సాక్షి, పశ్చిమ గోదావరి:
♦ 1950 టోల్‌ఫ్రీ నెంబరులో కూడా వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ECI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఓటర్ ఐడీ నెంబర్‌ను 1950 నెంబర్‌కు మెసేజ్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
♦ గూగుల్ ప్లే స్టోర్‌లో VOTER HELP LINE యాప్‌ను మీ స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని, సంబంధిత వివరాలు ఎంటర్ చేసి ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు.
♦ ఆర్డీఓ ఆఫీసులో ఎన్నికల విధులు చూసే అధికారి (ఆర్డీఓ లేదా ఇతరులు) ఉంటారు. ఆయనను సంప్రదించడం ద్వారా ఓటుందో లేదో తెలుసుకోవచ్చు.
♦ ఎమార్వో ఆఫీసులో ఎమ్మార్వో లేదా ఎన్నిక విధులకు కేటాయించిన ఇతర అధికారులను కలిసి కూడా ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు.
♦ బూత్ లెవెల్ ఆఫీసర్స్ (బీఎల్‌వో)లు వద్ద ఆ బూత్ పరిధిలోని ఓటరు జాబితా ఉంటుంది. ఆ జాబితాను ప్రతీ పంచాయతీ ఆఫీసులో ప్రదర్శిస్తారు. దీనిని పరిశీలించి ఓటుందో లేదో తెలుసుకోవచ్చు.
♦ ఒక వేళ మీఓటు లేదని తెలిస్తే పై మూడు స్థాయిల్లోను అక్కడికక్కడే తగిన ఆధారాలు చూపి ఫామ్ - 6 నింపి ఓటు నమోదు చేసుకోవచ్చు.
♦ మీ సేవా కేంద్రాల్లోను నిర్ణీత రుసుము తీసుకుని ఓటుందో లేదో తెలియజేస్తారు. సరైన ధ్రువపత్రాలు సమర్పిస్తే ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేస్తారు.
♦ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదలతో పాటే తాజా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. ఇది కలెక్టర్ నుంచి బూత్ లెవెల్ అధికారి వరకూ అందరి వద్ద ఉంటుంది. దీనిని పరిశీలించడం ద్వారా కూడా మీ ఓటు వివరాలు కనుక్కోవచ్చు. ఒకవేళ ఓటు లేకుంటే ఓటు నమోదుకు ఉన్న అవకాశాలు గురించి ఆర్డీవో, ఎమ్మార్వో, బూత్ లెవెల్ అధికారిని సంప్రదించాలి.
బూత్ లెవెల్ అధికారి - 912111 9481
తహసీల్దార్ - 94910 41449
- ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం
Comments
Please login to add a commentAdd a comment