అంగన్‌వాడీలకు పాల సరఫరా | milk supply to Anganwadi | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలకు పాల సరఫరా

Published Thu, Nov 17 2016 2:21 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM

అంగన్‌వాడీలకు పాల సరఫరా - Sakshi

అంగన్‌వాడీలకు పాల సరఫరా

సారవకోట : జిల్లాలో అన్నా అమృత హస్తం అమలు జరుగుతున్న ఐసీడీఎస్ ప్రాజెక్టులకు మంగళవారం పాల ప్యాకెట్లు సరఫరా అయ్యారుు. జిల్లాలో ఇచ్ఛాపురం, మందస, సారవకోట, కొత్తూరు, సీతంపేట, పాలకొండ, వీరఘట్టం ప్రాజెక్టులలో ఈ అన్నా అమృత హస్తం పథకం అమలు జరుగుతంది. ప్రాజెక్టు పరిధిలో ఉన్న గర్భిణులు, బాలింతలకు రోజుకు 200 మిల్లీ లీటర్ల పాలను అందించేందుకు వీలుగా పాలు సరఫరా అయ్యారుు.   

 వీటిని ఆయా ప్రాజెక్టుల పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలకు ప్రతీ రోజు 200 మిల్లీ లీటర్ల పాలను కేంద్రాలలో అందించాలి. ప్రస్తుతం కేంద్రాలకు ఒక లీటర్ ప్యాకెట్లు మంజూరయ్యారుు. ఇది వరకు స్వయంశక్తి సంఘాల ద్వారా పాలను కొనుగోలు చేసి అంగన్‌వాడీ కేంద్రాలకు అందించే వారు. ఈ పద్ధతి సక్రమంగా నడవక పోవడంతో ప్రభుత్వం నేరుగా కాంట్రాక్టర్ల ద్వారా కేంద్రాలకు అందజేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement