సాక్షి, అమరావతి: అంగన్‌వాడీ వర్కర్లకు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మాదిరిగా రాష్ట్రంలో వేతనాలను పెంచనందుకు సిగ్గుగా లేదా? అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
విజయనగరంలో తమ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్‌వాడీ వర్కర్లపై లాఠీచార్జి చేయడాన్ని మంగళవారం వైఎస్ జగన్ ట్వీటర్‌లో తీవ్రంగా ఖండించారు. ‘తమ హక్కుల సాధన కోసం విజయనగరంలో ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లపై జరిగిన పాశవికమైన లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబూ.. మీరు మహిళా సాధికారత గురించి మాట్లాడతారు. మళ్లీ వారిపై తీవ్ర అణచివేత చర్యలకు ఒడిగడతారు. తెలంగాణలో మాదిరిగా అంగన్‌వాడీ వర్కర్ల వేతనాలు పెంచనందుకు మీకు సిగ్గుగా లేదా?’అని జగన్ ట్వీటర్‌లో పేర్కొన్నారు.
Strongly condemn brutal lathi charge on Anganwadi workers agitating for their rights at Vizianagram. @ncbn, you speak of women empowerment, yet you resort to oppressive measures against them. Aren't you ashamed of failing to provide them with enhanced wages, as done in Telangana?
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 24, 2018
Comments
Please login to add a commentAdd a comment