West Godavari Dist
-
రేడియో ద్వారా రైతులకు వ్యవసాయ శిక్షణ
-
పోలవరం ప్రాజెక్ట్‌లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం
సాక్షి, పశ్చిమగోదావరి: పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణం తుది దశకు చేరుకుంటోంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రాజెక్టును ఎట్టి పరిస్ధితుల్లోనూ పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణ సంస్ధ మేఘా ఇంజనీరింగ్ చకచగా పనులు పూర్తిచేస్తోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్ట్‌లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 42.5 మీటర్ల ఎత్తులో కాపర్ డ్యామ్ నిర్మాణాన్ని ఇంజనీరింగ్ అధికారులు పూర్తి చేశారు. ఈ ఏడాది స్పిల్‌వే నుంచి 14 గేట్ల ద్వారా నీటి తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్పిల్ వే చానల్ పనులు పూర్తయ్యాయి. పోలవరం వరద నీరు మళ్లింపు మొదలు సహజసిద్ధంగా వెళుతున్న గోదావరి నదిని అధికారులు మూసివేయడంతో వరద నీరు దిశ మారనుంది. గోదావరి నదీ ప్రవాహాన్ని ఎడమవైపు నుంచి కుడివైపుకు అధికారులు మళ్లిస్తున్నారు. పోలవరం స్పిల్‌వే నుంచి ఈ వర్షాకాలంలో వరద నీరు మళ్లించేందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ యేడాది 14 గేట్ల ద్వారా ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి గోదావరి నదీ ప్రవాహాన్ని తరలించనున్నారు. స్పిల్‌వే ద్వారా నీటి తరలింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
ఏలూరు ఘటన: క్రమంగా తగ్గుతున్న కేసులు..
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య ఇప్పటివరకు 270కి చేరింది. అస్వస్థతకు గురైన బాధితులు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఇప్పటివరకు 117 మందిని డిశ్చార్జ్ చేశామని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం పదిమందిని అధికారులు విజయవాడ తరలించారు. బాధితులకు వైద్యసిబ్బంది అలుపెరగకుండా సేవలు అందిస్తున్నారు. (చదవండి: భయపడవద్దు.. అండగా ఉంటాం: ఆళ్ల నాని) లక్షణాలు కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. వైద్య బృందం.. ఇంటింటికి ఆరోగ్య సర్వే చేపట్టింది. టెస్టుల కోసం శాంపిల్స్‌ను అధికారులు వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఫిట్స్ లక్షణాలతో చేరిన బాధితులకు ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో అదనపు బెడ్లు ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంత్రి ఆళ్లనాని పర్యవేక్షణలో కలెక్టర్, అధికారులు చర్యలు చేపట్టారు. కంట్రోల్ రూమ్ ద్వారా కలెక్టర్.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. (చదవండి: ఏలూరు ఘటనపై సీఎం జగన్ ఆరా) డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సమీక్ష.. ఉదయం నుంచి క్రమంగా కేసులు తగ్గాయని మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఆదివారం సాయంత్రం కలెక్టర్, డీఎంహెచ్‌వో, వైద్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా కేసులు నమోదైన ప్రాంతాల్లో 108 వాహనాలు సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎం కార్యాలయం నుంచి గంట గంటకు ఇక్కడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని మంత్రి తెలిపారు. ‘‘నీరు, ఫుడ్ పాయిజన్ లాంటివి ఏమీ జరగలేదు. విజయవాడ ఎయిమ్స్ నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చింది. నిపుణుల బృందాలు కూడా ఏలూరు రానున్నాయి. ఎక్కువగా కేసులు నమోదైన ప్రాంతాల్లో వాలంటీర్లు సర్వే చేపట్టారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని రేపు(సోమవారం) సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శిస్తారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సీఎం సమీక్షిస్తారని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. -
ఆహాఏమిరుచి..అనరామైమరచి
సాక్షి, కొవ్వూరు (పశ్చిమ గోదావరి) : వర్షాకాలం వచ్చింది.. దాని వెంటే మొక్కజొన్న పొత్తులు వచ్చాయి. ఒక పక్క వర్షం కురుస్తుంటే మరో పక్క వేడి వేడి జొన్నపొత్తులు తింటుంటే ఆ మజానే వేరంటారు మొక్కజొన్న పొత్తుల ప్రియులు. ఏటా జులై నుంచి సెప్టెంబర్ వరకూ దొరికే మొక్కజొన్న పొత్తులకు మంచి గిరాకీ ఉంటుంది. రాష్ట్రంలో దొరికే మొక్కజొన్న పొత్తుల కన్నా దొమ్మేరు పొత్తుకు ఓ ప్రత్యేక రుచి ఉంటుంది. ఇక్కడ ఉండే నేల స్వభావంతో ఈ ప్రాంతంలో పండే మొక్కజొన్న పొత్తులు మంచి రుచిని కలిగి ఉంటాయి. స్థానికులకు ఉపాధి మొక్కజొన్నపొత్తుల సీజన్ పలువురికి ఉపాధిగా మారుతుంది. దొమ్మేరుతో పాటు దూర ప్రాంతాలకు సైతం పొత్తులు ఎగుమతి అవుతుండటంతో స్థానికులకు ఆదాయం సమకూరుతోంది. ఈ సీజన్లో ఇక్కడ రోడ్ల పక్కన దుకాణాలు ఏర్పాటు చేసుకుని పొత్తులు అమ్ముతూ జీవనం సాగిస్తారు. ఒక్కో దుకాణంలో వెయ్యి పొత్తుల వరకూ కాల్చి అమ్మి ఆదాయం పొందుతారు. ఈ ప్రాంతంలో దొరికే పొత్తులను హోల్‌సేల్‌గా కొని, దుకాణాల్లో కాల్చి రిటైల్‌గా అమ్ముతుంటారు. ఒక్కో పొత్తు ప్రస్తుతం రూ. 10 నుంచి రూ. 15 వరకూ సైజును బట్టి అమ్మకాలు జరుపుతున్నారు. అయితే ప్రస్తుతం ధరలు అధికంగా ఉండడంతో ఈ ధర గిట్టుబాటు కావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు ఎకరం మొక్కజొన్న చేను రూ.50 వేలు మొక్కజొన్న సీజన్ ప్రారంభం కావడంతో పొత్తులకు మంచి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఎకరం మొక్కజొన్న తోటకు రూ.50 వేల వరకూ వ్యాపారులు చెల్లించి రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇది చాలా మంచి రేటని రైతులు చెబుతున్నారు. అయితే గత ఏడాది తయారవుతున్న మొక్కజొన్న పొత్తును పురుగు ఆశించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దిగుబడి లేక కొనుగోలు చేసిన వ్యాపారులు సైతం నష్టాలను చవిచూశారు. దీంతో సాగు విస్తీర్ణం తగ్గడంతో ధరలు పెరిగాయని చెబుతున్నారు. ఈ ఏడాది దొమ్మేరు, పరిసర గ్రామాల్లో అతి తక్కువ సాగు ఉండడం దీనికి కారణం అని చెబుతున్నారు. ఏది ఏమైనా కేవలం వర్షాకాలంలో దొరికే దొమ్మేరు ప్రాంతంలోని మొక్కజొన్న పొత్తును ఒక్కసారైనా రుచి చూడాలని ఈ ప్రాంతం మీదుగా వెళ్లే ప్రయాణికులు, ప్రజలు భావిస్తుంటారు. దొమ్మేరు మొక్కజొన్న పొత్తులకు భలే డిమాండ్ కొవ్వూరు మండలం దొమ్మేరులో మొక్కజొన్న పొత్తుల దుకాణాలు -
అక్షరాభ్యాసం చేయుంచిన మహిళా మంత్రి
సాక్షి, కొవ్వూరు: ఐసీడీఏస్ కొవ్వూరులోని లిటరి క్లబ్లో పోషక పదార్థాలు కలిగిన తినుబండారాల స్టాల్‌ను నిర్వహించింది. ఓఎన్జీసీ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ స్టాల్లో ఐసీడీఎస్ వివిధ రకాల పోషకాహర పదార్థాలను ఏర్పాటు చేసింది. గర్భిణి స్ర్తీలకు, పిల్లలకు పోషక పదార్థాలు అందేలా చూసి, వారికి అవగాహన కల్పించడంమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. మంత్రి తానేటి వనిత స్టాల్స్‌ను సందర్శించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే అంగన్వాడి విద్యార్థులకు తన చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించి ఆనంతరం ఆమె పిల్లలకు స్కూల్ బ్యాగ్‌లను, పలకలను పంపిణీ చేశారు. -
విద్యార్థుల ప్రతిభ.. ఆకట్టుకుంటున్న సృజన!
నేటితరం విద్యార్థులు కేవలం మార్కుల సాధనకేకాకుండా చదువుకుంటూనే వివిధ రకాల ప్రాజెక్టుల తయారీపై దృష్టిపెడుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చే వివిధ రకాల పరికరాలను తయారుచేస్తూ అబ్బురపరుస్తున్నారు. ప్రధానంగా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో వినూత్న తరహా ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు. దీనికిగాను ఆయా కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సాహం ప్రశంసనీయం. పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామంలోని భీమవరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ఆకట్టుకుంటున్నాయి. సాక్షి, భిమవరం(పశ్చిమ గోదావరి) : హార్ట్‌బీట్ మానిటరింగ్ సిస్టమ్, స్మార్ట్ సెక్యూరిటీ ఆలర్ట్ ఫర్ హెవికల్స్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్, స్మార్ట్ రిజర్వాయర్ సిస్టమ్ వంటివి ఎన్నో ప్రాజెక్టులను భీమవరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు తయారు చేశారు. కళాశాలలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సహకారంతో రేయింబవళ్లు విద్యార్థులు తమ మేథస్సును ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతో తయారుచేసిన పలు ప్రాజెక్టులకు మరింత మెరుగుపర్చి వినియోగంలోకి తీసుకువస్తే ధనికులకేకాకుండా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ప్రస్తుతం ఈవీఎంలు మొరాయిస్తున్న కారణంగా ఎన్నికల పోలింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనికి తోడు ఓటరు గుర్తింపు కార్డులను పరిశీలించడం మరికొంత ఆలస్యానికి కారణం. దీనిని అధిగమించడానికి ఈసీఇ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న పి నిర్మల, వి సాయిభారతి, పి వెంకటలక్ష్మి, బి హిమసాయి తయారుచేసిన ఎలక్ట్రానిక్స్ ఓటింగ్ సిస్టమ్ ఎంతగానో దోహదపడుతుంది. దీని ద్వారా ఓటింగ్ త్వరితగతిని పూర్తిచేయించడమేకాక సిబ్బంది సంఖ్యను కూడా ఘననీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది. హార్ట్‌బీట్ మానిటరింగ్ సిస్టమ్ కళాశాలలోని ఈసీఈ డిపార్ట్మెంట్కు చెందిన విద్యార్థులు వై రోహిత్, కె హరిలత, కె శివ, బి దేవి కేవలం రూ.2,500 వ్యయంతో తయారుచేసిన హార్ట్‌బీట్ మానిటరింగ్ సిస్టమ్ ఆకట్టుకుంటోంది. దీని ద్వారా ఆసుపత్రులు, నివాసాల్లో సైతం రోగుల హార్ట్‌బీట్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ప్రధానంగా వృద్ధులు ఒంటరిగా ఉన్నప్పుడు దీనిని ఉపయోగించుకోవడం ఎంతో సులువు. తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ యంత్రాన్ని అన్ని వర్గాల ప్రజలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్ రిజర్వాయర్ సిస్టమ్ ఈసీఈ తృతీయ సంవత్సరం విద్యార్థిని జి సుప్రియ నేతృత్వంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఎస్ జ్యోతిక, సీహెచ్ సాయి మహేష్, పి లలిత రూ.3 వేల వ్యయంతో రూపొందించిన స్మార్ట్ రిజర్వాయర్ సిస్టమ్ ద్వారా రిజర్వాయర్లు, డ్యామ్‌లలో నీటి పరిమాణాన్ని గుర్తించే వీలుంటుంది. నివాసాల వద్ద ఏర్పాటుచేసుకునే వాటర్ ట్యాంక్లులో నీరు నిండిన సమయంలో ఈ సిస్టమ్ ద్వారా ఆలారమ్ మోగుతుంది. తద్వారా నీటి వృథాను అరికట్టవచ్చు. వెహికల్స్ అలర్ట్ నేటి ఆధునిక యుగంలో అన్ని వయస్సులవారు వాహనాలను యథేచ్చగా వినియోగిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలకు గురై అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోతున్ననవారు కొందరైతే, సకాలంలో వైద్యం అందక తుదిశ్వాస విడిచేవారు మరికొందరు. అయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు సీహెచ్ సంతోష్, బి దేవిశ్రీ, వి థామస్, వై లోకేష్, ఎన్ శరత్ తయారుచేసిన స్మార్ట్ సెక్యూరిటీ అలర్ట్ ఫర్ వెహికల్స్ సిస్టమ్ ద్వారా మోటారుసైకిల్స్, కార్లు నడిపే సమయంలో హెల్మ్‌ట్, సీట్‌బెల్ట్ ధరించకపోయినా, మద్యం సేవించి డ్రైవింగ్ చేసినా స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేసిన పద్ధతి వల్ల వెంటనే సదరు కుటుంబ సభ్యులకు మెసేజ్ వెళ్తుంది. ఎక్కడైనా ప్రమాదం జరిగినా క్షణాల్లో తెలుస్తుంది. తద్వారా ప్రమాదం జరిగి వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చును. దీనిని కేవలం రూ.4 వేల వ్యయంతో రూపొందించారు. చదువుతో పాటు ప్రయోగాలు మా కళాశాలలో విద్యనేర్చుకోవడంతో పాటు సరికొత్త అంశాలపై ప్రయోగాలను చేస్తున్నాం. దీని ద్వారా కేవలం ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూడనవసరం లేకుండా సొంతంగా చిన్న కంపెనీ ఏర్పాటు చేసుకుని మరొక పదిమందికి ఉపాధి అవకాశం కల్పించవచ్చును. –జి.సుప్రియ, ఈసీఈ విద్యార్థి కళాశాల యాజమాన్యం ప్రోత్సహిస్తోంది కళాశాలలో విద్యాబోధనతో సమానంగా వివిధ రకాల ప్రాజెక్టుల రూపకల్పనకు యాజమాన్యం ఎంతగానో అవకాశం కల్పిస్తోంది. సొంతంగా ప్రాజెక్టులు తయారు చేయడం వల్ల చదువు పూర్తయిన తరువాత వివిధ ఆంశాలపై అవగాహన ఉండడంతో ఎక్కడ ఉద్యోగంలో చేరినా కష్టం లేకుండా పనిచేసుకునే అవకాశం ఉంటుంది. –పి.నిర్మల, విద్యార్థిని మాలో మాకే పోటీ ప్రాక్టికల్స్ వల్ల ఎక్కువ ప్రయోజనం బట్టిపట్టే విద్యకంటే ప్రాక్టికల్స్ ద్వారా ఎక్కువ విజ్ఞానాన్ని గ్రహించవచ్చు. మా కళాశాలలో వివిధ రకాల ప్రాజెక్టులను తయారు చేసే విద్యార్థులకు మంచి ప్రోత్సహం లభిస్తోంది. అందువల్లనే తక్కువ ఖర్చుతో ప్రజలకు ఎక్కువ ఉపయోగకకరంగా ఉండే వివిధ రకాల ప్రాజెక్టుల తయారీలో విద్యార్థులం పోటీ పడుతున్నాం. –సీహెచ్ సంతోష్, విద్యార్థి -
అక్రమ లేఅవుట్లపై అధికారుల కొరడా
సాక్షి, నరసాపురం(పశ్చిమ గోదావరి) : పట్టణంలో నాలుగేళ్లపాటు విచ్చలవిడిగా సాగిన అక్రమ లేఅవుట్ల వ్యాపారంపై మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. రెండు రోజుల నుంచి అనధికార లేఅవుట్లలో వేసిన రోడ్లు ధ్వంసం చేస్తున్నారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పుడుతోంది. రియల్ఎస్టేట్ దందాలో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలే ఉండటం విశేషం. ప్రస్తుతం వేస్తున్న అక్రమ లేఅవుట్లే కాకుండా, ఇప్పటికే అమ్మకాలు సాగించిన అనధికార లేవుట్లపైనా అధికారులు దృష్టిపెట్టారు. నిజానికి నాలుగేళ్లుగా మున్సిపల్ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించారు. దీంతో ఏకంగా రూ.500 కోట్ల వరకూ రియల్ఎస్టేట్ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగినట్టు అంచనా. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పట్టణంలో జరిగిన అవినీతి, అక్రమాలపై దృష్టిపెట్టారు. ముఖ్యంగా మూడురోజుల క్రితం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన అనధికార లేఅవుట్లు, మున్సిపల్ రిజర్వ్ స్థలాల ఆక్రమణలు వంటి అంశాలను ఉపేక్షించనని హెచ్చరించారు. దీంతో అధికారుల్లో చలనం వచ్చింది. దాదాపు 120 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు పట్టణంలో దాదాపుగా 120 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు గత నాలుగేళ్ల కాలంలో వేశారు. రోడ్డుపక్కన పెద్దపెద్ద ఆర్చిలు కట్టి తమను ఎవరు అడ్డుకుంటారనే విధంగా రెచ్చిపోయారు. పట్టణంలోని స్టేషన్‌పేట, గ్రేస్‌నగర్, చినమామిడిపల్లిలోని సాయిబాబాగుడి ఎదురుగా తోటలో ఎకరాలకు ఎకరాలు భూములు పూడ్చారు. ఇక పీచుపాలెం, థామస్ బ్రిడ్జిప్రాంతం , జవదాలవారిపేట, పొన్నపల్లి, ఎన్టీఆర్కాలనీ , నందమూరి కాలనీ, రుస్తుంబాద ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లు ఇష్టానుసారం వేసేశారు. మున్సిపల్ ప్రజాప్రతినిధులకు, అధికారులకు లక్షల్లో మామూళ్లు ముట్టాయి. తమతమ వార్డుల్లో జరుగుతున్న లేవుట్ల వ్యవహారంలో కొందరు కౌన్సిర్లు కూడా ప్రధాన భూమిక పోషించారని విమర్శలు ఉన్నాయి. ముందుగా సంబంధిత కౌన్సిలర్లతో రియలర్టర్లు మట్లాడేసుకుంటే , ఈ విషయంలో కౌన్సిల్ సమావేశాల్లో గొడవలు చేయడం, అధికారులపై ఒత్తిడి తేవడం లాంటివి లేకుండా సాఫీగా చేసుకుపోయారనే విమర్శలు ఉన్నా యి. మొత్తంగా నాలుగేళ్లపాటు మున్సిపాలిటీ ఖజానాకు ఒక్క రూపాయి కూడా దక్కకుండా సాగిన ఈ అక్రమ దందాకు ప్రభుత్వం మారడంతో కళ్లెం పడింది. అనధికార లేఅవుట్లలోనూ అక్రమాలే.. కేవలం అనధికార లేఅవుట్లలోనే కాకుండా, అధికార లేవుట్లలోనూ అక్రమాలు యథేచ్ఛగా సాగిపోయాయి. చినమామిడిపల్లిలో ఓ లేవుట్‌కోసం కమర్షియల్ ప్రాంతాన్ని క్షణాల్లో గృహనివాస ప్రాంతంగా మార్పు చేశారు. ఇక ఈ లేఅవుట్ జనానికి బాగా కనిపించడం కోసం, ఇటువైపు ప్రభుత్వ స్థలంలో కాలువగట్టున ఏళ్ల తరబడి పెంచిన మొక్కలను, చెట్లను నరికేసి అధికారులు సహకరించారు. ఇదే ప్రాంతంలో రైల్వేగేట్ సమస్యకు పరిష్కారంగా మురుగుకాలువపై వంతెన నిర్మించాల్సి ఉంది. అయితే ఆ వంతెన కట్టలేకపోతున్నారు గానీ, ఇదే కాలువపై లేవుట్ల కోసం మాత్రం మూడుచోట్ల వంతెనలు కట్టేశారు. ఇక పట్టణ ంలో అపార్టుమెంట్లు కూడా నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. అనధికార లేవుట్లపై చర్యలు తీసుకుంటున్నాం పట్టణంలో అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకుంటున్నాం. అనధికార లేవుట్లను గుర్తించి ఆ స్థలాలను కొనొద్దని సర్వే నంబర్లతో సహా పట్టణంలో బోర్డులు పెట్టాం. ప్రస్తుతం అక్రమ లేఅవుట్లను ధ్వంసం చేస్తున్నాం. ఇది కొనసాగుతోంది. – వి.చంద్రశేఖర్, టీపీఓ, నరసాపురం -
పోడు కత్తి
పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో దశాబ్దాల కాలం నుంచి పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న పలువురు సన్న, చిన్నకారు గిరిజన రైతులకు పెద్ద సమస్య వచ్చిపడింది. భూములకు పట్టాలివ్వాలని రైతులు ఆందోళన చేస్తుంటే.. ‘అసలు వారు ఆ భూములకు హక్కుదారులుకారు.. వారిని భూముల నుంచి తొలగించాలి’ అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ఆదివాసీలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సాక్షి, బుట్టాయగూడెం(పశ్చిమ గోదావరి) : 2005లో అటవీ హక్కుల చట్టం వచ్చింది. ఆ సమయంలో సుమారు 15 వేల మందికిపైగా నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భూములు పంచి పట్టాలిచ్చారు. ఆయన మరణం తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి పట్టాలు రాలేదు. గ్రామ సభలు సక్రమంగా జరగకపోవడం వల్ల దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయిందని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల రిటైర్డ్ ఫారెస్ట్ ఉద్యోగి, వన్యప్రాణి సంరక్షణకు చెందిన కొందరు ప్రతినిధులు సుప్రీంకోర్టులో అటవీ సంరక్షణపై కేసు వేశారు. దీంతో 2005 అటవీ హక్కుల చట్టం తర్వాత వచ్చిన క్లెయిమ్స్‌ను తిరస్కరించడంతోపాటు ఆ భూముల నుంచి గిరిజనులను ఖాళీ చేయించేందుకు 2019 జులై 27వ తేదీని గడువుగా సుప్రీం కోర్టు ప్రకటించింది. పట్టాలివ్వాలని ఆందోళన పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులను తరిమేయడం సరికాదని, వారికి పట్టాలిచ్చి న్యాయం చేయాలని గిరిజన, ప్రజా సంఘాల నాయకులు, గిరిజనులు కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేస్తూ వస్తున్నారు. అయితే సమయం దగ్గర పడుతున్నందున తమ పరిస్థితి ఏంటని గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోడు భూమే తమకు జీవన ఆధారమని, అదికాస్తా పోతే తమ బతుకులు ఛిద్రమవుతాయని ఆదివాసీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోడు భూముల పట్టాల వ్యవహారాలకు సంబంధించి గ్రామసభలు నిర్వహించి వాటిని సాగు చేస్తున్న రైతులు అటవీ హక్కుల చట్టానికి అర్హులాకాదా అని తేల్చాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారులు గ్రామ సభలను తూతూమంత్రంగా నిర్వహించారని గిరిజన సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లో వేలాది మంది పోడు భూములు సాగు చేసుకునేవారు ఉన్నప్పటికీ అధికారులు శ్రద్ధచూపకపోవడం వల్ల తీవ్రమైన నష్టాలు కలిగే అవకాశం ఉందని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సాగులో ఉన్న హక్కుదారులకు పట్టాలకు కల్పించకపోతే అనేక గిరిజన కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన తర్వాత వచ్చిన తీర్పు ప్రకారం జులై 27వ తేదీ నాటికి గ్రామ సభలను నిర్వహించి అర్హత ఉన్నవారికి తప్పనిసరిగా పట్టాలు ఇవ్వాలి. లేకుంటే భూముల నుంచి గిరిజనులను గెంటేసే అవకాశం ఉంది. అధికారులు చొరవ తీసుకొని గడువు దగ్గర పడుతున్నందున గిరిజనులకు న్యాయం చేయాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. జిల్లాలో 15 వేల ఎకరాల్లో పోడు భూమిసాగు జిల్లాలోని ఏజెన్సీ మండలాలతోపాటు టి. నర్సాపురం, చింతలపూడి, నల్లజర్ల, ద్వారకా తిరుమల మండలాల్లో సుమారు 15 వేల ఎకరాల్లో 5,738 మంది రైతులు పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్నట్లు సమాచారం. అయితే అటవీ హక్కుల చట్టంలో వీరంతా దరఖాస్తు చేసుకున్నా.. ప్రస్తుతం తిరస్కరణకు గురైనట్లు గిరిజన సంఘాల నాయకులు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రా>మసభలు నిర్వహించి రైతులు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలిస్తే పట్టాలిచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు గ్రామసభలు నిర్వహించకపోవడం వల్ల పోడు భూముల సాగుదారులు రోడ్డున పడే అవకాశం ఉందని చెప్పారు. -
తెలుగుదేశం పార్టీలో ముసలం..
సాక్షి , ఏలూరు : తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్ధం పుచ్చుకోగా, కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కాకినాడలో రహస్య సమావేశం నిర్వహించడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలైన కాపు సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు 14 మంది కాకినాడలో సమావేశం అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఇందులో జిల్లా నుంచి ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయం నేపథ్యంలో వీరు భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. తెలుగుదేశంలో కొనసాగాలా, లేక పార్టీ మారాలా అన్న విషయంపై చర్చ జరిపినట్లు సమాచారం. అందరూ ఒకే నిర్ణయంపై ఏ పార్టీలోనైనా చేరాలని భావిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం వీరు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంతో చర్చించిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారని సమాచారం. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై కూడా చర్చ జరిగింది. అయితే వారు మాత్రం తాము పార్టీ మారడం లేదని, ఎన్నికల్లో ఓటమి కారణాలపై చర్చించామని చెబుతున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుని ఓటమిపై చర్చించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు రాజ్యసభలో టీడీఎల్పీ బీజేపీలో విలీనం అయ్యింది. ఎంపీ సుజనా చౌదరి నేతత్వంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు గురువారం సాయంత్రం టీడీపీ లెజిస్లేటివ్ పార్టీనీ బీజేపీలో విలీనం చేస్తూ తీర్మానం లేఖను ఉప రాష్ట్రపతికి అందజేశారు. ఈ తీర్మానం ప్రతిపై ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి రాంమ్మోహన్రావు సంతకం చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, పార్టీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతా రామలక్ష్మి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. తెలుగుదేశం ఎంపీలతోపాటు సీతా రామలక్ష్మి కూడా బీజేపీలో చేరతారని వార్తలు వెలువడ్డాయి. అయితే చివరి నిముషంలో ఆమె తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుని వెనక్కి తగ్గారు. దీంతో టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో ప్రస్తుతానికి సీతా రామలక్ష్మితో పాటు రవీంద్రకుమార్ మాత్రమే మిగిలారు. తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు సర్వత్రా చర్చకు దారితీశాయి. -
ప్రభుత్వం మారినా కుర్చీలు వీడని టీడీపీ నేతలు
సాక్షి, దెందులూరు : వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడి మూడు వారాలు దాటినా నామినేటెడ్ పదవులను టీడీపీ నేతలు వదలటం లేదు. ఎన్నికల ముందు ప్రతిపక్షం హోదా కూడా దక్కదు.. వైఎస్సార్సీపీకి పుట్టగతులుండవు.. మళ్లీ వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అంటూ బీరాలు పలికి పందేలు కట్టి భుజాలు దాకా చేతులు కాల్చుకున్న వారు ఏం మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో అసలు ఏం చేయాలో తెలియక నానాటికీ నైతిక స్థైర్యాన్ని కోల్పోతున్నారు. ఒక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.. మరోవైపు తమగోడు చెప్పుకుందామంటే బూతద్దం పెట్టి వెతికినా చెప్పుకోవడానికి ఏ ఒక్క నాయకుడు గెలవలేదు. ఈ దశాబ్ధపు యోధుడు, ప్రజా నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి 3,648 కిలోమీటర్ల పాదయాత్ర, నవరత్న పథకాల రూపకల్పన ముందు గాలిలో సునామీ మాదిరిగా చాలెంజ్‌లు విసిరిన టీడీపీ నేతలంతా ఘోర ఓటమిని చవిచూశారు. అయితే దెందులూరు నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్ పదవి కాలం ముగిసింది. ఏఎంసీ డైరెక్టర్లు, పాఠశాలల ఎస్ఎంసీ కమిటీలు, వైద్యశాలల అభివృద్ధి కమిటీలు, నీటి సంఘాలు, దేవదాయ శాఖ దేవాలయాల అధ్యక్షులు, కమిటీ సభ్యులతో పాటు ఇతర నామినేటెడ్ పదవులను గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన టీడీపీ నేతలు నేటికీ ఆ పదవుల కుర్చీలను వదలటం లేదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రభుత్వం మారిన వెంటనే ఆ ప్రభుత్వ హయంలో నామినేటెడ్ పోస్టులన్నీ ముందస్తుగా స్వచ్ఛందంగా పదవుల్లో నియమితులైన నేతలు రాజీనామా చేయటం సంప్రదాయం. గతంలో ఏ ప్రభుత్వ శాఖకు అయినా అపవాదు లభిస్తే ఆ శాఖా మంత్రులు రాజీనామా చేసిన సంఘటనలు కోకొల్లలు. ఇందుకు భిన్నంగా సంప్రదాయాలు, ఆదర్శాలు, సంస్కృతిని అవహేళన చేస్తూ టీడీపీ నాయకులు కుర్చీలను పట్టుకు వేళాడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని, పార్టీ నాయకులను చులకనగా, హేళనగా, అగౌరవంగా మాట్లాడిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎలా కొనసాగుతారని గ్రామగ్రామాన ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు టీడీపీ ప్రభుత్వం ఘోర ఓటమి పాలవటంతో నేటికీ షాక్ నుంచి తేరుకోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు టీడీపీ రాజ్యసభ సభ్యులు కొందరు బీజేపీలోకి చేరడంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన ఉంది. ఎంపీలే భవిష్యత్తు కోసం దారి వెతుక్కుంటుంటే గ్రామ శివారు ప్రాంతాల్లో ఐదేళ్లపాటు ఒంటరిగా ఏ అండా లేకుండా ఎలా ఈదుతామన్న బలమైన వాదన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులతో పాటు కార్యకర్తలందరిలో స్పష్టంగా ఉంది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర పార్టీల్లో చేరితో టీడీపీ మొత్తం ఖాళీ అవటం ఖాయమని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానించటం గమనార్హం. తమ ప్రభుత్వంలో సైతం నామినేటెడ్ పదవుల్లో ఉన్న టీడీపీ నేతలు ఇంకా రాజీనామా చేయకపోవడం పట్ల వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. -
అమ్మో.. మధ్యాహ్న భోజనం..
సాక్షి, దేవరపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులను అర్థాకలితో ఉంచుతుంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేయాలంటే విద్యార్థులు భయపడిపోతున్నారు. సుమారు ఆరు నెలలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పలువురు విద్యార్థులు ఇంటి వద్ద నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. ఇంటి వద్ద భోజనం అందుబాటులో లేని విద్యార్థులు పాఠశాలలో పెడుతున్న భోజనం తిని అర్థాకలితో ఉంటున్నారు. ముతక రకం బియ్యం, రుచికరంగా లేని కూరలను విద్యార్థులకు సరఫరా చేయడం వల్ల తినడానికి విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. విద్యార్థులు తినకపోవడంతో చాలా పాఠశాలల్లో భోజనం నేలపాలవుతుంది. బుధవారం మెనూ ప్రకారం విద్యార్థులకు పప్పు, ఆకుకూర, కోడిగుడ్డు ఇవ్వవలసి ఉంది. అయితే విద్యార్థులకు పెట్టిన భోజనం చిమిడి ముద్దగా ఉండంతో పాటు సాంబరులాంటి పప్పు అందజేశారు. కోడిగుడ్డు పాడైపోయి దుర్వాసన రావడంతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. లక్ష్మీపురం పాఠశాలకు సరఫరా చేసిన భోజనం అధ్వానంగా ఉందని విద్యార్థులు తెలిపారు. చిమిడి ముద్దగా ఉన్న అన్నం, పలచని పప్పు, పాడైపోయిన కోడిగుడ్లు సరఫరా చేసినట్టు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం ముద్దగా ఉండి గట్టిగా ఉంటుందని, రుచికరంగా లేని కూరలతో అన్నం తినలేకపోతున్నామని విద్యార్థులు వాపోయారు. 2018 డిసెంబర్ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో డ్వాక్రా మహిళలు వంటలు చేసి విద్యార్థులకు అందజేసేవారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి వంట ఏజన్సీ మహిళలను తొలగించి ఢిల్లీకి చెందిన ఏక్తా శక్తి ఫౌండేషన్‌కు మధ్యాహ్న భోజనం సరఫరాను అప్పగించారు. గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల, గోపాలపురం, దేవరపల్లి మండలాలకు సంస్థ ద్వారా పాఠశాలలకు భోజనం సరఫరా చేస్తున్నారు. యర్నగూడెంలో భోజనాలు తయారుచేసి పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. అప్పటినుంచి మధ్యాహ్న భోజన పథకం గాడి తప్పింది. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితంలేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడిందని విద్యార్థులు విమర్శిస్తున్నారు. బడిలో భోజనం చేస్తుంటే కడుపులో నొప్పి వస్తుందని విద్యార్థులు అంటున్నారు. బుధవారం పల్లంట్ల పాఠశాలకు వెళ్లిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు విద్యార్థులు మధ్యాహ్న భోజనం గురించి మొరపెట్టుకున్నారు. అన్నం తినలేకపోతున్నామని, సన్న బియ్యం అన్నం, రుచికరమైన కూరలు సరఫరా చేయాలని విద్యార్థులు ఎమ్మెల్యేను కోరారు. దీనిపై ఎమ్మెల్యే వెంకట్రావు ఫోన్లో జిల్లా విద్యాశాఖ అధికారితో మాట్లాడారు. భోజనం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సహించనని, వెంటనే భోజనం సరఫరా చేస్తున్న ఏజన్సీతో మాట్లాడి నాణ్యతగల భోజనం సరఫరా చేయాలని సూచించారు. సమస్యను విద్యాశాఖా మంత్రి దృష్టికి తీసుకువెళతానని ఆయన అన్నారు. విద్యార్థులకు పెట్టే భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
ఒత్తిడి నుంచి ఉపశమనం..
సాక్షి, దెందులూరు: ఎట్టకేలకు పోలీసులకు వారంతపు సెలవు దొరికింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పోలీసులకు ఊరట కలిగించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పోలీసు శాఖలో 30 విభాగాలున్నాయి. క్షణం తీరికలేకుండా పగలు, రాత్రి, ఎండ, వాన అనకుండా 24 గంటలూ వి«ధినిర్వహణలో ఉండే ఏకైక ప్రభుత్వ శాఖ పోలీస్ శాఖ ఒక్కటే. వారంతపు సెలవు లేకపోవడంతో ఉద్యోగ రీత్య మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. తీవ్ర అనారోగ్యాలపాలవుతున్నారు. కుటుంబజీవితాన్ని కోల్పోతున్నారు. ఇన్ని అవాంతరాలు ప్రతికూల పరిస్థితులతో దశాబ్ధాలుగా అన్ని విభాగాల పోలీసులు ప్రజాసేవలో నిమగ్నమై ఒక్కోసారి విధుల్లోనే మృత్యువాతకు గురవుతున్నారు. మరికొందరు దేశ రక్షణ కోసం, మరికొందరు అల్లర్లలో ప్రాణాలు కోల్పోతున్నారు. పోలీస్ శాఖలో పోలీసుల పరిస్థితులు గుర్తెరిగి అధ్యయనంచేసి వారికి ఊరట కలిగించి కుటుంబసభ్యులతో ఒక రోజంతా గడిపేలా వీక్లీ ఆఫ్‌ను ప్రకటించారు. అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) డాక్టర్ రవిశంకర్ సీఎం ఆదేశాలను పోలీసులకు వీక్లీ ఆఫ్‌పై విధి విధానాలను వివరించారు. ఇప్పటికే విశాఖ, కడప జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వీక్లీఆఫ్‌ను అమలుచేస్తున్నామని, నేటి నుంచి అమలుచేసే ఈ విధానంవల్ల లోటు పాట్లు జరగకుండా పోలీసుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా వీక్లీ ఆఫ్ అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకోనున్నారు. దీంతో అన్ని విభాగాల పోలీసులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, మేధావులు, స్వచ్చంద సంస్థలు, విద్యావేత్తలు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. సీఎం, హోంశాఖ మంత్రి,డీజీపీలకు కృతజ్ఞతలు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వీక్లీ ఆఫ్లపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వటం వల్ల తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఒక రోజు విశ్రాంతి అనంతరం సిబ్బంది ఉత్తేజంగా తిరిగి విధుల్లో చేరి బాధ్యతలు నిర్వహిస్తారు. – కె ఈశ్వరరావు, జిల్లా ఏఎస్పీ పోలీసులందరికీ మేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన వీక్లీ ఆఫ్‌తో పోలీసులకి మేలు చేకూరుతుంది. సంవత్సరాల పాటు వారంతపు సెలవులు లేకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు వారంతపు సెలవుతో ఉపశమనం లభిస్తుంది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. – జి సూర్యనారాయన, సీఐ, వన్‌టౌన్, ఏలూరు మంచి ఆలోచన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహోన్నతమైన వ్యక్తి. వేలాది మంది ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు, భవిష్యత్తు పరిరక్షణకు చర్యలు తీసుకోవటమే కాకుండా చేసిన ఆలోచన కూడా మహోన్నతమైనది. పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. – ఎన్ఆర్ కిషోర్ బాబు, ఎస్సై సక్రమంగా అమలు చేయాలి పోలీసులకు మేలు చేసే నిర్ణయాన్ని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. వీక్లీ ఆఫ్ నిర్ణయాన్ని సక్రమంగా అమలు చేయాలి. అదే సమయంలో లోటుపాట్లపై ఉన్నతాధికారులు పర్యవేక్షించాలి. సమీక్షలు నిర్వహించాలి. – శ్రీను, కానిస్టేబుల్, దెందులూరు -
తింటే తంటాయే!
సాక్షి, పెదవేగి రూరల్: రోడ్ల పక్కన విక్రయించే చిరుతిళ్లు చూస్తుంటే నోరూరుతుంది. వాటిని తినాలని మనసు పీకుతుంది. జిహ్వచాపల్యానికి లోనై వాటిని తిన్నామా...అనారోగ్యం పాలుకాక తప్ప దు. దెందులూరు నియోజకవర్గంలో ప్రధాన గ్రామాల్లో వీధి పక్కన విక్రయించే చిరుతిళ్ల వ్యాపారం మూడు ప్లేట్లు ఆరు పార్శిళ్లుగా జోరుగా సాగుతోంది. గతంలో పట్టణాల్లో మాత్రమే కనిపించే ఈ వ్యాపారాలు ఇప్పుడు పల్లెలోనూ బాగా విస్తరించాయి. కంటికి ఇంపుగా...మసాలా గుమగుమలతో కూడిన ఆహారం ఆకట్టుకుంటుంది. న్యూడిల్స్, మంచూరియా, పానీపూరీ,చాట్మసాలాలు అబ్బో అనిపిస్తుంటాయి. వాటిని చూస్తుంటే తినాలనిపిస్తుంటుంది. అయితే వాటి తయారీలో ఎటువంటి నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదు. వాటిని తరచుగా తింటే అనారోగ్యం పాలు కాక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా ఆపరిశుభ్రమైన ఆహరాన్ని తింటే అమీబియాసిస్, మలబద్దకం తదితర సమస్యలు తలెత్తుతాయి. అంతేకాక వీటిని ఎక్కువగా తినేవారు ఊబకాయులుగా, లేకుంటే బక్కచిక్కడమో జరుగుతుందని పోషకాహార నిపుణులుచెబుతున్నారు. ఆకర్షితులవుతున్న యువత బజారులోని ఆహార వ్యాపారులు ఎక్కువగా కళాశాలలు, వసతిగృహలు, విద్యాసంస్థలు, జనం ఎక్కువగా సంచరించే జంక్షన్లలో దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలో పుట్‌పాత్‌లపైన, కళాశాలల ఎదురుగా ఉన్న ఈ బళ్లవద్ద 90 శాతం పైగా విద్యార్థులే కనిపిస్తుంటారు. పరిశుభ్రత నాస్తి విద్యార్థులు, యువత ఎక్కువగా ఇష్టపడే వీధి వంటకం పానీపూరీ చాట్, నీటితో నింపి ఇచ్చే క్రమంలో బ్యాక్టీరియా, ఫంగస్‌ను మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. పానీపూరీలో చాట్ నింపిన అనంతరం పూరీలను ప్రత్యేకంగా తయారయ్యే నీటితో ఉంచి వినియోగదారునికి అందిస్తుంటారు. ఈ క్రమంలో కనీస పరిశుభ్రత చర్యలు పాటించరు. ఈ క్రమంలో కనీస పరిశుభ్రత చర్యలు పాటించరు. వ్యాపారం జరిగే నాలుగైదు గంటల సమయం సదా వ్యాపారి చేతులు నీళ్లలో నానుతూనే ఉంటాయి. వేళ్ల సందుల్లో గోళ్ల మధ్య ప్రమాదకర క్యాండీడా ఫంగస్ చేరుతుంది. మురిగిపోయిన చాట్‌ను మరుసటి రోజు వినియోగిస్తుంటారు. చాట్‌లో బ్యాక్టీరియా, వైరస్ పోగు ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని గత ఏడాది హైదరాబాద్ కేంద్రగా జరిగిన ఏక్రాస్ సెక్షనల్ స్టడీ ఆన్ మైక్రోబయాజికల్ క్వాలిటీ ఆఫ్ స్పష్టం చేసింది. -
ఒక్కరే ఉండాలి...అది ఉన్నతాధికారే..
సాక్షి, ఏలూరు (మెట్రో): బాధ్యతలు స్వీకరించి వారం రోజులు కాకముందే వినూత్న పద్ధతులను అమలు చేస్తున్నారు కలెక్టర్ రేవు ముత్యాలరాజు. జిల్లాలో ఇప్పటికే ఉన్నతాధికారులందరితోనూ సమావేశాన్ని నిర్వహించిన కలెక్టర్ ప్రతి సోమవారం నిర్వహించే మీ కోసం కార్యక్రమంలోనూ మూస పద్ధతికి స్వస్తి పలికారు. సమూల మార్పులకు చర్యలు చేపట్టారు. సోమవారం వచ్చిందంటే జిల్లా అధికారులంతా మూకుమ్మడిగా కలెక్టరేట్లో మీ కోసం కార్యక్రమానికి వస్తారు. మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌కు ప్రజలు ఫిర్యాదులు చేస్తుంటే ఆ ఫిర్యాదులను కలెక్టర్ సంబంధిత శాఖాధికారులకు అప్పగించి వాటి పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేస్తుంటారు. ఇది ఇప్పటి వరకూ కొనసాగింది. అయితే కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఈ పద్ధతిని మానేయాలని అధికారులను ఆదేశించారు. కేవలం ప్రాధాన్యం కలిగిన అధికారులు మాత్రమే మీ కోసం కార్యక్రమానికి హాజరు కావాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఫిర్యాదులు రానీ, వచ్చినా అరకొరా వచ్చే శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు ఉన్న శాఖల అధికారులు మాత్రమే రావాలనీ, వచ్చిన ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కరే ఉండాలి... అదీ ఉన్నతాధికారే.. ఇప్పటివరకూ ప్రతి సోమవారం నిర్వహించే మీ కోసం కార్యక్రమానికి ఒక్కో శాఖ నుంచి ఇద్దరేసి అధికారులు హాజరవుతుండేవారు. వచ్చే సోమవారం నుంచి ప్రతి శాఖ నుంచి ఒక్కరు మాత్రమే మీ కోసం కార్యక్రమానికి హాజరు కావాలంటూ కలెక్టర్ ఆదేశాలిచ్చారు. వచ్చే అధికారి కూడా ఆ శాఖ ఉన్నతాధికారి అయి ఉండాలని స్పష్టం చేశారు. కిందిస్థాయి సిబ్బందిని పంపిస్తే వారిపై చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. అధికారులు ఎవరైనా జిల్లా దాటివెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా తన అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. తిప్పిపంపిన కలెక్టర్ ఫిర్యాదులు రాని శాఖలైన అగ్నిమాపక, రవాణా, చేనేత, ఆర్టీసీ, నెడ్‌క్యాప్, ఎల్డీఎం, జిల్లా మలేరియా, ఆడిట్, మహిళా కౌన్సిలర్ విభాగం, కమర్షియల్ టాక్స్ వంటి శాఖల అధికారులను కలెక్టర్ సోమవారం మీ కోసం కార్యక్రమం నుంచి తిప్పి పంపించేశారు. ఈ సమయాన్ని ఇతర పనులకు కేటాయించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అదించాలని కలెక్టర్ సూచించారు. ఫిర్యాదుదారులకు ఫోన్ ప్రతి సోమవారం వచ్చిన ఫిర్యాదులు పరిష్కారమయ్యాయా, కాలేదా, ఎందుకు కాలేదు వంటి వాటిపై ఇక నుంచి కలెక్టర్ ప్రత్యేకించి ప్రతి శుక్రవారం పరిశీలించనున్నారు. పరిష్కారమయ్యాయని అధికారులు చెప్పే అర్జీలను పునఃపరిశీలించనున్నారు. కలెక్టర్ అప్పటికప్పుడు ఏదో ఒక ఫిర్యాదుదారునికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అధికారుల్లో జవాబుదారీతనం పెంచేందుకు కలెక్టర్ ముత్యాలరాజు కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. ఉద్యోగుల కోసమూ ‘మీ కోసం’ ఉద్యోగుల సమస్యలనూ పరిష్కరించేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులతో మీ కోసం కార్యక్రమాన్ని ప్రతినెలా నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ ముత్యాలరాజు చెప్పారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తేనే ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలను ప్రతి ఉద్యోగి అందించగలుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. వీలైతే ఈనెల 21న ఉద్యోగుల మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని కలెక్టర్ ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. -
‘రూ.6 వేల కోట్లు స్వాహా చేశారు’
సాక్షి, పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సంబంధించి చంద్రబాబు పాత్ర ఏమీ లేదని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఐదేళ్ల కాలంలో 12 వేల కోట్లు వ్యయం చేస్తే.. వాటిలో 6 వేల కోట్లు అధికారపార్టీ నేతలు, అధికారులు, ఇరిగేషన్ మంత్రి, స్వాహా చేశారని ఆరోపించారు. మెయిన్ డ్యామ్ ఇంతవరకూ ప్రారంభం కాలేదని.. అయినా ఎప్పటికప్పుడు నీళ్లిస్తామంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో ఐదేళ్ల వరకూ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశమే లేదని స్పష్టం చేశారు. రానున్న ప్రభుత్వానికి నిజానిజాలు తెలియజేయడానికే పోలవరం పర్యటన చేస్తున్నామని చెప్పారు. మొత్తం సమాచారం క్రోడీకరించి కొత్తముఖ్యమంత్రికి అందిస్తామని అన్నారు. ఇక కాఫర్ డ్యామ్ అనేది తాత్కాలిక నిర్మాణం మాత్రమేనని అన్నారు. కాలువల ద్వారా నీళ్లివ్వాలంటే మరో నాలుగేళ్లు పడుతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకూ పవర్ ప్రాజెక్టు ఊసే లేదని అన్నారు. నిర్వాసిత గ్రామాల్లో ఏడు గ్రామాలకు మాత్రమే పునరావాసం కల్పించారని విమర్శించారు. ఇందులో కూడా అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. రానున్న ప్రభుత్వం వీటన్నిటిపై విచారణ చేస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పేందుకు నిజనిర్ధారణ కమిటీ నివేదిక రూపొందిస్తుందని అన్నారు. గంపెడు మట్టి కూడా పడలేదు.. ఇప్పటివరకూ అందరూ పోలవరం నుంచి నీళ్లిస్తారనే భ్రమలో ఉన్నారని, కానీ ఇప్పటివరకూ మెయిన్ డ్యామ్ నిర్మాణానికి గంపెడు మట్టి కూడా పడలేదని రిటైర్డ్ ఛీఫ్ ఇంజనీరు ప్రభాకరరెడ్డి చెప్పారు. సీడబ్ల్యూసీ అనుమతిచ్చిన 28 మీటర్ల ఎత్తుకంటే అధికంగా 42 మీటర్ల ఎత్తున కాఫర్ డ్యాం కడుతున్నారని దీనివల్ల ఏం సాధించదలుచుకుందో అర్దం కావడం లేదని అన్నారు. ఏడున్నర లక్షల కొత్త ఆయకట్టుకు నీరివ్వాల్సిన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకూ ఒక్క ఎకరాకు కూడా సర్వే జరగలేదని వెల్లడించారు. నాగార్జునాసాగర్ 1956లో మొదలు పెడితే కాలువలకు పూర్తి స్థాయిలో నీరివ్వడం 2000వ సంవత్సరం వరకూ కొనసాగిందని గుర్తు చేశారు. బాబు ఓ పిట్టల దొర చంద్రబాబు ఓ గ్రాఫిక్ పిట్టల దొర అని సామాజికవేత్త, ముప్పాళ్ల సుబ్బారావు వ్యాఖ్యానించారు. ప్రాజెక్టును చూసేందుకని కోట్లరూపాయలు వెచ్చించడం దారుణమని అన్నారు. ఇక కాఫర్ డ్యామ్ నుంచి సాగునీరు సప్లై చేస్తామని చెప్పడ అసాధ్యమని చెప్పారు. చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి ప్రకటనలు చూస్తే వారిపై 420 కేసు నమోదు చేయాలనిపిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్ఈ ఉప్పల పాటి నారాయణరాజు పాల్గొన్నారు. -
బాబు సర్కారులో అన్నీ భారాలే..!
రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్ర బాగుపడాలంటే తానే దిక్కంటూ.. అలవికాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. ఆ తర్వాత ప్రజలను వంచించింది. ఐదేళ్లూ ‘పన్ను’ గాట్లతో సామాన్యుల రక్తం జలగలా పీల్చింది. జేబులు కొల్లగొట్టింది. ఆర్టీసీ, విద్యుత్ చార్జీలతోపాటు.. ఆస్తి, ఇతర పన్నులను భారీగా పెంచేసింది. పేద, మధ్యతరగతివర్గాల వారిపై మోయలేని భారం మోపి వారి నడ్డివిరిచింది. సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి): విద్యుత్ వినియోగదారులపై 2016లో చార్జీల భారం మోపారు. ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పరిధిలో కేటగిరీ బీ–2లో గృహేతర, వాణిజ్య వినియోగదారుల సర్వీసులు 73,039 ఉండగా వాటి ద్వారా ప్రస్తుతం నెలకు సుమారు 1.34 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగమవుతోంది. దీని నిమిత్తం నెలకు సుమారు రూ.12.39 కోట్లను ఆయా వాణిజ్య వినియోగదారులు చెల్లిస్తున్నారు. ఈ కేటగిరీపై యూనిట్‌కు 18 పైసలు భారం వేయడంతో నెలకు సుమారు రూ.24 లక్షలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. అలాగే జిల్లాలోని 4,331 పరిశ్రమలు ఇప్పటి వరకూ ప్రతినెలా సుమారు 1.19 కోట్ల యూనిట్ల విద్యుత్ వినయోగిస్తూ సుమారు రూ.8.23 కోట్ల మేరకు బిల్లులు చెల్లిస్తున్నారు. విద్యుత్ చార్జీల మోత పరిశ్రమల విద్యుత్ వినియోగంపై యూనిట్‌కు 13 పైసలు పెంచడంతో వారిపై సుమారు రూ.15.47 లక్షల రూపాయలు నెలకు అదనంగా భారం పడింది. ఇదిలా ఉండగా విద్యుత్ చార్జీల పెంపు విషయంలో పంచాయతీలను, మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కూడా ప్రభుత్వం విడిచిపెట్టలేదు. ప్రజలకు అత్యవసరమైన వీధిలైట్ల వినియోగం, నీటి సరఫరాకు వినియోగించే విద్యుత్‌పై సైతం పెంపుదల భారం పడింది. వాటిపైనా యూనిట్‌కు 11 నుంచి 13 పైసలు పెంచారు. దీంతో అప్పటికే సుమారు రూ.142 కోట్ల విద్యుత్ బిల్లులు తూర్పుప్రాంత విద్యుత్ సంస్థకు బకాయిపడ్డ పంచాయితీలు ప్రజాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించే అంశంలో పునరాలోచనలో పడ్డాయి. వీటితోపాటు విద్యా వ్యవస్థను కూడా చంద్రబాబు ఉపేక్షించలేదు. ప్రభుత్వ రంగ హాస్టళ్లు, పాఠశాలలపైనా యూనిట్‌కు 14 పైసలు చొప్పున భారం వేశారు. మొత్తంగా వివిధ కేటగిరీల్లో పెంచిన విద్యుత్ చార్జీల ప్రభావం జిల్లా వాసులపై నెలకు రూ.కోటి, ఏడాదికి రూ.12కోట్లు పడింది. జిల్లా ప్రజలపై ఏటా అదనపు భారం ఇలా.. రూ.కోట్లలో విద్యుత్ చార్జీలు -12 కోట్లు ఇంటిపన్ను- 33 కోట్లు ఆర్టీసీ వడ్దన - 33.60 కోట్లు ఆర్టీసీ చార్జీలు ఇలా.. ఇక సామాన్య ప్రజల రవాణా అవసరాలు తీర్చే ఆర్టీసీపైనా ప్రభుత్వం కనికరం చూపలేదు. అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే 2015లో ఆర్టీసీ ప్రయాణ టిక్కెట్ ధరలను అమాంతం పెంచేసింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ప్రయాణించే పల్లెవెలుగు (ప్యాసింజర్) బస్సుల టిక్కెట్ ధర అప్పట్లో కిలో మీటరుకు 59 పైసలు ఉండగా దానిపై 5 శాతం ధర పెంచింది. అలాగే ఎక్స్‌ప్రెస్ బస్సుల ధరలు కిలో మీటరుకు 79 పైసలుండగా దానిని 8 పైసలు పెంచి 87 చేయగా, డీలక్స్ బస్సులకు 89 పైసలుండగా 9 పైసలు పెంచి 98 పైసలు చేసింది. వీటితో పాటు సూపర్ లగ్జరీ బస్సులకు 105 పైసలుండగా 11 పైసలు పెంచి 116 పైసలు, ఇంద్ర బస్సులకు 132 పైసలుండగా 14 పైసలు పెంచి 146 పైసలు, గరుడ బస్సులకు 155 పైసలుండగా 16 పైసలు పెంచి 171 పైసలు, గరుడ ప్లస్ బస్సులకు 165 పైసలుండగా 17 పైసలు పెంచి 182 పైసలుగా నిర్ణయించి వసూలు చేయడం ప్రారంభించింది. ‘టోలూ’ వలిచింది ఇదిలా ఉంటే.. టోల్ గేట్ చార్జీలు మినహాయిస్తే ఆర్టీసీ చార్జీలు తగ్గే అవకాశం ఉన్నా.. ఆ చార్జీల బారాన్ని కూడా ప్రయాణికులపైనే మోపింది. బస్సు ప్రయాణికుడు ప్రతి టోల్‌గేట్‌పై అక్షరాలా రూ.ఏడు చెల్లించాల్సి వస్తోదంటే ప్రభుత్వం వారిపై ఏవిధంగా చీకటి దెబ్బలు వేసిందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఆర్టీసీ పశ్చిమ రీజియన్ పరిధిలో రోజుకు సుమారు 1.08 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా వారందరిపై ఈ భారంపడుతోంది. ‘సెస్సా’దియ్యా.. మరో విచిత్రం ఏమిటంటే సేఫ్టీ సెస్ పేరిట ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులపై అదనపు భారం వేసి జేబులు గుల్ల చేస్తోంది. ప్రతి ఎక్స్‌ప్రెస్ టిక్కెట్‌పై ఒక రూపాయిని సేఫ్టీ సెస్‌గా వసూలు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం చీకటి దోపిడీలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఇంటి పన్నుపోటూ ఎక్కువే పేదలకు నిలువ నీడ కోసం గృహాలు కట్టించి ఇవ్వాల్సిన ప్రభుత్వం, రెక్కల కష్టంతో తినీ తినకా రూపాయి, రూపాయి పోగుచేసుకుని ఇల్లు కట్టుకుంటే దానిపై పన్నుల రూపంలో భారీ దోపిడీకి తెర లేపింది. గత ఏడాది తాజాగా ఇంటిపన్నును అమాంతం 20 శాతం పెంచేసింది. దీంతో సామాన్యులు సతమతమవుతున్నారు. పల్లెల్లోనూ పన్నులు భారీగా పెరిగాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఇంటి పన్ను డిమాండ్ గత ఏడాదికి పూర్వం రూ.165 కోట్లు ఉండగా, గత ఏడాది నుంచి ఆ డిమాండ్ కాస్తా మరో రూ.33 కోట్లు పెరిగి సుమారు రూ.198 కోట్లకు చేరుకుంది. ఏటా ఇది పెరిగే అవకాశం ఉంది. అద్దెలూ పెరిగాయి.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలకు గృహాలు ఇస్తామని చెప్పడం తప్ప ఇచ్చిన పాపాన పోలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ నియోజకవర్గాల్లో కొన్ని ఇళ్ళు నిర్మించిన ప్రభుత్వం వాటిని కేవలం టీడీపీ వారికే కేటాయించింది. దీంతో అర్హులు అద్దె ఇళ్లలోనే మగ్గాల్సి వస్తోంది. ఇంటిపన్నులు పెరగడంతో యజమానులు అద్దెలూ పెంచేశారు. సామాన్యులపై భారం సిగ్గు చేటు ఇంటిపన్ను రూపంలో 20 శాతం పెంచడం దారుణం. సామాన్యులపై ప్రభుత్వం ఈ విధంగా కక్ష సాధిస్తోంది. ప్రభుత్వానికి ఆదాయం కావాలంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప కష్టపడి ఇళ్ళు నిర్మించుకున్న వారిపై పన్నుల భారం మోపడం సబబు కాదు. – కడలి రామ్మోహనరావు, ఏలూరు టీడీపీ పాలనలో నరకమే.. టీడీపీ అధికారంలోకి వస్తోందంటేనే సామాన్య మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో తొమ్మిదేళ్ళ పాలనలో నరకం చూపించిన ప్రభుత్వం అనంతరం 2014 నుంచి మరోసారి తన ప్రతాపం చూపుతోంది. ఈ ప్రభుత్వాన్ని భరించడం మా వల్ల కాదని ప్రజలు లబోదిబోమంటున్నారు. – మువ్వల నాగేశ్వరరావు, ఏలూరు అభివృద్ధి శూన్యం టీడీపీ అధికారం చేపట్టిన ఏడాదికే పన్నుల మదింపు తీసుకురావడంతో ఇంటి పన్నులు పెరుగుతున్నాయి. ఏటా ఐదు శాతం చొప్పున పన్నును పెంచి వసూలు చేస్తున్నారు. భవనం, భూముల విలువను పరిగణనలోకి తీసుకుని పంచాయతీ పన్నులు విధించడంతో పేదలు, సామాన్యులకు భారంగా మారింది. రోడ్లు, డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో ఏ పని చేపట్టాలన్నా పంచాయతీ పన్నులతోపాటు, ఆర్థిక సంఘం నిధులపైనే ఆధారపడుతున్నాయి. –గెడ్డం రవీంద్రబాబు, మాజీ ఉపసర్పంచ్, సమిశ్రగూడెం -
రైతుల గుండెల్లో గ్రంధి శ్రీనివాస్
భూములున్నా.. పంట పండించుకోవడం తప్ప.. వారికి ఎటువంటి హక్కులేదు. పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నా బ్యాంకుల్లో కుదవ పెట్టుకునే అవకాశం లేదు. దీంతో ఆ రైతుల పరిస్థితి అగమ్యగోచరం. అటువంటి సమయంలో భీమవరం ఎమ్మెల్యేగా ఎన్నికైన గ్రంధి శ్రీనివాస్ వారికి అండగా నిలిచారు. ప్రభుత్వాన్ని ఒప్పించి సీఏడీ భూములకు పట్టాలు ఇప్పించారు. దీంతో అక్కడ సుమారు 1000 మంది రైతులకు మేలు కలిగింది. అటువంటి శ్రీనివాస్‌ను తాము ఎప్పటికీ మర్చిపోలేం అని రైతన్నలు చెప్పారు. మళ్లీ ఆయన్ని ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని వారంతా నడుం బిగించారు. సాక్షి, భీమవరం (పశ్చిమ గోదావరి): భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామంలో సర్కార్ అగ్రికల్చర్ డెవలప్మెంట్(సీఏడీ)భూములు సుమారు 1532 ఎకరాలు ఉన్నాయి. వాటిని 1921 సంవత్సరం నుంచి గ్రామానికి చెందిన కొంతమంది పేదలు సాగుచేయడం ప్రారంభించారు. అడవి మాదిరిగా చెట్లు, చేమలు, రుప్పలతో అస్తవ్యస్థంగా ఉండే ఆ భూములను అప్పటి రైతులు ఎంతో కష్టపడి సాగుకు అనుకూలంగా మార్పుచేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ భూములపై రైతులకు చట్టబద్ధంగా ఎటువంటి హక్కులేకపోయింది. ఆ భూములు మావేనని చెప్పడానికి వారి వద్ద ఎటువంటి ఆధారం ఉండేది కాదు. కనీసం తమ ఆడబిడ్డలకు పిల్లలకు కట్న కానుకలుగా ఇచ్చే అవకాశం లేకపోయింది. ఎంతోకాలంగా పట్టాలిప్పించాలని రైతులు అనేక మంది ప్రజాప్రతినిధులు, అధికారులను వేడుకున్నా ఫలితం శూన్యం. ఎంతో నిరాశలో ఉన్న రైతులకు 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైన గ్రంధి శ్రీనివాస్ ఆశాదీపంగా కనిపించారు. రైతులు పడుతున్న కష్టాలు, ఇబ్బందులను గుర్తించిన ఆయన వెంటనే వారికి పట్టాలు ఇప్పించడానికి కృషి ప్రారంభించారు. 1532 ఎకరాల సీఏడీ భూముల్లో సుమారు 902 మంది రైతులకు 950 ఎకరాలకు పట్టాలు ఇచ్చి వారి కళ్లలో ఆనందాన్ని నింపారు. అయితే మిగిలిన భూములకు పట్టాలు ఇప్పించడానికి పదేళ్లుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు ఎటువంటి శ్రద్ధ చూపించలేదని విమర్శిస్తున్నారు. మళ్లీ శ్రీనివాస్ ఎమ్మెల్యే అయితే మిగిలిన భూములకు పట్టాలు వస్తాయని వారంతా నేడు ఆశగా ఉన్నారు. మా కష్టం తెలిసిన మహనీయుడు శ్రీనివాస్ భీమవరం ఎమ్మెల్యేగా ఎంతోమంది పని చేశారు. కానీ రైతుల కష్టాలు ఎవరూ గుర్తించేవారు కాదు. గ్రంధి శ్రీనివాస్ గుర్తించి 950 ఎకరాలకు పట్టాలిచ్చి 900 మందికి పైగా రైతుల కళ్లలో ఆనందాన్ని చూసిన వ్యక్తి. మా వంశంలోని తరతరాలకు గుర్తుండిపోతారు. –జి.వెంకట సుబ్బలక్ష్మి, మహిళా రైతు, గొల్లవానితిప్ప రైతు బిడ్డ కనుకనే.. రైతులంటే రైతు బిడ్డ అయిన శ్రీనివాస్‌కు అభిమానం ఎక్కువ. రైతులు కనబడితే కారు ఆపి పలకరిస్తారు. ఇప్పటివరకు శ్రీనివాస్ లాంటి ఎమ్మెల్యేను చూడలేదు. –మెంటే పల్లయ్య, రైతు, గొల్లవానితిప్ప కట్నంగా ఇస్తున్నాం పట్టాలు ఇవ్వక ముందు మా ఆడబిడ్డలకు భూమిని కట్నంగా ఇచ్చే అవకాశం ఉండేది కాదు. శ్రీనివాస్ చలువ వల్ల ఇప్పుడు కట్నాలుగా ఇస్తున్నాం. –పాకల రంగారావు, రైతు, గొల్లవానితిప్ప నాలుగు మెతుకులు తింటున్నాం అప్పట్లో మా పొలానికి పట్టాలు ఏమి లేకపోవడంతో భూమికి విలువ ఉండేది కాదు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పట్టాలు ఇచ్చిన తరువాత భూమికి విలువ పెరిగింది. ఆయన దయవల్లే నాలుగు మెతుకులు తినగలుగుతున్నాం. - గుద్దటి పెద్దిరాజు, రైతు, గొల్లవానితిప్ప -
నెరవేరని రాజన్న ఆశయం
సాక్షి, మొగల్తూరు (పశ్చిమ గోదావరి): నాలుగు గ్రామాల ప్రజలకు తాగు నీరందిస్తానని దివంగత నేత తీర ప్రాంత ప్రజల గుండెలోల చిరస్థాయిగా నిలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. రాజీవ్ పల్లెబాటలో భాగంగా 2009 జనవరిలో మండలంలో పర్యటించిన సందర్భంలో రూ.33 కోట్లతో మొగల్తూరులో భారీ మంచి నీటి ప్రాజెక్టుకు దివంగత నేత హామీ ఇచ్చారు. ఆయన అకాల మృతి అనంతరం ప్రభుత్వాలు మారినా పట్టించుకున్న నాదుడు లేడు. రూ.13 కోట్లతో చేపట్టిన పనులు రూ.13 కోట్లు వెచ్చించి సుమారు 30వేల మంది ప్రజల దాహర్తి తీర్చేందుకు ఉద్దేశించి మొగల్తూరు గొల్లగూడెంలో తవ్విన చెరువు. పంచాయతీకి చెందిన చెరువునే ఆర్‌డబ్ల్యూఎస్‌కు బదలాయించి చెరువు చుట్టూ రివిట్ మెంట్ కట్టారు. అయితే నాలుగు గ్రామాలకు తాగు నీరందించాల్సి ఉండగా కేవలం మొగల్తూరుకు తప్ప ఏ గ్రామానికి అందదు. నాలుగు గ్రామాలకు తాగునీరు మొగల్తూరు, రామన్నపాలెం, శేరేపాలెం, కొత్తపాలెం గ్రామాలతో పాటు సుమారు 40 శివారు ప్రాంతాలకు తాగు నీరందించేందుకు రూ. 13 కోట్లు మంజూరయ్యాయి. అయితే ప్రాజెక్టును సుమారు 20 ఎకరాల్లో నిర్మించేందుకు భూసేకరణకు ప్రయత్నించినా పనులు పూర్తి కాలేదు. అయితే నిధులు మురుగుపోతున్నాయనే ఉద్దేశంతో మొగల్తూరు పంచాయతీ ప్రాజెక్టు చెరువుతోపాటు పంచాయతీకి చెందిన మరో రెండు చెరువులు కలుపుకుని తాగునీరు అందించేందుకు ప్రతిపాదించారు. దీనిలో భాగంగా మొగల్తూరులోని పాలకమ్మ చెరువు రోడ్డులో గల కోమటి చెరువులో నీటిని నిల్వ చేసి గొల్లగూడెం చెరువు ద్వారా ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పైప్‌లు ద్వారా నీరందించాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. పూర్తి కాని పైప్‌లైన్ పనులు ఇక ఫిల్టర్ అయిన నీటిని ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో రిజర్వు చేసుకుని పైప్‌లు ద్వారా గతంలో ఆయా గ్రామాల్లో ఉన్న రామన్నపాలెంలో 8, మొగల్తూరులో 7, శేరేపాలెంలో 3, కొత్తపాలెంలో 2 ఓహెచ్‌ఆర్‌లు ద్వారా అందించాల్సిన పైప్‌లైన్ పనులు పూర్తికాలేదు. శేరేపాలెంలో పైప్‌లైన్ పనులు పూర్తిఅయినా నీరందటంలేదు. కొత్తపాలెం గ్రామంలో మాత్రం కొద్దిగా వస్తున్నాయని, నాసిరకం పైపులు కారణంగా నీరందడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక రామన్నపాలెం గ్రామంలో కొంతమేర పైప్లైన్లు వేసి వదిలేయడంతో ఆగ్రామానికి పూర్తిగా నీరు సరఫరా కావడంలేదు. కేవలం మొగల్తూరు గ్రామానికి మాత్రమే పూర్తి స్థాయిలో నీరందిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే తాగునీటి ప్రాజెక్టుపై పాలకులు శ్రద్ధ చూపడం లేదని ఈ సారి సమస్యలను తీర్చే నాయకుడునే ఎన్నుకుంటామని ప్రజలు చెబుతున్నారు. తాగు నీరందడం లేదు మొగల్తూరు ప్రాజెక్టు ద్వారా తాగు నీరందడంలేదు. గ్రామంలోని పంచాయతీ చెరువు ఉన్నా తాగేందుకు పనికి రావడంలేదు. దీంతో రోజూ కొనుక్కుని తమ దాహాన్ని తీర్చుకుంటున్నాం. – ఏగి రాజశేఖర్, శేరేపాలెం నాసిరకంగా పనులు ప్రాజెక్టు పనులు నాసిరకంగా చేపట్టడంతో చిన్న దెబ్బతగిలినా పైపులు పగిలి పోతున్నాయి. కాంట్రాక్టరు అధికారం పక్షానికి దగ్గిర వ్యక్తి కావడంతో పనులు నాసిరకంగా పూర్తిచేసినా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. – కొత్తపల్లి ఆంజనేయులు, కొత్తపాలెం ఇప్పటికీ మాకు నీరందదు మొగల్తూరు భారీ ప్రాజెక్టు ద్వారా తమ గ్రామానికి కూడా నీరందిస్తామని దివంగత నేత ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. ఇప్పటికీ మాగ్రామానికి పైప్ లైన్ పనులు పూర్తి చేయలేదు. జగన్ అధికారంలోకి వస్తేనే మాకు నీరు అందుతుంది. – కాటూరి చంద్రమోహన్, రామన్నపాలెం జగన్ రావాలి – తాగు నీరందాలి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత జలయజ్ఞం పథకంలో మంచి నీటి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి. మా గ్రామానికి స్వచ్ఛమైన నీరందాలంటే జగన్ రావాలి, తాగు నీరందాలి. – కొత్తపల్లి బాబి, శేరేపాలెం -
ఆశల తీరం.. అభివృద్ధికి దూరం
సాక్షి, నరసాపురం: జిల్లాలో 19 కిలోమీటర్లు మేర తీర ప్రాంతం.. అపార మత్స్యసంపద, ఏటా రూ.300 కోట్లపైగా మత్స్యసంపద ఎగుమతులు.. వేటపై ఆధారపడి జీవించే 3 వేల మత్స్యకార కుటుంబాలు.. ఇది నరసాపురం ప్రాంతం పరిస్థితి. అయితే సముద్రంలోకి బోట్లను పంపుకోవడానికి, మత్స్యసంపద ఎగుమతులు, దిగుమతులు చేసుకోవడానికి సరైన ఫ్లాట్పాం లేని దుస్థితి. నరసాపురం మండలం బియ్యపుతిప్పలో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని దశాబ్దాలుగా నేతలు చెబుతూనే ఉన్నా కార్యాచరణ ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ అంశంపై కదలిక వచ్చింది. ఆయన మృతితో పట్టించుకునేవారే కరువయ్యారు. మత్స్యకారులు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో వారి ఓట్లకు గాలం వేసేందుకు తెలుగుదేశం పార్టీ హార్బర్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. హార్బర్ స్థానంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం అంటూ హడావుడి కూడా చేశారు. అపార మత్స్యసంపద.. బంగాళాఖాతానికి చేరువలో ఉండటంతో నరసాపురం తీరంలో అపారంగా మత్స్యసంపద ఉంది. నరసాపురం, కాకినాడ, నెల్లూరు, మచిలీపట్నం ప్రాంతాలకు చెందిన సుమారు 150 వరకూ బోట్లు తీరంలో నిత్యం వేటసాగిస్తాయి. ఏటా ఈ ప్రాంతం నుంచి రూ.300 కోట్లపైనే మత్స్య ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. అయితే స్థానికంగా ఎగుమతి, దిగుమతులకు సంబంధించి, వేట బోట్లను నిలిపి ఉంచుకోవడానికి ఎలాంటి సదుపాయాలు లేవు. దీంతో వేట ముగించిన బోట్లు అటు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది. నరసాపురంలోని లాకుల వద్ద ఉన్న గోదావరి పాయ వద్ద నిలిపి ఉంచుతారు. మళ్లీ బోట్లను వేట కోసం సముద్రంలోకి తీసుకెళ్లడం మత్స్యకారులకు కష్టంతో కూడుకున్న పని. మత్స్యకారుల వేటకు అనువుగా, మత్స్యసంపద ఎగుమతి, దిగుమతులకు వీలుగా నరసాపురం మండలం బియ్యపుతిప్పలో హార్బర్ నిర్మించాలనే డిమాండ్ ఎంతో కాలంగా ఉంది. ఐదేళ్లు.. ఎన్నో డ్రామాలు టీడీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో హార్బర్‌పై ఎలాంటి దృష్టిపెట్టలేదు. హార్బర్ తరహాలోనే బియ్యపుతిప్పలో రూ.13.58 కోట్లతో ఫిష్‌ల్యాండింగ్ సెంటర్ నిర్మిస్తామని కొత్త ప్రతిపాదన తెరమీదకు తెచ్చారు. 2017 జనవరి 26న మత్స్యశాఖ కార్యదర్శి ఎస్.అంజలి బియ్యపుతిప్ప ప్రాంతాన్ని సందర్శించారు. స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. రెండు నెలల్లో టెండర్లు పిలుస్తామని, మరో రెండు, మూడు నెలల్లోనే పనులు మొదలు పెడతామంటూ హడావుడి చేశారు. కేంద్ర మత్స్యశాఖ నిధులు అందిస్తుందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. కొన్నాళ్ల తర్వాత ఎమ్మెల్యే సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం చేపడతామని ప్రకటించారు. గతంలో వైఎస్ హయాంలో స్థల సేకరణ జరిగిన ప్రాంతంలోనే ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి మొదటి విడతగా రూ.13.58 కోట్లు మంజూరు చేశారని, దీనికి సంబంధించి జీఓ కూడా ఇచ్చారని చెప్పుకొచ్చారు. లోకేష్‌తో శంకుస్థాపన కూడా చేయించారు. అయితే ఒక్కపైసా కూడా నిధుల విడుదల కాలేదు. ఇవీ ఉపయోగాలు.. హార్బర్ నిర్మిస్తే తీరప్రాంతంతో పాటు జిల్లా కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మత్స్యసంపదకు డిమాండ్ ఉంది. అయితే గిడ్డంగులు వంటి సదుపాయలు లేకపోవడంతో మత్స్య ఉత్పత్తులను అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తుంది. హార్బర్ నిర్మిస్తే మత్స్యకారులకు మేలు జరుగుతుంది. రవాణా మార్గాలు అభివృద్ధితో పాటు అనుబంధ పరిశ్రమలు వస్తాయి. వైఎస్ హయాంలో కదలిక 2004లో వైఎస్ అధికారంలోకి రాగానే ఫిషింగ్ హార్బర్‌పై దృష్టిపెట్టారు. 2006లో వైఎస్ రాజశేఖరెడ్డి రూ.8.53 కోట్లతో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయించారు. 2009లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తరువాత కేంద్ర మత్స్యశాఖ ద్వారా నరసాపురం మండలం బియ్యపుత్పిలో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి దాదాపుగా రంగం సిద్ధం చేశారు. అప్పటి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చొరవతో అక్కడున్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో హార్బర్ నిర్మించాలని, రేవు నిర్మాణం, శీతల గిడ్డంగులు, బోట్లు, వలల మరమ్మతుల యూనిట్ నెలకొల్పాలని నిర్ణయించారు. మోసం చేస్తున్నారు ఐదేళ్లుగా పట్టించుకోలేదు. హార్బర్ నిర్మాణానికి జీఓ వచ్చిందన్నారు. శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు. తీరంలో మత్స్యకారులను ప్రభుత్వం మోసం చేస్తుంది. ముందు హార్బర్ అన్నారు, మళ్లీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అంటున్నారు. చివరకు ఏదీలేదు. వశిష్ట వంతెన తరహాలోనే హార్బర్ విషయంలో కూడా మోసం చేశారు. –బర్రి శంకరం, మత్స్యకారనేత జిల్లా అభివృద్ధిపై ప్రభావం జిల్లాలో తీరప్రాంతం ఇక్కడే ఉంది. ఇక్కడ హార్బర్ నిర్మిస్తే కేవలం మత్స్యకారులకే కాదు అందరికీ ఉపయోగం. జిల్లా అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. అభివృద్ధిపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. 2014 ఎన్నికల్లో 15కి 15 స్థానాలు కట్టబెట్టిన జిల్లాకు చంద్రబాబునాయుడు మొండిచేయి చూపించారు. –విన్నా ప్రకాష్, న్యాయవాది -
పశ్చిమ గోదావరి: ఓటరు లిస్టులో మీ పేరు చెక్ చేస్కోండి..!
సాక్షి, పశ్చిమ గోదావరి: ♦ 1950 టోల్‌ఫ్రీ నెంబరులో కూడా వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ECI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఓటర్ ఐడీ నెంబర్‌ను 1950 నెంబర్‌కు మెసేజ్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ♦ గూగుల్ ప్లే స్టోర్‌లో VOTER HELP LINE యాప్‌ను మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని, సంబంధిత వివరాలు ఎంటర్ చేసి ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ♦ ఆర్డీఓ ఆఫీసులో ఎన్నికల విధులు చూసే అధికారి (ఆర్డీఓ లేదా ఇతరులు) ఉంటారు. ఆయనను సంప్రదించడం ద్వారా ఓటుందో లేదో తెలుసుకోవచ్చు. ♦ ఎమార్వో ఆఫీసులో ఎమ్మార్వో లేదా ఎన్నిక విధులకు కేటాయించిన ఇతర అధికారులను కలిసి కూడా ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ♦ బూత్ లెవెల్ ఆఫీసర్స్ (బీఎల్వో)లు వద్ద ఆ బూత్ పరిధిలోని ఓటరు జాబితా ఉంటుంది. ఆ జాబితాను ప్రతీ పంచాయతీ ఆఫీసులో ప్రదర్శిస్తారు. దీనిని పరిశీలించి ఓటుందో లేదో తెలుసుకోవచ్చు. ♦ ఒక వేళ మీఓటు లేదని తెలిస్తే పై మూడు స్థాయిల్లోను అక్కడికక్కడే తగిన ఆధారాలు చూపి ఫామ్ - 6 నింపి ఓటు నమోదు చేసుకోవచ్చు. ♦ మీ సేవా కేంద్రాల్లోను నిర్ణీత రుసుము తీసుకుని ఓటుందో లేదో తెలియజేస్తారు. సరైన ధ్రువపత్రాలు సమర్పిస్తే ఆన్లైన్లో కూడా నమోదు చేస్తారు. ♦ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదలతో పాటే తాజా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. ఇది కలెక్టర్ నుంచి బూత్ లెవెల్ అధికారి వరకూ అందరి వద్ద ఉంటుంది. దీనిని పరిశీలించడం ద్వారా కూడా మీ ఓటు వివరాలు కనుక్కోవచ్చు. ఒకవేళ ఓటు లేకుంటే ఓటు నమోదుకు ఉన్న అవకాశాలు గురించి ఆర్డీవో, ఎమ్మార్వో, బూత్ లెవెల్ అధికారిని సంప్రదించాలి. బూత్ లెవెల్ అధికారి - 912111 9481 తహసీల్దార్ - 94910 41449 - ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
నిరాశగా వెనుదిరిగిన డ్వాక్రా మహిళలు..
సాక్షి, ఏలురు/పశ్చిమగోదావరి : డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ... ఎన్నికల ముందు మరో మోసానికి తెరలేపారు. పసుపు కుంకుమ కార్యక్రమం పేరుతో డ్వాక్రా మహిళలకు టోకరా ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. రుణాలను మాఫీ చేయకపోగా తమకు చెల్లని చెక్కులు ఇచ్చారని డ్వాక్రా సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన చెక్కులను బ్యాంకు అధికారులు పాత బాకీల కింద జమ చేసుకుంటున్నారని వాపోతున్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి వస్తున్నాయి. (‘డ్వాక్వా’పై దద్దరిల్లిన కౌన్సిల్) తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని జీలుగుమల్లి మండలం కామయ్యపాలెంలోనూ టీడీపీ ప్రభుత్వ మోసం బయటపడింది. ‘పసుపు కుంకుమ’ కార్యక్రమంలో చెక్కులు కొందరికి మాత్రమే వచ్చాయని డ్వాక్రా మహిళలు చెప్తున్నారు. ఆ చెక్కులు తీసుకుని బ్యాంక్‌కు వెళితే.. పాత బాకీలో జమ చేసుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రన్న చేతిలో మరోసారి మోసపోయామని నిరాశతో ఇళ్లకు వెనుదిరిగారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇవ్వడంతో డ్వాక్రా సభ్యులెవరూ ఆ రుణాలు చెల్లించలేదు. దాంతో అసలుతో పాటు వడ్డీ కూడా తడిసి మోపెడు అయింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో .... ఓట్లు రాబట్టకునేందుకు డ్వాక్రా రుణాలు మాఫీ చేయాల్సి రావడంతో టీడీపీ సర్కార్ పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చి చేతులు దులుపుకుంటుందని మహిళలుమండిపడుతున్నారు. -
3 రోజుల్లో వంద కోట్ల బెట్టింగ్‌లు
-
కుమార్తె జీవితం కోసం ఓ తండ్రి ఆవేదన
-
ప.గో.జిల్లాలో రేవ్ పార్టీ గుట్టు రట్టు
-
చేపల్లేవు..చెరువుల్లేవు
-
డివైడర్‌ను ఢీకొట్టిన లారీ