
సాక్షి, కొవ్వూరు: ఐసీడీఏస్ కొవ్వూరులోని లిటరి క్లబ్‌లో పోషక పదార్థాలు కలిగిన తినుబండారాల స్టాల్‌ను నిర్వహించింది. ఓఎన్‌జీసీ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ స్టాల్‌లో ఐసీడీఎస్ వివిధ రకాల పోషకాహర పదార్థాలను ఏర్పాటు చేసింది. గర్భిణి స్ర్తీలకు, పిల్లలకు పోషక పదార్థాలు అందేలా చూసి, వారికి అవగాహన కల్పించడంమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. మంత్రి తానేటి వనిత స్టాల్స్‌ను సందర్శించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే అంగన్‌వాడి విద్యార్థులకు తన చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించి ఆనంతరం ఆమె పిల్లలకు స్కూల్ బ్యాగ్‌లను, పలకలను పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment