌లో పని చేసిన అధికారి అక్కడ అక్రమాలకు పాల్పడ్డారు. నాలుగేళ్ల క్రితం జరిగిన నియామకాల్లోనూ పెద్దఎత్తున వసూలు చేశారు. ఈ విషయం తెలియడంతో ఇక ఇంటికి పంపించేస్తారని భావించి అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఓ ప్రాజెక్ట్‌కు బదిలీ చేయించుకున్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరిన ఓ నాయకుడి అనుచరుల అండతో అక్రమాలు కొనసాగిస్తున్నారు. వసూళ్ల కోసమే ప్రత్యేకంగా ఇద్దరు ఉద్యోగులను నియమించుకున్నట్లు విమర్శలున్నాయి. – చెన్నేకొత్తపల్లి ప్రాజెక్ట్ పరిధిలోని అధికారి ఏకంగా సరుకులను బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఓ అంగన్వాడీ కేంద్రాన్ని నడుతున్న మహిళ కొడుకు గతంలో అనంతపురంలో ఓళిగ సెంటర్ నిర్వహించేవాడు. ఇప్పుడు ధర్మవరంలో ఉంటున్నాడు. ఇక్కడి కేంద్రాల నుంచి సదరు ఓళిగ సెంటర్‌కు సరుకులు తరలిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా కీలక టీడీపీ ప్రజాప్రతినిధి అండ ఉండడంతో పాటు తమకూ వాటా వస్తుండడంతో పట్టించుకోవడం లేదు. – ధర్మవరం ప్రాజెక్ట్‌లోని ఓ అధికారి ఏకంగా ‘పచ్చ’కండువా వేసుకుని పని చేస్తున్నారు. బత్తలపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్తను తన వెంటబెట్టుకుని ‘రాజకీయం’ చేయడం.. వసూళ్లకు పాల్పడడం చేస్తున్నారు. పైగా గతంలో కేంద్రాలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్ సైతం నిత్యం ప్రాజెక్ట్ కార్యాలయంలోనే తిష్టవేసి ఉంటాడు. – మడకశిర ప్రాజెక్ట్‌లో బియ్యం, నూనె, కందిబేడలు సరి‘హద్దు’ దాటుతున్నాయి. ఓ అధికారి కీలకంగా వ్యవహరిస్తుండగా, ముగ్గురు సూపర్వైజర్లు ఈ వ్యవహారంలో పాలుపంచుకుంటున్నారు. గతంలోనూ పోస్టుల భర్తీకి సంబంధించి సదరు అధికారి కీలకంగా వ్యవహరించి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. – హిందూపురం ప్రాజెక్ట్‌లోని ఓ అధికారి భర్త ఇక్కడ హల్చల్ చేస్తుంటాడు. టీడీపీ ప్రజాప్రతినిధి తర్వాత ‘సర్వం తానే’ అనుకుంటున్న వ్యక్తికి ఇతడు స్నేహితుడు కావడం.. ఈ విషయం అందరికీ తెలియడంతో అంగన్వాడీ కార్యకర్తలు కూడా అతను ఎంత చెబితే అంత ఇవ్వాల్సిందే! – కదిరిలోని ఓ ప్రాజెక్ట్ పరిధిలో ఽస్కూల్ సమీపంలోని అంగన్వాడీ సెంటర్లో పిల్లలెవరూ లేకున్నా ప్రతినెలా సరుకులు మాత్రం సరఫరా అవుతున్నాయి. ఓ సూపర్వైజర్ మధ్యవర్తిత్వంతో వసూళ్ల పర్వం సాగుతోంది. – గుత్తి ప్రాజెక్ట్ పరిధిలో కార్యాలయ ఉద్యోగి కీలకంగా వ్యవహరిస్తున్నారు. కోడిగుడ్ల సరఫరాలో కమీషన్లకు కక్కుర్తిపడుతున్నారన్న విమర్శలున్నాయి. – రాయదుర్గం ప్రాజెక్ట్‌లో ఓ సూపర్‌వైజర్‌దే పైచేయి. ఇక్కడ అమృత హస్తం అమలవుతుండడంతో పా‘పాల’కు పాల్పడుతున్నారు. టీడీపీ నాయకుడి అండదండలు ఉండడంతో ఎవరూ ఏం చేయలేరన్న ధీమాతో ఉన్నారు. – కంబదూరు ప్రాజెక్ట్‌లో కార్యాలయ ఉద్యోగి ఒకరు ‘లోగుట్టు’ వ్యవహారం నడిపిస్తున్నారు. సెక్టార్ సమావేశాలు జరిగినప్పుడు పిల్లల సంక్షేమం గురించి కాకుండా వాటాలపైనే చర్చిస్తుండడం గమనార్హం. -
సీన్ రివర్స్
ఒంగోలు టౌన్ : ఐసీడీఎస్ ఒంగోలు అర్బన్ ప్రాజెక్టులో అంగన్వాడీ కేంద్రాల మెర్జ్‌కు అద్దె రూపంలో బ్రేకులు పడుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో కాన్వెంట్ విద్య అందించాలన్న ఉద్దేశంతో మూడు కేంద్రాలను ఒకేచోటకు తరలించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఈ తరలింపు ప్రక్రియకు అనూహ్య రీతిలో అడ్డంకులు వచ్చిపడుతున్నాయి. ఇప్పటివరకు తమ ఇళ్లలో అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించినందున బకాయిలు చెల్లించిన తర్వాతే కదలనిస్తామంటూ అనేకమంది ఇంటి యజమానులు చెబుతుండటంతో అంగన్వాడీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒంగోలు అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 137 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి నెలకు 3 వేల రూపాయల చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఈ కేంద్రాల విలీన ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి అద్దె దెబ్బ అంగన్వాడీలను వేధిస్తోంది. ఒంగోలు అర్బన్ ప్రాజెక్టులోనే 13 నెలల నుంచి అద్దె బకాయిలు ఉండటంతో అవి ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితుల్లో అంగన్వాడీలు కొట్టుమిట్టాడుతున్నారు. అడకత్తెరలో పోకచెక్కలా... ఒంగోలు అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. తాము సూచించిన విధంగా అంగన్వాడీ కేంద్రాలను సమీపంలోని కేంద్రంలో మెర్జ్ చేయాలని సూపర్వైజర్ మొదలుకుని సీడీపీఓ వరకు ఆదేశాల మీద ఆదేశాలు ఇస్తున్నారు. అయితే ఆ కేంద్రాలను వారు సూచించిన చోటకు మార్చేందుకు ప్రయత్నిస్తే అద్దె బకాయిలు చెల్లించిన తర్వాతే కేంద్రాలను కదలనిస్తామంటూ అనేకమంది ఇంటి యజమానులు గట్టిగా చెబుతుండటంతో అంగన్వాడీల పరిస్థితి అయోమయంగా మారింది. ఒకవైపు కేంద్రాలను మార్చలేదంటూ అధికారుల నుంచి వేధింపులు, ఇంకోవైపు కేంద్రాలను కదలనీయమంటూ యజమానులు భీష్మించుకుని కూర్చుండటంతో అనేకమంది అంగన్వాడీలు ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మెర్జ్ చేయాలంటూ ఒత్తిళ్లు ఎక్కువగా వస్తుండటంతో కొంతమంది అంగన్వాడీలు వడ్డీకి తీసుకువచ్చి కడుతుంటే, ఇంకొంతమంది అంగన్వాడీలు ఇంట్లో ఉన్న అరకొర బంగారాన్ని తాకట్టు పెట్టి కేంద్రాల అద్దె బకాయిలు చెల్లిస్తున్నారు. బకాయిలు ఎప్పుడు వస్తాయో... ఒంగోలు అర్బన్ ప్రాజెక్టులో అద్దె బకాయిలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని మిగిలిన 20 ప్రాజెక్టుల్లో నెలల తరబడి అద్దె సమస్య లేదు. ప్రభుత్వం నుంచి బడ్జెట్ వచ్చిన వెంటనే బకాయిలు చెల్లించుకుంటూ వస్తున్నారు. అయితే ఒంగోలు అర్బన్ ప్రాజెక్టులో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. బడ్జెట్ ఉన్నప్పటికీ అద్దె బిల్లులు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అనేక మంది అంగన్వాడీలు ఆందోళన చెందుతున్నారు. బడ్జెట్ వచ్చినప్పటికీ బిల్లులు చెల్లించని విషయాన్ని ప్రాజెక్టు డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు కొంతమంది సమాయత్తం అవుతున్నారు. సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తా : ప్రాజెక్టు డైరెక్టర్ ఒంగోలు అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టులో అంగన్వాడీ కేంద్రాల అద్దె బకాయిల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తానని జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జీ విశాలాక్షి ’సాక్షి’కి తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల బిల్లుల చెల్లింపులో సమస్య తలెత్తిందన్నారు. దాని పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. -
ఐసీడీఎస్‌కు బాలుడి అప్పగింత
మహానంది: తప్పిపోయిన మహానందిలో తిరుగుతున్న బాలుడిని మహానంది ఎస్ఐ పెద్దయ్యనాయుడు ఆదివారం ఐసీడీఎస్ సిబ్బందికి అప్పగించారు. అయితే మహానందిలో ఉంటున్న లక్ష్మిదేవి ఆదివారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని..బాలుడు తన మనవడని తెలిపినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఆళ్లగడ్డకు చెందిన ఈ బాలుడు.. మరొక పిల్లవాడితో కలిసి నాలుగు రోజుల క్రితం మహానందికి వచ్చినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్ఐ పెద్దయ్యనాయుడు అంగన్వాడీ కార్యకర్త పుష్పకళకు సమాచారం అందజేసి ఐసీడీఎస్ అధికారులకు బాలుడిని అప్పగించారు. పూర్తి వివరాలతో తల్లితో పాటు వస్తే బాలుడిని అప్పగిస్తామని అవ్వ లక్ష్మిదేవికి ఆయన తెలిపారు. -
ఐసీడీఎస్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(హాస్పిటల్): స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మూడు కేటగిరిల్లో ఇచ్చే అవార్డులకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు జి. అనురాధమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, చిన్నారులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ అవార్డులు అందజేస్తారన్నారు. మహిళలు, చిన్నారులు, వివిధ వృత్తుల్లో పనిచేస్తున్న వారికి ఒక కేటగిరి, మహిళలు, పిల్లలు ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి రెండో కేటగిరి, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తూ మహిళలకు సంబంధించి విషయాలపై పనిచేసిన వారిని మూడో కేటగిరిగా పరిగణించి అవార్డులు ప్రకటిస్తారన్నారు. ఆసక్తిగల వారు ఈ నెల 28వ తేదిలోపు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో దరఖాస్తులు సీల్డ్కవర్లో అందజేయాలన్నారు. -
కోడి గుడ్ల స్కాంపై పీడీ విచారణ
కదిరి టౌన్ : ఐసీడీఎస్ శాఖలో కోడిగుడ్ల సరఫరాలో జరిగిన అవినీతి తంతుపై ఆ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జుబేదాబేగం మంగళవారం విచారణ నిర్వహించారు. ఐసీడీఎస్ పడమర ప్రాజెక్టులో గతంలో కోడిగుడ్ల సరఫరాలో రూ.అరకోటి నిధుల స్వాహాపై సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి విచారణ బాధ్యతను కదిరి ఆర్డీఓ వెంకటేశును అప్పగించారు. ఆయన విచారణ చేపట్టి నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన సంగతి విదితమే. ఈనేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పీడీ స్థానిక ఐసీడీఎస్ పడమర ప్రాజెక్టు కార్యాలయాన్ని తనిఖీ చేసి, పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టుపరిధిలోని పట్టణంతోపాటు వివిధ మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు ఏ మేర సరఫరా జరిగాయి. ఎంత మేర నిధులు డ్రా అయ్యాయి. సంబంధిత కాంట్రాక్టరు, అధికారుల ద్వారా జరిగిన అవినీతి అక్రమాలపై రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పీడీ విలేకరులతో మాట్లాడుతూ ఇదివరకే ఆర్డీఓ విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదికను అందించారన్నారు. ప్రస్తుతం తుది విచారణ చేస్తున్నామన్నారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. -
బాలల హక్కుల పరిరక్షణకు కృషి
– జేసీ–2 రామస్వామి – ఘనంగా బాలల హక్కుల వారోత్సవాలు కర్నూలు(అర్బన్): బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సి ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్–2 రామస్వామి అన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఐసీడీఎస్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ శారద అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి మాట్లాడుతూ.. బాల బాలికలు విద్య, ఆరోగ్యం, ఆహార విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలో సమగ్ర బాలల సంరక్షణ కేంద్రాలు పని చేస్తున్నాయని, అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి వయో వృద్ధుల వరకు అన్ని రకాల సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని ఐసీడీఎస్ ఆర్జేడీ శారద చెప్పారు. చెడు అలవాట్లకు లోనుకాకుండా యోగా కేంద్రాలకు వెళ్లి ఏకాగ్రతను పెంచుకోవాలని సీనియర్ న్యాయవాది నాగలక్ష్మిదేవి సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపాలని డిప్యూటీ డీఈఓ తాహెరా సుల్తానా అన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎంపీపీ ఈశ్వరమ్మ, సర్పంచును సన్మానించారు. వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. బాలికా సంరక్షణ పథకం కింద మంజూరైన ఇన్సూరెన్స్ బాండ్లను 40 మంది ఆడపిల్లల తల్లిదండ్రులకు జేసీ–2 అందించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ఏపీడీ అరుణ, 1098 పీడీ మోహన్‌రావు, జిల్లాలోని ఐసీడీఎస్ సీడీపీఓ, సూపర్వైజర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
అంగన్వాడీలకు పాల సరఫరా
సారవకోట : జిల్లాలో అన్నా అమృత హస్తం అమలు జరుగుతున్న ఐసీడీఎస్ ప్రాజెక్టులకు మంగళవారం పాల ప్యాకెట్లు సరఫరా అయ్యారుు. జిల్లాలో ఇచ్ఛాపురం, మందస, సారవకోట, కొత్తూరు, సీతంపేట, పాలకొండ, వీరఘట్టం ప్రాజెక్టులలో ఈ అన్నా అమృత హస్తం పథకం అమలు జరుగుతంది. ప్రాజెక్టు పరిధిలో ఉన్న గర్భిణులు, బాలింతలకు రోజుకు 200 మిల్లీ లీటర్ల పాలను అందించేందుకు వీలుగా పాలు సరఫరా అయ్యారుు. వీటిని ఆయా ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలకు ప్రతీ రోజు 200 మిల్లీ లీటర్ల పాలను కేంద్రాలలో అందించాలి. ప్రస్తుతం కేంద్రాలకు ఒక లీటర్ ప్యాకెట్లు మంజూరయ్యారుు. ఇది వరకు స్వయంశక్తి సంఘాల ద్వారా పాలను కొనుగోలు చేసి అంగన్వాడీ కేంద్రాలకు అందించే వారు. ఈ పద్ధతి సక్రమంగా నడవక పోవడంతో ప్రభుత్వం నేరుగా కాంట్రాక్టర్ల ద్వారా కేంద్రాలకు అందజేస్తున్నారు. -
ఐసీడీఎస్‌లో ‘ఎగ్’ యాప్
ఎగ్ యాప్ ,ఐసీడీఎస్ , అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ కేంద్రాలకు పారదర్శకంగా గుడ్ల పంపిణీ అవకతవకలకు కళ్లెం వేసేలా సాంకేతిక పరిజ్ఞానం డిమాండ్, సరఫరాపై నిరంతర నిఘా కొత్త టెక్నాలజీ ఈ నెల నుంచే వినియోగంలోకి.. సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరాపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిఘా కట్టుదిట్టం చేసింది. పిల్లలకిచ్చే గుడ్లు కొన్నిచోట్ల దారిమళ్లుతున్నాయని భావించిన ఆ శాఖ... ప్రతి గుడ్డుకు లెక్కగట్టాలని నిర్ణరుుంచింది. అంగన్వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా తీరుతెన్నులను నిరంతరం పరిశీలించేలా సరికొత్తగా ‘ఎగ్’యాప్‌ను రూపొందించింది. ఒకట్రెండు రోజుల్లో ఈ యాప్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ యాప్‌ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో నిల్వల పరిస్థితి ఎప్పటికప్పుడు స్పష్టమవడంతో పాటు గుడ్ల డిమాండ్ సైతం తెరపై కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించిన యంత్రాంగం... తాజాగా సరఫరాదారులకు సైతం శిక్షణ ఇచ్చింది. కేంద్రాలకు గుడ్ల సరఫరా ఇలా... అంగన్వాడీ కేంద్రాల వారీగా పిల్లల సంఖ్య ఇప్పటికే ఆన్లైన్లో అప్డేట్ చేశారు. అంతేకాకుండా ఆయా సెంటర్ల పరిధిలో ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం కింద పౌష్టికాహార పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. దీంతో ప్రతి అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి గుడ్ల డిమాండ్ ఎప్పటికప్పుడు యాప్‌లో స్పష్టమవుతుంది. ఈ మేరకు సరఫరాదారులు గుడ్ల స్టాకును తన పరిధిలోని కేంద్రాలకు చేరవేయాలి. స్టాకును అంగన్వాడీ కేంద్రంలో అప్పగించిన వెంటనే సంబంధిత అంగన్వాడీ కార్యకర్త నుంచి ఒన్‌టైమ్ పాస్వర్డ్(ఓటీపీ)ను యాప్‌లో అప్లోడ్ చేయాలి. ఇందుకు సంబంధించి అంగన్వాడీ కార్యకర్త మొబైల్ ఫోన్‌కు ఓటీపీని కేంద్ర సర్వర్ నుంచి సంక్షిప్త సమాచారం ద్వారా పంపిస్తారు. అలా ఓటీపీ నమోదు చేసిన వెంటనే స్టాకు సరఫరా చేసినట్లు యాప్‌లో తెలుస్తుంది. ఈ వివరాలన్నీ రాష్ట్ర కార్యాలయంతో పాటు సీడీపీవోలకు సైతం అందుతాయి. సరఫరాను బట్టి డీలర్లకు బిల్లులు చెల్లించేందుకు అధికారులు ప్రొసీడింగ్‌లు తయారు చేస్తారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, సీడీపీవోలు, కాంట్రాక్టర్ల సెల్ఫోన్లలో ఇప్పటికే యాప్‌ను ఇన్స్టాల్ చేశారు. సరికొత్తగా యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ నెల గుడ్ల సరఫరాలో కొంత జాప్యం జరిగింది. మెజార్టీ కేంద్రాల్లో గతనెలకు సంబంధించి గుడ్ల నిల్వలుండటంతో వాటిని సర్దుబాటు చేశారు. -
విశాఖజిల్లాలో దారుణం
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యలమంచిలి నెహ్రూనగర్‌లో రోడ్డు పక్కన చెట్ల పొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలి వెళ్లారు. శిశువు ఏడుపు విన్న స్థానికులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించి ఆస్పత్రిలో చేర్చారు. అప్పుడే పుట్టిన మగశిశువును గుర్తు తెలియని వ్యక్తుల చెట్లపొదల్లో వదిలి వెళ్లారని స్థానికులు పోలీసులకు తెలిపారు. -
ప్రసవంలోనే విరిగిన ఎముకలు
- ఆడ శిశువుకు అరుదైన జబ్బు – ఆసుపత్రిలోనే వదిలివెళ్లిన తల్లిదండ్రులు – శిశు కేంద్రంలో సంరక్షణ కర్నూలు(హాస్పిటల్): ప్రసవంలోనే విరిగిన ఎముకలతో ఓ ఆడ శిశువు ఈలోకంలోకి అడుగిడింది. అలాంటి శిశువును పెంచే స్థోమత లేదని భావించిన తల్లిదండ్రులు కష్టమైనా సరే పాపను ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. చికిత్స అనంతరం పాపను వైద్యులు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలో గత నెల 26వ తేదీన ఓ ఆడ శిశువు అనాథగా కనిపించింది. ఆసుపత్రి సిబ్బంది తల్లిదండ్రుల కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పాపను చిన్నపిల్లల వార్డులోని ఎన్ఐసీయూలో చేర్పించి చికిత్స చేయించారు. పాప కాళ్లు, చేతులు ఒంపులు తిరిగి, వాపుతో ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు వైద్యపరీక్షలు చేయించగా 'ఆస్టియో జెనెసిస్ ఇన్ఫరెఫెక్టా' అనే ఎముకల వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. ఈ వ్యాధి ఉన్న వారి ప్రసవ సమయంలో ఎముకలు విరిగిపోతాయని వారు నిర్ధారించారు. 15 రోజుల పాటు పాపకు వైద్యం అందించి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించగా వారు స్థానిక సి.క్యాంపులోని శిశు కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం పాప ఆలనపాలనను శిశు కేంద్రంలోని ఆయాలే చూస్తున్నారు. కుటుంబసభ్యులు తగిన ఆధారాలతో వస్తే పాపను అప్పగిస్తామని ప్రకటించారు. బాధ్యులపై కేసు నమోదుకు ఎస్పీ ఆదేశం ఎస్పీ ఆకె రవికృష్ణ శుక్రవారం శిశుకేంద్రానికి వెళ్లి ఆయాల సంరక్షణలోని శిశువు పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించే విషయమై వైద్యులతో మాట్లాడారు. పాపను అనాథగా వదిలివెళ్లిన వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని త్రీటౌన్ సీఐ మధుసూదన్‌రావును ఆదేశించారు. ఎవరైనా బాలికలను పెంచలేనిస్థితిలో ఉంటే దగ్గరలోని పోలీస్‌స్టేషన్, ఐసీడీఎస్, ప్రభుత్వ శిశు విహార్‌కు సమాచారం అందించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చట్టప్రకారం బాద్యులైన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ రమణమూర్తి, శిశు గృహ మేనేజర్ మెహతాజ్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ శారద ఉన్నారు. -
త్వరలో అంగన్వాడీ పోస్టుల భర్తీ
రాయదుర్గం రూరల్ : జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 200 హెల్పర్, 25 అంగన్వాడీ వర్కర్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జుబేదాబేగం వెల్లడించారు. మండలపరిషత్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో 5,126 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా అందులో 1200 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయన్నారు. ఉపాధి హామీ నిధులతో 881 కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని తలపెట్టగా 419 నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయన్నారు. 100 సూపర్ వైజర్ల పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉందన్నారు. చిన్నసైజులోని కోడిగుడ్లు సరఫరా అవుతున్నాయని విలేకరులు ప్రశ్నించగా.. వచ్చే నెల నుంచి పౌల్ట్రీ ఫాం నుంచి నేరుగా నిర్ణీత పరిమాణం గల కోడిగుడ్లు పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. జూలై నుంచి పిల్లలకు, బాలింతలకు పాలు అందడం లేదని ప్రస్తావించగా.. ఏజెన్సీవారు పాల సరఫరా నిలిపివేసిన కారణంగా ఇవ్వలేకపోయామన్నారు. త్వరలోనే పాల సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ సరోజమ్మ, ఎంపీడీఓ శ్రీనివాసులు, సూపర్వైజర్ లీలాపద్మావతి పాల్గొన్నారు. -
భ్రూణహత్యల నివారణకు కృషి చేయాలి
బద్వేలు అర్బన్: భ్రూణహత్యల నివారణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని అపుడే సమాజంలో ఆడపిల్లల నిష్పత్తిని పెంచేందుకు సాధ్యమవుతుందని ఐసీడీఎస్ పీడీ రాఘవరావు, ఐసీపీఎస్ పీడీ శివక్రిష్ణ అన్నారు. శనివారం స్థానిక ఎన్జీవోహోంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బేటీబచావో– బేటీ పడావో కార్యక్రమంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు లింగనిర్ధారణ పరీక్షలు చేయించకుండా మహిళలను చైతన్య పరచాలన్నారు. అలాగే బాల్య వివాహాల వలన కూడా లేనిపోని సమస్యలు , ఇబ్బందులు తలెత్తుతాయని దీనిపై కూడా ప్రత్యేక దృష్టిసారించి బాల్య వివాహాలను నిరోధించాలన్నారు.అలాగే ఆడ పిల్లలను చదివించాలని కోరారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ సోమేసుల పార్థసారథి మాట్లాడుతూ ప్రస్తుతం మహిళల సంక్షేమం కోసం అనేక రకాల చట్టాలు ఉన్నాయని వాటిపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకున్నప్పుడే మహిళలు సమాజంలో రాణించగలుగుతారని అన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ రాజమ్మ , సూపర్వైజర్లు సరళాదేవి, వెంకటసుబ్బమ్మ, సుభద్ర, అంగన్వాడీ వర్కర్లు్ల పాల్గొన్నారు. -
‘ఐసీడీఎస్’ తరలిస్తే ధర్నాకు దిగుతా
- ఎమ్మెల్యే సున్నం రాజయ్య దుమ్ముగూడెం దుమ్మగూడెం మండలం ములకపాడులోగల ఐసీడీఎస్ కార్యాలయాన్ని భద్రాచలంలో విలీనం చేస్తే ఊరుకునేది లేదని, దీనిని అడ్డుకునేందుకు ధర్నాకు దిగుతానని ఎమ్మెల్యే సున్నం రాజయ్య హెచ్చరించారు. ములకపాడు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాన్ని తరలించేందుకుగాను ఫర్నీచర్‌ను తీసుకెళుతున్నారని తెలుసుకున్న రాజయ్య.. గురువారం హైదరాబాద్‌లో ఐసీడీఎస్ డైరెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో డైరెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడి నుంచే డైరెక్టర్‌తో మాట్లాడారు. గతంలో భద్రాచలంలో ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాలన్ని పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా దుమ్ముగూడెం మండలంలోని ములకపాడుకు మార్చారని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పరిధిలో 95 పెద్ద కేంద్రాలు, 40 చిన్న కేంద్రాలు ఉన్నాయన్నారు. వీటి ద్వారా 40వేల మందికి పౌష్టికాహారం అందుతోందని చెప్పారు. ఇంతమందికి ఉపయోగపడుతున్న ప్రాజెక్టును భద్రాచలం తరలించడం సరికాదన్నారు. ‘‘జిల్లాల పునర్విభజన పేరుతో పాలనను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం చెబుతుంటే.. మీరేమో ఐసీడీఎస్ కార్యాలయాన్ని ప్రజలకు దూరంగా తరలించడం ఎంతమాత్రం సరికాదు’’ అని వాదించారు. దీనిపై కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని డైరెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం, కలెక్టర్‌తో కూడా ఎమ్మెల్యే మాట్లాడారు. ఐసీడీఎస్ జేడీ రాములును కలిసి వివరాలు తెలిపారు. వినతిప్రతం ఇచ్చారు. ఐసీడీఎస్ కార్యాలయాన్ని తరలిస్తే.. కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. ఆయన వెంట సీఐటీయూ కార్యదర్శి బ్రహ్మాచారి, మండల కార్యదర్శి సిహెచ్.మిత్ర, సీఐటీయూ నాయకురాలు రాధాకుమారి తదితరులు ఉన్నారు. ఈ వివరాలన్నిటినీ ‘సాక్షి’కి ఎమ్మెల్యే హైదరాబాద్ నుంచి ఫోన్లో వెల్లడించారు. -
ఐసీడీఎస్‌కు యువతి అప్పగింత
రైల్వేగేట్ : నగరంలోని వరంగల్ రైల్వేస్టేషన్ జీఆర్పీ పోలీసులు ముస్లిం యువతిని ఐసీడీఎస్‌కు అప్పగించారు. సీఐ స్వామి కథనం ప్రకారం.. వరంగల్ జీఆర్పీ సీఐ స్వామి కథనం ప్రకారం.. వరంగల్ రైల్వేస్టేషన్లో సల్మాబేగం(25) అనే యువతి మంగళవారం ఏడుస్తుండగా ప్రయివేటు సానిటేషన్ వర్కర్ మహాలక్ష్మి జీఆర్పీ పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో పోలీసులు సల్మాబేగంను స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ ఆమె వివరాలు అడగగా తమది వరంగల్ అని, తన తల్లిదండ్రులు తనను చిన్నప్పుడే జైపూర్‌కు తీసుకెళ్లారని తాను రైలులో ఇక్కడికి వచ్చినట్లు చెప్పింది. అలాగే కొన్ని విషయాల్లో పొంతనలేని సమాధానాలు చెప్పడంతోపాటు తనకు ఈ పోలీస్టేషన్లో ఉద్యోగం ఇప్పించాలని, ఉపాధి కావాలని అన్నట్లు పోలీసులు తెలిపారు. సల్మాబేగం మానసిక స్థితి బాగాలేకనే ఇలా మాట్లాడుతున్నట్లు గమనించి ఐసీడీఎస్ అర్బన్-2 సీడీపీఓ మధురిమకు యువతిని అప్పగించినట్లు సీఐ పేర్కొన్నారు. కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుల్ మురళి తదితరులున్నారు. -
అమ్మకానికి ఆడపిల్లలు..?
* పోలీసుల అదుపులో తండ్రి * ఐసీడీఎస్‌కు బాలికల అప్పగింత ఆదిలాబాద్ క్రైం: ఓ తండ్రి తన ఇద్దరు ఆడపిల్లలను అమ్మకానికి పెట్టాడనే అనుమానంతో పోలీసులు ఆ తండ్రిని పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో పాటు బాలికలను ఐసీడీఎస్‌కు అప్పగించారు. ఈ ఉదంతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. మహారాష్ట్రలోని కిన్వట్‌కు చెందిన దశరథ్, శోభా దంపతులు కొంతకాలంగా ఆదిలాబాద్‌లోని కేఆర్కే కాలనీలో ఉంటూ కూలి పని చేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉండగా.. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 7వ, 5వ తరగతి చదువుతున్నారు. మంగళవారం దశరథ్ తన ఇద్దరు కూతుళ్లతో కలసి పట్టణంలోని రైల్వేస్టేషన్లో రాజ స్తాన్‌కు చెందిన యువకుడు లతీఫ్‌తో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో అతని గ్రామానికే చెందిన రవికాంత్ అనే యువకుడు అక్కడికి వచ్చాడు. అదే సమయంలో పోలీసులు అక్కడికి రాగా, రవికాంత్ వెళ్లి దశరథ్ బాలికలను అమ్ముతున్నాడని చెప్పాడు. గతంలోనూ దశరథ్ ఇంకో కూతురిని విక్రయించాడని, తర్వాత ఇక్కడికి వచ్చి ఉంటున్నాడని పేర్కొన్నాడు. దీంతో పోలీసులు వారందరినీ టూటౌన్‌కు తరలించారు. లతీఫ్ తనకు పాత పరిచయమని, మహాలక్ష్మీవాడ కాలనీలో ఉంటున్న బంధువుల వద్దకు రాగా రైల్వేస్టేషన్లో కలిశాడని దశరథ్ చెప్పాడు. తమ పిల్లలను ఎందుకు అమ్ముకుంటామని, అనవసరంగా తీసుకొచ్చారని చెప్పుకొచ్చాడు. ఇదే విషయమై లతీఫ్‌తో ‘సాక్షి’ మాట్లాడగా.. తన బంధువుల ఇంటికి వచ్చానని, ఎప్పటి నుంచో దశరథ్‌తో పరిచయం ఉందని తెలిపాడు. ట్రాక్టర్ కొనుగోలు విషయమై రైల్వేస్టేషన్లో మాట్లాడాడని చెబుతున్నాడు. కాగా, తాను వెళ్లేసరికి విషయూన్ని పక్కదోవ పట్టించారంటూ రవికాంత్ తెలిపాడు. ఇద్దరు చిన్నారులను పోలీసులు ఐసీడీఎస్‌కు తరలించారు. వీరందరినీ పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతే అసలు విషయం బయటపడుతుందని, అప్పటి వరకు చిన్నారులు ఐసీడీఎస్‌లో ఉంటారని ఎస్సై రాజన్న వివరించారు. -
సంరక్షణ గృహానికి చిన్నారులు
కడప కార్పొరేషన్: కడప నగరంలో భిక్షమెత్తుతున్న ఇద్దరు బాలలను స్త్రీ, శిశు అభివృద్ది సంస్థ(ఐసీడీఎస్) అధికారులు రక్షించారు. వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచి సంరక్షణ గృహానికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి...చిన్న వెంకట సుబ్బయ్య(50) అనే వ్యక్తికి తిరుపతిలో మతిస్థిమితం లేని ఓ మహిళ తారసపడింది. ఆమె మాట్లాడలేదు. ఆమెను లొంగదీసుకున్న అతను చిన్నారులు ఆంజనేయులు(6), లక్ష్మి(1)లను కూడా తన ఆధీనంలో ఉంచుకొని భిక్షమెత్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఆర్టీసీ బస్టాండు వద్ద చిన్నారి లక్ష్మిని ఎత్తుకొని దీనంగా భిక్షమెత్తుతున్న ఆంజనేయులును ఐసీడీఎస్ అధికారులు గుర్తించారు. వారిచే ఎవరైనా ఈ పనిచేయిస్తున్నారేమోనని అనుమానంతో ఆ పిల్లలకు భిక్షం వేయవద్దని వారించసాగారు. తాపీగా చెట్టుకింద పడుకొని ఇదంతా చూసిన చిన్నవెంకట సుబ్బయ్య ఐసీడీఎస్ అధికారులపై దౌర్జన్యానికి దిగాడు. దీంతో వారు పోలీసుల ద్వారా ఆ నలుగురిని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ రాఘవరావు దగ్గరికి తీసుకొచ్చారు. పీడీ పిల్లలిద్దరినీ సీడబ్లు్యసీ ఎదుట హాజరుపరిచి వారి అనుమతితో సంరక్షణశాలకు తరలించారు. అనంతరం రాఘవరావు మాట్లాడుతూ ఆ పిల్లలిద్దరూ అతనికి పుట్టినవారు కాదని, అందుకే ఆ పిల్లవాణ్ని కొడుతూ భిక్షమెత్తిస్తున్నాడని తెలిపారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
ప్రొద్దుటూరు: మైనర్ బాలిక నిశ్చితార్థాన్ని ఐసీడీఎస్ అధికారులు శనివారం అడ్డుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని గోకుల్ నగర్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక తనకు వివాహం చేసేందుకు తల్లి ఏర్పాట్లు చేస్తోందని... త్వరలో ఖాజీపేటకు చెందిన ఆటో డ్రైవర్‌తో నిశ్చితార్థం చేయబోతోందని టోల్ ఫ్రీ నంబర్ 1098కు ఉదయాన్నే ఫోన్ చేసింది. వెంటనే టూటౌన్ ఎస్ఐ ఆంజనేయులు, అర్బన్ ఐసీడీఎస్ సీడీపీఓ రాజేశ్వరిదేవి, సూపర్వైజర్ సావిత్రమ్మ ఆ బాలిక ఇంటికి వెళ్లారు. అనంతరం ఆ బాలిక, తల్లిని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఐసీడీఎస్ అధికారుల చేత ఫిర్యాదు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ తన తల్లి తనకు బలవంతంగా వివాహం చేస్తోందని, ఆరు నెలల క్రితం కూడా ఫిర్యాదు చేయడంతో అప్పుడు కూడా పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి చర్చించామన్నారు. ప్రస్తుతం మరో మారు ఈ బాలిక ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ భ్రమరాంభతోపాటు ఆమె భర్త పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బాలిక తల్లికి మద్దతుగా వకాల్తా పుచ్చుకోగా ఎస్ఐ డీఎస్పీ నీలం పూజిత వద్దకు పంపారు. డీఎస్పీ అధికారులపై ఉద్దేశ పూర్వకంగా ఆరోపణలు చేయొద్దని, వారు పై అధికారుల ఆదేశాల ప్రకారం పని చేయాల్సి ఉంటుందన్నారు. ఆ మేరకు ఐసీడీఎస్ అధికారులు కడపలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ శారదాతో చర్చించి బాలసదనంలో చేర్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సుజాత, ఎల్.సుబ్బమ్మ, లక్ష్మి పాల్గొన్నారు. -
పసికందును ‘అమ్మే’శారు
చేరదీసిన ఐసీడీఎస్ అధికారులు నెల్లూరు(అర్బన్) : వెంకటాచలం మండలం చెముడుగుంట పంచాయతీ నక్కల గిరిజనకాలనీలో వారం క్రితం 5 నెలల పసి కందును అమ్మిన సంఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆ బిడ్డను ఐసీడీఎస్ విభాగం ఐసీపీఎస్ అధికారులు చేరదీశారు. గిరిజనకాలనీకి చెందిన సుబ్బాల మస్తానయ్య,చెంచులక్ష్మి దంపతులది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. ఆ పేద దంపతులు బిడ్డను పోషించలేక ఐదు నెలల మగబిడ్డను సమీపంలోని బుజబుజనెల్లూరు ప్రాంతానికి చెందిన బొడ్డు సుమతి, ప్రభుదాస్ దంపతులకు రూ.15 వేలకు అమ్మేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో కలెక్టర్ ముత్యాలరాజుకు ఫోన్లో సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి బిడ్డను స్వాధీనం చేసుకున్నారు. ఇంతలోనే బిడ్డ తండ్రి మస్తానయ్య తమ బిడ్డ తనకు కావాలని అడిగారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వెంకటాచలం తహసీల్దార్ కూడా విచారించారు. ఐసీడీఎస్ అధికారులు బిడ్డను అమ్మిన దంపతులపై వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పసిబిడ్డను పెద్దాస్పత్రిలోని చిన్న పిల్లల విభాగానికి తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిసింది. -
ఐసీడీఎస్ చెంతకు చిన్నారులు
కడప రూరల్ : ముద్దనూరుకు చెందిన లక్ష్మిదేవి ఈ ఏడాది ఉగాది రోజున కొన్ని కారణాల వల్ల కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ప్రైవేటు జీపు డ్రైవర్‌గా పని చేస్తున్న ఆమె భర్త శంకర్ మానసిక వేదనతో ఇటీవల మృతి చెందాడు. ఫలితంగా ఆ దంపతుల పెద్ద కుమార్తె వైశాలి (7), చిన్న కుమార్తె గౌరీప్రియ (3) అనాథలుగా మారారు. వీరిపై ‘సాక్షి’లో ఇటీవల కథనం ప్రచురితమైంది. ఇందుకు ఐసీడీఎస్ అధికారులు స్పందించారు. ముద్దనూరుకు చెందిన సూపర్వైజర్ లక్ష్మిప్రియ, కార్యకర్త విజయదుర్గ ఆ చిన్నారులను శుక్రవారం కడప ఐసీడీఎస్ కార్యాలయానికి తీసుకొచ్చి ఆ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాఘవరావుకు అప్పగించారు. బంధువుల రంగప్రవేశం అయితే ఆ చిన్నారుల బంధువులు తాము పోషిస్తామంటూ ముందుకు వచ్చారు. ఆ మేరకు ప్రాజెక్టు డైరెక్టర్ వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్నారు. తమ బాలసదన్‌లో ఈ చిన్నారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు. అయినా వారు వినలేదు. ఈ చిన్నారులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి అప్పగిస్తామని, వారి నిర్ణయం మేరకు నడుచుకుంటామని పీడీ తెలిపారు. -
అంగన్వాడీలకు త్వరలో టాబ్లు
మార్టేరు (పెనుమంట్ర) : పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే క్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ కార్యకర్తలకు త్వరలోనే టాబ్లు అందించనున్నట్టు ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.చంద్రశేఖర్ తెలిపారు. మార్టేరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇందుకోసం ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయన్నారు. అలాగే కంప్యూటర్ టాబ్లు కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు. కాగా ప్రతి కార్యకర్తకు వీటి వినియోగంపై తగిన శిక్షణ కూడా ఇస్తామని చెప్పారు. తద్వారా కార్యకర్తలకు ప్రస్తుతానికి రికార్డుల పనిభారం తగ్గుతుందన్నారు. భవిష్యత్ కాలంలో కాగితరహితంగా కేంద్రాల నిర్వహణ సాగనుందన్నారు. ఉద్యోగుల వేలిముద్రల నిర్వహణలో రాష్ట్రవ్యాప్తంగా మన జిల్లా ముందంజలో ఉందన్నారు. ప్రతి అంగన్వాడీ కార్యకర్త, ఆయా సమీపంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో తప్పనిపరిగా వేలిముద్రలు వేయాలని ఆయన సూచించారు. అందుకు సహకరించని గ్రామ పంచాయతీలపై తమ సిబ్బంది ఫిర్యాదు చేస్తే తాము వెంటనే జిల్లా కలెక్టర్‌కు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. రూ.7.5 లక్షల వ్యయంతో జిల్లావ్యాప్తంగా 324 అంగన్వాడీ కేంద్రాలను నూతనంగా నిర్మిస్తున్నామని చెప్పారు. అలాగే రెండేళ్లుగా పెండింగ్‌లో మాతృత్వ సంయోజన పథకం అమలుకు రూ.23 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెనుమంట్ర ప్రాజెక్టు అధికారిణి టి.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. -
ఐసీడీఎస్ పీడీగా గిరిజ
మంకమ్మతోట : స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ పీడీగా గిరిజ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇన్చార్జి పీడీ రాధమ్మ నుంచి ఆమె బాధ్యతలు తీసుకున్నారు. ఐసీడీఎస్ కమిషనరేట్‌లో సీడీపీవో స్థాయి అధికారిగా ఆమె విధులు నిర్వస్తున్నారు. పీడీగా పదోన్నతి పొంది బదిలీపై వచ్చారు. -
రెండు జిల్లాల పరిధిలోకి రూరల్ ఐసీడీఎస్
హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టరేట్లోని హన్మకొండ రూరల్ ఐసీడీఎస్ కార్యాలయం పరిస్థితి అయోమయంగా ఉంది. ఈ కార్యాలయ పరిధిలో మెుత్తం 310 అంగన్వాడీ కేంద్రా లు, ఏడుగురు సూపర్వైజర్లు ఉన్నారు. పేరుకు రూరల్ కార్యాలయమైనా అర్బన్‌లోని విలీన గ్రామాల్లో సుమారు వంద అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. హన్మకొండ, వరంగల్, ఆత్మకూరు, గీసుకొండ, హసన్‌పర్తి మండలాల పరిధిలో అంగన్వాడీ కేంద్రా లు ఉన్నాయి. ప్ర స్తుతం విభజనతో ఐనవోలు, కాజీపేట, ఖిలావరంగల్ మండలాల్లోకి కొన్ని అంగన్వాడీ కేంద్రాలు చేరుతున్నాయి. ఇక హన్మకొండ జిల్లా పరిధిలోకి హన్మకొండ, ఐనవోలు, కాజీపేట మండలాల్లోని 59, వరంగల్ జిల్లా పరిధిలోకి వరంగల్, ఆత్మకూరు, గీసుకొండ, ఖిలావరంగల్ మండలాల్లోని 251 అంగన్వాడీ కేంద్రాలు వస్తున్నా యి. ఐసీడీఎస్ పీడీ కార్యాలయ పరిధిలో పనిచేస్తుంది. అయితే ఇప్పుడు రెండు జిల్లాల పరిధిలోకి కేంద్రాలు వస్తున్నందున అధికారులు విభజన విషయంలో తలలు పట్టుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో పను లు పూర్తి చేసి తుది నివేదిక అధికారులకు అందజేస్తామని సీడీపీవో శైలజ తెలిపారు. వరంగల్ జిల్లాలోని 251 కేంద్రాలు వెళ్తుండటం తో మిగిలేది 59 అంగన్వాడీ కేం ద్రాలు మాత్రమే కావడంతో కార్యాలయం భవితవ్యం ఏమిటనేది తేలాల్సి ఉంది. -
అయ్యో.. పాపం!
→ కలహాలతో విడిపోయిన దంపతులు? → అనాథగా మారిన ఏడాదిన్నర చిన్నారి → శిశుసదన్కు తరలించిన ఐసీడీఎస్ అధికారులు కనగానపల్లి : రెండేళ్ల చిన్నారికి ఎంత కష్టమొచ్చిందో.. ఏ పాపం ఎరుగని ఆ చిన్నా రి అనాథగా మారింది. అమ్మానాన్న మధ్య తలెత్తిన మనస్పర్ధలు ఆ చిన్నారిని ఒంటరి చేశాయి. ఏడాదిన్నర వయస్సు కలిగిన ఆ పాపను కనగానపల్లి మండ లం బద్దలాపురం ఎస్సీ కాలనీ సమీపంలో కన్నవారు శుక్రవారం ఉదయం ఒంటరిగా వదిలివెళ్లిపోయారని గ్రామస్తులు తెలిపారు. ఏడుస్తూ కనిపించిన పాపను స్థా నికులు గమనించి చేరదీశా రు. చుట్టుపక్కల వారిని విచారించారు. విష యం తెలుసుకున్న అంగన్వాడీ వర్క ర్లు ఐసీడీఎస్ అధికారుSకు సమాచా రం అందించారు. సీడీపీఓ వనజాక్షి, సూపర్వైజర్ మీనాక్షమ్మ హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. పాప ను అనంతపురంలోని బాలశిశుసదన్కు తరలించారు. అయితే బద్దలాపురానికి చెందిన ఓ యువతి, యువకు డు రెండేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారని గ్రామస్తుల ద్వారా తెలి సింది. కొద్ది రోజులు వారి సంసారం సాఫీగా సాగినా ఆ తరువాత కుటుం బ కలహాల తో విడిపోయారని సమాచారం. అప్పటికే వారికి ఓ పాపం పుట్టిందని తెలుస్తోంది. ప్రస్తుతం వారి ద్దరూ వేర్వేరుగా ఉంటుండగా, పాప పోషణ భారం కావడంతో బిడ్డను అనాథను చేసినట్లు తెలుస్తోంది. -
ఐసీడీఎస్‌లో మెరుగైన సేవలకు కృషి
తడికలపూడి (కామవరపుకోట) : జిల్లాలోని పద్దెనిమిది ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అందిస్తున్న సేవలను మరింత బలోపేతం చేసేందుకుSకృషి చేస్తున్నట్టు జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ఇందుకు స్ట్రెన్తనింగ్ న్యూట్రిషన్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా 18 ఐసీడీఎస్ప్రాజెక్టులను నాలుగు డివిజన్లుగా విభజించి సూపర్వైజర్లకు తడికలపూడి దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం)లో ’అనుబంధ పోషకాహారం– ఆహారంలో వైవిధ్యత’(మాడ్యూల్ 9)అనే అంశంపై 23 నుంచి 27 వరకు శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. కొవ్వూరు డివిజన్లోని సూపర్వైజర్లకు మంగళవారం ఒక రోజు శిక్షణ ఇచ్చామన్నారు. ఐఎస్‌ఎస్‌ఎన్‌ఐపీ కన్సల్టెంట్ సుధాకర్, ప్రాంగణం అధికారిణి ఎం.ఉమాదేవి పాల్గొన్నారు. -
ఐసీడీఎస్‌కు ఆడశిశువు అప్పగింత
మహబూబ్‌నగర్ క్రైం : ఓ రైలులో గుర్తుతెలియని వ్యక్తులు తొమ్మిది నెలల ఆడశిశువును వదిలిపెట్టి వెళ్లారు. రైల్వే ఎస్ఐ రాఘవేందర్‌గౌడ్ కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం గుంటూరు నుంచి కాచిగూడ వరకు వెళుతున్న ఫ్యాసింజర్ రైలు మహబూబ్‌నగర్ స్టేషన్లో ఆగింది. అదే సమయంలో తొమ్మిది నెలల ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. కొద్దిసేపటికి అక్కడి ప్రయాణికులు గమనించి వెంటనే రైల్వేపోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు ముస్తాక్, షర్మిల పాల్గొన్నారు. -
బాల్య వివాహానికి యత్నం
– అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు తోటపల్లిగూడూరు : కొన్ని గంటల వ్యవధిలో పెద్దలు నిర్వహించనున్న ఓ బాల్య వివాహాన్ని ఆదివారం ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. ఈ సంఘటన మండలంలోని చింతోపులో జరిగింది. చింతోపు బీసీ కాలనీకి చెందిన పత్తెం మల్లికార్జున్, శిరీషా దంపతుల కుమార్తె (16)కు తుమ్మలపెంటకు చెందిన నరేంద్రబాబుతో ఆదివారం రాత్రి వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. అయితే చింతోపులో ఓ మైనర్ బాలికకు పెళ్లి జరుగుతుందని ఐసీడీఎస్ అధికారులకు స్థానికులు కొందరు సమాచారం అందించారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం ఇందుకూరుపేట ఐసీడీఎస్ సీడీపీఓ శారదాకుమారి తన సిబ్బందితో కలిసి చింతోపు బీసీ కాలనీకి వెళ్లి వివరాలు సేకరించారు. పెళ్లి నిశ్చయించిన బాలికకు 16 ఏళ్ల లోపే ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఈ పెళ్లి జరగడానికి వీళ్లేదంటూ అధికారులు మైనర్ బాలిక తల్లిదండ్రులను ఆదేశించారు. అయితే పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని మరి కొన్ని గంటల్లో జరగాల్సిన పెళ్లిని ఆపొద్దంటూ బాలిక తల్లిదండ్రులు ఐసీడీఎస్ అధికారులతో మొరపెట్టుకున్నారు. అయినా మైనర్ బాలికకు పెళ్లి చేయడం చట్ట రీత్యా నేరమని, అందుకు ఒప్పుకునేది లేదని అధికారులు స్పష్టం చేశారు. పెళ్లి సమయానికి నిశ్చతార్థం చేసుకుని మరో రెండేళ్ల తర్వాత పెళ్లి చేయాలని వారు ఆ బాలిక తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు. కాదని పెళ్లి చేస్తే అందరూ కటకటాల్లోకి వెళ్లాల్సివస్తుందని హెచ్చరించారు. -
జిల్లాకు 596 అంగన్వాడీ భవనాలు
ఐసీడీఎస్ పీడీ రాబర్ట్స్ రామతీర్థం (నెల్లిమర్ల రూరల్) : జిల్లాకు కొత్తగా 596 అంగన్వాడీ భవనాలు మంజూరైనట్లు ఐసీడీఎస్ పీడీ ఏఈ రాబర్ట్స్ తెలిపారు. కష్ణమ్మ పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రామతీర్థం గ్రామాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల కల్పనకు ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిందని చెప్పారు. ఒక్కో భవనానికి ఏడున్నర లక్షల రూపాయలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. న్యూట్రిషన్ మిషన్ ద్వారా చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా శిశుమరణాలను తగ్గించడానికి అంగన్వాడీల ద్వారా మహిళలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. తల్లిపాలు ఆరోగ్యకరమని తెలియజెప్పడానికి ఇప్పటికే జిల్లాలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించామని తెలిపారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె.రాజ్‌కుమార్, టీడీపీ నాయకులు సువ్వాడ రవిశేఖర్, గేదెల రాజారావు, కోటపాటి తిరుపతిరావులు పాల్గొన్నారు. -
తల్లిపాలే పిల్లలకు శ్రేయస్కరం
♦ అంగన్వాడి కార్యకర్తలకు దీర్ఘకాలిక లక్ష్యాలు అవసరం ♦ పూర్వప్రాథమిక విద్యా ఎంతో అవసరం ♦ తల్లిపాల మాసోత్సవాల్లో పరిగి ఎమ్మెల్యే టీ.రామ్మోహన్‌రెడ్డి పరిగి: పుట్టగానే ముర్రుపాలతో పాటు తదనంతరం తల్లిపాలు తాగించటం వల్ల దీర్ఢకాలంలో వారి ఎదుగుదలకు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే టీ. రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం పరిగిలోని కేఎన్ఆర్ గార్డెన్లో ఐసీడీఎస్ ఆద్వర్యంలో తల్లిపాల మాసోత్సవాల్లో బాగంగా నియోజకవర్గ స్థాయి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలు స్వల్పకాలిక లక్ష్యాలను సాధిస్తూనే దీర్ఘకాలిక లక్ష్యాలకోసం పనిచేయాలన్నారు. పూర్వ ప్రాథమిక విద్య ప్రభుత్వం ప్రవేశపెట్టాలని అయితే అది అంగన్వాడి సెంటర్ల ద్వారానే అమలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలలకు అనుబందంగా జరగాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. మాతా శిశు మరణాలను తగ్గించటంలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకమైనదని ఆయన తెలిపారు. కార్యకర్తలకు నిరంతరం శిక్షణ తోపాటు వారిలో వత్తిడిని తగ్గించేందుకు నిరంతరం ప్రత్యేక కార్యక్రమాలు అవసరమని అధికారులకు సూచించారు. అంగన్వాడి కార్యకర్తల సమస్యలు, పోస్టుల భర్తి తదితర అంశాలు అసెంబ్లీలో చర్చిస్తానని తెలిపారు. అనంతరం పరిగి జ్యోతి, గండేడ్ ఎంపీపీ శాంత మాట్లాడుతూ సమాజాం అంగన్వాడీలను సరియైన విదంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రసవం తల్లికి పునర్జన్మ అని అలాంటి తల్లులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన వ్యవస్థపై ఉందని పరిగి సర్పంచ్ విజయమాల అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్లను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే గ్రామ స్థాయిలోనే చాలా రకాల హెల్త్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎంపీడీఓ విజయప్ప, ఎస్పీ హెచ్ఓ డాక్టర్ ధశరథ్ అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలతో అంగన్వాడి కేంద్రాలు పనిచేస్తున్నాయని సీడీపీఓ ప్రియదర్శిని అన్నారు. తల్లిపాలు పిల్లల పాలిట సంజీవిని అని వివరించారు. చిన్నతనంలో తల్లిపాలు తాగిన చిన్నారుల్లో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్లు సరళ, ఆదిలక్ష్మి, ప్రమిళ, రాణి, నిర్మళ, దివ్య, నీలవేణి, పద్మ, జ్యోతి, కాంగ్రెస్ నాయకులు టీ. వెంకటేష్, అశోక్‌రెడ్డి అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న స్టాళ్లు. అంగన్వాడి కార్యకర్తలు ఊర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. ఇందులో బాగంగా అంగన్వాడి కార్యకర్తలు చిన్నారులకు చిన్నతనంలో ఆటల కోసం, సృజనాత్మకతను పెంచేందుకు వినియోగించే పరికరాలు, వస్తులు అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో ప్రదర్శించారు. తీసుకోవాల్సిన ఆహార పధార్థాల తయారు చేసి స్టాళ్లలో ఉంచారు వాటివల్ల కలిగే ఉపయోగాలను అక్కడ రాసి ఉంచారు. ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబందించిన పరికరాలు ప్రదర్శించారు. -
చట్టవిరుద్ధ దత్తతపై చర్యలు
ఐసీడీఎస్ పీడీ రాబర్ట్స్ విజయనగరం ఫోర్ట్: చట్టవిరుద్ధంగా దత్తత తీసుకుంటే చర్యలు తప్పవని ఐసీడీఎస్ పీడీ ఎ.ఇ.రాబర్ట్స్ అన్నారు. గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన కె. శంకర్రావు, లక్ష్మి దంపతులు మగ పిల్లవాడి కోసం నిరీక్షించి ఐదో కాన్పులో కూడ ఆడపిల్ల జన్మించడంతో ఆ బిడ్డను విజయనగరంలోని సూర్యకాంతం అనే మధ్యవర్తి ద్వారా విశాఖపట్నానికి చెందిన పి.మహాలక్ష్మి అనే మహిళకు అనధికారికంగా ఇచ్చేశారు. విషయం తెలుసుకున్న డీసీపీయూ అధికారులు గజపతినగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ పాపను పోలీసులు సోమవారం రాత్రి రప్పించి శిశుగహలో పెట్టారు. మంగళవారం పాప తల్లిదండ్రులు ఐసీడీఎస్ కార్యాలయానికి వచ్చారు. పాపను బాలల సంక్షేమ కమిటీ, ఐసీడీఎస్ పీడీ ముందు డీసీపీయూ అధికారులు ప్రవేశ పెట్టారు. పాపను పెంచుకోలేమని తల్లిదండ్రులు చెప్పగా శిశుగహలో ఉంచాలని బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ కేసలి అప్పారావు, పీడీ రాబర్ట్స్ ఆదేశించారు. కార్యక్రమంలో డీసీపీయూ బి.హెచ్.లక్ష్మి, యాళ్ల నాగరాజు, స్వామినాయుడు, చలం తదితరులు పాల్గొన్నారు. -
స్వధార్ హోంలో ప్రసవించిన బాలిక
గంటసేపు నరక యాతన స్థానికంగా ఉండని నిర్వహకులు, సిబ్బంది ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన ఇందూరు : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతంనగర్‌లో గల ఐసీడీఎస్ శాఖకు చెందిన స్వధార్ హోంలో పద్నాలుగేళ్ల బాలిక బిడ్డను ప్రసవించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నేలపై బిడ్డను ప్రసవించి గంటకుపైగా నరక యాతన అనుభవిస్తుంటే పట్టించుకునే వారే కరువయ్యారు. పట్టించుకుందామంటే అందులో ఉన్నవారంతా బాలికలే. ఏం జరుగుతుందో తెలియక షాక్‌కు గురయ్యారు. అయితే ఒక్క పక్క బాలిక బిడ్డను ప్రసవించి స్పృహ కోల్పోయే స్థితికి చేరుకుంది. మరో పక్క పుట్టిన బిడ్డ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియదు. పుట్టిన బిడ్డ, బాలిక పరిస్థితి విషమిస్తుందనే సమయానికి సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు స్వధార్ హోంకు చేరుకుని 108 వాహనంలో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యాన్ని అందించారు. మరో అరగంట ఆలస్యం జరిగితే బాలికకు, పుట్టిన బిడ్డకు ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాలు కోల్పోయే వారని వైద్యులు పేర్కొన్నట్లు తెలిసింది. ఒక పక్క ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలోనే జరపాలని జిల్లా కలెక్టర్ యోగితా రాణా చెబుతుంటే.. ఇలా ఎక్కడో ఒక చోట అధికారుల నిర్లక్ష్యం బయటపడుతోంది. అయితే స్వధార్ హోంలో జరిగిన ప్రసవం మామూలు విషయం కాదు. 14 ఏళ్ల బాలిక, అది కూడా ఏడవ నెలలోనే ప్రసవించడం చాల ఆందోళనకరమైన పరిస్థితి. బాధిత బాలికల బాగోగులు చూడాల్సిన నిర్వాహకులు స్థానికంగా లేకపోవడం, జరిగిన విషయంపై ఐసీడీఎస్ అధికారులు నిర్వాహకులపై చర్యలు తీసుకుకోండా పట్టింపులేనట్లుగా వ్యవహరించడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఇంత జరిగినా జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లకపోవడం విశేషం! స్వధార్ హోం పర్యవేక్షకురాలిని ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా బాలిక జిల్లా ఆసుపత్రిలో ప్రసవించిందని చెప్పడం కొసమెరుపు. అలాగే స్వధార్ హోం నిర్వహకులను ఫోన్లో సంప్రదించగా జరిగిందేదో జరిగింది, విషయాన్ని పెద్దదిగా చేయవద్దని చెప్పడం మరో గమనార్హం. అసలు విషయం .. బోధన్ మండలం అమ్ధాపూర్ గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికను ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. బాలిక గర్భవతి కావడంతో ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు నిర్భయ కేసును న మోదు చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే బాలికకు మూడవ నెల అని నిర్ధారించారు. ఈ సమయంలో అబార్షన్ చేయడం బాలికకు ప్రమాదమని తెలుపడంతో, బాలిక కడుపులో గర్భాన్ని అలాగే ఉంచారు. ఐసీడీఎస్ అధికారులు బాలికకు స్వధార్ హోంలో ఆశ్రయం కల్పించారు. బాలికకు సెప్టెంబర్‌కు తొమ్మిది నెలలు నిండుతాయని, అప్పుడే ప్రసవం చేయాలని వైద్యులు సూచించారు. అయితే బాలిక ఏడవ నెల గర్భంలోనే జూలై 21న ఉదయం 6 గంటలకు స్వధార్ హోంలోనే బిడ్డను ప్రసవించింది. నొప్పులతో బాలిక అరుస్తుంటే ఏం చెయ్యాలో తోచని స్థితిలో తోటి బాలికలు ఉండిపోయారు. స్థానికంగా ఉండాల్సిన స్వధార్ హోం నిర్వాహకులు, సూపరింటెండెంట్, కౌన్సిలర్, ఇతర సిబ్బంది అందుబాటులో లేరు. బాలిక అక్కడే నేలపై బిడ్డను ప్రసవించింది. -
స్వధార్ హోమ్‌లో ప్రసవించిన బాలిక
-గంటసేపు నరక యాతన -స్థానికంగా ఉండని సిబ్బంది -ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన ఇందూరు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతంనగర్‌లో గల ఐసీడీఎస్ శాఖకు చెందిన స్వధార్ హోంలో పద్నాలుగేళ్ల బాలిక బిడ్డను ప్రసవించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నేలపై బిడ్డను ప్రసవించి గంటకుపైగా నరక యాతన అనుభవిస్తుంటే పట్టించుకునే వారే కరువయ్యారు. పట్టించుకుందామంటే అందులో ఉన్నవారంతా బాలికలే. ఏం జరుగుతుందో తెలియక షాక్‌కు గురయ్యారు. అయితే ఒక్క పక్క బాలిక బిడ్డను ప్రసవించి స్పృహ కోల్పోయే స్థితికి చేరుకుంది. మరో పక్క పుట్టిన బిడ్డ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియదు. పుట్టిన బిడ్డ, బాలిక పరిస్థితి విషమిస్తుందనే సమయానికి సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు స్వధార్ హోంకు చేరుకుని 108 వాహనంలో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యాన్ని అందించారు. మరో అరగంట ఆలస్యం జరిగితే బాలికకు, పుట్టిన బిడ్డకు ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాలు కోల్పోయే వారని వైద్యులు పేర్కొన్నట్లు తెలిసింది. ఒక పక్క ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలోనే జరపాలని జిల్లా కలెక్టర్ యోగితా రాణా చెబుతుంటే.. ఇలా ఎక్కడో ఒక చోట అధికారుల నిర్లక్ష్యం బయటపడుతోంది. అయితే స్వధార్ హోంలో జరిగిన ప్రసవం మామూలు విషయం కాదు. 14 ఏళ్ల బాలిక, అది కూడా ఏడవ నెలలోనే ప్రసవించడం చాల ఆందోళనకరమైన పరిస్థితి. బాధిత బాలికల బాగోగులు చూడాల్సిన నిర్వాహకులు స్థానికంగా లేకపోవడం, జరిగిన విషయంపై ఐసీడీఎస్ అధికారులు నిర్వాహకులపై చర్యలు తీసుకుకోండా పట్టింపులేనట్లుగా వ్యవహరించడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఇంత జరిగినా జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లకపోవడం విశేషం! స్వధార్ హోం పర్యవేక్షకురాలిని సాక్షి’ ఫోన్లో సంప్రదించగా బాలిక జిల్లా ఆసుపత్రిలో ప్రసవించిందని చెప్పడం కొసమెరుపు. అలాగే స్వధార్ హోం నిర్వహకులను ఫోన్లో సంప్రదించగా జరిగిందేదో జరిగింది, విషయాన్ని పెద్దదిగా చేయవద్దని చెప్పడం మరో గమనార్హం. అసలు విషయం .. బోధన్ మండలం అమ్ధాపూర్ గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికను ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. బాలిక గర్భవతి కావడంతో ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు నిర్భయ కేసును నమోదు చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే బాలికకు మూడవ నెల అని నిర్ధారించారు. ఈ సమయంలో అబార్షన్ చేయడం బాలికకు ప్రమాదమని తెలుపడంతో, బాలిక కడుపులో గర్భాన్ని అలాగే ఉంచారు. ఐసీడీఎస్ అధికారులు బాలికకు స్వధార్ హోంలో ఆశ్రయం కల్పించారు. బాలికకు సెప్టెంబర్‌కు తొమ్మిది నెలలు నిండుతాయని, అప్పుడే ప్రసవం చేయాలని వైద్యులు సూచించారు. అయితే బాలిక ఏడవ నెల గర్భంలోనే జూలై 21న ఉదయం 6 గంటలకు స్వధార్ హోంలోనే బిడ్డను ప్రసవించింది. నొప్పులతో బాలిక అరుస్తుంటే ఏం చెయ్యాలో తోచని స్థితిలో తోటి బాలికలు ఉండిపోయారు. స్థానికంగా ఉండాల్సిన స్వధార్ హోం నిర్వాహకులు, సూపరింటెండెంట్, కౌన్సిలర్, ఇతర సిబ్బంది అందుబాటులో లేరు. బాలిక అక్కడే నేలపై బిడ్డను ప్రసవించింది. -
లేపాక్షి ఆలయంలో ప్రపంచ బ్యాంక్ బందం
లేపాక్షి : లేపాక్షి దేవాలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం ప్రపంచ బ్యాంక్ బృందం అధికారులు ఢిల్లీ నుంచి అనిజైగబ్‌మ్యాచు, సబ్జార్ మహమ్మద్ షేక్, రాష్ట్రం నుంచి నరసింహరావు, జిల్లా నుంచి సుధాకర్ సందర్శించారు. ఆలయంలోని అపురూపమైన శిల్పాలు, చిత్రలేఖనాలు తిలకించి ఆనందించారు. ఏడు శిరస్సుల నాగేంద్రుడు, 70 స్తంభాల్లో చెక్కిన లేపాక్షి డిజైన్లు, కల్యాణ మండపం, నాట్యమండపం, అంతరిక్ష స్తంభం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ అర్చకులు సూర్యప్రకాష్‌రావు ద్వారా ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభధ్రస్వాముల వారికి విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ బ్యాంక్ బృందంలో భాగంగా ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ను బలోపేతం చేయడానికి ఇస్ని ప్రాజెక్ట్ ఉందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన దశలవారి శిక్షణ కార్యక్రమాలు, సామూహిక సీమంతాలు, అన్నప్రాశన తదితర కార్యక్రమాలపై ఆరా తీశామన్నారు. హిందూపురం సీడీపీఓ నాగమల్లేశ్వరీ, ఏసీడీపీఓ సునిత ఆయన వెంట ఉన్నారు. అదేవిధంగా కర్ణాటకలోని లా కమిషన్ చైర్మన్ ఎస్ఆర్ నాయక్ శుక్రవారం ఉదయం లేపాక్షి ఆలయం సందర్శించారు. ఆలయ విశిష్టతను గురించి ఆలయ అర్చకులు సూర్యప్రకాష్‌రావును అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. -
తల్లిపాలే శ్రేష్టం
-
పుట్టిన బిడ్డను వదిలేసి వెళ్లిన తల్లి
పురిట్లో బిడ్డను పక్కన పెట్టేసి కనికరం లేకుండా వెళ్లిపోయిందో తల్లి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కంభంలోఇన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానిక ఆస్పత్రికి గత నెల 27న పురిటి నొప్పులతో వచ్చిన మహిళ ఆడపిల్ల పుట్టిన కొద్దిసేపటికి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఎంతకి తిరిగి రాకపోవడంతో.. ఆస్పత్రి యాజమన్యం ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు పాపకు వైద్య చికిత్సలు చేయించి తీసుకెళ్లారు. -
కుళ్లిన గుడ్లపై విచారణ
రెంజల్ : రెంజల్‌లోని రెండు అంగన్వాడీ కేంద్రాలను ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శారద తనిఖీ చేశారు. శుక్రవారం సాక్షి దినపత్రికలో ‘అంగన్వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు సరఫరా’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌తో పాటు బోధన్ సీడీపీవో వెంకట రమణమ్మలు రెంజల్‌లోని కేంద్రాలను తనిఖీ చేశారు. అయితే అధికారులు విచారణకు వస్తున్నారని ముందుగానే సమాచారం అందడంతో ఒకటో నంబరు కేంద్రం నిర్వాహకురాలు ఆయమ్మతో గుడ్లను సమీపంలోని పిచ్చిమొక్కల్లో పారవేయించారు. అధికారులు అంగన్వాడీ కేంద్రంలో విచారణ చేపట్టారు. ‘సాక్షి’లో ప్రచురితమైన పేపర్ కటింగ్‌ను వెంట తీసుకువచ్చారు. అప్పటికే నిర్వాహకురాలు ఆయాతో 28 గుడ్లను పిచ్చిమొక్కల్లో పారవేయించారు. విషయాన్ని గుర్తించిన స్థానికులు పీడీకి పారవేసిన గుడ్లను చూయించారు. దీంతో కేంద్రం నిర్వాహకురాలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్లను ఎందుకు పారవేయించావని ప్రశ్నించగా నిర్వాహకురాలు, ఆయాలు పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో పీడీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కేంద్రానికి వచ్చిన గుడ్ల వివరాలు, లబ్ధిదారులకు పంపిణీ చేసిన రికార్డులను తనిఖీ చేయగా వంద గుడ్ల వరకు వ్యత్యాసం తేలింది. నిర్వాహకురాలి నిర్లక్ష్యం వల్లే కుళ్లిన గుడ్లు అందాయని నిర్ధారణకు వచ్చారు. విషయాన్ని కలెక్టర్‌కు నివేదించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. -
కడప రైల్వే స్టేషన్లో బాలికల కలకలం
కడప రూరల్ : కడప రైల్వేస్టేషన్లో బుధవారం మధ్యాహ్నం బాలికలు కలకలం రేపారు. 13 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సు గల 11 మంది బాలికలు చెన్నైకి వెళ్లడానికి స్టేషన్‌కు చేరుకున్నారు. వారి సమాధానాలు అనుమానాస్పదంగా ఉండటంతో రైల్వే పోలీసులు ఐసీడీఎస్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం వివరాల మేరకు..11మంది బాలికలు చెన్నైకి కుట్టుశిక్షణకు వెళుతున్నట్లుగా తెలిపారు. వారికి సంరక్షకులమంటూ నాన్న, అన్న, మేనమామలుగా చెప్పుకునే 10మంది వరకు ఉన్నారు. వారు చెప్పిన వివరాల మేరకు చెన్నైలోని శిక్షణ కేంద్రాల యాజమాన్యాలకు ఫోన్ చేయగా, వారి నుంచి అస్పష్టమైన సమాధానం వచ్చింది. దీనికితోడు అటు బాలికలు, ఇటు వారివెంట ఉన్న పెద్దలు కూడా పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో ఐసీడీఎస్ పీడీ రాఘవరావు బాలికలను సీడబ్లు్యసీ (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ)కి అప్పగించారు. బాలికలకు బంధువులుగా చెప్పుకునే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఐసీడీఎస్ పీడీ రాఘవరావు మాట్లాడుతూ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్టూడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం ఇచ్చిన సమాచారం మేరకు కడప రైల్వేస్టేçÙన్లో బాలికలను అదుపులోకి తీసుకున్నామన్నారు. దీనిపై విచారణ చేపడతామని, అవసరమైతే ప్రభుత్వపరంగా బాలికలకు ఇక్కడే ఉచితంగా కుట్టుశిక్షణ ఇప్పించే ఏర్పాటు చేస్తామన్నారు. -
కడప రైల్వే స్టేషన్లో బాలికల కలకలం
-
తనిఖీ అధికారి పేరుతో దోపిడీ
21.4 సవర్ల బంగారు నగలు లూటీ బిట్రగుంట : బోగోలు మండలం కడనూతలలో అంగన్వాడీ కేంద్రం నిర్వాహకురాలు బుడంపాటి బాలాత్రిపురసుందరిని ప్రత్యేకాధికారి పేరుతో గుర్తుతెలియని వ్యక్తి బెదిరించి బీరువాలోని బంగారు నగలు దోచుకెళ్లిన సంఘటన స్థానికంగా శనివారం కలకలం సృష్టించింది. బాధితురాలు, పోలీసుల కథనం మేరకు.. కడనూతలలో అంగన్వాడీ కేంద్రం నిర్వాహకురాలిగా విధులు నిర్వహించే బాలత్రిపుర సుందరి వద్దకు ద్విచక్రవాహనంపై గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడు. నేరుగా అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన ఆగంతకుడు కలెక్టర్ కార్యాలయం నుంచి విచారణ కోసం వచ్చిన ప్రత్యేకాధికారి అజయ్‌గా పరిచయం చేసుకున్నాడు. కేంద్రంలోని రికార్డులన్నీ పరిశీలించి పచ్చ ఇంకుతో రిమార్కులు రాయడంతో పాటు అంగన్వాడీ కేంద్రాని సెల్ఫోన్లో వీడియో తీశాడు. అక్రమాలు చోటు చేసుకున్నాయని బెదిరిస్తూ అంగన్వాడీ కేంద్రం నిర్వాహకురాలితో పాటు ఆయా దగ్గర ఉన్న సెల్ఫోన్లు తీసుకుని స్విచ్చాఫ్ చేయించాడు. అంగన్వాడీ కేంద్రం నిర్వాహకురాలి ఇంట్లో తనిఖీలు చేయాలంటూ ఇంటి వద్దకు వచ్చి బీరువాలో నగలన్నీ బయటకు తీయించాడు. మొత్తం 21.4 సవర్ల బంగారాన్ని సీజ్ చేసినట్లు నటించి కలెక్టర్ కార్యాలయానికి వచ్చి రికార్డులు చూపించి నగలు తీసుకువెళ్లాలంటూ బైక్‌పై ఉడాయించాడు. కొద్దిసేపటికి తేరుకున్న త్రిపురసుందరి మోసపోయినట్లు గుర్తించి బిట్రగుంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఏ తల్లి కన్నబిడ్డో..
సాక్షి, కడప : ఆరు నెలల క్రితం ఓ తల్లి వదిలేసిన పురిటి బిడ్డను కడప శిశుగృహ సిబ్బంది అక్కున చేర్చుకున్నారు. బరువు తక్కువగా ఉన్న ఆ బిడ్డకు ఐసీడీఎస్ అధికారులు మెరుగైన వైద్యం చేయించి సంరక్షించారు. ఇప్పుడు ఆ బుజ్జాయి 4.5 కిలోల బరువు ఉన్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆరు నెలల క్రితం రాజంపేట మున్సిపాలిటీ సమీపంలోని వంక ప్రాంతంలో ఓ తల్లి పురిటి బిడ్డను వదిలేసి వెళ్లింది. ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో తెలీదు ఆ చిన్నారిని స్కూల్ బ్యాగులో ఉంచి వెళ్లింది. పసికందు ఏడుస్తుంటే సమీపంలో దుస్తులు ఉతుకుతున్న రజకులు గమనించారు. ఆ పసిబిడ్డను అక్కున చేర్చుకున్నారు. బరువు తక్కువగా ఉందని గ్రహించారు. అదే సమయంలో ఒక ముస్లిం సోదరుడు (పండ్ల వ్యాపారి) అటుగా వచ్చాడు. ఆయనకు ఐదుగురు ఆడ పిల్లలు. బరువు తక్కువగా ఉన్న ఈ చిన్నారిని కడపకు తీసుకెళ్లి వైద్యం చేయించాడు. నాలుగైదు వేలు ఖర్చు చేశాడు. ఆ తర్వాత కడపలోని అధికారులు సమాచారం ఇచ్చాడు. వెంటనే అధికారులు రిమ్స్‌కు తరలించి వైద్య సేవలు అందించి విషమ పరిస్థితిలో ఉన్న చిన్నారిని కాపాడారు. ఐసీడీఎస్ పీడీ రాఘవరావు ప్రత్యేక శ్రద్ధతీసుకున్నారు. అక్కడి నుంచి కడప నగర శివార్లలోని శిశుగృహకు తరలించి ప్రత్యేకంగా చూసుకుంటూ వచ్చారు. పుట్టినపుడు 800 గ్రాముల బరువున్న ఆ చిన్నారి ప్రస్తుతం 4.5 కిలోల బరువు ఉన్నాడు. శిశు విహార్‌లో ఐసీడీఎస్ పీడీ పర్యవేక్షణలో చిన్నారికి రమణకుమార్ అని నామకరణం కూడా చేశారు. ఆ చిన్నారి ప్రస్తుత వయస్సు ఆరు నెలలు. ముద్దుగా ఉన్న ఆ బుజ్జాయిని గురువారం సాయంత్రం దంపతులు దత్తత తీసుకున్నారు. -
ఐసీడీఎస్ శిశుగృహ సంరక్షణలో చిన్నారులు
కాకినాడ సిటీ : కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఈ నెల ఏడున వదిలివేసిన మగశిశువు, 13న రాయుడుపాలెం అంగన్వాడీ పరిధిలో వదిలిన ఆడ శిశువును ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్థానిక శ్రీరామ్‌నగర్‌లోని శిశుగృహ సంరక్షణలో ఉంచారు. శిశువులకు సంబంధించిన తల్లిదండ్రులు కానీ, రక్త సంబంధీకులు కానీ నెల రోజుల్లో తగిన ఆధారాలతో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఇన్చార్జి పీడీ టి.ప్రవీణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరూ రాకపోతే శిశువులను చట్టబద్ధంగా దత్తత ఇస్తారని చెప్పారు. -
‘చంద్రన్న’పుచ్చిన కందిపప్పు
పురుగుల కందిపప్పుతోనే వంటలు అంగన్వాడీ సిబ్బందిపై తల్లిదండ్రుల ఆగ్రహం చోద్యం చూస్తున్న అధికారులు చిన్నగొట్టిగల్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు జూన్ కోటా కింద జనవరిలో చంద్రన్న సంక్రాంతి కానుకలో మిగిలిన, పురుగులు పట్టిన కంది పప్పును పంపిణీ చేయడంపై పెద్ద దుమారం రేగింది. ఈ పప్పుతోనే వంటలు వండుతుండడంతో తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోక పోవడంతో దీన్నే వినియోగిస్తున్నామని అంగన్వాడీ కార్యకర్తలు చేతులెత్తేస్తున్నారు. రొంపిచెర్ల: రొంపిచెర్ల సివిల్ సప్లయిస్ గోడౌన్ నుంచి చిన్నగొట్టిగల్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు జూన్‌నెల కోటా కింద నాసిరకం కందిపప్పును పంపిణీ చేశారు. జనవరిలో చంద్రన్న సంక్రాంతి కానుకలో మిగిలి, పురుగులు పట్టిన కంది పప్పును సివిల్ సప్లయియ్స్ గోడౌన్ నుంచి చౌక డిపోలకు సరఫరా చేయగా, వారు అంగన్ వాడీ కేంద్రాలకు పంపిణీ చేశారు. రొంపిచెర్ల వుండలంలోని 37 అంగన్వాడీ కేంద్రాలు, ఎర్రావారిపాళ్యెం మండలంలోని 37 కేంద్రాలు, చిన్నగొట్టిగల్లు మండలంలోని 29 కేంద్రాలకు బియ్యుం, కంది పప్పు, వంట నూ నెను 88 చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో అదే పప్పును అవుృతహస్తం పథకం కింద గర్భిణులు, బాలింతల వుధ్యాహ్న భోజనం కూరలకు వాడుతున్నారు. కొన్ని చోట్ల పురుగులు పడి చెడి పోరుున కంది పప్పుపై అంగన్వాడీ కార్యకర్తలను పిల్లల తల్లిదండ్రులు నిలదీశారు. దీనిపై అంగన్వాడీ కార్యకర్తలు పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు పట్టించుకోక పోవడంతో అదే కంది పప్పును వాడాల్సి వస్తోందని కార్యకర్తలు చెబుతున్నారు. చంద్రన్న కానుక కంది పప్పు ఇచ్చాం.. అంగన్వాడీ కేంద్రాలకు ఐదు క్వింటాళ్ల చంద్రన్న సంక్రాంతి కంది పప్పును ఇచ్చిన వూట వాస్తవమే. చంద్రన్న సంక్రాంతి కానుకలో మిగిలి పోరుున కంది పప్పును జిల్లా అధికారులు రొంపిచెర్ల సవిల్ సప్లయిస్ గోడౌన్‌కు పంపారు. అదే పప్పను అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేశాం. పప్పు బాగా లేకపోతే దానిని వాపసు చేయువచ్చు. దాని స్థానంలో వుంచి కంది పప్పును ఇస్తాం. 2600 నెరుు్య ప్యాకెట్లు చెడి పోరుున వూట వాస్తవమే. అప్పుటి డీటీ నిర్లక్ష్యమే కారణం. ఇప్పుడు మేము ఏమీ చేయులేం. - సివిల్ సప్లయిస్ అధికారి నాగరాజ కంపుకొడుతున్న చంద్రన్న కానుక నెరుు్య గత ఏడాది జూలైలో రంజాన్ చంద్రన్న కానుకగా పంపిణీ చే సిన నెరుు్య రొంపిచెర్ల సివిల్ సప్లయిస్ గోడౌన్లో కంపు కొడుతుంది. అప్పట్లో 2600 ప్యాకెట్ల నెయ్యి మిగిలిపోయింది. ఈ నెరుు్య ప్యాకెట్లను అప్పుడే వాపసు చేయాల్సి ఉండగా, అప్పటి డీటీ శ్రీకాంత్ పట్టించుకోలేదు. దీంతో సువూరు రూ.95 వేల విలువ చేసే నెరుు్య ప్యాకెట్లు గోడౌన్లో కంపు కొడుతున్నారుు. -
మళ్లీ అమ్మాయే పుట్టిందని..
ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి): ఆడపిల్ల పుట్టిందని వదిలించుకోవడానికి దంపతులు నిర్ణయించుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. యాచారం మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన జర్పుల కృష్ణ భార్య లక్ష్మికి ఇప్పటికే నాలుగు కాన్పులయ్యాయి. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయిదో కాన్పులో ఈనెల 6వ తేదీన లక్ష్మికి కూతురు పుట్టింది. ఆడ పిల్ల కావటంతో పోషించే స్తోమత లేక వదులుకునేందుకు నిర్ణయించుకున్నారు. వారు ఇబ్రహీంపట్నంలో ఐసీడీఎస్ సీడీపీవో శాంతిశ్రీని సంప్రదించారు. ఆమె సూచనల మేరకు గురువారం ఐసీడీఎస్ కార్యాలయంలో తమ కూతురును అప్పగించారు. కౌన్సెలింగ్ చేసినా ఆ తల్లిదండ్రుల మనస్సు మారలేదని సీడీపీవో తెలిపారు. దీంతో వారి నుంచి ఒప్పందం పత్రం రాయించుకుని చిన్నారిని శిశు విహార్‌కు తరలించామన్నారు. ఇప్పటికైనా కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలని ఆ దంపతులకు సూచించామని శాంతిశ్రీ తెలిపారు. -
ఏకంగా కోటి రూపాయల నకిలీ బిల్లులు
అనంతపురం: జిల్లాలోని ఓ ఐసీడీఎస్‌లో కోటి రూపాయల గోల్ మాల్ బయటపడింది. కదిరి ఐసీడీఎస్‌లో సరఫరా చేయకుండానే కోడిగుట్లకు కోటి రూపాయల బిల్లులు తయారు చేశారు. అధికారుల తనిఖీలలో ఈ విషయం వెలుగుచూసింది. దీంతో కాంట్రాక్టర్ చంద్రహాసన్ అకౌంట్లను అధికారులు సీజ్ చేశారు. అక్రమాలపై కదిరి ఆర్డీవో వెంకటేశ్వర్లు విచారణ చేస్తున్నారు. -
కుత్బుల్లాపూర్‌లో శిశు విక్రయం
హైదరాబాద్ : పెళ్లి కాకుండానే పుట్టిన పసికందును అమ్మేసి, ఆ యువతికి మరొకరితో పెళ్లి చేశారు. అయితే శిశు విక్రయ విషయం పోలీసుల దాకా వెళ్లటంతో చివరికి చిన్నారి ఐసీడీఎస్ అధికారుల ఒడికి చేరింది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి గ్రామ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ యువతి పెళ్లికి ముందే గర్భం దాల్చి కూతురికి జన్మనిచ్చింది. అయితే, ఆమె తల్లి, అమ్మమ్మ కలిసి మూడో కంటికి తెలియకుండా ఆ శిశువును అదే రోజు వేరొకరికి విక్రయించేశారు. ఇది జరిగి తొమ్మిది నెలలవుతోంది. కాగా సదరు యువతికి నెల క్రితం వేరే యువకుడితో పెళ్లయింది. ఇదిలా ఉండగా శిశు విక్రయం విషయం ఆనోటా ఈనోటా ఐసీడీఎస్ అధికారులకు తెలిసింది. వారు శుక్రవారం పోలీసుల సాయంతో శిశువును స్వాధీనం చేసుకుని శిశుగృహకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఐసీడీఎస్‌లో అక్రమాలకు చెక్
► సూపర్వైజర్ల అక్రమ వసూళ్లకు కళ్లెం ► వాట్సప్‌తో హాజరు శాతం పర్యవేక్షించాలి ► మంత్రి ఆదేశాలతో అక్రమార్కుల్లో అలజడి ఆర్మూర్: ఐసీడీఎస్‌లో అక్రమాలకు చెక్ పెట్టడానికి తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చర్యలు ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సూపర్వైజర్లు, సెక్టార్ లీడర్లు కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతుండడంతో పాటు శాఖలో చోటు చేసుకున్న అవినీతిని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేయాలని శాఖ రాష్ట్రస్థాయి అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో స్త్రీ శిశు సంక్షేమశాఖ పని తీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్‌లో ఉన్న అక్రమార్కులు అప్రమత్తమయ్యారు. అంతే కాకుండా జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల జియో ట్యాగింగ్ చేయడంతో పాటు వాటి ఫొటోలు, హాజరు పట్టికలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఇందుకోసం వాట్సప్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఉపయోగించుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశాలు జారీ చేశారు. సూపర్వైజర్లు, సెక్టార్ లీడర్లు, అంగన్వాడీ కార్యకర్తలు అక్రమాలకు పాల్పడకుండా తరచూ ఆకస్మిక తనిఖీలను సైతం నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాలు వెలువడగానే మంత్రి సూచించిన మేరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టి అక్రమార్కులకు చెక్ పెట్టడానికి ఐసీడీఎస్ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. -
పడిగాపులు
బదిలీల్లో గందరగోళం రాత్రి వేళ ఉద్యోగుల ఇక్కట్లు ఐసీడీఎస్, ఇంజనీరింగ్ శాఖల్లో బదిలీలు జరిగినా మళ్లీ ఫైలు తెమ్మంటున్న కలెక్టర్ మచిలీపట్నం : ‘ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఒక విధంగా ఉన్నాయి.. జిల్లాలో మరో విధంగా నిబంధనలు విధించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరిగితే సహించేది లేదు.’ - ఇదీ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ యూనియన్ నేతల మధ్య చర్చ ‘పంచాయతీరాజ్ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జాబితాలు సిద్ధం చేసి సోమవారం ఉదయం ఏడు గంటల కల్లా విజయవాడ తీసుకురమ్మన్నారు. దీంతో బదిలీలు అక్కడే ఉంటాయని విజయవాడ వెళ్లాం. మధ్యాహ్నం రెండు గంటలకు మచిలీపట్నంలోనే బదిలీల ప్రక్రియ ఉంటుందని చెప్పారు. పడుతూ, లేస్తూ ఇక్కడికొచ్చాం. రాత్రి 8.30 గంటలైంది. ఇంతవరకు సీనియార్టీ జాబితాలు విడుదల చేయలేదు. జాబితా విడుదలైతేనే బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుంది.’ - పలువురు ఉద్యోగుల మధ్య సంభాషణ ఇది ‘రాత్రి 8.15 గంటలైంది. మహిళా ఉద్యోగులను ఈ విధంగా ఇబ్బందిపెట్టడం ఎంతవరకు సమంజసం? బయట కూర్చుంటే దోమలు.. జెడ్పీ సమావేశపు హాలులో కూర్చుంటే ఉక్కపోత.. బీపీ, షుగర్‌తో బాధపడే ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. ఎప్పటికి బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుంది, ఎప్పటికి పూర్తవుతుంది, ఎప్పటికి ఇంటికి చేరాలి’ - ఇదీ మరికొందరు ఉద్యోగుల మధ్య చర్చ బదిలీల కోసం సోమవారం మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశపు హాలుకు వచ్చిన ఉద్యోగులు అర్ధరాత్రి వరకు నానా పాట్లు పడ్డారు. సోమవారంతో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తికావాల్సి ఉండగా రాత్రి 8.30 గంటల వరకు సీనియార్టీ జాబితాలను ప్రకటించకపోవడంతో పడిగాపులు పడ్డారు. దోమల బాధ పడలేక, ఉక్కపోత తాళలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉన్నతాధికారుల మధ్య సమన్వయలోపం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. మూడు రోజుల క్రితం ఇంజనీరింగ్ విభాగంలో, శని, ఆదివారాల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో బదిలీల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. అయినప్పటికీ ఈ రెండు శాఖల ఫైళ్లను తన వద్దకు తేవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయటంతో సోమవారం అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. యూనియన్ నాయకులు ఉద్యోగులకు సమాధానం చెప్పలేక, ఉన్నతాధికారులను ఒప్పించలేక సతమతమమయ్యారు. పంచాయతీరాజ్ మినిస్టీరియల్ విభాగంలోని ఉద్యోగుల బదిలీల వ్యవహారంపై కలెక్టర్, జెడ్పీ చైర్పర్సన్, సీఈవో మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్ ఉద్యోగుల బదిలీ ప్రక్రియను పంచాయతీరాజ్ చట్టం ప్రకారం తామే నిర్వహిస్తామని జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ జిల్లా ఇన్చార్జ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకువెళ్లి ఆయనను ఒప్పించారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ విజయవాడ నుంచి మచిలీపట్నంలోని జెడ్పీ కార్యాలయానికి మారింది. అయితే కలెక్టర్ నుంచి పంచాయతీరాజ్ ఉద్యోగుల సీనియార్టీ జాబితాలు సోమవారం రాత్రి 8.30 గంటల వరకు రాకపోవటంతో బదిలీల ప్రక్రియ ప్రారంభమే కాలేదు. ప్రభుత్వం సాధారణ బదిలీలకు మార్గదర్శకాలను జారీ చేస్తూ ఐదేళ్లు ఒకే ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ కావాలని పేర్కొంది. మూడేళ్లు ఒకే ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఈ ప్రక్రియను కాదని కలెక్టర్ బాబు.ఎ అందరు ఉద్యోగులు స్వీయ మదింపు వివరాలను ఆన్లైన్లో ఉంచాలని చెప్పటంతో గందరగోళం నెలకొంది. ఏ ప్రాతిపదికన సీనియార్టీ జాబితాలను తయారు చేస్తారనే అంశంపై సోమవారం రాత్రి 8.30 గంటల వరకు ఉద్యోగుల్లో ఉత్కంఠ ఏర్పడింది. బదిలీల ప్రక్రియపై పలువురు ఉద్యోగులను ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో తమకే తెలియటం లేదని చెప్పటం గమనార్హం. -
ఆడపిల్ల భారం అనుకున్నారు..
మూడోసారీ ఆడపిల్లే పుట్టిందని ఆ తల్లిదండ్రులు ఆమెను వదిలించుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం కొర్ర తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన నెహ్రూ, పద్మ దంపతులకు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలున్నారు. మూడో కాన్పులో నెల క్రితం ఆడపిల్ల పుట్టింది. పేద కుటుంబమైనందున పోషించే స్తోమత లేక ఆ దంపతులు మూడో కుమార్తెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు గురువారం ఆ శిశువును జిల్లా కేంద్రంలోని శిశువిహార్ తరలించారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ సిబ్బంది
నిజామాబాద్: ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్న మైనారిటీ తీరని ప్రేమికుల వివాహ ప్రయత్నాన్ని సోమవారం ఎల్లారెడ్డి ఐసీడీఎస్ సిబ్బంది అడ్డుకున్నారు. మండలంలోని రాములు నాయక్ తండాకు చెందిన మోతీలాల్(19), లింగంపేట మండలం పర్మల్ల తండాకు చెందిన సరిత(16) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈనెల 16న వీరి వివాహం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. వివాహానికి అమ్మాయి బంధువులు అభ్యంతరాలు తెలిపారు. కానీ పెళ్లి కుమారుడు బాలికను తన ఇంటికి తీసుకువచ్చాడు. మైనారిటీ తీరని అమ్మాయికి పెళ్లి కాబోతున్న విషయాన్ని గుర్తుతెలియని వ్యక్తులు చైల్డ్ కేర్ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయడంతో వారు స్థానిక ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. సీడీపీవో సునంద సూచనల మేరకు గ్రామానికి వెళ్లిన సూపర్వైజర్లు శ్రీప్రియ, విశాలదేవి, వీఆర్వో విఠల్‌లు మైనారిటీ తీరని బాలికను తహసీల్దార్ నాగజ్యోతి ఎదుట హాజరుపరిచారు. ఈ మేరకు ఆ బాలికకు తహసీల్దార్ కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికను వారి కుటుంబసభ్యులకు అప్పగించి ఇరువర్గాల పెద్దలకు నచ్చజెప్పి బాల్యవివాహం చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో పేష్కార్ బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఐసీడీఎస్‌లో అక్రమ వసూళ్లు
ఆర్మూర్: అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షిస్తూ సక్రమంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాల్సిన సూపర్వైజర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు వేసవి కాలంలో చెల్లించాల్సిన బిల్లులు, వేతనాల కోసం ప్రతి కేంద్రం నుంచి రూ. 700 చొప్పున ముడుపులు వసూలు చేస్తున్నారు. సెక్టార్ లీడర్ల సహకారంతో సూపర్వైజర్లు చేస్తున్న ఈ అక్రమ వసూళ్లలో సీడీపీవోతో పాటు జిల్లా స్థాయి అధికారులకు భాగం ముట్టజెప్పాల్సి ఉంటుందని చెపుతూ వసూళ్ల పర్వానికి పాల్పడుతున్నారు. అసలే ఐదు నెలలుగా వేతనాలు అందని అంగన్వాడీ కార్యకర్తలు తమ పైస్థాయి అధికారులు బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతుండటంతో ఏంచేయాలో పాలు పోక వారు అడిగినంత ముట్టజెపుతున్నారు. ఆర్మూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోనే 2 లక్షల 20 వేల రూపాయల వరకు అక్రమ వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా అంతటా ఇదే తంతు కొనసాగుతుండటంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 18 లక్షల రూపాయలు అక్రమ వసూళ్లు జరిగినట్లు సమాచారం. ఆర్మూర్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) ప్రాజెక్టు పరిధిలో ఆర్మూర్ అర్బన్, ఆర్మూర్ అర్బన్ 2, మామిడిపల్లి, పిప్రి, దేగాం, జక్రాన్‌పల్లి, అర్గుల్, బాల్కొండ, ముప్కాల్, మెండోర, నందిపేట, బజార్‌కొత్తూరు, డొంకేశ్వర్లలో కలిపి 13 సెక్టార్లు ఉన్నాయి. ఈ 13 సెక్టార్లను ఐసీడీఎస్ ఆర్మూర్ సీడీపీవో ఆధ్వర్యంలో 13 మంది సూపర్వైజర్లు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆర్మూర్ ప్రాజెక్టు పరిధిలో 326 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 318 మంది కార్యకర్తలు, 304 మంది ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. అయితే వేసవి కాలంలో ఎండ వేడిమి కారణంగా కేంద్రానికి పిల్లలు, బాలింతలు, గర్భిణులు రావడానికి ఇబ్బందులు పడతారు కాబట్టి తమకు కూడా వేసవి సెలువులు మంజూరు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులను కోరారు. దీంతో కేంద్రంలో 15 రోజులు కార్యకర్త, 15 రోజులు ఆయా విధులు నిర్వహించాలని జిల్లా స్థాయి అధికారులు సూచించారు. ఏప్రిల్, మేనెల ముగిసిపోయాయి. అయితే ఈ వేసవి కాలంలో కార్యకర్తలకు, ఆయాలకు వేతనాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల బిల్లులు చేయాల్సిన బాధ్యత సూపర్వైజర్లపై ఉంటుంది. ఇక్కడే భారీ అవినీతికి బీజం పడింది. మీరు వేసవి కాలంలో పని చేయకున్నా మీకు వేతనాలు, బిల్లులు ఇస్తున్నాము కాబట్టి ప్రతి అంగన్వాడీ కేంద్రం నుంచి రూ. 700 చెల్లించాల్సిందేనంటూ సూపర్వైజర్లు హుకుం జారీ చేశారు. సూపర్వైజర్లకు ముడుపులు వసూలు చేసి పెట్టే బాధ్యతను సెక్టార్ లీడర్లు తమ భుజాలపై వేసుకొని సెక్టార్ మీటింగ్‌లు పెట్టి మరీ వసూళ్లు చేసారు. ఈ ముడుపుల్లో సీడీపీవో, జిల్లా స్థాయి అధికారులకు సైతం భాగం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో చాలీ చాలని వేతనాలతో నాలుగు, ఐదు నెలల నుంచి వేతనాలు రాకుండా ఇబ్బందులు పడుతున్న అంగన్వాడీ కార్యకర్తలు అప్పులు చేసి మరీ ముడుపులు అప్పజెప్పారు. ఒక ఆర్మూర్ ప్రాజెక్టు పరిధిలోనే 2 లక్షల 20 వేల రూపాయల వరకు అక్రమ వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా.. నిజామాబాద్ ఐసీడీఎస్ పరిధిలో 10 ప్రాజెక్టులు ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, భీమ్‌గల్, కామారెడ్డి, దోమకొండ, బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, మద్నూరు ప్రాజెక్టుల పరిధిలో 2,708 అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి. వీటిని సుమారు వంద మంది సూపర్వైజర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల పరిధిలో సైతం సూపర్వైజర్లు అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. ఈ మొత్తం సుమారు 18 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. అక్రమ వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాము.. అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాము. ప్రతి నెలా బిల్లుల కోసం రూ. 200 చొప్పున వసూలు చేసిన మాట వాస్తవమే. వేసవి బిల్లుల విషయంలో సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాము. - శైలజ, సీడీపీవో, ఐసీడీఎస్ ఆర్మూర్ -
అంగట్లో ఆడపిల్ల
వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని అంతాపూర్ తండాలో నెలన్నర వయసున్న పసిపాప విక్రయాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. కోటగిరి మండలం జల్లాపల్లి అబాదికి చెందిన దేగావత్ శాంతాబాయి, మోహన్ దంపతులు ఏడేళ్ల క్రితం అంతాపూర్తండాకు వలస వచ్చి, కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లున్నారు. నెలన్నర క్రితం మరో కూతురు జన్మించింది. ముగ్గురు ఆడపిల్లలు కావడం, ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో పసిపాపను విక్రయించాలని నిర్ణయిం చుకున్నారు. పాపను అమ్మేందుకు వారు మూడు రోజులుగా బోధన్ ప్రాంతంలో తిరుగుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అంగన్వాడీ కార్యకర్త చంద్రకళ గురువారం ఉదయం ఐసీడీఎస్, రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు వారు నిందితులకు అంగన్వాడీ కేంద్రంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. తమది పేద కుటుంబమని, ముగ్గురూ ఆడపిల్లలే కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని శాంతాబాయి, మోహన్ తెలిపారు. అందుకే పసిపాపను అమ్మాలనుకున్నామని చెప్పారు. సర్పంచ్ కిషన్, ఆర్ఐ వరుణ్, వీఆర్వో ఆశోక్ వారిని సముదాయించారు. అనంతరం పసిపాపను నిజామాబాద్‌లోని బాలసదన్‌కు తరలించారు. -
మాకీ అమ్మానాన్నలు వద్దు..
- పనికి పొమ్మంటూ కొడుతున్నారు... మాకు చదువుకోవాలని ఉంది - పోలీసులను ఆశ్రయించిన అక్కాతమ్ముడు హనుమాన్‌జంక్షన్ రూరల్ : ‘బడికెళతామంటే వద్దు పనికి పొమ్మంటున్నారు.. మాకేమో చదువుకోవాలని ఉంది.. ఇంట్లో ఎప్పుడూ గొడవలు, తన్నులాటలే.. ఏంచేయాలో దిక్కుతోచటం లేదు.. మాకీ అమ్మనాన్నలు వద్దు..’ అంటూ ఇద్దరు చిన్నారులు కృష్ణా జిల్లా వీరవల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని తంగెళ్లమూడికి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ అక్రమ్ కొన్నేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన శిరీషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురు మహ్మద్ షన్ను (12), కుమారుడు మహ్మద్ అబ్దు బకత్ సిద్ధిఖ్ (9) ఉన్నారు. కొంతకాలంగా వీరి సంసారంలో గొడవలు ప్రారంభమయ్యాయి. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అమ్మమ్మ, తాతయ్యలు వింజమూరి మల్లేశ్వరి, రంగారావు.. బాపులపాడు మండలంలోని ఎ.సీతారామపురంలో తమ వద్దే ఉంచుకుని చదువు చెప్పిస్తున్నారు. పది రోజుల క్రితం అక్రం.. తమ పిల్లలను పంపించాలని గొడవ చేసి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి దంపతులు రోజూ గొడవపడడం, పిల్లలను వేధించడం, కూలి పనులకు వెళ్లాలని కొట్టడంతో భరించలేక అమ్మమ్మ, తాతయ్య దగ్గరకు వచ్చేశారు. తండ్రి మళ్లీ వచ్చి తీసుకెళతాడని భయపడిన వారు బుధవారం నేరుగా వీరవల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. తాము తమ తల్లిదండ్రుల వద్ద ఉండలేమంటూ కన్నీటి పర్యంతమవుతూ వారి కష్టాలు ఎస్ఐ పి.మురళీకృష్ణకు చెప్పుకున్నారు. అమ్మనాన్నలు తమను కొడుతున్నారని, బడికి పంపించడం లేదని వాపోయారు. అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటూ చదువుకుంటామని చెప్పారు. పోలీసులు పిల్లలిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి గన్నవరం ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు కాలేదు. -
పోషించే స్తోమత లేక..
పోషించే స్తోమత లేక ఓ తల్లి తన కన్న కూతురిని అచ్చంపేటలోని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించింది. ఈ సంఘటన అచ్చంపేట మండలం అక్కారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భారతి, వశ్యా దంపతులకు మొదటి, రెండు కాన్పుల్లో ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారు. మూడవ కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టడంతో తమకు భారమై పోతుందని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. స్థానిక ఐసీడీఎస్ అధికారులు శిశువును మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని శిశువిహార్‌కు తరలించారు. -
బుద్ధి, జ్ఞానం ఉందా?
ఐసీడీఎస్ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడిన ప్రత్యేక కమిషనర్ చక్రవర్తి విజయనగరం : ‘బుద్ధి, జ్ఞానం ఉందా? కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చారు. కదలకుండా కూర్చొంటారా? ఇంటి పక్కనే ఉద్యోగం కావాలి.. ఉద్యోగం వచ్చాక పని చేయకుండా జీతం ఇవ్వాలా?’ అంటూ ఐసీడీఎస్ అధికారులపై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్ కేఆర్బీహెచ్ఎన్ఎస్ చక్రవర్తి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక విజయ నగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం ఉత్తరాంధ్రలోని ఐసీడీఎస్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓలు వారి పరిధిలో ఉన్న అన్ని కేంద్రాలనూ పర్యవేక్షించానని నిల్చొని ధైర్యంగా చెప్పగలరా? అని ప్రశ్నించారు. దీంతో 19 మంది సీడీపీఓలు నిల్చొన్నారు. ఉత్తరాంధ్రలో 60 మంది సీడీపీఓలు ఉన్నారని, ఇందులో 19 మంది మాత్రమే లేచారంటే.. మిగిలిన 41 మంది పని చేయనట్లేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో ఎంతమంది ఏసీడీపీఓలుగా ఉద్యోగాల్లో చేరారని అడగగా.. 14 మంది నిల్చొన్నారు. ‘మీరైనా కేంద్రాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షించారా?’ అని కమిషనర్ ప్రశ్నించగా.. ఏ ఒక్కరూ పర్యవేక్షించామని చెప్పలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన.. సీడీపీఓలు, ఏసీడీపీఓలు కేంద్రాలను పర్యవేక్షించకుండా ఉంటే పీడీలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. విధులు సక్రమంగా నిర్వహించకుంటే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చే పౌష్టికాహారం పక్కదారి పడకూడదనే ఉద్దేశంతో.. గత ఏడాది డిసెంబర్లో ఈ-పాస్ విధానాన్ని ప్రవేశ పెట్టామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పడిన ఖాళీలను ప్రతి నెలా గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, ఆయాల అధార్ నంబర్లు సేకరించాలని ఆదేశించారు. మైదాన ప్రాంతంలో ఒక రేషన్ షాపు పరిధిలో ఒకట్రెండు అంగన్వాడీ కేంద్రాలు మాత్రమే ఉండాలన్నారు. గిరిజన ప్రాం తంలో ఐదు కేంద్రాలకు మించి ఉండరాదని చెప్పారు. కేంద్రాలకు రేషన్ షా పులు దగ్గరలో ఉండేటట్లు చూసుకోవాలని తెలిపారు. పూర్వ ప్రాథమిక విద్య పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ జేడీ శివపార్వతి, ఆర్జేడీ కామేశ్వరమ్మ, విజయనగరం పీడీ ఏఈ రాబర్ట్స్, విశాఖపట్నం పీడీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఆరోపణలు అభూతకల్పనలు
నైతిక విలువలతో ఉద్యోగం చేస్తున్నా.. ఉద్యోగంలో చేరకముందే తండ్రి ఆస్తి సంక్రమించింది విశాఖపట్నం : అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, అభూతకల్పనలని ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ ఎం.విజయలక్ష్మి స్పష్టం చేశారు. పీఎంపాలెంలోని తన ఇంటిపై ఏసీబీ దాడుల సందర్భంగా పత్రికల్లో వచ్చిన కధనాల్లో వచ్చిన ఆరోపణలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. అక్రమ ఆస్తులుగా పేర్కొన్నవన్నీ ఉద్యోగంలో చేరకముందే తండ్రి నుంచి తనకు సంక్రమించాయని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1994లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పలు ప్రాంతాల్లో మహిళలు, పిల్లల పట్ల ఎంతో నిబద్ధతతో, నిజాయితీతో పనిచేస్తూ సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నానన్నారు. అయితే తనపై కొందరు పనిగట్టుకొని చేసిన తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. లంచం తీసుకోవడమే కాదు.. ఇవ్వడం కూడా నేరమని భావించే తనపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఉన్నత కుటుంబం స్వతహాగానే తమది ఆస్తిపాస్తులున్న కుటుంబమని విజయలక్ష్మి పేర్కొన్నారు. 1986లో వివాహం తర్వాత తండ్రి ద్వారా తనకు సంక్రమించిన మూడో వంతు ఆస్తిని విక్రయించి 1994కు ముందే.. అంటే సర్వీసులో చేరకముందు ఇక్కడ వేరే ఆస్తులు కొన్నామన్నారు. సహజంగానే ఇప్పుడు వాటి మార్కెట్ విలువ పెరిగిందన్నారు. అఆగే ఉద్యోగంలో చేరిన 1994 నాటికి తమ ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి వెల్లడించానని వివరించారు. భర్త వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తులతో పాటు, తన తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి ప్రతి ఏటా నివేదిస్తున్నానని చెప్పారు. తన జీతాన్ని పొదుపు చేస్తూ ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం బంగారం సమకూర్చుకుంటుంటే.. అదేదో తప్పు అన్నట్లు.. దాన్ని అక్రమ ఆస్తి అని ఆరోపించడం తన మానసిక స్థైర్యాన్ని కోల్పోయేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 22 ఏళ్ల సర్వీసులో ఏనాడూ ఆరోపణలు ఎదుర్కోలేదన్నారు. తన సర్వీసు రిజిస్టరే దీనికి సాక్ష్యమన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల నియామకాల్లో అవినీతికి పాల్పడ్డానన్న ఆరోపణలు నిరాధారమైనవన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ మొదలు మొత్తం ఎంపిక ప్రక్రియను ఆన్లైన్లోనే పారదర్శకంగా నిర్వహించామన్నారు. తన కుమార్తె పెళ్లి మరో రెండు నెలల్లో ఉన్నందున తమ ఇంటి పైఅంతస్తును నివాసయోగ్యంగా చేయడానికి కొంత నగదు బ్యాంకు నుంచి డ్రా చేసి ఇంట్లో ఉంచామన్నారు. అలాగే తన కుటుంబానికి మూడు ఖరీదైన కార్లు లేవన్నారు. తన భర్త 2010లో బ్యాంకు రుణంతో కొన్న కారు, కుమార్తె తన ఉద్యోగం ద్వారా సంపాదించిన సొమ్ముతో కొన్న సెకండ్ హ్యాండ్ కారు మాత్రమే ఉన్నాయన్నారు. తనవి కాని ఆస్తులను తన అక్రమ ఆస్తులుగా చూపించడాన్ని ఖండిస్తున్నానన్నారు. భర్త కుటుంబ ఆస్తి వివాదాలే కారణం! ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ విజయలక్ష్మి భర్త తరఫు కుటుంబానికి సంబంధించి ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఈ ఆక్కసుతోనే కొందరు విజయలక్ష్మి కుటుంబంపై తప్పుడు ఆరోపణలతో ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదుల ఆధారంగానే ప్రాథమిక విచారణ కూడా జరపకుండా నేరుగా సోదాలకు దిగినట్లు సమాచారం. అందువల్లే ఉద్యోగంలో చేరడానికి ముందు ఉన్న విజయలక్ష్మి ఆస్తులను అక్రమ ఆస్తులుగా మీడియా ముందు చూపించారు. ఐసీడీఎస్‌లో చేరినప్పటి నుంచి ఈమె నిబద్ధతతోనే పని చేస్తున్నారని తోటి అధికారులు చెబుతున్నారు. -
కౌన్సెలింగ్‌తో ఆగిన బాల్య వివాహం
అమృతలూరు: మిలటరీలో పనిచేస్తున్న ఓ యువకుడు వివాహ వయస్సు నిండని యువతిని పెళ్ళి చేసుకుంటున్నాడన్న సమాచారంతో రంగంలోకి దిగిన ఐసీడీఎస్ అధికారులు వివాహాన్ని నిలిపివేయించారు. మండలంలోని పెదపూడికి చెందిన పెదపూడి రామారావు కుమారుడు భూపాల్ మిలటరీలో పనిచేస్తున్నాడు. జంపనికి చెందిన చొప్పర చినబాబు కుమార్తె (17)తో గురువారం వివాహం చేయటానికి నిశ్చయించారు. ఈ నేపథ్యంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిణి అన్నవరపు అనూరాధ పెదపూడి గ్రామానికి వెళ్ళి పెళ్ళి కుమారుడి తల్లి దండ్రులతో మాట్లాడారు. వివాహ వయస్సు దాటకుండా పెళ్ళి చేయడం చట్టరీత్యా నేరమని ఆమె హెచ్చరించారు. అంతేకాక ఉద్యోగరీత్యా కూడా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వరుని తల్లిదండ్రులకు వివరించారు. దీంతో వారు ప్రస్తుతం నిశ్చితార్ధం చేసుకుని మైనార్టీ తీరిన తరువాత వివాహం చేస్తామని అధికారిణి అనూరాధకు లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. -
బుర్రిపాలెంలో బ్రహ్మోత్సవం
► ప్రిన్స్ మహేశ్‌బాబు రాకతో మిన్నంటిన కోలాహలం ► వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, గ్రామస్తులు ► సామాజిక మార్పునకు ప్రయత్నం చేస్తానని మహేశ్ వెల్లడి ► పేద మహిళలకు ఇళ్ల స్థల పట్టాల పంపిణీ తెనాలి : ఎప్పుడెప్పుడాని ఎదురుచూసిన ఘట్టం రానేవచ్చింది. తమ అభిమాన హీరో, ప్రిన్స్ మహేశ్‌బాబు రానున్న సమాచారం తెలిసి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన అభిమానులకు ఆదివారం నిజంగా పండగరోజయింది. ఉదయం నుంచి గ్రామంలో సందడి చేశారు. తెనాలి నుంచి, పరిసర గ్రామాల నుంచి ఏది దొరికితే ఆ వాహనంలో చేరుకున్న అభిమానులు, మహేశ్ పర్యటన మార్గానికి ఇరువైపుల వేచిఉండటమే కాదు, ఆ దారిలో ప్రతి మేడ, గోడ, చెట్టు...అభిమానులతో నిండిపోయింది. ఎండ ఒక పక్క ముచ్చెమటలు పట్టిస్తున్నా, దాహం వేస్తున్నా ఖాతరు చేసినవారు లేరు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత గ్రామానికి చేరుకున్న వెండితెర శ్రీమంతుడిని చూసి అంతా కేరింతలు కొట్టారు. చేతులు ఊపి సంతోషాన్ని తెలియ జేయటమే కాదు..సెల్ఫోన్లతో వీడియోలు, ఫోటోలు తీయటంలో మునిగిపోయారు. నేరుగా తమ ఇంటికి చేరుకున్న మహేశ్‌బాబు, రెండు మూడు పర్యాయాలు బయటకొచ్చి డాబాపైనుంచి చేతులూపుతూ కుర్రకారును మరింత కిర్రెక్కించారు. అదే భవనంలో మరో డాబాపై విలేకరుల సమావేశం, అక్కడే వనరులు, రుణ అర్హత కార్డులు, ఆరోగ్య కార్డులను పంపిణీ చేశాక, టాపులేని వాహనంపై బయలుదేరిన మహేశ్‌ను చూసి అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. మహేశ్ చేతుల మీదుగా.. గ్రామంలో అభివృద్ధి పనులే కాకుండా, సామాజిక మార్పునకు ప్రయత్నం చేస్తామని ప్రిన్స్ మహేశ్ బాబు ఈ సందర్భంగా చెప్పారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, విజయవాడ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, తండ్రి సోదరు డు జి.ఆదిశేషగిరిరావుతో కలిసి మహేశ్ బాబు విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో చేపట్టనున్న కార్యక్రమాలతోపాటు అక్కడే ప్రభుత్వానికి చెందిన వివిధ వనరులను లబ్ధిదారులకు అందజేశారు. పేద మహిళలు వెంకటేశ్వరమ్మ, పాపమ్మకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేశారు. కిలారి రాజేష్‌కు కౌలురైతు రుణ అర్హత గుర్తింపు కార్డు అందజేశారు. డ్వాక్రా గ్రూపులకు కోటి రూపాయల చెక్కు అందించారు. మహేశ్‌తో కలిసి బుర్రిపాలెం గ్రామస్తుల ఆరోగ్య సంరక్షణకు ముందుకొచ్చిన ఆంధ్రా హాస్పటల్ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్డులను గ్రామసర్పంచ్ కొండూరి సామ్రాజ్యం, కంచర్ల ఏసుదాసు, పెమ్మసాని సంపతయ్యకు అందజేశారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్యకార్డు లు ఇచ్చి, ప్రతి రెం డు నెలలకోసారి వైద్యశిబిరాలను నిర్వహిస్తామని ఆ హాస్పటల్ చైర్మన్ డాక్టర్ రమణ వెల్లడించారు. ఆర్నెల్లకోసారి పిల్లలకు ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు. గ్రామస్తులకు తమ హాస్పటల్లో స్పెషలిస్టు వైద్యపరీక్షలు ఉచితంగానే చేస్తామని ప్రకటించారు. ఐసీడీఎస్ పథకంలో భాగంగా అంగన్వాడీ కేంద్రం నుంచి ఒకటో తరగతిలో చేరనున్న ఇద్దరు బాలికలకు తగిన పత్రాలను ఇచ్చారు. మచిలీపట్నం దగ్గర్లోని ఘంటసాల శివారు దేవరకోటలో ముత్యాలమ్మ తల్లి దేవాలయానికి మహేశ్‌బాబు అందించిన సహకారానికి కృతజ్ఞతగా ఆ గ్రామస్తులు తీసుకొచ్చిన చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఆదర్శగ్రామంగా బుర్రిపాలెం... గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ, చిత్తూరులో తమ తల్లిదండ్రుల ఊర్లను దత్తత తీసుకొని అభివృద్ధి చేశామని చెప్పారు. తన అత్తగారి ఊరయిన బుర్రిపాలెంను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని సంకల్పించినపుడు, ప్రధానమంత్రి గ్రామయోజన పథకంలో నిబంధనతో వీలు కాలేదన్నారు. ఫలితంగానే తన భార్య పద్మావతి, మహేష్‌బాబుకు చెరొక గ్రామం దత్తత తీసుకోవాలని సూచించినట్టు తెలిపారు. రోడ్లు, డ్రెయిన్లు, కమ్యూనిటీ హాలు, పైపులైను, అదనపు తరగతి గదులు నిర్మించి గ్రామాన్ని ఒక మోడల్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రముఖ నిర్మాత, హీరో కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ, మహేష్, ఎంపీ జయదేవ్‌లు గ్రామాభివృద్ధికి చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నట్టు చెప్పా రు. గ్రామాన్ని బాగు చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. మహేశ్, జయదేవ్‌ల చొరవతో బుర్రిపాలెం రాష్ట్రంలో ఒక ఆదర్శ గ్రామంగా రూపొందగలదన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. మహేశ్‌బాబు చేపట్టిన దత్తత కార్యక్రమం మరెం దరికో స్ఫూర్తి కాగలదన్నారు. తెనాలి ఆర్డీవో జి.నర్సిం హులు, ఎంపీపీ ఎస్.వెంకట్రావు, తహశీల్దారు జీవీ సుబ్బారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు అమిరినేని రాజా, సౌపాటి కిరణ్, బుర్రిపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు. -
పసిగుడ్డును రోడ్డుపై వదిలేశారు
ఆత్మకూరురూరల్(శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు): ఒక రోజు వయసున్న బిడ్డను వస్త్రంలో చుట్టి రోడ్డుపై వదిలి వెళ్లిన దారుణమైన సంఘటన ఆత్మకూరు మండలంలోని బోయిల చిరువెళ్ల గ్రామ సరిహద్దుల్లో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంకాల సమయంలో పొలిమేర్ల నుంచి వస్తున్న పశువుల కాపరులు పొదల్లో ఏడుపు వినిపించి చూడగా బిడ్డ కనిపించడంతో గ్రామపెద్దలకు సమాచారం అందించారు. గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి, శ్యామలమ్మ దంపతులు సంఘటన స్థలానికి చేరుకొని బిడ్డను అక్కున చేర్చుకున్నారు. ఆడపిల్ల భారమనుకున్నారో ఏమో కానీ బిడ్డను రోడ్డు పక్కన వదిలి వెళ్లడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు. ఎవరైనా వాహనంలో వచ్చి జన సంచారం లేని సమయంలో రోడ్డు పక్కన వదిలి పెట్టి ఉంటారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కాగా, సుబ్బారెడ్డి దంపతులు తమకు ముగ్గురూ మగపిల్లలే అని.. ఆడపిల్లను దేవుడిచ్చిన వరంగా పెంచుకుంటామని అంటుండగా గ్రామానికి చెందిన మరో దంపతులు తమకు వివాహమై 15 ఏళ్లు అయినా సంతానం లేదని.. తమకు అప్పగిస్తే ఆ పాపను పెంచుకుంటామని పేర్కొన్నారు. గ్రామ పెద్దలు పోలీసులు, ఐసీడీసీఎస్ అధికారులకు సమాచారం అందించారు. -
ఐసీడీఎస్ కార్యాలయమా... బార్ అండ్ రెస్టారెంటా ?
ఎమ్మెల్యే చింతల తీవ్ర ఆగ్రహం వాల్మీకిపురం: వందలాది మంది మహిళలు పనిచేస్తున్న చిత్తూరు జిల్లాలోని వాల్మికీపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం నిత్యం బార్ అండ్ రెస్టారెంట్లా మారిందని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అరుణమ్మ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన ఇంటి ముందు ఉన్న ఐసీడీఎస్ కార్యాలయంలో రాత్రి పది గంటలు దాటిన తరువాత కూడా అధికారులు, బయటి వ్యక్తులు మద్యం సేవిస్తూ ప్రభుత్వ కార్యాలయాన్ని బార్లాగా మార్చేశారని మండిపడ్డారు. అంగన్వాడీ కార్యకర్తల జీతాల బిల్లుల్లో అవకతవకలు, జాప్యం చోటుచేసుకున్నా సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చారావాండ్లపల్లెలో అంగన్వాడీ స్థలాలు ఆక్రమణకు గురైనా అధికారులు కళ్లు మూసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారుల ప్రమేయం లేకుండా చూడాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఎదుట ఇంకుడు గుంతలు తవ్వి ఆదర్శ వుండలంగా నిలవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను గ్రావూల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ సవూవేశంలో జెడ్పీటీసీ సభ్యులు శ్రీవల్లి, మండల ప్రత్యేక ఆహ్వానితులు హరీష్‌రెడ్డి, తహశీల్దార్ సురేంద్ర, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆడపిల్లను ‘అమ్మే’సింది..?
త్రిపురారం : ఆడపిల్లంటే సృష్టికి మూలం.. ఇంటికి దీపం.. మరో అమ్మ. కానీ, అదే ఆడపిల్లను భారంగా భావిస్తోంది నేటి సమాజం. ఆర్థిక పరిస్థితులు, నిరక్షరాస్యత, కారణాలు ఏవైతేనేం.. ఆడపిల్లలను కాదనుకుంటున్నారు కన్న తల్లిదండ్రులు. ఇందుకు త్రిపురారం మండలంలోని డొంకతండానే నిదర్శనం. వివరాల్లోకి వెళ్లితే గుంటూరు జిల్లా గురజాల మండలం అంభాపురం గ్రామానికి చెందిన అరుణతో డొంక తండాకు చెందిన ధనావత్ శ్రీనుకు రెండేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఒక కుమార్తె ఉన్నారు. ఆరు నెలల క్రితం ధనావత్ అరుణ రెండో కాన్పు కోసం తన పుట్టింటికి వెళ్లింది. అయితే అరుణ కాన్పు కావడంతో కుమార్తె జన్మించింది. కాన్పుతో వెళ్లి.. ఒంటరిగా తిరిగొచ్చి.. ఆరు నెలల పాటు తన పుట్టింటిలో ఉన్న ఆమె నాలుగు రోజుల క్రితం అత్తగారి ఇంటికి ఒంటరిగా వచ్చింది. అరుణ తన బిడ్డతో రాకుండా ఒంటరిగా వచ్చిన విషయం తెలుసుకున్న గ్రామ అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్ శుక్రవారం ఐసీడీఎస్ సీడీపీఓ పద్మావతికి సమాచారం ఇచ్చారు. సీడీపీఓ గ్రామానికి వచ్చి ధనావత్ అరుణను విచారించింది. దీంతో అరుణ శిశువును విక్రయించినట్లు ఒకసారి, కామెర్లు పోసి శిశువు చనిపోయినట్లు మరోసారి సమాధానం చెప్పింది. దీంతో మే 2వ తేదీలోగా శిశువు జాడ తమకు చెప్పాలని ఐసీడీఎస్ అధికారులు ధనావత్ అరుణను కోరారు. -
మగ్గిపోతున్న బాల్యం
శ్రీకాకుళం టౌన్ :ఎండ వేడిమి తాళలేక అంగన్వాడీ చిన్నారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గాలి, వెలుతురు లేని ఇరుకు గదుల్లో అవస్థలు పడుతున్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం వరకు కేంద్రాలు తెలిచి ఉంచడంతో పిల్లలు సొమ్మసిల్లి పడిపోయే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) పరిధిలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవు. చాలా కేంద్రాలు ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నారు. ఇరుకు గదుల్లో చిన్నారులు మగ్గిపోతున్నారు. పిల్లలను కేంద్రాలకు పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. జిల్లాలో పరిస్థితి ఇదీ శ్రీకాకుళం జిల్లాలో 18 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 3403 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 3,275 మంది కార్యకర్తలు, 2,933 మంది సహాయకులు, 709 మంది మినీ కార్యకర్తలు, 305 మంది న్యూట్రిషన్ కౌన్సెలర్లు పనిచేస్తున్నారు. ఏడు ప్రాజెక్టుల్లో అమృతహస్తం అమలు చేస్తుండగా, మిగిలిన 11 ప్రాజెక్టుల్లో సమీకృత ఆహారం అందిస్తున్నారు. 18 ప్రాజెక్టుల్లో సుమారు 1.92 లక్షల మంది చిన్నారులు, 22,552 మంది గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందజేస్తున్నారు. రూ.లక్షల్లో అద్దెలు జిల్లా వ్యాప్తంగా 3,403 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, 162 కేంద్రాలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. అద్దె భవనాలకు నెల నెలా లక్షలాది రూపాయలు చెల్లిస్తున్నారే తప్ప, సొంత భవనాలపై అధికారులు దృష్టి సారించడం లేదు. కేంద్రాలకు అద్దె రూపంలో గ్రామీణ ప్రాంతంలో రూ.250, పట్టణ ప్రాంతంలో రూ.750 చెల్లిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో భవనాలు అద్దెకు లభించకపోవడంతో ఇరుకు గదుల్లో కేంద్రాలు నిర్వహిస్తున్నారు. గాలి, వెలుతురు ఉండటం లేదు. ఫ్యాన్లు తిరగవు. ప్రభుత్వం నిర్మించిన పక్కా భవనాలకు సహితం విద్యుత్ సౌకర్యం లేదు. వేసవి ఎండలకు చిన్నారులు అల్లాడిపోతున్నారు. సెలవులు ప్రకటించాలి వేసవి కాలంలో కూడా మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేంద్రాలు పనిచేయడంతో చిన్నారులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఫ్యాన్లు లేని ఇరుకు గదుల్లో బాలింతలు, చిన్నారులు, గర్భిణులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కేంద్రాలకు రానిదే పౌష్టికాహారం ఇచ్చేది లేదని అంగన్వాడీ కార్యకర్తలు తెగేసి చెబుతున్నారు. అవస్థలు పడుతూ కేంద్రాలకు వెళ్లక తప్పడం లేదని పలువురు వాపోతున్నారు. ఎండలో పిల్లలను బయటకు పంపితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం లేక పోలేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతన్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేసవి ఎండలు తగ్గే వరకు అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఇంత అమానుషమా..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాకేంద్రంలోని శిశుగృహ చిన్నారుల చేతులపై సిబ్బంది వాతలు పెట్టిన వైనంపై కలెక్టర్ నీతూప్రసాద్ మండిపడ్డారు. బుధవారం మధ్యాహ్నం శిశుగృహను సందర్శించిన కలెక్టర్ చిన్నారులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈనెల 15న శిశుగృహలోని ఆయాలు స్టవ్ వెలిగించి చెంచాలను వేడి చేసి అన్నం తింటున్న ఏడుగురు చిన్నారుల చేతులపై వాతలు పెట్టిన దృశ్యాలను సీసీ పుటేజీ ద్వారా పరిశీలించి చలించిపోయారు. ఈ దారుణం జరిగి ఐదురోజులైనా తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదంటూ ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ మోహన్‌రెడ్డిపై మండిపడ్డారు. ఈ విషయంపై పీడీ మోహన్‌రెడ్డి 17న ఫైలు పంపానంటూ నీళ్లు నమలడంతో వెంటనే ఫైలు తెప్పించి చూడగా 19న ఫైలు పంపినట్లుగా ఉంది. దీంతో అబద్ధాలెందుకు చెబుతున్నావంటూ మోహన్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి అమానుషానికి ఒడిగట్టిన ఆయాలు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై ఏమి చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నించారు. బాధ్యులైన ముగ్గురు ఆయాలకు మెమో ఇచ్చానని మోహన్‌రెడ్డి బదులిచ్చారు. అయితే ఆయాలు శుక్రవారం రాత్రి వరకు విధులు నిర్వహించిన విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్... మోహన్‌రెడ్డి తీరును తప్పుపట్టారు. తక్షణమే ఆ ముగ్గురు ఆయాలను ఉద్యోగాల నుంచి తొలగించడంతోపాటు క్రిమినల్ కేసుపెట్టి అరెస్టు చేయాలంటూ అధికారులను, పోలీసులను ఆదేశించారు. శిశుగృహ మేనేజర్ దేవారావు, ఇతర సిబ్బంది పర్యవేక్షణ లోపం స్పష్టంగా కన్పిస్తున్నందున వారందరినీ ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ మోహన్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించినందున ఆయనను విధుల నుంచి తప్పించి హైదరాబాద్ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తున్నట్లు తెలిపారు. స్పందించిన బాలల హక్కుల కమిషన్ మరోవైపు శిశుగృహలో జరిగిన ఘటనను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు అచ్యుతరావు సీరియస్‌గా పరిగణిస్తూ కేసును సుమోటోగా స్వీకరించారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి మే 2లోగా నివేదిక పంపాలని కలెక్టర్‌కు నోటీసు పంపారు. శిశుగృహలో పిల్లల సంరక్షణ విషయంలో అధికారుల పర్యవేక్షణ లోపం ఉందని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని అభిప్రాయపడ్డారు. లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి భవానీచంద్ర సైతం బుధవారం మధ్యాహ్నం శిశుగృహను సందర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. పట్టించిన సీసీ కెమెరాలు శిశుగృహలోని గదుల్లో ప్రభుత్వం గతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో ఆయాల దురాగతం బయటపడింది. ఈనెల 15న సా యంత్రం చిన్నారుల చేతులపై ఆయాలు వాత లు పెట్టిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. అయినప్పటికీ ఐదు రోజులపాటు ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఐసీడీఎస్ అధికారులు గోప్యంగా ఉంచడం, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈనెల 16న సాయంత్రం సామాజిక కార్యకర్త శ్రీలత జరిగిన విషయాన్ని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఆయన ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నారు. కనీసం కలెక్టర్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకోకపోవడం గమనార్హం. మరోవైపు ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఆయాలు శుక్రవారం రాత్రి వరకు డ్యూటీలోనే ఉండటం గమనార్హం. ఈ విషయం వెలుగులోకి వచ్చాక పోలీసులతోపాటు ఆర్డీవో చంద్రశేఖర్ పలువురు అధికారులు వచ్చి విచారణ జరుపుతుండటంతో ఆయాలు అక్కడినుంచి పరారైనట్లు శిశుగృహ సిబ్బంది చెబుతున్నారు. -
కన్నపేగును కాదనుకున్నారు..
చిన్నారిని వదిలేసి ఎవరిదారిన వారు వెళ్లిన దంపతులు.. పరిగి: ఓ తల్లి కన్నపేగును వదిలేసి వెళ్లిపోయింది. ఇంటి యజమాని పాపను చేరదీసి అక్కున చేర్చుకుంది. ఈ ఘటన ఆలస్యంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిగిలో వెలుగుచూసింది. దోమ మండలం గొడుగోనిపల్లికి చెందిన అమీర్, సంపూర్ణ అలియాస్ ఫాతిమాలు ప్రేమించుకున్నారు. 2014లో మతాం తర వివాహం చేసుకున్నారు. 15 నెలల క్రితం పరిగిలోని రిజ్వాన హఫీజ్ దంపతుల ఇంట్లో అద్దెకు దిగారు. రెండు నెలల తర్వాత అమీర్, సంపూర్ణ దంపతులకు పాప జన్మిం చింది. 10 నెలల క్రితం అమీర్ భార్యకు చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. పది రోజులపాటు భార్య ఎదురు చూసి నా అతడు రాలేదు. పాపను ఎలా పోషించుకోవాలో తెలియక సంపూర్ణ కూడా పాపను వదిలేసి వెళ్లిపోయింది. ఇంట్లో గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారిని ఇంటి యజమానులైన రిజ్వానా బేగం, హఫీజ్ దంపతులు చేరదీసి అక్కున చేర్చుకున్నారు. వీరికి పిల్లలున్నా గతంలో చనిపోయారు. పాపను తామే పెంచుకుందామని నిర్ణయించుకొని సాకుతూ వచ్చారు. సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు ఐసీడీఎస్ అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఐసీడీఎస్ సిబ్బంది రిజ్వానా బేగం ఇంటికి చేరుకొని వివరాలు సేకరిం చారు. ఏ సంబంధం లేకుండా పాపను పెంచుకోవడం చట్టరీత్యా నేరం అని స్పష్టం చేశారు. పాపను హైదరాబాద్‌లోని శిశువిహార్‌కు తరలించారు. తాము పాపను పెంచుకుంటామని మంగళవారం పరిగిలోని ఐసీడీఎస్ కార్యాలయానికి రిజ్వానా వచ్చి మొరపెట్టుకున్నారు. అయితే, పాపను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు నిరాకరించినట్లు తెలిసింది. -
ఎండల ధాటికి.. అంగన్‌వాఢీలా..
కేంద్రాల్లో తగ్గిన చిన్నారుల హాజరు పనివేళలు కుదించాలని నిర్వాహకుల వినతి కాజీపేట : సూర్యుడు నిప్పులు కక్కుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. ఇక చిన్నారులు, వృద్ధులు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఎండల ధాటికి నగరంలోని చాలా పాఠశాలలను 11.30 గంటల వరకే మూసేసి, పిల్లల్ని ఇళ్లకు పంపించేస్తున్నారు. ఇక అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారుల హాజరు శాతం సగానికి సగం పడిపోరుుంది. ఉదయం 11 గంటలు దాటితే ఆయూ కేంద్రాల్లో పిల్లల జాడ కనిపించడం లేదు. మండుటెండల్లో తమ పిల్లల్ని ఇంటి బయటికి పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు ఎండలు తగ్గేవరకు అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు పనిచేసేలా చూడాలని నిర్వాహకులు కోరుతున్నారు. తద్వారా చిన్నారుల హాజరు శాతం కొంతమేర పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. చాలా కేంద్రాల్లో వసతుల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఫలితంగా అంగన్వాడీలకు వెళ్లే చిన్నారులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఏప్రిల్‌లోనే ఇంత భారీ స్థారుులో ఉష్ణోగ్రతలుంటే.. ఇక మే, జూన్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన జనంలో వ్యక్తమవుతోంది. దీనిపై ఐసీడీఎస్ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా ‘ఎండ తీవ్రతకు భయపడి పిల్లలు సక్రమంగా కేంద్రాలకు రావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రాల పనివేళలను తగ్గించే అంశాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు’ అని వివరించారు. -
డబ్బులిచ్చిన వారికే ఉద్యోగాలు..
► ఐసీడీఎస్ బాలసదన్‌లో ఇష్టానుసారంగా కాంట్రాక్టు పోస్టుల భర్తీ ► ఇంటర్వ్యూ జరపకుండా.., మెరిట్ జాబితా ఇవ్వకుండా.. ► అర్హులను కాదని అనర్హులకు పోస్టులు కట్టబెట్టిన వైనం నెల్లూరు(అర్బన్) : జిల్లాలో మొత్తం ఐదు బాలసదన్ వసతి గృహాలున్నాయి. నెల్లూరు, గూడూరు, కోట బాలసదన్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న మ్యూజిక్, డ్రాయింగ్, కంప్యూటర్, విద్యాబోధన, సైకాలజీ, సహాయకులు తదితర 43 పోస్టులను భర్తీ చేసేందుకు ఐసీడీఎస్ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా జనవరి నెల 19వ తేదీన ఖాళీలను కాంట్రాక్టు పద్దతిన భర్తీ చేస్తున్నామని, జనవరి 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పత్రికాముఖంగా అధికారులు ప్రకటన ఇచ్చారు. డిగ్రీ, బీఈడీ, సోషల్ వర్క్, పదోతర గతి పాస్/ఫెయిల్ తదితర అర్హతలుండాలని చెప్పారు. అర్హతలను బట్టి అభ్యర్థులను ఎంపికజేసి ఇంటర్వ్యూకి పిలుస్తామని ప్రకటించారు. దీంతో 46 మండలాల నుంచి వందలాది మంది నిరుద్యోగులు పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రకటించని మెరిట్ జాబితా.. ఎంఎస్సీ, డిగ్రీలు చేసిన వారిని ఎంతకీ ఇంటర్వ్యూకి పిలవలేదు. దీంతో వారు జనవరి 28వ తేదీ తర్వాత ఐసీడీఎస్ కార్యాలయం చుట్టూ తిరగడం ప్రారంభించారు. అధికారులు ఇంటర్వ్యూకి కాల్‌లెటర్ పంపిస్తామని వారికి చెప్పారు. ఇది జరిగి రెండు నెలలు పూర్తయినా ఇంటర్వ్యూలు జరపలేదు. అసలు పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ జాబితానే ప్రకటించలేదు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం గుట్టు చప్పుడు కాకుండా పోస్టులను భర్తీ చేశారు. దీంతో అసలైన అభ్యర్థులను కాదని డబ్బులు తీసుకొని ఉద్యోగాలు భర్తీ చేశారని దరఖాస్తుదారులు కొందరు ఆరోపిస్తున్నారు. చేతులు మారిన పైసలు.. పోస్టులను భర్తీ చేశారని తెలుసుకున్న పలువురు దరఖాస్తుదారులు ఏం జరిగిందా అని ఆరాతీయగా అసలు విషయం బయటపడింది. డబ్బులు తీసుకొని అనర్హులకు పోస్టులు కట్టబెట్టిన వైనం వెలుగుచూసింది. ఒక్కో పోస్టు భర్తీ కోసం రూ.50వేల నుంచి రూ.1.50 లక్షల వరకు చేతులు మారినట్లు తెలిసింది. అలాగే అధికార పార్టీ నేతల సిఫార్సులు బాగా పనిచేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇలానే గతంలోనూ అధికారులు రెండు దఫాలు నోటిఫికేషన్లు ఇచ్చి ఎవరీకీ తెలియకుండానే ఖాళీ పోస్టులు భర్తీ చే శారు. మెరిట్ జాబితా ఇవ్వకుండా పోస్టులు భర్తీ చేయడంపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. జిల్లా కలెక్టర్ కలుగ చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మెరిట్ ప్రకారమే భర్తీ.. ఐసీడీఎస్ పీడీ విద్యావతి సెలవులో ఉండటంతో ఈ విషయమై సూపరింటెండెంట్ ఎలిజిబెత్‌ను సాక్షి వివరణ కోరింది. రెండు, మూడు సార్లు ఫైలు తిప్పి పంపాక మెరిట్ ప్రకారమే తయారు చేసిన జాబితాను కలెక్టర్ ఆమోదించారని ఆమె చెప్పారు. అసలు మెరిట్ లిస్ట్‌ను తయారు చేయలేదు కదా అని అడగ్గా ఇప్పుడు మెరిట్ జాబితాను నోటీసు బోర్డులో పెట్టమని క్లర్కు సుధాకర్‌కు చెబుతానన్నారు.జిల్లా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అభాగ్యులు, అనాథల కోసం నడిచే బాలసదన్ వసతిగృహాల్లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తారనేందుకు మరో ఉదాహరణ ఇది. కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని నోటిఫికేషన్ ఇచ్చి డబ్బులిచ్చిన వారికి పోస్టులు కట్టబెట్టారు అధికారులు.. దీంతో అసలైన అర్హులు లబోదిబోమంటున్నారు. అంతా రహస్యంగా జరిగిన ఈ వ్యవహారం ప్రస్తుతం ఆశాఖలో చర్చనీయాంశంగా మారింది. -
బాల్య వివాహానికి అధికారుల అడ్డుకట్ట
రామన్నపాలెం(కొడవలూరు): బాల్య వివాహానికి అధికారులు అడ్డుకట్ట వేసిన సంఘటన శనివారం జరిగింది. మండలంలోని రామన్నపాలెం దళితవాడకు చెందిన పన్నెండేళ్ల బాలికకు అదే ప్రాంతానికి చెందిన పదిహేనేళ్ల బాలుడితో ఈ నెల 24న వివాహం చేసేందుకు ఇరువురి తల్లిదండ్రులు నిశ్చయించారు. ఈ వివాహ సమాచారం ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎ.రాజేశ్వరికి తెలియడంతో ఆమె బాలిక తల్లిదండ్రులను శనివారం కలిశారు. బాల్య వివాహాల వల్ల సంభవించే అనర్థాలతోపాటు తలెత్తే ఆర్థిక సమస్యలను తెలియజేశారు. అంతేకాకుండా చట్టరీత్యా కూడా నేరమైనందున బాల్యవివాహం చేయరాదని వారికి సూచించారు. సానుకూలంగా స్పందించిన బాలిక తల్లిదండ్రులు వివాహాన్ని నిలిపివేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులే ఎంపీడీఓ వసుంధరకు ఫోన్ చేసి బాల్యవివాహాన్ని నిలిపి వేసినట్లు తెలిపారు. దీంతో మరో ఐదు రోజుల్లో జరగబోయిన బాల్యవివాహానికి అడ్డుకట్ట పడింది. -
బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు
భూత్పూర్ / మద్దూరు/ ఆమనగల్లు : జిల్లాలో వేర్వేరుచోట్ల నాలుగు బాల్య వివాహాలను పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. భూత్పూర్ మండలంలోని వెల్కిచర్లలో పదోతరగతి చదువుతున్న 16ఏళ్ల బాలికను బిజినేపల్లి మండలం వెల్గొండ వాసి రాజు తో ఈనెల 19న వివాహం చేసేందుకు కుటుంబ పెద్దలు నిశ్చయించారు. ఈ క్రమంలోనే శుక్రవారం వధువుకు ప్రథానం చేసేందుకు పూనుకోగా కొందరు గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన ఎస్ఐ అశోక్, తహ సీల్దార్ జ్యోతి, ఐసీడీఎస్ సీడీపీఓ ప్రవీణ అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. బాల్య వివాహం చేయడం చట్టరీత్యా నేరమని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చా రు. అనంతరం బాలికను ఐసీడీఎస్ సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. మరో సంఘటనలో మద్దూరు మండలంలోని పల్లెర్ల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలకు వారి తల్లిదండ్రులు త్వరలో పెళ్లి చేయాలని నిర్ణయించారు. విషయం తెలుసుకున్న బాధితులు శుక్రవారం భూమిక స్వచ్ఛంద సంస్థ హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నం.18004252908కు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. దీంతో సంస్థ సభ్యురాలు వసంత, ఎస్ఐ నరేందర్ గ్రామానికి చేరుకుని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం బాలికలిద్దరినీ పెదిరిపాడ్‌లోని కేజీబీవీకి తరలిం చారు. వారిని జిల్లా కేంద్రంలోని బాలసదన్‌లో చదవిస్తామని భూమిక సంస్థ సభ్యురాలు తెలిపారు. ఇంకో సంఘటనలో ఆమనగల్లు మండలం ఎక్వాయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఇందిరానగర్‌తండాలో 16ఏళ్ల బాలికకు త్వరలో ముద్విన్ గ్రామపంచాయతీ పరిధిలోని కొరచకొండతండాకు చెందిన వీరానాయక్‌తో వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. విషయాన్ని స్థానికులు కొందరు పోలీసులకు సమాచారమివ్వడంతో శుక్రవారం ఉదయం ఎస్ఐ సాయికుమార్, ఎంఆర్ఐ హరీందర్‌రెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్లు దానమ్మ, దమయంతి అక్కడికి చేరుకుని తల్లిదండ్రులతో మాట్లాడారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని చెప్పి వారి నుంచి ఒప్పంద పత్రం తీసుకున్నారు. -
పుత్తడి బొమ్మకు పెళ్లంట!
పదమూడేళ్ల బాలికకు వివాహం చేసే యత్నం చివరి నిమిషంలో అడ్డుకున్న ఐసీడీఎస్ సిబ్బంది, పోలీసులు బండిఆత్మకూరు: బండిఆత్మకూరులో బాలికకు వివాహం చేసే ప్రయత్నాన్ని పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది అడ్డుకున్నారు. బాలిక తల్లిదండ్రులను కౌన్సెలింగ్ ఇచ్చి సర్ధి చెప్పారు. బండిఆత్మకూరు గ్రామానికి చెందిన వనార్చి కృష్ణ (26)కు అదే గ్రామానికి చెందిన బాలమ్మ కూతురు లక్ష్మితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి హేమ (3)అనే కూతురు ఉంది. బతుకుదెరువుకు వనార్చి కృష్ణ, లక్ష్మి ముంబై వెళ్లారు. కుటుంబ కలహాలతో ఆరు నెలల క్రితం లక్ష్మి అక్కడే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వనార్చి కృష్ణ మళ్లీ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. గిద్దలూరుకు చెందిన ఒక బాలికను(13)ను పెళ్లి చేసుకోనున్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు బుధవారం ఉదయం బండిఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని వనార్చి కృష్ణ ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులను విచారించారు. తర్వాత వనార్చి కృష్ణ, బాలిక, ఆమె తలిదండ్రులను పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ శరత్‌కుమార్‌రెడ్డి విచారించారు. తమ కూతురు గిద్దలూరులోని ఒక పాఠశాలలో ప్రస్తుతం నాలుగోతరగతి చదువుతుందని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. తాము తమ కూతురుకు పెళ్లి చేసేందుకు ఇక్కడకు రాలేదన్నారు. మహాశివరాత్రికి తమ బంధువైన వనార్చి కృష్ణ ఇంటికి వచ్చామంటూ చెప్పుకొచ్చారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సూపర్వైజర్ శిరీషతో పాటు సిబ్బంది ఆనందమ్మ, నాగరజామ్మ సుశీలమ్మ, రాజమ్మ, సునీత, రామేశ్వరమ్మ వచ్చి బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు.బాలికకు 18 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేయవద్దని వారికి వివరించారు. అనంతరం వారితో అగ్రిమెంట్ రాయించుకున్నారు. భవిష్యత్తులో ఎలాంటి తప్పు చేసిన కఠినంగా శిక్షిస్తామని ఎస్ఐ శరత్‌కుమార్‌రెడ్డి వారిని హెచ్చరించారు. -
ఆగిన బాల్య వివాహం
దుబ్బాక : బాల్య వివాహాలు వద్దని ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రచారాలను నిర్వహిస్తున్నా ప్రజలకు కనువిప్పు కలగడం లేదు. జిల్లాలో ఎక్కడో ఓ చోట బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అభం, శుభం తెలియని చిన్నారుల పెళ్లి చేయాలనుకున్న పెద్దల నిర్ణయాన్ని అధికారులు అడ్డుకున్న సంఘటన దుబ్బాక మండలం కేంద్రంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణ కేంద్రానికి చెందిన పర్వతం లక్ష్మి, లింగయ్య కూతురు శ్యామల, నూనె లక్ష్మి, నర్సింలు కుమారుడు సుధాకర్ల వివాహం చేయడానికి సర్వం సిద్ధం చేశారు. మరో పది నిమిషాల్లో జరగాల్సిన పెళ్లిని సమాచారం అందుకున్న తహహల్దార్ అరుణ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు హేమలత, యాక్ పాషా బేగం అక్కడికి అడ్డుకున్నారు. పెళ్లి నిశ్చయించిన పెద్దలకు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాంతో జరిగే అనార్థాలను వివరించారు. చిన్నారులను పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. వధువు వివాహ వయస్సు 18, వరుని వివాహ వయస్సు 21 సంవత్సరాలు నిండితేనే ఇరువురి సమ్మతి మేరకు వివాహం చేయాలని తెలిపారు. బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
చింతపల్లి(నల్లగొండ): బాల్య వివాహం జరుగుతుందనే సమాచారంతో రంగంలోకి దిగిన ఐసీడీఎస్ అధికారులు వివాహన్ని ఆపి బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మొదుగుల మల్లెపల్లి గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని(15)కి నెల్వలపల్లి గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిపిస్తుండగా.. అక్కడికి చేరుకున్న అధికారులు వివాహాన్ని ఆపి బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. -
బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు
కమ్మరపల్లి (నిజామాబాద్ జిల్లా) : నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న ఓ బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయం మండల కేంద్రానికి చెందిన 17 ఏళ్ల బాలికకు ప్రేమ వివాహం జరుగుతుందని సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ , ఐసీడీఎస్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించి వివాహాన్ని నిలిపివేశారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలం కమాన గ్రామంలో ఓ బాలిక వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికకు వివాహం జరగాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ హమీద్, ఏఎస్ఐ తాహెర్ అలీ, ఐసీడీఎస్ సూపర్ వైజర్ సత్తెమ్మ, సర్పంచ్ ప్రకాశ్ తదితరులతో కలసి వచ్చి వివాహాన్ని నిలిపివేయించారు. 18 ఏళ్లు నిండకుండా వివాహం చేయడం నేరమని వారికి తెలియ జేశారు. -
ఎందుకో? ఏమో?
అంగన్వాడీ నియామకాల్లో జాప్యం ఇంటర్వ్యూల రోజున ఫలితాలు వెల్లడిస్తామని చెప్పిన అధికారులు నేతల సిఫార్సు కోసమే వేచి చూస్తున్నారన్న ఆరోపణలు బేరసారాలు మొదలైనట్లు అనుమానాలు సాక్షి ప్రతినిధి, విజయనగరం: అంగన్వాడీ పోస్టుల వ్యవహారం షరామామూలుగానే తయారైంది. గత ఏడాది అక్టోబర్‌లో నియామకం చేపట్టిన పోస్టులు అమ్ముడై పోయిన విషయం సంచలనం సృష్టించింది. ఈ సారైనా అంగన్ వాడీల నియామకాలను పారదర్శకంగా నిర్వహిస్తారని భావించిన అభ్యర్థులు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఆశలు వదులుకుంటున్నారు. అంగన్వాడీ పోస్టులు మళ్లీ అంగట్లో సరుకుల్లానే అమ్ముడుపోతున్నట్లు సమాచారం. నేతల ఒత్తిళ్లతో ఫలితాల వెల్లడిలో అధికారులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. బేరసారాలు కొలిక్కి రాకపోవడం వల్ల నాయకులు ఫలితాల విడుదలకు సంకేతాలు ఇవ్వడం లేదా? ఏ రోజుకా రోజు ఫలితాలు ప్రకటించకపోవడం వెనుక బలమైన కారణమిదేనా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపించక మానడం లేదు. మరకలు పోకుండానే ఎన్నడూ లేని విధంగా గత అక్టోబర్‌లో ఎంపికలు నిర్వహించిన అంగన్వాడీ పోస్టులు అమ్ముడైపోయాయి. కార్యకర్త పోస్టుకు రూ.4లక్షల నుంచి రూ. 7లక్షలు వరకు, ఆయా పోస్టుకు రూ. 2లక్షల నుంచి రూ.3లక్షల వరకు రేటు పలికింది. క్రయ, విక్రయాల ఒప్పందం ప్రకారం అధికార పార్టీ నేతలు సిఫార్సు చేశారు. ఎమ్మెల్యేలు ఏకంగా లెటర్ హెడ్‌పై జాబితాలిచ్చారు. నేతలకు దాసోహమైన అధికారులు ఎటువంటి అభ్యంతరాలు పెట్టకుండా పచ్చజెండా ఊపారు.రాష్ట్రస్థాయిలో దీనిపై చర్చ జరిగింది. ఆ వ్య వహారం ఇంకా చల్లారనే లేదు. మళ్లీ నియామకాలు తాజాగా మరికొన్ని పోస్టుల నియామకాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. మైదాన ప్రాంతంలో (ఐసీడీఎస్ పరిధి) 28 అంగన్వాడీ కార్యకర్తలు, 115ఆయాలు, 34మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 98లింక్ వర్కర్ పోస్టులను, ఐటీడీఏ పరిధిలో 16 అంగన్వాడీ కార్యకర్తలు, 55ఆయా పోస్టులు, 19మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 57క్రైసీ వర్కర్లు, 262లింక్ వర్కర్ల పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ చేపట్టారు. గతంలో వచ్చిన ఆరోపణలకు ఈసారి తావివ్వకూడదన్న ఉద్దేశంతో ఇంటర్వ్యూలు పూర్తయిన వెంటనే ఏ రోజుకా రోజు ఫలితాలను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ఐసీడీఎస్ పరిధిలో 15,16,22వ తేదీల్లోనూ, ఐటీడీఎ పరిధిలో 18,19,20వ తేదీల్లో ఇంటర్వ్యూలు జరిగాయి. ఐటీడీఎ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించిన రోజునే ఫలితాలను ప్రకటించారు. అంతకుముందే క్రయ, విక్రయాలు జరిగిపోయాయేమో తెలియదు గాని ఫలితాల వెల్లడిలో మాత్రం జాప్యం జరగలేదు. మైదానంలో మాట తప్పారు ఇంటర్వ్యూ పూర్తయి రోజులు గడుస్తున్నా ఫలితాల వెల్లడిలో జాప్యంతో అనుమానాలు రేకేత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో బేరసారాలు కుదరక, నేతలు సిఫార్సు చేయడంలో జరుగుతున్న జాప్యం కారణంగానే ఫలితాల వెల్లడిలో తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇంటర్వ్యూలు పూర్తయ్యాక ఫలితాల ప్రకటనలో జాప్యం జరిగితే ఎన్ని ఒత్తిళ్లు వస్తాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదని, క్షణాల్లో జాబితాలు తారుమారైనా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇంటర్వ్యూకు హాజరైన అర్హులైన అభ్యర్థులకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అంగన్వాడీ పోస్టుల కోసం బయట పెద్ద ఎత్తున బేరసారాలు సాగుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగం మాదిరిగా ఉంటుందనే అభిప్రాయంతో ఆశావహులు రూ,లక్షల్లో చెల్లించేందుకు పోటీ పడుతున్నారు. ఉద్యోగం వస్తే ఏదో రకంగా సంపాదించుకోవచ్చన్న ఉద్దేశంతో అడిగినంత ముట్టజెప్పే స్థోమత ఉన్న వారు ముందుకొస్తున్నారు. ఈ పోటీయే నేతలకు కాసుల పంట పండిస్తోంది. రెండు రోజుల్లో వెల్లడిస్తాం ఐటీడీఏ పరిధిలోని 409 పోస్టులకు ఫలితాలు వెల్లడించామని ఐసీడీఎస్ పీడీ రాబర్ట్స్ తెలిపారు. మైదాన ప్రాంతంలో ఉన్న పోస్టు ల మరో రెండు రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. ఏరోజుకారోజు ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు కదా అని ప్రశించగా సమాధానం దాటవేశారు. -
పైసలిస్తే పోస్టునీదే
విజయనగరం ఫోర్ట్: మెంటాడ మండలానికి చెందిన ఓ అభ్యర్థి తనకు అంగన్వాడీ కార్యకర్త పోస్టు ఇప్పించాలని కోరుతూ అధికార పార్టీ నేతను ఆశ్రయించింది. ఈ విషయమై ఆ నేత బదులిస్తూ ‘పోస్టు తప్పనిసరిగా నీకే ఇప్పిస్తాను.. మరి మాకు ఖర్చులు ఉంటాయి. వాటిని భరించగలిగితే పోస్టు ఖాయం. ఇక వెళ్లిపోవచ్చు..’ అంటూ తేల్చిచెప్పారు. గజపతినగరం నియోజకవర్గంలోని గంట్యాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని కార్యకర్త పోస్టు కోసం ఓ అభ్యర్థి అధికార పార్టీ నేతను ఆశ్రయించగా సదరు నాయకుడు రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ మొత్తం ఇచ్చేందుకు అభ్యర్థి కూడా అంగీకరించినట్లు సమాచారం. ఇదీ జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీ విషయంలో చాలాచోట్ల జరుగుతున్న వ్యవహారం. కొద్ది నెలల కిందట జరిగిన అంగన్వాడీ నియామకాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫారుసు చేసిన వారిలో దాదాపు 90 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలియడంతో డబ్బులు ఇస్తే పని అయిపోతుందనే భావన చాలా మంది అభ్యర్థుల్లో నెలకొంది. వాస్తవ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. తాజాగా అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడటంతో అధికార పార్టీ నేతలు పండగ చేసుకుంటున్నారు. గతంలో మాదిరిగానే అధిక మొత్తంలో దండుకోవచ్చుననే భావనలో చాలామంది తెలుగు తమ్ముళ్లలో ఉన్నట్టు సమాచారం. పోస్టుల వివరాలు.. : మైదాన ప్రాంతంలో 275 పోస్టులు, ఐటీడీఏ పరిధిలో 409 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మైదాన ప్రాంతంలో 28 కార్యకర్త, 115 ఆయా, 34 మినీ అంగన్వాడీ కార్యకర్త, 98 లింక్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీడీఏ పరిధిలో 16 అంగన్వాడీ కార్యకర్త, 55 ఆయా, 19 మిని అంగన్వాడీ కార్యకర్త, 57 క్రైసీ వర్కర్, 262 లింక్ వర్కర్ పోస్టుల నియామకాలు జరగనున్నాయి. 15 నుంచి ఇంటర్వ్యూలు... : ప్రాజెక్టు వారీగా ఖాళీగా ఉన్న పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఎంపిక కమిటీ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్, మెంబర్ కన్వీనర్‌గా ఐసీడీఎస్ పీడీ, సభ్యులుగా డీఎంహెచ్ఓ, ఆర్డీఓ, సీడీపీఓలు వ్యవహరిస్తారు. ఈ నెల 15 నుంచి 17 వరకు మైదాన ప్రాంతంలోని అంగన్వాడీ పోస్టులకు , 18 నుంచి 20వతేది వరకు గిరిజన ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. సిఫారుసులుంటేనే...! : అధికార పార్టీ నేత ఎవరికి చెబితే వారికే పోస్టు దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అధికార పార్టీ నేతలు లెటర్‌హెడ్‌పై ఇచ్చిన పేర్లకే ఉద్యోగాలు రావడంతో ఈ ఆరోపణలకు ఊతమిస్తున్నాయి. మరోవైపు అధికారులు కూడా టీడీపీ నేత సిఫారుసులకే ప్రాధాన్యమిస్తున్నట్లు బాధిత అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారమే నియామకాలు చేపడతామని అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతా పారదర్శకం.. ఈసారి అంగన్వాడీ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తాం. దీనికోసం సిబ్బందిని కూడా నియమించనున్నాం. సిఫారుసులను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టించుకోం. -ఎ.ఇ.రాబర్ట్స్, ఐసీడీఎస్ పీడీ, విజయనగరం -
అవినీతి ఘాటు!
పోపుల ఖర్చులో అవినీతి జాడ్యం ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో భారీగా వసూళ్లు విడుదలైన సొమ్ములో ఆర్థిక భారమున్నా.. జీతాలు లేకున్నా.. అప్పులు చేసి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించిన అంగన్వాడీలు పెట్టుబడిని రాబట్టడానికి ఉద్యమాలు చేశారు. ప్రభుత్వం నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్నా వెన్ను చూపకుండా ఎదురొడ్డి పోరాడారు. ఫలితంగా నాలుగు నెలల జీతాలతో పాటు పోపుల ఖర్చుకింద ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జిల్లాలోని 3403 కేంద్రాలకు ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో సగం మాత్రమే అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన ఆశాఖ అధికారులు మిగిలిన సగానికి చేతివాటం ప్రదర్శించారనే విమర్శలు వస్తున్నాయి. శ్రీకాకుళం టౌన్: జిల్లాలో 18 ఐసీడీఎస్ ప్రాజెక్టులు మహిళా శిశు సమగ్రాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేస్తున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రాజెక్టుల పరిధిలో 3,403 అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. అలాగే 789 మినీ అంగన్వాడీలు, 3403 న్యూట్రిషన్ కౌన్సిల్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఒకటి నుంచి ఆరు నెలల లోపు చిన్నారులు 23,739 మంది, ఆరు నెలల నుంచి ఏడాది లోపు 22,404 మంది చిన్నారులు, ఏడాది నుంచి ఠమొదటిపేజీ తరువాయి మూడేళ్ల వయసున్న వారు 81,066 మంది, మూడు నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లలు 59,784 మంది పిల్లలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో ఏడాది నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లలకు మాత్రమే పౌష్టికాహారం అందిస్తారు. ఒక్కో చిన్నారికి 95 పైసలు వంతున పోపుల కోసం ప్రభుత్వం ప్రతిరోజూ చెల్లిస్తోంది. అయితే గత ఎనిమిది నెలలుగా పోపులసొమ్ము విడుదల చేయక పోవడంతో అంగన్వాడీలు ఆందోళన బాటపట్టారు. ఇతర సమస్యలతో పాటు పోపుల నిధులు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి పోపుల కోసం ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లిస్తూ ఇటీవల నిధులు విడుదల చేయడంతో అంగన్వాడీ ఆనందపడ్డారు. అయితే ఇదే అదునుగా భావించిన ఐసీడీఎస్ అధికారులు చేతివాటం ప్రదర్శించారు. పోపుల సొమ్ముల్లో సగం ప్రాజెక్టుల్లోని వారే కత్తిరించి మిగిలిన సొమ్ము కార్యకర్తలకు అందజేశారు. చేతివాటం రూ.5 లక్షల పైనే.. అంగన్వాడీల నుంచి పోపుల సొమ్ములో ప్రాజెక్టుల వారీగా వసూలు చేసిన మొత్తం రూ.5 లక్షల పైనే ఉంది. నెలకు 1.39 లక్షల మంది పిల్లలకు తల ఒక్కింటికీ ప్రభుత్వం రోజుకి 95 పైసలు చొప్పున నెలకు రూ.1.35 లక్షలు విడుదలైంది. ఎనిమిది నెలలకు గాను 18 ప్రాజెక్టుల్లో రూ.10.52 లక్షలు విడుదలైతే అందులో అంగన్వాడీ కార్యకర్తలకు కేవలం రూ. 5 లక్షలు మాత్రమే చెల్లించిన అధికారులు మిగిలిన సొమ్మును మింగేశారు. ఇదేంటని అడిగితే జీతాలు బిల్లులు చేశామని.. ట్రెజరీ సిబ్బందికి పర్సంటేజీలంటూ ఐసీడీఎస్ సిబ్బంది సమాధానం చెబుతున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డేటా నావద్దలేదు అంగన్వాడీ కార్యకర్తలకు పోపుల వ్యయంతోపాటు జీతాల సొమ్ము ఇప్పటికే విడుదలైంది. ఈ నిధులు ప్రాజెక్టులకు పంపించడం జరిగింది. ఎంతెంత వచ్చిందో డేటా మాత్రం ప్రస్తుతం నావద్దలేదు. నరసన్నపేట మీటింగ్‌లో ఉన్నా..అవినీతి గురించి నాకు తెలియదు. - చక్రధర్‌రావు, ఐసీడీఎస్ పీడీ -
103 మంది బాల కార్మికులకు విముక్తి
సుల్తానాబాద్(కరీంనగర్ జిల్లా): సుల్తానాబాద్ మండల పరిధిలో 103 మంది బాల కార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు. ఒడిషాకి చెందిన వీరంతా సుల్తానాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇటుకల బట్టీల్లో పనిచేస్తున్నారు. బాలలను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. బాలలను దగ్గర్లోని సంక్షేమ కార్యాలయానికి తరలించనున్నట్లు ఐసీడీఎస్ అధికారిణి పర్వీన్ సుల్తానా తెలిపారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
ఓ బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం రంగాపురం గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను బంధువుల అబ్బాయికి ఇచ్చి బుధవారం వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్ పీవో, పోలీసులు మంగళవారం గ్రామానికి వెళ్లి వివాహం చేయడం చట్టరీత్యా నేరమని బాలిక తల్లిదండ్రులకు చెప్పారు. అయితే, తాము వివాహం చేసి తీరుతామని పేర్కొనగా, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఉద్యోగాలు ఊడబెరికారు
అర్ధంతరంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ల తొలగింపు రమ్మని పిలిచి... ఊస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు రోడ్డునపడిన 20 మంది.. నోటీసు లేదు... కారణం చెప్పలేదు... తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదు...కానీ అర్ధంతరంగా 20 మంది ఐసీడీఎస్ సూపర్వైజర్ల ఉద్యోగాలు పీకేశారు. బాబు వస్తే జాబు వస్తాయని ఊదరగొట్టిన టీడీపీ తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోంది. ఉత్తరాంధ్రలో 20 మంది సూపర్వైజర్లను అర్ధంతరంగా తొలగించడమే ఇందుకు తాజా తార్కాణం. విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో ఐసీడీఎస్‌లో 20 మంది సూపర్వైజర్లను ప్రభుత్వం అర్ధంతరంగా, అన్యాయంగా తొలగించింది. ఆఫీసుకు పిలిపించి ఏమీ చెప్పకుండానే చేతిలో ఓ ‘కవర్’ పెట్టారు. ఇంటికి వెళ్లి ఆ కవర్ తెరచి చూడమని పంపించివేశారు. అందులో ఏముందో తెలియక ఇంటికి వెళ్లి సూపర్వైజర్లు ఆ కవర్ తెరచి చూసి ఒ హతాశులయ్యారు. ‘మిమ్మల్ని సూపర్వైజర్లుగా తొలగించాం. కా వాలంటే మీ రు అంగన్వాడీ కార్యకర్తలుగా చేరొచ్చు. కానీ ఎక్కడ పోస్టింగో కూడా చెప్పలేం’అని అం దులో ఉంది. ఇలా ఎలాంటి కారణం చూపించకుండా త మను తొలగిచడంతో ఆ సూపర్వైజర్లు నిర్ఘాంతపోయారు. 2013లో ఉత్తరాంధ్రలో 237 ఐసీడీఎస్ సూపర్వైజర్ పోస్టు ల భర్తీ ప్రక్రియ చేపట్టారు. ఎంపిక పరీక్షలో ర్యాం కుల ఆధారంగా అర్హులైన 159 మందికి పోస్టింగ్ ఇచ్చారు. మిగిలిన పోస్టులు ఖాళీ గానే ఉన్నాయి. అలా ఎంపికైనవారు ప్రస్తుతం ప్రొబేషన్‌లో ఉన్నారు. మరో రెండు నెలల్లో వారి ఉద్యోగాలు పర్మినెంట్ అవుతయని వా రు ఆశిస్తున్నారు. ఉన్నఫళంగా 20 మంది సూపర్వైజర్లను ఉద్యోగాల నుంచి తొలగిం చారు. ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని చెబుతూ వారిని తొలగిం చినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఎంపిక చేసిన ఉన్నతాధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం సూపర్వైజర్లను తొలగించడమేమిటో ప్రభుత్వానికే తెలియాలి. సక్రమంగా ఎంపికైనా: సూపర్వైజర్లను అడ్డగోలుగా తొలగించినట్లు ప్రభుత్వ ఉత్తర్వులే వెల్లడిస్తున్నాయి. ఉదాహరణకు బి.నిర్మల అనే ఆమె విజయనగరం జిల్లా బాడంగి ఐసీడీఎస్ ప్రాజెక్టుపరిధిలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఎంపిక జాబితాలో 130వ ర్యాంకు వచ్చిన నిర్మల కంటే మెరుగైన ర్యాంకు వచ్చినవారు ఉన్నందున ఆమెను తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ 2013లో ఎంపిక జాబితాలో ఆమెకు 124వ ర్యాంకు వచ్చింది. ఇష్టానుసారంగా ర్యాంకులను మార్చేసి ప్రభుత్వం వారిని తొలగించేసింది. బాధిత సూపర్వైజర్లు ఆర్జేడీని సంప్రదించగా కలెక్టర్ ఆదేశాల మేరకే వారిని ఉద్యోగాల నుంచి తొలగించామని చెప్పారు. కానీ ఆ ఉత్తర్వుల్లో ఎక్కడా కూడా కలెక్టర్ ఆదేశాల ప్రస్తావనే లేదు. -
ఐసీడీఎస్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
మున్సంగిపుట్టు (విశాఖపట్నం) : షార్ట్‌సర్క్యూట్ వల్ల ఐసీడీఎస్ కార్యాలయంలో పార్క్ చేసి ఉన్న జీపు దగ్ధమైంది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా మున్సంగిపుట్టు మండల కేంద్రంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణలోని షెడ్డులో ప్రమాదవశాత్తూ షార్ట్ సర్క్యూట్ జరగడంతో షెడ్డులో ఉన్న జీపు కాలిపోతోంది. ఇది గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. -
'టీడీపీ హయాంలోనే ఇలా..'
పెనమలూరు (కృష్ణా): స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పనితీరుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేసిన ప్రజాప్రతినిధుల కమిటీ సోమవారం నాడు పలు అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేసింది. కృష్ణా జిల్లా పెనమలూరు, చోడవరంలో ఈ కమిటీ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మీసాల గీత, అంగన్వాడీ సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆమె మీడియాకు తెలిపారు. కమిటీలోని మరో సభ్యురాలు తాతినేని పద్మావతి మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే అంగన్వాడీ సెంటర్ల పనితీరు సరిగా లేదని విమర్శించారు. -
గుట్టుగా పసికందు విక్రయం
అధికారుల రిస్కీ ఆపరేషన్‌తో వెలుగు చూసిన వైనం విచారణ చేపట్టిన పోలీసులు నాయుడుపేటటౌన్ : మూడు నెలల పసి బాలుడ్ని గుట్టుచప్పుడు కాకుండా విక్రయించిన ఉదంతంపై అధికారులు మంగళవారం మండలంలోని కారుమంచివారికండ్రిగలో విచారణ చేపట్టారు. సీడీపీఓ ప్రమీలారాణి తెలిపిన వివరాల మేరకు.. కారుమంచివారికండ్రిగకు చెందిన తీపలపూడి బాబయ్య, కృష్ణమ్మ దంపతుల ఒక్క కుమారుడు గతంలో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో వారు ఈ నెల 2న నాయుడుపేట నుంచి మూడు నెలల బాలుడ్ని ఎక్కడి నుంచో గ్రామానికి తీసుకొచ్చినట్లుగా అధికారులకు సమాచారం అందింది. విషయం అధికారులకు తెలియడంతో ఐసీడీఎస్ సీడీపీఓ ప్రమీలారాణి, జిల్లాల బాలల సంరక్షణ అధికారి సురేష్, పోలీసుల కలిసి గ్రామంలో విచారణ చేపట్టారు. బాలుని తల్లి చిత్తూరు జిల్లాకు చెందిన జూలేఖాగా గుర్తించారు. ఈమె నాయుడుపేటలోని తమ బంధువుల ద్వారా బాలుడ్ని విక్రయించినట్లు నిర్ధారించారు. బాలుని విక్రయ విషయంలో పట్టణానికి చెందిన ముంతాజ్, ఓ ప్రైవేటు వైద్యశాలలో పని చేసే లక్ష్మీకాంతమ్మ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. బాలుడ్ని బాబయ్య దంపతులు రూ.70 వేలకుపైగా నగదు ఇచ్చి కొనుగోలు చేసినట్లుగా వెల్లడైంది. పట్టణంలోని ముంతాజ్ స్వగృహానికి పోలీసులు వెళ్లగా అప్పటికే ఆమె పరారయ్యారు. ముగ్గురుపై కేసు నమోదు సీడీపీఓ ప్రమీలారాణి ఫిర్యాదు మేరకు బాబయ్య, కృష్ణమ్మ దంపతులు, బాలుని తల్లి జూలేఖాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై మరింత దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడ్ని నెల్లూరులోని ప్రభుత్వ శిశువిహార్‌కు తరలిస్తున్నామని ఐసీడీఎస్ అధికారులు వెల్లడించారు. -
మిస్ అయితే.. ఉందిగా ఐసీపీఎస్
పుష్కరఘాట్ (రాజమండ్రి) : జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్)లో భాగమైన సమగ్ర శిశు సంరక్షణ సంస్థ (ఐసీపీఎస్) సిబ్బంది గోదావరి పుష్కరాల్లో విశేష సేవలందిస్తున్నారు. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్, గోదావరి రైల్వే స్టేషన్, సెంట్రల్ కంట్రోల్ రూమ్, మెయిన్ కంట్రోల్ రూమ్‌లలో ఐసీపీఎస్ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తప్పిపోయిన చిన్నారులను చేరదీసి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ పది రోజుల్లో సుమారు 200 మంది చిన్నారులు, రెండు వేల మంది పెద్దలు వారి కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోవడంతో వారిని ఐసీపీఎస్ అధికారులు చేరదీసి మైకుల ద్వారా ప్రచారం చేసి వారి వద్దకు చేర్చారు. 24 మంది ఐసీపీఎస్ సిబ్బంది గోదావరి పుష్కరాలలో సేవలందిస్తున్నారు. నలుగురితో రెస్క్యూటీమ్ : గోదావరి పుష్కరాల్లో తప్పిపోయిన చిన్నారులను సంరక్షించేందుకు వివిధ ఘాట్లు, రాజమండ్రిలో నలుగురు సభ్యులతో రెస్క్యూ టీమ్‌ను ఏర్పాటు చేశారు. వారు అన్ని ప్రాంతాల్లో సంచరిస్తూ చిన్నారులను చేరదీసి వారిని చిల్డ్రన్ హోమ్‌కు తరలించి సంరక్షిస్తూ వారిని తల్లిదండ్రుల చెంతకు చేరుస్తున్నారు. రాజమండ్రికి చెందిన ఏకలవ్య చిల్డ్రన్ హోమ్, సీడీపీఓ ఎస్ఎస్ కుమారి, జిల్లా బాలల సంరక్షణాధికారి సీహెచ్ వెంకట్రావు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. -
ప్రిస్టేజ్ దక్కేదెలా?
- కుక్కర్ల కుంభకోణంపై కలెక్టర్ సీరియస్ - సమగ్ర విచారణకు ఐసీడీఎస్ పీడీకి ఆదేశం - కంపెనీ కుక్కర్లే సరఫరా చేశానంటున్న కాంట్రాక్టర్ - వాస్తవాలను తొక్కి పెట్టాల్సిందిగా సీడీపీఓలపై ఒత్తిడి సాక్షి ప్రతినిధి, కడప : ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లు కుక్కర్ల కుంభకోణం ఐసీడీఎస్ శాఖ పరిధిలోని అధికారులకు చుట్టుకుంటోంది. కార్యాలయ సిబ్బంది మొదలు సీడీపీఓల వరకు మొత్తం వ్యవహారం నడుస్తోంది. కుక్కర్లు సరఫరా కంటే ముందే బిల్లు చేజిక్కించుకుని, నిబంధనల మేరకు డెలివరీ చేసినట్లు రికార్డులు ఉండడంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని కాంట్రాక్టర్ చేతులు ఎత్తేశారు. వెరసి సానుకూల ధోరణితో కొందరు, కాసులకు కక్కుర్తి పడి మరికొందరు అడ్డంగా ఇరుక్కున్నారు. మొత్తం వ్యవహారంపై కలెక్టర్ కెవి రమణ సమగ్ర విచారణకు ఆదేశించడంతో ఐసీడీఎస్ శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఐసీడిఎస్శాఖ పరిధిలో అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యతలేని లోకల్ మేడ్ కుక్కర్లు సరఫరా చేయడంపై బుధవారం ‘ప్రిస్టేజ్’ పోయింది శీర్షికన ప్రత్యేక కథనంతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ కెవి రమణ సమగ్ర విచారణ చేపట్టాల్సిందిగా పీడీ రాఘవరావును ఆదేశించారు. ఆమేరకు ‘ఎంఅండ్ఎస్ ఎంటర్ ప్రైజెస్’ కంపెనీ వివరణ కోరారు. తాను నిబంధనల మేరకు కంపెనీ కుక్కర్లు సరఫరా చేశానని, ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని కాంట్రాక్టర్ రాత పూర్వకంగా వివరణ ఇచ్చినట్లు సమాచారం. దాంతో ఐదు లీటర్ల కుక్కర్లు, 7.5 లీటర్లు కుక్కర్లు ఎన్ని సరఫరా చేశారు.. ఏ కంపెనీవి.. ఎప్పుడు ఇచ్చారు.. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి.. అన్న విషయాలను ధ్రువీకరించాల్సిందిగా జిల్లాలోని సీడీపీఓలను పిడీ రాఘవరావు కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాస్తవాలను మరుగున పరచాలని, అన్ని కుక్కర్లు ప్రిస్టేజ్ కంపెనీవే అందాయని నివేదిక ఇవ్వాలని తెరవెనుక సీడీపీఓలపై ఒత్తిడి అధికమైనట్లు సమాచారం. ఇప్పటికీ వాస్తవ నివేదిక అందించకపోతే మొత్తం వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందనే భావనలో కొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ‘మేము చూసుకుంటాం.. మీరు కాంట్రాక్టర్ చెప్పినట్లు నివేదిక ఇవ్వండ’ంటూ కార్యాలయ సిబ్బంది కొందరు రంగ ప్రవేశం చేసినట్లు సమాచారం. ముందే బిల్లులు చెల్లింపులపై ఆరా టెండర్లు ముగిసిన నెలలోపు కాంట్రాక్టర్ బిల్లు పెట్టుకోవడం, బిల్లు పెట్టిన రెండు రోజుల్లోనే మొత్తం రూ.74.69 లక్షలు చెల్లించడం, ఎనిమిది నెలల అనంతరం లోకల్ మేడ్ కుక్కర్లు సరఫరా చేసిన వ్యవహారంలో కార్యాలయ సిబ్బంది పాత్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాంట్రాక్టర్, సిబ్బంది పరస్పర సహకారంతోనే ఇలా వ్యవహరించడంతో అంగన్వాడీ కేంద్రాలకు ప్రిస్టేజ్ స్థానంలో నాణ్యతలేని కుక్కర్లు చేరాయి. సరఫరా చేయకపోయినా ఆగమేఘాలపై బిల్లు చెల్లించిన ఉదంతంలో కొంతమందికి లక్షలాది రూపాయాలు లంచంగా ముట్టినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఐదుగురు సీడీపీఓ ప్రాజెక్టుల పరిధిలో లోకల్ మేడ్ కుక్కర్లు సరఫరా చేసినట్లు ఇప్పటికే రూఢీ అయినట్లు సమాచారం. సమగ్ర విచారణ చేస్తున్నాం : రాఘవరావు, డీఆర్డీఏ పీడీ అంగన్వాడీ కేంద్రాలకు ప్రిస్టేజ్ ఫ్రెషర్ కుక్కర్ల స్థానంలో లోకల్ మేడ్ కుక్కర్లు సరఫరా చేయడంపై సమగ్ర విచారణ చేస్తున్నాం. కాంట్రాక్టర్ తాను ప్రిస్టేజ్ కంపెనీ కుక్కర్లు సరఫరా చేశానని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు, ఏ కంపెనీవి, ఎన్ని కుక్కర్లు ఇచ్చారు.. అవి ఏయే ప్రాంతాల్లో ఎన్ని ఉన్నాయన్న అంశంపై సీడీపీఓలను రాత పూర్వకంగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించాను. సమగ్రంగా విచారించి కలెక్టర్‌కు నివేదిక అందిస్తాం. -
బాలిక నిశ్చితార్థాన్ని అడ్డుకున్న అధికారులు
మద్దూరు (కంకిపాడు) : బాలిక నిశ్చితార్థం సన్నాహాలను ఐసీడీఎస్, పోలీసు శాఖ అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని మద్దూరు గ్రామంలో బుధవారం రాత్రి ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాలిక స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన గోపి రాజు మైనర్‌తో వివాహం చేసేందుకు పెద్దలు ఒప్పందం చేసుకున్నారు. గురువారం నిశ్చితార్థ వేడుక పెట్టుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. విషయాన్ని స్థానికు లు ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఐసీడీఎస్ అధికారులు, పోలీసు సిబ్బంది గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. మేజర్లు కాకుండా వివాహం జరిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఇరుపక్షాల పెద్దలను హెచ్చరించారు. తరచూ నిర్వహించే తనిఖీల్లో మైనర్లు అందుబాటులో లేకపోతే శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేయాల్సి ఉంటుందని ఐసీడీఎస్ సీడీపీవో ఉమాదేవి హెచ్చరించారు. మైనార్టీ తీరే వరకూ వివాహం జరిపించబోమని స్పష్టంచేస్తూ ఇరుపక్షాల పెద్దలతో రాతపూర్వక హామీ తీసుకున్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మాదేవి పాల్గొన్నారు. -
ప్రిస్టేజ్ పోయింది!
ఐసీడీఎస్‌లో కుక్కర్ల కుంభకోణం రూ.74 లక్షలతో కుక్కర్ల కొనుగోలుకు టెండర్లు సరఫరా చేయకముందే కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లింపు ఎనిమిది నెలలకు ప్రిస్టేజ్ స్థానంలో లోకల్ మేడ్ కుక్కర్లు సరఫరా లోపాయికారి ఒప్పందంతో నోరు మెదపని అధికారులు సాక్షి ప్రతినిధి, కడప : వక్ర మార్గానికి కాదేదీ అనర్హం అన్నట్లు ఐసీడీఎస్ కార్యాలయం తయారైంది. పిల్లల పౌష్టికాహారం మొదలు ప్రతి సందర్భంలోనూ అక్రమ ఆదాయమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోంది. ఓ వైపు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఆ శాఖ పనితీరులో మార్పు కనిపించడం లేదు. తాజాగా కుక్కర్ల కొనుగోల్‌మాల్ వ్యవహారం బహిర్గతమైంది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించిన ఎనిమిది నెలల అనంతరం లోకల్ మేడ్ కుక్కర్లు సరఫరా చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఐసీడీఎస్ శాఖ అంగన్వాడీ కేంద్రాలకు కుక్కర్లు సరఫరా చేయదలిచింది. ఆ మేరకు 7.5 లీటర్ల కెపాసిటి గల 3621 కుక్కర్లు, 5 లీటర్లు కెపాసిటిగల 2861 కుక్కర్ల కోసం టెండర్లు ఆహ్వానించారు. 7.5 లీటర్ల కుక్కర్ రూ.1320 చొప్పున, 5 లీటర్ల కుక్కర్ రూ.940 చొప్పున సరఫరా చేసేందుకు ఎంఅండ్ఎస్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీ టెండర్లు దక్కించుకుంది. ఈ ప్రక్రియ గత ఏడాది ఫిబ్రవరి 14న ముగిసింది. టెండర్లు దక్కించుకున్న నెలలోపు కాం ట్రాక్టర్ బిల్లు పెట్టుకున్నాడు. మార్చి 10న బిల్లు పెట్టుకోగా మార్చి 12న రూ.74.69 లక్షలు ఐసీడిఎస్ యంత్రాంగం కాం ట్రాక్టర్‌కు చెల్లించి ంది. వాస్తవానికి కుక్కర్లు సరఫరా చేసిన అనంతరం బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్ ఇచ్చిన కాసులకు కక్కుర్తిపడిన యంత్రాంగం ముందుస్తుగా బిల్లు చెల్లించి స్వామి భక్తి ప్రదర్శించినట్లు సమాచారం. అనంతరం ఎనిమిది నెలల పాటు కుక్కర్లు సరఫరా చేయకపోయినా యంత్రాంగం ‘నిమ్మకు నీరెత్తినట్లు’గా ఉండిపోయారు. నవంబర్ 12న కుక్కర్లు సరఫరా చేశారు. లోపాయి కారి ఒప్పందం వల్లే అధికారులు ఇంత ఆలస్యమైనా నోరు మెదపనట్లు సమాచారం. ప్రిస్టేజ్ ఫ్రెషర్ కుక్కర్ స్థానంలో లోకల్‌మేడ్ నిబంధనల మేరకు ఎంఅండ్ఎస్ ఎంటర్ ప్రైజెస్ ప్రిస్టేజ్ ఫ్రెషర్ కుక్కర్లు సరఫరా చేయాల్సి ఉంది. అయితే లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, కమలాపురం, ప్రొద్దుటూరు, పులివెందుల, సిద్ధవటం సీడీపీఓ ప్రాజెక్టు పరిధిలో లోకల్ మేడ్ కుక్కర్లు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. మండల కేంద్రాల పరిధిలో నిబంధన మేరకు కంపెనీ కుక్కర్లు సరఫరా చేసి, గ్రామాల పరిధిలో లోకల్ మేడ్ కుక్కర్లు సరఫరా చేసినట్లు సమాచారం. దాదాపు 3500 పైగా లోకల్‌మేడ్ కుక్కర్లు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు సుమారు రూ.20 లక్షలు పైగా అక్రమంగా కాంట్రాక్టర్ సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అందుకు ప్రత్యక్షంగా ఐసీడీఎస్ యంత్రాంగం సహకారం స్పష్టంగా కన్పిస్తోంది. వాస్తవమే.. విచారిస్తున్నాం : ఐసీడీఎస్ పీడీ రాఘవరావు అంగన్వాడీ కేంద్రాలకు ప్రిస్టేజ్ ఫ్రెషర్ కుక్కర్ల స్థానంలో లోకల్ మేడ్ కుక్కర్లు సరఫరా చేశారని కొంత మంది సీడీపీఓలు నా దృష్టికి తెచ్చారు. ఆ మేరకు విచారణ చేపడుతున్నాం. బిల్లులు ముందుస్తుగా ఎందుకు చెల్లించారనే విషయమై కూడా విచారణ సాగుతోంది. లోకల్ మేడ్ కుక్కర్లు ఉన్నట్లు గుర్తించాం. శాఖపరంగా విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. -
మన్యంలో మాతృవేదన
మాతా, శిశువుల ప్రాణాలకు గ్యారంటీ లేదు కాన్పు కష్టమైతే అంతే సంగతి ఏజెన్సీలో కుంటుపడిన గైనిక్ సేవలు శై‘శవ’ గీతి మన్యంలో మార్మోగుతోంది. మాతాశిశు మరణాలకు అంతులేకుండా పోతోంది. పోషకాహార లోపాలకు రక్తహీనత తోడై మారుమూల గూడేల్లో చావుడప్పు ఆగకుండా మోగుతోంది. పిల్లలు, గర్భిణులు, బాలింతల కోసం ఐసీడీఎస్ ఉండీ ఉద్ధరించిందేమన్న వాదన వ్యక్తమవుతోంది. ఏటా మాతాశిశు మరణాలు వందల్లో ఉంటే అధికారులు మాత్రం వీటిని తగ్గించి చూపిస్తున్నారు. అంతా బాగానే ఉందని బాకా ఊదేస్తున్నారు. ఇలా తక్కువ చేసి చూపించడంతో ఉన్నతస్థాయి వర్గాల్లో అంతా బాగానే ఉందనిపిస్తోంది. పరోక్షంగా గిరిజనుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. చింతపల్లి, పాడేరుల్లో ఉన్న న్యూబార్న్ స్టెబిలైజేషన్ యూనిట్లతో ఒరిగిందేమీ లేకుండాపోతోంది. పాడేరు : ఏజెన్సీలోని ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో ప్రసూతి సేవలు మృగ్యమయ్యాయి. కాన్పు కష్టమైతే పూర్తి స్థాయిలో వైద్య సేవలు వీటిల్లో అందడం లేదు. ఇలాంటప్పుడే మాతా, శిశువుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఏజెన్సీ ఆస్పత్రుల్లో గైనకాలజిస్ట్లు అందుబాటులో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రతి సమావేశంలోనూ అధికారులు, ప్రజాప్రతినిధులు మాతా,శిశు మరణాలను నిరోధించాలని పేర్కొంటున్నారు. అది కంఠశోషగానే మిగులుతోంది. గతేడాది ఏజెన్సీలో ప్రవస సమయంలో 34 మంది తల్లులు, 472 మంది శిశువులు చనిపోయినట్టు అధికారుల రికార్డులే పేర్కొంటున్నాయి. ఈ ఏడాది 9 మంది తల్లులు, 104 మంది శిశువులు చనిపోయారు. పాడేరు, చింతపల్లి, అరకు ఏరియా ఆస్పత్రులకు మాత్రమే గైనకాలజిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఏళ్లతరబడి అవి భర్తీకావడం లేదు. ఎప్పుడైనా ప్రసూతి సమస్యలు తీవ్రమైనప్పుడు తాత్కాలికంగా గైనకాలజిస్ట్‌ను నియమిస్తున్నారు. వారి సేవలు కొన్ని రోజులకే పరిమితమవుతున్నాయి. ప్రస్తుతం పాడేర ఆస్పత్రిలో పీజీ గైనకాలజిస్ట్‌గా ఉన్నారు. సుఖ ప్రసవం అయితే ఫర్వాలేదు. లేదంటే అత్యవసర సమయాల్లో ఉన్నత వైద్యసేవల కోసం 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించాల్సిన దుస్థితి. ఆదివాసీలకు రోగాలతోపాటు తిండి కూడా ప్రధాన సమస్య. ఏజెన్సీలో ఇది ఎక్కువ. వ్యవసాయంలో ఎంతో కొంత ప్రవేశం ఉన్న తెగల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా..పూర్తిగా ఆహారం సేకరణపై ఆధారపడే భగత, కోందు, గదబ, కోయ జాతుల పరిస్థితి దయనీయం. చిన్న వయస్సుల్లో పెళ్లిల్ల వల్ల మన్యంలో మాతృమూర్తులు అంత్యంత బలహీనంగా ఉంటున్నారు. శారీరక ఎదుగుదల లేకుండానే యువతులు ప్రసవిస్తున్నారు. ఫలితంగా తల్లీబిడ్డల ఆరోగ్యం కొడిగట్టిన దీపమవుతోంది. పౌష్టికాహారం నివారణకు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి మన్యంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏజెన్సీ 11 మండలాల్లోనూ గిరిజనులు వ్యాధుల బారినపడి అల్లాడిపోతున్నారన్నారు. దీనిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదన్నదని ఆరోపించారు. ఎక్కడా పూర్తి స్థాయిలో వైద్యసేవలు సక్రమంగా అందడం లేదన్నారు. వైద్య,ఆరోగ్యశాఖ మాతాశిశు మరణాలను నియంత్రించలేకపోతోందన్నారు. మలేరియా విజృభింస్తున్నదని పేర్కొన్నారు. -
చిన్నారి క్షేమం
మంచాల : నాలుగు నెలల క్రితం కనిపించకుండా పోయిన చిన్నారి క్షేమంగా ఉంది. గతంలో పోషణ భారమై తల్లిదండ్రులు దత్తత ఇచ్చారు. శనివారం అధికారికంగా ఐసీడీఎస్ అధికారులు చిన్నారిని అప్పగించారు. వివరాలు.. మండల పరిధిలోని ఆంబోత్ తండాకు చెందిన ఆంబోత్ మాధవి, శంకర్ దంపతులకు కూతురు వైష్ణవి(3) ఉంది. గత మార్చి 5న రెండో సంతానంగా కూడా పాప పుట్టింది. ఆర్ధిక పరిస్థితి బాగలేకపోవడంతో మాధవి చెన్నారెడ్డిగూడలోని తన తల్లిదండ్రులైన రామావత్ పరంగీ, శంకర్ల సాయంతో అదేనెల 10న లింగంపల్లి గ్రామానికి చెందిన మైలారం వీరేషం,స్వరూప దంపతులకు పాపను దత్తత ఇచ్చారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. చిన్నారి విషయమై స్థానికులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో పాపను చంపేశారని, విక్ర యించారని అప్పట్లో పుకార్లు వ్యాపించాయి. దీంతో శనివారం స్థానిక సర్పంచ్ బాలమణి, ఎంపీటీసీ సభ్యురాలు రాణెమ్మ, గ్రామ పెద్దలు పాప ఎక్కడున్నా తక్షణమే తీసుకురావాలని మాధవి, శంకర్ దంపతులకు తేల్చిచెప్పారు. విషయం ఐసీడీయస్ అధికారులకు కూడా చెప్పారు. పాపను తీసుకొని తల్లిదండ్రులు, అమ్మమ్మతాతలు వచ్చారు. పాపను పెంచే స్థోమత తమకు లేదని చెప్పారు. అందుకే లింగంపల్లి గ్రామానికి చెందిన వారికి ఇచ్చామని చెప్పారు. అనంతరం ప్రజాప్రతినిధుల సమక్షంలో ఐసీడీయస్ అధికారులు చట్టప్రకారం పత్రం రాయించుకొని పాపను స్వరూప, వీరేషం దంపతులకు దత్తత ఇచ్చారు. పాపను బాగా చూసు కుంటామని వారు తెలిపారు. -
పులివెందుల సీడీపీఓ సస్పెన్షన్
10 మంది సూపర్వైజర్లపై వేటుకు రంగం సిద్ధం సాక్షి, కడప : పులివెందుల ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ సావిత్రిదేవిపై సస్పెన్షన్ వేటు పడింది. 2014 వేసవిలో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించకుండానే నిర్వహించినట్లు రికార్డులు చూపి పెద్ద ఎత్తున సరుకులను పక్కదారి పట్టించారన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. పులివెందుల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ స్కూళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్లు గత ఏడాది వేసవిలో పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ విషయంపై తెలుగు యువత నాయకుడొకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, అంగన్వాడీకి చెందిన అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో అప్పట్లో విచారణ చేపట్టారు. అప్పటి పీడీ లీలావతి, ప్రస్తుత పీడీ రాఘవరావులతోపాటు ఆర్డీలు విచారణ నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలను ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడటంతో పాటు కొన్ని సెంటర్లకు అధికారులు వెళ్లి విచారించారు. చాలా రోజులుగా విచారణ కొనసాగింది. ఇందులో భాగంగా సీడీపీఓపై చర్యలు తీసుకోకుండా ఓ రాజ్యాంగ పదవిని అనుభవిస్తున్న నేత తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేగా, మరో వైపు చర్యలు తీసుకోవాల్సిందేనంటూ తెలుగు యువత నాయకుడు ఒత్తిడి చేస్తూ వచ్చారు. దీంతో ఉన్నతాధికారులకు ఎటూ పాలుపోలేని పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు ఉన్నత స్థాయి అధికారుల సూచన మేరకు సీడీపీఓ సావిత్రిదేవిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి పది మంది సూపర్వైజర్లపై వేటు పడనున్నట్లు సమాచారం. ఒక్క పులివెందుల ప్రాంతంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా జరిగిన అవకతవకలపై కూడా అధికారులు దృష్టి సారించాలని వర్కర్లు కోరుతున్నారు. -
శిశువులు మరణిస్తే అంగన్వాడీలపై చర్యలు
ఒంగోలు టౌన్ :గర్భిణులు, బాలింతలు, శిశువులకు సంబంధించిన వివరాలను ఈనెల 25వ తేదీలోపు ఆన్లైన్లో నమోదు చేయకపోతే సంబంధిత సీడీపీవోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని కలెక్టర్ సుజాతశర్మ హెచ్చరించారు. ఎక్కడైనా అనారోగ్యంతో, పౌష్టికాహార లోపంతో శిశువులు మరణిస్తే సంబంధిత ఆరోగ్య కార్యకర్తతోపాటు అంగన్వాడీ కార్యకర్తపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఐసీడీఎస్ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆశించిన స్థాయిలో సేవలు అందడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో గర్భిణుల సగటు నమోదు 59శాతం ఉందని, మిగిలిన 41 శాతం గుర్తించడంలో అంగన్వాడీలు పూర్తిగా వెనుకబడ్డారని చెప్పారు. ఎంఎంఆర్, ఐఎంఆర్, గర్భిణుల ప్రసవ తేదీ వివరాలను ప్రభుత్వం రూపొందించిన వెబ్సైట్లో నమోదు చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహారంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని కలెక్టర్ సుజాతశర్మ హెచ్చరించారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ కే లీలావతి, లీగల్ కౌన్సిలర్ సిరిగిరి సరళ, ఐసీపీఎస్ డీసీపీవో జ్యోతిసుప్రియ పాల్గొన్నారు. -
ఎవడబ్బ సొమ్మని..!
అమాత్యుల ప్రొటోకాల్ ఖర్చుల కోసం అధికారుల అడ్డదారులు లంచం డబ్బుతో మంత్రులకు ఏర్పాట్లు ! ఏసీబీకి పట్టుబడ్డ ఐసీడీఎస్ ఉద్యోగిని వెల్లడి ప్రభుత్వం నుంచి చాలీచాలని నిధులు చర్చనీయాంశమైన ప్రొటోకాల్ నీతి! ఆనాడు రామదాసు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో శ్రీరామచంద్రుడికి గుడి కట్టించి తన స్వామి భక్తిని చాటుకున్నాడు.. ఆనక చెరసాల పాలయ్యాడు. ఇప్పుడు మన అధికారులు అమాత్యులపై తమ స్వామిభక్తిని చాటుకుంటున్నారు. ప్రొటోకాల్ ఖర్చుల పేరుతో మంత్రివర్యుల విందు విలాసాలకు, స్టార్ హోటల్ సౌకర్యాలకు, వారి మందీమార్బలం కోసం అవసరమైనంతా ఖర్చు చేస్తున్నారు. దీనికోసం లంచాలకు తెరతీస్తున్నారు. చివరికి జైలుపాలవుతున్నారు. తాజాగా విజయవాడలో ఏసీబీకి చిక్కిన ఐసీడీఎస్ ఉద్యోగిని ఉదంతంతో ఈ విషయం బాహాటమైంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ : జిల్లాలో ముగ్గురు రాష్ట్ర మంత్రులు ఉన్నారు. పక్క జిల్లా గుంటూరులో మరో ఇద్దరున్నారు. వీరుగాక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిత్యం విజయవాడ, రాజధాని ప్రాంతంలోనే పర్యటిస్తున్నారు. అంటే ఆరుగురు మంత్రులు వారంలో నాలుగు రోజులు విజయవాడలోనే ఉంటున్నారు. ఐదుగురు మంత్రులకు హోటళ్లలో గదులు బుక్ చేస్తున్నారు. స్టార్ హోటళ్లు కావడంతో బిల్లులు కట్టలేక ఆయా శాఖల వారు నానా అవస్థలు పడుతున్నారు. అన్ని హంగులూ ఉండాల్సిందే... ఎక్సైజ్ శాఖ మంత్రి విజయవాడ వచ్చారంటే అన్ని హంగులూ ఉండాల్సిందే. గెస్ట్‌హౌస్‌లో తగిన సౌకర్యాలు ఉండటం లేదని చాలా సార్లు హోటల్లో గదులు బుక్ చేస్తున్నారు. సాధారణంగా డబ్బు సంపాదించే శాఖ కావడం, మద్యం వ్యాపారులు నిత్యం మంత్రితో టచ్‌లో ఉండటంతో ఖర్చులకు వెనకాడటం లేదు. పైగా నగరంలో మద్యం సిండికేట్ వారు ఎంత పెంచుకోవాలంటే అంత పెంచి అమ్మకాలు చేసుకునే సౌకర్యం ఎక్సైజ్ శాఖ కల్పించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు కూడా నిత్యం ఇక్కడే ఉంటుంటారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కార్యాలయం ఏర్పాటుచేసినా అది పేరుకు మాత్రమేనని చెప్పవచ్చు. సమావేశాల ఖర్చులన్నీ అధికారుల పైనే... ఇక జల వనరుల శాఖ మంత్రి కూడా గెస్ట్‌హౌస్‌లో ఉంటుంటారు. ఇరిగేషన్ కార్యాలయంలో పలుమార్లు సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఖర్చులన్నీ ఇరిగేషన్ శాఖ పైనే పడుతున్నాయి. ఈ మంత్రి ప్రొటోకాల్‌కే నెలకు కనీసంగా ఆరు లక్షల రూపాయలకు పైగా ఖర్చవుతున్నట్లు ఆ శాఖ ఉద్యోగులు కొందరు తెలిపారు. రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ప్రకాశం జిల్లా నుంచి వారంలో ఒకసారి తప్పకుండా వస్తుంటారు. ఆయన ప్రొటోకాల్ బిల్లు కూడా తడిసి మోపెడవుతోందని అధికారులు చెబుతున్నారు. వాణిజ్య పన్నుల శాఖ మంత్రి, రెవెన్యూ మంత్రి వచ్చినప్పుడు ఇక చెప్పేదేముంది వారి హంగామానే వేరు. ఆ శాఖల్లో తీసుకునే పై ఫీజుల నుంచే ప్రొటోకాల్‌కు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో మంత్రికి కనీసంగా నెలకు రెండు లక్షలు ప్రొటోకాల్ ఖర్చులు అవుతున్నట్లు అధికారుల సమాచారం. ప్రభుత్వం ఇచ్చేది నామినల్... ప్రొటోకాల్ ఖర్చుల కోసం ప్రభుత్వం నామినల్‌గా ఇస్తుంది. వాహనాల ఖర్చు, మంత్రి, గన్మెన్ల భోజనం ఖర్చులు మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది. మరి వారు వచ్చినప్పుడు గేట్‌వే హోటల్లో సమావేశం పెట్టారంటే కనీసంగానైనా లక్ష రూపాయల బిల్లు చెల్లించాల్సిందే. మంత్రితో పాటు వచ్చే మందీమార్బలానికి కూడా సంబంధిత శాఖ వారే ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. ఇటీవల జిల్లా కలెక్టర్‌కు రూ.8 లక్షల ప్రొటోకాల్ సొమ్ము వచ్చింది. కానీ బిల్లులు పెడితే అవి ఏ మూలకూ సరిపోవని ఒక ఉన్నతాధికారి తెలిపారు. విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం, గుడివాడ, నూజివీడు డివిజన్లకూ ప్రొటోకాల్ సొమ్ము ఇస్తారు. ఒక్క విజయవాడకే ఎక్కువ సొమ్ము కేటాయిస్తారు. ఇవి కాకుండా గన్నవరం తహశీల్దార్‌కు ప్రత్యేకంగా ప్రొటోకాల్ డ్యూటీ ఉంటుంది. అదీ నెలకు రూ.50 వేలకు మించడం లేదు. అక్కడ అయ్యే ఖర్చులు మాత్రం నెలకు కనీసంగానైనా రూ.3 లక్షల వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. విమానాశ్రయం ఉండటంతో నిత్యం మంత్రులే కాకుండా ఉన్నతాధికారులు, కేంద్ర మంత్రులు, అధికారులు వస్తుంటారు. వారి ఖర్చంతా తహశీల్దార్ కార్యాలయం భరించాల్సి ఉంటుంది. మామూళ్లకు తెరతీసిన శాఖలు ప్రొటోకాల్ ఖర్చుల పేరుతో పలు శాఖలు దండుకునే కార్యక్రమాన్ని చేపట్టాయి. కొన్ని శాఖల వారు ఏకంగా మంత్రుల పేర్లు చెప్పి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. వీరు ప్రత్యేకించి డబ్బులు అడగకుండా నెల కాగానే వారే పువ్వుల్లో పెట్టి ఇవ్వాలి. లేకుంటే తగిన విధంగా అధికారులు స్పందిస్తారు. సీఎం సభలు, పర్యటన ఖర్చులు మినహా ఇతర ప్రొటోకాల్ ఖర్చుల వ్యవహారం ఆయా శాఖల వారే చూడటంతో పరిస్థితి దారుణంగా ఉంది. సాధారణంగా ప్రొటోకాల్ ఖర్చులు రెవెన్యూ వారు చూడాలి. అయితే పలు శాఖల మంత్రులు నిత్యం వస్తుండటంతో రెవెన్యూ వారు చేతులెత్తేశారు. దాంతో ఆయా శాఖల వారే స్టార్ హోటళ్లలో రూముల నుంచి వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చూస్తున్నారు. పది నెలల క్రితం విజయవాడ గేట్‌వేలో సీఎం ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశం సొమ్ము వారం రోజుల క్రితం వచ్చింది. ఇలా నెలల తరబడి ఆగే పరిస్థితుల్లో వ్యాపారులు లేరు. దీంతో ఆయా శాఖల వారికి వడ్డన తప్పడం లేదు. ప్రొటోకాల్ రాష్ట్ర కార్యాలయం కూడా హైదరాబాద్‌లోనే ఉంది. నూతన రాజధానికి వస్తే కొంతవరకు సమస్య తీరుతుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంది. -
నీరసం వీడని ‘ఆరోగ్యలక్ష్మి’
అందని కొత్త మెనూ సాక్షి, హైదరాబాద్: ‘ఆరోగ్యలక్ష్మి’ నీరసించిపోతోంది. పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఆచరణకు నోచుకోవడంలేదు. ఆరోగ్యలక్ష్మి మెనూ పెంపునకు సంబంధించిన సర్క్యూలర్ ఉన్నతస్థాయి నుంచి అంగన్వాడీలకు అందాల్సి ఉంది. బాలింతలు, గర్భిణులకు తగిన పోషకాహారం అందించడం ఆరోగ్యలక్ష్మి ఉద్దేశం. ప్రస్తుతం రోజుకు రూ.15 విలువైన పోషకాహారం మాత్రమే ఇస్తున్నారు. ఈ మెనూ సరిపోవడంలేదని భావించిన ప్రభుత్వం జూన్ 2వ తేదీ నుంచి ప్రతిరోజూ రూ.21 విలువైన ఆహారాన్ని అందించాలని జూన్ ఒకటో తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆహార పదార్థాలను ఇంటికి ఇచ్చే విధానానికి స్వస్తి పలికి, అంగన్వాడీల్లోనే ఒక పూట పోషకాహారాన్ని తప్పనిసరిగా లబ్ధిదారులకు అందించాలి. లబ్ధిదారులకు రోజువారీ ఇచ్చే ఆహారంలో ఆకుకూర పప్పు, కూరగాయలతో సాంబారు, ఒక గుడ్డు, 200 మిల్లీలీటర్లు పాలు అంగన్వాడీ కేంద్రాల్లోనే అందించే విధంగా సర్కారు కొత్త మెనూను రూపొందించింది. ఒకపూట పూర్తి భోజనంతోపాటు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇప్పించడం, శిశువులకు వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించడం తదితర కార్యక్రమాల పర్యవేక్షణను కూడా అంగన్వాడీ కేంద్రాలకే సర్కారు అప్పగించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని మొత్తం 5.18 లక్షల మందికి వారానికి ఆరురోజులపాటు సమృద్ధిగా పోషకాహారం ఇవ్వాలి. ‘ఆరోగ్యలక్ష్మి’ ద్వారా లబ్ధిదారులకు కొత్త మెనూను అమలు చేయాలని అన్ని జిల్లాల సమగ్ర శిశు అభివద్ధి సేవాకేంద్రాల(ఐసీడీఎస్) సిబ్బందికి మహిళా శిశు సంక్షేమ విభాగం డెరైక్టర్ సర్క్యులర్ పంపాల్సి ఉంది. డెరైక్టర్ సెలవులో ఉండడం, ఇన్చార్జి డెరైక్టర్‌కు పని భారం అధికంగా ఉండడంతో సకాలంలో సర్కులర్ జారీ కాలేదని ఆ విభాగం సిబ్బంది చెబుతున్నారు. -
అంగన్వాడీల వయోపరిమితి పెంపు
హైదరాబాద్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేస్తున్న అంగన్వాడీలకు శుభవార్త. అంగన్ వాడీ కార్యకర్తలకు, సహాయకులకు వయోపరిమితిని పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారి గరిష్ట వయోపరిమితి 60 ఏళ్లుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అరవై ఏళ్లు పూర్తయిన అంగన్ వాడీ కార్యకర్తలకు రూ. 50 వేలు, సహాయకులకు రూ.20 వేలను పదవీ విరమణ ప్రయోజనంగా ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. -
బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు
-
‘సబల’ నిధులు స్వాహా..!
ఐసీడీఎస్‌లో మరో అక్రమం ⇒ రూ.75 లక్షలు ఖజానా నుంచి అడ్వాన్స్ గా డ్రా ⇒ శాఖ ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే..! ⇒ కలెక్టర్‌నే తప్పుదోవ పట్టించిన వైనం ⇒ సబల నిలిపివేతతో నిధుల కైంకర్యానికి పన్నాగం ఆదిలాబాద్ : స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో మరో భారీ అక్రమం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఓ సీడీపీవో లక్షల నిధుల స్వాహా వ్యవహారం మరువక ముందే.. తాజాగా ఈ వ్యవహారాన్నే తలదన్నేలా మరోటి చోటుచేసుకుంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ నుంచి అనుమతి పొందకుండానే ట్రెజరీ నిధులు విడుదల చేసినట్లు సమాచారం. ఎలాంటి నిబంధనలు పాటించకుండానే సబల పథకానికి సంబంధించిన రూ.75 లక్షలు అడ్వాన్స్‌గా డ్రా చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ పథకం నిలిచిపోతుందని ముందుగానే తెలిసిన శాఖలోని పలువురు అధికారులు.. ఈ నిధులను తమ కమీషన్ల కోసం కోడిగుడ్ల కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఒక పథకం నిధులు మరో పథకానికి మళ్లించొద్దని నిబంధనలున్నా.. అధికారులు తమ స్వార్థం కోసమే ఇలా చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతిలేకుండానే.. ఐసీడీఎస్‌కు కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రతి కొనుగోలుకు సం బంధించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనలను చైర్మన్‌గా ఉన్న కలెక్టర్ అనుమతి పొంది కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిధులతో సబల పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రతినెలా కిశోర బాలికలకు 3 కిలోల బియ్యం, కేజీ కంది పప్పు, అరకిలో నూనె సరుకులను అందజేస్తారు. కాగా.. గత మార్చిలో రూ.75 లక్షలు ఐసీడీఎస్ అధికారులు ట్రెజరీ నుంచి అడ్వాన్స్‌గా డ్రా చేశారు. నూనె కొనుగోలు కోసం రూ.75 లక్షలు డ్రా కోసం అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌కు ప్రతిపాదించారు. కలెక్టర్ అనుమతితో ఆ నిధులను డ్రా చేశారు. అయితే.. ఇప్పటి వరకు నూనె కొనుగోలు కోసం ఏపీ ఆయిల్ ఫెడ్‌కు చెల్లించకపోవడం గమనార్హం. ఆ నిధులను అంగన్వాడీలకు కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ శాఖ కమిషనర్ కార్యాలయం అధికారులపై ఇందుకు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కోడిగుడ్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరవుతుంటాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సబల నిధులను కోడిగుడ్ల కాంట్రాక్టర్లకు చెల్లించాలనే యత్నాలు ఏ విధంగా సబబన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్ల నుంచి ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో పనిచేసే అధికారులకు, వివిధ ప్రాజెక్టుల సీడీపీవోలకు భారీగా కమీషన్లు ముడుతుండడంతోనే ఈ నిధులు మళ్లించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే కమిషనర్ కార్యాలయం అధికారులు దీనికి అంగీకరించడం లేదని సమాచారం. అడ్వాన్స్‌గా డ్రా చేసిన డబ్బులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కలెక్టర్‌కు ప్రతిపాదించిన దానిలో నూనె కొనుగోలు చేస్తామని చెప్పిన అధికారులు ఆ నిధులను తమ కమీషన్ల కక్కుర్తి కోసం కోడిగుడ్ల కాంట్రాక్టర్‌కు చెల్లించాలని చూడ్డం విస్తుకలిగిస్తోంది. ఐసీడీఎస్‌కు చైర్మన్‌గా ఉన్న కలెక్టర్‌నే ఈ వ్యవహారంలో ఐసీడీఎస్ అధికారులు తప్పుతోవ పట్టించారు. ఇప్పుడు ఆ నిధులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయడమంటే కలెక్టర్ వరకు వ్యవహారం వెళ్తుందని వారిలో గుబులు మొదలైంది. సబల నిలిపివేత.. సబల పథకం నిలిపివేస్తున్నట్లు మే 5న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి జిల్లా అధికారులకు సమాచారం అందింది. ఈ పథకాన్ని ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల్లో అమలు చేస్తుండగా తాజాగా నిలిపివేశారు. కిశోర బాలికలకు ప్రతినెలా 3 కిలోల బియ్యం, కేజీ కంది పప్పు, అరకిలో నూనె, 16 కోడిగుడ్లను అందజేసేవారు. ప్రతి లబ్ధిదారుడికి రోజూ రూ.5 విలువైన సరుకులను నెల కోసం అందిస్తారు. 11 నుంచి 18 ఏళ్ల వయసుగల బడిబయట పిల్లలు సుమారు 1.23 లక్షల మందికి లబ్ధి చేకూర్చే ఈ పథకాన్ని నిలిపివేశారు. పథకం నిలిచిపోతుందని తెలిసే జిల్లా యంత్రాంగాన్నే తప్పుతోవ పట్టించి పీడీ కార్యాలయంలో పనిచేసే కొంత మంది ఉద్యోగులు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి నిధులను అడ్వాన్స్‌గా డ్రా చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో ఐసీడీఎస్ పీడీ మీరా బెనర్జీని ‘సాక్షి’ వివరణ కోరగా మార్చి నెలలో సబలకు సంబంధించిన రూ.75.76 లక్షలను నూనె కొనుగోలు కోసం ట్రెజరీ నుంచి విడుదల చేసినట్లు తెలిపారు. వీటిని తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తామని వివరించారు. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని, కమిషనర్ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా తాము వ్యవహరిస్తామని చెప్పడం కొసమెరుపు. -
‘అంగన్వాడీ’ వేతనాలు పెంపు
హైదరాబాద్: సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్)లో పని చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, సహాయకులకు గౌరవ వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వేతన పెంపుతో పాటు వర్కర్లు, హెల్పర్లు నిర్వహించాల్సిన విధులు, బాధ్యతలు, క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. మార్చి ఒకటో తేదీ నుంచే వేతన పెంపు అమల్లోకి వస్తుందని, వేతనాలను నేరుగా బ్యాంకు ఖాతాలకే జమ చేయాలని సీడీపీవోలను ప్రభుత్వం ఆదేశించింది. ఏడాదికి 12 క్యాజువల్ సెలవులతో పాటు ప్రత్యేక పరిస్థితుల్లో సెలవు అవకాశాలను కూడా కల్పించింది. కాగా, ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతలకు ఒకపూట ఆహారాన్ని అంగన్వాడీల్లోనే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అంగన్వాడీల్లో అందిస్తున్న ఆహార పరిమాణాన్ని, ధరలను పెంచుతూ ప్రభుత్వం మరో ఉత్తర్వును జారీ చేసింది. ప్రతిరోజూ ఒక్కో వ్యక్తికి అందించే ఆహార పరిమాణం పెంచడంతో పాటు ప్రస్తుతం వ్యయాన్ని రూ.15 నుంచి రూ.21 కు పెంచింది. అంగన్వాడీల్లో విధులిలా.. అంగన్వాడీ కేంద్రాల్లో వర్కర్లకు 24 రకాలు, హెల్పర్లకు 7 రకాల విధులను సూచిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అంగన్వాడీ కేంద్రాన్ని ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలి. చిన్నారులకు ఉడకబెట్టిన గుడ్లను ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు పంపిణీ చేయాలి. ప్రత్యేక రోజుల్లో బాలామృతం, 8 గుడ్లు ఇవ్వాలి. ఇమ్యునైజేషన్, డీవార్మింగ్ నిమిత్తం ఏఎన్ఎంలు, ఆశావర్కర్లను భాగస్వాములు చేయాలి. ఐసీడీఎస్ వేదికల (ఐజీఎంఎస్‌వై, ఆర్ ఎస్బీకే,కేఎస్‌వై.. తదితర)తో సమన్వయం చేసుకోవాలి. అంగన్వాడీ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, పరిశుభ్రమైన ఆహారాన్ని పంపిణీ చేయాలి. చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు తీసుకురావాలి. అంగన్వాడీ వర్కర్లు చెప్పిన విధులను నిర్వహించాలి. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలనైనా నిర్వహించేందుకు వర్కర్లు, హెల్పర్లు సిద్ధంగా ఉండాలి. -
మైనర్ వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
ముషీరాబాద్ (హైదరాబాద్) : ఓ మైనర్‌కు పెళ్లి జరుగుతుందన్న విషయం తెలుసుకున్న అధికారులు ఆ పెళ్లిని అడ్డుకుని బాలికను సంరక్షణ కేంద్రానికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ అడిక్‌మెట్ డివిజన్ గణేష్‌నగర్‌లో నివసించే రాములు, సునీతల కూతురు హేమలత(16) వివాహం.. శంకర్‌పల్లికి చెందిన జంగయ్య, కళావతిల కుమారుడు నరేష్‌తో శుక్రవారం అడిక్‌మెట్ డివిజన్లోని లలితానగర్ కమ్యూనిటీ హాల్లో జరుగుతుంది. పెళ్లి మండపంపై పెళ్లి కుమారుడు నరేష్ వేచి ఉన్నాడు. అయితే పెళ్లి కూతురు హేమలతకు 16 సంవత్సరాలే ఉన్నాయని బాలిక సంరక్షణ విభాగం (ఐసీడీఎస్) సూపర్వైజర్ హంసవేణికి కొందరు ఫిర్యాదు చేయగా వెంటనే సమీపంలోని నల్లకుంట పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించి హుటాహుటిన ఆమె పెళ్లి మండపానికి వచ్చారు. అయితే అప్పటికీ పెళ్లి కూతురు పెళ్లి మండపానికి చేరుకోకపోవడంతో అధికారులే స్వయంగా గణేష్‌నగర్‌లో గల పెళ్లి కూతురు ఇంటికి వెళ్లి ఆమెను వారితోపాటు తీసుకెళ్లారు. నింబోళి అడ్డాలోని బాలిక సంరక్షణ కేంద్రానికి పంపారు. దీంతో పీటలపై పెళ్లి ఆగిపోయింది.