పాపను శిశుగహ సిబ్బందికి అప్పగిస్తున్న తల్లిదండ్రులు
చట్టవిరుద్ధంగా దత్తత తీసుకుంటే చర్యలు తప్పవని ఐసీడీఎస్ పీడీ ఎ.ఇ.రాబర్ట్స్ అన్నారు. గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన కె. శంకర్‌రావు, లక్ష్మి దంపతులు మగ పిల్లవాడి కోసం నిరీక్షించి ఐదో కాన్పులో కూడ ఆడపిల్ల జన్మించడంతో ఆ బిడ్డను విజయనగరంలోని సూర్యకాంతం అనే మధ్యవర్తి ద్వారా విశాఖపట్నానికి చెందిన పి.మహాలక్ష్మి అనే మహిళకు అనధికారికంగా ఇచ్చేశారు.
ఐసీడీఎస్ పీడీ రాబర్ట్స్
విజయనగరం ఫోర్ట్: చట్టవిరుద్ధంగా దత్తత తీసుకుంటే చర్యలు తప్పవని ఐసీడీఎస్ పీడీ ఎ.ఇ.రాబర్ట్స్ అన్నారు. గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన కె. శంకర్‌రావు, లక్ష్మి దంపతులు మగ పిల్లవాడి కోసం నిరీక్షించి ఐదో కాన్పులో కూడ ఆడపిల్ల జన్మించడంతో ఆ బిడ్డను విజయనగరంలోని సూర్యకాంతం అనే మధ్యవర్తి ద్వారా విశాఖపట్నానికి చెందిన పి.మహాలక్ష్మి అనే మహిళకు అనధికారికంగా ఇచ్చేశారు. విషయం తెలుసుకున్న డీసీపీయూ అధికారులు గజపతినగరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ పాపను పోలీసులు సోమవారం రాత్రి రప్పించి శిశుగహలో పెట్టారు. మంగళవారం పాప తల్లిదండ్రులు ఐసీడీఎస్ కార్యాలయానికి వచ్చారు. పాపను బాలల సంక్షేమ కమిటీ, ఐసీడీఎస్ పీడీ ముందు డీసీపీయూ అధికారులు ప్రవేశ పెట్టారు. పాపను పెంచుకోలేమని తల్లిదండ్రులు చెప్పగా శిశుగహలో ఉంచాలని బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ కేసలి అప్పారావు, పీడీ రాబర్ట్స్ ఆదేశించారు. కార్యక్రమంలో డీసీపీయూ బి.హెచ్.లక్ష్మి, యాళ్ల నాగరాజు, స్వామినాయుడు, చలం తదితరులు పాల్గొన్నారు.