MRO office
-
MRO కార్యాలయంలోని ముస్లిం మైనార్టీ అధికారిపై టీడీపీనేత దౌర్జన్యం
-
MRO పై టీడీపీ నేత రౌడీయిజం
-
కావలి ఎమ్మార్వో కార్యాలయంలో టీడీపీ నేతల రచ్చ
-
ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణలోని గెస్ట్ హౌజ్ లో మందు పార్టీ
-
కళ్లూ, చేతులు పోయాయి సారూ.. అయినా కనికరించరా?
సాక్షి,పెద్దేముల్( వికారబాద్): ఆరు నెలల క్రితం ఇంటి వద్ద జరిగిన ఓ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి సర్వసం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవడం లేదని, అధికారులు కనీసం సదరం సరిఫికెట్ కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన తండ్రీకొడుకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన పెద్దేముల్లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన బేగరి యాదప్ప, గీత దంపతులకు ఏకైక కుమారుడు వెంకటయ్య. అనారోగ్యంతో కొంతకాలం క్రితం గీత మృతి చెందింది. దీంతో తండ్రీకొడుకు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జూలై 2021లో యాదప్ప ఇంటి వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో యాదప్ప కుమారుడు వెంకటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతని కళ్లూ, రెండు చేతులు పోయాయి. ఒకరి సహాయం లేనిదే బయటకు వెళ్లలేని దుర్భర స్థితి. పేలుడు పదార్థాలకు కావాల్సిన సామగ్రి స్థానిక ఇరిగేషన్ కార్యాలయంలో లభ్యం కావడంతో అప్పట్లో ఆ శాఖ అధికారులు రూ.3 లక్షల నగదు, రెండెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. అందులో రూ.1,20 లక్ష నగదు అందచేశారని, మిగతా డబ్బులు, భూమి ఇవ్వటం లేదని యాదప్ప తెలిపారు. ఈ విషయమై పలుమార్లు ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. ఈ విషయాన్ని ఇటీవల పెద్దేముల్‌కు వచ్చిన కలెక్టర్ నిఖిల దృష్టికి తహసీల్దార్ తీసుకెళ్లారు. పూట గడవని తమకు కనీసం పింఛన్ మంజూరు చేయాలని తండ్రీకొడుకు వేడుకున్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్.. వారికి సదరం సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించారు. అయినా అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని బాధితులు గురువారం మధ్యాహ్నం పెట్రోల్ డబ్బాతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. ఇద్దరూ ఒంటిపై పెట్రోల్ పోసుకుంటుండగా.. గమనించిన అక్కడున్న వారు పెట్రోల్ డబ్బాను లాక్కున్నారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ ఫయీమ్ఖాద్రీ వారిని సముదాయించారు. తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. తండ్రీకొడుకుకు తహసీల్దార్, ఎస్ఐ నాగరాజు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఽ సర్టిఫికెట్ ఇవ్వండి: ఎమ్మెల్యే తండ్రీకొడుకు ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి, వెంటనే సదరం సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించారు. తండ్రీకొడుకును అక్కడే ఉన్న టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆటోలో వికారాబాద్‌కు తరలించారు. -
తహసీల్ ఆఫీస్‌కే ఆపద !
సాక్షి, కామారెడ్డి: శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు తయారైంది రెవెన్యూశాఖ పరిస్థితి. అందరి భూముల సమస్యలను పరిష్కరించే ఆ శాఖకే ఆపద వచ్చిపడింది. భూముల రికార్డులు భధ్రపరచడంతో పాటు భూముల రిజిస్ట్రేషన్లు జరిగే తహశీల్దార్ కార్యాలయ భవనం ఉన్న స్థలం అటవీశాఖదట. తహసీల్ ఆఫీస్, మండల పరిషత్ కార్యాలయం, జూనియర్ కాలేజీ భవనం...ఇలా అక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ అటవీశాఖకు సంబందించిన సర్వేనంబరులోనే ఉన్నాయంటున్నారు. అలాగే 175 మంది రైతులకు సంబందించిన వ్యవసాయ భూములు, 70 కిపైగా నివాసపు గృహాలు కూడా ఆ సర్వేనంబరులోకి వస్తాయట. ఎప్పుడో విడుదల చేసిన అటవీ శాఖ గెజిట్‌లో సదరు సర్వేనంబరు అటవీశాఖదిగా పేర్కొనడం ఇప్పుడు రెవెన్యూ శాఖకు తలనొప్పి తెచ్చిపెట్టింది. ఫారెస్ట్ గెజిట్‌లో పేర్కొన్న సర్వే నంబర్లకు సంబందించి ఎలాంటి పాసుపుస్తకాలు జారీ చేయకూడదని స్పష్టమైన ఆదేశాలున్నాయి. దీంతో ఆ సర్వేనంబరులోని రైతులకు పాసుపుస్తకాల జారీ ఆగిపోయింది. ఫలితంగా రైతుబంధు నిలిచిపోయింది. బాధిత రైతులు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే రెవెన్యూ కార్యాలయమే ఆపదలో ఉంటే రైతుల కష్టం తీర్చేదెవరని నోరెల్లబెడుతున్నారు. లింగంపేట మండల కేంద్రంలో ప్రధాన రహదారికి సమీపంలో 983 సర్వే నంబరులో 450.08 ఎకరాల భూమి ఉంది. ఈ సర్వేనంబరులో 175 మంది రైతులు వందలాది ఎకరాల భూమిని సాగుచేస్తున్నారు. 2005లో 150 ఎకరాలకు పట్టాలతో పాటు పట్టాదారు పాసుపుస్తకాలు కూడా ఇచ్చారు. రైతులు బోర్లు తవ్వించుకుని పంటలు సాగు చేస్తున్నారు. పంట రుణాలు పొందారు. కొంత కాలం రైతుబంధు కూడా అందుకున్నారు. అదే సర్వేనంబరులో మూడు దశాబ్దాల క్రితం ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారు. అలాగే 70 కి పైగా ఇండ్లు కూడా నిర్మించుకుని ఉంటున్నారు. దశాబ్దాల తరబడిగా ఆ స్థలంలో జీవనం సాగుతోంది. రికార్డుల ప్రక్షాలణతో వెలుగులోకి.... రాష్ట్ర ప్రభుత్వం భూముల రికార్డుల ప్రక్షాలన మొదలుపెట్టిన సమయంలో అటవీ శాఖ తమ గెజిట్‌లోని సర్వే నంబర్లకు సంబందించిన వివరాలను రెవన్యూ శాఖ ముందుంచింది. రికార్డుల ప్రక్షాలన కొనసాగుతూ ఆ సర్వేనంబరుకు వచ్చేసరికి రెవెన్యూ అధికారులు షాక్‌కు గురయ్యారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం దొరకలేదు. ఫారెస్ట్ గెజిట్‌లో పేర్కొన్నదానిని మార్చాలంటే ఇప్పట్లో సాధ్యం అయ్యే పనికాదని కూడా అంటున్నారు. కాగా అటవీ శాఖ గెజిట్‌లో 983 సర్వేనంబరు ఉండడంతో అందులో భూములు కలిగి ఉండి పంటలు సాగుచేస్తున్న రైతులకు డిజిటల్ పాసుపుస్తకాలు అందలేదు. దీంతో రైతులకు రైతుబంధు కూడా నిలిచిపోయింది. అక్కడి రైతులు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదు. డిజిటల్ పాసుపుస్తకాలు రాకపోవడం, ఆ సర్వేనంబరును హోల్డ్‌లో పెట్టడంతో రైతుబంధు నిలిచిపోయింది. దీంతో రైతులు ఆవేధన చెందుతున్నారు. జడ్పీ సమావేశంలో ఇదే అంశంపై చర్చ.... ఈ నెల 5న జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో లింగంపేట ప్రజాప్రతినిధులు 983 సర్వేనంబరుకు సంబందించిన సమస్యను ప్రస్తావించారు. ఆ సర్వే నంబరు గెజిట్‌లో ఉందని అటవీ శాఖ జిల్లా అధికారి నిఖిత పేర్కొన్నారు. తహశీల్దార్ కార్యాలయం కూడా అదే సర్వే నంబరులో ఉందని పేర్కొనడంతో సభలో నవ్వులు పూశాయి. తహశీల్దార్ కార్యాలయం అటవీశాఖ సర్వేనంబరులోనిది కావడంతో అందరూ విస్తుపోయారు. తమ చేతిలో ఏమీలేదని అటవీ అధికారులు సభలో పేర్కొన్నారు. అయితే అటవీ శాఖకు సంబందించిన భూమిని కొందరు రియల్టర్లు కబ్జా చేసి అమ్ముకుంటున్నారని, దానిపై కేసులు వేశారని సభ్యులు పేర్కొనగా తాము కౌంటర్ పిటీషన్ వేసినట్టు ఆమె వివరణ ఇచ్చారు. ఫారెస్ట్ గెజిట్‌లో పేర్కొనడం వల్లే సమస్య.... 983 సర్వేనంబరునుఫారెస్ట్ గెజిట్‌లో పెట్టారు. అందువల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గెజిట్‌లో మార్పులు జరిగితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఉన్నతాధికారులకు గతంలోనే నివేదించాం. మా చేతుల్లో ఏమీ లేదు. రైతులు కూడా తిరుగుతున్నారు. పరిష్కారం దొరకాలంటే ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది. గెజిట్‌లో ఆ సర్వేనంబరును తొలగిస్తేగానీ ఇబ్బంది పోదని భావిస్తున్నాం. –అమీన్ సింగ్, తహశీల్దార్ -
తన పేరిట పౌతి చేయడం లేదని..
సాక్షి, డిండి(నల్లగొండ): తన తండ్రి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని పౌతి చేయడం లేదని ఓ వ్యక్తి మంగళవారం పురుగుల మందు డబ్బాతో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపాడు. వివరాలు.. మండల పరిధిలోని కాల్యతండాకు చెందిన ఆంగోతు చత్రునాయక్‌కు బొగ్గులదొన గ్రామ శివారులోని 113 సర్వే నంబర్లో 2.28 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. ఇందులో నుంచి 2014 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన దంజ్యనాయక్‌కు 28 గుంటల భూమిని విక్రయించాడు. కానీ 28 కుంటలకు సంబంధించి ప్రొసీడింగ్, పాత పట్టా పాసుపుస్తకం జారీ అయినప్పటికీ ధరణిలో మాత్రం వివరాలు నమోదు కాలేదు. చత్రునాయక్ మరణించడంతో ప్రస్తుతం అతడి కుమారులు తన తండ్రి పేరు మీద ఉన్న 2.28 ఎకరాలు పౌతి చేయాలని స్లాట్ బుక్ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న దంజ్యానాయక్ గతంలో తనకు విక్రయించిన 28 గుంటల భూమి తనకే చెందుతుందని, అందుకు సంబంధించిన పత్రాలు తమ దగ్గర ఉన్నాయని, సదరు పౌతిని నిలిపివేయాలని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు అందడంతో రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో ఉంచినట్లు తహసీల్దార్ ప్రశాంత్ తెలిపారు. కాగా తన తండ్రి పేరు మీదన్న పొలాన్ని పౌతి చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చత్రునాయక్ కుమారులలో ఒకరైన భద్యానాయక్ పురుగుల మందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ పోచయ్య తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు. -
మానవపాడు తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
-
తహశీల్దార్ కార్యాలయానికి అల్లు అర్జున్
సాక్షి, హైదరాబాద్: పుష్ప సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో సందడి చేశారు. శంకర్పల్లి మండలంలోని జన్వాడలో బన్నీ రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం శుక్రవారం బన్నీ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. రిజిస్ట్రేషన్ పనులు పూర్తి అయిన తరువాత ప్రొసీడింగ్ ఆర్డర్‌ను శంకర్పల్లి తహశీల్దార్ సైదులు బన్నీకి అందజేశారు. చదవండి: మనసులోని బాధను బయటపెట్టిన సమంత.. పోస్ట్ వైరల్ అయితే ఎమ్మార్వో కార్యాలయానికి అల్లు అర్జున్ వచ్చాడని తెలుసుకున్న అభిమానులు ఆయనను చూసేందుకు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఎమ్మార్వో సిబ్బంది, అభిమానులు బన్నీతో సెల్ఫీలు తీసుకున్నారు. ఇక రిజిస్ట్రేషన్ పూర్తైన వెంటనే ఆయన తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఇదిలా ఉండగా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ సైతం 6 ఎకరాల భూమి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బన్నీ కూడా అదే శంకరపల్లి మండలంలో భూమిని కొన్నారు. చదవండి: ‘పుష్ప’లో అదిరిపోయే ఐటెం సాంగ్, బాలీవుడ్ భామ షాకింగ్ రెమ్యూనరేషన్! ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘ఫుష్ప’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తండ్రి, కుమారుడి ప్రాణం తీసిన స్థల వివాదం
బొమ్మలసత్రం: స్థల వివాదం తండ్రి, కుమారుడి ప్రాణం తీసింది. ఈ ఘటన ఆదివారం నంద్యాల పట్టణంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు..నంద్యాలలో కోటా వీధికి చెందిన చిన్న సుబ్బరాయుడు, వెంకట లక్ష్మమ్మ దంపతులకు కుమారుడు నాగరమేష్, కుమార్తె సుదీపిక ఉన్నారు. చిన్న సుబ్బరాయుడుతో పాటు సమీప బంధువు కందాల కృష్ణమూర్తికి పూర్వీకుల నుంచి భూములు వచ్చాయి. నంద్యాల మండలం పులిమద్ది గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 246లో రెండు ఎకరాలు, కొత్తపల్లి గ్రామ సమీపంలోని సర్వే 1578లో 55 సెంట్ల భూమిని వీరిద్దరూ కౌలుకు ఇచ్చేవారు. వచ్చిన ధాన్యాన్ని రెండు భాగాలుగా పంచుకునే వారు. కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు గౌరీశంకర్, విజయ్‌కుమార్ న్యాయవాదులు కావటంతో నాలుగేళ్ల క్రితం రెవెన్యూ అధికారులను మభ్యపెట్టి ఆన్లైన్లో భూములను తమ పేర్లపై మార్చుకున్నారు. ఈ విషయం తెలిసి గౌండా పని చేస్తున్న చిన్న సుబ్బరాయుడు కృష్ణమూర్తి కుటుంబ సభ్యులను నిలదీశారు. ఇరు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో డిగ్రీ వరకు చదువుకున్న సుబ్బరాయుడు కుమారుడు నాగరమేష్ మనస్తాపానికి గురయ్యాడు. గురువారం ఉదయం నంద్యాల శివారు ప్రాంతంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక శుక్రవారం మృతి చెందాడు. కుమారుడి మృతితో మనస్తాపం చెందిన చిన్న సుబ్బరాయుడు శనివారం పురుగు మందు తాగాడు. చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక శనివారం రాత్రి మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఆసుపత్రికి చేరుకున్న బంధువులు చిన్న సుబ్బరాయుడి మృత దేహంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కందాల కృష్ణమూర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లిన ఎన్టీఆర్.. ఆ భూమి కొనేందుకేనట!
Jr NTR: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. గోపాలపురం గ్రామంలోని రెవెన్యూ పరిధిలోని ఆరున్నర ఎకరాల భూమి కొనుగోలుకు సంబంధించి రిజిస్ర్టేషన్ పనుల కోసం ఎన్టీఆర్ స్వయంగా ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఎన్టీఆర్‌తో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. తారక్‌తో సెల్ఫీలు దిగి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తారక్‌తో పాటు రామ్‌చరణ్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. ఇక సినిమాలతో బిజీగా ఉంటూనే ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ బుల్లితెరపై కూడా సందడి చేసేందుకు రెడీ అయ్యారు తారక్. త్వరలోనే ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ కానుంది. -
తీగ లాగితే ‘రెవెన్యూ’ డొంక కదులుతోంది
సాక్షి, గుంటూరు(చేబ్రోలు): ప్రభుత్వం పారదర్శకంగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే కొంత మంది అవినీతి అధికారుల కారణంగా చెడ్డపేరు వస్తోంది. చేబ్రోలు తహసీల్దారు కార్యాలయ అధికారి, సిబ్బంది చేతివాటంపై తెనాలి సబ్ కలెక్టర్ నిధి మీనా రెండు రోజులుగా చేబ్రోలులో విచారణ చేపట్టారు. ఈ విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ‘సాక్షి’ కథనంతో వెలుగులోకి ఈ నెల 3వ తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంతో 4వ తేదీన జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ చేబ్రోలు తహసీల్దారు బీపీ ప్రభాకర్‌ను సస్పెండ్ చేశారు. చేబ్రోలు తహసీల్దారుగా పనిచేస్తున్న బీపీ ప్రభాకర్ మహిళా వలంటీర్‌ని రాత్రి సమయంలో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడం, ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు, భూములు ఆన్లైన్ నమోదులో అక్రమాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తహసీల్దారును సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పూర్తిస్థాయిలో విచారణకు తెనాలి సబ్ కలెక్టర్ నిధి మీనా నలుగురు తహసీల్దార్లు, ఆర్ఐలు, రెవెన్యూ సిబ్బంది సహకారంతో జరిపిన రికార్డుల పరిశీలనలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ►రెవెన్యూ నిబంధనల ప్రకారం క్వారీ గోతులకు సాగు భూములుగా అనుమతులు ఇవ్వకూడదు. సస్పెండ్ అధికారి మాత్రం చేబ్రోలు, వడ్లమూడి, సుద్దపల్లి గ్రామాల్లో 80ఎకరాల్లోని క్వారీ భూములకు సాగు భూములుగా ఆన్లైన్లో నమోదు చేసి వాటికి పాసు పుస్తకాలను కూడా అందజేసి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు. సుద్దపల్లి గ్రామంలోని సర్వే నెంబరు 135,136, 139లలో ఆవుల హరిబాబు, ఝాన్సీ, నవీన్, సుబ్బారావు, సువేందుల కుటుంబానికి చెందిన 60 ఎకరాల భూమి దశాబ్ద కాలం క్రితమే క్వారీంయింగ్ జరిగి గోతులుగా ఉన్న భూమికి సస్పెండ్ అయిన రెవెన్యూ అ«ధికారి లక్షలాది రూపాయిలు జేబులో వేసుకొని కొద్ది నెలల క్రితం పాసుపుస్తకాలు అందజేసి ఆన్లైన్లో నమోదు చేసినట్లు గుర్తించారు. ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చేశారు... ►చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చేసి తమ ఘనతను చాటుకున్నారు. వడ్లమూడి గ్రామంలోని సర్వే నెంబరు 345/7లో 96 సెంట్ల భూమి రైతు పేరున ఉంది. దాని పక్కనే ఉన్న ఎకరం ప్రభుత్వ భూమిని కలిపి 1.96 ఎకరాల భూమిని ఆన్లైన్లో ఆ రైతు పేరున నమోదు చేయటం వెనుక లక్షల రూపాయిల సొమ్మును స్థానిక ఆర్ఐ, వీఆర్వో, కంప్యూటర్ ఆపరేటర్ల సహకారంతో సస్పెండ్ అధికారి పూర్తి చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ►చేబ్రోలులోని సర్వే నంబరు 709లో ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో గత 20 ఏళ్లుగా పాసుపుస్తకం జారీకి నోచుకోలేదు. సస్పెండ్ అధికారితో పాటు అతడి అనుచరులు కలిపి పక్కాగా ఆన్లైన్లో నమోదు చేసి పాసుపుస్తకాన్ని అందజేయటంతో లక్షల రూపాయిలు స్వాహా చేసినట్లు సమాచారం. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను పక్కదారి పట్టించిన సస్పెండ్ అధికారి అతడి సోదరుడు, అతడి ముఖ్య అనుచరులపై విచారణ జరిపి వారిని కూడా సస్పెండ్ చేసి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఇళ్ల స్థలాల పంపిణీలో రెవెన్యూ అధికారి లీలలు.. చేబ్రోలు, కొత్తరెడ్డిపాలెం, వేజండ్ల గ్రామాల్లో రెవెన్యూ అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శించి అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్యకు స్థానికులు ఫిర్యాదు చేశారు. డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో కూడా వివిధ గ్రామాల నుంచి తహసీల్దారుపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. దీనిపై ఎమ్మెల్యే ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. నారాకోడూరు మీ సేవా కేంద్రం నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయించి ఎటువంటి విచారణ లేకుండా ఇళ్ల స్థలాలు అందజేసినట్లు గుర్తించారు. తహసీల్దారు 150 మంది వరకు అనర్హులకు ఇళ్ల పట్టాలు, పది నుంచి 20 వేలు వరకు డబ్బులు తీసుకొని అందజేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఉన్నతాధికారుల విచారణలో కూడా వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. -
గుమ్మానికి వేలాడిన నిరసన సూత్రం
చాలా సంఘటనలు ఇలా జరిగి అలా కాలం పొరల్లోకి వెళ్లిపోతుంటాయి. ఒక్కోసారి ఎంతో ప్రాధాన్యత గల సందర్భాలు కూడా సమాజంపై వేయవలసినంత ముద్ర వేయకుండానే మాములు ఘటనగా సమసిపోతాయి. దానివల్ల వాటి నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఎవరికీ అందకుండానే మిగిలిపోతాయి. అయితే వాటి మూలాల్ని వెదికి ఆయా వ్యక్తులు అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించిన పూర్వాపరాలే మిటో తెలుసుకుంటే అవి వ్యవస్థలో రావలసిన మార్పునకు సూచనలిస్తాయి. ఈ మధ్య ఒక మహిళ తన భూసమస్యను పరిష్కరించమని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి వేసారి తన మంగళసూత్రాన్ని ఎమ్మార్వో ఆఫీసు ప్రవేశ ద్వారానికి తగిలించింది. తాను ఇంతకన్నా ఏమీ చెల్లించుకోలేను, దీన్ని తీసుకొని నా కార్యం చేసి పెట్టండని వేడుకొంది. ఈ సంఘటన జూన్ 30 నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగింది. ఆ మహిళా రైతు పేరు పొలాస మంగ. మంగకు ఎలాంటి పోరాట, ఉద్యమ నేపథ్యం లేదు. రెండేళ్లుగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా తన భూమిపై హక్కును ఎలా పరిరక్షించుకోవాలో అర్థం కాలేదు. ఆఫీసు లోపల తన తాళి బొట్టును తీసి ఏ ఉద్యోగి చేతిలోనో పెడితే పరిస్థితి ఎలా ఉండేదో గానీ, ఏకంగా ఆఫీసు గుమ్మానికి తగిలించడంతో కలకలం రేగింది. మధ్యలో వేలాడుతూ ఆఫీసులోకి వచ్చే పోయేవారి కంటపడి ఇదేమి చోద్యమనేలా చర్చకు వచ్చింది. ఇదేదో ఉద్రిక్త పరిస్థితికి దారి తీస్తుందన్న బెదురుతో రెవెన్యూ అధికారులు విషయాన్ని స్థానిక పోలీసు స్టేషనుకు చేరవేశారు. ఆ సమయాన జిల్లా కేంద్రంలో ఉన్న డిప్యూటీ తహసీల్దారు హుటాహుటిన ఆఫీసుకొచ్చి ఆమెతో మాట్లాడి సమస్యను తెలుసుకొన్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్ళి ఆమె అలా ఎందుకు చేయవలసివచ్చిందో కనుక్కున్నారు. వార్త జిల్లా కలెక్టర్ దాకా వెళ్ళింది. సంగతేమిటో చూడమని ఆయన ఆర్డీవోను పుర మాయించారు. ఆ అధికారి స్వయంగా భూమి వద్దకు వెళ్లి పూర్తిస్థాయి విచారణ చేపట్టి సమస్యను పరిష్కరిస్తామని ఆమెతో అన్నారు. ఇలా అధికారులు దిగి వచ్చి తన సమస్యను ఆలకిస్తారని ఆమె తాళిని తగిలించేముందు ఊహించి ఉండకపోవచ్చు. ఇదొక అరుదైన ఘటనగా, రెవెన్యూ శాఖ పరువు ప్రతిష్టకు ముడిపడిన విషయంగా భావించి అధికారగణం కదిలి వచ్చిందనుకోవచ్చు. ప్రపంచంలో మహిళలు అతికష్ట సమయంలో ఉద్వేగభరితమైన రీతిలో తమ నిరసనను ప్రదర్శించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. మంగ చూపిన తెగువ కూడా ఆ స్థాయికి తక్కువేమీ కాదు. పదేళ్ల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్ళిన మంగ భర్త రాజేశం ఎక్కడ, ఎలా ఉన్నాడో సమాచారం లేదు. ప్రస్తుతం కొడుకుతో పాటు మెట్‌పల్లిలోని తన పుట్టినింటిలో ఉంటూ ఆమె ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. ఇదే అదునుగా తన ఎకరం 23 గుంటల భూమిని భర్త తోబుట్టువులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆమె వాదన. మంగ భర్త పరిస్థితిని కూడా తెలుసుకునే పని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. ఆమె అనుభవాలను, ఆలోచనలను నలుగురి ముందుకు తెచ్చి వాటికి తగిన ప్రాచుర్యం ఇయ్యవలసిన సందర్భమిది. మంగ చూపిన తెగువను ఒక నిరసన బాటగా మలుచుకునే బాధ్యత నారీలోకంపై ఉంది. ప్రభావశీల సంఘటనలు ప్రతిరోజూ జరుగవు. - బి. నర్సన్ వ్యాసకర్త కవి, కథకుడు మొబైల్ : 9440128169 -
మెదక్ జిల్లా శివం పెట్ MRO ఆఫీస్ లో కలకలం
-
టైమ్ 11 దాటినా పత్తాలేని తహసీల్దార్..
సాక్షి, మెదక్ : పరిపాలన వ్యవస్థ సక్రమంగా నడవాలంటే అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఏ ప్రభుత్వానికైనా మంచిపేరు రావాలంటే అధికారుల కృషి ఉండాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం తరచూ సమయపాలన పాటించకపోవడం పట్ల ప్రజలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన రేగోడ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11గంటలు దాటినా కార్యాలయంలో కేవలం ధరణి కంప్యూటర్ ఆపరేటర్, ఒక వీఆర్ఏ మాత్రమే విధుల్లో ఉన్నారు. దీంతో అక్కడే తహసీల్దార్ కోసం పడిగాపులు కాసిన రైతులు, ప్రజలు విలేకరులకు సమాచారం అందించారు. విలేకరులు వెల్లి చూడగా తహసీల్దార్‌తో పాటు పలువురు అందుబాటులో లేరు. తరచూ సమయపాలన పాటించడం లేదని పలువురు వాపోయారు. గతంలో అధికారుల గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా అధికారుల తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలనెలా వేలరూపాయలు వేతనం తీసుకుంటున్నా విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భూమి మార్పు విషయంలో అడిగిన డబ్బులు ఇచ్చినా ఓ అధికారి, వీఆర్ఓ పనిచేయకుండా తిప్పించుకుంటున్నారని మర్పల్లి గ్రామానికి చెందిన ఒకరు తెలిపారు. మారుమూల మండలంలోని రేగోడ్పై జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆడిందే ఆటగా పాడిందే పాటగా నడిపిస్తున్నారని ఆరోపించారు. కార్యాలయానికి వెల్లే సన్నిహితులకు ప్రాధాన్యత ఇస్తూ సామాన్యులను పట్టించుకోకపోవడం ఏమిటోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోని ఇబ్బందులు తప్పించాలని పలువురు కోరుతున్నారు. చదవండి: ఏంది స్వామి 20 లక్షలు అలా కాల్చినావ్ జిల్లా కేంద్రంలో ఏసీపీ హల్చల్ రెండేళ్లుగా తిరుగుతున్నా మా తాత పేరున ఉన్న 133అ సర్వే నంబరులో ఎకరా మూడుగుంటలనర భూమికి తొమ్మిది గుంటలు భూమి మాత్రమే ఆన్లైన్లో చూపిస్తుంది. మిగతా భుమిని ఆన్లైన్లో పెట్టాలని అధికారులను తరచూ కోరుతున్నా. గత సంవత్సరం కార్యాలయంలోని ఓ అధికారికి, వీఆర్ఓకు డబ్బులు ఇచ్చినా భూమిని సరిచేయలేదని, మా తాతపేరుపై ఉన్న భూమిని మా నాన్న పేరున చేయడం లేదు. రోజూ తిరుగుతున్నా పని కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నా. – అనిల్, మర్పల్లి ఫిర్యాదు చేసినా మారడం లేదు తహసీల్దార్‌తో పాటు సిబ్బంది సమయానికి రావడం లేదు. ఈ విషయమై ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినా అధికారి, సిబ్బందిలో మార్పు రావడం లేదు. ఇక్కడి అధికారుల తీరువల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. – నాగయ్య స్వామి, సిందోల్ ఒక్కోసారి ఆలస్యం అవుతుంది.. ఒక్కోసారి ఆలస్యం అవుతుంది. కానీ ముందుగానే వస్తున్నాం. ఆఫీసుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సేవలు అందిస్తున్నాం – సత్యనారాయణ, తహసీల్దార్ -
ఎమ్మార్వో ఆఫీసులో అధికారుల తిట్ల పురాణం
సాక్షి, గద్వాల: ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు కర్తవ్యం మరిచారు. ఒకరికొకరు సమన్వయంతో పనిచేయాల్సిందిపోయి సోయి మరచి వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని తహసిల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో వెలుగు చూసింది. సర్వేయర్ బ్రహ్మయ్య, సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ పరస్పరం బండ బూతులతో రచ్చకెక్కారు. అధికారుల తిట్ల పురాణాన్ని పనుల నిమిత్తం వచ్చిన కొందరు వ్యక్తులు వీడియో తీసి బయటపెట్టడంతో.. అది కాస్తా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు ఇలా గొడవపడటంపై జనం మండిపడుతున్నారు. పైఅధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
కార్యాలయంలో రాసలీలలు
సాక్షి, బళ్లారి: అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఉన్నతాధికారి దారితప్పి ఏకంగా కార్యాలయంలోనే ఓ మహిళతో ముద్దుముచ్చట్లకు పాల్పడడం సంచలనమైంది. కొప్పళ నగరాభివృద్ధి ప్రాధికార కార్యాలయంలో పనిచేస్తున్న తహసీల్దార్ గురుబసవరాజు రెండు నెలల క్రితం కుష్టిగి తహసీల్దార్‌గా పనిచేస్తున్న సమయంలో ఆఫీసులోని ఓ మహిళా ఉద్యోగికి ముద్దుపెడుతున్న వీడియో బయటకు వచ్చింది. ఈనేపథ్యంలో ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జోగ్‌ఫాల్స్ వద్ద టెక్కీ ఆత్మహత్యాయత్నం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయిన ఐటీ ఇంజనీరు జలపాతం నుంచి దూకి ప్రాణాలు తీసుకోబోయాడు. పోలీసుల జోక్యంతో విరమించుకున్నాడు. బెంగళూరులో నివసించే టెక్కీ చేతన్ కుమార్‌కు ఇటీవల ఉద్యోగం పోయింది. దీంతో జీవితం మీద విరక్తి చెందిన శివమొగ్గ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ జోగ్ జలపాతం నుంచి దూకి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అధికారులు కళ్లుగప్పి జలపాతం ఎగువకు చేరుకున్నాడు. మొబైల్, లగేజ్ అన్నింటిని 960 అడుగుల లోతులో ఉన్న లోయలోకి పడేశాడు. ఇంతలో భద్రతా సిబ్బంది గమనించి అతన్ని వారించారు. ఇంతలో పోలీసులు కూడా చేరుకున్నారు. అందరూ దూరం నుంచే చేతన్‌తో మాట్లాడి వెనక్కి వచ్చేలా ఒప్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు చేతన్ జలపాతం నుంచి వెనక్కి రావడంతో కథ సుఖాంతమైంది. అనూహ్య ప్రమాదం సాక్షి, బళ్లారి: ఇనుప కడ్డీల లోడుతో నిలబడి ఉన్న లారీని కేఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కండక్టర్ శరణప్ప (40) దేహంలోకి కడ్డీలు గుచ్చుకుని విలవిలలాడాడు. బుధవారం తెల్లవారుజామున బళ్లారి జిల్లా కూడ్లిగి సమీపంలోని జాతీయ రహదారి– 58 పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కుష్టిగి నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న కారును తప్పించబోతూ నిలిపిఉన్న ఇనుపరాడ్ల లారీని వెనుకవైపు ఢీకొట్టింది. దీంతో బస్సులోకి కడ్డీలు చొచ్చుకుపోయాయి. కండక్టర్ దేహంలోకి చొచ్చుకుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. గంటకుపైగా కండక్టర్ ఎటూ కదల్లేక నరకం అనుభవించాడు. 108 అంబులెన్స్, ఫైర్ సిబ్బంది వచ్చి కండక్టర్ శరీరం నుంచి కడ్డీలను కత్తిరించి బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్, ముగ్గురు ప్రయాణికులు కూడా గాయపడ్డారు. -
ఎమ్మార్వో కార్యాలయంలో.. పెట్రోల్ కలకలం
సాక్షి, సిద్దిపేట : తహసీల్దార్ కార్యాలయం లోపలికి వెళ్లి తలుపులు వేసుకుని పెట్రోల్ డబ్బాలతో అత్మహత్య చేసుకుంటామని తండ్రీ కూతుళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. సంవత్సరాల నుంచి కోహెడ ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ తహసీల్దార్ కార్యాలయం లోపలికి వెళ్లి తలుపులు వేసుకుని పెట్రోల్ డబ్బాలతో అత్మహత్య చేసుకుంటామని నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం చెంచలచెరువులపల్లి గ్రామానికి చెందిన భీంరెడ్డి తిరుపతి రెడ్డి, అతని కుమార్తె స్వరూప తమ భూమి వేరే వాళ్ల పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని వాపోయారు. తన తండ్రి తిరుపతి రెడ్డికి చెందిన ఎకరం 30 గుంటల భూమిని తన పేరుమీద 2011 లో రిజిస్ట్రేషన్ చేయించారని అప్పటినుండి మ్యుటేషన్ చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితురాలు స్వరూప అన్నారు. ఈ మధ్యకాలంలో పహాణీలో తన తండ్రి పేరును తొలగించి వేరే వాళ్ల పేరు మీద భూమిని నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న తహసీల్దార్, ఇప్పుడున్న తహసీల్దార్ భూమి మోక మీదకి వచ్చి తనిఖీ చేసి హద్దులు నిర్ణయించి భూమి తమ పేరు మీదనే చేస్తామని చెబుతున్నారు కానీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేరే వ్యక్తి తమ భూమిలో గత కొన్ని రోజులుగా దున్నతున్నాడని, పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు సైతం తమను తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసేంతవరకు తహసీల్దార్ కార్యాలయంలోనే ఉంటామని లేకుంటే కార్యాలయంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. విషయం తెలుసు తహసీల్దార్, పోలీసులు బాధితులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. -
‘నేను స్పెషలాఫీసర్‌ని.. ఇది నా ఐడీ’
సాక్షి, సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం) : సచివాలయాల పరిశీలనకు వచ్చిన ప్రత్యేక అధికారినంటూ ఓ వ్యక్తి స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయం, వార్డు సచివాలయాల్లో సోమవారం హల్చల్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి బాలాజీపేటకు చెందిన 40వ వార్డు సచివాలయ కార్యదర్శులను వెంటబెట్టుకుని ఓ వ్యక్తి వచ్చాడు. నేరుగా తహసీల్దార్ గదిలోకి వెళ్లి ఆయన సీట్లో కూర్చున్నాడు ‘‘నేను సీఎం కార్యాలయం నుంచి వచ్చిన స్పెషలాఫీసర్‌ను, ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించింది’’ ఇది నా ఐడీ అని చూపించాడు. తన పేరు ఉపేంద్ర రోషన్ అని తన సెల్ నంబర్: 6301814060గా చెప్పాడు. తహసీల్దార్ సుస్వాగతం అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజును పిలిచి వివరాలు అడిగాడు. బుధవారం మళ్లీ వస్తానని అప్పటికి అన్ని రికార్డులు సిద్ధం చేసి ఉంచాలని చెప్పి వెళ్లిపోయాడు. (టార్గెట్ వైఎస్సార్సీపీ! ) సందేహం కలిగిన డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజు ప్రభుత్వ కార్యాలయానికి ఫోన్ చేసి ఆరా తీయగా అటువంటి వ్యక్తి ఎవరూ లేరని చెప్పారు. దీంతో సాయంత్రం ఆ వ్యక్తికి ఫోన్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి రావాలని కోరగా, తొలుత వీలుపడదని చెప్పాడు. అయితే డిప్యూటీ తహసీల్దార్ గట్టిగా చెప్పడంతో రాత్రి ఏడు గంటలకు కార్యాలయానికి వచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న టూటౌన్ పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇతడు రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామానికి చెందిన వాడని, బీఎడ్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడని టూటౌన్ సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. నాలుగురోజులుగా రాజమహేంద్రవరంలో పలు సచివాలయాలకు వెళ్లి, తాను సీఎం పేషీ నుంచి వచ్చానని అక్కడి సిబ్బందిపై హడావుడి చేస్తూ వస్తున్నాడని తెలిపారు. జిల్లాలోని రెవెన్యూ, కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన వారి ఫోన్ నంబర్లన్నీ అతడి ఫోన్లో ఉండడం కొసమెరుపు. నకిలీ అధికారిని అరెస్ట్ చేసిన పోలీసులు -
ఎమ్మార్వో ఆఫీసులో వ్యక్తి వీరంగం
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలోని ఎడపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించారు. శ్రీనివాస్ అనే వ్యక్తి అధికారులపై దాడికి యత్నించాడు. అడ్డొచ్చిన వీఆర్ఓ పుల్‌సింగ్‌పై దాడి చేశాడు. అంతేకాకుండా కార్యాలయంలోని కుర్చీలను ధ్వంసం చేశాడు. కుర్నాపల్లి శివారులోని సర్వే నంబర్ 127, 128, 129లో ఉన్న భూములను తమ బంధువుల పేరుపై పట్టాలు చేసి పాస్‌బుక్‌లు ఇవ్వాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశాడు. అందుకు అధికారులు కుదరదని చెప్పడంతో.. ఆగ్రహానికి లోనైనా శ్రీనివాస్‌రావు దాడికి తెగబడ్డాడు. పట్టా చేయాలని కోరుతుంటే అధికారులు ఏడాదిన్నరగా తిప్పుకుంటారని శ్రీనివాస్‌రావు ఆరోపించారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. కాగా, గతేడాది అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలోనే ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
లంచం అడిగిన తహసీల్దార్‌కు ఊహించని షాక్
భోపాల్ : లంచం అడిగిన తహసీల్దార్‌కు ఓ మహిళ ఊహించని షాక్ ఇచ్చింది. లంచంగా తన ఇంటిలో ఉన్న గేదెను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు..నౌధియా గ్రామానికి చెందిన రాంకలీ పటేల్ అనే మహిళ ..పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని తన పేరు మీద మ్యుటేషన్ చేయాలని కోరుతూ తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పని కావాలంటే రూ. 10వేలు లంచం ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయ అధికారులు అడిగారు. దీంతొ సదరు మహిళ అప్పు చేసి మరీ రూ.10వేలు లంచం అప్పజెప్పింది. అయినప్పటికీ ఆమె పని కాలేదు. కొద్దిరోజుల తర్వాత మరోసారి ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి ఆరా తీసింది. ఇంకా పని కాలేదని, మ్యుటేషన్ చేయాలంటే మరో రూ.10వేలు లంచంగా ఇవ్వాలన్నారు. లంచం ఇచ్చేందుకు డబ్బులు లేకపోవడంతో తన గేదెను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చింది. లంచంగా తన గేదెను తీసుకొని తన పేరుపై మ్యుటేషన్ చేయాలని కోరింది. లంచం అడిగిన విషయం అందరికీ తెలియడంతో తహసీల్దార్ అధికారులు ఆందోళన చెంది.. అసలు నిన్ను లంచం ఎవరు అడిగారు అంటూ ఆ మహిళపై కోపగించుకున్నారు. అంతేకాదు నాలుగు రోజుల కిత్రమే మహిళ పేరున మ్యుటేషన్ చేశామని , తమను అల్లరి చేసేందుకే మహిళ కుట్ర పన్ని కార్యాలయానికి గేదెను తెచ్చిందని ఎమ్మార్వో వివరణ ఇచ్చారు. కాగా, మహిళపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని ఎమ్మారో కార్యాలయ అధికారులు తెలిపారు. -
24 రోజుల తర్వాత... అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్..
సాక్షి, రంగారెడ్డి: సంచలనం సృష్టించిన ఎమ్మార్వో విజయారెడ్డి హత్య అనంతరం 24 రోజుల తర్వాత గురువారం అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయం తెరుచుకుంది. ఘటన జరిగిన భవనాన్ని ఖాళీ చేసి..నూతన భవనంలో కార్యాలయం ప్రారంభించారు. ఎమ్మార్వో వెంకట్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి ఆమె కార్యాలయంలోనే ఈ నెల 4వ తేదీన హత్యకు గురయ్యారు. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో కూర సురేశ్ అనే రైతు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సురేష్ కూడా మృతి చెందాడు. ఈ సంఘటన అనంతరం కార్యాలయం మూతపడింది. నేడు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నూతన కార్యాలయాన్ని అధికారులు ప్రారంభించారు. చదవండి: మహిళా తహసీల్దార్ సజీవ దహనం తహశీల్దార్ సజీవ దహనం: డాడీ.. మమ్మీకి ఏమైంది? -
వేరొకరికి పట్టా చేశారని..
దంతాలపల్లి : తన భూమిని వేరొకరికి పట్టా చేశారని ఆరోపిస్తూ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఓ దివ్యాంగ యువకుడు మంగళవారం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన ఐనాల ఉప్పలయ్య 2012లో తండ వెంకటయ్య నుంచి ఎనిమిది ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. అయితే, డబ్బు పూర్తి స్థాయిలో చెల్లించకపోగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు. కాగా, వెంకటయ్యతో పాటు ఆయన కుమారుడు విష్ణు కూడా వేర్వేరుగా మరణించారు. అనంతరం నెల రోజులకు ఐనాల ఉప్పలయ్య వెళ్లి విష్ణు భార్య సరితను కలసి తనకు అమ్మిన భూమి రిజిస్ట్రేషన్ చేయాలని కోరాడు. దీనికి సరిత రశీదులు సరిగా లేవని, అవి ఫోర్జరీవని చెప్పడమే కాకుండా అదనంగా డబ్బు చెల్లించాలని చెబితే ఉప్పలయ్య నిరాకరించాడు. కొన్ని రోజుల అనంతరం ఫోర్జరీ సంతకాలతో ఉప్పలయ్య సాదాబైనామాకు దరఖాస్తు చేసుకుంటే సరిత అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు పరిశీలించి సరితకు ఎనిమిది ఎకరాలతో పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేశారు. ఈ క్రమంలో ఐనాల ఉప్పలయ్య మరణించగా ఆయన కుమారుడు, దివ్యాంగుడైన ఐనాల ఓంశంకర్.. భూమి మీదకు వెళ్తే సరిత కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుంది. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య వివాదాలు తలెత్తి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. తాజాగా సరిత తన భూమిని వేరొకరికి విక్రయించడంతో ఓంశంకర్ తన భూమిని అధికారులు వేరొకరికి పట్టా చేశారని ఆరోపిస్తూ మంగళవారం తహసీల్దార్ గౌరీశంకర్‌తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను శరీరంపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎస్సై బానోతు వెంకన్న.. ఓంశంకర్ను వారించారు. ఈ విషయమై దంతాలపల్లి తహసీల్దార్ గౌరీశంకర్ మాట్లాడుతూ కోర్టు కేసులో ఉండటంతో భూ సమస్యను తాము పరిష్కరించలేమని చెప్పామని పేర్కొన్నారు. -
వీఆర్వో అనుమతిస్తేనే తహసీల్దార్ దర్శనం
సాక్షి, కరీంనగర్ : అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాలకు పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు చేపట్టారు. కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో ఉన్న కరీంనగర్‌రూరల్, అర్బన్ తహసీల్దార్ కార్యాలయాలకు సోమవారం వివిధ సమస్యలపై బాధితులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆయా కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తహసీల్దార్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మానిటర్లో తహసీల్దార్లు కార్యాలయాల్లోకి వచ్చే వారిని, లోపల ఉద్యోగుల పనితీరును పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా కార్యాలయాల లోపలికి వెళ్లేముందు దరఖాస్తుదారులను అటెండర్లు పూర్తి వివరాలు అడిగి లోపలికి పంపిస్తున్నారు. వీఆర్వోల అనుమతి లేకుండా నేరుగా తహసీల్దార్లను కలువకుండా రక్షణ చర్యలు తీసుకున్నారు. ఒకవైపు ప్రజావాణిలో భూసమస్యలపై జేసీ శ్యాంప్రసాద్‌లాల్‌కు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ కొందరు బాధితులు మళ్లీ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులను కలిసేందుకు వచ్చారు. అయితే ముందుగా సంబంధిత గ్రామాల వీఆర్వోలు బాధితుల దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం సమస్య పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇచ్చారు. మరికొందరు బా«ధితులను వీఆర్వోలు స్వయంగా తహసీల్దార్ సుధాకర్ వద్దకు తీసుకెళ్లి సమస్యను వివరించారు. దరఖాస్తు ఎవరి వద్ద ఉంది, సమస్య ఏమిటో తెలుసుకుని పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను తహసీల్దార్ సుధాకర్ వీఆర్వోకు సూచించారు. అదేవిధంగా అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ముందుగా అటెండర్ దరఖాస్తుదారుల సమస్యలను అడిగి తెలుసుకుని లోపలికి పంపిస్తున్నారు. సంబంధిత అధికారి దరఖాస్తుదారుల సమస్యను పరిశీలించి అవసరమైతే తహసీల్దార్ దగ్గరకు స్వయంగా తీసుకెళ్తున్నారు. అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీకెమెరా -
తహసీల్దారు.. పైరవీ జోరు !
సాక్షి, నిర్మల్ : రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం తహసీల్దార్ల బదిలీలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారిని సొంత జిల్లాలకు బదిలీ చేసింది. జిల్లాకు చెందిన తహసీల్దార్లు కూడా మళ్లీ సొంత జిల్లాకు రానున్నారు. జిల్లా కలెక్టర్లు సోమవారం తహసీల్దార్లకు మండలాల వారీగా పోస్టింగులు ఇవ్వాల్సిందిగా స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, భూపరిపాలన శాఖ చీఫ్ కమిషన్ సోమేశ్‌కుమార్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో జిల్లాలో ఎవరికి ఏ మండలం ఇస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవం ఉన్నవాళ్లే కనుక ఏ మండలం ఎలా ఉంటుంది.. ఎక్కడ చేస్తే బాగుంటుందన్న విషయాలపై అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉండే మండలాల్లో పోస్టింగ్ ఇప్పించుకునేందుకు పలువురు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మళ్లీ పాత జిల్లాకు.. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు మూడునెలల ముందు తహసీల్దార్ల బదిలీలను చేపట్టారు. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారిని ఇతర జిల్లా లకు బదిలీ చేశారు. ఈక్రమంలో జిల్లాకు చెంది న తహసీల్దార్లలోనర్సయ్య, కలీం, నారాయణ, సుభాష్‌చందర్, తుకారాంను జగిత్యాల జిల్లాకు పంపించారు. జి.లక్ష్మి, నరేందర్, సంతోష్‌రెడ్డి, శంకర్, రాజ్‌మోహన్, కిరణ్మయి,పి.నర్సయ్యను మంచిర్యాల జిల్లాకు బదిలీ చేశారు. శ్యాంసుందర్‌ను కరీంనగర్, లోకేశ్వర్‌రావును ఆదిలాబాద్, జి.శ్రీకాంత్‌ను పెద్దపల్లి, పి.వెంకటరమణను వరంగల్ అర్బన్ జిల్లాకు బదిలీ చేశారు. ప్రస్తుత ఆదేశాలతో వారు మళ్లీ నిర్మల్ జిల్లాకు రానున్నారు. ఇక ఎన్నికల సమయంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో తహసీల్దార్లు మన జిల్లాకు వచ్చారు. ఇందులో అతిఖుద్దీన్, ప్రభాకర్, మహేంద్రనాథ్, మోతీరాం, పవన్‌చంద్ర, శివరాజ్, శ్రీదేవి, సంధ్యారాణి, మోహన్‌సింగ్, చంద్రశేఖర్ ఉన్నారు. అలాగే సత్యనారాయణ, రాజేశ్, రాజేందర్ జగిత్యాల జిల్లా నుంచి రాగా, సుధాకర్, అనుపమరావు, వెంకటలక్ష్మి, ఉమాశంకర్ పెద్దపల్లి జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. బదిలీ కోసం ఎదురుచూసి.. ఎన్నికలు పూర్తయి నెలలు గడుస్తున్నా.. తమను సొంత జిల్లాలకు బదిలీ చేయడం లేదన్న ఆందోళన చాలామంది తహసీల్దార్లలో కనిపించింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికలు కూడా రానుండటంతో ఇక ఆ ఎన్నికలు కూడా పూర్తయ్యే వరకు ఉండాల్సి వస్తుందేమోనని భావించారు. కానీ.. ప్రస్తుత పరిస్థితులు ఎన్నికలకు అనుకూలంగా కనిపించకపోవడం, తాజాగా రెవెన్యూ అధికారులపై జరిగిన దాడులు, శాఖ చేసిన ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం బదిలీలను చేపట్టినట్లు చెబుతున్నారు. అబ్ధుల్పూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యోదంతం తర్వాత రెవెన్యూ అధికారులు చేసిన ఆందోళన రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైంది. పనులన్నీ పక్కనపెట్టి వారు చేసిన నిరసన చివరకు బదిలీలకు మార్గం సుగమం చేసినట్లు భావిస్తున్నారు. అనుకూలమైన చోటు కోసం.. జిల్లాకు బదిలీ అయిన తర్వాత ఇక్కడ ఏ మండలానికి వెళ్తారో.. అనేదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. జిల్లాలోని పలు మండలాలపై రెవెన్యూ అధికారులు ఆసక్తి చూపుతున్నట్లు చెబుతుంటారు. ప్రధానంగా నిర్మల్ అర్బన్, నిర్మల్‌రూరల్, ఖానాపూర్, భైంసా తదితర మండలాలను ఎక్కువమంది కోరుకుంటారన్నది రెవెన్యూ వర్గాలు చెబుతున్న మాట. ఆదాయ వనరులతో పాటు అనుకూలమైన వాతావరణం ఉన్న మండలాన్ని చాలామంది తహసీల్దార్లు ఆశిస్తున్నారు. ఈనేపథ్యం లో జిల్లాలోని పలు స్థానాలకు పోటీ నెలకొన్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు తహసీల్దార్లు అనుకూలమైన మండలం కోసం భారీ ఎత్తున పైరవీలు సైతం మొదలుపెట్టినట్లు సమాచారం. కొంతమంది ఇప్పటికే హైదరాబాద్ వెళ్లి ‘పెద్ద’లను కలిసినట్లు వినిపిస్తోంది. ప్రధాన పోస్టు కావడంతో.. జిల్లాకు కలెక్టర్ ఎలాగో.. మండలానికి తహసీల్దార్ అదే స్థాయి అధికారి. ఒక్క రెవెన్యూ మాత్రమే కాకుండా చాలా పనుల్లో, విషయాల్లో మండలానికి తహసీల్దారే బాధ్యుడు. మండలస్థాయిలో ప్రాధాన్యతతో పాటు దానికి తగ్గట్లు ప్రయోజనాలు ఉండటంతో ఆ పోస్టుకు డిమాండ్ పెరిగింది. అందులోనూ అనుకూలమైన చోటు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ పని చేసుకోవడంతో పాటు సంబంధిత ప్రయోజనాలనూ పొందే అవకాశాలు ఉంటాయి. ఈనేపథ్యంలోనే జిల్లాలో తమకు ప్రయోజనకరంగా ఉండే చోటు కోసం పెద్దఎత్తున్న ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.